శ్రీమద్భగవద్గీత - 01: 01వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 01: Chap. 01, Ver. 01
🌹శరీమద్భగవద్గీత🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 పరధమ అధ్యాయము 🌴
🌻 శలోకము 1 🌻
ధృతరాష్ట్ర ఉవాచ :
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ: |
మామకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
శ్రీమద్భగవద్గీత విస్తారముగా ప్రకటింపబడు ఆస్తిక విజ్ఞానశాస్త్రము. అది గీతామహాత్మ్యము నందు సంగ్రహించబడినది. భగవద్గీతను కృష్ణభక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసికొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది.
గీతను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసికొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్యపరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసికొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచామునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను సైతము పాటకుడు భగవద్గీత యందు గాంచగలడు. అదియే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత.
పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రమై విరాజిల్లుచున్నది.
మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయ సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్త్వశాస్త్రమునకు మూలసిద్ధాంతములై యున్నవి. అనాదియైన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధినొందిన కురుక్షేత్రమునందు ఈ తత్త్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది.ఈ భూమిపై శ్రీకృష్ణభగవానుడు స్వయముగా ప్రత్యక్షమైనప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికెను.
కురుక్షేత్రరణరంగమున శ్రీకృష్ణభగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రమను(ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము) పదము ప్రాధాన్యత సంతరించుకొన్నది.
కౌరవుల తండ్రియైన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశామును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై యుండెను. కనుకనే తన సందేహమున అతడు “వారు ఏమి చేసిరి?” అని కార్యదర్శియైన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు.
జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంచింపలేదు. అదియును గాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయస్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధపరిణామముపై స్థలప్రభావమును గూర్చి అతడు మిగుల భీతినొందెను. సస్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావమును చూపునని అతడెరిగి యుండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్తితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను.
పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండుసంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల యెడ ధృతరాష్ట్రునికి గల సంబంధము దీని ద్వారా ఎవరైననను అవగతము చేసికొనవచ్చును.
పంటపొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి, ధర్మపితయైన శ్రీకృష్ణభగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపుమొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు, యధిష్టరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్టుతులు కాగాలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహించబడినది. చారిత్రిక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక “ధర్మక్షేత్రము” మరియు “కురుక్షేత్రము” అనేది పదములకు గల విశేషార్థమిదియే.
🌹🌹🌹🌹🌹
🌹 BhagavadGita As it is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 1
dhṛtarāṣṭra uvāca :
dharma-kṣetre kuru-kṣetre
samavetā yuyutsavaḥ
māmakāḥ pāṇḍavāś caiva
kim akurvata sañjaya
Translation :
Dhṛtarāṣṭra said: O Sañjaya, after my sons and the sons of Pāṇḍu assembled in the place of pilgrimage at Kurukṣetra, desiring to fight, what did they do?
Purport :
Bhagavad-gītā is the widely read theistic science summarized in the Gītā-māhātmya (Glorification of the Gītā). There it says that one should read Bhagavad-gītā very scrutinizingly with the help of a person who is a devotee of Śrī Kṛṣṇa and try to understand it without personally motivated interpretations.
The example of clear understanding is there in the Bhagavad-gītā itself, in the way the teaching is understood by Arjuna, who heard the Gītā directly from the Lord. If someone is fortunate enough to understand the Bhagavad-gītā in that line of disciplic succession, without motivated interpretation, then he surpasses all studies of Vedic wisdom, and all scriptures of the world. One will find in the Bhagavad-gītā all that is contained in other scriptures, but the reader will also find things which are not to be found elsewhere.
That is the specific standard of the Gītā. It is the perfect theistic science because it is directly spoken by the Supreme Personality of Godhead, Lord Śrī Kṛṣṇa.
The topics discussed by Dhṛtarāṣṭra and Sañjaya, as described in the Mahābhārata, form the basic principle for this great philosophy.
It is understood that this philosophy evolved on the Battlefield of Kurukṣetra, which is a sacred place of pilgrimage from the immemorial time of the Vedic age. It was spoken by the Lord when He was present personally on this planet for the guidance of mankind.
The word dharma-kṣetra (a place where religious rituals are performed) is significant because, on the Battlefield of Kurukṣetra, the Supreme Personality of Godhead was present on the side of Arjuna. Dhṛtarāṣṭra, the father of the Kurus, was highly doubtful about the possibility of his sons’ ultimate victory.
In his doubt, he inquired from his secretary Sañjaya, “What did they do?” He was confident that both his sons and the sons of his younger brother Pāṇḍu were assembled in that Field of Kurukṣetra for a determined engagement of the war. Still, his inquiry is significant. He did not want a compromise between the cousins and brothers, and he wanted to be sure of the fate of his sons on the battlefield.
Because the battle was arranged to be fought at Kurukṣetra, which is mentioned elsewhere in the Vedas as a place of worship – even for the denizens of heaven – Dhṛtarāṣṭra became very fearful about the influence of the holy place on the outcome of the battle.
He knew very well that this would influence Arjuna and the sons of Pāṇḍu favorably, because by nature they were all virtuous. Sañjaya was a student of Vyāsa, and therefore, by the mercy of Vyāsa, Sañjaya was able to envision the Battlefield of Kurukṣetra even while he was in the room of Dhṛtarāṣṭra. And so, Dhṛtarāṣṭra asked him about the situation on the battlefield.
Both the Pāṇḍavas and the sons of Dhṛtarāṣṭra belong to the same family, but Dhṛtarāṣṭra’s mind is disclosed herein. He deliberately claimed only his sons as Kurus, and he separated the sons of Pāṇḍu from the family heritage.
One can thus understand the specific position of Dhṛtarāṣṭra in his relationship with his nephews, the sons of Pāṇḍu. As in the paddy field the unnecessary plants are taken out, so it is expected from the very beginning of these topics that in the religious field of Kurukṣetra, where the father of religion, Śrī Kṛṣṇa, was present, the unwanted plants like Dhṛtarāṣṭra’s son Duryodhana and others would be wiped out and the thoroughly religious persons, headed by Yudhiṣṭhira, would be established by the Lord.
This is the significance of the words dharma-kṣetre and kuru-kṣetre, apart from their historical and Vedic importance.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 14/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 02: 01వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 02: Chap. 01, Ver. 02
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 2
సంజయ ఉవాచ
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూడం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||
సంజయుడు పలికెను: ఓ రాజా! పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను.
భాష్యము:
ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మికదృష్టి సైతము లోపించెను. ధర్మవిషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండియు ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు లాలేరని అతడు నిశ్చయముగా తెలిసియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై యుండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసికొనగలిగెను.
కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజాను ఉత్సాహపరచనెంచి, పవిత్రస్థలముచే పవిత్రులైన అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరుగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవసేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజ్జస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతియైన ద్రోణాచార్యుని చెంతకు చేరేనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పెర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రత ననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసివచ్చెను. కనుకననే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగపరచలేకపోయెను.
🌹🌹🌹🌹🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 2
sañjaya uvāca dṛṣṭvā tu pāṇḍavānīkaṁ vyūḍhaṁ duryodhanas tadā ācāryam upasaṅgamya rājā vacanam abravīt
TRANSLATION:
Sañjaya said: O King, after looking over the army arranged in military formation by the sons of Pāṇḍu, King Duryodhana went to his teacher and spoke the following words.
PURPORT:
Dhṛtarāṣṭra was blind from birth. Unfortunately, he was also bereft of spiritual vision. He knew very well that his sons were equally blind in the matter of religion, and he was sure that they could never reach an understanding with the Pāṇḍavas, who were all pious since birth. Still he was doubtful about the influence of the place of pilgrimage, and Sañjaya could understand his motive in asking about the situation on the battlefield.
Sañjaya wanted, therefore, to encourage the despondent king and thus assured him that his sons were not going to make any sort of compromise under the influence of the holy place. Sañjaya therefore informed the king that his son, Duryodhana, after seeing the military force of the Pāṇḍavas, at once went to the commander in chief, Droṇācārya, to inform him of the real position.
Although Duryodhana is mentioned as the king, he still had to go to the commander on account of the seriousness of the situation. He was therefore quite fit to be a politician. But Duryodhana’s diplomatic veneer could not disguise the fear he felt when he saw the military arrangement of the Pāṇḍavas.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 15/May/2019
శ్రీమద్భగవద్గీత - 03: 01వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 03: Chap. 01, Ver. 03
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 3
పపశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||
ఓ ఆచార్యా! మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము.
భాష్యము:
బ్రహ్మణుడును మరియు గొప్ప సైన్యాధిపతి యైనను ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూప నెంచెను. ద్రౌపది (అర్జునిని భార్య) జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగియుండెను. ఆ వైరా కారణమున ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమునాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను.
ద్రోణాచార్యుడు ఈ విషయమున సంపూర్ణముగా ఎరిగియున్నను ద్రుపద తనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధవిద్యను నేర్చుటకై తన చెంతకు చేరినపుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధరహస్యములను తెలియజేయుటలో సంకోచము కనబరచలేదు. ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్దరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవసేనా వ్యూహమును సైతము రచించెను.
ద్రోణాచార్యుడు సావదానుడై రాజీధోరణి లేని యుద్ధము చేయవలెనను ఉద్దేశముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల యెడ యుద్ధరంగమున అతడు అదేవిధముగా మృదుస్వభావముతో వర్తించరాదని తెలియజేయుట దుర్యోధనుని ఉద్దేశ్యమై యుండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడు మరియు తెలివిగలవాడు అయిన శిష్యుడు. యుద్దరంగమున అటువంటి కనికర భావము అపజయమునకు దారితీయుననియు దుర్యోధనుడు హెచ్చరించెను.
🌹🌹🌹🌹🌹
🌹 BhagavadGita As it is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 3
paśyaitāṁ pāṇḍu-putrānām
ācārya mahatīṁ camūm
vyūḍhāṁ drupada-putreṇa
tava śiṣyeṇa dhīmatā
Translation :
O my teacher, behold the great army of the sons of Pāṇḍu, so expertly arranged by your intelligent disciple the son of Drupada.
PURPORT :
Duryodhana, a great diplomat, wanted to point out the defects of Droṇācārya, the great brāhmaṇa commander in chief. Droṇācārya had some political quarrel with King Drupada, the father of Draupadī, who was Arjuna’s wife. As a result of this quarrel, Drupada performed a great sacrifice, by which he received the benediction of having a son who would be able to kill Droṇācārya.
Droṇācārya knew this perfectly well, and yet as a liberal brāhmaṇa he did not hesitate to impart all his military secrets when the son of Drupada, Dhṛṣṭadyumna, was entrusted to him for military education. Now, on the Battlefield of Kurukṣetra, Dhṛṣṭadyumna took the side of the Pāṇḍavas, and it was he who arranged for their military phalanx, after having learned the art from Droṇācārya.
Duryodhana pointed out this mistake of Droṇācārya’s so that he might be alert and uncompromising in the fighting.
By this he wanted to point out also that he should not be similarly lenient in battle against the Pāṇḍavas, who were also Droṇācārya’s affectionate students. Arjuna, especially, was his most affectionate and brilliant student. Duryodhana also warned that such leniency in the fight would lead to defeat.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 16/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 04: 01వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 04: Chap. 01, Ver. 04
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 4
అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ ||
ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు.
భాష్యము:
యుద్ధవిద్య యందు ద్రోణాచార్యుని గొప్పశక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైనవారు పెక్కురు కలరు.
విజయపథములో వారు గొప్ప అవరోధములు వంటివారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో గొప్ప అవరోధముల వంటివారు దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతియెక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటచే అందులకు కారణము. భీమార్జునుల శక్తిని తెలిసియుండట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 4
atra śūrā maheṣv-āsā bhīmārjuna-samā yudhi yuyudhāno virāṭaś ca drupadaś ca mahā-rathaḥ
TRANSLATION: Here in this army are many heroic bowmen equal in fighting to Bhīma and Arjuna: great fighters like Yuyudhāna, Virāṭa and Drupada.
PURPORT: Even though Dhṛṣṭadyumna was not a very important obstacle in the face of Droṇācārya’s very great power in the military art, there were many others who were causes of fear. They are mentioned by Duryodhana as great stumbling blocks on the path of victory because each and every one of them was as formidable as Bhīma and Arjuna. He knew the strength of Bhīma and Arjuna, and thus he compared the others with them.
🌹🌹🌹🌹🌹
Date: 17/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 05: 01వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 05: Chap. 01, Ver. 05
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 5
ధృష్టకేతుశ్చేకితాన: కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ: ||
ధృష్ట కేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోదులును అందున్నారు.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 5
dhṛṣṭaketuś cekitānaḥ
kāśirājaś ca vīryavān
purujit kuntibhojaś ca
śaibyaś ca nara-puṅgavaḥ
Translation:
There are also great heroic, powerful fighters like Dhṛṣṭaketu, Cekitāna, Kāśirāja, Purujit, Kuntibhoja and Śaibya.
🌹🌹🌹🌹🌹
Date: 18/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 06: 01వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 06: Chap. 01, Ver. 06
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 6
యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా: ||
పరాక్రమవంతులైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపదికుమారులును అందున్నారు. ఈ వీరులందరును మహారథులు.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 6
yudhāmanyuś ca vikrānta
uttamaujāś ca vīryavān
saubhadro draupadeyāś ca
sarva eva mahā-rathāḥ
There are the mighty Yudhāmanyu, the very powerful Uttamaujā, the son of Subhadrā and the sons of Draupadī. All these warriors are great chariot fighters.
🌹🌹🌹🌹🌹
Date: 19/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 07: 01వ అధ్., శ్లో 07, 08 / Bhagavad-Gita - 07: Chap. 01, Ver. 07, 08
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 7, 8
అస్మాకం తు విశిష్టా యే తాన్నిభోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||
కాని ఓ బ్రాహ్మణోత్తమా! నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను.
8. భావాన్ భీష్మశ్చ కర్ణశ్చ సమితింజయ:
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||
యుద్దమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు,భీష్ముడు, కర్ణుడు,కృపుడు, అశ్వత్థామ,వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు.
భాష్యము: యుద్దరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖవీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీకరాజు తనయుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించియున్నందున కర్ణుడు అర్జునునికి సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య.
🌹🌹🌹🌹🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 7, 8
asmākaṁ tu viśiṣṭā ye
tān nibodha dvijottama
nāyakā mama sainyasya
saṁjñārthaṁ tān bravīmi te
But for your information, O best of the brāhmaṇas, let me tell you about the captains who are especially qualified to lead my military force.
8. bhavān bhīṣmaś ca karṇaś ca
kṛpaś ca samitiṁ-jayaḥ
aśvatthāmā vikarṇaś ca
saumadattis tathaiva ca
There are personalities like you, Bhīṣma, Karṇa, Kṛpa, Aśvatthāmā, Vikarṇa and the son of Somadatta called Bhūriśravā, who are always victorious in battle.
Duryodhana mentions the exceptional heroes in the battle, all of whom are ever victorious. Vikarṇa is the brother of Duryodhana, Aśvatthāmā is the son of Droṇācārya, and Saumadatti, or Bhūriśravā, is the son of the King of the Bāhlīkas. Karṇa is the half brother of Arjuna, as he was born of Kuntī before her marriage with King Pāṇḍu. Kṛpācārya’s twin sister married Droṇācārya.
🌹🌹🌹🌹🌹
Date: 20/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 08: 01వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 08: Chap. 01, Ver. 09
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 9
అన్యే చ బహవ: శూరా మదర్థే త్యక్తజీవితా: |
నానాశస్త్రప్రహరణా: సర్వే యుద్ధవిశారదా: ||
నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలువిధములైన ఆయుధములను దాల్చినవారు మరియు యుద్ధనిపుణతను కలిగినవారును అయియున్నారు.
భాష్యము:
జయద్రదుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధనుని కొరకు జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులై యున్నారు. వేరుమాటలలో పాపియైన దుర్యోధనుని పక్షము వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరును మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయింపబడినది. కాని దుర్యోధనుడు మాత్రము పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగియుండెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 9
anye ca bahavaḥ śūrā
mad-arthe tyakta-jīvitāḥ
nānā-śastra-praharaṇāḥ
sarve yuddha-viśāradāḥ
Translation : There are many other heroes who are prepared to lay down their lives for my sake. All of them are well equipped with different kinds of weapons, and all are experienced in military science.
Purport : As far as the others are concerned – like Jayadratha, Kṛtavarmā and Śalya – all are determined to lay down their lives for Duryodhana’s sake. In other words, it is already concluded that all of them would die in the Battle of Kurukṣetra for joining the party of the sinful Duryodhana. Duryodhana was, of course, confident of his victory on account of the above-mentioned combined strength of his friends.
🌹🌹🌹🌹🌹
Date: 21/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 09: 01వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 09: Chap. 01, Ver. 10
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 10
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||
మన సైన్యబలము లెక్కింప విలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవసైన్యము పరిమితముగా నున్నది.
భాష్యము : ఇచ్చట దుర్యోధనుడు ఇరుసేనాబలముల తులనాత్మక అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడగు సేనానియైన భీష్మపితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడు తన సైన్యబలము అపరిమితముగా నున్నట్లు అతడు భావించెను. అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుదాగు సేనానియైన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనాబలము పరిమితముగా నున్నట్లు అతనికి గోచరించెను. దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయను కలిగియుండెను. తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తానూ సంహరింప బడుదునని అతడు ఎరిగి యుండుటయే అందులకు కారణము. కాని అదే సమయమున పరమోత్తమ సేనానియైన భీష్ముని సన్నిధిని తలచుకొని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగియుండెను. యుద్దరంగమున తాను విజయమును సాధించుట తథ్యమనియే అతడు తెలియపరచెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 10
aparyāptaṁ tad asmākaṁ
balaṁ bhīṣmābhirakṣitam
paryāptaṁ tv idam eteṣāṁ
balaṁ bhīmābhirakṣitam
Translation : Our strength is immeasurable, and we are perfectly protected by Grandfather Bhīṣma, whereas the strength of the Pāṇḍavas, carefully protected by Bhīma, is limited.
Purport : Herein an estimation of comparative strength is made by Duryodhana. He thinks that the strength of his armed forces is immeasurable, being specifically protected by the most experienced general, Grandfather Bhīṣma. On the other hand, the forces of the Pāṇḍavas are limited, being protected by a less experienced general, Bhīma, who is like a fig in the presence of Bhīṣma. Duryodhana was always envious of Bhīma because he knew perfectly well that if he should die at all, he would only be killed by Bhīma. But at the same time, he was confident of his victory on account of the presence of Bhīṣma, who was a far superior general. His conclusion that he would come out of the battle victorious was well ascertained.
🌹🌹🌹🌹🌹
Date: 22/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 10: 01వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 10: Chap. 01, Ver. 11
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 11
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితా: |
భీష్మమేవాభిరక్షన్తు భవన్త: సర్వ ఏవ హి ||
సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది.
భాష్యము : భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యమును కలిగినవారిగా తలతురేమోనని భావించెను. తత్కారణముగా తన సహజ రాజదోరణిలో అతడు పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచ యత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్పవీరుడే అయినను వృద్దుడైనందున ప్రతియెక్కరు అన్నివైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా అలోచించవలెనని అతడు వక్కాణించెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకొనగలరు. కనుక ఇతర వీరులందరును తమ ముఖ్యస్థానములను వీడకుండుట మరియు సేనావ్యూహమును శత్రువు భేదించుట అవకాశమీయకపోవుట అతి ముఖ్యమై యున్నవి. కౌరవుల విజయము భీష్ముని సన్నిధి పైననే ఆధారపడియున్నదని దుర్యోధనునుడు స్పష్టముగా తలచెను. యుద్ధమునందు భీష్ముడు మరియు ద్రోణాచార్యుని పూర్ణ సహకారము నెడ అతడు పూర్ణ విశ్వాసము కలిగియుండెను. సభలో మహాసేనానాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసెడి సమయమున అర్జునుని భార్యయైన ద్రౌపది నిస్సహాయస్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినపుడు వారు ఒక్కమాటైనను పలుకలేదని అతడెరుగుటయే అందులకు కారణము. ఆ ఇరువురు సేనానులు పాండవుల యెడ ఏదియో ఒక మమకారమును కలిగియున్నారని తెలిసినప్పటికినిటికిని పాచికల సమయమున గావించినట్లు వారిపుడు ఆ మమకారమును పూర్ణముగా త్యజింతురని అతడు ఆశించెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 11
ayaneṣu ca sarveṣu
yathā-bhāgam avasthitāḥ
bhīṣmam evābhirakṣantu
bhavantaḥ sarva eva hi
All of you must now give full support to Grandfather Bhīṣma, as you stand at your respective strategic points of entrance into the phalanx of the army.
Purport : Duryodhana, after praising the prowess of Bhīṣma, further considered that others might think that they had been considered less important, so in his usual diplomatic way, he tried to adjust the situation in the above words. He emphasized that Bhīṣmadeva was undoubtedly the greatest hero, but he was an old man, so everyone must especially think of his protection from all sides. He might become engaged in the fight, and the enemy might take advantage of his full engagement on one side.
Therefore, it was important that other heroes not leave their strategic positions and allow the enemy to break the phalanx. Duryodhana clearly felt that the victory of the Kurus depended on the presence of Bhīṣmadeva. He was confident of the full support of Bhīṣmadeva and Droṇācārya in the battle because he well knew that they did not even speak a word when Arjuna’s wife Draupadī, in her helpless condition, had appealed to them for justice while she was being forced to appear naked in the presence of all the great generals in the assembly. Although he knew that the two generals had some sort of affection for the Pāṇḍavas, he hoped that these generals would now completely give it up, as they had done during the gambling performances.
🌹🌹🌹🌹🌹
Date: 23/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 11: 01వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 11: Chap. 01, Ver. 12
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 12
తస్య సంజయన్ హర్షం కురువృద్ధ: పితామహ: |
సింహనాదం వినద్యోచ్చై: శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
అప్పుడు కురువృద్దుడును, యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరముగా పూరించెను.
బాష్యము : కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయమందలి భావనను అవగతము చేసికొనగలిగెను. అంతట దుర్యోధనుని యెడ గల సహజకరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లుగా అతిబిగ్గరముగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయ యత్నించెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షమున ఉన్నందున అతనికి యుద్దమందు విజయావకాశము లేదని శంఖము యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణ్ణుడగు దుర్యోధనునికి (మనుమనికి) పరోక్షముగా తెలియజేసెను. అయినప్పటికిని యుద్దమును నిర్వహించుట అతని ధర్మమై యున్నది. ఆ విషయమున ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 12
tasya sañjanayan harṣaṁ
kuru-vṛddhaḥ pitāmahaḥ
siṁha-nādaṁ vinadyoccaiḥ
śaṅkhaṁ dadhmau pratāpavān
Then Bhīṣma, the great valiant grandsire of the Kuru dynasty, the grandfather of the fighters, blew his conchshell very loudly, making a sound like the roar of a lion, giving Duryodhana joy.
Purport : The grandsire of the Kuru dynasty could understand the inner meaning of the heart of his grandson Duryodhana, and out of his natural compassion for him he tried to cheer him by blowing his conchshell very loudly, befitting his position as a lion. Indirectly, by the symbolism of the conchshell, he informed his depressed grandson Duryodhana that he had no chance of victory in the battle, because the Supreme Lord Kṛṣṇa was on the other side. But still, it was his duty to conduct the fight, and no pains would be spared in that connection.
🌹🌹🌹🌹🌹
Date: 24/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 12: 01వ అధ్., శ్లో 13, 14 / Bhagavad-Gita - 12: Chap. 01, Ver. 13, 14
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 13, 14
తత: శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖా: |
సహసైవాభ్యహన్యన్త స శభ్దస్తుములో(భవత్ ||
అటుపిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నియు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతిభీకరముగా నుండెను.
తత: శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |
మాధవ: పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు: ||
ఎదుటి పక్షమున శ్రీకృష్ణభగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుఱ్ఱములు పూన్చబడిన మహారథమునందు ఆసీనులైనవారై తమ దివ్యశంఖములను పురించిరి.
శ్రీకృష్ణార్జునుల హస్తమునందలి శంఖములు భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా దివ్యములని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచియున్నందున ప్రతిపక్షమువారికి జయమనెడి ఆశయే లేదని ఆ దివ్యశంఖముల ధ్వని సూచించినది. “జయస్తు పాన్డుపుత్రాణాం యేషాం పక్షే జనార్దన:” – శ్రీకృష్ణభగవానుడు తన సాహచర్యము నొసగెడి కారణమున విజయము సదా పాండుపుత్రులకే లభించగలదు. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అచ్చట లక్ష్మీదేవి సైతము నిలిచియుండును. ఏలయన లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడును ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు ఐశ్వర్యములనునవి అర్జునుని కొరకు వేచియున్నవి. ఇదియే గాక మిత్రులిరువురు ఆసీనులై యున్న రథము అగ్నిదేవునిచే అర్జునునకు ఒసగబడినట్టిది. ముల్లోకములలో అన్ని దిక్కులను అది జయించు సామర్త్యమును కలిగియున్నదిని ఈ విషయము సూచించుచున్నది.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 13, 14
tataḥ śaṅkhāś ca bheryaś ca
paṇavānaka-gomukhāḥ
sahasaivābhyahanyanta
sa śabdas tumulo ’bhavat
After that, the conchshells, drums, bugles, trumpets and horns were all suddenly sounded, and the combined sound was tumultuous.
tataḥ śvetair hayair yukte
mahati syandane sthitau
mādhavaḥ pāṇḍavaś caiva
divyau śaṅkhau pradadhmatuḥ
On the other side, both Lord Kṛṣṇa and Arjuna, stationed on a great chariot drawn by white horses, sounded their transcendental conchshells.
Purport : In contrast with the conchshell blown by Bhīṣmadeva, the conchshells in the hands of Kṛṣṇa and Arjuna are described as transcendental. The sounding of the transcendental conchshells indicated that there was no hope of victory for the other side because Kṛṣṇa was on the side of the Pāṇḍavas. Jayas tu pāṇḍu-putrāṇāṁ yeṣāṁ pakṣe janārdanaḥ. Victory is always with persons like the sons of Pāṇḍu because Lord Kṛṣṇa is associated with them. And whenever and wherever the Lord is present, the goddess of fortune is also there because the goddess of fortune never lives alone without her husband. Therefore, victory and fortune were awaiting Arjuna, as indicated by the transcendental sound produced by the conchshell of Viṣṇu, or Lord Kṛṣṇa. Besides that, the chariot on which both the friends were seated had been donated by Agni (the fire-god) to Arjuna, and this indicated that this chariot was capable of conquering all sides, wherever it was drawn over the three worlds.
🌹🌹🌹🌹🌹
Date: 25/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 13: 01వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 13: Chap. 01, Ver. 15
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 15
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ: |
పౌణ్డ్రం దధ్మౌ మాహాశంఖం భీమకర్మా వృకోదర: ||
శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను; భోజనప్రియుడు, ఘన కార్యములను చేయువాడు అగు భీముడు పౌండ్రమనెడి తన మాహాశంఖము నూదెను.
బాష్యము : సర్వేంద్రియములకు ప్రభువైనందునే శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు హృషీకేషుడు తెలుపబడినాడు. జీవులందరును అతని అంశలు గావున జీవుల ఇంద్రియములు సైతము అతని ఇంద్రియములు అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి తెలియలేనందున వారికి ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నిలిచి వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును. కాని అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండును. శుద్ధభక్తుని విషయమున అతడు ప్రత్యక్షముగా ఇంద్రియములను నియమించును. ఇచ్చట కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుని దివ్యేంద్రియములను ప్రత్యక్షముగా నియమించుటచే శ్రీకృష్ణభగవానునికి ప్రత్యేకముగా “హృషీ కేశుడు” అనెడి నామము వాడబడినది. వివిధ కార్యములను అనుసరించి భగవానుడు వివిధనామములను కలిగియుండును. ఉదాహరణకు మధువనెడి రాక్షసుని సంహరించుట వలన అతనికి మధుసూదనుడనెడి నామము కలిగెను. గోవులకు మరియు ఇంద్రియములకు అతడు ఆనందము నొసగును కనుక “గోవిందుడు” అనెడి నామము కలిగెను. వసుదేవుని తనయుడై ఆవిర్భవించినందున “వాసుదేవుడు” అనెడి నామము కలిగెను. దేవకీదేవిని తల్లిగా అంగీకరించినందున “దేవకీనందన” అనెడి నామము కలిగెను. బృందావనమున యశోదకు బాల్యలలీలను దర్శించు అవకాశమొసగినందున “యశోదనందన” అనెడి నామము కలిగెను. స్నేహితుడైన అర్జునునకు సారథిగా వర్తించుట వలన “పార్థసారథి” యను నామము కలిగెను. అదేవిధముగా కురుక్షేత్రరణరంగమున అర్జునునకు నిర్దేశము నొసగుట వలన “హృషీకేశుడు” అను నామము కలిగెను.
వివిధ యజ్ఞముల నిర్వహణకు ధనము అవసరపడినప్పుడు దానిని సంపాదించుటలో అగ్రజునికి సహాయపడి నందున ఈ శ్లోకమున అర్జునుడు ధనుంజయునిగా తెలుపబడినాడు. అదేవిధముగా భీముడు వృకోదరునిగా తెలుపబడినాడు. విపరీతముగా తినుటయే గాక దానికి తగినట్లుగా హిడింబాసురుని వధించుట వంటి ఘనకార్యములు చేయుటయే అందులకు కారణము. ఈ విధముగా భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులు పూరించిన వారి ప్రత్యెక శంఖములు పాండవ సమీక్ష వీరులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షములో అట్టి ఘనతలు గాని, దివ్యనిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని, లక్ష్మీదేవి సన్నిది గాని లేవు. అనగా వారు రణమున ఓడిపోవుట నిశ్చయింపబడియే ఉన్నది. ఆ సందేశమే శంఖధ్వానముల ద్వారా ప్రకటింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 15
pāñcajanyaṁ hṛṣīkeśo
devadattaṁ dhanañ-jayaḥ
pauṇḍraṁ dadhmau mahā-śaṅkhaṁ
bhīma-karmā vṛkodaraḥ
Lord Kṛṣṇa blew His conchshell, called Pāñcajanya; Arjuna blew his, the Devadatta; and Bhīma, the voracious eater and performer of herculean tasks, blew his terrific conchshell, called Pauṇḍra.
Purport : Lord Kṛṣṇa is referred to as Hṛṣīkeśa in this verse because He is the owner of all senses. The living entities are part and parcel of Him, and therefore the senses of the living entities are also part and parcel of His senses. The impersonalists cannot account for the senses of the living entities, and therefore they are always anxious to describe all living entities as senseless, or impersonal. The Lord, situated in the hearts of all living entities, directs their senses. But He directs in terms of the surrender of the living entity, and in the case of a pure devotee He directly controls the senses. Here on the Battlefield of Kurukṣetra the Lord directly controls the transcendental senses of Arjuna, and thus His particular name of Hṛṣīkeśa. The Lord has different names according to His different activities. For example, His name is Madhusūdana because He killed the demon of the name Madhu; His name is Govinda because He gives pleasure to the cows and to the senses; His name is Vāsudeva because He appeared as the son of Vasudeva; His name is Devakī-nandana because He accepted Devakī as His mother; His name is Yaśodā-nandana because He awarded His childhood pastimes to Yaśodā at Vṛndāvana; His name is Pārtha-sārathi because He worked as charioteer of His friend Arjuna. Similarly, His name is Hṛṣīkeśa because He gave direction to Arjuna on the Battlefield of Kurukṣetra.
Arjuna is referred to as Dhanañjaya in this verse because he helped his elder brother in fetching wealth when it was required by the king to make expenditures for different sacrifices. Similarly, Bhīma is known as Vṛkodara because he could eat as voraciously as he could perform herculean tasks, such as killing the demon Hiḍimba. So the particular types of conchshell blown by the different personalities on the side of the Pāṇḍavas, beginning with the Lord’s, were all very encouraging to the fighting soldiers. On the other side there were no such credits, nor the presence of Lord Kṛṣṇa, the supreme director, nor that of the goddess of fortune. So they were predestined to lose the battle – and that was the message announced by the sounds of the conchshells.
🌹🌹🌹🌹🌹
Date: 26/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 14: 01వ అధ్., శ్లో 16, 17, 18 / Bhagavad-Gita - 14: Chap. 01, Ver. 16, 17, 18
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 16 17, 18
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్టిర: |
నకుల: సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||
కాశ్యశ్చ పరమేష్వాస: శిఖండి చ మహారథ:
ధృష్టధ్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత: ||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ: పృథివీపతే |
సౌభద్రశ్చ మాహాబాహు: శంఖాన్ దధ్ము: పృథక్ పృథక్ ||
ఓ రాజా! కుంతీపుత్రుడైన యుధిష్టిరుడు అనంతవిజయమనెడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనెడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనెడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టధ్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ధ్రౌపదీతనయులు, గొప్ప బాహువులు గలిగిన సుభాద్రాతనయుడు మున్నగు వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి.
బాష్యము : పాండుతనయులు మోసము చేయుట మరియు రాజ్యసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్ట యత్నించుట యనెడి అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు ననెడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుని వంటివారి వరకు సర్వులు(ప్రపంచపలుదేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా) అచ్చట నిలిచియుండిరి. వారందరును నశింపనున్నారు. తన కుమారులు అనునసరించిన యుక్తి విధానము ప్రోత్సాహించియున్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోరవిపత్తుకు కారణమై యున్నాడు.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 16, 17, 18
anantavijayaṁ rājā
kuntī-putro yudhiṣṭhiraḥ
nakulaḥ sahadevaś ca
sughoṣa-maṇipuṣpakau
kāśyaś ca parameṣv-āsaḥ
śikhaṇḍī ca mahā-rathaḥ
dhṛṣṭadyumno virāṭaś ca
sātyakiś cāparājitaḥ
drupado draupadeyāś ca
sarvaśaḥ pṛthivī-pate
saubhadraś ca mahā-bāhuḥ
śaṅkhān dadhmuḥ pṛthak pṛthak
King Yudhiṣṭhira, the son of Kuntī, blew his conchshell, the Ananta-vijaya, and Nakula and Sahadeva blew the Sughoṣa and Maṇipuṣpaka. That great archer the King of Kāśī, the great fighter Śikhaṇḍī, Dhṛṣṭadyumna, Virāṭa, the unconquerable Sātyaki, Drupada, the sons of Draupadī, and others, O King, such as the mighty-armed son of Subhadrā, all blew their respective conchshells.
Purport : Sañjaya informed King Dhṛtarāṣṭra very tactfully that his unwise policy of deceiving the sons of Pāṇḍu and endeavoring to enthrone his own sons on the seat of the kingdom was not very laudable. The signs already clearly indicated that the whole Kuru dynasty would be killed in that great battle. Beginning with the grandsire, Bhīṣma, down to the grandsons like Abhimanyu and others – including kings from many states of the world – all were present there, and all were doomed. The whole catastrophe was due to King Dhṛtarāṣṭra, because he encouraged the policy followed by his sons.
🌹🌹🌹🌹🌹
Date: 27/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 15: 01వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 15: Chap. 01, Ver. 19
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో(భ్యనునాడయన్ ||
ఆ వివిధశంఖముల ధ్వని అతిభీకర మయ్యెను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయము బ్రద్దలు చేసెను.
బాష్యము : పాండుతనయులు మోసము చేయుట మరియు రాజ్యసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్ట యత్నించుట యనెడి అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు ననెడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుని వంటివారి వరకు సర్వులు (ప్రపంచ పలు దేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా) అచ్చట నిలిచియుండిరి. వారందరును నశింపనున్నారు. తన కుమారులు అనునసరించిన యుక్తి విధానము ప్రోత్సాహించియున్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోరవిపత్తుకు కారణమై యున్నాడు.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 19
sa ghoṣo dhārtarāṣṭrāṇāṁ
hṛdayāni vyadārayat
nabhaś ca pṛthivīṁ caiva
tumulo ’bhyanunādayan
The blowing of these different conchshells became uproarious. Vibrating both in the sky and on the earth, it shattered the hearts of the sons of Dhṛtarāṣṭra.
Purport : When Bhīṣma and the others on the side of Duryodhana blew their respective conchshells, there was no heart-breaking on the part of the Pāṇḍavas. Such occurrences are not mentioned, but in this particular verse it is mentioned that the hearts of the sons of Dhṛtarāṣṭra were shattered by the sounds vibrated by the Pāṇḍavas’ party. This is due to the Pāṇḍavas and their confidence in Lord Kṛṣṇa. One who takes shelter of the Supreme Lord has nothing to fear, even in the midst of the greatest calamity.
🌹🌹🌹🌹🌹
Date: 28/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 16: 01వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 16: Chap. 01, Ver. 20
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 20
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ: |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవ: |
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ||
ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా! వ్యూహముగా నిలిచియున్నా ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణభగవానునితో ఈ వాక్యములను పలికెను.
బాష్యము : యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షోపదేశములతో నిర్దేశితులైన పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనావ్యూహము ధృతరాష్ట్రతనయులను దాదాపు పూర్తిగా నిరుత్సాహపరచినదని పై వ్యాక్యము ద్వారా అవగతమగుచున్నది. హనుమానుని రూపముచే చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయమునకు మరొక సూచనయై యుండెను. ఏలయన, రామ, రావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు రామునకు సహాయము చేయగా శ్రీరాముడు విజయము నొందెను. ఇప్పుడు రాముడు మరియు హనుమానులిరువురును అర్జునునికి సహాయము చేయుటకై అతని రథమున ఉండిరి. శ్రీకృష్ణభగవానుడు స్వయముగా శ్రీరాముడే. అంతియేగాక శ్రీరాముడు ఎచ్చట నుండునో అతని నిత్య సేవకుడైన హనుమానుడు మరియు నిత్యసతియైన సీతాదేవి(లక్ష్మీదేవి) అచ్చట నుందురు. కావున వాస్తవమునకు అర్జునుడు ఎట్టి శత్రువు నుండియు భయము నొందుటకు కారణము లేదు. అన్నింటికీ మించి హృషీకేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయుటకు స్వయముగా ఉపస్తితుడై యుండెను. ఈ విధముగా యుద్ధము నిర్వహించుట యనెడి విషయమున చక్కని సహాయము అర్జునునకు లభ్యమై యుండెను. తన నిత్యభక్తుని కొరకు భగవానుడు ఏర్పరచిన అట్టి శుభకరమైన పరిస్థితులు నిశ్చయముగా విజ్యమునకు సూచనలు కావించుచున్నవి.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 20
atha vyavasthitān dṛṣṭvā
dhārtarāṣṭrān kapi-dhvajaḥ
pravṛtte śastra-sampāte
dhanur udyamya pāṇḍavaḥ
hṛṣīkeśaṁ tadā vākyam
idam āha mahī-pate
At that time Arjuna, the son of Pāṇḍu, seated in the chariot bearing the flag marked with Hanumān, took up his bow and prepared to shoot his arrows. O King, after looking at the sons of Dhṛtarāṣṭra drawn in military array, Arjuna then spoke to Lord Kṛṣṇa these words.
Purport : The battle was just about to begin. It is understood from the above statement that the sons of Dhṛtarāṣṭra were more or less disheartened by the unexpected arrangement of military force by the Pāṇḍavas, who were guided by the direct instructions of Lord Kṛṣṇa on the battlefield. The emblem of Hanumān on the flag of Arjuna is another sign of victory because Hanumān cooperated with Lord Rāma in the battle between Rāma and Rāvaṇa, and Lord Rāma emerged victorious. Now both Rāma and Hanumān were present on the chariot of Arjuna to help him. Lord Kṛṣṇa is Rāma Himself, and wherever Lord Rāma is, His eternal servitor Hanumān and His eternal consort Sītā, the goddess of fortune, are present. Therefore, Arjuna had no cause to fear any enemies whatsoever. And above all, the Lord of the senses, Lord Kṛṣṇa, was personally present to give him direction. Thus, all good counsel was available to Arjuna in the matter of executing the battle. In such auspicious conditions, arranged by the Lord for His eternal devotee, lay the signs of assured victory.
🌹🌹🌹🌹🌹
Date: 29/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 17: 01వ అధ్., శ్లో 21, 22 / Bhagavad-Gita - 17: Chap. 01, Ver. 21, 22
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 21, 22
అర్జున ఉవాచ
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే(చ్యుత |
యావదేతాన్నిరీక్షే(హం యోద్దుకామానవస్థితాన్ ||
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||
అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! దయచేసి రెండుసేనల నడుమ నా రథమును నిలుపుము. తద్ద్వార యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైనవారిని మరియు మహా సంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును.
బాష్యము : శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు దేవదేవుడైన తన నిర్హేతుక కరుణ వలన మిత్రుని సేవ యందు నియుక్తుడయ్యెను. తన భక్తుల యెడ ప్రేమను చూపుటలో అతడెన్నడును విఫలత్వము నొందడు. కనుకనే అతడు ఇచ్చట “అచ్యుతుని”గా సంబోధింపబడినాడు. రథసారథిగా అతడు అర్జునిని ఆదేశములను అమలుపరచ వలసివచ్చును. ఆ విధముగా నొనర్చుటకు ఆ దేవదేవుడు సంకోచింపనందున అచ్యుతునిగా పిలువబడినాడు. తన భక్తుని కొరకు రథచోదకుని స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడును భంగము రాదు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవదేవుడే. ఇంద్రియాధిపతియైన హృషీకేశుడే. భగవానుడు మరియు అతని సేవకుని నడుమ గల సంభందము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు సదా భగవానునికి సేవను గూర్చ సంసిద్ధుడై యుండును. అదేవిధముగా భగవానుడు సైతము భక్తునికి ఏదియో కొంత సేవగూర్చెడి అవకాశము కొరకై వేచియుండును. ఆదేశము లొసగువానిగా తాను ఆజ్ఞల నొసగుట కన్నాను శుద్ధభక్తుడైనవాడు తనను ఆజ్ఞాపించు స్థానమును గైకొనినచో అతడు మిక్కిలి ముదమందును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతియెక్కరు అతని ఆజ్ఞాపాలకులే. ఆజ్ఞాపించుట అతనికి అధికులెవ్వరు లేరు. కాని తనను శుద్ధభక్తుడైనవాడు ఆజ్ఞాపించుట తటస్థించినపుడు ఆ దేవదేవుడు దివ్యానందమును ననుభవించును. అయినప్పటికి అన్ని పరిస్థితుల యందును అతడు అచ్యుతుడైన ప్రభువే అయియున్నాడు.
భగవానుని శుద్ధభక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో మరియు సోదరులతో యుద్ధము చేయగోరలేదు. కాని ఎటువంటి శాంతిమయ రాయబారమునకు సైతము సమ్మతింపని దుర్యోధనుని మొండితనము వలననే అతడు యుద్ధరంగమునకు బలవంతముగా రావలసివచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు ఏ ప్రముఖుల ఉపస్థితులై యుండిరా యని గాంచుటలో అతడు ఆతురతను కలిగియుండెను. రణరంగమున శాంతియత్నములు చేయుటున్న ప్రశ్నలేకున్నను వారిని అతడు తిరిగి చూడగోరెను. అంతియేగాక అవాంచితమైన యుద్ధము వైపుకు వారెంత మ్రొగ్గు చూపియుండిరో అతడు గాంచగోరెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 21, 22
arjuna uvāca
senayor ubhayor madhye
rathaṁ sthāpaya me ’cyuta
yāvad etān nirīkṣe ’haṁ
yoddhu-kāmān avasthitān
kair mayā saha yoddhavyam
asmin raṇa-samudyame
Arjuna said: O infallible one, please draw my chariot between the two armies so that I may see those present here, who desire to fight, and with whom I must contend in this great trial of arms.
Purport : Although Lord Kṛṣṇa is the Supreme Personality of Godhead, out of His causeless mercy He was engaged in the service of His friend. He never fails in His affection for His devotees, and thus He is addressed herein as infallible. As charioteer, He had to carry out the orders of Arjuna, and since He did not hesitate to do so, He is addressed as infallible. Although He had accepted the position of a charioteer for His devotee, His supreme position was not challenged. In all circumstances, He is the Supreme Personality of Godhead, Hṛṣīkeśa, the Lord of the total senses. The relationship between the Lord and His servitor is very sweet and transcendental. The servitor is always ready to render service to the Lord, and, similarly, the Lord is always seeking an opportunity to render some service to the devotee. He takes greater pleasure in His pure devotee’s assuming the advantageous position of ordering Him than He does in being the giver of orders. Since He is master, everyone is under His orders, and no one is above Him to order Him. But when He finds that a pure devotee is ordering Him, He obtains transcendental pleasure, although He is the infallible master in all circumstances.
As a pure devotee of the Lord, Arjuna had no desire to fight with his cousins and brothers, but he was forced to come onto the battlefield by the obstinacy of Duryodhana, who was never agreeable to any peaceful negotiation. Therefore, he was very anxious to see who the leading persons present on the battlefield were. Although there was no question of a peacemaking endeavor on the battlefield, he wanted to see them again, and to see how much they were bent upon demanding an unwanted war.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 30/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 18: 01వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 18: Chap. 01, Ver. 23
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 23
యోత్స్యమానానవేక్షే(హం య ఏతే(త్ర సమాగతా: |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేర్యుద్దే ప్రియచికీర్షవ ||
దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.
భాష్యము : తన తండ్రియైన ధృతరాష్ట్రుని సహాయమున దుష్టప్రణాళిక ద్వారా పాండవుల రాజ్యమును దుర్యోధనుడు హరింప గోరేననుట బహిరంగ రహస్యము. అనగా దుర్యోధనుని పక్షమున చేరిన వారందరును అతని లక్షణమునలను పోలినవారే.
యుద్ధరంభమునకు పూర్వము రణరంగమున వారిని అర్జునుడు గాంచదలిచెను. వారెవారా యని తెలిసికొనుటయే గాని వారితో శాంతి మంతనములు జరిపెడి భావన అర్జునునకు లేదు. తన చెంతనే శ్రీకృష్ణభగవానుడు ఉపస్థితుడై యున్నందున విజయమును గూర్చి సంపూర్ణ విశ్వాసమున్నను తాను తలపడవలసి యున్నవారి బలమును అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడగోరె ననుటయు ఒక ముఖ్యవిషయమే.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 23
yotsyamānān avekṣe ’haṁ
ya ete ’tra samāgatāḥ
dhārtarāṣṭrasya durbuddher
yuddhe priya-cikīrṣavaḥ
Let me see those who have come here to fight, wishing to please the evil-minded son of Dhṛtarāṣṭra.
Purport : It was an open secret that Duryodhana wanted to usurp the kingdom of the Pāṇḍavas by evil plans, in collaboration with his father, Dhṛtarāṣṭra.
Therefore, all persons who had joined the side of Duryodhana must have been birds of the same feather. Arjuna wanted to see them on the battlefield before the fight was begun, just to learn who they were, but he had no intention of proposing peace negotiations with them. It was also a fact that he wanted to see them to make an estimate of the strength which he had to face, although he was quite confident of victory because Kṛiṣṇa was sitting by his side.
🌹🌹🌹🌹🌹
Date: 31/May/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 19: 01వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 19: Chap. 01, Ver. 24
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 24
సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్తాపయిత్వా రథోత్తమమ్ ||
సంజయుడు పలికెను : ఓ భరతవంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంభోదింపబడినవాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను.
భాష్యము : ఈ శ్లోకము నందు అర్జునుడు గుడాకేశునిగా సంబోధింపబడినాడు. “గుడాక”మనగా నిద్ర యని భావము. అట్టి నిద్రను జయించినవాడు గుడాకేశునిగా పిలువబడును. నిద్రయనగా అజ్ఞానమని భావము. అనగా అర్జునుడు శ్రీకృష్ణభగవానుని సఖ్యము కారణమున నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయించెను. కృష్ణభక్తునిగా అతడు శ్రీకృష్ణభగవానుని క్షణకాలము సైతము మరిచియుండలేదు. ఏలయన అదియే భక్తుని లక్షణము. నిద్రయందైనను లేదా మెలకువ యందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలల స్మరణమును మరువడు. ఆ విధముగా కృష్ణభక్తుడు శ్రీకృష్ణునే నిరంతరము తలచుచు నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని సులభముగా జయింపగలుగును. ఇదియే “కృష్ణభక్తి రసభావనము” లేదా సమాధి యని పిలువబడుచున్నది. హృషీకేశునిగా లేదా ప్రతిజీవి యొక్క ఇంద్రియమనముల నిర్దేశకునిగా శ్రీకృష్ణభగవానుడు ఇరుసేనల నడుమ రథమును నిలుపుమనెడి అర్జునిని ప్రయోజనమును అవగతము చేసికొనెను. కనుకనే అతడు ఆ విధముగా నొనర్చి ఈ క్రింది విధముగా పలికెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 24
sañjaya uvāca
evam ukto hṛṣīkeśo
guḍākeśena bhārata
senayor ubhayor madhye
sthāpayitvā rathottamam
Sañjaya said: O descendant of Bharata, having thus been addressed by Arjuna, Lord Kṛṣṇa drew up the fine chariot in the midst of the armies of both parties.
Purport : In this verse Arjuna is referred to as Guḍākeśa. Guḍākā means sleep, and one who conquers sleep is called guḍākeśa. Sleep also means ignorance. So Arjuna conquered both sleep and ignorance because of his friendship with Kṛṣṇa. As a great devotee of Kṛṣṇa, he could not forget Kṛṣṇa even for a moment, because that is the nature of a devotee. Either in waking or in sleep, a devotee of the Lord can never be free from thinking of Kṛṣṇa’s name, form, qualities and pastimes. Thus a devotee of Kṛṣṇa can conquer both sleep and ignorance simply by thinking of Kṛṣṇa constantly. This is called Kṛṣṇa consciousness, or samādhi. As Hṛṣīkeśa, or the director of the senses and mind of every living entity, Kṛṣṇa could understand Arjuna’s purpose in placing the chariot in the midst of the armies. Thus He did so, and spoke as follows
🌹🌹🌹🌹🌹
Date: 01/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 20: 01వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 20: Chap. 01, Ver. 25
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 25
భీష్మద్రోణప్రముఖత: సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ||
భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భుపలకుల సమక్షమున శ్రీకృష్ణుడు “ఓ పార్థా! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరిని గాంచుము” అని పలికెను.
భాష్యము : సకలజీవుల యందున్న పరమాత్మగా శ్రీకృష్ణుడు అర్జునిని మనస్సులోని ఆలోచనలను అవగతము చేసికొనగలిగెను. ఈ సందర్బమున ఉపయోగింపబడిన హృషీకేశుడు అనెడి పదము ఆ దేవదేవుడు సమస్తము నెరుగునని సూచించుచున్నది. పార్థా (కుంతీ తనయుడు లేదా పృథా తనయుడు) అనెడి పదము సైతము అర్జునిని విషయమున ప్రాధాన్యము కలిగియున్నది. పృథా (తన తండ్రియగు వసుదేవుని సోదరి) తనయుడు కనుకనే తాను సారథి యగుటకు అంగీకరించితినని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు మిత్రునిగా తెలియజేయగోరెను. ఇక “కురువంశీయులను గాంచుము” అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలుకుటలో ఉద్దేశ్యమేమి? యుద్ధము అచ్చటనే నిలిపివేయవలెనని అర్జునుడు కోరేనాయేమి? తన మేనత్తకుమారుడైన అర్జునుని నుండి అట్టి విషయమును శ్రీకృష్ణుడు ఎన్నడును ఊహించియుండలేదు. ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్యధోరణిలో దర్శించెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 25
bhīṣma-droṇa-pramukhataḥ
sarveṣāṁ ca mahī-kṣitām
uvāca pārtha paśyaitān
samavetān kurūn iti
In the presence of Bhīṣma, Droṇa and all the other chieftains of the world, the Lord said, “Just behold, Pārtha, all the Kurus assembled here.”
Purport : As the Supersoul of all living entities, Lord Kṛṣṇa could understand what was going on in the mind of Arjuna. The use of the word Hṛṣīkeśa in this connection indicates that He knew everything. And the word Pārtha, meaning “the son of Pṛthā, or Kuntī,” is also similarly significant in reference to Arjuna. As a friend, He wanted to inform Arjuna that because Arjuna was the son of Pṛthā, the sister of His own father Vasudeva, He had agreed to be the charioteer of Arjuna. Now what did Kṛṣṇa mean when He told Arjuna to “behold the Kurus”? Did Arjuna want to stop there and not fight? Kṛṣṇa never expected such things from the son of His aunt Pṛthā. The mind of Arjuna was thus predicted by the Lord in friendly joking.
🌹🌹🌹🌹🌹
Date: 02/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 21: 01వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 21: Chap. 01, Ver. 26
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 26
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ: పిత్రూనథ పితామహాన్ |
ఆచర్యాన్మా తులాన్ భ్రాత్రూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా |
శ్వశురాన్ సుహ్రుదశ్చైవ సేనయోరుభయోరపి ||
ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
భాష్యము : రణరంగము నందు అర్జునుడు సమస్తబందువులను గాంచెను. తన తండ్రి కాలమునాటి భురిశ్రవుని వంటివారిని, తాతలైన భీష్ముడు మరియు సోమదత్తులను, ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు మరియు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి స్నేహితులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు గాంచెను. పలువురు మిత్రులను గూడియున్న సైన్యమును సైతము అతడు చూడగలిగెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 26
tatrāpaśyat sthitān pārthaḥ
pitṝn atha pitāmahān
ācāryān mātulān bhrātṝn
putrān pautrān sakhīṁs tathā
śvaśurān suhṛdaś caiva
senayor ubhayor api
There Arjuna could see, within the midst of the armies of both parties, his fathers, grandfathers, teachers, maternal uncles, brothers, sons, grandsons, friends, and also his fathers-in-law and well-wishers.
Purport : On the battlefield Arjuna could see all kinds of relatives. He could see persons like Bhūriśravā, who were his father’s contemporaries, grandfathers Bhīṣma and Somadatta, teachers like Droṇācārya and Kṛpācārya, maternal uncles like Śalya and Śakuni, brothers like Duryodhana, sons like Lakṣmaṇa, friends like Aśvatthāmā, well-wishers like Kṛtavarmā, etc. He could see also the armies which contained many of his friends.
🌹🌹🌹🌹🌹
Date: 03/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 22: 01వ అధ్., శ్లో 27, 28 / Bhagavad-Gita - 22: Chap. 01, Ver. 27, 28
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 27, 28
27. తాన్ సమీక్ష స కౌన్తేయ: సర్వాన్ ననవస్తితాన్ |
కృపయా పరయావిష్టో విషిదన్నిదమబ్రవీత్ ||
నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను కూడినవాడ ఈ విధముగా పలికెను.
అర్జున ఉవాచ
28. దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితమ్ |
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ||
అర్జునుడు పలికెను
ఓ కృష్ణా యుద్దోత్సాహముతో సమావేశమై యున్న ఈ జ్ఞాతులను చూచి, నా యొక్క శరీరావయములు కంపించుచున్నవి. నోరు కూడా ఎండిపోవుచున్నది.
భాష్యము : శ్రీకృష్ణభగవానుని యెడ నిష్కపటమైన భక్తికలవాడెవడైనను దివ్యపురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త సద్గుణములను కలిగియుండును. కాని అభక్తుడైనవాడు విద్య మరియు సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకికయోగ్యతలను కలిగియున్నప్పటికి భగవద్గునములు లోపించియుండును. తమలో తాము యుద్ధము చేయుటకు సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను గాంచినంతనే అర్జునుడు వారి యెడ దయపూర్ణ హృదయుడయ్యెను. తన సైనికులకు సంబంధించినంతవరకు అతడు వారి యెడ మొదటి నుండియు కరుణను కలిగియుండెను. అంతియేగాక ప్రతిపక్షపు సైనికుల ఎదను వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు కరుణాభావమును పొందెను. అతడు ఆ విధముగా తలచుచుండ శరీరావయములు కంపించెను. నోరు ఎండిపోయెను. వారి యుద్దోత్సాహము గాంచి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యెను. దాదాపు రాజవంశమంతయు (అర్జునుని రక్తసంబంధికులు) అతనితో యుద్ధము చేయ అరుదెంచెను. కరుణాపూర్ణుడైన అర్జునుని ఈ విషయము ఉద్విగ్నపరిచెను. ఇచ్చట తెలుపబడినప్పటికిని అతని శరీరావయములు కంపించుట, నోరు ఎండిపోవుటయే గాక అతడు కరుణాపూర్ణుడై రోదించుచుండెననియు ఎవరైనను ఊహించగలరు. అర్జునుని యందలి ఇట్టి లక్షణములు అతని మృదుహృదయము వలననే కలిగినినవి గాని శక్తి హీనట వలన కాదు. అట్టి మృదుహృదయము శుద్ధభక్తుని ముఖ్యలక్షణము. కావుననే భాగవతము నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
యస్యాస్తి భక్తి ర్భగవత్యకించనా సర్వైర్గుణై స్తత్ర సమాసతే సురా: |
హరవభక్తస్య కుతో మహాద్గుణా: మనోరథేనాసతి ధావతో బహి: ||
“దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు అకుంటితమైన భక్తి గలవాడు దేవతల సర్వ శుభలక్షణములను కలిగియుండును. కాని అభక్తుడైనవాడు కేవలము తుచ్ఛములైన లౌకికయోగ్యతలనే కలిగియుండును. అట్టి ఆభక్తుడు మానసికస్థాయిలో వర్తించుచు భౌతికశక్తికి ఆకర్షితుడగుటయే అందులకు కారణము. భాగవతము (5 .18 .12)
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 27, 28
tān samīkṣya sa kaunteyaḥ
sarvān bandhūn avasthitān
kṛpayā parayāviṣṭo
viṣīdann idam abravīt
When the son of Kuntī, Arjuna, saw all these different grades of friends and relatives, he became overwhelmed with compassion and spoke thus.
arjuna uvāca:
28. dṛṣṭvemaṁ sva-janaṁ kṛṣṇa
yuyutsuṁ samupasthitam
sīdanti mama gātrāṇi
mukhaṁ ca pariśuṣyati
Arjuna said: My dear Kṛṣṇa, seeing my friends and relatives present before me in such a fighting spirit, I feel the limbs of my body quivering and my mouth drying up.
Purport : Any man who has genuine devotion to the Lord has all the good qualities which are found in godly persons or in the demigods, whereas the nondevotee, however advanced he may be in material qualifications by education and culture, lacks in godly qualities. As such, Arjuna, just after seeing his kinsmen, friends and relatives on the battlefield, was at once overwhelmed by compassion for them who had so decided to fight amongst themselves. As far as his soldiers were concerned, he was sympathetic from the beginning, but he felt compassion even for the soldiers of the opposite party, foreseeing their imminent death. And while he was so thinking, the limbs of his body began to quiver, and his mouth became dry. He was more or less astonished to see their fighting spirit. Practically the whole community, all blood relatives of Arjuna, had come to fight with him. This overwhelmed a kind devotee like Arjuna. Although it is not mentioned here, still one can easily imagine that not only were Arjuna’s bodily limbs quivering and his mouth drying up, but he was also crying out of compassion. Such symptoms in Arjuna were not due to weakness but to his softheartedness, a characteristic of a pure devotee of the Lord. It is said therefore:
yasyāsti bhaktir bhagavaty akiñcanā
sarvair guṇais tatra samāsate surāḥ
harāv abhaktasya kuto mahad-guṇā
mano-rathenāsati dhāvato bahiḥ
“One who has unflinching devotion for the Personality of Godhead has all the good qualities of the demigods. But one who is not a devotee of the Lord has only material qualifications that are of little value. This is because he is hovering on the mental plane and is certain to be attracted by the glaring material energy.” (Bhāg. 5.18.12)
🌹🌹🌹🌹🌹
Date: 04/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 23: 01వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 23: Chap. 01, Ver. 29
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 29
29. వవేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే |
గాండీవం స్రంసతే హస్టాత్ త్వక్చైవ పరిదహ్యతే ||
నా దేహమంతయు కంపించుచున్నది. నాకు రోమాంచమగుచున్నది. గాండివధనుస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవు చున్నది.
భాష్యము : రెండువిధములైన దేహకంపనములు కలవు. అదేవిధముగా రోమాంచితమగుట కుడా రెండు విధములు. అట్టి విషయము ఆధ్యాత్మిక తన్మ్యత్వములో గాని, భౌతికపరిస్థితియందు తీవ్రభయములో గాని కలుగుచుండును. దివ్యానుభవమునందు భయమనునది ఉండదు. ఇట్టి పరిస్థితిలో అర్జునుని యందు గోచరించు లక్షణములు ప్రాణహాని యనెడి భౌతికభయము వలన కలుగుచున్నవి. అతని ఇతర లక్షణముల నుండి సైతము ఇది ప్రతీతమగుచున్నది. ప్రసిద్ధమైన గాండివధనుస్సు చేతి నుండి జారిపోవునంతగా అతడు అసహనము పొందెను. హృదయము మండుచున్న కారణమున చర్మము సైతము మండుచున్న భావనను పొందెను. ఇవన్నియును జీవితపు భౌతికభావన వలననే కలిగినట్టివి.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 29
vepathuś ca śarīre me
roma-harṣaś ca jāyate
gāṇḍīvaṁ sraṁsate hastāt
tvak caiva paridahyate
My whole body is trembling, my hair is standing on end, my bow Gāṇḍīva is slipping from my hand, and my skin is burning.
Purport : There are two kinds of trembling of the body, and two kinds of standings of the hair on end. Such phenomena occur either in great spiritual ecstasy or out of great fear under material conditions. There is no fear in transcendental realization. Arjuna’s symptoms in this situation are out of material fear – namely, loss of life. This is evident from other symptoms also; he became so impatient that his famous bow Gāṇḍīva was slipping from his hands, and, because his heart was burning within him, he was feeling a burning sensation of the skin. All these are due to a material conception of life.
🌹🌹🌹🌹🌹
Date: 05/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 24: 01వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 24: Chap. 01, Ver. 30
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 30
30. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మన: |
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ||
నేను ఇపుడు ఏ మాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణా! కేశిసంహారీ! కేవలము విపరీతములననే నేను గాంచుచున్నాను.
భాష్యము : అసహనత కారణమున అర్జునుడు యుద్దరంగమున నిలువ అశక్తుడై యుండెను. ఈ మనోదుర్భలత వలన అతడు తననే మరచిపోవుచుండును. భౌతికవిషయముల యెడ అధికాసక్తి యనుననది. మనుజుని అట్టి భ్రాంతిమాయ స్థితి యందు నిలుపును. “భయమ్ ద్వితీయాభినివేశత: స్యాత్” (భాగవతము 11.2.37) భౌతికపరిస్థితులచే తీవ్రముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును. అర్జునుడు యుద్ధరంగమునందు భాధమాయమైన విపరితములనే దర్శించసాగెను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందము పొందలేనట్లుగా నుండెను. ఇచ్చట “నిమిత్తాని విపరీతాని” అను పదములు ప్రాముఖ్యమును కలిగియున్నవి. మనుజుడు తన ఆకాంక్షలలో కేవలము విఫలత్వమునే గాంచినపుడు “నేనిచట ఎందులకుకున్నాను?” అని తలపోయును. సాధారణముగా ప్రతియెక్కరు తన యందు మరియు తన స్వీయ క్షేమమునందు ప్రియమును కలిగియుందురు. భగవానుని యందు ఎవ్వరును ప్రియమును కలిగియుండరు. ఇచ్చట శ్రీకృష్ణుని సంకల్పమున అర్జునుడు తన నిజలాభాము నెడ జ్ఞానశూన్యతను ప్రదర్శించుచున్నాడు. ప్రతియొక్కరి నిజలాభము(స్వార్థగతి) విష్ణువు లేదా శ్రీకృష్ణుని యందె కలదు. బద్ధజీవుడు ఈ విషయమును మరచుట చేతనే భౌతికక్లేశముల ననుభవించును. రణరంగమునందు లభించెడి విజయము తనకు దుఃఖకారణమే కాగలదని అర్జునుడు తలపోసెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 30
na ca śaknomy avasthātuṁ
bhramatīva ca me manaḥ
nimittāni ca paśyāmi
viparītāni keśava
I am now unable to stand here any longer. I am forgetting myself, and my mind is reeling. I see only causes of misfortune, O Kṛṣṇa, killer of the Keśī demon.
Purport : Due to his impatience, Arjuna was unable to stay on the battlefield, and he was forgetting himself on account of this weakness of his mind. Excessive attachment for material things puts a man in such a bewildering condition of existence. Bhayaṁ dvitīyābhiniveśataḥ syāt (Bhāg. 11.2.37): such fearfulness and loss of mental equilibrium take place in persons who are too affected by material conditions. Arjuna envisioned only painful reverses in the battlefield – he would not be happy even by gaining victory over the foe. The words nimittāni viparītāni are significant. When a man sees only frustration in his expectations, he thinks, “Why am I here?” Everyone is interested in himself and his own welfare. No one is interested in the Supreme Self. Arjuna is showing ignorance of his real self-interest by Kṛṣṇa’s will. One’s real self-interest lies in Viṣṇu, or Kṛṣṇa. The conditioned soul forgets this, and therefore suffers material pains. Arjuna thought that his victory in the battle would only be a cause of lamentation for him
🌹🌹🌹🌹🌹
Date: 06/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 25: 01వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 25: Chap. 01, Ver. 31
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 31
31. న చ శ్రేయో (నుపశ్యామి హత్వా స్వజనమాహవే |
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ||
ఓ కృష్ణా! ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నను.
భాష్యము : మనుజుని నిజలాభాము విష్ణువు (లేదా కృష్ణుడు) నందే కలదని తెలియక బద్ధజీవులు దేహపరబంధముల యెడ ఆకర్షితులగుదురు. వాటి యందు తాము ఆనందము పొందగలమని వారు అభిలషింతురు. జీవితపు అట్టి అంధమయ భావనలో వారు భౌతికసుఖమునకు హేతువులైన వాటిని సైతము మరచిపోవుదురు. ఇచ్చట అర్జునుడు క్షత్రియధర్మమును మరచినట్లుగా తోచుచున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములో రణరంగమునందు మరణించు క్షత్రియుడు మరియు ఆధ్యాత్మికానుభవము కొరకే అంకితమైన సన్యాసి యనెడి ఇరుపురు శక్తివంతమును మరియు తేజోమయమును అగు సూర్యమండలమున ప్రవేశింపయోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల మాట అటుంచి శత్రువులను వధించుటకు సైతము అర్జునుడు విముఖుడై యుండెను. బంధువులను చంపుట వలన తనకు జీవితమున సుఖము లభింపదని అతడు భావించెను. కనుకనే ఆకలిలేనివాడు వంట చేయుటకు నిరాకరించురీతి అతడు యుద్ధము చేయుటకు ఇచ్చగింపలేదు. ఇపుడతడు వనముకేగి వ్యర్థముగా ఒంటరి జీవితమును గడప నిశ్చయించు కొనెను. క్షత్రియునిగా జీవనార్థమై అతనికి ఒక రాజ్యము అవసరము. ఏలయన క్షత్రియులు ఇతర ఏ వృత్తులు యందును నియుక్తులు కాజాలరు. కాని ప్రస్తుతము అర్జునుడు రాజ్యమును కలిగిలేడు. జ్ఞాతులలో మరియు సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యమును తిరిగి పొందుట ఒక్కటే రాజ్యమును పొందుటకు అర్జునునకు అవకాశమై యుండెను. కాని ఆ విధముగా ఒనర్చుటకు అతడు ఇష్టపడలేదు. కనుకనే ఒంటరిగా విఫల జీవితమును గడుపుటకు వనమున కేగుట ఒక్కటే తనకు తగినదని అతడు భావించెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 31
na ca śreyo ’nupaśyāmi
hatvā sva-janam āhave
na kāṅkṣe vijayaṁ kṛṣṇa
na ca rājyaṁ sukhāni ca
I do not see how any good can come from killing my own kinsmen in this battle, nor can I, my dear Kṛṣṇa, desire any subsequent victory, kingdom or happiness.
Purport : Without knowing that one’s self-interest is in Viṣṇu (or Kṛṣṇa), conditioned souls are attracted by bodily relationships, hoping to be happy in such situations. In such a blind conception of life, they forget even the causes of material happiness. Arjuna appears to have even forgotten the moral codes for a kṣatriya. It is said that two kinds of men, namely the kṣatriya who dies directly in front of the battlefield under Kṛṣṇa’s personal orders and the person in the renounced order of life who is absolutely devoted to spiritual culture, are eligible to enter into the sun globe, which is so powerful and dazzling. Arjuna is reluctant even to kill his enemies, let alone his relatives. He thinks that by killing his kinsmen there would be no happiness in his life, and therefore he is not willing to fight, just as a person who does not feel hunger is not inclined to cook. He has now decided to go into the forest and live a secluded life in frustration. But as a kṣatriya, he requires a kingdom for his subsistence, because the kṣatriyas cannot engage themselves in any other occupation. But Arjuna has no kingdom. Arjuna’s sole opportunity for gaining a kingdom lies in fighting with his cousins and brothers and reclaiming the kingdom inherited from his father, which he does not like to do. Therefore he considers himself fit to go to the forest to live a secluded life of frustration.
🌹🌹🌹🌹🌹
Date: 07/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 26: 01వ అధ్., శ్లో 32 - 35 / Bhagavad-Gita - 26: Chap. 01, Ver. 32 - 35
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 32 - 35
32. కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా |
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా: సుఖాని చ ||
33. త ఇమే(వస్థితా యుద్ధే ప్రాణం స్త్యక్త్వా ధనాని చ |
ఆచార్య: పితర: పుత్రాస్తథైవ చ పితామహా: ||
34. మాతులా: శ్వశురా: పౌత్రా: శ్యాలా: సంబంధినస్తథా |
ఏతన్న హన్తుమిచ్చామి ఘ్నతో(పి మధుసూదన ||
35. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో: కిం ను మహీకృతే |
నిహత్య ధార్తరాష్ట్రాన్న: కా ప్రీతి: స్యాజ్జనార్ధన ||
ఓ గోవిందా! మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నమో వారందరును ఈ యుద్ధమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసుధనా! ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బందువులందరును తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా యెదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్ధనా! ఈ ధరాత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందము పొందగలము?
భాష్యము : గోవులకు మరియు ఇంద్రియములకు శ్రీకృష్ణుడు ఆనందధ్యేయమైన కారణమున అతనిని అర్జునుడు ఇచ్చట “గోవిందా” యని సంభోదించినాడు. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తనను ఆనందపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలెనని సూచించుచున్నాడు. కాని మన ఇంద్రియతృప్తి కొరకై గోవిందుడు నిర్దేశింపబడలేదు. అయినప్పటికిని ఆ గోవిందుని తృప్తిపరచుట యత్నించినచో అప్రయత్నముగా మనము కుడా తృప్తినొందగలము. ప్రతియెక్కరు తమ ఇంద్రియములను తృప్తిపరచవలెననియే వాంచింతురు మరియు అట్టి ఆనందమును భగవానుడు ఒసగవలెననియు కోరుదురు. కాని భగవానుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే వారికి ఇంద్రియభోగము నొసగును గాని వారు కోరినంత కాదు. కాని మనుజుడు అట్లుగాక భిన్నమార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియముల తృప్తిని కోరకుండ గోవిందుని ప్రియము కొరకే యత్నించినపుడు అతని కరుణచే సమస్త కోరికలు పూర్ణము చేసికొనగలడు. తన జాతి మరియు కుటుంబసభ్యుల యెడ అర్జునుడు కనబరచిన ప్రగాడ అనురాగామునకు వారి యెడ అతనికి గల సహజ కరుణయే కొంత కారణమై యున్నది. కనుకనే అతడు యుద్ధమునకు సిద్ధపడలేదు. సాధారణముగా ప్రతియొక్కరు తమ ధనసంపత్తులను బంధు,మిత్రులకు ప్రదర్శింపవలెనని తలతురు. బంధుమిత్రులందరును యుద్ధమున మరణింతురు కావున యుద్ధవిజయము తదుపరి తన సంపదను వారితో కలసి పంచుకొనజాలనని అర్జునుడు భీతిచెందెను. లౌకికజీవనము నందలి భావములు ఈ విధముగనే ఉండును. కాని ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనట్టిది. భక్తుడు సదా భగవానుని కోరికలను పూర్ణము చేయవలెననియే కోరును కనుక ఆ దేవదేవుని సేవ కొరకు (అతడు అంగీకరించినచో) అన్ని విధములైన సంపదలను స్వికరించును. భగవానుడు అంగీకరింపనిచో ఆ భక్తుడు చిల్లిగవ్వనైనను తాకరాదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని చంపవలసియే వచ్చినచో కృష్ణుడే స్వయముగా వారిని సంహరింపవలెనని అతడు కోరెను. యుద్ధరంగమునకు అరుదెంచక పూర్వమే శ్రీకృష్ణుడు వారిని సంహరించి యుండెననియు మరియు తాను కేవలము శ్రీకృష్ణుని పనిముట్టుగా కావలసియున్నదని ఈ క్షణముణ అర్జునుడు తెలియకున్నాడు. ఈ సత్యము రాబోవు అధ్యాయములలో తెలుపబడినది. భగవానుని సహజ భక్తుడైన కారణమున అర్జునుడు తన దుష్టజ్ఞాతుల యెడ మరియు సోదరుల యెడ ప్రతిక్రియ చేయగోరలేదు. కాని వారిని వదింపవలెననుట శ్రీకృష్ణుని సంకల్పమై యుండెను. భగవద్భక్తుడెన్నడును దుష్టుని యెడ ప్రతీకారము చేయడు. కాని భక్తుల యెడ దుష్టులు కావించు తప్పిదమును మాత్రము భగవానుడు సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరినైనను క్షమింపగలడు గాని భక్తులకు హాని గూర్చినవానిని మాత్రము క్షమింపడు. కనుకనే అర్జునుడు క్షమింపగోరినను దుష్టులను దునుమాడుటకే శ్రీకృష్ణభగవానుడు నిశ్చయుడై యుండెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 32 - 35
kiṁ no rājyena govinda
kiṁ bhogair jīvitena vā
yeṣām arthe kāṅkṣitaṁ no
rājyaṁ bhogāḥ sukhāni ca
ta ime ’vasthitā yuddhe
prāṇāṁs tyaktvā dhanāni ca
ācāryāḥ pitaraḥ putrās
tathaiva ca pitāmahāḥ
mātulāḥ śvaśurāḥ pautrāḥ
śyālāḥ sambandhinas tathā
etān na hantum icchāmi
ghnato ’pi madhusūdana
api trailokya-rājyasya
hetoḥ kiṁ nu mahī-kṛte
nihatya dhārtarāṣṭrān naḥ
kā prītiḥ syāj janārdana
O Govinda, of what avail to us are a kingdom, happiness or even life itself when all those for whom we may desire them are now arrayed on this battlefield? O Madhusūdana, when teachers, fathers, sons, grandfathers, maternal uncles, fathers-in-law, grandsons, brothers-in-law and other relatives are ready to give up their lives and properties and are standing before me, why should I wish to kill them, even though they might otherwise kill me? O maintainer of all living entities, I am not prepared to fight with them even in exchange for the three worlds, let alone this earth. What pleasure will we derive from killing the sons of Dhṛtarāṣṭra?
Purport : Arjuna has addressed Lord Kṛṣṇa as Govinda because Kṛṣṇa is the object of all pleasures for cows and the senses. By using this significant word, Arjuna indicates that Kṛṣṇa should understand what will satisfy Arjuna’s senses. But Govinda is not meant for satisfying our senses. If we try to satisfy the senses of Govinda, however, then automatically our own senses are satisfied. Materially, everyone wants to satisfy his senses, and he wants God to be the order supplier for such satisfaction. The Lord will satisfy the senses of the living entities as much as they deserve, but not to the extent that they may covet. But when one takes the opposite way – namely, when one tries to satisfy the senses of Govinda without desiring to satisfy one’s own senses – then by the grace of Govinda all desires of the living entity are satisfied. Arjuna’s deep affection for community and family members is exhibited here partly due to his natural compassion for them. He is therefore not prepared to fight. Everyone wants to show his opulence to friends and relatives, but Arjuna fears that all his relatives and friends will be killed on the battlefield and he will be unable to share his opulence after victory. This is a typical calculation of material life. The transcendental life, however, is different. Since a devotee wants to satisfy the desires of the Lord, he can, Lord willing, accept all kinds of opulence for the service of the Lord, and if the Lord is not willing, he should not accept a farthing. Arjuna did not want to kill his relatives, and if there were any need to kill them, he desired that Kṛṣṇa kill them personally. At this point he did not know that Kṛṣṇa had already killed them before their coming into the battlefield and that he was only to become an instrument for Kṛṣṇa. This fact is disclosed in following chapters. As a natural devotee of the Lord, Arjuna did not like to retaliate against his miscreant cousins and brothers, but it was the Lord’s plan that they should all be killed. The devotee of the Lord does not retaliate against the wrongdoer, but the Lord does not tolerate any mischief done to the devotee by the miscreants. The Lord can excuse a person on His own account, but He excuses no one who has done harm to His devotees. Therefore the Lord was determined to kill the miscreants, although Arjuna wanted to excuse them.
🌹🌹🌹🌹🌹
Date: 08/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 27: 01వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 27: Chap. 01, Ver. 36
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 36
36. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయిన: |
తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్ స్వబాన్దవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖిన: శ్యామ మాధవ ||
ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణా! స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము?
భాష్యము : వేదనిర్దేశము ననుసరించి ఆరు రకముల దుర్మార్గులు కలరు. వారే 1. విషముపెట్టువాడు 2. ఇంటికి నిప్పుపెట్టువాడు 3. మారణ ఆయుధములతో దాడి చేయువాడు 4. ఇతరుల ధనమును దోచెడివాడు 5. ఇతరుల స్థలము నాక్రమించెడివాడు 6. పరుల భార్యను చెరపట్టెడివాడు. అట్టి దుర్మార్గులను శీఘ్రమే సంహరింపవలెను. వారి సంహారముచే ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య వ్యక్తినైనను సరియైన కార్యమే. కాని అర్జునుడు సామాన్యవక్తి కాడు. సాధుస్వభావమును కలిగియున్న కారణమున వారి యెడ అతడు సాదుస్వభావము వర్తించదలెచెను. అయినను అటువంటి సాధువర్తనము క్షత్రియునకు సంభందించినది కాదు. రాజ్యమును పాలించు భాద్యతాయుతుడైన రాజు సాదు స్వభావమును కలిగి యుండవలెను గాని పిరికివాడై యుండకూడదు. ఉదాహరణమునకు శ్రీరామచంద్రుడు సాధుస్వభావమును కలిగియుండెను. కనుకనే నేటికిని జనులు రామరాజ్యమున వసింపవలెనని తహతహలాడుచున్నారు. శ్రీరాముడు ఎన్నడును పిరికితనమును ప్రదర్శింపలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు రాముని యెడ దుర్మార్గతను ప్రదర్శించెను. అపుడు శ్రీరాముడు ప్రపంచచరిత్రలో అసమానమైన విధముగా అతనికి గుణపాఠము చెప్పెను. కాని అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించినవారు అతని తాత, గురువు, స్నేహితులు, బంధువులు, పుత్రులు, మనుమలు మొదలైన అతని బంధువర్గము వారే. కనుకనే సాధారణ దుర్మార్గముల యెడ చూపవలసినటువంటి తీవ్రచర్యను తాను వారి యెడ తీసికొనరాదని అర్జునుడు భావించెను. అదియును గాక సాధువులైనవారు. కేక్షమాగుణము కలిగియుండవలెనని తెలియజేయుబడుచున్నది. సాధువులైనవారికి అట్టి నిర్దేశములు రాజకీయరాజకీయ అత్యవసర పరిస్థితుల కన్నను అత్యంత ముఖ్యమైనవి. స్వజనమును రాజకీయ కారణములచే చంపుటకు బదులు వారిని ధర్మము మరియు సాధువర్తనము దృష్ట్యా క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే అశాశ్వతమైన దేహసౌఖ్యము కొరకు అట్టి సంహారము లాభదాయకము కాదని అతడు తలచెను. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యము శాశ్వతము కానప్పుడు తాను తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని స్వజన సంహారము ద్వారా ఏల పణముగా పెట్టవలెను? అర్జునుడు శ్రీకృష్ణుని ఇచ్చట “మాధవ” యని సంభోదించుట యందు ఒక ప్రాముఖ్యము కలదు. అంత్యమున ఆశుభమునే కలుగజేయు కారికార్యమునందు తనను శ్రీకృష్ణుడు( లక్ష్మీదేవి భర్తగా) నియుక్తుని చేయరాదని అర్జునుడు ఆ దేవదేవుని తెలియజేయుగోరెను. అయినను వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుడు ఎవ్వరికిని ఆశుభములను కలుగజేయదు. అట్టి యెడ తన భక్తులకు అట్టి పరిస్థితులను కలిగించడని వేరుగా తెలుపనవసరము లేదు.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 36
pāpam evāśrayed asmān
hatvaitān ātatāyinaḥ
tasmān nārhā vayaṁ hantuṁ
dhārtarāṣṭrān sa-bāndhavān
sva-janaṁ hi kathaṁ hatvā
sukhinaḥ syāma mādhava
Sin will overcome us if we slay such aggressors. Therefore it is not proper for us to kill the sons of Dhṛtarāṣṭra and our friends. What should we gain, O Kṛṣṇa, husband of the goddess of fortune, and how could we be happy by killing our own kinsmen?
Purport : According to Vedic injunctions there are six kinds of aggressors: (1) a poison giver, (2) one who sets fire to the house, (3) one who attacks with deadly weapons, (4) one who plunders riches, (5) one who occupies another’s land, and (6) one who kidnaps a wife. Such aggressors are at once to be killed, and no sin is incurred by killing such aggressors. Such killing of aggressors is quite befitting any ordinary man, but Arjuna was not an ordinary person. He was saintly by character, and therefore he wanted to deal with them in saintliness. This kind of saintliness, however, is not for a kṣatriya. Although a responsible man in the administration of a state is required to be saintly, he should not be cowardly. For example, Lord Rāma was so saintly that people even now are anxious to live in the kingdom of Lord Rāma (rāma-rājya), but Lord Rāma never showed any cowardice.
Rāvaṇa was an aggressor against Rāma because Rāvaṇa kidnapped Rāma’s wife, Sītā, but Lord Rāma gave him sufficient lessons, unparalleled in the history of the world. In Arjuna’s case, however, one should consider the special type of aggressors, namely his own grandfather, own teacher, friends, sons, grandsons, etc. Because of them, Arjuna thought that he should not take the severe steps necessary against ordinary aggressors. Besides that, saintly persons are advised to forgive. Such injunctions for saintly persons are more important than any political emergency. Arjuna considered that rather than kill his own kinsmen for political reasons, it would be better to forgive them on grounds of religion and saintly behavior. He did not, therefore, consider such killing profitable simply for the matter of temporary bodily happiness. After all, kingdoms and pleasures derived therefrom are not permanent, so why should he risk his life and eternal salvation by killing his own kinsmen? Arjuna’s addressing of Kṛṣṇa as “Mādhava,” or the husband of the goddess of fortune, is also significant in this connection. He wanted to point out to Kṛṣṇa that, as the husband of the goddess of fortune, He should not induce Arjuna to take up a matter which would ultimately bring about misfortune. Kṛṣṇa, however, never brings misfortune to anyone, to say nothing of His devotees
🌹🌹🌹🌹🌹
Date: 09/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 28: 01వ అధ్., శ్లో 37, 38 / Bhagavad-Gita - 28: Chap. 01, Ver. 37, 38
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 37 - 38
37. యద్య ప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతస: |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||
38. కథం న జ్ఞేయమస్మాభి: పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్ధన ||
ఓ జనార్దనా! లోభపూర్ణ చిత్తము కలిగిన విరందరును కులసంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నాను, వంశనాశనము నందు దోషము గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులను కావలెను?
భాష్యము : ప్రతిపక్షమువారు ఆహ్వానిచినప్పుడు క్షత్రియుడైనవాడు యుద్ధము చేయుటకుగాని, జూదమాడుటకుగాని నిరాకారింపరాదు. కావున అట్టి నియమము ననుసరించి అర్జునుడు యుద్ధము నొనరించుట నిరాకారింపరాదు. దుర్యోధనుని పక్షము వారిచే అతడు యుద్ధమునకు ఆహ్వానింపబడుటయే అందులకు కారణము. కాని అట్టి యుద్ధపంతపు ప్రభావములను ప్రతిపక్షమువారు చూడజాలకున్నారని అతడు భావించెను. కాని అతడు ఆ దుష్టప్రభావములను గాంచగలిగినందున ప్రతిపక్షమువారి పంతమును అంగీకరింపలేకపోయెను. ఫలితము శుభకరమైనచో నియమమును కచ్చితముగా పాటింపవచ్చును, కాని ఫలితము విరుద్ధముగా నున్నప్పుడు ఎవ్వరును దానికి కట్టుబడ జాలరు.ఈ విధమైన మంచిచెడ్డలను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించుకొనెను
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 37 - 38
yady apy ete na paśyanti
lobhopahata-cetasaḥ
kula-kṣaya-kṛtaṁ doṣaṁ
mitra-drohe ca pātakam
kathaṁ na jñeyam asmābhiḥ
pāpād asmān nivartitum
kula-kṣaya-kṛtaṁ doṣaṁ
prapaśyadbhir janārdana
O Janārdana, although these men, their hearts overtaken by greed, see no fault in killing one’s family or quarreling with friends, why should we, who can see the crime in destroying a family, engage in these acts of sin?
Purport : A kṣatriya is not supposed to refuse to battle or gamble when he is so invited by some rival party. Under such an obligation, Arjuna could not refuse to fight, because he had been challenged by the party of Duryodhana. In this connection, Arjuna considered that the other party might be blind to the effects of such a challenge. Arjuna, however, could see the evil consequences and could not accept the challenge. Obligation is actually binding when the effect is good, but when the effect is otherwise, then no one can be bound. Considering all these pros and cons, Arjuna decided not to fight.
🌹🌹🌹🌹🌹
Date: 10/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 29: 01వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 29: Chap. 01, Ver. 39
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 39
39. కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మా: సనాతనా: |
ధర్మేనష్టే కులం కృత్స్నమధర్మో(భిభవత్యుత ||
కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మ వర్తనులగుదురు.
భాష్యము : వంశమునందలి వారు సక్రమముగా వృద్ధినొంది ఆద్యాత్మికవిలువలను సంతరించుకొనుటకై సహాయపడుటకు పలు ధర్మనియమములు వర్ణాశ్రమపద్దతి యందు కలవు. జన్మ మొదలుగా మృత్యువు వరకు గల అట్టి అనేక శుద్ధికర్మలకు వంశంలోని పెద్దలు భాద్యతను వహింతురు. కాని ఆ పెద్దల మరణము పిమ్మట అతి వంశాచారములు నిలిచిపోయి మిగిలిన వంశమువారు అధర్మమగు అలవాట్లను వృద్దిచేసికొను అవకాశము కలదు. తద్ద్వారా ఆధ్యాత్మికముక్తికి వారు అవకాశము కోల్పోవగలరు. కనుకనే ఏ ప్రయోజనము కొరకైనను వంశపెద్దలను వధింపరాదు.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 39
39. kula-kṣaye praṇaśyanti
kula-dharmāḥ sanātanāḥ
dharme naṣṭe kulaṁ kṛtsnam
adharmo ’bhibhavaty uta
Translation : With the destruction of the dynasty, the eternal family tradition is vanquished, and thus the rest of the family becomes involved in irreligion.
Purport : In the system of the varṇāśrama institution there are many principles of religious traditions to help members of the family grow properly and attain spiritual values. The elder members are responsible for such purifying processes in the family, beginning from birth to death. But on the death of the elder members, such family traditions of purification may stop, and the remaining younger family members may develop irreligious habits and thereby lose their chance for spiritual salvation. Therefore, for no purpose should the elder members of the family be slain.
🌹🌹🌹🌹🌹
Date: 11/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 30: 01వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 30: Chap. 01, Ver. 40
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 40
40. అధర్మాభిభావాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియ: |
స్త్రీషు దుష్టాషు వార్ ష్ణేయ జాయతే వర్ణసంకర: ||
ఓ కృష్ణా! వంశము నందు అధర్మము ప్రబలమగుట వలన కులస్త్రిలు చెడిపోవుదురు. ఓ వృష్ణివంశసంజాతుడా! అట్టి కులస్త్రి పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును.
భాష్యము : జీవితమునందలి శాంతికి, అభిరుద్ధికి, ఆధ్యాత్మికోన్నతికి మానవసంఘమునందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాదారము. దేశము మరియు జాతి యొక్క ఆధ్యాత్మిక పురోగతి కొరకు సంఘమునందు సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనియుండురీతిలో వర్ణాశ్రమధర్మములు ఏర్పాటు చేయబడినవి. అటువంటి జనబాహుళ్యము స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడియుండును. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశమున్న రీతిగనే స్త్రీలు సైతము పతనమగుటకు అవకాశము కలదు. కనకనే పిల్లలకు మరియు స్త్రీలకు కుటుంబపెద్దల రక్షణము అవసరము. వివిధ ధర్మాచారములందు నియుక్తులగుట ద్వారా స్త్రీలు పెడదారి పట్టకున్డురు. చాణక్యపండితుని అభిప్రాయము ప్రకారము స్త్రీలు సాధారణముగా తెలివికలవారు కానందున నమ్మకముంచ దగినవారు కారు. కనుకనే ధర్మకార్యములకు సంబంధించి వంశాచారములు వారికి సదా వ్యాపకము కలిగించవలెను. ఆ విధముగా వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమపద్దతిని పాటించుటకు యోగ్యత కలిగిన సత్ప్రజకు జన్మనొసగ గలరు. అట్టి వర్ణాశ్రమధర్మము విఫలమైనప్పుడు స్త్రీలు సహజముగా కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియుదురు. ఆ విధముగా అవాంచిత జనబాహుళ్యము వృద్ధిచేయుచు జారత్వము ప్రబలమగును. బాధ్యతారహితులైన పురుషులు కొందరు అటువంటి జారత్వమునే ప్రోత్సహించుచుందురు. అంతట సంఘమున అవాంచిత సంతానము పెచ్చు పెరిగి యుద్ధములకు మరియు అశాంతికి దారి తీయును.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 40
40. adharmābhibhavāt kṛṣṇa
praduṣyanti kula-striyaḥ
strīṣu duṣṭāsu vārṣṇeya
jāyate varṇa-saṅkaraḥ
Translation : When irreligion is prominent in the family, O Kṛṣṇa, the women of the family become polluted, and from the degradation of womanhood, O descendant of Vṛṣṇi, comes unwanted progeny.
Purport : Good population in human society is the basic principle for peace, prosperity and spiritual progress in life. The varṇāśrama religion’s principles were so designed that the good population would prevail in society for the general spiritual progress of state and community. Such population depends on the chastity and faithfulness of its womanhood. As children are very prone to be misled, women are similarly very prone to degradation. Therefore, both children and women require protection by the elder members of the family. By being engaged in various religious practices, women will not be misled into adultery. According to Cāṇakya Paṇḍita, women are generally not very intelligent and therefore not trustworthy. So the different family traditions of religious activities should always engage them, and thus their chastity and devotion will give birth to a good population eligible for participating in the varṇāśrama system. On the failure of such varṇāśrama-dharma, naturally the women become free to act and mix with men, and thus adultery is indulged in at the risk of unwanted population. Irresponsible men also provoke adultery in society, and thus unwanted children flood the human race at the risk of war and pestilence.
🌹🌹🌹🌹🌹
Date: 12/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 31: 01వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 31: Chap. 01, Ver. 41
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 41
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియా: ||
అవాంచిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితురులు పతనము నొందుదురు.
భాష్యము : కర్మకాండ విధుల ప్రకారము వంశపితురులకు నియమానుసారముగా పిండోదకములు అర్పించవలసిన అవసరమున్నది. అట్టి అర్పణము విష్ణువు యొక్క అర్చనము ద్వారా చక్కగా ఒనరించబడగలదు. ఏలయన విష్ణువునకు అర్పించిన ఆహారమును భుజించుట యనెడి కార్యము మనుజుని అన్ని రకములైన పాపముల నుండి ముక్తుని చేయగలదు. కొన్నిమార్లు వంశపితరులు పలువిధములైన పాపకర్మఫలముల కారణమున తపించు చుండవచ్చును. ఇంకొన్నిమార్లు వారికి స్థూలదేహము సైతము లభింపక పిశాచములుగా సూక్ష్మదేహమునందే బలవంతముగా నిలువవలసివచ్చును. కాని వంశీయులచే భగత్ప్రసాదము ఆ పితురులకు అర్పింపబడినప్పుడు వారు పిశాచరూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవనస్థితుల నుండి విడుదలను పొందగలరు. పితరులకు ఒనర్చబడెడి అట్టి సహాయము వాస్తవమునకు ఒక వంశాచారము. భక్తియుతజీవనము నందు నిలువనివాడు అటువంటి కర్మకాండ తప్పక ఒనరింపవలెను. కాని భక్తియుత జీవనము నందు నిలిచినవాడు అట్టి కర్మలను ఒనరింపవలసిన అవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా మనుజుడు లక్షలాది పితృదేవతలనైనను సర్వవిధములైన దుఃఖముల నుండి ముక్తులను చేయగలడు. ఈ విషయమే శ్రీమద్భాగవతము (11.5.41) నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
దేవర్షిభూతాప్తనృణాం పితౄణాం న కింకరో నాయమృణీ చ రాజన్ |
సర్వాత్మనా య: శరణం శరణ్యం గతో ముకున్దం పరిహృత్య కర్తమ్ ||
“సర్వవిధములైన ధర్మములను త్యజించి ముక్తినొసగెడి ముకుందుని చరణపద్మాశ్రయ శరణమున నిలిచినవాడు మరియు చేపట్టిన మార్గమునందు పూర్ణ శ్రద్ధాళువైనవాడు దేవతలకుగాని, ఋషులకుగాని, జీవులకుగాని, కుటుంబమువారికిగాని, పితృదేవతలకుగాని ఋణపడియుండడు. వారి యెడ అతనికి ఎట్టి విధులుగాని, బాధ్యతలుగాని లేవు.” పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణుని భక్తియుతసేవ ద్వారా అట్టి సమస్త బాధ్యతలు అప్రయత్నముగా పూర్ణము కావింపబడుచున్నవి.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 41
saṅkaro narakāyaiva
kula-ghnānāṁ kulasya ca
patanti pitaro hy eṣāṁ
lupta-piṇḍodaka-kriyāḥ
Translation : An increase of unwanted population certainly causes hellish life both for the family and for those who destroy the family tradition. The ancestors of such corrupt families fall down, because the performances for offering them food and water are entirely stopped.
Purport : According to the rules and regulations of fruitive activities, there is a need to offer periodical food and water to the forefathers of the family. This offering is performed by worship of Viṣṇu, because eating the remnants of food offered to Viṣṇu can deliver one from all kinds of sinful reactions. Sometimes the forefathers may be suffering from various types of sinful reactions, and sometimes some of them cannot even acquire a gross material body and are forced to remain in subtle bodies as ghosts. Thus, when remnants of prasādam food are offered to forefathers by descendants, the forefathers are released from ghostly or other kinds of miserable life. Such help rendered to forefathers is a family tradition, and those who are not in devotional life are required to perform such rituals. One who is engaged in the devotional life is not required to perform such actions. Simply by performing devotional service, one can deliver hundreds and thousands of forefathers from all kinds of misery. It is stated in the Bhāgavatam (11.5.41):
devarṣi-bhūtāpta-nṛṇāṁ pitṝṇāṁ
na kiṅkaro nāyam ṛṇī ca rājan
sarvātmanā yaḥ śaraṇaṁ śaraṇyaṁ
gato mukundaṁ parihṛtya kartam
“Anyone who has taken shelter of the lotus feet of Mukunda, the giver of liberation, giving up all kinds of obligation, and has taken to the path in all seriousness, owes neither duties nor obligations to the demigods, sages, general living entities, family members, humankind or forefathers.” Such obligations are automatically fulfilled by performance of devotional service to the Supreme Personality of Godhead.
🌹🌹🌹🌹🌹
Date: 13/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 32: 01వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 32: Chap. 01, Ver. 42
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 42
దోషైరేతై: కులఘ్నానాం వర్ణసంకరకారకై: |
ఉత్సాద్యన్తే జాతిధర్మా: కులధర్మాశ్చ శాశ్వతా: ||
వంశాచారమును నశింపజేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతిధర్మములు నాశనమగును.
భాష్యము : మానవుడు తన చరమలక్ష్యమైన ముక్తిని బడయురీతిలో మానవసంఘపు నాలుగువర్ణముల వారి కర్మలు (కుటుంబసంక్షేమ కార్యములతో సహా) నిర్ణయింపబడినవి. అవి సనాతనధర్మము లేదా వర్ణాశ్రమధర్మముచే నిర్దేశింపబడినవి. కనుకనే బాధ్యతారహితులైన నాయకులచే సనాతనధర్మ విధానము విచ్ఛిన్నము గావింపబడినపుడు సంఘములో అయోమయస్థితి ఏర్పడును. తత్ఫలితముగా జనులు తమ జీవితలక్ష్యమైన విష్ణువును మరచిపోవుదురు. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడుదురు. వారిని అనుసరించు జనులు నిక్కముగా అయోమయస్థితిన పడగలరు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 42
doṣair etaiḥ kula-ghnānāṁ
varṇa-saṅkara-kārakaiḥ
utsādyante jāti-dharmāḥ
kula-dharmāś ca śāśvatāḥ
Translation : By the evil deeds of those who destroy the family tradition and thus give rise to unwanted children, all kinds of community projects and family welfare activities are devastated.
Purport : Community projects for the four orders of human society, combined with family welfare activities, as they are set forth by the institution of sanātana-dharma, or varṇāśrama-dharma, are designed to enable the human being to attain his ultimate salvation. Therefore, the breaking of the sanātana-dharma tradition by irresponsible leaders of society brings about chaos in that society, and consequently people forget the aim of life – Viṣṇu. Such leaders are called blind, and persons who follow such leaders are sure to be led into chaos.
🌹🌹🌹🌹🌹
Date: 14/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 33: 01వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 33: Chap. 01, Ver. 43
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 43
ఉత్పన్నకుల ధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||
ఓ కృష్ణా! జనార్దనా! కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని.
భాష్యము : అర్జునుడు ఇచ్చట తన వాదమునకు స్వానుభవమును గాక, ప్రామాణికుల ద్వారా వినియున్న విషయమును ఆధారము చేసికొనెను. వాస్తవజ్ఞానమును స్వీకరించుటకు అదియే సరియైన మార్గము. జ్ఞానమునందు ఇదివరకే స్థితుడైనట్టి సరియైన వ్యక్తి యొక్క సహాయము లేనిదే ఎవ్వరును వాస్తవజ్ఞానపు ముఖ్యాంశమును అవగతము చేసికొనలేరు. మరణమునకు పూర్వమే స్వీయపాపకర్మలకు ప్రాయశ్చిత్తమును చేసికొనెడి ఒక విధానము వర్ణాశ్రమపద్ధతి యందు కలదు. సదా పాపకర్మల యందే నియుక్తులైనవారు ప్రాయశ్చిత్తముగా పిలువబడు ఆ విధానమును తప్పక అనుసరింపవలెను. ఆ విధముగా చేయని యెడల పాపకర్మల ఫలితముగా వారు దుర్భర జీవనమునకై నరక లోకములకు ఏగవలసి వచ్చును.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 43
utsanna-kula-dharmāṇāṁ
manuṣyāṇāṁ janārdana
narake niyataṁ vāso
bhavatīty anuśuśruma
Translation : O Kṛṣṇa, maintainer of the people, I have heard by disciplic succession that those whose family traditions are destroyed dwell always in hell.
Purport : Arjuna bases his argument not on his own personal experience, but on what he has heard from the authorities. That is the way of receiving real knowledge. One cannot reach the real point of factual knowledge without being helped by the right person who is already established in that knowledge. There is a system in the varṇāśrama institution by which before death one has to undergo the process of atonement for his sinful activities. One who is always engaged in sinful activities must utilize the process of atonement, called prāyaścitta. Without doing so, one surely will be transferred to hellish planets to undergo miserable lives as the result of sinful activities.
🌹🌹🌹🌹🌹
Date: 15/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 34: 01వ అధ్., శ్లో 44 / Bhagavad-Gita - 34: Chap. 01, Ver. 44
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 44
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం |
యద్ రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతా: ||
అహో! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించవలెననెడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము.
భాష్యము : స్వార్థపూరిత భావములతో ప్రేరేపింపబడి మనుజుడు కొన్నిమార్లు స్వంతసోదరుడు, తండ్రి లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు ఒడిగట్టును. ప్రపంచచరిత్రలో అట్టి సంఘటనలు పలుగలవు. కాని అర్జునుడు శ్రీకృష్ణభగవానుని భక్తుడైనందున నీతినియమములను గూర్చిన పూర్తి ఎరుక కలిగి అట్టి కార్యములు జరుగకుండునట్లుగా గాంచెను.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 44
aho bata mahat pāpaṁ
kartuṁ vyavasitā vayam
yad rājya-sukha-lobhena
hantuṁ sva-janam udyatāḥ
Translation : Alas, how strange it is that we are preparing to commit greatly sinful acts. Driven by the desire to enjoy royal happiness, we are intent on killing our own kinsmen.
Purport : Driven by selfish motives, one may be inclined to such sinful acts as the killing of one’s own brother, father or mother. There are many such instances in the history of the world. But Arjuna, being a saintly devotee of the Lord, is always conscious of moral principles and therefore takes care to avoid such activities.
🌹🌹🌹🌹🌹
Date: 16/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 35: 01వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 35: Chap. 01, Ver. 45
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 45
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ: |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||
నిరాయుధుడు మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.
భాష్యము : క్షత్రియ యుద్ధనియమము ననుసరించి నిరాయుధుడైనవానిని మరియు యుద్ధమును చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. అటువంటి పరిస్థితిలో శత్రువులు దాడిచేసినప్పటికిని తాను మాత్రము యుద్ధము చేయబోనని అర్జునుడు నిర్ణయించుకొనినాడు. ప్రతిపక్షమువారు ఎంత సమరోత్సాహముతో నున్నారో అతడు పట్టించుకొనలేదు. శ్రీకృష్ణభగవానుని ఘనభక్తుడైన కారణమున కలిగినట్టి మృదుహృదయమే ఆ లక్షణములకు కారణమై యున్నది.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 45
yadi mām apratīkāram
aśastraṁ śastra-pāṇayaḥ
dhārtarāṣṭrā raṇe hanyus
tan me kṣema-taraṁ bhavet
Translation : Better for me if the sons of Dhṛtarāṣṭra, weapons in hand, were to kill me unarmed and unresisting on the battlefield.
Purport : It is the custom – according to kṣatriya fighting principles – that an unarmed and unwilling foe should not be attacked. Arjuna, however, decided that even if attacked by the enemy in such an awkward position, he would not fight. He did not consider how much the other party was bent upon fighting. All these symptoms are due to soft-heartedness resulting from his being a great devotee of the Lord.
🌹🌹🌹🌹🌹
Date: 17/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 36: 01వ అధ్., శ్లో 46 / Bhagavad-Gita - 36: Chap. 01, Ver. 46
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 46
సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జున: సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానస: ||
సంజయుడు పలికెను: రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్భాణములను పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను.
భాష్యము : శత్రుసైన్యము నందలి పరిస్థితిని పరిశీలించినపుడు అర్జునుడు రథమునందు నిలబడియే యుండెను. కాని పిదప అతడు శోకముచే మిగుల నొచ్చి ధనుర్బాణములను పడవైచి రథమునందు తిరిగి కూర్చుండిపోయెను. అటువంటి దయ మరియు మృదుహృదయము కలిగి శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవ యందు నిలిచిన మనుజుడే ఆత్మజ్ఞానమును స్వీకరించుటకు అర్హుడై యున్నాడు.
శ్రీమద్భగవద్గీత యందలి “కురుక్షేత్రరణరంగమున సైనికపరిశీలనము” అను ప్రథమాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 🌴
Verse 46
sañjaya uvāca
evam uktvārjunaḥ saṅkhye
rathopastha upāviśat
visṛjya sa-śaraṁ cāpaṁ
śoka-saṁvigna-mānasaḥ
Translation : Sañjaya said: Arjuna, having thus spoken on the battlefield, cast aside his bow and arrows and sat down on the chariot, his mind overwhelmed with grief.
Purport : While observing the situation of his enemy, Arjuna stood up on the chariot, but he was so afflicted with lamentation that he sat down again, setting aside his bow and arrows. Such a kind and soft-hearted person, in the devotional service of the Lord, is fit to receive self-knowledge.
Thus end the Bhaktivedanta Purports to the First Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Observing the Armies on the Battlefield of Kurukṣetra.
🌹🌹🌹🌹🌹
Date: 18/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 37: 02వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 37: Chap. 02, Ver. 01
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 1
1. సంజయ ఉవాచ
తం తతా కృపయా విష్ణు మశ్రుపూర్ణా కులేక్షణమ్ |
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదన: ||
తాత్పర్యం :
సంజయుడు పలికెను. చింతాక్రాంతుడై కనుల యందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జునిని గాంచిన మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) ఈ క్రింది వాక్యములను పలికెను.
భాష్యము : విషయపూర్ణమైన జాలి, చింత, కన్నీరు అనునవి ఆత్మజ్ఞానరాహిత్యమునకు చిహ్నములై యున్నవి. నిత్యమైన ఆత్మ కొరకు చూపెడి జాలియే వాస్తవమునకు అత్మానుభవము. ఈ శ్లోకము “మధుసూదన” అను పదమునకు విశేష ప్రాధాన్యము కలదు. మధువను దానవుని సంహరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్తవ్యనిర్వహణలో అవరోధము కలిగించిన తన అపార్థమును దానవుని సంహరించవలెనని అర్జునుడు కోరెను. జాలి నెచ్చెట చూపవలెనో ఎవ్వరును ఎరుగరు. నీటిలో మునుగువాని దుస్తులపై జాలిచూపుట మూర్ఖత్వమే కాగలదు. బాహ్యవస్త్రమును వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు(అతడు నిష్కారణముగా చింతించువాడు) అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున అట్టి నైజము అతనికి తగియుండలేదు. అయినను అజ్ఞానియైనవాని దు:ఖమును శ్రీకృష్ణభగవానుడు శమింపజేయగలడు. ఆ ప్రయోజనార్థమే గీత అతనిచే గానము చేయబడినది. భౌతికదేహము మరియు ఆత్మల విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మానుభవమును ఈ అధ్యాయము మనకు ఉపదేశించుచున్నది. పరమప్రామాణికుడైన శ్రీకృష్ణుడే దీనిని వివరించెను. ఫలితముల యెడ సంగత్వము లేకుండా కర్మనొనరించు ఆత్మతత్త్వమునందు స్థిరముగా నిలిచియున్నవానికే ఈ అనుభవము సాధ్యము కాగలదు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 1
1. sañjaya uvāca
taṁ tathā kṛpayāviṣṭam
aśru-pūrṇākulekṣaṇam
viṣīdantam idaṁ vākyam
uvāca madhusūdanaḥ
Translation : Sañjaya said: Seeing Arjuna full of compassion, his mind depressed, his eyes full of tears, Madhusūdana, Kṛṣṇa, spoke the following words.
Purport : Material compassion, lamentation and tears are all signs of ignorance of the real self. Compassion for the eternal soul is self-realization. The word “Madhusūdana” is significant in this verse. Lord Kṛṣṇa killed the demon Madhu, and now Arjuna wanted Kṛṣṇa to kill the demon of misunderstanding that had overtaken him in the discharge of his duty. No one knows where compassion should be applied. Compassion for the dress of a drowning man is senseless. A man fallen in the ocean of nescience cannot be saved simply by rescuing his outward dress – the gross material body. One who does not know this and laments for the outward dress is called a śūdra, or one who laments unnecessarily. Arjuna was a kṣatriya, and this conduct was not expected from him. Lord Kṛṣṇa, however, can dissipate the lamentation of the ignorant man, and for this purpose the Bhagavad-gītā was sung by Him. This chapter instructs us in self-realization by an analytical study of the material body and the spirit soul, as explained by the supreme authority, Lord Śrī Kṛṣṇa. This realization is possible when one works without attachment to fruitive results and is situated in the fixed conception of the real self.
🌹🌹🌹🌹🌹
Date: 19/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 38: 02వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 38: Chap. 02, Ver. 02
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 2
2. శ్రీభగవానువాచ
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున ||
తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ అర్జునా! నీకీ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినది? జీవితపు వీలువ నెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు. పైగా అపకీర్తిని కలిగించును.
భాష్యము :
శ్రీకృష్ణుడన్నను మరియు పూర్ణపురుషోత్తముడగు భగవానుడన్నను ఒక్కటియే. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత యందంతటను భగవానుని సంభోదింపబడినాడు. పరతత్త్వమునందు చరమాంశము భగవానుడే. పరతత్త్వమనునది బ్రహ్మము (సర్వత్రా వ్యాపించియుండెడి పరమపురుషుని రూపు), పరమాత్మ (దేవదేవుడైన శ్రీకృష్ణుడు) అనెడి మూడుదశలలో అనుభూతమగుచున్నది. శ్రీమద్భాగవతము (1.2.11) నందు ఇట్టి పరతత్త్వభావము ఈ క్రింది విధముగా వివరింపబడినది.
వదన్తి తత్తత్త్వవిదస్తత్వం యత్ జ్ఞానమద్వయమ్ |
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ధ్యతే ||
“పరతతత్వమనునది తత్త్వవిదులచే మూడుదశలలో అనుభూతమగుచున్నది. అవియన్నియును అభిన్నములై యున్నవి. పరతత్త్వపూ ఆ వివిధదశలే బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనుచు తెలుపబడును.”
