శ్రీమద్భగవద్గీత - 181: 04వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 181: Chap. 04, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 181 / Bhagavad-Gita - 181 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 19 🌴


19. యస్య సర్వే సమారమ్భా: కామసంకల్పవర్జితా: |
జ్ఞానగ్నిదగ్ధకర్మాణాం తమాహు: పణ్డితం బుధా: ||

🌷. తాత్పర్యం :

ఎవని ప్రతి కర్మయు భోగవాంఛా రహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. కర్మ ఫలములన్నియు జ్ఞానగ్నిచే దగ్ధమైనవిగా (జ్ఞానాగ్నిదగ్దకర్మడు) అతడు ఋషులచే చెప్పబడును.

🌷. భాష్యము :

సంపూర్ణమైన జ్ఞానము గలవాడే కృష్ణభక్తిరసభావన యందు మగ్నుడై యుండెడి మనుజుని కర్మలను అవగాహనము చేసికొనగలడు. కృష్ణభక్తిభావన యందుండెడివాడు సర్వవిధములైన ఇంద్రియభోగభావనల నుండి విడివాడియుండును కావున శ్రీకృష్ణభగవానునికి నిత్యదాసుడనెడి తన నిజస్థితి గూర్చిన సంపూర్ణజ్ఞానముతో కర్మఫలములన్నింటిని భస్మీపటలము కావించుకొనెని ఎరుగవలసియున్నది.

అట్టి దివ్యజ్ఞానము సంపాదించిన వాడే వాస్తవమునకు పండితుడు. భగవానునితో గల నిత్యసంబంధమును గూర్చిన ఈ జ్ఞానాభివృద్ధి అగ్నిచో పోల్చబడును. అది ఒక్కమారు రగిలినచో సర్వములైన కర్మఫలములను సములముగా దహింపజేయగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 181 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 19 🌴

19 . yasya sarve samārambhāḥ kāma-saṅkalpa-varjitāḥ
jñānāgni-dagdha-karmāṇaṁ tam āhuḥ paṇḍitaṁ budhāḥ



🌷 Translation :

One is understood to be in full knowledge whose every endeavor is devoid of desire for sense gratification. He is said by sages to be a worker for whom the reactions of work have been burned up by the fire of perfect knowledge.

🌹 Purport :

Only a person in full knowledge can understand the activities of a person in Kṛṣṇa consciousness. Because the person in Kṛṣṇa consciousness is devoid of all kinds of sense-gratificatory propensities, it is to be understood that he has burned up the reactions of his work by perfect knowledge of his constitutional position as the eternal servitor of the Supreme Personality of Godhead.

He is actually learned who has attained to such perfection of knowledge. Development of this knowledge of eternal servitorship to the Lord is compared to fire. Such a fire, once kindled, can burn up all kinds of reactions to work.

🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2019