శ్రీమద్భగవద్గీత - 661: 18వ అధ్., శ్లో 78 / Bhagavad-Gita - 661: Chap. 18, Ver. 78


🌹. శ్రీమద్భగవద్గీత - 661 / Bhagavad-Gita - 661 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 78 🌴

చివరి భాగము.

78. యత్ర యోగేశ్వర: కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధర: |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా
నీతిర్మతిర్మమ ||

🌷. తాత్పర్యం :

యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేతి ధనుర్ధారియైన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణశక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇదియే నా అభిప్రాయము.

🌷. భాష్యము :

భగవద్గీత ధృతరాష్ట్రుని విచారణలో ఆరంభమైనది. భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధులచే సహాయమును పొందుచున్న తన కుమారులు విజయము పట్ల అతడు మిగుల ఆశను కలిగియుండెను. విజయము తన పక్షమునకే సిద్ధించునని అతడు భావించుచుండెను.

కాని యుద్ధరంగమున జరిగిన సన్నివేశమును వివరించిన పిమ్మట సంజయుడు ధృతరాష్ట్రునితో “నీవు విజయమును గూర్చి ఆలోచించినను, నా అభిప్రాయము ప్రకారము శ్రీకృష్ణార్జునులు ఎచ్చట నుందురో అచ్చటనే సర్వశుభము కలుగగలదు” అని పలికెను. అనగా ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపరాదని అతడు ప్రత్యక్షముగా నిర్ధారించినాడు.

శ్రీకృష్ణుడు నిలిచియున్నందున అర్జునుని పక్షమునకే విజయము సిద్ధించుననుట నిశ్చయమైన విషయము. ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అర్జునుని రథచోదకుడగుట ఆ భగవానుని మరొక విభూతియై యున్నది. శ్రీకృష్ణునకు గల పలువిభూతులలో వైరాగ్యము ఒకటి.

శ్రీకృష్ణుడు వైరాగ్యమునకు సైతము ప్రభువైనందున అట్టి వైరాగ్యమును పలు సందర్భములలో ప్రదర్శించెను. వాస్తవమునకు రణము దుర్యోధనుడు మరియు ధర్మరాజు నడుమ సంభవించి యుండెను. అర్జునుడు కేవలము తన అగ్రజూడైన ధర్మరాజు తరపున పోరుటకు సిద్ధపడెను. ఆ విధముగా శ్రీకృష్ణార్జును లిరువురును ధర్మరాజు పక్షమున ఉండుటచే అతని విజయము తథ్యమై యుండెను.

ప్రపంచమునెవరు పాలింపవలెనో నిర్ణయించుటకు ఆ యుద్ధము ఏర్పాటు చేయబడెను. అట్టి రాజ్యాధికారము యుధిష్టిరునకే సంప్రాప్తించునని సంజయుడు భవిష్యద్వాణిని పలికినాడు. అంతియేగాక యుద్ధ విజయానంతరము ధర్మరాజు మరింతగా సుఖసంపదలతో వర్థిల్లుననియు ఇచ్చట భవిష్యత్తు నిర్ణయింపబడినది.

ధర్మరాజు ధర్మాత్ముడు మరియు పవిత్రుడే గాక గొప్ప నీతిమంతుడగుటయే అందులకు కారణము. అతడు జీవితమున ఎన్నడును అసత్యమును పలిగియుండలేదు.

భగవద్గీతను రణరంగమున ఇరువురు స్నేహితుల నడుమ జరిగిన సంభాషణగా భావించు మూఢులు పెక్కుమంది కలరు. కాని స్నేహితుల నడుమ జరిగెడి సాధారణ సంభాషణ లెన్నడును శాస్త్రము కాజాలదు. మరికొందరు అధర్మకార్యమైన యుద్ధమునకు శ్రీకృష్ణుడు అర్జునుని పురికొల్పెనని తమ అభ్యంతరమును తెలుపుదురు. కాని వాస్తవమునకు భగవద్గీత దివ్య ధర్మోపదేశమనెడి నిజస్థితి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.

దివ్య ధర్మోపదేశము గీత యందలి నవమాధ్యాయపు ముప్పదినాలుగవ శ్లోకమున “మన్మనాభవ మద్భక్త:”యని తెలుపబడినది. అనగా ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానునికి భక్తులు కావలసియున్నది. సర్వధర్మముల సారము శ్రీకృష్ణుని శరణుపొందుటయే (సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ).

కనుక భగవద్గీత నీతి మరియు ధర్మముల దివ్య విధానములతో నిండియున్నది. ఇతరమార్గములు సైతము పవిత్ర్రీకరణమొనర్చునవే యైనను మరియు అంత్యమున ఈ మార్గమునకే మనుజుని గొనివచ్చునవైనను భగవద్గీత యందలి చివరి ఉపదేశమే నీతి మరియు ధర్మ విషయమున శ్రీకృష్ణభగవానుని శరణాగతి.

అట్టి శరణాగతియే అష్టాదశాధ్యాయపు తుది నిర్ణయమై యున్నది.

శ్రీకృష్ణ పరమాత్మనే నమః

సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 661 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 78 🌴

Last Part

78. yatra yogeśvaraḥ kṛṣṇo
yatra pārtho dhanur-dharaḥ
tatra śrīr vijayo bhūtir
dhruvā nītir matir mama


🌷 Translation :

Wherever there is Kṛṣṇa, the master of all mystics, and wherever there is Arjuna, the supreme archer, there will also certainly be opulence, victory, extraordinary power, and morality. That is my opinion.


🌹 Purport :

The Bhagavad-gītā began with an inquiry of Dhṛtarāṣṭra’s. He was hopeful of the victory of his sons, assisted by great warriors like Bhīṣma, Droṇa and Karṇa.

He was hopeful that the victory would be on his side. But after describing the scene on the battlefield, Sañjaya told the King, “You are thinking of victory, but my opinion is that where Kṛṣṇa and Arjuna are present, there will be all good fortune.” He directly confirmed that Dhṛtarāṣṭra could not expect victory for his side.

Victory was certain for the side of Arjuna because Kṛṣṇa was there. Kṛṣṇa’s acceptance of the post of charioteer for Arjuna was an exhibition of another opulence. Kṛṣṇa is full of all opulences, and renunciation is one of them. There are many instances of such renunciation, for Kṛṣṇa is also the master of renunciation.

The fight was actually between Duryodhana and Yudhiṣṭhira. Arjuna was fighting on behalf of his elder brother, Yudhiṣṭhira. Because Kṛṣṇa and Arjuna were on the side of Yudhiṣṭhira, Yudhiṣṭhira’s victory was certain.

The battle was to decide who would rule the world, and Sañjaya predicted that the power would be transferred to Yudhiṣṭhira. It is also predicted here that Yudhiṣṭhira, after gaining victory in this battle, would flourish more and more because not only was he righteous and pious but he was also a strict moralist. He never spoke a lie during his life.

There are many less intelligent persons who take Bhagavad-gītā to be a discussion of topics between two friends on a battlefield. But such a book cannot be scripture. Some may protest that Kṛṣṇa incited Arjuna to fight, which is immoral, but the reality of the situation is clearly stated: Bhagavad-gītā is the supreme instruction in morality.

The supreme instruction of morality is stated in the Ninth Chapter, in the thirty-fourth verse: man-manā bhava mad-bhaktaḥ. One must become a devotee of Kṛṣṇa, and the essence of all religion is to surrender unto Kṛṣṇa (sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja). The instructions of Bhagavad-gītā constitute the supreme process of religion and of morality.

All other processes may be purifying and may lead to this process, but the last instruction of the Gītā is the last word in all morality and religion: surrender unto Kṛṣṇa. This is the verdict of the Eighteenth Chapter.

Sri Krishna Paramathmane namah

THE END

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 660: 18వ అధ్., శ్లో 77 / Bhagavad-Gita - 660: Chap. 18, Ver. 77


🌹. శ్రీమద్భగవద్గీత - 660 / Bhagavad-Gita - 660 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 77 🌴

77. తచ్చ సంస్మృత్య సంస్మృత్య
రూపమత్యద్భుతం హరే: |
విస్మయో మే మహాన్ రాజన్
హృష్యామి చ పున: పున: ||


🌷. తాత్పర్యం :

ఓ రాజా! అత్యద్భుతమైన శ్రీకృష్ణభగవానుని రూపమున స్మరించిన కొలది నేను అత్యంత విస్మయము నొందుచు మరల మరల ఆనందము ననుభవించుచున్నాను.


🌷. భాష్యము :

వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు సైతము అర్జునునకు చూపబడిన శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమును గాంచగలిగినట్లు ఇచ్చట గోచరించుచున్నది. అట్టి విశ్వరూపమును శ్రీకృష్ణుడు పూర్వమెన్నడును చూపలేదని తెలుపబడినది. అది ఒక్క అర్జనునికే చూపబడినను ఆ సమయమున కొందరు మహాభక్తులు సైతము ఆ రూపమును గాంచగలిగిరి. అట్టివారిలో వ్యాసమహర్షి ఒకరు.

శ్రీకృష్ణుని పరమభక్తులలో ఒకడైన అతడు శక్తిపూర్ణ అవతారముగా పరిగణింపబడినాడు. వ్యాసదేవుడు దానిని తన శిష్యుడైన సంజయునకు దర్శింపజేసెను. అర్జునునకు చూపబడిన ఆ అద్భుత రూపమున తలచుచు సంజయుడు మరల మరల ఆనందము ననుభవించుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 660 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 77 🌴

77. tac ca saṁsmṛtya saṁsmṛtya rūpam aty-adbhutaṁ hareḥ
vismayo me mahān rājan hṛṣyāmi ca punaḥ punaḥ


🌷 Translation :

O King, as I remember the wonderful form of Lord Kṛṣṇa, I am struck with wonder more and more, and I rejoice again and again.


🌹 Purport :

It appears that Sañjaya also, by the grace of Vyāsa, could see the universal form Kṛṣṇa exhibited to Arjuna. It is, of course, said that Lord Kṛṣṇa had never exhibited such a form before. It was exhibited to Arjuna only, yet some great devotees could also see the universal form of Kṛṣṇa when it was shown to Arjuna, and Vyāsa was one of them.

He is one of the great devotees of the Lord, and he is considered to be a powerful incarnation of Kṛṣṇa. Vyāsa disclosed this to his disciple Sañjaya, who remembered that wonderful form of Kṛṣṇa exhibited to Arjuna and enjoyed it repeatedly.

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 659: 18వ అధ్., శ్లో 76 / Bhagavad-Gita - 659: Chap. 18, Ver. 76


🌹. శ్రీమద్భగవద్గీత - 659 / Bhagavad-Gita - 659 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 76 🌴

76. రాజన్ సంస్మృత్య సంస్మృత్య
సంవాదమిమద్భుతమ్ |
కేశవార్జునయో: పుణ్యం
హృష్యామి చ ముహుర్ముహు: ||


🌷. తాత్పర్యం :

ఓ రాజా! శ్రీకృష్ణార్జుణుల నడుమ జరిగిన అద్భుతమును, పవిత్రమును అగు సంవాదమును స్మరించిన కొలది ప్రతిక్షణము పులకించు ఆనదము నొందుచున్నాను.

