Showing posts with label గీత. Show all posts
Showing posts with label గీత. Show all posts

శ్రీమద్భగవద్గీత - 239: 06వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 239: Chap. 06, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 239 / Bhagavad-Gita - 239 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 06 🌴

06. బన్దురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జిత: |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ||


🌷. తాత్పర్యం :

మనస్సును జయించినవానికి మనస్సే ఉత్తమమిత్రుడు. కాని అట్లు చేయలేనివానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును.

🌷. భాష్యము :

మానవధర్మమును నిర్వహించుట యందు మనస్సుని మిత్రునిగా చేసికొనుట కొరకు దానిని నియమించుటయే అష్టాంగయోగాభ్యాసపు ప్రయోజమై యున్నది. మనస్సు నియమింపబడనిచో యోగాభ్యాసము కేవలము సమయమును వృథాచేయుటయే కాగలదు. మనస్సును అదుపు చేయనివాడు సదా గొప్ప శత్రువుతో కలసి జీవనము సాగించువాడు కాగలడు. తత్కారణముగా అతని జన్మ మరియు జన్మప్రయోజనము సంపూర్ణముగా నష్టము కాగలవు. తన కన్నను ఉన్నతుడైనవాని ఆజ్ఞలను నిర్వర్తించుట జీవుల సహజస్థితియై యున్నది. మనస్సు జయింపరాని శత్రువుగా నిలిచినంతకాలము మనుజుడు కామము, క్రోధము, ద్వేషము, మోహము మొదలుగువాని ఆజ్ఞలను అనుసరింపవలసివచ్చును.

కాని మనస్సు జయింపబడినప్పుడు మనుజుడు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపున వసించియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలకు కట్టుబడియుండుటకు స్వచ్చందముగా అంగీకరించును. హృదయస్థుడైన పరమాత్మను చేరి, అతని ఆజ్ఞల మేరకు వర్తించుటనే నిజమైన యోగము ఉపదేశించును. కృష్ణభక్తిభావన యందు ప్రత్యక్షముగా నియుక్తుడైనవానికి శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా నియుక్తుడైనవానికి శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా జరిగిపోవును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 239 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 06 🌴

06. bandhur ātmātmanas tasya yenātmaivātmanā jitaḥ
anātmanas tu śatrutve vartetātmaiva śatru-vat

🌷 Translation :

For him who has conquered the mind, the mind is the best of friends; but for one who has failed to do so, his mind will remain the greatest enemy.

🌹 Purport :

The purpose of practicing eightfold yoga is to control the mind in order to make it a friend in discharging the human mission. Unless the mind is controlled, the practice of yoga (for show) is simply a waste of time. One who cannot control his mind lives always with the greatest enemy, and thus his life and its mission are spoiled. The constitutional position of the living entity is to carry out the order of the superior. As long as one’s mind remains an unconquered enemy, one has to serve the dictations of lust, anger, avarice, illusion, etc.

But when the mind is conquered, one voluntarily agrees to abide by the dictation of the Personality of Godhead, who is situated within the heart of everyone as Paramātmā. Real yoga practice entails meeting the Paramātmā within the heart and then following His dictation. For one who takes to Kṛṣṇa consciousness directly, perfect surrender to the dictation of the Lord follows automatically.

🌹 🌹 🌹 🌹 🌹

23 Dec 2019

శ్రీమద్భగవద్గీత - 149: 03వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 149: Chap. 03, Ver. 42

🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 149 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము  - 42 🌴

42. ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్య: పరం మన: |
మనస్తు పరా బుద్ధిర్యో బుద్ధే: పరతస్తు స: ||

🌷. తాత్పర్యం :
జడపదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు; ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము; మనస్సు కన్నను బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము.

