శ్రీమద్భగవద్గీత - 184: 04వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 184: Chap. 04, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 184 / Bhagavad-Gita - 184 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 22 🌴

22. యదృచ్చాలాభసంతుష్టో ద్వాన్ద్వాతీతో విమర్పత: |
సమ: సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే |


🌷. తాత్పర్యం :

యాదృచ్చికముగా లభించినదానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడును, అసూయ లేనివాడును, జయాపజయములందు స్థిరుడై యుండెడివాడును అగు మనుజుడు కర్మలకు ఒనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు.


🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావితుడు దేహపోషణార్థము సైతము ఎక్కువగా శ్రమింపడు. యాదృచ్చికముగా లభించినదానితో అతడు సంతుష్టి నొందును. భిక్షమెత్తుట గాని, అప్పుచేయుట గాని చేయక న్యాయముగా తన శక్తికొలది కర్మ నొనరించి తద్వారా లభించినదానితో అతడు సంతృప్తి నొందును. కనుకనే తన జీవనోపాధి విషయమున అతడు స్వతంత్రుడై యుండును. ఇతరులకు ఒనర్చబడెడి సేవ తన భక్తికి (కృష్ణభక్తిభావన యందలి సేవకు) అడ్డురాకుండా యుండునట్లు అతడు చూచుకొనును.

అయినను భగవానుని సేవ కొరకు మాత్రము భౌతికజగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలతచెందక ఎట్టి కర్మయందైనను అతడ పాల్గొనుచు భౌతికజగము నందలి ద్వంద్వములనునవి సుఖదుఃఖములు, శీతోష్ణముల రూపములో అనుభూతమగుచుండును. కాని భక్తుడు కృష్ణుని ప్రీత్యర్థమై ఎటువంటి జంకు లేకుండా తన కర్మల నొనరించును కావున అట్టి ద్వంద్వములకు అతీతునిగా నుండును. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండింటి యందును స్థిరుడై యుండును. మనుజుడు దివ్యజ్ఞాన పూర్ణుడైనప్పుడు ఈ విధమైన చిహ్నములు గోచరించును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 184 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 22 🌴

22. yadṛcchā-lābha-santuṣṭo dvandvātīto vimatsaraḥ
samaḥ siddhāv asiddhau ca kṛtvāpi na nibadhyate



🌷 Translation :

He who is satisfied with gain which comes of its own accord, who is free from duality and does not envy, who is steady in both success and failure, is never entangled, although performing actions.


🌹 Purport :

A Kṛṣṇa conscious person does not make much endeavor even to maintain his body. He is satisfied with gains which are obtained of their own accord. He neither begs nor borrows, but he labors honestly as far as is in his power, and is satisfied with whatever is obtained by his own honest labor. He is therefore independent in his livelihood. He does not allow anyone’s service to hamper his own service in Kṛṣṇa consciousness.

However, for the service of the Lord he can participate in any kind of action without being disturbed by the duality of the material world. The duality of the material world is felt in terms of heat and cold, or misery and happiness. A Kṛṣṇa conscious person is above duality because he does not hesitate to act in any way for the satisfaction of Kṛṣṇa. Therefore he is steady both in success and in failure. These signs are visible when one is fully in transcendental knowledge.

🌹 🌹 🌹 🌹 🌹


31 Oct 2019