🌷. భాష్యము :

భగవద్గీత యొక్క అవగాహనము అతి దివ్యమైనట్టిది. శ్రీకృష్ణార్జున సంవాద విషయములను అవగతము చేసికొనగలిగినవాడు మహాత్ముడై ఆ సంవాద విషయములను మరవకుండును. ఇదియే ఆధ్యాత్మికజీవనపు దివ్యస్థితి.

అనగా భగవద్గీతను ప్రామాణికుడైన (శ్రీకృష్ణుడు) వానినుండి శ్రవణము చేయువాడు పూర్ణ కృష్ణభక్తిభావనను పొందగలడు. అట్టి కృష్ణభక్తిరసభావన ఫలితమేమనగా మనుజుడు నిరంతరము వికాసము నొందుచు, ఏదియో కొంత సమయము గాక ప్రతిక్షణము జీవితమున ఆనందము ననుభవించును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 659 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 76 🌴

76. rājan saṁsmṛtya saṁsmṛtya
saṁvādam imam adbhutam
keśavārjunayoḥ puṇyaṁ
hṛṣyāmi ca muhur muhuḥ

🌷 Translation :

O King, as I repeatedly recall this wondrous and holy dialogue between Kṛṣṇa and Arjuna, I take pleasure, being thrilled at every moment.

🌹 Purport :

The understanding of Bhagavad-gītā is so transcendental that anyone who becomes conversant with the topics of Arjuna and Kṛṣṇa becomes righteous and he cannot forget such talks.

This is the transcendental position of spiritual life. In other words, one who hears the Gītā from the right source, directly from Kṛṣṇa, attains full Kṛṣṇa consciousness.

The result of Kṛṣṇa consciousness is that one becomes increasingly enlightened, and he enjoys life with a thrill, not only for some time, but at every moment.

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 658: 18వ అధ్., శ్లో 75 / Bhagavad-Gita - 658: Chap. 18, Ver. 75


🌹. శ్రీమద్భగవద్గీత - 658 / Bhagavad-Gita - 658 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 75 🌴

75. వ్యాసప్రసాదాచ్చ్రుతవానేతద్
గుహ్యమహం పరమ్ |
యోగం యోగేశ్వరాత్కృష్ణా
త్సాక్షాత్కథయత: స్వయమ్ ||

🌷. తాత్పర్యం :

అర్జునునితో స్వయముగా సంభాషించుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమగుహ్య వచనములను వ్యాసదేవుని కరుణచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని.

🌷. భాష్యము :

వ్యాసదేవుడు సంజయునికి ఆధ్యాత్మికగురువు. తన గురువైన వ్యాసదేవుని కరుణచేతనే తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనగలిగితినని సంజయుడు అంగీకరించుచున్నాడు.

అనగా ప్రతియొక్కరు ప్రత్యక్షముగా గాక ఆధ్యాత్మికగురువు ద్వారా శ్రీకృష్ణుని అవగతము చేసికొనవలసియున్నది. భగవదనుభూతి ప్రత్యక్షముగా అనుభవింపవలసినదే అయినను గురువు మాత్రము దానికి మాధ్యమముగా ఒప్పారగలడు. ఇదియే గురుపరమపరా రహస్యము.

గురువు ప్రామాణికుడైనప్పుడు మనుజుడు అర్జునుని రీతి ఆయన నుండి భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణము చేయవచ్చును. జగమునందు పెక్కురు యోగులు మరియు సిద్ధపురుషులు ఉన్నప్పటకిని శ్రీకృష్ణుడు సమస్త యోగవిధానములకు ప్రభువై యున్నాడు.

అటువంటి శ్రీకృష్ణుడు తనకే శరణము నొందుమని గీత యందు నిశ్చయముగా ఉపదేశమొసగుచున్నాడు. ఆ విధముగా ఒనరించువాడు అత్యుత్తమ యోగి కాగలడు. ఈ విషయము షష్టాధ్యాయపు చివరి శ్లోకమునందు నిర్దారింపబడినది. (యోగినామపి సర్వేషాం).

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 658 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 75 🌴

75. vyāsa-prasādāc chrutavān etad guhyam ahaṁ param
yogaṁ yogeśvarāt kṛṣṇāt sākṣāt kathayataḥ svayam


🌷 Translation :

By the mercy of Vyāsa, I have heard these most confidential talks directly from the master of all mysticism, Kṛṣṇa, who was speaking personally to Arjuna.


🌹 Purport :

Vyāsa was the spiritual master of Sañjaya, and Sañjaya admits that it was by Vyāsa’s mercy that he could understand the Supreme Personality of Godhead.

This means that one has to understand Kṛṣṇa not directly but through the medium of the spiritual master. The spiritual master is the transparent medium, although it is true that the experience is still direct. This is the mystery of the disciplic succession. When the spiritual master is bona fide, then one can hear Bhagavad-gītā directly, as Arjuna heard it.

There are many mystics and yogīs all over the world, but Kṛṣṇa is the master of all yoga systems. Kṛṣṇa’s instruction is explicitly stated in Bhagavad-gītā – surrender unto Kṛṣṇa. One who does so is the topmost yogī. This is confirmed in the last verse of the Sixth Chapter. Yoginām api sarveṣām.

Nārada is the direct disciple of Kṛṣṇa and the spiritual master of Vyāsa. Therefore Vyāsa is as bona fide as Arjuna because he comes in the disciplic succession, and Sañjaya is the direct disciple of Vyāsa. Therefore by the grace of Vyāsa, Sañjaya’s senses were purified, and he could see and hear Kṛṣṇa directly.

One who directly hears Kṛṣṇa can understand this confidential knowledge. If one does not come to the disciplic succession, he cannot hear Kṛṣṇa; therefore his knowledge is always imperfect, at least as far as understanding Bhagavad-gītā is concerned.

🌹 🌹 🌹 🌹 🌹


06 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 657: 18వ అధ్., శ్లో 74 / Bhagavad-Gita - 657: Chap. 18, Ver. 74


🌹. శ్రీమద్భగవద్గీత - 657 / Bhagavad-Gita - 657 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 74 🌴

74. సంజయ ఉవాచ
ఇత్యహం వాసుదేవస్య
పార్థస్య చ మహాత్మన: |
సంవాదమిమ శ్రౌష
మద్భుతం రోమహర్షణం ||


🌷. తాత్పర్యం :

సంజయుడు పలికెను : ఈ విధముగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణము చేసితిని. అద్భతమైన ఆ సంవాదముచే నాకు రోమాంచనమగుచున్నది.


🌷. భాష్యము :

కురుక్షేత్ర రణరంగమున ఏమి జరిగెనని ధృతరాష్ట్రుడు తన కార్యదర్శియైన సంజయుని గీతారంభమున ప్రశ్నించెను. ఈ అధ్యయన విషయమంతయు సంజయుని హృదయమున అతని గురువగు వ్యాసదేవుని కరుణచే విదితమయ్యెను. ఆ విధముగా అతడు రణరంగవిషయములను ఎరుకపరచగలిగెను.

ఇరువఇరువురు మహాత్ముల నడుమ భగవద్గీత వంటి అత్యంత ప్రాముఖ్యమైన సంవాదమెన్నడును జరిగియుండలేదు మరియు భవిష్యత్తులో జరుగు నవకాశము లేదు. కనుకనే ఆ సంవాదము అత్యంత అద్భతమై యుండెను.

దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయముగా తన శక్తులను గూర్చి జీవునకు (పరమభక్తుడగు అర్జునుడు) వివరించియుండుటచే ఆ సందేశము వాస్తవమునకు అత్యంత అద్భుతముగనే ఉండగలదు. శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుటకు మనము అర్జునుని అడుగుజాడలను అనురించినచో తప్పక మన జీవితములు సుఖకరములు మరియు జయప్రదములు కాగలవు.

సంజయుడు ఈ విషయమును గుర్తించి దానిని అవగాహనము చేసికొనుటకు యత్నించుచు ధృతరాష్ట్రునకు దానినంతయు నెరిగించెను. కనుకనే కృష్ణార్జుణులు ఎచ్చట నుందురో అచ్చట విజయము తథ్యమని నిర్ధారింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 657 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 74 🌴

74. sañjaya uvāca

ity ahaṁ vāsudevasya pārthasya ca mahātmanaḥ
saṁvādam imam aśrauṣam adbhutaṁ roma-harṣaṇam

🌷 Translation :

Sañjaya said: Thus have I heard the conversation of two great souls, Kṛṣṇa and Arjuna. And so wonderful is that message that my hair is standing on end.

🌹 Purport :

In the beginning of Bhagavad-gītā, Dhṛtarāṣṭra inquired from his secretary Sañjaya, “What happened on the Battlefield of Kurukṣetra?” The entire study was related to the heart of Sañjaya by the grace of his spiritual master, Vyāsa. He thus explained the theme of the battlefield.

The conversation was wonderful because such an important conversation between two great souls had never taken place before and would not take place again. It was wonderful because the Supreme Personality of Godhead was speaking about Himself and His energies to the living entity, Arjuna, a great devotee of the Lord.

If we follow in the footsteps of Arjuna to understand Kṛṣṇa, then our life will be happy and successful. Sañjaya realized this, and as he began to understand it, he related the conversation to Dhṛtarāṣṭra. Now it is concluded that wherever there is Kṛṣṇa and Arjuna, there is victory.

🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 656: 18వ అధ్., శ్లో 73 / Bhagavad-Gita - 656: Chap. 18, Ver. 73


🌹. శ్రీమద్భగవద్గీత - 656 / Bhagavad-Gita - 656 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 73 🌴

73. నష్టో మోహ: స్మృతిర్లబ్ధా
త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోస్మి గతసన్దేహ:
కరిష్యే వచనం తవ ||

🌷. తాత్పర్యం :

అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! నా మోహము ఇప్పుడు నశించినది. నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడును, సందేహరహితుడును అయి నీ ఆజ్ఞానుసారమును వర్తించుటకు సిద్ధముగా నున్నాను.

🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వర్తించుటయే జీవుని (అర్జునుని) సహజస్థితియై యున్నది. అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడినాడు.

జీవుని నిజమైన స్థితి శ్రీకృష్ణుని నిత్యదాసత్వమే యని చైతన్యమహాప్రభువు కూడా తెలిపియున్నారు. ఈ సిద్ధాంతము మరచియే జీవుడు భౌతికప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కాని అతడు ఆ భగవానుని సేవలో నిమగ్నుడగుట ద్వారా ముక్తుడు కాగలడు. జీవుని సహజస్థితి దాసత్వమే గనుక అతడు మాయనో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణునో సదా సేవింపవలసివచ్చును.

ఒకవేళ అతడు శ్రీకృష్ణభగవానుని సేవించినచో తన సహజస్థితియందు నిలువగలడు. కాని భౌతికశక్తియైన మాయను సేవింపదలచినచో నిక్కముగా బంధములో చిక్కుబడగలడు. భ్రాంతి యందు భౌతికజగమున సేవను గూర్చుచు అతడు ఇచ్చాకామములచే బద్ధుడైనను తనను తాను జగత్తుకు అధినేతయైనట్లు భావించును.