ఈ మూడు అంశములను సూర్యుని ఉపమానముతో చక్కగా వివరింపవచ్చును. సూర్యుడు సైతము సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అనెడి మూడు అంశములను కలిగియున్నాడు. సూర్యకాంతిని మాత్రమే అధ్యయానము చేయువాడు ప్రాథమిక విద్యార్థిగా, సూర్యబింబమును అర్థము చేసికొనినవాడు ఉన్నత విద్యార్థి. కాని సూర్య మండలమునందు ప్రవేశింపగలిగినవాడు అత్యున్నతుడు. కేవలము సూర్యకాంతిని ( దాని విశ్వవ్యాపకతను మరియు నిరాకారమైనట్టి దాని తేజము) అధ్యయనము చేయుచు సంతృప్తి చెందెడి సాధారణ విధ్యార్తులతో పరతత్త్వపు బ్రహ్మానుభవమును బడసినవారిని పోల్చవచ్చును. మరింత పురోగమించినచో విద్యార్థి సూర్యబింబము నెరుగగలడు. అట్టి సూర్యబింబముతో పరతత్త్వపు పరమాత్మజ్ఞానము పోల్చబడినది. ఇక సూర్యమండలము లోనికే ప్రవేశింపగలిగినవానితో పరతత్త్వపు రూపలక్షణములను అనుభూతమొనర్చుకొనినవారిని పోల్చవచ్చును. అనగా పరతత్త్వా ధ్యయనము నందు నియుక్తులైన సర్వులు ఒకే విషయమునకు సంబంధించిన వారైనను భక్తులు(పరతత్త్వపు భగవానుడనెడి లక్షణమును అనుభూత మొనర్చుకొనిన ఆధ్యాత్మిక వాదులు) ఉత్తమోత్తమములై యున్నారు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము నందలి కర్మలు అభిన్నములైనను వానిని అధ్యయనము చేయు విద్యార్థులు మాత్రము ఒకే తరగతికి చెందినవారు కారు.
“భగవానుడు” అను సంస్కృతపదము గొప్ప ప్రామాణికుడైన పరాశరమునిచే (వ్యాసదేవుని తండ్రి) చక్కగా వివరింప బడినది. సంపద, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యములను సంపూర్ణముగా, సమగ్రస్థాయిలో కలిగియున్నట్టి వాడే భగవానుడని పిలువబడును. ధనవంతులు, శక్తిమంతులు, అందమైనవారు, యశోవంతులు, జ్ఞానవంతులు, వైరాగ్యవంతులు పలువురున్నను తామే సర్వసంపదలను, శక్తిని కలిగియున్నామని ఎవ్వరును చెప్పుకొనలేరు. పపూర్ణపురుషోత్తముడగు భగవానుడైనందున శ్రీకృష్ణుడు మాత్రమె ఆ విధముగా పలుకుటకు అర్హుడై యున్నాడు. ఏ జివుడును శ్రీకృష్ణుడు కలిగియున్నంతగా సంపూర్ణ ఐశ్వర్యములను కలిగియుండలేడు. బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు సైతము కృష్ణునితో సమముగా విభూతులను కలిగిలేరు. కనుకనే బ్రహ్మసంహిత యందు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా నిర్ధారించియున్నాడు. అతనికి సములు గాని, అధికులు గాని లేరు. అతడే ఆదిదేవుడు. సర్వకారణములకు కారణుడు. గోవిందునిగా తెలియబడు భగవానుడు.
ఈశ్వర: పరం: కృష్ణ: సచ్చిదానందవిగ్రహ: |
అనాదిరాదిర్గోవింద: సర్వకారణకారణమ్ ||
“భగవానుని లక్షణములను పలువురు కలిగియుండవచ్చును. కాని తనను అతిశయించువాడు వేరోక్కడు లేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడై యున్నాడు. అతడు సచ్చిదానందవిగ్రహుడు. ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణమై యున్నాడు.” (బ్రహ్మసంహిత 5.1).
శ్రీమద్భాగవతము నందు పరమపురుషుడు ధరించిన అవతారముల జాబితా ఒసగబడినది. కాని శ్రీకృష్ణుడు మాత్రము ఆదియగు భగవానునిగా వర్ణింపబడినాడు. అతని నుండియే అనేకానేక అవతారములు మరియు రూపములు విస్తరించును.
ఏతే చాంశకలా: పుంస: కృష్ణస్తు భగవాన్ స్వయమ్ |
ఇంద్రారివ్యాకులం లోకం మృడయన్తి యుగే యుగే ||
“ఇచ్చట తెలుపబడిన ఆదిదేవుని అవతారములన్నియును అతని అంశావతారములు లేదా కళావతారములై యున్నవి. కాని శ్రీకృష్ణుడు మాత్రము స్వయము భగవానుడై యున్నాడు.” (భాగవతము 1.3.2.8).
కావుననే శ్రీకృష్ణుడు ఆదియైన పూర్ణపురుషోత్తముడును మరియు పరతత్త్వమును (పరమాత్మునకు మరియు నిరాకారబ్రహ్మమునకు మూలము) అయియున్నాడు.
దేవదేవుని సన్నిధి యందు బంధువుల కొరకు అర్జునుడు దుఃఖించుట నిక్కముగా అనుచితమై యున్నది. కనుకనే శ్రీకృష్ణుడు “కుత:” (ఎచ్చట నుండి) యను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తము చేసెను. అట్టి కల్మషము ఆర్యులుగా తెలియబడు నాగరిక మనుజుల నుండు ఎన్నడును ఊహింపలేనట్టిది. జీవితపు విలువ నెరిగి ఆధ్యాత్మికానుభవముపై ఆధారపడిన నాగరికతనే కలిగియుండు మనుజులకు “ఆర్యులు” అనెడి పదము సంబంధించినదై యున్నది. భౌతికభావననే కలిగినవారు పరతత్త్వపు (విష్ణువు లేదా భగవానుడు) అనుభవమే జీవితలక్ష్యమణి ఎరుగక భౌతికజగత్తు యొక్క బాహ్యలక్షణములచే ఆకర్చితులగుదురు. తత్కారణమున ముక్తియననేమో వారెరుగరు. భౌతికబంధము నుండి ముక్తిని గూర్చిన జ్ఞానము లేనివారు అనార్యులని పిలువబడుదురురు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికిని యుద్ధము చేయు నిరాకరించుట ద్వారా విధ్యుక్తధర్మముల నుండి తొలగుచున్నాడు. అట్టి పిరికికార్యము అనార్యులకు ఉచితమైనదిగా వర్ణింపబడినది. విధ్యుక్తధర్మము నుండి అట్టి అతిక్రమణ మనుజునికి ఆధ్యాత్మిక పురోగతి యందు సహాయమును గాని, ఈ ప్రపంచమున యశోవంతుడగుటకు అవకాశము ఫగాని ఒసగదు. కనుకనే బంధువుల యెడ అర్జునుని నామమాత్ర కరుణను శ్రీకృష్ణభగవానుడు ఆమోదింపలేదు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 2
2. śrī-bhagavān uvāca kutas tvā kaśmalam idaṁ viṣame samupasthitam anārya-juṣṭam asvargyam akīrti-karam arjuna
Translation : The Supreme Personality of Godhead said: My dear Arjuna, how have these impurities come upon you? They are not at all befitting a man who knows the value of life. They lead not to higher planets but to infamy.
Purport : Kṛṣṇa and the Supreme Personality of Godhead are identical. Therefore Lord Kṛṣṇa is referred to as Bhagavān throughout the Gītā. Bhagavān is the ultimate in the Absolute Truth. The Absolute Truth is realized in three phases of understanding, namely Brahman, or the impersonal all-pervasive spirit; Paramātmā, or the localized aspect of the Supreme within the heart of all living entities; and Bhagavān, or the Supreme Personality of Godhead, Lord Kṛṣṇa. In the Śrīmad-Bhāgavatam (1.2.11) this conception of the Absolute Truth is explained thus:
vadanti tat tattva-vidas
tattvaṁ yaj jñānam advayam
brahmeti paramātmeti
bhagavān iti śabdyate
“The Absolute Truth is realized in three phases of understanding by the knower of the Absolute Truth, and all of them are identical. Such phases of the Absolute Truth are expressed as Brahman, Paramātmā and Bhagavān.”
These three divine aspects can be explained by the example of the sun, which also has three different aspects, namely the sunshine, the sun’s surface and the sun planet itself. One who studies the sunshine only is the preliminary student. One who understands the sun’s surface is further advanced. And one who can enter into the sun planet is the highest. Ordinary students who are satisfied by simply understanding the sunshine – its universal pervasiveness and the glaring effulgence of its impersonal nature – may be compared to those who can realize only the Brahman feature of the Absolute Truth. The student who has advanced still further can know the sun disc, which is compared to knowledge of the Paramātmā feature of the Absolute Truth. And the student who can enter into the heart of the sun planet is compared to those who realize the personal features of the Supreme Absolute Truth. Therefore, the bhaktas, or the transcendentalists who have realized the Bhagavān feature of the Absolute Truth, are the topmost transcendentalists, although all students who are engaged in the study of the Absolute Truth are engaged in the same subject matter. The sunshine, the sun disc and the inner affairs of the sun planet cannot be separated from one another, and yet the students of the three different phases are not in the same category.
The Sanskrit word bhagavān is explained by the great authority Parāśara Muni, the father of Vyāsadeva. The Supreme Personality who possesses all riches, all strength, all fame, all beauty, all knowledge and all renunciation is called Bhagavān. There are many persons who are very rich, very powerful, very beautiful, very famous, very learned and very much detached, but no one can claim that he possesses all riches, all strength, etc., entirely. Only Kṛṣṇa can claim this because He is the Supreme Personality of Godhead. No living entity, including Brahmā, Lord Śiva or Nārāyaṇa, can possess opulences as fully as Kṛṣṇa. Therefore it is concluded in the Brahma-saṁhitā by Lord Brahmā himself that Lord Kṛṣṇa is the Supreme Personality of Godhead. No one is equal to or above Him. He is the primeval Lord, or Bhagavān, known as Govinda, and He is the supreme cause of all causes:
īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
sac-cid-ānanda-vigrahaḥ
anādir ādir govindaḥ
sarva-kāraṇa-kāraṇam
“There are many personalities possessing the qualities of Bhagavān, but Kṛṣṇa is the supreme because none can excel Him. He is the Supreme Person, and His body is eternal, full of knowledge and bliss. He is the primeval Lord Govinda and the cause of all causes.” (Brahma-saṁhitā 5.1)
In the Bhāgavatam also there is a list of many incarnations of the Supreme Personality of Godhead, but Kṛṣṇa is described as the original Personality of Godhead, from whom many, many incarnations and Personalities of Godhead expand:
ete cāṁśa-kalāḥ puṁsaḥ
kṛṣṇas tu bhagavān svayam
indrāri-vyākulaṁ lokaṁ
mṛḍayanti yuge yuge
“All the lists of the incarnations of Godhead submitted herewith are either plenary expansions or parts of the plenary expansions of the Supreme Godhead, but Kṛṣṇa is the Supreme Personality of Godhead Himself.” (Bhāg. 1.3.28)
Therefore, Kṛṣṇa is the original Supreme Personality of Godhead, the Absolute Truth, the source of both the Supersoul and the impersonal Brahman.
In the presence of the Supreme Personality of Godhead, Arjuna’s lamentation for his kinsmen is certainly unbecoming, and therefore Kṛṣṇa expressed His surprise with the word kutaḥ, “wherefrom.” Such impurities were never expected from a person belonging to the civilized class of men known as Āryans. The word āryan is applicable to persons who know the value of life and have a civilization based on spiritual realization. Persons who are led by the material conception of life do not know that the aim of life is realization of the Absolute Truth, Viṣṇu, or Bhagavān, and they are captivated by the external features of the material world, and therefore they do not know what liberation is. Persons who have no knowledge of liberation from material bondage are called non-Āryans. Although Arjuna was a kṣatriya,he was deviating from his prescribed duties by declining to fight. This act of cowardice is described as befitting the non-Āryans. Such deviation from duty does not help one in the progress of spiritual life, nor does it even give one the opportunity to become famous in this world. Lord Kṛṣṇa did not approve of the so-called compassion of Arjuna for his kinsmen
🌹🌹🌹🌹🌹
Date: 20/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 39: 02వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 39: Chap. 02, Ver. 03
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 3
3. క్లైబ్యం మా స్మ గమ: పార్థ నైతత్త్వయ్యుప పద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప ||
తాత్పర్యం :
ఓ పృథాకుమారా! పతనకారక నపుంసకత్వమునకు లొంగకము. ఇది నీకు తగదు. ఓ పరంతపా! ఇట్టి హృదయ దుర్బలతను విడినాడి వెంటనే లెమ్ము.
భాష్యము :
ఇచ్చట అర్జుండు పృథ తనయునిగా సంభోదింప బడినాడు. పృథ శ్రీకృష్ణుని తండ్రియైన వసుదేవుని సోదరి. తత్కారణమున అర్జునుడు శ్రీకృష్ణునితో రక్తసంబంధమును కలిగియున్నాడు. క్షత్రియుని తనయుడు యుద్ధము చేయ నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడు మాత్రమే. అలాగుననే బ్రహ్మణ తనయుడు పాపవర్తనమును కలిగియున్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడే. అట్టి క్షతియులు, బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కాజాలరు. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుని సన్నిహిత స్నేహితుడు. అంతియేగాక శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథము నందుండి అతనికి నిర్దేశము కూర్చుచున్నాడు. ఇన్ని యోగ్యతలను కలిగినప్పటికిని అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తికర కార్యము చేయువాడే కాగలడు. అర్జునుని యందు గోచరించు అట్టి నైజము అతనికి తగినట్లులేదని శ్రీకృష్ణుడు పలికినాడు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు మరియు బంధువుల యెడ ఉదార స్వభావముతో తానూ యుద్దమును త్యజింతునని అర్జునుడు వాదింపవచ్చును. కాని అట్టి ఉదారత కేవలము హృదయదుర్బలత మాత్రమేనని శ్రీకృష్ణుడు భావించెను. అట్టి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడు ఆమోదింపడు. కనకనే అటువంటి ఉదార స్వభావమును లేదా నామమాత్ర అహింసను అర్జునుని వంటివారు శ్రీకృష్ణుని ప్రత్యక్ష మార్గదర్శకత్వమున శీఘ్రమే త్యజింప వలసియున్నది.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 3
3. klaibyaṁ mā sma gamaḥ pārtha naitat tvayy upapadyate
kṣudraṁ hṛdaya-daurbalyaṁ
tyaktvottiṣṭha paran-tapa
Translation : O son of Pṛthā, do not yield to this degrading impotence. It does not become you. Give up such petty weakness of heart and arise, O chastiser of the enemy.
Purport :
Arjuna was addressed as the son of Pṛthā, who happened to be the sister of Kṛṣṇa’s father Vasudeva. Therefore Arjuna had a blood relationship with Kṛṣṇa. If the son of a kṣatriya declines to fight, he is a kṣatriya in name only, and if the son of a brāhmaṇa acts impiously, he is a brāhmaṇa in name only. Such kṣatriyas and brāhmaṇas are unworthy sons of their fathers; therefore, Kṛṣṇa did not want Arjuna to become an unworthy son of a kṣatriya. Arjuna was the most intimate friend of Kṛṣṇa, and Kṛṣṇa was directly guiding him on the chariot; but in spite of all these credits, if Arjuna abandoned the battle he would be committing an infamous act. Therefore Kṛṣṇa said that such an attitude in Arjuna did not fit his personality. Arjuna might argue that he would give up the battle on the grounds of his magnanimous attitude for the most respectable Bhīṣma and his relatives, but Kṛṣṇa considered that sort of magnanimity mere weakness of heart. Such false magnanimity was not approved by any authority. Therefore, such magnanimity or so-called nonviolence should be given up by persons like Arjuna under the direct guidance of Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
Date: 21/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 40: 02వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 40: Chap. 02, Ver. 04
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 4
4. అర్జున ఉవాచ
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభి: ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||
తాత్పర్యం :
అర్జునుడు పలికెను: ఓ శత్రుసంహారా! ఓ మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణుల వంటివారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను?
భాష్యము :
పితామహుడైన భీష్ముడు, ఆచార్యుడైన ద్రోణాచార్యుల వంటి గౌరవనీయులగు పెద్ద సదా పూజింప దగినవారు. అటువంటి వారు దాడి చేసినను వారి యెడ ఎదురు దాడి చేయరాదు. పెద్దలతో వాగ్యుద్ధమునకైనను దిగకుండుట సాధారణ కట్టుబాటు. కొన్నిమార్లు వారు కటువుగా వర్తించినను వారి యెడ కటువుగా వర్తించరాదు. అట్టి యెడ వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యము కాగలదు? కృష్ణుడు ఆ విధముగా ఎన్నడైనా తాతయైన ఉగ్రసేనుని గాని, గురువైన సాందీపమునిని గాని ఎదుర్కొనెనా? ఈ విధమైన కొన్ని వాదములను అర్జునుడు శ్రీకృష్ణునకు తెలియ జేయుచున్నాడు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 4
4. arjuna uvāca kathaṁ bhīṣmam ahaṁ saṅkhye droṇaṁ ca madhusūdana iṣubhiḥ pratiyotsyāmi pūjārhāv ari-sūdana
Translation : Arjuna said: O killer of enemies, O killer of Madhu, how can I counterattack with arrows in battle men like Bhīṣma and Droṇa, who are worthy of my worship?
Purport :
Respectable superiors like Bhīṣma the grandfather and Droṇācārya the teacher are always worshipable. Even if they attack, they should not be counterattacked. It is general etiquette that superiors are not to be offered even a verbal fight. Even if they are sometimes harsh in behavior, they should not be harshly treated. Then, how is it possible for Arjuna to counterattack them? Would Kṛṣṇa ever attack His own grandfather, Ugrasena, or His teacher, Sāndīpani Muni? These were some of the arguments offered by Arjuna to Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
Date: 22/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 41: 02వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 41: Chap. 02, Ver. 05
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 5
5. గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుఇజ్నీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ||
తాత్పర్యం :
గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికి వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును.
భాష్యము :
గురువు హేయమైన కార్యమును చేయుచు తన విచక్షణ కోల్పోయినపుడు త్యజింపదగినవాడని శాస్త్రనియమములు తెలుపుచున్నవి. దుర్యోధనుడు ఒసగిన ఆర్ధిక సహాయము కారణముగా భీష్ముడు లిరువురును అతని పక్షమును వహించియుండిరి. కాని కేవలము ఆర్ధిక కారణముచే ఆతి స్థానమును స్వీకరించుట వారికి తగినట్లుగా లేదు. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినప్పటికిని వారు పెద్దలుగనే నిలిచియుందురని అర్జునుడు భావించుచున్నాడు. కనుకనే వారిని సంహరించిన పిదప భౌతికలాభముల ననుభవించుట యనగా రక్తపంకిలమైన వాటిని అనుభవించుట యనేయే భావము.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 5
5. gurūn ahatvā hi mahānubhāvān
śreyo bhoktuṁ bhaikṣyam apīha loke
hatvārtha-kāmāṁs tu gurūn ihaiva
bhuñjīya bhogān rudhira-pradigdhān
Translation : It would be better to live in this world by begging than to live at the cost of the lives of great souls who are my teachers. Even though desiring worldly gain, they are superiors. If they are killed, everything we enjoy will be tainted with blood.
Purport :
According to scriptural codes, a teacher who engages in an abominable action and has lost his sense of discrimination is fit to be abandoned. Bhīṣma and Droṇa were obliged to take the side of Duryodhana because of his financial assistance, although they should not have accepted such a position simply on financial considerations. Under the circumstances, they have lost the respectability of teachers. But Arjuna thinks that nevertheless they remain his superiors, and therefore to enjoy material profits after killing them would mean to enjoy spoils tainted with blood.
🌹🌹🌹🌹🌹
Date: 23/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 42: 02వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 42: Chap. 02, Ver. 06
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 6
6. న చైతద్ విద్మ: కతరన్నో గరీయో యద్ వా జయేమ యది వా నో జయేయు:
యానేవ హత్వాన జిజీవిషామః తే వస్థితా: ప్రముఖే ధార్తరాష్ట్రా: ||
తాత్పర్యం :
వారిని జయించుట ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేమిక జీవించియుండుట వ్యర్థము. అయినప్పటికిని వారిపుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు.
భాష్యము :
యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మమైనను అనవసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలెనా లేక యుద్దమును త్యజించి భిక్షపై జీవించవలెనా అర్జునుడు తెలియలేకపోయెను. శత్రువును జయింపని యెడ భిక్షాటనయే అతనికి జీవనాధారము కాగలదు. అలాగని విజయము నిశ్చయముగా లభించునని కుడా లేదు. ఏలయన యుద్ధమునందు ఇరుపక్షములలో ఎవరైనను జయమును సాధింపవచ్చును. ఒకవేళ విజయము వారి కొరకై వేచియున్నను (మరియు వారి యుద్ధకారణము న్యాయసమ్మతమైనను) యుద్ధమందు ధృతరాష్ట్రుని తనయులు మరణించినచో వారి అభావమున జీవించుట కష్టతరము కాగలదు. అట్టి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయము కాగలదు. అర్జునిని ఈ భావములన్నియును అతడు గొప్ప భగవద్భక్తుడు అనియే గాక, అత్యున్నత జ్ఞానపూర్ణుదనియు మరియు మనో ఇంద్రియములపై పూర్ణ నిగ్రహము కలవాదనియు స్పష్టముగా నిరూపించుచున్నవి. రాజవంశములో జన్మించినను భిక్షమెత్తి జీవించుట యనెడి కోరిక అతని వైరాగ్యమునకు మరొక చిహ్నమై యున్నది. ఈ గుణములు మరియు శ్రీకృష్ణుని(ఆధ్యాత్మికగురువు) ఉపదేశాములపై అతని శ్రద్ధ యనునవి అతడు నిక్కముగా ధర్మాత్ముడని సూచించుచున్నవి. కనుకనే అతడు ముక్తికి అర్హుడై యున్నాడని నిర్దారింపబడినది. ఇంద్రియములు నిగ్రహింపబడనిదే జ్ఞానస్థాయికి ఉద్దరింపబడు అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తికి అవకాశము లేదు. లౌకిక సంబంధములో అపరిమిత గుణములతో పాటుగా అర్జునుడు ఈ గుణములందును యోగ్యుడైయున్నాడు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 6
6. na caitad vidmaḥ kataran no garīyo yad vā jayema yadi vā no jayeyuḥ yān eva hatvā na jijīviṣāmas te ’vasthitāḥ pramukhe dhārtarāṣṭrāḥ
Translation : Nor do we know which is better – conquering them or being conquered by them. If we killed the sons of Dhṛtarāṣṭra, we should not care to live. Yet they are now standing before us on the battlefield.
Purport :
Arjuna did not know whether he should fight and risk unnecessary violence, although fighting is the duty of the kṣatriyas, or whether he should refrain and live by begging. If he did not conquer the enemy, begging would be his only means of subsistence. Nor was there certainty of victory, because either side might emerge victorious. Even if victory awaited them (and their cause was justified), still, if the sons of Dhṛtarāṣṭra died in battle, it would be very difficult to live in their absence. Under the circumstances, that would be another kind of defeat for them. All these considerations by Arjuna definitely proved that not only was he a great devotee of the Lord but he was also highly enlightened and had complete control over his mind and senses. His desire to live by begging, although he was born in the royal household, is another sign of detachment. He was truly virtuous, as these qualities, combined with his faith in the words of instruction of Śrī Kṛṣṇa (his spiritual master), indicate. It is concluded that Arjuna was quite fit for liberation. Unless the senses are controlled, there is no chance of elevation to the platform of knowledge, and without knowledge and devotion there is no chance of liberation. Arjuna was competent in all these attributes, over and above his enormous attributes in his material relationships.
🌹🌹🌹🌹🌹
Date: 24/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 43: 02వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 43: Chap. 02, Ver. 07
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 7
7. కార్పణ్య దోషోపహతస్వభావ: పృచ్చామి త్వాం ధర్మసమ్మూడచేతా: |
యచ్చ్రేయ: స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే(హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||
తాత్పర్యం :
కార్పణ్యదోష కారణమున నేనిపుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయియితిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిపుడు నీకు శిష్యుడనుశిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము.
భాష్యము :
ప్రకృతి నియమము ప్రకారము లౌకికకర్మలే ప్రతియొక్కరి కలతకు కారణములై యున్నవి. అడుగడుగునా కలతలే కలవు కనుక జీవిత ప్రయోజనము నేరవేర్చుటలో సరియైన నిర్దేశము నొసగు ఆధ్యాత్మికగురువుని చేరుట ప్రతియెక్కరికి ఉత్తమము. కోరకనే కలుగునట్టి జీవితపు కలతల నుండి ముక్తిని పొందుటకై ఆద్యాత్మిక గురువును చేరుమని వేదశాస్త్రములు మనకు ఉపదేశించుచున్నవి. అవి ఎవ్వరి ప్రమేయము లేకుండగనే రగుల్కొనెడు దావాలనము వంటివి. అదేవిధముగా మనము కోరకున్నప్పటికిని జీవితపు కలతలు అప్రయత్నముగా కలుగుచుండుట ఈ లోకపు పరిస్థితియై యున్నది. అగ్నిప్రమాదమును ఎవ్వరును కోరరు. అయినను అది సంభవించి మనము కలతకు గురియగుచుందుము. కనుకనే జీవితపు కలతలను పరిష్కరించుతాకు మరియు పరిష్కారపు విజ్ఞానమును అవగతము చేసికొనుటకు ప్రామాణిక పరంపరలో నున్న ఆధ్యాత్మిక గురువు దరిచేరుమని వేదంవాజ్మయము ఉపదేశించుచున్నది. ఆధ్యాత్మికగురువును కలిగియున్న వ్యక్తి సర్వమును తెలియగలుగును.కనుక మనుజుడు లౌకిక కలతల యందే ఉండిపోక గురువును తప్పక చేరవలెను. ఈ శ్లోకపు సారాంశమిదియే.
లౌకికకలతల యందున్న వాడెవడు? జీవితపు సమస్యలను అవగాహన చేసికొననివాడే అట్టి మనుజుడు. బృహదారన్యకోపనిషత్తు (3.8.10) కలతచెందిన మానవుని ఈ విధముగా వర్ణించుచున్నది. “ యో వా ఏతదక్షరం గార్గ్యవిదిత్వా స్మా ల్లోకాత్ ప్రైతి స కృపణ:” మానవునిగా జీవితసమస్యలను పరిష్కరించక ఆత్మానుభవ విజ్ఞానమును అవగతము చేసికొనక మార్జాల శునకము వలె దేహమును త్యజించువాడు కృపణుడు. మానవజన్మము జీవునికి అత్యంత విలువైనది. దానినతడు జీవితసమస్యలను పరిష్కరించుటకు ఉపయోగించు కొనవచ్చును. కనుకనే ఈ అవకాశమును సద్వినియోగపరచుకొననివాడు లోభి యనబడును. అట్టి క్పపణునికి విరుద్ధస్వభావము గలవాడు బ్రాహ్మణుడు. సమస్త జీవనసమస్యల పరిష్కారమునకు మానవజన్మను ఉపయోగించుకొనగల బుద్ధిమంతుడు. “య ఏతదక్షరం గార్గి విదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ:”
కుటుంబము, సంఘము, దేశాదుల యెడ అతి అనురాగముతో కృపణులు భౌతికభావన యందు కాలమును వృథా చేయుదురు. సాధారణముగా మనుజుడు భార్య, సంతానము, బంధువులనెడి శారీరిక సంబంధమైన కుటుంబజీవనమున అనురక్తుడై యుండును. కృపణుడైనవాడు తాను కుటుంబసభ్యులను మరణము నుండి కాపాడగలుగుదుననియు లేదా తన కుటుంబము (సంఘము) మృత్యువు నుండి తనను రక్షించుననియు భావించు చుండును . అటువంటి సంసారిక అనురాగము జంతువులందును గోచరించును. అవి కుడా తమ సంతానము యొక్క రక్షణభారము స్వీకరించుచున్నవి. అర్జునుడు తెలివిగల వాడైనందున కుటుంబసభ్యుల యెడ అనురాగము మరియు వారిని మృత్యువు నుండి రక్షించవలెనను కోరికలే తన కలతకు కారణములని తెలియగలిగెను. స్వీయధర్మమైన యుద్ధము తన కొరకై ఎదురు చూచుచున్నను కృపణత్వ కారణముగా తానూ తన విధులను నిర్వర్తింపలేక పోవుచున్నట్లు అతడు అవగతము చేసికొనెను. కనుకనే అతడు పరమ ఆధ్యాత్మికగురువైన శ్రీకృష్ణుని ఒక నిశ్చయమైన పరిష్కారమును చూపుమని అడుగుచున్నాడు. శిష్యునిగా అతడు శ్రీకృష్ణుని శరణొందినవాడు. స్నేహపూర్వక సంభాషణలు ఆపవలెనని అతడు వాంచించెను. గురుశిష్యుల నడుమ సంభాషణము గంభీరముగా నుండును. కావున ప్రామాణికుడైన గురువు ఎదుట అర్జునుడు గాంభీర్యముతో పలుకగోరెను. కనుకనే భగవద్గీత విజ్ఞానమునకు శ్రీకృష్ణుడు ఆదిగురువు కాగా, దానిని అవగతము చేసికొనిన ప్రథమశిష్యుడు అర్జునుడు అయ్యెను. అర్జునుడు గీతను అవగతము చేసికొనిన విధానము గీత యందే తెలుపబడినది. అయినను మూడులైన కొందరు గీతావ్యాఖ్యాతలు రూపముతో నున్న శ్రీకృష్ణునకు శరణము నొందవలసిన అవసరము లేదనియు, శ్రీకృష్ణుని యందు అంతర్యామిగా నున్న అజుడైనవానిని శరణువేడవలెననియు వ్యాఖ్యానించుచుందురు. వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుని అంతర్భాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఇట్టి అవగాహనము లేకుండా భగవద్గీతను అవగతము చేసికొన యత్నించువాడు నిక్కముగా పరమమూఢుడు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 7
7. kārpaṇya-doṣopahata-svabhāvaḥ pṛcchāmi tvāṁ dharma-sammūḍha-cetāḥ yac chreyaḥ syān niścitaṁ brūhi tan me śiṣyas te ’haṁ śādhi māṁ tvāṁ prapannam
Translation : Now I am confused about my duty and have lost all composure because of miserly weakness. In this condition I am asking You to tell me for certain what is best for me. Now I am Your disciple, and a soul surrendered unto You. Please instruct me.
Purport :
By nature’s own way the complete system of material activities is a source of perplexity for everyone. In every step there is perplexity, and therefore it behooves one to approach a bona fide spiritual master who can give one proper guidance for executing the purpose of life. All Vedic literatures advise us to approach a bona fide spiritual master to get free from the perplexities of life, which happen without our desire. They are like a forest fire that somehow blazes without being set by anyone. Similarly, the world situation is such that perplexities of life automatically appear, without our wanting such confusion. No one wants fire, and yet it takes place, and we become perplexed. The Vedic wisdom therefore advises that in order to solve the perplexities of life and to understand the science of the solution, one must approach a spiritual master who is in the disciplic succession. A person with a bona fide spiritual master is supposed to know everything. One should not, therefore, remain in material perplexities but should approach a spiritual master. This is the purport of this verse.
Who is the man in material perplexities? It is he who does not understand the problems of life. In the Bṛhad-āraṇyaka Upaniṣad (3.8.10) the perplexed man is described as follows: yo vā etad akṣaraṁ gārgy aviditvāsmāḻ lokāt praiti sa kṛpaṇaḥ. “He is a miserly man who does not solve the problems of life as a human and who thus quits this world like the cats and dogs, without understanding the science of self-realization.” This human form of life is a most valuable asset for the living entity, who can utilize it for solving the problems of life; therefore, one who does not utilize this opportunity properly is a miser. On the other hand, there is the brāhmaṇa, or he who is intelligent enough to utilize this body to solve all the problems of life. Ya etad akṣaraṁ gārgi viditvāsmāl lokāt praiti sa brāhmaṇaḥ.
The kṛpaṇas, or miserly persons, waste their time in being overly affectionate for family, society, country, etc., in the material conception of life. One is often attached to family life, namely to wife, children and other members, on the basis of “skin disease.” The kṛpaṇa thinks that he is able to protect his family members from death; or the kṛpaṇa thinks that his family or society can save him from the verge of death. Such family attachment can be found even in the lower animals, who take care of children also. Being intelligent, Arjuna could understand that his affection for family members and his wish to protect them from death were the causes of his perplexities. Although he could understand that his duty to fight was awaiting him, still, on account of miserly weakness, he could not discharge the duties. He is therefore asking Lord Kṛṣṇa, the supreme spiritual master, to make a definite solution. He offers himself to Kṛṣṇa as a disciple. He wants to stop friendly talks. Talks between the master and the disciple are serious, and now Arjuna wants to talk very seriously before the recognized spiritual master. Kṛṣṇa is therefore the original spiritual master of the science of Bhagavad-gītā, and Arjuna is the first disciple for understanding the Gītā. How Arjuna understands the Bhagavad-gītā is stated in the Gītā itself. And yet foolish mundane scholars explain that one need not submit to Kṛṣṇa as a person, but to “the unborn within Kṛṣṇa.” There is no difference between Kṛṣṇa’s within and without. And one who has no sense of this understanding is the greatest fool in trying to understand Bhagavad-gītā.
🌹🌹🌹🌹🌹
Date: 25/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 44: 02వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 44: Chap. 02, Ver. 08
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 8
8. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యాచ్చోకముచ్చోషణ మిన్ద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||
తాత్పర్యం :
ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకనును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యమువలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను.
భాష్యము :
ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకనును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యమువలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించు కొనజాలను.
ధర్మనియమములు, నీతి నియమముల జ్ఞానముపై ఆధారపడిన పలువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నాను తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణభగవానుని సహాయము లేకుండా పరిష్కరించుకొనజాలనట్లు విదితమగుచున్నది. స్వీయమనుగుడనే శోషింపజేయునట్టి సమస్యలను నివారించుటలో తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు అవగతము చేసికొనగలిగెను. శ్రీకృష్ణభగవానుని వంటి గురువు సహాయము లేకుండా అట్టి కలతలకు పరిష్కారమును గూర్చుట అతనికి అసాధ్యము. పుస్తకజ్ఞానము, పాండిత్యము, ఉన్నతపదవుల వంటివి జీవితసమస్యలకు పరిష్కారము నొసగుటలో వ్యర్తములై యున్నవి. శ్రీకృష్ణుని వంటి గురువొక్కడే సమస్యా పరిష్కారమునకు సహాయము చేయగలడు. కనుక సారంశమేమనగా నూటికినూరుపాళ్ళు కృష్ణభక్తిరసభావితుడైన గురువే ప్రామాణికుడైన గురువు. ఏలయన అట్టివాడే జీవితసమస్యలను పరిష్కరింపగలడు. కృష్ణసంబంధ విజ్ఞానముణ నిష్ణాతుడైనవాడు నిజమైన ఆధ్యాత్మికగురువని శ్రీచైతన్యమాహాప్రభువు తెలిపిరి. దానికి అతని సాంఘికస్థాయి ఏ విధముగను అవరోధము కాజాలదు.
కిబా విప్ర, కిబా న్యాసి, శూద్ర కేనే నయ |
యై కృష్ణతత్త్వవేత్తా, సేఇ గురు హయ ||
“కృష్ణసంబంధ విజ్ఞానమునందు మనుజుడు నిష్ణాతుడైనచో అతడు విప్రుడైనను (వేదజ్ఞానపండితుడు) లేదా హీనకులజుడైనను లేదా సన్న్యాసియైనను సరియే, అతడే పూర్ణుడైన ప్రామాణిక ఆధ్యాత్మికగురువై యున్నాడు” (చైతన్య చరితామృత ,మధ్య 8.128). అనగా కృష్ణసంబంధ విజ్ఞానమున నిష్ణాతుడు కానిదే ఎవ్వరును ప్రామాణిక ఆధ్యాత్మికగురువు కాజాలరు. ఇదే విషయము పద్మపురాణము నందును ఇట్లు తెలుపబడినది.
షట్కర్మ నిపునో విప్రో మంత్రతంత్ర విశారద: | అవైష్ణవో గురుర్ న స్యాద్ , వైష్ణవ: శ్వపచో గురు: ||
“వేదజ్ఞానమునందు పండితుడైన బ్రహ్మణుడు సైతము కృష్ణసంబంధ విజ్ఞానమున నిష్ణాతుడు కాకుండా (వైష్ణవుడు కాకుండా) ఆధ్యాత్మిక గురువగుటకు అర్హుడు కాబోడు. కాని శూద్రవంశమున జన్మించినప్పటికి మనుజుడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ భక్తి రస భావితుడైనచో ఆధ్యాత్మికగురువు కాగలడు.”
జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనెడి భౌతిక అస్తిత్వపు క్లేశములు ధనమును కూడాబెట్టుట ద్వారా లేదా ఆర్ధికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. ప్రపంచమందు పలుచోట్ల సమస్త సౌఖ్యములను కలిగిన దేశములు కలవు. అవి బహుసంపత్తిని కలిగియున్నను మరియు ఆర్ధికాభివృద్ధిని బడసియున్నను అచ్చట భౌతికక్లేశములు ఇంకను కలవు. వారు వివిధరీతులలో శాంతి కొరకై యత్నించుచున్నారు. వారు శ్రీకృష్ణుని (భగవద్గీత మరియు శ్రీమద్భాగవతము) దరిచేరినపుడే నిజమైన ఆనందము పొందగలరు. అట్టి గ్రంథములు కృష్ణసంబంధ విజ్ఞానమును కూడియున్నవి. కృష్ణభక్తిరసభావితుడగు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతము చేసికొనినపుడే అట్టి ఆనందము ప్రాప్తించగలదు.
ఆర్ధికాభివృద్ధి మరియు విషయసౌఖ్యములు అనునవి మనుజుని సంసారిక, సాంఘిక, జాతీయ (లేదా అంతర్జాతీయ) శోకమును నివారింపగలిగినచో, ధరత్రిపై శత్రురహిత రాజ్యము గాని లేదా స్వర్గమునందలి దేవతలకున్నటువంటి ఆధిపత్యము గాని తన శోకమును పోగోట్టజాలదని అర్జునుడు పలికియుండెడివాడు కాడు. కనుకనే అతడు కృష్ణభక్తిరసభావన యందు శరణాగతిని పొందెను. శాంతి, సామరస్యములకు అదియే చక్కని మార్గము. ఆర్ధికాభివృద్ధి లేదా ప్రపంచాధిపత్యమనునది ప్రకృతి ప్రళయముచే ఏ క్షణమైనను నశింపగలదు. ఉన్నతలోకములకు చేరు యత్నము (నేటి కాలమున మనుజులు చంద్రలోకమును చేరగోరినట్లు) సైతము ఒక్క దెబ్బతో నశించిపోగలదు. భగవద్గీత ఈ విషయమునే ద్రువీకరించుచున్నది (క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి). అనగా పుణ్యకర్మల ఫలములు నశించినంతనే జీవుడు ఆనంద శిఖరము నుండి అధోజీవన స్థాయికి పతనము చెందును.
ప్రపంచమునందలి పలువురు రాజనీతిజ్ఞులు ఆ రీతినే పతనము చెందియుండిరి. అవి కేవలము మరింత శోకమునకే కారణము కాగలవు. కావున మనము శుభము కొరకై శోకనాశానమును కోరుదుమేని అర్జునుడు ఒనరించిన రీతి శ్రీకృష్ణుని శరణము పొందవలెను. అనగా అర్జునుడు సమస్యను నిశ్చయముగా పరిష్కరింపుమని శ్రీకృష్ణుని అడిగియున్నాడు. అదియే కృష్ణభక్తిరసభావనా మార్గము.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 8
8. na hi prapaśyāmi mamāpanudyād yac chokam ucchoṣaṇam indriyāṇām avāpya bhūmāv asapatnam ṛddhaṁ rājyaṁ surāṇām api cādhipatyam
Translation : I can find no means to drive away this grief which is drying up my senses. I will not be able to dispel it even if I win a prosperous, unrivaled kingdom on earth with sovereignty like the demigods in heaven.
Purport :
Although Arjuna was putting forward so many arguments based on knowledge of the principles of religion and moral codes, it appears that he was unable to solve his real problem without the help of the spiritual master, Lord Śrī Kṛṣṇa. He could understand that his so-called knowledge was useless in driving away his problems, which were drying up his whole existence; and it was impossible for him to solve such perplexities without the help of a spiritual master like Lord Kṛṣṇa. Academic knowledge, scholarship, high position, etc., are all useless in solving the problems of life; help can be given only by a spiritual master like Kṛṣṇa. Therefore, the conclusion is that a spiritual master who is one hundred percent Kṛṣṇa conscious is the bona fide spiritual master, for he can solve the problems of life. Lord Caitanya said that one who is a master in the science of Kṛṣṇa consciousness, regardless of his social position, is the real spiritual master.
kibā vipra, kibā nyāsī, śūdra kene naya
yei kṛṣṇa-tattva-vettā, sei ‘guru’ haya
“It does not matter whether a person is a vipra [learned scholar in Vedic wisdom], or is born in a lower family, or is in the renounced order of life – if he is a master in the science of Kṛṣṇa, he is the perfect and bona fide spiritual master.” (Caitanya-caritāmṛta, Madhya 8.128) So without being a master in the science of Kṛṣṇa consciousness, no one is a bona fide spiritual master. It is also said in the Vedic literature:
ṣaṭ-karma-nipuṇo vipro
mantra-tantra-viśāradaḥ
avaiṣṇavo gurur na syād vaiṣṇavaḥ śva-paco guruḥ
“A scholarly brāhmaṇa, expert in all subjects of Vedic knowledge, is unfit to become a spiritual master without being a Vaiṣṇava, or expert in the science of Kṛṣṇa consciousness. But a person born in a family of a lower caste can become a spiritual master if he is a Vaiṣṇava, or Kṛṣṇa conscious.” (Padma Purāṇa)
The problems of material existence – birth, old age, disease and death – cannot be counteracted by accumulation of wealth and economic development. In many parts of the world there are states which are replete with all facilities of life, which are full of wealth and economically developed, yet the problems of material existence are still present. They are seeking peace in different ways, but they can achieve real happiness only if they consult Kṛṣṇa, or the Bhagavad-gītā and Śrīmad-Bhāgavatam – which constitute the science of Kṛṣṇa – through the bona fide representative of Kṛṣṇa, the man in Kṛṣṇa consciousness.
If economic development and material comforts could drive away one’s lamentations for family, social, national or international inebrieties, then Arjuna would not have said that even an unrivaled kingdom on earth or supremacy like that of the demigods in the heavenly planets would be unable to drive away his lamentations. He sought, therefore, refuge in Kṛṣṇa consciousness, and that is the right path for peace and harmony. Economic development or supremacy over the world can be finished at any moment by the cataclysms of material nature. Even elevation into a higher planetary situation, as men are now seeking on the moon planet, can also be finished at one stroke. The Bhagavad-gītā confirms this: kṣīṇe puṇye martya-lokaṁ viśanti. “When the results of pious activities are finished, one falls down again from the peak of happiness to the lowest status of life.” Many politicians of the world have fallen down in that way.* *Such downfalls only constitute more causes for lamentation.
Therefore, if we want to curb lamentation for good, then we have to take shelter of Kṛṣṇa, as Arjuna is seeking to do. So Arjuna asked Kṛṣṇa to solve his problem definitely, and that is the way of Kṛṣṇa consciousness.
🌹🌹🌹🌹🌹
Date: 26/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 45: 02వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 45: Chap. 02, Ver. 09
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 9
9. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ: పరన్తప: |
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ ||
తాత్పర్యం :
సంజయుడు పలికెను: శత్రువులను తపింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి, పిదప శ్రీకృష్ణునితో “ గోవిందా! నేను యుద్దమును చేయను” అని పలికి మౌనమును వహించెను.
భాష్యము :
యుద్ధమాచరించుటకు బదులు అర్జునుడు యుద్ధరంగమును వీడి భిక్షాటనను స్వీకరింపనున్నాడని అవగతము చేసికొని ధృతరాష్ట్రుడు మిక్కిలి మదమంది యుండవచ్చును. కాని అర్జునుడు తన శత్రువులను వధింప సమర్థుడని (పరంతపుడు) పలుకుచు సంజయుడు అతనిని నిరాశపరచెను. బంధుప్రేమ కారణముగా అర్జునుడు కొలది సమయము మిథ్యా శోకతప్తుడైనను శిష్యుని వలె దివ్యగురువైన శ్రీకృష్ణుని శరణుపొందెను. వంశానురాగము వలన కలిగిన మిథ్యా శోకము నుండి అతడు శీఘ్రమే ముక్తిని పొందగలడనియు మరియు ఆత్మానుభవపు (కృష్ణభక్తిరసభావనము) పూర్ణజ్ఞానముచే జ్ఞానవంతుడు కాగాలడనియు ఇది సూచించుచున్నది. పిదప అతడు నిక్కముగా యుద్ధమున పాల్గొనగలడు. అనగా శ్రీకృష్ణుని జ్ఞానమును బడసి అర్జునుడు విజయము సాధించు వరకు యుద్ధము చేయనున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిశ్చయముగా నిరాశగా మారగలదు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 9
9. sañjaya uvāca
evam uktvā hṛṣīkeśaṁ
guḍākeśaḥ paran-tapaḥ na yotsya iti govindam
uktvā tūṣṇīṁ babhūva ha
Translation : Sañjaya said: Having spoken thus, Arjuna, chastiser of enemies, told Kṛṣṇa, “Govinda, I shall not fight,” and fell silent.
Purport :
Dhṛtarāṣṭra must have been very glad to understand that Arjuna was not going to fight and was instead leaving the battlefield for the begging profession. But Sañjaya disappointed him again in relating that Arjuna was competent to kill his enemies (paran-tapaḥ). Although Arjuna was, for the time being, overwhelmed with false grief due to family affection, he surrendered unto Kṛṣṇa, the supreme spiritual master, as a disciple. This indicated that he would soon be free from the false lamentation resulting from family affection and would be enlightened with perfect knowledge of self-realization, or Kṛṣṇa consciousness, and would then surely fight. Thus Dhṛtarāṣṭra’s joy would be frustrated, since Arjuna would be enlightened by Kṛṣṇa and would fight to the end
🌹🌹🌹🌹🌹
Date: 27/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 46: 02వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 46: Chap. 02, Ver. 10
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 10
10. తమువాచ హృషికేష ప్రహసన్నివ భారత |
సేనాయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచ: ||
తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా! ఇరుసేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఆ సమయమున దుఃఖితుడైన అర్జునునితో ఇట్లు పలికెను.
భాష్యము :
హృషీ కేశుడు మరియు గుడాకేశుడు అణు ఇరువురు సన్నిహిత మిత్రుల నడుమ ఇచ్చట సంభాషణము జరుగుచున్నది. స్నేహితులుగా ఇరువురును ఒకే స్థాయికి చెందినవారైనను వారిలో ఒకరు వేరొకరికి స్వచ్ఛందముగా శిష్యుడయ్యెను. స్నేహితుడు శిష్యునిగా మారుటకు ఎంచుకొనినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. సర్వులకు ప్రభువుగా అతడు సదా ఉన్నతస్థానము నందే నిలిచియుండును. అయినను తనను స్నేహితునిగా, పుత్రునిగా లేక ప్రియునిగా పొందగోరిన భక్తుని యెడ అతడు అదేరితిగా వర్తించుటకు అంగీకరించును. గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానము స్వీకరించి శిష్యునితో కోరినరీతి గాంభీర్యముగా పలుక నారంభించెను. సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురుశిష్యుల నడుమ సంభాషణ ఇరుసేనల సమక్షమున బాహాటముగా జరిగినట్లు అవగతమగుచున్నది. అనగా భగవద్గీత వాక్యములు ఒకానొక వ్యక్తికి, సంఘమునకు లేదా జాతికి సంబంధించినవి గాక సర్వుల కొరకై నిర్దేశింపబడియున్నవి. శత్రుమిత్రులు ఇరువురును ఆ వాక్యములను శ్రవణము చేయుటకు సమానముగా అర్హులై యున్నారు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 10
10. tam uvāca hṛṣīkeśaḥ prahasann iva bhārata
senayor ubhayor madhye viṣīdantam idaṁ vacaḥ
Translation : O descendant of Bharata, at that time Kṛṣṇa, smiling, in the midst of both the armies, spoke the following words to the grief-stricken Arjuna.
Purport :
The talk was going on between intimate friends, namely the Hṛṣīkeśa and the Guḍākeśa. As friends, both of them were on the same level, but one of them voluntarily became a student of the other. Kṛṣṇa was smiling because a friend had chosen to become a disciple. As Lord of all, He is always in the superior position as the master of everyone, and yet the Lord agrees to be a friend, a son or a lover for a devotee who wants Him in such a role. But when He was accepted as the master, He at once assumed the role and talked with the disciple like the master – with gravity, as it is required. It appears that the talk between the master and the disciple was openly exchanged in the presence of both armies so that all were benefited. So the talks of Bhagavad-gītā are not for any particular person, society, or community, but they are for all, and friends or enemies are equally entitled to hear them.
🌹🌹🌹🌹🌹
Date: 28/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 47: 02వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 47: Chap. 02, Ver. 11
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 11
11. శ్రీ భగవానువాచ
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితా: ||
తాత్పర్యం :
పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైనవారు జీవించి యున్న వారిని గూర్చి గాని, మరణించిన వారిని గూర్చి గాని దుఃఖింపరు.
భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి పరోక్షముగా శిష్యుని మూర్ఖుడని పిలుచుచు మందలించు చున్నాడు. “ నీవు పండితుని మాదిరి పలుకుచున్నావు. కాని దేహమననేమో, ఆత్మయననేమో తెలిసిన పండితుడు దేహపు ఏ స్థితిని గూర్చియు (జీవించి యున్న స్థితిని గాని, మరణించిన స్థితిని గాని) శోకింపడని ఎరుగకున్నావు” అని అతడు పలికెను. తరువాతి అధ్యాయములలో వివరింపబడిన రీతి జ్ఞానమనగా భౌతికపదార్థము, ఆత్మ మరియు ఆ రెండింటిని నియమించువాని గూర్చి తెలియుటయే. రాజకీయములు లేదా సాంఘిక ఆచారముల కన్నను ధర్మ నియమములకే అధిక ప్రాధాన్యత ఒసగవలెనని అర్జునుడు వాదించెను. కాని భౌతిక పదార్థము, ఆత్మ, భగవానుని గుర్చిన జ్ఞానము ధార్మిక నియమముల కన్నను మరింత ముఖ్యమైనదని అతడు ఎరుగకుండెను. అటువంటి జ్ఞానము కొరవడియున్నందున గొప్ప ప్రజ్ఞకలవానిగా తనను అతడు ప్రదర్శించుకొనుట తగియుండలేదు. ప్రజ్ఞగలవాడు కానందునే అతడు విచారింపదగని దానిని గూర్చి విచారించెను. దేహము ఒకప్పుడు ఉద్భవించి నేదో, రేపో రాలిపోయే తీరును. కనుకనే దేహము ఆత్మ యంత ముఖ్యమైనది కాదు. ఇది తెలిసినవాడే నిజముగా ప్రజ్ఞకలవాడు. భౌతికదేహపు స్థితి ఎట్లున్నను అట్టివానికి దుఃఖకారణము ఏదియును లేదు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 11
11. śrī-bhagavān uvāca
aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase gatāsūn agatāsūṁś ca nānuśocanti paṇḍitāḥ
Translation : The Supreme Personality of Godhead said: While speaking learned words, you are mourning for what is not worthy of grief. Those who are wise lament neither for the living nor for the dead.
Purport :
The Lord at once took the position of the teacher and chastised the student, calling him, indirectly, a fool. The Lord said, “You are talking like a learned man, but you do not know that one who is learned – one who knows what is body and what is soul – does not lament for any stage of the body, neither in the living nor in the dead condition.” As explained in later chapters, it will be clear that knowledge means to know matter and spirit and the controller of both. Arjuna argued that religious principles should be given more importance than politics or sociology, but he did not know that knowledge of matter, soul and the Supreme is even more important than religious formularies. And because he was lacking in that knowledge, he should not have posed himself as a very learned man. As he did not happen to be a very learned man, he was consequently lamenting for something which was unworthy of lamentation. The body is born and is destined to be vanquished today or tomorrow; therefore the body is not as important as the soul. One who knows this is actually learned, and for him there is no cause for lamentation, regardless of the condition of the material body
🌹🌹🌹🌹🌹
Date: 29/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 48: 02వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 48: Chap. 02, Ver. 12
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 12
12. న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపా: |
న చైవ న భవిష్యామ: సర్వే వయమత: పరమ్ ||
తాత్పర్యం :
నేను గాని, నీవు గాని, ఈ రాజులందరు గాని నిలిచియుండని సమయమేదియును లేదు. అలాగుననే భవిష్యత్తు నందు మనమెవ్వరు ఉండకపోము.
భాష్యము :
దేవదేవుడు అసంఖ్యాకములైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు మరియు కర్మఫలములు ననుసరించి పోషకుడై యున్నాడని కటోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు (వేదముల) నందు తెలుపబడినది. అదే దేవదేవుడు ప్రతిజీవి హృదయములో తన ప్రధానాంశ రూపమున సదా నిలిచియుండును . అట్టి భగవానుని బాహ్యాభ్యంతరములలో గాంచగలిగిన సాధుపురుషులే పూర్ణమును మరియు శాశ్వతమును అగు శాంతిని నిజముగా పొందుచున్నారు.
నిత్యో నిత్యానం చేతనశ్చేతనానాం
ఏకో బహూనాం యో విధధాతి కామాన్ |
త మాత్మస్థం యే(ను పశ్యన్తి ధీరా:
తేషాం శాన్తి: శాశ్వతీ నేతరేషామ్ ||
(కతోపనిషత్తు 2.2.13)
అర్జునునకు తెలుపబడిన ఈ వేదసత్యము నిజమునకు జ్ఞానరహితులైనను జ్ఞానవంతులుగా తమను ప్రదర్శించుకొను జనులందరికీ తెలుపబడుచున్నది.* *తాను, అర్జునుడు మరియు రణరంగమున సమాకుడిన రాజులందరును నిత్యులైన జీవులనియు మరియు బంధముక్తస్థితులు రెండింటి యందును జీవులకు తానూ నిత్య పోషకుడననియు శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్యపురుషుడు, అతని నిత్య సహచరుడైన అర్జునుడు మరియు రణరగమునందు సమాకుడిన రాజులు నిత్యులగు జీవులై యున్నారు. అది భవిష్యత్తు నందును ఉండకపోదు. అనగా వారి యొక్క వ్యక్తిత్త్వము గతమునందును నిలిచియున్నది. అది భవిష్యత్తు నందును ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుచున్నది. అట్టి యెడ ఎవరి కొరకును చింతించుటకు ఎట్టి కారణము లేదు.
మోక్షము పిమ్మట ఆత్మ మయావరణము నుండి బయటపడి నిరాకారబ్రహ్మముతో కలసి తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమప్రామణికుడైన శ్రీకృష్ణభగవానుడు సమర్థించుట లేదు. అలాగుననే వ్యక్తిత్వమనునది కేవలము బద్ధస్థితి యందే అనెడి సిద్ధాంతము సైతము సమర్ధించలేదు. ఉపనిషత్తులలో నిర్దారింపబడిన రీతి తన వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము శాశ్వతముగా భవిష్యత్తు నందును నిలిచియుండునని శ్రీకృష్ణభగవానుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. మయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము అత్యంత ప్రామాణికమై యున్నది. వ్యక్తిత్వమనునది వాస్తవము కానిచో ఈ విషయమును శ్రీకృష్ణుడు (భవిష్యత్తు నందు కూడా యనుచు) నొక్కి వక్కనించెడివాడు కాడు. ఇచ్చట శ్రీకృష్ణుడు తెలిపిన వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదని మయావాదులు వాదించు నవకాశము కలదు. ఒకవేళ వ్యక్తిత్వము భౌతికమనెడి ఆ వాదమునే అంగీకరించినను శ్రీకృష్ణభగవానుని వ్యక్తిత్వమునందు భేదమునెట్లు గాంచగలము? తన వ్యక్తిత్వమును గతమునందు ఉన్నదానిగాను మరియు భవిష్యత్తు నందును నిలిచియుండుదానిగను శ్రీకృష్ణుడు నిర్ధారించినాడు. తన వ్యక్తిత్వము అతడు పలు రీతుల నిరూపించియున్నాడు. అంతియేగాక నిరాకారబ్రహ్మము అతనికి లోబడియున్నదనియు ప్రకటింపబడినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వత్రా నిరూపించియే యున్నాడు. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా భావించినచో అతని భగవద్గీతకు (ప్రామాణిక గ్రంథముగా) విలువ కలుగదు. నాలుగు విధములైన దోషములను కలిగియుండెడి సాధారణ మానవుడు శ్రవణదాయకమైన ఉపదేశము నెన్నడును చేయజాలడు. కాని భగవద్గీత వాజ్మయమునకు అతీతమైనది. ఏ లౌకికగ్రంథమును దీనితో సాటిరాదు. కాని ఎవరేని శ్రీకృష్ణభగవానుని సాధారణవ్యక్తిగా భావించినంతనే ఇది తన ప్రాముఖ్యమును కోల్పోవును. ఈ శ్లోకమునందు తెలుపబడిన బహుత్వమనునది వ్యవహారికమనియు మరియు అది దేహమునకు సంబధించినదనియు మాయావాదులు వాదింతురువాదింతురు. కాని అట్టి దేహభావనము పూర్వపు శ్లోకమునందు ఇదివరకే ఖండించబడినది. జీవుల దేహభావనను ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందులకు ప్రతిపాదించును? అనగా ఇచ్చట వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలో ప్రస్తావించబడినది తెలియుచున్నది. ఈ విషయమునే శ్రీరామానుజులు మరియు ఇతర ఆచార్యులు నిర్ధారించిరి. ఇట్టి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవానుని భక్తులకే అవగతము కాగలదని భగవద్గీత యందు పలుచోట్ల ఈ విషయము నిర్దారింపబడినది
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 12
12. na tv evāhaṁ jātu nāsaṁ
na tvaṁ neme janādhipāh
na caiva na bhaviṣyāmaḥ
sarve vayam ataḥ param
Translation : Never was there a time when I did not exist, nor you, nor all these kings; nor in the future shall any of us cease to be.
Purport :
In the Vedas – in the Kaṭha Upaniṣad as well as in the Śvetāśvatara Upaniṣad – it is said that the Supreme Personality of Godhead is the maintainer of innumerable living entities, in terms of their different situations according to individual work and reaction of work. That Supreme Personality of Godhead is also, by His plenary portions, alive in the heart of every living entity. Only saintly persons who can see, within and without, the same Supreme Lord can actually attain to perfect and eternal peace.
nityo nityānāṁ cetanaś cetanānām
eko bahūnāṁ yo vidadhāti kāmān
tam ātma-sthaṁ ye ’nupaśyanti dhīrās
teṣāṁ śāntiḥ śāśvatī netareṣām
(Kaṭha Upaniṣad 2.2.13)
The same Vedic truth given to Arjuna is given to all persons in the world who pose themselves as very learned but factually have but a poor fund of knowledge. The Lord says clearly that He Himself, Arjuna and all the kings who are assembled on the battlefield are eternally individual beings and that the Lord is eternally the maintainer of the individual living entities both in their conditioned and in their liberated situations. The Supreme Personality of Godhead is the supreme individual person, and Arjuna, the Lord’s eternal associate, and all the kings assembled there are individual eternal persons. It is not that they did not exist as individuals in the past, and it is not that they will not remain eternal persons. Their individuality existed in the past, and their individuality will continue in the future without interruption. Therefore, there is no cause for lamentation for anyone.
The Māyāvādī theory that after liberation the individual soul, separated by the covering of māyā, or illusion, will merge into the impersonal Brahman and lose its individual existence is not supported herein by Lord Kṛṣṇa, the supreme authority. Nor is the theory that we only think of individuality in the conditioned state supported herein. Kṛṣṇa clearly says herein that in the future also the individuality of the Lord and others, as it is confirmed in the Upaniṣads, will continue eternally. This statement of Kṛṣṇa’s is authoritative because Kṛṣṇa cannot be subject to illusion. If individuality were not a fact, then Kṛṣṇa would not have stressed it so much – even for the future. The Māyāvādī may argue that the individuality spoken of by Kṛṣṇa is not spiritual, but material. Even accepting the argument that the individuality is material, then how can one distinguish Kṛṣṇa’s individuality? Kṛṣṇa affirms His individuality in the past and confirms His individuality in the future also. He has confirmed His individuality in many ways, and impersonal Brahman has been declared to be subordinate to Him. Kṛṣṇa has maintained spiritual individuality all along; if He is accepted as an ordinary conditioned soul in individual consciousness, then His Bhagavad-gītā has no value as authoritative scripture. A common man with all the four defects of human frailty is unable to teach that which is worth hearing. The Gītā is above such literature. No mundane book compares with the Bhagavad-gītā. When one accepts Kṛṣṇa as an ordinary man, the Gītā loses all importance. The Māyāvādī argues that the plurality mentioned in this verse is conventional and that it refers to the body. But previous to this verse such a bodily conception is already condemned. After condemning the bodily conception of the living entities, how was it possible for Kṛṣṇa to place a conventional proposition on the body again? Therefore, individuality is maintained on spiritual grounds and is thus confirmed by great ācāryas like Śrī Rāmānuja and others. It is clearly mentioned in many places in the Gītā that this spiritual individuality is understood by those who are devotees of the Lord. Those who are envious of Kṛṣṇa as the Supreme Personality of Godhead have no bona fide access to the great literature. The nondevotee’s approach to the teachings of the Gītā is something like that of a bee licking on a bottle of honey. One cannot have a taste of honey unless one opens the bottle. Similarly, the mysticism of the Bhagavad-gītā can be understood only by devotees, and no one else can taste it, as it is stated in the Fourth Chapter of the book. Nor can the Gītā be touched by persons who envy the very existence of the Lord. Therefore, the Māyāvādī explanation of the Gītā is a most misleading presentation of the whole truth. Lord Caitanya has forbidden us to read commentations made by the Māyāvādīs and warns that one who takes to such an understanding of the Māyāvādī philosophy loses all power to understand the real mystery of the Gītā. If individuality refers to the empirical universe, then there is no need of teaching by the Lord. The plurality of the individual soul and the Lord is an eternal fact, and it is confirmed by the Vedas as above mentioned.
🌹🌹🌹🌹🌹
Date: 30/Jun/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 49: 02వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 49: Chap. 02, Ver. 13
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 13
13. దేహినో(స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా | తథా దేహాన్తరప్రాప్థిర్ధీరస్తత్ర న ముహ్యతి ||
తాత్పర్యం :
దేహధారి దేహమునందు బాల్యము నుండి యౌవనమునకు, యౌవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చను రీతి మరణానంతరాము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయనున ధీరుడైనవాడు మోహము నొందడు.
భాష్యము :
ప్రతిజీవుడు వ్యక్తిగత ఆత్మయైనందున కొంత సమయము బాలునిగా, మరికొంత సమయము యౌవనవంతునిగా, ఇంకొంత కాలము ముదుసలిగా వ్యక్తమగుచు నిరంతరమ దేహమార్పులకు లోనగుచుండును. అయినప్పటికిని ఆత్మ మాత్రము ఎట్టి మార్పులేక యుండును. అది చివరకు మరణసమయమున దేహము మార్చి వేరొక దేహమునకు ప్రయాణించును. తదుపరి జన్మలో వేరొక దేహమును(భౌతికము గాని లేదా ఆధ్యాత్మికము గాని) పొందుట నిశ్చయమై యున్నందున భీష్మద్రోణుల మరణ విషయమున అర్జునుడు చింతించుటకు ఎట్టి కారణము లేదు. వారిని గూర్చి అతడు మిగుల వ్యాకుల పడియున్నాడు. కాని వారు తమ పాతదేహములను వదలి నూతనదేహములను పొందుట ద్వారా తిరిగి శక్తిని పొందగలరని అతడు ఆనందింపవలసియున్నది. జీవితమున మనుజుని కర్మ ననుసరించి వివిధములైన సుఖముల కొరకు లేదా దు:ఖముల కొరకు అట్టి దేహమార్పు కలుగుచుండును. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును పవిత్రాత్ములై నందున తదుపరి జన్మమున నిక్కముగా ఆధ్యాత్మికదేహములను పొందనున్నారు లేదా కనీసము ఉన్నత భోగము కొరకై దేవతాశరీరములను పొందగలరు. ఈ రెండింటిలో ఏది జరిగినను చింతకు కారణమేదియును లేదు.
ఆత్మ, పరమాత్మ, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానమును సంపూర్ణముగా కలిగియున్నవాడు ధీరుడని పిలువబడును. అట్టివాడు దేహపరమైన మార్పుల యెడ మోహము నొందడు.
మాయావాద సిద్ధాంతము పలుకు ఆత్మ యొక్క అద్వయత్వము ఏమాత్రము అంగీకరింపలేము. ఆత్మ ముక్కలుగా ఖండింపబడలేదనుటయే దానికి ఆధారము. ఆ రీతి వ్యక్తిగతాత్మలుగా ఖండింపబడుట యనునది పరమాత్మను మార్పునొందు వానిగా లేదా ఖండింపబడువానిగా చేయును. అట్టి విషయము పరమాత్మ మార్పురహితమనెడి సిద్ధాంతమునకు వ్యతిరేకమై యున్నది. భగవద్గీత యందు నిర్దారింపబడిన రీతిగా భగవానుని అంశలు నిత్యముగా(సనాతనులు) నిలిచియుండి క్షరులుగా పిలువబడును. అనగా వారు భౌతికప్రకృతికి పతనము చెందు లక్షణమును కలిగియుందురు. ఈ అంశలు నిత్యముగా తమ అంశరూపమున నిలిచియుందురు. ముక్తిపొందిన పిమ్మటయు జీవుడు అంశగా మిగిలియుండును. కాని ముక్తి పొందిన పిమ్మట అతడు ఆనందము మరియు జ్ఞానములను గూడి దేవదేవునితో నిత్యజీవనమును పొందును.
ప్రతిదేహమునందు నిలిచి పరమాత్మ నామమున తెలియబడు దేవదేవుని యెడ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వియింపవచ్చును. అతడు బద్దజీవునికి భిన్నుడై యున్నాడు. ఆకాశము నీటి యందు ప్రతిబింబమైనప్పుడు ఆ ప్రతిబింబములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు సైతము గోచరించును. నక్షత్రములను జీవులతో మరియు సూర్యుని లేదా చంద్రుని దేవదేవునితో పోల్చవచ్చును. ఇచ్చట అర్జునుడు జీవాత్మ కాగా, దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయై యున్నాడు. చతుర్ధ్యాయపు ఆది యందు అవగతము కానున్నట్లు వారిరువురును ఒకే స్థాయికి చెందినవారు కారు. అర్జునుడు శ్రీకృష్ణునితో సనమానస్థాయి గలవాడైనచో లేదా శ్రీకృష్ణుడు అర్జునిని కన్నను ఉన్నతస్థాయిలో నున్నవాడు కానిచో వారిరువురి నడుమగల ఉపదేశకుడు మరియు ఉపదేశమునందువాడు అనెడి సంబంధము అర్థరహితమగును. ఇరువరును మయాశక్తిచే మొహమునకు గురియగువారే యైనచో అందులో ఒకరు గురువగుటకు, మరియొకరు శిష్యుడగుటకు అవసరమే లేదు. మయాబంధములో నున్నప్పుడు ఎవ్వరును ప్రామాణిక ఉపదేశకుడు కాలేనందున అట్టి ఉపదేశము వ్యర్థమే కాగలదు. కనుకనే ఇట్టి పరిస్థితులలో జీవుడైన అర్జునుని (మాయచే భ్రాంతి నొందినవాడు) కన్నను ఉన్నతస్థాయిలో నున్న శ్రీకృష్ణుడు దేవదేవునిగా అంగీకరింప బడుచున్నాడు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 13
13. dehino ’smin yathā dehe
kaumāraṁ yauvanaṁ jarā
tathā dehāntara-prāptir
dhīras tatra na muhyati
Translation : As the embodied soul continuously passes, in this body, from boyhood to youth to old age, the soul similarly passes into another body at death. A sober person is not bewildered by such a change.
Purport :
Since every living entity is an individual soul, each is changing his body every moment, manifesting sometimes as a child, sometimes as a youth and sometimes as an old man. Yet the same spirit soul is there and does not undergo any change. This individual soul finally changes the body at death and transmigrates to another body; and since it is sure to have another body in the next birth – either material or spiritual – there was no cause for lamentation by Arjuna on account of death, neither for Bhīṣma nor for Droṇa, for whom he was so much concerned. Rather, he should rejoice for their changing bodies from old to new ones, thereby rejuvenating their energy. Such changes of body account for varieties of enjoyment or suffering, according to one’s work in life. So Bhīṣma and Droṇa, being noble souls, were surely going to have spiritual bodies in the next life, or at least life in heavenly bodies for superior enjoyment of material existence. So, in either case, there was no cause of lamentation.
Any man who has perfect knowledge of the constitution of the individual soul, the Supersoul, and nature – both material and spiritual – is called a dhīra, or a most sober man. Such a man is never deluded by the change of bodies.
The Māyāvādī theory of oneness of the spirit soul cannot be entertained, on the ground that the spirit soul cannot be cut into pieces as a fragmental portion. Such cutting into different individual souls would make the Supreme cleavable or changeable, against the principle of the Supreme Soul’s being unchangeable. As confirmed in the Gītā, the fragmental portions of the Supreme exist eternally (sanātana) and are called kṣara; that is, they have a tendency to fall down into material nature. These fragmental portions are eternally so, and even after liberation the individual soul remains the same – fragmental. But once liberated, he lives an eternal life in bliss and knowledge with the Personality of Godhead. The theory of reflection can be applied to the Supersoul, who is present in each and every individual body and is known as the Paramātmā. He is different from the individual living entity. When the sky is reflected in water, the reflections represent both the sun and the moon and the stars also. The stars can be compared to the living entities and the sun or the moon to the Supreme Lord. The individual fragmental spirit soul is represented by Arjuna, and the Supreme Soul is the Personality of Godhead Śrī Kṛṣṇa. They are not on the same level, as it will be apparent in the beginning of the Fourth Chapter. If Arjuna is on the same level with Kṛṣṇa, and Kṛṣṇa is not superior to Arjuna, then their relationship of instructor and instructed becomes meaningless. If both of them are deluded by the illusory energy (māyā), then there is no need of one being the instructor and the other the instructed. Such instruction would be useless because, in the clutches of māyā, no one can be an authoritative instructor. Under the circumstances, it is admitted that Lord Kṛṣṇa is the Supreme Lord, superior in position to the living entity, Arjuna, who is a forgetful soul deluded by māyā.
🌹🌹🌹🌹🌹
Date: 01/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 50: 02వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 50: Chap. 02, Ver. 14
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 14
14. మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణ సుఖదు:ఖదా: |
ఆగమపాయినో(నిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ||
తాత్పర్యం :
ఓ కౌంతేయా! తాత్కాలికములైనట్టి సుఖదుఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల వంటివి. ఓ భరతవంశీయుడా! ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలత నొందక సహించుట మనుజుడు నేర్వవలెను.
భాష్యము :
విధ్యుక్తధర్మమును చక్కగా నిర్వహించుట యందు సుఖ:దుఖముల తాత్కాలికమైన రాకపోకలు సహించుట ప్రతియెక్కరు నేర్వవలెను. వేదనియమము ప్రకారము మాఘమాసము నందును (జనవరి-ఫిభ్రవరి) తెలావారుఝాముననే స్నానమాచరింపవలెను. ఆ సమయమున వాతావరణము అతిచలిగా నున్నను వేదనియమా చరణమునకు కట్టుబడినవాడు తత్కారమునకు సంశయింపరు. అదేవిధముగా ఎండాకాలపు అతివేడి సమయమున మే,జూన్ నెలల యందు కుడా స్త్రీలు వంటశాల యందు వండుటకు సంశయింపరు. అనగా వాతావరణపు అసౌకర్యములు కలిగినప్పటికిని మనుజుడు తన విధ్యుక్తధర్మమును నిర్వహింపవలెను. ఆ రీతిగనే యుద్ధమనునది క్షత్రియధర్మము. అట్టి యుద్దమును స్నేహితుడు లేదా బంధువుతో చేయవలసివచ్చినను క్షత్రియుడైనవాడు తన విధ్యుక్తధర్మము నుండి వైదొలగరాదు. జ్ఞానస్థాయికి ఎదుగుట కొరకై మనుజుడు నిర్దేశిత నియమనిబంధనలను అనుసరింపవలెను. ఏలయన కేవలము జ్ఞానము మరియు భక్తి ద్వారానే ఎవడైనను తనను తాను మాయాబంధముల నుండి ముక్తుని గావించు కొనగలడు.
ఈ శ్లోకమున అర్జునుని సంభోధించిన రెండు నామములకు ప్రాశస్త్యము కలదు. కౌంతేయ అనెడి సంబోధన అతని తల్లి తరపున గల రక్తసంబంధమును, భారత అనెడి సంబోధనము తండ్రి ద్వారా సంక్రమించిన గొప్పదనమును సూచించుచున్నది. ఈ విధముగా రెండు వైపుల నుండియు అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగియున్నాడు. అట్టి వారసత్వము స్వీయధర్మపాలన యందు గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్దమును నిరాకరించుటకు అవకాశము లేదు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 14
14. mātrā-sparśās tu kaunteya śītoṣṇa-sukha-duḥkha-dāḥ āgamāpāyino ’nityās tāṁs titikṣasva bhārata
Translation : O son of Kuntī, the nonpermanent appearance of happiness and distress, and their disappearance in due course, are like the appearance and disappearance of winter and summer seasons. They arise from sense perception, O scion of Bharata, and one must learn to tolerate them without being disturbed.
Purport :
In the proper discharge of duty, one has to learn to tolerate nonpermanent appearances and disappearances of happiness and distress. According to Vedic injunction, one has to take his bath early in the morning even during the month of Māgha (January-February). It is very cold at that time, but in spite of that a man who abides by the religious principles does not hesitate to take his bath. Similarly, a woman does not hesitate to cook in the kitchen in the months of May and June, the hottest part of the summer season. One has to execute his duty in spite of climatic inconveniences. Similarly, to fight is the religious principle of the kṣatriyas, and although one has to fight with some friend or relative, one should not deviate from his prescribed duty. One has to follow the prescribed rules and regulations of religious principles in order to rise up to the platform of knowledge, because by knowledge and devotion only can one liberate himself from the clutches of māyā (illusion).
The two different names of address given to Arjuna are also significant. To address him as Kaunteya signifies his great blood relations from his mother’s side; and to address him as Bhārata signifies his greatness from his father’s side. From both sides he is supposed to have a great heritage. A great heritage brings responsibility in the matter of proper discharge of duties; therefore, he cannot avoid fighting.
🌹🌹🌹🌹🌹
Date: 02/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 51: 02వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 51: Chap. 02, Ver. 15
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 15
15. యం హి ణ వ్యథయన్త్యేతే పురుషం పురుషర్శభ |
సమదుఖసుఖం ధీరం సో(మృతత్వయ కల్పతే ||
తాత్పర్యం :
ఓ మానవశ్రేష్టుడా (అర్జునా)! సుఖదుఃఖములచే కలత నొందక, ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై యున్నాడు.
భాష్యము :
ఉన్నత ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తి యందు స్థిరనిశ్చయము కలిగి, సుఖదు:ఖముల తాకిడిని సమానముగా సహింపగలిగినవాడు నిక్కముగా మోక్షమును పొందుటకు అర్హుడై యున్నాడు. వర్ణాశ్రమ విధానమునందు నాలుగవ జీవనస్థితియైన సన్యాసము వాస్తవమునకు అత్యంత కష్టదాయకమైనది. అయినను జీవితమును పూర్ణమొనర్చుకొనవలెనను నిశ్చయము కలిగినవాడు కష్టములెన్ని ఎదురైనను తప్పక సన్యాసమును స్వికరించును. ఆతి కష్టములు సాధారణముగా గృహసంబంధములను త్రెంపుకొనవలసి వచ్చునందున మరియు భార్యాపిల్లల సంబంధము త్యజింపవలసి యున్నందున కలుగుచుండును. కాని అట్టి కష్టములను సహించినచో మనుజుని ఆధ్యాత్మికానుభావమార్గము సంపూర్ణము కాగలదు. అదేవిధముగా స్వీయవంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియునిగా ధర్మపాలన విషయమున అర్జునుడు ధృడనిశ్చయము కలిగియుండవలెనని భోదింపబడినది. శ్రీచైతన్యమహాప్రభువు ఇరువదినాలుగేండ్ల ప్రాయమున సన్యాసము స్వీకరించినపుడు ఆయనపై ఆధారపడిన భార్యను మరియు తల్లిని పోషించువారు వేరోక్కరు లేకుండిరి. అయినప్పటికిని ఉన్నతప్రయోజనార్థమై ఆయన సన్న్యాసమును స్వీకరించి ఉన్నతధర్మ పాలనలో ధీరులై నిలిచిరి. భౌతికబంధము నుండి ముక్తిని సాధించుతాకు అదియే మార్గము.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 15
15. yaṁ hi na vyathayanty ete puruṣaṁ* *puruṣarṣabha sama-duḥkha-sukhaṁ dhīraṁ so ’mṛtatvāya kalpate
Translation :
O best among men [Arjuna], the person who is not disturbed by happiness and distress and is steady in both is certainly eligible for liberation.
Purport :
Anyone who is steady in his determination for the advanced stage of spiritual realization and can equally tolerate the onslaughts of distress and happiness is certainly a person eligible for liberation. In the varṇāśrama institution, the fourth stage of life, namely the renounced order (sannyāsa), is a painstaking situation. But one who is serious about making his life perfect surely adopts the sannyāsa order of life in spite of all difficulties. The difficulties usually arise from having to sever family relationships, to give up the connection of wife and children. But if anyone is able to tolerate such difficulties, surely his path to spiritual realization is complete. Similarly, in Arjuna’s discharge of duties as a kṣatriya, he is advised to persevere, even if it is difficult to fight with his family members or similarly beloved persons. Lord Caitanya took sannyāsa at the age of twenty-four, and His dependents, young wife as well as old mother, had no one else to look after them. Yet for a higher cause He took sannyāsa and was steady in the discharge of higher duties. That is the way of achieving liberation from material bondage.
🌹🌹🌹🌹🌹
Date: 03/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 52: 02వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 52: Chap. 02, Ver. 16
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 16
16. నాసాతో విద్యతే భావో నాభావో విద్యతే సత: ||
ఉభయోరపి దృష్టో న్తస్త్వనయోస్తత్వ దర్శిభి: ||
తాత్పర్యం :
అసత్తునకు (భౌతిక దేహము) ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి (ఆత్మ) మార్పు లేదనియు సత్యద్రష్టలైన వారు నిర్ణయించి యున్నారు. ఈ రెండింటి తత్త్వమును బాగుగా అధ్యయనము చేసి వారీ విషయమున ధృవీకరించిరి.
భాష్యము :
మార్పుచెందు దేహమునకు ఉనికి లేదు. వివిధములైన కణముల చర్య మరియు ప్రతిచర్య వలన దేహము ప్రతిక్షణము మార్పునకు లోనగుచున్నదడని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించియున్నది. కనుకనే దేహము నందు పెరుగుదల మరియు ముసలితనములు కలుగుచున్నవి. కాని మనోదేహములు ఆ విధముగా సదా మార్పు చెందుచున్నను ఆత్మ మాత్రము ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచియుండును. అదియే భౌతికపదార్థము మరియు ఆత్మల నడుమ గల భేదము. ప్రకృతిరీత్యా దేహము నిత్యపరిణామశీలమై యుండగా ఆత్మ నిత్యత్వ లక్షణమును కలిగియున్నది. అన్ని తరగతుల సత్యద్రష్టలచే (నిరాకారవాదులు మరియు సాకారవాదులు ఇరువురును) ఈ విషయము ధ్రువీకరింపబడినది. విష్ణువు మరియు అతని ధామములన్నియును స్వయంప్రకాశమాన ఉనికిని కలిగియున్నట్లు (జ్యొతీంషి విష్ణుర్భువనాని విష్ణు:) విష్ణుపురాణము (2.12.38) నందు తెలుపబడినది. అనగా సత్తు,అసత్తు అను పదములు వరుసగా ఆత్మ మరియు భౌతికపదార్థములనే సూచించుచున్నవి. సత్యద్రష్టలందరి అభిప్రాయమిదియే.
అజ్ఞాన ప్రభావముచే మొహపరవశులైన జీవులకు శ్రీకృష్ణభగవాను డొసగిన ఉపదేశపు ఆరంభమిదియే. అజ్ఞానము అంతమొందించుటనెడి కార్యము అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమగల నిత్యసంబధమును పున:స్థాపించుట, భగవానుడు మరియు అతని అంశలైన జీవుల నడుమ గల భేదమును సంపూర్తిగా అవగతము చేసికొనుట యనెడి అంశములను కూడియుండును. భగవానుడు మరియు తన నడుమగల భేదము పూర్ణము మరియు అంశము నడుమగల సంబందము వంటిదని తెలిసి, తనను గుర్చిన సంపూర్ణాధ్యయనము కావించుట ద్వారా మనుజుడు భగవతత్త్వమును అవగతము చేసికొనగలడు.
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 16
16. nāsato vidyate bhāvo nābhāvo vidyate sataḥ ubhayor api dṛṣṭo ’ntas tv anayos tattva-darśibhiḥ
Translation :
Those who are seers of the truth have concluded that of the nonexistent [the material body] there is no endurance and of the eternal [the soul] there is no change. This they have concluded by studying the nature of both.
Purport :
There is no endurance of the changing body. That the body is changing every moment by the actions and reactions of the different cells is admitted by modern medical science; and thus growth and old age are taking place in the body. But the spirit soul exists permanently, remaining the same despite all changes of the body and the mind. That is the difference between matter and spirit. By nature, the body is ever changing, and the soul is eternal. This conclusion is established by all classes of seers of the truth, both impersonalist and personalist. In the Viṣṇu Purāṇa (2.12.38) it is stated that Viṣṇu and His abodes all have self-illuminated spiritual existence (jyotīṁṣi viṣṇur bhuvanāni viṣṇuḥ). The words existent and nonexistent refer only to spirit and matter. That is the version of all seers of truth.
This is the beginning of the instruction by the Lord to the living entities who are bewildered by the influence of ignorance. Removal of ignorance involves the reestablishment of the eternal relationship between the worshiper and the worshipable and the consequent understanding of the difference between the part-and-parcel living entities and the Supreme Personality of Godhead. One can understand the nature of the Supreme by thorough study of oneself, the difference between oneself and the Supreme being understood as the relationship between the part and the whole.
🌹🌹🌹🌹🌹
Date: 04/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 53: 02వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 53: Chap. 02, Ver. 17
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 17
17. అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతం |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి ||
తాత్పర్యం :
శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మా నశింపు లేనటువంటిదని నీవు తెలిసికొనుము. అట్టి అవినాశియైన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు.
భాష్యము :
శరీరమంతటను వ్యాపించి యున్నటు వంటి ఆత్మ యొక్క నిజతత్త్వమును ఈ శ్లోకము మరింత స్పష్టముగా వివరించుచున్నది. దేహమందంతటను వ్యాపించి యున్నదేదో ఎవ్వరును అవగతము చేసికొనగలరు. అదియే చైతన్యము. కనుకనే దేహమునందలి ఒక భాగమున లేదా సంపూర్ణ దేహమున కలుగు సుఖదు:ఖములను ప్రతియెక్కరు తెలియగలుగుచున్నారు. కాని ఈ చైతన్యము మనుజుని దేహము వరకు మాత్రమే పరిమితమై యున్నది. ఒక దేహపు బాధలు మరియు సుఖములు వేరొక దేహమునకు తెలియవు. కనుకనే ప్రతిదేహము ఒక జీవాత్మ యొక్క ఆచ్చాదనయై యున్నది. అట్టి దేహమునందు ఆత్మా యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూత మగును. ఈ ఆత్మ కేశాగ్రపు పదివేల వంతు పరిమాణము కలదిగా వర్ణింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 17
17. avināśi tu tad viddhi yena sarvam idaṁ tatam vināśam avyayasyāsya na kaścit kartum arhati
Translation :
That which pervades the entire body you should know to be indestructible. No one is able to destroy that imperishable soul.
Purport :
This verse more clearly explains the real nature of the soul, which is spread all over the body. Anyone can understand what is spread all over the body: it is consciousness. Everyone is conscious of the pains and pleasures of the body in part or as a whole. This spreading of consciousness is limited within one’s own body. The pains and pleasures of one body are unknown to another. Therefore, each and every body is the embodiment of an individual soul, and the symptom of the soul’s presence is perceived as individual consciousness.
🌹🌹🌹🌹🌹
Date: 05/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 54: 02వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 54: Chap. 02, Ver. 18
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 18
18. అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా: శరీరిణ: |
అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత ||
తాత్పర్యం :
అవినాశియును, అపరిమితుడును, నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా! నీవు యుద్ధము చేయుము.
భాష్యము :
ప్రకృతిరీత్యా దేహము నశించు స్వభావము కలిగియున్నది. అది ఈ క్షణమే నశింపవచ్చును లేదా నూరు సంవత్సరముల పిదపైనను నశింపవచ్చును. అనగా అది నిలిచియుండును కాలము మారవచ్చును గాని, అనంతముగా దానిని పోషించుతాకు అవకాశమే లేదు. కాని ఆత్మ అతిసూక్ష్మమైనది. దానిని గాంచుటకైనను శత్రువులకు సాధ్యము కాదు. అట్టియెడ వధించుతను గూర్చి వేరుగా తెలుపపనిలేదు. గత శ్లోకములో తెలుపబడినరీతి అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణము కొలుచు పద్దతిని ఎవ్వరును ఎరుంగరు. అట్టి ఆత్మ ఎవ్వరి చేతను చంపబడదు. కాని కోరినంతకాలము లేదా శాశ్వతముగా దేహము రక్షింపబడదు. అనగా ఈ రెండు కోణములలో దేని ద్వారా గాంచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. కర్మానుసారముగా అణుపరిమాణ ఆత్మ వివిధములైన దేహములను ధరించును గావున ధర్మాచారణమును ప్రతియొక్కరు తప్పక అవలంబింపవలసియున్నది. జీవుడు దివ్యప్రకాశపు అంశయైన కారణమున వేదాంతసూత్రములందు అతడు ప్రకాశమానునిగా అంగీకరింపబడినాడు. కనుకనే సూర్యిని కాంతి సమస్తజగత్తును పోషించురీతి, ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచున్నది. అట్టి ఆత్మ దేహము నుండి తొలగినంతనే దేహము క్రుళ్ళుట నారంభించును. అనగా ఆత్మయే దేహమును పోషించుచున్నది. దేహము స్వత: ముఖ్యమైనది కాదు. కనుకనే లౌకికమైన దేహపరభావనలచే ధర్మమును త్యజింపక యుద్ధమాచరింపుమని అర్జునుడు ఉపదేశ మొసగబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 18
18. antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ anāśino ’prameyasya tasmād yudhyasva bhārata
Translation :
The material body of the indestructible, immeasurable and eternal living entity is sure to come to an end; therefore, fight, O descendant of Bharata.
Purport :
The material body is perishable by nature. It may perish immediately, or it may do so after a hundred years. It is a question of time only. There is no chance of maintaining it indefinitely. But the spirit soul is so minute that it cannot even be seen by an enemy, to say nothing of being killed. As mentioned in the previous verse, it is so small that no one can have any idea how to measure its dimension. So from both viewpoints there is no cause of lamentation, because the living entity as he is cannot be killed nor can the material body be saved for any length of time or permanently protected. The minute particle of the whole spirit acquires this material body according to his work, and therefore observance of religious principles should be utilized. In the Vedānta-sūtras the living entity is qualified as light because he is part and parcel of the supreme light. As sunlight maintains the entire universe, so the light of the soul maintains this material body. As soon as the spirit soul is out of this material body, the body begins to decompose; therefore it is the spirit soul which maintains this body. The body itself is unimportant. Arjuna was advised to fight and not sacrifice the cause of religion for material, bodily considerations.
🌹🌹🌹🌹🌹
Date: 06/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 55: 02వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 55: Chap. 02, Ver. 19
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 19
19. య ఏనం వేత్తి హన్తారాం యశ్చైనం మన్యతే హతం |
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ||
తాత్పర్యం :
జీవుడు చంపువాడని తలచువాడు గాని, చంపబడువాడని భావించువాడు గాని జ్ఞానవంతులు కారు. ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు.
భాష్యము :
మారణాయుధములచే దేహధారి గాయపడినపుడు దేహమునందలి జీవుడు మాత్రము చంపబడడని ఎరుగవలెను. అత్యంత సూక్ష్మమైన అట్టి ఆత్మను వధించుట ఎత్తి ఆయుధములచేతను సాధ్యము కాదు. ఈ విషయము రాబోవు శ్లోకముల ద్వారా నిరూపణ కాగలదు. అంతియేగాక దివ్యమైన ఆధ్యాత్మికస్థితి కారణముగా ఆత్మ వధార్హము కాదు. అనగా చంపబడునది లేదా చంపబడవలసినది కేవలము దేహము మాత్రమే. అయినను దీని ఉద్దేశ్యము దేహవధను ప్రోత్సహించుట కాదు. “మా హింస్యాత్ సర్వభూతాని” యను వేదనియమము ప్రకారము ఎవ్వరి యెడను హింసను ప్రదర్శించరాదు. అలాగుననే జీవుడెన్నడును చంపబడడని అవగాతమగుట జంతువధను ప్రోత్సహించుట ఎన్నడను కాదు. అధికారము లేకుండా ఎవరినేని వధించుట అత్యంత హేయమైన కార్యము. అట్టి చర్య దేశనియమము ప్రకారము మరియు భగవన్నియమము ప్రకారము దండనీయమే కాగలదు. కాని ఇచ్చట అర్జునుడు ధర్మము కొరకే సంహారము నందు నియోగింప బడుచుండెను గాని విపరీత తలంపుతో కాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 19
19. ya enaṁ vetti hantāraṁ yaś cainaṁ manyate hatam
ubhau tau na vijānīto nāyaṁ hanti na hanyate
Translation :
Neither he who thinks the living entity the slayer nor he who thinks it slain is in knowledge, for the self slays not nor is slain.
Purport :
When an embodied living entity is hurt by fatal weapons, it is to be known that the living entity within the body is not killed. The spirit soul is so small that it is impossible to kill him by any material weapon, as will be evident from subsequent verses. Nor is the living entity killable, because of his spiritual constitution. What is killed, or is supposed to be killed, is the body only. This, however, does not at all encourage killing of the body. The Vedic injunction is mā hiṁsyāt sarvā bhūtāni: never commit violence to anyone. Nor does understanding that the living entity is not killed encourage animal slaughter. Killing the body of anyone without authority is abominable and is punishable by the law of the state as well as by the law of the Lord. Arjuna, however, is being engaged in killing for the principle of religion, and not whimsically.
🌹🌹🌹🌹🌹
Date: 07/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 56: 02వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 56: Chap. 02, Ver. 20
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 20
20. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయ: |
అజో నిత్య: శాశ్వతో(యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||
తాత్పర్యం :
ఆత్మకు ఎన్నడును జన్మగాని, మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింప బోదు. జన్మ రహితమును, నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు.
భాష్యము :
భగవానుని అణుపరిమాణ అంశయైన ఆత్మ భగానునితో గుణరీతిని సమానమైనది. దేహము వలె అది మార్పునొందదు. కనుకనే అది కొన్నిమార్లు స్థిరము లేదా కూటస్థమని పిలువబడును. తల్లి గర్భము నుండి జన్మించుట, స్థితిని కలిగియుండుట, పెరుగుట, ఇతరములను సృష్టించుట, క్రమముగా క్షీణించుట, చివరికి నశించుట అనెడి ఆరువిధములైన మార్పులు దేహమునందు కలుగుచుండును. కాని ఆత్మ ఎన్నడును అటువంటి మార్పుల నొందదు. అనగా జన్మను లేదు. కాని అది దేహమును స్వీకరించుట వలన దేహము జన్మము నొందుచున్నది. అనగా అట ఆత్మ జన్మము నొందుట లేదు. అలాగుననే అది మరణమునకు సైతము గురుకాదు. జన్మించిన ప్రతి దానికి మరణము తప్పదు. కాని ఆత్మకు జన్మము లేనందున భూత, భవిష్యత్, వర్తమానములనునవి దాని లేవు. నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు ఆత్మ యెన్నడు ఆవిర్భవించెనో ఎట్టి చారిత్రిక ఆధారము లేదు. దేహభావన కారణముగా మనము ఆత్మ యొక్క జన్మాది విషయములను గూర్చి ప్రశ్నింపవచ్చను. కాని నిత్యమైన ఆత్మ ఎన్నడును దేహము వలె ముసలితనము నొందదు. కనుకనే ముదుసలి కుడా కుడా తన బాల్యము లేదా యౌవనములో కలిగియున్న ఉత్సాహమునే కలిగియుండును. దేహమునందు కలిగెడి మార్పులు ఆత్మపై ప్రభావము చూపవు. వృక్షముగాని లేదా మరియే ఇతర భౌతికవిషయముల వలె గాని ఆత్మ క్షీణింపదు. ఇతరములను కుడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్నములైన జీవత్మలు. కాని దేహము కలిగియున్న కారణముగా వారు ఒక వ్యకికి సంతానముగా గోచరించుచున్నారు. అనగా ఆత్మ యొక్క ఉనికి కారణముననే దేహము వృద్ధినొందుచున్నది. అయినను ఆత్మ యందు మాత్రము మార్పులు లేదా ఇతర సృష్టులు కలుగవు. కనుకనే దేహమునందు కలిగెడి ఆరుమార్పులకు ఆత్మ అతీతమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 20
20. na jāyate mriyate vā kadācin nāyaṁ bhūtvā bhavitā vā na bhūyaḥ ajo nityaḥ śāśvato ’yaṁ purāṇo na hanyate hanyamāne śarīre
Translation :
For the soul there is neither birth nor death at any time. He has not come into being, does not come into being, and will not come into being. He is unborn, eternal, ever-existing and primeval. He is not slain when the body is slain.
Purport :
Qualitatively, the small atomic fragmental part of the Supreme Spirit is one with the Supreme. He undergoes no changes like the body. Sometimes the soul is called the steady, or kūṭa-stha. The body is subject to six kinds of transformations. It takes its birth from the womb of the mother’s body, remains for some time, grows, produces some effects, gradually dwindles, and at last vanishes into oblivion. The soul, however, does not go through such changes. The soul is not born, but, because he takes on a material body, the body takes its birth. The soul does not take birth there, and the soul does not die. Anything which has birth also has death. And because the soul has no birth, he therefore has no past, present or future. He is eternal, ever-existing and primeval – that is, there is no trace in history of his coming into being. Under the impression of the body, we seek the history of birth, etc., of the soul. The soul does not at any time become old, as the body does. The so-called old man, therefore, feels himself to be in the same spirit as in his childhood or youth. The changes of the body do not affect the soul. The soul does not deteriorate like a tree, nor anything material. The soul has no by-product either. The by-products of the body, namely children, are also different individual souls; and, owing to the body, they appear as children of a particular man. The body develops because of the soul’s presence, but the soul has neither offshoots nor change. Therefore, the soul is free from the six changes of the body.
🌹🌹🌹🌹🌹
Date: 08/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 57: 02వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 57: Chap. 02, Ver. 21
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 21
21. వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పరుష: పార్థ కం ఘాతయతి హన్తి కం ||
తాత్పర్యం :
ఓ పార్థా! ఆత్మ నాశము లేనిదనియు, నిత్యమైనదనియు, పుట్టుకలేనిదనియు, అవ్యయమైనదనియు తెలిసినవాడు ఎవ్వరినేని ఎట్లు చంపును? లేదా చంపించును?
భాష్యము :
వాస్తవమునకు ప్రతిదానికి ఒక ప్రయోజనముండును. పూర్ణజ్ఞానవంతుడైనవాడు ఎచ్చట మరియు ఏవిధముగా ఒకదానిని సరియైన ప్రయోజనము కొరకై వినియోగించవలేనో తెలిసియుండును. అలాగుననే హింసకు సైతము ఒక ప్రయోజనమున్నది. కాని దానిని ఎట్లు వినియోగించవలెనన్న విషయమును జ్ఞానవంతుడు ఎరిగియుండును. హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాడు. ఏలయన అతడు ఉరిశిక్ష యను హింసను న్యాయసూత్రముల ననుసరించియే అమలుపరచును. హత్య గావించినవానికి మరణదండన విధింపబడవలెననియు, తద్ రీతినే చేసిన ఘోరపాపమునకు అతడు మరుసటి జన్మలో దుఃఖభాగుడు కావలసిన అవసరము కలుగగలదని మానవధర్మ శాస్త్రమైన మనుసంహిత తెలియజేయుచున్నది. అనగా హంతకుని రాజు ద్వారా విధింపబడెడి ఉరిశిక్ష లాభదాయకమైనదే. అలాగుననే శ్రీకృష్ణుడు యుద్ధమునకై ఆదేశింపగా అట్టి హింస పరమధర్మము కొరకేని నిర్దారింపవలసియున్నది. శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమున సంభవించు హింస యనునది హింస ఏమాత్రము కానేరదని ఎరిగి అర్జునుడు అట్టి ఆదేశమును అనుసరింపవలెను. ఏలయన ఆత్మ యనునది వధింపబడునది కాదు. కనుక న్యాయమును నెలకొల్పుటకై అట్టి నామమాత్ర హింస ఆమోదనీయమే. శస్త్రచికిత్స రోగిని బాగు చేయుటకే గాని చంపుటకు కాదు. కావున శ్రీకృష్ణుని ఉపదేశమున అర్జునుడు ఒనరింపబోవు యుద్ధము జ్ఞానపూర్ణమై యున్నది. దాని యందు పాపమునకు ఏమాత్రము అవకాశము లేదు
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 21
21. vedāvināśinaṁ nityaṁ ya enam ajam avyayam kathaṁ sa puruṣaḥ pārtha kaṁ ghātayati hanti kam
Translation :
O Pārtha, how can a person who knows that the soul is indestructible, eternal, unborn and immutable kill anyone or cause anyone to kill?
Purport :
Everything has its proper utility, and a man who is situated in complete knowledge knows how and where to apply a thing for its proper utility. Similarly, violence also has its utility, and how to apply violence rests with the person in knowledge. Although the justice of the peace awards capital punishment to a person condemned for murder, the justice of the peace cannot be blamed, because he orders violence to another person according to the codes of justice. In Manu-saṁhitā, the lawbook for mankind, it is supported that a murderer should be condemned to death so that in his next life he will not have to suffer for the great sin he has committed. Therefore, the king’s punishment of hanging a murderer is actually beneficial. Similarly, when Kṛṣṇa orders fighting, it must be concluded that violence is for supreme justice, and thus Arjuna should follow the instruction, knowing well that such violence, committed in the act of fighting for Kṛṣṇa, is not violence at all because, at any rate, the man, or rather the soul, cannot be killed; so for the administration of justice, so-called violence is permitted. A surgical operation is not meant to kill the patient, but to cure him. Therefore the fighting to be executed by Arjuna at the instruction of Kṛṣṇa is with full knowledge, so there is no possibility of sinful reaction.
🌹🌹🌹🌹🌹
Date: 09/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 58: 02వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 58: Chap. 02, Ver. 22
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 22
22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాటి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాస్య అన్యాని సంయాతి నవాని దేహీ ||
తాత్పర్యం :
మనుజుడు పాతవస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి, ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది.
భాష్యము :
ఆత్మ దేహములను మార్చుననెడి విషయము అంగీకరింపబడిన సత్యము. ఆత్మ ఉనికిని అంగీకరింపని ఆధునిక విజ్ఞానశాస్త్రవేత్తలు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను, దేహమునందు జరిగెడి మార్పులను అంగీకరించియే తీరవలెను. శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యౌవనము వరకు, యౌవనము నుండి ముసలితనము వరకు కలుగు దేహమునందలి మార్పులను వారు అంగీకరింపవలసియున్నది. ముసలితనము పిమ్మట మార్పు అనునది వేరొక దేహమును కలుగజేయును. ఈ విషయమును ఇదివరకే పూర్వశ్లోకము(2.13) నందు వివరింపబడినది.
ఒక దేహము నుండి వేరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కరుణచే సాధ్యపడుచున్నది. స్నేహితుని కోరికను ఇంకొక స్నేహితుడు తీర్చు రీతి, ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు తీర్చును. ఆత్మ మరియు పరమాత్మలను ఒకే వృక్షముపై కూర్చొనియున్న రెండు పక్షులతో ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి(ఆత్మ) వృక్షఫలములను ఆరగించుచుండగా, వేరొక పక్షి (శ్రీకృష్ణుడు) తన మిత్రుని గాంచుచున్నది. ఈ పక్షులు రెండును గుణరీతిని ఏకమైనను, అందొకటి భౌతికవృక్షపు ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములను కేవలము సాక్షిగా నిలిచియున్నది. ఇచ్చట శ్రీకృష్ణుడు సాక్షియైన పక్షి కాగా, అర్జునుడు ఫలమారగించు పక్షియై యున్నాడు. వారివురు స్నేహితులే అయినను అందులో ఒకరు గురువు కాగా, రెండవవాడు శిష్యుడై యున్నాడు. ఈ సంబంధమును మరచుటయే ఆత్మ ఒక వృక్షము నుండి వేరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమై యున్నది. అనగా దేహమనెడి వృక్షముపై జీవాత్మ తీవ్రప్రయాస నొందుచుండును. కాని అది చెంతనే ఉన్న మిత్రుడైన వేరొకపక్షిని (ఉపదేశము కొరకై అర్జునుడు శ్రీకృష్ణుని శరణునొందిన రీతి) గురువుగా అంగీకరించినంతనే శీఘ్రముగా సర్వశోకముల నుండి ముక్తినొందగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 22
22. vāsāṁsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti naro ’parāṇi tathā śarīrāṇi vihāya jīrṇāny anyāni saṁyāti navāni dehī
Translation :
As a person puts on new garments, giving up old ones, the soul similarly accepts new material bodies, giving up the old and useless ones.
Purport :
Change of body by the atomic individual soul is an accepted fact. Even the modern scientists who do not believe in the existence of the soul, but at the same time cannot explain the source of energy from the heart, have to accept continuous changes of body which appear from childhood to boyhood and from boyhood to youth and again from youth to old age. From old age, the change is transferred to another body. This has already been explained in a previous verse (2.13).
Transference of the atomic individual soul to another body is made possible by the grace of the Supersoul. The Supersoul fulfills the desire of the atomic soul as one friend fulfills the desire of another. The Vedas, like the Muṇḍaka Upaniṣad (3.1.2), as well as the Śvetāśvatara Upaniṣad (4.7), compare the soul and the Supersoul to two friendly birds sitting on the same tree. One of the birds (the individual atomic soul) is eating the fruit of the tree, and the other bird (Kṛṣṇa) is simply watching His friend. Of these two birds – although they are the same in quality – one is captivated by the fruits of the material tree, while the other is simply witnessing the activities of His friend. Kṛṣṇa is the witnessing bird, and Arjuna is the eating bird. Although they are friends, one is still the master and the other is the servant. Forgetfulness of this relationship by the atomic soul is the cause of one’s changing his position from one tree to another, or from one body to another. The jīva soul is struggling very hard on the tree of the material body, but as soon as he agrees to accept the other bird as the supreme spiritual master – as Arjuna agreed to do by voluntary surrender unto Kṛṣṇa for instruction – the subordinate bird immediately becomes free from all lamentations.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 10/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 59: 02వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 59: Chap. 02, Ver. 23
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 23
23. నైనం చిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావక: |
న చైనం క్లేక్లేదయన్త్యాపో న శోషయతి మారుత: ||
తాత్పర్యం :
ఆత్మ ఎత్తి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే శోషింపబడదు.
భాష్యము :
ఖడ్గములు, ఆగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయవ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేవు. ఆధునిక అగ్ని అస్త్రములతో పాటు పృథివి, జలము,వాయువు,ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు సైతము పలుగాలవని తెలియవచ్చుచున్నది. ఈనాటి అణ్వస్త్రములు ఆగ్నేయాస్త్రములు కోవకు చెందినవి. కాని పూర్వపు అస్త్రములు అన్నిరకములైన భౌతిక ములకములతో చేయబడి యుండెడివి. ఆగ్నేయాస్త్రములు వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతుల నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రమునకు తెలియవు. అదే కాకుండా వాయవ్యాస్త్రములు గూర్చి నవీన శాస్త్రజ్ఞులకు ఏమాత్రము జ్ఞానము లేదు. ఏదిఏమైనను ఎన్ని ఆయుధములను ఉపయోగించినను (అవి ఎంతటి వైజ్ఞానికములైననను) ఆత్మ చేదింపబడదు లేదా నశింపబడదు.
ఏ విధముగా ఆత్మ అజ్ఞానముచే ఉనికి లోనికి వచ్చి ఆపై మాయచే కప్పబడుచున్నదో మాయవాదులు వివరింపలేరు. అలాగుననే మూలమైన పరమాత్మా నుండి ఆత్మలను ఖండించుటయు సాధ్యమయిన విషయము కాదు. వాస్తవమునకు ఆత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడివడియుండెడి అంశలు. నిత్యముగా(సనాతముగా) విడివడియుండెడి అంశలైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడునవై యున్నవి. అగ్నికణములు అగ్ని గునమునే కలిగియున్నట్లు, భగవానుని సాహచార్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడిగలవు. జీవులు శ్రీకృష్ణభగవానుని నుండి విడివడియున్న అంశలుగా వరాహపురాణమునందు వర్ణింపబడినది. భగవద్గీత ప్రకారము కుడా ఈ విషయము సత్యమై యున్నది. కావున మాయ నుండి ముక్తి పొందిన పిదపయు జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే యుండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు ఒసగిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము వలన అర్జునుడు ముక్తిని పొందెనే గాని శ్రీకృష్ణునితో ఎన్నడును ఏకము కాలేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 23
23. nainaṁ chindanti śastrāṇi nainaṁ dahati pāvakaḥ na cainaṁ kledayanty āpo na śoṣayati mārutaḥ
Translation :
The soul can never be cut to pieces by any weapon, nor burned by fire, nor moistened by water, nor withered by the wind.
Purport :
All kinds of weapons – swords, flame weapons, rain weapons, tornado weapons, etc. – are unable to kill the spirit soul. It appears that there were many kinds of weapons made of earth, water, air, ether, etc., in addition to the modern weapons of fire. Even the nuclear weapons of the modern age are classified as fire weapons, but formerly there were other weapons made of all different types of material elements. Fire weapons were counteracted by water weapons, which are now unknown to modern science. Nor do modern scientists have knowledge of tornado weapons. Nonetheless, the soul can never be cut into pieces, nor annihilated by any number of weapons, regardless of scientific devices.
The Māyāvādī cannot explain how the individual soul came into existence simply by ignorance and consequently became covered by the illusory energy. Nor was it ever possible to cut the individual souls from the original Supreme Soul; rather, the individual souls are eternally separated parts of the Supreme Soul. Because they are atomic individual souls eternally (sanātana), they are prone to be covered by the illusory energy, and thus they become separated from the association of the Supreme Lord, just as the sparks of a fire, although one in quality with the fire, are prone to be extinguished when out of the fire. In the Varāha Purāṇa, the living entities are described as separated parts and parcels of the Supreme. They are eternally so, according to the Bhagavad-gītā also. So, even after being liberated from illusion, the living entity remains a separate identity, as is evident from the teachings of the Lord to Arjuna. Arjuna became liberated by the knowledge received from Kṛṣṇa, but he never became one with Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
Date: 11/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 60: 02వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 60: Chap. 02, Ver. 24
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 24
24. అచ్చేధ్య యమదాహ్యో యమక్లేద్యో శోష్య ఏవ చ |
నిత్య: సర్వగత: స్థాణురచలో(యం సనాతన: ||
తాత్పర్యం :
ఆత్మ ఛేదింప బడనటు వంటి మరియు కరుగునటువంటిది. దహింపజేయుటకు గాని, శోషింపజేయుటకు గాని అది వీలుకానటువంటిది. అది నిత్యమును, సర్వత్రా వ్యాపితమును, మార్పురహితమును, అచలమును, సనాతనము అయియున్నది.
భాష్యము :
ఆత్మ యొక్క ఈ లక్షణములన్నియు దానిని పరమపురుషుని నిత్యమైన అంశగా నిరూపించుచున్నవి. అది ఎటువంటి మార్పు లేకుండా తన అణుస్థితి యందే సదా నిలిచియుండును. ఐక్యము నొందుట యనునది ఆత్మ విషయమున ఊహింపరానిదైనందున మాయావాద సిద్ధాంతము దానికి సరిపోదు. భౌతికసంపర్కము నుండి ముక్తినొందిన పిమ్మట అది భగవానుని తేజోమయ కిరణములలో ఒక ఆధ్యాత్మిక కణముగా నిలువగోరవచ్చును. కాని బుద్ధిమంతులైన జీవులు మాత్రము భగవానుని సాహచార్యమును పొందుటకై ఆధ్యాత్మికలోకములందు ప్రవేశింతురు.
జీవులు భగవానుని సృష్టియందంతటను నిలిచియున్న విషయము నిస్సందేహము కనుక “సర్వగత” అను పదమునకు ఇచ్చట ప్రాముఖ్యము కలిగినది. అనగాఅనగా వారు భూమిపైనను, జలమునందు, వాయువునందును, భూమి అడుగుభాగామునను, చివరికి అగ్ని యందును జీవించుచున్నారు. ఆత్మ అగ్నిచే దగ్ధము కాదనెడి విషయము ఇచ్చట స్పష్టముగా తెలుపబడినందున అగ్నిలో వారు దగ్ధమై పోదురనెడి నమ్మకమును నిరాకారింపవచ్చును. కావున సూర్య మండలమున కూడా జీవులు అట్టి లోకమునకు తగిన దేహములతో జీవించుచున్నరనుటలో ఎట్టి సందేహము లేదు. సూర్యమండలము జీవరహితమైన సర్వగతమనెడి పదము అర్థరహితము కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 24
24. acchedyo ’yam adāhyo ’yam akledyo ’śoṣya eva ca nityaḥ sarva-gataḥ sthāṇur acalo ’yaṁ sanātanaḥ
Translation :
This individual soul is unbreakable and insoluble, and can be neither burned nor dried. He is everlasting, present everywhere, unchangeable, immovable and eternally the same.
Purport :
All these qualifications of the atomic soul definitely prove that the individual soul is eternally the atomic particle of the spirit whole, and he remains the same atom eternally, without change. The theory of monism is very difficult to apply in this case, because the individual soul is never expected to become one homogeneously. After liberation from material contamination, the atomic soul may prefer to remain as a spiritual spark in the effulgent rays of the Supreme Personality of Godhead, but the intelligent souls enter into the spiritual planets to associate with the Personality of Godhead.
The word sarva-gata (“all-pervading”) is significant because there is no doubt that living entities are all over God’s creation. They live on the land, in the water, in the air, within the earth and even within fire. The belief that they are sterilized in fire is not acceptable, because it is clearly stated here that the soul cannot be burned by fire. Therefore, there is no doubt that there are living entities also in the sun planet with suitable bodies to live there. If the sun globe is uninhabited, then the word sarva-gata – “living everywhere” – becomes meaningless.