🌷. భాష్యము :
ఇంద్రియములు కామము యొక్క కర్మలకు వివిధ ద్వారములై యున్నవి. అనగా దేహమునందు నిలిచియుండెడి కామము వివిధములైన ఇంద్రియముల ద్వారా బహిర్గతమగుచుండును. కనుక దేహము కన్నను ఇంద్రియములు శ్రేష్టములై యున్నవి. కాని కృష్ణభక్తిరసభావనము (ఉత్తమచైతన్యము) కలిగినప్పడు ఇంద్రియములు కామము బహిర్గతమగుటకు ఉపయోగింపబడవు. కృష్ణభక్తిభావన యందు ఆత్మ భగవానునితో ప్రత్యక్షసంబంధమును ఏర్పరచుకొనును గావున ఇచ్చట తెలుపబడిన దేహకర్మాది సర్వవిషయములు అంత్యమున పరమాత్మ యందే ముగియును. దేహకర్మ యనగా ఇంద్రియకర్మ గనుక ఇంద్రియములను నిరోధించుట యనగా దేహకర్మలను ఆపివేయుట యని భావము. కాని మనస్సు క్రియాశీలత కలిగియున్నందున దేహము ఎట్టి కర్మను చేయక నిశ్చలముగా నున్నను ఉన్నతమైనది బుద్ధి మరియు ఆ బుద్ధి కన్నను ఉన్నతమైనదే ఆత్మ. కనుక ఒకవేళ ఆత్మను ప్రత్యక్షముగా శ్రీకృష్ణభగవానుని సంబంధమును నిలిపినచో బుద్ధి, మనస్సు, ఇంద్రియములనునవి వాటంతట అవియే అప్రయత్నముగా భగవత్సేవలో నియుక్తములగును. ఇటువంటి విషయమే కఠోపనిషత్తునందు ఒక చోట చెప్పబడినది. దాని ప్రకారము ఇంద్రియార్థములు ఇంద్రియముల కన్నను ఉత్తమములు కాగా, మనస్సు ఇంద్రియార్థముల కన్నను ఉత్తమమై యున్నది. కావున ఒకవేళ మనస్సు భగవానుని సేవలో నిత్యము నిలిచియున్నచో ఇంద్రియములు ఇతర మార్గములందు నియుక్తమగుటకు అవకాశముండదు. ఇట్టి మానసికస్థితి పూర్వమే వివరింప బడినది. “పరమ దృష్ట్వా నివర్తతే”. అనగా మనస్సును శ్రీకృష్ణభగవానుని దివ్యమైన సేవలో నిలిపినచో అది ఇతర హీనప్రవృత్తులను కలిగియుండు అవకాశముండదు. కఠోపనుషత్తునందు ఆత్మ “మహాన్”(ఘనమైనది) అని వర్ణింపబడినది. అనగా ఇంద్రియార్థములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కన్నను ఆత్మ ఘనమైనది. కనుక ఆత్మ యొక్క నిజస్థితిని ప్రత్యక్షముగా అవగతము చేసికొనుటయే సమస్యాపరిష్కారమునకు మార్గమై యున్నది.

బుద్ధి చేత మనుజుడు ఆత్మ యొక్క నిజస్థితిని తెలిసికొని, మనస్సును సదా కృష్ణభక్తిరసభావన యందు నిలుపవలెను. అది సమస్యలన్నింటిని సంపూర్ణముగా పరిష్కరింపగలదు. ఇంద్రియార్థముల నుండి దూరముగా నుండుమని ప్రారంభదశలో నున్న సాధకునికి సాధారణముగా ఉపదేశింపబడును. కాని దానితో పాటుగా అతడు బుద్ధిచే మనస్సును దృడపరచుకొనవలెను. శ్రీకృష్ణభగవానుని యందు సంపూర్ణ శరణాగతితో మనుజుడు బుద్ధి నుపయోగించి తన మనస్సును కృష్ణభక్తిభావన యందు నిలిపినచో అతని మనస్సు అప్రయత్నముగా దృడవంతమగును. అట్టి స్థితిలో సర్పముల వలె బలమైన ఇంద్రియములకు ఆత్మ ప్రభువైనను భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని సాహచర్యమునందు అది దృడము కానిచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందు అవకాశము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 149 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 42 🌴

42. indriyāṇi parāṇy āhur
indriyebhyaḥ paraṁ manaḥ
manasas tu parā buddhir
yo buddheḥ paratas tu saḥ

🌷 Translation : 
The working senses are superior to dull matter; mind is higher than the senses; intelligence is still higher than the mind; and he [the soul] is even higher than the intelligence.