అట్టి భావనయే భ్రాంతి యనబడును. కాని మనుజుడు ముక్తుడైనపుడు అట్టి భ్రాంతి నశించి, ఆ దేవదేవుని కోరికల ననుసరించి వర్తించుటకు స్వచ్చందముగా శరణాగతుడగును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 656 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 73 🌴

73. arjuna uvāca
naṣṭo mohaḥ smṛtir labdhā
tvat-prasādān mayācyuta
sthito ’smi gata-sandehaḥ
kariṣye vacanaṁ tava

🌷 Translation :

Arjuna said: My dear Kṛṣṇa, O infallible one, my illusion is now gone. I have regained my memory by Your mercy. I am now firm and free from doubt and am prepared to act according to Your instructions.

🌹 Purport :

The constitutional position of a living entity, represented by Arjuna, is that he has to act according to the order of the Supreme Lord. He is meant for self-discipline.

Śrī Caitanya Mahāprabhu says that the actual position of the living entity is that of eternal servant of the Supreme Lord. Forgetting this principle, the living entity becomes conditioned by material nature, but in serving the Supreme Lord he becomes the liberated servant of God.

The living entity’s constitutional position is to be a servitor; he has to serve either the illusory māyā or the Supreme Lord. If he serves the Supreme Lord he is in his normal condition, but if he prefers to serve the illusory, external energy, then certainly he will be in bondage. In illusion the living entity is serving in this material world.

He is bound by his lust and desires, yet he thinks of himself as the master of the world. This is called illusion. When a person is liberated, his illusion is over, and he voluntarily surrenders unto the Supreme to act according to His desires.

🌹 🌹 🌹 🌹 🌹


04 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 655: 18వ అధ్., శ్లో 72 / Bhagavad-Gita - 655: Chap. 18, Ver. 72


🌹. శ్రీమద్భగవద్గీత - 655 / Bhagavad-Gita - 655 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 72 🌴

72. కచ్చిదేతచ్చ్రుతం పార్థ
త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహ:
ప్రనష్ట స్తే ధనంజయ ||

🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ధనంజయా! ఏకాగ్రమనస్సుతో దీనినంతటిని నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా?

🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట అర్జునునికి ఆధ్యాత్మికగురువు వలె వర్తించుచున్నాడు. కనుకనే అర్జునుడు భగవద్గీతను సరియైన విధముగా అవగతము చేసికొనెనా లేదా యని ప్రశ్నించుట అతని ధర్మమై యున్నది. ఒకవేళ అర్జునుడు అవగతము చేసికొననిచో అవసరమైన ఏదేని ఒక విషయమును గాని లేదా సంపూర్ణగీతను గాని శ్రీకృష్ణుడు తిరిగి తెలుపుటకు సంసిద్ధుడై యున్నాడు.

వాస్తవమునకు శ్రీకృష్ణుని వంటి గురువు నుండి గాని, శ్రీకృష్ణుని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నుండి గాని గీతాశ్రవణము చేసినవాడు తన అజ్ఞానమును నశింపజేసికొనగలడు. భగవద్గీత యనునది ఏదో ఒక కవి లేదా నవలారచయితచే రచింపబడినది కాదు. అది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణునిచే పలుకబడినట్టిది.

కనుక శ్రీకృష్ణుని నుండి గాని, అతని ప్రామాణిక ఆధ్యాత్మిక ప్రతినిధి నుండి గాని ఆ ఉపదేశములను శ్రవణము చేయగలిగిన భాగ్యవంతుడు తప్పక ముక్తపురుషుడై అజ్ఞానాంధకారము నుండి బయటపడగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 655 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 72 🌴

72. kaccid etac chrutaṁ pārtha
tvayaikāgreṇa cetasā
kaccid ajñāna-sammohaḥ
praṇaṣṭas te dhanañ-jaya

🌷 Translation :

O son of Pṛthā, O conqueror of wealth, have you heard this with an attentive mind? And are your ignorance and illusions now dispelled?

🌹 Purport :

The Lord was acting as the spiritual master of Arjuna. Therefore it was His duty to inquire from Arjuna whether he understood the whole Bhagavad-gītā in its proper perspective. If not, the Lord was ready to re-explain any point, or the whole Bhagavad-gītā if so required.

Actually, anyone who hears Bhagavad-gītā from a bona fide spiritual master like Kṛṣṇa or His representative will find that all his ignorance is dispelled. Bhagavad-gītā is not an ordinary book written by a poet or fiction writer; it is spoken by the Supreme Personality of Godhead.

Any person fortunate enough to hear these teachings from Kṛṣṇa or from His bona fide spiritual representative is sure to become a liberated person and get out of the darkness of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 654: 18వ అధ్., శ్లో 71 / Bhagavad-Gita - 654: Chap. 18, Ver. 71


🌹. శ్రీమద్భగవద్గీత - 654 / Bhagavad-Gita - 654 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 71 🌴

71. శ్రద్ధావాననసూయశ్చ
శ్రుణుయాదపి యో నర: |
సోపి ముక్త: శుభాన్ లోకాన్
ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ||


🌷. తాత్పర్యం :

శ్రద్ధను, అసూయరాహిత్యమును గూడి శ్రవణము చేయువాడు సర్వపాపఫలముల నుండి విడుదలను పొంది, పుణ్యకర్ములైనవారు నివసించు పుణ్యలోకములను పొందగలడు.


🌷. భాష్యము :

తన యెడ అసూయను కలిగినవారికి గీతాజ్ఞానమును బోధించరాదని శ్రీకృష్ణభగవానుడు ఈ అధ్యాయపు అరువదిఏడవ శ్లోకమున స్పష్టముగా పలికియున్నాడు. అనగా భగవద్గీత భక్తుల కొరకే నిర్దేశింపబడియున్నది.

కాని కొన్నిమార్లు భక్తులు బహిరంగముగా ఉపన్యాసములు గావింతురనెడి ప్రశ్న ఉదయింపవచ్చును. అది ఈ విధముగా ఇచ్చట వివరింపబడినది. ఉపన్యాసమునకు వచ్చిన ప్రతియొక్కరు భక్తులు కాకపోయినను, వారిలో పెక్కురు కృష్ణుని యెడ అసూయరహితులును కావచ్చును.

అట్టి అసూయరహితులు శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విశ్వాసమును కలిగియుందురు. వారు గీతాజ్ఞానమును భవద్భక్తుని ముఖత: శ్రవణము చేసినచో శీఘ్రమే సర్వపాపఫలముల నుండి విడుదలను పొంది, పుణ్యాతములైనవారు వసించెడి పుణ్యలోకములను పొందగలరు.

అనగా శుద్ధభక్తుడగుటకు యత్నింపనివాడు సైతము శ్రద్ధతో గీతాశ్రవణమును చేయుట ద్వారా సర్వపుణ్యకర్మల ఫలములను పొందగలడు. కునక పాపఫలముల నుండి విడుదలను పొంది కృష్ణభక్తునిగా నగుటకు ప్రతియొక్కనికి కృష్ణభక్తుడు అవకాశము నొసగుచుండును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 654 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 71 🌴

71. śraddhāvān anasūyaś ca śṛṇuyād api yo naraḥ
so ’pi muktaḥ śubhāḻ lokān prāpnuyāt puṇya-karmaṇām


🌷 Translation :

And one who listens with faith and without envy becomes free from sinful reactions and attains to the auspicious planets where the pious dwell.


🌹 Purport :

In the sixty-seventh verse of this chapter, the Lord explicitly forbade the Gītā’s being spoken to those who are envious of the Lord. In other words, Bhagavad-gītā is for the devotees only.

But it so happens that sometimes a devotee of the Lord will hold open class, and in that class not all the students are expected to be devotees. Why do such persons hold open class? It is explained here that although not everyone is a devotee, still there are many men who are not envious of Kṛṣṇa.

They have faith in Him as the Supreme Personality of Godhead. If such persons hear from a bona fide devotee about the Lord, the result is that they become at once free from all sinful reactions and after that attain to the planetary system where all righteous persons are situated.

Therefore simply by hearing Bhagavad-gītā, even a person who does not try to be a pure devotee attains the result of righteous activities. Thus a pure devotee of the Lord gives everyone a chance to become free from all sinful reactions and to become a devotee of the Lord.

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 653: 18వ అధ్., శ్లో 70 / Bhagavad-Gita - 653: Chap. 18, Ver. 70


🌹. శ్రీమద్భగవద్గీత - 653 / Bhagavad-Gita - 653 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 70 🌴

70. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయో: |
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్ట: స్యామితి మే మతి: ||

🌷. తాత్పర్యం :

మన ఈ పవిత్రమగు సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞముచే నన్ను పూజించినవాడగునని నేను ప్రకటించుచున్నాను.


🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 653 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 70 🌴

70. adhyeṣyate ca ya imaṁ
dharmyaṁ saṁvādam āvayoḥ
jñāna-yajñena tenāham
iṣṭaḥ syām iti me matiḥ

🌷 Translation :

And I declare that he who studies this sacred conversation of ours worships Me by his intelligence.


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2021

శ్రీమద్భగవద్గీత - 652: 18వ అధ్., శ్లో 69 / Bhagavad-Gita - 652: Chap. 18, Ver. 69


🌹. శ్రీమద్భగవద్గీత - 652 / Bhagavad-Gita - 652 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 69 🌴

69. న చ తస్మాన్మసుష్యేషు
కశ్చిన్మే ప్రియకృత్తమ: |
భవితా న చమే తస్మాదన్య:
ప్రియతరో భువి ||

🌷. తాత్పర్యం :

నాకు అతని కన్నను ప్రియుడైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైనవాడు వేరొక్కడు ఉండబోడు.

🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 652 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 69 🌴

69. na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ
bhavitā na ca me tasmād anyaḥ priya-taro bhuvi


🌷 Translation :

There is no servant in this world more dear to Me than he, nor will there ever be one more dear.

🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹



28 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 651: 18వ అధ్., శ్లో 68 / Bhagavad-Gita - 651: Chap. 18, Ver. 68


🌹. శ్రీమద్భగవద్గీత - 651 / Bhagavad-Gita - 651 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 68 🌴

68. య ఇదం పరమం గుహ్యం
మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా
మామేవైష్యత్యసంశయ: ||

🌷. తాత్పర్యం :

ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధభక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు.

🌷. భాష్యము :

అభక్తులైనవారు శ్రీకృష్ణునిగాని, భగవద్గీతను గాని అవగతము చేసికొనలేనందున గీతను భక్తుల సమక్షమునందే చర్చించుమని సాధారణముగా ఉపదేశింపబడును. శ్రీకృష్ణభగవానుని మరియు అతని గీతాజ్ఞానమును యథాతథముగా ఆంగీకరింపలేనివారు తోచినరీతి గీతావ్యాఖ్యానమును చేయుటకు యత్నించి అపరాధులు కారాదు. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడినవారికే భగవద్గీత బోధించవలెను. అనగా ఈ చర్చనీయ విషయము భక్తులకు సంబంధించినదే గాని తాత్త్వికకల్పనాపరులది కాదు.

