శ్రీమద్భగవద్గీత - 173: 04వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 173: Chap. 04, Ver. 11
🌹. శ్రీమద్భగవద్గీత - 173 / Bhagavad-Gita - 173 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 11 🌴
11. యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ వర్త్మానువర్తన్తే మనుష్యా: పార్థ సర్వశ: ||
🌷. తాత్పర్యం :
ఎవరు ఏ విధముగా నన్ను శరణువేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థా! ప్రతియొక్కరు అన్నివిధములా నా మార్గమునే అనుసరింతురు.
🌻. భాష్యము :
ప్రతి యొక్కరు శ్రీ కృష్ణభగవానునే అతని వివిధ రూపము లందు అన్వేషించుచున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి తేజము నందును మరియు కణములతో సహా సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాపియైన పరమాత్మ యందును దేవదేవుడైన శ్రీకృష్ణుడు కేవలము పాక్షికముగా అనుభూతమగుడును. విశుద్ధభక్తులే అతనిని పూర్ణముగా అనుభూతమొనర్చుకొనగలరు. అనగా శ్రీకృష్ణుడే ప్రతియెక్కరికిని అనుభవధ్యేయమై యున్నాడు.
ఆ విధముగా ప్రతియొక్కరు ఆ దేవదేవుని పొందగోరిన విధము ననుసరించి తృప్తిని బడయుచుందురు. ఆధ్యాత్మికజగత్తునందు సైతము శ్రీకృష్ణుడు భక్తులు కోరినరీతిగా దివ్యభావనలో వారితో వర్తింతును. ఒక భక్తుడు కృష్ణుని పరమ యజమనిగా కోరవచ్చును. మరియొకరు అతనిని స్నేహితునుగా పొందగోరువచ్చును. ఇంకొకరు పుత్రునిగా కోరవచ్చును. ఇంకను ఒకడు ప్రియునిగా కోరవచ్చును. తన యెడగల ప్రేమస్థాయి ననుసరించి శ్రీకృష్ణుడు వారికి సమముగా వరదానము కావించును. భౌతికజగమునందు కూడా అట్టి పరస్పర భావవినియము కలదు.
నిరాకారత్వమునందును స్థిరముగా నెలకొనజాలనివారు తిరిగి భౌతికజగమునకు వచ్చి కర్మల యెడ గల నిద్రాణముగా నున్న తమ కోరికలను ప్రదర్శింతురు. వారికి ఎన్నడును ఆధ్యాత్మికజగములందు ప్రవేశము లభింపడు. కేవలము భౌతికజగమునందే వర్తించుటకు వారికి అవకాశము కల్పింపబడును. కామ్యకర్మరతులైనవారికి శ్రీకృష్ణభగవానుడు యజ్ఞేశ్వరుని రూపమున వారి విధ్యుక్తధర్మములకు తగిన ఫలమును ఒసగుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 173 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 11 🌴
11. ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham
mama vartmānuvartante manuṣyāḥ pārtha sarvaśaḥ
🌷 Translation :
As all surrender unto Me, I reward them accordingly. Everyone follows My path in all respects, O son of Pṛthā.
🌹 Purport :
Everyone is searching for Kṛṣṇa in the different aspects of His manifestations. Kṛṣṇa, the Supreme Personality of Godhead, is partially realized in His impersonal brahma-jyotir effulgence and as the all-pervading Supersoul dwelling within everything, including the particles of atoms. But Kṛṣṇa is fully realized only by His pure devotees.
Consequently, Kṛṣṇa is the object of everyone’s realization, and thus anyone and everyone is satisfied according to one’s desire to have Him. In the transcendental world also, Kṛṣṇa reciprocates with His pure devotees in the transcendental attitude, just as the devotee wants Him. One devotee may want Kṛṣṇa as supreme master, another as his personal friend, another as his son and still another as his lover. Kṛṣṇa rewards all the devotees equally, according to their different intensities of love for Him. In the material world, the same reciprocations of feelings are there, and they are equally exchanged by the Lord with the different types of worshipers.
Some of them, who are not firmly situated even in the impersonal existence, return to this material field to exhibit their dormant desires for activities. They are not admitted into the spiritual planets, but they are again given a chance to act on the material planets. For those who are fruitive workers, the Lord awards the desired results of their prescribed duties, as the yajñeśvara; and those who are yogīs seeking mystic powers are awarded such powers.
🌹 🌹 🌹 🌹 🌹
20 Oct 2019