🌹🌹🌹🌹🌹
Date: 12/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 61: 02వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 61: Chap. 02, Ver. 25
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 25
25. అవ్యక్తో యమచిన్త్యో యమవికార్యో య ముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||
తాత్పర్యం :
ఈ అత్మ కనబడనిది, ఊహింపరానిది, మార్పు రహితము అని చెప్పబడినది. అందుచే ఈ విధముగా దానిని బాగుగా తెలిసికొని, నీవు ఈ శరీరము కొరకు దుఃఖించుటకు తగవు.
భాష్యము :
ఇదివరకు వివరింపబడిన రీతి ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతను అది దర్శింపబడదు. కనుకనే అది అవ్యక్తమని తెలుపబడినది. ఇక డని అస్తిత్వమునకు సమంధించినంతవరకు శృతి లేదా వేదంజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవ్వరును ప్రయోగాత్మకముగా నిర్దారింపలేరు. అనుభవైకవేద్యమైన ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు వేరేవియును లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసియున్నది. కొన్ని విషయములు మనము కేవలము ఉన్నతమగు ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసివచ్చును. ఉదాహరణమునకు తల్లి ప్రామాణికతపై ఆధారపడి తండ్రి ఉనికిని గుర్తించుట సాధారణముగా జరుగుచుండును. అచ్చట తండ్రిని గుర్తించుటకు తల్లి ప్రామాణికత ఒక్కటే మార్గము. అదేవిధముగా ఆత్మను అవగతము చేసికొనుటకు కేవలము వేదాధ్యనము తప్ప వేరొక్క మార్గము లేదు. వేరుమాటలలో ఆత్మ యనునది మానవ మావవ ప్రయోగాత్మక జ్ఞానముచే అవగతము కానట్టిది. ఆత్మ చైతన్యస్వరూపమనియు మరియు చైతన్యసహితమనియు వేదములలో తెలుపబడినది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను. దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మ యందు మార్పులు సంభవింపవు. మార్పురహితమైనట్టిదిగా అట్టి ఆత్మ సదా అణురూపమున నిలిచియుండును. పరమాత్ముడు అనంతుడు కాగా, అణురూప ఆత్మ అత్యంత సూక్ష్మమైయున్నది.కావుననే మార్పురహితమగు సూక్ష్మమైన ఆత్మ ఏనాడును అనంతమైన పరమాత్మతో(భగవానునితో) సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని నిర్దారించుటకే ఈ సిద్ధాంతము వేదములందు పలురీతులుగా మరల మరల వివరింపబడినది. దోషరహితముగా ఒక విషయమును గూర్చి మనము అవగతము చేసికొనుటకై మరల మరల వివిరించుట అత్యంత అవరసరము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 25
2. avyakto ’yam acintyo ’yam
avikāryo ’yam ucyate tasmād evaṁ viditvainaṁ nānuśocitum arhasi
Translation :
It is said that the soul is invisible, inconceivable and immutable. Knowing this, you should not grieve for the body.
Purport :
As described previously, the magnitude of the soul is so small for our material calculation that he cannot be seen even by the most powerful microscope; therefore, he is invisible. As far as the soul’s existence is concerned, no one can establish his existence experimentally beyond the proof of śruti, or Vedic wisdom. We have to accept this truth, because there is no other source of understanding the existence of the soul, although it is a fact by perception. There are many things we have to accept solely on grounds of superior authority. No one can deny the existence of his father, based upon the authority of his mother. There is no source of understanding the identity of the father except by the authority of the mother. Similarly, there is no source of understanding the soul except by studying the Vedas. In other words, the soul is inconceivable by human experimental knowledge. The soul is consciousness and conscious – that also is the statement of the Vedas, and we have to accept that. Unlike the bodily changes, there is no change in the soul. As eternally unchangeable, the soul remains atomic in comparison to the infinite Supreme Soul. The Supreme Soul is infinite, and the atomic soul is infinitesimal. Therefore, the infinitesimal soul, being unchangeable, can never become equal to the infinite soul, or the Supreme Personality of Godhead. This concept is repeated in the Vedas in different ways just to confirm the stability of the conception of the soul. Repetition of something is necessary in order that we understand the matter thoroughly, without error.
🌹🌹🌹🌹🌹
Date: 13/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 62: 02వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 62: Chap. 02, Ver. 26
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 26
26. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ | తథాపి త్వం మాహాబాహో నైనం శోచితుమర్హసి ||
తాత్పర్యం :
ఓ మహాబాహో! ఒకవేళ నీవీ ఆత్మ ( లేదా జీవలక్షణములు) ఎల్లప్పుడును పుట్టుచు, మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు.
భాష్యము :
దేహమునకు పరముగా ఆత్మ కోక ప్రత్యేక ఉనికి కలదని అంగీకరింపని తత్త్వవేత్తల తెగ ఒకటి ఎల్లప్పుడు ఉండును. వారు దాదాపు బౌద్ధులను పోలినట్టివారు. శ్రీకృష్ణభగవానుడు గీతను తెలియజేసిన కాలమునందు అట్టివారు ఉన్నట్లుగా గోచరించుచున్నది. “లోకాయతికులు” మరియు “వైభాషికులు” అని తెలియబడు అట్టి తత్త్వవేత్తలు మూలకముల సరియైన సమ్మేళనము వలన జీవనము కలుగునని పలుకుదురు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తత్త్వవేత్తలు సైతము అదేవిధముగా తలతురు. వారి సిద్ధాంతము ప్రకారము మూలకముల కలయికలో కొన్ని భౌతిక, రసాయయనచర్యల వలన జీవము కలుగుచున్నది. నవీన మానవశాస్త్రములు ఇట్టి సిద్ధాంతము పైననే ఆధారపడియున్నది. పలు కుహునా ధర్మములు ఈ సిద్ధాంతమును మరియు భక్తిరహితమైన బౌద్ధవాదమును అనుసరించుచు అమెరికాదేశమునందు ప్రాచుర్యము నొందుచున్నది.
ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతము వలె ఆత్మ ఉనికిని గుర్తింపకున్నను దుఃఖించుటకు కారణము లేదు. కొన్ని రసాయనములు నష్టము వలన ఎవ్వరును చింతాక్రంతులై విధ్యుక్త ధర్మమును విడనాడరు. పైగా నేటి ఆధునిక యుద్ధపద్ధతిన శత్రువుపై విజయమును పొందుటకు మనుజుడు టన్నుల పరిమాణములో రసాయనములను వృథా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంతముప్రకారము దేహముతో పాటు ఆత్మ నశించును. కావున అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేదంనిర్ణయమును అంగీకరించినను లేదా ఆత్మ ఉనికిని నిరాకరించినను చింతించుటకు ఎట్టి కారణము లేదు. అనేకసంఖ్యలో జీవులు పదార్థముల కలయిక వలన ప్రతిక్షణము ఉత్పత్తి యగుచు వారిలో పలువురు నశించుచున్నందున అట్టి సంఘటనల విషయమున చింతింప నవసరము లేదని ఈ సిద్ధాంతపు వాదము. కావున అట్టి విషయమున చింతింప నవసరము లేదు. ఆత్మకు పునర్జన్మయే లేనిచో పితామహుడు మరియు గురువులను సంహరించుట ద్వారా పాపము కలుగునని అర్జునుడు భయము నొందుటకు కారణమే లేదు. ఇచ్చట శ్రీకృష్ణుడు అర్జునిని “మహాబాహో” యని ఎత్తిపొడుపు ధోరణిలో సంబోధించుచున్నాడు. వేదమార్గమును పాటించకున్నను కనీసము అర్జునుడు వేదజ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందులకు భగవానుడట్లు పలికెను. క్షత్రియునిగా అర్జునుడు వేదధర్మమునకు చెందినవాడైనందున అది అతనిని నియమపాలనము చేయువానిగా చేసినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 26
26. atha cainaṁ nitya-jātaṁ nityaṁ vā manyase mṛtam tathāpi tvaṁ mahā-bāho nainaṁ śocitum arhasi
Translation :
If, however, you think that the soul [or the symptoms of life] will always be born and die forever, you still have no reason to lament, O mighty-armed.
Purport :
There is always a class of philosophers, almost akin to the Buddhists, who do not believe in the separate existence of the soul beyond the body. When Lord Kṛṣṇa spoke the Bhagavad-gītā, it appears that such philosophers existed, and they were known as the Lokāyatikas and Vaibhāṣikas. Such philosophers maintain that life symptoms take place at a certain mature condition of material combination. The modern material scientist and materialist philosophers also think similarly. According to them, the body is a combination of physical elements, and at a certain stage the life symptoms develop by interaction of the physical and chemical elements. The science of anthropology is based on this philosophy. Currently, many pseudo religions – now becoming fashionable in America – are also adhering to this philosophy, as are the nihilistic nondevotional Buddhist sects.
Even if Arjuna did not believe in the existence of the soul – as in the Vaibhāṣika philosophy – there would still have been no cause for lamentation. No one laments the loss of a certain bulk of chemicals and stops discharging his prescribed duty. On the other hand, in modern science and scientific warfare, so many tons of chemicals are wasted for achieving victory over the enemy. According to the Vaibhāṣika philosophy, the so-called soul or ātmā vanishes along with the deterioration of the body. So, in any case, whether Arjuna accepted the Vedic conclusion that there is an atomic soul or he did not believe in the existence of the soul, he had no reason to lament. According to this theory, since there are so many living entities generating out of matter every moment, and so many of them are being vanquished every moment, there is no need to grieve for such incidents. If there were no rebirth for the soul, Arjuna had no reason to be afraid of being affected by sinful reactions due to his killing his grandfather and teacher. But at the same time, Kṛṣṇa sarcastically addressed Arjuna as mahā-bāhu, mighty-armed, because He, at least, did not accept the theory of the Vaibhāṣikas, which leaves aside the Vedic wisdom. As a kṣatriya, Arjuna belonged to the Vedic culture, and it behooved him to continue to follow its principles.
🌹🌹🌹🌹🌹
Date: 14/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 63: 02వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 63: Chap. 02, Ver. 27
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 27
27. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే(ర్థే న త్వం శోచితుమర్హసి ||
తాత్పర్యం :
పుట్టిన వానికి మరణము తప్పదు మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విధ్యుక్త ధర్మ నిర్వహణము నందు నీవు దుఃఖింప రాదు.
భాష్యము :
కర్మానుసారము ప్రతి యొక్కరు జన్మింప వలసి యున్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించి వేరొక జన్మ నొందవలసి యుండును. ఈ విధముగా జనన, మరణచక్రములో ప్రతియోక్కరు ముక్తి యనునది లేకుండా పరిభ్రమింతురు. ఇట్టి జననమరణచక్రము అనవసర హత్యలు, జంతుహింస, యుద్ధము వంటివానిని ప్రోత్సహించునది కాదు. కాని అదే సమయమున అట్టి హింస మరియు యుద్ధము లనునవి మానవసంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుటకు అనివార్య అంశములు కాగలవు.
శ్రీకృష్ణభగవానుని వాంఛ అయినందున కురుక్షేత్రయుద్ధము అనివార్యామై యుండెను. అంతియేగాక ధర్మము కొరకై యుద్ధము చేయుట క్షత్రియుల విధ్యుక్తధర్మమై యున్నది. తానూ విధ్యుక్తధర్మమునే నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందులకై తనవారి మరణమును గూర్చి చింతింపవలెను లేదా భయపడవలెను. ధర్మమును త్యజించి తద్ద్వారా పాపమును పొందుట అతనికి ఏమాత్రము తగదు. అటువంటి పాపము విషయమున అతడు మిగుల భీతుడై యున్నాడు. విధ్యుక్తధర్మమైన యుద్దమును విడునాడుట ద్వారా ఎన్నడును అతడు తన బంధువుల మరణము ఆపలేడు. పైగా అధర్మమార్గమును ఎంచుకొనుట వలన అతడు పతనము నొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 27
27. jātasya hi dhruvo mṛtyur dhruvaṁ janma mṛtasya ca tasmād aparihārye ’rthe na tvaṁ śocitum arhasi
Translation :
One who has taken his birth is sure to die, and after death one is sure to take birth again. Therefore, in the unavoidable discharge of your duty, you should not lament.
Purport :
One has to take birth according to one’s activities of life. And after finishing one term of activities, one has to die to take birth for the next. In this way one is going through one cycle of birth and death after another without liberation. This cycle of birth and death does not, however, support unnecessary murder, slaughter and war. But at the same time, violence and war are inevitable factors in human society for keeping law and order.
The Battle of Kurukṣetra, being the will of the Supreme, was an inevitable event, and to fight for the right cause is the duty of a kṣatriya. Why should he be afraid of or aggrieved at the death of his relatives since he was discharging his proper duty? He did not deserve to break the law, thereby becoming subjected to the reactions of sinful acts, of which he was so afraid. By avoiding the discharge of his proper duty, he would not be able to stop the death of his relatives, and he would be degraded due to his selection of the wrong path of action.
🌹🌹🌹🌹🌹
Date: 15/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 64: 02వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 64: Chap. 02, Ver. 28
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 28
28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత |
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||
తాత్పర్యం :
సృజింపబడిన జీవులందరు ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందురు. అట్టి యెడ దుఃఖించుటకు అవసరమేమి కలదు?
భాష్యము :
ఆత్మ ఉనికిని అంగీకరించువారు మరియు ఆత్మ ఉనికిని అంగీకరింపనివారు అనుచు తత్వవేత్తలు రెండు రకములుగా నున్నారు. వీరిలో ఎవరిని అనుసరించినప్పటికిని దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. వేదజ్ఞానము ననుసరించువారు ఆత్మ ఉనికిని అంగీకరింపని వారిని నాస్తికులని పిలుతురు. మాటవరుసకు ఆ నాస్తికవాదమును గ్రహించినను దుఃఖమునకు ఎత్తి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండగా భౌతికాంశములన్నియును సృష్టికి పూర్వము అవ్యక్తములై యుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్తస్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక ఎత్తైన భవంతిని ఉదాహరణముగా గైకొననిచో అది భూమ యొక్క పదార్థముల నుండియే వ్యక్తమగుచున్నది. దానిని కూలగొట్టి నప్పుడు అది తిరిగి అవ్యక్తమైదాని పదార్థములులన్నియును భూమిలో కలసిపోవును. శక్తి యనునది సృష్టింపబడదు మరియు నశింపబడదనెడి సిద్ధాంతము ప్రకారము శక్తి అక్షయమై యున్నను కాలములో అనేకములు వ్యక్తములై తిరిగి అవ్యక్తములగు చుండును. అట్టి యెడ వాటి వ్యక్తస్థితి గూర్చియు లేదా అవ్యక్తస్థితిని గూర్చియు దుఃఖించుటకు కారణమేమి? అవ్యక్తస్థితి యందు వాటికి నాశము లేదు. ఆద్యంతములు రెండింటి యందును అవి అవ్యక్తరూపమున నిలిచి మధ్యలో వ్యక్తములగుచున్నవి. కాని అది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు.
దేహము కాలక్రములో నశించు స్వభావము కలది(అన్తవన్త ఇమే దేహా:) అయినను ఆత్మ శాస్వతమైనదని (నిత్యస్యోక్తా: శరీరిణ:) యనెడి భగవద్గీత యందు తెలుపబడిన వేదసారాంశమును మనము అంగీకరింతుమేని ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సదా జ్ఞప్తి యందుంచు కొనవలెను. కావున వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖించవలెను? ఆత్మతో పోల్చినచో దేహమునకెట్టి అస్తిత్వము లేదు. అది ఒక స్వప్నము వంటిది. స్వప్నములో కొన్నిమార్లు మనము ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజు వలె ఒక రథము నందు కూర్చొనినట్లు గాంచవచ్చును. కాని మేల్కొంచినంతనే మనము ఆకాశమున గాని, రథమునందు గాని లేమని భోధపడగలదు. భౌతికదేహపు అస్తిత్వలేమిని ఆధారము చేసికోనియే వేదజ్ఞానము మనుజుని ఆత్మానుభవమునకు ప్రోత్సహించుచున్నది. కావున ఆత్మ యొక్క అస్తిత్వము అంగీకరించినను లేదా అంగీకరింపకున్నను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 28
28. avyaktādīni bhūtāni vyakta-madhyāni bhārata
avyakta-nidhanāny eva tatra kā paridevanā
Translation :
All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when annihilated. So what need is there for lamentation?
Purport :
Accepting that there are two classes of philosophers, one believing in the existence of the soul and the other not believing in the existence of the soul, there is no cause for lamentation in either case. Nonbelievers in the existence of the soul are called atheists by followers of Vedic wisdom. Yet even if, for argument’s sake, we accept this atheistic theory, there is still no cause for lamentation. Apart from the separate existence of the soul, the material elements remain unmanifested before creation. From this subtle state of nonmanifestation comes manifestation, just as from ether, air is generated; from air, fire is generated; from fire, water is generated; and from water, earth becomes manifested. From the earth, many varieties of manifestations take place. Take, for example, a big skyscraper manifested from the earth. When it is dismantled, the manifestation becomes again unmanifested and remains as atoms in the ultimate stage. The law of conservation of energy remains, but in course of time things are manifested and unmanifested – that is the difference. Then what cause is there for lamentation either in the stage of manifestation or in unmanifestation? Somehow or other, even in the unmanifested stage, things are not lost. Both at the beginning and at the end, all elements remain unmanifested, and only in the middle are they manifested, and this does not make any real material difference.
And if we accept the Vedic conclusion as stated in the Bhagavad-gītā that these material bodies are perishable in due course of time (antavanta ime dehāḥ) but that the soul is eternal (nityasyoktāḥ śarīriṇaḥ), then we must remember always that the body is like a dress; therefore why lament the changing of a dress? The material body has no factual existence in relation to the eternal soul. It is something like a dream. In a dream we may think of flying in the sky, or sitting on a chariot as a king, but when we wake up we can see that we are neither in the sky nor seated on the chariot. The Vedic wisdom encourages self-realization on the basis of the nonexistence of the material body. Therefore, in either case, whether one believes in the existence of the soul or one does not believe in the existence of the soul, there is no cause for lamentation for loss of the body.
🌹🌹🌹🌹🌹
Date: 16/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 65: 02వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 65: Chap. 02, Ver. 29
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 29
29. ఆశ్చర్యవత్ పశ్యతి కష్చిదేనమ్ ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య: |
ఆశ్చర్యవచ్చైనమన్య: శ్రుణోతి శ్రుత్వాప్యేనం వేదం న చైవ కశ్చిత్ ||
తాత్పర్యం :
కొందరు ఆత్మను అధ్బుతమైనదానిగా గాంచుదురు. కొందరు దానిని అధ్బుతమైన దానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అధ్బుతమైనదానిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు.
భాష్యము :
అధికపరిమాణ దేహము గల జంతువునందు మరియు ఘనమైన అశ్వత్థవృక్షమునందే గాక, ఒక అంగుళమాత్ర స్థలములో కోట్లాది సంఖ్యలో నుండు సూక్ష్మజీవుల యందును ఆత్మ ఉన్నదనెడు విషయము నిక్కముగా అధ్బుతమైనది. అల్పజ్ఞులు మరియు తపోనిష్ట లేనివారు ఇట్టి ఆత్మ యొక్క అధ్బుతకర్మలను తెలియకున్నారు. విశ్వమునందు తొలిజీవియైన బ్రహ్మదేవునకు సైతము జ్ఞానము ప్రసాదించిన పరమప్రామణికుడైన శ్రీకృష్ణభగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు. కేవలము భౌతికభావనయే కలిగియుండుట వలన ఎట్లు అణుపరిమాణ ఆత్మ అతిపెద్దదిగా మరియు అతి చిన్నదిగా వర్తింపగలదో ఈ కాలపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు దాని నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అధ్బుతమైనదిగా గాంతురు. భౌతికశక్తిచే మోహమునకు గురియై జనులు ఇంద్రియభోగ విషయములందే అధికముగా రతులగుదురు. ఆత్మానుభవమును పొందకున్నచో కర్మలన్నియును జీవనసంఘర్షణలో అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు. ప్రతియొక్కరు ఆత్మను గూర్చి తెలిసికొని తద్ద్వారా భౌతికక్లేశములను పరిష్కారము చూపవలెనని వారు బహుషా తెలిసియుండకపోవచ్చును.
ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సంగమున ప్రవచనములను వినుచుందురు. కాని కొన్నిమార్లు అజ్ఞానవశమున వారు ఆత్మ మరియు పరమాత్మ లిరివురును ఒక్కటే యనియు, వారివురి నడుమ పరిమాణమందును భేదము లేదనియు భావించి తప్పుమార్గమున చనుదురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మల, వారి నడుమ గల సంబంధమును, వారికి సంబంధించిన విషయములనన్నింటిని సంపూర్తిగా తెలిసిన మనుజుడు దుర్లభుడు. ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది, ఆత్మ యొక్క స్థానమును వివిధకోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత దుర్లభుడు. కాని ఏదియో ఒక విధముగా ఈ ఆత్మను గుర్చిన విషయమును మనుజుడు అవగతము చేసికొనినచో జన్మ సఫలము కాగలదు.
ఇతర సిద్ధాంతములచే మార్గము తప్పకుండా పరంప్రామాణికుడైన శ్రీకృష్ణభగవానుడు పలికిన గీతావాక్యములకు యథాతథముగా అంగీకరించుటయే ఆత్మను గూర్చి అవగతము చేసికొనుట సులభమైన మార్గమై యున్నది. కాని దానికి కూడా అధికమైన తపస్సు మరియు త్యాగము అవసరము. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు పూర్వము మనుజుడు (ఈ జన్మయందు గాని లేదా పూర్వజన్మలందు గాని) తపోసంపన్నుడు కావలసియుండును. శుద్ధభక్తుని నిర్హేతుక కరుణ చేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతమగును గాని అన్యథా కాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 29
29. āścarya-vat paśyati kaścid enam
āścarya-vad vadati tathaiva cānyaḥ
āścarya-vac cainam anyaḥ śṛṇoti
śrutvāpy enaṁ veda na caiva kaścit
Translation :
Some look on the soul as amazing, some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all.
Purport :
The fact that the atomic soul is within the body of a gigantic animal, in the body of a gigantic banyan tree, and also in the microbic germs, millions and billions of which occupy only an inch of space, is certainly very amazing. Men with a poor fund of knowledge and men who are not austere cannot understand the wonders of the individual atomic spark of spirit, even though it is explained by the greatest authority of knowledge, who imparted lessons even to Brahmā, the first living being in the universe. Owing to a gross material conception of things, most men in this age cannot imagine how such a small particle can become both so great and so small. So men look at the soul proper as wonderful either by constitution or by description. Illusioned by the material energy, people are so engrossed in subject matters for sense gratification that they have very little time to understand the question of self-understanding, even though it is a fact that without this self-understanding all activities result in ultimate defeat in the struggle for existence. Perhaps they have no idea that one must think of the soul, and thus make a solution to the material miseries.
Some people who are inclined to hear about the soul may be attending lectures, in good association, but sometimes, owing to ignorance, they are misguided by acceptance of the Supersoul and the atomic soul as one without distinction of magnitude. It is very difficult to find a man who perfectly understands the position of the Supersoul, the atomic soul, their respective functions and relationships and all other major and minor details. And it is still more difficult to find a man who has actually derived full benefit from knowledge of the soul, and who is able to describe the position of the soul in different aspects. But if, somehow or other, one is able to understand the subject matter of the soul, then one’s life is successful.
The easiest process for understanding the subject matter of self, however, is to accept the statements of the Bhagavad-gītā spoken by the greatest authority, Lord Kṛṣṇa, without being deviated by other theories. But it also requires a great deal of penance and sacrifice, either in this life or in the previous ones, before one is able to accept Kṛṣṇa as the Supreme Personality of Godhead. Kṛṣṇa can, however, be known as such by the causeless mercy of the pure devotee and by no other way.
🌹🌹🌹🌹🌹
Date: 17/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 66: 02వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 66: Chap. 02, Ver. 30
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 30
30. దేహీ నిత్య మవధ్యోయం దేహేసర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాణి న త్వం శోచితుమర్హసి ||
తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా! దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖించుట తగదు.
భాష్యము :
అవధ్యమైన ఆత్మను గూర్చిన ఉపదేశము శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ముగించుచున్నాడు. అమరమైన ఆత్మను గూర్చి అనేక విధములుగా వివరించుచు అది నిత్యమైనదియు, దేహము శాశ్వతము కానిదనియు భగవానుడు నిర్దారించెను. కావున పితామహుడైన భీష్ముడు మరియు గురువైన ద్రోణుడు యుద్ధమున మరణింతురనెడి భీతితో క్షత్రియుడైన అర్జునుడు యుద్దమును త్యజింపరాదు. శ్రీకృష్ణుని ప్రామణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతియెక్కరు విశ్వసింపవలెను. ఆత్మ యనునది లేదనియు లేదా రసాయనముల కలయికతో ఒకానొక స్థితిలో జీవము పుట్టుననియు భావించరాదు. ఆత్మ నిత్యమైనను హింస ఎన్నడును ప్రోత్సహనీయము కాదు. కాని యుద్ధసమయమున దాని నిజమైన అవసరము కలిగినపడు మాత్రము దానిని తజించరాదు. అట్టి అవసరము భగవానుని ఆదేశము పైననే సమర్థింపవలెను గాని తోచినరీతిగా కాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 30
30. dehī nityam avadhyo ’yaṁ
dehe sarvasya bhārata
tasmāt sarvāṇi bhūtāni
na tvaṁ śocitum arhasi
Translation :
O descendant of Bharata, he who dwells in the body can never be slain. Therefore you need not grieve for any living being.
Purport :
The Lord now concludes the chapter of instruction on the immutable spirit soul. In describing the immortal soul in various ways, Lord Kṛṣṇa establishes that the soul is immortal and the body is temporary. Therefore Arjuna as a kṣatriya should not abandon his duty out of fear that his grandfather and teacher – Bhīṣma and Droṇa – will die in the battle. On the authority of Śrī Kṛṣṇa, one has to believe that there is a soul different from the material body, not that there is no such thing as soul, or that living symptoms develop at a certain stage of material maturity resulting from the interaction of chemicals. Though the soul is immortal, violence is not encouraged, but at the time of war it is not discouraged when there is actual need for it. That need must be justified in terms of the sanction of the Lord, and not capriciously.
🌹🌹🌹🌹🌹
Date: 18/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 67: 02వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 67: Chap. 02, Ver. 31
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 31
31. స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |
ధర్మ్యాద్ది యుద్ధాచ్చ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ||
తాత్పర్యం :
క్షత్రియునిగా స్వధర్మము ననుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరోక్కటి లేదని నివెరుగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు.
భాష్యము :
సంఘము నడచుటకై అవసరమైన నాలుగు విధములైన వర్ణములలో సత్పరిపాలన కొరకై యున్న రెండవ వర్ణమునకు క్షత్రియవర్ణమని పేరు. “క్షత్” అనగా హాని యని భావము. హాని నుండి రక్షణము గూర్చువారే క్షత్రియులు (త్రాయతే – రక్షించుట). సాధారణముగా సంహారము విషయమున క్షత్రియులకు అరణ్యమున శిక్షణ ఇవ్వబడును. క్షత్రియులు అడవికి పోయి, ఒంటరిగా పులితో ఖడ్గమును బూని తలపడి, అది మరణించిన పిమ్మట దానికి రాజలాంఛనములతో దహనక్రియలు చేయుదురు. ఈ విధమైన పధ్ధతి నేటికిని జైపూరు రాష్ట్రమనందలి క్షత్రియవంశరాజులచే పాటింపబడుచున్నది. ధర్మరహితమైన హింసయనునది కొన్నిమార్లు అత్యంత అవసరమైనది కనుక క్షత్రియులకు పోటీపడుట మరియు సంహరించుట యందు అభ్యాసము గూర్చబడును. కావుననే క్షత్రియులు నేరుగా సన్యాసమును స్వీకరించరాదు. అహింస యనునది రాజనీతి యందు ఒక తంత్రమైన అది ఎన్నడును ఒక సిద్ధాంతము కాదు.
స్వధర్మము రెండు రకములు. ముక్తిని పొందనంత వరకు మనుజుడు దేహమునకు సంబంధించిన విధ్యుక్తధర్మములను ధర్మనుసారముగా ముక్తిని పొందుట కొరకై ఒనరించవలెను. ముక్తిని పొందిన పిమ్మట స్వధర్మము ఆధ్యాత్మికము కాగలదు. అది ఆపై దేహభావన యందున్నంత వరకు బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు వేరు వేరు ధర్మములుండును. అట్టి ధర్మములు అనివార్యములు. వాస్తవమునకు సస్వధర్మము భగవానునిచే నిర్ణయింపబడినది. ఈ విషయము చతుర్థాధ్యాయము నందు స్పష్టపరుపబడినది. దేహభావనలో ఒనరింపబడెడి స్వధర్మము వర్ణాశ్రమధర్మముగా పిలువబడుచున్నది.అదియే మనుజుని ఆధ్యాత్మిక అవగాహనమునకు సోపానమై యున్నది. వర్ణాశ్రమధర్మ పాలనముతో (గుణముల ననుసరించియున్న ప్రత్యేకధర్మములు) మానవనాగరికత ఆరంభమగును. ఏ రంగమునందైనను ప్రామాణికులైన వారి ఆజ్ఞల ప్రకారము స్వధర్మము నిర్వహించుట యనునది మనుజుని ఉత్తమజన్మమునకు ఉద్ధరించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 31
31. sva-dharmam api cāvekṣya na vikampitum arhasi dharmyād dhi yuddhāc chreyo ’nyat kṣatriyasya na vidyate
Translation :
Considering your specific duty as a kṣatriya, you should know that there is no better engagement for you than fighting on religious principles; and so there is no need for hesitation.
Purport :
Out of the four orders of social administration, the second order, for the matter of good administration, is called kṣatriya. Kṣat means hurt. One who gives protection from harm is called kṣatriya (trāyate – to give protection). The kṣatriyas are trained for killing in the forest. A kṣatriya would go into the forest and challenge a tiger face to face and fight with the tiger with his sword. When the tiger was killed, it would be offered the royal order of cremation. This system has been followed even up to the present day by the kṣatriya kings of Jaipur state. The kṣatriyas are specially trained for challenging and killing because religious violence is sometimes a necessary factor. Therefore, kṣatriyas are never meant for accepting directly the order of sannyāsa, or renunciation. Nonviolence in politics may be a diplomacy, but it is never a factor or principle.
There are two kinds of sva-dharmas, specific duties. As long as one is not liberated, one has to perform the duties of his particular body in accordance with religious principles in order to achieve liberation. When one is liberated, one’s sva-dharma – specific duty – becomes spiritual and is not in the material bodily concept. In the bodily conception of life there are specific duties for the brāhmaṇas and kṣatriyas respectively, and such duties are unavoidable. Sva-dharma is ordained by the Lord, and this will be clarified in the Fourth Chapter. On the bodily plane sva-dharma is called varṇāśrama-dharma, or man’s steppingstone for spiritual understanding. Human civilization begins from the stage of varṇāśrama-dharma, or specific duties in terms of the specific modes of nature of the body obtained. Discharging one’s specific duty in any field of action in accordance with the orders of higher authorities serves to elevate one to a higher status of life.
🌹🌹🌹🌹🌹
Date: 19/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 68: 02వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 68: Chap. 02, Ver. 32
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 32
32. యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖిన: క్షత్రియా: పార్థ లభన్తే యుద్ధమీదృశమ్ ||
తాత్పర్యం :
ఓ పార్థా! స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్దావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు.
భాష్యము :
“ఈ యుద్ధము నందు ఎటువంటి శుభమును నేను గాంచుట లేదు. ఇది శాశ్వతమగు నరకవాసమునే గూర్చును.” అని పలికిన అర్జునుని నైజమును జగద్గురువైన శ్రీకృష్ణుడు నిరసించుచున్నాడు. అర్జునుని అట్టి పలుకులు కేవలము అజ్ఞానజనితములు. అతడు తన విధ్యుక్తధధర్మ నిర్వహణమునందు అహింసను పాటింపదలచెను. క్షత్రియుడైనవాడు యుద్ధరంగమునందు అహింసను పాటించుట యనునది మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని జనకుడు మరియు గొప్ప ఋషియైన పరాశరుడు రచించిన పరాశరుడు రచించిన పరాశరస్మృతి యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
క్షత్రియో హి ప్రజా రక్షన్ శస్త్రపాణి: ప్రదణ్డయన్ |
ననిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయేత్ ||
“పౌరులకు అన్నిరకములైన కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మమై యున్నందున అవసరమగు విషయములందు శాంతిభద్రతల పరిరక్షణకై హింసను చేపట్టవలసి యుండును. కావున అతడు శత్రురాజుల సైన్యమును జయించి, తదుపరి ధర్మబద్దముగా రాజ్యమును పాలించెను.
ఈ విషయమున నన్నింటిని బట్టి అర్జునుడు యుద్దమును త్యజించుటకు ఎట్టి కారణము లేదు. శత్రువులను జయించినచో రాజ్యమును అతడు అనుభవింపగలడు. ఒకవేళ యుద్ధరంగమునందు మరణించినచో ద్వారములు తెరువబడియున్న స్వర్గమునకు అతడు చేరగలడు. కావున ఏ విధముగా గాంచినను యుద్ధమే అతనికి లాభదాయకమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 32
32. yadṛcchayā copapannaṁ svarga-dvāram apāvṛtam sukhinaḥ kṣatriyāḥ pārtha labhante yuddham īdṛśam
Translation :
O Pārtha, happy are the kṣatriyas to whom such fighting opportunities come unsought, opening for them the doors of the heavenly planets.
Purport :
As supreme teacher of the world, Lord Kṛṣṇa condemns the attitude of Arjuna, who said, “I do not find any good in this fighting. It will cause perpetual habitation in hell.” Such statements by Arjuna were due to ignorance only. He wanted to become nonviolent in the discharge of his specific duty. For a kṣatriya to be on the battlefield and to become nonviolent is the philosophy of fools. In the Parāśara-smṛti, or religious codes made by Parāśara, the great sage and father of Vyāsadeva, it is stated:
kṣatriyo hi prajā rakṣan śastra-pāṇiḥ pradaṇḍayan nirjitya para-sainyādi kṣitiṁ dharmeṇa pālayet
“The kṣatriya’s duty is to protect the citizens from all kinds of difficulties, and for that reason he has to apply violence in suitable cases for law and order. Therefore he has to conquer the soldiers of inimical kings, and thus, with religious principles, he should rule over the world.”
Considering all aspects, Arjuna had no reason to refrain from fighting. If he should conquer his enemies, he would enjoy the kingdom; and if he should die in the battle, he would be elevated to the heavenly planets, whose doors were wide open to him. Fighting would be for his benefit in either case.
🌹🌹🌹🌹🌹
Date: 20/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 69: 02వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 69: Chap. 02, Ver. 33
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 33
33. అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తత: స్వధర్మ్యం కీర్తిం చ హిత్వా పాప మువాప్స్యసి ||
తాత్పర్యం :
ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్దమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచి నందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడవనెడి కీర్తిని నీవు పోగొట్టుకొందువు.
భాష్యము :
అర్జునుడు ప్రసిద్ధి గాంచిన యోధుడు. శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధమొనర్చి అతడు కీర్తిని బడసెను. వేటగాని రూపములో నున్న శివుని అర్జునుడు రణమునందు ఓడించెను. ఆ విధముగా అతడు శివుని మెప్పించి అతని నుండు పాశుపాతాస్త్రమును బహుమతిగా పొందెను. కనుకనే అర్జునుడు గొప్ప యోధుడని సర్వులు ఎరుగుదురు. ద్రోణాచార్యుడు సైతము అతనికి అనేక వరములను మరియు గురువును సైతము వధింపగల విశేష శక్తివంతమైన ఆయుధమును నొసగెను. ఈ విధముగా అర్జునుడు పలువురు మహానుభావుల నుండు యుద్ధమునకు కావలసిన యోగ్యతలను సాధించెను. స్వర్గాధిపతి మరియు జనకుడైన ఇంద్రుని నుండియు అతడు వరములను పొందెను. కాని ఇప్పుడు అతడు యుద్దమును త్యజించినచో క్షత్రియునిగా తన ధర్మమును అలక్ష్య పరచిన వాడగుటయే గాక, పేరు ప్రతిష్టలను కోల్పోయి నరకమునకు రాచమార్గమును తయారు చేసికొనిన వాడగును. అనగా వేరు మాటలలో యుద్దమును చేయుట వలన గాక, దాని నుండి విరమించుట ద్వారా అతడు నరకమును పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 33
33. atha cet tvam imaṁ dharmyaṁ saṅgrāmaṁ na kariṣyasi tataḥ sva-dharmaṁ kīrtiṁ ca hitvā pāpam avāpsyasi
Translation :
If, however, you do not perform your religious duty of fighting, then you will certainly incur sins for neglecting your duties and thus lose your reputation as a fighter.
Purport :
Arjuna was a famous fighter, and he attained fame by fighting many great demigods, including even Lord Śiva. After fighting and defeating Lord Śiva in the dress of a hunter, Arjuna pleased the lord and received as a reward a weapon called pāśupata-astra. Everyone knew that he was a great warrior. Even Droṇācārya gave him benedictions and awarded him the special weapon by which he could kill even his teacher. So he was credited with so many military certificates from many authorities, including his adoptive father Indra, the heavenly king. But if he abandoned the battle, not only would he neglect his specific duty as a kṣatriya, but he would lose all his fame and good name and thus prepare his royal road to hell. In other words, he would go to hell not by fighting but by with drawing from battle.
🌹🌹🌹🌹🌹
Date: 21/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 70: 02వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 70: Chap. 02, Ver. 34
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 34
34. అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిర్మ రణాదతి రిచ్యతే ||
తాత్పర్యం :
జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడును చెప్పుకొనుదురు. గౌరవనీయుడైనవానికి అపకీర్తి యనునది మరణము కన్నను దారుణ దారుణమైనది.
భాష్యము :
అర్జునుని యుద్ధవిముఖతను గూర్చి శ్రీకృష్ణభగవానుడు అతని స్నేహితుడు మరియు తత్త్వబోధకుని రూపమున తన తుది తీర్పును ఈ విధముగా పలుకుచున్నాడు. “ఓ అర్జునా! యుద్ధము ప్రారంభము గాకమునుపే నీవు యుద్ధరంగమును వీడినచో నిన్ను జనులు భీరువని పిలుతురు. జనులు నిందించినను రణరంగము నుండి పారిపోయినచో ప్రాణములు దక్కగలవని నీవు భావించవచ్చును. కాని ఈ విషయమున నీవు యుద్ధరంగమున మరణించుటయే ఉత్తమమని నా ఉపదేశము. నీ వంటి గౌరవనీయునికి అపకీర్తి యనునది మరణము కన్నను దారుణమైనది. కావున ప్రాణభీతితో నీవు పారిపోరాదు. యుద్ధమునందు మరణించుటయే ఉత్తమము. అది నా స్నేహితమును దుర్వినియోగాపరచుట నుండియు మరియు సంఘమునందు గౌరవమును కోల్పోవుట నుండియు నిన్ను కాపాడగలదు.”
కావున యుద్ధరంగమును వీడుట కన్నను దాని యందే మరణించుట అర్జునునకు ఉత్తమమనుట శ్రీకృష్ణభగవానుని తుది తీర్పుయై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 34
34. akīrtiṁ cāpi bhūtāni kathayiṣyanti te ’vyayām sambhāvitasya cākīrtir maraṇād atiricyate
Translation :
People will always speak of your infamy, and for a respectable person, dishonor is worse than death.
Purport :
Both as friend and philosopher to Arjuna, Lord Kṛṣṇa now gives His final judgment regarding Arjuna’s refusal to fight. The Lord says, “Arjuna, if you leave the battlefield before the battle even begins, people will call you a coward. And if you think that people may call you bad names but that you will save your life by fleeing the battlefield, then My advice is that you’d do better to die in the battle. For a respectable man like you, ill fame is worse than death. So, you should not flee for fear of your life; better to die in the battle. That will save you from the ill fame of misusing My friendship and from losing your prestige in society.”
So, the final judgment of the Lord was for Arjuna to die in the battle and not withdraw
🌹🌹🌹🌹🌹
Date: 22/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 71: 02వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 71: Chap. 02, Ver. 35
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 35
35. భయాద్ రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథా: |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||
తాత్పర్యం :
నీ పేరు ప్రతిష్టల యెడ గొప్ప గౌరవమును కలిగియున్న సేనాదిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడినావని తలచి నిన్ను చులకన చేయుదురు.
భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు తన తీర్పును ఇంకను కొనసాగించుచున్నాడు. “సోదరులు మరియు పితామహుని పై గల జాలితో యుద్దరంగమును వీడితివని దుర్యోధనుడు, కర్ణుడు మొదలగు సేనాధిపతులు భావింతురని నీవు తలచకుము. నీవు ప్రాణభయముతోనే పలాయనమైతివని వారు తలచెదరు. తత్కారణమున నీ పేరు ప్రతిష్టల యెడ వారి గొప్ప అభిప్రాయము నశించిపోగలదు”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 35
35. bhayād raṇād uparataṁ maṁsyante tvāṁ mahā-rathāḥ yeṣāṁ ca tvaṁ bahu-mato bhūtvā yāsyasi lāghavam
Translation :
The great generals who have highly esteemed your name and fame will think that you have left the battlefield out of fear only, and thus they will consider you insignificant.
Purport :
Lord Kṛṣṇa continued to give His verdict to Arjuna: “Do not think that the great generals like Duryodhana, Karṇa and other contemporaries will think that you have left the battlefield out of compassion for your brothers and grandfather. They will think that you have left out of fear for your life. And thus their high estimation of your personality will go to hell.”
🌹🌹🌹🌹🌹
Date: 23/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 72: 02వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 72: Chap. 02, Ver. 36
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 36
36. అ అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితా: | నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ||
తాత్పర్యం :
నీ శత్రువులు నిన్ను పలు నిర్దయవాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకన్నను నీకు దుఃఖకరమైనది వేరేది గలదు?
భాష్యము :
అర్జునుని అవాంఛితమైన జాలిని గాంచి శ్రీకృష్ణభగవానుడు తొలుత దిగ్బ్రాంతి చెందెను. అట్టి జాలి అనార్యులకు మాత్రమే తగినదని అతడు తెలియజేసెను. ఈ విధముగా భగవానుడు పలువాక్యములతో అర్జునుని అవాంఛిత కరుణకు విరుద్ధముగా తన వాదమును నిరూపణ చేసియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 36
36. avācya-vādāṁś ca bahūn vadiṣyanti tavāhitāḥ nindantas tava sāmarthyaṁ tato duḥkha-taraṁ nu kim
Translation :
Your enemies will describe you in many unkind words and scorn your ability. What could be more painful for you?
Purport :
Lord Kṛṣṇa was astonished in the beginning at Arjuna’s uncalled-for plea for compassion, and He described his compassion as befitting the non-Āryans. Now in so many words, He has proved His statements against Arjuna’s so-called compassion.
🌹🌹🌹🌹🌹
Date: 24/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 73: 02వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 73: Chap. 02, Ver. 37
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 37
37. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ట కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయ: ||
తాత్పర్యం :
ఓ కుంతీ తనయా! నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుతటయో లేక యుద్దమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృతనిశ్చయుడవై లేచి యుద్ధము చేయుము.
భాష్యము :
తన పక్షమున జయము కలుగనున్న నిశ్చయము లేకున్నను అర్జునుడు యుద్దమును చేయవలసియే యున్నది. ఏలయన అట్టి యుద్ధమునందు మరణించినను అతడు స్వర్గలోకములను పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 37
37. hato vā prāpsyasi svargaṁ jitvā vā bhokṣyase mahīm tasmād uttiṣṭha kaunteya yuddhāya kṛta-niścayaḥ
Translation :
Your enemies will describe you in many unkind words and scorn your ability. What could be more painful for you?
Purport :
Even though there was no certainty of victory for Arjuna’s side, he still had to fight; for, even being killed there, he could be elevated into Heavenly planets
🌹🌹🌹🌹🌹
Date: 25/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 74: 02వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 74: Chap. 02, Ver. 38
🌹శరీమద్భగవద్గీత 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 38
38. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమువాప్స్యసి ||
సుఖదు:ఖములను గాని, లాభాలాభములను గాని, జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయము. ఆ విధముగా చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు.
భాష్యము :
తాను యుద్దమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణభగవానుడు ఇప్పుడు నేరుగా పలుకుచున్నాడు. కృష్ణపరమైన కర్మల యందు సుఖదు:ఖములు, లాభనష్టములు, జయాపజయములు వంటి భావనలకు తావు లేదు. ప్రతిదియు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరింపవలెననుట ద్వియభావానము. కావున అట భౌతికకర్మల వలన బంధము కలుగదు. తన ఇంద్రియప్రీత్యర్థమే కర్మనొనరించువాడు నిక్కముగా బద్దుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేదా రాజసమైనను తదనుగుణమైన ఫలము ప్రాప్తించియే తీరును. కాని కృష్ణభక్తిభావనలో సంపూర్ణ శరణాగతి నొందినవాడు అట్లుగాక ఎవ్వరికిని ఋణపడడు మరియు బద్ధుడు కాడు. కాని సామాన్య కార్యము లందు రతుడైనవాడు ఋణియై యున్నాడు. శ్రీమద్భాగవతము (11.5.41) నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.
దేవర్షిభూతాప్తనృణాం పిత్రూణాం న కింకరో నాయం ఋణి చ రాజన్ |
సర్వాత్మనా య: శరణం శరణ్యం గతో ముకున్దం పరిహృత్య కర్తమ్ ||
సర్వధర్మములను త్యజించి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని పొందెడివాడు దేవతలకు గాని, ఋషులకు గాని, జనులకు గాని, బంధువులకు గాని, పితృదేవతలకు గాని ఋణపడియుండడు మరియు సేవకుడు కాబోడు. “ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు పరోక్షముగా ఈ శ్లోకము నందు తెలియజేసేను. రాబోవు శ్లోకములలో ఈ విషయమును మరింత స్పష్టముగా వివరింప బడును
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 38
38. sukha-duḥkhe same kṛtvā lābhālābhau jayājayau tato yuddhāya yujyasva naivaṁ pāpam avāpsyasi
Translation :
Do thou fight for the sake of fighting, without considering happiness or distress, loss or gain, victory or defeat – and by so doing you shall never incur sin.
Purport :
Lord Kṛṣṇa now directly says that Arjuna should fight for the sake of fighting because He desires the battle. There is no consideration of happiness or distress, profit or loss, victory or defeat in the activities of Kṛṣṇa consciousness. That everything should be performed for the sake of Kṛṣṇa is transcendental consciousness; so there is no reaction to material activities. He who acts for his own sense gratification, either in goodness or in passion, is subject to the reaction, good or bad. But he who has completely surrendered himself in the activities of Kṛṣṇa consciousness is no longer obliged to anyone, nor is he a debtor to anyone, as one is in the ordinary course of activities. It is said:
devarṣi-bhūtāpta nṛṇāṁ pitṝṇāṁ na kiṅkaro nāyam ṛṇī ca rājan sarvātmanā yaḥ śaraṇaṁ śaraṇyaṁ gato mukundaṁ parihṛtya kartam
“Anyone who has completely surrendered unto Kṛṣṇa, Mukunda, giving up all other duties, is no longer a debtor, nor is he obliged to anyone – not the demigods, nor the sages, nor the people in general, nor kinsmen, nor humanity, nor forefathers.” (Bhāg. 11.5.41) That is the indirect hint given by Kṛṣṇa to Arjuna in this verse, and the matter will be more clearly explained in the following verses.
🌹🌹🌹🌹🌹
Date: 25/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 75: 02వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 75: Chap. 02, Ver. 39
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 39
39. ఏషా తే(భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి ||
తాత్పర్యం :
ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ననుసరించి నీకు వివరించితిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమున వివరించెదను ఆలకింపుము. ఓ పృథాకుమారా! అట్టి జ్ఞానము ననుసరించి నీవు వర్తింతువేని కర్మబంధము నుండి విడివడగలవు.
భాష్యము :
వేదనిఘంటువైన “నిరుక్తి” ననుసరించి “సాంఖ్యము” అనగా సంపూర్ణముగా వివరించునదని భావము. సాంఖ్య మనునది ఆత్మ యొక్క నిజస్వభావమును వివరించు తత్త్వము కాగా, యోగము ఇంద్రియముల నియమమును కూడియుండును. ఇచ్చట యుద్ధము నుండి విరమించుటనెడి అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ ప్రీతిపై ఆధారపడి యున్నది. ధృతరాష్ట్రుని తనయులైన తన సోదరులను, జ్ఞాతులను యుద్ధములో జయించి రాజ్యము ననుభవించుట కన్నాను వారిని యుద్ధములో వధింపకుండుట తనకు ఎక్కువ ఆనందమును కలుగజేయునని తలచియుండుట చేతనే ముఖ్యధర్మమును మరచి అతడు యుద్ధము నుండి విరమిమప గోరెను. అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములను ఇంద్రియ ప్రీతికి సంబంధించినవే. వారిని జయించుటచే కలిగెడి ఆనందము మరియు వారిని జీవితులుగా గాంచుటచే ఒసగూడెడి ఆనందము రెండును జ్ఞాన ధర్మములను పణముగా పెట్టునటువంటి దేహభావనపై ఆధారపడియున్నవి. పితామహుని దేహమును వధించుట ఆత్మను వధించుట కాబోదని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు వివరింపగోరెను. సర్వులు ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరును శాశ్వతముగా వ్యక్తిగతులనియు, అందరును భూత, భవిష్యత్, వర్తమానములందిన్ని వేళలా ఉండగలరనియు భగవానుడు వివరించెను. కేవలము మనము దేహములనే పలురీతులుగా మార్చుచున్నాము. కాని దేహబంధము నుండి ముక్తి పిదపయు మన వ్యక్తిత్వము నిలిచియుండును. ఈ విధముగా ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషణాత్మక వివరణను శ్రీకృష్ణభగవానుడు తెలియజేసెను. వివిధకోణములలో కావింపబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన వివరణాత్మక జ్ఞానమే నిరుక్తి నిఘంటువు ననుసరించి సాంఖ్యజ్ఞానముగా తెలుపబడినది. ఈ సాంఖ్య జ్ఞానమునకు మరియు నాస్తికుడైన కపిలునిచే తెలుపబడిన సాంఖ్యతట్ట్వమునకు ఎట్టి సంబంధము లేదు. నాస్తికుడైన కపిలును సాంఖ్యము కన్నను పూర్వమే శ్రీకృష్ణుని అవతారమైన కపిల భగవానునిచే సాంఖ్యతత్త్వము శ్రీమద్భాగవతము నందు వివరింపబడినది. కపిల భగవానుడు ఈ తత్త్వమును తన తల్లియైన దేవహుతికి వివరించెను. పురుషుడు లేదా భగవానుడు చైతన్యవంతుడనియు మరియు ప్రకృతిపై అతడు దృష్టిని సారించుట ద్వారా సృష్టికార్యక్రమమును నిర్వహించుననియు కపిలభగవానుడు స్పష్టముగా దాని యందు తెలియజేసెను. ఈ విషయమును వేదములందు మరియు గీత యందు అంగీకరింపబడినది. ప్రకృతిపై దృష్టిని సారించుట ద్వారా భగవానుడు జీవులను దాని యందు నిలిపెనని వేదములు తెలియ జేయుచున్నవి. ఆ జీవులందరు ఈ భౌతికజగమున ఇంద్రియప్రీత్యర్థమై శ్రమించుచు మాయావశమున తమను తాము భోక్తలుగా భావింతురు. ఈ భోగానుభవమే ముక్తస్థితి యందును భగవానునితో ఏకము కావలెనను భావనగా జీవుని పట్టి పీడించును.ఇట్టి భావనయే మాయ(ఇంద్రియపు భ్రాంతి) యొక్క చివరి వల. ఇంద్రియభోగపు కర్మలను గూడిన పలుజన్మలు ఆ విధముగా గడచిన పిమ్మట మాహాత్ముడైన వాడు వాసుదేవుని శరణుజొచ్చును. తద్ద్వారా పరతత్త్వాన్వేషణము సఫలము కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 39
39. eṣā te ’bhihitā sāṅkhye buddhir yoge tv imāṁ śṛṇu buddhyā yukto yayā pārtha karma-bandhaṁ prahāsyasi
Translation :
Thus far I have described this knowledge to you through analytical study. Now listen as I explain it in terms of working without fruitive results. O son of Pṛthā, when you act in such knowledge you can free yourself from the bondage of works.
Purport :
According to the Nirukti, or the Vedic dictionary, saṅkhyā means that which describes things in detail, and sāṅkhya refers to that philosophy which describes the real nature of the soul. And yoga involves controlling the senses. Arjuna’s proposal not to fight was based on sense gratification. Forgetting his prime duty, he wanted to cease fighting, because he thought that by not killing his relatives and kinsmen he would be happier than by enjoying the kingdom after conquering his cousins and brothers, the sons of Dhṛtarāṣṭra. In both ways, the basic principles were for sense gratification. Happiness derived from conquering them and happiness derived by seeing kinsmen alive are both on the basis of personal sense gratification, even at a sacrifice of wisdom and duty. Kṛṣṇa, therefore, wanted to explain to Arjuna that by killing the body of his grandfather he would not be killing the soul proper, and He explained that all individual persons, including the Lord Himself, are eternal individuals; they were individuals in the past, they are individuals in the present, and they will continue to remain individuals in the future, because all of us are individual souls eternally. We simply change our bodily dress in different manners, but actually we keep our individuality even after liberation from the bondage of material dress. An analytical study of the soul and the body has been very graphically explained by Lord Kṛṣṇa. And this descriptive knowledge of the soul and the body from different angles of vision has been described here as Sāṅkhya, in terms of the Nirukti dictionary. This Sāṅkhya has nothing to do with the Sāṅkhya philosophy of the atheist Kapila. Long before the imposter Kapila’s Sāṅkhya, the Sāṅkhya philosophy was expounded in the Śrīmad-Bhāgavatam by the true Lord Kapila, the incarnation of Lord Kṛṣṇa, who explained it to His mother, Devahūti. It is clearly explained by Him that the puruṣa, or the Supreme Lord, is active and that He creates by looking over the prakṛti. This is accepted in the Vedas and in the Gītā. The description in the Vedas indicates that the Lord glanced over the prakṛti, or nature, and impregnated it with atomic individual souls. All these individuals are working in the material world for sense gratification, and under the spell of material energy they are thinking of being enjoyers. This mentality is dragged to the last point of liberation when the living entity wants to become one with the Lord. This is the last snare of māyā, or sense gratificatory illusion, and it is only after many, many births of such sense gratificatory activities that a great soul surrenders unto Vāsudeva, Lord Kṛṣṇa, thereby fulfilling the search after the ultimate truth.
🌹🌹🌹🌹🌹
Date: 26/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 76: 02వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 76: Chap. 02, Ver. 40
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 40
40. నేహాభీక్రమనాశో(స్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||
తాత్పర్యం :
ఈ ప్రయత్నము నందు నష్టము గాని, హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్పపురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును.
భాష్యము :
కృష్ణభక్తిరసభావన యందు కర్మనొనరించుట (శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఎటువంటి భోగాభిలాష లేకుండా కర్మను చేయుట) యనునది మహోన్నత దివ్యకార్యము. అటువంటి కార్యమును కొద్దిగా ఆరంభిచినను అందు ఎటువంటి ఆటంకములు కలుగవు. అంతియేగాక అట్టి స్వల్పయత్నము ఏనాడును నశించిపోదు. భౌతికపరిధిలో ప్రారంభింపబడు కర్మ ఒకనాటికి సంపూర్ణము చెందవలసియే యుండును. అట్లుకానిచో ఆ యత్నమంతయు విఫలము కాగలదు. కాని కృష్ణభక్తిభావనలో ప్రారంభించబడు కర్మ సంపూర్ణము కాకున్నను శాశ్వతప్రభావమును కలిగియుండును. అనగా కృష్ణభక్తిభావన యందలి తన కర్మ పూర్ణము కానప్పటికిని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణపరమగు కర్మ ఒక్క శాతము పూర్తియైనను శాశ్వత ఫలమును కలిగియుండి తదుపరి ప్రారంభము రెండవ శాతము నుండి మొదలగును. కాని లౌకికకర్మ యందు నూటికి నూరుపాళ్లు సఫలత కలుగనిదే లాభము చేకూరదు. అజామిళుడు తన ధర్మమును కృష్ణభక్తి భావనలో కొద్దిగానే నిర్వర్తించినను భగవానుని కరుణా వలన అంత్యమున నూటికినూరుపాళ్ళు ఫలితమును పొందెను. శ్రీమద్భాగవతము (1.5.17) నందు ఈ విషయమున సంబంధించిన ఒక చక్కని శ్లోకము కలదు.
త్యక్త్వా స్వధర్మం చరణామ్బుజం హరే: భజన్నపక్వోథ పతేత్తతో యది |
యత్ర క్వ వా భద్రం అభూదముష్య కిమ్ కో వార్థ ఆప్తో(భజతాం స్వధర్మత: ||
“స్వధర్మములను విడిచి కృష్ణభక్తి భావన యందు కర్మలు చేయువాడు ఆ కర్మలను పూర్తి చేయజాలనందున పతనమైనను అతడు పొందు నష్టమేమున్నది? అలాగుననే లౌకికకర్మలను పూర్ణముగా నొనరించువాడు పొందు లాభమేమున్నది?” క్రైస్తవులు సైతము ఈ విషయముననే ఇట్లు పలుకుదు : సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో మనుజుడు పొందు లాభమేమి కలదు?
భౌతికకర్మలు మరియు వాటి ఫలితములు దేహముతో పరిసమాప్త మగును. కాని కృష్ణభక్తి భావన యందలి కర్మలు దేహ త్యాగానంతరము సైతము మనుజుని కృష్ణభక్తి భావన వైపునకే అతనిని గొనిపోవును. అనగా ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల ఇంట గాని లేదా ధనవంతుల ఇంట గాని జన్మించుట తదుపరి జన్మమున మనుజుడు అవకాశమును తప్పక పొందగలడు. అటువంటి జన్మము మనుజుడు మరింత పురోగతి నొందుటకు అవకాశమును గూర్చగలదు. ఇదియే కృష్ణభక్తి రస భావనలో ఒనరింపబడు కర్మ యెక్క అద్వితీయ లక్షణము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 40
40. nehābhikrama-nāśo ’sti pratyavāyo na vidyate sv-alpam apy asya dharmasya trāyate mahato bhayāt
Translation :
In this endeavor there is no loss or diminution, and a little advancement on this path can protect one from the most dangerous type of fear.
Purport :
Activity in Kṛṣṇa consciousness, or acting for the benefit of Kṛṣṇa without expectation of sense gratification, is the highest transcendental quality of work. Even a small beginning of such activity finds no impediment, nor can that small beginning be lost at any stage. Any work begun on the material plane has to be completed, otherwise the whole attempt becomes a failure. But any work begun in Kṛṣṇa consciousness has a permanent effect, even though not finished. The performer of such work is therefore not at a loss even if his work in Kṛṣṇa consciousness is incomplete. One percent done in Kṛṣṇa consciousness bears permanent results, so that the next beginning is from the point of two percent, whereas in material activity without a hundred percent success there is no profit. Ajāmila performed his duty in some percentage of Kṛṣṇa consciousness, but the result he enjoyed at the end was a hundred percent, by the grace of the Lord. There is a nice verse in this connection in Śrīmad-Bhāgavatam (1.5.17):
tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer
bhajann apakvo ’tha patet tato yadi
yatra kva vābhadram abhūd amuṣya kiṁ ko vārtha āpto ’bhajatāṁ sva-dharmataḥ
“If someone gives up his occupational duties and works in Kṛṣṇa consciousness and then falls down on account of not completing his work, what loss is there on his part? And what can one gain if one performs his material activities perfectly?” Or, as the Christians say, “What profiteth a man if he gain the whole world yet suffer the loss of his eternal soul?”
Material activities and their results end with the body. But work in Kṛṣṇa consciousness carries a person again to Kṛṣṇa consciousness, even after the loss of the body. At least one is sure to have a chance in the next life of being born again as a human being, either in the family of a great cultured brāhmaṇa or in a rich aristocratic family that will give one a further chance for elevation. That is the unique quality of work done in Kṛṣṇa consciousness.
🌹🌹🌹🌹🌹
Date: 27/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 77: 02వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 77: Chap. 02, Ver. 41
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 41
41. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్ద |
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్దయో(వ్యవసాయినామ్ ||
తాత్పర్యం :
ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును.
భాష్యము :
కృష్ణభక్తి రసభావన ద్వారా మనుజుడు జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థాయికి చేరగలడనెడి దృఢనిశ్చయమే “వ్యవసాయాత్మికా బుద్ధి” యని పిలువబడును. ఈ విషయమునే చైతన్య చరితామృతము (మధ్య లీల 22.62) ఈ విధముగా పలుకుచున్నది.
శ్రద్ధా శబ్దే – విశ్వాస కహే సుదృడ నిశ్చయ |
కృష్ణే భక్తి కయిలే సర్వకర్మ కృత హోయ ||
ఉదాత్తమైన దాని యందు మ్రొక్కవోని నమ్మకమే విశ్వాసమని అందురు. కృష్ణభక్తిరసభావిత కర్మల యందు మనుజడు నిమగ్నమైనపుడు వంశాచారములకు గాని, సంఘాచారములకు గాని లేక దేశాచారములకు గాని లోబడి కర్మనొనరింప నవసరము లేదు. గతజన్మ శుభాశుభకర్మల ఫలితములే లౌకికకర్మలు. కృష్ణభక్తి హృదయములో జాగృతమైనవాడు తన కార్యములందు శుభఫలములకై విడిగా యత్నింప నవసరము లేదు. ఏలయనగా మనుజుడు కృష్ణభక్తిభావనలో స్థితుడైనంతనే కర్మలన్నియును నిర్గుణస్థితికి చెందినవి కాగలవు. శుభాశుభ ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందులకు కారణము. జీవితపు భౌతికభావనను సంపూర్ణముగా త్యాగము చేయుట యనునది కృష్ణభక్తిభావన యందు పరిపూర్ణత్వ స్థితి. కృష్ణభక్తి యందు పురోగతి ద్వారా అట్టి స్థితి అప్రయత్నముగా సిద్ధింపగలదు.
కృష్ణభక్తిభాభావన యందు గల మనుజుని స్థిరప్రయోజనము అతని జ్ఞానముపై ఆధారపడియుండును. “వాసుదేవ: సర్వమితి స మహాత్మా సుదుర్లభ:” – శ్రీకృష్ణుడే (వాసుదేవుడు) సర్వకారణములకు మూలమని సంపూర్ణముగా సంపూర్ణముగా నెరిగిన కృష్ణభక్తి పరాయణుడు అత్యంత దుర్లభుడు. వృక్షపు మొదలుకు నీరుపోయుట ద్వారా ఆకులకు మరియు శాఖలన్నింటికి అప్రయత్నముగా నీరుపోసినట్లగు రీతి, కృష్ణభక్తిరసభావనలో కర్మ చేయుట ద్వారా మనుజుడు తనకు, కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు, మానవాళి సమస్తమునకు సేవ చేసినవాడగును. కర్మల ద్వారా శ్రీకృష్ణుడు సంతృప్తి నొందినచో ప్రతియొక్కరు సంతృప్తి నుండగలరు. అట్టి కృష్ణపరమగు సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధియైన గురువు నిర్దేశము నందు చక్కగా అభ్యసింపపడును. కృష్ణప్రతినిధియైన ఆధ్యాత్మిక గురువు శిష్యుని నైజమును తెలిపి కృష్ణభక్తిభావనలో అతడు వర్తించునట్లుగా నిర్దేశము నొసగగలడు. కృష్ణభక్తిభావనను గూర్చి సంపూర్ణముగా నెరుగుటకు మనుజుడు దృడచిత్తముతో వర్తించుచు గురువుగారి ఆజ్ఞలను జీవితలక్ష్యముగా భావించి అంగీకరింపవలెను. ఈ విషయమున శ్రీవిశ్వనాథచక్రవర్తి ఠాకూర తమ సుప్రసిద్ధమైన గురువందనములో ఈ విధముగా తెలిపిరి.
యస్యప్రసాదాద్ భగవత్ప్రసాదో యస్యప్రసాదా న్న గతి: కుతోపి |
ధ్యాయాన్ స్తువంస్తస్య యశస్త్రిసన్ధ్యమ్ వన్దే గురో: శ్రీ చరణారవిన్ధమ్ ||
“గురుదేవులను సంతృప్తిపరచుట ద్వారా భగవానుడు సంతృప్తి నొందును. గురుదేవుని సంతృప్తిపరుపకుండా కృష్ణభక్తిభావనా స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. కావున ఆయన అనుగ్రహము కొరకై దినమునకు మూడుసార్లు ధ్యానించి, ప్రార్థించి, గౌరవపూర్వక వందనములను అర్పింతును”.
కాని ఈ కార్యమంతయు దేహభావనకు పరమైన ఆత్మజ్ఞానముపై ఆధారపడియున్నది. అది సిద్ధాంతపరమైనది మాత్రమే గాక ఆచంరించునదై యుండవలెను. ఆ సమయమున కర్తల యందు భోగాభిలాషకు తావే ఉండదు. ఆ విధమైన స్థిరచిత్తము లేనివాడు పలువిధములైన సకామకర్మలచే విచలితుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 41
41. vyavasāyātmikā buddhir ekeha kuru-nandana bahu- śākhā hy anantāś ca buddhayo ’vyavasāyinām
Translation :
Those who are on this path are resolute in purpose, and their aim is one. O beloved child of the Kurus, the intelligence of those who are irresolute is many-branched.
Purport :
A strong faith that by Kṛṣṇa consciousness one will be elevated to the highest perfection of life is called vyavasāyātmikā intelligence. The Caitanya-caritāmṛta (Madhya 22.62) states:
‘śraddhā’-śabde – viśvāsa kahe sudṛḍha niścaya kṛṣṇe bhakti kaile sarva-karma kṛta haya
Faith means unflinching trust in something sublime. When one is engaged in the duties of Kṛṣṇa consciousness, he need not act in relationship to the material world with obligations to family traditions, humanity or nationality. Fruitive activities are the engagements of one’s reactions from past good or bad deeds. When one is awake in Kṛṣṇa consciousness, he need no longer endeavor for good results in his activities. When one is situated in Kṛṣṇa consciousness, all activities are on the absolute plane, for they are no longer subject to dualities like good and bad. The highest perfection of Kṛṣṇa consciousness is renunciation of the material conception of life. This state is automatically achieved by progressive Kṛṣṇa consciousness.
The resolute purpose of a person in Kṛṣṇa consciousness is based on knowledge. Vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ: a person in Kṛṣṇa consciousness is the rare good soul who knows perfectly that Vāsudeva, or Kṛṣṇa, is the root of all manifested causes. As by watering the root of a tree one automatically distributes water to the leaves and branches, so by acting in Kṛṣṇa consciousness one can render the highest service to everyone – namely self, family, society, country, humanity, etc. If Kṛṣṇa is satisfied by one’s actions, then everyone will be satisfied.
Service in Kṛṣṇa consciousness is, however, best practiced under the able guidance of a spiritual master who is a bona fide representative of Kṛṣṇa, who knows the nature of the student and who can guide him to act in Kṛṣṇa consciousness. As such, to be well versed in Kṛṣṇa consciousness one has to act firmly and obey the representative of Kṛṣṇa, and one should accept the instruction of the bona fide spiritual master as one’s mission in life. Śrīla Viśvanātha Cakravartī Ṭhākura instructs us, in his famous prayers for the spiritual master, as follows:
yasya prasādād bhagavat-prasādo
yasyāprasādān na gatiḥ kuto ’pi dhyāyan stuvaṁs tasya yaśas tri-sandhyaṁ
vande guroḥ śrī-caraṇāravindam
“By satisfaction of the spiritual master, the Supreme Personality of Godhead becomes satisfied. And by not satisfying the spiritual master, there is no chance of being promoted to the plane of Kṛṣṇa consciousness. I should, therefore, meditate and pray for his mercy three times a day, and offer my respectful obeisances unto him, my spiritual master.”
The whole process, however, depends on perfect knowledge of the soul beyond the conception of the body – not theoretically but practically, when there is no longer a chance for sense gratification manifested in fruitive activities. One who is not firmly fixed in mind is diverted by various types of fruitive acts.
🌹🌹🌹🌹🌹
Date: 28/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 78: 02వ అధ్., శ్లో 42, 43 / Bhagavad-Gita - 78: Chap. 02, Ver. 42, 43
🌹శరీమద్భగవద్గీత 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 42- 43
42. యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చిత: |
వేదవాదరతా: పార్థ నాన్యదస్తీతి వాదిన: ||
43. కామాత్మాన: స్వర్గపరా జన్మ కర్మఫలప్రదాయమ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||
తాత్పర్యం :
స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము,అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు.
భాష్యము :
సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞానకారణముగా వారు వేదమందలి కర్మకాండ భాగములోని సకామ కర్మల యెడనే అనురక్తులగుదురు. మదిర, మగువ, లౌకికవైభవములు పుష్కలముగా లభించు స్వర్గలోకమునందు జీవితము ననుభవించుటను తప్ప వారు వేరేదియును కోరరు. అట్టి స్వర్గలోకములను పొందుటకు పెక్కు యజ్ఞములు(ముఖ్యముగా జ్యోతిష్టోమ యజ్ఞములు) వేదములందు ప్రతిపాదింపబడినవి. స్వర్గలోకప్రాప్తిని గోరువారు అట్టి యజ్ఞములను తప్పక ఆచరించియే తీరవలెనని వాటి యందు తెలుపబడినది. కాని అల్పజ్ఞులు ఇది యొక్కటే వేదముల సమస్త ప్రయోజనమని భావింతురు. అటువంటి అనుభవశూన్య జనులకు కృష్ణభక్తిభావన యందు స్థిరప్రయోజనముతో నెలకొనియుండుట మిగుల కష్టతరము. విషపూర్ణవృక్షపు పుష్పముల యెడ గల ఆకర్షణ పరిణామము నెరుగక మూడుడు వాని యందలి భోగముల యెడ ఆకర్షితులగుదురు.
“అపామ సోమమమృతా అభూమ మరియు అక్ష్యయ్యమ్ హ వై చాతుర్మాస్యయాజిన: సుకృతం భవతి” యని వేదపు కర్మకాండ భాగములో తెలుపబడినది. అనగా వేరుమాటలలో చాతుర్మాస్య వ్రతమును పాటించినవాడు సోమరసమును త్రాగి అమృతత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హుడగుచున్నాడు. సోమరసముతో బలమును పొంది, భోగానుభవమును పొందవలెనని భూమిపై కూడా కొందరు అభిలషింతురు. అట్టివారు భవబంధముల నుండి ముక్తి యెడ శ్రద్ధను చూపక కేవలము ఆర్భాటము కలిగిన వైదియజ్ఞములందే రతులగుదురు. భోగలాలసులైన అట్టివారు స్వర్గభోగములను తప్ప వేరేదియును కోరరు. స్వర్గమునందు నందకాననమనెడి ఉద్యానవనము కలదనియు మరియు అందు సుందరస్త్రీ సాంగత్యము, కోరినంతగా సోమరసము లభించుననియు తెలుపబడినది. అట్టి దేహపర సౌఖ్యము నిక్కముగా ఇంద్రియపరమైనట్టిది. కనుకనే భౌతికజగత్తునకు ప్రభువులమనెడి భావనలో నిలిచి అట్టి లౌకిక తాత్కాలిక సౌఖ్యముల యెడ అనురక్తులై యుండెడివారు పెక్కురు కలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is 🌹
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 42 - 43
42. yām imāṁ puṣpitāṁ vācaṁ
pravadanty avipaścitaḥ
veda-vāda-ratāḥ pārtha nānyad astīti vādinaḥ
43. kāmātmānaḥ svarga-parā janma- karma-phala- pradām kriyā- viśeṣa- bahulāṁ bhogaiśvarya -gatiṁ prati
Translation :
People in general are not very intelligent, and due to their ignorance they are most attached to the fruitive activities recommended in the karma-kāṇḍa portions of the Vedas. They do not want anything more than sense gratificatory proposals for enjoying life in heaven, where wine and women are available and material opulence is very common. In the Vedas many sacrifices are recommended for elevation to the heavenly planets, especially the Jyotiṣṭoma sacrifices. In fact, it is stated that anyone desiring elevation to heavenly planets must perform these sacrifices, and men with a poor fund of knowledge think that this is the whole purpose of Vedic wisdom. It is very difficult for such inexperienced persons to be situated in the determined action of Kṛṣṇa consciousness. As fools are attached to the flowers of poisonous trees without knowing the results of such attractions, unenlightened men are similarly attracted by such heavenly opulence and the sense enjoyment thereof.
In the karma-kāṇḍa section of the Vedas it is said, apāma somam amṛtā abhūma and akṣayyaṁ ha vai cāturmāsya-yājinaḥ sukṛtaṁ bhavati. In other words, those who perform the four-month penances become eligible to drink the soma-rasa beverages to become immortal and happy forever. Even on this earth some are very eager to have soma-rasa to become strong and fit to enjoy sense gratifications. Such persons have no faith in liberation from material bondage, and they are very much attached to the pompous ceremonies of Vedic sacrifices. They are generally sensual, and they do not want anything other than the heavenly pleasures of life. It is understood that there are gardens called Nandana- kānana in which there is good opportunity for association with angelic, beautiful women and having a profuse supply of soma-rasa wine. Such bodily happiness is certainly sensual; therefore there are those who are purely attached to such material, temporary happiness, as lords of the material world.
🌹🌹🌹🌹🌹
Date: 29/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 79: 02వ అధ్., శ్లో 44 / Bhagavad-Gita - 79: Chap. 02, Ver. 44
🌹శరీమద్భగవద్గీత - 79 🌹
📚 Prasad Bharadwaj
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 44
44. భోగైశ్వర్యప్రసక్తానం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధి: సమాధౌ న విధీయతే ||
తాత్పర్యం :
భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై, వానిచే మొహపరవశులగు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్త సేవను గుర్చిన స్థిరనిశ్చయము కలుగనే కలుగదు.
భాష్యము :
సమాధి” యనగా స్థిరమైన చిత్తమని భావము." వేదంనిఘంటువైన “నిరుక్తి” ఈ విషయమున ఇట్లు పలుకుచున్నది. “సమ్యాగాధీయతే(స్మిన్ అత్మతత్త్వ యథాత్మ్యమ్”- అనగా ఆత్మను అవగతము చేసికొనుటలో చిత్తము లగ్నమై యున్నప్పుడు అది సమాధి యందున్నదని చెప్పబడుచున్నది. ఇంద్రియభోగములందు అనురక్తులైనవారికి గాని, అటువంటి తాత్కాలికమైన వాటిచే మోహ పరవశలగు వారికి గాని సమాధి ఎన్నడును సాధ్యపడడు. అట్టి వారందరును దాదాపు మాయాశక్తిచే శిక్షింపబడినట్టివారే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 79 🌹
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 44
44. vyavasāyātmikā buddhir ekeha kuru-nandana bahu- śākhā hy anantāś ca buddhayo ’vyavasāyinām
Translation :
Those who are on this path are resolute in purpose, and their aim is one. O beloved child of the Kurus, the intelligence of those who are irresolute is many-branched.
Purport :
Samādhi means “fixed mind.” The Vedic dictionary, the Nirukti, says, samyag ādhīyate ’sminn ātma-tattva-yāthātmyam: “When the mind is fixed for understanding the self, it is said to be in samādhi.” Samādhi is never possible for persons interested in material sense enjoyment and bewildered by such temporary things. They are more or less condemned by the process of material energy.
🌹🌹🌹🌹🌹
Date: 30/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 80: 02వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 80: Chap. 02, Ver. 45
🌹. శ్రీమద్భగవద్గీత - 80 🌹
📚 Prasad Bharadwaj
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 45
45. త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||
తాత్పర్యం :
వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా! నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై, ద్వంద్వముల నుండియు మరియు యోగ క్షేమములనెడి చింతల నుండియు విడివడిన వాడవై ఆత్మ యందు స్థిరుడవగుము.
భాష్యము :
భౌతిక కార్యములు అన్నియును త్రిగుణములను కూడిన కర్మలను మరియు ఫలములను కూడి యుండును. భౌతిక జగమున బంధము కలిగించు సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. జనులను ఇంద్రియ భోగానుభవము నుండి ఆధ్యాత్మిక స్థాయికి క్రమముగా గొనిపోవు నిమిత్తమే వేదములు అట్టి సకామకర్మలను ఉపదేశించును. శ్రీకృష్ణభగవానుని స్నేహితునిగా మరియు శిష్యునిగా అర్జునుడు ఇచ్చట వేదాంత తత్త్వము యొక్క దివ్యస్థాయికి ఎదుగవలసినదిగా ఉపదేశింపబడినాడు. బ్రహ్మజిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గుర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్త్వము యొక్క ఆరంభాములోని అంశము. భౌతికజగము నందు గల జీవులందరును తీవ్ర జీవన సంఘర్షణకు లోనై యుందురు. ఏ విధముగా మనుగడను సాగించి పిదప భౌతికబంధము నుండి ముక్తినొందగగలరో ఉపదేశించుటకే భౌతికజగత్తును సృష్టించిన పిమ్మట భగవానుడు వారికి వేదంజ్ఞానము నొసగెను. భోగవాంఛను కూడిన కర్మలు(కర్మకాండ) ముగిసినంతనే ఆధ్యాత్మికానుభవమునకు అతడు ఉపనిషత్తుల రూపున అవకాశము నొసగెను. భగవద్గీత పంచమవేదమైన మహాభారతము యొక్క భాగమైనట్లు, ఉపనిషత్తులు వివిధ వేదములందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మికజీవనపు ఆరంభము సూచించును.
భౌతికదేహము నిలిచియున్నంత కాలము త్రిగుణ పూర్ణములైన కర్మలు మరియు ఫలితములు తప్పవు. కనుక ప్రతియొక్కరు సుఖదుఃఖములు, శీతతాపముల వంటి ద్వంద్వములను సహించుట నేర్చుకొని ఆ ద్వంద్వ సహనము ద్వారా లాభనష్టముల యెడ గల చింత నుండి దూరులు కావలెను. దేవదేవుడైన శ్రీకృష్ణుని కృపా కటాక్షములపై మనుజుడు సంపూర్ణముగా ఆధారపడినప్పుడు అట్టి దివ్యస్థితి (సంపూర్ణ కృష్ణభక్తిభావన యందు) సిద్ధింపగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 80 🌹
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 45
45. trai-guṇya-viṣayā vedā nistrai-guṇyo bhavārjuna
nirdvandvo nitya-sattva-stho niryoga-kṣema ātmavān
Translation :
The Vedas deal mainly with the subject of the three modes of material nature. O Arjuna, become transcendental to these three modes. Be free from all dualities and from all anxieties for gain and safety, and be established in the self.
Purport :
All material activities involve actions and reactions in the three modes of material nature. They are meant for fruitive results, which cause bondage in the material world. The Vedas deal mostly with fruitive activities to gradually elevate the general public from the field of sense gratification to a position on the transcendental plane. Arjuna, as a student and friend of Lord Kṛṣṇa, is advised to raise himself to the transcendental position of Vedānta philosophy where, in the beginning, there is brahma-jijñāsā, or questions on the supreme transcendence. All the living entities who are in the material world are struggling very hard for existence. For them the Lord, after creation of the material world, gave the Vedic wisdom advising how to live and get rid of the material entanglement. When the activities for sense gratification, namely the karma-kāṇḍa chapter, are finished, then the chance for spiritual realization is offered in the form of the Upaniṣads, which are part of different Vedas, as the Bhagavad-gītā is a part of the fifth Veda, namely the Mahābhārata. The Upaniṣads mark the beginning of transcendental life.
As long as the material body exists, there are actions and reactions in the material modes. One has to learn tolerance in the face of dualities such as happiness and distress, or cold and warmth, and by tolerating such dualities become free from anxieties regarding gain and loss. This transcendental position is achieved in full Kṛṣṇa consciousness when one is fully dependent on the good will of Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
Date: 31/Jul/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 81: 02వ అధ్., శ్లో 46 / Bhagavad-Gita - 81: Chap. 02, Ver. 46
🌹. శ్రీమద్భగవద్గీత - 81 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴దవితీయ అధ్యాయము🌴
శ్లోకము 46
46. యావానర్థ ఉదపానే సర్వత: సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత: ||
తాత్పర్యం :
చిన్ననుతిచే ఒనగూడు ప్రయోజనములన్నియును శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలముచే సిద్ధించురీతి, వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి.
భాష్యము :
వేదవాజ్మయమునందలి కర్మకాండ భాగములో తెలియజేయబడిన యజ్ఞములు మరియు కర్మలన్నియును క్రమానుగతమైన ఆత్మానుభూతి కొరకే నిర్దేశింపబడినవి. ఇక ఆత్మానుభవపు ప్రయోజనము భగవద్గీత యొక్క పంచదశాధ్యాయము (15.15) నందు స్పష్టముగా తెలుపబడినది. సమస్తమునకు ఆదికారణుడైన శ్రీకృష్ణభగవానుని ఎరుగుటయే వేదాధ్యయనపు ప్రయోజనమని అచ్చట వివరించబడినది; అనగా శ్రీకృష్ణుని గూర్చియు మరియు అతనితో జీవునికి గల నిత్యసంబంధమును గూర్చియు తెలియజేయుటయే అత్మనుభవపు నిజమైనభావము. గీత యొక్క పంచదశాధ్యాయపు (15.7) నందు జీవులకు శ్రీకృష్ణభగవానునితో గల సంబంధము సైతము వివరింపబడినది. జీవులందరును శ్రీకృష్ణుని అంశలు గావున ప్రతిజీవుడును కృష్ణభక్తిభావన యందు పునరుద్ధరించుకొనుటయే వేదజ్ఞానపు పూర్ణతస్థితియై యున్నది. ఈ విషయమున శ్రీమద్భాగవతము (3.33.7) నందు ఇట్లు స్థిరీకరించబడినది.
అహో బత శ్వపచో తో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నాం తుభ్యమ్ |
తేపుస్తప స్తే జుహువు: సస్నురార్యా బ్రహ్మానూ చుర్నామ గృణన్తి యే తే ||
“హే ప్రభూ! నీ పవిత్ర నామమును కీర్తించువాడు చండాలుని (శునకమాంసను భుజించువాడు) వంశము వంటి అధమవంశములో జన్మించినను అత్యున్నత ఆత్మానుభవస్థాయిలో నున్నట్టివాడు. అట్టివాడు వేదప్రకారము సర్వవిధములైన యజ్ఞములను, తపస్సులను ఆచరించినట్టివాడే! సమస్త పుణ్యతీర్థములలో స్నానమాచరించి, వేదవాజ్మయమును పలుమార్లు అధ్యయనము చేసినట్టివాడే! అట్టివాడే ఆర్యవంశములో ఉత్తముడని పరిగణింపబడును.”
కావున కేవలము కర్మకాండకే ఆకర్షితులు గాక ప్రతియొక్కరు వేదంప్రయోజనమును తెలివితో అర్థము చేసికొనవలెను. అలాగుననే అధిక ఇంద్రియభోగము కొరకై స్వర్గలోకములను చేరవలెననియు కోరరాదు. నేటి కాలమున వేదధర్మములను , కర్మలను పాటించుట గాని,వేదాంతము, ఉపనిషత్తులను కూలంకుశముగా అధ్యయనము చేయుట గాని సామాన్య మానవునికి సాధ్యము కాదు. వేదముల ప్రయోజనము సిద్ధింప జేయుటకు అధిక కాలము, శక్తి, జ్ఞానము,వనరుల అవసరముండును. అవియన్నియును ఈ కాలమున అతి దుర్లభములు. కాని పతిత పావనుడైన శ్రీ చైతన్య మాహా ప్రభువుచే ఉపదేశింప బడిన పవిత్ర హరినామ సంకీర్తనము ద్వారా వేదముల ఉత్తమ ప్రయోజనము సిద్ధింపగలదు. వేదాంతమును అధ్యయనము చేయక ఏల భావావిష్టుని వలె హరినామమును కీర్తించుచుంటివని శ్రీ చైతన్య మాహా ప్రభువును ప్రకాశానంద సరస్వతియను ఒక వేద విద్వాంసుడు ప్రశ్నించెను. అందులకు ఆయన తనను తన ఆధ్యాత్మికగురువు మూడుడని తలచి కృష్ణనామమే కీర్తించుమణి తెలిపియుండెననియు, తాను ఆ విధముగనే కావించి ఉన్మాది నైతిననియు ప్రత్యుత్తర మిచ్చిరి. ఈ కలి యుగమున జనులలో అత్యధిక భాగము మూడులు మరియు వేదాంత జ్ఞానమును అర్థము చేసికొన గలిగినంత విద్య లేనివారు అయి యున్నారు. అట్టివారు అపరాధ రహితముగా పవిత్ర హరినామ సంకీర్తనము చేయుట ద్వారా వేదాంతతత్త్వపు ప్రయోజనము సిద్ధింపగలదు. వేదాంతమనునది వేదజ్ఞానపు చివరి అంశము. వేదాంత తత్త్వమును రచించిన వాడు మరియు తెలిసినవాడు శ్రీకృష్ణ భగవానుడే. అట్టి శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామకీర్తనలో దివ్యానందము నొందు మహాత్ముడే అత్యున్నత వేదాంతి. ఇదియే వేదజ్ఞానము యొక్క చరం ప్రయోజనమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 81 🌹
✍️ Swami Bhakti Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 46
46. yāvān artha uda-pāne sarvataḥ samplutodake
tāvān sarveṣu vedeṣu brāhmaṇasya vijānataḥ
Translation :
All purposes served by a small well can at once be served by a great reservoir of water. Similarly, all the purposes of the Vedas can be served to one who knows the purpose behind them.
Purport :
The rituals and sacrifices mentioned in the karma-kāṇḍa division of the Vedic literature are meant to encourage gradual development of self-realization. And the purpose of self-realization is clearly stated in the Fifteenth Chapter of the Bhagavad-gītā (15.15): the purpose of studying the Vedas is to know Lord Kṛṣṇa, the primeval cause of everything. So, self-realization means understanding Kṛṣṇa and one’s eternal relationship with Him. The relationship of the living entities with Kṛṣṇa is also mentioned in the Fifteenth Chapter of Bhagavad-gītā (15.7). The living entities are parts and parcels of Kṛṣṇa; therefore, revival of Kṛṣṇa consciousness by the individual living entity is the highest perfectional stage of Vedic knowledge. This is confirmed in the Śrīmad-Bhāgavatam (3.33.7) as follows:
aho bata śva-paco ’to garīyān yaj-jihvāgre vartate nāma tubhyam tepus tapas te juhuvuḥ sasnur āryā brahmānūcur nāma gṛṇanti ye te
“O my Lord, a person who is chanting Your holy name, although born of a low family like that of a caṇḍāla [dog-eater], is situated on the highest platform of self-realization. Such a person must have performed all kinds of penances and sacrifices according to Vedic rituals and studied the Vedic literatures many, many times after taking his bath in all the holy places of pilgrimage. Such a person is considered to be the best of the Āryan family.”
So one must be intelligent enough to understand the purpose of the Vedas, without being attached to the rituals only, and must not desire to be elevated to the heavenly kingdoms for a better quality of sense gratification. It is not possible for the common man in this age to follow all the rules and regulations of the Vedic rituals, nor is it possible to study all of the Vedānta and the Upaniṣads thoroughly. It requires much time, energy, knowledge and resources to execute the purposes of the Vedas. This is hardly possible in this age. The best purpose of Vedic culture is served, however, by chanting the holy name of the Lord, as recommended by Lord Caitanya, the deliverer of all fallen souls. When Lord Caitanya was asked by a great Vedic scholar, Prakāśānanda Sarasvatī, why He, the Lord, was chanting the holy name of the Lord like a sentimentalist instead of studying Vedānta philosophy, the Lord replied that His spiritual master had found Him to be a great fool and thus asked Him to chant the holy name of Lord Kṛṣṇa. He did so, and became ecstatic like a madman. In this Age of Kali, most of the population is foolish and not adequately educated to understand Vedānta philosophy; the best purpose of Vedānta philosophy is served by inoffensively chanting the holy name of the Lord. Vedānta is the last word in Vedic wisdom, and the author and knower of the Vedānta philosophy is Lord Kṛṣṇa; and the highest Vedāntist is the great soul who takes pleasure in chanting the holy name of the Lord. That is the ultimate purpose of all Vedic mysticism.
🌹🌹🌹🌹🌹
Date: 01/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 82: 02వ అధ్., శ్లో 47 / Bhagavad-Gita - 82: Chap. 02, Ver. 47
🌹. శ్రీమద్భగవద్గీత - 82 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 47
47. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫల హేతుర్బూర్మా తే సజ్ఞోస్త్వకర్మణి ||
తాత్పర్యం :
విధ్యుక్తధర్మమును నిర్వర్తించుట యందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విధ్యుక్తధర్మమును వీడుట యందు ఆసక్తుడవు కాకుము.
భాష్యము :
విధ్యుక్తధర్మములు, దుష్కర్మలు, అకర్మ అనుచు కర్మలు మూడు రకములు. మనుజుని గుణముల ననుసరించి విధింపబడిన కర్మలే విధ్యుక్తధర్మములు. ప్రామాణికమైన అనుమతి లేకుండగనే ఒనరింపబడునవి దుష్కర్మలు కాగా, విధ్యుక్తధర్మమును చేయకుండుట అకర్మ అనుదాని భావము. ఆకర్మునిగా కారాదనియు మరియు ఫలాపేక్ష లేకుండా విధ్యుక్తధర్మమును విధిగా నిర్వహించు మనియు ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు. కర్మఫలములందు ఆసక్తిని కలిగియుండెడివాడు ఆ కర్మలకు సైతము కారణముగుటచే ఆ ఫలముల వలన సుఖి లేదా దుఃఖి యగుచున్నాడు.
ఇక విధ్యుక్తధర్మములకు సంబంధించినవరకు వాటిని నిత్యకర్మము, అత్యవసరకర్మము, ఇష్టమైన కర్మలనెడి మూడింటిగా విభజింపవచ్చును. శాస్త్రానుసారముగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా విధిగా నిర్వర్తింపబడు నిత్యకర్మ సత్వగుణకర్మ అనబడును. ఫలితము వాంచించుచు చేయబడు కర్మ బంధమును కలిగించును గావున అది అమంగళదాయకము. ప్రతియెక్కరికిని వారి విధ్యుక్తధర్మమునందు అధికారము కలదు. కాని ఆ ధర్మమును వారు ఫలాపేక్ష లేకుండా నిర్వర్తింప వలసి యున్నది. అట్టి ఫలాపేక్ష రహిత విధ్యుక్త ధర్మపాలనము మనుజుని ముక్తిమార్గమును చేర్చగలదు.
కావుననే ఫలమునందు ఆసక్తిని గొనక విధిగా యుద్ధము చేయుమని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశమొసగినాడు. యుద్ధములో పాల్గొనకపోవుటయు ఒక విధముగా ఆసక్తియే. అటువంటి ఆసక్తి ఎన్నడును మనుజుని ముక్తిపథమునకు నడిపించదు. ఆసక్తి ఎటువంటిదైనను అది బంధమునకే కారణము కాగలదు. అకర్మ అనునది పాపమే కనుక విధిగా యుద్ధము చేయుటయే అర్జునునికి శుభప్రదమైన మోక్షమార్గమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 82 🌹
✍️ Swami Bhakti Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 47
47. karmaṇy evādhikāras te mā phaleṣu kadācana
mā karma-phala-hetur bhūr mā te saṅgo ’stv akarmaṇi
Translation :
You have a right to perform your prescribed duty, but you are not entitled to the fruits of action. Never consider yourself the cause of the results of your activities, and never be attached to not doing your duty.
Purport :
There are three considerations here: prescribed duties, capricious work, and inaction. Prescribed duties are activities enjoined in terms of one’s acquired modes of material nature. Capricious work means actions without the sanction of authority, and inaction means not performing one’s prescribed duties. The Lord advised that Arjuna not be inactive, but that he perform his prescribed duty without being attached to the result. One who is attached to the result of his work is also the cause of the action. Thus he is the enjoyer or sufferer of the result of such actions.
As far as prescribed duties are concerned, they can be fitted into three subdivisions, namely routine work, emergency work and desired activities. Routine work performed as an obligation in terms of the scriptural injunctions, without desire for results, is action in the mode of goodness. Work with results becomes the cause of bondage; therefore such work is not auspicious. Everyone has his proprietary right in regard to prescribed duties, but should act without attachment to the result; such disinterested obligatory duties doubtlessly lead one to the path of liberation.
Arjuna was therefore advised by the Lord to fight as a matter of duty without attachment to the result. His nonparticipation in the battle is another side of attachment. Such attachment never leads one to the path of salvation. Any attachment, positive or negative, is cause for bondage. Inaction is sinful. Therefore, fighting as a matter of duty was the only auspicious path of salvation for Arjuna.
🌹🌹🌹🌹🌹
Date: 02/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 83: 02వ అధ్., శ్లో 48 / Bhagavad-Gita - 83: Chap. 02, Ver. 48
🌹. శ్రీమద్భగవద్గీత - 83 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 48
48. యోగస్థ కురు కర్మాణి సజ్ఞం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యో: సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||
తాత్పర్యం :
ఓ అర్జునా! జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విధ్యుక్తధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావానమే యోగామనబడును.
భాష్యము :
యోగమునందు వర్తించుమని అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు. ఆ యోగమనగా నేమి? సదా కలతపెట్టు ఇంద్రియములను అదుపుజేసి భగవానుని యందు మనస్సును సంలగ్నము చేయుటయే యోగము. మరి ఆ భగవానుదెవ్వరు? దేవదేవుడైన? శ్రీకృష్ణుడే భగవానుడు. అట్టి శ్రీకృష్ణుడే స్వయముగా యుద్ధము చేయుమని పలుకుచున్నందున యుద్ధఫలములతో అర్జునునకు ఎట్టి సంబంధము లేదు. లాభము లేదా జయమనెడి విషయము శ్రీకృష్ణుడే చూచు కొనగలడు. కనుకనే కేవలము తన ఆదేశానుసారము వర్తించుమని అర్జునుడు శ్రీకృష్ణునిచే ఉపదేశింప బడినాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించుటయే నిజమైన యోగము. అట్టి విధానము కృష్ణభక్తిరస భావన యందు పాటింపబడును. కృష్ణభక్తిభావన యందే మనుజుడు తాను యజమానినడి భావనను త్యజింపగలడు. కావున శ్రీకృష్ణునకు లేదా శ్రీకృష్ణుని దాసునకు అతడు దాసుడు కావలెను. కృష్ణభక్తిరసభావన యందు కర్మనొనరించుటకు అదియే సరియైన మార్గము. అట్టి మార్గమే యోగమునందు వర్తించుటకు అతనికి తోడ్పడగలదు.
అర్జునుడు క్షత్రియుడు మరియు వర్ణాశ్రమ ధర్మవిధానము పాటించువాడు. వర్ణాశ్రమధర్మముల ముఖ్యోద్దేశము విష్ణువును సంతృప్తిపరచుటయేనని విష్ణుపురాణము నందు తెలుపబడినది. ఈ భౌతికజగమునందు ప్రతియొక్కరు స్వీయతృప్తినే వాంచింతురు. కాని వాస్తవమునకు ప్రతియొక్కరు శ్రీకృష్ణునే సంతృప్తిపరుచవలెను గాని స్వీయసంతృప్తికై ఆరాటపడరాదుపడరాదు. అనగా శ్రీకృష్ణుని సంతృప్తిపరుపనిదే వర్ణాశ్రమధర్మ నియమములను ఎవ్వరును చక్కగా పాటించలేరు. శ్రీకృష్ణుడు తెలిపిన రీతిగా వర్తింపవలెనని అర్జునుడు పరోక్షముగా భోధింపబడుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 83 🌹
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 48
48. yoga-sthaḥ kuru karmāṇi saṅgaṁ tyaktvā dhanañ-jaya siddhy- asiddhyoḥ samo bhūtvā samatvaṁ yoga ucyate
Translation :
Perform your duty equipoised, O Arjuna, abandoning all attachment to success or failure. Such equanimity is called yoga.
Purport :
Kṛṣṇa tells Arjuna that he should act in yoga. And what is that yoga? Yoga means to concentrate the mind upon the Supreme by controlling the ever-disturbing senses. And who is the Supreme? The Supreme is the Lord. And because He Himself is telling Arjuna to fight, Arjuna has nothing to do with the results of the fight. Gain or victory are Kṛṣṇa’s concern; Arjuna is simply advised to act according to the dictation of Kṛṣṇa. The following of Kṛṣṇa’s dictation is real yoga, and this is practiced in the process called Kṛṣṇa consciousness. By Kṛṣṇa consciousness only can one give up the sense of proprietorship. One has to become the servant of Kṛṣṇa, or the servant of the servant of Kṛṣṇa. That is the right way to discharge duty in Kṛṣṇa consciousness, which alone can help one to act in yoga.
Arjuna is a kṣatriya, and as such he is participating in the varṇāśrama-dharma institution. It is said in the Viṣṇu Purāṇa that in the varṇāśrama-dharma, the whole aim is to satisfy Viṣṇu. No one should satisfy himself, as is the rule in the material world, but one should satisfy Kṛṣṇa. So unless one satisfies Kṛṣṇa, one cannot correctly observe the principles of varṇāśrama-dharma. Indirectly, Arjuna was advised to act as Kṛṣṇa told him.
🌹🌹🌹🌹🌹
Date: 03/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 84: 02వ అధ్., శ్లో 49 / Bhagavad-Gita - 84: Chap. 02, Ver. 49
🌹. శ్రీమద్భగవద్గీత - 84 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 49
49. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ద్ధనంజయ
బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా: ఫలహేతవ: |
తాత్పర్యం :
ఓ ధనుంజయా! భక్తియోగముచే హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణువేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోభులు.
భాష్యము :
శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా నిజస్థితిని అవగతము చేసికొననివాడు కృష్ణభక్తిభావన యందు పనిచేయుట మినహా సమస్త కలాపములను త్యజించును. ఇదివరకే వివరింపబడినట్లు బుద్ధియోగమనగా శ్రీకృష్ణభగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ. అదియే జీవులకు నిజమైన కర్మము. కేవలము లోభులు మాత్రమే మరింత భౌతికబంధమున చిక్కుబడుటకు తన కర్మఫలములను అనుభవింపగోరుదురు. కృష్ణపరమైన కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నియును కర్తను జనన, మరణచక్రము నందే సదా బంధించును గావున హేయములై యున్నవి. కావుననే కర్మలకు ఎవ్వరును కారణము కారాదు. ప్రతికర్మయు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కృష్ణభక్తిభావన యందు నిర్వహింప వలెను. లోభులైనవారు కష్టముతో లేదా అదృష్టముతో కూడబెట్టిన ధనమును ఏ విధముగా వినియోగించవలెనో ఎరుగరు. వాస్తవమునకు ప్రతియొక్కరు తమ శక్తిసామర్త్యములను కృష్ణభక్తి కొరకే వినియోగించవలెను. అదియే మనుజుని జన్మను సఫలము కావింపగలదు. అదృష్టహీనులైనవారే లోభుల వలె తమ శక్తిని భగవానుని సేవలో వినియోగింపరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 84 🌹
✍️ Swami Bhakti Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 49
49. dūreṇa hy avaraṁ karma buddhi-yogād dhanañ-jaya buddhau śaranam anviccha kṛpaṇāḥ phala-hetavaḥ
Translation :
O Dhanañjaya, keep all abominable activities far distant by devotional service, and in that consciousness surrender unto the Lord. Those who want to enjoy the fruits of their work are misers.
Purport :
One who has actually come to understand one’s constitutional position as an eternal servitor of the Lord gives up all engagements save working in Kṛṣṇa consciousness. As already explained, buddhi-yoga means transcendental loving service to the Lord. Such devotional service is the right course of action for the living entity. Only misers desire to enjoy the fruit of their own work just to be further entangled in material bondage. Except for work in Kṛṣṇa consciousness, all activities are abominable because they continually bind the worker to the cycle of birth and death. One should therefore never desire to be the cause of work. Everything should be done in Kṛṣṇa consciousness, for the satisfaction of Kṛṣṇa. Misers do not know how to utilize the assets of riches which they acquire by good fortune or by hard labor. One should spend all energies working in Kṛṣṇa consciousness, and that will make one’s life successful. Like misers, unfortunate persons do not employ their human energy in the service of the Lord.
🌹🌹🌹🌹🌹
Date: 04/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 85: 02వ అధ్., శ్లో 50 / Bhagavad-Gita - 85: Chap. 02, Ver. 50
🌹. శ్రీమద్భగవద్గీత - 85 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 50
50. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్ యోగాయ యుజ్యస్య యోగ: కర్మసు కౌశలమ్ ||
🌷 తత్పర్యం :
భక్తియోగమందు నియుక్తుడైనవాడు ఈ జన్మమందే శుభాశుభఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మ యందలి నేర్పుయైనటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము.
🌷 భష్యము :
అనంతకాలము నుండి ప్రతిజీవుడు తన శుభాశుభకర్మల ఫలములను ప్రోగుచేసికొని యున్నాడు. అంతియేగాక తన నిజస్థితి సైతము ఎరుగలేకున్నాడు. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించిపోగలదు. శ్రీకృష్ణభగవానునికి సంపూర్ణ శరణాగతిని పొంది జన్మ,జన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాని ఫలముల శృంఖముల నుండి ముక్తి నొందుమనియే భగవద్గీత జీవునికి భోధించు చున్నది. కనుకనే కర్మఫలములను శుద్ధిచేయు విధానమైనటు వంటి కృష్ణభక్తి రసభావన యందు కర్మనొనరింపుమని అర్జునుడు భోదింపపడినాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 85 🌹
✍️ Swami Bhakti Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 50
50. buddhi-yukto jahātīha ubhe sukṛta-duṣkṛte tasmād yogāya yujyasva yogaḥ karmasu kauśalam
🌷Translation :
A man engaged in devotional service rids himself of both good and bad reactions even in this life. Therefore strive for yoga, which is the art of all work.
🌷 Purport :
Since time immemorial each living entity has accumulated the various reactions of his good and bad work. As such, he is continuously ignorant of his real constitutional position. One’s ignorance can be removed by the instruction of the Bhagavad-gītā, which teaches one to surrender unto Lord Śrī Kṛṣṇa in all respects and become liberated from the chained victimization of action and reaction, birth after birth. Arjuna is therefore advised to act in Kṛṣṇa consciousness, the purifying process of resultant action.
🌹🌹🌹🌹🌹
Date: 05/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 86: 02వ అధ్., శ్లో 51 / Bhagavad-Gita - 86: Chap. 02, Ver. 51
🌹. శ్రీమద్భగవద్గీత - 86 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 51
51. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణ: |జన్మబన్ధ వినిర్ముక్తా: పదం గచ్ఛన్త్యనామయమ్ ||
🌷 తత్పర్యం :
ఆ విధముగా భక్తియోగమునందు నియుక్తులైన మహర్షులు లేదా భక్తులు ఈ భౌతికజగమునందు కర్మఫలముల నునుద్ తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన,మరణచక్రము నుండి విడుదలను పొంది (భగవద్దామమును చేరుట ద్వారా) దుఃఖరాహిత్యస్థితిని పొందుచున్నారు.
🌷 భష్యము :
ముక్తజీవులు దుఃఖరాహిత్యమైన స్థానమునకు చెందినవారై యున్నారు. ఈ విషయమున శ్రీమద్భాగవతము(10.14.58)
ఈ విధముగా పలుకు చున్నది. సమాశ్రితా యే పపదపల్లవప్లం మహత్పదం పుణ్యయశో మురారే: |
భవామ్భుది ర్వత్సపదం పరం పదం పదం పదం యద్విపదాం న తేషామ్ ||
“విశ్వమునకు శరణ్యుడును మరియు ముక్తినిచ్చు ముకుందునిగా ప్రసిద్ధినొందినవాడును అగు శ్రీకృష్ణభగవానుని పాదపద్మనౌకను ఆశ్రయించినవానికి సంసారసాగరము దూడపాదముద్ర యందలి జలమే కాగలదు. వైకుంఠము లేదా దుఃఖరహితస్థలమైన పరమపదమే ఆ భక్తుని గమ్యస్థానముగాని అడుగడుగున అపాయము కలిగిన అన్యస్థానము కాదు.”
ఈ భౌతికజగము అడుగడుగున అపాయము కలిగిన దుఃఖ;భూయిష్ట స్థానమని ఎవ్వరును అజ్ఞానవశమున తెలిసికొనజాలరు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు సకామకర్మల ద్వారా తమ స్థితిని చక్కబరచుకొనుటకు యత్నింపుము. అట్టి కర్మఫలములు తమకు ఆనందము నొసగగలవని వారు భావింతురు. కాని విశ్వమునందు ఎచ్చోటను దుఃఖరాహిత్యమైన జన్మముండదని వారెరుగరు. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనెడి నాలుగు దుఃఖములు విశ్వమందంతటను గలవు. కాని భగవానుని నిత్యదాసునిగా తన నిజస్థితిని అవగతము చేసికొనినవాడు భగవానుని స్థితిని తెలిసికొని అతని భక్తియుక్తసేవలో నియుక్తుడగును. తత్పలితముగా అతడు దుఃఖమాయజీవనము గాని, కాలము మరియు మృత్యువుల ప్రభావము గాని లేనటువంటి వైకుంఠలోకములందు ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు. వాస్తవమునకు తన నిజస్థితిని తెలియుట యనగా భగవానుని ఉదాత్తము మరియు ఉన్నతమైన స్థితిని తెలియుట యనియే భావము. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానమైనవే యని తప్పుగా తలంచువాడు అంధకారమున ఉన్నట్టివాడు. తత్పలితముగా అట్టివాడు భగవానుని సేవలో ఎన్నడును నిలువజాలడు. అట్టివాడు తనకు తానే ప్రభువై జన్మ,మృత్యు పరంపరకు మార్గము నేర్పరచుకొనును. కాని సేవయే తన నిజస్థితి యని అవగతము చేసికొనినవాడు శ్రీకృష్ణభగవానుని సేవలో నిలిచి శీఘ్రమే వైకుంఠలోకమును పొందుటకు అర్హుడగుచున్నాడు. శ్రీకృష్ణభగవానునికి ఒనర్చబడు సేవయే కర్మయోగము(బుద్ధియోగము) అనబడును. సులభవాక్యములలో చెప్పవలెనన్న అదియే కృష్ణభక్తి యనబడును..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 86 🌹
✍️ Swami Bhakti Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 51
51. karma-jaṁ buddhi-yuktā hiphalaṁ tyaktvā manīṣiṇaḥ
janma-bandha-vinirmuktāḥ padaṁ gacchanty anāmayam
🌷Translation :
By thus engaging in devotional service to the Lord, great sages or devotees free themselves from the results of work in the material world. In this way they become free from the cycle of birth and death and attain the state beyond all miseries [by going back to Godhead].
🌷 Purport :
For one who has accepted the boat of the lotus feet of the Lord, who is the shelter of the cosmic manifestation and is famous as Mukunda, or the giver of mukti, the ocean of the material world is like the water contained in a calf’s footprint. Paraṁ padam, or the place where there are no material miseries, or Vaikuṇṭha, is his goal, not the place where there is danger in every step of life.”
Owing to ignorance, one does not know that this material world is a miserable place where there are dangers at every step. Out of ignorance only, less intelligent persons try to adjust to the situation by fruitive activities, thinking that the resultant actions will make them happy. They do not know that no kind of material body anywhere within the universe can give life without miseries. The miseries of life, namely birth, death, old age and diseases, are present everywhere within the material world. But one who understands his real constitutional position as the eternal servitor of the Lord, and thus knows the position of the Personality of Godhead, engages himself in the transcendental loving service of the Lord.
Consequently he becomes qualified to enter into the Vaikuṇṭha planets, where there is neither material, miserable life nor the influence of time and death. To know one’s constitutional position means to know also the sublime position of the Lord. One who wrongly thinks that the living entity’s position and the Lord’s position are on the same level is to be understood to be in darkness and therefore unable to engage himself in the devotional service of the Lord. He becomes a lord himself and thus paves the way for the repetition of birth and death. But one who, understanding that his position is to serve, transfers himself to the service of the Lord, at once becomes eligible for Vaikuṇṭha-loka. Service for the cause of the Lord is called karma-yoga or buddhi-yoga, or in plain words, devotional service to the Lord.
🌹🌹🌹🌹🌹
Date: 06/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 87: 02వ అధ్., శ్లో 52 / Bhagavad-Gita - 87: Chap. 02, Ver. 52
🌹. శ్రీమద్భగవద్గీత - 87 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 52
52. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ||
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||
🌷 తత్పర్యం :
ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మొహారణ్యమును దదాటునో అప్పుడు నీవు వినినదాని యెడ మరియు వినవలసినదాని యెడ విరక్తిని కలిగినవాడవగుదువు.
🌷 భష్యము :
శ్రీకృష్ణభగవానుని యెడ గల భక్తియుత సేవ ద్వారా వేదములందలి కర్మల యెడ విరాగామును పొందిన మహాభక్తుల ఉదాహరణములు పెక్కులు కలవు. కృష్ణుని గూర్చియు మరియు కృష్ణునితో తనకు గల సంబంధమును గూర్చియు మనుజుడు వాస్తవముగా నెరిగినప్పుడు తానూ అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికిని అతడు సర్వవిధములైన కామ్యకర్మల యెడ విరక్తుడగును. పరమభక్తుడును మరియు భక్తిపరంపరలో ఆచార్యుడును అగు శ్రీమాధవేంద్రపురి ఈ క్రింది విధముగా పలికిరి.
సంధ్యావందన భద్రమస్తు భవతో భో:స్నాన తుభ్యం నమో భో దేవా: పితరశ్చ తర్పణవిధౌ నాహం క్షమ: క్షమ్యతామ్ |
యాత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తమస్య కంసద్విష: స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే ||
“ఓ సంధ్యావందనమా! నీకు భద్రమగుగాక! ఓ స్నానమా! నీకు నేను నమస్సులు అర్పింతును. ఓ దేవతలారా! ఓ పితృదేవతలారా! మీకు వందనములను అర్పింపలేని నా ఆశక్తతకు నన్ను మన్నింపుడు. ఇప్పుడు నేనెచ్చట నిలిచియున్నను కంసారియైన యాదవకులోత్తముని (శ్రీకృష్ణుని) తలచుచు సర్వపాపబంధముల నుండి విముక్తుడను కాగలను. ఇదియే నాకు చాలునని నేను భావించుచున్నాను.”