అయినను ఈ భగవద్గీతను శ్రద్ధతో ప్రకటింప యత్నించువారు భక్తియోగమున పురోగమించి శుద్ధమగు భక్తిమయ జీవనస్థితికి చేరగలరు. అట్టి శుద్ధ భక్తిఫలితముగా మనుజుడు భగవద్ధామమును తప్పక చేరగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 651 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 68 🌴

68. ya idaṁ paramaṁ guhyaṁ
mad-bhakteṣv abhidhāsyati
bhaktiṁ mayi parāṁ kṛtvā
mām evaiṣyaty asaṁśayaḥ

🌷 Translation :

For one who explains this supreme secret to the devotees, pure devotional service is guaranteed, and at the end he will come back to Me.

🌹 Purport :

Generally it is advised that Bhagavad-gītā be discussed amongst the devotees only, for those who are not devotees will understand neither Kṛṣṇa nor Bhagavad-gītā.

Those who do not accept Kṛṣṇa as He is and Bhagavad-gītā as it is should not try to explain Bhagavad-gītā whimsically and become offenders. Bhagavad-gītā should be explained to persons who are ready to accept Kṛṣṇa as the Supreme Personality of Godhead. It is a subject matter for the devotees only and not for philosophical speculators.

Anyone, however, who tries sincerely to present Bhagavad-gītā as it is will advance in devotional activities and reach the pure devotional state of life. As a result of such pure devotion, he is sure to go back home, back to Godhead.

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 650: 18వ అధ్., శ్లో 67 / Bhagavad-Gita - 650: Chap. 18, Ver. 67


🌹. శ్రీమద్భగవద్గీత - 650 / Bhagavad-Gita - 650 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 67 🌴

67. ఇదం తే నాతపస్కాయ
నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం
న చ మాం యోభ్యసూయతి ||

🌷. తాత్పర్యం :

ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపస్సంపన్నులు కానివారికి గాని, భక్తులు కానివారికి గాని, భక్తియుతసేవలో నిలువనివారికి గాని, నా యెడ అసూయను కలిగినవారికి గాని ఎన్నడును వివరించరాదు.

🌷. భాష్యము :

ధర్మవిధానములందలి తపస్సులకు ఆచరింపనివారికి, కృష్ణభక్తిభావనలో భక్తియోగమును నిర్వహింప సమకట్టనివారికి, శుద్ధభక్తుని సేవింపనివారికి, ముఖ్యముగా శ్రీకృష్ణుని చారిత్రాత్మక వ్యక్తిగా మాత్రమే భావించువారికి లేదా శ్రీకృష్ణుని గొప్పతనము నెడ అసూయను కలిగియుండువారికి ఈ గుహ్యతమజ్ఞానమును వివరింపరాదు. అయినను దానవప్రవృత్తి కలిగి శ్రీకృష్ణుని యెడ అసూయను కలిగినవారు సైతము కొన్నిమార్లు శ్రీకృష్ణుని వేరే విధముగా అర్చించుచున్నట్లు గోచరించును.

అట్టివారు భిన్నవిధములుగా గీతావ్యాఖ్యానము చేయుట యనెడి వృత్తిని చేపట్టి, దానిని వ్యాపారముగా కొనసాగింతురు. కాని శ్రీకృష్ణుని యథార్థముగా తెలిసికొనగోరువారు మాత్రము అట్టి గీతావ్యాఖ్యానముల నుండి దూరులు కావలెను. భోగలాలసులైనవారికి గీతాప్రయోజనము అవగతము కాదు.

భోగలాలసుడు కాకుండ, వేదనిర్దేశితములైన నియమములను కచ్చితముగా పాటించువాడు సైతము ఒకవేళ భక్తుడు కానిచో శ్రీకృష్ణుని అవగతము చేసికొనజాలడు. తమను తాము భక్తులుగా ప్రదర్శించుకొనుచు కృష్ణపరకర్మల యందు మాత్రము నియుక్తులు కానివారు కూడా శ్రీకృష్ణుని ఎరుగజాలరు.

శ్రీకృష్ణుడు తాను దేవదేవుడనియు మరియు తనకు సమానమైనది లేదా తనకున్నను అధికమైనది వేరొక్కటి లేదనియు భగవద్గీత యందు తెలిపిన కారణముగా అతని యెడ అసూయను కలిగినవారు పలువురుందురు. కృష్ణుని యెడ అసూయను కలిగియుండెడి అట్టివారు గీతావగాహనకు అసమర్థులు కావున వారికి గీతను బోధింపరాదు.

శ్రద్దారహితులైనవారు శ్రీకృష్ణుని మరియు భగవద్గీతను అవగతము చేసికొను అవకాశమే లేదు. కనుక శుద్ధభక్తుని నుండి శ్రీకృష్ణుని అవగతము చేసికొనకుండ ఎవ్వరును భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నింపరాదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 650 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 67 🌴

67. idaṁ te nātapaskāya
nābhaktāya kadācana
na cāśuśrūṣave vācyaṁ
na ca māṁ yo ’bhyasūyati

🌷 Translation :

This confidential knowledge may never be explained to those who are not austere, or devoted, or engaged in devotional service, nor to one who is envious of Me.

🌹 Purport :

Persons who have not undergone the austerities of the religious process, who have never attempted devotional service in Kṛṣṇa consciousness, who have not tended a pure devotee, and especially those who are conscious of Kṛṣṇa only as a historical personality or who are envious of the greatness of Kṛṣṇa should not be told this most confidential part of knowledge.

It is, however, sometimes found that even demoniac persons who are envious of Kṛṣṇa, worshiping Kṛṣṇa in a different way, take to the profession of explaining Bhagavad-gītā in a different way to make business, but anyone who desires actually to understand Kṛṣṇa must avoid such commentaries on Bhagavad-gītā.

Actually the purpose of Bhagavad-gītā is not understandable to those who are sensuous. Even if one is not sensuous but is strictly following the disciplines enjoined in the Vedic scripture, if he is not a devotee he also cannot understand Kṛṣṇa.

And even when one poses himself as a devotee of Kṛṣṇa but is not engaged in Kṛṣṇa conscious activities, he also cannot understand Kṛṣṇa. There are many persons who envy Kṛṣṇa because He has explained in Bhagavad-gītā that He is the Supreme and that nothing is above Him or equal to Him. There are many persons who are envious of Kṛṣṇa.

Such persons should not be told of Bhagavad-gītā, for they cannot understand. There is no possibility of faithless persons’ understanding Bhagavad-gītā and Kṛṣṇa. Without understanding Kṛṣṇa from the authority of a pure devotee, one should not try to comment upon Bhagavad-gītā.

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 649: 18వ అధ్., శ్లో 66 / Bhagavad-Gita - 649: Chap. 18, Ver. 66


🌹. శ్రీమద్భగవద్గీత - 649 / Bhagavad-Gita - 649 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 66 🌴

66. సర్వధర్మాన్ పరిత్యజ
మామేకం శరణం వ్రజ |
అహం త్వాం సర్వపాపేభ్యో
మోక్ష్యయిష్యామి మా శుచ: ||


🌷. తాత్పర్యం :

సర్వవిధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నిన్ను సర్వపఫలముల నుండి నేను ముక్తిని గావింతును. భయము నొందకుము.


🌷. భాష్యము :

పరబ్రహ్మజ్ఞానము, పరమాత్మజ్ఞానము, వర్ణాశ్రమధర్మజ్ఞానము, సన్న్యాసాశ్రమ జ్ఞానము, అసంగత్వము, శమదమాదులు, ధ్యానము మొదలగువానికి సంబంధించిన జ్ఞానము, ధర్మవిధానములను దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంతవరకు వివరించియున్నాడు.

ధర్మవిధానములను పలువిధములుగా సైతము అతడు వర్ణించియుండెను. ఇక ఇప్పుడు గీతాజ్ఞానమును సంగ్రహపరచుచు తాను ఇంతవరకు వివరించియున్న ధర్మవిధానముల నన్నింటిని విడిచి, కేవలము తనకు శరణము నొందుమని అర్జునినితో శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు.

శ్రీకృష్ణభగవానుడు తానే స్వయముగా రక్షణము నొసగుదునని ప్రతిజ్ఞ చేసియున్నందున అట్టి శరణాగతి అర్జునుని తప్పక సర్వవిధములైన పాపఫలముల నుండి ముక్తుని చేయగలదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 649 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 66 🌴

66. sarva-dharmān parityajya
mām ekaṁ śaraṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo
mokṣayiṣyāmi mā śucaḥ


🌷 Translation :

Abandon all varieties of religion and just surrender unto Me. I shall deliver you from all sinful reactions. Do not fear.


🌹 Purport :

The Lord has described various kinds of knowledge and processes of religion – knowledge of the Supreme Brahman, knowledge of the Supersoul, knowledge of the different types of orders and statuses of social life, knowledge of the renounced order of life, knowledge of nonattachment, sense and mind control, meditation, etc. He has described in so many ways different types of religion.

Now, in summarizing Bhagavad-gītā, the Lord says that Arjuna should give up all the processes that have been explained to him; he should simply surrender to Kṛṣṇa. That surrender will save him from all kinds of sinful reactions, for the Lord personally promises to protect him.

In the Seventh Chapter it was said that only one who has become free from all sinful reactions can take to the worship of Lord Kṛṣṇa. Thus one may think that unless he is free from all sinful reactions he cannot take to the surrendering process.

To such doubts it is here said that even if one is not free from all sinful reactions, simply by the process of surrendering to Śrī Kṛṣṇa he is automatically freed. There is no need of strenuous effort to free oneself from sinful reactions. One should unhesitatingly accept Kṛṣṇa as the supreme savior of all living entities. With faith and love, one should surrender unto Him.

🌹 🌹 🌹 🌹 🌹


25 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 648: 18వ అధ్., శ్లో 65 / Bhagavad-Gita - 648: Chap. 18, Ver. 65


🌹. శ్రీమద్భగవద్గీత - 648 / Bhagavad-Gita - 648 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 65 🌴

65. మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు |
మావేవైష్యసి సత్యం తే
ప్రతిజానే ప్రియోసిమే ||


🌷. తాత్పర్యం :

సర్వదా నన్నే చింతింపుము. నా భక్తుడవగుము. నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను.


🌷. భాష్యము :

ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని శుద్ధభక్తుడై అతనినే చింతించుచు అతని కొరకే కర్మ నొనరించుట గుహ్యతమమైన జ్ఞానమై యున్నది. అనగా ఎవ్వరును కృత్రిమ ధ్యానపరులు కాకూడదు. శ్రీకృష్ణుని గూర్చి సదా చింతించగలిగే అవకాశము కలుగు రీతిలో జీవితమును ప్రతియొక్కరు మలచుకొనవలెను. దైనందిన కర్మలన్నియును కృష్ణునితో సంబంధము కలిగియుండునట్లుగా వారు చూచుకొనవలెను.

