శ్రీమద్భగవద్గీత - 162: 03వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 162: Chap. 03, Ver. 43


🌹. శ్రీమద్భగవద్గీత - 162 / Bhagavad-Gita - 162🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 43 🌴

43. ఏవం బుద్ధే: పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |
జహి శత్రుం మాహాబాహో కామరూపం దురాసదమ్ ||


🌷. తాత్పర్యం :

ఓ గొప్పబాహువులు గల అర్జునా! ఈ విధముగా తనను ఇంద్రియ, మనోబుద్ధులకు పరమైనవానిగా తెలిసికొని, ఆధ్యాత్మిక బుద్ధిచే (కృష్ణభక్తిరసభావానము) మనస్సును స్థిరపరచి, ఆ విధముగా ఆధ్యాత్మికబలముచే మనుజుడు కామమనెడి ఈ దుర్జయమైన శత్రువును జయింపవలెను.


🌷. భాష్యము :

మానవుడు నిర్విశేష శున్యమును చరమలక్ష్యముగా భావింపక తనను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా గుర్తించి కృష్ణభక్తిరసభావనను అవలంబించవలెనని భగవద్గీత యందలి ఈ తృతీయాధ్యాయము నిర్దేశించుచున్నది. భౌతికజీవనస్థితి యందు ప్రతియొక్కరు కామవాంఛను మరియు ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెనను కోరికను కలిగియుందురు. అటువంటి ఇంద్రియభోగవాంఛ మరియు స్వామిత్వ భావనయే బద్ధజీవునకు గొప్ప శత్రువై యున్నది. కాని కృష్ణభక్తి యనెడి బలము ద్వారా మనుజుడు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, అదుపు చేయగలడు.

అనగా చేయు కర్మను మరియు విధ్యుక్తధర్మమును ఎవ్వరును హటాత్తుగా త్యజింపవలసిన అవసరము లేదు. కృష్ణభక్తిరసభావనను క్రమముగా వృద్ధిపరచుకొనుచు మనో, ఇంద్రియములచే ప్రభావితము కానటువంటి అధ్యాతిమికస్థితి యందు మనుజుడు నెలకొనగలడు. పవిత్రతను సాధించుట కొరకై యత్నించెడి స్థిరబుద్ధి ద్వారా అది సాధ్యపడగలదు. ఇదియే ఈ అధ్యాయపు సంపూర్ణ సారాంశము. అపరిపక్వ భౌతికజీవనస్థితిలో తాత్వికకల్పనలు మరియు నామమాత్ర యోగము ద్వారా ఇంద్రియనిరోధము వంటివి మనుజుని ఆధ్యాత్మికజీవనమునకు తోడ్పడజాలవు. కనుక అతడు ఉన్నతబుద్ధి ద్వారా కృష్ణభక్తిరసభావన యందు సుశిక్షితుడు కావాలసియున్నది.

శ్రీమద్భగవద్గీత యందలి “కర్మయోగము” లేదా “కృష్ణభక్తి భావన యందు విధ్యుక్తధర్మనిర్వహణము” అను తృతీయాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 162 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 43 🌴


43. evaṁ buddheḥ paraṁ buddhvā saṁstabhyātmānam
ātmanā jahi śatruṁ mahā-bāho kāma-rūpaṁ durāsadam


🌷 Translation :

Thus knowing oneself to be transcendental to the material senses, mind and intelligence, O mighty-armed Arjuna, one should steady the mind by deliberate spiritual intelligence [Kṛṣṇa consciousness] and thus – by spiritual strength – conquer this insatiable enemy known as lust.


🌷 Purport :

This Third Chapter of the Bhagavad-gītā is conclusively directive to Kṛṣṇa consciousness by knowing oneself as the eternal servitor of the Supreme Personality of Godhead, without considering impersonal voidness the ultimate end. In the material existence of life, one is certainly influenced by propensities for lust and desire for dominating the resources of material nature. Desire for overlording and for sense gratification is the greatest enemy of the conditioned soul; but by the strength of Kṛṣṇa consciousness, one can control the material senses, the mind and the intelligence.

One may not give up work and prescribed duties all of a sudden; but by gradually developing Kṛṣṇa consciousness, one can be situated in a transcendental position without being influenced by the material senses and the mind – by steady intelligence directed toward one’s pure identity. This is the sum total of this chapter. In the immature stage of material existence, philosophical speculations and artificial attempts to control the senses by the so-called practice of yogic postures can never help a man toward spiritual life. He must be trained in Kṛṣṇa consciousness by higher intelligence.

Thus end the Bhaktivedanta Purports to the Third Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Karma-yoga, or the Discharge of One’s Prescribed Duty in Kṛṣṇa Consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


9 Oct 2019