త్రిసంధ్యల యందును వివిధస్తుతులను కావించుట, తెల్లవారుఝామునే స్నానము చేయుట, పితృదేవతలకు వందనములొసగుట వంటి వేదవిహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభదశలో నున్న భక్తులకు తప్పనిసరియైనవి. కాని కృష్ణభక్తిభావన యందు మనుజుడు పూర్ణుడైనప్పుడు మరియు ఆ దేవదేవుని ప్రేమయుతసేవలో నియుక్తుడైనపుడు పుర్ణత్వమును సాధించిన కారణమున ఈ విధివిధానముల యెడ విరాగామును పొందును. శ్రీకృష్ణభగవానుని భక్తి ద్వారా ఈ స్థితికి చేరగలిగినవాడు శాస్త్రమునందు తెలియజేయబడిన వివిధతపస్సులను, యజ్ఞములను నిర్వహింపవలసిన అవసరము లేదు. దీనికి విరుద్ధముగా వేదప్రయోజనము శ్రీకృష్ణుని చేరుటకే ననెడి విషయము తెలియక కేవలము వేదపరమైన కర్మల యందు మగ్నమైనవాడు ఆ కర్మల యందు కాలమును వృథాచేసినట్లే యగును. అనగా కృష్ణభక్తి యందున్నవారు “శబ్ధబ్రహ్మము” లేదా వేదోపనిషత్తులను అతిశయించుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 87 🌹
✍️ Swami Bhakti Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 52
52. yadā te moha-kalilaṁ
buddhir vyatitariṣyati
tadā gantāsi nirvedaṁ
śrotavyasya śrutasya ca
🌷Translation :
When your intelligence has passed out of the dense forest of delusion, you shall become indifferent to all that has been heard and all that is to be heard.
🌷 Purport :
There are many good examples in the lives of the great devotees of the Lord of those who became indifferent to the rituals of the Vedas simply by devotional service to the Lord. When a person factually understands Kṛṣṇa and his relationship with Kṛṣṇa, he naturally becomes completely indifferent to the rituals of fruitive activities, even though an experienced brāhmaṇa. Śrī Mādhavendra Purī, a great devotee and ācārya in the line of the devotees, says:
sandhyā-vandana bhadram astu bhavato bhoḥ snāna tubhyaṁ namo
bho devāḥ pitaraś ca tarpaṇa-vidhau nāhaṁ kṣamaḥ kṣamyatām
yatra kvāpi niṣadya yādava-kulottaṁsasya kaṁsa-dviṣaḥ
smāraṁ smāram aghaṁ harāmi tad alaṁ manye kim anyena me
“O my prayers three times a day, all glory to you. O bathing, I offer my obeisances unto you. O demigods! O forefathers! Please excuse me for my inability to offer you my respects. Now wherever I sit, I can remember the great descendant of the Yadu dynasty [Kṛṣṇa], the enemy of Kaṁsa, and thereby I can free myself from all sinful bondage. I think this is sufficient for me.”
The Vedic rites and rituals are imperative for neophytes: comprehending all kinds of prayer three times a day, taking a bath early in the morning, offering respects to the forefathers, etc. But when one is fully in Kṛṣṇa consciousness and is engaged in His transcendental loving service, one becomes indifferent to all these regulative principles because he has already attained perfection.
If one can reach the platform of understanding by service to the Supreme Lord Kṛṣṇa, he has no longer to execute different types of penances and sacrifices as recommended in revealed scriptures. And, similarly, if one has not understood that the purpose of the Vedas is to reach Kṛṣṇa and simply engages in the rituals, etc., then he is uselessly wasting time in such engagements. Persons in Kṛṣṇa consciousness transcend the limit of śabda-brahma, or the range of the Vedas and Upaniṣads.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 07/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 88: 02వ అధ్., శ్లో 53 / Bhagavad-Gita - 88: Chap. 02, Ver. 53
🌹. శ్రీమద్భగవద్గీత - 88 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 53
53. శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా | సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ||
🌷 తత్పర్యం :
ఎప్పుడు నీ మనస్సు వేదముల మధుర వాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి యనెడి సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడగుదువు.
🌷 భష్యము :
మనుజుడు సమాధిమగ్నుడైనాడని పలుకుట అతడు కృష్ణభక్తిరసభావనను సంపూర్ణముగా అనుభూత మొనర్చుకొనినాడని పలుకుటయే కాగలదు. అనగా సమాధిమగ్నుడైనవాడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది తత్త్వముల అనుభూతిని బడసి యుండును. మనుజుడు శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనియు మరియు కృష్ణభక్తి భావనలో కర్మల నొనరించుటయే నిజ ధర్మమనియు ఎరుగుటయే ఆత్మానుభవము నందు పూర్ణత్వస్థితి.
కృష్ణభక్తి పరాయణుడు (శ్రద్దావంతుడైన భక్తుడు) ఎన్నడును వేదముల పుష్పిత వాక్కులచే కలత నొందరాదు. అంతియే గాక స్వర్గాదులను పొందుటకై కామ్యకర్మల యందు నియుక్తుడు కారాదు.
కృష్ణభక్తిరసభావన యందు మనుజడు శ్రీకృష్ణునితో ప్రత్యక్షముగా అనోన్య సంబంధము పొందును గనుక భగవానుని ఆదేశములను అతడు అట్టి దివ్యస్థితి యందే నిలిచి గ్రహించగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక ఫలమును బడసి చరమ జ్ఞానమును పొందగలడు. దాని కొరకై మనుజుడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధియైన గురువు ఆదేశములను మాత్రము నిర్వహింప వలసి యుండును .
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 88 🌹
✍️ Swami Bhakti Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 53
53. śruti-vipratipannā te
yadā sthāsyati niścalā
samādhāv acalā buddhis
tadā yogam avāpsyasi
🌷Translation :
When your mind is no longer disturbed by the flowery language of the Vedas, and when it remains fixed in the trance of self-realization, then you will have attained the divine consciousness.
🌷 Purport :
To say that one is in samādhi is to say that one has fully realized Kṛṣṇa consciousness; that is, one in full samādhi has realized Brahman, Paramātmā and Bhagavān. The highest perfection of self-realization is to understand that one is eternally the servitor of Kṛṣṇa and that one’s only business is to discharge one’s duties in Kṛṣṇa consciousness.
A Kṛṣṇa conscious person, or unflinching devotee of the Lord, should not be disturbed by the flowery language of the Vedas nor be engaged in fruitive activities for promotion to the heavenly kingdom. In Kṛṣṇa consciousness, one comes directly into communion with Kṛṣṇa, and thus all directions from Kṛṣṇa may be understood in that transcendental state.
One is sure to achieve results by such activities and attain conclusive knowledge. One has only to carry out the orders of Kṛṣṇa or His representative, the spiritual master.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 08/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 89: 02వ అధ్., శ్లో 54 / Bhagavad-Gita - 89: Chap. 02, Ver. 54
🌹. శ్రీమద్భగవద్గీత - 89 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 54
54. అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితిధీ: కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ||
🌷 తత్పర్యం :
అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షనము లేవి? అతడు ఏ విధముగా భాషించును, అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును, ఎట్లు నడుచును?
🌷 భష్యము :
ప్రతిమనిషిని అతని ప్రత్యేక స్థితిని ననుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణభక్తియందున్నవాడు సైతము తన ప్రత్యేక నైజమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులను కలిగియుండును. ధనికుడైనవాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేకలక్షణములను కలిగియుండునట్లు, దివ్యమైన కృష్ణభక్తిరసభావన యందు నిమగ్నుడైన మహాత్ముడు తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగియుండును. భక్తుని అటువంటి ప్రత్యేక లక్షణములు భగవద్గీత ద్వారా తెలియగలవు. భాషణమనునది మనుజుని ముఖ్యమైన లక్షణము కనుక కృష్ణభక్తిభావన యందున్నవాడు ఏ విధముగా భాషించుననెడి విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడైనవాడు భాషించనంతవరకే ముర్ఖుడుగా గుర్తింపబడడనెది తెసిలిన విషయమే. చక్కని వేషధారణ కావించిన మూర్ఖుడు పలుకనంత వరకు ముర్ఖునిగా గుర్తింపబడకున్నను పలుకుట నారంభించినంతనే తన నిజరూపమును వెల్లడిజేయును.
కృష్ణభక్తిరసభావన యందున్న మనుజుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడనున్నట్లు పిదప ఇతర లక్షణములు అప్రయత్నముగా ఒనగూడగలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 89 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 54
54. arjuna uvāca
sthita-prajñasya kā bhāṣā
samādhi-sthasya keśava
sthita-dhīḥ kiṁ prabhāṣeta
kim āsīta vrajeta kim
🌷Translation :
Arjuna said: O Kṛṣṇa, what are the symptoms of one whose consciousness is thus merged in transcendence? How does he speak, and what is his language? How does he sit, and how does he walk?
🌷 Purport :
As there are symptoms for each and every man, in terms of his particular situation, similarly one who is Kṛṣṇa conscious has his particular nature – talking, walking, thinking, feeling, etc. As a rich man has his symptoms by which he is known as a rich man, as a diseased man has his symptoms by which he is known as diseased, or as a learned man has his symptoms, so a man in transcendental consciousness of Kṛṣṇa has specific symptoms in various dealings. One can know his specific symptoms from the Bhagavad-gītā. Most important is how the man in Kṛṣṇa consciousness speaks; for speech is the most important quality of any man.
It is said that a fool is undiscovered as long as he does not speak, and certainly a well-dressed fool cannot be identified unless he speaks, but as soon as he speaks, he reveals himself at once. The immediate symptom of a Kṛṣṇa conscious man is that he speaks only of Kṛṣṇa and of matters relating to Him. Other symptoms then automatically follow, as stated below.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 09/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 90: 02వ అధ్., శ్లో 55 / Bhagavad-Gita - 90: Chap. 02, Ver. 55
🌹. శ్రీమద్భగవద్గీత - 90 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 55
55. శ్రీ భగవానువాచ
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ | ఆత్మన్యేవాత్మనా తుష్ట: స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||
🌷 తత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆవిధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మ యందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
🌷 భష్యము :
కృష్ణభక్తి యందు పూర్ణుడైనట్టివాడు (భక్తియోగమునందు పూర్ణుడు) మహర్షుల సర్వసద్గుణములను కలిగియుండగా, దివ్యమైన ఆధ్యాత్మికస్థితిలో నిలువలేనటువంటివాడు ఎటువంటి సద్గుణములను కలిగియుండజాలడని శ్రీమద్భాగవతము నిర్ధారించుచున్నది. అట్టివాడు మానసికకల్పనాపరుడగుటయే అందులకు కారణము. కనుకనే మనోజనితమైన సర్వవిధ కామములను మనుజుడు త్యజింపవలెనని ఇచ్చట తెలుపబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ కోరికలు బలవంతముగా అణచబడలేవు. కాని మనుజుడు కృష్ణభక్తిలో నియుక్తుడైనంతనే ఇంద్రియసంబంధ కోరికలు ఎట్టి బాహ్యయత్నము లేకుండా అప్రయత్నముగా అణిగిపోగలవు. కనుక ప్రతియొక్కరు ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణభక్తిభావన యందు నియుక్తులు కావలెను. ఏలయన అదియే దివ్యచైతన్యస్థాయిని తక్షణమే చేరుటకు సహాయభూతమగుచున్నది. మహాత్ముడైనవాడు తనను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా గుర్తించి సదా తృప్తుడై నిలిచియుండును. దివ్యస్థితి యందు నెలకొనిన అటువంటి మనుజుడు తుచ్చమైన ఇంద్రియపర కోరికలను కలిగియుండక శ్రీకృష్ణభగవానుని నిత్యసేవనమనెడి తన సహజస్థితిలో సదా ఆనందమగ్నుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 90 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 55
55. śrī-bhagavān uvāca
prajahāti yadā kāmān
sarvān pārtha mano-gatān
ātmany evātmanā tuṣṭaḥ
sthita-prajñas tadocyate
🌷Translation :
The Supreme Personality of Godhead said: O Pārtha, when a man gives up all varieties of desire for sense gratification, which arise from mental concoction, and when his mind, thus purified, finds satisfaction in the self alone, then he is said to be in pure transcendental consciousness.
🌷 Purport :
The Bhāgavatam affirms that any person who is fully in Kṛṣṇa consciousness, or devotional service of the Lord, has all the good qualities of the great sages, whereas a person who is not so transcendentally situated has no good qualifications, because he is sure to be taking refuge in his own mental concoctions. Consequently, it is rightly said herein that one has to give up all kinds of sense desire manufactured by mental concoction. Artificially, such sense desires cannot be stopped. But if one is engaged in Kṛṣṇa consciousness, then, automatically, sense desires subside without extraneous efforts. Therefore, one has to engage himself in Kṛṣṇa consciousness without hesitation, for this devotional service will instantly help one onto the platform of transcendental consciousness. The highly developed soul always remains satisfied in himself by realizing himself as the eternal servitor of the Supreme Lord. Such a transcendentally situated person has no sense desires resulting from petty materialism; rather, he remains always happy in his natural position of eternally serving the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 10/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 91: 02వ అధ్., శ్లో 56 / Bhagavad-Gita - 91: Chap. 02, Ver. 56
🌹. శ్రీమద్భగవద్గీత - 91 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 56
56. దుఃఖేష్వనుద్విగ్నమనా: సుఖేషు విగతస్పృహ: |
వీతరాగభయక్రోధ: స్థితధీర్మునిరుచ్యతే ||
🌷 తత్పర్యం :
త్రివిధ తాపములందును చలింపని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడును, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సుగల ముని యని చెప్పబడును.
🌷 భష్యము :
ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసికకల్పనలతో పలురీతుల మననము కావించువాడనియే “ముని” యను పదమునకు అర్థము. ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణముండును. మునియైనవాడు ఇతర మునులకు భిన్నుడు కానిచో ముని యని పిలువబడును అర్హుడు కాడు. “ న చాసౌ ఋషి: యస్యమతం న భిన్నం” (మాహాభారతము, వనపర్వము 313.117 ). కాని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తెలిపిన “స్థితధీర్ముని:” సామాన్య మునులకు అన్యమైనవాడు. సర్వవిధములైన మనోకల్పితభావములను త్యజించి యున్నందున అట్టి స్థితధీర్ముని సదా కృష్ణభక్తిలో నిలిచియుండును. అతడు “ప్రశాంత నిశ్శేష మనోరథాంతరుడు” (స్తోత్రరత్నం 43) అని పిలువబడును. అనగా అతడు సర్వవిధములిన మానసికకల్పనా భావములను అతిశయించిన శ్రీకృష్ణుడే సర్వస్వమనెడి నిర్ణయమునకు వచ్చినట్టివాడు (వాసుదేవ: సర్వమితి స మహాత్మా సుదుర్లభ:). అతడే ఆత్మయందు స్థితిని కలిగినట్టి ముని. అట్టి కృష్ణభక్తిపరాయణుడైన ముని త్రివిధతాపములను తాకిడిచే ఎట్టి కలతను పొందడు. తన గతము నందలి పాపములకు ఎక్కువ శిక్ష అనుభవింపవలసి యున్నదని భావించును అతడు ఆ తాపాత్రయములను భగవత్కరుణగా అంగీకరించును. అంతియేగాక భగవానుని కరుణచే తనకు దుఃఖములు అతికొద్ది పరిమాణములో కలుగుచున్నవని అతడు తలపోయును. అదే విధముగా సుఖము కలిగినప్పుడు అట్టివాడు (తానా సౌఖ్యమునకు అర్హుడు కానని తలచుచు) ఆ కీర్తిని శ్రీకృష్ణునకు ఆపాధించును. భగవానుని కరుణ వలననే తాను అట్టి అనుకూల, సుఖవాతావరణములలో నిలిచి భక్తిని సాగించుగలుగుచున్నానని అతడు అవగతము చేసికొనును. అట్టి సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడు ధైర్యమును కలిగియుండి ఆసక్తి మరియు అనాసక్తులచే ప్రభావితుడు కాకుండును. ఇంద్రియభోగము కొరకు దేనినైనను గ్రహించుట యనునది ఆసక్తి కాగా, విషయసుఖముల యెడ అనాసక్తిని యనునది ఆసక్తి కాగా, విషయసుఖముల యెడ అనాసక్తి యనునది వైరాగ్యమనబడును. కాని కృష్ణభక్తి యందు స్థిరుడైనట్టివాడు జీవితమున శ్రీకృష్ణభగవానుని సేవ కొరకే అర్పించి యున్నందున అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడై యుండును. కావుననే తన ప్రయత్నములు విఫలమైనను అతడు క్రోధము చెందడు. అనగా కృష్ణభక్తిపరాయణుడు. జయాపజయములు రెండింటి యందును సదా ధీరుడై స్థిరనిశ్చయముతో నిలుచును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 91 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 56
56. duḥkheṣv anudvigna-manāḥ
sukheṣu vigata-spṛhaḥ
vīta-rāga-bhaya-krodhaḥ
sthita-dhīr munir ucyate
🌷Translation :
One who is not disturbed in mind even amidst the threefold miseries or elated when there is happiness, and who is free from attachment, fear and anger, is called a sage of steady mind.
🌷 Purport :
The word muni means one who can agitate his mind in various ways for mental speculation without coming to a factual conclusion. It is said that every muni has a different angle of vision, and unless a muni differs from other munis, he cannot be called a muni in the strict sense of the term. Nāsāv ṛṣir yasya mataṁ na bhinnam (Mahābhārata, Vana-parva 313.117). But a sthita-dhīr muni, as mentioned herein by the Lord, is different from an ordinary muni. The sthita-dhīr muni is always in Kṛṣṇa consciousness, for he has exhausted all his business of creative speculation. He is called praśānta-niḥśeṣa-mano-rathāntara (Stotra-ratna 43), or one who has surpassed the stage of mental speculations and has come to the conclusion that Lord Śrī Kṛṣṇa, or Vāsudeva, is everything (vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ). He is called a muni fixed in mind. Such a fully Kṛṣṇa conscious person is not at all disturbed by the onslaughts of the threefold miseries, for he accepts all miseries as the mercy of the Lord, thinking himself only worthy of more trouble due to his past misdeeds; and he sees that his miseries, by the grace of the Lord, are minimized to the lowest.
Similarly, when he is happy he gives credit to the Lord, thinking himself unworthy of the happiness; he realizes that it is due only to the Lord’s grace that he is in such a comfortable condition and able to render better service to the Lord. And, for the service of the Lord, he is always daring and active and is not influenced by attachment or aversion.
Attachment means accepting things for one’s own sense gratification, and detachment is the absence of such sensual attachment. But one fixed in Kṛṣṇa consciousness has neither attachment nor detachment because his life is dedicated in the service of the Lord. Consequently he is not at all angry even when his attempts are unsuccessful. Success or no success, a Kṛṣṇa conscious person is always steady in his determination.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 11/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 92: 02వ అధ్., శ్లో 57 / Bhagavad-Gita - 92: Chap. 02, Ver. 57
🌹. శ్రీమద్భగవద్గీత - 92 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము🌴
శ్లోకము 57
57. య: సర్వత్రానభి స్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||
🌷 తత్పర్యం :
భౌతికజగమునందు ప్రాప్తించిన మంచి, చెడులను ప్రశంసించుట గాని, ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణజ్ఞానమునందు స్థిరుడై నిలుచును.
🌷 భష్యము :
భౌతికజగమునందు సదా మంచి, చెడులలో ఏదియోనొకటి కలుగుచునే యుండును. అట్టి ఒడుదుడుకులచే కలతనొందక మంచిచెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణభక్తిరసభావనలో స్థిరుడైనవాడిని అవగతము చేసికొనవచ్చును. లోకము ద్వంద్వభరితము కావున భౌతికజగమున ఉన్నంతకాలము మంచి, చెడులలో ఏదియో నొకటి కలుగుచునే ఉండును. కాని కృష్ణభక్తిభావన యందు స్థిరుడైనట్టివాడు నిర్గుణుడైన కృష్ణుని గుర్చియే సదా చింతించుచుండుట వలన అట్టి మంచి, చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణభక్తిరసభావనయే సమాధి యని పిలువబడు సంపూర్ణ ఆధ్యాత్మికస్థితి యందు మనుజుని నెలకొల్పగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 92 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 🌴
Verse 57
57. yaḥ sarvatrāna bhisnehas
tat tat prāpya śubhāśubham
nābhinandati na dveṣṭi
tasya prajñā pratiṣṭhitā
🌷Translation :
In the material world, one who is unaffected by whatever good or evil he may obtain, neither praising it nor despising it, is firmly fixed in perfect knowledge.
🌷 Purport :
There is always some upheaval in the material world which may be good or evil. One who is not agitated by such material upheavals, who is unaffected by good and evil, is to be understood to be fixed in Kṛṣṇa consciousness. As long as one is in the material world there is always the possibility of good and evil because this world is full of duality. But one who is fixed in Kṛṣṇa consciousness is not affected by good and evil, because he is simply concerned with Kṛṣṇa, who is all-good absolute. Such consciousness in Kṛṣṇa situates one in a perfect transcendental position called, technically, samādhi.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 12/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 93: 02వ అధ్., శ్లో 58 / Bhagavad-Gita - 93: Chap. 02, Ver. 58
🌹. శ్రీమద్భగవద్గీత - 93 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 58
58. యదా సంహరతే చాయం కుర్మో(జ్గ్నానీవ సర్వశ : |
ఇన్ద్రియాణిన్ద్రియార్తేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||
🌷 తత్పర్యం :
తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనెడి రీతి, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణమునందు స్థిరముగా నున్నవాడును.
🌷 భష్యము :
తాను కోరిన రీతిలో తన ఇంద్రియములను నియమింపగలుగుట యోగి(భక్తుడు) లేదా ఆత్మదర్శియైనవానికి పరీక్షయై యున్నది. సాధారణముగా జనులందరును ఇంద్రియములచే దాసులై అవి చెప్పిన రీతి వర్తింతురు. యోగి ఎట్టి స్థితిలో నుండుననెడి ప్రశ్నకు ఇదియే సమాధానము. ఇంద్రియములు విషపూర్ణసర్పములతో పోల్చబడినవి. అవి సదా ఎటువంటి అడ్డు లేకుండా విచ్చలవిడిగా వర్తింపగోరుచుండును. కనుక యోగియైనవాడు లేదా భక్తుడు సర్పముల వంటి ఇంద్రియములను అణుచుటకు (పాములవాని వలె) పరమ శక్తిశాలియై యుండవలెను. అవి యథేచ్చగా వర్తించుటకు అతడెన్నడును అనుమతింపడు. నిషేదింపబడిన కర్మలను గూర్చియు, అమోదింపబడిన కర్మలను గూర్చియు పలువిధములైన ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఇంద్రియభోగము నుండి దూరులై అట్టి నిషిద్దకర్మలను మరియు ఆమోదయోగ్యమైన కర్మలను అవగతము చేసికొననిదే కృష్ణభక్తిభావన యందు స్థిరత్వము పొందుట సాధ్యపడడు. ఈ విషయమున తాబేలు ఒక చక్కని ఉపమానముగా తెలుపబడినది. తాబేలు తన అవయములను ఏ క్షణమైనను ఉపసంహరించుకొని, తిరిగి ఏ సమయమందైనను ఏదేని కార్యార్థమై ప్రదర్శింపగలదు. అదేవిధముగా కృష్ణభక్తిభావనలో నున్న వ్యక్తి యొక్క ఇంద్రియములు కేవలము భగవానుని సేవ కొరకే వినియోగింపబడి అనన్యసమయములలో ఉపసంహరింపబడియుండును. ఇందిరయములను స్వీయసంతృప్తి కొరకు గాక శ్రీకృష్ణభగవానుని సేవ కొరకు వినియోగించమని ఇచ్చట అర్జునుడు ఉపదేశింపబడుచున్నాడు. ఇంద్రియములన్నింటిని శ్రీకృష్ణభగవానుని సేవ యందే నిలుపవలెననెడి విషయమిచ్చట ఇంద్రియములను సదా తన యందే నిలుపుకొని యుండు తాబేలు ఉపమానముతో పోల్చి తెలుబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 93 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 58
58. yadā saṁharate cāyaṁ
kūrmo ’ṅgānīva sarvaśaḥ
indriyāṇ īndriyār thebhyas tasya prajñā pratiṣṭhitā
🌷Translation :
One who is able to withdraw his senses from sense objects, as the tortoise draws its limbs within the shell, is firmly fixed in perfect consciousness.
🌷 Purport :
The test of a yogī, devotee or self-realized soul is that he is able to control the senses according to his plan. Most people, however, are servants of the senses and are thus directed by the dictation of the senses. That is the answer to the question as to how the yogī is situated. The senses are compared to venomous serpents. They want to act very loosely and without restriction. The yogī, or the devotee, must be very strong to control the serpents – like a snake charmer. He never allows them to act independently.
There are many injunctions in the revealed scriptures; some of them are do-not’s, and some of them are do’s. Unless one is able to follow the do’s and the do-not’s, restricting oneself from sense enjoyment, it is not possible to be firmly fixed in Kṛṣṇa consciousness. The best example, set herein, is the tortoise. The tortoise can at any moment wind up its senses and exhibit them again at any time for particular purposes. Similarly, the senses of the Kṛṣṇa conscious persons are used only for some particular purpose in the service of the Lord and are withdrawn otherwise. Arjuna is being taught here to use his senses for the service of the Lord, instead of for his own satisfaction. Keeping the senses always in the service of the Lord is the example set by the analogy of the tortoise, who keeps the senses within.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 13/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 94: 02వ అధ్., శ్లో 59 / Bhagavad-Gita - 94: Chap. 02, Ver. 59
🌹. శ్రీమద్భగవద్గీత - 94 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 59
59. విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహిన: |
రసవర్జం రసో(ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||
🌷 తత్పర్యం :
దేహిని ఇంద్రియభోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే యుండును. కాని అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలుడు.
🌷 భష్యము :
దివ్యమైన ఆధ్యాత్మికస్థితిలో నిలువనిదే ఇంద్రియభోగముల నుండి మరలుట ఎవ్వరికిని సాధ్యము కాదు. విధినియమముల ద్వారా ఇంద్రియభోగానుభవముపై ఆంక్షలు విధించుట యనునది రోగిని కొన్ని విధములైన ఆహారపదార్థమూలా నుండి నియమించుట వంటిది. అట్టి నియమములు రోగికెన్నడును రుచింపవు. అంతియేగాక ఆహారపదార్థములపై కోరికయు అతనికి పోదు. ఆ విధముగనే అల్పజ్ఞులైన మనుజుల కొరకు యమము, నియమము, ఆసనము, ప్రాణాయాము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణాడి పలు పక్రియలు కలిగిన అష్టాంగయోగ విధానము ఇంద్రియములు అదుపు కొరకై నిర్దేశింపబడినవి. కాని కృష్ణభక్తిలో పురోభివృద్ధి నొందుచు శ్రీకృష్ణభగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు మృతప్రాయములైన లౌకికవిషయముల యెడ రుచిని కోల్పోయియుండును. అనగా నియమములనునవి తోలోదశలో నున్న భక్తుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకే ఏర్పాటు చేయబడినవి. కృష్ణభక్తిభావన యందు నిజమగు రసాస్వాదానము కలుగునంతవరకే అవి ప్రయోజనము కలిగియుండును. మనుజుడు కృష్ణభక్తిరసభావితుడైనంతనే శుష్కవిషయములందు అప్రయత్నముగా రుచిని కోల్పోవును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 94 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 59
59. viṣayā vinivartante
nirāhārasya dehinaḥ
rasa-varjaṁ raso ’py asya paraṁ dṛṣṭvā nivartate
🌷Translation :
Though the embodied soul may be restricted from sense enjoyment, the taste for sense objects remains. But, ceasing such engagements by experiencing a higher taste, he is fixed in consciousness.
🌷 Purport :
Unless one is transcendentally situated, it is not possible to cease from sense enjoyment. The process of restriction from sense enjoyment by rules and regulations is something like restricting a diseased person from certain types of eatables. The patient, however, neither likes such restrictions nor loses his taste for eatables. Similarly, sense restriction by some spiritual process like aṣṭāṅga-yoga, in the matter of yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna, etc., is recommended for less intelligent persons who have no better knowledge. But one who has tasted the beauty of the Supreme Lord Kṛṣṇa, in the course of his advancement in Kṛṣṇa consciousness, no longer has a taste for dead, material things. Therefore, restrictions are there for the less intelligent neophytes in the spiritual advancement of life, but such restrictions are only good until one actually has a taste for Kṛṣṇa consciousness. When one is actually Kṛṣṇa conscious, he automatically loses his taste for pale things.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 14/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 95: 02వ అధ్., శ్లో 60 / Bhagavad-Gita - 95: Chap. 02, Ver. 60
🌹. శ్రీమద్భగవద్గీత - 95 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 60
60. యతతో హ్యాపి కౌన్తేయ పురుషస్య విపశ్చిత: |
ఇంద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మన: ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! ఇంద్రియములు బలవంతములను మరియు దృడములును అయియున్నవి. వానిని అదుపు చేయు యత్నించు విచక్షణాపూర్ణుని మనస్సును సైతము అవి హరించివేయుచున్నవి.
🌷. భాష్యము :
ఇంద్రియములను జయించుటకు యత్నించు మునులు, తత్త్వవేత్తలు, జ్ఞానులు పలువురు కలరు. కాని వారట్లు ప్రయత్నించుచున్న వారి యందు ఘనులైనట్టివారే కల్లోలిత మనస్సు కారణముగా ఇంద్రియభోగమునకు బలియగుదురు. గొప్ప తాపసి మరియు పూర్ణయోగియైన విశ్వామిత్రుడు సైతము మేనకచే మైథునభోగమునకు ఆకర్షితుడయ్యెను. యోగము మరియు పలువిధములైన తపస్సులచే ఇంద్రియములను అతడు అదుపుజేయు యత్నించినను మేనకచే మైథునభోగమునకు వశీభూతుడయ్యెను. ఇటువంటి సంఘటనలు ప్రపంచచరిత్రలో పెక్కు గలవు. కావున కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా లగ్నము కానిదే ఇంద్రియములను మరియు మనస్సును అదుపు చేయుట మిగుల కష్టతరము. కృష్ణుని యందు మనస్సును సంలగ్నము చేయక విషయకర్మల నుండి విరమించుట ఎవ్వరికిని సాధ్యము కాదు. ఈ విషయమున గొప్పముని మరియు భక్తుడు అయిన శ్రీ యమునాచార్యులు ఒక చక్కని ఉపమానము ఇచ్చియున్నారు.
యదవధి మమచేత: కృష్ణపదారవిన్దే
నవనవరసధామన్యుద్యతరం రంతుమాసీత్|
తదవధి బత నారీ సంగమే స్మర్యమాణే
భవతి ముఖవికార: సుష్టు నిష్టివనం చ ||
“శ్రీకృష్ణభగవానుని పాదపద్మసేవ యందు నా మనస్సు సదా నిలిచియుండుట చేతను మరియు అనుక్షణము నేనొక నవ్యదివ్యరసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగభావన కలిగినంతనే నేను విముఖుడనై ఆ భావముపై ఉమ్మివేయుదును.”
కనుకనే కృష్ణభక్తిరసభావన యనునది అతి దివ్యమైనది. దాని ద్వారా విషయభోగములు అన్నియును రసహీనములగును. అట్టి కృష్ణభక్తిరసభావానము ఆకలికొన్నవాడు తగినంత పుష్టికర ఆహారముతో ఆకలిని శమింపజేసికొనుట వంటిది. కృష్ణభక్తిభావనలో మనస్సును సంలగ్నము చేసియున్నందున భక్త అంబరీషుడు గొప్ప యోగియైన దుర్వాసముని సైతము జయించెను ( స వై మన: కృష్ణపాదారవిన్దయో: వచాంసి వైకుంఠ గుణానువర్ణనే).
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 95 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 60
60. yatato hy api kaunteya
puruṣasya vipaścitaḥ
indriyāṇi pramāthīni
haranti prasabhaṁ manaḥ
🌷Translation :
The senses are so strong and impetuous, O Arjuna, that they forcibly carry away the mind even of a man of discrimination who is endeavoring to control them.
🌷 Purport :
There are many learned sages, philosophers and transcendentalists who try to conquer the senses, but in spite of their endeavors, even the greatest of them sometimes fall victim to material sense enjoyment due to the agitated mind. Even Viśvāmitra, a great sage and perfect yogī, was misled by Menakā into sex enjoyment, although the yogī was endeavoring for sense control with severe types of penance and yoga practice. And, of course, there are so many similar instances in the history of the world. Therefore, it is very difficult to control the mind and senses without being fully Kṛṣṇa conscious. Without engaging the mind in Kṛṣṇa, one cannot cease such material engagements. A practical example is given by Śrī Yāmunācārya, a great saint and devotee, who says:
yad-avadhi mama cetaḥ kṛṣṇa-pādāravinde
nava-nava-rasa-dhāmany udyataṁ rantum āsīt
tad-avadhi bata nārī-saṅgame smaryamāne
bhavati mukha-vikāraḥ suṣṭhu niṣṭhīvanaṁ ca
“Since my mind has been engaged in the service of the lotus feet of Lord Kṛṣṇa, and I have been enjoying an ever new transcendental humor, whenever I think of sex life with a woman, my face at once turns from it, and I spit at the thought.”
Kṛṣṇa consciousness is such a transcendentally nice thing that automatically material enjoyment becomes distasteful. It is as if a hungry man had satisfied his hunger by a sufficient quantity of nutritious eatables. Mahārāja Ambarīṣa also conquered a great yogī, Durvāsā Muni, simply because his mind was engaged in Kṛṣṇa consciousness (sa vai manaḥ kṛṣṇa-padāravindayor vacāṁsi vaikuṇṭha-guṇānuvarṇane).
🌹 🌹 🌹 🌹 🌹
Date: 15/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 96: 02వ అధ్., శ్లో 61 / Bhagavad-Gita - 96: Chap. 02, Ver. 61
🌹. శ్రీమద్భగవద్గీత - 96 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 61
61. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర: |
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||
🌷. తాత్పర్యం :
ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశము నందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావన యనునది అత్యున్నత యోగపూర్ణత్వమని ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. కృష్ణభక్తిరసభావన లేనిదే ఇంద్రియములపై అదుపు సాధ్యపడదు. గత శ్లోకపు భాస్యములో తెలియజేసినట్లు దుర్వాసుడు భక్త అంబరీషునితో కయ్యమునకు దిగెను. గర్వకారణమున అతడు అనవసరముగా క్రోధితుడై ఇంద్రియములను నిగ్రహింపజాలకపోయెను. వేరొకప్రక్క రాజు ముని యంతటి శక్తిసంపన్నుడు కాకున్నను భక్తుడైనందున అన్యాయముల నన్నింటిని మౌనముగా సహించి విజయము సాధించెను. శ్రీమద్భాగవతము(9.4.18-20) నందు తెలుపబడినట్లు ఈ క్రింది యోగ్యతల కారణమున ఆ రాజు తన ఇంద్రియములను నియమింపగలిగెను.
స వై మన: కృష్ణపదారవిన్దాయో:
వచాంసి వైకుంఠగుణానువర్ణనే |
కరౌ హరేర్మన్దిరమార్జనాదిషు
శ్రుతిం చకారాచ్యుత సత్కథథోదయే ||
ముకున్దలింగాలయ ముకున్దలింగాలయ దర్శనే దృశౌ
తద్భ్రుత్యగాత్ర స్పర్శేంగ సంగమమ్ |
ఘ్రాణ చ తత్పాదసరోజసౌరభే
శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే ||
పాదౌ హరే: క్షేత్రపదానుసర్పణే
శిరో హృషీ కేశపదాభివన్దనే |
కామం చ దాస్యే న తు కామకామ్యాయా
యథోత్తమశ్లోకజనాశ్రయా రతి: ||
“అంబరీషమహారాజు తన మనస్సును శ్రీకృష్ణభగవానుని పాదపద్మముల చెంత స్థిరముగా నిలిపెను. తన వాక్కును కృష్ణుని ధామమును వర్ణించుట యందు నియోగించును. తన కరములను కృష్ణుని మందిరములను శుభ్రపరచుట యందును, తన కర్ణములను ఆ ఆ భగవానుని లీలాకథను శ్రవణము చేయుట యందును, తన కన్నులను ఆ దేవదేవుని సుందరమైన రూపమును గాంచుట యందును, తన దేహమును భక్తుల దేహమును స్పృశించుట యందును, తన నాసికను ఆ దేవదేవుని పాదపద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును అస్వాదించుట యందును, తన జిహ్వను భగవానుని అర్పణము గావించిన తులసీదళములను రుచిచూచుట యందును, తన పాదములను అ శ్రీహరి మందిరములు గల తీర్థస్థలములకు ప్రయాణించుట యందును, తన శిరమును ఆ హృషీకేశుని పాదములకు మ్రొక్కుట యందును, తన కోరికలనన్నింటిని ఆ ఉత్తమశ్లోకుని కోరికలను పూర్ణము కావించుట యందును సంపూర్ణముగా వినియోగించెను.” ఈ యోగ్యలతలన్నియును అతని “మత్పర” భక్తునిగా చేసినవి.
ఈ సందర్భమున “మత్పర:” అను పదము మిక్కిలి ప్రాధాన్యము కలిగియున్నది. మనుజుడు ఏ విధముగా ‘మత్పర’ భక్తుడు కాగాలడో అంబరీషుని జీవితము ద్వారా వివరింపబడినది. గొప్ప విద్వాంసుడును మరియు ‘మత్పర’ భక్తిపరంపరలో ఆచార్యుడును అయిన శ్రీబలదేవ విద్యాభూషణులు ఈ విధముగా పలికిరి. “మద్భక్తి ప్రభావేన సర్వేంద్రియ విజయ పూర్వికాస్వాత్మదృష్టి: సులభేతి భావ: - శ్రీకృష్ణభగవానుని యందు గల భక్తిబలము చేతనే ఇంద్రియములు సంపూర్ణముగా అదుపు చేయబడును”. అగ్ని దృష్టాంతము కూడా కొన్నిమార్లు ఈ విషయమున ఒసగబడుచుండును. “మండుచున్న అగ్ని సమస్తమును భస్మీపాటలము చేయు రీతి, యోగ హృదయస్థుడైన విష్ణువు సర్వపాపములను భస్మము చేయుచున్నాడు”. యోగసూత్రములు సైతము విష్ణుధ్యానమును ప్రతిపాదించుచున్నవే గాని శూన్యధ్యానము కాదు. విష్ణుపరములు కానటువంటి వాటిపై ధ్యానము కావించెడి నామమాత్ర యోగులు ఊహాకల్పిత విషయములనే అన్వేషించుచు కాలమును వృథా పరచినవారగుదురు. కాని మనము మాత్రము శ్రీకృష్ణభగవానుని భక్తి కలిగినటువంటి కృష్ణభక్తిరసభావితము కావలెను. అదియే నిజమైన యోగము యొక్క ముఖ్యలక్ష్యము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 96 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 61
61. tāni sarvāṇi saṁyamya
yukta āsīta mat-paraḥ
vaśe hi yasyendriyāṇi
tasya prajñā pratiṣṭhitā
🌷Translation :
One who restrains his senses, keeping them under full control, and fixes his consciousness upon Me, is known as a man of steady intelligence.
🌷 Purport :
That the highest conception of yoga perfection is Kṛṣṇa consciousness is clearly explained in this verse. And unless one is Kṛṣṇa conscious it is not at all possible to control the senses. As cited above, the great sage Durvāsā Muni picked a quarrel with Mahārāja Ambarīṣa, and Durvāsā Muni unnecessarily became angry out of pride and therefore could not check his senses.
On the other hand, the king, although not as powerful a yogī as the sage, but a devotee of the Lord, silently tolerated all the sage’s injustices and thereby emerged victorious. The king was able to control his senses because of the following qualifications, as mentioned in the Śrīmad-Bhāgavatam (9.4.18–20): sa vai manaḥ kṛṣṇa-
padāravindayor
vacāṁsi vaikuṇṭha-
guṇānuvarṇane
karau harer mandira-mārjanādiṣu
śrutiṁ cakārācyuta-sat-kathodaye
mukunda-liṅgālaya-darśane dṛśau
tad-bhṛtya-gātra-sparśe ’ṅga-saṅgamam
ghrāṇaṁ ca tat-pāda-saroja-saurabhe
śrīmat-tulasyā rasanāṁ tad-arpite
pādau hareḥ kṣetra-padānusarpaṇe
śiro hṛṣīkeśa-padābhivandane
kāmaṁ ca dāsye na tu kāma-kāmyayā
yathottama-śloka-janāśrayā ratiḥ
“King Ambarīṣa fixed his mind on the lotus feet of Lord Kṛṣṇa, engaged his words in describing the abode of the Lord, his hands in cleansing the temple of the Lord, his ears in hearing the pastimes of the Lord, his eyes in seeing the form of the Lord, his body in touching the body of the devotee, his nostrils in smelling the flavor of the flowers offered to the lotus feet of the Lord, his tongue in tasting the tulasī leaves offered to Him, his legs in traveling to the holy place where His temple is situated, his head in offering obeisances unto the Lord, and his desires in fulfilling the desires of the Lord … and all these qualifications made him fit to become a mat-para devotee of the Lord.”
The word mat-para is most significant in this connection. How one can become mat-para is described in the life of Mahārāja Ambarīṣa. Śrīla Baladeva Vidyābhūṣaṇa, a great scholar and ācārya in the line of the mat-para, remarks, mad-bhakti-prabhāvena sarvendriya-vijaya-pūrvikā svātma-dṛṣṭiḥ su-labheti bhāvaḥ. “The senses can be completely controlled only by the strength of devotional service to Kṛṣṇa.” Also, the example of fire is sometimes given: “As a blazing fire burns everything within a room, Lord Viṣṇu, situated in the heart of the yogī, burns up all kinds of impurities.” The Yoga-sūtra also prescribes meditation on Viṣṇu, and not meditation on the void. The so-called yogīs who meditate on something other than the Viṣṇu form simply waste their time in a vain search after some phantasmagoria. We have to be Kṛṣṇa conscious – devoted to the Personality of Godhead. This is the aim of the real yoga.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 16/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 97: 02వ అధ్., శ్లో 62 / Bhagavad-Gita - 97: Chap. 02, Ver. 62
🌹. శ్రీమద్భగవద్గీత - 97 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 62
62. ధ్యాయతో విషయాన్ పుంస: సజ్జ్గస్తేఘూపజాయతే |
సజ్ఞ్గాత్సంజాయతే కామ: కామాత్క్రోధో భిజాయతే ||
🌷. తాత్పర్యం :
ఇంద్రియార్థములను ధ్యానించునపుడు వాని యెడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధినొందగా, కామము నుండి క్రోధము ఉద్భవించును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడు కానివాడు ఇంద్రియార్థములను చింతించునప్పుడు విషయవాంఛలచే ప్రభావితుడగును. వాస్తవమునకు ఇంద్రియములకు చక్కని కార్యక్రమము ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణభగవానుని ప్రేమయుక్తసేవ యందు వానిని నియోగించినచో అవి తప్పక విషయసేవనమునందు నిలువగోరును. ఈ భౌతికజగమునందు బ్రహ్మరుద్రాదులతో సహా ప్రతియెక్కరును ఇంద్రియార్థములచే ప్రభావితము చెందెడివారే. అట్టి యెడ స్వర్గలోకములందలి దేవతల గూర్చి వేరుగా తెలుపపనిలేదు. భౌతికజగత్తు యొక్క ఈ చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణభక్తిభావనాయుతులము అగుటయే ఏకైక మార్గము. ఒకమారు పరమశివుడు ధ్యానమగ్నుడై యుండగా పార్వతీదేవి అతనిని ఇంద్రియప్రీతికై చలింపజేసెను. అందులకు శివుడు అంగీకరించగా కార్తికేయుని జననము కలిగెను. శ్రీకృష్ణభగవానుని భక్తుడైన హరిదాసఠాకూరును సైతము మాయాదేవి అవతారము అదేవిధముగా మొహమునకు గురిచేయు యత్నించెను. కాని యౌవనవంతుడైనను హరదాసుడు శ్రీకృష్ణభగవానుని అంతరంగభక్తి కారణమున అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగెను. పూర్వపు శ్లోకభాష్యములో శ్రీయామునాచార్యులు తెలియజేసిన రీతి, భగవానుని సాహచర్యములో ఒనగూడు ఆధ్యాత్మికానుభవపు దివ్యరసాస్వాదన కారణమున శుద్ధభక్తుడు సర్వవిధములైన ఇంద్రియభోగములను వర్ణించును. భక్తుల ఆధ్యాత్మికవిజయపు రహస్యమిదియే. కావున కృష్ణభక్తిరసభావితుడు కానివాడు ఇంద్రియముల కృత్రిమదమనమునందు ఎంతటి శక్తిసంపన్నుడైనను అంత్యమున విఫలత్వమునే పొందగలడు. ఇంద్రియప్రీతిని గూర్చిన లేశమాత్ర చింతయైనను కోరికల పూర్ణము కొరకై అతనిని కలతపరచుటయే అందులకు కారణము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 97 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 62
62. dhyāyato viṣayān puṁsaḥ
saṅgas teṣūpajāyate
saṅgāt sañjāyate kāmaḥ
kāmāt krodho ’bhijāyate
🌷Translation :
While contemplating the objects of the senses, a person develops attachment for them, and from such attachment lust develops, and from lust anger arises.
🌷 Purport :
One who is not Kṛṣṇa conscious is subjected to material desires while contemplating the objects of the senses. The senses require real engagements, and if they are not engaged in the transcendental loving service of the Lord, they will certainly seek engagement in the service of materialism. In the material world everyone, including Lord Śiva and Lord Brahmā – to say nothing of other demigods in the heavenly planets – is subjected to the influence of sense objects, and the only method to get out of this puzzle of material existence is to become Kṛṣṇa conscious.
Lord Śiva was deep in meditation, but when Pārvatī agitated him for sense pleasure, he agreed to the proposal, and as a result Kārtikeya was born. When Haridāsa Ṭhākura was a young devotee of the Lord, he was similarly allured by the incarnation of Māyā-devī, but Haridāsa easily passed the test because of his unalloyed devotion to Lord Kṛṣṇa. As illustrated in the above-mentioned verse of Śrī Yāmunācārya, a sincere devotee of the Lord shuns all material sense enjoyment due to his higher taste for spiritual enjoyment in the association of the Lord. That is the secret of success. One who is not, therefore, in Kṛṣṇa consciousness, however powerful he may be in controlling the senses by artificial repression, is sure ultimately to fail, for the slightest thought of sense pleasure will agitate him to gratify his desires.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 17/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 98: 02వ అధ్., శ్లో 63 / Bhagavad-Gita - 98: Chap. 02, Ver. 63
🌹. శ్రీమద్భగవద్గీత - 98 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 63
63. క్రోధాద్ భవతి సమ్మోహ: సమ్మోహాత్స్మ్రువిభ్రమ: |
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రుణశ్యతి ||
🌷. తాత్పర్యం :
క్రోధమువలన అధికమోహము కలుగగా,మోహము వలన జ్ఞాపకశక్తి భ్రమకు గురియగును. జ్ఞాపకశక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధినశించినపుడు మనుజుడు తిరిగి సంసారగర్తమున పడిపోవును.
🌷. భాష్యము :
ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సమ్భన్దివస్తున: |
ముముక్షుభి: పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే ||
(భక్తిరసామృతసింధువు – 1.2.258)
ప్రతిదియు భగవానుని సేవలో వినియోగమునకు వచ్చుననెడి విషయమును కృష్ణభక్తిభావన వృద్ధియైనపుడు మనుజుడు ఎరుగగలడు. కృష్ణభక్తిభావనకు సంబంధించిన జ్ఞానము లేని కొందరు కృత్రిమముగా విషయవస్తువులను త్యజించుటకు యత్నింతురు. తత్పలితముగా భౌతికబంధము నుండి వారు ముక్తిని వాంఛించుచున్నను వైరాగ్యమునందు సంపూర్ణస్థితిని మాత్రము పొందజాలరు. వారి నామమాత్ర వైరాగ్యము “ఫల్గు” లేదా అప్రధానమైనదని పిలువబడును. కాని కృష్ణభక్తియందున్న వ్యక్తి ఏ విధముగా ప్రతిదానిని శ్రీకృష్ణసేవలో వినియోగించవలెనో ఎరిగియుండును. తత్కారణముగా అతడు విషయభావనలకు ఎన్నడును బాలి కాడు. ఉదాహరణకు భగవానుడు (లేదా పరతత్త్వము) నిరాకారుడు అయినందున భుజింపడని నిరాకారవాది భావించును. కనుక అతడు సైతము రుచికర పదార్థములను త్యజించుటకు యత్నించును. కాని భక్తుడైనవాడు మాత్రము శ్రీకృష్ణుడు దివ్యభోక్తయనియు మరియు భక్తితో నొసగు సమస్తమును ప్రియముతో ఆరగించుననియు తెలిసియుండుటచే రుచికరమైన ఆహారపదార్థములను ఆ భగవానునకు అర్పించును. ఆ పిదప ప్రసాదముగా పిలువబడును అన్నశేషమును అతడు గ్రహించును. ఆ విధముగా ప్రతిదియు ఆధ్యాత్మికమగుచున్నందున భక్తునికి పతనభయము లేదు. భక్తుడు ప్రసాదమును భక్తితో స్వీకరించగా, అభక్తుడైనవాడు దానిని భౌతికమైనదని భావించి విసర్జించును. కనుకనే నిరాకారవాదులు కృత్రిమ వైరాగ్యము వలన జీవితము ఆనందముగా అనుభవింపలేరు. ఈ కారణము వలననే కొద్దిపాటి మనోచలనమైనను వారిని తిరిగి సంసారగర్తమున తోయుచున్నది. భక్తియుతసేవ యొక్క ఆసరా లేకపోవుట వలననే ముక్తినొందు స్థితి వరకు ఎదిగినను, అట్టివారు తిరిగి పతనము నొందుదురని తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 98 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 63
63. krodhād bhavati sammohaḥ
sammohāt smṛti-vibhramaḥ
smṛti-bhraṁśād buddhi-nāśo
buddhi-nāśāt praṇaśyati
🌷Translation :
From anger, complete delusion arises, and from delusion bewilderment of memory. When memory is bewildered, intelligence is lost, and when intelligence is lost one falls down again into the material pool.
🌷 Purport :
Śrīla Rūpa Gosvāmī has given us this direction:
prāpañcikatayā buddhyā
hari-sambandhi-vastunaḥ
mumukṣubhiḥ parityāgo
vairāgyaṁ phalgu kathyate
(Bhakti-rasāmṛta-sindhu 1.2.258)
By development of Kṛṣṇa consciousness one can know that everything has its use in the service of the Lord. Those who are without knowledge of Kṛṣṇa consciousness artificially try to avoid material objects, and as a result, although they desire liberation from material bondage, they do not attain to the perfect stage of renunciation. Their so-called renunciation is called phalgu, or less important. On the other hand, a person in Kṛṣṇa consciousness knows how to use everything in the service of the Lord; therefore he does not become a victim of material consciousness. For example, for an impersonalist, the Lord, or the Absolute, being impersonal, cannot eat. Whereas an impersonalist tries to avoid good eatables, a devotee knows that Kṛṣṇa is the supreme enjoyer and that He eats all that is offered to Him in devotion. So, after offering good eatables to the Lord, the devotee takes the remnants, called prasādam. Thus everything becomes spiritualized, and there is no danger of a downfall. The devotee takes prasādam in Kṛṣṇa consciousness, whereas the nondevotee rejects it as material. The impersonalist, therefore, cannot enjoy life, due to his artificial renunciation; and for this reason, a slight agitation of the mind pulls him down again into the pool of material existence. It is said that such a soul, even though rising up to the point of liberation, falls down again due to his not having support in devotional service.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 18/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 99: 02వ అధ్., శ్లో 64 / Bhagavad-Gita - 99: Chap. 02, Ver. 64
🌹. శ్రీమద్భగవద్గీత - 99 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 64
64. రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
కాని సమస్త రాగద్వేషముల నుండి ముక్తి పొందిన వాడును మరియు విధినియమముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగిన వాడును అగు మనుజడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును.
🌷. భాష్యము :
మనుజుడు బాహ్యముగా ఇంద్రియములను ఏదియోనొక కృత్రిమపద్దతిలో అదుపు చేసినను వానిని శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియోగించనిదే పతనము తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణభక్తియందున్నవాడు బాహ్యమునకు విషయభోగస్థాయిలో నున్నట్లే కనిపించినను తన కృష్ణభక్తిభావన వలన అతడు భోగకర్మల యెడ ఆసక్తిని కలిగియుండడు. అట్టి కృష్ణభక్తుడు కేవలము కృష్ణుని ప్రియమును టపా అన్యమును వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై యుండును. భక్తుడైనవాడు శ్రీకృష్ణుడు కోరినచో సామాన్యముగా అవాంఛనియమైన కార్యము సైతము ఒనరించును. అలాగుననే కృష్ణుడు కోరకున్నచో సామాన్యముగా తన ప్రీత్యర్థమై ఒనరించు కర్మను సైతము ఒనరింపకుండును. అనగా కేవలము శ్రీకృష్ణుని అధ్యక్షత యందే వర్తించువాడు కావున కర్మ చేయుట లేదా చేయకుండుట యనెడి రెండు విషయములు ఆ భక్తుని అదుపులోనే యుండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని నిర్హేతుక కరుణ మాత్రమే. భోగానుభవస్థితి యందున్నప్పటికిని భక్తుడు దానిని పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 99 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 64
64. rāga-dveṣa-vimuktais tu
viṣayān indriyaiś caran
ātma-vaśyair vidheyātmā
prasādam adhigacchati
🌷Translation :
But a person free from all attachment and aversion and able to control his senses through regulative principles of freedom can obtain the complete mercy of the Lord.
🌷 Purport :
It is already explained that one may externally control the senses by some artificial process, but unless the senses are engaged in the transcendental service of the Lord, there is every chance of a fall. Although the person in full Kṛṣṇa consciousness may apparently be on the sensual plane, because of his being Kṛṣṇa conscious he has no attachment to sensual activities. The Kṛṣṇa conscious person is concerned only with the satisfaction of Kṛṣṇa, and nothing else. Therefore he is transcendental to all attachment and detachment. If Kṛṣṇa wants, the devotee can do anything which is ordinarily undesirable; and if Kṛṣṇa does not want, he shall not do that which he would have ordinarily done for his own satisfaction. Therefore to act or not to act is within his control because he acts only under the direction of Kṛiṣhṇa. This consciousness is the causeless mercy of the Lord, which the devotee can achieve in spite of his being attached to the sensual platform.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 19/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 100: 02వ అధ్., శ్లో 65 / Bhagavad-Gita - 100: Chap. 02, Ver. 65
🌹. శ్రీమద్భగవద్గీత - 100 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 65
65. ప్రసాదే సర్వదు:ఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి: పర్యవతిష్టతే ||
🌷. తాత్పర్యం :
ఈ విధముగా కృష్ణభక్తిరసభావన యందు సంతృప్తి చెందినవానికి త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్త చిత్తము కలిగినపుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 100 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 65
65. prasāde sarva-duḥkhānāṁ
hānir asyopajāyate
prasanna-cetaso hy āśu buddhiḥ paryavatiṣṭhate
🌷Translation :
For one thus satisfied [in Kṛṣṇa consciousness], the threefold miseries of material existence exist no longer; in such satisfied consciousness, one’s intelligence is soon well established.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 20/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 101: 02వ అధ్., శ్లో 66 / Bhagavad-Gita - 101: Chap. 02, Ver. 66
🌹. శ్రీమద్భగవద్గీత - 101 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 66
66. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయుత: శాన్తిరశాన్తస్య కుత: సుఖమ్ ||
🌷. తాత్పర్యం :
(కృష్ణభక్తిభావన యందు) భగవానునితో సంబంధమును పొందనివాడు విశుద్ధబుద్ధిని గాని, స్థిరమైన మనస్సును గాని కలిగియుండజాలడు. అవి లేనిదే శాంతిని పొందటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును?
🌷. భాష్యము :
మనుజుడు కృష్ణభక్తిభావన యందు నిలువనిదే శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు, తపస్సులకు ఫలభోక్తయనియు, అతడే సకలసృష్టులకు అధిపతి యనియు, అతడే సకలజీవులకు నిజమైన స్నేహితుడనియు మనుజుడు అవగతము చేసికొనినపుడు వాస్తవమైన శాంతిని పొందునని భగవద్గీత పంచామాధ్యాయమున (5.29) ద్రువీకరింప బడినది. అనగా మనుజుడు కృష్ణభక్తిరస భావితుడు కానిచో మనస్సుకు ఒక లక్ష్యము లభింపడు. చరమలక్ష్యము లేనందునే మనస్సు చంచలమగును గనుక శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తమునకు భోక్త, ప్రభువు, స్నేహితుడు తెలిసికొననిచో మనుజుడు స్థిరమనస్సుతో శాంతిని పొందగలడు. కనుకనే శ్రీకృష్ణునితో ఎటువంటి సంబంధము లేకుండా వర్తించువాడు ఎంతటి ఆధ్యాత్మికపురోగతిని మరియు శాంతిని ప్రదర్శించినను శాంతి లేకుండా సదా కలత చెందియే ఉండును. కృష్ణభక్తిరసభావన యనునది స్వయముగా ప్రకటమయ్యే దివ్యమైన శాంతిస్థితి. అట్టి దివ్యస్థితి శ్రీకృష్ణునితో గల దివ్య సంబంధముతోనే ప్రాప్తించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 101 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 66
66. nāsti buddhir ayuktasya na cāyuktasya bhāvanā
na cābhāvayataḥ śāntir aśāntasya kutaḥ sukham
🌷Translation :
One who is not connected with the Supreme [in Kṛiṣhṇa consciousness] can have neither transcendental intelligence nor a steady mind, without which there is no possibility of peace. And how can there be any happiness without peace?
🌷 Purport :
Unless one is in Kṛiṣhṇa consciousness, there is no possibility of peace. So it is confirmed in the Fifth Chapter (5.29) that when one understands that Kṛiṣhṇa is the only enjoyer of all the good results of sacrifice and penance, that He is the proprietor of all universal manifestations, and that He is the real friend of all living entities, then only can one have real peace. Therefore, if one is not in Kṛiṣhṇa consciousness, there cannot be a final goal for the mind. Disturbance is due to want of an ultimate goal, and when one is certain that Kṛiṣhṇa is the enjoyer, proprietor and friend of everyone and everything, then one can, with a steady mind, bring about peace. Therefore, one who is engaged without a relationship with Kṛiṣhṇa is certainly always in distress and is without peace, however much he may make a show of peace and spiritual advancement in life. Kṛiṣhṇa consciousness is a self-manifested peaceful condition which can be achieved only in relationship with Kṛiṣhṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 21/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 102: 02వ అధ్., శ్లో 67 / Bhagavad-Gita - 102: Chap. 02, Ver. 67
🌹. శ్రీమద్భగవద్గీత - 102 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 67
67. ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి ||
🌷. తాత్పర్యం :
నీటి యందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి, మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చరించు ఇంద్రియములలో ఒక్కటైనను సరియే మనుజుని బుద్ధిని హరింపగలదు.
🌷. భాష్యము :
ఇంద్రియములన్నియు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన సేవయందు నియుక్తములై యుండవలెను. ఒక్క ఇంద్రియము భోగానుభవములో నున్నను అది భక్తుని ఆధ్యాత్మికపురోగమున మార్గము నుండి దారి మళ్ళించగలదు. అంబరీషుని వృత్తాంతములో తెలిపిన రీతి ఇంద్రియములన్నియును కృష్ణభక్తి యందే నియోగింప బడవలెను. అది ఒక్కటియే మనస్సును అదుపు చేయుటకు సరియైన విధానము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 102 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 67
67. indriyāṇāṁ hi caratāṁ
yan mano ’nuvidhīyate
tad asya harati prajñāṁ
vāyur nāvam ivāmbhasi
🌷Translation :
As a strong wind sweeps away a boat on the water, even one of the roaming senses on which the mind focuses can carry away a man’s intelligence.
🌷 Purport :
Unless all of the senses are engaged in the service of the Lord, even one of them engaged in sense gratification can deviate the devotee from the path of transcendental advancement. As mentioned in the life of Mahārāja Ambarīṣa, all of the senses must be engaged in Kṛṣṇa consciousness, for that is the correct technique for controlling the mind.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 22/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 103: 02వ అధ్., శ్లో 68 / Bhagavad-Gita - 103: Chap. 02, Ver. 68
🌹. శ్రీమద్భగవద్గీత - 103 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 68
68. టతస్మాద్ యస్య మాహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||
🌷. తాత్పర్యం :
అందుచే ఓ మాహాబాహో! ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడియుండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడనబడును.
🌷. భాష్యము :
ఇంద్రియములను శ్రీకృష్ణభగవానుని ప్రేమయుత సేవ యందు నిలుపుట ద్వారా ( కృష్ణభక్తిరసభావన ద్వారా) మనుజుడు ఇంద్రియవేగమును అరికట్టవచ్చును. శత్రువులను అధికబలముతో అణిచివేయు రీతి, ఇంద్రియవేగమును సైతము అణచవచ్చును. కాని అది ఎట్టి మానవయత్నముచే గాక ఇంద్రియములను శ్రీకృష్ణభగవానుని సేవలో నిలుపుట ద్వారానే సాధ్యమగును. ఈ విధముగా కృష్ణభక్తిరసభావన ద్వారానే మనుజుడు నిజముగా స్థితప్రజ్ఞుడు కాగాలడనియు మరియు కృష్ణభక్తి యనెడి ఈ దివ్యకళను ప్రామాణికుడైన గురువు నిర్దేశమునందే ఒనరింపవలెననియు అవగతము చేసికొనినవాడు సాధకుడు (ముక్తిని పొందుటకు యోగ్యుడు) అనబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 103 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 68
68. tasmād yasya mahā-bāho
nigṛhītāni sarvaśaḥ
indriyāṇīndriyārthebhyas
tasya prajñā pratiṣṭhitā
🌷Translation :
Therefore, O mighty-armed, one whose senses are restrained from their objects is certainly of steady intelligence.
🌷 Purport :
One can curb the forces of sense gratification only by means of Kṛṣṇa consciousness, or engaging all the senses in the transcendental loving service of the Lord. As enemies are curbed by superior force, the senses can similarly be curbed, not by any human endeavor, but only by keeping them engaged in the service of the Lord. One who has understood this – that only by Kṛṣṇa consciousness is one really established in intelligence and that one should practice this art under the guidance of a bona fide spiritual master – is called a sādhaka, or a suitable candidate for liberation.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 23/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 104: 02వ అధ్., శ్లో 69 / Bhagavad-Gita - 104: Chap. 02, Ver. 69
🌹. శ్రీమద్భగవద్గీత - 104 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 69
69. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: ||
🌷. తాత్పర్యం :
సకలజీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము.
🌷. భాష్యము :
తెలివిగల వారిలో రెండు తరగతుల వారు కలరు. అందులో నొకరు ఇంద్రియ ప్రీత్యర్థమై భౌతికకర్మల యందు తెలివిని కలిగియుండగా, ఇంకొక రకమువారు అంతర్ముఖులు మరియు అభ్యాసతత్పరులై యుందురు. అంతర్ముఖుడైన ముని (తెలివిగల మనుజుడు) కర్మల విషయములో లగ్నమైయున్న మనుజులకు రాత్రి వంటివి. ఆత్మానుభవరాహిత్యము వలన అట్టి రాత్రి యందు లౌకికజనులు సదా నిద్రలో నుందురు. అట్టి విషయానురక్తుల “రాత్రిసమయము” నందు మాత్రము అంతర్ముఖుడైన ముని జాగరూకుడై యుండును. మునియైనవాడు ఆద్యాత్మిక పురోభివృద్ధి యందు దివ్యానందము నొందగా, ఆత్మానుభవ విషయమున నిద్రించు కారణముగా భౌతికకర్మల యందున్న మనుజుడు పలువిధములైన భోగములను గూర్చి కలలు గనుచు ఆ నిద్రావస్థ యందు కొన్నిమార్లు సుఖమును, మరికొన్నిమార్లు దుఖమును అనుభవించుచుండును. అతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖదు:ఖముల యెడ సదా తటస్థుడై యుండును. భౌతికకర్మలచే ఏమాత్రము కలతచెందక అతడు తన ఆత్మానుభవకర్మల యందు నిమగ్నుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 104 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 69
69. yā niśā sarva-bhūtānāṁ
tasyāṁ jāgarti saṁyamī
yasyāṁ jāgrati bhūtāni
sā niśā paśyato muneḥ
🌷Translation :
What is night for all beings is the time of awakening for the self-controlled; and the time of awakening for all beings is night for the introspective sage.
🌷 Purport :
There are two classes of intelligent men. One is intelligent in material activities for sense gratification, and the other is introspective and awake to the cultivation of self-realization. Activities of the introspective sage, or thoughtful man, are night for persons materially absorbed.
Materialistic persons remain asleep in such a night due to their ignorance of self-realization. The introspective sage remains alert in the “night” of the materialistic men. The sage feels transcendental pleasure in the gradual advancement of spiritual culture, whereas the man in materialistic activities, being asleep to self-realization, dreams of varieties of sense pleasure, feeling sometimes happy and sometimes distressed in his sleeping condition. The introspective man is always indifferent to materialistic happiness and distress. He goes on with his self-realization activities undisturbed by material reactions.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 24/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 105: 02వ అధ్., శ్లో 70 / Bhagavad-Gita - 105: Chap. 02, Ver. 70
🌹. శ్రీమద్భగవద్గీత - 105 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 70
70. ఆపూర్వ మాణమచల ప్రతిష్టం సముద్రమాప: ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్ కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ ||
🌷. తాత్పర్యం :
సదా సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి, తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహములే కలత నొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు.
🌷. భాష్యము :
విస్తారమగు సముగ్రము సదా జలపూర్ణమై యుండును. అధికపరిమాణములో జలముచే పూరింపబడుట వలన ముఖ్యముగా వర్షాకాలమునందు ఆది జలముచే నిండియుండును. కాని అది స్థిరముగా నునుండి చలింపకుండును. కనీసము చెలియకట్టనైనను దాటదు. ఈ విషయము కృష్ణభక్తిభావన యందు స్థితినొందిన వ్యక్తియందును సత్యమై యున్నది. దేహమున్నంతవరకు దేహమునకు సంబంధించిన కోరికలు కలుగుచునే యుండును. కాని భక్తుడైనవాడు తన యందలి పూర్ణత్వము కారణముగా అట్టి కోరికలచే కలతనొందడు. కృష్ణభక్తి యందున్నవానికి ఆ శ్రీకృష్ణుడే సర్వావసరములను తీర్చును గావున అతడు ఏదియును వాంచింపడు. కనుకనే అతడు సముద్రము వలె సదా తన యందే పూర్ణుడై యుండును. సముద్రమునందు నదులు ప్రవేశించు రీతిగా తన యందు కోరికలు ప్రవేశించినను అతడు తన కర్మల యందు స్థిరుడై యుండి ఇంద్రియభోగకోరికలచే ఏమాత్రము కలతనొందకుండును. కోరికలు కలుగుచున్నప్పటికి భోగవాంచను త్యజించియుండెడి కృష్ణభక్తిభావనాయుతునికి ఇదియే నిదర్శనము. భగవానుని ప్రేమయుత సేవలో తృప్తినొందుచు సముద్రము వలె స్థిరుడై యుండును గావున ఆ భక్తుడు సంపూర్ణశాంతిని పొందును. కాని మోక్షపర్యంతము (భౌతికజయమును గూర్చి వేరుగా తెలుపపనిలేదు) కోరికల నీడేర్చుకొనుట యందే ప్రియము గలవాడు ఎన్నడును శాంతిని పొందలేరు. కామ్యకర్మరతులు, మోక్షకాములు, సిద్దులను పొంద యత్నించు యోగులు మొదలగు వారందరును తీరని కోరికలచే ఎల్లప్పుడును దు:ఖముచే కలిగియుందురు. కాని కృష్ణభక్తిభావన యందుండువాడు శ్రీకృష్ణభగవానుని సేవలో సద ఆనందమునే కలిగియుండును. అతనికి ఏ కోరికలు ఉండవు. చివరకు నామమాత్ర భౌతికబంధము నుండి ముక్తిని సైతము అతడు వాంచింపడు. అనగా లౌకిక కోరికలు లేనందునే కృష్ణభక్తులు సదా సంపూర్ణశాంతిని కలిగియుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 105 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 70
70. āpūryamāṇam acala-pratiṣṭhaṁ
samudram āpaḥ praviśanti yadvat
tadvat kāmā yaṁ praviśanti sarve
sa śāntim āpnoti na kāma-kāmī
🌷Translation :
A person who is not disturbed by the incessant flow of desires – that enter like rivers into the ocean, which is ever being filled but is always still – can alone achieve peace, and not the man who strives to satisfy such desires.
🌷 Purport :
Although the vast ocean is always filled with water, it is always, especially during the rainy season, being filled with much more water. But the ocean remains the same – steady; it is not agitated, nor does it cross beyond the limit of its brink. That is also true of a person fixed in Kṛṣṇa consciousness. As long as one has the material body, the demands of the body for sense gratification will continue. The devotee, however, is not disturbed by such desires, because of his fullness. A Kṛṣṇa conscious man is not in need of anything, because the Lord fulfills all his material necessities. Therefore he is like the ocean – always full in himself. Desires may come to him like the waters of the rivers that flow into the ocean, but he is steady in his activities, and he is not even slightly disturbed by desires for sense gratification. That is the proof of a Kṛṣṇa conscious man – one who has lost all inclinations for material sense gratification, although the desires are present. Because he remains satisfied in the transcendental loving service of the Lord, he can remain steady, like the ocean, and therefore enjoy full peace. Others, however, who want to fulfill desires even up to the limit of liberation, what to speak of material success, never attain peace.
The fruitive workers, the salvationists, and also the yogīs who are after mystic powers are all unhappy because of unfulfilled desires. But the person in Kṛṣṇa consciousness is happy in the service of the Lord, and he has no desires to be fulfilled. In fact, he does not even desire liberation from the so-called material bondage. The devotees of Kṛṣṇa have no material desires, and therefore they are in perfect peace.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 25/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 106: 02వ అధ్., శ్లో 71 / Bhagavad-Gita - 106: Chap. 02, Ver. 71
🌹. శ్రీమద్భగవద్గీత - 106 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 71
71. విహాయ కామాన్ య: సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ: |
నిర్మమో నిరహంకార: స శాన్తిమధిగచ్చతి ||
🌷. తాత్పర్యం :
ఇంద్రియభోగానుభవ కోరికల నన్నింటిని త్యజించి నిష్కామునిగా జీవించుచు, మమకారము మరియు మిథ్యాహంకారము వదిలిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును.
🌷. భాష్యము :
నిష్కామత్వమనగా ఇంద్రియభోగము కొరకై దేనిని వాచింపకుండుట యని భావము. అనగా కృష్ణభక్తియందు నిలువగోరుటయే నిజమైన నిష్కామత్వము. దేహాత్మభావనము మరియు జగమునందలి దేనిపైనను యజమానిత్వమును కలిగియుండక శ్రీకృష్ణుని దాసునిగా మనుజుని వాస్తస్థితిని అవగతము చేసికొనుటయే కృష్ణభక్తిభావనయందలి పూర్ణత్వస్థితి. అట్టి పూర్ణత్వస్థితి యందు నెలకొనినవాడు శ్రీకృష్ణుడే సకలమునకు అధిపతి కనుక సమస్తమును అతని ప్రీత్యర్థమే నియోగింపబడవలెనని ఎరిగియుండును. అర్జునుడు తొలుత తన ప్రీత్యర్థమై యుద్దమును నిరాకరించినను కృష్ణభక్తిభావనాయుతుడు అయినంతనే యుద్ధము నొనరించెను. అతడు యుద్ధమునందు పాల్గొనవలెనని శ్రీకృష్ణుడు వాంచించియుండుటయే అందులకు కారణము. యుద్ధము చేయవలెననెడి కోరిక తనకు లేకున్నను కృష్ణుని కొరకై అతడు తన శక్త్యానుసారము యుద్ధము చేసెను. కృత్రిమముగా కోరికలను నశింపజేయుట కన్నను కృష్ణుని ప్రియమును వాంచించుట యనునది నిజమైన నిష్కామత్వమై యున్నది. జీవుడేజీవుడెన్నడు వాంఛారహితుడు కాజాలడు. కాని అతడు తన కోరికల పద్ధతిని(గుణమును) మార్చుకొనవలయును. భౌతికవాంఛారహితుడైన వ్యక్తి సమస్తము శ్రీకృష్ణునకే చెందినదని (ఈశావాస్యమిదం సర్వమ్) తెలిసియుండును కావున దేనిపైనను వ్యర్థముగా యజమానిత్వమును కలిగియుండడు. ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణునికి నిత్యాంశయైన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడును శ్రీకృష్ణునితో సమానుడు కాని, అధికుడు కాని కాజాలడనెడి ఆత్మానుభవము పైననే ఈ దివ్యజ్ఞానము ఆధారపడియున్నది. ఇట్టి కృష్ణభక్తిరసభావన యొక్క అవగాహనయే శాంతికి మూలసిద్ధాంతమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 106 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 71
71. vihāya kāmān yaḥ sarvān pumāṁś carati niḥspṛhaḥ nirmamo nirahaṅkāraḥ
sa śāntim adhigacchati
🌷Translation :
A person who has given up all desires for sense gratification, who lives free from desires, who has given up all sense of proprietorship and is devoid of false ego – he alone can attain real peace.
🌷 Purport :
To become desireless means not to desire anything for sense gratification. In other words, desire for becoming Kṛṣṇa conscious is actually desirelessness. To understand one’s actual position as the eternal servitor of Kṛṣṇa, without falsely claiming this material body to be oneself and without falsely claiming proprietorship over anything in the world, is the perfect stage of Kṛṣṇa consciousness. One who is situated in this perfect stage knows that because Kṛṣṇa is the proprietor of everything, everything must be used for the satisfaction of Kṛṣṇa. Arjuna did not want to fight for his own sense satisfaction, but when he became fully Kṛṣṇa conscious he fought because Kṛṣṇa wanted him to fight. For himself there was no desire to fight, but for Kṛṣṇa the same Arjuna fought to his best ability. Real desirelessness is desire for the satisfaction of Kṛṣṇa, not an artificial attempt to abolish desires. The living entity cannot be desireless or senseless, but he does have to change the quality of the desires. A materially desireless person certainly knows that everything belongs to Kṛṣṇa (īśāvāsyam idaṁ sarvam), and therefore he does not falsely claim proprietorship over anything. This transcendental knowledge is based on self-realization – namely, knowing perfectly well that every living entity is an eternal part and parcel of Kṛṣṇa in spiritual identity, and that the eternal position of the living entity is therefore never on the level of Kṛṣṇa or greater than Him. This understanding of Kṛṣṇa consciousness is the basic principle of real peace.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 26/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 107: 02వ అధ్., శ్లో 72 / Bhagavad-Gita - 107: Chap. 02, Ver. 72
🌹. శ్రీమద్భగవద్గీత - 107 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము 🌴
శ్లోకము 72
72. ఏషా బ్రాహ్మీ స్థితి: పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామన్తకాలే(పి బ్రహ్మనిర్వాణ మృచ్చతి ||
🌷. తాత్పర్యం :
ఇదియే అధ్యాత్మికమును, దివ్యమును అయిన జీవనవిధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహము నొందడు. మరణ సమయము నందును ఆ విధముగా స్థితుడైనవట్టివాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనము (ఆధ్యాత్మిక జీవనము) మనుజడు క్షణములో పొందవచ్చును లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేక పోవచ్చును. ఇది కేవలము తత్త్వము యొక్క అవగాహన మరియు అంగీకకారముపైననే ఆధారపడి యున్నది. కృష్ణునకు శరణము నొందుట ద్వారా ఖట్వాంగమహారాజు మరణమునకు కొలది నిమిషమునకు ముందే అట్టి జీవనస్థితి పొందగలిగెను. వాస్తవమునకు విషయపూర్ణ జీవనమునకు ముగించుటయే నిర్వాణము.
భౌతికజీవనము తరువాత మిగులునది శూన్యమని భౌద్ధవాదము తెలుపుచుండగా అందులకు భిన్నముగా శ్రీమద్భగవద్గీత ఉపదేశించుచున్నది. అనగా నిజమైన జీవితము భౌతికజీవితపు అంతము పిమ్మట ఆరంభమగుచున్నది. ఈ భౌతికజీవన విధానము ప్రతి యొక్కరు అంతము చేసికొనియే తీరవలెనని తెలిసికొనుట లౌకికునికి సరిపోవును. కాని ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందినవాడు భౌతికజన్మము తదుపరి వేరొక ఆధ్యాత్మికముగా కలదని ఎరుగవలెను. జన్మ ముగియుటకు పూర్వమే మనుజుడు అదృష్టవశమున కృష్ణభక్తిరసభావితుడు అయినచో శీఘ్రమే “బ్రహ్మనిర్వాణస్థితి”ని పొందగలడు. భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు భేదము లేదు. ఆ రెండును ఒకే పూర్ణత్వస్థాయిలో ఉన్నట్టివి కనుక భగవానుని సేవయందు నిలుచుట యన్నది భగవద్ధామమును పొందినట్లే యగును. భౌతికజగమునందు ఇంద్రియప్రీతి కర్మలుండగా అధ్యాత్మికజగమున కృష్ణపరకర్మలుండును. ఈ జన్మమునందే కృష్ణభక్తిని పొందుట యనునది శీఘ్రమే బ్రహ్మస్థితిని కలుగజేయును. కనుకనే కృష్ణభక్తిరసభావితుడు భగవద్రాజ్యమున నిశ్చయముగా ప్రవేశించినట్టివాడే యగుచున్నాడు.
బ్రహ్మము భౌతికత్వమునకు వ్యతిరేకమైనది. కనుక “బ్రహ్మీస్థితి” యనగా భౌతిక కర్మకలాపములను కూడిన స్థాయిలో నిలువకుండుట యని అర్థము. శ్రీకృష్ణభగవానునికి ఒనర్చబడు భక్తియుక్తసేవ ముక్తస్థితిగా భగవద్గీత యందు అంగీకరింపబడినది (సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే). కనుకనే బ్రాహ్మీస్థితి భౌతికబంధముల నుండి ముక్తిని పొందినట్టి స్థితియై యున్నది.
భగవద్గీత యొక్క ఈ ద్వితీయాధ్యాయము గీతాసారమని శ్రీల భక్తివినోదఠాకూరులు తెలిపియుండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగములనునవి భగవద్గీత యందలి చర్చనీయాంశములు. ఈ ద్వితీయధ్యాయమున గీతాసారాంశముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా చర్చించబడి భక్తియోగము కొద్దిగా సూచించబడినది.
శ్రీమద్భగవద్గీత యందలి “గీతాసారము” అను ద్వితీయాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 107 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga 🌴
Verse 72
72. eṣā brāhmī sthitiḥ pārtha naināṁ prāpya vimuhyati
sthitvāsyām anta-kāle ’pi brahma-nirvāṇam ṛcchati
🌷Translation :
That is the way of the spiritual and godly life, after attaining which a man is not bewildered. If one is thus situated even at the hour of death, one can enter into the kingdom of God.
🌷 Purport :
One can attain Kṛṣṇa consciousness or divine life at once, within a second – or one may not attain such a state of life even after millions of births. It is only a matter of understanding and accepting the fact. Khaṭvāṅga Mahārāja attained this state of life just a few minutes before his death, by surrendering unto Kṛṣṇa. Nirvāṇa means ending the process of materialistic life. According to Buddhist philosophy, there is only void after the completion of this material life, but Bhagavad-gītā teaches differently.
Actual life begins after the completion of this material life. For the gross materialist it is sufficient to know that one has to end this materialistic way of life, but for persons who are spiritually advanced, there is another life after this materialistic life. Before ending this life, if one fortunately becomes Kṛṣṇa conscious, he at once attains the stage of brahma-nirvāṇa. There is no difference between the kingdom of God and the devotional service of the Lord.
Since both of them are on the absolute plane, to be engaged in the transcendental loving service of the Lord is to have attained the spiritual kingdom. In the material world there are activities of sense gratification, whereas in the spiritual world there are activities of Kṛṣṇa consciousness. Attainment of Kṛṣṇa consciousness even during this life is immediate attainment of Brahman, and one who is situated in Kṛṣṇa consciousness has certainly already entered into the kingdom of God.
Brahman is just the opposite of matter. Therefore brāhmī sthiti means “not on the platform of material activities.” Devotional service of the Lord is accepted in the Bhagavad-gītā as the liberated stage (sa guṇān samatītyaitān brahma-bhūyāya kalpate). Therefore, brāhmī sthiti is liberation from material bondage.
Śrīla Bhaktivinoda Ṭhākura has summarized this Second Chapter of the Bhagavad-gītā as being the contents for the whole text. In the Bhagavad-gītā, the subject matters are karma-yoga, jñāna-yoga and bhakti-yoga. In the Second Chapter karma-yoga and jñāna-yoga have been clearly discussed, and a glimpse of bhakti-yoga has also been given, as the contents for the complete text.
Thus end the Bhaktivedanta Purports to the Second Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of its Contents.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 27/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 108: 03వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 108: Chap. 03, Ver. 01
🌹. శ్రీమద్భగవద్గీత - 108 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 1
1. అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు ఈ విధంగా అన్నాడు.
కృష్ణా! కర్మముకంటే జ్ఞానమే మేలని నీ అభిప్రాయముగ అనిపించుచున్నది. ఇదియే నీ అభిప్రాయం అయినచో, నన్ను, హింసారూపమై క్రూరమైనట్టి యుద్ధాఖ్యకర్మమునే చేయుము అని నీవు నియోగించుటకు కారణముయేమి? చెప్పుము అని భావము.
🌷. భాష్యము :
పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు తన సన్నిహిత స్నేహితుడైన అర్జునుని దుఃఖసాగరము నుండి ఉద్ధరింపజేయు ఉద్దేశ్యముతో ఆత్మ యొక్క నిజస్థితిని గడచిన అధ్యాయమునందు విపులముగా వివరించెను. అంతియేగాక ఆత్మానుభవమార్గమైన బుద్ధియోగమును( కృష్ణభక్తిరసభావనము) సైతము ప్రతిపాదించును. కొన్నిమార్లు కృష్ణభక్తిభావము జడత్వమని తప్పుగా భావింపబడును. అ విధముగా అపార్థము చేసికొనినవాడు పవిత్ర కృష్ణనామమును జపించును పూర్ణ కృష్ణభక్తియుతుడగుటకు ఏకాంతస్థలమునకు చనుచుండును. కాని కృష్ణభక్తి తత్త్వమున సంపూర్ణముగా శిక్షణను పొందనిదే ఏకాంతస్థలములో కృష్ణనామజపమును చేయుట హితకరము కాదు. అట్టి కార్యము వలన కేవలము అమాయకజనులచే భక్తిప్రశంశలు మాత్రమే మనుజునకు లభింపగలవు. అర్జునుడు సైతము కృష్ణభక్తిభావన (బుద్ధియోగము లేదా ఆధ్యాత్మికజ్ఞానమునందు బుద్ధి) యనగా క్రియాశీలక జీవనము నుండి విరణమును పొంది ఏకాంతస్థలములో తపోధ్యానము చేయుట యని భావించెను. అనగా కృష్ణభక్తి నెపమున అతడు యుద్ధము నుండి తెలివితో విరమింపగోరెను. కాని అతడు ఉత్తమవిద్యార్థి వలె తన గురువు ఎదుట ఈ విషయముంచి ఉత్తమమార్గామేదియో తనకు తెలుపుమని ప్రశ్నించెను. అర్జునిని ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణభగవానుడు కర్మయోగమును (కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించు విధానము) ఈ తృతీయాధ్యాయమున విపులముగా వివరించాను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 108 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 1
1. arjuna uvāca
jyāyasī cet karmaṇas te
matā buddhir janārdana
tat kiṁ karmaṇi ghore māṁ
niyojayasi keśava
🌷Translation :
Arjuna said: O Janārdana, O Keśava, why do You want to engage me in this ghastly warfare, if You think that intelligence is better than fruitive work?
🌷 Purport :
The Supreme Personality of Godhead Śrī Kṛṣṇa has very elaborately described the constitution of the soul in the previous chapter, with a view to delivering His intimate friend Arjuna from the ocean of material grief. And the path of realization has been recommended: buddhi-yoga, or Kṛṣṇa consciousness. Sometimes Kṛṣṇa consciousness is misunderstood to be inertia, and one with such a misunderstanding often withdraws to a secluded place to become fully Kṛṣṇa conscious by chanting the holy name of Lord Kṛṣṇa. But without being trained in the philosophy of Kṛṣṇa consciousness, it is not advisable to chant the holy name of Kṛṣṇa in a secluded place, where one may acquire only cheap adoration from the innocent public. Arjuna also thought of Kṛṣṇa consciousness or buddhi-yoga, or intelligence in spiritual advancement of knowledge, as something like retirement from active life and the practice of penance and austerity at a secluded place. In other words, he wanted to skillfully avoid the fighting by using Kṛṣṇa consciousness as an excuse. But as a sincere student, he placed the matter before his master and questioned Kṛṣṇa as to his best course of action. In answer, Lord Kṛṣṇa elaborately explained karma-yoga, or work in Kṛṣṇa consciousness, in this Third Chapter.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 28/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 109: 03వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 109: Chap. 03, Ver. 02
🌹. శ్రీమద్భగవద్గీత - 109 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 2
2. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మెహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో(హమాప్నుయామ్ ||
🌷. తాత్పర్యం :
అనేకార్థములు కలిగిన నీ భోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయుము.
🌷. భాష్యము :
భగవద్గీత ఉపోద్ఘాతముగా గడచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధిచే ఇంద్రియనిగ్రహము, ఫలాపేక్షరహిత కర్మము, ప్రారంభదశలో గల సాధకుని స్థితులనెడి వివిధ విషయములు వర్ణింపబడినవి. కాని అవియన్నియును ఒక క్రమపద్దతిలో వివరింపబడలేదు. వాని సంపూర్ణావగాహనకు మరియు ఆచరణకు ఒక క్రమపద్ధతి అత్యంత అవసరమై యున్నది. కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను సంపూర్ణముగా తెలియనెంచెను. తద్ద్వారా సాధారణవ్యక్తి సైతము వాటిని ఎటువంటి కల్పనలు మరియు వ్యతిరేకవివరణలు లేకుండా అంగీకరించు అవకాశము కలుగును. తన పదప్రయోగాముచే అర్జుని అర్జునుని తన ప్రశ్నల ద్వారా భగవద్గీత అంతరార్థమును తెలిసికొనగోరు నిష్టాపూర్ణులకు కృష్ణభక్తిరసభావనా మార్గము సుగమము చేయుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 109 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 2
2. vyāmiśreṇeva vākyena
buddhiṁ mohayasīva me
tad ekaṁ vada niścitya
yena śreyo ’ham āpnuyām
🌷Translation :
My intelligence is bewildered by Your equivocal instructions. Therefore, please tell me decisively which will be most beneficial for me.
🌷 Purport :
In the previous chapter, as a prelude to the Bhagavad-gītā, many different paths were explained, such as sāṅkhya-yoga, buddhi-yoga, control of the senses by intelligence, work without fruitive desire, and the position of the neophyte. This was all presented unsystematically. A more organized outline of the path would be necessary for action and understanding. Arjuna, therefore, wanted to clear up these apparently confusing matters so that any common man could accept them without misinterpretation. Although Kṛṣṇa had no intention of confusing Arjuna by any jugglery of words, Arjuna could not follow the process of Kṛṣṇa consciousness – either by inertia or by active service. In other words, by his questions he is clearing the path of Kṛṣṇa consciousness for all students who seriously want to understand the mystery of the Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 29/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 110: 03వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 110: Chap. 03, Ver. 03
🌹. శ్రీమద్భగవద్గీత - 110 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 3
3. శ్రీభగవానువాచ
లోకే(స్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యనాం కర్మయోగేన యోగినామ్ ||
🌷. తాత్పర్యం :
దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను: పాపరహితుడవైన ఓ అర్జునా! ఆత్మానుభూతిని పొందగోరు మానవుల రెండురకములని ఇదివరకే నేను వివిరించితివి. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసికొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అర్థము చేసికొనగోరుదురు.
🌷. భాష్యము :
ద్వితీయాధ్యయపు ముప్పదితొమ్మిదవ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము (బుద్ధియోగము) లనెడి రెండు విధానములను శ్రీకృష్ణభగవానుడు వివరించెను. అదేవిషయమును భగవానుడు ఈ శ్లోకమున మరింత విశదముగా వివరించుచున్నాడు. ఆత్మ మరియు భౌతికపదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసికకల్పనలను కావించుట యందును మరియు ఏదేని విషయము పయోగాత్మకజ్ఞానము, తాత్విక చింతన ద్వారా ఎరుగుట యందును అభిరుచిని కలిగినట్టి మనుజులకు చెందినట్టిది. యిఇక రెండవరకమువారు కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించెడి వారు. ఈ విషయమును ద్వితీయాధ్యాయపూ అరువదియెకటక శ్లోకమునందు వివరింపబడినది. బుద్ధియోగము(కృష్ణభక్తిభావన) ననుసరించి కర్మచేయుట ద్వారా మనుజుడు కర్మబంధము నుండి విడివడగలడనియు, పైగా కర్మయందు ఎటువంటి దోషము కలుగాదనియు శ్రీకృష్ణభగవానుడు ద్వితియాద్యయపు ముప్పదితొమ్మిదవ శ్లోకమున తెలిపియే యున్నాడు. బుద్ధియోగామనగా భగవానుని పైననే (మరింత విశదముగా చెప్పవలెనన్న శ్రీకృష్ణుని పైననే ) సంపూర్ణముగా ఆధారపడుటయనియు, తద్ద్వారా ఇంద్రియములన్నియు సులభముగా అదుపులోనికి రాగాలవనియు ఆ అధ్యాయపు అరువదియెకటవ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. అనగా ధర్మము మరియు తత్త్వముల వలె ఈ రెండుయోగములు ఒకదానిపై మరొకటి ఆధారపడియున్నవి. తత్త్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేదా మూడవిశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్త్వము కేవలము మానసిక కల్పనము కాగలదు. పరతత్త్వమును అనుభూతమొనర్చుకొనుటకు నిష్టగా యత్నించువారు సైతము అంత్యమున కృష్ణభక్తిభావననే పొందుదురు కావున శ్రీకృష్ణుడే పరమలక్ష్యమై యున్నాడు. ఈ విషయము భగవద్గీత యందును తెలుపబడినది. భగవానునితో పోల్చినచో జీవుని నిజస్థితి ఎట్టిదని అవగతము చేసికొనుటయే అన్నింటి యందును ముఖ్యాంశమై యున్నది. పరోక్షమార్గామైన మనోకల్పనను కావించుచు మనుజుడు క్రమముగా కృష్ణభక్తిభావనాస్థితికి రావచ్చును లేదా రెండవమార్గమున కృష్ణభక్తి యందు ప్రత్యక్షసంబంధము నేర్పరచుకొనవచ్చను. ఈ రెండింటిలో కృష్ణభక్తిభావనా మార్గము ఉత్తమమైనది. తాత్వికవిధానము ద్వారా ఇంద్రియములను శుద్ధిపరచుకొనవలసిన అవసరం దాని యందు లేకపోవుటయే అందులకు కారణము. కృష్ణభక్తియే సాక్షాత్తుగా అతి పవిత్రమొనర్చు విధానము. భక్తియుక్తసేవ యనెడి ప్రత్యక్ష విధానము వలన ఆ కార్యము సులభమును మరియు ఉదాత్తమును అయి యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 110 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 3
3. śrī-bhagavān uvāca
loke ’smin dvi-vidhā niṣṭhā
purā proktā mayānagha
jñāna-yogena sāṅkhyānāṁ
karma-yogena yoginām
🌷Translation :
The Supreme Personality of Godhead said: O sinless Arjuna, I have already explained that there are two classes of men who try to realize the self. Some are inclined to understand it by empirical, philosophical speculation, and others by devotional service.
🌷 Purport :
In the Second Chapter, verse 39, the Lord explained two kinds of procedures – namely sāṅkhya-yoga and karma-yoga, or buddhi-yoga. In this verse, the Lord explains the same more clearly. Sāṅkhya-yoga, or the analytical study of the nature of spirit and matter, is the subject matter for persons who are inclined to speculate and understand things by experimental knowledge and philosophy. The other class of men work in Kṛṣṇa consciousness, as it is explained in the sixty-first verse of the Second Chapter. The Lord has explained, also in the thirty-ninth verse, that by working by the principles of buddhi-yoga, or Kṛṣṇa consciousness, one can be relieved from the bonds of action; and, furthermore, there is no flaw in the process. The same principle is more clearly explained in the sixty-first verse – that this buddhi-yoga is to depend entirely on the Supreme (or more specifically, on Kṛṣṇa), and in this way all the senses can be brought under control very easily.
Therefore, both the yogas are interdependent, as religion and philosophy. Religion without philosophy is sentiment, or sometimes fanaticism, while philosophy without religion is mental speculation. The ultimate goal is Kṛṣṇa, because the philosophers who are also sincerely searching after the Absolute Truth come in the end to Kṛṣṇa consciousness. This is also stated in the Bhagavad-gītā. The whole process is to understand the real position of the self in relation to the Superself. The indirect process is philosophical speculation, by which, gradually, one may come to the point of Kṛṣṇa consciousness; and the other process is directly connecting everything with Kṛṣṇa in Kṛṣṇa consciousness. Of these two, the path of Kṛṣṇa consciousness is better because it does not depend on purifying the senses by a philosophical process. Kṛṣṇa consciousness is itself the purifying process, and by the direct method of devotional service it is simultaneously easy and sublime.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 30/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 111: 03వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 111: Chap. 03, Ver. 04
🌹. శ్రీమద్భగవద్గీత - 111 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 4
4. న కర్మణామనారమ్భాత్ నైష్కర్యం పురుషోశ్నుతే |
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్న్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు.
🌷. భాష్యము :
లౌకికజనుల హృదయములను శుద్ధిపరచుట కొరకై విధింపబడినటువంటి విధ్యక్తధర్మములను నియమముగా పాటించి పవిత్రుడైనపుడు మనుజుడు సన్న్యాసమును స్వీకరించుట ద్వారా జయము సిద్ధింపదు. సాంఖ్య తత్త్వవేత్తల ఉద్దేశ్యము ప్రకారము కేవలము సన్న్యాసము స్వీకరించినంతనే (కామ్యకర్మల నుండి విరమించినంతనే ) మనుజుడు నారాయణునితో సమానుడు కాగలడు. కాని శ్రీకృష్ణభగవానుడు ఈ సిద్ధాంతము అంగీకరించుట లేదు. హృదయము పవిత్రము కానిదే సన్న్యాసమును స్వీకరించినచో అది కేవలము సాంఘికవ్యవస్థ సంక్షోభమునకే కారణము కాగలదు. కాని ఒకవేళ మనుజడు తన విధ్యుక్తధర్మములను నిర్వర్తింపకున్నను భగవానుని దివ్యసేవను స్వీకరించి తన శక్త్యానుసారము పురోగమించినచో (బుద్ధియోగము) భగవానునిచో ఆమోదింపబడును. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ – అట్టి ధర్మాచరణము కొద్దిగా ఒనరింపబడినను మనుజుని గొప్ప సంకటముల నుండి తరింపజేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 111 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 4
4. na karmaṇām anārambhān
naiṣkarmyaṁ puruṣo ’śnute
na ca sannyasanād eva
siddhiṁ samadhigacchati
🌷Translation :
Not by merely abstaining from work can one achieve freedom from reaction, nor by renunciation alone can one attain perfection.
🌷 Purport :
The renounced order of life can be accepted when one has been purified by the discharge of the prescribed form of duties which are laid down just to purify the hearts of materialistic men. Without purification, one cannot attain success by abruptly adopting the fourth order of life (sannyāsa). According to the empirical philosophers, simply by adopting sannyāsa, or retiring from fruitive activities, one at once becomes as good as Nārāyaṇa. But Lord Kṛṣṇa does not approve this principle. Without purification of heart, sannyāsa is simply a disturbance to the social order. On the other hand, if someone takes to the transcendental service of the Lord, even without discharging his prescribed duties, whatever he may be able to advance in the cause is accepted by the Lord (buddhi-yoga). Sv-alpam apy asya dharmasya trāyate mahato bhayāt. Even a slight performance of such a principle enables one to overcome great difficulties.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 31/Aug/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 112: 03వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 112: Chap. 03, Ver. 05
🌹. శ్రీమద్భగవద్గీత - 112 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 5
5. న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశ: కర్మ సర్వ: ప్రకృతిజైర్గుణై: ||
🌷. తాత్పర్యం :
ప్రతిమానవుడు భౌతికప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము ననుసరించి అవశుడై కర్మ యందు ప్రేరేపింపబడును. కావున ఏదియును చేయకుండ క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు.
🌷. భాష్యము :
సర్వదా చైతన్యముతో కూడియుండుట యనునది దేహమునకు సంబంధించినది కాక ఆత్మ యొక్క లక్షణమై యున్నది. ఆత్మ లేనిదే భౌతికదేహము కొద్దిగానైనను కదలదు. అనగా దేహము కేవలము ఒక చైతన్యరహితమైన వాహనము వంటిది. నిత్యక్రియాశీలకమై క్షణకాలమును జడత్వమును కలిగియుండని ఆత్మ యొక్క ఉనికి వలననే అది పనిచేయగలదు. వాస్తవమునకు ఆత్మను కృష్ణభక్తిరసభావిత కర్మ యందే నియుక్తము కావింపవలెను. లేనిచో అది మాయాశక్తి నిర్దేశములైన కర్మలలో నియుక్తము కాగలదు. భౌతికశక్తి సంపర్కమునందే ఆత్మ భౌతికగుణమును పొందుచున్నది. అట్టి గుణసంపర్కము నుండి ఆత్మను శుద్ధిపరచుట శాస్త్రములందు తెలుపబడిన విధ్యుక్తధర్మములను విధిగా నిర్వర్తింపవలసియున్నది. కాని ఆత్మ దాని నిజకర్మయైన కృష్ణభక్తిలో నియుక్తమైనప్పుడు అది ఏది చేయగలిగినను లాభదాయకమే కాగలదు. శ్రీమద్భాగవతము(1.5.17) ఈ విషయముననే ద్రువీకరించుచున్నది.
త్యక్త్వా స్వధర్మం చరణామ్బుజం హరేర్బజన్నపక్వో(థపతేత్తతో యది |
యత్ర క్వ వాభద్రమభూదముష్య కిం కో వార్థ ఆప్తో(భజతాం స్వదర్మతః ||
“ఎవరేని కృష్ణభక్తిభావనము స్వీకరించినచో శాస్త్రవిహిత కర్మలను పాటింపకున్నను, భక్తియుతసేవను సక్రమముగా నిర్వర్తింపకున్నను, తన స్థితి నుండి పతనము నొందినను ఎట్టి నష్టమును గానీం పాపమును గాని పొందడు. అట్లుగాక అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణకర్మలను నిర్వహించినను కృష్ణభక్తిభావనాపూర్ణుడు కానిచో ఏమి లాభమును పొందగలడు?” అనగా కృష్ణభక్తిభావనాస్థితికి చేరుట పవిత్రీకరణవిధానము అవసరమై యున్నది. కావున సన్న్యాసము లేదా ఏ పవిత్రీకరణవిధానమైనను తుదిలక్షమైన కృష్ణభక్తిభావనను పొందుటకు సహాయభూతము మాత్రమే. అతి కృష్ణభక్తి ప్రాప్తించినచో సమస్తము నిష్పలమే కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 112 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 5
5. na hi kaścit kṣaṇam api
jātu tiṣṭhaty akarma-kṛt
kāryate hy avaśaḥ karma
sarvaḥ prakṛti-jair guṇaiḥ
🌷Translation :
Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes of material nature; therefore no one can refrain from doing something, not even for a moment.
🌷 Purport :
It is not a question of embodied life, but it is the nature of the soul to be always active. Without the presence of the spirit soul, the material body cannot move. The body is only a dead vehicle to be worked by the spirit soul, which is always active and cannot stop even for a moment. As such, the spirit soul has to be engaged in the good work of Kṛṣṇa consciousness, otherwise it will be engaged in occupations dictated by the illusory energy. In contact with material energy, the spirit soul acquires material modes, and to purify the soul from such affinities it is necessary to engage in the prescribed duties enjoined in the śāstras. But if the soul is engaged in his natural function of Kṛṣṇa consciousness, whatever he is able to do is good for him. The Śrīmad-Bhāgavatam (1.5.17) affirms this:
tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer
bhajann apakvo ’tha patet tato yadi
yatra kva vābhadram abhūd amuṣya kiṁ
ko vārtha āpto ’bhajatāṁ sva-dharmataḥ
“If someone takes to Kṛṣṇa consciousness, even though he may not follow the prescribed duties in the śāstras or execute the devotional service properly, and even though he may fall down from the standard, there is no loss or evil for him. But if he carries out all the injunctions for purification in the śāstras, what does it avail him if he is not Kṛṣṇa conscious?” So the purificatory process is necessary for reaching this point of Kṛṣṇa consciousness. Therefore, sannyāsa, or any purificatory process, is to help reach the ultimate goal of becoming Kṛṣṇa conscious, without which everything is considered a failure.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 01/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 113: 03వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 113: Chap. 03, Ver. 06
🌹. శ్రీమద్భగవద్గీత - 113 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 6
6. కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇన్ద్రియార్థాన్ విమూడాత్మా మిథ్యాచార: స ఉచ్యతే ||
🌷. తాత్పర్యం :
కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి యనబడును.
🌷. భాష్యము :
మనస్సునందు ఇంద్రియభోగమును గూర్చి ఆలోచించుచునే ధ్యానతత్పరతను ప్రదర్శించు కపతులు పలువురు గలరు. అట్టివారు కృష్ణభక్తిభావానమునందు కర్మను చేయ నిరాకరింతురు. అట్టి మిథ్యాచారులు తమను అనుసరించు శిష్యులను భ్రమింపచేయుటకు శుష్కవేదాంతమును సైతము పలుకుదురు. ఈ శ్లోకము ప్రకారము అట్టి వారందరును గొప్ప మోసకారులు. ఇంద్రియప్రీతి కోరినవాడు వర్ణాశ్రమధర్మమును పాటించుచు తనకు సంబంధించిన నియమనిబంధనలను అనుసరించినచో క్రమముగా తనను తాను పవిత్రుని కావించుకొనగలడు. కాని యోగివలె నటించుచు ఇంద్రియార్థములను వెదుకువాడు కొన్నిమార్లు తత్త్వముపై ప్రవచనములను గావించినను గొప్ప మోసకారి యనియే పిలువబడును. అట్టి పాపి యొక్క జ్ఞానము భగవానుని మాయచే హరింపబడును గావున వాని జ్ఞానమునకు ఎట్టి విలువయు ఉండదు. అటువంటి కపటాత్ముని మనస్సు సదా అపవిత్రమై యుండుట వలన అతని ధ్యానప్రదర్శనము సర్వదా ప్రయోజనశూన్యమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 113 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 6
6. karmendriyāṇi saṁyamya
ya āste manasā smaran
indriyārthān vimūḍhātmā
mithyācāraḥ sa ucyate
🌷Translation :
One who restrains the senses of action but whose mind dwells on sense objects certainly deludes himself and is called a pretender.
🌷 Purport :
There are many pretenders who refuse to work in Kṛṣṇa consciousness but make a show of meditation, while actually dwelling within the mind upon sense enjoyment. Such pretenders may also speak on dry philosophy in order to bluff sophisticated followers, but according to this verse these are the greatest cheaters. For sense enjoyment one can act in any capacity of the social order, but if one follows the rules and regulations of his particular status, he can make gradual progress in purifying his existence. But he who makes a show of being a yogī while actually searching for the objects of sense gratification must be called the greatest cheater, even though he sometimes speaks of philosophy. His knowledge has no value, because the effects of such a sinful man’s knowledge are taken away by the illusory energy of the Lord. Such a pretender’s mind is always impure, and therefore his show of yogic meditation has no value whatsoever.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 02/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 114: 03వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 114: Chap. 03, Ver. 07
🌹. శ్రీమద్భగవద్గీత - 114 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 7
7. యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతే(ర్జున |
కర్మేన్ద్రియై: కర్మయోగమసక్త: స విశిష్యతే ||
🌷. తాత్పర్యం :
అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుట యత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును (కృష్ణభక్తిరసభావన యందు) ఆరంభించు శ్రద్దావంతుడు అత్యుత్తముడు.
🌷. భాష్యము :
యథేచ్చాజీవనము మరియు ఇంద్రియభోగముల కొరకు కపటయోగిగా వర్తించుట కన్నను, భవబంధము నుండి ముక్తిని కలిగించి భగవద్దామమును ప్రవేశింపచేయు స్వధర్మమున నిలిచి జీవితలక్ష్యము కొరకై ప్రయత్నించుట అత్యంత ఉత్తమము. వాస్తమునకు నిజమైన స్వార్థగతి లేదా జీవితపరమార్థము విష్ణువును చేరుటయే. ఈ జీవితలక్ష్యమును సాధించుటలో మనకు తోడ్పడు విధముగనే వర్ణాశ్రమపద్ధతులు ఏర్పాటు చేయబడినవి. అనగా గృహస్థుడు కుడా కృష్ణభక్తిభావన యందలి నియమిత సేవ ద్వారా ఈ గమ్యమును చేరగలడు. ఆత్మానుభావము కొరకై ప్రతియొక్కరు శాస్త్రములలో తెలుపబడిన రీతి నియమిత జీవనమును సాగించుచు సంగరహితముగా తమ కర్మ నొనరించినచో పురోభివృద్ధిని పొందగలరు. ఈ విధానము అనుసరించు శ్రద్దావంతుడు అమాయకులను మోసగించుటకై కపటభక్తిని ప్రదర్శించు కపటయోగి కన్నను అత్యంత ఉత్తముడు. కేవలము జీవనార్థమై కపటధ్యానము చేయువాని కన్నను శ్రద్ధగా వీధులను శుభ్రపరచువాడు ఉత్తముడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 114 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 7
7. yas tv indriyāṇi manasā
niyamyārabhate ’rjuna
karmendriyaiḥ karma-yogam
asaktaḥ sa viśiṣyate
🌷Translation :
On the other hand, if a sincere person tries to control the active senses by the mind and begins karma-yoga [in Kṛṣṇa consciousness] without attachment, he is by far superior.
🌷 Purport :
Instead of becoming a pseudo transcendentalist for the sake of wanton living and sense enjoyment, it is far better to remain in one’s own business and execute the purpose of life, which is to get free from material bondage and enter into the kingdom of God. The prime svārtha-gati, or goal of self-interest, is to reach Viṣṇu. The whole institution of varṇa and āśrama is designed to help us reach this goal of life. A householder can also reach this destination by regulated service in Kṛṣṇa consciousness. For self-realization, one can live a controlled life, as prescribed in the śāstras, and continue carrying out his business without attachment, and in that way make progress. A sincere person who follows this method is far better situated than the false pretender who adopts show-bottle spiritualism to cheat the innocent public. A sincere sweeper in the street is far better than the charlatan meditator who meditates only for the sake of making a living.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 03/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 115: 03వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 115: Chap. 03, Ver. 08
🌹. శ్రీమద్భగవద్గీత - 115 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 8
8. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణ: |
శరీరయత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణ: ||
🌷. తాత్పర్యం :
నీ విధ్యుక్తధర్మమును నీవు నిర్వర్తింపుము. ఏలయన అది అకర్మ కన్నను ఉత్తమమైనది. కర్మ నొనరింపకుండా దేహపోషణము సైతము మనుజుడు చేసికొనజాలడు.
🌷. భాష్యము :
ఉత్తమవంశమునకు చెందినవారమని తప్పుగా ప్రకటించుకొను కపటధ్యానపరులు మరియు ఆధ్యాత్మికోన్నతికై సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యాప్రదర్శనమును కావించు ఘనులు పలువురు కలరు. కాని అర్జునుడు ఆ విధమైన మిథ్యావాది కారాదని శ్రీకృష్ణభగవానుడు తలచెను. పైగా క్షత్రియులకు నిర్దేశింపబడిన కర్మలను అర్జునుడు పాటింపవలెనని భగవానుడు కోరెను. అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియోధుడు కావున తన స్థానమందే నిలిచి, గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మములను పాటించుట ఉత్తమకార్యము. అట్టి కర్మలు లౌకికుని హృదయమును శుభ్రపరచి భౌతికకల్మషము నుండి అతనిని ముక్తుని చేయగలదు. జీవనార్థమై ఆచరింపబడు నామమాత్ర సన్యాసము శ్రీకృష్ణభగవానుడు కాని, ఏ ధర్మశాస్త్రము కాని అంగీకరించు అవకాశము లేదు. వాస్తవమునకు ఏదియో ఒక కర్మ ద్వారా మనుజుడు దేహమును పోషింపవలసియుండును. భౌతికభావనల నునిడ్ శుద్ధిపరుపకనే కర్మను చపలత్వముతో త్యజింపరాదు. భౌతికజగము నందున్న ప్రతియోక్కరికిని ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెననెడి కల్మషభవములు ( వేరుమాటలలో ఇంద్రియభోగవాంచలు) తప్పకయుండును. అటువంటి కలుషితభవములు తప్పక నశింపవలెను. విధ్యుక్తధర్మముల ద్వారా అట్టి కార్యము సాధింపక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగి వలె అగుటకు ఎవ్వరును యత్నింపరాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 115 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 8
8. niyataṁ kuru karma tvaṁ
karma jyāyo hy akarmaṇaḥ
śarīra-yātrāpi ca te
na prasidhyed akarmaṇaḥ
🌷Translation :
Perform your prescribed duty, for doing so is better than not working. One cannot even maintain one’s physical body without work.