ఇరువదినాలుగు గంటలు కృష్ణుని తప్ప అన్యమును చింతింపలేని విధముగా వారు జీవితమును ఏర్పాటు చేసికొనవలెను. అటువంటి శుద్ధమగు కృష్ణభక్తిభావనలో నిమగ్నుడైనవాడు తన ధామమును నిక్కముగా చేరగలడని శ్రీకృష్ణుడు వాగ్దానమొసగుచున్నాడు. అచ్చట అతడు శ్రీకృష్ణుని సన్నిహిత సాహచర్యమున నియుక్తుడు కాగలడు.

అర్జునుడు శ్రీకృష్ణభగవానునికి ప్రియమిత్రుడైనందునే అతనికి ఈ గుహ్యతమజ్ఞానము ఉపదేశింపబడినది. అర్జునుని మార్గము ననుసరించు ప్రతివారును శ్రీకృష్ణునకు ప్రియమిత్రులై అర్జునుని వలె పూర్ణత్వము నొందగలరు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 648 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 65 🌴

65. man-manā bhava mad-bhakto
mad-yājī māṁ namaskuru
mām evaiṣyasi satyaṁ te
pratijāne priyo ’si me


🌷 Translation :

Always think of Me, become My devotee, worship Me and offer your homage unto Me. Thus you will come to Me without fail. I promise you this because you are My very dear friend.


🌹 Purport :

The most confidential part of knowledge is that one should become a pure devotee of Kṛṣṇa and always think of Him and act for Him. One should not become an official meditator. Life should be so molded that one will always have the chance to think of Kṛṣṇa. One should always act in such a way that all his daily activities are in connection with Kṛṣṇa.

He should arrange his life in such a way that throughout the twenty-four hours he cannot but think of Kṛṣṇa. And the Lord’s promise is that anyone who is in such pure Kṛṣṇa consciousness will certainly return to the abode of Kṛṣṇa, where he will be engaged in the association of Kṛṣṇa face to face.

This most confidential part of knowledge is spoken to Arjuna because he is the dear friend of Kṛṣṇa. Everyone who follows the path of Arjuna can become a dear friend to Kṛṣṇa and obtain the same perfection as Arjuna.

🌹 🌹 🌹 🌹 🌹


24 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 647: 18వ అధ్., శ్లో 64 / Bhagavad-Gita - 647: Chap. 18, Ver. 64


🌹. శ్రీమద్భగవద్గీత - 647 / Bhagavad-Gita - 647 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 64 🌴

64. సర్వగుహ్యతమం భూయ: శ్రుణు మే పరమం వచ: |
ఇష్టోసి మే దృఢమతి తతో వక్ష్యామి తే హితమ్ ||


🌷. తాత్పర్యం :

నీకు నాకు ప్రియమిత్రుడవైనందున జ్ఞానములలో కెల్ల గుహ్యతమమైనట్టి నా దివ్యోపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై యున్నందున దీనిని ఆలకింపుము.


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు తొలుత రహస్యజ్ఞానమును (బ్రహ్మజ్ఞానమును), పిదప రహస్యతరజ్ఞానమును (హృదయస్థ పరమాత్మజ్ఞానము) ఒసగి ఇప్పుడు రహస్యతరమైన జ్ఞానమును అందించనున్నాడు.

పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణునకు శరణము నొందుటయే అట్టి రహస్యతమమైన జ్ఞానము. నవమాధ్యాయముయొక్క చివరన “ఎల్లప్పుడు నన్నే చింతింపుము” (మన్మనా:) అని తెలిపిన విషయమునే తిరిగి శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు.

గీతోదేశపు సారాంశమైన ఆ విషయమును నొక్కిచెప్పుటకే ఆ ఉపదేశము తిరిగి ఒసగబడుచున్నది. భగవద్గీత యొక్క ఈ సారాంశమును శ్రీకృష్ణునకు ప్రియుడైన భక్తుడే (కృష్ణభక్తుడు) అవగతము చేసికొనగలడు. సామాన్యమానవుడు దానినెన్నడును తెలిసికొనజాలడు.

శ్రీకృష్ణభగవానుడు ఒసగనున్న ఈ ఉపదేశము వేదోపదేశములలో అత్యంతముఖ్యమై యున్నది. అనగా ఈ విషయమున శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నది జ్ఞానమునందు అత్యంత ముఖ్యభాగమై, అర్జునుని చేతనే గాక సర్వజీవులచే అనుసరణీయమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 647 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 64 🌴

64. sarva-guhyatamaṁ bhūyaḥ
śṛṇu me paramaṁ vacaḥ
iṣṭo ’si me dṛḍham iti
tato vakṣyāmi te hitam


🌷 Translation :

Because you are My very dear friend, I am speaking to you My supreme instruction, the most confidential knowledge of all. Hear this from Me, for it is for your benefit.


🌹 Purport :

The Lord has given Arjuna knowledge that is confidential (knowledge of Brahman) and still more confidential (knowledge of the Supersoul within everyone’s heart), and now He is giving the most confidential part of knowledge: just surrender unto the Supreme Personality of Godhead.

At the end of the Ninth Chapter He has said, man-manāḥ: “Just always think of Me.” The same instruction is repeated here to stress the essence of the teachings of Bhagavad-gītā. This essence is not understood by a common man, but by one who is actually very dear to Kṛṣṇa, a pure devotee of Kṛṣṇa.

This is the most important instruction in all Vedic literature. What Kṛṣṇa is saying in this connection is the most essential part of knowledge, and it should be carried out not only by Arjuna but by all living entities.

🌹 🌹 🌹 🌹 🌹


23 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 646: 18వ అధ్., శ్లో 63 / Bhagavad-Gita - 646: Chap. 18, Ver. 63

 

🌹. శ్రీమద్భగవద్గీత - 646 / Bhagavad-Gita - 646 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 63 🌴

63. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ||


🌷. తాత్పర్యం : 

ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించితిని. దీనిని సంపూర్ణముగా విమర్శన కావించి, పిదప తోచిన రీతి ఒనరింపుము.


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బ్రహ్మభూతజ్ఞానమును సంపూర్ణముగా ఇదివరకే వివరించెను. బ్రహ్మభూతస్థితి యందున్నవాడు సదా ఆనందపూర్ణుడై యుండును. అతడు శోకించుటను యొరుగడు మరియు దేనిని వాంచింపడు. అటువంటి దివ్యస్థితికి గుహ్యమైన బ్రహ్మభూతజ్ఞానమే కారణము. 

బ్రహ్మభూతజ్ఞానమునే గాక శ్రీకృష్ణుడు పరమాత్మ జ్ఞానము సైతము అర్జునునకు తెలియపరిచెను. అదియును బ్రహ్మజ్ఞానమేయైనను బ్రహ్మభూతజ్ఞానము కన్నను ఉన్నతమైనది.

ఇచ్చట “యథేచ్చసి తథా కురు” అను పదము శ్రీకృష్ణభగవానుడు జీవులకు గల అతిసూక్ష్మమైన స్వాతంత్ర్యముతో జోక్యము కలుగచేసికొనడని సూచించుచున్నది. 

మానవుడు ఏ విధముగా తన జీవనస్థితిని వృద్ధిచేసికొనగలడో శ్రీకృష్ణభగవానుడు అన్ని కోణముల నుండి భగవద్గీత యందు వివరిచియున్నాడు. హృదయస్థుడైన పరమాత్మునకు శరణుపొందుమని అర్జునునకు ఒసగిన ఉపదేశము వానిలో ముఖ్యమైనది. దానిని బట్టి సరియైన విచక్షణతో మనుజుడు పరమాత్మ నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపవలసియున్నది. 

అట్టి అంగీకారము మనుజుడు సదా మానవజన్మ యొక్క అత్యున్నత పూర్ణస్థితియైనటువంటి కృష్ణభక్తిభావనలో నిలిచియుండుటకు తోడ్పడగలదు. యుద్ధము చేయుమని అర్జునుడు శ్రీకృష్ణభగవానునిచే ప్రత్యక్షముగా ఆదేశింపబడినాడు. 

భగవానుని శరణువేడుట జీవుల లాభమునకే గాని, భగవానుని లాభము కొరకు కాదు. కాని శరణాగతికి ముందు తమ బుద్ధిననుసరించి ఆ విషయమును గూర్చి విమర్శన చేసికొనుటకు ప్రతియొక్కరు స్వాతంత్ర్యమును కలిగియున్నారు. అదియే దేవదేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశమును ఆంగీకరించుటకు ఉత్తమమార్గము. అట్టి ఉపదేశము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నుండి కూడా లభింపగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 646 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 63 🌴

63. iti te jñānam ākhyātaṁ
guhyād guhya-taraṁ mayā
vimṛśyaitad aśeṣeṇa
yathecchasi tathā kuru


🌷 Translation : 

Thus I have explained to you knowledge still more confidential. Deliberate on this fully, and then do what you wish to do.


🌹 Purport :

The Lord has already explained to Arjuna the knowledge of brahma-bhūta. One who is in the brahma-bhūta condition is joyful; he never laments, nor does he desire anything. That is due to confidential knowledge. Kṛṣṇa also discloses knowledge of the Supersoul. This is also Brahman knowledge, knowledge of Brahman, but it is superior.

Here the words yathecchasi tathā kuru – “As you like, you may act” – indicate that God does not interfere with the little independence of the living entity. In Bhagavad-gītā, the Lord has explained in all respects how one can elevate his living condition. 

The best advice imparted to Arjuna is to surrender unto the Supersoul seated within his heart. By right discrimination, one should agree to act according to the order of the Supersoul. 

That will help one become situated constantly in Kṛṣṇa consciousness, the highest perfectional stage of human life. Arjuna is being directly ordered by the Personality of Godhead to fight. Surrender to the Supreme Personality of Godhead is in the best interest of the living entities. It is not for the interest of the Supreme. 

Before surrendering, one is free to deliberate on this subject as far as the intelligence goes; that is the best way to accept the instruction of the Supreme Personality of Godhead. Such instruction comes also through the spiritual master, the bona fide representative of Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


22 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 645: 18వ అధ్., శ్లో 62 / Bhagavad-Gita - 645: Chap. 18, Ver. 62


🌹. శ్రీమద్భగవద్గీత - 645 / Bhagavad-Gita - 645 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 62 🌴

62. తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రాసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||


🌷. తాత్పర్యం :

ఓ భరతవంశీయుడా! అతనికే సంపూర్ణముగా శరణము నొందుము. అతని కరుణచే పరమశాంతిని, దివ్య శాశ్వతస్థానమును నీవు పొందగలవు.


🌷. భాష్యము :

అనగా ప్రతిజీవుడు ఎల్లరి హృదయములందు స్థితుడై యున్న పరమపురుషుని శరణము నొందవలసియున్నది. అట్టి శరణాగతియే భౌతికస్థితి యందలి సర్వవిధక్లేశముల నుండి అతనిని విముక్తిని చేయగలదు.