🌷 Purport :
The senses are different outlets for the activities of lust. Lust is reserved within the body, but it is given vent through the senses. Therefore, the senses are superior to the body as a whole. These outlets are not in use when there is superior consciousness, or Kṛṣṇa consciousness. In Kṛṣṇa consciousness the soul makes direct connection with the Supreme Personality of Godhead; therefore the hierarchy of bodily functions, as described here, ultimately ends in the Supreme Soul. Bodily action means the functions of the senses, and stopping the senses means stopping all bodily actions. But since the mind is active, then even though the body may be silent and at rest, the mind will act – as it does during dreaming. But above the mind is the determination of the intelligence, and above the intelligence is the soul proper.

If, therefore, the soul is directly engaged with the Supreme, naturally all other subordinates, namely, the intelligence, mind and senses, will be automatically engaged. In the Kaṭha Upaniṣad there is a similar passage, in which it is said that the objects of sense gratification are superior to the senses, and mind is superior to the sense objects. 

If, therefore, the mind is directly engaged in the service of the Lord constantly, then there is no chance that the senses will become engaged in other ways. This mental attitude has already been explained. Paraṁ dṛṣṭvā nivartate. If the mind is engaged in the transcendental service of the Lord, there is no chance of its being engaged in the lower propensities. In the Kaṭha Upaniṣad the soul has been described as mahān, the great. Therefore the soul is above all – namely, the sense objects, the senses, the mind and the intelligence. Therefore, directly understanding the constitutional position of the soul is the solution of the whole problem.

With intelligence one has to seek out the constitutional position of the soul and then engage the mind always in Kṛṣṇa consciousness. That solves the whole problem. A neophyte spiritualist is generally advised to keep aloof from the objects of the senses. But aside from that, one has to strengthen the mind by use of intelligence. If by intelligence one engages one’s mind in Kṛṣṇa consciousness, by complete surrender unto the Supreme Personality of Godhead, then, automatically, the mind becomes stronger, and even though the senses are very strong, like serpents, they will be no more effective than serpents with broken fangs. But even though the soul is the master of intelligence and mind, and the senses also, still, unless it is strengthened by association with Kṛṣṇa in Kṛṣṇa consciousness, there is every chance of falling down due to the agitated mind.
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 031: 01వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 031: Chap. 01, Ver. 31


🌹. శ్రీమద్భగవద్గీత - 31 / Bhagavad-Gita - 31 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాదయోగము - 31 🌴


31. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ||
న చ శ్రేయో నుపశ్యామి హత్వా స్వజనమాహవే |

🌷. తాత్పర్యం :

ఓ కృష్ణా! కేశిసంహారీ! కేవలము విపరీతములననే నేను గాంచుచున్నాను. ఓ కృష్ణా! ఈ యుద్ధము నందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను.

🌻. భాష్యము :

అర్జునుడు యుద్ధరంగము నందు భాధమాయమైన విపరితములనే దర్శించసాగెను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందము పొందలేనట్లుగా నుండెను. ఇచ్చట “నిమిత్తాని విపరీతాని” అను పదములు ప్రాముఖ్యమును కలిగియున్నవి.

మనుజుడు తన ఆకాంక్షలలో కేవలము విఫలత్వమునే గాంచినపుడు “నేనిచట ఎందులకుకున్నాను?” అని తలపోయును. సాధారణముగా ప్రతియెక్కరు తన యందు మరియు తన స్వీయ క్షేమమునందు ప్రియమును కలిగియుందురు. భగవానుని యందు ఎవ్వరును ప్రియమును కలిగియుండరు. ఇచ్చట శ్రీకృష్ణుని సంకల్పమున అర్జునుడు తన నిజలాభాము నెడ జ్ఞానశూన్యతను ప్రదర్శించుచున్నాడు.