🌷 Purport :
There are many pseudo meditators who misrepresent themselves as belonging to high parentage, and great professional men who falsely pose that they have sacrificed everything for the sake of advancement in spiritual life. Lord Kṛṣṇa did not want Arjuna to become a pretender. Rather, the Lord desired that Arjuna perform his prescribed duties as set forth for kṣatriyas. Arjuna was a householder and a military general, and therefore it was better for him to remain as such and perform his religious duties as prescribed for the householder kṣatriya. Such activities gradually cleanse the heart of a mundane man and free him from material contamination. So-called renunciation for the purpose of maintenance is never approved by the Lord, nor by any religious scripture. After all, one has to maintain one’s body and soul together by some work. Work should not be given up capriciously, without purification of materialistic propensities. Anyone who is in the material world is certainly possessed of the impure propensity for lording it over material nature, or, in other words, for sense gratification. Such polluted propensities have to be cleared. Without doing so, through prescribed duties, one should never attempt to become a so-called transcendentalist, renouncing work and living at the cost of others.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 04/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 116: 03వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 116: Chap. 03, Ver. 09
🌹. శ్రీమద్భగవద్గీత - 116 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 9
9. యజ్ఞార్థాత్ కర్మణో(న్యత్ర లోకో(యం కర్మబన్ధన: |
తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసంగ: సమాచార ||
🌷. తాత్పర్యం :
విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతికజగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతీపుత్రా! నీ విధ్యుక్తధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు.
🌷. భాష్యము :
సాధారణమైన దేహపోషణ కొరకైనను ప్రతియొక్కరు కర్మచేయవలసి యున్నందున ఆ ప్రయోజనము సిద్ధించురీతిలోనే వర్ణాశ్రమములకు సంబంధించిన విధ్యుక్తధర్మములు నిర్దేశింపబడినవి. యజ్నమనాగా విష్ణువు లేదా యాగకర్మలు. యాగకర్మలన్నియును విష్ణుప్రీత్యర్థమే నిర్ణియింపబడినవి. “యజ్ఞో వై విష్ణు:” అని వేదములు పలుకుచున్నవి. అనగా మనుజుడు విదింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణువును ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనము పొందగలడు. అనగా కృష్ణభక్తిరసభావన యనునది ఈ శ్లోకమున తెలిపిన రీతి యజ్ఞమును నిర్వహించుట వంటిది. వర్ణాశ్రమపద్దతి సైతము విష్ణుప్రీతినే లక్ష్యముగా భావించును. “వర్ణాశ్రమాచారవతా పురుషేణ పర: పుమాన్/ విష్ణు: ఆరాధ్యతే” (విష్ణుపురాణము 3.8.8)
కనుక ప్రతియొక్కరు విష్ణుప్రీత్యర్థమే కర్మనొనరింపవలసియున్నది. శుభాశుభకర్మలు రెండును ఫలములను కలిగియుండి కర్తను బంధించు కారణమున ఇతర కర్మలన్నియును జగమునందు బంధమునే కలిగించును. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిభావన యందు కృష్ణుని ( లేదా విష్ణువు) ప్రీత్యర్థమై కర్మనొనరింపవలెను. అటువంటి కర్మలను చేయునపుడు మనుజుద్ ముక్తస్థితి యందే నిలిచియుండును. ఇది కర్మచేయట యందు గొప్ప నేర్పరితనమై యున్నందున నిష్ణాటులైనవారి నిర్దేశము దీనికి తొలుత అవసమై యున్నది. అనగా శ్రీకృష్ణభాక్తును నిర్దేశమునందు గాని లేదా (ఎవరి సమక్షమున అర్జునునకు కర్మ చేయునవకాశము కలిగెనో అటువంటి) శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్ష భోధనల ననుసరించి గాని ప్రతియొక్కరు నిపుణతతో వర్తింపవలసియున్నది. దేనిని కూడా ఇంద్రియప్రీతికై నిర్వహింపరాదు. ప్రతిదియును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే నిర్వహింపవలెను. ఇటువంటి అబ్యాసము మనుజుని కర్మఫలము నుండి రక్షించుటయే గాక క్రమముగా భగవానుని ప్రేమయుత సేవా స్థాయికి అతనిని ఉద్ధరించును. దాని ద్వారా అతడు భగవద్ధామమును చేరగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 116 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 9
9. yajñārthāt karmaṇo ’nyatra
loko ’yaṁ karma-bandhanaḥ
tad-arthaṁ karma kaunteya
mukta-saṅgaḥ samācara
🌷Translation :
Work done as a sacrifice for Viṣṇu has to be performed; otherwise work causes bondage in this material world. Therefore, O son of Kuntī, perform your prescribed duties for His satisfaction, and in that way you will always remain free from bondage.
🌷 Purport :
Since one has to work even for the simple maintenance of the body, the prescribed duties for a particular social position and quality are so made that that purpose can be fulfilled. Yajña means Lord Viṣṇu, or sacrificial performances. All sacrificial performances also are meant for the satisfaction of Lord Viṣṇu. The Vedas enjoin: yajño vai viṣṇuḥ. In other words, the same purpose is served whether one performs prescribed yajñas or directly serves Lord Viṣṇu. Kṛṣṇa consciousness is therefore performance of yajña as it is prescribed in this verse. The varṇāśrama institution also aims at satisfying Lord Viṣṇu. Varṇāśramācāravatā puruṣeṇa paraḥ pumān/ viṣṇur ārādhyate (Viṣṇu Purāṇa 3.8.8).
Therefore one has to work for the satisfaction of Viṣṇu. Any other work done in this material world will be a cause of bondage, for both good and evil work have their reactions, and any reaction binds the performer. Therefore, one has to work in Kṛṣṇa consciousness to satisfy Kṛṣṇa (or Viṣṇu); and while performing such activities one is in a liberated stage. This is the great art of doing work, and in the beginning this process requires very expert guidance. One should therefore act very diligently, under the expert guidance of a devotee of Lord Kṛṣṇa, or under the direct instruction of Lord Kṛṣṇa Himself (under whom Arjuna had the opportunity to work). Nothing should be performed for sense gratification, but everything should be done for the satisfaction of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 05/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 117: 03వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 117: Chap. 03, Ver. 10
🌹. శ్రీమద్భగవద్గీత - 117 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 10
10. సహజయజ్ఞా: ప్రజా: సృష్ట్వా పురోవాచ ప్రజాపతి: |
అనేన ప్రసవిష్యధ్వమేష వో(స్త్విష్టకామధుక్ ||
🌷. తాత్పర్యం :
సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులకు మరియు దేవతలకు విష్ణుప్రీత్యర్థమైన యజ్నములతో సహా సృష్టించి “ ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు. ఏలయన వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును ఒసంగును” అని ఆశీర్వదించెను.
🌷. భాష్యము :
సర్వజీవుల ప్రభువైన విష్ణువుచే సృష్టింపబడిన భౌతికజగత్తు బద్ధజీవులు భగవద్దామము తిరిగి చేరుటకు ఒసగాబడిన ఒక అవకాశము వంటిది. దేవదేవుడైన శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే ఈ జగమునందు జీవులందరును భౌతికప్రకృతిచే బద్దులగుచున్నారు. అట్టి నిత్యసంబంధమును జీవులు తెలిసికొనుటకు వేదము సహాయపడును. “వేదైశ్చ సర్వైరహమేవవేద్య:” అని ఈ విషయమునే భగవద్గీత తెలియజేయుచున్నది. తన నెరుగుటయే వేదముల ఉద్దేశ్యమని శ్రీకృష్ణభగవానుడు తెలిపియున్నాడు. “పతిం విశ్వస్యాత్మేశ్వరం” అని వేదంమంత్రములందు తెలుపబడినది. అనగా జీవులకు ప్రభువు దేవదేవుడైన విష్ణువు. శ్రీమద్భాగవతమునందు కూడా శ్రీల శుకదేవగోస్వామి భగవానుడే పతి యని పలువిధములుగా వర్ణించియున్నారు. (2.4.20)
శ్రియ: పతి ర్యజ్ఞపతి: ప్రజాపతి ర్దియాం పతిర్లోకపతిర్ధరాపతి: |
పతిర్గతి శ్చాన్ధకవృష్టిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి: ||
భగవానుడైన విష్ణువే ప్రజాపతి. అతడే సమస్త జీవులకు, సమస్త లోకములకు, సమస్త సౌందర్యములకు పతియై యున్నాడు. సర్వులకు అతడే రక్షకుడు. విష్ణుప్రీత్యర్తమై ఏ విధముగా యజ్ఞములను నిర్వహింపవలెనో బద్ధజీవులు నేర్చుట కొరకే అతడు ఈ భౌతికజగత్తును సృష్టించెను. తద్ద్వారా వారు ఈ జగత్తునందున్నంతవరకు ఎటువంటి కలతలు లేకుండా సుఖముగా జీవించి,దేహత్యాగము పిమ్మట భగవద్ధామమును చేరగలరు. బద్ధజీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యమమిదియే. యజ్ఞనిర్వాహణము ద్వారా బద్ధజీవులు క్రమముగా కృష్ణభక్తిరసభావితులై అన్నివిధముల దివ్యులగుదురు.ఈ కలియుగమునందు వేదములు హరినామసంకీర్తనమనెడి సంకీర్తనాయజ్ఞమును ఉపదేశించుచున్నది.ఈ దివ్యవిధానము శ్రీచైతన్యమాహాప్రభవు ఈ యుగజనుల ఉద్ధారమునకై ప్రవేశపెట్టిరి. అట్టి సంకీర్తనాయజ్ఞముతో కృష్ణభక్తిరసభావనము చక్కని పొత్తు కలిగియుండును. ఈ క్రింది శ్రీమద్భాగవత (11.5.32) శ్లోకములో శ్రీకృష్ణభగవానుడు భక్తుని రూపమున (శ్రీచైతన్యమాహాప్రభువు) తెలుపబడినాడు. దీని యందు సంకీర్తనాయజ్ఞము కూడా ప్రత్యక్షముగా ప్రస్తావించబడినది.
కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్రపార్షదమ్ |
యజ్ఞై: సంకీర్తనప్రాయై: యజన్తి హి సుమేధస: ||
“ఈ కలియుగమునందు మేధాసంపత్తి కలిగిన మనుజులు పార్షదులతో కూడియుండెడి భగవానుని సంకీర్తనాయజ్ఞముచే పూజింతురు.” వేదములందు తెలియజేయబడిన ఇతర యజ్ఞముల నిర్వాహణము ఈ కలియుగమునందు సులభము కాదు. కాని సంకీర్తనాయజ్ఞము సర్వప్రయోజనములకు సులభము మరియు మహనీయమై యున్నది. ఇదే విషయము భగవద్గీత(9.14) యందును ఉపదేశించబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 117 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 10
10. saha-yajñāḥ prajāḥ sṛṣṭvā
purovāca prajāpatiḥ
anena prasaviṣyadhvam
eṣa vo ’stv iṣṭa-kāma-dhuk
🌷Translation :
In the beginning of creation, the Lord of all creatures sent forth generations of men and demigods, along with sacrifices for Viṣṇu, and blessed them by saying, “Be thou happy by this yajña [sacrifice] because its performance will bestow upon you everything desirable for living happily and achieving liberation.”
🌷 Purport :
The material creation by the Lord of creatures (Viṣṇu) is a chance offered to the conditioned souls to come back home – back to Godhead. All living entities within the material creation are conditioned by material nature because of their forgetfulness of their relationship to Viṣṇu, or Kṛṣṇa, the Supreme Personality of Godhead. The Vedic principles are to help us understand this eternal relation, as it is stated in the Bhagavad-gītā: vedaiś ca sarvair aham eva vedyaḥ. The Lord says that the purpose of the Vedas is to understand Him. In the Vedic hymns it is said: patiṁ viśvasyātmeśvaram. Therefore, the Lord of the living entities is the Supreme Personality of Godhead, Viṣṇu. In the Śrīmad-Bhāgavatam also (2.4.20) Śrīla Śukadeva Gosvāmī describes the Lord as pati in so many ways:
śriyaḥ patir yajña-patiḥ prajā-patir
dhiyāṁ patir loka-patir dharā-patiḥ
patir gatiś cāndhaka-vṛṣṇi-sātvatāṁ
prasīdatāṁ me bhagavān satāṁ patiḥ
The prajā-pati is Lord Viṣṇu, and He is the Lord of all living creatures, all worlds, and all beauties, and the protector of everyone. The Lord created this material world to enable the conditioned souls to learn how to perform yajñas (sacrifices) for the satisfaction of Viṣṇu, so that while in the material world they can live very comfortably without anxiety, and after finishing the present material body they can enter into the kingdom of God. That is the whole program for the conditioned soul. By performance of yajña, the conditioned souls gradually become Kṛṣṇa conscious and become godly in all respects. In the Age of Kali, the saṅkīrtana-yajña (the chanting of the names of God) is recommended by the Vedic scriptures, and this transcendental system was introduced by Lord Caitanya for the deliverance of all men in this age. Saṅkīrtana-yajña and Kṛṣṇa consciousness go well together. Lord Kṛṣṇa in His devotional form (as Lord Caitanya) is mentioned in the Śrīmad-Bhāgavatam (11.5.32) as follows, with special reference to the saṅkīrtana-yajña:
kṛṣṇa-varṇaṁ tviṣākṛṣṇaṁ
sāṅgopāṅgāstra-pārṣadam
yajñaiḥ saṅkīrtana-prāyair
yajanti hi su-medhasaḥ
“In this Age of Kali, people who are endowed with sufficient intelligence will worship the Lord, who is accompanied by His associates, by performance of saṅkīrtana-yajña.” Other yajñas prescribed in the Vedic literatures are not easy to perform in this Age of Kali, but the saṅkīrtana-yajña is easy and sublime for all purposes, as recommended in Bhagavad-gītā also (9.14).
🌹 🌹 🌹 🌹 🌹
Date: 06/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 118: 03వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 118: Chap. 03, Ver. 11
🌹. శ్రీమద్భగవద్గీత - 118 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 11
11. దేవాన్ భావయతే తే దేవా భావయస్తు వ: |
పరస్పరం భావయన్త: శ్రేయ: పరమవాప్స్యథ ||
🌷. తాత్పర్యం :
యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును గూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు.
🌷. భాష్యము :
లోకకార్యములను నిర్వహించుటకై నియమింపబడిన పాలకులే దేవతలు. జీవుల దేహపోషనార్థమై కావలసిన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరముల నన్నింటిని ఒసగు కార్యము అట్టి దేవతలకు అప్పగించబడినది. అసంఖ్యాకములుగా నున్న అట్టి దేవతలు దేవదేవుడైన శ్రీకృష్ణుని శరీరమునందలి భాగములు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులనునవి మానవుల యజ్ఞనిర్వాహణపై ఆధారపడియుండును. కొన్ని యజ్ఞములు కేవలము ఒక ప్రత్యేక దేవత ప్రీత్యర్థమే నిర్ణయింపబడియున్నను వాస్తవమునకు అన్ని యజ్ఞముల యందును విష్ణువే ముఖ్యభోక్తగా పూజింపబడును. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తయని శ్రీమద్భగవద్గీత యందును తెలుపబడినది (భోక్తారం యజ్ఞతపసాం). అనగా యజ్ఞపతి ప్రీతియే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యమై యున్నది. ఇటువంటి యజ్ఞములు యథావిధిగా నిర్వహింపబడినప్పుడు మానవాసారములను తీర్చు వివిధశాఖలకు చెందిన దేవతలా ప్రీతినొందెదరు. తద్ద్వారా ప్రకృతిజన్య పదార్థములందు కొరత యెన్నడును వాటిల్లదు.
యజ్ఞనిర్వాహణము అనేకములైన ఇతరలాభములను గూర్చుచు, అంత్యమున భవబంధము నుండి ముక్తిని సైతము కలిగించును. “ఆహారశుద్ధౌ సత్వశుధ్ధి: సత్వశుద్ధౌ ద్రువాస్మృతి:, స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష:” అని వేదములలో తెలుపబడిన రీతి యజ్ఞనిర్వాహణము ద్వారా సర్వకర్మలు పవిత్రములు కాగలవు. అనగా యజ్ఞము ద్వరా ఆహారపదార్థములు పవిత్రములు కాగలవు. పవిత్రాహారామును భుజించుట ద్వారా మనుజుని స్థితియే పవిత్రముగును. స్థితి యొక్క పవిత్రీకరణ ద్వారా బుద్ధి యందలి సూక్ష్మగ్రంథులు పవిత్రత నొందగలవు. ఆ విధముగా స్మృతి పవిత్రమైనప్పుడు మనుజుడు మోక్షమార్గమును గూర్చి చింతింపగలుగును. ఇవన్నియును కలిసి అంత్యమున అతనిని దివ్యమైన కృష్ణభక్తిభావనకు చేర్చగలవు. అట్టి పరమోత్కృష్టమైన కృష్ణభక్తిభావనయే నేటి మానవసమాజమునకు పరమావశ్యకమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 118 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 11
11. devān bhāvayatānena
te devā bhāvayantu vaḥ
parasparaṁ bhāvayantaḥ
śreyaḥ param avāpsyatha
🌷Translation :
The demigods, being pleased by sacrifices, will also please you, and thus, by cooperation between men and demigods, prosperity will reign for all.
🌷 Purport :
The demigods are empowered administrators of material affairs. The supply of air, light, water and all other benedictions for maintaining the body and soul of every living entity is entrusted to the demigods, who are innumerable assistants in different parts of the body of the Supreme Personality of Godhead. Their pleasures and displeasures are dependent on the performance of yajñas by the human being. Some of the yajñas are meant to satisfy particular demigods; but even in so doing, Lord Viṣṇu is worshiped in all yajñas as the chief beneficiary. It is stated also in the Bhagavad-gītā that Kṛṣṇa Himself is the beneficiary of all kinds of yajñas: bhoktāraṁ yajña-tapasām. Therefore, ultimate satisfaction of the yajña-pati is the chief purpose of all yajñas. When these yajñas are perfectly performed, naturally the demigods in charge of the different departments of supply are pleased, and there is no scarcity in the supply of natural products.
Performance of yajñas has many side benefits, ultimately leading to liberation from material bondage. By performance of yajñas, all activities become purified, as it is stated in the Vedas:
āhāra-śuddhau sattva-śuddhiḥ sattva-śuddhau dhruvā smṛtiḥ smṛti-lambhe sarva-granthīnāṁ vipramokṣaḥ.
By performance of yajña one’s eatables become sanctified, and by eating sanctified foodstuffs one’s very existence becomes purified; by the purification of existence finer tissues in the memory become sanctified, and when memory is sanctified one can think of the path of liberation, and all these combined together lead to Kṛiṣṇa consciousness, the great necessity of present-day society.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 07/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 119: 03వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 119: Chap. 03, Ver. 12
🌹. శ్రీమద్భగవద్గీత - 119 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 12
12. ఇష్టాన్ భోగాన్ హి దేవా దాస్యన్తే యజ్ఞభావితా: |
తైర్దాత్తానప్రదాయైభ్యో యో భుజ్ఞ్కే స్తేన ఏవ స: ||
🌷. తాత్పర్యం :
వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నియును ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును.
🌷. భాష్యము :
దేవదేవుడైన విష్ణువు తరపున జీవితావష్యకములైనవాటిని సమకూర్చుటకు అధీకృతులైనట్టివారే దేవతలు. కావున వారిని విధిపూర్వకమగు యజ్ఞముచే సంతృప్తిపరుపవలెను. వేదములందు పలుదేవతల కొరకు పలువిధములైన యజ్ఞములు తెలుపబడినను అవియన్నియును అంత్యమున దేవదేవునకే అర్పింపబడును. శ్రీకృష్ణభగవానుని గూర్చి తెలియనివానికే దేవతాయజ్ఞము ఆదేశించబడినది. మనుజుని వివిధ గుణములు ననుసరించి వివిధయజ్ఞములు వేదములందు ప్రతిపాదింపబడినవి. వివిధదేవతార్చనములు కూడా అదే విధముగా గుణముల ననుసరించియే తెలుపబడినవి. ఉదాహరణమునకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క ఘోరరూపమైన కాళికాదేవి పూజా ఆదేశింపబడినది. ఆ దేవత యెదుట పశుబలియు తెలుపబడినది. కాని సత్వగుణములో నున్నవారికి మాత్రము విష్ణుభగవానుని దివ్యారచనము ఉద్దేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మికస్థితిని పొందుటకే ఈ యజ్ఞములన్నియును ఉన్నవి. పంచమాహాయజ్ఞములని తెలియబడు ఐదు యజ్ఞములు మాత్రము సాధారణజనులకు అత్యంత అవశ్యకములై యున్నవి.
అయినను మానవులకు అవసరమైనట్టి జీవనావశ్యకములన్నియు శ్రీకృష్ణభగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడునని ప్రతియొక్కరు ఎరుగవలెను. ఎవ్వరును వాటిని సృష్టింపలేరు. ఉదాహరణకు మానవులు భుజించెడిచెడి ఆహారపదార్థములను గ్రహించినచో సత్త్వగుణప్రధానులు స్వీకరించెడి ధ్యానము, ఫలములు, కాయగూరాలు, పాలు, పంచదార మొదలగునవి కాని, మాంసాహారులు భుజించెడి మాంసము కాని ఏదియును మనుజునిచే సృష్టింపబడలేదు. అదేవిధముగా జీవితావసరములైన ఉష్ణము, కాంతి, నీరు, వాయువు వంటివి కూడా మానవునిచే సృష్టింపబడలేదు. శ్రీకృష్ణభగవానుడు లేనిదే సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, గాలి వంటివి కలుగవు. అవి లేనిదే ఎవ్వరును జీవింపలేరు. అనగా మన జీవితము ఆ భగవానుడు కరుణతో సమకూర్చువాని పైననే ఆధారపడియున్నది. చివరికి మనము నిర్వహించు కర్మాగారము కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము వంటి అనేక మూలకములు లేదా ముడిపదార్థముల అవసరమున్నది. అవియన్నియును దేవతలచే ఒసగబడుచున్నవి. లభించినవానిని సద్వినియోగాపరచుకొని ఆనందముతో ఆరోగ్యవంతులై, అత్మానుభవమును గూర్చి చింతించు జీవితలక్ష్యమైన జీవనసంఘర్షణ నుండి ముక్తిని సాధింతురనెడి ఉద్దేశ్యము చేతనే వారట్లు మనకు సర్వమును ఒసగుచున్నారు. అట్టి జీవితలక్ష్యము యజ్ఞనిర్వాహణచే సిద్ధించుచున్నది. కాని మానవజన్మ లక్ష్యమును మరచి, భగవానుని ప్రతినిదులచే ఒసగబడినవాటిని కేవలము ఇంద్రియప్రీతి కొరకే వినియోగించి భౌతికత్వమునందే మరింతగా బద్ధులమైనచో (అది సృష్టిప్రయోజనమెన్నడును కాదు) మనము చోరులుగా పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడుడుము. ఎటువంటి జీవితోద్దేశ్యము కలిగియుండనందున చోరులచే నిండియున్న సంఘమెన్నడును సుఖవంతము కాజాలదు. దొంగలైనటువంటి విషయపూర్ణ మనుజులకు ఎట్టి జీవితప్రయోజనముండదు. ఇంద్రియప్రీతియే వారి ముఖ్యోద్దేశ్యము. యజ్ఞమును ఏ విధముగా ఆచరింపవలెనో వారు ఎరుగరు. కనుకనే సులభముగా నిర్వహింపబడెడి సంకీర్తన యజ్ఞమనెడి యజ్ఞమును శ్రీచైతన్యమాహాప్రభువు ప్రవేశపెట్టిరి. కృష్ణభక్తిభావనను అంగీకరించగలిగిన ప్రపంచజనులెవ్వరైనను ఈ సంకీర్తనయజ్ఞమును నిర్వహింపగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 119 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 12
12. iṣṭān bhogān hi vo devā dāsyante yajña-bhāvitāḥ tair dattān apradāyaibhyo
yo bhuṅkte stena eva saḥ
🌷Translation :
In charge of the various necessities of life, the demigods, being satisfied by the performance of yajña [sacrifice], will supply all necessities to you. But he who enjoys such gifts without offering them to the demigods in return is certainly a thief.
🌷 Purport :
The demigods are authorized supplying agents on behalf of the Supreme Personality of Godhead, Viṣṇu. Therefore, they must be satisfied by the performance of prescribed yajñas. In the Vedas, there are different kinds of yajñas prescribed for different kinds of demigods, but all are ultimately offered to the Supreme Personality of Godhead.
For one who cannot understand what the Personality of Godhead is, sacrifice to the demigods is recommended. According to the different material qualities of the persons concerned, different types of yajñas are recommended in the Vedas. Worship of different demigods is also on the same basis – namely, according to different qualities. For example, the meat-eaters are recommended to worship the goddess Kālī, the ghastly form of material nature, and before the goddess the sacrifice of animals is recommended. But for those who are in the mode of goodness, the transcendental worship of Viṣṇu is recommended. But ultimately all yajñas are meant for gradual promotion to the transcendental position. For ordinary men, at least five yajñas, known as pañca-mahā-yajña, are necessary.
One should know, however, that all the necessities of life that the human society requires are supplied by the demigod agents of the Lord. No one can manufacture anything. Take, for example, all the eatables of human society. These eatables include grains, fruits, vegetables, milk, sugar, etc., for the persons in the mode of goodness, and also eatables for the nonvegetarians, like meats, none of which can be manufactured by men. Then again, take for example heat, light, water, air, etc., which are also necessities of life – none of them can be manufactured by the human society. Without the Supreme Lord, there can be no profuse sunlight, moonlight, rainfall, breeze, etc., without which no one can live. Obviously, our life is dependent on supplies from the Lord. Even for our manufacturing enterprises, we require so many raw materials like metal, sulphur, mercury, manganese, and so many essentials – all of which are supplied by the agents of the Lord, with the purpose that we should make proper use of them to keep ourselves fit and healthy for the purpose of self-realization, leading to the ultimate goal of life, namely, liberation from the material struggle for existence. This aim of life is attained by performance of yajñas. If we forget the purpose of human life and simply take supplies from the agents of the Lord for sense gratification and become more and more entangled in material existence, which is not the purpose of creation, certainly we become thieves, and therefore we are punished by the laws of material nature. A society of thieves can never be happy, because they have no aim in life. The gross materialist thieves have no ultimate goal of life. They are simply directed to sense gratification; nor do they have knowledge of how to perform yajñas. Lord Caitanya, however, inaugurated the easiest performance of yajña, namely the saṅkīrtana-yajña, which can be performed by anyone in the world who accepts the principles of Kṛiṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 08/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 120: 03వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 120: Chap. 03, Ver. 13
🌹. శ్రీమద్భగవద్గీత - 120 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 13
13. యజ్ఞశిష్టాన: సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషై: |
భుంజతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్ ||
🌷. తాత్పర్యం :
యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవధ్భక్తులు సర్వవిధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసికొనువారు కేవలము పాపమునే భుజింతురు.
🌷. భాష్యము :
భగవద్భక్తులు లేదాలేదా కృష్ణభక్తిరసభావితులు సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మసంహితలో(5.38) తెలుపబడిన రీతి వారు సదా శ్రీకృష్ణభగవానుని ప్రేమ యందే నిలిచియుందురు(ప్రేమాంజనచ్చురిత భక్తివిలో చనేన సన్త: సదైవ హృదయేషు విలోకయన్తి). దేవదేవుని (ప్రియము నొసగు గోవిందును లేదా ముక్తినొసగు ముకుందుని లేదా సర్వాకర్షకుడైన శ్రీకృష్ణుని) ప్రేమలో సన్నిహితముగా ముడివడియుండుటచే అతనికి తొలుత అర్పింపనిదే దేనిని వారు స్వీకరింపరు. అనగా అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణోస్మరణము. అర్చనము వంటి పలు భక్తిమార్గములు ద్వారా యజ్ఞములు సదా నిర్వహించుచునే యుందురు. అట్టి యజ్ఞనిర్వాణములు వారిని సదా భౌతికజగమునందలి సర్వవిధ పాపసంగము నుండి దూరముగా నుంచును. అట్లుగాక తమ ఆనందము కొరకే ఆహారమును తయారు చేసికొనువారు కేవలము చోరులే గాక సర్వవిధములైన పాపములను భుజించినవారు కాగలరు. దొంగ మరియు పాపియైన మనుజుడు ఎట్లు ఆనందమును పొందగలడు? అదియెన్నడును సాధ్యము కాదు. కనుకనే జనులు సర్వవిధములుగా ఆనందమయులగుటకు సులభమైన ఈ సంకీర్తనా విధానమును నిర్వహించుటను (పూర్ణకృష్ణభక్తిభావనలో) వారికి నేర్చవలసియున్నది. లేనిచో ప్రపంచమునందు సుఖముగాని, శాంతిగాని నెలకొనజాలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 120 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 13
13. yajña-śiṣṭāśinaḥ santo mucyante sarva-kilbiṣaiḥ
bhuñjate te tv aghaṁ pāpā ye pacanty ātma-kāraṇāt
🌷Translation :
The devotees of the Lord are released from all kinds of sins because they eat food which is offered first for sacrifice. Others, who prepare food for personal sense enjoyment, verily eat only sin.
🌷 Purport :
The devotees of the Supreme Lord, or the persons who are in Kṛṣṇa consciousness, are called santas, and they are always in love with the Lord as it is described in the Brahma-saṁhitā (5.38): premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti. The santas, being always in a compact of love with the Supreme Personality of Godhead, Govinda (the giver of all pleasures), or Mukunda (the giver of liberation), or Kṛṣṇa (the all-attractive person), cannot accept anything without first offering it to the Supreme Person. Therefore, such devotees always perform yajñas in different modes of devotional service, such as śravaṇam, kīrtanam, smaraṇam, arcanam, etc., and these performances of yajñas keep them always aloof from all kinds of contamination of sinful association in the material world. Others, who prepare food for self or sense gratification, are not only thieves but also the eaters of all kinds of sins. How can a person be happy if he is both a thief and sinful? It is not possible. Therefore, in order for people to become happy in all respects, they must be taught to perform the easy process of saṅkīrtana-yajña, in full Kṛṣṇa consciousness. Otherwise, there can be no peace or happiness in the world.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 09/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 121: 03వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 121: Chap. 03, Ver. 14
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 121 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 14
14. అన్నాద్భావన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవ: |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ: కర్మసముద్భవ: ||
🌷. తాత్పర్యం :
జీవదేహములన్నియును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధ్యానములపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా, విహితకర్మము నుండి యజ్ఞము ఉద్బవించుచున్నది.
🌷. భాష్యము :
శ్రీమద్భగవద్గీత గొప్ప వ్యాఖ్యాతలైన శ్రీల బలదేవవిద్యాభూషణులు ఈ విధముగా తెలిపిరి. “యే ఇంద్రాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణు మభ్యర్చ్యతచ్చేష మశ్నన్తి తేన తద్దేహయాత్రాం సంపాదయన్తి, తే సన్త: సర్వేశ్వరస్య యజ్ఞాపురుషస్య భక్తా: సర్వకిల్భిషై; అనాదికాలవివృద్ధై: ఆత్మానుభవప్రతిబన్ధకై ర్నిఖిలై: పాపై: విముచ్యన్తే”. యజ్ఞపురుషుడని (సర్వయజ్ఞభోక్త) తెలియబడు శ్రీకృష్ణభగవానుడు దేవతలందరికీ ప్రభువు. దేహమునందలి వివిధ అంగములు దేహమునకు సేవ చేయురీతి ఆ దేవతలందరును భగవానుని సేవను గూర్చుదురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతల సృష్టిపరిపాలనకై నియమింపబడిన అధికారులై నందున వారి ప్రీతి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించుచున్నది. తద్ద్వారా వారు ప్రియమునొంది ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు వలసిన గాలిని, వెలుతురు, నీటిని అందించగలరు. శ్రీకృష్ణభగవానుని అర్చించినప్పుడు ఆతని అంగములైన దేవతలు అప్రయత్నముగా పూజింపబడుచున్నందున ప్రత్యేముగా ఆ దేవతలను అర్చింపనవసరము లేదు. ఈ కారణముననే భక్తులు(కృష్ణభక్తిభావన యందున్నవారు) తొలుత ఆహారమును కృష్ణునకు అర్పించి పిదప గ్రహింతురు (ఈ విధానము ద్వారా దేహము ఆధ్యాత్మికముగా పుష్టినొందగలదు). ఆ విధమైన కర్మ ద్వారా పూర్వపాపములన్నియు నశించుటయే కాక, దేహము సర్వభౌతిక కల్మషములకు అతీతమగుచున్నది. అంటువ్యాధి ప్రబలినప్పుడు రోగనిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మనుజుని రక్షించురీతి, విష్ణువుకు అర్పింపబడిన ఆహారము మనలను విషయాసక్తత నుండి రక్షించును. ఇట్టి విధానము నవలంబించువాడు భక్తుడని పిలువబడును. కావున కృష్ణప్రసాదమును స్వీకరించు భక్తుడు ఆత్మానుభవమార్గములో అవరోధముల వంటి పూర్వపాపములను నశింపజేసికొనుచున్నాడు. ఈ విధముగా వర్తించనివాడు పాపభారమును క్రమముగా పెంచుకొనిపోవుచు పాపఫలముల ననుభవించుటకు హీనమైన శునక, సుకరాదుల దేహమును తయారుచేసికొనును. ఈ భౌతికదేహము కల్మషభూయిష్టమైనట్టిది. భగవత్ప్రసాడామును(విష్ణువునకు అర్పింపబడిన ఆహారము) స్వీకరించువాడు మాత్రమే వాని ప్రభావము నుండి రక్షింపబడుచున్నాడు. ఆ విధముగా నొనరింపనివాడు దాని కల్మషముచే ప్రభావితుడు కాగలడు.
వాస్తవమునకు ధ్యానము మరియు కూరగాయలే ఆహారయోగ్యములు. ధ్యానము, కూరగాయాలు, ఫలములు మొదలగువాటిని మానవుడు భుజింపగా, ధ్యానపు వ్యర్థశేషమును గడ్డిని, చెట్లను జంతువులు ఆహారముగా స్వీకరించును. మాంసభక్షణము చేయుటకు అలవాటుపాడనివారు. అనగా చివరికి మనము భూఉత్పత్తులు సమృద్ధియైన వర్షముపై ఆధారపడియుండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియమింపబడుచున్నది. ఆ దేవతలందరును శ్రీకృష్ణభగవానుని సేవకులు. అట్టి భగవానుడు యజ్ఞముచే సంతృప్తినొందును. గావున కనీసము ఆహారపదార్థముల కొరత నుండి రక్షింపబడుటకైనను యజ్ఞమును (ముఖ్యముగా ఈ యుగమునకు నిర్దేశింపబడిన సంకీర్తనా యజ్ఞమును నిర్వహింపవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 121 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga 🌴
Verse 14
14. annād bhavanti bhūtāni
parjanyād anna-sambhavaḥ
yajñād bhavati parjanyo
yajñaḥ karma-samudbhavaḥ
🌷Translation :
All living bodies subsist on food grains, which are produced from rains. Rains are produced by performance of yajña [sacrifice], and yajña is born of prescribed duties.
🌷 Purport :
Śrīla Baladeva Vidyābhūṣaṇa, a great commentator on the Bhagavad-gītā, writes as follows:
ye indrādy-aṅgatayāvasthitaṁ yajñaṁ sarveśvaraṁ viṣṇum abhyarcya tac-cheṣam aśnanti tena tad deha-yātrāṁ sampādayanti, te santaḥ sarveśvarasya yajña-puruṣasya bhaktāḥ sarva-kilbiṣair anādi-kāla-vivṛddhair ātmānubhava-pratibandhakair nikhilaiḥ pāpair vimucyante.
The Supreme Lord, who is known as the yajña-puruṣa, or the personal beneficiary of all sacrifices, is the master of all the demigods, who serve Him as the different limbs of the body serve the whole. Demigods like Indra, Candra and Varuṇa are appointed officers who manage material affairs, and the Vedas direct sacrifices to satisfy these demigods so that they may be pleased to supply air, light and water sufficiently to produce food grains. When Lord Kṛṣṇa is worshiped, the demigods, who are different limbs of the Lord, are also automatically
Date: 10/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 122: 03వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 122: Chap. 03, Ver. 15
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 122 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము 🌴
శ్లోకము 15
15. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్ ||
🌷. తాత్పర్యం :
నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపపడగా, అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్టితమై యుండును.
🌷. భాష్యము :
కేవలము శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కర్మనొనరింపవలసిన అవసరము (యజ్ఞార్థకర్మ) ఈ శ్లోకమునందు మరింత నొక్కి చెప్పబడినది. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రీత్యర్థమే మనము కర్మ చేయవలెనన్నచో కర్మకు సంబంధించిన మార్గదర్శకత్వమును బ్రహ్మమునందే పొందవలెను. కనుకనే వేదములు కర్మనొనరించుటకు మార్గదర్శకసూత్రములై యున్నవి. వేదనిర్దేశము లేకుండా ఒనరింపబడెడి కర్మము వికర్మగా(అప్రమాణికకర్మ) లేదా పాపకర్మగా తెలియబడును. కనుక కర్మఫలము నుండి రక్షింపబడుటకు ప్రతియొక్కరు వేదముల నుండి మార్గదర్శకత్వమును పొందవలెను. సాధారణజీవతమున మనుజుడు దేశము యొక్క రాజ్యంగ నిర్దేశమునందు పనిచేయురీతి ప్రతియెక్కరును భగవానుని నిర్దేశములోనే కర్మ నొనరించవలెను. వేదములందలి అట్టి నిర్దేశములు ప్రత్యక్షముగా అతని శ్వాస ద్వారా ప్రకటనమై యున్నవి. అస్య మహతో భూతస్య నిశ్యసితమేతత్ యద్ ఋగ్వేదో యజుర్వేద: సామవేదో(థర్వాంగిరస: -ఋగ్బేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదమనెడి నాలుగు వేదములు దేవదేవుని శ్వాస నుండి బహిర్గతమైనవి (బృహదారాణ్యకోపనిషత్తు 4.5.11). భగవానుడు సర్వశక్తిసమన్వితుడు కావున శ్వాస ద్వారాను భాషించగలడు. శ్రీకృష్ణభగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతరేంద్రియ కార్యములను సైతము చేయగలిగిన శక్తిసామర్థ్యములు కలిగియున్నాడని తెలుపుచు బ్రహ్మసంహిత ఈ విషయమును నిర్దారించచున్నది. అనగా భగవానుడు శ్వాస ద్వారాను మాట్లాడగలడు. కన్నుల ద్వారాను సృజింపగలడు. వాస్తవమునకు అతడు ప్రకృతిని వీక్షించుట ద్వారానే జీవులను సృష్టించెనని తెలుపబడినది. బద్ధజీవులను ఆ విధముగా ప్రకృతి గర్భమున సృజించిన పిమ్మట వారు ఏ విధముగా తరిగి తన ధామమును చేరగలరో తెలుపుటకు అతడు వేదవిజ్ఞానమునందు నిర్దేశములు నొసగెను. భౌతికప్రకృతి యందున్న బద్ధజీవులు భోగాభిలాషను సదా కలిగియుందురని మనమెరుగవలెను. కాని జీవుడు అట్టి వికృతకోరికలను సంతృప్తిపరచుకొని, ఆ నామమాత్రభోగము ముగిసిన పిమ్మట ఎట్లు భగవద్ధామమును చేరవచ్చునో తెలుపురీతిగా వేదనిర్దేశములు సృష్టింపబడినవి. అనగా ఇది బద్ధజీవులు ముక్తిని పొందుటకు కల్పింపబడిన ఒక అవకాశము కనుక వారందరును కృష్ణభక్తిభావనాయుతులు అగుట ద్వారా యజ్ఞవిధానమును అనుసరింపవలెను. వేదశాసనములను అనుసరింపనివారు సైతము కృష్ణభక్తిభావానా నియమములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞచరణమే(వైదిక కర్మాచరణము) కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 122 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 15 🌴
15. karma brahmodbhavaṁ viddhi
brahmākṣara-samudbhavam
tasmāt sarva-gataṁ brahma
nityaṁ yajñe pratiṣṭhitam
🌷Translation :
Regulated activities are prescribed in the Vedas, and the Vedas are directly manifested from the Supreme Personality of Godhead. Consequently the all-pervading Transcendence is eternally situated in acts of sacrifice.
🌷 Purport :
Yajñārtha-karma, or the necessity of work for the satisfaction of Kṛṣṇa only, is more expressly stated in this verse. If we have to work for the satisfaction of the yajña-puruṣa, Viṣṇu, then we must find out the direction of work in Brahman, or the transcendental Vedas. The Vedas are therefore codes of working directions. Anything performed without the direction of the Vedas is called vikarma, or unauthorized or sinful work. Therefore, one should always take direction from the Vedas to be saved from the reaction of work. As one has to work in ordinary life by the direction of the state, one similarly has to work under direction of the supreme state of the Lord. Such directions in the Vedas are directly manifested from the breathing of the Supreme Personality of Godhead. It is said, asya mahato bhūtasya niśvasitam etad yad ṛg-vedo yajur-vedaḥ sāma-vedo ’tharvāṅgirasaḥ. “The four Vedas – namely the Ṛg Veda, Yajur Veda, Sāma Veda and Atharva Veda – are all emanations from the breathing of the great Personality of Godhead.” (Bṛhad-āraṇyaka Upaniṣad 4.5.11) The Lord, being omnipotent, can speak by breathing air, for as it is confirmed in the Brahma-saṁhitā, the Lord has the omnipotence to perform.
Date: 11/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 123: 03వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 123: Chap. 03, Ver. 16
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 123 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 16 🌴
16. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ య: |
ఆఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞచక్రమును జీవితమున అనుసరింపనివాడు నిక్కముగా పాపజీవనుడగును. కేవలము ఇంద్రియతృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనము గడుపును.
🌷. భాష్యము :
“కష్టించి పనిచేసి పిదప ఇంద్రియభోగము ననుభవింపుము” అనెడి ధనలోభపూరితమైన తత్త్వము శ్రీకృష్ణభగవానునిచే ఇచ్చట నిరసించబడుచున్నది. కనుకకనుక ఈ భౌతికజగమును అనుభవింపగోరువారికి పైన తెలుపబడిన యజ్ఞచక్రము అత్యంత అవసరము. అట్టి నియమములను పాటింపనివాడు మిగుల నిరసింపవడినవాడై ప్రమాదకరజీవితమును గడుపువాడే యగును. ప్రకృతి నియమము ప్రకారము మానవజన్మ యనునది కర్మయోగము లేదా జ్ఞానయోగము లేదా భక్తియోగమనెడి ఏదియో ఒక మార్గము ద్వారా ఆత్మానుభూతిని పొందుట కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. నిర్దేశితమైనటువంటి యజ్ఞములను కచ్చితముగా అనుసరింపవలసిన అవసరము గుణదోషాతీతులైన మహాత్ములకు లేకున్నను, ఇంద్రియభోగమునందు నిలిచినవారు మాత్రము పైన తెలుపబడిన యజ్ఞచక్రము ద్వారా పవిత్రతను పొందవలసియున్నది. వాస్తవమునకు కర్మలు పలురకములు. కృష్ణభక్తిభావన లేనివారు నిక్కముగా భోగభావన కలిగినవారు భోగకర్మఫలములందు తగుల్కొనకుండా తమ కోరికలను సంతృప్తిపరచుకొనునట్లుగా యజ్ఞావిదానము ఏర్పాటు చేయబడినది. ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మన స్వీయకృషిపై గాక, దేవతలచే ప్రత్యక్షముగా నిర్వహింపబడెడి భగవానుని ప్రణాళికపై ఆధారపడియుండును. కనుకనే వేదములందు తెలుపబడిన ప్రత్యేక దేవతల కొరకే యజ్ఞములు ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. పరోక్షముగా అది కృషభక్తిరసభావనా విధానపు అభ్యసమే అయియున్నది. ఏలయన యజ్ఞానిర్వహణమందు నిష్ణాతుడైనవాడు నిక్కముగా కృష్ణభక్తిభావనాయుతుడు కాగలడు. కాని అట్టి యజ్ఞాచరణము ద్వారా మనుజడు కృష్ణభక్తిభావితుడు కానిచో అవియన్నియును కేవలము నీతి సూత్రములుగా పరిగణింప బడును. కనుక ప్రతి యొక్కరు తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల వరకే పరిమితము చేసికొనక, వాటిని అదిగమించి కృష్ణభక్తిభావనను పొందవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 123 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 16 🌴
16. evaṁ pravartitaṁ cakraṁ
nānuvartayatīha yaḥ
aghāyur indriyārāmo
moghaṁ pārtha sa jīvati
🌷Translation :
My dear Arjuna, one who does not follow in human life the cycle of sacrifice thus established by the Vedas certainly leads a life full of sin. Living only for the satisfaction of the senses, such a person lives in vain.
🌷 Purport :
The mammonist philosophy of “work very hard and enjoy sense gratification” is condemned herein by the Lord. Therefore, for those who want to enjoy this material world, the above-mentioned cycle of performing yajñas is absolutely necessary. One who does not follow such regulations is living a very risky life, being condemned more and more. By nature’s law, this human form of life is specifically meant for self-realization, in either of the three ways – namely karma-yoga, jñāna-yoga or bhakti-yoga. There is no necessity of rigidly following the performances of the prescribed yajñas for the transcendentalists who are above vice and virtue; but those who are engaged in sense gratification require purification by the above-mentioned cycle of yajña performances. There are different kinds of activities. Those who are not Kṛṣṇa conscious are certainly engaged in sensory consciousness; therefore they need to execute pious work. The yajña system is planned in such a way that sensory conscious persons may satisfy their desires without becoming entangled in the reaction of sense-gratificatory work. The prosperity of the world depends not on our own efforts but on the background arrangement of the Supreme Lord, directly carried out by the demigods. Therefore, the yajñas are directly aimed at the particular demigods mentioned in the Vedas. Indirectly, it is the practice of Kṛṣṇa consciousness, because when one masters the performance of yajñas one is sure to become Kṛṣṇa conscious. But if by performing yajñas one does not become Kṛṣṇa conscious, such principles are counted as only moral codes. One should not, limit only to the point of moral codes, but should transcend them, to attain Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 12/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 124: 03వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 124: Chap. 03, Ver. 17
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 124 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 17 🌴
17. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మాతృప్తశ్చ మానవ: |
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ||
🌷. తాత్పర్యం :
కాని ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మ యందే ఆనందమును గొనుచు, ఆత్మ యందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందినవానికి చేయవలసిన కర్మమేమియును లేదు.
🌷. భాష్యము :
పూర్ణముగా కృష్ణభక్తిభావనాయుతుడై కృష్ణపరకర్మలచే పూర్ణతృప్తి నొందినవానికి చేయవలసిన కర్మమేమియును ఉండదు. కృష్ణభక్తిభావితుడై కారణమున వేలాది యజ్ఞనిర్వహణ ప్రభావమైన కల్మషమార్జనము అతని యందు శీఘ్రమే కలుగుచున్నది. చైతన్యము ఆ విధముగా శుద్ధిపడినపుడు మనుజుడు తనకు శ్రీకృష్ణభగవానునితో గల సంబంధమును స్థిరముగా ఎరుగవలయును. అట్టివానికి విధ్యుక్తధర్మము స్వయముగా భగవానుని కరుణచే హృదయమునందు ప్రకాశితమగును. కనుక వేదంనిర్దేశములను అనుసరింపవలసిన నిర్భంధము అతనికి ఏమాత్రము ఉండదు. అటువంటి కృష్ణభక్తిరసభావితుడు ఎటువంటి లౌకికకర్మల యందును మగ్నుడు కాడు. అంతియేగాక అతడు మదిర, మగువ వంటి మోహపూర్వక విషయములందు ఏమాత్రము ఆనందమును గొనడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 124 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 17 🌴
17. yas tv ātma-ratir eva syād
ātma-tṛptaś ca mānavaḥ
ātmany eva ca santuṣṭas
tasya kāryaṁ na vidyate
🌷Translation :
But for one who takes pleasure in the Self, whose human life is one of self-realization, and who is satisfied in the Self only, fully satiated – for him there is no duty.
🌷 Purport :
A person who is fully Kṛṣṇa conscious, and is fully satisfied by his acts in Kṛṣṇa consciousness, no longer has any duty to perform. Due to his being Kṛṣṇa conscious, all impiety within is instantly cleansed, an effect of many, many thousands of yajña performances. By such clearing of consciousness, one becomes fully confident of his eternal position in relationship with the Supreme. His duty thus becomes self-illuminated by the grace of the Lord, and therefore he no longer has any obligations to the Vedic injunctions. Such a Kṛṣṇa conscious person is no longer interested in material activities and no longer takes pleasure in material arrangements like wine, women and similar infatuations.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 13/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 125: 03వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 125: Chap. 03, Ver. 18
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 125 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 18 🌴
18. నైవ తస్య కృతేనార్థో నకృతేనేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ: ||
🌷. తాత్పర్యం :
ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విధ్యుక్తధర్మనిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదియును ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపక పోవుటకు కారణము గాని, ఇతర జీవులపై అధార పడవలసిన అవసరము గాని అతనికి ఉండదు.
🌷. భాష్యము :
ఆత్మానుభవము పొందిన వ్యక్తికి కృష్ణపరమైన కర్మలు తప్ప అన్యమైన విధ్యుక్తధర్మ నిర్వహణమేదియును లేదు. రాబోవు శ్లోకములలో తెలుపబడబోవు రీతి కృష్ణభక్తిభావన జడత్వము కూడా కాదు. కృష్ణభక్తిభావన యందున్నవాడు దేవతాశరణమును గాని, మానవశరణము గాని పొందడు. కృష్ణభక్తి యందు అతడు ఏది యొనరించినను అది విధినిర్వాహణమునకు సరిపోవునదై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 125 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 18 🌴
18. naiva tasya kṛtenārtho
nākṛteneha kaścana
na cāsya sarva-bhūteṣu
kaścid artha-vyapāśrayaḥ
🌷Translation :
A self-realized man has no purpose to fulfill in the discharge of his prescribed duties, nor has he any reason not to perform such work. Nor has he any need to depend on any other living being.
🌷 Purport :
A self-realized man is no longer obliged to perform any prescribed duty, save and except activities in Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is not inactivity either, as will be explained in the following verses. A Kṛṣṇa conscious man does not take shelter of any person – man or demigod. Whatever he does in Kṛṣṇa consciousness is sufficient in the discharge of his obligation.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 14/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 126: 03వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 126: Chap. 03, Ver. 19
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 126 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 19 🌴
19. తస్మాదసక్త: సతతం కార్యం కర్మ సమాచర |
ఆసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుష: ||
🌷. తాత్పర్యం :
కనుక ప్రతియొక్కరు కర్మఫలముల యందు ఆసక్తిని గొనక తన విధియని భావించుచు కర్మల యందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మ నొనరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు.
🌷. భాష్యము :
భక్తులకు “పరము” అనునది దేవదేవుడైన శ్రీకృష్ణుడు కాగా, నిరాకారవాదికి మోక్షమై యున్నది. కనుక సరియైన నిర్దేశమునందు కర్మఫలము నెడ సంగము లేకుండా కృష్ణుని కొరకై కర్మను చేయువాడు (కృష్ణభక్తిరసభావితుడు) తప్పక జీవితపు పరమలక్ష్యము వైపుకు పురోగమించును. కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణుని కొరకే యుద్ధము చేయుమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణుడు కోరియుండుటయే అందులకు కారణము. సాధువుగా లేదా అహింసాత్మకునిగా వర్తించుట యనునది సంగత్వమును కూడినది. కాని భగవానుని పక్షమున కర్మచేయుట ఫలమునందాసక్తి లేకుండా వర్తించుట వంటిది. పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన అత్యుత్తమ పూర్ణకర్మమదియే.
ఇంద్రియభోగానుభవమునందు ఒనర్చబడు పాపకర్మలను శుద్ధిపరచుట కొరకే యజ్ఞముల వంటి వేదవిహితకర్మలు నిర్వహింపబడును. కాని కృష్ణభక్తి యందలి కర్మలు శుభాశుభకర్మఫలములకు అతీతములై యున్నవి. కృష్ణభక్తుడైనవాడు కర్మఫలములందు ఆసక్తుడు గాక, కేవలము కృష్ణుని తరపున కర్మను సాగించును. అతడు అన్నిరకముల కార్యములను నిర్వహించినను సంపూర్ణముగా అసంగుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 126 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 19 🌴
19. tasmād asaktaḥ satataṁ
kāryaṁ karma samācara
asakto hy ācaran karma param āpnoti pūruṣaḥ
🌷Translation :
Therefore, without being attached to the fruits of activities, one should act as a matter of duty, for by working without attachment one attains the Supreme.
🌷 Purport :
The Supreme is the Personality of Godhead for the devotees, and liberation for the impersonalist. A person, therefore, acting for Kṛṣṇa, or in Kṛṣṇa consciousness, under proper guidance and without attachment to the result of the work, is certainly making progress toward the supreme goal of life. Arjuna is told that he should fight in the Battle of Kurukṣetra for the interest of Kṛṣṇa because Kṛṣṇa wanted him to fight. To be a good man or a nonviolent man is a personal attachment, but to act on behalf of the Supreme is to act without attachment for the result. That is perfect action of the highest degree, recommended by the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa.
Vedic rituals, like prescribed sacrifices, are performed for purification of impious activities that were performed in the field of sense gratification. But action in Kṛṣṇa consciousness is transcendental to the reactions of good or evil work. A Kṛṣṇa conscious person has no attachment for the result but acts on behalf of Kṛṣṇa alone. He engages in all kinds of activities, but is completely nonattached.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 15/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 127: 03వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 127: Chap. 03, Ver. 20
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 127 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 20 🌴
20. కర్మనైవ హి ససిద్ధిమాస్థితా జనకాదయ: |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ||
🌷. తాత్పర్యం :
జనకమాహారాజు వంటి రాజులు కేవలము విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిరి. కావున జనసామాన్యమునకు భోదించు నిమిత్తమై తప్పక నీవు కర్మను చేయుము.
🌷. భాష్యము :
జనకుడు వంటి రాజులు ఆత్మానుభవము పొందిన మహాత్ములైనందున వేదనిర్దేశములైన కర్మల నొనరింపవలసిన అవసరము వారికి లేకుండెను. అయినను సామాన్యజనులకు ఆదర్శమును నెలకొల్పుటకై వారు తమ విధ్యుక్తధర్మములను సంపూర్ణముగా నిర్వర్తించిరి. జనకమహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రునికి మామగారు. భగవద్బక్తుడైనందున అతడు ఉన్నత ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియున్నను మిథిలానగరమునకు (బీహారురాష్టమునకు) రాజైన కారణమున విధ్యుక్తధర్మములను ఏ విధముగా నిర్వర్తింపవలెనో తన ప్రజలకు స్వయముగా తెలియజేయవలసివచ్చెను. శ్రీకృష్ణునకు మరియు అతని నిత్యస్నేహితుడైన అర్జునునకు విఫలమైన చోట హింస తప్పనిసరి యని జనులకు తెలియజేయుటకై వారు యుద్ధము చేసిరి. కురుక్షేత్ర యుద్ధమునకు పూర్వము యుద్ధమును నివారించుటకు సర్వవిధములైన ప్రయత్నములు జరిగెను. స్వయము శ్రీకృష్ణభగవానుడు అందులకు యత్నించినను ఎదుటి పక్షమువారు యుద్ధమునకే సిద్ధపడిరి. కనుక న్యాయసమ్మతమైన అట్టి విషయమున యుద్ధము తప్పనిసరి అయ్యెను. కృష్ణభక్తిరసభావితుడు ఈ లోకము నెడ ఆసక్తిరహితుడైనను జనులు ఏ విధముగా జీవించవలెనో మరియు కర్మలు ఏ విధముగా ఒనరించవలెనో తెలియజేయుటకై కర్మల నొనరించుచుండును. కృష్ణభక్తిభావన యందు అనుభవజ్ఞులైనవారు ఇతరులు తమను అనుసరించురీతిలో కర్మను సమర్థవంటముగా ఒనరింపగలరు. ఈ విషయమును రాబోవు శ్లోకమునందు వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 127 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 20 🌴
20. karmaṇaiva hi saṁsiddhim
āsthitā janakādayaḥ
loka-saṅgraham evāpi
sampaśyan kartum arhasi
🌷Translation :
Kings such as Janaka attained perfection solely by performance of prescribed duties. Therefore, just for the sake of educating the people in general, you should perform your work.
🌷 Purport :
Kings like Janaka were all self-realized souls; consequently they had no obligation to perform the prescribed duties in the Vedas. Nonetheless they performed all prescribed activities just to set examples for the people in general. Janaka was the father of Sītā and father-in-law of Lord Śrī Rāma. Being a great devotee of the Lord, he was transcendentally situated, but because he was the king of Mithilā (a subdivision of Bihar province in India), he had to teach his subjects how to perform prescribed duties. Lord Kṛṣṇa and Arjuna, the Lord’s eternal friend, had no need to fight in the Battle of Kurukṣetra, but they fought to teach people in general that violence is also necessary in a situation where good arguments fail. Before the Battle of Kurukṣetra, every effort was made to avoid the war, even by the Supreme Personality of Godhead, but the other party was determined to fight. So for such a right cause, there is a necessity for fighting. Although one who is situated in Kṛṣṇa consciousness may not have any interest in the world, he still works to teach the public how to live and how to act. Experienced persons in Kṛṣṇa consciousness can act in such a way that others will follow, and this is explained in the following verse.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 16/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 128: 03వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 128: Chap. 03, Ver. 21
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 128 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 21 🌴
21. యద్ యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జన: | స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||
🌷. తాత్పర్యం :
మహానియుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును.
🌷. భాష్యము :
స్వీయాచరణము ద్వారా జనులకు భోధ చేయగల నాయకుడు సామాన్యజనులకు సర్వదా అవసరము. నాయకుడే స్వయముగా ధూమపానము చేయువాడైనచో ధూమపానము చేయవద్దని జనులకు భోధను చేయలేడు. విద్యను భోధించుటకు పూర్వమే గురువు చక్కని నడవడిక అలవరచుకొనవలెనని శ్రీచైతన్యమహాప్రభువు తెలిపిరి. ఆ విధముగా చేయువాడు ఆచార్యుడు లేక ఉత్తమగురువని పిలువబడును.
కనుక సామాన్యజనులకు భోధించుట కొరకై గురువైనవాడు శాస్త్రనియమములను చక్కగా పాటింపవలెను అంతియేగాక శాస్త్రనియములకు విరుద్ధములైన నియమములను అతడెన్నడును తయారు చేయరాదు. మనుసంహిత వంటి పలు గ్రంథములు మానవాళి అనుసరించుటకు ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపబడినవి. నాయకుడైనవాని భోధలు అట్టి శాస్త్రనియమములపై ఆధారపడియుండవలెను. తన ఉన్నతిని వాంచించువాడు మహాత్ములైనవారు ఆచరించు ప్రామాణిక నియమములను చక్కగా పాటింపవలెను.
మహాభక్తుల మార్గము అనుసరనీయమనియు మరియు ఆత్మానుభవమార్గమున పురోగతికి అదియే సరియైన విధానమనియు శ్రీమద్భాగవతము సైతము ద్రువీకరింపచుచున్నది. దేశమనేలెడి రాజు, జన్మనొసగిన తండ్రి, పాటశాల యందు విద్య నేర్పెడి ఉపాధ్యుయుడు జనసామన్యమునకు నాయకుల వంటివారు. తమపై ఆధారపడిన వారి యెడ అట్టి సహజనాయకులు గొప్ప బాధ్యతను కలిగియున్నారు. కనకనే నీతి మరియు తత్త్వసూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు వారు నిపుణులై యుండవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 128 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 21 🌴
21. yad yad ācarati śreṣṭhas
tat tad evetaro janaḥ
sa yat pramāṇaṁ kurute
lokas tad anuvartate
🌷Translation :
Whatever action a great man performs, common men follow. And whatever standards he sets by exemplary acts, all the world pursues.
🌷 Purport :
People in general always require a leader who can teach the public by practical behavior. A leader cannot teach the public to stop smoking if he himself smokes. Lord Caitanya said that a teacher should behave properly before he begins teaching. One who teaches in that way is called ācārya, or the ideal teacher.
Therefore, a teacher must follow the principles of śāstra (scripture) to teach the common man. The teacher cannot manufacture rules against the principles of revealed scriptures. The revealed scriptures, like Manu-saṁhitā and similar others, are considered the standard books to be followed by human society. Thus the leader’s teaching should be based on the principles of such standard śāstras. One who desires to improve himself must follow the standard rules as they are practiced by the great teachers.
The Śrīmad-Bhāgavatam also affirms that one should follow in the footsteps of great devotees, and that is the way of progress on the path of spiritual realization. The king or the executive head of a state, the father and the schoolteacher are all considered to be natural leaders of the innocent people in general. All such natural leaders have a great responsibility to their dependents; therefore they must be conversant with standard books of moral and spiritual codes.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 17/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 129: 03వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 129: Chap. 03, Ver. 22
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 129 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 22 🌴
22. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదియును లేదు. నేను కోరునది కాని, పొందవలసిన కాని ఏదియును లేకున్నను విహితకర్మల యందు నేను నియుక్తుడనై యున్నాను.
🌷. భాష్యము :
వేదవాజ్మయమునందు భగవానుడు ఈ విధముగా వర్ణింపబడినాడు.
తం ఈశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతమ్ |
పతిం పతీనాం పరమం పరస్తాద్ విదామదేవం భువనేశమీడ్యమ్ ||
న తస్యకార్యం కరణం చ విద్యతే న తత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే |
పరాస్య శక్తి ర్వివిదైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబాలక్రియా చ ||
“భగవానుడు నియామకులందరికీ నియామకుడైనట్టివాడు. అతడు సమస్త లోలపాలకులలో అతిఘనుడైనవాడు. ప్రతియొక్కరు అతని ఆధీనములో నున్నవారే. జీవులందరి ఆ భగవానుడే వివిధ శక్తులను ప్రదానము కావించియున్నాడు. కనుక ఆ జీవులెన్నడును స్వతః ఘనులు కాజాలరు. సమస్త దేవతలచే పూజింపబడు ఆ భగవానుడు నిర్దేశించువారందరికి పరమ నిర్దేశకుడు. కావున అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడైనట్టివాడు. అంతియేగాక వారందరిచే అతడు పూజనీయుడై యున్నాడు. అతని కన్నను ఘనుడెవ్వరును లేరు మరియు అతడే సర్వకారణములకు ఆదికారణుడై యున్నాడు.”
“ఆ భగవానుడు సాధారణ జీవుని దేహము వంటి దేహమును కలిగియుండడు. అతని దేహము మరియు ఆత్మలకు భేదము లేదు. పరంపురుషుడైన అతని ఇంద్రియములు దివ్యములు. అతని ఏ ఇంద్రియమైనను ఇతరేంద్రియకార్యము చేయగల సామర్థ్యమును కలిగియుండును. కావున అతని కంటె ఘనుడు గాని లేడు. అతని శక్తులు అనేకములగుటచే అతని కర్మలన్నియును అప్రయత్నముగా సహరీతిలో నిర్వహింపబడుచుండును.” (శ్వేతాశ్వతరోపనిషత్తు 6.7-8).
భగవానుని యందు ప్రతిదియు సమగ్రముగాను మరియు సత్యముగాను నెలకొనియుండుట వలన అతడు నిర్వహింపవలసిన కర్మమేదియును లేదు. ఫలము గోరువానికి మాత్రమే చేయవలసిన కర్మ యుండును. కాని ముల్లోకములయందు ఏదియును పొందవలసినది లేనివానికి నిక్కముగా ఎట్టి కర్మయు ఉండదు. అయినను శ్రీకృష్ణభగవానుడు క్షత్రియులకు నాయకుని రూపున కురుక్షేత్రరణరంగమున కార్యోన్ముఖుడయ్యెను. ఏలయన దీనులకు మరియు దుఃఖితులైనవారికి రక్షణము గూర్చుట క్షత్రియుల ధర్మమై యున్నది. తానూ శాస్త్రవిధులకు అతీతుడై యున్నను శాస్త్రములను భంగపరచు దేనినైనను శ్రీకృష్ణభగవానుడు ఒనరింపడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 129 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 22 🌴
22. na me pārthāsti kartavyaṁ
triṣu lokeṣu kiñcana
nānavāptam avāptavyaṁ
varta eva ca karmaṇi
🌷Translation :
O son of Pṛthā, there is no work prescribed for Me within all the three planetary systems. Nor am I in want of anything, nor have I a need to obtain anything – and yet I am engaged in prescribed duties.
🌷 Purport :
The Supreme Personality of Godhead is described in the Vedic literatures as follows:
tam īśvarāṇāṁ paramaṁ maheśvaraṁ
taṁ devatānāṁ paramaṁ ca daivatam
patiṁ patīnāṁ paramaṁ parastād
vidāma devaṁ bhuvaneśam īḍyam
na tasya kāryaṁ karaṇaṁ ca vidyate
na tat-samaś cābhyadhikaś ca dṛśyate
parāsya śaktir vividhaiva śrūyate
svābhāvikī jñāna-bala-kriyā ca
“The Supreme Lord is the controller of all other controllers, and He is the greatest of all the diverse planetary leaders. Everyone is under His control. All entities are delegated with particular power only by the Supreme Lord; they are not supreme themselves. He is also worshipable by all demigods and is the supreme director of all directors. Therefore, He is transcendental to all kinds of material leaders and controllers and is worshipable by all. There is no one greater than Him, and He is the supreme cause of all causes.
“He does not possess a bodily form like that of an ordinary living entity. There is no difference between His body and His soul. He is absolute. All His senses are transcendental. Any one of His senses can perform the action of any other sense. Therefore, no one is greater than Him or equal to Him. His potencies are multifarious, and thus His deeds are automatically performed as a natural sequence.” (Śvetāśvatara Upaniṣad 6.7–8)
🌹 🌹 🌹 🌹 🌹
Date: 18/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 130: 03వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 130: Chap. 03, Ver. 23
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 130 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 23 🌴
23. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రిత: |
మమ వర్త్మానువర్తన్తే మనుష్యా: పార్థ సర్వశ: ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! ఒకవేళ నేను విధ్యుక్తధర్మమములను శ్రద్ధగా నిర్వహింపనిచో మనుజులు తప్పక నా మార్గమునే అనుసరింతురు.
🌷. భాష్యము :
ఆధ్యాత్మికపురోగతికి కారకమగు సాంఘికజీవన శాంతిని నెలకొల్పుటకై ప్రతినాగరిక మనుజునకు కొన్ని వంశాచారములు నిర్ణయింపబడినవి. కాని అట్టి నియమనిబంధనలు బద్ధజీవునకే గాని శ్రీకృష్ణునకు కావు. అయినను తానూ ధర్మసంస్థాపనకై అవతరించి యున్నందున శ్రీకృష్ణుడు ఆ విహితకర్మలు అనుసరించెను లేనిచో సామాన్యజనులు పరమప్రామాణికుడైన శ్రీకృష్ణునే అనుసరింపగలరు. గృహస్థునకు అవసరమైన ధార్మికకర్మలను గృహమునందు మరియు గృహము వెలుపల శ్రీకృష్ణుడు నిర్వహించెనని శ్రీమద్భాగవతము ద్వారా అవగతమగుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 130 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 23 🌴
23. yadi hy ahaṁ na varteyaṁ
jātu karmaṇy atandritaḥ
mama vartmānuvartante
manuṣyāḥ pārtha sarvaśaḥ
🌷Translation :
For if I ever failed to engage in carefully performing prescribed duties, O Pārtha, certainly all men would follow My path.
🌷 Purport :
In order to keep the balance of social tranquillity for progress in spiritual life, there are traditional family usages meant for every civilized man. Although such rules and regulations are for the conditioned souls and not Lord Kṛṣṇa, because He descended to establish the principles of religion He followed the prescribed rules. Otherwise, common men would follow in His footsteps, because He is the greatest authority. From the Śrīmad-Bhāgavatam it is understood that Lord Kṛṣṇa was performing all the religious duties at home and out of home, as required of a householder.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 19/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 131: 03వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 131: Chap. 03, Ver. 24
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 131 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 24 🌴
24. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదాహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమా: ప్రజా: ||
🌷. తాత్పర్యం :
విధ్యుక్తధర్మమములను నేను నిర్వహింపనిచో లోకములన్నియును నాశామును పొందగలవు. అవాంఛనీయ ప్రజాబాహుళ్యమునకు నేను కారణుడనై తద్ద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరచిన వాడనగుదును.
🌷. భాష్యము :
వర్ణసంకరమనగా మానవసంఘము యొక్క శాంతిని చెరచునటువంటి అవాంఛనీయ జనబాహుళ్యమని భావము. సంఘపు ఈ శాంతి భగ్నతను నివారించుటకే విధినియమములను నిర్ణయింపబడినవి. వాటి ద్వారా మనుజులు అప్రయత్నముగా శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అట్టి నియమనిభందనలు గౌరవము మరియు అవసరములు కొనసాగు రీతిలో వాటిని అనుసరించును. శ్రీకృష్ణభగవానుడు జీవులందరినీ తండ్రి గనుక ఒకవేళ జీవులు తప్పుదారి పట్టినచో ఆ భాద్యత పరోక్షముగా అతనికే చెందును. కనుకనే ఎప్పుడు ధర్మనియమముల యెడ అగౌరము పొడసూపునో అప్పుడు అతడు అవతరించి సంఘము సరిచేయును. భగవానుని అడుగుజాడలలో నుడవవలసియున్నను ఎన్నడును అతనిని అనుకరించలేమనెడి సత్యమును మనము ఎరిగియుండవలెను. అనుసరించుట మరియు అనుకరించుట యనునవి సమానమైనవి కావు. ఉదాహరణమునకు శ్రీకృష్ణుడు బాల్యములో చూపిన గోవర్ధనోద్ధరణమును మనము అనుసరింపలేము. ఏ మానవునికైనను అది అసాధ్యమైనదే. అనగా అతని ఉపదేశములను మనము అనుసరించగలము కాని ఎన్నడును అతనిని అనుకరింపలేము. శ్రీమద్భాగవతము (10.33.30-31) ఈ విషయమునే ఇట్లు ద్రువీకరించుచున్నది.
నైతత్సమాచరే జ్జాతు మనసాపి హ్యనీశ్వర: |
వినశ్యత్యాచరన్ మౌడ్యాద్యథా రుద్రో(బ్దిజం విషమ్ ||
ఈశ్వరాణాం వచ: సత్యం తథైవాచరితం క్వచిత్ |
తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాం స్త త్సమాచరేత్ ||
“భగవానుడు మరియు అతని సేవకుల ఉపదేశముల ప్రతియొక్కరు పాటింపవలసి యున్నది. వారి ఉపదేశములు మనకు సర్వశుభదాయకములు. ఏ బుద్ధిమంతుడైనను ఉపదేశించిన రీతిగనే వాటిని అనుసరించును. కాని వారి కార్యములను మాత్రము మనుజుడు అనుసరించురాదు. పరమశివుని అనుకరించుచు విషసముద్రమును పానము చేయుటకు ఎవ్వరును యత్నించరాదు.”
సూర్య, చంద్రుల గమనములను నియమించు శక్తిని కలిగినవారిని (ఈశ్వరుల) స్థితి ఉన్నతమైనదిగా మనము గమనింపవలెను. అటువంటి శక్తి లేనిదే సర్వశక్తిసమన్వితులైన అట్టి ఈశ్వరులను ఎవ్వరును అనుకరింపలేరు. ఉదాహరణకు పరమశివుడు సముద్రమంత విస్తృతమైయున్న విషమును పానము కావించెను. కాని సామాన్యమానవుడు ఆ విషములో అతిసూక్ష్మభాగమును స్వీకరించినను వెంటనే మరణించును. కాని పరమశివుని మిథ్యాభక్తులు కొందరు గంజాయిని పీల్చుట, మాదకద్రవ్యములను గ్రహించుట వంటి కర్మలను చేయుచుందురు. శివుని కార్యముల అట్టి అనుకరణ ద్వారా తాము మృత్యువును ఆహ్వానించుచున్నామని వారు ఎరుగజాలరు. అదేవిధముగా శ్రీకృష్ణభగవానుని మిథ్యాభక్తులు కొందరు ఆ దేవాదేవుని వలె గోరర్ధనపర్వతమును ఎత్తలేమనెడి విషయమును మరచి అతని రాసలీలను మాత్రము అనుకరింప యత్నింతురు. కావున శక్తిమంతులను అనుకరించుట కన్నను వారి ఉపదేశములను అనుసరించుట అత్యంత ఉత్తమము. అంతియేగాక ఎటువంటి యోగ్యతలు లేకుండా వారి స్థానములను ఆక్రమింప యత్నించుటయు చేయరాదు. భగవానునకు ఉండవలసిన శక్తి లేకుండా భగదవతారముగా చలామణి యగు “అవతారములు” ఈనాడు పెక్కు గలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 131 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 24 🌴
24. utsīdeyur ime lokā
na kuryāṁ karma ced aham
saṅkarasya ca kartā syām
upahanyām imāḥ prajāḥ
🌷Translation :
If I did not perform prescribed duties, all these worlds would be put to ruination. I would be the cause of creating unwanted population, and I would thereby destroy the peace of all living beings.
🌷 Purport :
Varṇa-saṅkara is unwanted population which disturbs the peace of the general society. In order to check this social disturbance, there are prescribed rules and regulations by which the population can automatically become peaceful and organized for spiritual progress in life. When Lord Kṛṣṇa descends, naturally He deals with such rules and regulations in order to maintain the prestige and necessity of such important performances. The Lord is the father of all living entities, and if the living entities are misguided, indirectly the responsibility goes to the Lord.
Therefore, whenever there is general disregard of regulative principles, the Lord Himself descends and corrects the society. We should, however, note carefully that although we have to follow in the footsteps of the Lord, we still have to remember that we cannot imitate Him. Following and imitating are not on the same level. We cannot imitate the Lord by lifting Govardhana Hill, as the Lord did in His childhood. It is impossible for any human being. We have to follow His instructions, but we may not imitate Him at any time. The Śrīmad-Bhāgavatam (10.33.30–31) affirms:
naitat samācarej jātu
manasāpi hy anīśvaraḥ
vinaśyaty ācaran mauḍhyād
yathārudro ’bdhi-jaṁ viṣam
īśvarāṇāṁ vacaḥ satyaṁ
tathaivācaritaṁ kvacit
teṣāṁ yat sva-vaco-yuktaṁ
buddhimāṁs tat samācaret
“One should simply follow the instructions of the Lord and His empowered servants. Their instructions are all good for us, and any intelligent person will perform them as instructed. However, one should guard against trying to imitate their actions. One should not try to drink the ocean of poison in imitation of Lord Śiva.”
We should always consider the position of the īśvaras, or those who can actually control the movements of the sun and moon, as superior. Without such power, one cannot imitate the īśvaras, who are superpowerful. Lord Śiva drank poison to the extent of swallowing an ocean, but if any common man tries to drink even a fragment of such poison, he will be killed. There are many pseudo devotees of Lord Śiva who want to indulge in smoking gañjā (marijuana) and similar intoxicating drugs, forgetting that by so imitating the acts of Lord Śiva they are calling death very near. Similarly, there are some pseudo devotees of Lord Kṛṣṇa who prefer to imitate the Lord in His rāsa-līlā, or dance of love, forgetting their inability to lift Govardhana Hill. It is best, therefore, that one not try to imitate the powerful, but simply follow their instructions; nor should one try to occupy their posts without qualification. There are so many “incarnations” of God without the power of the Supreme Godhead.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 20/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 132: 03వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 132: Chap. 03, Ver. 25
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 132 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 25 🌴
25. సక్తా: కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత |
కుర్యాద్ విద్వాంస్తథాసక్త శ్చికీర్షుర్లోక సంగ్రహమ్ ||
🌷. తాత్పర్యం :
పామరులు ఫలములను ఆసక్తిగలవారై తమ కర్మనొనరించునట్లు, విద్వాంసుడైన వాడు జనులను ధర్మమార్గమున వర్తింపజేయుటకై సంగరహితముగా కర్మ నొనరింపవలెను.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుని, కృష్ణభక్తిభావన యందు లేనివానిని కోరికల ననుసరించు వేరు పరుపవచ్చును. కృష్ణభక్తిభావన యందున్నవాడు కృష్ణభక్తిపురోగతికి దోహదము కానటువంటి దేనిని ఒనరింపడు. అట్టివాడు భౌతికకర్మలందు అమితానురక్తుడైన అజ్ఞాని మాదిరిగా కర్మనొనరించినను అతని ఆచరణము శ్రీకృష్ణుని ప్రీత్యర్థము యుండును. కాని అజ్ఞాని కర్మలు ఇంద్రియప్రీత్యర్థమై యుండును. కావున ఏ విధముగా కర్మనొనరింపవలెనో మరియు ఎట్లు కర్మఫలములను కృష్ణభక్తి ప్రయోజనార్థమై వినియోగింపవలెనో కృష్ణభక్తుడు జనులకు చూపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 132 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 25 🌴
25. saktāḥ karmaṇy avidvāṁso
yathā kurvanti bhārata
kuryād vidvāṁs tathāsaktaś
cikīrṣur loka-saṅgraham
🌷Translation :
As the ignorant perform their duties with attachment to results, the learned may similarly act, but without attachment, for the sake of leading people on the right path.
🌷 Purport :
A person in Kṛṣṇa consciousness and a person not in Kṛṣṇa consciousness are differentiated by different desires. A Kṛṣṇa conscious person does not do anything which is not conducive to development of Kṛṣṇa consciousness. He may even act exactly like the ignorant person, who is too much attached to material activities, but one is engaged in such activities for the satisfaction of his sense gratification, whereas the other is engaged for the satisfaction of Kṛṣṇa. Therefore, the Kṛṣṇa conscious person is required to show the people how to act and how to engage the results of action for the purpose of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 21/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 133: 03వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 133: Chap. 03, Ver. 26
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 133 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 26 🌴
26. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసజ్గినామ్ |
జోష యేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్త: సమాచరన్ ||
🌷. తాత్పర్యం :
విధ్యుక్తధర్మపు ఫలముల యెడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడురీతిగా విద్వాంసుడు వారిని కర్మ యందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తిభావముతో కర్మనొనరించును (కృష్ణభక్తి వృద్ది యగుటకు) వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలెను.
🌷. భాష్యము :
“వేదైశ్చ సర్వైరహమేవ వేద్య:” సమస్త వేదకర్మల అంతిమ ప్రయోజనమిదియే. వేదములందు తెలుపబడిన సర్వకర్మలు, సర్వయజ్ఞములు (లౌకిక కర్మలకు సంబంధించిన నిర్దేశములతో సహా) ఇతరములైన అన్ని విషయములు జీవితగమ్యమైన శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుట కొరకే ఉద్దేశింపబడియున్నవి. కాని బద్ధజీవులు ఇంద్రియభోగము కన్నను అన్యమైనది ఎరుగనందున అట్టి ప్రయోజనముకే వేదాధ్యయనమును గావింతురు. అయినను వేదకర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియభోగములచే మనుజుడు క్రమముగా కృష్ణభక్తిభావనా స్థాయికి చేరగలడు. కనుకనే కృష్ణభక్తిభావనాయుతుడు ఇతరుల కర్మల యందు లేదా అవగాహన యందు కలతకు కలిగించరాదు. దానికి బదులు ఏ విధముగా కర్మఫలమును శ్రీకృష్ణుని సేవకు అంకితము చేయవచ్చునో తెలియజేయురీతిలో అతడు కర్మ నొనరింపవలెను. అనగా ఇంద్రియభోగము కొరకై కర్మనొనరించు అజ్ఞాని వాస్తవమునకు ఏ విధముగా కర్మనొనరించవలెనో మరియు ఏ విధముగా వర్తించవలెనో తెలిసికొనగలిగే రీతిలో కృష్ణభక్తిభావనాయుతుడు వర్తింపవలెను. అజ్ఞానియైనవానిని వాని కర్మల యందు కలతపెట్టకుండుట సరియైనదే అయినను, కొద్దిగా కృష్ణభక్తిభావన కలిగినవానిని ఇతర వేదప్రక్రియలకై ఎదురు చూడక నేరుగా కృష్ణ సేవ యందు నియుక్తుని చేయవచ్చును. అటువంటి అదృష్టభాగుని వేదవిహిత కర్మల ననుసరింపవలసిన అవసరము ఏదియును లేదు. ఏలయన విధ్యుక్తధర్మ నిర్వాహణము ద్వారా కలుగు ఫలములన్నింటిని మనుజుడు కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలుచుట వలన సాధింపగలుగును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 133 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 26 🌴
26. na buddhi-bhedaṁ janayed
ajñānāṁ karma-saṅginām
joṣayet sarva-karmāṇi
vidvān yuktaḥ samācaran
🌷Translation :
So as not to disrupt the minds of ignorant men attached to the fruitive results of prescribed duties, a learned person should not induce them to stop work. Rather, by working in the spirit of devotion, he should engage them in all sorts of activities [for the gradual development of Kṛṣṇa consciousness].
🌷 Purport :
Vedaiś ca sarvair aham eva vedyaḥ. That is the end of all Vedic rituals. All rituals, all performances of sacrifices, and everything that is put into the Vedas, including all direction for material activities, are meant for understanding Kṛṣṇa, who is the ultimate goal of life. But because the conditioned souls do not know anything beyond sense gratification, they study the Vedas to that end. But through fruitive activities and sense gratification regulated by the Vedic rituals one is gradually elevated to Kṛṣṇa consciousness. Therefore a realized soul in Kṛṣṇa consciousness should not disturb others in their activities or understanding, but he should act by showing how the results of all work can be dedicated to the service of Kṛṣṇa. The learned Kṛṣṇa conscious person may act in such a way that the ignorant person working for sense gratification may learn how to act and how to behave. Although the ignorant man is not to be disturbed in his activities, a slightly developed Kṛṣṇa conscious person may directly be engaged in the service of the Lord without waiting for other Vedic formulas. For this fortunate man there is no need to follow the Vedic rituals, because by direct Kṛṣṇa consciousness one can have all the results one would otherwise derive from following one’s prescribed duties.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 22/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 134: 03వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 134: Chap. 03, Ver. 27
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 134 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 27 🌴
27. ప్రకృతే: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ: |
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||
🌷. తాత్పర్యం :
మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనాయుతుడు, భౌతికభావన యందున్నవాడు అను ఇరువురు వ్యక్తులు ఒకే స్థాయిలో కర్మనొనరించుచు ఒకే పదము నందున్నట్లుగా గోచరింతురు. కాని వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేష వ్యత్యాసమున్నది. భౌతికభావన యందున్నవాడు మిథ్యాహంకారము చేత తననే ప్రతిదానికి కర్తగా భావించును. దేహము ప్రకృతిచే సృష్టించ బడినదనియు మరియు అట్టి ప్రకృతి భగవానుని నిర్దేశము నందు వర్తించుననియు అతడు ఎరుగడు. అనగా అట్టి లౌకికుడు తాను అంత్యమున శ్రీకృష్ణభగవానుని అదుపులోనే ఉన్నాననెడి జ్ఞానమును కలిగియుండడు. మిథ్యాహంకారపూరితుడగు తాను స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు స్థూల, సూక్ష్మదేహములు రెండును భగవానుని ఆదేశానుసారము ప్రకృతిచే సృష్టింపబడినవనియు మరియు తన మానసికకర్మలు, దేహపరకర్మలన్నియును భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని సేవ యందు నియుక్తము కావలెననియు ఎరుగడు. అజ్ఞానియైనవాడు బహుకాలము తన ఇంద్రియములను ఇంద్రియభోగములందు దురుపయోగము కావించినందున శ్రీకృష్ణభగవానుడు హృషీకేశుడని (దేహేంద్రియములకు ప్రభువు) తెలిసికొనలేడు. అట్టివాడు శ్రీకృష్ణభగవానునితో గల నిత్య సంబంధమును మరపింపచేయు మిథ్యాహంకారముచే నిక్కముగా మోహపరవశుడైనట్టి వాడే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 134 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 27 🌴
27. prakṛteḥ kriyamāṇāni
guṇaiḥ karmāṇi sarvaśaḥ
ahaṅkāra-vimūḍhātmā
kartāham iti manyate
🌷Translation :
The spirit soul bewildered by the influence of false ego thinks himself the doer of activities that are in actuality carried out by the three modes of material nature.
🌷 Purport :
Two persons, one in Kṛiṣhṇa consciousness and the other in material consciousness, working on the same level, may appear to be working on the same platform, but there is a wide gulf of difference in their respective positions. The person in material consciousness is convinced by false ego that he is the doer of everything. He does not know that the mechanism of the body is produced by material nature, which works under the supervision of the Supreme Lord. The materialistic person has no knowledge that ultimately he is under the control of Kṛiṣhṇa. The person in false ego takes all credit for doing everything independently, and that is the symptom of his nescience. He does not know that this gross and subtle body is the creation of material nature, under the order of the Supreme Personality of Godhead, and as such his bodily and mental activities should be engaged in the service of Kṛṣṇa, in Kṛiṣṇa consciousness. The ignorant man forgets that the Supreme Personality of Godhead is known as Hṛṣīkeśa, or the master of the senses of the material body, for due to his long misuse of the senses in sense gratification, he is factually bewildered by the false ego, which makes him forget his eternal relationship with Kṛiṣhṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 23/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 135: 03వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 135: Chap. 03, Ver. 28
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 135 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 28 🌴
28. తత్వవిత్తు మాహాబాహో గుణకర్మవిభాగయో: |
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే ||
🌷. తాత్పర్యం :
ఓ మాహాబాహో! పరతత్త్వజ్ఞానము కలిగినవాడు భక్తియుతకర్మము మరియు కామ్యకర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి, ఇంద్రియములందును మరియు ఇంద్రియభోగములందును ఆసక్తుడు గాకుండును.
🌷. భాష్యము :
భాష్యము పరతత్త్వము నెరిగినవాడు భౌతిక సంపర్కములో తన హేయస్థితిని గుర్తింపగలుగును. తాను పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణుని అంశననియు మరియు తానూ భౌతికజగమునందు ఉండరాదనియు అతడెరుగును. నిత్యానంద జ్ఞానపూర్ణుడైన భగవానుని అంశగా తన నిజస్థితిని అతడు తెలిసికొనగలిగి ఏదియోనొక కారణము చేత జీవితపు భౌతికభావన యందు చిక్కుబడితినని అవగతము చేసికొనగలుగును. వాస్తవమునకు పరిశుద్ధస్థితి యందు అతడు తన కర్మములు నన్నింటిని శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవతో ముడివేయవలసియున్నది. కావున అతడు కృష్ణపరకర్మల యందు నియుక్తుడై సమయానుగుణములు మరియు తాత్కాలికములు అయిన ఇంద్రియకర్మల యెడ సహజముగా అసంగుడగును. అట్టివాడు భౌతికజీవనస్థితి భగవానుని ఆధీనమున ఉన్నటువంటిదని తెలిసి ఎట్టి కర్మఫలముల చేతను కలతనొందకుండును. పైగా వాటిని అతడు భగవత్కరుణగా భావించును. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనెడి మూడు తత్త్వములుగా పరతత్త్వము నెరిగినవాడు శ్రీమద్భాగవతము ననుసరించి “తత్త్వవిత్” యని పిలువబడును
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 135 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 28 🌴
28. tattva-vit tu mahā-bāho
guṇa-karma-vibhāgayoḥ
guṇā guṇeṣu vartanta
iti matvā na sajjate
🌷 Translation :
One who is in knowledge of the Absolute Truth, O mighty-armed, does not engage himself in the senses and sense gratification, knowing well the differences between work in devotion and work for fruitive results.
🌷 Purport :
The knower of the Absolute Truth is convinced of his awkward position in material association. He knows that he is part and parcel of the Supreme Personality of Godhead, Kṛṣṇa, and that his position should not be in the material creation. He knows his real identity as part and parcel of the Supreme, who is eternal bliss and knowledge, and he realizes that somehow or other he is entrapped in the material conception of life. In his pure state of existence he is meant to dovetail his activities in devotional service to the Supreme Personality of Godhead, Kṛṣṇa. He therefore engages himself in the activities of Kṛṣṇa consciousness and becomes naturally unattached to the activities of the material senses, which are all circumstantial and temporary. He knows that his material condition of life is under the supreme control of the Lord; consequently he is not disturbed by all kinds of material reactions, which he considers to be the mercy of the Lord. According to Śrīmad-Bhāgavatam, one who knows the Absolute Truth in three different features – namely Brahman, Paramātmā and the Supreme Personality of Godhead – is called tattva-vit, for he knows also his own factual position in relationship with the Supreme.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 24/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 136: 03వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 136: Chap. 03, Ver. 29
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 136 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 29 🌴
29. ప్రకృతేర్గుణసమ్మూఢా: సజ్జన్తే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ||
🌷. తాత్పర్యం :
ప్రకృతిగుణములచే మోహపరవశులైన మూఢులు భౌతికకర్మల యందు సంపూర్ణముగా నియుక్తులైన సంగత్వము నొందుదురు. కర్తయొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు.
🌷. భాష్యము :
జ్ఞానవిహీనులైన మనుజులు స్థూల భౌతికచైతన్యముతో తాదాత్మ్యము చెందియుండి భౌతికఉపాధుల భావనలో మునిగియుందురు. ఈ దేహము భౌతికప్రకృతి యొక్క వారము వంటిది. అట్టి దేహమునందు తాదాత్మ్యము చెందియుండువాడు మందుడు లేదా ఆత్మనెరుగని అలసుదని పిలువబడును. అజ్ఞానులైనవారు దేహమునే ఆత్మగా భావింతురు. అట్టివారు దేహమునకు సంబంధించినవారిని బంధువులుగా భావించును, జన్మనొసగిన స్థలమును పూజనీయస్థానముగా తలచుచు, ధర్మకార్యముల ఉద్దేశ్యము కేవలము నిర్వహించుట కొరకే యని భావింతురు. సాంఘికసేవ, జాతీయభావము, పరహితమును వాంచించుట యనునవి అట్టి భౌతికజగమునందు క్షణకాలమును తీరిక లేకుండా వర్తింతురు. వారికి ఆధ్యాత్మికానుభవము ఒక మిథ్య. కనుక వారు దాని యందు ఆసక్తిని కనబరచరు. అయినను ఆధ్యాత్మికజీవనమున జ్ఞానవికాసము నొందినవారు అట్టి విషయపూర్ణ చిత్తులను కలతపెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రశాంతముగా కొనసాగించవలెను. అట్టి మోహగ్రస్థ మానవులను అహింస మరియు లౌకిక ఉపకార కార్యముల వంటి ప్రాథమిక నీతిధర్మములందు నియుక్తులను చేయవచ్చును.
అజ్ఞానులైనవారు కృష్ణభక్తిభావన యందలి కర్మలను అర్థము చేసికొనజాలరు. కావున అట్టివారిని కలతపెట్టరాదనియు మరియు ఆ విధముగా విలువైన కాలమును వృథాపరుపరాదనియు శ్రీకృష్ణభగవానుడు మనకు ఉపదేశించుచున్నాడు. కాని ఆ భగవానుని ఉద్దేశము తెలిసియుండెడి కారణము భక్తులు అతని కన్నను అధిక కరుణను కలిగియుందురు. తత్కారణమున వారు మూఢులను కృష్ణపరకర్మల యందు నియుక్తులను చేయ యత్నించుట వంటి పలురకముల విపత్తులనైనను స్వీకరింతురు. అటువంటి కృష్ణపరకర్మలే మానవునకు అత్యంత అవసరములై యున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 136 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 29 🌴
29. prakṛter guṇa-sammūḍhāḥ
sajjante guṇa-karmasu
tān akṛtsna-vido mandān
kṛtsna-vin na vicālayet
🌷 Translation :
Bewildered by the modes of material nature, the ignorant fully engage themselves in material activities and become attached. But the wise should not unsettle them, although these duties are inferior due to the performers’ lack of knowledge.
🌷 Purport :
Persons who are unknowledgeable falsely identify with gross material consciousness and are full of material designations. This body is a gift of the material nature, and one who is too much attached to the bodily consciousness is called manda, or a lazy person without understanding of spirit soul. Ignorant men think of the body as the self; they accept bodily connections with others as kinsmanship, the land in which the body is obtained is their object of worship, and they consider the formalities of religious rituals to be ends in themselves. Social work, nationalism and altruism are some of the activities for such materially designated persons. Under the spell of such designations, they are always busy in the material field; for them spiritual realization is a myth, and so they are not interested. Those who are enlightened in spiritual life, however, should not try to agitate such materially engrossed persons. Better to prosecute one’s own spiritual activities silently. Such bewildered persons may be engaged in such primary moral principles of life as nonviolence and similar materially benevolent work.
Men who are ignorant cannot appreciate activities in Kṛṣṇa consciousness, and therefore Lord Kṛṣṇa advises us not to disturb them and simply waste valuable time. But the devotees of the Lord are more kind than the Lord because they understand the purpose of the Lord. Consequently they undertake all kinds of risks, even to the point of approaching ignorant men to try to engage them in the acts of Kṛṣṇa consciousness, which are absolutely necessary for the human being.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 25/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 137: 03వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 137: Chap. 03, Ver. 30
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 137 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 30 🌴
30. మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యా ధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర: ||
🌷. తాత్పర్యం :
కావున ఓ అర్జునా! నన్ను గూర్చిన సంపూర్ణజ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి, కర్మలనన్నింటిని నాకు అర్పించి మాంద్యమునకు వీడి యుద్ధము చేయుము.
🌷. భాష్యము :
శ్రీమద్భగవద్గీత యొక్క ప్రయోజనము ఈ శ్లోకము స్పష్టముగా తెలియజేయుచున్నది. సైనిక క్రమశిక్షణ వలె విధ్యుక్తధర్మములను నిర్వహించుటకు ప్రతియొక్కరు సంపూర్ణ కృష్ణభక్తిరసభావితులు కావలసియున్నదని శ్రీకృష్ణభగవానుడు భోధించుచున్నాడు. అటువంటి ఉత్తరువు విషయమును కొంత కష్టతరము కావించినను కృష్ణునిపై ఆధారపడి కర్మలను నిర్వహింపవలసియే యున్నది. ఏలయన అదియే జీవుని నిజస్థితియై యున్నది. జీవుని నిత్యమైన సహజస్థితి భగవానుని కోరికలకు లోబడియుండుట కావున అతడెన్నడును భగవానుని సహాయము లేకుండా స్వతంత్రునిగా ఆనదము ననుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుని మాదిరిగా శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతియొక్కరు భగవానుని అనుగ్రహము కొరకు సర్వమును త్యాగము చేయుటయే గాక విధ్యుక్తధర్మములను సైతము ఎటువంటి యజమానిత్వము లేకుండా నిర్వహింపవలసియున్నది. అర్జునుడు ఇచ్చట భగవానుని ఆజ్ఞను గూర్చి చింతింప నవసరము లేదు. కేవలము దాని అమలు పరచిన చాలును. శ్రీకృష్ణభగవానుడు సర్వాత్మలకు అత్మయైనవాడు. కనుక స్వంతభావన ఏమాత్రము లేకుండా ఆ పరమపురుషును పైననే సంపూర్ణముగా ఆధారపడెడివాడు (అనగా కృష్ణభక్తిరసభావితుడు) “ఆధ్యాతిమికచేతనుడు” అని పిలువబడును. “నిరాశీ:” అనగా ప్రభువు ఆజ్ఞమేరకు వర్తించుచు, కర్మఫలములను కోరనివాడని భావము. ధనమును లెక్కించు గుమస్తా తన యజమాని కొరకు లక్షలాదిరూపాయలను లెక్కించినను ఒక్క పైసా పైనను యజమానిత్వమును చూపడు. అదేవిధముగా ఈ జగమునందు ఏదియును ఒక వ్యక్తికి చెందినది కాదని ప్రతియొక్కరు అవగతము చేసికొనవలెను. ప్రతిదియు శ్రీకృష్ణభగవానునిదే. “మయి (నా యందు)” పదమునకు భావమిదియే. అట్టి కృష్ణభక్తిభావన యందు పనిచేయువాడు నిక్కముగా దేనిపైనను మమత్వమును చూపడు. అట్టి భావనయే “నిర్మమత్వభావనము”(ఏదియును నాదికాదు) అనబడును. నామమాత్ర బదువుల యెడ గల బంధుత్వ కారణమున అట్టి కటిన ఉత్తరువును పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దానిని శీఘ్రమే త్యజించవలెను. ఆ విధముననే మనుజుడు “విగతజ్వరుడు” (అలసత్వము లేనివాడు) కాగలడు. ప్రతియొక్కడు తన గుణము మరియు స్థితి ననుసరించి ఒక ప్రత్యేకమైన కర్మనొనరింప వలసియుండును. పైన తెలిపిన విధముగా అట్టి విధ్యుక్తధర్మములను కృష్ణభక్తిభావనలో నిర్వహింపవలెను. అది మనుజుని ముక్తి పథమునకు నడిపించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 137 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 30 🌴
30. mayi sarvāṇi karmāṇi
sannyasyādhyātma-cetasā
nirāśīr nirmamo bhūtvā
yudhyasva vigata-jvaraḥ
🌷 Translation :
Therefore, O Arjuna, surrendering all your works unto Me, with full knowledge of Me, without desires for profit, with no claims to proprietorship, and free from lethargy, fight.
🌷 Purport :
This verse clearly indicates the purpose of the Bhagavad-gītā. The Lord instructs that one has to become fully Kṛṣṇa conscious to discharge duties, as if in military discipline. Such an injunction may make things a little difficult; nevertheless duties must be carried out, with dependence on Kṛṣṇa, because that is the constitutional position of the living entity. The living entity cannot be happy independent of the cooperation of the Supreme Lord, because the eternal constitutional position of the living entity is to become subordinate to the desires of the Lord. Arjuna was therefore ordered by Śrī Kṛṣṇa to fight as if the Lord were his military commander. One has to sacrifice everything for the good will of the Supreme Lord, and at the same time discharge prescribed duties without claiming proprietorship. Arjuna did not have to consider the order of the Lord; he had only to execute His order. The Supreme Lord is the soul of all souls; therefore, one who depends solely and wholly on the Supreme Soul without personal consideration, or in other words, one who is fully Kṛṣṇa conscious, is called adhyātma-cetās. Nirāśīḥ means that one has to act on the order of the master but should not expect fruitive results.
The cashier may count millions of dollars for his employer, but he does not claim a cent for himself. Similarly, one has to realize that nothing in the world belongs to any individual person, but that everything belongs to the Supreme Lord. That is the real purport of mayi, or “unto Me.” And when one acts in such Kṛṣṇa consciousness, certainly he does not claim proprietorship over anything. This consciousness is called nirmama, or “nothing is mine.” And if there is any reluctance to execute such a stern order, which is without consideration of so-called kinsmen in the bodily relationship, that reluctance should be thrown off; in this way one may become vigata-jvara, or without feverish mentality or lethargy. Everyone, according to his quality and position, has a particular type of work to discharge, and all such duties may be discharged in Kṛṣṇa consciousness, as described above. That will lead one to the path of liberation.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 26/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 138: 03వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 138: Chap. 03, Ver. 31
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 138 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 31 🌴
31. యే యే మతమిదం నిత్యమనుతష్టన్తి మానవా: |
శ్రద్ధావన్తో(నసూయన్తో ముచ్యన్తే తే(పి కర్మభి: ||
🌷. తాత్పర్యం :
నా అజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించువారు కామ్యకర్మబంధముల నుండి విడివడగలరు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని ఆదేశము వేదజ్ఞానపు సారమై యున్నందున ఎటువంటి మినహాయింపు లేకుండా నిత్యసత్యమై యున్నది. వేదములు నిత్యమైనట్లు కృష్ణభక్తిభావన యందలి ఈ సత్యము కూడా నిత్యమై యున్నది. కనుక శ్రీకృష్ణభగవానుని యెడ అసూయరహితులై ప్రతియొక్కరు ఈ ఆదేశమునందు శ్రద్ధను కలిగియుండవలెను. శ్రీకృష్ణుని యందు శ్రద్దాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానములు వ్రాయు తత్త్వవేత్తలు పెక్కురు గలరు. అట్టివారు ఏనాడును కామ్యకర్మబంధము నుండి ముక్తిని పొందజాలరు. కాని భగవానుని నిత్య ఆజ్ఞలపై సంపూర్ణశ్రద్ధను కలిగియున్న సామన్యవ్యక్తి అట్టి ఆజ్ఞను పాటింప సమర్థుడు కాకపోయినను కర్మబంధము నుండి ముక్తిని పొందగలడు. భగవదాజ్ఞల నన్నింటిని అనుసరించుట కృష్ణభక్తిభావన యందలి ఆరంభస్థితిలో సాధ్యము కాకపోవచ్చును. కాని ఆ నియమము నెడ ద్వేషమును చూపక అపజయము మరియు నిరాశల చింత వీడి మనుజుడు శ్రద్ధతో కర్మనొనరించినిచో నిక్కముగా కృష్ణభక్తిభావనాస్థితికి ఉద్ధరింపబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 138 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 31 🌴
31. ye me matam idaṁ nityam
anutiṣṭhanti mānavāḥ
śraddhāvanto ’nasūyanto
mucyante te ’pi karmabhiḥ
🌷 Translation :
Those persons who execute their duties according to My injunctions and who follow this teaching faithfully, without envy, become free from the bondage of fruitive actions.
🌷 Purport :
The injunction of the Supreme Personality of Godhead, Kṛṣṇa, is the essence of all Vedic wisdom and therefore is eternally true without exception. As the Vedas are eternal, so this truth of Kṛṣṇa consciousness is also eternal. One should have firm faith in this injunction, without envying the Lord. There are many philosophers who write comments on the Bhagavad-gītā but have no faith in Kṛṣṇa. They will never be liberated from the bondage of fruitive action. But an ordinary man with firm faith in the eternal injunctions of the Lord, even though unable to execute such orders, becomes liberated from the bondage of the law of karma. In the beginning of Kṛṣṇa consciousness, one may not fully discharge the injunctions of the Lord, but because one is not resentful of this principle and works sincerely without consideration of defeat and hopelessness, he will surely be promoted to the stage of pure Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 27/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 139: 03వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 139: Chap. 03, Ver. 32
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 139 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 32 🌴
32. యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్టన్తి మే మతమ్ |
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతస: ||
🌷. తాత్పర్యం :
కాని అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపనివారలు జ్ఞానరహితులుగను, మూడులుగను, పూర్ణత్వమును పొందు యత్నములో నాశము నొందినవారిగను భావింపబడుదురు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనను పొందకపోవుట యందలి దోషము ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అత్యున్నత అధికారి ఆజ్ఞ యెడ అవిధేయతకు శిక్ష తప్పనిసరియైనట్లు,దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞ యెడ అవిధేయతకు సైతము శిక్ష తప్పనిసరిగా లభించును. అట్టి అవిధేయుడు ఎంతటి గొప్పవాడైనను తన రిక్త హృదయము కారణముగా తనను గూర్చి మరియు పరబ్రహ్మము, పరమాత్మ, భగవానులను గూర్చు జ్ఞానరహితుడై యుండును. కావున అతడు జీవనపూర్ణత్వమును పొందుటకు అవకాశమే ఉండదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 139 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 32 🌴
32. ye tv etad abhyasūyanto
nānutiṣṭhanti me matam
sarva-jñāna-vimūḍhāṁs tān
viddhi naṣṭān acetasaḥ
🌷 Translation :
But those who, out of envy, disregard these teachings and do not follow them regularly are to be considered bereft of all knowledge, befooled, and ruined in their endeavors for perfection.
🌷 Purport :
The flaw of not being Kṛṣṇa conscious is clearly stated herein. As there is punishment for disobedience to the order of the supreme executive head, so there is certainly punishment for disobedience to the order of the Supreme Personality of Godhead. A disobedient person, however great he may be, is ignorant of his own self, and of the Supreme Brahman, Paramātmā and the Personality of Godhead, due to a vacant heart. Therefore there is no hope of perfection of life for him.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 28/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 140: 03వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 140: Chap. 03, Ver. 33
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 140 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 33 🌴
33. సదృశం చేష్టతే స్వస్యా: ప్రకృతేర్ జ్ఞానవానపి |
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహ: కిం కరిష్యతి ||
🌷. తాత్పర్యం :
జ్ఞానవంతుడైన మనుజుడు సైతము తన గుణముల ననుసరించియే కర్మ నొనరించును. ఏలయన ప్రతియొక్కరు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి యెడ నిగ్రహమేమి చేయగలదు?
🌷. భాష్యము :
సప్తమాధ్యాయమున (7.14) శ్రీకృష్ణుభగవానుడు నిర్ధారించిన రీతి మనుజుడు సంపూర్ణ కృష్ణభక్తిభావన యనెడి అధ్యాత్మికస్థితి యందు నెలకొననిదే భౌతికప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి ముక్తిని పొందలేడు. కావున లౌకికభావనలో గొప్ప విధ్వాంసుడని పెరోందనివానికి సైతము కేవలము సిద్ధాంతమాత్ర జ్ఞానముచే (ఆత్మను దేహమునకు అన్యముగా గాంచుట) మాయబంధము నుండి ముక్తిని పొందుట సాధ్యము కాదు. జ్ఞానమునందు పురోగతి నొందినవానిగా పైకి ప్రదర్శనము గావించుచు అంతరమున సంపూర్ణముగా గుణములకు లోబడి వాటిని జయింపలేని నామమాత్ర ఆధ్యాత్మికవాదులు పెక్కురు గలరు. మనుజుడు విద్యాజ్ఞానసంపన్నుడైనను చిరకాల భౌతికప్రకృతి సాహచర్యముచే బద్దుడై యుండును. మనుజుడు తన భౌతికస్థితి ననుసరించి వివిధకర్మలలో నియుక్తుడై యున్నను భౌతికబంధము నుండి ముక్తినోన్డుతకు కృష్ణభక్తిరసభావనము సహాయపడగలదు. కావున సంపూర్ణముగా కృష్ణభక్తిభావనాయుతులు కానిదే ఎవ్వరును విధ్యుక్తధర్మములను త్యజింపరాదు. అనగా విధ్యక్తధర్మములను తొందరపాటుగా త్యజించి నామమాత్ర యోగిగా లేదా కృత్రిమ ఆధ్యాత్మికునిగా నగుటకు ఎవ్వరును యత్నింపరాదు. మనుజుడు తానున్న స్థితి యందే నిలిచి, ఉన్నత శిక్షణలో కృష్ణభక్తిని పొందుటకు యత్నించుట ఉత్తమమైన విధానము. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని మయాబంధము నుండి విడుదలను పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 140 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 33 🌴
33. sadṛśaṁ ceṣṭate svasyāḥ
prakṛter jñānavān api
prakṛtiṁ yānti bhūtāni
nigrahaḥ kiṁ kariṣyati
🌷 Translation :
Even a man of knowledge acts according to his own nature, for everyone follows the nature he has acquired from the three modes. What can repression accomplish?
🌷 Purport :
Unless one is situated on the transcendental platform of Kṛṣṇa consciousness, he cannot get free from the influence of the modes of material nature, as it is confirmed by the Lord in the Seventh Chapter (7.14).
Therefore, even for the most highly educated person on the mundane plane, it is impossible to get out of the entanglement of māyā simply by theoretical knowledge, or by separating the soul from the body. There are many so-called spiritualists who outwardly pose as advanced in the science but inwardly or privately are completely under particular modes of nature which they are unable to surpass.
Academically, one may be very learned, but because of his long association with material nature, he is in bondage. Kṛṣṇa consciousness helps one to get out of the material entanglement, even though one may be engaged in his prescribed duties in terms of material existence. Therefore, without being fully in Kṛṣṇa consciousness, one should not give up his occupational duties. No one should suddenly give up his prescribed duties and become a so-called yogī or transcendentalist artificially. It is better to be situated in one’s position and to try to attain Kṛṣṇa consciousness under superior training. Thus one may be freed from the clutches of Kṛṣṇa’s māyā.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 29/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 141: 03వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 141: Chap. 03, Ver. 34
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 141 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 34 🌴
34. ఇన్ద్రియ స్యెన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపన్తినౌ ||
🌷. తాత్పర్యం :
ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల యెడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి గావున వాటికి ఎవ్వరును వశము కాకూడదు.
🌷. భాష్యము :
భాష్యము కృష్ణభక్తిరసభావన యందున్నవారు ఇంద్రియభోగముల యెడ సహజముగా విముఖులై యుందురు. అటువంటి దివ్యభావన లేనివారు శాస్త్రములలో తెలుపబడిన విధినియమములను తప్పక అనుసరింపవలసియుండును. విచ్చలవడి భోగానుభవము భౌతికబంధము కలిగించగలదు. కాని శాస్త్రములందు తెలుపబడిన విధినియమములను పాటించువారు ఇంద్రియార్థములచే బంధింపబడరు. ఉదాహరణకు మైథునభోగమనునది బద్ధజీవునకు అత్యంత అవసరమైనది. అట్టి సుఖము వివాహము ద్వారా ఆమోదింపబడినది. భార్యతో తప్ప ఇతర స్త్రీలతో లైంగియభోగమునందు పాల్గొనరాదనీ శాస్త్రములు తెలుపుచున్నవి. పరస్త్రీని తల్లిగా భావించవలెను. అటువంటి ఆదేశములు ఉన్నప్పటికిని మనుజుడు ఇతర స్త్రీలతో అక్రమసంబంధమును పొందగోరును. అటువంటి భావములను సంపూర్ణముగా నశింపజేయవలెను. లేనిచో అవి ఆత్మానుభవమార్గమున గొప్ప ఆటమకములు కాగలవు. దేహమున్నంత కాలము దేహావసరవములు తప్పవు కనుక వానిని నియమనిబంధనల ననుసరించి గ్రహించవలెను. అయినను ఆ నియమముల పైన కూడా పూర్తిగా ఆధారపడరాదు. కేవలము సంగరహితులమై వాటిని మనము అనుసరింపవలెను. ఏలయన విదినియమముల ప్రకారము పొందబడు ఇంద్రియభోగము సైతము కొన్నిమార్లు మనుజుని తప్పుద్రోవను పట్టించు ప్రమాదము కలదు. రాజమార్గమునందు కూడా ప్రమాదము ఒనగూడు అవకాశముండుననెడి విషయము తెలిసినదే కదా! రాజమార్గములు చక్కాగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినను, వాటిపై ఎట్టి ప్రమాదములు జరుగవని ఎవ్వరును హామీ నొసగలేరు. భౌతికసంపర్క కారణమున భోగవాంఛ అనంతకాలము నుండి వచ్చుచున్నది. కావున ఇంద్రియభోగము నియమితమైనప్పటికిని మనుజుడు పతనము నొందుట ఆస్కారము కలదు. అందుచే విధినియమానుసార ఇంద్రియభోగము సైతము త్యజించవలసియున్నది. కృష్ణభక్తిభావన యందు ఆసక్తి(కృష్ణుని ప్రేమపూర్వకసేవ) అన్నివిధములైన ఇంద్రియభోగకర్మల యెడ విముఖతను కలిగించును. కావున జీవితపు ఏ స్థితి యందును అట్టి కృష్ణభక్తిభావనము నుండి విడివడుటకు ఎవ్వరును యత్నించరాదు. అంత్యమున కృష్ణభక్తిరసభావనాస్థితిలో నెలకొనుటయే సర్వవిధములైన ఇంద్రియభోగముల నుండి విడివడుట యందలి పూర్ణప్రయోజనమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 141 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 34 🌴
34. indriyasyendriyasyārthe
rāga-dveṣau vyavasthitau
tayor na vaśam āgacchet
tau hy asya paripanthinau
🌷 Translation :
There are principles to regulate attachment and aversion pertaining to the senses and their objects. One should not come under the control of such attachment and aversion, because they are stumbling blocks on the path of self-realization.