ముఖ్య విషయమేమన అట్టి శరణాగతిచే జీవుడు ఈ జన్మపు భౌతికక్లేశముల నుండి విడివడుటయే గాక అంత్యమున శ్రీకృష్ణభగవానుని సైతము చేరగలడు. ఋగ్వేదము (1.22.20) నందు ఆ దివ్యదామము “తద్విష్ణో: పరమం పదమ్” అని వర్ణింపబడినది.

సృష్టియంతయు భగవద్రాజ్యమే గావున భౌతికమైనదంతయు వాస్తవమునకు ఆధ్యాత్మికమే. కాని ఈ వేదమంత్రమందలి “పరమం పదమ్” అనునది మాత్రము ఆధ్యాత్మికజగత్తుగా (వైకుంఠము) పిలువబడు సనాతనధామమును ప్రత్యేకముగా సూచించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 645 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 62 🌴

62. tam eva śaraṇaṁ gaccha
sarva-bhāvena bhārata
tat-prasādāt parāṁ śāntiṁ
sthānaṁ prāpsyasi śāśvatam


🌷 Translation :

O scion of Bharata, surrender unto Him utterly. By His grace you will attain transcendental peace and the supreme and eternal abode.


🌹 Purport :

A living entity should therefore surrender unto the Supreme Personality of Godhead, who is situated in everyone’s heart, and that will relieve him from all kinds of miseries of this material existence.

By such surrender, not only will one be released from all miseries in this life, but at the end he will reach the Supreme God. The transcendental world is described in the Vedic literature (Ṛg Veda 1.22.20) as tad viṣṇoḥ paramaṁ padam.

Since all of creation is the kingdom of God, everything material is actually spiritual, but paramaṁ padam specifically refers to the eternal abode, which is called the spiritual sky or Vaikuṇṭha.

🌹 🌹 🌹 🌹 🌹


20 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 644: 18వ అధ్., శ్లో 61 / Bhagavad-Gita - 644: Chap. 18, Ver. 61

 

🌹. శ్రీమద్భగవద్గీత - 644 / Bhagavad-Gita - 644 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 61 🌴

61. ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి |
భ్రామయన్ సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ||


🌷. తాత్పర్యం : 

ఓ అర్జునా! పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై యుండి, భౌతికశక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు.


🌷. భాష్యము :

అర్జునుడు దివ్యజ్ఞాత కాడు. యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట యనెడి అతని నిర్ణయము కేవలము అతని పరిమితజ్ఞానము పైననే ఆధారపడియున్నది. 

కనుకనే శ్రీకృష్ణభగవానుడు జీవులు సర్వజ్ఞులు కారని ఉపదేశించుచున్నాడు. ఆ దేవదేవుడే (స్వయముగా శ్రీకృష్ణుడు) పరమాత్మరూపమున జీవుల హృదయములందు నిలిచి వారిని నిర్దేశించుచుండును. దేహమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వకర్మలను మరచినను భూత, భవిష్యత్, వర్తమానముల జ్ఞాతగా పరమాత్ముడు జీవుని కర్మలకు సాక్షిగా నిలిచియుండును. 

అనగా జీవుల కర్మలన్నియు ఈ పరమాత్మునిచే నిర్దేశింపబడుచున్నవి. కనుకనే జీవుడు తనకు అర్హమైన వానిని పొందుచు భౌతికదేహమున కొనసాగుచుండును. అట్టి భౌతికదేహము పరమాత్మ నిర్దేశమున భౌతికశక్తిచే సృజించబడుచుండును. జీవుడు ఆ విధముగా ఒక దేహమునందు ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగణమైన రీతిలో వర్తించ వలసివచ్చును. 

అధికవేగముగా ప్రయాణించగలిగిన కారులో కూర్చుని యున్నటువంటి వ్యక్తి అల్పవేగముతో ప్రయాణించగలిగిన కారులో నున్న వ్యక్తికన్నను అధిక వేగముగా ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందలి మనుష్యులు (జీవులు) ఏకమేయైనను వారి ప్రయాణవేగములు వేరుగా నుండును. 

అదేవిధముగా పరమాత్ముని ఆజ్ఞానుసారము భౌతికప్రకృతియే జీవుడు పూర్వ ఇచ్చానుసారము వర్తించుటకు అనుగుణమైన దేహమును తయారుచేయుచుండును. ఈ విషయమున జీవుడు అస్వతంత్రుడు. కనుక ఎవ్వడును తాను భగవానునిపై ఆధారపడలేదని భావించరాదు. అతడు సదా భగవానుని అదుపులోనే యుండును. కనుకనే శరణాగతి యనునది ప్రతియోక్కరి ధర్మము. తదుపరి శ్లోకము యొక్క భోద అదియే.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 644 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 61 🌴

61. īśvaraḥ sarva-bhūtānāṁ
hṛd-deśe ’rjuna tiṣṭhati
bhrāmayan sarva-bhūtāni
yantrārūḍhāni māyayā


🌷 Translation : 

The Supreme Lord is situated in everyone’s heart, O Arjuna, and is directing the wanderings of all living entities, who are seated as on a machine, made of the material energy.


🌹 Purport :

Arjuna was not the supreme knower, and his decision to fight or not to fight was confined to his limited discretion. Lord Kṛṣṇa instructed that the individual is not all in all. 

The Supreme Personality of Godhead, or He Himself, Kṛṣṇa, as the localized Supersoul, sits in the heart directing the living being. After changing bodies, the living entity forgets his past deeds, but the Supersoul, as the knower of the past, present and future, remains the witness of all his activities. 

Therefore all the activities of living entities are directed by this Supersoul. The living entity gets what he deserves and is carried by the material body, which is created in the material energy under the direction of the Supersoul. As soon as a living entity is placed in a particular type of body, he has to work under the spell of that bodily situation. 

A person seated in a high-speed motorcar goes faster than one seated in a slower car, though the living entities, the drivers, may be the same. Similarly, by the order of the Supreme Soul, material nature fashions a particular type of body to a particular type of living entity so that he may work according to his past desires. 

The living entity is not independent. One should not think himself independent of the Supreme Personality of Godhead. The individual is always under the Lord’s control. Therefore one’s duty is to surrender, and that is the injunction of the next verse.

🌹 🌹 🌹 🌹 🌹


19 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 643: 18వ అధ్., శ్లో 60 / Bhagavad-Gita - 643: Chap. 18, Ver. 60


🌹. శ్రీమద్భగవద్గీత - 643 / Bhagavad-Gita - 643 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 60 🌴

60. స్వభావజేన కౌన్తేయ నిబద్ధ: స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్ ||


🌷. తాత్పర్యం :

మోహకారణముగా నీవిప్పుడు నా నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింప కున్నావు. కాని ఓ కౌంతేయా! నీ స్వభావము వలన పుట్టిన కర్మచే అవశుడవై నీవు దానిని ఒనరింపగలవు.


🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుని నిర్దేశమునందు వర్తించుటకు నిరాకరించినచో మానవుడు అవశుడై తన గుణముల ననుసరించి వర్తించవలసివచ్చును.

ప్రతియొక్కరు ప్రకృతి త్రిగుణములలో ఏదియో ఒక గుణసమ్మేళన ప్రభావమునకు లోనై యుండి, ఆ రీతిగా వర్తించుచుందురు. కాని ఎవరైతే బుద్ధిపుర్వకముగా శ్రీకృష్ణుభగవానుని దివ్యనిర్దేశమునందు నియుక్తులగుదురో అట్టివారు మహిమాన్వితులగుదురు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 643 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 60 🌴

60. svabhāva-jena kaunteya
nibaddhaḥ svena karmaṇā
kartuṁ necchasi yan mohāt
kariṣyasy avaśo ’pi tat


🌷 Translation :

Under illusion you are now declining to act according to My direction. But, compelled by the work born of your own nature, you will act all the same, O son of Kuntī.


🌹 Purport :

If one refuses to act under the direction of the Supreme Lord, then he is compelled to act by the modes in which he is situated. Everyone is under the spell of a particular combination of the modes of nature and is acting in that way. But anyone who voluntarily engages himself under the direction of the Supreme Lord becomes glorious.

🌹 🌹 🌹 🌹 🌹


18 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 642: 18వ అధ్., శ్లో 59 / Bhagavad-Gita - 642: Chap. 18, Ver. 59


🌹. శ్రీమద్భగవద్గీత - 642 / Bhagavad-Gita - 642 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 59 🌴

59. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ||


🌷. తాత్పర్యం :

ఒకవేళ నా నిర్దేశము ననుసరించి వర్తించక యుద్ధము చేయకుందువేని నీవు తప్పుమార్గమును పట్టినవాడవగుదువు. నీ స్వభావము ననుసరించి నీవు యుద్ధమునందు నియుక్తుడవు కావలసియే యున్నది.


🌷. భాష్యము :

అర్జునుడు క్షత్రియగుణముతో జన్మించినవాడు మరియు యుద్ధవీరుడు. తత్కారణముగా యుద్ధము చేయుట అతని సహజధర్మమై యున్నది. కాని మిథ్యాహంకారము వలన అతడు గురువు, పితామహుడు, ఇతర మిత్రుల వధచే పాపము సంక్రమించునని భయపడుచున్నాడు.

అనగా ఇచ్చట అర్జునుడు కర్మలకు శుభాశుభ ఫలములను ఒసగునది తానేయైనట్లు తనను తాను తన కర్మలకు ప్రభువుగా భావించుచున్నాడు. యుద్ధమును చేయుమని ఉపదేశించుచు దేవదేవుడు యెదుటనే నిలిచియున్నాడనెడి విషయమును అతడు మరచియున్నాడు. బద్ధజీవుని మరుపు స్వభావమిదియే. ఏది మంచిదో, ఏది చెడ్డదో దేవదేవుడే ఉపదేశము లొసగును.

జీవనపూర్ణత్వమును బడయుటకు మనుజుడు కేవలము కృష్ణభక్తిభావనలో కర్మచేయుటయే కావలసినది. పరమపురుషుడు ఎరిగియున్న విధముగా ఎవ్వరును తమ గమ్యమును నిర్ధారించలేరు. కనుక ఆ దేవదేవుని నిర్దేశమును గొని కర్మ యందు వర్తించుటయే ఉత్తమమార్గము.

అనగా శ్రీకృష్ణభగవానుని ఆదేశమును గాని, ఆ దేవదేవుని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు ఆదేశమును గాని ఎవ్వరును ఉపేక్ష చేయరాదు. కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను ఎటువంటి జంకు లేకుండా అమలుపరుప వలసియున్నది. అదియే మనుజుని అన్ని పరిస్థితుల యందును సురక్షితముగా నుంచగలదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 642 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 59 🌴

59. yad ahaṅkāram āśritya
na yotsya iti manyase
mithyaiṣa vyavasāyas te
prakṛtis tvāṁ niyokṣyati


🌷 Translation :

If you do not act according to My direction and do not fight, then you will be falsely directed. By your nature, you will have to be engaged in warfare.


🌹 Purport :

Arjuna was a military man, and born of the nature of the kṣatriya. Therefore his natural duty was to fight. But due to false ego he was fearing that by killing his teacher, grandfather and friends he would incur sinful reactions.

