🌹. శ్రీమద్భగవద్గీత - 159 / Bhagavad-Gita - 159 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 40 🌴
40. ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే |
ఎతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్
🌷. తాత్పర్యం :
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యనునవి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజజ్ఞానమును ఆవరించి అతనిని మోహింప జేయును.
🌷. భాష్యము :
బద్ధజీవుని దేహమందలి వివిధ ముఖ్యస్థానములను శత్రువు ఆక్రమించియున్నాడు. అట్టి శత్రువును జయింపగోరువారు అతడు ఎచ్చట కనుగొనబడునో తెలియుట కొరకు శ్రీకృష్ణభగవానుడు ఆయా స్థానములను గూర్చి తెలుపుచున్నాడు. మనస్సు ఇంద్రియముల కర్మలన్నింటిని మూలము కావున ఇంద్రియార్థముల గూర్చి వినినంతనే ఇంద్రియభోగాభిలాషలకు మనస్సు నిలయమగును. తత్పలితముగా మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు ఆశ్రయమగును.
తదుపరి బుద్ధి అట్టి కామభావనలకు కేంద్రమగును. బుద్ధి ఆత్మ యొక్క పొరుగున ఉన్నటువంటిది. కామపూర్ణమైన బుద్ధి యనునది ఆత్మ మిథ్యాహంకారమును పొంది, భౌతికభావనలో ఇంద్రియ, మనస్స్సులతో తాదాత్మ్యము చెందునట్లుగా ప్రభావితము చేయును. తద్ద్వారా జీవాత్మ ఇంద్రియసుఖములకు అలవాటుపడి అదియే నిజ సుఖమణి భ్రమపడును.జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతము (10.84.13) నందు చక్కగా వివరింపబడినది.
యస్యాత్మ బుద్ధి: కుణపే త్రిదాతుకే
స్వధీ: కలత్రాదిషు భౌమ ఇజ్యధీ: |
యత్తీర్థబుద్ధి: సలిలే న కర్హచిత్
జనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖర:
“త్రిధాతులతో తయారు చేయబడిన దేహమును ఆత్మను, దేహము నుండి కలిగినవారిని బంధువులుగను, జన్మభూమిని పూజస్థానముగాను, తీర్థస్థానమున కేగుట అధ్యాత్మికజ్ఞానపూర్ణులగు మహాత్ములను కలిసికొనుటకు గాక స్నానమాచరించు ప్రయోజనముగను భావించు మనుజుడు గార్ధభము లేక గోవుగా భావింపబడును.”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 159 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 40 🌴
40. indriyāṇi mano buddhir asyādhiṣṭhānam ucyate
etair vimohayaty eṣa jñānam āvṛtya dehinam
🌷 Translation :
The senses, the mind and the intelligence are the sitting places of this lust. Through them lust covers the real knowledge of the living entity and bewilders him.
🌷 Purport :
The enemy has captured different strategic positions in the body of the conditioned soul, and therefore Lord Kṛṣṇa is giving hints of those places, so that one who wants to conquer the enemy may know where he can be found. Mind is the center of all the activities of the senses, and thus when we hear about sense objects the mind generally becomes a reservoir of all ideas of sense gratification; and, as a result, the mind and the senses become the repositories of lust. Next, the intelligence department becomes the capital of such lustful propensities. Intelligence is the immediate next-door neighbor of the spirit soul.
Lusty intelligence influences the spirit soul to acquire the false ego and identify itself with matter, and thus with the mind and senses. The spirit soul becomes addicted to enjoying the material senses and mistakes this as true happiness. This false identification of the spirit soul is very nicely explained in the Śrīmad-Bhāgavatam (10.84.13):
yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke |
sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ |
yat-tīrtha-buddhiḥ salile na karhicij
janeṣv abhijñeṣu sa eva go-kharaḥ
“A human being who identifies this body made of three elements with his self, who considers the by-products of the body to be his kinsmen, who considers the land of birth worshipable, and who goes to the place of pilgrimage simply to take a bath rather than meet men of transcendental knowledge there is to be considered like an ass or a cow.”
🌹 🌹 🌹 🌹 🌹
6 Oct 2019
janeṣv abhijñeṣu sa eva go-kharaḥ
“A human being who identifies this body made of three elements with his self, who considers the by-products of the body to be his kinsmen, who considers the land of birth worshipable, and who goes to the place of pilgrimage simply to take a bath rather than meet men of transcendental knowledge there is to be considered like an ass or a cow.”
🌹 🌹 🌹 🌹 🌹
6 Oct 2019