ప్రతియొక్కరి నిజలాభము(స్వార్థగతి) విష్ణువు లేదా శ్రీకృష్ణుని యందె కలదు. బద్ధజీవుడు ఈ విషయమును మరచుట చేతనే భౌతికక్లేశముల ననుభవించును. రణరంగమునందు లభించెడి విజయము తనకు దుఃఖకారణమే కాగలదని అర్జునుడు తలపోసెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 31 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga - 31 🌴

31. nimittāni ca paśyāmi
viparītāni keśava
na ca śreyo ’nupaśyāmi
hatvā sva-janam āhave


🌷. Translation :

I see only causes of misfortune, O Kṛṣṇa, killer of the Keśī demon. I do not see how any good can come from killing my own kinsmen in this battle.

🌻. Purport :

Arjuna envisioned only painful reverses in the battlefield – he would not be happy even by gaining victory over the foe.

The words nimittāni viparītāni are significant. When a man sees only frustration in his expectations, he thinks, “Why am I here?” Everyone is interested in himself and his own welfare. No one is interested in the Supreme Self. Arjuna is showing ignorance of his real self-interest by Kṛṣṇa’s will.

One’s real self-interest lies in Viṣṇu, or Kṛṣṇa. The conditioned soul forgets this, and therefore suffers material pains. Arjuna thought that his victory in the battle would only be a cause of lamentation for him.

🌹🌹🌹🌹🌹

07 Jun 2019

శ్రీమద్భగవద్గీత - 030: 01వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 030: Chap. 01, Ver. 30


🌹. శ్రీమద్భగవద్గీత  - 30 / Bhagavad-Gita - 30 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాదయోగము - 30, 🌴

30. గాండీవం స్రంసతే హస్టాత్ త్వక్చైవ పరిదహ్యతే ||
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మన: | 

🌷. తాత్పర్యం : 
గాండివధనుస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవు చున్నది. నేను ఇపుడు ఏ మాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. 

🌻. భాష్యము : 
ప్రసిద్ధమైన గాండివధనుస్సు చేతి నుండి జారిపోవునంతగా అతడు అసహనము పొందెను. హృదయము మండుచున్న కారణమున చర్మము సైతము మండుచున్న భావనను పొందెను. ఇవన్నియును జీవితపు భౌతికభావన వలననే కలిగినట్టివి.

అసహనత కారణమున అర్జునుడు యుద్దరంగమున నిలువ అశక్తుడై యుండెను. ఈ మనోదుర్భలత వలన అతడు తననే మరచిపోవుచుండును. భౌతికవిషయముల యెడ అధికాసక్తి యనుననది. మనుజుని అట్టి భ్రాంతిమాయ స్థితి యందు నిలుపును. “భయమ్ ద్వితీయాభినివేశత: స్యాత్” (భాగవతము 11.2.37) భౌతికపరిస్థితులచే తీవ్రముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును. 
🌹 🌹 🌹 🌹 🌹 



🌹 Bhagavad-Gita as It is  -30 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga - 30 🌴

30. gāṇḍīvaṁ sraṁsate hastāt
tvak caiva paridahyate
na ca śaknomy avasthātuṁ
bhramatīva ca me manaḥ

🌷. Translation : 
my bow Gāṇḍīva is slipping from my hand, and my skin is burning. I am now unable to stand here any longer. I am forgetting myself, and my mind is reeling. 

🌻. Purport : 
This is evident from other symptoms also; he became so impatient that his famous bow Gāṇḍīva was slipping from his hands, and, because his heart was burning within him, he was feeling a burning sensation of the skin. All these are due to a material conception of life.

Due to his impatience, Arjuna was unable to stay on the battlefield, and he was forgetting himself on account of this weakness of his mind. Excessive attachment for material things puts a man in such a bewildering condition of existence. Bhayaṁ dvitīyābhiniveśataḥ syāt (Bhāg. 11.2.37): such fearfulness and loss of mental equilibrium take place in persons who are too affected by material conditions.
🌹🌹🌹🌹🌹

06 Jun 2019