Actually he was considering himself master of his actions, as if he were directing the good and bad results of such work. He forgot that the Supreme Personality of Godhead was present there, instructing him to fight. That is the forgetfulness of the conditioned soul.

The Supreme Personality gives directions as to what is good and what is bad, and one simply has to act in Kṛṣṇa consciousness to attain the perfection of life. No one can ascertain his destiny as the Supreme Lord can; therefore the best course is to take direction from the Supreme Lord and act.

No one should neglect the order of the Supreme Personality of Godhead or the order of the spiritual master, who is the representative of God. One should act unhesitatingly to execute the order of the Supreme Personality of Godhead – that will keep one safe under all circumstances.

🌹 🌹 🌹 🌹 🌹


17 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 641: 18వ అధ్., శ్లో 58 / Bhagavad-Gita - 641: Chap. 18, Ver. 58


🌹. శ్రీమద్భగవద్గీత - 641 / Bhagavad-Gita - 641 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 58 🌴

58. మచ్చిత్త: సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి |
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినఙ్క్ష్యసి ||


🌷. తాత్పర్యం :

నా యందు చిత్తము గలవాడైనచో నా కరుణచే బద్ధజీవనపు ఆటంకముల నన్నింటిని దాటగలవు. కాని ఒకవేళ నామాట వినక అట్టి భావనలో గాక మిథ్యాహంకారముతో వర్తించితివేని తప్పక వినాశమును పొందగలవు.


🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావితుడైనవాడు తన జీవనమునకై ఒనరింపవలసిన ధర్మముల యెడ అనవసర చింతను కలిగియుండడు. అటువంటి చింతారాహిత్యమును మూఢుడైనవాడు ఏ మాత్రము అవగాహన చేసికొనజాలడు.

భక్తి భావనలో వర్తించువానికి శ్రీకృష్ణుడు ఆప్తమిత్రుడు కాగలడు. ఆ దేవదేవుడు తన మిత్రుని సౌఖ్యమును ప్రత్యక్షముగా తానే గాంచును. ఇరువదినాలుగు గంటలు తన ప్రీత్యర్థమే కర్మనొనరించు అతనికి ఆ దేవదేవుడు తనను తానే అర్పించుకొనును.

కనుక దేహాత్మభావన యందలి మిథ్యాహంకారముచే ఎవ్వరును మోహమునొందరాదు. ప్రకృతినియమములకు లేదా కర్మఫలములకు తాను పరుడనని భావింపరాదు. వాస్తవమునకు ప్రతియొక్కరు కఠినమైన ప్రకృతినియమములకు లోబడియే యుందురు.

కాని కృష్ణభక్తిభావనలో కర్మనొనరించినంతనే మనుజుడు ముక్తుడై భౌతిక క్లేశముల నుండి బయటపడగలడు. అనగా కృష్ణభక్తిభావనలో వర్తించనివాడు జన్మ, మృత్యు సాగరమనెడి సుడిగుండమున నశించుచున్నవానిగా ప్రతియొక్కరు గమనింపవలెను. చేయదగినదేదో, చేయరనిదేదో ఏ బద్ధజీవుడును వాస్తవముగా ఎరుగాజాలడు.

కాని శ్రీకృష్ణుడే అంతరము నుండి తెలియజేయుచున్నందున మరియు ఆధ్యాత్మికగురువుచే సమర్థింపబడుచున్నందున కృష్ణభక్తిరసభావితుడు మాత్రము కర్మ యందు వర్తించ స్వేచ్చను కలిగియుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 641 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 58 🌴

58. mac-cittaḥ sarva-durgāṇi
mat-prasādāt tariṣyasi
atha cet tvam ahaṅkārān
na śroṣyasi vinaṅkṣyasi


🌷 Translation :

If you become conscious of Me, you will pass over all the obstacles of conditioned life by My grace. If, however, you do not work in such consciousness but act through false ego, not hearing Me, you will be lost.


🌹 Purport :

A person in full Kṛṣṇa consciousness is not unduly anxious about executing the duties of his existence. The foolish cannot understand this great freedom from all anxiety.

For one who acts in Kṛṣṇa consciousness, Lord Kṛṣṇa becomes the most intimate friend. He always looks after His friend’s comfort, and He gives Himself to His friend, who is so devotedly engaged working twenty-four hours a day to please the Lord. Therefore, no one should be carried away by the false ego of the bodily concept of life.

One should not falsely think himself independent of the laws of material nature or free to act. He is already under strict material laws. But as soon as he acts in Kṛṣṇa consciousness, he is liberated, free from the material perplexities. One should note very carefully that one who is not active in Kṛṣṇa consciousness is losing himself in the material whirlpool, in the ocean of birth and death.

No conditioned soul actually knows what is to be done and what is not to be done, but a person who acts in Kṛṣṇa consciousness is free to act because everything is prompted by Kṛṣṇa from within and confirmed by the spiritual master.

🌹 🌹 🌹 🌹 🌹


16 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 640: 18వ అధ్., శ్లో 57 / Bhagavad-Gita - 640: Chap. 18, Ver. 57


🌹. శ్రీమద్భగవద్గీత - 640 / Bhagavad-Gita - 640 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 57 🌴

57. చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పర: |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త: సతతం భవ ||


🌷. తాత్పర్యం :

సర్వకర్మల యందు నా పైననే ఆధారపడి సదా నా రక్షణమునందే కర్మ నొనరింపుము. అట్టి భక్తియుతసేవలో సంపూర్ణముగా నా యందే చిత్తము కలవాడగుము.


🌷. భాష్యము :

మనుజుడు కృష్ణభక్తిభావన యందు వర్తించినపుడు తాను జగమునకు ప్రభువునన్న భావనలో వర్తించడు. వాస్తవమునకు ప్రతియొక్కరు సంపూర్ణముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని నిర్దేశమునందు సేవకుని వలె వర్తించవలసియున్నది.

సేవకుడైనవాడు కర్మ విషయమున స్వతంత్రతను కలిగియుండక యజమాని ఆజ్ఞానుసారమే వర్తించవలసివచ్చును. అదే విధముగా దివ్య యజమానుడైన శ్రీకృష్ణుని తరపున వర్తించు సేవకుడు కర్మ యొక్క లాభనష్టములతో ప్రభావితుడు గాకుండును.

అతడు కేవలము తన విధ్యుక్తధర్మమును ఆ భగవానుని ఆజ్ఞానుసారము ఒనరించుచుండును. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వర్తించియుండెను. కాని శ్రీకృష్ణుడు లేని సమయమున మనుజడు ఎట్లు వర్తించవలెనని ఎవరైనను వాదించు అవకాశము కలదు.

ఈ గీతాగ్రంథమునందు శ్రీకృష్ణభగవానుడు తెలిపిన నిర్దేశానుసారము మరియు ఆ దేవదేవుని ప్రతినిధియైన గురువు యొక్క నేతృత్వములో మనుజుడు కర్మనొనరించినచో శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశములో వర్తించిన ఫలమే కలుగుననుట దానికి సమాధానము.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 640 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 57 🌴

57. cetasā sarva-karmāṇi
mayi sannyasya mat-paraḥ
buddhi-yogam upāśritya
mac-cittaḥ satataṁ bhava


🌷 Translation :

In all activities just depend upon Me and work always under My protection. In such devotional service, be fully conscious of Me.


🌹 Purport :

When one acts in Kṛṣṇa consciousness, he does not act as the master of the world. Just like a servant, one should act fully under the direction of the Supreme Lord. A servant has no individual independence.

He acts only on the order of the master. A servant acting on behalf of the supreme master is unaffected by profit and loss. He simply discharges his duty faithfully in terms of the order of the Lord.

Now, one may argue that Arjuna was acting under the personal direction of Kṛṣṇa but when Kṛṣṇa is not present how should one act? If one acts according to the direction of Kṛṣṇa in this book, as well as under the guidance of the representative of Kṛṣṇa, then the result will be the same.

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 639: 18వ అధ్., శ్లో 56 / Bhagavad-Gita - 639: Chap. 18, Ver. 56


🌹. శ్రీమద్భగవద్గీత - 639 / Bhagavad-Gita - 639 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 56 🌴

56. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ: |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||


🌷. తాత్పర్యం :

అన్ని రకములైన కర్మల యందు నియుక్తుడైనను నా శుద్ధభక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతమును, అవ్యయమును అగు పదమును నా అనుగ్రహముచే పొందగలడు.


🌷. భాష్యము :

“మద్వ్యపాశ్రయ:” అనగా శ్రీకృష్ణభగవానుని రక్షణమున అని భావము. భౌతికకల్మషముల నుండి విడివడుటకు శుద్ధభక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని నిర్దేశమున లేదా ఆ భగవానుని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నిర్దేశమున వర్తించును. కాలపరిమితి యనునది లేకుండా ఇరువదినాలుగు గంటలు, నూటికినూరుపాళ్ళు భగవానుని నిర్దేశమున అతడు కర్మల యందు నియుక్తుడై యుండును.

ఆ విధముగా కృష్ణభక్తిభావనలో కర్మల యందు నియుక్తుడైన భక్తుని యెడ శ్రీకృష్ణభగవానుడు పరమదయాళువు కాగలడు. తత్కారణముగా ఎట్టి కష్టములెదురైనను అంత్యమున అతడు కృష్ణలోకమున చేరగలడు.

అతడు కృష్ణలోకమును నిశ్చయముగా చేరుననుటలో ఎట్టి సందేహము లేదు. అట్టి కృష్ణలోకమునందు ప్రతిదియు మార్పురహితము, శాశ్వతము, అవ్యయము, జ్ఞానపూర్ణమై యుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 639 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 56 🌴

56. sarva-karmāṇy api sadā
kurvāṇo mad-vyapāśrayaḥ
mat-prasādād avāpnoti
śāśvataṁ padam avyayam


🌷 Translation :

Though engaged in all kinds of activities, My pure devotee, under My protection, reaches the eternal and imperishable abode by My grace.


🌹 Purport :

The word mad-vyapāśrayaḥ means under the protection of the Supreme Lord. To be free from material contamination, a pure devotee acts under the direction of the Supreme Lord or His representative, the spiritual master.

There is no time limitation for a pure devotee. He is always, twenty-four hours a day, one hundred percent engaged in activities under the direction of the Supreme Lord. To a devotee who is thus engaged in Kṛṣṇa consciousness the Lord is very, very kind.

In spite of all difficulties, he is eventually placed in the transcendental abode, or Kṛṣṇaloka. He is guaranteed entrance there; there is no doubt about it. In that supreme abode, there is no change; everything is eternal, imperishable and full of knowledge.

🌹 🌹 🌹 🌹 🌹


14 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 638: 18వ అధ్., శ్లో 55 / Bhagavad-Gita - 638: Chap. 18, Ver. 55


🌹. శ్రీమద్భగవద్గీత - 638 / Bhagavad-Gita - 638 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 55 🌴

55. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్త్వత: |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్ ||


🌷. తాత్పర్యం :

కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసికొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా దామమున చేరగలడు.


