✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 06 🌴
06. అజోపి సన్నవ్యయాత్యా భూతానామీశ్వరోపి సన్ |
ప్రకృతిం స్వామధిష్టాయ సమ్భవామ్యాత్మమాయయా ||
🌷. తాత్పర్యం :
జన్మలేని వాడనైనను, నా దివ్యదేహము ఎన్నడును నశింపనిదైనను, సకల జీవులకు ప్రభువునైనను ఆదియైన దివ్యరూపముతో నేను ప్రతి యుగము నందును అవతరింతును.
🌻. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు తన జన్మ యందలి ప్రత్యేకతను గూర్చి పలుకుచున్నాడు. అతడు సాధారణ మానవుని వలె గోచరించినను తన పూర్వపు “జన్మల” విషయముల నన్నింటిని జ్ఞప్తియందుంచుకొనును. కాని సామాన్యుడు తాను కొలదిగంటల క్రిందట యేమి ఒనర్చెనో సైతము గుర్తుంచుకొనలేడు. గడచిన దినమందు అదే సమయమున ఏమి చేయుచుంటివని ఎవారినేని ప్రశ్నించినచో వెంటనే సమాధాన మొసగుట ఆ సామాన్యునికి బహుకష్టతరము కాగలదు.క్రిందటి రోజు అదే సమయమున ఏమి చేయుచుండెనో గుర్తు తెచ్చుకొనుటకు అతడు తన జ్ఞాపకశక్తినంతటినీ తిరిగి తోడవలసియే వచ్చును.
అయినప్పటికిని తాను దేవుడనని(లేదా కృష్ణుడనని) పలుకుటకు మానవులు ఏమాత్రము జంకరు. కాని అట్టి అర్థరహిత పలుకులచే ఎవ్వరును మోసపోరాదు. ఇంకను ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు తన “ప్రకృతి”ని (తన రూపమును) గూర్చి వివరించినాడు. ప్రకృతియనగా స్వభావము మరియు స్వరూపము(స్వీయరూపము) అని భావము. భగవానుడు తాను తన స్వీయరూపముముతో అవతరింతునని పలికెను. సాధారణజీవులు మార్చునట్లుగా అతడు తన దేఃమును మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మమందు ఒక రకమైన దేహమును కలిగి యుండవచ్చు. కాని మరుసటి జన్మలో వేరోక దేహము లభించగలదు.
అనగా భౌతికజగము నందు జీవుడు స్థిరమైన దేహమును కలిగియుండక ఒక దేహము లభించగలదు. అనగా భౌతికజగమునందు జీవుడు స్థిరమైన దేహమును కలిగియుండక ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుచునే యుండును. కాని భగవానుడు ఆ విధముగా కావింపడు. అతడెప్పుడు అవతరించినను అంతరంగికశక్తి ద్వారా తన ఆది దివ్యశరీరముతోనే ఆవిర్భవించుచుండును. వేరుమాటలలో మురళిని దాల్చిన ద్విభుజరూపము నందు(ఆదియైన నిత్యరూపము) శ్రీకృష్ణుడు ఈ భౌతికజగమున అవతరించును. భౌతికజగత్తు యొక్క కల్మషముచే ప్రభావితము కాకుండా తన దివ్యరూపముతోనో అతడు అవతరించును.
🌹 🌹🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 168 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 06 🌴
06. ajo ’pi sann avyayātmā bhūtānām īśvaro ’pi san
prakṛtiṁ svām adhiṣṭhāya sambhavāmy ātma-māyayā
🌷 Translation :
Although I am unborn and My transcendental body never deteriorates, and although I am the Lord of all living entities, I still appear in every millennium in My original transcendental form.
🌷 Purport :
The Lord has spoken about the peculiarity of His birth: although He may appear like an ordinary person, He remembers everything of His many, many past “births,” whereas a common man cannot remember what he has done even a few hours before.
If someone is asked what he did exactly at the same time one day earlier, it would be very difficult for a common man to answer immediately. He would surely have to dredge his memory to recall what he was doing exactly at the same time one day before. And yet, men often dare claim to be God, or Kṛṣṇa. One should not be misled by such meaningless claims. Then again, the Lord explains His prakṛti, or His form. Prakṛti means “nature,” as well as svarūpa, or “one’s own form.” The Lord says that He appears in His own body. He does not change His body, as the common living entity changes from one body to another.
The conditioned soul may have one kind of body in the present birth, but he has a different body in the next birth. In the material world, the living entity has no fixed body but transmigrates from one body to another.
The Lord, however, does not do so. Whenever He appears, He does so in the same original body, by His internal potency. In other words, Kṛṣṇa appears in this material world in His original eternal form, with two hands, holding a flute. He appears exactly in His eternal body, uncontaminated by this material world. Although He appears in the same transcendental body and is Lord of the universe, it still appears that He takes His birth like an ordinary living entity.
🌹 🌹 🌹 🌹 🌹
15 Oct 2019