శ్రీమద్భగవద్గీత - 185: 04వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 185: Chap. 04, Ver. 23


🌹. శ్రీమద్భగవద్గీత - 185 / Bhagavad-Gita - 185 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 23 🌴


23. గతసజ్ఞస్య ముక్తస్య జ్ఞానవస్థితచేతస: |
యజ్ఞాయాచరత: కర్మ సమగ్రం ప్రవిలీయతే ||


🌷. తాత్పర్యం :

ప్రకృతి త్రిగుణముల యెడ అసంగుడై దివ్యజ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని సర్వకర్మల దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును.


🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావితుడగుట ద్వారా మనుజుడు ద్వంద్వమూలా నుండి విడివడి క్రమముగా త్రిగుణముల సంపర్కము నుండి విడివడును. కృష్ణునితో గల సంబంధమున తన నిజస్థితి ఎరిగియుండుటచే అతడు ముక్తినొందుటకు అర్హుడగును. ఆ విధముగా అతని మనసెప్పుడును కృష్ణభక్తి నుండి వేరొక వైపుకు మరలదు.

తత్కారణముగా అతడేది ఒనర్చినను ఆదివిష్ణువైన శ్రీకృష్ణుని కొరకే ఒనరించును. విష్ణుప్రీత్యర్థమే యజ్ఞములన్నియు ఉద్దేశింపబడి యున్నందున అతని కర్మలన్నియును యజ్ఞరూపములే యగుచున్నవి. అట్టి యజ్ఞరూప కర్మల ఫలములన్నియును నిక్కముగా దివ్యత్వము నందు లీనమగుటచే వానిని ఒనరించువారెవ్వరును కర్మఫలములచే ప్రభావితులు కారు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 185 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 23 🌴


23. gata-saṅgasya muktasya jñānāvasthita-cetasaḥ
yajñāyācarataḥ karma samagraṁ pravilīyate


🌷 Translation :

The work of a man who is unattached to the modes of material nature and who is fully situated in transcendental knowledge merges entirely into transcendence.


🌹 Purport :

Becoming fully Kṛṣṇa conscious, one is freed from all dualities and thus is free from the contaminations of the material modes. He can become liberated because he knows his constitutional position in relationship with Kṛṣṇa, and thus his mind cannot be drawn from Kṛṣṇa consciousness. Consequently, whatever he does, he does for Kṛṣṇa, who is the primeval Viṣṇu. Therefore, all his works are technically sacrifices because sacrifice aims at satisfying the Supreme Person, Viṣṇu, Kṛṣṇa. The resultant reactions to all such work certainly merge into transcendence, and one does not suffer material effects.

🌹 🌹 🌹 🌹 🌹


1 Nov 2019