🌷 Purport :
Those who are in Kṛṣṇa consciousness are naturally reluctant to engage in material sense gratification. But those who are not in such consciousness should follow the rules and regulations of the revealed scriptures. Unrestricted sense enjoyment is the cause of material encagement, but one who follows the rules and regulations of the revealed scriptures does not become entangled by the sense objects. For example, sex enjoyment is a necessity for the conditioned soul, and sex enjoyment is allowed under the license of marriage ties. According to scriptural injunctions, one is forbidden to engage in sex relationships with any women other than one’s wife. All other women are to be considered as one’s mother. But in spite of such injunctions, a man is still inclined to have sex relationships with other women. These propensities are to be curbed; otherwise they will be stumbling blocks on the path of self-realization. As long as the material body is there, the necessities of the material body are allowed, but under rules and regulations. And yet, we should not rely upon the control of such allowances.
One has to follow those rules and regulations, unattached to them, because practice of sense gratification under regulations may also lead one to go astray – as much as there is always the chance of an accident, even on the royal roads. Although they may be very carefully maintained, no one can guarantee that there will be no danger even on the safest road. The sense enjoyment spirit has been current a very long, long time, owing to material association. Therefore, in spite of regulated sense enjoyment, there is every chance of falling down; therefore any attachment for regulated sense enjoyment must also be avoided by all means. But attachment to Kṛṣṇa consciousness, or acting always in the loving service of Kṛṣṇa, detaches one from all kinds of sensory activities. Therefore, no one should try to be detached from Kṛṣṇa consciousness at any stage of life. The whole purpose of detachment from all kinds of sense attachment is ultimately to become situated on the platform of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 30/Sep/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 142: 03వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 142: Chap. 03, Ver. 35
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 142 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 35 🌴
35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: ||
🌷. తాత్పర్యం :
పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!
🌷. భాష్యము :
ప్రతియొక్కరు పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణభక్తిభావన యందు తమ విధ్యుక్తధర్మములను నిర్వహింపవలసియున్నది. భౌతికప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములో మనుజుని స్థితి ననుసరించి విధింపబడిన ధర్మములే విధ్యుక్తధర్మములు. ఇక శ్రీకృష్ణుని దివ్య సేవార్థమే ఆధ్యాత్మికగురువుచే ఒసగబడిన కర్మలు ఆధ్యాత్మికకర్మలు. భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను మరణము వరకు ప్రతియొక్కరు పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విధ్యుక్తధర్మములను నిర్వహింపవలసియున్నది. ఆధ్యాత్మికస్థాయిలో ఒనరింపబడు కర్మలు మరియు భౌతికస్థాయిలో ఒనరింపబడు కర్మలు భిన్నమైనను ప్రామాణికమైన నిర్దేశమును అనుసరించుట కర్తకు సర్వదా లాభదాయకము. గుణప్రభావము నందున్న మనుజుడు ఇతరులను అనుకరింప తన స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటింపవలెను. ఉదాహరణకు సత్వగుణము నందుండెడి బ్రాహ్మణుడు అహింసాపరుడుగా నుండును. కాని రజోగుణము నందుండెడి క్షత్రియుడు హింసాపూర్ణుడగుటకు ఆమోదయోగ్యమైనది. క్షత్రియుడైనవానికి హింసకు సంబధించిన నియమముల ననుసరించి నశించుట యనునది అహింసాపరుడైన బ్రహ్మణుని అనుకరించుట కన్నను ఉత్తమమైనది. ప్రతియొక్కరు తమ హృదయకల్మషము క్రమవిధానము ద్వారా శుద్ధిపరచుకొనవలెనే గాని తొందరపాటుతో కాదు. అయినను గుణసంపర్కమును దాటి సంపూర్ణముగా కృష్ణభక్తిరసభావన యందు స్థితుడైన పిమ్మట మనుజుడు గురునిర్దేశములో ఎట్టి కర్మమునైనను ఒనరింప సమర్థుడగును. అట్టి సంపూర్ణ కృష్ణభక్తిభావనా స్థితి యందు క్షత్రియడు బ్రాహ్మణునిగా వర్తించవచ్చును. అలాగుననే బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించవచ్చును. అనగా అట్టి దివ్య ఆధ్యాత్మికస్థితి యందు భౌతికజగమునకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తిమ్పావు. ఉదాహరణమునకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడైనను పిదప బ్రాహ్మణునిగా వర్తించెను. కాని పరశురాముడు బ్రాహ్మణుడైనను తదుపరి క్షత్రియునిగా వర్తించెను. ఆధ్యాత్మికస్థితి యందు నెలకొనినందునే వారు ఆ విధముగా చేయగలిగిరి. కాని భౌతికపరిధిలో ఉన్నంతవరకు మనుజుడు గుణము ననుసరించి యున్న తన కర్మలనే ఒనరింపవలెను. ఆ విధముగా ఒనర్చుచునే అతడు పూర్ణ కృష్ణభక్తిభావనను కలిగియుండవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 142 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 35 🌴
35. śreyān sva-dharmo viguṇaḥ
para-dharmāt sv-anuṣṭhitāt
sva-dharme nidhanaṁ śreyaḥ
para-dharmo bhayāvahaḥ
🌷 Translation :
It is far better to discharge one’s prescribed duties, even though faultily, than another’s duties perfectly. Destruction in the course of performing one’s own duty is better than engaging in another’s duties, for to follow another’s path is dangerous.
🌷 Purport :
One should therefore discharge his prescribed duties in full Kṛṣṇa consciousness rather than those prescribed for others. Materially, prescribed duties are duties enjoined according to one’s psychophysical condition, under the spell of the modes of material nature. Spiritual duties are as ordered by the spiritual master for the transcendental service of Kṛṣṇa. But whether material or spiritual, one should stick to his prescribed duties even up to death, rather than imitate another’s prescribed duties. Duties on the spiritual platform and duties on the material platform may be different, but the principle of following the authorized direction is always good for the performer. When one is under the spell of the modes of material nature, one should follow the prescribed rules for his particular situation and should not imitate others. For example, a brāhmaṇa, who is in the mode of goodness, is nonviolent, whereas a kṣatriya, who is in the mode of passion, is allowed to be violent. As such, for a kṣatriya it is better to be vanquished following the rules of violence than to imitate a brāhmaṇa who follows the principles of nonviolence.
Everyone has to cleanse his heart by a gradual process, not abruptly. However, when one transcends the modes of material nature and is fully situated in Kṛṣṇa consciousness, he can perform anything and everything under the direction of a bona fide spiritual master. In that complete stage of Kṛṣṇa consciousness, the kṣatriya may act as a brāhmaṇa, or a brāhmaṇa may act as a kṣatriya. In the transcendental stage, the distinctions of the material world do not apply. For example, Viśvāmitra was originally a kṣatriya, but later on he acted as a brāhmaṇa, whereas Paraśurāma was a brāhmaṇa but later on he acted as a kṣatriya. Being transcendentally situated, they could do so; but as long as one is on the material platform, he must perform his duties according to the modes of material nature. At the same time, he must have a full sense of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 01/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 143: 03వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 143: Chap. 03, Ver. 36
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 143 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 36 🌴
36. అర్జున ఉవాచ
అథ కేన ప్రయుక్తో(యం పాపం చరతి పూరుష: |
అనిచ్ఛన్నపి వార్ ష్ణేయ బలాదిన నియోజిత: ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను : ఓ వృష్ణివంశసంజాతుడా! అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైనవాని వలె మనుజుడు దేనిచే పాపకర్మలను చేయుట యందు ప్రేరేపింపబడుచున్నాడు?
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశగా జీవుడు ఆదిలో అధ్యాత్మికుడు, పవిత్రుడు, భౌతికకల్మషరాహిత్యుడు అయియుండెను. అనగా స్వభావరీత్యా అతడు భౌతికజగమునకు సంబంధించన పాపములకు అతీతుడై యున్నాడు. కాని ప్రకృతి సంగత్వము కలుగగనే అతడు ఎటువంటి సంకోచము లేకుండా వివిధములైన పాపకర్మలయందు మగ్నుడగుచున్నాడు. కొన్నిమార్లు అతడు తన అభిప్రాయమునకు భిన్నముగను వర్తించి అట్టి పాపమును చేయుచుండును. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచిన ప్రశ్న జీవుల వికృత స్వభావమునాకు తగినదియై ఆలోచనాపూర్ణముగా నున్నది. జీవుల కొన్నిమార్లు పాపము చేయ కోరకున్నను బలవంతముగా వారు దాని యందు వర్తింపబడుదురు. తరువాతి శ్లోకములో భగవానునిచే వివరింపబడినట్లు అట్టి పాపకర్మలు అంతరమందున్న పరమాత్మునిచే కాక వేరుకారణములచే ప్రేరేపింపబడుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 143 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 36 🌴
36. arjuna uvāca
atha kena prayukto ’yaṁ
pāpaṁ carati pūruṣaḥ
anicchann api vārṣṇeya
balād iva niyojitaḥ
🌷 Translation :
Arjuna said: O descendant of Vṛṣṇi, by what is one impelled to sinful acts, even unwillingly, as if engaged by force?
🌷 Purport :
A living entity, as part and parcel of the Supreme, is originally spiritual, pure, and free from all material contaminations. Therefore, by nature he is not subject to the sins of the material world. But when he is in contact with the material nature, he acts in many sinful ways without hesitation, and sometimes even against his will. As such, Arjuna’s question to Kṛṣṇa is very sanguine, as to the perverted nature of the living entities. Although the living entity sometimes does not want to act in sin, he is still forced to act. Sinful actions are not, however, impelled by the Supersoul within, but are due to another cause, as the Lord explains in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 02/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 144: 03వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 144: Chap. 03, Ver. 37
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 144 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 37 🌴
37. శ్రీభగవానువాచ
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవ: |
మహాశనో మాహాపాప్మా విద్ద్యేనమిహ వైరిణమ్ ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : అర్జునా! రజోగుణసంపర్కముచే ఉద్భవించి, తదుపరి క్రోధముగా పరిణమించి కామమే దానికి కారణము. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును కబళించునట్టి పాపభూయిష్ట శత్రువు.
🌷. భాష్యము :
జీవుడు భౌతికసంపర్కమును పొందినంతనే కృష్ణుని యెడ గల అతని నిత్యప్రేమ రజోగుణము వలన కామముగా మార్పుచెందును. అనగా పుల్లని చింతపండుతో కలసినంతనే పాలు పెరుగుగా మారునట్లు, భగవత్ప్రేమ భావము కామముగా మార్పు చెందుచున్నది. ఆ కామము సంతృప్తి చెందినచో శీఘ్రమే కోపముగా మార్పుచెందును. అటుపిమ్మట కోపము మోహముగా మార్పునొందును. ఆ మొహమే జీవుని భౌతికస్థితిని అనంతముగా కొనసాగించును. అనగా కామమే జీవునకు గొప్ప శత్రువై యున్నది. అదియే పవిత్రుడైన జీవుడు భౌతికజగమున బద్దునిగా నిలుచునట్లు చేయుచున్నది. క్రోధము రజోగుణమునకు మారురూపము. ఈ గుణములు ఈ విధముగా క్రోధము మరియ తజ్జన్యములైన వానిగా ప్రకటితమగుచుండును. కనుక నిర్దేశింపబడిన జీవనవిధానము మరియు కర్మము ద్వారా రజోగుణము తమోగునముగా పతనము చెందుట బదులు సత్త్వగుణమునకు ఉద్ధరింపబడినచో మనుజుడు ఆధ్యాత్మిక సంపర్క కారణమున క్రోధము యొక్క పతనము నుండి రక్షింపబడును.
అనవతరము వృద్ధిచెందెడి తన ఆధ్యాత్మికానందము కొరకు భగవానుడు బహురూపములుగా విస్తరించెను. జీవులు అట్టి ఆధ్యాత్మికానందపు అంశలు. వారు కూడా పాక్షికమైన స్వతంత్రను కలిగియున్నారు. కాని సేవాభావము భోగవాంఛగా మారి వారి స్వాతంత్ర్యము దుర్వినియోగామైనపుడు వారు కామము యొక్క వశములోనికి వత్తురు. బద్ధజీవులు ఈ కామభావనలను సంతృప్తిపరచుకొనుట కొరకే భగవానుడు ఈ భౌతికజగత్తును సృష్టించెను. అట్టి అనంత కామభోగపు కర్మలలో పూర్తిగా విసుగుచెంది, హతాశయులైనపుడు వారు తమ నిజస్థితిని గూర్చి ప్రశ్నించుట(విచారణను) నారభించుతురు.
ఆ విచారణయే వేదాంతసూత్రముల ఆరంభమై యున్నది. అట్టి ఆరంభమందు “అథాతో బ్రహ్మ జిజ్ఞాసా” అని చెప్పబడినది. అనగా ప్రతియొక్కరు పరమపురుషుని గూర్చి విచారణ కావింపవలెను.ఆ పరమపురుషుడు “జన్మాద్యశ్చయతో(న్వయాదితరతశ్చ” యని నిర్వచింపబడినాడు. అనగా సర్వసృష్టికి పరబ్రహ్మమే కారణము. కావున కామమునకు సైతము మూలము పరమపురుషుని యందే కలదు. కావున ఒకవేళ అట్టి కామము భగత్ప్రేమగా(కృష్ణభక్తిరసభావనలోనికి లేదా కృష్ణుని కొరకే సర్వమును వాంచించుట యను భావనలోనికి) మార్పు చెందినచో కామక్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. శ్రీరామచంద్రుని బంటైన హనుమంతుడు రావణుని సువర్ణనగరము దహించుట ద్వారా తన క్రోధమును ప్రదర్శించెను. ఆ విధమైన కార్యముచే అతడు గొప్ప రామభక్తునిగా కీర్తినొందెను. ఇచ్చట భగవద్గీత యందు కుడా శ్రీకృష్ణభగవానుడు తన ప్రీత్యర్థమై క్రోధమును శత్రువులపై చూపుమని అర్జునిని ప్రేరేపించుచున్నాడు. అనగా కామక్రోధములను కృష్ణభక్తిభావన యందు నియోగించినచో అవి శత్రువులుగా కాక మన మిత్రువులుగా మారగాలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 144 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 37 🌴
37. śrī-bhagavān uvāca
kāma eṣa krodha eṣa
rajo-guṇa-samudbhavaḥ
mahāśano mahā-pāpmā
viddhy enam iha vairiṇam
🌷 Translation :
The Supreme Personality of Godhead said: It is lust only, Arjuna, which is born of contact with the material mode of passion and later transformed into wrath, and which is the all-devouring sinful enemy of this world.
🌷 Purport :
When a living entity comes in contact with the material creation, his eternal love for Kṛṣṇa is transformed into lust, in association with the mode of passion. Or, in other words, the sense of love of God becomes transformed into lust, as milk in contact with sour tamarind is transformed into yogurt. Then again, when lust is unsatisfied, it turns into wrath; wrath is transformed into illusion, and illusion continues the material existence. Therefore, lust is the greatest enemy of the living entity, and it is lust only which induces the pure living entity to remain entangled in the material world. Wrath is the manifestation of the mode of ignorance; these modes exhibit themselves as wrath and other corollaries. If, therefore, the mode of passion, instead of being degraded into the mode of ignorance, is elevated to the mode of goodness by the prescribed method of living and acting, then one can be saved from the degradation of wrath by spiritual attachment.
The Supreme Personality of Godhead expanded Himself into many for His ever-increasing spiritual bliss, and the living entities are parts and parcels of this spiritual bliss. They also have partial independence, but by misuse of their independence, when the service attitude is transformed into the propensity for sense enjoyment, they come under the sway of lust. This material creation is created by the Lord to give facility to the conditioned souls to fulfill these lustful propensities, and when completely baffled by prolonged lustful activities, the living entities begin to inquire about their real position.
This inquiry is the beginning of the Vedānta-sūtras, wherein it is said, athāto brahma-jijñāsā: one should inquire into the Supreme. And the Supreme is defined in Śrīmad-Bhāgavatam as janmādy asya yato ’nvayād itarataś ca, or, “The origin of everything is the Supreme Brahman.” Therefore the origin of lust is also in the Supreme. If, therefore, lust is transformed into love for the Supreme, or transformed into Kṛṣṇa consciousness – or, in other words, desiring everything for Kṛṣṇa – then both lust and wrath can be spiritualized. Hanumān, the great servitor of Lord Rāma, exhibited his wrath by burning the golden city of Rāvaṇa, but by doing so he became the greatest devotee of the Lord. Here also, in Bhagavad-gītā, the Lord induces Arjuna to engage his wrath upon his enemies for the satisfaction of the Lord. Therefore, lust and wrath, when they are employed in Kṛṣṇa consciousness, become our friends instead of our enemies.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 03/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 145: 03వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 145: Chap. 03, Ver. 38
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 145 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 38 🌴
38. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ||
🌷. తాత్పర్యం :
పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామము యొక్క వివిధ దశలచే జీవుడు కప్పుడియుండును.
🌷. భాష్యము :
జీవుని శుద్ధచైతన్యమును మరుగుపరచు ఆవరణదశలు మూడు కలవు. ఆ ఆవరణయే కామము. అదియే అగ్ని యందలి పొగ, అద్దము పై నుండెడి ధూళి మరియు గర్భము పైని మావి వలె వివిధరూపములలో నుండును. కామము పొగచే పోల్చినపుడు జీవుడనెడి అగ్ని అతికొద్దిగా అనుభూతమగునని అవగతము చేసికొనవచ్చును. అనగా జీవుడు కృష్ణభక్తిభావనను కొద్దిగా ప్రదర్శించునపుడు పొగ చేత కప్పబడిన అగ్నిని పోలియుండును. పొగ ఉన్నచోట అగ్నియున్నను ప్రారంభదశలో అగ్ని ప్రదర్శితము కాక గుప్తముగా నుండును. ఈ స్థితిని కృష్ణభక్తిరసభావన యందలి తొలిదశతో పోల్చవచ్చును. అద్దము పైన గల ధూళి వివిధములైన ఆధ్యాత్మికపద్దతుల ద్వారా మనోదర్పణ మాలిన్యమును తొలగించు విధానమును సూచించును. దాని కొరకు హరినామసంకీర్తనమే అత్యుత్తమమైన మార్గము. మావి చేత గర్భము కప్పబడియుండుట అనెడి ఉపమానము నిస్సహాయస్థితిని సూచించును. ఏలయన మావి యందు శిశువు నిస్సహాయస్థితిలో కదలలేకయుండును. ఇట్టి జీవనస్థితి వృక్షములకు అన్వయింపవచ్చును. వృక్షములు సైతము జీవులే. కాని అత్యధిక కామమును వారు ప్రదర్శించియుండుటచే అట్టి దాదాపు చేతనారహిత జీవనస్థితిని పొందిరి. ధూళి చేత అద్ధము కప్పబడిన ఉపమానము పక్షులకు మరియు జంతువులకు అన్యయింపవచ్చును. మానవజన్మలో జీవుడు కృష్ణభక్తిరసభావనను జాగృతము చేసికొనగలడు. దాని యందు అతడు పురోగమించినచో ఆధ్యాత్మికజీవనమనెడి అగ్ని రగుల్కొనగలదు. తదుపరి పొగను జాగ్రత్తగా నివారించినచో అగ్నిని ప్రజ్వలింపచేయ వచ్చును. కావుననే ఈ మానవజన్మ భవబంధముల నుండి తప్పించుకొనుటకు జీవునకు ఒక చక్కని అవకాశమై యున్నది. అట్టి మానవజన్మ యందు సమర్థవంతమైన మార్గదర్శకత్వమున కృష్ణభక్తిభావనను అలవరచుకొనుట ద్వారా ఎవ్వరైనను కామమనెడి శత్రువును జయింపగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 145 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 38 🌴
38. dhūmenāvriyate vahnir
yathādarśo malena ca
yatholbenāvṛto garbhas
tathā tenedam āvṛtam
🌷 Translation :
As fire is covered by smoke, as a mirror is covered by dust, or as the embryo is covered by the womb, the living entity is similarly covered by different degrees of this lust.
🌷 Purport :
There are three degrees of covering of the living entity by which his pure consciousness is obscured. This covering is but lust under different manifestations like smoke in the fire, dust on the mirror, and the womb about the embryo. When lust is compared to smoke, it is understood that the fire of the living spark can be a little perceived. In other words, when the living entity exhibits his Kṛṣṇa consciousness slightly, he may be likened to the fire covered by smoke. Although fire is necessary where there is smoke, there is no overt manifestation of fire in the early stage. This stage is like the beginning of Kṛṣṇa consciousness. The dust on the mirror refers to a cleansing process of the mirror of the mind by so many spiritual methods. The best process is to chant the holy names of the Lord. The embryo covered by the womb is an analogy illustrating a helpless position, for the child in the womb is so helpless that he cannot even move. This stage of living condition can be compared to that of the trees. The trees are also living entities, but they have been put in such a condition of life by such a great exhibition of lust that they are almost void of all consciousness. The covered mirror is compared to the birds and beasts, and the smoke-covered fire is compared to the human being. In the form of a human being, the living entity may revive a little Kṛṣṇa consciousness, and, if he makes further development, the fire of spiritual life can be kindled in the human form of life. By careful handling of the smoke in the fire, fire can be made to blaze. Therefore the human form of life is a chance for the living entity to escape the entanglement of material existence. In the human form of life, one can conquer the enemy, lust, by cultivation of Kṛṣṇa consciousness under able guidance.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 04/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 146: 03వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 146: Chap. 03, Ver. 39
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 146 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 39 🌴
39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కొన్తేయ దుష్పురేణానలేన చ ||
🌷. తాత్పర్యం :
ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధచైతన్యము ఎన్నడును తృప్తి చెందనిదియు మరయు అగ్ని వలె దహించుచునదియైన కామమనెడి నిత్యవైరిచే ఆవరింపబడును.
🌷. భాష్యము :
ఇంధనముచే అగ్ని ఆర్పబడనట్లు, ఎంతటి భోగానుభవము చేతను కామము సంతృప్తి చెందదని మనుస్మృతి యందు తెలుపబడినది. ఈ భౌతికజగమునందు సర్వకర్మలకు మూలము మైథునభోగమై యున్నది. కనుకనే ఈ జగము “మైథునాగారము” లేక మైథునభోగ బంధమని పిలువబడును. కారాగారమునందు నేరస్థులు బంధింపబడినట్లు భగవానుని ఆజ్ఞలను ఉల్లఘించినవారు మైథునభోగము ద్వారా బంధింపబడుదురు. ఇంద్రియభోగమునే పరమావధిగా భావించుచు సాధించెడి నాగరికత యొక్క పురోగతియనగా భౌతికత్వమున జీవుడు నిలిచియుండవలసిన కాలపరిమితి పొడగించుటనియే భావము. అనగా అజ్ఞానమునకు చిహ్నమైన కామమే జీవుని భౌతికజగమునందు బంధించుచున్నది. ఇంద్రియభోగము ననుభవించునప్పుడు సుఖభావనము కొద్దిగా కలిగినను వాస్తవమునకు అట్టి నామమాత్ర సుఖభావనను ఇంద్రియభోగికి నిత్యశత్రువై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 146 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 39 🌴
39. āvṛtaṁ jñānam etena
jñānino nitya-vairiṇā
kāma-rūpeṇa kaunteya
duṣpūreṇānalena ca
🌷 Translation :
Thus the wise living entity’s pure consciousness becomes covered by his eternal enemy in the form of lust, which is never satisfied and which burns like fire.
🌷 Purport :
It is said in the Manu-smṛti that lust cannot be satisfied by any amount of sense enjoyment, just as fire is never extinguished by a constant supply of fuel. In the material world, the center of all activities is sex, and thus this material world is called maithunya-āgāra, or the shackles of sex life. In the ordinary prison house, criminals are kept within bars; similarly, the criminals who are disobedient to the laws of the Lord are shackled by sex life.
Advancement of material civilization on the basis of sense gratification means increasing the duration of the material existence of a living entity. Therefore, this lust is the symbol of ignorance by which the living entity is kept within the material world. While one enjoys sense gratification, it may be that there is some feeling of happiness, but actually that so-called feeling of happiness is the ultimate enemy of the sense enjoyer.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 05/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 147: 03వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 147: Chap. 03, Ver. 40
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 147 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 40 🌴
40. ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే |
ఎతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ||
🌷. తాత్పర్యం :
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యనునవి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజజ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును.
🌷. భాష్యము :
బద్ధజీవుని దేహమందలి వివిధ ముఖ్యస్థానములను శత్రువు ఆక్రమించియున్నాడు. అట్టి శత్రువును జయింపగోరువారు అతడు ఎచ్చట కనుగొనబడునో తెలియుట కొరకు శ్రీకృష్ణభగవానుడు ఆయా స్థానములను గూర్చి తెలుపుచున్నాడు. మనస్సు ఇంద్రియముల కర్మలన్నింటిని మూలము కావున ఇంద్రియార్థముల గూర్చి వినినంతనే ఇంద్రియభోగాభిలాషలకు మనస్సు నిలయమగును. తత్పలితముగా మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు ఆశ్రయమగును. తదుపరి బుద్ధి అట్టి కామభావనలకు కేంద్రమగును. బుద్ధి ఆత్మ యొక్క పొరుగున ఉన్నటువంటిది. కామపూర్ణమైన బుద్ధి యనునది ఆత్మ మిథ్యాహంకారమును పొంది, భౌతికభావనలో ఇంద్రియ, మనస్స్సులతో తాదాత్మ్యము చెందునట్లుగా ప్రభావితము చేయును. తద్ద్వారా జీవాత్మ ఇంద్రియసుఖములకు అలవాటుపడి అదియే నిజ సుఖమణి భ్రమపడును.జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతము (10.84.13) నందు చక్కగా వివరింపబడినది.
యస్యాత్మ బుద్ధి: కుణపే త్రిదాతుకే
స్వధీ: కలత్రాదిషు భౌమ ఇజ్యధీ: |
యత్తీర్థబుద్ధి: సలిలే న కర్హచిత్
జనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖర: ||
“త్రిధాతులతో తయారు చేయబడిన దేహమును ఆత్మను, దేహము నుండి కలిగినవారిని బంధువులుగను, జన్మభూమిని పూజస్థానముగాను, తీర్థస్థానమున కేగుట అధ్యాత్మికజ్ఞానపూర్ణులగు మహాత్ములను కలిసికొనుటకు గాక స్నానమాచరించు ప్రయోజనముగను భావించు మనుజుడు గార్ధభము లేక గోవుగా భావింపబడును.”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 147 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 40 🌴
40. indriyāṇi mano buddhir
asyādhiṣṭhānam ucyate
etair vimohayaty eṣa
jñānam āvṛtya dehinam
🌷 Translation :
The senses, the mind and the intelligence are the sitting places of this lust. Through them lust covers the real knowledge of the living entity and bewilders him.
🌷 Purport :
The enemy has captured different strategic positions in the body of the conditioned soul, and therefore Lord Kṛṣṇa is giving hints of those places, so that one who wants to conquer the enemy may know where he can be found. Mind is the center of all the activities of the senses, and thus when we hear about sense objects the mind generally becomes a reservoir of all ideas of sense gratification; and, as a result, the mind and the senses become the repositories of lust. Next, the intelligence department becomes the capital of such lustful propensities. Intelligence is the immediate next-door neighbor of the spirit soul. Lusty intelligence influences the spirit soul to acquire the false ego and identify itself with matter, and thus with the mind and senses. The spirit soul becomes addicted to enjoying the material senses and mistakes this as true happiness. This false identification of the spirit soul is very nicely explained in the Śrīmad-Bhāgavatam (10.84.13):
yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke | sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ | yat-tīrtha-buddhiḥ salile na karhicij
janeṣv abhijñeṣu sa eva go-kharaḥ
“A human being who identifies this body made of three elements with his self, who considers the by-products of the body to be his kinsmen, who considers the land of birth worshipable, and who goes to the place of pilgrimage simply to take a bath rather than meet men of transcendental knowledge there is to be considered like an ass or a cow.”
🌹 🌹 🌹 🌹 🌹
Date: 06/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 148: 03వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 148: Chap. 03, Ver. 41
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 148 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 41 🌴
41. తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ||
🌷. తాత్పర్యం :
కావున భరతవంశీయులలో శ్రేష్టుడవైన ఓ అర్జునా! ఇంద్రియనిగ్రహము ద్వారా పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి, జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి అద్దానిని నశింపజేయుము.
🌷. భాష్యము :
ఆత్మకు సంబంధించిన విజ్ఞానము మరియు ఆత్మానుభవమును పొందు వాంఛను నశింపజేయునటువంటి గొప్ప పాపశత్రువైన కామమును నశింపజేయుటకు తొలినుండియే ఇంద్రియములను నిగ్రహింపుమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు. ఇచ్చట జ్ఞానమనగా అనాత్మకు భిన్నమైన ఆత్మజ్ఞానము. అనగా ఆత్మ దేహము కాదని తెలుపునటువంటి జ్ఞానము. ఇక విజ్ఞానమనగా ఆత్మ యొక్క నిజస్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధమును తెలుపునటువంటిది. ఈ విషయము శ్రీమద్భాగవతము (2.9.31) నందు ఇట్లు తెలుపబడినది.
జ్ఞానమ్ పరమగుహ్యమ్ మే యద్విజ్ఞాన సమన్వితమ్ |
సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా ||
“ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము అతిగుహ్యము మరియు గహనమై యున్నది. కాని అట్టి జ్ఞానమును మరియు అనుభూతిని వాటి వివిధ అంశములతో భగవానుడే స్వయముగా వివరించినచో అవగతము కాగలవు.” ఆత్మను గూర్చిన అట్టి సాధారణ మరియు ప్రత్యేక జ్ఞానమును భగవద్గీత మనకు ఒసగుచున్నది. జీవులు వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుని అంశలైనందున అతనిని సేవించుటకే వారు ఉద్దేశింపబడియున్నారు. అట్టి సేవాభావనమే కృష్ణభక్తిరసభావానము. కావున జీవితము తొలినుండియే ప్రతియొక్కరు కృష్ణభక్తిభావన నలవరచుకొనుటకు యత్నించవలెను. తద్ద్వారా వారు సంపూర్ణ కృష్ణభక్తిభావితులై తదనుగుణముగా వర్తించగలరు.
ప్రతిజీవునకు సహజమైనటువంటి భగవత్ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కామము. కాని మనుజుడు ఆది నుండియే కృష్ణభక్తిభావన యందు శిక్షణ గరుపబడినచో అతని సహజ భగవత్ప్రేమ కామముగా పతనము చెందదు. భగవత్ప్రేమ కామముగా పతనము చెందినపుడు తిరిగి సహజ స్థితికి చేరగలుగుట అతికష్టము కాగలదు. ఏదయేమైనను కృష్ణభక్తిరసభావన మాత్రము అత్యంత శక్తివంతమైనది. జీవితమున భక్తిని ఆలస్యముగా ఆరంభించినవాడు సైతము భక్తియోగమునందలి నియమములను అనుసరించుట ద్వారా కృష్ణుని ప్రేమించువాడు కాగలడు. కనుక జీవితపు ఏ స్థితి నుండైనను లేదా జీవితలక్ష్యము తెలిసిన తోడనే ప్రతియొక్కరు కృష్ణభక్తిభావన యందు (భక్తియోగము నందు) ఇంద్రియములను అదుపు చేయుట నారంభించి కామమును శ్రీకృష్ణభగవానుని ప్రేమగా మార్చవచ్చును. అట్టి కృష్ణప్రేమయే మానవజీవితము నందలి అత్యున్నత పూర్ణత్వస్థితియై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 148 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 41 🌴
41. tasmāt tvam indriyāṇy ādau
niyamya bharatarṣabha
pāpmānaṁ prajahi hy enaṁ
jñāna-vijñāna-nāśanam
🌷 Translation :
Therefore, O Arjuna, best of the Bhāratas, in the very beginning curb this great symbol of sin [lust] by regulating the senses, and slay this destroyer of knowledge and self-realization.
🌷 Purport :
The Lord advised Arjuna to regulate the senses from the very beginning so that he could curb the greatest sinful enemy, lust, which destroys the urge for self-realization and specific knowledge of the self. Jñāna refers to knowledge of self as distinguished from non-self, or in other words, knowledge that the spirit soul is not the body. Vijñāna refers to specific knowledge of the spirit soul’s constitutional position and his relationship to the Supreme Soul. It is explained thus in the Śrīmad-Bhāgavatam (2.9.31):
jñānaṁ parama-guhyaṁ me
yad vijñāna-samanvitam
sa-rahasyaṁ tad-aṅgaṁ ca
gṛhāṇa gaditaṁ mayā
“The knowledge of the self and Supreme Self is very confidential and mysterious, but such knowledge and specific realization can be understood if explained with their various aspects by the Lord Himself.” Bhagavad-gītā gives us that general and specific knowledge of the self. The living entities are parts and parcels of the Lord, and therefore they are simply meant to serve the Lord. This consciousness is called Kṛṣṇa consciousness. So, from the very beginning of life one has to learn this Kṛṣṇa consciousness, and thereby one may become fully Kṛṣṇa conscious and act accordingly.
Lust is only the perverted reflection of the love of God which is natural for every living entity. But if one is educated in Kṛṣṇa consciousness from the very beginning, that natural love of God cannot deteriorate into lust.
When love of God deteriorates into lust, it is very difficult to return to the normal condition. Nonetheless, Kṛṣṇa consciousness is so powerful that even a late beginner can become a lover of God by following the regulative principles of devotional service. So, from any stage of life, or from the time of understanding its urgency, one can begin regulating the senses in Kṛṣṇa consciousness, devotional service of the Lord, and turn the lust into love of Godhead – the highest perfectional stage of human life.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 07/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 149: 03వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 149: Chap. 03, Ver. 42
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 149 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 42 🌴
42. ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్య: పరం మన: |
మనస్తు పరా బుద్ధిర్యో బుద్ధే: పరతస్తు స: ||
🌷. తాత్పర్యం :
జడపదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు; ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము; మనస్సు కన్నను బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము.
🌷. భాష్యము :
ఇంద్రియములు కామము యొక్క కర్మలకు వివిధ ద్వారములై యున్నవి. అనగా దేహమునందు నిలిచియుండెడి కామము వివిధములైన ఇంద్రియముల ద్వారా బహిర్గతమగుచుండును. కనుక దేహము కన్నను ఇంద్రియములు శ్రేష్టములై యున్నవి. కాని కృష్ణభక్తిరసభావనము (ఉత్తమచైతన్యము) కలిగినప్పడు ఇంద్రియములు కామము బహిర్గతమగుటకు ఉపయోగింపబడవు. కృష్ణభక్తిభావన యందు ఆత్మ భగవానునితో ప్రత్యక్షసంబంధమును ఏర్పరచుకొనును గావున ఇచ్చట తెలుపబడిన దేహకర్మాది సర్వవిషయములు అంత్యమున పరమాత్మ యందే ముగియును. దేహకర్మ యనగా ఇంద్రియకర్మ గనుక ఇంద్రియములను నిరోధించుట యనగా దేహకర్మలను ఆపివేయుట యని భావము. కాని మనస్సు క్రియాశీలత కలిగియున్నందున దేహము ఎట్టి కర్మను చేయక నిశ్చలముగా నున్నను ఉన్నతమైనది బుద్ధి మరియు ఆ బుద్ధి కన్నను ఉన్నతమైనదే ఆత్మ. కనుక ఒకవేళ ఆత్మను ప్రత్యక్షముగా శ్రీకృష్ణభగవానుని సంబంధమును నిలిపినచో బుద్ధి, మనస్సు, ఇంద్రియములనునవి వాటంతట అవియే అప్రయత్నముగా భగవత్సేవలో నియుక్తములగును. ఇటువంటి విషయమే కఠోపనిషత్తునందు ఒక చోట చెప్పబడినది. దాని ప్రకారము ఇంద్రియార్థములు ఇంద్రియముల కన్నను ఉత్తమములు కాగా, మనస్సు ఇంద్రియార్థముల కన్నను ఉత్తమమై యున్నది. కావున ఒకవేళ మనస్సు భగవానుని సేవలో నిత్యము నిలిచియున్నచో ఇంద్రియములు ఇతర మార్గములందు నియుక్తమగుటకు అవకాశముండదు. ఇట్టి మానసికస్థితి పూర్వమే వివరింప బడినది. “పరమ దృష్ట్వా నివర్తతే”. అనగా మనస్సును శ్రీకృష్ణభగవానుని దివ్యమైన సేవలో నిలిపినచో అది ఇతర హీనప్రవృత్తులను కలిగియుండు అవకాశముండదు. కఠోపనుషత్తునందు ఆత్మ “మహాన్”(ఘనమైనది) అని వర్ణింపబడినది. అనగా ఇంద్రియార్థములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కన్నను ఆత్మ ఘనమైనది. కనుక ఆత్మ యొక్క నిజస్థితిని ప్రత్యక్షముగా అవగతము చేసికొనుటయే సమస్యాపరిష్కారమునకు మార్గమై యున్నది.
బుద్ధి చేత మనుజుడు ఆత్మ యొక్క నిజస్థితిని తెలిసికొని, మనస్సును సదా కృష్ణభక్తిరసభావన యందు నిలుపవలెను. అది సమస్యలన్నింటిని సంపూర్ణముగా పరిష్కరింపగలదు. ఇంద్రియార్థముల నుండి దూరముగా నుండుమని ప్రారంభదశలో నున్న సాధకునికి సాధారణముగా ఉపదేశింపబడును. కాని దానితో పాటుగా అతడు బుద్ధిచే మనస్సును దృడపరచుకొనవలెను. శ్రీకృష్ణభగవానుని యందు సంపూర్ణ శరణాగతితో మనుజుడు బుద్ధి నుపయోగించి తన మనస్సును కృష్ణభక్తిభావన యందు నిలిపినచో అతని మనస్సు అప్రయత్నముగా దృడవంతమగును. అట్టి స్థితిలో సర్పముల వలె బలమైన ఇంద్రియములకు ఆత్మ ప్రభువైనను భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని సాహచర్యమునందు అది దృడము కానిచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందు అవకాశము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 149 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 42 🌴
42. indriyāṇi parāṇy āhur
indriyebhyaḥ paraṁ manaḥ
manasas tu parā buddhir
yo buddheḥ paratas tu saḥ
🌷 Translation :
The working senses are superior to dull matter; mind is higher than the senses; intelligence is still higher than the mind; and he [the soul] is even higher than the intelligence.
🌷 Purport :
The senses are different outlets for the activities of lust. Lust is reserved within the body, but it is given vent through the senses. Therefore, the senses are superior to the body as a whole. These outlets are not in use when there is superior consciousness, or Kṛṣṇa consciousness. In Kṛṣṇa consciousness the soul makes direct connection with the Supreme Personality of Godhead; therefore the hierarchy of bodily functions, as described here, ultimately ends in the Supreme Soul. Bodily action means the functions of the senses, and stopping the senses means stopping all bodily actions. But since the mind is active, then even though the body may be silent and at rest, the mind will act – as it does during dreaming. But above the mind is the determination of the intelligence, and above the intelligence is the soul proper.
If, therefore, the soul is directly engaged with the Supreme, naturally all other subordinates, namely, the intelligence, mind and senses, will be automatically engaged. In the Kaṭha Upaniṣad there is a similar passage, in which it is said that the objects of sense gratification are superior to the senses, and mind is superior to the sense objects.
If, therefore, the mind is directly engaged in the service of the Lord constantly, then there is no chance that the senses will become engaged in other ways. This mental attitude has already been explained. Paraṁ dṛṣṭvā nivartate. If the mind is engaged in the transcendental service of the Lord, there is no chance of its being engaged in the lower propensities. In the Kaṭha Upaniṣad the soul has been described as mahān, the great. Therefore the soul is above all – namely, the sense objects, the senses, the mind and the intelligence. Therefore, directly understanding the constitutional position of the soul is the solution of the whole problem.
With intelligence one has to seek out the constitutional position of the soul and then engage the mind always in Kṛṣṇa consciousness. That solves the whole problem. A neophyte spiritualist is generally advised to keep aloof from the objects of the senses. But aside from that, one has to strengthen the mind by use of intelligence. If by intelligence one engages one’s mind in Kṛṣṇa consciousness, by complete surrender unto the Supreme Personality of Godhead, then, automatically, the mind becomes stronger, and even though the senses are very strong, like serpents, they will be no more effective than serpents with broken fangs. But even though the soul is the master of intelligence and mind, and the senses also, still, unless it is strengthened by association with Kṛṣṇa in Kṛṣṇa consciousness, there is every chance of falling down due to the agitated mind.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 08/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 150: 03వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 150: Chap. 03, Ver. 43
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 150 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 43 🌴
43. ఏవం బుద్ధే: పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |
జహి శత్రుం మాహాబాహో కామరూపం దురాసదమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ గొప్పబాహువులు గల అర్జునా! ఈ విధముగా తనను ఇంద్రియ, మనోబుద్ధులకు పరమైనవానిగా తెలిసికొని, ఆధ్యాత్మిక బుద్ధిచే (కృష్ణభక్తిరసభావానము) మనస్సును స్థిరపరచి, ఆ విధముగా ఆధ్యాత్మికబలముచే మనుజుడు కామమనెడి ఈ దుర్జయమైన శత్రువును జయింపవలెను.
🌷. భాష్యము :
మానవుడు నిర్విశేష శున్యమును చరమలక్ష్యముగా భావింపక తనను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా గుర్తించి కృష్ణభక్తిరసభావనను అవలంబించవలెనని భగవద్గీత యందలి ఈ తృతీయాధ్యాయము నిర్దేశించుచున్నది. భౌతికజీవనస్థితి యందు ప్రతియొక్కరు కామవాంఛను మరియు ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెనను కోరికను కలిగియుందురు. అటువంటి ఇంద్రియభోగవాంఛ మరియు స్వామిత్వ భావనయే బద్ధజీవునకు గొప్ప శత్రువై యున్నది. కాని కృష్ణభక్తి యనెడి బలము ద్వారా మనుజుడు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, అదుపు చేయగలడు. అనగా చేయు కర్మను మరియు విధ్యుక్తధర్మమును ఎవ్వరును హటాత్తుగా త్యజింపవలసిన అవసరము లేదు. కృష్ణభక్తిరసభావనను క్రమముగా వృద్ధిపరచుకొనుచు మనో, ఇంద్రియములచే ప్రభావితము కానటువంటి అధ్యాతిమికస్థితి యందు మనుజుడు నెలకొనగలడు. పవిత్రతను సాధించుట కొరకై యత్నించెడి స్థిరబుద్ధి ద్వారా అది సాధ్యపడగలదు. ఇదియే ఈ అధ్యాయపు సంపూర్ణ సారాంశము. అపరిపక్వ భౌతికజీవనస్థితిలో తాత్వికకల్పనలు మరియు నామమాత్ర యోగము ద్వారా ఇంద్రియనిరోధము వంటివి మనుజుని ఆధ్యాత్మికజీవనమునకు తోడ్పడజాలవు. కనుక అతడు ఉన్నతబుద్ధి ద్వారా కృష్ణభక్తిరసభావన యందు సుశిక్షితుడు కావాలసియున్నది.
శ్రీమద్భగవద్గీత యందలి “కర్మయోగము” లేదా “కృష్ణభక్తి భావన యందు విధ్యుక్తధర్మనిర్వహణము” అను తృతీయాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 150 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 43 🌴
43. evaṁ buddheḥ paraṁ buddhvā
saṁstabhyātmānam ātmanā
jahi śatruṁ mahā-bāho
kāma-rūpaṁ durāsadam
🌷 Translation :
Thus knowing oneself to be transcendental to the material senses, mind and intelligence, O mighty-armed Arjuna, one should steady the mind by deliberate spiritual intelligence [Kṛṣṇa consciousness] and thus – by spiritual strength – conquer this insatiable enemy known as lust.
🌷 Purport :
This Third Chapter of the Bhagavad-gītā is conclusively directive to Kṛṣṇa consciousness by knowing oneself as the eternal servitor of the Supreme Personality of Godhead, without considering impersonal voidness the ultimate end. In the material existence of life, one is certainly influenced by propensities for lust and desire for dominating the resources of material nature. Desire for overlording and for sense gratification is the greatest enemy of the conditioned soul; but by the strength of Kṛṣṇa consciousness, one can control the material senses, the mind and the intelligence. One may not give up work and prescribed duties all of a sudden; but by gradually developing Kṛṣṇa consciousness, one can be situated in a transcendental position without being influenced by the material senses and the mind – by steady intelligence directed toward one’s pure identity. This is the sum total of this chapter. In the immature stage of material existence, philosophical speculations and artificial attempts to control the senses by the so-called practice of yogic postures can never help a man toward spiritual life. He must be trained in Kṛṣṇa consciousness by higher intelligence.
Thus end the Bhaktivedanta Purports to the Third Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Karma-yoga, or the Discharge of One’s Prescribed Duty in Kṛṣṇa Consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 09/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 151: 04వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 151: Chap. 04, Ver. 01
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 151 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 01 🌴
01. శ్రీభగవానువాచ
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్ ||
🌷. తాత్పర్యం :
దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను; మొదట ఈ జ్ఞానము సూర్యునికి (మానవునికి భగవానునితో గల సంబంధ విజ్ఞానము) ఉపదేశించితిని. ఆ వివస్వానుడు (సూర్యుడు) మానవులకు తండ్రియైన వైవస్వతమనువునకు చెప్పెను. మనువు ఇక్ష్వాకురాజునకు చెప్పెను.
🌷. భాష్యము :
సూర్యలోకము మొదలుగా సర్వలోకములందలి రాజవంశములకు శ్రీమద్భగవద్గీతాజ్ఞానము ప్రాచీనకాలము నుండియే ఉపదేశించబడినదనెడి దాని చరిత్ర ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. సర్వలోకరాజులు తమ ప్రజలకు రక్షణణమును కల్పించుటకే ప్రత్యేకముగా నిర్దేశింపబడియున్నారు. కనుక ప్రజలను చక్కగా పాలించి వారిని కామబంధము నుండి రక్షించుటకు రాజవంశమువారు భగవద్గీతాజ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసికొనవలసిన అవసరమున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని నిత్య సంబంధములో ఆధ్యాత్మికజ్ఞానమును సంపాదించుటకే మానవజన్మ ఉద్దేశింపబడినది. ఈ సందేశమును ప్రజలకు విద్య, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయుట సర్వదేశ, లోకపాలకుల బాధ్యాతయైయున్నది. అనగా జనుల శ్రేయస్సు కొరకు రాజులు ఈ కృష్ణసంబంధ విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలసియున్నది. తద్ద్వారా జనులు ఈ ఘనమైన శాస్త్రపు లాభమును బడసి, జయప్రదమైన మార్గమున పయనించి లభించిన మానవజన్మను సద్వినియోగపరచుకొనగలరు.
ఈ కల్పమునందు సూర్యదేవుడు వివస్వానునిగా పిలువబడును. ఆ సూర్యుడే గ్రహమండలమందలి సర్వగ్రహములకు మూలము. బ్రహ్మసంహిత (5.52) యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
యచ్చక్షు రేష సవితా సకలగ్రహాణామ్
రాజా సమస్తసురమూర్తిర శేష తేజా: |
యస్యాజ్ఞయా భ్రమతి సంభ్రుతకాలచక్రో
గోవిందం ఆదిపురుషం తమహం భజామి ||
“ఏ ఆదిపురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధికశక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవదేవుడైన గోవిందుని(శ్రీకృష్ణుని) నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాసించును, అతని ఆజ్ఞలకు లోబడి తన కక్ష్య యందు పరిభ్రమించుచుండును” అని బ్రహ్మదేవుడు స్తుతించెను.
సూర్యుడే సమస్తగ్రహములకు రాజై యున్నాడు. గ్రహములన్నింటికిని ఉష్ణమును మరియు వెలుగును ప్రదానము చేయుచు వాటిని నియమించెడి సూర్యమండలమును సూర్యదేవుడు(ప్రస్తుత నామము వివస్వానుడు) పాలించును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ననుసరించి తన కక్ష్యలో పరిభ్రమించుచుండును. శ్రీకృష్ణభగవానుడు తొలుత వివస్వానునే ప్రథమశిష్యునిగా స్వీకరించి గీతాజ్ఞానమును భోదించెను. అనగా గీత అనాదికాలము నుండి వచ్చుచున్న ప్రామాణికశాస్త్ర గ్రంథమే గాని, అప్రధానులైన లౌకికపండితుల కొరకు ఉద్దేశింపబడిన ఊహాకల్పిత గ్రంథము కాదు.
మాహాభారతము (శాంతిపర్వము 348.51-52) నందు గీత యొక్క చరిత్రను ఈ క్రింది విధముగా మనము కనుగొనవచ్చును.
త్రేతాయుగాదౌ చ తతో వివస్వాన్ మనవే దదౌ |
మనుశ్చ లోకబృత్యర్థం సుతాయేక్ష్వాకవే దదౌ ||
ఇక్ష్వాకుణా చ కథితో వ్యాప్య లోకానవస్థిత: ||
“భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ జ్ఞానము త్రేతాయుగారంభమున వివస్వానునిచే మనువునకు భోధింపబడినది. మానవులకు తండ్రియై యున్నందున మనువు దానిని తన కుమారుడును, భూమండలమునకు రాజును మరియు శ్రీరామచంద్రుడు ఉద్భవించిన రఘువంశము యొక్క మూలపురుషుడును అగు మాహారాజు ఇక్ష్వాకునకు ఒసెగెను.” అనగా గీతాజ్ఞానము ఇక్ష్వాకుమహారాజు కాలము నుండియే మానవసంఘమునందు నెలకొనియున్నది.
నాలుగులక్షల ముప్పదిరెండువేల సంవత్సరముల (4,32,000) కాలపరిమితి గల కలియుగములో ప్రస్తుతము వరకు కేవలము ఐదువేల సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపరయుగము (8,00,000 సంవత్సరములు), దానికి పరువము త్రేతాయుగము (1,200,000 సంవత్సరములు) గడచియున్నవి. అనగా దాదాపు 2,005,000 సంవత్సరములకు పూర్వము మనువు తన శిష్యుడును మరియు భూమండలమునకు రాజును అగు ఇక్ష్వాకునకు ఈ గీతాజ్ఞానమును భోధించెను. ప్రస్తుత మనువు యొక్క ఆయు:పరిమితి 305,300,000 ససంవత్సరములు. అందులో 120,400,000 సంవత్సరముసంవత్సరములు మాత్రమే గడిచియున్నవి. గీతాజ్ఞానము మనువు యొక్క జన్మమునకు పూర్వమే శిష్యుడైన వివస్వానునికి (సూర్యదేవునకు) శ్రీకృష్ణభగవానునిచే తెలుపబడిన విషయము బట్టి దాదాపు 12,04,00,000 ససంవత్సరములకు పూర్వమే ఇది ఉపదేశించబడినదని స్థూలముగా అంచనా వేయవచ్చును. అదే జ్ఞానము మానవసంఘమున దాదాపు ఇరువదిలక్షల సంవత్సరములుగా వ్యాప్తియందున్నది. శ్రీకృష్ణభగవానునిచే అర్జునునకు ఐదువేల సంవత్సరముల క్రిందట అదియే తిరిగి చెప్పబడినది. గీత ప్రకారము మరియు గీతను బోధించిన శ్రీకృష్ణభగవానుని ప్రకారము ఇదియే భగవద్గీత యొక్క స్థూలచరిత్రము.
వివస్వానుడు స్వయముగా అయియున్నందున అతనికి ఈ భగవద్గీతా జ్ఞానము తెలుపబడినది. వేదసదృశమైన ఈ గీతాజ్ఞానము శ్రీకృష్ణభగవానునిచే స్వయముగా తెలుపబడియున్నందున “అపౌరుషేయము”(మనవాతీతము) అయియున్నది. కనుక మానవకల్పిత వివరణలు లేకుండా వేదములను అంగీకరించినట్లు గీతాజ్ఞానమును సైతము ఎటుంటి లౌకికవివరణలు లేకుండా యథాతథముగా స్వీకరింపవలసియున్నది. లౌకికవిద్వాంసులు గీతాజ్ఞానమును తమకు తోచిన విధముగా ఊహింపవచ్చును గాని అది ఎన్నటికిని భగవద్గీత యథాతథము కాజాలదు. కనుక భగవద్గీత యథాతథముగా గురుపరంపరలో స్వీకరింపవలెను. అట్టి దివ్యజ్ఞానమును శ్రీకృష్ణభగవానుడు తొలుత సూర్యదేవుని బోధింపగా, సూర్యుడు తన తనయుడైన మనువునకు, పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించినట్లుగా ఇచ్చట వర్ణింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 151 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 01 🌴
01. śrī-bhagavān uvāca
imaṁ vivasvate yogaṁ
proktavān aham avyayam
vivasvān manave prāha
manur ikṣvākave ’bravīt
🌷 Translation :
The Personality of Godhead, Lord Śrī Kṛṣṇa, said: I instructed this imperishable science of yoga to the sun-god, Vivasvān, and Vivasvān instructed it to Manu, the father of mankind, and Manu in turn instructed it to Ikṣvāku.
🌷 Purport :
Herein we find the history of the Bhagavad-gītā traced from a remote time when it was delivered to the royal order of all planets, beginning from the sun planet. The kings of all planets are especially meant for the protection of the inhabitants, and therefore the royal order should understand the science of Bhagavad-gītā in order to be able to rule the citizens and protect them from material bondage to lust. Human life is meant for cultivation of spiritual knowledge, in eternal relationship with the Supreme Personality of Godhead, and the executive heads of all states and all planets are obliged to impart this lesson to the citizens by education, culture and devotion. In other words, the executive heads of all states are intended to spread the science of Kṛṣṇa consciousness so that the people may take advantage of this great science and pursue a successful path, utilizing the opportunity of the human form of life.
In this millennium, the sun-god is known as Vivasvān, the king of the sun, which is the origin of all planets within the solar system. In the Brahma-saṁhitā (5.52) it is stated:
yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ
rājā samasta-sura-mūrtir aśeṣa-tejāḥ
yasyājñayā bhramati sambhṛta-kāla-cakro
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
“Let me worship,” Lord Brahmā said, “the Supreme Personality of Godhead, Govinda [Kṛṣṇa], who is the original person and under whose order the sun, which is the king of all planets, is assuming immense power and heat. The sun represents the eye of the Lord and traverses its orbit in obedience to His order.”
The sun is the king of the planets, and the sun-god (at present of the name Vivasvān) rules the sun planet, which is controlling all other planets by supplying heat and light. He is rotating under the order of Kṛṣṇa, and Lord Kṛṣṇa originally made Vivasvān His first disciple to understand the science of Bhagavad-gītā. The Gītā is not, therefore, a speculative treatise for the insignificant mundane scholar but is a standard book of knowledge coming down from time immemorial.
In the Mahābhārata (Śānti-parva 348.51–52) we can trace out the history of the Gītā as follows:
tretā-yugādau ca tato
vivasvān manave dadau
manuś ca loka-bhṛty-arthaṁ
sutāyekṣvākave dadau
ikṣvākuṇā ca kathito
vyāpya lokān avasthitaḥ
“In the beginning of the millennium known as Tretā-yuga this science of the relationship with the Supreme was delivered by Vivasvān to Manu. Manu, being the father of mankind, gave it to his son Mahārāja Ikṣvāku, the king of this earth planet and forefather of the Raghu dynasty, in which Lord Rāmacandra appeared.” Therefore, Bhagavad-gītā existed in human society from the time of Mahārāja Ikṣvāku.
At the present moment we have just passed through five thousand years of the Kali-yuga, which lasts 432,000 years. Before this there was Dvāpara-yuga (800,000 years), and before that there was Tretā-yuga (1,200,000 years).
Thus, some 2,005,000 years ago, Manu spoke the Bhagavad-gītā to his disciple and son Mahārāja Ikṣvāku, the king of this planet earth. The age of the current Manu is calculated to last some 305,300,000 years, of which 120,400,000 have passed. Accepting that before the birth of Manu the Gītā was spoken by the Lord to His disciple the sun-god Vivasvān, a rough estimate is that the Gītā was spoken at least 120,400,000 years ago; and in human society it has been extant for two million years. It was respoken by the Lord again to Arjuna about five thousand years ago. That is the rough estimate of the history of the Gītā, according to the Gītā itself and according to the version of the speaker, Lord Śrī Kṛṣṇa. It was spoken to the sun-god Vivasvān because he is also a kṣatriya and is the father of all kṣatriyas who are descendants of the sun-god, or the sūrya-vaṁśa kṣatriyas. Because Bhagavad-gītā is as good as the Vedas, being spoken by the Supreme Personality of Godhead, this knowledge is apauruṣeya, superhuman. Since the Vedic instructions are accepted as they are, without human interpretation, the Gītā must therefore be accepted without mundane interpretation. The mundane wranglers may speculate on the Gītā in their own ways, but that is not Bhagavad-gītā as it is. Therefore, Bhagavad-gītā has to be accepted as it is, from the disciplic succession, and it is described herein that the Lord spoke to the sun-god, the sun-god spoke to his son Manu, and Manu spoke to his son Ikṣvāku
🌹 🌹 🌹 🌹 🌹
Date: 10/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 152: 04వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 152: Chap. 04, Ver. 02
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 152 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 02 🌴
02. ఏవం పరంప్రాప్తంమిమం రాజర్షయో విదు: |
స కాలేనేహ మహతా యోగో నష్ట: పరన్తప ||
🌷. తాత్పర్యం :
ఈ దివ్యజ్ఞానము ఈ విధముగా గురుశిష్యపరంపరా రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసికొనిరి. కాని కాలక్రమమున పరంపర విఛ్చిన్నమగుట వలన జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది.
🌷. భాష్యము :
ప్రజలను పాలించుట యందు భగవద్గీత యొక్క ప్రయోజనమును రాజర్షులు నెరవేర్చవలసియున్నందున వారి కొరకే ఈ గీతాజ్ఞానము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. నిశ్చయముగా ఇది దానప్రవృత్తి గలవారికి ఉద్దేశింపబడలేదు. ఎవ్వరికి కుడా లాభము కలుగనట్లుగా వారు దీని విలువను నష్టపరచుటయే గాక తమ విపరీత తలంపుల ననుసరించి దీనికి వివిధ వివరణలను కల్పించు చుందురు. ఈ విధముగా మూలప్రయోజనము అటువంటి అధర్మపరులగు వ్యాఖ్యాతల విపరీతతలంపులచే నష్టపడినప్పడు గురుశిష్యపరంపరను తిరిగి పున:స్థాపించవలసిన అవసరమేర్పడును. దివ్యమైన గురుశిష్యపరంపర నష్టమైనదని శ్రీకృష్ణభగవానుడు ఐదువేల సంవత్సరములకు పూర్వము గుర్తించి, గీతాజ్ఞాన ప్రయోజనము నశించినట్లు కనిపించుచున్నదని ప్రకటించెను. అదేవిధముగా ప్రస్తుతము కూడా అనేకములైన గీతావ్యాఖ్యానములు (ముఖ్యముగా ఆంగ్లములో) వ్యాప్తియందున్నను దాదాపు అవన్నియును ప్రామాణిక పరంపరానుగతములు కాకయున్నవి. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు పెక్కు లభించుచున్నను దాదాపు ఆ వ్యాఖ్యతలందరును శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించియుండలేదు. కాని వారు శ్రీకృష్ణభగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారము మాత్రము కావింతురు. ఇదియే దానప్రవృత్తి. ఏలయన దానవులు భగవానుని నమ్మకున్నను భగవదాస్తిని మాత్రము అనుభవింపవలెనని కోరుచుందురు. గురుశిష్యపరంపరలో స్వీకరింపబడిన భగవద్గీత వ్యాఖ్యానమొకటి ఆంగ్లభాష యందు అవసరమై యున్నందున తత్ప్రయోజనము పూర్ణము చేయుట కొరకే ఈ రచనాయత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరింపబడిన భగవద్గీత సమస్త మానవాళికి ఒక వరము వంటిది. కాని అట్లుగాక దీనిని ఒక కాల్పనికమైన తాత్వికగ్రంథముగా స్వీకరించినచో అది కాలమును వృథాపరచినట్లే కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 152 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 02 🌴
02. evaṁ paramparā-prāptam
imaṁ rājarṣayo viduḥ
sa kāleneha mahatā
yogo naṣṭaḥ paran-tapa
🌷 Translation :
This supreme science was thus received through the chain of disciplic succession, and the saintly kings understood it in that way. But in course of time the succession was broken, and therefore the science as it is appears to be lost.
🌷 Purport :
It is clearly stated that the Gītā was especially meant for the saintly kings because they were to execute its purpose in ruling over the citizens. Certainly Bhagavad-gītā was never meant for the demonic persons, who would dissipate its value for no one’s benefit and would devise all types of interpretations according to personal whims. As soon as the original purpose was scattered by the motives of the unscrupulous commentators, there arose the need to reestablish the disciplic succession. Five thousand years ago it was detected by the Lord Himself that the disciplic succession was broken, and therefore He declared that the purpose of the Gītā appeared to be lost. In the same way, at the present moment also there are so many editions of the Gītā (especially in English), but almost all of them are not according to authorized disciplic succession. There are innumerable interpretations rendered by different mundane scholars, but almost all of them do not accept the Supreme Personality of Godhead, Kṛṣṇa, although they make a good business on the words of Śrī Kṛṣṇa. This spirit is demonic, because demons do not believe in God but simply enjoy the property of the Supreme. Since there is a great need of an edition of the Gītā in English, as it is received by the paramparā (disciplic succession) system, an attempt is made herewith to fulfill this great want. Bhagavad-gītā – accepted as it is – is a great boon to humanity; but if it is accepted as a treatise of philosophical speculations, it is simply a waste of time.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 11/Oct/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 153: 04వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 153: Chap. 04, Ver. 03
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 153 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 03 🌴
03. స ఏవాయం మయా తే(ద్య యోగ: ప్రోక్త: పురాతన: |
భక్తో(సి మే సఖా చేతి రహస్యం హ్యేతుదుత్తమమ్ ||
🌷. తాత్పర్యం :
నీవు నా భక్తుడు మరియు స్నేహితుడువు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసికొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను.
🌷. భాష్యము :
భక్తులు మరియు దానప్రవృత్తిగలవారు అనుచు మానవులలో రెండు తరగతుల వారు గలరు. అర్జునుడు భక్తుడైన కారణమున అతనిచే ఈ గొప్పజ్ఞానపు గ్రహీతగా శ్రీకృష్ణభగవానుడు ఎంచుకొనెను. ఈ రహస్యశాస్త్రమును అవగతము చేసికొనుట దానవప్రవృత్తి గలవారికి సాధ్యము కాదు. ఈ దివ్యజ్ఞాన గ్రంథమునకు పలు వ్యాఖ్యానములు కలవు. ఆ వ్యాఖ్యానములలో కొంతమంది భక్తులచే రచింపబడగా, మరికొన్ని దానప్రవృత్తి గలవారిచే వ్రాయబడియున్నవి. భక్తుల వ్యాఖ్యానము సత్యమైనది కాగా, దానవప్రవృత్తి గలవారి లిఖితములు వ్యర్థములై యున్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించెను. అర్జునుని మార్గము ననుసరించి వ్రాయబడిన ఏ గీతావ్యాఖ్యానమైనను ఈ దివ్యశాస్త్రమున కొనరింపబడు నిజమైన భక్తియుతసేవయై యున్నది. దానవప్రవృత్తిగలవారు శ్రీకృష్ణుని యథాతథముగా స్వీకరింపక, ఆ దేవదేవుని గూర్చి స్వకల్పనలు చేయుచ పాఠకులను అతని బోధల నుండి పెడత్రోవ మార్గములను గూర్చి ఇచ్చట హెచ్చరిక చేయబడుచున్నది.కనుక ప్రతియొక్కరు అర్జునుని నుండి వచ్చిన పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్భగవద్గీత యనెడి ఈ దివ్యశాస్త్రము ద్వారా లాభమును గడింపవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 153 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 03 🌴
03. sa evāyaṁ mayā te ’dya
yogaḥ proktaḥ purātanaḥ
bhakto ’si me sakhā ceti
rahasyaṁ hy etad uttamam
🌷 Translation :
That very ancient science of the relationship with the Supreme is today told by Me to you because you are My devotee as well as My friend and can therefore understand the transcendental mystery of this science.
🌷 Purport :
There are two classes of men, namely the devotee and the demon. The Lord selected Arjuna as the recipient of this great science owing to his being a devotee of the Lord, but for the demon it is not possible to understand this great mysterious science. There are a number of editions of this great book of knowledge. Some of them have commentaries by the devotees, and some of them have commentaries by the demons. Commentation by the devotees is real, whereas that of the demons is useless. Arjuna accepts Śrī Kṛṣṇa as the Supreme Personality of Godhead, and any commentary on the Gītā following in the footsteps of Arjuna is real devotional service to the cause of this great science. The demonic, however, do not accept Lord Kṛṣṇa as He is. Instead they concoct something about Kṛṣṇa and mislead general readers from the path of Kṛṣṇa’s instructions. Here is a warning about such misleading paths. One should try to follow the disciplic succession from Arjuna, and thus be benefited by this great science of Śrīmad Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 12/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 154: 04వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 154: Chap. 04, Ver. 04
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 154 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 04 🌴
04. అర్జున ఉవాచ
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత: |
కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను : సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నను పూర్వుడు. అట్టి యెడ ఆదిలో నీవీ జ్ఞానమును అతనికి ఉపదేశించితివనుటను నేనెట్లు అర్థము చేసికొనగలును?
🌷. భాష్యము :
అర్జునుడు శ్రీకృష్ణభగవానుడు పరమభక్తుడు. అట్టి యెడ శ్రీకృష్ణుని వచనములను అతడు నమ్మకుండుట ఎట్లు సంభవించును? వాస్తవమేననగా అర్జునుడు ఇచ్చట తన కొరకు గాక భగవానుని యందు నమ్మకము లేనివారి కొరకు లేదా శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విషయమును అంగీకరింపని దానప్రవృత్తి కలవారి కొరకు ప్రశ్నించుచున్నాడు. అనగా వారి కొరకే అర్జునుడు శ్రీకృష్ణభగవానుని గూర్చి ఏమియును తెలియనివాని వలె ఈ విషయమును విచారణ కావించుచున్నాడు. దశమాధ్యాయమున విదితము కానున్నట్లు శ్రీకృష్ణుడు సమస్తమునకు మూలమైన భగవానుడనియు మరియు పరతత్త్వపు చరమానుభవమనియు అర్జునుడు సంపూర్ణముగా నెరిగియుండెను. అయినను ఆ దేవదేవుడు దేవకీదేవి తనయునిగా ధరత్రిపై అవతరించెను. అట్టి యెడ అతడు నిత్యుడైన ఆదిపురుషునిగా మరియు దేవదేవునిగా నిలిచియుండుట ఎట్లు సాధ్యమయ్యెనో సామాన్యమానవునకు బోధపడని విషయము. కనుక ఆ విషయమును విశదపరచుటకే అర్జునుడు శ్రీకృష్ణుని ఈ ప్రశ్నను అడిగియుండెను. తద్ద్వారా శ్రీకృష్ణుడే ఈ విషయమును గూర్చి ప్రామాణికముగా పలుకగలడని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు పరమప్రామాణికుడు అనెడి సత్యమును ఈనాడే గాక అనంతకాలము నుండియు సమస్త ప్రపంచము ఆమోదించినది. కేవలము దానవులే అతనిని తిరస్కరింతురు. సర్వులచే శ్రీకృష్ణుడు ప్రామణికునిగా అంగీకరింపబడినందున అర్జునుడు ఈ ప్రశ్నను అతని ముందుంచుచున్నాడు. తద్ద్వార దానవప్రవృత్తి కలవారిచే వివరింపబడుటకు బదులు కృష్ణుడు తనను గూర్చి తానే వివరించుటకు అవకాశము కలుగగలదు. అట్టి దానవప్రవృత్తిగలవారు దానవస్వభావులైన తమ అనుయాయులు నిమిత్తమై సదా శ్రీకృష్ణుని గూర్చి వక్రభాష్యము కావింతురు. కాని వాస్తవమునకు ప్రతివారును తమ శ్రేయస్సు కొరకై కృష్ణసంబంధ విజ్ఞానమును ఎరుగవలసియున్నది. కావున శ్రీకృష్ణుడే తనను గూర్చి ప్రవచించినపుడు అది సర్వలోకమంగళకరము కాగలదు. శ్రీకృష్ణుని సదా తమ పరధిలోనే అధ్యయనము కావింతురు కావున దానవప్రవృత్తి గలవారికి ఆ దేవదేవుని వివరణలు విచిత్రముగా తోచినను భక్తులు మాత్రము వానిని(కృష్ణుడే స్వయముగా పలికినప్పుడు) హృదయపూర్వకముగా స్వీకరింతురు. శ్రీకృష్ణుని గూర్చి అధికాధికముగా తెలియగోరియున్నందునే భక్తులు అతని ప్రామాణిక వచనములను సర్వదా భక్తితో మన్నింతురు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా తలంచు నాస్తికులు కూడా ఈ విధముగా అతడు మానవాతీతుడనియు, జ్ఞాననందపూర్ణుడనియు (సచ్చిదానందవిగ్రహుడు), దివ్యుడనియు, త్రిగుణాతీతుడనియు, దేశకాలప్రభావములకు పరుడనియు తెలిసికొనగలరు. అర్జునుని వంటి భక్తుడెన్నడును శ్రీకృష్ణుని దివ్యస్థితి యెడ ఎటువంటి అనుమానమును కలిగియుండడు. శ్రీకృష్ణుడు ప్రకృతి గుణములచే ప్రభావితుడయ్యెడి సామాన్యమానవుడని భావించువారి నాస్తికస్వభావమును నిరసించుటకు అర్జునుడు చేసిన యత్నమే ఈ ప్రశ్నను శ్రీకృష్ణభగవానుని ముందుంచుట.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 154 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 04 🌴
04. arjuna uvāca
aparaṁ bhavato janma
paraṁ janma vivasvataḥ
katham etad vijānīyāṁ
tvam ādau proktavān iti
🌷 Translation :
Arjuna said: The sun-god Vivasvān is senior by birth to You. How am I to understand that in the beginning You instructed this science to him?
🌷 Purport :
Arjuna is an accepted devotee of the Lord, so how could he not believe Kṛṣṇa’s words? The fact is that Arjuna is not inquiring for himself but for those who do not believe in the Supreme Personality of Godhead or for the demons who do not like the idea that Kṛṣṇa should be accepted as the Supreme Personality of Godhead; for them only Arjuna inquires on this point, as if he were himself not aware of the Personality of Godhead, or Kṛṣṇa. As it will be evident from the Tenth Chapter, Arjuna knew perfectly well that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the fountainhead of everything and the last word in transcendence. Of course, Kṛṣṇa also appeared as the son of Devakī on this earth. How Kṛṣṇa remained the same Supreme Personality of Godhead, the eternal original person, is very difficult for an ordinary man to understand.
Therefore, to clarify this point, Arjuna put this question before Kṛṣṇa so that He Himself could speak authoritatively. That Kṛṣṇa is the supreme authority is accepted by the whole world, not only at present but from time immemorial, and the demons alone reject Him. Anyway, since Kṛṣṇa is the authority accepted by all, Arjuna put this question before Him in order that Kṛṣṇa would describe Himself without being depicted by the demons, who always try to distort Him in a way understandable to the demons and their followers. It is necessary that everyone, for his own interest, know the science of Kṛṣṇa. Therefore, when Kṛṣṇa Himself speaks about Himself, it is auspicious for all the worlds. To the demons, such explanations by Kṛṣṇa Himself may appear to be strange because the demons always study Kṛṣṇa from their own standpoint, but those who are devotees heartily welcome the statements of Kṛṣṇa when they are spoken by Kṛṣṇa Himself. The devotees will always worship such authoritative statements of Kṛṣṇa because they are always eager to know more and more about Him. The atheists, who consider Kṛṣṇa an ordinary man, may in this way come to know that Kṛṣṇa is superhuman, that He is sac-cid-ānanda-vigraha – the eternal form of bliss and knowledge – that He is transcendental, and that He is above the domination of the modes of material nature and above the influence of time and space. A devotee of Kṛṣṇa, like Arjuna, is undoubtedly above any misunderstanding of the transcendental position of Kṛṣṇa. Arjuna’s putting this question before the Lord is simply an attempt by the devotee to defy the atheistic attitude of persons who consider Kṛṣṇa to be an ordinary human being, subject to the modes of material nature.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 13/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 155: 04వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 155: Chap. 04, Ver. 05
🌹. శ్రీమద్భగవద్గీత - 155 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 05 🌴
05. శ్రీ శ్రీ భగవానువాచ
బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరన్తప ||
🌷. తాత్పర్యం :
దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : ఓ పరంతపా! నీకును మరియు నాకును పలుజన్మలు గడిచినవి. నాకు అవియన్నియును జ్ఞప్తియందున్నవి. కాని నీవు వానిని జ్ఞప్తి యందుంచుకొనజాలవు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని అనేకానేక అవతారములను గూర్చిన సమాచారము బ్రహ్మసంహిత(5.33) యందు మనకు లభించుచున్నది. దాని యందు ఇట్లు తెలుపబడినది.
అద్వైతమచ్యుతమనాదిమనన్తరూపమ్
ఆద్యం పురాణపురుషం నవయౌవనం చ |
వేదేషు దుర్లభ మదుర్లభ మాత్మభక్తౌ
గోవిందం ఆదిపురుషం తమహం భజామి ||
“అద్వితీయుడును, అచ్యుతుడును, అనాదియును అగు దేవదేవుడైన గోవిందుని(శ్రీ కృష్ణుని) నేను భజింతును. అతడు అనంతరూపములలోనికి అదే ఆదిపురుషునిగా, అనాదిగా మరియు నిత్యయౌవనములో అలరారువానిగా భాసించును. భగవానుని అట్టి సచ్చిదానందవిగ్రహరూపములు వేదంవేత్తలకు సాధారణముగా దుర్లభములైనను, శుద్ధభక్తులకు మాత్రము స్వయముగా ప్రకటితమగుచుండును.”
అదే బ్రహ్మసంహిత(5.39) యందు ఈ క్రింది విషయము కూడా తెలుపబడినది.
రామాదిమూర్తిషు కలానియమేన తిష్ఠన్
నానావతార మకరోద్భువనేషు కింతు |
కృష్ణ: స్వయం సమభవత్పరమ: పుమాన్ యో
గోవిందం ఆదిపురుషం తమహం భజామి ||
“రామ, నృసింహాది పలు అవతారములను, ఇతరములైన అనేక అంశావతారములను ధరించువాడును మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుచు స్వయముగా అవతరించెడివాడును అగు గోవిందుని(శ్రీకృష్ణుని) నేను భజింతును.
భగవానుడు అద్వితీయుడని తెలియబడినను అసంఖ్యాకరూపములలోనికి ప్రకటితమగుచుండునని వేదములందు తెలుపబడినది. పలురంగులు మార్చినను వాస్తవమునకు మార్పురహితముగా నుండు వైడుర్యముతో అతనిని పోల్చవచ్చను. ఆ నానావిధ రూపములన్నియును విశుద్ధభక్తులకే సంపూర్ణముగా అవగతమగును. కేవలము వేదాధ్యయనముచే అవి అవగతము కావు ( వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మ భక్తౌ). అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణభగవానుని నిత్యసహచరులు. భగవానుడెప్పుడు అవతరించినను వివిధస్థాయిలలో అతని సేవ కొరకు ఆ నిత్యసహచరులైన భాకులును అవతరింతురు. అటువంటి భక్తులలో అర్జునుడు ఒకడు. గీతాజ్ఞానమును భగవానుడు లక్షలాది సంవత్సరములకు పూర్వము సూర్యదేవుడైన వివస్వానునకు భోదించినపుడు అర్జునుడు సైతము తన స్థాయిలో భగవానుని చెంత నిలిచియే యున్నాడని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. కాని అర్జునుడు మరియు భగవానుని నడుమ వ్యత్యాసమేమనగా భగవానుడు ఆ సంఘటనను జ్ఞాపకముంచుకొనగం అర్జునుడందులకు సమర్థుడు కాకుండెను. ఇదియే అంశలైన జీవులు మరియు భగవానుని నడుమ గల భేదము. ఇచ్చట అర్జునుడు శత్రువులను తపింపజేయు గొప్ప యోధునిగా సంబోధింపబడినను తన గతజన్మలలో జరిగిన విషయములను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో అశక్తుడై యుండెను. అనగా జీవుడు భౌతికపరిగణలో ఎంతటి ఘనుడైనను భగవానునకెన్నడును సాటిరాడు. శ్రీకృష్ణభగవానునితో శాశ్వతసాహచర్యము కలిగినవాడు నిక్కముగా ముక్తపురుషుడే. కాని అతడెన్నడును భగవానునితో సముడు కాలేడు. బ్రహ్మసంహిత యందు శ్రీకృష్ణుడు అచ్యుతినిగా వర్ణింపబడినాడు. అనగా భౌతికత్వ సంపర్కమున ఉన్నప్పటికిని అతడు తన దివ్యత్వమును మరచిపోడు. కనుక జీవుడు అర్జునుని వంటి ముక్తపురుషుడైనను భగవానునితో అన్నివిధముల సముడు కాజాలడు. అర్జునుడు భగవానుని భక్తుడైనను ఒక్కొక్కమారు భగవానుని స్థితిని మార్చు నవకాశము కలదు. కాని దివ్యకరుణచే భక్తుడు శీఘ్రమే తిరిగి భగవానుని అచ్యుతమైనటువంటి స్థితిని తెలిసికొనగలడు. కాని అభక్తులు(దానవప్రవృత్తి కలవారు) భగవానుని ఈ దివ్యతత్వమును తెలిసికొనజాలరు. కనుకనే గీత యందలి ఈ వివరణలు అభక్తులకు మరియు దానవప్రవృట్టి గలవారికి ఎన్నడును అవగతము కావు. కృష్ణార్జులిరువురును స్వభావారీత్యా శాశ్వతులైనను, లక్షలాది సంవత్సరములకు పూర్వము తానూ చేసిన కర్మలను శ్రీకృష్ణభగవానుడు జ్ఞప్తి యందుంచుకొనగా అర్జునుడందులకు సమర్థుడు కాకుండెను. అనగా జీవుడు తన దేశము మార్పుచెందుచున్న కారణముగా సర్వమును మరచిపోవుననియు మరియు శ్రీకృష్ణుడు తన సచ్చిదానందదేహమును మార్చని కారణముగా సర్వమును జ్ఞప్తి యందుంచుకొనుననియు మనము ఇచ్చట గమనింపవచ్చును. అతడు అద్వైతుడు. అనగా అతనికి మరియు అతని దేహమునకు బేధము లేదు. అతనికి సంబంధించిన ప్రతిదియును చైతన్యపుర్ణమే. కాని బద్ధజీవుని విషయమున అతని ఆత్మ దేహము కన్నను భిన్నమైనది. భగవానుడు మరియ అతని దేహము రెండును ఏకమే గనుక అతడు భౌతికజగమునందు అవతరించినను అతని స్థితి సర్వదా సాధారణజీవుని స్థితికి భిన్నముగా నుండును. భగవానుని ఇట్టి దివ్యమైన తత్త్వమును అసురప్రవృత్తిగలవారు అవగతము చేసికొనజాలరు. ఈ విషయమున భగవానుడే రాబోవు శ్లోకములలో వివరించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 155 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 05 🌴
05. śrī-bhagavān uvāca
bahūni me vyatītāni
janmāni tava cārjuna
tāny ahaṁ veda sarvāṇi
na tvaṁ vettha paran-tapa
🌷 Translation :
The Personality of Godhead said: Many, many births both you and I have passed. I can remember all of them, but you cannot, O subduer of the enemy!
🌷 Purport :
In the Brahma-saṁhitā (5.33) we have information of many, many incarnations of the Lord. It is stated there:
advaitam acyutam anādim ananta-rūpam
ādyaṁ purāṇa-puruṣaṁ nava-yauvanaṁ ca
vedeṣu durlabham adurlabham ātma-bhaktau
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
“I worship the Supreme Personality of Godhead, Govinda [Kṛṣṇa], who is the original person – absolute, infallible, without beginning. Although expanded into unlimited forms, He is still the same original, the oldest, and the person always appearing as a fresh youth. Such eternal, blissful, all-knowing forms of the Lord are usually not understood by even the best Vedic scholars, but they are always manifest to pure, unalloyed devotees.”
It is also stated in Brahma-saṁhitā (5.39):
rāmādi-mūrtiṣu kalā-niyamena tiṣṭhan
nānāvatāram akarod bhuvaneṣu kintu
kṛṣṇaḥ svayaṁ samabhavat paramaḥ pumān yo
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
“I worship the Supreme Personality of Godhead, Govinda [Kṛṣṇa], who is always situated in various incarnations such as Rāma, Nṛsiṁha and many subincarnations as well, but who is the original Personality of Godhead known as Kṛṣṇa, and who incarnates personally also.”
In the Vedas also it is said that the Lord, although one without a second, manifests Himself in innumerable forms. He is like the vaidūrya stone, which changes color yet still remains one. All those multiforms are understood by the pure, unalloyed devotees, but not by a simple study of the Vedas (vedeṣu durlabham adurlabham ātma-bhaktau). Devotees like Arjuna are constant companions of the Lord, and whenever the Lord incarnates, the associate devotees also incarnate in order to serve the Lord in different capacities. Arjuna is one of these devotees, and in this verse it is understood that some millions of years ago when Lord Kṛṣṇa spoke the Bhagavad-gītā to the sun-god Vivasvān, Arjuna, in a different capacity, was also present. But the difference between the Lord and Arjuna is that the Lord remembered the incident whereas Arjuna could not remember. That is the difference between the part-and-parcel living entity and the Supreme Lord. Although Arjuna is addressed herein as the mighty hero who could subdue the enemies, he is unable to recall what had happened in his various past births. Therefore, a living entity, however great he may be in the material estimation, can never equal the Supreme Lord. Anyone who is a constant companion of the Lord is certainly a liberated person, but he cannot be equal to the Lord. The Lord is described in the Brahma-saṁhitā as infallible (acyuta), which means that He never forgets Himself, even though He is in material contact. Therefore, the Lord and the living entity can never be equal in all respects, even if the living entity is as liberated as Arjuna. Although Arjuna is a devotee of the Lord, he sometimes forgets the nature of the Lord, but by the divine grace a devotee can at once understand the infallible condition of the Lord, whereas a nondevotee or a demon cannot understand this transcendental nature. Consequently these descriptions in the Gītā cannot be understood by demonic brains. Kṛṣṇa remembered acts which were performed by Him millions of years before, but Arjuna could not, despite the fact that both Kṛṣṇa and Arjuna are eternal in nature.
We may also note herein that a living entity forgets everything due to his change of body, but the Lord remembers because He does not change His sac-cid-ānanda body. He is advaita, which means there is no distinction between His body and Himself. Everything in relation to Him is spirit – whereas the conditioned soul is different from his material body. And because the Lord’s body and self are identical, His position is always different from that of the ordinary living entity, even when He descends to the material platform. The demons cannot adjust themselves to this transcendental nature of the Lord, which the Lord Himself explains in the following verse.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 14/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 156: 04వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 156: Chap. 04, Ver. 06
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 156 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 06 🌴
06. అజో(పి సన్నవ్యయాత్యా భూతానామీశ్వరో(పి సన్ |
ప్రకృతిం స్వామధిష్టాయ సమ్భవామ్యాత్మమాయయా ||
🌷. తాత్పర్యం :
జన్మలేనివాడనైనను, నా దివ్యదేహము ఎన్నడును నశింపనిదైనను, సకలజీవులకు ప్రభువునైనను ఆదియైన దివ్యరూపముతో నేను ప్రతియుగము నందును అవతరింతును.
🌻. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు తన జన్మ యందలి ప్రత్యేకతను గూర్చి పలుకుచున్నాడు. అతడు సాధారణ మానవుని వలె గోచరించినను తన పూర్వపు “జన్మల” విషయముల నన్నింటిని జ్ఞప్తియందుంచుకొనును. కాని సామాన్యుడు తాను కొలదిగంటల క్రిందట యేమి ఒనర్చెనో సైతము గుర్తుంచుకొనలేడు. గడచిన దినమందు అదే సమయమున ఏమి చేయుచుంటివని ఎవారినేని ప్రశ్నించినచో వెంటనే సమాధానమొసగుట ఆ సామాన్యునికి బహుకష్టతరము కాగలదు.క్రిందటి రోజు అదే సమయమున ఏమి చేయుచుండెనో గుర్తు తెచ్చుకొనుటకు అతడు తన జ్ఞాపకశక్తినంతటినీ తిరిగి తోడవలసియే వచ్చును. అయినప్పటికిని తాను దేవుడనని(లేదా కృష్ణుడనని) పలుకుటకు మానవులు ఏమాత్రము జంకరు. కాని అట్టి అర్థరహిత పలుకులచే ఎవ్వరును మోసపోరాదు. ఇంకను ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు తన “ప్రకృతి”ని (తన రూపమును) గూర్చి వివరించినాడు. ప్రకృతియనగా స్వభావము మరియు స్వరూపము(స్వీయరూపము) అని భావము. భగవానుడు తాను తన స్వీయరూపముముతో అవతరింతునని పలికెను. సాధారణజీవులు మార్చునట్లుగా అతడు తన దేఃమును మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మమందు ఒక రకమైన దేహమును కలిగియుండవచ్చు. కాని మరుసటి జన్మలో వేరోక దేహము లభించగలదు. అనగా భౌతికజగమునందు జీవుడు స్థిరమైన దేహమును కలిగియుండక ఒక దేహము లభించగలదు. అనగా భౌతికజగమునందు జీవుడు స్థిరమైన దేహమును కలిగియుండక ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందుచునే యుండును. కాని భగవానుడు ఆ విధముగా కావింపడు. అతడెప్పుడు అవతరించినను అంతరంగికశక్తి ద్వారా తన ఆది దివ్యశరీరముతోనే ఆవిర్భవించుచుండును. వేరుమాటలలో మురళిని దాల్చిన ద్విభుజరూపమునందు(ఆదియైన నిత్యరూపము) శ్రీకృష్ణుడు ఈ భౌతికజగమున అవతరించును. భౌతికజగత్తు యొక్క కల్మషముచే ప్రభావితము కాకుండా తన దివ్యరూపముతోనో అతడు అవతరించును. తాను జగదీశ్వరుడైనను మరియు ఆది దివ్యదేహముతో అవతరించినను అతడు సాధారణజీవి వలె జన్మను పొందినట్లుగా గోచరించును. భౌతికదేహము వలె అతని దేహము జీర్ణము కాకపోయిననుశైశవము నుండు బాల్యమునకు, బాల్యము నుండి యౌవనమునకు అతని దేహము మార్పు చెందుచున్నట్లు గోచరించును. కాని ఆశ్చర్యమేమనగా అతని దేహము యౌవనము పిమ్మట ఎటువంటి మార్పునొందదు. కురుక్షేత్రరణరంగ సమయమున శ్రీకృష్ణుడు పలువురు మనుమలను కలిగియున్నను, అనగా లౌకికపరిగణలో వయస్సు మీరినవాడైనను ఇరువది లేక ఇరువదియైదేళ్ళ ప్రాయపు యౌవనవంతుని వలె గోచరించెను. వృద్ధ్యాప్యమును పొందినవానిగా కృష్ణుని మనము ఏ చిత్రమునందును గాంచబోము. ఏలయన సమస్త సృష్టిలో భూత, భవిష్యత్, వర్తమానములందన్ని వేళలా అతడు అనాదియైనను మనవలె అతడెన్నడును వృద్ధాప్యమును పొందడు.
అతని దేహము కాని, బుద్ధి కాని ఎన్నడును మార్పుచెందదు మరియు నష్టము కాదు. కనుకనే భౌతికజగత్తు నందున్నప్పటికిని అతడు పుట్టుకలేనివాడే. సచ్చిదానందవిగ్రుహుడే. తన దివ్యదేహమునందు మరియు బుద్ధి యందు మార్పు లేనటువంటివాడే. వాస్తవమునకు అతని జన్మము మరియు అవతార సమాప్తములు సూర్యుడు ఉదయించుట, ఎదుటనే ప్రయాణించుట, తిరిగి మన దృష్టికి అగోచరమగుట వంటివి. సూర్యుడు మన దృష్టికి అగోచరుడైనంతనే అతడు అస్తమించినాడనియు మరియు ఎదుట గోచరించినంతనే ఉదయించినాడనియు మనము భావింతుము. కాని వాస్తవమునకు సూర్యుడు తన స్థానములో స్థిరముగా నిలిచియుండును. కేవలము మన దోషపూర్ణ(అసంపూర్ణ) ఇంద్రియముల కారణమున ఆకాశమునందు సూర్యుని ఉదాయాస్తమములను మనము పరిగణింతుము. శ్రీకృష్ణభగవానుని అవతరణము మరియు అవతరణ పరిసమాప్తము లనునవి సామాన్యజీవుని జన్మము మరియు అస్తమయములకు సంపూర్ణముగా భిన్నములైనట్టివి గనుక అతడు తన అంతరంగశక్తి కారణముగా సచ్చిదానందస్వరూపుడనియు మరియు భౌతికప్రకృతిచే ప్రభావితుడు కాబోడనియు నిరూపితమగుచున్నది.
🌹 Bhagavad-Gita as It is - 156 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 06 🌴
06. ajo ’pi sann avyayātmā
bhūtānām īśvaro ’pi san
prakṛtiṁ svām adhiṣṭhāya
sambhavāmy ātma-māyayā
🌷 Translation :
Although I am unborn and My transcendental body never deteriorates, and although I am the Lord of all living entities, I still appear in every millennium in My original transcendental form.
🌷 Purport :
The Lord has spoken about the peculiarity of His birth: although He may appear like an ordinary person, He remembers everything of His many, many past “births,” whereas a common man cannot remember what he has done even a few hours before.
If someone is asked what he did exactly at the same time one day earlier, it would be very difficult for a common man to answer immediately. He would surely have to dredge his memory to recall what he was doing exactly at the same time one day before. And yet, men often dare claim to be God, or Kṛṣṇa. One should not be misled by such meaningless claims. Then again, the Lord explains His prakṛti, or His form. Prakṛti means “nature,” as well as svarūpa, or “one’s own form.” The Lord says that He appears in His own body. He does not change His body, as the common living entity changes from one body to another. The conditioned soul may have one kind of body in the present birth, but he has a different body in the next birth. In the material world, the living entity has no fixed body but transmigrates from one body to another. The Lord, however, does not do so. Whenever He appears, He does so in the same original body, by His internal potency. In other words, Kṛṣṇa appears in this material world in His original eternal form, with two hands, holding a flute. He appears exactly in His eternal body, uncontaminated by this material world. Although He appears in the same transcendental body and is Lord of the universe, it still appears that He takes His birth like an ordinary living entity. And although His body does not deteriorate like a material body, it still appears that Lord Kṛṣṇa grows from childhood to boyhood and from boyhood to youth. But astonishingly enough He never ages beyond youth. At the time of the Battle of Kurukṣetra, He had many grandchildren at home; or, in other words, He had sufficiently aged by material calculations. Still He looked just like a young man twenty or twenty-five years old. We never see a picture of Kṛṣṇa in old age because He never grows old like us, although He is the oldest person in the whole creation – past, present and future. Neither His body nor His intelligence ever deteriorates or changes. Therefore, it is clear that in spite of His being in the material world, He is the same unborn, eternal form of bliss and knowledge, changeless in His transcendental body and intelligence. Factually, His appearance and disappearance are like the sun’s rising, moving before us and then disappearing from our eyesight. When the sun is out of sight, we think that the sun has set, and when the sun is before our eyes, we think that the sun is on the horizon.
Actually, the sun is always in its fixed position, but owing to our defective, insufficient senses, we calculate the appearance and disappearance of the sun in the sky. And because Lord Kṛṣṇa’s appearance and disappearance are completely different from that of any ordinary, common living entity, it is evident that He is eternal, blissful knowledge by His internal potency – and He is never contaminated by material nature.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 15/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 157: 04వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 157: Chap. 04, Ver. 07
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 157 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 07 🌴
07. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహం ||
🌷. తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధినొందునో ఆ సమయమున నేను అవతరింతును.
🌻. భాష్యము :
ఇచ్చట “సృజామి” అను పదము ముఖ్యమైనది. దానినెన్నడును సృష్టింపబడు ననెడి భావనలో ఉపయోగించరాదు. ఏలయన గత శ్లోకము ననుసరించి భగవానుని దేహమునకు లేదా రూపమునకు సృష్టి యనునది లేదు. రూపములన్నియును నిత్యముగా నిలిచి యండుటయే అందులకు కారణమున. కావున సృజామి యనగా భగవానుడు తన స్వీయరూపముతో అవతరించునని భావము. నియమానుసారముగా శ్రీకృష్ణుభగవానుడు బ్రహ్మదేవుని ఒక దినము నందలి ఏడవ మనువు యొక ఇరువదిఎనిమిదవ యుగపు ద్వాపర యుగాంతమున ఆవిర్భవించుచుండును. కాని అతనికి అదేవిధముగా విధినియమానుసారము అవతరింపవలెనను నిబంధనము మాత్రము లేదు. అతడు తనకు తోచినరీతిగా వర్తింపగలడు. కనుక అధర్మము ప్రబలి, నిజమైన ధర్మము అడుగంటినప్పుడు అతడు తన ఇచ్చానుసారము అవతరించుచుండును. ధర్మనియమములు వేదములందు వివరింపబడినవి. అట్టి వేదనియమాచరణము నందు భంగము వాటిల్లనిచో మనుజడు ఆధర్మవర్తనుడగును. ఆ నియమములు భగవానుని శాసనములని శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. కేవలము శ్రీకృష్ణభగవానుడు మాత్రమే ధర్మవిధానమును సృజింపగలడు. వేదములు సైతము తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానునిచే పలుకబడినవి తెలియవచ్చుచున్నది. కనుకనే ధర్మనియమములు సాక్షాత్తుగా భగవానుని నిర్దేశములై యున్నవి (ధర్మం తు సాక్షాద్భగవత్ప్రణితమ్). ఈ నియమములన్నియును భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినవి. భగవానుని అధ్యక్షతలో ఆ నియమములను స్థాపించుటయే వేదముల ప్రయోజనమై యున్నది. ధర్మము యొక్క అత్యున్నత నియమము తననే శరణు వేడవలెననియు, అంతకు మించి వేరొకటి లేదనియు శ్రీకృష్ణభగవానుడు స్వయముగా గీత యొక్క అంత్యమున ప్రత్యక్షముగా ఆదేశించినాడు. ఆ దేవదేవుని సంపూర్ణ శరణాగతి లోనికే వేదనియమములు మనుజుని చేర్చగలవు. అట్టి నియమములు దానవులు మరియు దానవప్రవృత్తి గలవారిచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణభగవానుడు అవతరించును. భౌతికభావనము విచ్చలవిడిగా నుండి, లౌకికులు వేదప్రమాణము ఒక నెపముగా భావించినప్పుడు అవతరించిన బుద్ధుడు శ్రీకృష్ణుడు అవతారమని శ్రీమద్భాగవతము ద్వారా అవగతమగుచున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనలకై గల జంతువధ విషయమున నియమ నిబంధనలు వేదములందున్నప్పటికిని దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను పాటింపకనే జంతుబలులను స్వీకరించిరి. అట్టి విపరీతము నాపి, వేదధర్మమైన అహింసను నెలకొల్పుట కొరకే బుద్ధుడు అవతరించెను. అనగా శ్రీకృష్ణభగవానుని ప్రతి అవతారమునకు ఒక ముఖ్యకార్యముండును. అవన్నియును శాస్త్రములందు సంపూర్ణముగా వివరింపబడినవి. కనుక శాస్త్రములందు తెలుపనిదే ఎవ్వరినీ కూడా అవతారముగా అంగీకరింపరాదు. భగవానుడు భారతదేశమునందే అవతరించుననుట సత్యము కాదు. అతడెక్కడైనను, ఎన్నడైనను కోరినరీతిగా అవతరింపవచ్చును. భగవచ్చైతన్యమునకు మానవులను మళ్ళించుట మరియు ధర్మనియమములను వారిచే పాటింపజేయుటయే ఉద్దేశ్యముగా నుండు అతని అన్ని అవతారముల యందును అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనులు అవగాహన చేసికొను రీతిలో ధర్మమును గూర్చియే ఉపదేశమొసగును. కొన్నిమార్లు అతడు స్వయముగా అరుదెంచును. మరి కొన్నిమార్లు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపమున గాని, సేవకుని రూపమున గాని పంపును. లేదా తానే స్వయముగా గూడరూపములో అరుదెంచును.
ప్రపంచమునందలి ఇతర మనుష్యుల కన్నను ఉన్నతుడై యున్నందున భగవద్గీత నియమములు అర్జునునకు తెలుపబడినవి. అర్జునుడే కాక ఉన్నతులైన వారందరును ఈ ఉపదేశమును గ్రహించుటకు అర్హులై యున్నారు. రెండును రెండుచే కలిపినచే నాలుగగుననుట ప్రాథమిక, ఉన్నతగణితములందు వ్యత్యాసమున్నది. అదేవిధముగా భగవానుడు అవతరించిన ప్రతిసారియు అవే ధర్మనియములు ఉపదేశింపబడినను పరిస్థితుల ప్రకారము అవి ప్రాథమికములు మరియు ఉన్నతములని రెండు విధములుగా నుండును. తరువాత వివరింపబడబోవు రీతి, వర్ణాశ్రమసాంఘిక విధానము అంగీకరించుట ద్వారా ఉన్నత ధర్మాచరణము ఆరంభము కాగలదు. అనగా సర్వత్ర కృష్ణభక్తిభావనమును జాగృతము చేయుటయే సర్వావతారాముల ముఖ్య ప్రయోజనమై యున్నది. అట్టి భావనము పరిస్థితుల ననుసరించి కొన్నిమార్లు వ్యక్తమై, మరికొన్నిమార్లు అవ్యక్తముగా నిలిచియుండును.
🌹 Bhagavad-Gita as It is - 157 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 07 🌴
07. yadā yadā hi dharmasya
glānir bhavati bhārata
abhyutthānam adharmasya
tadātmānaṁ sṛjāmy aham
🌷 Translation :
Whenever and wherever there is a decline in religious practice, O descendant of Bharata, and a predominant rise of irreligion – at that time I descend Myself.
🌷 Purport :
The word sṛjāmi is significant herein. Sṛjāmi cannot be used in the sense of creation, because, according to the previous verse, there is no creation of the Lord’s form or body, since all of the forms are eternally existent. Therefore, sṛjāmi means that the Lord manifests Himself as He is. Although the Lord appears on schedule, namely at the end of the Dvāpara-yuga of the twenty-eighth millennium of the seventh Manu in one day of Brahmā, He has no obligation to adhere to such rules and regulations, because He is completely free to act in many ways at His will. He therefore appears by His own will whenever there is a predominance of irreligiosity and a disappearance of true religion. Principles of religion are laid down in the Vedas, and any discrepancy in the matter of properly executing the rules of the Vedas makes one irreligious. In the Bhāgavatam it is stated that such principles are the laws of the Lord. Only the Lord can manufacture a system of religion. The Vedas are also accepted as originally spoken by the Lord Himself to Brahmā, from within his heart. Therefore, the principles of dharma, or religion, are the direct orders of the Supreme Personality of Godhead (dharmaṁ tu sākṣād bhagavat-praṇītam). These principles are clearly indicated throughout the Bhagavad-gītā. The purpose of the Vedas is to establish such principles under the order of the Supreme Lord, and the Lord directly orders, at the end of the Gītā, that the highest principle of religion is to surrender unto Him only, and nothing more. The Vedic principles push one towards complete surrender unto Him; and whenever such principles are disturbed by the demoniac, the Lord appears. From the Bhāgavatam we understand that Lord Buddha is the incarnation of Kṛṣṇa who appeared when materialism was rampant and materialists were using the pretext of the authority of the Vedas. Although there are certain restrictive rules and regulations regarding animal sacrifice for particular purposes in the Vedas, people of demonic tendency still took to animal sacrifice without reference to the Vedic principles. Lord Buddha appeared in order to stop this nonsense and to establish the Vedic principles of nonviolence. Therefore each and every avatāra, or incarnation of the Lord, has a particular mission, and they are all described in the revealed scriptures. No one should be accepted as an avatāra unless he is referred to by scriptures. It is not a fact that the Lord appears only on Indian soil. He can manifest Himself anywhere and everywhere, and whenever He desires to appear. In each and every incarnation, He speaks as much about religion as can be understood by the particular people under their particular circumstances. But the mission is the same – to lead people to God consciousness and obedience to the principles of religion. Sometimes He descends personally, and sometimes He sends His bona fide representative in the form of His son, or servant, or Himself in some disguised form.
The principles of the Bhagavad-gītā were spoken to Arjuna, and, for that matter, to other highly elevated persons, because he was highly advanced compared to ordinary persons in other parts of the world. Two plus two equals four is a mathematical principle that is true in the beginner’s arithmetic class and in the advanced class as well. Still, there are higher and lower mathematics. In all incarnations of the Lord, therefore, the same principles are taught, but they appear to be higher and lower in varied circumstances. The higher principles of religion begin with the acceptance of the four orders and the four statuses of social life, as will be explained later. The whole purpose of the mission of incarnations is to arouse Kṛṣṇa consciousness everywhere. Such consciousness is manifest and nonmanifest only under different circumstances.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 17/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 158: 04వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 158: Chap. 04, Ver. 08
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 158 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 08 🌴
08. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||
🌷. తాత్పర్యం :
సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పున:స్థాపించుటకు ప్రతియుగమునందును నేను అవతరించుచుందును.
🌻. భాష్యము :
భగవద్గీత ప్రకారము సాధువనగా కృష్ణభక్తిభావనాపూర్ణుడని భావము. ఒక వ్యక్తి అధర్మవర్తునునిగా గోచరించినను, కృష్ణభక్తిభావన లక్షణములను సంపూర్ణముగా కలిగియున్నచో అతనిని సాధువుగా అవగతము చేసికొనవలెను. కృష్ణభక్తిభావనను లెక్కజేయనివారే దుష్కృతులనబడుదురు. అట్టి దుష్కృతులు లౌకికవిద్యాపారంగతులైనను మూడులుగును మరియు నరాధములుగును వర్ణింపబడినారు. కాని కృష్ణభక్తి యందు నూటికి నూరుపాళ్ళు మగ్నుడైనవాడు విద్యావంతుడు లేదా నాగరికుడు కాకపోయినను సాధువుగా అంగీకరింపబడును. రావణ,కంసులను వధించిన రీతి నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్యయముగా అవతరింపవలసిన అవసరము లేదు. ఏలయన దానవులను సంహరించుటకు యోగ్యులైన ప్రతినిధులు అతనికి పెక్కుమంది గలరు. అయినను దానవులచే పీడింపబడు తన శుద్ధభక్తులకు ఆనదింపజేయుట కొరకే అతడు ప్రత్యేకముగా అవతరించును. దానవప్రవృత్తి కలవాడు భక్తుని సదా పీడించుచుండును. పీడింపబడెడి భక్తుడు స్వజనుడే అయినప్పటికిని అతడు ఆ కార్యమునకు వెనుదీయడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయుడు. అయినను ఆ దానవుడు ప్రహ్లాదుని మిగుల పీడించెను. కృష్ణుని తల్లియైన దేవకి కంసుని సోదరియైనను, కృష్ణునికి జన్మనొసగనున్నందున ఆమె మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురిచేయబడిరి. కనుక కంసుని వధించుట కన్నను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు ఆవిర్భవించెను. అయినను ఆ రెండుకార్యములు ఏకకాలముననే ఒనరింపబడెను. కనుకనే సాధువులైనవారిని రక్షించి, దుష్టులను నశింపజేయుటకే శ్రీకృష్ణభగవానుడు వివిధ అవతారములకు స్వీకరించునని ఇచ్చట తెలుపబడినది.
🌹 Bhagavad-Gita as It is - 158 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 08 🌴
08. paritrāṇāya sādhūnāṁ
vināśāya ca duṣkṛtām
dharma-saṁsthāpanārthāya
sambhavāmi yuge yuge
🌷 Translation :
To deliver the pious and to annihilate the miscreants, as well as to reestablish the principles of religion, I Myself appear, millennium after millennium.
🌹 Purport :
According to Bhagavad-gītā, a sādhu (holy man) is a man in Kṛṣṇa consciousness. A person may appear to be irreligious, but if he has the qualifications of Kṛṣṇa consciousness wholly and fully, he is to be understood to be a sādhu. And duṣkṛtām applies to those who do not care for Kṛṣṇa consciousness. Such miscreants, or duṣkṛtām, are described as foolish and the lowest of mankind, even though they may be decorated with mundane education, whereas a person who is one hundred percent engaged in Kṛṣṇa consciousness is accepted as a sādhu, even though such a person may be neither learned nor well cultured. As far as the atheistic are concerned, it is not necessary for the Supreme Lord to appear as He is to destroy them, as He did with the demons Rāvaṇa and Kaṁsa. The Lord has many agents who are quite competent to vanquish demons. But the Lord especially descends to appease His unalloyed devotees, who are always harassed by the demoniac. The demon harasses the devotee, even though the latter may happen to be his kin. Although Prahlāda Mahārāja was the son of Hiraṇyakaśipu, he was nonetheless persecuted by his father; although Devakī, the mother of Kṛṣṇa, was the sister of Kaṁsa, she and her husband Vasudeva were persecuted only because Kṛṣṇa was to be born of them. So Lord Kṛṣṇa appeared primarily to deliver Devakī rather than kill Kaṁsa, but both were performed simultaneously. Therefore it is said here that to deliver the devotee and vanquish the demon miscreants, the Lord appears in different incarnations.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 17/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 159: 04వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 159: Chap. 04, Ver. 09
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 159 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 09 🌴
09. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వత: |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున ||
🌷. తాత్పర్యం :
.ఓ అర్జునా! నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీరత్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతికజగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు.
🌻. భాష్యము :
.భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండియే జరుగుననెడి విషయము ఆరవశ్లోకములలో ఇదివరకే తెలుపబడినది. అట్టి అవతారసత్యము నెరిగినవాడు భవబంధముల నుండి ముక్తిని పొందినట్టివాడే కనుక దేహత్యాగానంతరము అతడు శ్రీఘ్రమే భగవద్దామమును తప్పక చేరగలడు. జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏమాత్రము సులభమైన కార్యము కాదు. నిరాకారవాదులు మరియు యోగులు బహుకష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందెడి ముక్తి (భగవానుని నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగుట) కేవలము పాక్షికము మాత్రమే. దానిని సాధించిన పిమ్మటయు భౌతికజగమునకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కాని శ్రీకృష్ణభగవానుని రూపము మరియు కర్మల దివ్యస్వభావమును అవగతము చేసికొనుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట శ్రీకృష్ణదామము పొంది ఈ భౌతికజగమునకు తిరిగి రావలసిన ప్రమాదము నుండి బయటపడుదురు. శ్రీకృష్ణభగవానునకు అనేక రూపములు మరియు అవతారములు కలవని (అద్వైతమచ్యుత మనాది మనంతరూపమ్) బ్రహ్మసంహిత (5.33) యందు తెలుపబడినది. ఈ విధముగా భగవానునకు పలురూపములున్నను ఆ రూపములన్నియును ఏవమే అయియున్నవి మరియు ఆ దేవదేవుడు అద్వితీయుడై యున్నాడు. ఈ సత్యము లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్యతత్త్వవేత్తలకు దురవగ్రాహ్యమైన యున్నను ప్రతియొక్కరు దీనిని విశ్వాసముతో అవగాహన చేసికొనవలెను. వేదములందు (పురుషబోధినీ ఉపనిషత్తు) ఈ విధముగా తెలుపబడినది.
ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపీ హృద్యంతరాత్మా |
“తన విశుద్ధభక్తుల సంబంధమున అద్వితీయుడైన భగవానుడు అనేకానేక దివ్యరూపములలో నిత్యముగా వర్తించుచుండును.” ఈ వేదవాక్యము భగవద్గీత యందలి ఈ శ్లోకములో శ్రీకృష్ణభగవానునిచే నిర్ధారింపబడుచున్నది. కనుక వేదప్రమాణము మరియు భగవానుని ప్రమాణము బట్టి ఈ సత్యమును అంగీకరించి కాలమును తత్త్వకల్పనలచే వృథాచేయనివాడు అత్యున్నత పూర్ణతమ ముక్తస్థితి తప్పక పొందగలడు. అనగా ఈ సత్యమును నిస్సందేహముగా మరియు విశ్వాసముతో అంగీకరించువాడు ముక్తిని పొందుచున్నాడు. వాస్తవమునకు “తత్త్వమసి” అనెడి మహావాక్యము ఈ విషయమున చక్కగా అన్వయమగుచున్నది. ఏలయన ఎవ్వరు శ్రీకృష్ణునే పరతత్త్వముగా అవగతము చేసికొందురో లేదా కృష్ణునితో “ఓ కృష్ణా! నీవే ఆ పరబ్రహ్మము” అని పలుకుదురో వారే శ్రీఘ్రముగా ముక్తిని పొందగలరు. తద్ద్వారా భగవానుని దివ్యసచర్యమును పొందగలుగుట వారికి నిశ్చయము కాగలదు. అనగా అటువంటి శ్రద్ధాపూర్ణుడైన భక్తుడు పూర్ణత్వమును సాధించగలడు. ఈ క్రింది వేదవాక్యము నందు ఈ విషయము నిర్ధారితమైనది.
తమేవ విదిత్వా(తిమృత్యుమేతి నాన్య: పంథా విద్యతే(యనాయ
“కేవలము భగవానుని గూర్చి తెలియుట ద్వారానే జన్మ,మృత్యు విముక్తమైన సంపూర్ణ ముక్తస్థితిని ఎవ్వరైనను పొందగలరు. అట్టి పూర్ణత్వమును బడయుటకు వేరొక్క మార్గము లేదు.” (శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.8) శ్రీకృష్ణుని పూర్ణపురుషోత్తముడగు భగవానునిగా అవగతము చేసికొనలేనివాడు నిక్కముగా తమోగుణమున ఉన్నట్టివాడై ముక్తిని బడయజాలడనుటయే అన్యమార్గము వేరొక్కటి లేదని పలుకుటలో భావము. సీసా యందలి తేనెను సీసాను నాకుట ద్వారా ఆస్వాదించలేనట్లు, లౌకికపాండిత్యము ననుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుటచే అట్టి తమోగుణయుతులు ముక్తిని బడయజాలరు. అట్టి తత్త్వవేత్తలు జగమునందు వివిధములైన ఉన్నతస్థానములను పొందగలిగినను ముక్తికి మాత్రము అర్హులు కాజాలరు. అట్టి గర్వితమతులు కృష్ణభక్తిరసభావనను అత్యంత శ్రద్ధ మరియు జ్ఞానములతో అలవరచుకొని జీవనపూర్ణత్వమును బడయవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 159 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 09 🌴
09. janma karma ca me divyam
evaṁ yo vetti tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti mām eti so ’rjuna
🌷 Translation :
One who knows the transcendental nature of My appearance and activities does not, upon leaving the body, take his birth again in this material world, but attains My eternal abode, O Arjuna.