🌷. భాష్యము :

పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని మరియు అతని ప్రధానాంశములైన విష్ణుతత్త్వములను అవగతము చేసికొనుట మనోకల్పనలచేగాని, అభక్తులకు గాని సాధ్యము కాదు. ఎవరేని ఆ దేవదేవుని అవగతము చేసికొనదలచినచో శుద్ధభక్తుని నిర్దేశమున భక్తియుతసేవను స్వీకరింపవలెను. లేనియెడల శ్రీకృష్ణభగవానుని తత్త్వమెల్లవేళలా గుప్తముగనే ఉండిపోగలదు.

భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున (7.25) “నాహం ప్రకాశ: సర్వస్య” యని తెలుపబడినట్లు అతడు సర్వులకు వ్యక్తము కాడు. విద్యావైదుష్యముచే కాని, మనోకల్పనచే గాని ఎవ్వరును భగవానుని అవగతము చేసికొనజాలరు.

వాస్తవముగా కృష్ణభక్తిరసభావితుడై భక్తిపూర్వక సేవయందు నిలిచినవాడే కృష్ణుడననేమో అవగతము చేసికొనగలడు. విశ్వవిద్యాలయ పట్టములు ఇందుకు ఏమాత్రము తోడ్పడవు.

కృష్ణపరజ్ఞానమునందు నిష్ణాతుడైనవాడు ఆధ్యాత్మికరాజ్యమగు కృష్ణలోకమును చేరుటకు యోగ్యుడగును. బ్రహ్మభావన పొందుట యనగా వ్యక్తిత్వమును కోల్పోవుట యని భావము కాదు.

వాస్తవమునకు బ్రహ్మభావన యందును భక్తియుతసేవ నిలిచియే యుండును. ఆ రీతి భక్తియుతసేవ ఉన్నంతకాలము భగవానుడు, భక్తుడు, భక్తియోగమనెడి మూడు అంశములు కొనసాగుచునే యుండును.

అట్టి జ్ఞానము ముక్తి పిదపయు నశించక నిలువగలదు. భౌతికభావన నుండి విడివడుటయే ముక్తి. కాని ఆధ్యాత్మికస్థితి యందును ఆత్మ, పరమాత్మల నడుమ భేదము, ఆత్మ యొక్క వ్యక్తిత్వము కొనసాగుచునే యుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 638 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 55 🌴

55. bhaktyā mām abhijānāti
yāvān yaś cāsmi tattvataḥ
tato māṁ tattvato jñātvā
viśate tad-anantaram


🌷 Translation :

One can understand Me as I am, as the Supreme Personality of Godhead, only by devotional service. And when one is in full consciousness of Me by such devotion, he can enter into the kingdom of God.


🌹 Purport :

The Supreme Personality of Godhead, Kṛṣṇa, and His plenary portions cannot be understood by mental speculation nor by the nondevotees.

If anyone wants to understand the Supreme Personality of Godhead, he has to take to pure devotional service under the guidance of a pure devotee. Otherwise, the truth of the Supreme Personality of Godhead will always be hidden. As already stated in Bhagavad-gītā (7.25), nāhaṁ prakāśaḥ sarvasya: He is not revealed to everyone.

No one can understand God simply by erudite scholarship or mental speculation. Only one who is actually engaged in Kṛṣṇa consciousness and devotional service can understand what Kṛṣṇa is. University degrees are not helpful.

One who is fully conversant with the Kṛṣṇa science becomes eligible to enter into the spiritual kingdom, the abode of Kṛṣṇa. Becoming Brahman does not mean that one loses his identity. Devotional service is there, and as long as devotional service exists, there must be God, the devotee, and the process of devotional service.

Such knowledge is never vanquished, even after liberation. Liberation involves getting free from the concept of material life; in spiritual life the same distinction is there, the same individuality is there, but in pure Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 637: 18వ అధ్., శ్లో 54 / Bhagavad-Gita - 637: Chap. 18, Ver. 54


🌹. శ్రీమద్భగవద్గీత - 637 / Bhagavad-Gita - 637 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 54 🌴

54. బ్రహ్మభూత: ప్రసన్నాత్మా
న శోచతి న కాంక్షతి |
సమ: సర్వేషు భూతేషు
మద్భక్తిం లభతే పరాం ||


🌷. తాత్పర్యం :

ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్టితుడైనవాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకించక, దేనిని వాంచింపక అట్టివాడు సర్వజీవుల యెడ సమత్వభావమును కలిగియుండును. అటువంటి స్థితి యందే అతడు నా శుద్ధభక్తియుత సేవను పొందుచున్నాడు.


🌷. భాష్యము :

నిరాకారవాదికి పరతత్త్వముతో ఏకమగుట యనెడి బ్రహ్మభూతస్థితిని పొందుటయే చరమగమ్యము. కాని సాకారవాది లేదా శుద్ధభక్తుడు శుద్ధమగు భక్తియుతసేవ యందు నెలకొనుట ఆ స్థితిని కూడా దాటి, ఇంకను పురోగమించవలెను.

అనగా శ్రీకృష్ణభగవానుని భక్తిపూర్వక సేవయందు నిలిచినవాడు బ్రహ్మభూతస్థితి యందు నిలిచియున్నట్టివాడే యని అర్థము. వాస్తవమునకు పరబ్రహ్మముతో ఏకము కానిదే ఎవ్వరును ఆ దేవదేవునికి సేవనొనర్చులేరు. దివ్యభావనలో సేవ్యుడు, సేవకుల నడుమ భేదము లేకున్నను, ఉన్నత ఆధ్యాత్మికభావనలో వారి నడుమ తారతమ్యము తప్పక ఉండును.

భౌతికభావనలో స్వీయతృప్తి కొరకు మనుజుడు కర్మనొనరించినపుడు దుఃఖము కలుగుచుండును. కాని ఆధ్యాత్మికజగమునందు శుద్ధభక్తి యందు నెలకొనినపుడు దుఃఖము కలుగదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 637 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 54 🌴

54. brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
samaḥ sarveṣu bhūteṣu
mad-bhaktiṁ labhate parām


🌷 Translation :

One who is thus transcendentally situated at once realizes the Supreme Brahman and becomes fully joyful. He never laments or desires to have anything. He is equally disposed toward every living entity. In that state he attains pure devotional service unto Me.


🌹 Purport :

To the impersonalist, achieving the brahma-bhūta stage, becoming one with the Absolute, is the last word. But for the personalist, or pure devotee, one has to go still further, to become engaged in pure devotional service.

This means that one who is engaged in pure devotional service to the Supreme Lord is already in a state of liberation, called brahma-bhūta, oneness with the Absolute. Without being one with the Supreme, the Absolute, one cannot render service unto Him. In the absolute conception, there is no difference between the served and the servitor; yet the distinction is there, in a higher spiritual sense.

In the material concept of life, when one works for sense gratification, there is misery, but in the absolute world, when one is engaged in pure devotional service, there is no misery.

🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 636: 18వ అధ్., శ్లో 53 / Bhagavad-Gita - 636: Chap. 18, Ver. 53


🌹. శ్రీమద్భగవద్గీత - 636 / Bhagavad-Gita - 636 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 53 🌴

53. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమ: శాన్తో బ్రహ్మభూయాయకల్పతే ||


🌷. తాత్పర్యం :

మిథ్యాహంకారము, మిథ్యాబలము, మిథ్యాగర్వము, కామము, క్రోధము, విషయవస్తుస్వీకారము అనువాని నుండి విడివడినవాడును, మమత్వదూరుడును, శాంతిమయుడును అగు మనుజుడు నిశ్చయముగా ఆత్మానుభవస్థాయికి ఉద్ధరింపగలడు.


🌷. భాష్యము :

మనుజుడు భౌతికభావన నుండి మక్తుడైనపుడు శాంతిమయుడై కలతకు గురికాకుండును. ఈ విషయము భగద్గీత (2.70 ) యందే వివరింపబడినది.

ఆపూర్వమాణం అచలప్రతిష్టమ్ సముద్ర మాప: ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్ కామాయం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాప్నోతి న కామకామీ ||

“సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండి సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే కలతనొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొంద సమర్థుడు కాజాలడు.”

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 636 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 53 🌴

53. ahaṅkāraṁ balaṁ darpaṁ
kāmaṁ krodhaṁ parigraham
vimucya nirmamaḥ śānto
brahma-bhūyāya kalpate


🌷 Translation :

Who is detached, free from false ego, false strength, false pride, lust, anger, and acceptance of material things, free from false proprietorship, and peaceful – such a person is certainly elevated to the position of self-realization.


🌹 Purport :

When one is free from the material conception of life, he becomes peaceful and cannot be agitated. This is described in Bhagavad-gītā (2.70):

āpūryamāṇam acala-pratiṣṭhaṁ
samudram āpaḥ praviśanti yadvat
tadvat kāmā yaṁ praviśanti sarve
sa śāntim āpnoti na kāma-kāmī

“A person who is not disturbed by the incessant flow of desires – that enter like rivers into the ocean, which is ever being filled but is always still – can alone achieve peace, and not the man who strives to satisfy such desires.”

🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2021

శ్రీమద్భగవద్గీత - 635: 18వ అధ్., శ్లో 52 / Bhagavad-Gita - 635: Chap. 18, Ver. 52

🌹. శ్రీమద్భగవద్గీత - 635 / Bhagavad-Gita - 635 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 52 🌴

52. వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానస: |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత: ||

🌷. తాత్పర్యం : 
మితాహారము కలిగినవాడును, మనోవాక్కాయములను నియంత్రించువాడును, సమాధిస్థితి యందున్నవాడును, అసంగుడును, 

🌷. భాష్యము :
దేహాత్మభావన లేని కారణముగా మిథ్యాదర్పమునకు దూరుడై యుండు అతడు భగవానుడు ఒసగినదానిచే తృప్తుడగు చుండును. అట్టివాడు ఇంద్రియప్రీతి లభింపనప్పుడు క్రోధము చెందుట గాని, ఇంద్రియార్థములకై తీవ్రయత్నములు సలుపుట గాని చేయడు. 

ఈ విధముగా మిథ్యాహంకారము నుండి సంపూర్ణముగా విడివడినపుడు, భౌతికవిషయముల యెడ అతడు అనాసక్తుడగును. అదియే బ్రహ్మానుభవస్థితియై యున్నది. అట్టి స్థితియే “బ్రహ్మభూతస్థితి” యనబడును. 
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 635 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 52 🌴

52. vivikta-sevī laghv-āśī
yata-vāk-kāya-mānasaḥ
dhyāna-yoga-paro nityaṁ
vairāgyaṁ samupāśritaḥ

🌷 Translation : 
who eats little, who controls his body, mind and power of speech, who is always in trance and who is detached,

🌹 Purport :
Because he has no bodily concept of life, he is not falsely proud. He is satisfied with everything that is offered to him by the grace of the Lord, and he is never angry in the absence of sense gratification. Nor does he endeavor to acquire sense objects. 

Thus when he is completely free from false ego, he becomes nonattached to all material things, and that is the stage of self-realization of Brahman. That stage is called the brahma-bhūta stage. 
🌹 🌹 🌹 🌹 🌹



10 Feb 2021