శ్రీమద్భగవద్గీత - 170: 04వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 170: Chap. 04, Ver. 08


🌹. శ్రీమద్భగవద్గీత - 170 / Bhagavad-Gita - 170 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 08 🌴


08. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||


🌷. తాత్పర్యం :

సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింప జేయుటకు మరియు ధర్మమును పున:స్థాపించుటకు ప్రతియుగము నందును నేను అవతరించు చుందును.


🌻. భాష్యము :

భగవద్గీత ప్రకారము సాధువనగా కృష్ణభక్తిభావనాపూర్ణుడని భావము. ఒక వ్యక్తి అధర్మవర్తునునిగా గోచరించినను, కృష్ణభక్తిభావన లక్షణములను సంపూర్ణముగా కలిగియున్నచో అతనిని సాధువుగా అవగతము చేసికొనవలెను. కృష్ణభక్తిభావనను లెక్కజేయనివారే దుష్కృతులనబడుదురు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యాపారంగతులైనను మూడులుగును మరియు నరాధములుగును వర్ణింపబడినారు.

కాని కృష్ణభక్తి యందు నూటికి నూరుపాళ్ళు మగ్నుడైనవాడు విద్యావంతుడు లేదా నాగరికుడు కాకపోయినను సాధువుగా అంగీకరింపబడును. రావణ,కంసులను వధించిన రీతి నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్యయముగా అవతరింపవలసిన అవసరము లేదు. ఏలయన దానవులను సంహరించుటకు యోగ్యులైన ప్రతినిధులు అతనికి పెక్కుమంది గలరు. అయినను దానవులచే పీడింపబడు తన శుద్ధభక్తులకు ఆనదింపజేయుట కొరకే అతడు ప్రత్యేకముగా అవతరించును. దానవప్రవృత్తి కలవాడు భక్తుని సదా పీడించుచుండును. పీడింపబడెడి భక్తుడు స్వజనుడే అయినప్పటికిని అతడు ఆ కార్యమునకు వెనుదీయడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయుడు.

అయినను ఆ దానవుడు ప్రహ్లాదుని మిగుల పీడించెను. కృష్ణుని తల్లియైన దేవకి కంసుని సోదరియైనను, కృష్ణునికి జన్మనొసగనున్నందున ఆమె మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురిచేయబడిరి. కనుక కంసుని వధించుట కన్నను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు ఆవిర్భవించెను. అయినను ఆ రెండుకార్యములు ఏకకాలముననే ఒనరింపబడెను. కనుకనే సాధువులైనవారిని రక్షించి, దుష్టులను నశింపజేయుటకే శ్రీకృష్ణభగవానుడు వివిధ అవతారములకు స్వీకరించునని ఇచ్చట తెలుపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 170 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 08 🌴


08. paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām
dharma-saṁsthāpanārthāya sambhavāmi yuge yuge


🌷 Translation :

To deliver the pious and to annihilate the miscreants, as well as to reestablish the principles of religion, I Myself appear, millennium after millennium.


🌹 Purport :

According to Bhagavad-gītā, a sādhu (holy man) is a man in Kṛṣṇa consciousness. A person may appear to be irreligious, but if he has the qualifications of Kṛṣṇa consciousness wholly and fully, he is to be understood to be a sādhu. And duṣkṛtām applies to those who do not care for Kṛṣṇa consciousness. Such miscreants, or duṣkṛtām, are described as foolish and the lowest of mankind, even though they may be decorated with mundane education, whereas a person who is one hundred percent engaged in Kṛṣṇa consciousness is accepted as a sādhu, even though such a person may be neither learned nor well cultured. A

s far as the atheistic are concerned, it is not necessary for the Supreme Lord to appear as He is to destroy them, as He did with the demons Rāvaṇa and Kaṁsa. The Lord has many agents who are quite competent to vanquish demons. But the Lord especially descends to appease His unalloyed devotees, who are always harassed by the demoniac.

The demon harasses the devotee, even though the latter may happen to be his kin. Although Prahlāda Mahārāja was the son of Hiraṇyakaśipu, he was nonetheless persecuted by his father; although Devakī, the mother of Kṛṣṇa, was the sister of Kaṁsa, she and her husband Vasudeva were persecuted only because Kṛṣṇa was to be born of them. So Lord Kṛṣṇa appeared primarily to deliver Devakī rather than kill Kaṁsa, but both were performed simultaneously. Therefore it is said here that to deliver the devotee and vanquish the demon miscreants, the Lord appears in different incarnations.

🌹 🌹 🌹 🌹 🌹


17 Oct 2019