🌹 Purport :
The Lord’s descent from His transcendental abode is already explained in the sixth verse. One who can understand the truth of the appearance of the Personality of Godhead is already liberated from material bondage, and therefore he returns to the kingdom of God immediately after quitting this present material body.
Such liberation of the living entity from material bondage is not at all easy. The impersonalists and the yogīs attain liberation only after much trouble and many, many births. Even then, the liberation they achieve – merging into the impersonal brahma-jyotir of the Lord – is only partial, and there is the risk of returning to this material world. But the devotee, simply by understanding the transcendental nature of the body and activities of the Lord, attains the abode of the Lord after ending this body and does not run the risk of returning to this material world. In the Brahma-saṁhitā (5.33) it is stated that the Lord has many, many forms and incarnations: advaitam acyutam anādim ananta-rūpam. Although there are many transcendental forms of the Lord, they are still one and the same Supreme Personality of Godhead. One has to understand this fact with conviction, although it is incomprehensible to mundane scholars and empiric philosophers. As stated in the Vedas (Puruṣa-bodhinī Upaniṣad):
eko devo nitya-līlānurakto
bhakta-vyāpī hṛdy antar-ātmā
“The one Supreme Personality of Godhead is eternally engaged in many, many transcendental forms in relationships with His unalloyed devotees.” This Vedic version is confirmed in this verse of the Gītā personally by the Lord. He who accepts this truth on the strength of the authority of the Vedas and of the Supreme Personality of Godhead and who does not waste time in philosophical speculations attains the highest perfectional stage of liberation. Simply by accepting this truth on faith, one can, without a doubt, attain liberation. The Vedic version tat tvam asi is actually applied in this case. Anyone who understands Lord Kṛṣṇa to be the Supreme, or who says unto the Lord, “You are the same Supreme Brahman, the Personality of Godhead,” is certainly liberated instantly, and consequently his entrance into the transcendental association of the Lord is guaranteed. In other words, such a faithful devotee of the Lord attains perfection, and this is confirmed by the following Vedic assertion:
tam eva viditvāti mṛtyum eti
nānyaḥ panthā vidyate ’yanāya
“One can attain the perfect stage of liberation from birth and death simply by knowing the Lord, the Supreme Personality of Godhead, and there is no other way to achieve this perfection.” (Śvetāśvatara Upaniṣad 3.8) That there is no alternative means that anyone who does not understand Lord Kṛṣṇa as the Supreme Personality of Godhead is surely in the mode of ignorance and consequently he will not attain salvation simply, so to speak, by licking the outer surface of the bottle of honey, or by interpreting the Bhagavad-gītā according to mundane scholarship. Such empiric philosophers may assume very important roles in the material world, but they are not necessarily eligible for liberation. Such puffed-up mundane scholars have to wait for the causeless mercy of the devotee of the Lord. One should therefore cultivate Kṛṣṇa consciousness with faith and knowledge, and in this way attain perfection.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 18/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 160: 04వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 160: Chap. 04, Ver. 10
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 160 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 10 🌴
10. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితా: |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా: ||
🌷. తాత్పర్యం :
రాగము, భయము, క్రోధము నుండి విడివాడి, నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్యప్రేమను పొందగలిగిరి.
🌻. భాష్యము :
పైన వర్ణింపబడినట్లు భౌతికభావన యందు మగ్నమైనవానికి పరతత్త్వము యొక్క రూపసహితత్వమును అవగతము చేసికొనుట అత్యంత కఠిన విషయము. దేహాత్మభావన యందే ఆసక్తమైన జనులు సాధారణముగా భౌతికతత్త్వమునందే మునిగి యున్నందున పరతత్త్వము ఏ విధముగా రూపసహితమై యున్నదో అవగతము చేసికొనజాలరు. అట్టి లౌకికులు నాశము పొందనిదియు, జ్ఞానపూర్ణమైనదనియు, ఆనంద స్వరూపమైనదనియు నైన ఆధ్యాత్మిక దేహమొకటి కలదని ఊహింపలేరు. భౌతికభావన యందు దేహము నశించునది, అజ్ఞానపూర్ణమైనది మరియు దుఃఖభూయిష్టమైనది అయియున్నది. కనుకనే భగవానుని దేహమును గూర్చి తెలుపగనే సాధారణముగా జనసామాన్యము అదే దేహభావనను మనస్సులో అన్వయించుకొందురు. అటువంటి లౌకికులకు విశ్వరూపమే పరతత్త్వము. తత్కారణముగా వారు పరతత్త్వమును నిరాకారమని భావింతురు. అదియును గాక భౌతికభావనలో సంపూర్ణముగా మునిగియున్నందున ముక్తి పిదపయు వ్యక్తిత్వమును నిలుపుకొనుట యనెడి భావన వారికి అత్యంత భయమును కలుగజేయును. అట్టివారికి ఆధ్యాత్మిక జీవనమనగా వ్యక్తిగతము మరియు రూపసహితమని తెలిపినపుడు తిరిగి రూపమును పొందుట మిక్కిలి జంకి నిరాకారత్వమునందు లీనమగుటనే వాంచింతురు. సాధారణముగా వారు జీవులను సముద్రమునందలి నీటి బుడగలతో పోల్చుదురు. నీటిబుడగలు సముద్రములో కలసిపోవు రీతిగా వ్యక్తిత్వమనునదిలేక బ్రహ్మములో లీనమగుట వారికి అత్యుత్తమ పూర్ణత్వస్థితియై యున్నది. వాస్తవమునకు అది ఆధ్యాత్మికతను ఏమాత్రము అవగాహన చేసికొనలేనివారు కొందరుందురు. అనేకములైన సిద్ధాంతములు మరియు తాత్విక కల్పనల యొక్క విరుద్ధవాదములచే విసుగుచెంది కోపముతో వారు పరమైన కారణమేదియును లేదనియు, చివరికి అంతయు శూన్యమేయనియు మూర్ఖముగా నిర్దారింతురు. అట్టివారు రోగగ్రస్థస్థితిలో నున్నట్టివారు. అనగా కొందరు భౌతికత్వమునందు ఆసక్తులై ఆధ్యాత్మికజీవనము నెడ అనాసక్తులు కాగా, కొందరు పరబ్రహ్మములో లీనము కాగోరుదురు. మరికొందరు విసుగుతో సర్వవిధములైన తాత్వికకల్పనల యెడ క్రోధాముపూని దేనిని కుడా విశ్వసింపరు. ఇటువంటి చివరి తెగవారు మాదకద్రవ్యములను ఆశ్రయించి, వాటి ద్వారా కలిగెడి మత్తునే కొన్నిమార్లు ఆధ్యాత్మికానుభుతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మికజీవనము నెడ భయము, విసుగు చెందిన జీవనము కలిగెడి శూన్యభావనము అనెడి మూడుస్థితుల భౌతికప్రపంచాసక్తిని మనుజుడు త్యజించవలెను. భౌతికజీవనపు ఈ మూడుస్థితుల నుండి బయటపడుటకు మనుజుడు త్యజించవలెను. భౌతికజీవనపు ఈ మూడుస్థితుల నుండి బయటపడుటకు మనుజుడు గురువు నేతృత్వమున శ్రీకృష్ణభగవానుని సంపూర్ణ శరణాగతిని పొంది, భక్తియుక్త జీవనపు నియమనిబంధనలను అనుసరింపవలెను. అటువంటి భక్తిమయజీవనపు చివరి స్థితియే “భావము” లేదా శ్రీకృష్ణభగవానుని దివ్యప్రేమగా పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 160 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 10 🌴
10. vīta-rāga-bhaya-krodhā
man-mayā mām upāśritāḥ
bahavo jñāna-tapasā
pūtā mad-bhāvam āgatāḥ
🌷 Translation :
Being freed from attachment, fear and anger, being fully absorbed in Me and taking refuge in Me, many, many persons in the past became purified by knowledge of Me – and thus they all attained transcendental love for Me.
🌹 Purport :
As described above, it is very difficult for a person who is too materially affected to understand the personal nature of the Supreme Absolute Truth. Generally, people who are attached to the bodily conception of life are so absorbed in materialism that it is almost impossible for them to understand how the Supreme can be a person. Such materialists cannot even imagine that there is a transcendental body which is imperishable, full of knowledge and eternally blissful. In the materialistic concept, the body is perishable, full of ignorance and completely miserable. Therefore, people in general keep this same bodily idea in mind when they are informed of the personal form of the Lord. For such materialistic men, the form of the gigantic material manifestation is supreme.
Consequently they consider the Supreme to be impersonal. And because they are too materially absorbed, the conception of retaining the personality after liberation from matter frightens them. When they are informed that spiritual life is also individual and personal, they become afraid of becoming persons again, and so they naturally prefer a kind of merging into the impersonal void. Generally, they compare the living entities to the bubbles of the ocean, which merge into the ocean. That is the highest perfection of spiritual existence attainable without individual personality. This is a kind of fearful stage of life, devoid of perfect knowledge of spiritual existence. Furthermore there are many persons who cannot understand spiritual existence at all. Being embarrassed by so many theories and by contradictions of various types of philosophical speculation, they become disgusted or angry and foolishly conclude that there is no supreme cause and that everything is ultimately void. Such people are in a diseased condition of life. Some people are too materially attached and therefore do not give attention to spiritual life, some of them want to merge into the supreme spiritual cause, and some of them disbelieve in everything, being angry at all sorts of spiritual speculation out of hopelessness. This last class of men take to the shelter of some kind of intoxication, and their affective hallucinations are sometimes accepted as spiritual vision. One has to get rid of all three stages of material consciousness: attachment to material life, fear of a spiritual personal identity, and the conception of void that arises from frustration in life. To get free from these three stages of the material concept of life, one has to take complete shelter of the Lord, guided by the bona fide spiritual master, and follow the disciplines and regulative principles of devotional life. The last stage of the devotional life is called bhāva, or transcendental love of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 19/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 161: 04వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 161: Chap. 04, Ver. 11
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 161 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 11 🌴
11. యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ వర్త్మానువర్తన్తే మనుష్యా: పార్థ సర్వశ: ||
🌷. తాత్పర్యం :
ఎవరు ఏ విధముగా నన్ను శరణువేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థా! ప్రతియొక్కరు అన్నివిధములా నా మార్గమునే అనుసరింతురు.
🌻. భాష్యము :
ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానునే అతని వివిధరూపములందు అన్వేషించుచున్నారు. నిరాకారబ్రహ్మజ్యోతి తేజమునందును మరియు కణములతో సహా సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాపియైన పరమాత్మ యందును దేవదేవుడైన శ్రీకృష్ణుడు కేవలము పాక్షికముగా అనుభూతమగుడును. విశుద్ధభక్తులే అతనిని పూర్ణముగా అనుభూతమొనర్చుకొనగలరు. అనగా శ్రీకృష్ణుడే ప్రతియెక్కరికిని అనుభవధ్యేయమై యున్నాడు. ఆ విధముగా ప్రతియొక్కరు ఆ దేవదేవుని పొందగోరిన విధము ననుసరించి తృప్తిని బడయుచుందురు. ఆధ్యాత్మికజగత్తునందు సైతము శ్రీకృష్ణుడు భక్తులు కోరినరీతిగా దివ్యభావనలో వారితో వర్తింతును. ఒక భక్తుడు కృష్ణుని పరమ యజమనిగా కోరవచ్చును. మరియొకరు అతనిని స్నేహితునుగా పొందగోరువచ్చును. ఇంకొకరు పుత్రునిగా కోరవచ్చును. ఇంకను ఒకడు ప్రియునిగా కోరవచ్చును. తన యెడగల ప్రేమస్థాయి ననుసరించి శ్రీకృష్ణుడు వారికి సమముగా వరదానము కావించును. భౌతికజగమునందు కూడా అట్టి పరస్పర భావవినియము కలదు. అట్టి భావములు భగవానుడు మరియు వివిధ భక్తుల నడుమ ఒనగూడుచునే ఉండును. అనగా శుద్ధభక్తులు భౌతికజగము నందును మరియు ఆధ్యాత్మికజగము నందును భగవానునితో సాహచర్యమును పొంది, సేవను గూర్చును, ఆ విధముగా అతని ప్రేమమయ సేవలో దివ్యమైన ఆధ్యాత్మికానందమును పొందుచుందురు. జీవుని వ్యక్తిత్వమును నశింపజేయుట ద్వారా సాయుజ్యముక్తిని (ఆధ్యాత్మికముగా ఆత్మహత్యయే) వాంచించు నిరాకారవాదులను కూడా శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతి యందు ఐక్యమొనర్చుకొని కరుణించుచుండును. అట్టి నిరాకారవాదులు భగవానుని సచ్చిదానందవిగ్రహమును అంగీకరింపని కారణముగా తమ వ్యక్తిత్వమును కోల్పోయి భగవానుని దివ్యమైన అంతరంగిక సేవ యందలి ఆనందమును అనుభవింపలేరు. అటువంటి నిరాకారత్వమునందును స్థిరముగా నెలకొనజాలనివారు తిరిగి భౌతికజగమునకు వచ్చి కర్మల యెడ గల నిద్రాణముగా నున్న తమ కోరికలను ప్రదర్శింతురు. వారికి ఎన్నడును ఆధ్యాత్మికజగములందు ప్రవేశము లభింపడు. కేవలము భౌతికజగమునందే వర్తించుటకు వారికి అవకాశము కల్పింపబడును. కామ్యకర్మరతులైనవారికి శ్రీకృష్ణభగవానుడు యజ్ఞేశ్వరుని రూపమున వారి విధ్యుక్తధర్మములకు తగిన ఫలమును ఒసగుచుండును. అలాగుననే సిద్ధులను కోరెడి యోగులకు అట్టి సిద్ధులను సమకూర్చుచుండును. అనగా ప్రతియొక్కరు తమ కర్మల యందు జయము కొరకు శ్రీకృష్ణుని పైననే ఆధారపడియున్నారు. అట్టి ఆధ్యాత్మికవిధానములన్నియును ఒకే మార్గమునందు గల వివిధస్థాయిల జయములు మాత్రమే అయియున్నవి. కనుకనే శ్రీమద్భాగవతము (2.3.10) నందు తెలుపిన రీతి మనుజుడు కృష్ణభక్తిభావన యందలి అత్యున్నత పూర్ణత్వస్థితికి చేరనంతవరకు సమస్త యత్నములు అసంపూర్ణములే కాలవు.
అకామ: సర్వకామో వా మోక్షకామ ఉదారధీ: |
తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరమ్ ||
“కోరికలు లేకున్నను (భక్తుల సహజస్థితి) లేదా కామ్యకర్మఫలములను కోరినను లేదా మోక్షవాంఛను కూడియున్నను ప్రతియొక్కరు తమ ఇచ్చాపూర్ణత్వము తుదకు కృష్ణభక్తిరసభావనలో మార్పుచెందు రీతిగా శాయశక్తులా దేవదేవుడైన శ్రీకృష్ణునే అర్చింపవలయును.”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 161 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 11 🌴
11. ye yathā māṁ prapadyante
tāṁs tathaiva bhajāmy aham
mama vartmānuvartante
manuṣyāḥ pārtha sarvaśaḥ
🌷 Translation :
As all surrender unto Me, I reward them accordingly. Everyone follows My path in all respects, O son of Pṛthā.
🌹 Purport :
Everyone is searching for Kṛṣṇa in the different aspects of His manifestations. Kṛṣṇa, the Supreme Personality of Godhead, is partially realized in His impersonal brahma-jyotir effulgence and as the all-pervading Supersoul dwelling within everything, including the particles of atoms. But Kṛṣṇa is fully realized only by His pure devotees. Consequently, Kṛṣṇa is the object of everyone’s realization, and thus anyone and everyone is satisfied according to one’s desire to have Him. In the transcendental world also, Kṛṣṇa reciprocates with His pure devotees in the transcendental attitude, just as the devotee wants Him.
One devotee may want Kṛṣṇa as supreme master, another as his personal friend, another as his son and still another as his lover. Kṛṣṇa rewards all the devotees equally, according to their different intensities of love for Him. In the material world, the same reciprocations of feelings are there, and they are equally exchanged by the Lord with the different types of worshipers. The pure devotees both here and in the transcendental abode associate with Him in person and are able to render personal service to the Lord and thus derive transcendental bliss in His loving service. As for those who are impersonalists and who want to commit spiritual suicide by annihilating the individual existence of the living entity, Kṛṣṇa helps also by absorbing them into His effulgence. Such impersonalists do not agree to accept the eternal, blissful Personality of Godhead; consequently they cannot relish the bliss of transcendental personal service to the Lord, having extinguished their individuality. Some of them, who are not firmly situated even in the impersonal existence, return to this material field to exhibit their dormant desires for activities. They are not admitted into the spiritual planets, but they are again given a chance to act on the material planets. For those who are fruitive workers, the Lord awards the desired results of their prescribed duties, as the yajñeśvara; and those who are yogīs seeking mystic powers are awarded such powers. In other words, everyone is dependent for success upon His mercy alone, and all kinds of spiritual processes are but different degrees of success on the same path. Unless, therefore, one comes to the highest perfection of Kṛṣṇa consciousness, all attempts remain imperfect, as is stated in the Śrīmad-Bhāgavatam (2.3.10):
akāmaḥ sarva-kāmo vā
mokṣa-kāma udāra-dhīḥ
tīvreṇa bhakti-yogena
yajeta puruṣaṁ param
“Whether one is without desire [the condition of the devotees], or is desirous of all fruitive results or is after liberation, one should with all efforts try to worship the Supreme Personality of Godhead for complete perfection, culminating in Kṛṣṇa consciousness.”
🌹 🌹 🌹 🌹 🌹
Date: 20/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 162: 04వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 162: Chap. 04, Ver. 12
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 162 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 12 🌴
12. కాంక్షన్త: కర్మాణాం సిద్ధిం యజన్త ఇహ దేవతా: |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||
🌷. తాత్పర్యం :
లోకమున జనులు కామ్యకర్మల యందు జయమును గోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు.
🌻. భాష్యము :
ఈ జగమున దైవమును గూర్చి లేదా దేవతలను గూర్చియు గొప్ప తప్పు భావన కలదు. అల్పజ్ఞులైనవారు (విద్వాంసులుగా చలామణి అగుచున్నను) దేవతలను భగవానుని వివిధరూపములుగా భావింతురు. కాని వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధరూపములు కారు. వారు కేవలము అతని అంశాలు మాత్రమే. భగవానుడొక్కడే కాని అతని అంశలు మాత్రము అనతములు. “నిత్యోనిత్యానాం” – భగవానుడొక్కడే యని వేదములు తెలుపుచున్నవి. “ఈశ్వర: పరమ: కృష్ణ:” – దేవదేవుడు అద్వితీయుడు. ఆతడే శ్రీకృష్ణుడు. భౌతికజగమును పాలించుటకు పాలనాధికారము ఒసగబడెడివారే దేవతలు. వారందరును వివిధశక్తులు కలిగిన జీవులు(నిత్యనాం) మాత్రమే. వారెన్నడను దేవదేవుడైన శ్రీకృష్ణునితో లేదా నారాయణునితో లేదా విష్ణువుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు మరియు శ్రీకృష్ణభగవానుడు సమానమే యని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడని పిలువబడును. బ్రహ్మ మరియు శివుని వంటి మహా దేవతలే ఆ భగవానునకు సాటిరారు. వాస్తవమునకు భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలచే పూజలనందుచుండును(శివవిరించితమ్). అయినను ఆశ్చర్యవిషయమేమన మూఢజనులు కొందరు భగవానునికి మనుష్యరూపమును ఆపాదించుట లేదా భగవానునికి జంతురూపము నపాదించుట వంటి అపోహలో పలువురు మానవులన పూజించుచుందురు. ఈ శ్లోకమున “ఇహదేవతా:” అణు పదము ఈ లోకమునకు చెందిన శక్తిమంతుడైన మనుజుని గాని, దేవతను గాని సూచించును. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుడు (నారాయణుడు లేదా విష్ణువు) ఈ లోకమునకు చెందినవాడుకాడు. అతడు ఈ భౌతికజగమునకు పరమైనట్టివాడు. మాయావాదులకు గురువైన శంకరాచార్యులు సైతము శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతికజగమునకు పరమైనవాడని అంగీకరించిరి. కాని మూఢజనులు (హృతజ్ఞానులు) శీఘ్రఫలములను గోరినందున వివిధదేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను, అవి అశాశ్వతములనియు మరియు బుద్ధిహీనులకు మాత్రమే నిర్దేశింపబడినవనియు ఎరుగజాలరు. కాని బుద్ధిమంతుడైనవాడు కృష్ణభక్తిభావన యందు నిలిచిన కారణముగా ఏదియో తాత్కాలిక లాభము కొరకై వివిధ దేవతలను అర్చింప నవసరము లేదు. వాస్తవమునకు దేవతలు మరియు వారిని పూజించెడి వారందరును విశ్వప్రళయమున నశించిపోవుదురు. అంతియేగాక దేవతా ఫలములన్నియును భౌతికములు మరియు అశాశ్వతములు అయియున్నవి. భౌతికజగములు మరియు వాటి యందు నివసించువారు (దేవతలు మరియు వారిని అర్పించువారు) అనెడి రెండు అంశములును విశ్వసముద్రములో బుడగలను పోలును. అయినను ఈ జగమునందు మనుజులు గృహక్షేత్రములు, చక్కని కుటుంబము, భోగ్యసంపత్తి వంటి అశాశ్వత విషయముల యెడ అనురక్తులగుదురు. అటువంటి తాత్కాలికములైన వాటిని పొందుటకు వారు దేవతలను గాని, శక్తిమంతుడైన మనుమనుజుని గాని పూజించుచుందురు. ఎవరేని ఒక రాజకీయనాయకుని సేవించుట ద్వారా ప్రభుత్వమునందు మంత్రిపదవి లభించినచో మనుజుడు గొప్ప లాభమును పొందినట్లుగా భావించును. కనుకనే ప్రతియొక్కరు అట్టి (అశాశ్వత) ఫలములను పొందుటకు నామమాత్ర నాయకులకు దండప్రణామము లాచరించుచుందురు. వారు ఆ ఫలములను తప్పక పొందుదురు. కాని అట్టి ముడులు భౌతికజీవన క్లేశములకు శాశ్వత పరిష్కారమును కలుగజేయు కృష్ణభక్తిభావన యందు ప్రియమును ఏమాత్రము ప్రదర్శించరు. వారు సదా ఇంద్రియభోగమునే వాంచించి, దానిని కొద్దిగా పొందుటకు శక్తినొసగబడిన జీవుల(దేవతల) అర్చనకు ఆకర్షితులగుదురు. అనగా సాధారణముగా జనులు కృష్ణభక్తిభావన యందు అభిరుచిని కలిగియుండరని ఈ శ్లోకము తెలుపుచున్నది. వారు దాదాపు విషయభోగమునందే అభిరుచిని కలిగియుండి ఎవరో ఒక శక్తిమంతుడైన జీవుని పూజించుచుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 162 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 12 🌴
12. kāṅkṣantaḥ karmaṇāṁ siddhiṁ
yajanta iha devatāḥ
kṣipraṁ hi mānuṣe loke
siddhir bhavati karma-jā
🌷 Translation :
Men in this world desire success in fruitive activities, and therefore they worship the demigods. Quickly, of course, men get results from fruitive work in this world.
🌹 Purport :
There is a great misconception about the gods or demigods of this material world, and men of less intelligence, although passing as great scholars, take these demigods to be various forms of the Supreme Lord.
Actually, the demigods are not different forms of God, but they are God’s different parts and parcels. God is one, and the parts and parcels are many. The Vedas say, nityo nityānām: God is one. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ. The Supreme God is one – Kṛṣṇa – and the demigods are delegated with powers to manage this material world. These demigods are all living entities (nityānām) with different grades of material power. They cannot be equal to the Supreme God – Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa. Anyone who thinks that God and the demigods are on the same level is called an atheist, or pāṣaṇḍī. Even the great demigods like Brahmā and Śiva cannot be compared to the Supreme Lord. In fact, the Lord is worshiped by demigods such as Brahmā and Śiva (śiva-viriñci-nutam). Yet curiously enough there are many human leaders who are worshiped by foolish men under the misunderstanding of anthropomorphism or zoomorphism. Iha devatāḥ denotes a powerful man or demigod of this material world. But Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa, the Supreme Personality of Godhead, does not belong to this world. He is above, or transcendental to, material creation. Even Śrīpāda Śaṅkarācārya, the leader of the impersonalists, maintains that Nārāyaṇa, or Kṛṣṇa, is beyond this material creation. However, foolish people (hṛta-jñāna) worship the demigods because they want immediate results. They get the results, but do not know that results so obtained are temporary and are meant for less intelligent persons. The intelligent person is in Kṛṣṇa consciousness, and he has no need to worship the paltry demigods for some immediate, temporary benefit. The demigods of this material world, as well as their worshipers, will vanish with the annihilation of this material world. The boons of the demigods are material and temporary. Both the material worlds and their inhabitants, including the demigods and their worshipers, are bubbles in the cosmic ocean. In this world, however, human society is mad after temporary things such as the material opulence of possessing land, family and enjoyable paraphernalia. To achieve such temporary things, people worship the demigods or powerful men in human society. If a man gets some ministership in the government by worshiping a political leader, he considers that he has achieved a great boon. All of them are therefore kowtowing to the so-called leaders or “big guns” in order to achieve temporary boons, and they indeed achieve such things. Such foolish men are not interested in Kṛṣṇa consciousness for the permanent solution to the hardships of material existence. They are all after sense enjoyment, and to get a little facility for sense enjoyment they are attracted to worshiping empowered living entities known as demigods. This verse indicates that people are rarely interested in Kṛṣṇa consciousness. They are mostly interested in material enjoyment, and therefore they worship some powerful living entity.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 21/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 163: 04వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 163: Chap. 04, Ver. 13
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 163 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 13 🌴
13. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశ: |
తస్య కర్తారామపి మాం విద్ధ్యకర్తారమవ్యయం ||
🌷. తాత్పర్యం :
ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మల ననుసరించి మానవసంఘమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలిసికొనుము.
🌻. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడే సమస్తమునాకు సృష్టికర్త. ప్రతిదియు అతని నుండియే సృష్టింపబడి, అతని యందే స్థితిననొంది, అంత్యమున లయము పిమ్మట అతని యందే విశ్రమించును. కనుకనే అతడు సత్త్వగుణమునందు నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు బుద్ధిమంతులైన జనులతో మొదలయ్యెడి చాతుర్వర్ణ్య వ్యవస్థకు సృష్టికర్త అయినాడు. భ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ యందలి తరువాతివారు రజోగుణమున స్థితిని కలిగి క్షత్రియులుగా పిలువబడు పరిపాలనాదక్షత గలవారు. తరువాతివారు రజస్తమోగుణముల మిశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్థులు. ఇక నాలుగవ వర్ణమువారు తమోగుణము నందుండి శూద్రులుగా పిలువబడు శ్రామికవర్గము. మానవసంఘము నందలి ఈ నాలుగువర్ణములను సృష్టించినప్పటికిని బద్ధజీవులలో ఒక భాగమైన మానవసంఘమున తాను ఒక బద్ధజీవిని కానందున శ్రీకృష్ణభగవానుడు ఈ వర్ణములలో దేనికిని చెందినవాడు కాడు. వాస్తవమునకు మానవజాతికి మరియు జంతుజాతికి భేదమేమియును లేదు. కాని మానవుని అట్టి జంతుస్థాయి నుండి ఉద్ధరించి, అతని యందు కృష్ణభక్తిరసభావనను వృద్ధిచేయుట కొరకే శ్రీకృష్ణభగవానుడు ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థను సృష్టించినాడు. కర్మ యెడ మనుజుని స్వభావము అతడు పొందియున్నట్టి గుణములను బట్టి నిర్ణయింపబడును. త్రిగుణముల వలన కలిగెడి అట్టి జీవనలక్షణములను(స్వభావమూలను) గూర్చి రాబోవు అష్టాదశాధ్యాయమున వివరింపబడినది. అయినను కృష్ణభక్తిరసభావితుడు బ్రాహ్మణుల కన్నను ఉన్నతుడైనట్టివాడు. బ్రహ్మణులైనవారు తమ గుణము ననుసరించి పరతత్త్వము నెరుగవలసియున్నను, వారిలో అధికభాగము శ్రీకృష్ణభగవానుని నిరాకారబ్రహ్మభావన వైపునకే ఎక్కువ మ్రొగ్గు చూపుదురు. కాని మనుజుడు అట్టి పరిమితమైన బ్రహ్మణజ్ఞానమును అధిగమించి దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన దివ్యజ్ఞానమును పొందగలిగినచో కృష్ణభక్తిరసభావనా జ్ఞానమునందు ఇమిడియున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ్య వ్యవస్థకు అతీతుడైనట్లే, కృష్ణభక్తిరసభావితుడు సైతము జాతి, దేశ, వర్గాది మానవసంఘ విభాగములకు అతీతుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 163 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 13 🌴
13. cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ
guṇa-karma-vibhāgaśaḥ
tasya kartāram api māṁ
viddhy akartāram avyayam
🌷 Translation :
According to the three modes of material nature and the work associated with them, the four divisions of human society are created by Me. And although I am the creator of this system, you should know that I am yet the non-doer, being unchangeable.
🌹 Purport :
The Lord is the creator of everything. Everything is born of Him, everything is sustained by Him, and everything, after annihilation, rests in Him. He is therefore the creator of the four divisions of the social order, beginning with the intelligent class of men, technically called brāhmaṇas due to their being situated in the mode of goodness. Next is the administrative class, technically called the kṣatriyas due to their being situated in the mode of passion. The mercantile men, called the vaiśyas, are situated in the mixed modes of passion and ignorance, and the śūdras, or laborer class, are situated in the ignorant mode of material nature. In spite of His creating the four divisions of human society, Lord Kṛṣṇa does not belong to any of these divisions, because He is not one of the conditioned souls, a section of whom form human society. Human society is similar to any other animal society, but to elevate men from the animal status, the above-mentioned divisions are created by the Lord for the systematic development of Kṛṣṇa consciousness. The tendency of a particular man toward work is determined by the modes of material nature which he has acquired. Such symptoms of life, according to the different modes of material nature, are described in the Eighteenth Chapter of this book. A person in Kṛṣṇa consciousness, however, is above even the brāhmaṇas.
Although brāhmaṇas by quality are supposed to know about Brahman, the Supreme Absolute Truth, most of them approach only the impersonal Brahman manifestation of Lord Kṛṣṇa. But a man who transcends the limited knowledge of a brāhmaṇa and reaches the knowledge of the Supreme Personality of Godhead, Lord Śrī Kṛṣṇa, becomes a person in Kṛṣṇa consciousness – or, in other words, a Vaiṣṇava. Kṛṣṇa consciousness includes knowledge of all different plenary expansions of Kṛṣṇa, namely Rāma, Nṛsiṁha, Varāha, etc. And as Kṛṣṇa is transcendental to this system of the four divisions of human society, a person in Kṛṣṇa consciousness is also transcendental to all divisions of human society, whether we consider the divisions of community, nation or species.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 22/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 164: 04వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 164: Chap. 04, Ver. 14
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 164 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 14 🌴
14. న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యో(భిజానాతి కర్మభిర్న స బధ్యతే ||
🌷. తాత్పర్యం :
నన్ను ఏ కర్మము ప్రభావితము చేయజాలదు; నేను యెట్టి కర్మఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు సైతము కర్మఫలములచే బంధింపబడడు.
🌻. భాష్యము :
దేశేములేనేడి రాజు తప్పుచేసెడి అవకాశములేదనియు లేదా రాజ్యాంగశాసనములకు అతడు అతీతుడై యుండుననియు పలికెడి భౌతికజగత్తుకు సంబంధించిన రాజ్యశసనములు కలవు. అదేవిధముగా భగవానుడు ఈ భౌతికజగత్తుకు సృష్టికర్తయైనప్పటికి అట్టి జగత్కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు ఈ జగమును సృష్టించి దానికి పరముగా నిలిచియుండగా, ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహించు స్వభావముతో జీవులు వివిధ కామ్యకర్మఫలములందు బంధితులగుదురు. ఉదాహరణమునకు ఒక సంస్థ యందలి పనివారి మంచి మరియు చెడుకర్మలకు వారే బాధ్యులు కాగలరుగాని సంస్థ యొక్క యజమాని కాదు. అదే విధముగా ఈ జగమునందు జీవులందరును తమ తమ ఇంద్రియభోగకర్మల యందు మగ్నులై యున్నారు. అట్టి కర్మలను భగవానుడేమియును నిర్దేశించియుండలేదు. అయినను జీవులు భోగానుభవవృద్ధి కొరకు ఈ జగత్తు నందలి కర్మల యందు నియుక్తులై, మరణానంతరము స్వర్గలోకమును పొందవలెనని వాంచింతురు. పూర్ణుడైనందున శ్రీకృష్ణభగవానుడు ఎన్నడును నామమాత్ర స్వర్గభోగములందు ఆకర్షణను కలిగియుండడు. వాస్తవమునాకు స్వర్గవాసులైన దేవతలందరును అతని సేవకులే. పనివారు వాంచించెడి తుచ్చ సౌఖ్యమును, ఆనందమును యజమాని ఎన్నడును కోరడు. కర్మలకు మరియు కర్మఫలములకు అతడు సర్వదా అతీతుడై యుండును. ఉదాహరణమునాకు భూమిపై ఉద్బవించు వృక్షజాలమునకు వర్షము కారణము కాకున్నను, వర్షము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశము లేదు. ఈ విషయమున వేదస్మృతి ఇట్లు నిర్ధారించుచున్నది.
నిమిత్తమాత్రమేవాసౌ సృజ్యానాం సర్గకర్మణి |
ప్రధానకారణిభూతా యతో వై సృజ్యశక్తయ: ||
“భౌతికసృష్టుల యందు భగవానుడు ప్రధానకారణుడు మాత్రమే. ప్రకృతియే వాటికి నిమిత్తకారణమై జగత్తును గోచరింపజేయుచున్నది.” సృష్టింపబడెడి దేవ, మనుష్య, మృగాది సర్వవిధజీవులు గత పుణ్య, పాపకర్మల ఫలములచే ప్రభావితము కావలసినదే. భగవానుడు వారికి కర్మల నొనరించు నిమిత్తమై తగిన సదుపాయములను గూర్చుచు త్రిగుణములను నియమించుచునే గాని వారి పూర్వ, ప్రస్తుత కర్మలకు బాధ్యతను వహింపడు. “వైషమ్యనైర్గుణ్యేన సాపేక్షత్వాత్ – భగవానుడు ఏ జీవి యెడను పక్షపాతమును కలిగియుండడు” అని వేదాంతసూత్రము (2.1.34) నిర్ధారించుచున్నది. అనగా వాస్తవమునాకు జీవుడే తన కర్మలకు బాధ్యుడై యునాడు. భగవానుడు అతనకి ప్రకృతి ద్వారా కేవలము సౌకర్యములను మాత్రమే కూర్చుచుండును. కర్మసిద్ధాంతపు ఈ రహస్యములను తెలిసినవాడు కర్మఫలములచే ఎన్నడును ప్రభావితుడు కాడు. అనగా శ్రీకృష్ణభగవానుని దివ్యతత్త్వమును అవగతము చేసికొనినవాడు కృష్ణభక్తిరసభావన యందు నిష్ణాతుడు కాగలడు. ఆ విధముగా అతడు ఎన్నడును కర్మసిద్ధాంతముచే ప్రభావితుడు కాడు. అట్లుకాక శ్రీకృష్ణుని దివ్యత్వమును ఎరుగక, సాధారణజీవుల కర్మల వలెనే అతని కర్మలు సైతము ఫలప్రాప్తి కొరకే ఉద్దేశింపబడినవని భ్రమించువాడు కర్మఫలములచే నిక్కముగా బంధితుడు కాగలడు. కాని పరమసత్యము నెరిగినవాడు కృష్ణభక్తిభావన యందు స్థితుడైనట్టి ముక్తపురుషుడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 164 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 14 🌴
14. na māṁ karmāṇi limpanti
na me karma-phale spṛhā
iti māṁ yo ’bhijānāti
karmabhir na sa badhyate
🌷 Translation :
There is no work that affects Me; nor do I aspire for the fruits of action. One who understands this truth about Me also does not become entangled in the fruitive reactions of work.
🌹 Purport :
As there are constitutional laws in the material world stating that the king can do no wrong, or that the king is not subject to the state laws, similarly the Lord, although He is the creator of this material world, is not affected by the activities of the material world. He creates and remains aloof from the creation, whereas the living entities are entangled in the fruitive results of material activities because of their propensity for lording it over material resources. The proprietor of an establishment is not responsible for the right and wrong activities of the workers, but the workers are themselves responsible.
The living entities are engaged in their respective activities of sense gratification, and these activities are not ordained by the Lord. For advancement of sense gratification, the living entities are engaged in the work of this world, and they aspire to heavenly happiness after death. The Lord, being full in Himself, has no attraction for so-called heavenly happiness. The heavenly demigods are only His engaged servants. The proprietor never desires the low-grade happiness such as the workers may desire. He is aloof from the material actions and reactions. For example, the rains are not responsible for different types of vegetation that appear on the earth, although without such rains there is no possibility of vegetative growth. Vedic smṛti confirms this fact as follows:
nimitta-mātram evāsau
sṛjyānāṁ sarga-karmaṇi
pradhāna-kāraṇī-bhūtā
yato vai sṛjya-śaktayaḥ
“In the material creations, the Lord is only the supreme cause. The immediate cause is material nature, by which the cosmic manifestation is made visible.” The created beings are of many varieties, such as the demigods, human beings and lower animals, and all of them are subject to the reactions of their past good or bad activities. The Lord only gives them the proper facilities for such activities and the regulations of the modes of nature, but He is never responsible for their past and present activities. In the Vedānta-sūtra (2.1.34) it is confirmed, vaiṣamya-nairghṛṇye na sāpekṣatvāt: the Lord is never partial to any living entity. The living entity is responsible for his own acts. The Lord only gives him facilities, through the agency of material nature, the external energy. Anyone who is fully conversant with all the intricacies of this law of karma, or fruitive activities, does not become affected by the results of his activities. In other words, the person who understands this transcendental nature of the Lord is an experienced man in Kṛṣṇa consciousness, and thus he is never subjected to the laws of karma. One who does not know the transcendental nature of the Lord and who thinks that the activities of the Lord are aimed at fruitive results, as are the activities of the ordinary living entities, certainly becomes entangled himself in fruitive reactions. But one who knows the Supreme Truth is a liberated soul fixed in Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 23/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 165: 04వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 165: Chap. 04, Ver. 15
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 165 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 15 🌴
15. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పుర్వైరపి ముముక్షుభి: |
కురు కర్మైవ తస్మాత్త్వం పుర్వై: పూర్వతరం కృతమ్ ||
🌷. తాత్పర్యం :
పూర్వకాలమున ముక్తపురుషులందరు నా దివ్యతత్త్వపు ఈ అవగాహనతోనే కర్మలను ఒనరించియుండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మనొనరింపుము.
🌻. భాష్యము :
మానవులలో రెండు తరగతులవారు కలరు. ఒకరు హృదయమునందు మలినభావములను కలవారు కాగా, మిగిలినవారు కల్మషదూరులై యుందురు. ఈ ఇరువురికిని కృష్ణభక్తిరసభావానము సమానముగా శ్రేయోదాయకమైనదే. మలినచిత్తులు భక్తియోగము నందలి నియమితసూత్రములను అనుసరించుచు పవిత్రతను పొందుటకై కృష్ణభక్తి విధానమును స్వీకరింపవచ్చును. విషయమాలిన్యము తొలగియున్నవారు సైతము ఈ కృష్ణభక్తిభావన యందు కొనసాగుచు, ఇతరులు తమను అనుసరించి లాభపడురీతిలో ఆదర్శముగా కర్మల నొనరింపవచ్చును. మూర్ఖజనులు లేదా భక్తి యొక్క ఆరంభదశలో నున్నవారు కొందరు తగినంత కృష్ణపరజ్ఞానము లేకుండుటచే కర్మల నుండి విరమింపగోరుదురు. యుధరంగకర్మల నుండి విరమించవలెననెడి అర్జునుని కోరికను శ్రీకృష్ణభగవానుడు ఆమోదింపలేదు. అనగా మనుజుడు కర్మను ఏ విధముగా ఒనరించవలెనో తెలిపిన చాలును. కృష్ణపరములగు కర్మల నుండి విరమించి కృష్ణభక్తి ప్రదర్శనము కావించుచు ఒంటరిగా కూర్చుండుట యనునది కృష్ణపరమగు కర్మరంగమున నియుక్తమగుట కన్నను ముఖ్యమెన్నడును కాబోదు. కనుకనే పూర్వము తెలుపబడిన వివస్వానుడు(సూర్యదేవుడు) వంటి శ్రీకృష్ణభగవానుని శిష్యులను అనుసరించుచు కృష్ణభక్తిభావనలో వర్తింపవలసినదిగా ఇచ్చట అర్జునుడు భోధింపబడెను. శ్రీకృష్ణభగవానుడు తన పూర్వకర్మలన్నింటిని మరియు పూర్వము కృష్ణభక్తిభావనలో వర్తించిన వారి కర్మలన్నింటిని సంపూర్ణముగా ఎరిగియుండెను. కనుకనే తన నుండి లక్షలసంవత్సరములకు పూర్వము విద్యను బడసిన సూర్యదేవుని కర్మలను అతడు అనుసరణియములని పలుకుచున్నాడు. శ్రీకృష్ణుని అట్టి శిష్యులే ఇచ్చట ముక్తపురుషులుగా పేర్కొనబడిరి. వారన్దరునుఆ దేవదేవుడు నిర్దేశించిన కార్యనిర్వాహణమందు నియుక్తులై యుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 165 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 15 🌴
15. evaṁ jñātvā kṛtaṁ karma
pūrvair api mumukṣubhiḥ
kuru karmaiva tasmāt tvaṁ
pūrvaiḥ pūrva-taraṁ kṛtam
🌷 Translation :
All the liberated souls in ancient times acted with this understanding of My transcendental nature. Therefore you should perform your duty, following in their footsteps.
🌹 Purport :
There are two classes of men. Some of them are full of polluted material things within their hearts, and some of them are materially free. Kṛṣṇa consciousness is equally beneficial for both of these persons. Those who are full of dirty things can take to the line of Kṛṣṇa consciousness for a gradual cleansing process, following the regulative principles of devotional service. Those who are already cleansed of the impurities may continue to act in the same Kṛṣṇa consciousness so that others may follow their exemplary activities and thereby be benefited. Foolish persons or neophytes in Kṛṣṇa consciousness often want to retire from activities without having knowledge of Kṛṣṇa consciousness. Arjuna’s desire to retire from activities on the battlefield was not approved by the Lord. One need only know how to act. To retire from the activities of Kṛṣṇa consciousness and to sit aloof making a show of Kṛṣṇa consciousness is less important than actually engaging in the field of activities for the sake of Kṛṣṇa. Arjuna is here advised to act in Kṛṣṇa consciousness, following in the footsteps of the Lord’s previous disciples, such as the sun-god Vivasvān, as mentioned hereinbefore. The Supreme Lord knows all His past activities, as well as those of persons who acted in Kṛṣṇa consciousness in the past. Therefore He recommends the acts of the sun-god, who learned this art from the Lord some millions of years before. All such students of Lord Kṛṣṇa are mentioned here as past liberated persons, engaged in the discharge of duties allotted by Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 24/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 166: 04వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 166: Chap. 04, Ver. 16
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 166 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 16 🌴
16. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా: |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్ ||
🌷. తాత్పర్యం :
కర్మయనగా నేమో మరియు అకర్మ యనగా నేమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు సైతము భ్రాంతినొంది యున్నారు. కనుక కర్మయనగా నేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలిసికొని నీవు అన్ని ఆశుభముల నుండియు ముక్తుడవు కాగలవు.
🌻. భాష్యము :
కృష్ణభక్తిరసభవిత కర్మను పూర్వపు ప్రామాణిక భక్తుల ఉపమానము ననుసరించియే ఒనరించవలెను. ఈ విషయము క్రిందటి పదునైదవశ్లోకమున ఉపదేశింపబడినది. కర్మను ఎందులకు స్వతంత్రముగా తోచినరీతిలో చేయరాదో రాబోవు శ్లోకమునందు వివరింపబడినది.
ఈ అధ్యాయపు ఆరంభములో తెలుపబడినట్లు కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించుటకు గురుశిష్యపరంపరలో వచ్చుచున్న ప్రామాణిక వ్యక్తుల నాయకత్వమును అనుసరింపవలెను. ఈ విధానము తొలుత సూర్యదేవునకు వివరింపబడగా, సూర్యుడు తన తనయుడైన మనువునకు దానిని బోధించెను. పిదప మనువు దానిని తన పుత్రుడైన ఇక్ష్వాకునకు తెలుపగా, అది ఆనాటి నుండి ధరత్రి యందు కొనసాగుచున్నది. అనగా ప్రతియొక్కరు పరంపరలో నున్న పూర్వపు ప్రామానణికులను సంపూర్ణముగా అనుసరింపవలెను. లేనిచో బుద్ధిమంతులైనవారు సైతము కృష్ణభక్తిభావనాయుత ప్రామాణిక కర్మల విషయమున మోహితులు కాగలరు. ఈ కారణము చేతనే ప్రత్యక్ష కృష్ణభక్తిభావన యందు అర్జునునకు ఉపదేశమొసగ శ్రీకృష్ణుడు నిర్ణియించుకొనెను. భగవానుడే ప్రత్యక్షముగా అర్జునునకు ఉపదేశించియున్నందున, అర్జునుని అనుసరించువారాలు నిక్కముగా భ్రాంతులు కాబోరు.
అసంపూర్ణమై యుండెడి ప్రయోగాత్మకజ్ఞానము ద్వారా ఎవ్వరును ధర్మవిధానమును నిర్ణియింపలేరని తెలుపబడినది. వాస్తవమునకు ధర్మనియమములు కేవలము భగవానుని చేతనే స్వయముగా నిర్ణయింపబడును. “ధర్మం తు సాక్షాత్ భగవత్ప్రణితమ్" (భాగవతము 6.3.19) ఎవ్వరును తమ అసంపూర్ణమగు మానసికకల్పనలచే వాటిని సృష్టింపలేరు. కనుకనే బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనకసనందనాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, శుకదేవగోస్వామి, యమరాజు,జనకుడు, బలిమాహారాజు వంటి మాహాజనుల అడుగుజాడలను ప్రతియొక్కరు అనుసరింపవలెను. కృష్ణభక్తిభావనలో ఒనరింపబడిన కర్మయే భవబంధముల నుండి మనుజుని ముక్తుని చేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 166 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 16 🌴
16 . kiṁ karma kim akarmeti
kavayo ’py atra mohitāḥ
tat te karma pravakṣyāmi
yaj jñātvā mokṣyase ’śubhāt
🌷 Translation :
Even the intelligent are bewildered in determining what is action and what is inaction. Now I shall explain to you what action is, knowing which you shall be liberated from all misfortune.
🌹 Purport :
Action in Kṛṣṇa consciousness has to be executed in accord with the examples of previous bona fide devotees. This is recommended in the fifteenth verse. Why such action should not be independent will be explained in the text to follow.
To act in Kṛṣṇa consciousness, one has to follow the leadership of authorized persons who are in a line of disciplic succession as explained in the beginning of this chapter. The system of Kṛṣṇa consciousness was first narrated to the sun-god, the sun-god explained it to his son Manu, Manu explained it to his son Ikṣvāku, and the system is current on this earth from that very remote time. Therefore, one has to follow in the footsteps of previous authorities in the line of disciplic succession. Otherwise even the most intelligent men will be bewildered regarding the standard actions of Kṛṣṇa consciousness. For this reason, the Lord decided to instruct Arjuna in Kṛṣṇa consciousness directly. Because of the direct instruction of the Lord to Arjuna, anyone who follows in the footsteps of Arjuna is certainly not bewildered.
It is said that one cannot ascertain the ways of religion simply by imperfect experimental knowledge. Actually, the principles of religion can only be laid down by the Lord Himself. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam (Bhāg. 6.3.19). No one can manufacture a religious principle by imperfect speculation. One must follow in the footsteps of great authorities like Brahmā, Śiva, Nārada, Manu, the Kumāras, Kapila, Prahlāda, Bhīṣma, Śukadeva Gosvāmī, Yamarāja, and Janaka. Only action performed in Kṛṣṇa consciousness can deliver a person from the entanglement of material existence.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 25/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 167: 04వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 167: Chap. 04, Ver. 17
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 167 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 17 🌴
17. కర్మణ్యో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ: |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి: ||
🌷. తాత్పర్యం :
కర్మగతులను అవగాహన చేసికొనుట అత్యంత కష్టము కనుక కర్మ యననేమో, వికర్మ యననేమో, అకర్మ యననేమో ప్రతియొక్కరు చక్కగా ఎరుగవలెను.
🌻. భాష్యము :
ఎవరేని భవబంధము నుండి ముక్తిని బడయుట యందు కృతనిశ్చయులై యున్నచో వారు తప్పక కర్మము, వికర్మము, అకర్మముల నడుమ గల భేదమును అవగాహన చేసికొనవలెను. ఈ కర్మసంబంధ విషయము అత్యంత కటినమైనది గనుక ప్రతియొక్కరు అటువంటి వివిధ కర్మలను విశ్లేషించి తెలిసికొనవలెను. కృష్ణభక్తిని మరియు తత్పరమైన కర్మలను అవగతము చేసికొనుటకు ప్రతియొక్కరు తమకు భగవానునితో గల సంబంధమును ఎరుగవలెను. అనగా జ్ఞానవంతుడైనవాడు జీవుడు శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనియు, తత్కారణముగా అతడు కృష్ణభక్తిభావనలో వర్తించవలసియుండుననియు అవగాహన చేసికొనును. భగవద్గీత యంతయు ఈ సారాంశము వైపునకే కేంద్రీకృతమై యున్నాది. ఈ భావనను మరియు తత్సంబంధిత కర్మలకు విరుద్ధములైన నిర్ణయములన్నియును నిషిద్దకర్మలే (వికర్మలే). ఈ విషయము నంతటిని సంపూర్ణముగా నెరుగుట కృష్ణభక్తి యందు నిష్ణాతులైనవారితో సాహచార్యము పొంది, వారి నుండి ఈ రహస్యమును తెలిసికొనవలెను. ఆ విధముగా చేయుట భగవానుని నుండి ప్రత్యక్షముగా నేర్చుటతో సమానము కాగలదు. లేనిచో అత్యంత బుద్ధిమంతులైనవారు సైతము భ్రాంతి గురికాగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 167 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 17 🌴
17 . karmaṇo hy api boddhavyaṁ
boddhavyaṁ ca vikarmaṇaḥ
akarmaṇaś ca boddhavyaṁ
gahanā karmaṇo gatiḥ
🌷 Translation :
The intricacies of action are very hard to understand. Therefore one should know properly what action is, what forbidden action is and what inaction is.
🌹 Purport :
If one is serious about liberation from material bondage, one has to understand the distinctions between action, inaction and unauthorized actions. One has to apply oneself to such an analysis of action, reaction and perverted actions because it is a very difficult subject matter. To understand Kṛṣṇa consciousness and action according to its modes, one has to learn one’s relationship with the Supreme; i.e., one who has learned perfectly knows that every living entity is an eternal servitor of the Lord and that consequently one has to act in Kṛṣṇa consciousness. The entire Bhagavad-gītā is directed toward this conclusion. Any other conclusions against this consciousness and its attendant actions are vikarmas, or prohibited actions. To understand all this one has to associate with authorities in Kṛṣṇa consciousness and learn the secret from them; this is as good as learning from the Lord directly. Otherwise, even the most intelligent persons will be bewildered.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 26/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 168: 04వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 168: Chap. 04, Ver. 18
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 168 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 18 🌴
18. కర్మణ్యకర్మ య: పశ్యేదకర్మణి కర్మ కర్మ య: |
స బుద్ధిమన్మసుష్యేషు స యుక్త: కృత్స్నకర్మకృత్ ||
🌷. తాత్పర్యం :
కర్మ యందు ఆకర్మను మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మనుజులలో బుద్ధిమంతుడైనవాడు. అట్టివాడు అన్నిరకముల కర్మలు యందు నియుక్తుడైన దివ్యస్థితి యందున్నవాడే యగును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందు కర్మ నొనరించువాడు సహజముగా అన్ని కర్మబంధముల నుండి ముక్తుడై యుండును. కర్మలన్నియును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరింపబడినందున అతడు కర్మప్రభావముచే సుఖదుఃఖములకు లోనుగాడు. తత్కారణమున అతడు కృష్ణుని కొరకై అన్నిరకముల కర్మల యందు నియుక్తుడైనను మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును. అకర్మ యనగా కర్మ చేయకుండుట యని భావము. ఆత్మానుభవమార్గములలో కర్మఫలము అవరోధము కాకూడదని తలచి నిరాకారవాదులు భయముతో కామ్యకర్మల నుండి విరమింతురు. కాని భక్తుడు మాత్రము భగవానుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా ఎరిగి సదా భక్తిపరమగుకర్మల యందు నియుక్తుడై యుండును. ప్రతిదియు కేవలము కృష్ణుని కొరకే చేయబడును కావున అతడు తన సేవాకార్యమునందు దివ్యానందము ననుభవించును. ఇట్టి విధానమునందు నియుక్తులైనవారు నిష్కాములుగా తెలియబడుదురు. శ్రీకృష్ణుని యెడ గల నిత్యదాసత్వభావము సర్వవిధములైన కర్మఫలముల నుండి మనుజుని ముక్తిని చేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 168 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 18 🌴
18 . karmaṇy akarma yaḥ paśyed
akarmaṇi ca karma yaḥ
sa buddhimān manuṣyeṣu
sa yuktaḥ kṛtsna-karma-kṛt
🌷 Translation :
One who sees inaction in action and action in inaction is intelligent among men, and he is in the transcendental position, although engaged in all sorts of activities.
🌹 Purport :
A person acting in Kṛṣṇa consciousness is naturally free from the bonds of karma. His activities are all performed for Kṛṣṇa; therefore he does not enjoy or suffer any of the effects of work. Consequently he is intelligent in human society, even though he is engaged in all sorts of activities for Kṛṣṇa. Akarma means without reaction to work. The impersonalist ceases fruitive activities out of fear, so that the resultant action may not be a stumbling block on the path of self-realization, but the personalist knows rightly his position as the eternal servitor of the Supreme Personality of Godhead. Therefore he engages himself in the activities of Kṛṣṇa consciousness. Because everything is done for Kṛṣṇa, he enjoys only transcendental happiness in the discharge of this service. Those who are engaged in this process are known to be without desire for personal sense gratification. The sense of eternal servitorship to Kṛṣṇa makes one immune to all sorts of reactionary elements of work.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 27/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 169: 04వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 169: Chap. 04, Ver. 19
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 169 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 19 🌴
19. యస్య సర్వే సమారమ్భా: కామసంకల్పవర్జితా: |
జ్ఞానగ్నిదగ్ధకర్మాణాం తమాహు: పణ్డితం బుధా: ||
🌷. తాత్పర్యం :
ఎవని ప్రతికర్మయు భోగవాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణజ్ఞానము కలిగినట్టివాడు. కర్మఫలములన్నియు జ్ఞానగ్నిచే దగ్ధమైనవిగా(జ్ఞానాగ్నిదగ్దకర్మడు) అతడు ఋషులచే చెప్పబడును.
🌷. భాష్యము :
సంపూర్ణమైన జ్ఞానము గలవాడే కృష్ణభక్తిరసభావన యందు మగ్నుడై యుండెడి మనుజుని కర్మలను అవగాహనము చేసికొనగలడు. కృష్ణభక్తిభావన యందుండెడివాడు సర్వవిధములైన ఇంద్రియభోగభావనల నుండి విడివాడియుండును కావున శ్రీకృష్ణభగవానునికి నిత్యదాసుడనెడి తన నిజస్థితి గూర్చిన సంపూర్ణజ్ఞానముతో కర్మఫలములన్నింటిని భస్మీపటలము కావించుకొనెని ఎరుగవలసియున్నది. అట్టి దివ్యజ్ఞానము సంపాదించినవాడే వాస్తవమునకు పండితుడు. భగవానునితో గల నిత్యసంబంధమును గూర్చిన ఈ జ్ఞానాభివృద్ధి అగ్నిచో పోల్చబడును. అది ఒక్కమారు రగిలినచో సర్వములైన కర్మఫలములను సములముగా దహింపజేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 169 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 19 🌴
19 . yasya sarve samārambhāḥ
kāma-saṅkalpa-varjitāḥ
jñānāgni-dagdha-karmāṇaṁ
tam āhuḥ paṇḍitaṁ budhāḥ
🌷 Translation :
One is understood to be in full knowledge whose every endeavor is devoid of desire for sense gratification. He is said by sages to be a worker for whom the reactions of work have been burned up by the fire of perfect knowledge.
🌹 Purport :
Only a person in full knowledge can understand the activities of a person in Kṛṣṇa consciousness. Because the person in Kṛṣṇa consciousness is devoid of all kinds of sense-gratificatory propensities, it is to be understood that he has burned up the reactions of his work by perfect knowledge of his constitutional position as the eternal servitor of the Supreme Personality of Godhead. He is actually learned who has attained to such perfection of knowledge. Development of this knowledge of eternal servitorship to the Lord is compared to fire. Such a fire, once kindled, can burn up all kinds of reactions to work.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 28/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 170: 04వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 170: Chap. 04, Ver. 20
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 170 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 20 🌴
20. త్యక్త్వాకర్మఫలాసజ్గ్ం నిత్యతృప్తో నిరాశ్రయ: |
కర్మణ్యభిప్రవృత్తో(వి నైవ కించత్ కరోతి స: ||
🌷. తాత్పర్యం :
కర్మఫలముల యెడ ఆసక్తిని విడిచి నిత్యతృప్తుడును, నిరాశ్రయుడును అయియుండెడివాడు అన్నిరకములగు కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే యగును.
🌷. భాష్యము :
మనుజుడు ప్రతిదియు కృష్ణుని కొరకే ఒనరించునపుడు ఆ భావన యందే కర్మబంధము నుండి విడుదల సాధ్యము కాగలదు. కృష్ణభక్తిపూర్ణుడైన భక్తుడు ఆ దేవదేవుని యెడ గల ప్రేమతోనే వర్తించును గావున కర్మఫలముల యెడ ఆకర్షణను కలిగియుండడు. అతడు సర్వభారమును కృష్ణునికే వదలివేయుటచే స్వీయపోషణము గూర్చియు చింతింపడు. లేనివి పొందవలెనని గాని, ఉన్నవానిని రక్షించుకొనవలెనని గాని అతడు ఆతురతపడడు. తన ధర్మమును శ్యక్తానుసారము నిర్యహించి పిదప అతడు సమస్తమును కృష్ణునికే వదలివేయును. అట్టి అసంగుడైన భక్తుడు ఏమియును చేయనివాని చందమున కర్మల యొక్క శుభాశుభఫలముల నుండి సర్వదా ముక్తుడై యుండును. ఇట్టి స్థితి అకర్మకు లేదా విషయఫలరహితమైన కర్మకు చిహ్నమై యున్నది. కనుక కృష్ణభక్తిభావన లేనటువంటి ఇతర కర్మ ఏదైనను సరియే కర్తను నిక్కముగా బంధించును. పూర్వము తెలుపబడినట్లు అదియే వికర్మ యొక్క నిజస్వరూపమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 170 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 20 🌴
20 . tyaktvā karma-phalāsaṅgaṁ
nitya-tṛpto nirāśrayaḥ
karmaṇy abhipravṛtto ’pi
naiva kiñcit karoti saḥ
🌷 Translation :
Abandoning all attachment to the results of his activities, ever satisfied and independent, he performs no fruitive action, although engaged in all kinds of undertakings.
🌹 Purport :
This freedom from the bondage of actions is possible only in Kṛṣṇa consciousness, when one is doing everything for Kṛṣṇa.
A Kṛṣṇa conscious person acts out of pure love for the Supreme Personality of Godhead, and therefore he has no attraction for the results of the action. He is not even attached to his personal maintenance, for everything is left to Kṛṣṇa. Nor is he anxious to secure things, nor to protect things already in his possession.
He does his duty to the best of his ability and leaves everything to Kṛṣṇa. Such an unattached person is always free from the resultant reactions of good and bad; it is as though he were not doing anything. This is the sign of akarma, or actions without fruitive reactions.
Any other action, therefore, devoid of Kṛṣṇa consciousness, is binding upon the worker, and that is the real aspect of vikarma, as explained hereinbefore.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 29/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 171: 04వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 171: Chap. 04, Ver. 21
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 171 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 21 🌴
21. నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహ: |
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||
🌷. తాత్పర్యం :
అట్టి అవగాహనము కలిగిన మనుజుడు మనుజుడు నియమిత మనోబుద్దులచే తనకున్నవానిపై స్యామ్యభావన విడిచి, కేవలము జీవనావసరముల కొరకే కర్మనొనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాపఫలములచే ప్రభావితుడు కాకుండును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడు తన కర్మల యందు శుభాశుభ ఫలములను వాంచింపడు. అతని మనోబుద్ధులు సదా నియమితులై యుండును.
తాను శ్రీకృష్ణభగవానుని అంశయై యున్నందున అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవమునాకు తాను చేయుట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానునిచే ఒనరింపబడుచున్నదని ఎరుగును. దేహమునందలి హస్తము తనకు తోచినరీతిగా గాక దేహావసరార్థమే దాని ప్రోద్బలముతో చరించునన్న విషయము తెలిసినదే. అదేవిధముగా కృష్ణభక్తుడైనవాడు స్వీయభోగాభిలాష లేనందున సదా శ్రీకృష్ణభగవానుని కోరికతోనే తాను ముడివడియుండును. ఆ భక్తుడు యంత్రమందలి ఒక భాగము శుభ్రపరచుట, తైలాదులతో పోషించునటువంటివి అవసరమైనట్లే, భగవానుని దివ్యమగు సేవాకార్యమున సరిగా నిలుచు నిమిత్తమే కృష్ణభక్తిపరాయణుడు కర్మ ద్వారా దేహమును పోషించుకొనును.
కనుకనే తన కర్మఫలములన్నింటికిని అతడు అతీతుడై యుండును. యజమాని అధీనములో నుండు జంతువు తన దేహముపై అధికారమును కలిగియుండక, తనను యజమాని చంప యత్నించినను అస్వతంత్రమై యుండుటచే ప్రతిఘటనను చేయదు. భక్తుడు సైతము యజమాని అధీనములో అస్వతంత్రమై యుండుటచే ప్రతిఘటనను చేయుదు. భక్తుడు సైతము యజమాని అధీనములో నుండు జంతువు వలె తన దేహముపై యజమానిత్వమును కలిగియుండడు.
ఆత్మానుభవ కార్యమునందే మగ్నుడైన అతడు లౌకికమైనవాటిని పొందగలిగినంతటి తీరికను కలిగియుండడు. దేహపోషణార్థమై అతడు అక్రమమార్గముల ద్వారా ధనమును కూడబెట్టవలసిన అవసరము లేనందున పాపముచే ఎన్నడును అంటబడడు. ఈ విధముగా ఆ భక్తుడు తన సమస్త కర్మఫలముల నుండి ముక్తుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 171 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 21 🌴
21 . nirāśīr yata-cittātmā
tyakta-sarva-parigrahaḥ
śārīraṁ kevalaṁ karma
kurvan nāpnoti kilbiṣam
🌷 Translation :
Such a man of understanding acts with mind and intelligence perfectly controlled, gives up all sense of proprietorship over his possessions and acts only for the bare necessities of life. Thus working, he is not affected by sinful reactions.
🌹 Purport :
A Kṛṣṇa conscious person does not expect good or bad results in his activities. His mind and intelligence are fully controlled. He knows that because he is part and parcel of the Supreme, the part played by him, as a part and parcel of the whole, is not his own activity but is only being done through him by the Supreme.
When the hand moves, it does not move out of its own accord, but by the endeavor of the whole body. A Kṛṣṇa conscious person is always dovetailed with the supreme desire, for he has no desire for personal sense gratification. He moves exactly like a part of a machine. As a machine part requires oiling and cleaning for maintenance, so a Kṛṣṇa conscious man maintains himself by his work just to remain fit for action in the transcendental loving service of the Lord. He is therefore immune to all the reactions of his endeavors. Like an animal, he has no proprietorship even over his own body. A cruel proprietor of an animal sometimes kills the animal in his possession, yet the animal does not protest. Nor does it have any real independence.
A Kṛṣṇa conscious person, fully engaged in self-realization, has very little time to falsely possess any material object. For maintaining body and soul, he does not require unfair means of accumulating money. He does not, therefore, become contaminated by such material sins. He is free from all reactions to his actions.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 30/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 172: 04వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 172: Chap. 04, Ver. 22
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 172 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 22 🌴
22. యదృచ్చాలాభసంతుష్టో ద్వాన్ద్వాతీతో విమర్పత: |
సమ: సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే |
🌷. తాత్పర్యం :
యాదృచ్చికముగా లభించినదానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడును, అసూయ లేనివాడును, జయాపజయములందు స్థిరుడై యుండెడివాడును అగు మనుజుడు కర్మలకు ఒనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడు దేహపోషణార్థము సైతము ఎక్కువగా శ్రమింపడు. యాదృచ్చికముగా లభించినదానితో అతడు సంతుష్టి నొందును. భిక్షమెత్తుట గాని, అప్పుచేయుట గాని చేయక న్యాయముగా తన శక్తికొలది కర్మ నొనరించి తద్వారా లభించినదానితో అతడు సంతృప్తి నొందును. కనుకనే తన జీవనోపాధి విషయమున అతడు స్వతంత్రుడై యుండును. ఇతరులకు ఒనర్చబడెడి సేవ తన భక్తికి (కృష్ణభక్తిభావన యందలి సేవకు) అడ్డురాకుండా యుండునట్లు అతడు చూచుకొనును. అయినను భగవానుని సేవ కొరకు మాత్రము భౌతికజగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలతచెందక ఎట్టి కర్మయందైనను అతడ పాల్గొనుచు. భౌతికజగము నందలి ద్వంద్వములనునవి సుఖదుఃఖములు, శీతోష్ణముల రూపములో అనుభూతమగుచుండును. కాని భక్తుడు కృష్ణుని ప్రీత్యర్థమై ఎటువంటి జంకు లేకుండా తన కర్మల నొనరించును కావున అట్టి ద్వంద్వములకు అతీతునిగా నుండును. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండింటి యందును స్థిరుడై యుండును. మనుజుడు దివ్యజ్ఞానపూర్ణుడైనప్పుడు ఈ విధమైన చిహ్నములు గోచరించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 172 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 22 🌴
22. yadṛcchā-lābha-santuṣṭo
dvandvātīto vimatsaraḥ
samaḥ siddhāv asiddhau ca
kṛtvāpi na nibadhyate
🌷 Translation :
He who is satisfied with gain which comes of its own accord, who is free from duality and does not envy, who is steady in both success and failure, is never entangled, although performing actions.
🌹 Purport :
A Kṛṣṇa conscious person does not make much endeavor even to maintain his body. He is satisfied with gains which are obtained of their own accord. He neither begs nor borrows, but he labors honestly as far as is in his power, and is satisfied with whatever is obtained by his own honest labor. He is therefore independent in his livelihood. He does not allow anyone’s service to hamper his own service in Kṛṣṇa consciousness. However, for the service of the Lord he can participate in any kind of action without being disturbed by the duality of the material world. The duality of the material world is felt in terms of heat and cold, or misery and happiness. A Kṛṣṇa conscious person is above duality because he does not hesitate to act in any way for the satisfaction of Kṛṣṇa. Therefore he is steady both in success and in failure. These signs are visible when one is fully in transcendental knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 31/Oct/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 173: 04వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 173: Chap. 04, Ver. 23
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 173 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 23 🌴
23. గతసజ్ఞస్య ముక్తస్య జ్ఞానవస్థితచేతస: |
యజ్ఞాయాచరత: కర్మ సమగ్రం ప్రవిలీయతే ||
🌷. తాత్పర్యం :
ప్రకృతి త్రిగుణముల యెడ అసంగుడై దివ్యజ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని సర్వకర్మల దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడగుట ద్వారా మనుజుడు ద్వంద్వమూలా నుండి విడివడి క్రమముగా త్రిగుణముల సంపర్కము నుండి విడివడును. కృష్ణునితో గల సంబంధమున తన నిజస్థితి ఎరిగియుండుటచే అతడు ముక్తినొందుటకు అర్హుడగును. ఆ విధముగా అతని మనసెప్పుడును కృష్ణభక్తి నుండి వేరొక వైపుకు మరలదు. తత్కారణముగా అతడేది ఒనర్చినను ఆదివిష్ణువైన శ్రీకృష్ణుని కొరకే ఒనరించును. విష్ణుప్రీత్యర్థమే యజ్ఞములన్నియు ఉద్దేశింపబడియున్నందున అతని కర్మలన్నియును యజ్ఞరూపములే యగుచున్నవి. అట్టి యజ్ఞరూప కర్మల ఫలములన్నియును నిక్కముగా దివ్యత్వమునందు లీనమగుటచే వానిని ఒనరించువారెవ్వరును కర్మఫలములచే ప్రభావితులు కారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 173 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 23 🌴
23. gata-saṅgasya muktasya
jñānāvasthita-cetasaḥ
yajñāyācarataḥ karma
samagraṁ pravilīyate
🌷 Translation :
The work of a man who is unattached to the modes of material nature and who is fully situated in transcendental knowledge merges entirely into transcendence.
🌹 Purport :
Becoming fully Kṛṣṇa conscious, one is freed from all dualities and thus is free from the contaminations of the material modes. He can become liberated because he knows his constitutional position in relationship with Kṛṣṇa, and thus his mind cannot be drawn from Kṛṣṇa consciousness. Consequently, whatever he does, he does for Kṛṣṇa, who is the primeval Viṣṇu. Therefore, all his works are technically sacrifices because sacrifice aims at satisfying the Supreme Person, Viṣṇu, Kṛṣṇa. The resultant reactions to all such work certainly merge into transcendence, and one does not suffer material effects.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 01/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 174: 04వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 174: Chap. 04, Ver. 24
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 174 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 24 🌴
24. బ్రహ్మార్పణ బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ||
🌷. తాత్పర్యం :
కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామమును తప్పక పొందితీరును. స్వీకరించునది మరియు అర్పింపబడునది యను రెండును బ్రహ్మమేయైనటువంటి ఆధ్యాత్మికకర్మల యందు అతడు తత్పరుడై యుండుటచే అందులకు కారణము.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందలి కర్మలు ఏ విధముగా అంత్యమున మనుజుని ఆధ్యాత్మికగమ్యమును చేర్చగలవో ఇచ్చట వివరింపబడినది. కృష్ణభక్తి యందు పలుకార్యములు గలవు. అవియన్నియు రాబోవు శ్లోకములందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రము కృష్ణభక్తిభావన యందలి సిద్ధాంతము తెలుపబడినది. భౌతికత్వమున బద్దుడైన బద్ధజీవి భౌతికభావన యందే కర్మనొనరింపవలసివచ్చినను ఏదియో ఒక విధముగా దాని నుండి అతడు ముక్తుడు కావాలసియున్నది. ఆ విధముగా బద్ధజీవుడు భౌతికభావన నుండి ముక్తిని పొందువిధానమే కృష్ణభక్తిరసభావనము. ఉదాహరణమునకు పాలపదార్థములను అధికముగా భుజించుట వలన కలిగిన అతిసారవ్యాధిచే బాధపడు రోగిని పాలకు సంబధించినదే అయిన పెరుగును తినిపించుట ద్వారా బాగుపరచినట్లు,విషయభావనలో రతుడైన బద్ధజీవుని భగవద్గీత యందు ఇచ్చట తెలుపబడిన కృష్ణభక్తిభావన ద్వారా బాగుపరచవచ్చును. ఈ పద్ధతే యజ్ఞము లేదా విష్ణుప్రీత్యర్థమై ఒనరింపబడు కర్మగా తెలియబడుచున్నది. భౌతికజగమునందలి కర్మలు ఎంత ఎక్కువగా విష్ణువు కొరకై (కృష్ణభక్తిభావన యందు) నిర్వహింపబడునో అంట అధికముగా వాతావరణము ఆధ్యాత్మికముగా రూపొందగలదు. “బ్రహ్మము” అనగా ఆధ్యాత్మికమని భావము. శ్రీకృష్ణభగవానుడే పరబ్రహ్మము. అతని దివ్యశరీరకాంతియే ఆధ్యాత్మికతెజమైన “బ్రహ్మజ్యోతి”గా పిలువబడును. స్థితిని కలిగిన ప్రతిదియు ఆ బ్రహ్మజ్యోతి యందే నిలిచియుండును. కాని అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియభోగముచే కప్పుబడినప్పుడు భౌతికమని తెలియబడును. అట్టి భౌతికతెర కృష్ణభక్తిభావనచే శీఘ్రమే తొలాగబడుచున్నందున ఆ భావన యందు అర్పణము చేయబడునది, అట్టి అర్పణము స్వీకరించునది, అర్పణవిధానము, అర్పణము చేయువాడు, దాని ఫలములన్నియును బ్రహ్మమే(పరతత్త్వమే) అయియున్నవి. మాయచే ఆవరింపబడిన బ్రహ్మము భౌతికము కాగా, బ్రహ్మమునకు అనుసంధానము కావింపబడిన భౌతికపదార్థము ఆధ్యాత్మిక గుణము తిరిగి పొందును. మోహతచైతన్యమును బ్రహ్మభావనలోనికి (భగవద్భావనలోనికి) మార్చుటయే కృష్ణభక్తిభావనామార్గము. అట్టి కృష్ణభక్తిభావనలో మనస్సు సంపూర్ణముగా మునిగియున్న స్థితియే “సమాధి” యని పిలువబడును. అట్టి స్థితిలో ఒనరింపబడు సర్వము యజ్ఞమే యనబడును. కావున అటువంటి ఆధ్యాత్మిక చైతన్యావస్థ యందు అర్పించువాడు, అర్పణము, స్వీకారము, కర్త, ఫలము లేదా అంతిమ లాభములన్నియును పరబ్రహ్మముతో ఏకమగును. అదియే కృష్ణభక్తిరసభావన విధానము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 174 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 24 🌴
24. brahmārpaṇaṁ brahma havir
brahmāgnau brahmaṇā hutam
brahmaiva tena gantavyaṁ
brahma-karma-samādhinā
🌷 Translation :
A person who is fully absorbed in Kṛṣṇa consciousness is sure to attain the spiritual kingdom because of his full contribution to spiritual activities, in which the consummation is absolute and that which is offered is of the same spiritual nature.
🌹 Purport :
How activities in Kṛṣṇa consciousness can lead one ultimately to the spiritual goal is described here. There are various activities in Kṛṣṇa consciousness, and all of them will be described in the following verses. But, for the present, just the principle of Kṛṣṇa consciousness is described. A conditioned soul, entangled in material contamination, is sure to act in the material atmosphere, and yet he has to get out of such an environment. The process by which the conditioned soul can get out of the material atmosphere is Kṛṣṇa consciousness. For example, a patient who is suffering from a disorder of the bowels due to overindulgence in milk products is cured by another milk product, namely curds. The materially absorbed conditioned soul can be cured by Kṛṣṇa consciousness as set forth here in the Gītā. This process is generally known as yajña, or activities (sacrifices) simply meant for the satisfaction of Viṣṇu, or Kṛṣṇa.
The more the activities of the material world are performed in Kṛṣṇa consciousness, or for Viṣṇu only, the more the atmosphere becomes spiritualized by complete absorption. The word brahma (Brahman) means “spiritual.” The Lord is spiritual, and the rays of His transcendental body are called brahma-jyotir, His spiritual effulgence. Everything that exists is situated in that brahma-jyotir, but when the jyotir is covered by illusion (māyā) or sense gratification, it is called material. This material veil can be removed at once by Kṛṣṇa consciousness; thus the offering for the sake of Kṛṣṇa consciousness, the consuming agent of such an offering or contribution, the process of consumption, the contributor and the result are – all combined together – Brahman, or the Absolute Truth. The Absolute Truth covered by māyā is called matter. Matter dovetailed for the cause of the Absolute Truth regains its spiritual quality. Kṛṣṇa consciousness is the process of converting the illusory consciousness into Brahman, or the Supreme. When the mind is fully absorbed in Kṛṣṇa consciousness, it is said to be in samādhi, or trance. Anything done in such transcendental consciousness is called yajña, or sacrifice for the Absolute. In that condition of spiritual consciousness, the contributor, the contribution, the consumption, the performer or leader of the performance and the result or ultimate gain – everything – becomes one in the Absolute, the Supreme Brahman. That is the method of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 02/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 175: 04వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 175: Chap. 04, Ver. 25
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 175 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 25 🌴
25. దైవ దైవమేవాపరే యజ్ఞం యోగిన: పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్యతి ||
🌷. తాత్పర్యం :
కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనెడి అగ్ని యందు హోమమును చేయుదురు.
🌷. భాష్యము :
ఇంతకు పూర్వము వివిరించిన రీతి కృష్ణభక్తిభావనలో విధ్యుక్తధర్మ నిర్వాహణ యందు నియుక్తుడైనవాడు పూర్ణయోగి (ప్రథమశ్రేణి యోగి) యని పిలువబడును. కాని అటువంటి యజ్ఞములనే దేవతార్చనమునందు ఒనరించువారును కలరు. ఇంకొందరు పరబ్రహ్మమును లేదా భగవానుని నిరాకారతత్త్వమును ఉపాసింతురు. అనగా వివిధ తరగతులను బట్టి వివిధములైన యజ్ఞములు కలవని విదితమగుచున్నది. కాని వాస్తవమునకు వివిధకర్తలచే చేయబడు యజ్ఞములందలి వివిధవర్గములు కేవలము యజ్ఞము యొక్క బాహ్యవర్గీకరణము మాత్రమే. ఏలయన యజ్ఞము యజ్ఞుడని పిలువబడు విష్ణుప్రీత్యర్థమే నిర్ణయింపబడియున్నది. కనుక వివిధములైన యజ్ఞములనన్నింటిని రెండు ప్రధాన తరగతులుగా విభజింపవచ్చును. ఒకటి లౌకికసంపదలను త్యాగము చేయుట కాగా రెండవది ఆధ్యాత్మికజ్ఞానప్రాప్తి కొరకు చేయబడునదై యున్నది. కృష్ణభక్తిభావన యందున్నవారు శ్రీకృష్ణభగవానుని ప్రీత్యర్థము తమకున్నవన్నియును అర్పింపగా, అశాశ్వతసుఖమును గోరువారు ఇంద్రుడు, సూర్యుడు వంటి దేవతల ప్రీత్యర్థము తమకున్నవి అర్పింతురు. ఇతరులైన నిరాకారవాదులు(మాయావాదులు) నిరాకారబ్రహ్మమునందు లీనమగుట ద్వారా తమ వ్యక్తిత్త్వమును అర్పింతురు. భౌతికజగత్తును పాలించుట మరియు దాని యందు అగ్ని, నీరు వెలుతురు వంటివి సమకూర్చుట కొరకు దేవదేవునిచే నియమింపబడిన శక్తిమంతులగు జీవులే వివిధ దేవతలు. భౌతికలాభమును కోరువారు అట్టి దేవతలను వేదకర్మకాండ ప్రకారము పలుయజ్ఞములు ద్వారా పూజింతురు. అట్టివారు “బహ్వీశ్వరవాదులు” (పలుదేవతలను విశ్వసించువార్) అని పిలువబడుదురు. కాని కొందరు దేవతారూపములను ఆశాశ్వతములని భావించి పరతత్త్వము యొక్క నిరాకారతత్త్వమును ఉపాసించుచు, బ్రహ్మాగ్ని యందు తమ వ్యక్తిత్వమును హుతము చేసి బ్రహ్మమునందు లీనమగుదురు. అట్టి నిరాకారవాదులు(మాయావాదులు) పరతత్త్వపు దివ్యత్వమును అవగతము చేసికొనుటకై తాత్త్విక కల్పనల యందు కాలమును వినియోగింతురు. అనగా కామ్యకర్మరతులు భోగానుభవము కొరకు తమకున్నవి అర్పింపగా, మాయావాదులు పరబ్రహ్మమునందు లీనమయ్యే ఉద్దేశ్యముతో తమ భౌతికఉపాధులను అర్పింతురు. అట్టి నిరాకారవాదికి పరబ్రహ్మమే యజ్ఞగుండము మరియు వ్యక్తిత్వమే బ్రహ్మాగ్ని యందు అర్పింపబడెడి ఆహుతి. కాని అర్జునుని వంటి కృష్ణభక్తిరసభావితుడు కేవలము కృష్ణుని ప్రీత్యర్థమే సమస్తము అర్పించును. ఆ విధముగా అతని సమస్త సంపత్తులు మరియు ఆత్మ అన్నియును కృష్ణునికి అర్పణమగును. కనుకనే అతడు ప్రథమశ్రేణి యోగి అయియున్నాడు. కాని అతడు తన వ్యక్తిత్వము నెన్నడును కోల్పోవడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 175 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 25 🌴
25. daivam evāpare yajñaṁ
yoginaḥ paryupāsate
brahmāgnāv apare yajñaṁ
yajñenaivopajuhvati
🌷 Translation :
Some yogīs perfectly worship the demigods by offering different sacrifices to them, and some offer sacrifices in the fire of the Supreme Brahman.
🌹 Purport :
As described above, a person engaged in discharging duties in Kṛṣṇa consciousness is also called a perfect yogī or a first-class mystic. But there are others also, who perform similar sacrifices in the worship of demigods, and still others who sacrifice to the Supreme Brahman, or the impersonal feature of the Supreme Lord. So there are different kinds of sacrifices in terms of different categories. Such different categories of sacrifice by different types of performers only superficially demark varieties of sacrifice. Factually sacrifice means to satisfy the Supreme Lord, Viṣṇu, who is also known as Yajña. All the different varieties of sacrifice can be placed within two primary divisions: namely, sacrifice of worldly possessions and sacrifice in pursuit of transcendental knowledge. Those who are in Kṛṣṇa consciousness sacrifice all material possessions for the satisfaction of the Supreme Lord, while others, who want some temporary material happiness, sacrifice their material possessions to satisfy demigods such as Indra, the sun-god, etc. And others, who are impersonalists, sacrifice their identity by merging into the existence of impersonal Brahman.
The demigods are powerful living entities appointed by the Supreme Lord for the maintenance and supervision of all material functions like the heating, watering and lighting of the universe. Those who are interested in material benefits worship the demigods by various sacrifices according to the Vedic rituals. They are called bahv-īśvara-vādī, or believers in many gods. But others, who worship the impersonal feature of the Absolute Truth and regard the forms of the demigods as temporary, sacrifice their individual selves in the supreme fire and thus end their individual existences by merging into the existence of the Supreme. Such impersonalists sacrifice their time in philosophical speculation to understand the transcendental nature of the Supreme. In other words, the fruitive workers sacrifice their material possessions for material enjoyment, whereas the impersonalist sacrifices his material designations with a view to merging into the existence of the Supreme. For the impersonalist, the fire altar of sacrifice is the Supreme Brahman, and the offering is the self being consumed by the fire of Brahman. The Kṛṣṇa conscious person, like Arjuna, however, sacrifices everything for the satisfaction of Kṛṣṇa, and thus all his material possessions as well as his own self – everything – is sacrificed for Kṛṣṇa. Thus, he is the first-class yogī; but he does not lose his individual existence.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 03/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 176: 04వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 176: Chap. 04, Ver. 26
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 176 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 26 🌴
26. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||
🌷. తాత్పర్యం :
కొందరు (నిష్ఠ కలిగిన బ్రహ్మచారులు) శ్రవణాది కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనెడి అగ్నియందు హోమము చేయగా, మరికొందరు (నియమితులైన గృహస్థులు) ఇంద్రియార్థములను ఇంద్రియములనెడి అగ్ని యందు అర్పింతురు.
🌷. భాష్యము :
బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యాసి యను నాలుగు ఆశ్రమముల వారందరును ఉత్తమయోగులు లేదా ఆధ్యాత్మికులు కావలసియున్నది. మానవజన్మ జంతువు వలె ఇంద్రియభోగానుభవము పొందుట కొరకు కానందున మనుజుడు క్రమముగా ఆధ్యాత్మిమికజీవనమందు పరిపూర్ణుడయ్యెడి విధముగా నాలుగు ఆశ్రమములు ఏర్పాటు చేయబడియున్నవి. బ్రహ్మచారులు గురువాశ్రయములో ఇంద్రియభోగము నుండి విడివడుట ద్వారా మనస్సును నిగ్రహించుటకు యత్నింతురు. శ్రవణమనునది అవగాహన కొరకు మూలసూత్రము గనుక బ్రహ్మచారి కేవలము కృష్ణపరములగు వచనములనే శ్రవణము చేయును. అనగా అతడు శ్రీకృష్ణభగవానుని లీలల శ్రవణ, కీర్తనములందు సంపూర్ణముగా నిమగ్నుడై యుండును (హరేర్నామాను కీర్తనమ్). హరినామకీర్తనమును (హరేకృష్ణ మాహామంత్రము) మాత్రమే శ్రవణము చేయుచు అతడు ఇతర లౌకిక శబ్దముల నుండి విడివడియుండును. అదే విధముగా ఇంద్రియభోగమునకు అనుమతి కలిగియున్న గృహస్థులు కుడా అట్టి అనుమతిని అతి నియమముతో నిర్యహింతురు. మైథునభోగము, మత్తుపదార్థముల స్వీకారము, మాంసభక్షణము లనునవి మానవుల సాధారణ నైజములు. కాని నియమితుడైన గృహస్థుడు అపరిమిత మైథునభోగమునందు మరియు ఇతర ఇంద్రియభోగములందు మగ్నుడు కాకుండును. మైథునజీవనము నియమించునది కావుననే ధర్మసమ్మతమైన వివాహము నాగరికసమాజము నందు వ్యాప్తి నొందియున్నది. నియమితుడైన గృహస్థుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవనము కొరకు తన సాధారణస్వభావమైన ఇంద్రియప్రీతిని అట్టి నియమితమైన సంగత్వరహిత మైథునజీవనము కూడా ఒక విధమైన యజ్ఞమే అయియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 176 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 26 🌴
26. śrotrādīnīndriyāṇy anye
saṁyamāgniṣu juhvati
śabdādīn viṣayān anya
indriyāgniṣu juhvati
🌷 Translation :
Some [the unadulterated brahmacārīs] sacrifice the hearing process and the senses in the fire of mental control, and others [the regulated householders] sacrifice the objects of the senses in the fire of the senses.
🌹 Purport :
The members of the four divisions of human life, namely the brahmacārī, the gṛhastha, the vānaprastha and the sannyāsī, are all meant to become perfect yogīs or transcendentalists. Since human life is not meant for our enjoying sense gratification like the animals, the four orders of human life are so arranged that one may become perfect in spiritual life. The brahmacārīs, or students under the care of a bona fide spiritual master, control the mind by abstaining from sense gratification. A brahmacārī hears only words concerning Kṛṣṇa consciousness; hearing is the basic principle for understanding, and therefore the pure brahmacārī engages fully in harer nāmānukīrtanam – chanting and hearing the glories of the Lord. He restrains himself from the vibrations of material sounds, and his hearing is engaged in the transcendental sound vibration of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa. Similarly, the householders, who have some license for sense gratification, perform such acts with great restraint. Sex life, intoxication and meat-eating are general tendencies of human society, but a regulated householder does not indulge in unrestricted sex life and other sense gratification. Marriage on the principles of religious life is therefore current in all civilized human society because that is the way for restricted sex life. This restricted, unattached sex life is also a kind of yajña because the restricted householder sacrifices his general tendency toward sense gratification for higher, transcendental life.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 04/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 177: 04వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 177: Chap. 04, Ver. 27
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 177 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 27 🌴
27. సర్వాణింద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ||
🌷. తాత్పర్యం :
ఇంద్రియ,మనోనియమము ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియకర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనియమమనెడి అగ్ని యందు ఆహుతులుగా అర్పింతురు.
🌷. భాష్యము :
పతంజలిచే సృష్టింపబడిన యోగపద్దతి ఇచ్చట తెలుపబడినది. పతంజలి యోగసూత్రములందు ఆత్మ “ప్రత్యగాత్మ” గా మరియు “పరాగాత్మ”గా పిలువబడును. ఇంద్రియభోగముతో సంగత్వము కలిగియున్నంతవరకు పరాగాత్మగా పిలువబడు ఆత్మ, అట్టి ఇంద్రియభోగము నుండి విడివడినంతనే ప్రత్యగాత్మగా పిలువబడును. అట్టి ఆత్మ దేహమునందు పదిరకములైన వాయువులచే ప్రభావితమగుచుండును. ఈ విషయము ప్రాణాయామము ద్వారా తెలియగలదు. ఏ విధముగా దేహమందలి వాయువులు నియమింపబడి భౌతికసంగత్వము నుండి ఆత్మ శుధ్ధిపడుటకు దోహదము కాగలవో తెలిపెడి పద్ధతిని మనుజునకు ఈ పతంజలి యోగసిద్ధాంతము ఉపదేశించును. ఈ యోగసిద్దాంతము ప్రకారము ప్రత్యగాత్మయే చివరి లక్ష్యము. అట్టి ప్రత్యగాత్మ భౌతికకర్మల నుండి విరమింపబడును. కర్ణములు శ్రవణమునందు, చక్షువులు దృశ్యమునందు, నాసిక ఘ్రాణమునందు, జిహ్వ రుచియందు, హస్తములు స్పర్శయందు లగ్నమయ్యెడి విధముగా ఇంద్రియములు ఇంద్రియార్థములందు లగ్నమై ఆత్మకు అన్యమైన కార్యములందు పాల్గొనును. అవియన్నియు ప్రాణవాయువు కార్యములుగా పిలువబడును. అపానవాయువు అధోముఖముగా ప్రసరించగా, వ్యానవాయువు సంకోచ, వ్యాకోచములకు కారణమగును. సమానవాయువు సమానత్వము కొరకు కాగా, ఉదానవాయువు ఊర్ధ్వముగా ప్రసరించును. మనుజుడు జ్ఞానవంతుడైనపుదు వీటినన్నింటిని ఆత్మానుభవ అన్వేషణలో నియుక్తము కావించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 177 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 27 🌴
27. sarvāṇīndriya-karmāṇi
prāṇa-karmāṇi cāpare
ātma-saṁyama-yogāgnau
juhvati jñāna-dīpite
🌷 Translation :
Others, who are interested in achieving self-realization through control of the mind and senses, offer the functions of all the senses, and of the life breath, as oblations into the fire of the controlled mind.
🌹 Purport :
The yoga system conceived by Patañjali is referred to herein. In the Yoga-sūtra of Patañjali, the soul is called pratyag-ātmā and parāg-ātmā. As long as the soul is attached to sense enjoyment it is called parāg-ātmā, but as soon as the same soul becomes detached from such sense enjoyment it is called pratyag-ātmā. The soul is subjected to the functions of ten kinds of air at work within the body, and this is perceived through the breathing system. The Patañjali system of yoga instructs one on how to control the functions of the body’s air in a technical manner so that ultimately all the functions of the air within become favorable for purifying the soul of material attachment. According to this yoga system, pratyag-ātmā is the ultimate goal. This pratyag-ātmā is withdrawn from activities in matter. The senses interact with the sense objects, like the ear for hearing, eyes for seeing, nose for smelling, tongue for tasting, and hand for touching, and all of them are thus engaged in activities outside the self. They are called the functions of the prāṇa-vāyu. The apāna-vāyu goes downwards, vyāna-vāyu acts to shrink and expand, samāna-vāyu adjusts equilibrium, udāna-vāyu goes upwards – and when one is enlightened, one engages all these in searching for self-realization.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 05/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 178: 04వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 178: Chap. 04, Ver. 28
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 178 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 28 🌴
28. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయయజ్ఞాశ్చ యతయ: సంశితవ్రతా: ||
🌷. తాత్పర్యం :
కటినవ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా మరియు మరికొందరు తీవ్రతపస్సులను చేయుట ద్వారా, అష్టాంగయోగ పద్ధతిని పాటించుట ద్వారా లేదా దివ్యజ్ఞానపురోగతికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞానవంతులగుదురు.
🌷. భాష్యము :
ఇచ్చట తెలుపబడిన యజ్ఞములను వివిధభాగములుగా విభజింపవచ్చును. పలువిధములైన దానముల రూపములలో తమ సంపత్తులను త్యాగము చేయువారు కొందరు కలరు. భారతదేశమునందు ధనవంతులు లేదా రాజవంశమునకు చెందినవారు ధర్మశాలలు, అన్నక్షేత్రములు, అతిధిశాలలు, అనాథాలయములు, విద్యాపీఠములు వంటి పలువిధములైన ధర్మసంస్థలను నెలకొల్పుట తెలిసిన విషయమే. అదే విధముగా ఇతరదేశములందు కూడా పేదలకు అన్నము, విద్య, వైద్య సౌకర్యములను ఉచితముగా కల్పించు ధర్మసంస్థలు,వైద్యశాలలు, వృద్ధాశ్రమములు పెక్కు గలవు. ఇటువంటి ధార్మిక కర్మలన్నియును “ద్రవ్యమయ యజ్ఞములు” అని పిలువబడును. మరికొందరు ఉన్నతజీవనప్రాప్తి కొరకు లేదా ఉన్నతలోకములకు ఉద్దరింపబడుట కొరకు చంద్రాయణము మరియు చాతుర్మాస్యము వంటి పలువిధములైన కటిననియమములను, తపస్సులను స్వచ్ఛందముగా స్వీకరింతురు. ఈ విధానములందు నియమపూర్ణ జీవితమును గడుపుటకు తీవ్రవ్రతములను పాటింపవలసియుండును. ఉదాహరణకు చాతుర్మాస్యదీక్ష యందు మనుజుడు నాలుగునెలలు (జూలై నుండి అక్టోబరు) గడ్డమును తొలగించుకొనడు. కొన్నిరకముల ఆహారమును స్వీకరింపక ఏకభుక్తముండును. గృహమును విడిచి వెళ్ళకుండును. జీవితసుఖమును త్యాగమొనర్చునటువంటి ఆ యజ్ఞములు “తపోమయ యజ్ఞములు” అని పిలువబడును. ఇంకను మరికొందరు బ్రహ్మమునందు లీనమవగోరి పతంజలియోగమునందు గాని, హఠయోగము లేదా అష్టాంగయోగమునందు కాని (సిద్ధులను కోరి) నియుక్తులగుదురు. ఇంకొందరు వివిధములైన తీర్థస్థానముల కేగుచుందురు. ఈ అభ్యాసములు భౌతికజగమునందు ఏదియో ఒక సిద్ధిని కోరి ఒనరింపబడును యోగయజ్ఞములు. మరికొందరు ఉపనిషత్తులు, వేదాంతసూత్రములవంటి వేదశాస్త్రములను లేదా సాంఖ్యజ్ఞానమును అధ్యయనము చేయుట యందు నియుక్తులగుదురు. అట్టివి స్వాధ్యాయయజ్ఞములు(అధ్యయన యజ్ఞమునందు నియుక్తమగుట) అనబడును. ఈ విధముగా యోగులందరను వివిధములైన యజ్ఞములందు నియుక్తులై ఉన్నతజీవనస్థితిని పొందగోరియుందురు. కాని శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షసేవయై యున్నందున కృష్ణభక్తిరసభావన యనునది వీటన్నింటికి భిన్నమైనది. అది పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞముల చేతను గాక కేవలము శ్రీకృష్ణభగవానుడు మరియు అతని ప్రామాణిక భక్తుల కరుణా చేతనే ప్రాప్తము కాగలదు. కనుకనే కృష్ణభక్తిరసభావనము దివ్యమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 178 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 28 🌴
28. dravya-yajñās tapo-yajñā
yoga-yajñās tathāpare
svādhyāya-jñāna-yajñāś ca
yatayaḥ saṁśita-vratāḥ
🌷 Translation :
Having accepted strict vows, some become enlightened by sacrificing their possessions, and others by performing severe austerities, by practicing the yoga of eightfold mysticism, or by studying the Vedas to advance in transcendental knowledge.
🌹 Purport :
These sacrifices may be fitted into various divisions. There are persons who are sacrificing their possessions in the form of various kinds of charities. In India, the rich mercantile community or princely orders open various kinds of charitable institutions like dharma-śālā, anna-kṣetra, atithi-śālā, anāthālaya and vidyā-pīṭha. In other countries, too, there are many hospitals, old age homes and similar charitable foundations meant for distributing food, education and medical treatment free to the poor. All these charitable activities are called dravyamaya-yajña. There are others who, for higher elevation in life or for promotion to higher planets within the universe, voluntarily accept many kinds of austerities such as candrāyaṇa and cāturmāsya. These processes entail severe vows for conducting life under certain rigid rules. For example, under the cāturmāsya vow the candidate does not shave for four months during the year (July to October), he does not eat certain foods, does not eat twice in a day or does not leave home. Such sacrifice of the comforts of life is called tapomaya-yajña.
There are still others who engage themselves in different kinds of mystic yogas like the Patañjali system (for merging into the existence of the Absolute), or haṭha-yoga or aṣṭāṅga-yoga (for particular perfections). And some travel to all the sanctified places of pilgrimage. All these practices are called yoga-yajña, sacrifice for a certain type of perfection in the material world. There are others who engage themselves in the studies of different Vedic literatures, specifically the Upaniṣads and Vedānta-sūtras, or the Sāṅkhya philosophy. All of these are called svādhyāya-yajña, or engagement in the sacrifice of studies. All these yogīs are faithfully engaged in different types of sacrifice and are seeking a higher status of life. Kṛṣṇa consciousness, however, is different from these because it is the direct service of the Supreme Lord. Kṛṣṇa consciousness cannot be attained by any one of the above-mentioned types of sacrifice but can be attained only by the mercy of the Lord and His bona fide devotees. Therefore, Kṛṣṇa consciousness is transcendental.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 06/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 179: 04వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 179: Chap. 04, Ver. 29
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 179 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 29 🌴
29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే(పానం తథాపరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణా: |
అపరే నియతాహారా: ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ||
🌷. తాత్పర్యం :
ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి, శ్వాసను సంపూర్ణముగా బంధించి, అంత్యమున సమాధిమగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియమించి ప్రాణవాయువును ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పింతురు.
🌷. భాష్యము :
శ్వాసను నియమించునట్టి ఈ యోగాపద్ధతి ప్రాణాయామము అనబడును. ఈ యోగపద్ధతి వివిధములైన ఆసనముల ద్వారా హఠయోగమునందలి ప్రారంభదశలో ఆచరింపబడును. ఇంద్రియనిగ్రహము కొరకు మరియు ఆధ్యాత్మికానుభవ పురోగతి కొరకు ఈ విధానములన్నియును ఉద్దేశింపబడినవి. దేహమునందలి వాయువులను నియమించి, వాటిని వాటి విరుద్ధదశలో ప్రసరింపజేయుట ఈ యోగపద్ధతి యందు యత్నింపబడును. అపానవాయువు అధోముఖముగా ప్రసరించగా, ప్రాణవాయువు ఊర్థ్వముగా ప్రసరించును. ఈ రెండువాయువులు విరుద్ధదశలలో ప్రసరించి, చివరికి పురాకమందు తటస్థము నొందురీతిగా ప్రాణాయామయోగి యత్నించును. ఉచ్చ్వాసమును నిశ్వాసమునందు అర్పించుట యనుననిది రేచకము. ప్రాణాపానవాయుల చలనము సంపూర్ణముగా స్తంభించినప్పుడు మనుజుడు కుంభకయోగమునందు ఉన్నట్లుగా తెలుపబడును. అట్టి కుంభకయోగము ద్వారా ఆధ్యాత్మికజీవన సంపూర్ణత్వమునకై మనుజుడు ఆయుర్వృద్ధిని సాధింపవచ్చును. బుద్ధిమంతుడైన యోగి మరొకజన్మకై వేచియుండక ఈ జన్మమునందే పూర్ణత్వమును సాధించుట యందు అనురక్తుడై యుండును. దాని కొరకై యోగి కుంభకయోగము ద్వారా జీవనపరిమాణమును అనేక సంవత్సరములు వృద్ధిచేసికొనును. కాని కృష్ణభక్తిభావన యందున్న భక్తుడు సదా శ్రీకృష్ణభగవానుని దివ్యసేవ యందు నిలిచియున్నందున అప్రయత్నముగా ఇంద్రియములపై నియమమును కలిగియే యుండును. సదా కృష్ణుని సేవలో నియుక్తములై యున్నందున అతని ఇంద్రియములు ఇతర కర్మలలో నిలుచు అవకాశముండదు. అట్టి భక్తుడు దేహత్యాగానంతరము సహజముగా శ్రీకృష్ణుని ధామమునకే పోవును గనుక జీవితపరిమాణమును పొడిగించు యత్నములు ఎన్నడును చేయడు. భగవద్గీత (14.26) యందు తెలిపినట్లుగా అతడు శీఘ్రముగా ముక్తిస్థాయికి చేరియుండును.
మాం చ యో(వ్యభిచారేణ భక్తియోగేన సేవతే | స గుణాన్సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ||
“భగవానుని అనన్య భక్తియుత సేవయందు నియుక్తుడైనవాడు త్రిగుణములను దాటి శ్రీఘ్రమే ఆధ్యాత్మికస్థితిని చేరును”. అనగా కృష్ణభక్తితత్పరుడు దివ్య ఆధ్యాత్మికస్థితిలోనే జీవనము నారంభించి దాని యందే నిరంతరము కొనసాగును. కనుక పతనమనెడి ప్రశ్నయే ఉదయించదు. ఎటువంటి ఆలస్యము లేకుండా అతడు చివరికి భగవద్ధామమును చేరును. కృష్ణప్రసాదమును మాత్రమే గ్రహించుట ద్వారా మనుజుడు ఆహారమును అప్రయత్నముగా నియమించినవాడే యగును. అట్టి నియమము ఇంద్రియనిగ్రహమునందు మిక్కిలి తోడ్పడగలదు. అట్టి ఇంద్రియనిగ్రహము లేనిదే భవబంధముల నుండి ముక్తిని పొందుటకు ఆస్కారమే లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 179 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 29 🌴
29. apāne juhvati prāṇaṁ
prāṇe ’pānaṁ tathāpare
prāṇāpāna-gatī ruddhvā
prāṇāyāma-parāyaṇāḥ
apare niyatāhārāḥ
prāṇān prāṇeṣu juhvati
🌷 Translation :
Still others, who are inclined to the process of breath restraint to remain in trance, practice by offering the movement of the outgoing breath into the incoming, and the incoming breath into the outgoing, and thus at last remain in trance, stopping all breathing. Others, curtailing the eating process, offer the outgoing breath into itself as a sacrifice.
🌹 Purport :
This system of yoga for controlling the breathing process is called prāṇāyāma, and in the beginning it is practiced in the haṭha-yoga system through different sitting postures. All of these processes are recommended for controlling the senses and for advancement in spiritual realization. This practice involves controlling the airs within the body so as to reverse the directions of their passage. The apāna air goes downward, and the prāṇa air goes up. The prāṇāyāma-yogī practices breathing the opposite way until the currents are neutralized into pūraka, equilibrium. Offering the exhaled breath into the inhaled breath is called recaka. When both air currents are completely stopped, one is said to be in kumbhaka-yoga.
By practice of kumbhaka-yoga, one can increase the duration of life for perfection in spiritual realization. The intelligent yogī is interested in attaining perfection in one life, without waiting for the next. For by practicing kumbhaka-yoga, the yogīs increase the duration of life by many, many years. A Kṛṣṇa conscious person, however, being always situated in the transcendental loving service of the Lord, automatically becomes the controller of the senses. His senses, being always engaged in the service of Kṛṣṇa, have no chance of becoming otherwise engaged. So at the end of life, he is naturally transferred to the transcendental plane of Lord Kṛṣṇa; consequently he makes no attempt to increase his longevity. He is at once raised to the platform of liberation, as stated in Bhagavad-gītā (14.26):
māṁ ca yo ’vyabhicāreṇa
bhakti-yogena sevate
sa guṇān samatītyaitān
brahma-bhūyāya kalpate
“One who engages in unalloyed devotional service to the Lord transcends the modes of material nature and is immediately elevated to the spiritual platform.” A Kṛṣṇa conscious person begins from the transcendental stage, and he is constantly in that consciousness. Therefore, there is no falling down, and ultimately he enters into the abode of the Lord without delay. The practice of reduced eating is automatically done when one eats only kṛṣṇa-prasādam, or food which is offered first to the Lord. Reducing the eating process is very helpful in the matter of sense control. And without sense control there is no possibility of getting out of the material entanglement.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 07/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 180: 04వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 180: Chap. 04, Ver. 30
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 180 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 30 🌴
30. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషా: |
యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్ ||
🌷. తాత్పర్యం :
యజ్ఞప్రయోజనము నెరిగిన ఈ కర్తలందరును పాపఫలముల నుండి శుద్ధిపది, యజ్ఞఫలమనెడి అమృతమును ఆస్వాదించినందున నిత్యమైన భగవద్ధామము వైపునకు పురోగమింతురు.
🌷. భాష్యము :
ఇంతవరకు తెలిపిన వివిధ యజ్ఞముల (ద్రవ్యమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, యోగయజ్ఞము) వివరణను బట్టి ఇంద్రియనిగ్రహమే వాటన్నింటి మూలలక్ష్యమని అవగతమగుచున్నది. ఇంద్రియభోగానుభవమే భవబంధమునకు మూలకారణమై యున్నందున భోగానుభవముకు పరమైన స్థితి యందు నిలువనిదే ఎవ్వరును నిత్యమును మరియు జ్ఞానానందపూర్ణమును అగు నిత్యస్థితికి ఉద్దరింపబడు అవకాశము లేదు. అట్టి స్థితి నిత్యాకాశమునందు (పరబ్రహ్మాకాశము నందు) కలదు. ఇంతవరకు తెలుపబడిన యజ్ఞములన్నియును భౌతికజీవనపు పాపఫలముల నుండి శుద్ధిపడుటకు మనుజునకు తోడ్పడును. ఇట్టి పురోగతి ద్వారా అతడు జీవితమునందు ఆనందమయుడు మరియు వైభవోపేతుడగుటయే గాక అంత్యమున నిరాకారబ్రహ్మమునందు లీనమగుట ద్వారా కాని లేదా దేవదేవుడైన శ్రీకృష్ణుని సాహచర్యమును పొందుట ద్వారా కాని నిత్యమైన భగవద్ధామమున ప్రవేశింపగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 180 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 30 🌴
30. sarve ’py ete yajña-vido
yajña-kṣapita-kalmaṣāḥ
yajña-śiṣṭāmṛta-bhujo
yānti brahma sanātanam
🌷 Translation :
All these performers who know the meaning of sacrifice become cleansed of sinful reactions, and, having tasted the nectar of the results of sacrifices, they advance toward the supreme eternal atmosphere.
🌹 Purport :
From the foregoing explanation of different types of sacrifice (namely sacrifice of one’s possessions, study of the Vedas or philosophical doctrines, and performance of the yoga system), it is found that the common aim of all is to control the senses. Sense gratification is the root cause of material existence; therefore, unless and until one is situated on a platform apart from sense gratification, there is no chance of being elevated to the eternal platform of full knowledge, full bliss and full life. This platform is in the eternal atmosphere, or Brahman atmosphere. All the above-mentioned sacrifices help one to become cleansed of the sinful reactions of material existence. By this advancement in life, not only does one become happy and opulent in this life, but also, at the end, he enters into the eternal kingdom of God, either merging into the impersonal Brahman or associating with the Supreme Personality of Godhead, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 08/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 181: 04వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 181: Chap. 04, Ver. 31
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 181 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 31 🌴
31. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్య: కురుసత్తమ |
🌷. తాత్పర్యం :
ఓ కురువంశ శ్రేష్టుడా! యజ్ఞమును నిర్వహింపకుండా ఎవ్వరును ఈ లోకముగాని, ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి యెడ తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేల?
🌷. భాష్యము :
జీవుడు ఎటువంటి భౌతికస్థితి యందున్నప్పటికిని తన నిజస్థితి యెడ జ్ఞానరహితుడైన యుండును. అనగా పాపజన్మల ఫలముల వలననే భౌతికజగమునందు అస్తిత్వము కలుగుచున్నది. అజ్ఞానము పాపజన్మకు కారణము కాగ, పాపజీవనము మనుజుడు భౌతికత్వమున కొనసాగుటకు కారణమగుచున్నది. అట్టి భవబంధము నుండి ముక్తిని సాధించుటకు మానవజన్మ యొక్కటే సరియైన మార్గమే యున్నది. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రియభోగము, అంత్యమున దుర్భరస్థితి నుండి సంపూర్ణముగా విముక్తి యనెడి మార్గములను చూపుట ద్వారా మనలకు ఒక అవకాశము నొసగుచున్నది. ధర్మమార్గము (ఇంతవరకు తెలుపబడిన వివిధయజ్ఞ నిర్వహణములు) మన సర్వ ఆర్ధిక పరిస్థితులను అప్రయత్నముగా చక్కబరచగలదు. జనాభివృద్ధి అధికముగా నున్నను యజ్ననిర్వాహణము ద్వారా సమృద్ధిగాగా ఆహారము, పాలు ఆదివి లభింపగలవు. దేహము చక్కగా పోషింపబడినప్పడు ఇంద్రియభోగానుభవ భావన కలుగును. కనుకనే వేదములు నియమిత భోగానుభవము కొరకై పవిత్ర వివాహపద్ధతిని నిర్దేశించుచున్నవి. తద్ద్వార మనుజుడు క్రమముగా భౌతికబంధము నుండి ముక్తుడై ఉన్నతస్థితిని చేరును. అట్టి ముక్తస్థితి యందలి సంపూర్ణత్వమే భగవానునితో సాహచర్యము. పూర్వము వివరించినట్లు అటువంటి సంపూర్ణత్వము యజ్ఞనిర్వాహణము ద్వారానే లభించగలదు. అట్లు వేదములు తెలిపినరీతిగా యజ్ఞమును నిర్వహించుట యందు మనుజడు అనురక్తుడు కానిచో ఈ జన్మమునందైనను సుఖమయ జీవనము ఊహింపలేడు. ఇక వేరే దేహముతో ఇంకొక లోకమునందు సౌఖ్యమును గూర్చి తెలుపుదనేమున్నది? వివిధయజ్ఞములను నిర్వహించువారికి అమితానందమును గూర్చుటకు స్వర్గలోకములందు వివిధప్రమాణములలో భౌతికసుఖములు గలవు. కాని కృష్ణభక్తిని చేయుట ద్వారా ఆధ్యాత్మికలోకమును పొందుటయే మానవునికి అత్యంత ఉత్కృష్టమైన ఆనందమై యున్నది. కనుకనే కృష్ణభక్తిరసభావనము సర్వభవక్లేశములకు దివ్యమైన పరిష్కారమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 181 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 31 🌴
31. nāyaṁ loko ’sty ayajñasya
kuto ’nyaḥ kuru-sattama
🌷 Translation :
O best of the Kuru dynasty, without sacrifice one can never live happily on this planet or in this life: what then of the next?
