శ్రీమద్భగవద్గీత - 163: 04వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 163: Chap. 04, Ver. 01


🌹. శ్రీమద్భగవద్గీత - 163 / Bhagavad-Gita - 163🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 01 🌴



01. శ్రీభగవానువాచ

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్


🌷. తాత్పర్యం :

దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను; మొదట ఈ జ్ఞానము సూర్యునికి (మానవునికి భగవానునితో గల సంబంధ విజ్ఞానము) ఉపదేశించితిని. ఆ వివస్వానుడు (సూర్యుడు) మానవులకు తండ్రియైన వైవస్వతమనువునకు చెప్పెను. మనువు ఇక్ష్వాకురాజునకు చెప్పెను.


🌷. భాష్యము :

సూర్యలోకము మొదలుగా సర్వలోకములందలి రాజవంశములకు శ్రీమద్భగవద్గీతాజ్ఞానము ప్రాచీనకాలము నుండియే ఉపదేశించబడినదనెడి దాని చరిత్ర ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. సర్వలోకరాజులు తమ ప్రజలకు రక్షణణమును కల్పించుటకే ప్రత్యేకముగా నిర్దేశింపబడియున్నారు. కనుక ప్రజలను చక్కగా పాలించి వారిని కామబంధము నుండి రక్షించుటకు రాజవంశము వారు భగవద్గీతా జ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసికొనవలసిన అవసరమున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని నిత్య సంబంధములో ఆధ్యాత్మికజ్ఞానమును సంపాదించుటకే మానవజన్మ ఉద్దేశింపబడినది.

ఈ సందేశమును ప్రజలకు విద్య, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయుట సర్వదేశ, లోకపాలకుల బాధ్యాతయైయున్నది. అనగా జనుల శ్రేయస్సు కొరకు రాజులు ఈ కృష్ణసంబంధ విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలసియున్నది. తద్ద్వారా జనులు ఈ ఘనమైన శాస్త్రపు లాభమును బడసి, జయప్రదమైన మార్గమున పయనించి లభించిన మానవజన్మను సద్వినియోగపరచుకొనగలరు. ఈ కల్పము నందు సూర్యదేవుడు వివస్వానునిగా పిలువబడును. ఆ సూర్యుడే గ్రహమండలమందలి సర్వగ్రహములకు మూలము. బ్రహ్మసంహిత (5.52) యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.


యచ్చక్షు రేష సవితా సకలగ్రహాణామ్
రాజా సమస్తసురమూర్తిర శేష తేజా: |
యస్యాజ్ఞయా భ్రమతి సంభ్రుతకాలచక్రో
గోవిందం ఆదిపురుషం తమహం భజామి


“ఏ ఆదిపురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధికశక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవదేవుడైన గోవిందుని(శ్రీకృష్ణుని) నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాసించును, అతని ఆజ్ఞలకు లోబడి తన కక్ష్య యందు పరిభ్రమించుచుండును” అని బ్రహ్మదేవుడు స్తుతించెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 163 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 01 🌴



01. śrī-bhagavān uvāca

imaṁ vivasvate yogaṁ proktavān aham avyayam
vivasvān manave prāha manur ikṣvākave ’bravīt


🌷 Translation :

The Personality of Godhead, Lord Śrī Kṛṣṇa, said: I instructed this imperishable science of yoga to the sun-god, Vivasvān, and Vivasvān instructed it to Manu, the father of mankind, and Manu in turn instructed it to Ikṣvāku.


🌷 Purport :

Herein we find the history of the Bhagavad-gītā traced from a remote time when it was delivered to the royal order of all planets, beginning from the sun planet. The kings of all planets are especially meant for the protection of the inhabitants, and therefore the royal order should understand the science of Bhagavad-gītā in order to be able to rule the citizens and protect them from material bondage to lust.

Human life is meant for cultivation of spiritual knowledge, in eternal relationship with the Supreme Personality of Godhead, and the executive heads of all states and all planets are obliged to impart this lesson to the citizens by education, culture and devotion. In other words, the executive heads of all states are intended to spread the science of Kṛṣṇa consciousness so that the people may take advantage of this great science and pursue a successful path, utilizing the opportunity of the human form of life.

In this millennium, the sun-god is known as Vivasvān, the king of the sun, which is the origin of all planets within the solar system. In the Brahma-saṁhitā (5.52) it is stated:


yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ
rājā samasta-sura-mūrtir aśeṣa-tejāḥ
yasyājñayā bhramati sambhṛta-kāla-cakro
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi


“Let me worship,” Lord Brahmā said, “the Supreme Personality of Godhead, Govinda [Kṛṣṇa], who is the original person and under whose order the sun, which is the king of all planets, is assuming immense power and heat. The sun represents the eye of the Lord and traverses its orbit in obedience to His order.”

🌹 🌹 🌹 🌹 🌹


24 Feb 2022