శ్రీమద్భగవద్గీత - 171: 04వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 171: Chap. 04, Ver. 09
🌹. శ్రీమద్భగవద్గీత - 171 / Bhagavad-Gita - 171 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 09 🌴
09. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వత: |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీరత్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతికజగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు.
🌻. భాష్యము :
భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండియే జరుగుననెడి విషయము ఆరవశ్లోకములలో ఇదివరకే తెలుపబడినది. అట్టి అవతారసత్యము నెరిగినవాడు భవబంధముల నుండి ముక్తిని పొందినట్టివాడే కనుక దేహత్యాగానంతరము అతడు శ్రీఘ్రమే భగవద్దామమును తప్పక చేరగలడు. జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏమాత్రము సులభమైన కార్యము కాదు. నిరాకారవాదులు మరియు యోగులు బహుకష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందెడి ముక్తి (భగవానుని నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగుట) కేవలము పాక్షికము మాత్రమే.
దానిని సాధించిన పిమ్మటయు భౌతికజగమునకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కాని శ్రీకృష్ణభగవానుని రూపము మరియు కర్మల దివ్యస్వభావమును అవగతము చేసికొనుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట శ్రీకృష్ణదామము పొంది ఈ భౌతికజగమునకు తిరిగి రావలసిన ప్రమాదము నుండి బయటపడుదురు. శ్రీకృష్ణభగవానునకు అనేక రూపములు మరియు అవతారములు కలవని (అద్వైతమచ్యుత మనాది మనంతరూపమ్) బ్రహ్మసంహిత (5.33) యందు తెలుపబడినది.
ఈ విధముగా భగవానునకు పలురూపములున్నను ఆ రూపములన్నియును ఏవమే అయియున్నవి మరియు ఆ దేవదేవుడు అద్వితీయుడై యున్నాడు. వేదములందు (పురుషబోధినీ ఉపనిషత్తు) ఈ విధముగా తెలుపబడినది.
ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపీ హృద్యంతరాత్మా |
“తన విశుద్ధభక్తుల సంబంధమున అద్వితీయుడైన భగవానుడు అనేకానేక దివ్యరూపములలో నిత్యముగా వర్తించుచుండును.” ఈ వేదవాక్యము భగవద్గీత యందలి ఈ శ్లోకములో శ్రీకృష్ణభగవానునిచే నిర్ధారింపబడుచున్నది. అనగా ఈ సత్యమును నిస్సందేహముగా మరియు విశ్వాసముతో అంగీకరించువాడు ముక్తిని పొందుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 171 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 09 🌴
09. janma karma ca me divyam evaṁ yo vetti tattvataḥ
tyaktvā dehaṁ punar janma naiti mām eti so ’rjuna
🌷 Translation :
One who knows the transcendental nature of My appearance and activities does not, upon leaving the body, take his birth again in this material world, but attains My eternal abode, O Arjuna.
🌹 Purport :
The Lord’s descent from His transcendental abode is already explained in the sixth verse. One who can understand the truth of the appearance of the Personality of Godhead is already liberated from material bondage, and therefore he returns to the kingdom of God immediately after quitting this present material body.
Such liberation of the living entity from material bondage is not at all easy. The impersonalists and the yogīs attain liberation only after much trouble and many, many births. Even then, the liberation they achieve – merging into the impersonal brahma-jyotir of the Lord – is only partial, and there is the risk of returning to this material world. But the devotee, simply by understanding the transcendental nature of the body and activities of the Lord, attains the abode of the Lord after ending this body and does not run the risk of returning to this material world. In the Brahma-saṁhitā (5.33) it is stated that the Lord has many, many forms and incarnations: advaitam acyutam anādim ananta-rūpam.
Although there are many transcendental forms of the Lord, they are still one and the same Supreme Personality of Godhead. As stated in the Vedas (Puruṣa-bodhinī Upaniṣad):
eko devo nitya-līlānurakto
bhakta-vyāpī hṛdy antar-ātmā
“The one Supreme Personality of Godhead is eternally engaged in many, many transcendental forms in relationships with His unalloyed devotees.” Simply by accepting this truth on faith, one can, without a doubt, attain liberation.
🌹 🌹 🌹 🌹 🌹
18 Oct 2019