శ్రీమద్భగవద్గీత - 164: 04వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 164: Chap. 04, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 164 / Bhagavad-Gita - 164🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 02 🌴


02. ఏవం పరంప్రాప్తంమిమం రాజర్షయో విదు: |
స కాలేనేహ మహతా యోగో నష్ట: పరన్తప ||


🌷. తాత్పర్యం :

ఈ దివ్యజ్ఞానము ఈ విధముగా గురుశిష్యపరంపరా రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసికొనిరి. కాని కాలక్రమమున పరంపర విఛ్చిన్నమగుట వలన జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది.

🌷. భాష్యము :

ప్రజలను పాలించుట యందు భగవద్గీత యొక్క ప్రయోజనమును రాజర్షులు నెరవేర్చవలసియున్నందున వారి కొరకే ఈ గీతాజ్ఞానము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. నిశ్చయముగా ఇది దానప్రవృత్తి గలవారికి ఉద్దేశింపబడలేదు. ఎవ్వరికి కుడా లాభము కలుగనట్లుగా వారు దీని విలువను నష్టపరచుటయే గాక తమ విపరీత తలంపుల ననుసరించి దీనికి వివిధ వివరణలను కల్పించు చుందురు.

ఈ విధముగా మూలప్రయోజనము అటువంటి అధర్మపరులగు వ్యాఖ్యాతల విపరీతతలంపులచే నష్టపడినప్పడు గురుశిష్యపరంపరను తిరిగి పున:స్థాపించవలసిన అవసరమేర్పడును. దివ్యమైన గురుశిష్యపరంపర నష్టమైనదని శ్రీకృష్ణభగవానుడు ఐదువేల సంవత్సరములకు పూర్వము గుర్తించి, గీతాజ్ఞాన ప్రయోజనము నశించినట్లు కనిపించుచున్నదని ప్రకటించెను. అదేవిధముగా ప్రస్తుతము కూడా అనేకములైన గీతావ్యాఖ్యానములు (ముఖ్యముగా ఆంగ్లములో) వ్యాప్తియందున్నను దాదాపు అవన్నియును ప్రామాణిక పరంపరానుగతములు కాకయున్నవి.

లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు పెక్కు లభించుచున్నను దాదాపు ఆ వ్యాఖ్యతలందరును శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించియుండలేదు. కాని వారు శ్రీకృష్ణభగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారము మాత్రము కావింతురు. ఇదియే దానప్రవృత్తి. ఏలయన దానవులు భగవానుని నమ్మకున్నను భగవదాస్తిని మాత్రము అనుభవింపవలెనని కోరుచుందురు.

గురుశిష్యపరంపరలో స్వీకరింపబడిన భగవద్గీత వ్యాఖ్యానమొకటి ఆంగ్లభాష యందు అవసరమై యున్నందున తత్ప్రయోజనము పూర్ణము చేయుట కొరకే ఈ రచనాయత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరింపబడిన భగవద్గీత సమస్త మానవాళికి ఒక వరము వంటిది. కాని అట్లుగాక దీనిని ఒక కాల్పనికమైన తాత్వికగ్రంథముగా స్వీకరించినచో అది కాలమును వృథాపరచినట్లే కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 164 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 02 🌴


02. evaṁ paramparā-prāptam imaṁ rājarṣayo viduḥ
sa kāleneha mahatā yogo naṣṭaḥ paran-tapa


🌷 Translation :

This supreme science was thus received through the chain of disciplic succession, and the saintly kings understood it in that way. But in course of time the succession was broken, and therefore the science as it is appears to be lost.

🌷 Purport :

It is clearly stated that the Gītā was especially meant for the saintly kings because they were to execute its purpose in ruling over the citizens. Certainly Bhagavad-gītā was never meant for the demonic persons, who would dissipate its value for no one’s benefit and would devise all types of interpretations according to personal whims. As soon as the original purpose was scattered by the motives of the unscrupulous commentators, there arose the need to reestablish the disciplic succession. Five thousand years ago it was detected by the Lord Himself that the disciplic succession was broken, and therefore He declared that the purpose of the Gītā appeared to be lost.

In the same way, at the present moment also there are so many editions of the Gītā (especially in English), but almost all of them are not according to authorized disciplic succession. There are innumerable interpretations rendered by different mundane scholars, but almost all of them do not accept the Supreme Personality of Godhead, Kṛṣṇa, although they make a good business on the words of Śrī Kṛṣṇa. This spirit is demonic, because demons do not believe in God but simply enjoy the property of the Supreme.

Since there is a great need of an edition of the Gītā in English, as it is received by the paramparā (disciplic succession) system, an attempt is made herewith to fulfill this great want. Bhagavad-gītā – accepted as it is – is a great boon to humanity; but if it is accepted as a treatise of philosophical speculations, it is simply a waste of time.

🌹 🌹 🌹 🌹 🌹


11 Oct 2019