🌹 Purport :
Whatever form of material existence one is in, one is invariably ignorant of his real situation. In other words, existence in the material world is due to the multiple reactions to our sinful lives. Ignorance is the cause of sinful life, and sinful life is the cause of one’s dragging on in material existence. The human form of life is the only loophole by which one may get out of this entanglement. The Vedas, therefore, give us a chance for escape by pointing out the paths of religion, economic comfort, regulated sense gratification and, at last, the means to get out of the miserable condition entirely. The path of religion, or the different kinds of sacrifice recommended above, automatically solves our economic problems. By performance of yajña we can have enough food, enough milk, etc. – even if there is a so-called increase of population. When the body is fully supplied, naturally the next stage is to satisfy the senses. The Vedas prescribe, therefore, sacred marriage for regulated sense gratification. Thereby one is gradually elevated to the platform of release from material bondage, and the highest perfection of liberated life is to associate with the Supreme Lord. Perfection is achieved by performance of yajña (sacrifice). Now, if a person is not inclined to perform yajña according to the Vedas, how can he expect a happy life even in this body, and what to speak of another body on another planet? There are different grades of material comforts in different heavenly planets, and in all cases there is immense happiness for persons engaged in different kinds of yajña. But the highest kind of happiness that a man can achieve is to be promoted to the spiritual planets by practice of Kṛṣṇa consciousness. Is therefore the solution to all the problems of material existence
🌹 🌹 🌹 🌹 🌹
Date: 09/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 182: 04వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 182: Chap. 04, Ver. 32
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 182 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 32 🌴
32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||
🌷. తాత్పర్యం :
ఈ వివిధ యజ్ఞములన్నియును వేదములచే ఆమోదింపబడినవి మరియు అవియన్నియు వివిధకర్మల నుండి ఉద్బవించినవి. వానిని యథార్థరూపములో ఎరుగట ద్వారా నీవు ముక్తిని పొందగలవు.
🌷. భాష్యము :
ఇంతవరకు చర్చింపబడినటువంటి వివిధయజ్ఞములు వివిధకర్తలకు అనుగుణముగా వేదములందు తెలుపబడియున్నవి. మానవుల దేహాత్మభావనలో సంపూర్ణముగా మగ్నులై యుందురు. కావున మనుజుడు దేహముతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని కర్మనొనరించు రీతిగా యజ్ఞములు నిర్ణయింపబడినవి. కాని అంత్యమున దేహము నుండి ముక్తిని పొందుట కొరకే అవియన్నియును నిర్దేశింపబడియున్నవి. ఈ విషయము శ్రీకృష్ణభగవానుని చేతనే స్వయముగా ఇచ్చట నిర్ధారితమైనది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 182 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 32 🌴
32. evaṁ bahu-vidhā yajñā
vitatā brahmaṇo mukhe
karma-jān viddhi tān sarvān
evaṁ jñātvā vimokṣyase
🌷 Translation :
All these different types of sacrifice are approved by the Vedas, and all of them are born of different types of work. Knowing them as such, you will become liberated.
🌹 Purport :
Different types of sacrifice, as discussed above, are mentioned in the Vedas to suit the different types of worker. Because men are so deeply absorbed in the bodily concept, these sacrifices are so arranged that one can work either with the body, with the mind or with the intelligence. But all of them are recommended for ultimately bringing about liberation from the body. This is confirmed by the Lord herewith from His own mouth.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 10/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 183: 04వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 183: Chap. 04, Ver. 33
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 183 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 33 🌴
33. శ్రేయాన్ ద్రవ్యమాయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ: పరన్తప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||
🌷. తాత్పర్యం :
ఓ పరంతపా! జ్ఞానయజ్ఞము ద్రవ్యమయజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థా! కర్మయజ్ఞము లన్నియును చివరికి దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి నొందును.
🌷. భాష్యము :
సంపూర్ణ జ్ఞానస్థితిని సాధించి తద్ద్వారా భౌతికక్లేశముల నుండి బయటపడి అంత్యమున శ్రీకృష్ణభగవానుని ప్రేమయుక్తసేవ యందు (కృష్ణభక్తిరసభావనము) నియుక్తమగుటయే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యమై యున్నది. అయినను ఈ యజ్ఞములకు సంబంధించిన ఒక రహస్యము కలదు. దానిని ప్రతియొక్కరు తప్పక ఎరుగవలెను. అదియేమన కర్త యొక్క శ్రద్ధ ననుసరించి యజ్ఞములు వివిధరూపములను దాల్చుచుండును. కర్తకు గల శ్రద్ధ దివ్యజ్ఞానస్థితికి చేరినప్పుడు, అట్టి కర్త జ్ఞానరహితముగా కేవలము తన సంపత్తులను త్యాగము చేయువాని కన్నను శ్రేష్టుడుగా గుర్తింపబడును. ఏలయన జ్ఞానప్రాప్తి కలుగనపుడు యజ్ఞములు భౌతికపరధికే చెంది ఎట్టి ఆధ్యాత్మికలాభమును గూర్చకుండును. అట్టి నిజమైన జ్ఞానము చివరికి దివ్యజ్ఞానపు ఉత్కృష్టస్థితియైన కృష్ణభక్తిరసభావనగా మార్పుచెందును. జ్ఞానవృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలము భౌతికకర్మలే కాగలవు. కాని అవి జ్ఞానస్థితికి చేరినప్పుడు సంపూర్ణ ఆధ్యాత్మిక స్థాయికి చేరగలవు. ఈ యజ్ఞములు వాటి ఉద్దేశ్యముల ననుసరించి కొన్నిమార్లు కర్మకాండగా( కామ్యకర్మములు), మరికొన్నిమార్లు జ్ఞానకాండగా (పరమాత్మాన్వేషణ జ్ఞానము) పిలువబడును. వాటి అంతిమలక్ష్యము జ్ఞానమే యగుట అత్యంత శ్రేష్టము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 183 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 33 🌴
33. śreyān dravya-mayād yajñāj
jñāna-yajñaḥ paran-tapa
sarvaṁ karmākhilaṁ pārtha
jñāne parisamāpyate
🌷 Translation :
O chastiser of the enemy, the sacrifice performed in knowledge is better than the mere sacrifice of material possessions. After all, O son of Pṛthā, all sacrifices of work culminate in transcendental knowledge.
🌹 Purport :
The purpose of all sacrifices is to arrive at the status of complete knowledge, then to gain release from material miseries and, ultimately, to engage in loving transcendental service to the Supreme Lord (Kṛṣṇa consciousness). Nonetheless, there is a mystery about all these different activities of sacrifice, and one should know this mystery. Sacrifices sometimes take different forms according to the particular faith of the performer. When one’s faith reaches the stage of transcendental knowledge, the performer of sacrifices should be considered more advanced than those who simply sacrifice material possessions without such knowledge, for without attainment of knowledge, sacrifices remain on the material platform and bestow no spiritual benefit. Real knowledge culminates in Kṛṣṇa consciousness, the highest stage of transcendental knowledge. Without the elevation of knowledge, sacrifices are simply material activities. When, however, they are elevated to the level of transcendental knowledge, all such activities enter onto the spiritual platform. Depending on differences in consciousness, sacrificial activities are sometimes called karma-kāṇḍa (fruitive activities) and sometimes jñāna-kāṇḍa (knowledge in the pursuit of truth). It is better when the end is knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 11/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 184: 04వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 184: Chap. 04, Ver. 34
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 184 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 34 🌴
34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శిన: ||
🌷. తాత్పర్యం :
గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయముతో ప్రశ్నలు వేసి సేవను గుర్చుము. ఆత్మదర్శులు తత్త్వదర్శనము చేసినవారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు.
🌷. భాష్యము :
ఆత్మానుభవమార్గమును నిస్సందేహముగా కటినమైనదికఠినమైనది. కనుకనే తన నుండియే వచ్చిన గురుపరంపరలోని ఆధ్యాత్మికగురువు దరిచేరుమని శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించుచున్నాడు. పరంపరా సిద్ధాంతమును పాటింపక ఎవ్వరును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యులు కాజాలరు. శ్రీకృష్ణభగవానుడే ఆది ఆధ్యాత్మికాచార్యుడు. అట్టి భగవానుని నుండి వచ్చుచున్న పరంపరలో నున్నవాడే ఆ ఆదిదేవుని ఉపదేశమును యథాతథముగా తన శిష్యులకు తెలియజేయగలడు. స్వీయపధ్ధతిని సృష్టించుట ద్వారా ఎవ్వరును ఆధ్యాత్మికానుభవమును పొందలేరు (మూర్ఖులైన కపటులకు అది మోజు వంటిది). “ధర్మం తు సాక్షాత్ భగవత్ప్రణితం” అని శ్రీమద్భాగవతము (6.3.19) తెలుపుచున్నది. అనగా ధర్మము భగవానుని చేతనే స్వయముగా మార్గమునకు చేర్చజాలవు. అదే విధముగా ఎవ్వరినీ సంప్రదింపక స్వతంత్రముగా చేయబడు శాస్త్రాధ్యయనము చేత ఎవ్వరును ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేరు. కనుక ప్రతియొక్కరు జ్ఞానమును పొందుటకు తప్పక గురువును సంతృప్తిపరచుటయే ఆధ్యాత్మికజీవన పురోభివృద్ధికి రహస్యము. ప్రశ్నలు మరియు శరణాగతి మరియు సేవ లేనిదే గురువుకు వేయబడు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతియొక్కరు గురుపరీక్షలో జయమును సాధింపవలెను. శిష్యుని యందలి శ్రద్ధను గమనించిన గురుదేవుడు అప్రయత్నముగా అతనికి నిజమైన ఆధ్యాత్మికావగాహనను ప్రదానము చేయగలడు. గ్రుడ్డిగా అనుసరించుట మరియు అర్థరహిత ప్రశ్నలు వేయుట రెండును ఈ శ్లోకమునందు నిరసింపబడినవి. ప్రతి యొక్కరు గురువు నుండి అణుకవతో శ్రవణము చేయుటయే గాక, అణుకువ, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహనను సైతము పొందవలసియున్నది. ఆధ్యాత్మికగురువు తన ప్రవృత్తిరీత్యా శిష్యుని యెడ కరుణను కలిగియుండును. కనుక శిష్యుడు అణుకవతో సదా సేవచేయు సిద్ధపడినపుడు అతని జ్ఞానసముపార్జనము మరియు పరిప్రశ్నలు పూర్ణత్వము నొందగలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 184 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 34 🌴
34. tad viddhi praṇipātena
paripraśnena sevayā
upadekṣyanti te jñānaṁ
jñāninas tattva-darśinaḥ
🌷 Translation :
Just try to learn the truth by approaching a spiritual master. Inquire from him submissively and render service unto him. The self-realized souls can impart knowledge unto you because they have seen the truth.
🌹 Purport :
The path of spiritual realization is undoubtedly difficult. The Lord therefore advises us to approach a bona fide spiritual master in the line of disciplic succession from the Lord Himself. No one can be a bona fide spiritual master without following this principle of disciplic succession. The Lord is the original spiritual master, and a person in the disciplic succession can convey the message of the Lord as it is to his disciple. No one can be spiritually realized by manufacturing his own process, as is the fashion of the foolish pretenders. The Bhāgavatam (6.3.19) says, dharmaṁ tu sākṣād bhagavat-praṇītam: the path of religion is directly enunciated by the Lord. Therefore, mental speculation or dry arguments cannot help lead one to the right path. Nor by independent study of books of knowledge can one progress in spiritual life. One has to approach a bona fide spiritual master to receive the knowledge. Such a spiritual master should be accepted in full surrender, and one should serve the spiritual master like a menial servant, without false prestige. Satisfaction of the self-realized spiritual master is the secret of advancement in spiritual life. Inquiries and submission constitute the proper combination for spiritual understanding.
Unless there is submission and service, inquiries from the learned spiritual master will not be effective. One must be able to pass the test of the spiritual master, and when he sees the genuine desire of the disciple, he automatically blesses the disciple with genuine spiritual understanding. In this verse, both blind following and absurd inquiries are condemned. Not only should one hear submissively from the spiritual master, but one must also get a clear understanding from him, in submission and service and inquiries. A bona fide spiritual master is by nature very kind toward the disciple. Therefore when the student is submissive and is always ready to render service, the reciprocation of knowledge and inquiries becomes perfect.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 12/Nov/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 185: 04వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 185: Chap. 04, Ver. 35
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 185 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 35 🌴
35. యద్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ |
యేన భూతాన్య శేషాణి ద్రక్ష్య స్యాత్మన్యథో మయి ||
🌷. తాత్పర్యం :
ఆత్మదర్శియైన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినపుడు ఆ జ్ఞానముచే సమస్తజీవులు పరమాత్ముని అంశలని, అనగా నాకు సంబంధించిన వారని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడును ఇట్టి మొహమునకు గురికావు.
🌷. భాష్యము :
జీవులందరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశలని ఎరుగగలుగుటయే ఆత్మదర్శియైన మహాత్ముని(ఉన్నది ఉన్నట్లుగా గాంచగలిగిన సత్యదర్శి) నుండి జ్ఞానమును పొందుట వలన కలిగెడి ఫలితమై యున్నది. కృష్ణుని నుండి విడివడియున్న స్థితి యొక్క భావనయే మాయ(మా – కాదు, యా – ఇది) యనబడును. అయినను కొందరు మాకు కృష్ణునితో సంబంధము లేదనియు, అతడు కేవలము ఒక చారిత్రాత్మకపురుషుడు మాత్రమే యనియు మరియు పరతత్త్వమనునది నిరాకారబ్రహ్మమే యనియు భావింతురు. కాని వాస్తవమునాకు భగవద్గీత యందు తెలుపబడిన రీతిగా నిరాకారబ్రహ్మము శ్రీకృష్ణుని శరీరకాంతియై యున్నది. పూర్ణపురుషోత్తమునిగా శ్రీకృష్ణుడే సమస్తమునకు కారణమైయున్నాడు. శ్రీకృష్ణుడే సమస్త కారణములకు కారణమైన దేవదేవుడని బ్రహ్మసంహిత యందు స్పష్టముగా తెలుపబడినది. లక్షలాదిగానున్న అవతారములన్నియును అతని భిన్నవిస్తారములై యున్నవి. అదే విధముగా జీవులు సైతము ఆ శ్రీకృష్ణుని విస్తారములే. శ్రీకృష్ణుడు అట్టి వివిధ విస్తారములందు తన మూలస్థితిని కోల్పోవునని మయావాద తత్త్వవేత్తలు తప్పుగా భావింతురు. వాస్తవమునకు అట్టి భావనము కేవలము భౌతికమైనది. దేనినైనను ముక్కలుగా విభజించినచో అది తన మూలరూపమును కోల్పోవుననుట ఈ భౌతికజగత్తు యొక్క అనుభవమై యున్నది. కాని పరతత్త్వమనగా ఒకటిని ఒకటితో కలుపగా ఒకటిగా నుండునదనియు మరియు ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటిగనే నిలుచునటువంటిదనియు వారు ఎరుగజాలరు. కాని ఆధ్యాత్మికజగము సమస్తము ఏ రీతిగానే ఉండును.
పరతత్త్వమును గూర్చిన తగిన జ్ఞానము లేనందున మాయచే కప్పబడి మనము కృష్ణుని నుండి వేరనెడి భావనను కలిగియుందుము. మనము శ్రీకృష్ణుని నుండి విదివదిన అంశలమైనను అతని నుండి భిన్నులము కాము. జీవుల దేహభేదములు మాయయేగాని వాస్తావము కాదు. మనమందరము శ్రీకృష్ణుని సేవ కొరకే ఉద్దేశింపబడియున్నాము. కాని మాయకారణముననే అర్జునుడు బంధువులతోగల దేహసంబంధిత బంధము భగవానుడైన కృష్ణునితో గల నిత్య ఆధ్యాత్మికబంధము కన్నను ముఖ్యమైనదిగా భావించెను. శ్రీకృష్ణుని నిత్యదాసునిగా జీవుడెన్నడును కృష్ణుని నుండి వేరుకాడనియు మరియు శ్రీకృష్ణుని నుండి తాను వేరనెడి జీవుని భావన మాయా యనియు ఉపదేశించుట కొరకే భగవద్గీత ఉద్దేశింపబడినది. భగవానుని నిత్యంశలుగా జీవులు నిర్వహింపవలసిన ప్రయోజన మొకటున్నది. అయినను వారు దానిని అనంతకాలముగా మరచిపోయి దేవ, మనుష్య, పశ్యాది వివిధదేహములు కలుగుచున్నవి. కాని మనుజుడు కృష్ణభక్తిరసభావన ద్వారా దివ్యసేవలో నియుక్తుడైనపుడు శీఘ్రమే మోహము నుండి విడివడగలడు. అట్టి జ్ఞానము కేవలము ఆధ్యాత్మిక గురువు ద్వారానే లభింపగలదు. తద్ద్వారా జీవుడు శ్రీకృష్ణునితో సముడనెడి భ్రాంతి నశించిపోవును. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు సకలజీవులకు ఆశ్రయుడనియు మరియు అట్టి ఆశ్రయమును విడిచి ప్రకృతిచే బ్రాంతినొందుట వలన జీవుల తమను వేరుగా భావించుచున్నారనియు తెలిసికొనుగలుగుటయే వాస్తవమునాకు పూర్ణజ్ఞానము. ఆ కారణముననే వారు భౌతికఉపాధి తాదాత్మ్యముచే కృష్ణుని మరచుచున్నారు. అట్టి మాయమోహిత జీవులు కృష్ణభక్తిరసభావన యందు నిలిచినపుడు ముక్తిమార్గమునందు చేరినట్టివారని శ్రీమద్భాగవతము (2.10.6) నిర్దారించుచున్నది. “ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి:”. శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా జీవుడు తన నిజస్థితిలో సదా నిలిచియుండుటచే ముక్తి యనబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 185 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 35 🌴
35. yaj jñātvā na punar moham
evaṁ yāsyasi pāṇḍava
yena bhūtāny aśeṣāṇi
drakṣyasy ātmany atho mayi
🌷 Translation :
Having obtained real knowledge from a self-realized soul, you will never fall again into such illusion, for by this knowledge you will see that all living beings are but part of the Supreme, or, in other words, that they are Mine.
🌹 Purport :
The result of receiving knowledge from a self-realized soul, or one who knows things as they are, is learning that all living beings are parts and parcels of the Supreme Personality of Godhead, Lord Śrī Kṛṣṇa. The sense of an existence separate from Kṛṣṇa is called māyā (mā – not, yā – this).
Some think that we have nothing to do with Kṛṣṇa, that Kṛṣṇa is only a great historical personality and that the Absolute is the impersonal Brahman. Factually, as it is stated in the Bhagavad-gītā, this impersonal Brahman is the personal effulgence of Kṛṣṇa. Kṛṣṇa, as the Supreme Personality of Godhead, is the cause of everything. In the Brahma-saṁhitā it is clearly stated that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the cause of all causes. Even the millions of incarnations are only His different expansions. Similarly, the living entities are also expansions of Kṛṣṇa. The Māyāvādī philosophers wrongly think that Kṛṣṇa loses His own separate existence in His many expansions. This thought is material in nature. We have experience in the material world that a thing, when fragmentally distributed, loses its own original identity. But the Māyāvādī philosophers fail to understand that absolute means that one plus one is equal to one, and that one minus one is also equal to one. This is the case in the absolute world.
For want of sufficient knowledge in the absolute science, we are now covered with illusion, and therefore we think that we are separate from Kṛṣṇa. Although we are separated parts of Kṛṣṇa, we are nevertheless not different from Him. The bodily difference of the living entities is māyā, or not actual fact. We are all meant to satisfy Kṛṣṇa. By māyā alone Arjuna thought that the temporary bodily relationship with his kinsmen was more important than his eternal spiritual relationship with Kṛṣṇa. The whole teaching of the Gītā is targeted toward this end: that a living being, as Kṛṣṇa’s eternal servitor, cannot be separated from Kṛṣṇa, and his sense of being an identity apart from Kṛṣṇa is called māyā. The living entities, as separate parts and parcels of the Supreme, have a purpose to fulfill. Having forgotten that purpose since time immemorial, they are situated in different bodies, as men, animals, demigods, etc. Such bodily differences arise from forgetfulness of the transcendental service of the Lord. But when one is engaged in transcendental service through Kṛṣṇa consciousness, one becomes at once liberated from this illusion. One can acquire such pure knowledge only from the bona fide spiritual master and thereby avoid the delusion that the living entity is equal to Kṛṣṇa. Perfect knowledge is that the Supreme Soul, Kṛṣṇa, is the supreme shelter for all living entities, and giving up such shelter, the living entities are deluded by the material energy, imagining themselves to have a separate identity. Thus, under different standards of material identity, they become forgetful of Kṛṣṇa. When, however, such deluded living entities become situated in Kṛṣṇa consciousness, it is to be understood that they are on the path of liberation, as confirmed in the Bhāgavatam (2.10.6): muktir hitvānyathā-rūpaṁ svarūpeṇa vyavasthitiḥ. Liberation means to be situated in one’s constitutional position as an eternal servitor of Kṛṣṇa (Kṛṣṇa consciousness).
🌹 🌹 🌹 🌹 🌹
Date: 13/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 186: 04వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 186: Chap. 04, Ver. 36
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 186 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 36 🌴
36. అపి చేదసి పాపేభ్య: సర్వేభ్య: పాపకృత్తమ: |
సర్వం జ్ఞానప్లవైనైవ వృజినం సంతరిష్యసి ||
🌷. తాత్పర్యం :
ఒకవేళ నీవు పాపులందరిలోను పరమపాపిగా భావింపబడినను దివ్యజ్ఞానమనెడి పడవ యందు స్థితుడవైనచో దుఃఖసముద్రమును దాటగలవు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుని సంబంధమున తన నిజస్థితిని మనుజుడు సరిగా అవగతము చేసికొనుట పరమోత్కృష్టమైనది. అది అజ్ఞానసాగరమునందు జరిగెడి జీవనసంఘర్షణ నుండి అతనిని శీఘ్రమే ఉద్ధరించును. ఈ భౌతికజగత్తు కొన్నిమార్లు అజ్ఞానసాగరమును, మరికొన్నిమార్లు దావానములతో చుట్టబడిన అరణ్యముగను వర్ణింపబడును. సముద్రమునందు ఎంతటి ప్రవీణుడైన ఈతగానికైనను ప్రాణరక్షణము కష్టమే; ఎవరేని వచ్చి అతనిని సముద్రము నుండి లేవదీసి రక్షించినచో అట్టివానిని గొప్పరక్షకుడని భావింపవచ్చును. దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండి స్వీకరింపబడిన పూర్ణజ్ఞానము ముక్తికి మార్గమై యున్నది. అట్టి కృష్ణభక్తిరసభావన యనెడి నౌక సరళమైనను మహోన్నతమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 186 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 36 🌴
36. api ced asi pāpebhyaḥ
sarvebhyaḥ pāpa-kṛt-tamaḥ
sarvaṁ jñāna-plavenaiva
vṛjinaṁ santariṣyasi
🌷 Translation :
Even if you are considered to be the most sinful of all sinners, when you are situated in the boat of transcendental knowledge you will be able to cross over the ocean of miseries.
🌹 Purport :
Proper understanding of one’s constitutional position in relationship to Kṛṣṇa is so nice that it can at once lift one from the struggle for existence which goes on in the ocean of nescience. This material world is sometimes regarded as an ocean of nescience and sometimes as a blazing forest. In the ocean, however expert a swimmer one may be, the struggle for existence is very severe. If someone comes forward and lifts the struggling swimmer from the ocean, he is the greatest savior. Perfect knowledge, received from the Supreme Personality of Godhead, is the path of liberation. The boat of Kṛṣṇa consciousness is very simple, but at the same time the most sublime.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 14/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 187: 04వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 187: Chap. 04, Ver. 37
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 187 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 37 🌴
37. యథైధాంసి సమిద్ధో(గ్నిర్భస్మసాత్ కురుతే(ర్జున |
జ్ఞానాగ్ని: సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు, జ్ఞానాగ్ని భౌతిక కర్మఫలముల నన్నింటిని బూడిదగా చేసివేయును.
🌷. భాష్యము :
ఆత్మ, పరమాత్మ మరియు వాని నడుమ గల సంబంధమును గూర్చిన పూర్ణజ్ఞానము ఇచ్చట అగ్నితో పోల్చబడినది. ఈ అగ్ని పాపఫలములనే గాక పుణ్యకర్మఫలములను కూడా భస్మీపాటలము కావించును. కలుగబోవు ఫలము, ఫలవంతమగుచున్న ఫలము, అనుభవించుచున్న ఫలము, సంచితఫలమనుచు కర్మఫలము లందు అనేక స్థితులు కలవు. కాని జీవుని నిజస్థితి యొక్క జ్ఞానము సమస్తమును భస్మము చేయగలదు. మనుజుడు జ్ఞానవంతుడైనపుడు సంచిత, ప్రారబ్దాది సర్వకర్మఫలములు నశించిపోవును. కనుకనే బృహదారణ్యకోపనిషత్తు (4.4.22) నందు “ఉభే ఉహైవైష ఏతే తరత్వమృత: సాధ్వసాధూనీ – పుణ్య, పాపకర్మఫలములు రెండింటిని మనుజుడు అధిగమించును” అని తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 187 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 37 🌴
37. yathaidhāṁsi samiddho ’gnir
bhasma-sāt kurute ’rjuna
jñānāgniḥ sarva-karmāṇi
bhasma-sāt kurute tathā
🌷 Translation :
As a blazing fire turns firewood to ashes, O Arjuna, so does the fire of knowledge burn to ashes all reactions to material activities.
🌹 Purport :
Perfect knowledge of self and Superself and of their relationship is compared herein to fire. This fire not only burns up all reactions to impious activities, but also all reactions to pious activities, turning them to ashes. There are many stages of reaction: reaction in the making, reaction fructifying, reaction already achieved, and reaction a priori. But knowledge of the constitutional position of the living entity burns everything to ashes. When one is in complete knowledge, all reactions, both a priori and a posteriori, are consumed. In the Vedas (Bṛhad-āraṇyaka Upaniṣad 4.4.22) it is stated, ubhe uhaivaiṣa ete taraty amṛtaḥ sādhv-asādhūnī: “One overcomes both the pious and impious reactions of work.”
🌹 🌹 🌹 🌹 🌹
Date: 15/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 188: 04వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 188: Chap. 04, Ver. 38
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 188 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 38 🌴
38. న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్ధ: కాలేనాత్మని విన్దతి ||
🌷. తాత్పర్యం :
ఈ జగమునందు ఆధ్యాత్మికజ్ఞానము వలె పవిత్రమైనది మరియు మహోన్నతమైనది వేరొక్కటి లేదు. సకల యోగముల పక్వఫలమైన ఆ జ్ఞానమును భక్తియోగాభ్యాసమునందు పరిపక్వతను సాధించినవాడు కాలక్రమమున తన యందే అనుభవించును.
🌷. భాష్యము :
దివ్యజ్ఞానమును గూర్చి పలుకునపుడు ఆధ్యాత్మిక అవగాహనతోనే మనము ఆ కార్యమును చేయుదురు. అట్టి ఆధ్యాత్మికజ్ఞానమును లేదా దివ్యజ్ఞానము కన్నను పవిత్రమైనది మరియు ఉన్నతమైనది వేరొక్కటి లేదు. అజ్ఞానము బంధమునాకు కారణము కాగా, అట్టి జ్ఞానము ముక్తికి కారణమై యున్నది. అదియే భక్తియోగ పక్వఫలము. అట్టి దివ్యజ్ఞానము నందు స్థితిని పొందినవాడు శాంతిని తన యందే అనుభవించుటచే దాని కొరకు బాహ్యమున వెదుక నవసరము కలుగదు. అనగా జ్ఞానము మరియు శాంతి యనునవి చివరకు కృష్ణభక్తిరసభావనగానే పరిణమించును. ఇదియే భగద్గీత యొక్క తుదివాక్యము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 188 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 38 🌴
38. na hi jñānena sadṛśaṁ
pavitram iha vidyate
tat svayaṁ yoga-saṁsiddhaḥ
kālenātmani vindati
🌷 Translation :
In this world, there is nothing so sublime and pure as transcendental knowledge. Such knowledge is the mature fruit of all mysticism. And one who has become accomplished in the practice of devotional service enjoys this knowledge within himself in due course of time.
🌹 Purport :
When we speak of transcendental knowledge, we do so in terms of spiritual understanding. As such, there is nothing so sublime and pure as transcendental knowledge. Ignorance is the cause of our bondage, and knowledge is the cause of our liberation. This knowledge is the mature fruit of devotional service, and when one is situated in transcendental knowledge, he need not search for peace elsewhere, for he enjoys peace within himself. In other words, this knowledge and peace culminate in Kṛṣṇa consciousness. That is the last word in the Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 16/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 189: 04వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 189: Chap. 04, Ver. 39
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 189 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 39 🌴
39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర: సంయతేన్ద్రియ: |
జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
దివ్యజ్ఞానతత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మికజ్ఞానమును పొందుట అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు దృఢమైన విశ్వాసము కలిగిన మనుజునికి అట్టి కృష్ణభక్తిభావనా జ్ఞానము లభించగలదు. కృష్ణభక్తిభావన యందు కేవలము వర్తించుట చేతనే సంపూర్ణత్వము సిద్ధించునని భావించువాడు శ్రద్ధావంతుడనబడును. భక్తియుతసేవ నొనరించుట ద్వారా మరియు హృదయమాలిన్యమును తొలగించు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే అను మాహామంత్రమును జపకీర్తనములు చేయుట ద్వారా అట్టి శ్రద్ధ ప్రాప్తించగలదు. వీనితోపాటుగా అతడు ఇంద్రియములను సైతము నిగ్రహించవలెను. శ్రీకృష్ణుని యెడ శ్రద్ధను కలిగి ఇంద్రియనియమమును పాటించువాడు కృష్ణభక్తి రసభావన జ్ఞానము నందు పూర్ణత్వమును ఏమాత్రము జాగులేక సులభముగా పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 189 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 39 🌴
39. śraddhāvāḻ labhate jñānaṁ
tat-paraḥ saṁyatendriyaḥ
jñānaṁ labdhvā parāṁ śāntim
acireṇādhigacchati
🌷 Translation :
A faithful man who is dedicated to transcendental knowledge and who subdues his senses is eligible to achieve such knowledge, and having achieved it he quickly attains the supreme spiritual peace.
🌹 Purport :
Such knowledge in Kṛṣṇa consciousness can be achieved by a faithful person who believes firmly in Kṛṣṇa. One is called a faithful man who thinks that simply by acting in Kṛṣṇa consciousness he can attain the highest perfection. This faith is attained by the discharge of devotional service and by chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, which cleanses one’s heart of all material dirt. Over and above this, one should control the senses. A person who is faithful to Kṛṣṇa and who controls the senses can easily attain perfection in the knowledge of Kṛṣṇa consciousness without delay.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 17/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 190: 04వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 190: Chap. 04, Ver. 40
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 190 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 40 🌴
40. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన: ||
🌷. తాత్పర్యం :
శాస్త్రములను శంకించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవత్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైనవారికి ఈ లోకమున గాని, పరలోకమున గాని సుఖము లేదు.
🌷. భాష్యము :
అధికారికములు మరియు ప్రామాణికములు అగు పెక్కు శాస్తములలో భగవద్గీత శ్రేష్ఠమైనది. జంతుప్రాయులైన మనుజులకు శాస్త్రములందు శ్రద్ధకాని, జ్ఞానము కాని ఉండదు. కొందరికి అట్టి శాస్త్రముల యెడ కొంత జ్ఞానమున్నను మరియు సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములను ఉదహరించగలిగినను ఆ శాస్త్రవచనములపై సంపూర్ణ విశ్వాసముండదు. మరికొందరు భగవద్గీత వంటి గ్రంథముల యెడ శ్రద్ధను కలిగియున్నను దేవదేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని, అతనిని అర్చించుట గాని చేయరు. అట్టి శ్రద్ధాహీనులు మరియు సంశయాత్ములైనవారు ఎన్నడును పురోభివృద్ధిని పొందలేరు. దైవమునందు, అతని వచనమునందు శ్రద్ధలేనివారు ఇహపరములందు ఎట్టి శుభమును బడయజాలరు. కనుక ప్రతియొక్కరు శాస్త్రనియమములను పాటించుచు జ్ఞానస్థాయికి ఎదుగవలెను. కేవలము అట్టి జ్ఞానమే ఆధ్యాత్మికావగాహనపు దివ్యస్థితికి చేరుటలో వారికి తోడ్పడగలదు. అనగా సందేహస్థులకు ఆధ్యాత్మికరంగమునందు ఎట్టి స్థానము లేదు. కనుక ప్రతియొక్కరు పరంపరానుగతముగా వచ్చుచున్న గొప్ప ఆచార్యల అడుగుజాడల ననుసరించి విజయమును సాధింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 190 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 40 🌴
40. ajñaś cāśraddadhānaś ca
saṁśayātmā vinaśyati
nāyaṁ loko ’sti na paro
na sukhaṁ saṁśayātmanaḥ
🌷 Translation :
But ignorant and faithless persons who doubt the revealed scriptures do not attain God consciousness; they fall down. For the doubting soul there is happiness neither in this world nor in the next.
🌹 Purport :
Out of many standard and authoritative revealed scriptures, the Bhagavad-gītā is the best. Persons who are almost like animals have no faith in, or knowledge of, the standard revealed scriptures; and some, even though they have knowledge of, or can cite passages from, the revealed scriptures, have actually no faith in these words. And even though others may have faith in scriptures like Bhagavad-gītā, they do not believe in or worship the Personality of Godhead, Śrī Kṛṣṇa. Such persons cannot have any standing in Kṛṣṇa consciousness. They fall down. Out of all the above-mentioned persons, those who have no faith and are always doubtful make no progress at all. Men without faith in God and His revealed word find no good in this world, nor in the next. For them there is no happiness whatsoever. One should therefore follow the principles of revealed scriptures with faith and thereby be raised to the platform of knowledge. Only this knowledge will help one become promoted to the transcendental platform of spiritual understanding. In other words, doubtful persons have no status whatsoever in spiritual emancipation. One should therefore follow in the footsteps of great ācāryas who are in the disciplic succession and thereby attain success.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 18/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 191: 04వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 191: Chap. 04, Ver. 41
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 191 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 41 🌴
41. యోగసన్న్యస్తకర్మాణాం జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ ||
🌷. తాత్పర్యం :
కర్మఫలముల నన్నింటిని త్యచించి భక్తియోగమునందు వర్తించుచు దివ్యజ్ఞానముచే సందేహములు నశించియున్నవాడు వాస్తవముగా ఆత్మ యందే స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయా! ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధితుడు కాడు.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణునిచే తెలుపబడినరీతిగా భగవద్గీతోపదేశమును అనుసరించువాడు దివ్యజ్ఞానము ద్వారా సర్వసంశయముల నుండి విముక్తుడగును. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో భగవానుని అంశరూపమున అతడు ఆత్మజ్ఞానమునందు స్థితిని పొందినవాడే యగును. అందుచే అతడు నిస్సందేహముగా కర్మబంధమునకు అతీతుడైయుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 191 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 41 🌴
41. yoga-sannyasta-karmāṇaṁ
jñāna-sañchinna-saṁśayam
ātmavantaṁ na karmāṇi
nibadhnanti dhanañ-jaya
🌷 Translation :
One who acts in devotional service, renouncing the fruits of his actions, and whose doubts have been destroyed by transcendental knowledge, is situated factually in the self. Thus he is not bound by the reactions of work, O conqueror of riches.
🌹 Purport :
One who follows the instruction of the Bhagavad-gītā, as it is imparted by the Lord, the Personality of Godhead Himself, becomes free from all doubts by the grace of transcendental knowledge. He, as a part and parcel of the Lord, in full Kṛṣṇa consciousness, is already established in self-knowledge. As such, he is undoubtedly above bondage to action.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 19/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 192: 04వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 192: Chap. 04, Ver. 42
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 192 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 42 🌴
42. తస్మాదజ్ఞానసంభూతం హృత్థ్సం జ్ఞానాసినాత్మన: |
ఛిత్వైనం సంశయం యోగమాతి ష్ఠోత్తిష్ట భారత ||
🌷. తాత్పర్యం :
కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞానఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారతా! యోగసమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము!
🌷. భాష్యము :
ఈ అధ్యాయమున ఉపదేశింపబడిన యోగపద్ధతి సనాతనయోగము (జీవునిచే నిర్వహింపబడు నిత్యకర్మలు) అని పిలువబడును. ఈ యోగవిధానము రెండువిధములైన యజ్ఞకర్మలను కూడియుండును. అందు ఒకటి ద్రవ్యమయయజ్ఞమని పిలువబడగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కర్మయైనటువంటి ఆత్మజ్ఞానముగా పిలువబడును. ద్రవ్యమయయజ్ఞము ఆత్మానుభవముతో సంధింపబడనిచో అది భౌతికకర్మగా పరిణమించును. కాని అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక ఉద్దేశ్యముతో (భక్తియోగమునందు) నిర్వహించువాడు పూర్ణయజ్ఞమును కావించినవాడగును. ఇక మనము ఆధ్యాత్మిక కర్మలను గూర్చి తెలిసికొనుట (స్వీయస్థితి) కాగా, రెండవది దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని గూర్చిన సత్యమును ఎరుగుట కాగలదు. భగవద్గీత మార్గమును యథాతథముగా అనుసరించువాడు ఆధ్యాత్మికజ్ఞానమునందలి ఈ రెండు ముఖ్యవిభాగవములను సులభముగా అవగతము చేసికొనగలడు. అట్టివానికి ఆత్మ శ్రీకృష్ణభగవానుని దివ్యకర్మలను సులభముగా అవగతము చేసికొనగలడు కావున అతనికి గల జ్ఞానము లాభదాయకము కాగలదు. ఈ అధ్యాయపు ఆరంభములో భగవానుని దివ్యకర్మలు అతని చేతనే చర్చించబడియున్నవి. అట్టి గీతోపదేశమును అవగాహన చేసికొనలేనివాడు శ్రద్ధారహితునిగను మరియు భగవానునిచే ఒసగబడిన కొద్దిపాటి స్వాతంత్ర్యమును దుర్వినియోగాపరచినవాడుగను భావింపబడును. అట్టి ఉపదేశము లభించిన పిమ్మటయు సత్, చిత్, జ్ఞానస్వరూపునిగా శ్రీకృష్ణభగవానుని నిజతత్త్వమును తెలిసికొనలేనివాడు నిక్కముగా గొప్ప మూర్ఖుడే. అట్టి అజ్ఞానము కృష్ణభక్తిభావన యందలి నియమములను పాటించుట ద్వారా క్రమముగా తొలగిపోగలదు. వివిధదేవతల కొరకై ఒనర్చబడు యజ్ఞముల ద్వారా, పరబ్రహ్మోపాసన ద్వారా, బ్రహ్మచర్యము ద్వారా, నియమిత గృహస్థజీవనము ద్వారా, యోగము ద్వారా, తపస్సు ద్వారా, భౌతికసంపత్తుల త్యాగము ద్వారా, వేదాధ్యయనము ద్వారా, వర్ణాశ్రమధర్మము ననుసరించుట ద్వారా కృష్ణభక్తిభావనము జాగృతము కాగలదు. ఇవియన్నియును నియమిత కర్మలపై ఆధారపడి యజ్ఞములుగా పిలువబడును. కాని వీటన్నింటి యందలి ముఖ్యవిషయము అత్మానుభవమే కనుక ఆ లక్ష్యసాధననే వాంచించువాడు భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి కాగలడు. అట్లుగాక శ్రీకృష్ణుని ప్రామాణికతనే శంకించువాడు పతనము నొందగలడు. కనుక భగవద్గీతాధ్యయనము గాని లేదా వేరే ఇతర శాస్త్రాధ్యయనమును గాని గురుసన్నిధిలో సేవ మరియు శరణాగతితో ఒనరింపవలెను. ఆధ్యాత్మికగురువు అనంతకాలము నుండి అవిచ్చిన్నముగా వచ్చుచున్న గురుపరంపరలో ఉన్నట్టివాడు. అనేక లక్షల సంవత్సరములకు పూర్వము సూర్యదేవునకు ఉపదేశింపబడి తదుపరి అతని ద్వారా ధరత్రి యందు వ్యాప్తినొందిన శ్రీకృష్ణభగవానుని ఉపదేశముల నుండి అట్టి గురువు ఏమాత్రము వైదొలగడు. కనుక ప్రతియొక్కరు భగవధ్గీతా మార్గమును దాని యందే తెలుపబడినరీతి అనుసరించుచు, ఇతరులను సత్యమార్గము నుండి పెడత్రోవ పట్టించు స్వీయాభ్యుదయ వాంచితులగు స్వార్థపరుల యెడ జాగరూకులై యుండవలెను. శ్రీకృష్ణభగవానుడు నిశ్చయముగా దివ్యపురుషుడు మరియు అతని కర్మలన్నియును దివ్యములు. ఈ విషయమును అవగతము చేసికొనినవాడు గీతాధ్యయనపు ఆది నుండియే ముక్తపురుషుడై యుండును.
శ్రీమధ్భగవద్గీత యందలి “దివ్యజ్ఞానము” అను చతుర్థాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 192 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 42 🌴
42. tasmād ajñāna-sambhūtaṁ
hṛt-sthaṁ jñānāsinātmanaḥ
chittvainaṁ saṁśayaṁ yogam
ātiṣṭhottiṣṭha bhārata
🌷 Translation :
Therefore the doubts which have arisen in your heart out of ignorance should be slashed by the weapon of knowledge. Armed with yoga, O Bhārata, stand and fight.
🌹 Purport :
The yoga system instructed in this chapter is called sanātana-yoga, or eternal activities performed by the living entity. This yoga has two divisions of sacrificial actions: one is called sacrifice of one’s material possessions, and the other is called knowledge of self, which is pure spiritual activity. If sacrifice of one’s material possessions is not dovetailed for spiritual realization, then such sacrifice becomes material. But one who performs such sacrifices with a spiritual objective, or in devotional service, makes a perfect sacrifice.
When we come to spiritual activities, we find that these are also divided into two: namely, understanding of one’s own self (or one’s constitutional position), and the truth regarding the Supreme Personality of Godhead. One who follows the path of Bhagavad-gītā as it is can very easily understand these two important divisions of spiritual knowledge. For him there is no difficulty in obtaining perfect knowledge of the self as part and parcel of the Lord. And such understanding is beneficial, for such a person can easily understand the transcendental activities of the Lord. In the beginning of this chapter, the transcendental activities of the Lord were discussed by the Supreme Lord Himself. One who does not understand the instructions of the Gītā is faithless, and is to be considered to be misusing the fragmental independence awarded to him by the Lord. In spite of such instructions, one who does not understand the real nature of the Lord as the eternal, blissful, all-knowing Personality of Godhead is certainly fool number one. Ignorance can be removed by gradual acceptance of the principles of Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is awakened by different types of sacrifices to the demigods, sacrifice to Brahman, sacrifice in celibacy, in household life, in controlling the senses, in practicing mystic yoga, in penance, in forgoing material possessions, in studying the Vedas and in partaking of the social institution called varṇāśrama-dharma. All of these are known as sacrifice, and all of them are based on regulated action. But within all these activities, the important factor is self-realization. One who seeks that objective is the real student of Bhagavad-gītā, but one who doubts the authority of Kṛṣṇa falls back. One is therefore advised to study Bhagavad-gītā, or any other scripture, under a bona fide spiritual master, with service and surrender. A bona fide spiritual master is in the disciplic succession from time eternal, and he does not deviate at all from the instructions of the Supreme Lord as they were imparted millions of years ago to the sun-god, from whom the instructions of Bhagavad-gītā have come down to the earthly kingdom. One should, therefore, follow the path of Bhagavad-gītā as it is expressed in the Gītā itself and beware of self-interested people after personal aggrandizement who deviate others from the actual path. The Lord is definitely the supreme person, and His activities are transcendental. One who understands this is a liberated person from the very beginning of his study of Bhagavad-gītā.
Thus end the Bhaktivedanta Purports to the Fourth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Transcendental Knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 20/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 193: 05వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 193: Chap. 05, Ver. 01
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 193 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - కర్మయోగము - 01 🌴
01. అర్జున ఉవాచ
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్సితమ్ ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు ఇట్లు పలికెను: ఓ కృష్ణ! తొలుత నన్ను కర్మత్యాగము చేయుమని చెప్పి తిరిగి భక్తియుతకర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము.
🌷. భాష్యము :
భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసికకల్పనల కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయమున తెలియజేయుచున్నాడు. ప్రకృతికి పరముగా నుండి మనుజుని కర్మఫలముల నుండి ముక్తిని చేయగలిగినందున భక్తియోగము వాస్తవమునాకు మానసికకల్పనల కన్నును సులభమైన మార్గమై యున్నది. ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన వైనము ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. ఏ విధముగా ఆత్మ అట్టి భవబంధము నుండి బుద్ధియోగము(భక్తియోగము) ద్వారా ముక్తినొందగలదో కూడా ఆ అధ్యాయముననే వివరింపబడినది. జ్ఞానస్థితిలో నిలిచియున్నవాడు ఒనరింపవలసిన ధర్మములేవియును ఉండవని తృతీయాధ్యాయమున వివరింపబడినది. సర్వవిధ యజ్ఞములు అంత్యమున జ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు చతుర్థాధ్యాయమున బోధించెను. అయినను పూర్ణజ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుటకు సంసిద్ధుడగుమని చతుర్థాధ్యాయపు అంత్యమున భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. అనగా భక్తియుతకర్మ మరియు జ్ఞానముతో కూడిన అకర్మల ప్రాముఖ్యమును ఏకమారు నొక్కిచెప్పుచు శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురుచేసి అతని స్థిరత్వమును కలవరపరచెను. జ్ఞానపూర్వక త్యాగమనగా ఇంద్రియప్రీతికర కర్మలనన్నింటిని విరమించుట యని అర్జునుడు ఎరిగియుండెను. కాని ఎవరేని భక్తియోగమునందు కర్మనొనరించుచున్నదో కర్మ ఎట్లు ఆగిపోగలదు? అనగా కర్మ మరియు త్యాగము రెండింటికిని పొత్తు కుదరదు కనుక సన్న్యాసముగా(జ్ఞానపూర్వక త్యాగము) అన్నిరకముల నుండి విడివడియుండుట యని అర్జునుడు భావించెను. జ్ఞానపూర్వక కర్మ బంధమును కలుగజేయదు కనుక అకర్మతో ససమానమని అర్జునుడు అవగతము చేసికొననట్లుగా ఇచ్చట కనిపించుచున్నది. కనుకనే తానూ కర్మను విరమింపవలెనో లేదా జ్ఞానయుతుడై కర్మనొనరింపవలెనో అతడు తెలియగోరుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 193 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 01 🌴
01. arjuna uvāca
sannyāsaṁ karmaṇāṁ kṛṣṇa
punar yogaṁ ca śaṁsasi
yac chreya etayor ekaṁ
tan me brūhi su-niścitam
🌷 Translation :
Arjuna said: O Kṛṣṇa, first of all You ask me to renounce work, and then again You recommend work with devotion. Now will You kindly tell me definitely which of the two is more beneficial?
🌹 Purport :
In this Fifth Chapter of the Bhagavad-gītā, the Lord says that work in devotional service is better than dry mental speculation. Devotional service is easier than the latter because, being transcendental in nature, it frees one from reaction. In the Second Chapter, preliminary knowledge of the soul and its entanglement in the material body were explained. How to get out of this material encagement by buddhi-yoga, or devotional service, was also explained therein. In the Third Chapter, it was explained that a person who is situated on the platform of knowledge no longer has any duties to perform. And in the Fourth Chapter the Lord told Arjuna that all kinds of sacrificial work culminate in knowledge. However, at the end of the Fourth Chapter, the Lord advised Arjuna to wake up and fight, being situated in perfect knowledge. Therefore, by simultaneously stressing the importance of both work in devotion and inaction in knowledge, Kṛṣṇa has perplexed Arjuna and confused his determination. Arjuna understands that renunciation in knowledge involves cessation of all kinds of work performed as sense activities. But if one performs work in devotional service, then how is work stopped? In other words, he thinks that sannyāsa, or renunciation in knowledge, should be altogether free from all kinds of activity, because work and renunciation appear to him to be incompatible. He appears not to have understood that work in full knowledge is nonreactive and is therefore the same as inaction. He inquires, therefore, whether he should cease work altogether or work with full knowledge.
Continues
🌹 🌹 🌹 🌹 🌹
Date: 21/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 194: 05వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 194: Chap. 05, Ver. 02
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 194 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 02 🌴
02. శ్రీ భగవానువాచ
సన్న్యాస: కర్మయోగాశ్చ ని:శ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు సమాధానమొసగెను; కర్మపరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములో. కాని ఆ రెండింటిలో కర్మపరిత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది.
🌷. భాష్యము :
కామ్యకర్మలు (ఇంద్రియప్రీతిని కోరునటువంటి) భవబంధమునకు కారణములై యున్నవి. దేహసౌఖ్యము పెంపొందించుకొను ఉద్దేశ్యముతో కర్మల నొనరించునంత కాలము జీవుడు వివిధములైన దేహములను పొందుచు భవబంధమున నిరంతరము కొనసాగవలసియే యుండును. శ్రీమద్భాగవతము(5.5.4-6) ఈ విషయమునే ఇట్లు నిర్ధారణ చేసినది.
నూనం ప్రమత్త: కురుతే వికర్మ
యదింద్రియప్రీతయ ఆపృణోతి |
న సాధు మన్యే యత ఆత్మనో(యమ్
అసన్నపి క్లేశద ఆస దేహ: ||
పరాభవస్తావ దబోధజాతో
యావన్న జిజ్ఞాసత ఆత్మతత్త్వం |
యావత్ర్కియా స్తావదిదం మనోవై
కర్మాత్మకం యేన శరీరబంధ: ||
ఏవం మన: కర్మవశం ప్రయుంక్తే
అవిద్యయాత్మన్యుపధీయమానే |
ప్రీతి ర్న యావన్మయి వాసుదేవే
న ముచ్యతే దేహయోగేన తావత్ ||
“ఇంద్రియప్రీతి యెడ ఆసక్తులై యుండు మనుజులు దుఃఖభూయిష్టమైన ప్రస్తుతదేహము గత కర్మఫలముగా లభించినదే యని తెలిసికొనజాలడు. ఈ దేహము ఆశాశ్వతమైనను ఉన్నంతకాలము జీవుని అది అనేకరకములుగా భాధించును. కనుక ఇంద్రియప్రీతి కొరకు వర్తించుట సరియైనది కాదు. మనుజడు తన నిజస్థితి గూర్చి ప్రశ్నించనంతకాలము జీవితములో పరాజయమును పొందినట్లుగా భావింపబడును. అతడు తన నిజస్థితిని ఎరుగనంతవరకు ఇంద్రియప్రీతికై ఫలముల నాశించి కర్మ యందు వర్తించవలసివచ్చును. అట్టి ఇంద్రియభోగానుభవ భావములో నున్నంతకాలము అతడు వివిధయోనుల యందు పరిభ్రమించవలసినదే. మనస్సు ఆ విధముగా కామ్యకర్మల యందు లగ్నమై యున్నను మరియు అజ్ఞానముచే ప్రభావితమై యున్నను ఏదియో ఒక విధముగా ప్రతియొక్కరు వాసుదేవుని భక్తియుతసేవ యెడ అనురక్తిని పెంపొందించుకొనవలెను. అప్పుడే ఎవ్వరైనను భవబంధము నుండి ముక్తిని పొందు అవకాశమును పొందగలరు.”
కావున జ్ఞానమొక్కటే(నేను దేహమున గాక ఆత్మననెడి జ్ఞానము) ముక్తికి సరిపోదు. అట్టి జ్ఞానముతో పాటు ఆత్మస్థితిలో వర్తించనిదే భవబంధము నుండి తప్పించుకొనుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. కాని కృష్ణభక్తిరసభావనమునందు ఒనరింపబడు కర్మ కామ్యకర్మ వంటిది కాదు. పూర్ణజ్ఞానముతో ఒనరింపబడు కర్మలు మనుజుని జ్ఞానమునందలి పురోగతిని మరింత దృడవంతము చేయగలవు. వాస్తవమునకు కృష్ణభక్తిభావన లేకుండా కేవలము కామ్యకర్మలను త్యజించుట యనునది బద్ధజీవుని హృదయమును పవిత్రము చేయజాలదు. హృదయము పవిత్రము కానంతవరకు మనుజుడు కామ్యభావనలో కర్మలను ఒనరింపవలసి వచ్చును. కాని కృష్ణభక్తిభావనలో ఒనరింపబడు కర్మ సర్వకర్మఫలముల నుండి తప్పించుకొనుటకు అప్రయత్నముగా దోహదమగుచున్నందున కర్మ వలన భౌతికస్థితికి ఎవ్వరును పతనము చెందు అవకాశముండదు. కనుకనే పతనము నొందు అవకాశమున్నటువంటి కర్మపరిత్యాగము కన్నను కృష్ణభక్తిరసభావితకర్మ శ్రేష్ఠమైనది. భక్తిరసామృతసింధువులో(1.2.258) శ్రీల రూపగోస్వామి నిర్దారించినట్లు కృష్ణభక్తిభావన లేకుండా చేయబడు త్యాగము అసంపూర్ణమై యున్నది.
ప్రాపంచికతయా బుద్ధ్యా హరిసంబంధివస్తున: |
ముముక్షుభి: పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే ||
“ముక్తిని పొందవలెనను ఆత్రుతతో మనుజులు దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన వస్తువులను మరియు విషయములను సైతము భౌతికముగా భావించి త్యాగము చేసినప్పుడు, వారి త్యాగము అసంపూర్ణమైనదిగా పిలువబడును.” సర్వము శ్రీకృష్ణునకే చెందినదనియు మరియు ఎవ్వరును దేనిపైనను స్వామ్యమును కలిగియుండరాదనియు తెలిపెడి జ్ఞానముతో కూడియున్నప్పుడే త్యాగము సంపూర్ణము కాగలదు. వాస్తవమునాకు ఏదియును ఎవ్వరకును చెందినది కాదని ప్రతియొక్కరు అవగాహన చేసికొనవలెను. అట్టి యెడ త్యాగమనెడి ప్రశ్న ఎట్లు ఉదయించును? సర్వము కృష్ణునిదే కనుక అతని సేవ కొరకే సమస్తమును వినియోగించవలసియున్నది. కర్మ యొక్క సమగ్రరూపమైన ఇటువంటి కృష్ణభక్తిరసభావితకర్మ యనునది మాయావాద సన్న్యాసులు అవలంబించు కృత్రిమమైన పరిత్యాగము కన్నను అత్యంత శ్రేష్ఠమైనది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 194 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 02 🌴
02. śrī-bhagavān uvāca
sannyāsaḥ karma-yogaś ca
niḥśreyasa-karāv ubhau
tayos tu karma-sannyāsāt
karma-yogo viśiṣyate
🌷 Translation :
The Personality of Godhead replied: The renunciation of work and work in devotion are both good for liberation. But, of the two, work in devotional service is better than renunciation of work.
🌹 Purport :
Fruitive activities (seeking sense gratification) are cause for material bondage.
As long as one is engaged in activities aimed at improving the standard of bodily comfort, one is sure to transmigrate to different types of bodies, thereby continuing material bondage perpetually. Śrīmad-Bhāgavatam (5.5.4–6) confirms this as follows:
nūnaṁ pramattaḥ kurute vikarma
yad indriya-prītaya āpṛṇoti
na sādhu manye yata ātmano ’yam
asann api kleśa-da āsa dehaḥ
parābhavas tāvad abodha-jāto
yāvan na jijñāsata ātma-tattvam
yāvat kriyās tāvad idaṁ mano vai
karmātmakaṁ yena śarīra-bandhaḥ
evaṁ manaḥ karma-vaśaṁ prayuṅkte
avidyayātmany upadhīyamāne
prītir na yāvan mayi vāsudeve
na mucyate deha-yogena tāvat
“People are mad after sense gratification, and they do not know that this present body, which is full of miseries, is a result of one’s fruitive activities in the past. Although this body is temporary, it is always giving one trouble in many ways. Therefore, to act for sense gratification is not good. One is considered to be a failure in life as long as he makes no inquiry about his real identity. As long as he does not know his real identity, he has to work for fruitive results for sense gratification, and as long as one is engrossed in the consciousness of sense gratification one has to transmigrate from one body to another. Although the mind may be engrossed in fruitive activities and influenced by ignorance, one must develop a love for devotional service to Vāsudeva. Only then can one have the opportunity to get out of the bondage of material existence.”
Therefore, jñāna (or knowledge that one is not this material body but spirit soul) is not sufficient for liberation. One has to act in the status of spirit soul, otherwise there is no escape from material bondage. Action in Kṛṣṇa consciousness is not, however, action on the fruitive platform. Activities performed in full knowledge strengthen one’s advancement in real knowledge. Without Kṛṣṇa consciousness, mere renunciation of fruitive activities does not actually purify the heart of a conditioned soul. As long as the heart is not purified, one has to work on the fruitive platform. But action in Kṛṣṇa consciousness automatically helps one escape the result of fruitive action so that one need not descend to the material platform. Therefore action in Kṛṣṇa consciousness is always superior to renunciation, which always entails a risk of falling. Renunciation without Kṛṣṇa consciousness is incomplete, as is confirmed by Śrīla Rūpa Gosvāmī in his Bhakti-rasāmṛta-sindhu (1.2.258):
prāpañcikatayā buddhyā
hari-sambandhi-vastunaḥ
mumukṣubhiḥ parityāgo
vairāgyaṁ phalgu kathyate
“When persons eager to achieve liberation renounce things related to the Supreme Personality of Godhead, thinking them to be material, their renunciation is called incomplete.” Renunciation is complete when it is in the knowledge that everything in existence belongs to the Lord and that no one should claim proprietorship over anything. One should understand that, factually, nothing belongs to anyone. Then where is the question of renunciation? One who knows that everything is Kṛṣṇa’s property is always situated in renunciation. Since everything belongs to Kṛṣṇa, everything should be employed in the service of Kṛṣṇa. This perfect form of action in Kṛṣṇa consciousness is far better than any amount of artificial renunciation by a sannyāsī of the Māyāvādī school.
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
Date: 22/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 195: 05వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 195: Chap. 05, Ver. 03
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 195 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 03 🌴
03. జ్ఞేయ: స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ ప్రముచ్యతే ||
🌷. తాత్పర్యం :
కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనివాడు నిత్యసన్న్యాసిగా తెలియబడును. ఓ మహాబాహుడవైన అర్జునా! ద్వంద్వముల నుండి విడివడి యుండు అట్టివాడు లౌకికబంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైనవాడు కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనందున నిత్యసన్న్యాసియై యున్నాడు. శ్రీకృష్ణునితో తనకు గల నిత్యసంబంధమున తన నిజస్థితి ఎరిగియున్న కారణముగా భక్తియుతసేవకు అంకితుడై యుండు అట్టి త్యాగి జ్ఞానమునందు పరిపూర్ణుడై యుండును. శ్రీ కృష్ణుడు పూర్ణుడనియు మరియు తాని అట్టి పూర్ణము యొక్క అంశననియు ఆ భక్తుడు సంపూర్ణముగా నెరిగియుండును. అట్టి జ్ఞానమే వాస్తవమునకు గుణరీతిని మరియు పరిమాణరీతిని సరియై యున్నందున సమగ్రజ్ఞానమై యున్నది. అంశలు ఏనాడును పూర్ణముతో సమానము కాలేనందున కృష్ణునితో ఏకత్వమనెడి భావనము ఎన్నడును సరియైనది కాదు. జీవుడు భగవానునితో గుణరీతిగనే సమానుడు గాని పరిమాణరీతిని కాదనెడి నిజమైన ఆధ్యాత్మికజ్ఞానము కోరికలు, చింతలు లేనటువంటి పూర్ణాత్మునిగా మనుజుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను కృష్ణుని కొరకే చేయును కనుక అతని మనస్సు నందు ద్వంద్వములు పొడసూపవు. ఆ విధముగా ద్వంద్వాతీతుడై అతడు ఈ భౌతికజగమునందును ముక్తుడై యుండగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 195 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 03 🌴
03. jñeyaḥ sa nitya-sannyāsī
yo na dveṣṭi na kāṅkṣati
nirdvandvo hi mahā-bāho
sukhaṁ bandhāt pramucyate
🌷 Translation :
One who neither hates nor desires the fruits of his activities is known to be always renounced. Such a person, free from all dualities, easily overcomes material bondage and is completely liberated, O mighty-armed Arjuna.
🌹 Purport :
One who is fully in Kṛṣṇa consciousness is always a renouncer because he feels neither hatred nor desire for the results of his actions. Such a renouncer, dedicated to the transcendental loving service of the Lord, is fully qualified in knowledge because he knows his constitutional position in his relationship with Kṛṣṇa. He knows fully well that Kṛṣṇa is the whole and that he is part and parcel of Kṛṣṇa. Such knowledge is perfect because it is qualitatively and quantitatively correct. The concept of oneness with Kṛṣṇa is incorrect because the part cannot be equal to the whole. Knowledge that one is one in quality yet different in quantity is correct transcendental knowledge leading one to become full in himself, having nothing to aspire to or lament over. There is no duality in his mind because whatever he does, he does for Kṛṣṇa. Being thus freed from the platform of dualities, he is liberated – even in this material world.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 23/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 196: 05వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 196: Chap. 05, Ver. 04
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 196 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 04 🌴
04. సాంఖ్యయోగౌ పృథాగ్బాలా: ప్రవదన్తి న పణ్డితా: |
ఏకమప్యాస్థిత: సమ్యగుభయోర్విన్దతే ఫలమ్ ||
🌷. తాత్పర్యం :
కేవలము అజ్ఞానులే భక్తియోగమును(కర్మయోగము) భౌతికజగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు(సాంఖ్యమునకు) భిన్నమైనదిగా పలుకుదురు. కాని ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మనుజుడు పొందగలడని పండితులు చెప్పుదురు.
🌷. భాష్యము :
ఆత్మ ఉనికిని తెలిసికొనుటయే భౌతికజగమును గూర్చిన విశ్లేషణాత్మక అధ్యయనముయొక్క లక్ష్యమై యున్నది. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగమునకు ఆత్మయై యున్నాడు. శ్రీకృష్ణభగవానునకు ఒనరింపబడు భక్తి ఆ పరమాత్మకు కూర్చబడు సేవయే కాగలదు. ఒక పద్ధతి చెట్టు ములమును కనుగొను విధానము కాగా, ఇంకొక పద్ధతి ఆ మూలమునకు నీరుపోయుట వంటిది. నిజమైన సాంఖ్యజ్ఞాన అధ్యయనపరుడు భౌతికజగత్తునకు మూలమైన విష్ణువును తెలిసికొని పూర్ణజ్ఞానముతో అతని సేవ యందు నియుక్తుడగును. అనగా వాస్తవమునకు ఈ రెండు మార్గముల లక్ష్యము విష్ణువేయైనందున రెండింటిలో భేదమేమియును లేదు. అంతిమ ప్రయోజనమును తెలియనివారే సాంఖ్యము మరియు కర్మయోగముల ప్రయోజనములు ఏకము కావని పలుకుదురు. కాని పండితుడైనవాడు మాత్రము ఈ రెండుమార్గముల యొక్క ఏకమాత్ర ప్రయోజనమును సంపూర్ణముగా ఎరిగియుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 196 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 04 🌴
04. sāṅkhya-yogau pṛthag bālāḥ
pravadanti na paṇḍitāḥ
ekam apy āsthitaḥ samyag
ubhayor vindate phalam
🌷 Translation :
Only the ignorant speak of devotional service [karma-yoga] as being different from the analytical study of the material world [Sāṅkhya]. Those who are actually learned say that he who applies himself well to one of these paths achieves the results of both.
🌹 Purport :
The aim of the analytical study of the material world is to find the soul of existence. The soul of the material world is Viṣṇu, or the Supersoul. Devotional service to the Lord entails service to the Supersoul. One process is to find the root of the tree, and the other is to water the root. The real student of Sāṅkhya philosophy finds the root of the material world, Viṣṇu, and then, in perfect knowledge, engages himself in the service of the Lord. Therefore, in essence, there is no difference between the two because the aim of both is Viṣṇu. Those who do not know the ultimate end say that the purposes of Sāṅkhya and karma-yoga are not the same, but one who is learned knows the unifying aim in these different processes.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 24/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 197: 05వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 197: Chap. 05, Ver. 05
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 197 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 05 🌴
04. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ య: పశ్యతి స పశ్యతి ||
🌷. తాత్పర్యం :
సాంఖ్యము ద్వారా పొందబడు స్థానమును భక్తియోగము ద్వారాను పొందవచ్చునని ఎరిగి, తత్కారణముగా భక్తియోగము మరియు సాంఖ్యములను ఏకస్థాయిలో నున్నవానిగా గాంచువాడు యథార్థదృష్టి కలిగినవాడగును.
🌷. భాష్యము :
జీవితపు చరమలక్ష్యమును కనుగొనుటయే తత్త్వపరిశోధనల ముఖ్యప్రయోజనమై యున్నది. జీవిత ముఖ్యలక్ష్యము ఆత్మానుభవమైనందున ఈ రెండుమార్గముల యందలి నిర్ణయములందు ఎట్టి భేదము లేదు. సాంఖ్యతత్త్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతికజగత్తుయొక్క అంశ కాదనియు, పూర్ణుడైన పరమాత్ముని అంశమేననియు మనుజుడు నిర్ధారణకు వచ్చును. శుద్ధాత్మకు భౌతికజగత్తుతో సంబంధము లేదనియు మరియు దాని కర్మలన్నియును కృష్ణపరములుగా నుండవలెననియు అంతట మనుజుడు తెలిసికొనగలుగును. అట్టి భావనలో అతడు కర్మనొనరించినచో తన నిజస్థితి యందు నిలిచినవాడే కాగలడు. మొదటి పద్ధతియైన సాంఖ్యములో మనుజుడు భౌతికపదార్థము నుండి విడివడవలసియుండగా, రెండవ పద్ధతియైన భక్తియోగమునందు కృష్ణభక్తిరసభావితకర్మల యందు సంపూర్ణముగా మగ్నుడు కావలసియుండును. బాహ్యమునాకు ఒకదాని యందు అసంగత్వము ఇంకొక దాని యందు సంగత్వము గోచరించినను వాస్తవమునకు రెండు పద్ధతులు ఏకమే అయియున్నవి. భౌతికత్వము నుండి విముక్తి మరియు కృష్ణుని యెడ అనురక్తి ఏకమేననెడి విషయమును గాంచగలిగినవాడు యథార్థదృష్టిని పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 197 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 05 🌴
05. yat sāṅkhyaiḥ prāpyate sthānaṁ
tad yogair api gamyate
ekaṁ sāṅkhyaṁ ca yogaṁ ca
yaḥ paśyati sa paśyati
🌷 Translation :
One who knows that the position reached by means of analytical study can also be attained by devotional service, and who therefore sees analytical study and devotional service to be on the same level, sees things as they are.
🌹 Purport :
The real purpose of philosophical research is to find the ultimate goal of life. Since the ultimate goal of life is self-realization, there is no difference between the conclusions reached by the two processes. By Sāṅkhya philosophical research one comes to the conclusion that a living entity is not a part and parcel of the material world but of the supreme spirit whole. Consequently, the spirit soul has nothing to do with the material world; his actions must be in some relation with the Supreme. When he acts in Kṛṣṇa consciousness, he is actually in his constitutional position. In the first process, Sāṅkhya, one has to become detached from matter, and in the devotional yoga process one has to attach himself to the work of Kṛṣṇa consciousness. Factually, both processes are the same, although superficially one process appears to involve detachment and the other process appears to involve attachment. Detachment from matter and attachment to Kṛṣṇa are one and the same. One who can see this sees things as they are.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 25/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 198: 05వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 198: Chap. 05, Ver. 06
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 198 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 06 🌴
06. సన్న్యాసస్తు మాహాబాహో దుఃఖమాప్తుమయోగత: |
యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
భక్తియుతసేవ యందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కాని భక్తియోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు.
🌷. భాష్యము :
సన్న్యాసుల యందు(సన్న్యాసాశ్రమము నందున్నవారు) రెండు తరగతులవారు కలరు. మయావాద సన్న్యాసులు సాంఖ్యతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుండగా, వైష్ణవసన్న్యాసులు వేదాంతసూత్రములకు చక్కని భాష్యమైన శ్రీమద్భాగవతతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుందురు. మయావాదులు సైతము వేదాంతసూత్రములను అధ్యయనము చేసినను దాని కొరకు వారు శంకరాచార్యులు వ్రాసిన శారీరికభాష్యమనెడి తమ స్వంత వ్యాఖ్యానమును ఉపయోగింతురు. భాగవతధర్మము నందు భక్తులు “పాంచరాత్రిక” విధానము ద్వారా భగవానుని భక్తియుక్తసేవ యందు నెలకొనియుందురు. కనుకనే భాగవతధర్మము ననుసరించు వైష్ణవసన్న్యాసులు భగవానుని దివ్యసేవ యందు పలురకములైన కర్మలను కలిగియుందురు. భౌతికకర్మలతో ఎట్టి సంబంధము లేకున్నను వారు భాగవత్సేవ కొరకై పలువిధములైన కర్మలలో నియుక్తులగుదురు. సాంఖ్యమునందు, వేదాంతాధ్యయనమునందు, మనోకల్పనల యందు మునిగియుండెడి మయావాద సన్న్యాసులు అట్టి దివ్యసేవా మధురిమను అనుభవింపలేరు. అతిదీర్ఘమైన తమ అధ్యయనముల వలన వారు కొన్నిమార్లు పరబ్రహ్మమును గూర్చిన మానసికకల్పనల యెడ విసుగుచెంది శ్రీమద్భాగవతము నాశ్రయింతురు. కాని సరియైన అవగాహన లేకనే భాగవతమును స్వీకరించుచున్నందున వారి అధ్యయనము శ్రమ కారణమే కాగలదు. వాస్తవమునకు అట్టి శుష్క మానసికకల్పనలు మరియు కృత్రిమమైన నిరాకారభావపు వ్యాఖ్యానములు మయావాద సంన్యాసులకు నిరర్ధక కార్యములు. భక్తియోగమునందు చరించుచున్న వైష్ణవసన్న్యాసులు తమ దివ్య కర్మాచరణమునందు ఆనందము ననుభవించుచు అంత్యమున భగవద్ధామమును చేరుదుమనెడి అభయమును కలిగియుందురు. కాని మాయావాద సన్న్యాసులు కొన్నిమార్లు ఆత్మానుభవమార్గము నుండి పతనము నొంది భౌతికకలాపములేయైన ధర్మకార్యములు మరియు పరహితముల వంటి లౌకికకర్మలలో తిరిగి ప్రవేశింతురు. కనుక సారాంశమేమనగా ఏది బ్రహ్మము మరియు ఏది బ్రహ్మము కాదనెడి మనోకల్పనల యందే నియుక్తులై యుండు మాయావాద సన్న్యాసుల కన్నను కృష్ణభక్తిరసభావితకర్మల యందు నియుక్తులైనవారు సరియైన స్థితిలో నెలకొనినట్టివారు. అయినను మయావాద సన్న్యాసులు సైతము బహుజన్మల పిదప కృష్ణభక్తిభావనకు పొందగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 198 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 06 🌴
06. sannyāsas tu mahā-bāho
duḥkham āptum ayogataḥ
yoga-yukto munir brahma
na cireṇādhigacchati
🌷 Translation :
Merely renouncing all activities yet not engaging in the devotional service of the Lord cannot make one happy. But a thoughtful person engaged in devotional service can achieve the Supreme without delay.
🌹 Purport :
There are two classes of sannyāsīs, or persons in the renounced order of life. The Māyāvādī sannyāsīs are engaged in the study of Sāṅkhya philosophy, whereas the Vaiṣṇava sannyāsīs are engaged in the study of Bhāgavatam philosophy, which affords the proper commentary on the Vedānta-sūtras. The Māyāvādī sannyāsīs also study the Vedānta-sūtras, but use their own commentary, called Śārīraka-bhāṣya, written by Śaṅkarācārya. The students of the Bhāgavata school are engaged in the devotional service of the Lord, according to pāñcarātrikī regulations, and therefore the Vaiṣṇava sannyāsīs have multiple engagements in the transcendental service of the Lord. The Vaiṣṇava sannyāsīs have nothing to do with material activities, and yet they perform various activities in their devotional service to the Lord. But the Māyāvādī sannyāsīs, engaged in the studies of Sāṅkhya and Vedānta and speculation, cannot relish the transcendental service of the Lord. Because their studies become very tedious, they sometimes become tired of Brahman speculation, and thus they take shelter of the Bhāgavatam without proper understanding. Consequently their study of the Śrīmad-Bhāgavatam becomes troublesome. Dry speculations and impersonal interpretations by artificial means are all useless for the Māyāvādī sannyāsīs.
The Vaiṣṇava sannyāsīs, who are engaged in devotional service, are happy in the discharge of their transcendental duties, and they have the guarantee of ultimate entrance into the kingdom of God. The Māyāvādī sannyāsīs sometimes fall down from the path of self-realization and again enter into material activities of a philanthropic and altruistic nature, which are nothing but material engagements. Therefore, the conclusion is that those who are engaged in Kṛṣṇa conscious activities are better situated than the sannyāsīs engaged in simple speculation about what is Brahman and what is not Brahman, although they too come to Kṛṣṇa consciousness, after many births.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 26/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 199: 05వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 199: Chap. 05, Ver. 07
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 199 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 07 🌴
07. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియ: |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||
🌷. తాత్పర్యం :
భక్తియోగముతో కర్మనొనరించువాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ, మనస్సులను జయించినవాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై యుండును. సర్వుల యెడ అతడు ప్రియమును కలిగియుండును. అట్టివాడు సదాకర్మల నాచారించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన ద్వారా ముక్తిమార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమప్రియుడై యుండును మరియు సర్వజీవులు అతనికి ప్రియులై యుందురు. అతని కృష్ణభక్తిరసభావనమే అందులకు కారణము. పత్రములు, కొమ్మలు వంటివి వృక్షము నుండి వేరు కానట్లుగా, ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలుకు నీరుపోయుట ద్వారా ఆకులు మరియు కొమ్మలన్నింటికిని నీరు సరఫార యగుననియు లేదా ఉదరమునకు ఆహారము నందించుట ద్వారా దేహమంతయు అప్రయత్నముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగియుండును. కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును కావున సర్వులకు ప్రియుడై యుండును. సర్వులు అతని పనిచే ప్రియము నొందుటచే అతడు శుద్ధమైన అంతరంగమును కలిగియుండును. శుద్ధాంతరంగము ద్వారా అతని మనస్సు సంపూర్ణముగా నిగ్రహింపబడి, నిగ్రహమనస్సు ద్వారా ఇంద్రియములు అదుపులోనికి వచ్చియుండును. మనస్సు సదా శ్రీకృష్ణుని యందే లగ్నమై యున్న కారణముగా అతడు కృష్ణుని నుండి దూరమగుట గాని, కృష్ణసేవకు ఇతరములైన కర్మలలో నియుక్తుడగుట గాని జరుగదు. ఆ భక్తుడు కృష్ణపరములగు విషయములను తప్ప అన్యమును శ్రవణము చేయగోరడు. కృష్ణునికి అర్పింపబడని ఆహారమును భుజింప వాంచింపడు. అలాగుననే కృష్ణునితో సంబంధములేని స్థలములకు పోవ నిచ్చగించడు. కనుకనే అతని ఇంద్రియములు సంపూర్ణముగా అదుపులో నుండును. ఆ విధముగ ఇంద్రియములు అదుపులో నున్నవాడు ఎవ్వరికిని అపకారమును తలపెట్టడు. “అట్టి యెడ అర్జునుడు ఏ విధముగా యుద్దరంగమున ఇతరులకు అపకారము చేసెను? అతడు కృష్ణభక్తిపూర్ణుడు కాడా?” అని ఎవ్వరైనను ప్రశ్నించు అవకాశము కలదు. కాని వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలిచినవారందరును వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున(ద్వితీయాధ్యాయమున ఇది వరకే తెలుపబడినట్లు) అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయియున్నది. అనగా ఆధ్యాత్మికదృష్టిలో కురుక్షేత్రమునందు ఎవ్వరును మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞ మేరకు వారు దుస్తులవంటి దేహములు మాత్రమే మార్చబడినవి. అనగా అర్జునుడు కురుక్షేత్రరణరంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సంపూర్ణభక్తిభావనలో నిర్వర్తింపజేసి యున్నందున నిజముగా యుద్ధము చేయనివాడే అయినాడు. అట్టివాడు ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 199 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 07 🌴
07. yoga-yukto viśuddhātmā
vijitātmā jitendriyaḥ
sarva-bhūtātma-bhūtātmā
kurvann api na lipyate
🌷 Translation :
One who works in devotion, who is a pure soul, and who controls his mind and senses is dear to everyone, and everyone is dear to him. Though always working, such a man is never entangled.
🌹 Purport :
One who is on the path of liberation by Kṛṣṇa consciousness is very dear to every living being, and every living being is dear to him. This is due to his Kṛṣṇa consciousness. Such a person cannot think of any living being as separate from Kṛṣṇa, just as the leaves and branches of a tree are not separate from the tree. He knows very well that by pouring water on the root of the tree, the water will be distributed to all the leaves and branches, or by supplying food to the stomach, the energy is automatically distributed throughout the body. Because one who works in Kṛṣṇa consciousness is servant to all, he is very dear to everyone. And because everyone is satisfied by his work, he is pure in consciousness. Because he is pure in consciousness, his mind is completely controlled. And because his mind is controlled, his senses are also controlled. Because his mind is always fixed on Kṛṣṇa, there is no chance of his being deviated from Kṛṣṇa. Nor is there a chance that he will engage his senses in matters other than the service of the Lord.
He does not like to hear anything except topics relating to Kṛṣṇa; he does not like to eat anything which is not offered to Kṛṣṇa; and he does not wish to go anywhere if Kṛṣṇa is not involved. Therefore, his senses are controlled. A man of controlled senses cannot be offensive to anyone. One may ask, “Why then was Arjuna offensive (in battle) to others? Wasn’t he in Kṛṣṇa consciousness?” Arjuna was only superficially offensive because (as has already been explained in the Second Chapter) all the assembled persons on the battlefield would continue to live individually, as the soul cannot be slain. So, spiritually, no one was killed on the Battlefield of Kurukṣetra. Only their dresses were changed by the order of Kṛṣṇa, who was personally present. Therefore Arjuna, while fighting on the Battlefield of Kurukṣetra, was not really fighting at all; he was simply carrying out the orders of Kṛṣṇa in full Kṛṣṇa consciousness. Such a person is never entangled in the reactions of work.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 27/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 200: 05వ అధ్., శ్లో 08, 09 / Bhagavad-Gita - 200: Chap. 05, Ver. 08, 09
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 200 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 08 - 09 🌴
08. నైవ కించిత్ కరోమీతి యక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యన్ శృణ్వన్ స్పృశన్జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్స్వపన్ శ్వపన్ ||
09. ప్రలవన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ||
🌷. తాత్పర్యం :
దివ్యచైతన్యయుక్తుడైనవాడు చూచుట, వినుట, తాకుట, వాసనజూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవముగా ఏదియును చేయనట్లుగా ఎరిగియుండును. ఏలయన మాట్లాడునప్పుడు, గ్రహించునప్పుడు, విసర్జించునప్పుడు, కనులుతెరచుట లేక మూయుట జరుగునప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థములలో వర్తించుచున్నవనియు మరియు తాను వాని నుండి దూరముగా నుంటిననియు అతడు సదా ఎరిగియుండును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనలో నున్నటువంటివాడు శుద్ధస్థితిలో యున్నందున కర్త, కర్మము, స్థితి, ప్రయత్నము, అదృష్టములను ఐదు విధములైన కారణములపై ఆధారపడియుండు ఎటువంటి కర్మలతో సంబంధమును కలిగియుండడు. శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో అతడు నిలిచియుండుటచే అందులకు కారణము. దేహేంద్రియములతో వర్తించుచున్నను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవస్థితిని గూర్చి సర్వదా ఎరిగియుండును. భౌతికభావనలో ఇంద్రియములు ఇంద్రియభోగమునకై నియోగించబడగా, కృష్ణభక్తిభావన యందు అవి కృష్ణుని ప్రీత్యర్థమై నియోగించబడును. కావుననే కృష్ణభక్తిపరాయణుడు ఇంద్రియకర్మలలో వర్తించుచున్నట్లు తోచినను ఎల్లవేళలా విముక్తుడై యుండును. చూచుట మరియు వినుట వంటి కర్మలు జ్ఞానసముపార్జన కొరకు కాగా, నడుచుట, మాట్లాడుట, విసర్జించుట మొదలగు ఇంద్రియకర్మలచే ఎన్నడును ప్రభావితుడు కాడు. అట్టి భక్తుడు తాను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనని ఎరిగియుండుటచే ఆ భగవానుని సేవ తప్ప అన్యకార్యమును చేయకుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 200 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 08 - 09🌴
08. naiva kiñcit karomīti
yukto manyeta tattva-vit
paśyañ śṛṇvan spṛśañ jighrann
aśnan gacchan svapañ śvasan
09. pralapan visṛjan gṛhṇann
unmiṣan nimiṣann api
indriyāṇīndriyārtheṣu
vartanta iti dhārayan
🌷 Translation :
A person in the divine consciousness, although engaged in seeing, hearing, touching, smelling, eating, moving about, sleeping and breathing, always knows within himself that he actually does nothing at all. Because while speaking, evacuating, receiving, or opening or closing his eyes, he always knows that only the material senses are engaged with their objects and that he is aloof from them.
🌹 Purport :
A person in Kṛṣṇa consciousness is pure in his existence, and consequently he has nothing to do with any work which depends upon five immediate and remote causes: the doer, the work, the situation, the endeavor and fortune. This is because he is engaged in the loving transcendental service of Kṛṣṇa. Although he appears to be acting with his body and senses, he is always conscious of his actual position, which is spiritual engagement. In material consciousness, the senses are engaged in sense gratification, but in Kṛṣṇa consciousness the senses are engaged in the satisfaction of Kṛṣṇa’s senses. Therefore, the Kṛṣṇa conscious person is always free, even though he appears to be engaged in affairs of the senses. Activities such as seeing and hearing are actions of the senses meant for receiving knowledge, whereas moving, speaking, evacuating, etc., are actions of the senses meant for work. A Kṛṣṇa conscious person is never affected by the actions of the senses. He cannot perform any act except in the service of the Lord because he knows that he is the eternal servitor of the Lord.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 28/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 201: 05వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 201: Chap. 05, Ver. 10
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 201 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 10 🌴
10. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వా కరోతి య: |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా ||
🌷. తాత్పర్యం :
ఫలముల నన్నింటిని భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు.
🌷. భాష్యము :
ఇచ్చట “బ్రాహ్మణి” యనగా “కృష్ణభక్తిరసభావనమునందు” అని అర్థము. “ప్రధానము” అని పిలువబడును భౌతికజగత్తు ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనమై యున్నది. “సర్వం హి ఏతత్ బ్రహ్మ”(మాండూక్యోపనిషత్తు 2), “తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే” (ముండకోపనిషత్తు 1.2.10) అను వేదమంత్రములు మరియు “మమ యోనిర్ మహద్బ్రహ్మ” (భగవద్గీత 14.3) అను భగవద్గీతావాక్యము జగత్తు నందలి సర్వము బ్రహ్మస్వరూపమని తెలుపుచున్నది. అనగా జగమునందలి విషయములు తమకు కారణమైన బ్రహ్మము కన్నను భిన్నముగా ప్రదర్శితమగుచున్నను వాస్తవమునాకు బ్రహ్మమునకు అభిన్నములై యున్నవి. ప్రతిదియు పరబ్రహ్మమైన శ్రీకృష్ణునికి సంబంధించినదే కావున అవియన్నియును అతనికే చెందియున్నవని ఈశోపనిషత్తు నందు తెలుపబడినది. సర్వము శ్రీకృష్ణునకే చెందినదనియు, శ్రీకృష్ణుడే సర్వమునకు యజమానియనియు, తత్కారణముగా సమస్తమును ఆ భగవానుని సేవయందే నియుక్తము కావించవలెననియు తెలిసినవాడు తన పుణ్యపాపకర్మల ఫలములతో సంబంధము లేకుండును. ఒక నిర్దుష్ట కార్యార్థమై భగావానునిచే ఒసగిబడియున్నందున భౌతికదేహమును సైతము కృష్ణభక్తిభావన యందు నియోగింపవలెను. అట్టి సమయమున నీటి యందున్నను తడి గాని తామరాకు వలె దేహము పాపకర్మఫలములకు అతీతమగును. “మయి సర్వాణి కర్మాణి సన్న్యస్య – నీ కర్మలనన్నింటిని నాకు అర్పింపుము” అని శ్రీకృష్ణభగవానుడు తృతీయాధ్యాయమున(3.30) పలికియుండెను. సారంశమేమనగా కృష్ణభక్తిభావనము లేనివాడు దేహేంద్రియభావనలో వర్తించగా, కృష్ణభక్తిపరాయణుడు దేహము కృష్ణుని సొత్తు గనుక దానిని అతని సేవ యందే నియోగించవలెనను జ్ఞానముతో వర్తించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 201 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 10 🌴
10. brahmaṇy ādhāya karmāṇi
saṅgaṁ tyaktvā karoti yaḥ
lipyate na sa pāpena
padma-patram ivāmbhasā
🌷 Translation :
One who performs his duty without attachment, surrendering the results unto the Supreme Lord, is unaffected by sinful action, as the lotus leaf is untouched by water.
🌹 Purport :
Here brahmaṇi means in Kṛṣṇa consciousness. The material world is a sum total manifestation of the three modes of material nature, technically called the pradhāna. The Vedic hymns sarvaṁ hy etad brahma (Māṇḍūkya Upaniṣad 2), tasmād etad brahma nāma rūpam annaṁ ca jāyate (Muṇḍaka Upaniṣad 1.1.9), and, in the Bhagavad-gītā (14.3), mama yonir mahad brahma indicate that everything in the material world is a manifestation of Brahman; and although the effects are differently manifested, they are nondifferent from the cause. In the Īśopaniṣad it is said that everything is related to the Supreme Brahman, or Kṛṣṇa, and thus everything belongs to Him only. One who knows perfectly well that everything belongs to Kṛṣṇa, that He is the proprietor of everything and that, therefore, everything is engaged in the service of the Lord, naturally has nothing to do with the results of his activities, whether virtuous or sinful. Even one’s material body, being a gift of the Lord for carrying out a particular type of action, can be engaged in Kṛṣṇa consciousness. It is then beyond contamination by sinful reactions, exactly as the lotus leaf, though remaining in the water, is not wet. The Lord also says in the Gītā (3.30), mayi sarvāṇi karmāṇi sannyasya: “Resign all works unto Me [Kṛṣṇa].” The conclusion is that a person without Kṛṣṇa consciousness acts according to the concept of the material body and senses, but a person in Kṛṣṇa consciousness acts according to the knowledge that the body is the property of Kṛṣṇa and should therefore be engaged in the service of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 29/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 202: 05వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 202: Chap. 05, Ver. 11
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 202 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 11 🌴
11. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి |
యోగిన: కర్మ కుర్వన్తి సజ్ఞం త్యక్త్వాత్మశుద్ధయే ||
🌷. తాత్పర్యం :
యోగులైనవారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సుతోడను, బుద్ధితోడను మరియు ఇంద్రియముల తోడను కర్మ నొనరింతురు.
🌷. భాష్యము :
యోగులైనవారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియములతో చేయబడు ఏ కర్మయైనను భౌతికకల్మషము నుండి పవిత్రమగును. అనగా కృష్ణభక్తిపరాయణుడు ఒనరించు కర్మలు ఎటువంటి భౌతిక కర్మ ఫలమును కలుగజేయబోవు. కనుకనే సదాచారములని పిలువబడు పవిత్రకర్మలను కృష్ణభక్తిభావన యందు నిలిచి సులభముగా నిర్వహింపవచ్చును. భక్తిరసామృతసింధువు (1.2.187) నందు ఈ విషయమును రూపగోస్వామిని ఇట్లు వివరించియుండిరి.
ఈహా యస్య హరేర్దాస్యే కర్మణా మనసా గిరా |
నిఖిలాస్వపి అవస్థాసూ జీవన్ముక్త: స ఉచ్యతే ||
“దేహము, మనస్సు, బుద్ధి, వాక్కులచే కృష్ణభక్తిరసభావన యందు వర్తించెడివాడు(కృష్ణ సేవానురక్తుడు) పలు నామమాత్ర లౌకికకర్మల యందు నియుక్తుడైనప్పటికిని భౌతికజగమున ముక్తపురుషుడే యగును.” దేహాత్మభావనము లేనందున అతడు మిథ్యాహంకారము లేకుండును. తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనది కాదనియు అతడు సంపూర్ణముగా నెరుగును. తాను కృష్ణునికి చెందినవాడు కనుక తన దేహము సైతము కృష్ణునిదే యని అతడు భావించును. దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము మొదలగు సమస్తమును కృష్ణుని సేవ యందే వినియోగించుటచే అతడు శీఘ్రమే కృష్ణునితో సన్నిహితత్వమును పొందును. కృష్ణునితో అతడు ఏకత్వమును కలిగియుండి, దేహాత్మభావనము వంటివి కలిగించు మిథ్యాహంకారమునకు దూరుడై యుండును. ఇదియే కృష్ణభక్తిరసభావనమందలి పూర్ణత్వస్థితియై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 202 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 11 🌴
11. kāyena manasā buddhyā
kevalair indriyair api
yoginaḥ karma kurvanti
saṅgaṁ tyaktvātma-śuddhaye
🌷 Translation :
The yogīs, abandoning attachment, act with body, mind, intelligence and even with the senses, only for the purpose of purification.
🌹 Purport :
When one acts in Kṛṣṇa consciousness for the satisfaction of the senses of Kṛṣṇa, any action, whether of the body, mind, intelligence or even the senses, is purified of material contamination. There are no material reactions resulting from the activities of a Kṛṣṇa conscious person. Therefore purified activities, which are generally called sad-ācāra, can be easily performed by acting in Kṛṣṇa consciousness. Śrī Rūpa Gosvāmī in his Bhakti-rasāmṛta-sindhu (1.2.187) describes this as follows:
īhā yasya harer dāsye
karmaṇā manasā girā
nikhilāsv apy avasthāsu
jīvan-muktaḥ sa ucyate
“A person acting in Kṛṣṇa consciousness (or, in other words, in the service of Kṛṣṇa) with his body, mind, intelligence and words is a liberated person even within the material world, although he may be engaged in many so-called material activities.” He has no false ego, for he does not believe that he is this material body, or that he possesses the body. He knows that he is not this body and that this body does not belong to him. He himself belongs to Kṛṣṇa, and the body too belongs to Kṛṣṇa. When he applies everything produced of the body, mind, intelligence, words, life, wealth, etc. – whatever he may have within his possession – to Kṛṣṇa’s service, he is at once dovetailed with Kṛṣṇa. He is one with Kṛṣṇa and is devoid of the false ego that leads one to believe that he is the body, etc. This is the perfect stage of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 30/Nov/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 203: 05వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 203: Chap. 05, Ver. 12
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 203 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 12 🌴
12. యుక్త: కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్టికీమ్ |
అయుక్త: కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ||
🌷. తాత్పర్యం :
స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కాని భగవద్భావనము లేనివాడు మరియు తన కర్మఫలము యెడ ఆసక్తిని కలిగియున్నవాడును అగు మనుజుడు బద్ధుడగును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుడు మరియు దేహభావన యందున్నవాడు అనెడి ఇరువురి నడుమగల భేదమేమనగా మొదటివాడు కృష్ణునితో సదా కూడియుండగా, రెండవవాడు తన కర్మఫలము యెడ ఆసక్తుడై యుండును. కృష్ణుని యెడ ఆసక్తుడై యుండి కేవలము అతని కొరకే కర్మనొనరించువాడు నిక్కముగా ముక్తపురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల యెడ ఎటువంటి చింతను కలిగియుండడు. ద్వైతభావనలో అనగా పరతత్త్వము యొక్క జ్ఞానరాహిత్యముతో కర్మనొనరించుటయే కర్మఫలముల యెడ చింతకు కారణమని శ్రీమధ్భాగవతమునందు వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్త్వము. అట్టి శ్రీకృష్ణుని భక్తి యందు ద్వైతభావనము లేదు. సర్వము సర్వశుభకరుడైన శ్రీకృష్ణుని శక్తిఫలమే అయినందున కృష్ణపరకర్మలన్నియును ఆధ్యాత్మికతను సంతరించుకొని దివ్యములు మరియు భౌతికప్రభావరహితములును అయియున్నవి. కనుకనే కృష్ణభక్తిభావన యందు మనుజుడు పూర్ణశాంతితో నిండియుండును. కాని ఇంద్రియప్రీతి కొరకు లాభగణనలో మునిగినవాడు అట్టి శాంతిని పొందలేడు. అనగా కృష్ణునికి అన్యముగా వేరేదియును లేదనెడి అవగాహనయే శాంతికి మరియు అభయత్వమునకు ఆధారమై యున్నది. ఇదియే కృష్ణభక్తిరసభావన యందలి రహస్యము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 203 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 12 🌴
12. yuktaḥ karma-phalaṁ tyaktvā
śāntim āpnoti naiṣṭhikīm
ayuktaḥ kāma-kāreṇa
phale sakto nibadhyate
🌷 Translation :
The steadily devoted soul attains unadulterated peace because he offers the result of all activities to Me; whereas a person who is not in union with the Divine, who is greedy for the fruits of his labor, becomes entangled.
🌹 Purport :
The difference between a person in Kṛṣṇa consciousness and a person in bodily consciousness is that the former is attached to Kṛṣṇa whereas the latter is attached to the results of his activities. The person who is attached to Kṛṣṇa and works for Him only is certainly a liberated person, and he has no anxiety over the results of his work. In the Bhāgavatam, the cause of anxiety over the result of an activity is explained as being one’s functioning in the conception of duality, that is, without knowledge of the Absolute Truth. Kṛṣṇa is the Supreme Absolute Truth, the Personality of Godhead. In Kṛṣṇa consciousness, there is no duality. All that exists is a product of Kṛṣṇa’s energy, and Kṛṣṇa is all good. Therefore, activities in Kṛṣṇa consciousness are on the absolute plane; they are transcendental and have no material effect. One is therefore filled with peace in Kṛṣṇa consciousness. But one who is entangled in profit calculation for sense gratification cannot have that peace. This is the secret of Kṛṣṇa consciousness – realization that there is no existence besides Kṛṣṇa is the platform of peace and fearlessness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 01/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 204: 05వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 204: Chap. 05, Ver. 13
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 204 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 13 🌴
13. సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ||
🌷. తాత్పర్యం :
దేహమునందున్న జీవుడు తన స్వభావమును నియమించి మానసికముగా కర్మలన్నింటిని త్యజించినపుడు, కర్మను చేయక మరియు కర్మకు కారణము కాక నవద్వారపురము నందు(దేహములో) సుఖముగా వసించును.
🌷. భాష్యము :
బద్ధజీవుడు నవద్వారములు గల పురమునందు నివసించును. దేహకర్మలు (దేహమనెడి పురము యొక్క కర్మలు) స్వాభావిక గుణము ననుసరించి వాటంతట అవే అప్రయత్నముగా నిర్వహింపబడును. దేహపరిస్థితుల ప్రభావమునకు లోనైయుండెడి జీవుడు ఒకవేళ తలచినచో వాటికి అతీతుడుగును కావచ్చును. జీవుడు తన ఉన్నతస్వభావమును మరచి దేహాత్మభావనను పొందుట వలననే దుఃఖము నొందుచున్నాడు. కృష్ణభక్తిభావనలో అతడు తన సహజస్థితిని పునరిద్ధరించుకొని బంధము నుండి ముక్తుడు కాగలడు. కనుకనే కృష్ణభక్తిపరాయణుడైనంతనే మనుజుడు శీఘ్రముగా దేహపరకర్మల నుండి దూరుడగును. అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమితజీవితము నందు అతడు నవద్వారపురములో సుఖుముగా జీవించును. నవద్వారములు ఈ క్రింది విధముగా తెలుపబడినవి.
నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి: |
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ ||
“జీవుని దేహమునందు నిలిచియుండెడి భగవానుడు విశ్వమునందలి సమస్తజీవులను నియమించువాడు. దేహము నవద్వారములను కలిగియుండును (రెండు కళ్ళు, రెండు నాసికారంధ్రములు, రెండు చెవులు, ఒకనోరు,మర్మావయము, గుదస్థానము). బద్ధస్థితిలో జీవుడు అట్టి దేహముతో తనను గుర్తించును. కాని హృదయస్థ పరమాత్మతో తనను అతడు గుర్తించినపుడు దేహమునందున్నపుడు భగవానుని వలె స్వతంత్రుడు కాగలదు (శ్వేతాశ్వతరోపనిషత్తు 3.18)”.
కనుకనే కృష్ణభక్తిరసభావనము నందున్నవాడు దేహము యొక్క అంతర్బాహ్య కర్మలన్నింటి నుండి స్వతంత్రుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 204 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 13 🌴
13. sarva-karmāṇi manasā
sannyasyāste sukhaṁ vaśī
nava-dvāre pure dehī
naiva kurvan na kārayan
🌷 Translation :
When the embodied living being controls his nature and mentally renounces all actions, he resides happily in the city of nine gates [the material body], neither working nor causing work to be done.
🌹 Purport :
The embodied soul lives in the city of nine gates. The activities of the body, or the figurative city of body, are conducted automatically by its particular modes of nature. The soul, although subjecting himself to the conditions of the body, can be beyond those conditions, if he so desires. Owing only to forgetfulness of his superior nature, he identifies with the material body, and therefore suffers. By Kṛṣṇa consciousness, he can revive his real position and thus come out of his embodiment. Therefore, when one takes to Kṛṣṇa consciousness, one at once becomes completely aloof from bodily activities. In such a controlled life, in which his deliberations are changed, he lives happily within the city of nine gates. The nine gates are mentioned as follows:
nava-dvāre pure dehī
haṁso lelāyate bahiḥ
vaśī sarvasya lokasya
sthāvarasya carasya ca
“The Supreme Personality of Godhead, who is living within the body of a living entity, is the controller of all living entities all over the universe. The body consists of nine gates [two eyes, two nostrils, two ears, one mouth, the anus and the genitals]. The living entity in his conditioned stage identifies himself with the body, but when he identifies himself with the Lord within himself, he becomes just as free as the Lord, even while in the body.” (Śvetāśvatara Upaniṣad 3.18)
Therefore, a Kṛṣṇa conscious person is free from both the outer and inner activities of the material body.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 02/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 205: 05వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 205: Chap. 05, Ver. 14
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 205 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 14 🌴
14. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు: |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||
🌷. తాత్పర్యం :
తన దేహమనెడి పురము యొక్క అధిపతియైన దేహి కర్మలను సృష్టించుటగాని, కర్మల యందు జనులను ప్రేరేపించుటగాని, కర్మఫలములను సృష్టించుటగాని చేయడు. ఇదియంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది.
🌷. భాష్యము :
సప్తమాధ్యాయమున తెలుపబడనున్నట్లు జీవుడు శ్రీకృష్ణభగవానుని శక్తులలో(ప్రకృతులలో) ఒకడై యున్నాడు. కాని భగవానుని వేరొక శక్తియైన(న్యునమైనట్టిది) భౌతికప్రకృతికి అతడు భిన్నుడైనవాడు. అట్టి ఉన్నతప్రకృతికి చెందిన జీవుడు అనంతకాలముగా ఏదియో ఒక కారణముచే నిమ్నమైన భౌతికప్రకృతి యొక్క సంబంధమును కలిగియున్నాడు. అతడు పొందునటువంటి తాత్కాలిక దేహము(చరించుస్థలము) వివిధములైన కర్మలకు మరియు ఫలములకు కారణమై యున్నది. అటువంటి బద్ధవాతావరణములో జీవుంచుచు అజ్ఞానవశమున దేహాత్మభావనచే జీవుడు దేహకర్మఫలములచే పీడితుడగును. అనంతకాలము నుండి పొందిన అట్టి అజ్ఞానమే దేహపరమగు దుఃఖమునకు, చింతకు కారణమై యున్నది. జీవుడు దేహపరకార్యముల నుండి దూరుడైనంతనే వాటి ఫలముల నుండియు దూరుడు కాగలడు. దేహమును పురమున నిలిచినంతకాలము జీవుడు దానికి అధిపతిగా కనిపించినను వాస్తవమునాకు అతడు దేహమునకు అధిపతి కాని, దాని కర్మలను మరియు ఫలములను నియమించువాడు కాని కాడు. అతడు కేవలము భవసాగరమున జీవనపోరాటము సల్పునట్టివాడే. తనను తల్లక్రిందులు చేయు ఆ సముద్రపుటలలపై అతడు ఎట్టి నియంత్రణను కలిగియుండడు. కనుక దివ్యమైన కృష్ణభక్త్తిభావన ద్వారా ఆ భవజలముల నుండి బయటపడుటయే దానికి ఉత్తమ పరిష్కారము. అది ఒక్కటే అతనిని సర్వక్లేశముల నుండి రక్షించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 205 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 14 🌴
14. na kartṛtvaṁ na karmāṇi
lokasya sṛjati prabhuḥ
na karma-phala-saṁyogaṁ
svabhāvas tu pravartate
🌷 Translation :
The embodied spirit, master of the city of his body, does not create activities, nor does he induce people to act, nor does he create the fruits of action. All this is enacted by the modes of material nature.
🌹 Purport :
The living entity, as will be explained in the Seventh Chapter, is one of the energies or natures of the Supreme Lord but is distinct from matter, which is another nature – called inferior – of the Lord. Somehow the superior nature, the living entity, has been in contact with material nature since time immemorial. The temporary body or material dwelling place which he obtains is the cause of varieties of activities and their resultant reactions. Living in such a conditional atmosphere, one suffers the results of the activities of the body by identifying himself (in ignorance) with the body. It is ignorance acquired from time immemorial that is the cause of bodily suffering and distress. As soon as the living entity becomes aloof from the activities of the body, he becomes free from the reactions as well. As long as he is in the city of the body, he appears to be the master of it, but actually he is neither its proprietor nor controller of its actions and reactions. He is simply in the midst of the material ocean, struggling for existence. The waves of the ocean are tossing him, and he has no control over them. His best solution is to get out of the water by transcendental Kṛṣṇa consciousness. That alone will save him from all turmoil.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 03/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 206: 05వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 206: Chap. 05, Ver. 15
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 206 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 15 🌴
15. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభు: |
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవ: ||
🌷. తాత్పర్యం :
భగవానుడు ఎవరి పాపమును గాని, పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారు నిజజ్ఞానమును ఆవరించెడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు.
🌷. భాష్యము :
“విభు:” అనెడి సంస్కృతపదమునకు అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము అనెడి షడ్గుణములు సమగ్రముగా కలిగియున్న భగవానుడని అర్థము. పాపపుణ్యకార్యములచే కలతనొందక అతడెల్లప్పుడును తన యందే తృప్తుడై యుండును. జీవుని స్థితికి అతడెన్నడును కారణము కాడు. జీవుడే అజ్ఞానముచే మోహమునొంది కొన్నిరకములైన స్థితుల యందు నిలువగోరి, తన కర్మఫల శృంఖలమును తయారుచేసికొనును. వాస్తవమునాకు ఉన్నతప్రకృతికి చెందిన జీవుడు పూర్ణజ్ఞానవంతుడు. అయినను తన పరిమితశక్తి కారణముగా అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తిసమన్వితుడు. కాని జీవుడు అట్టివాడు కాదు. భగవానుడు “విభు:” (సర్వజ్ఞుడు) కాగా జీవుడు “అణుమాత్రుడు” అయియున్నాడు. కాని జీవుడు ఆత్మయై యున్నందున తన ఇచ్చానుసారముగా దేనినైనను కోరు శక్తిని కలిగియుండును. అతని అట్టి కోరిక సర్వశక్తిసమన్వితుడైన భగవానుని చేతనే పూర్ణము చేయబడుచుండును. కనుక జీవుడు తన కోరికల విషయమున మోహము నొందినప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చుకొను అవకాశము నోసగునే గాని, జీవుని యొక్క వాంఛనీయ పరిస్థితి యందలి కర్మలకు మరియు ఫలములకు బాధ్యతను వహింపడు. కనుకనే మోహపరిస్థితులలో నుండుటచే జీవుడు తనను దేహముగా భావించి తాత్కాలికములైన సుఖము మరియు దుఃఖములచే ప్రభావితుడగును. భగవానుడు పరమాత్మరూపున సదా జీవుని సాహచార్యమున ఉండి, పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు వ్యక్తి దాని సుగంధమును ఆఘ్రాణించ గలిగిన రీతి జీవుని కోరికల నన్నింటిని అవగాహన చేసికొనును. వాస్తవమునకు కోరిక యనునది జీవునకు సూక్ష్మరూపబంధమైనను భగవానుడు జీవులకు వారి అర్హతను బట్టి కోరికలను పూర్ణము కావించుచుండును. ఈ విధముగా మనుజుడు తన కోరికలను పూర్ణము కావించుకొనుటలో సర్వశక్తిమంతుడు కాడు. కాని భగవానుడు మాత్రము తన కోరికలను పూర్ణము కావించుకొనగలడు. అతడు సర్వుల యెడ తటస్థుడై యుండును కనుకనే కొద్దిపాటి స్వాతంత్ర్యము కలిగినటువంటి జీవుల కోరికలతో అతడు జోక్యమును కలిగించుకొనడు. అయినను తనను పొందవలెనను ఇచ్చను ఎవరేని ప్రకటించినచో వారి యెడ ప్రత్యేక శ్రద్ధను తీసుకొని వారు తనను పొంది నిత్యానందము ననుభవించు రీతిగా వారి కోరికను వృద్ధి చేయును. కనుకనే “ఏష ఏ హ్యేవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే ఏష ఉ ఏవాసాధు కర్మ కారయతి యమధో నినీషతే – జీవుడు ఉద్దరింపబడు రీతిగా భగవానుడు వానిని పుణ్యకార్యములలో నియుక్తుని చేయును. అట్లే నరకమునకు పోవు రీతిగా పాపకార్యములందును నియుక్తుని చేయును” అని వేదమంత్రము తెలుపుచున్నది (కౌశీతకీ ఉపనిషత్తు 3.8).
అజ్ఞో జంతురనీశో(యమాత్మన: సుఖదుఃఖయో: |
ఈశ్వరప్రేరితో గచ్చేత్ స్వర్గం వా శ్వభ్రమేవ చ ||
“జీవుడు తన సుఖదుఃఖములందు సంపూర్ణముగా పరతంత్రుడై యుండును. గాలిచే మేఘము కదలినట్లు, అతడు భగవానుని సంకల్పముచే స్వర్గమునకు గాని, నరకమునకు గాని ప్రయాణించును.”
అనగా కృష్ణభక్తిరసభావనను త్యజించుచున్నందునే జీవుడు మోహమునకు గురియగుచున్నాడు. తత్కారణముగా జీవుడు సహజస్థితి రీత్యా నిత్యుడును, ఆనందస్వరూపుడును, జ్ఞానపూర్ణుడును అయినప్పటికిని తన అణుమాత్ర స్థితి వలన శ్రీకృష్ణభగవానుని సేవ గూర్చవలసిన నిజస్థితిని మరచి అజ్ఞానముచే బద్దుడగుచున్నాడు. అట్టి అజ్ఞానవశమున అతడు తన బద్ధస్థితికి భగవానుడే కారణమనియు పలుకుచుండును. “వైషమ్యనైర్ఘ్రుణ్యే న సాపేక్ష్యత్వాత్ తథా హి దర్శయతి – భగవానుడు బాహ్యముగా ద్వేషించుచున్నట్లు లేదా ప్రేమించుచున్నట్లు కానపించినను వాస్తమునకు అతడు ఎవ్వరినీ ద్వేషించుట గాని, ప్రేమించుట గాని చేయడు” అని వేదాంతసూత్రము (2.1.34) ఈ విషయమునే నిర్ధారించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 206 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 15 🌴
15. nādatte kasyacit pāpaṁ
na caiva sukṛtaṁ vibhuḥ
ajñānenāvṛtaṁ jñānaṁ
tena muhyanti jantavaḥ
🌷 Translation :
Nor does the Supreme Lord assume anyone’s sinful or pious activities. Embodied beings, however, are bewildered because of the ignorance which covers their real knowledge.
🌹 Purport :
The Sanskrit word vibhu means the Supreme Lord who is full of unlimited knowledge, riches, strength, fame, beauty and renunciation. He is always satisfied in Himself, undisturbed by sinful or pious activities.
He does not create a particular situation for any living entity, but the living entity, bewildered by ignorance, desires to be put into certain conditions of life, and thereby his chain of action and reaction begins. A living entity is, by superior nature, full of knowledge. Nevertheless, he is prone to be influenced by ignorance due to his limited power. The Lord is omnipotent, but the living entity is not. The Lord is vibhu, or omniscient, but the living entity is aṇu, or atomic. Because he is a living soul, he has the capacity to desire by his free will. Such desire is fulfilled only by the omnipotent Lord. And so, when the living entity is bewildered in his desires, the Lord allows him to fulfill those desires, but the Lord is never responsible for the actions and reactions of the particular situation which may be desired. Being in a bewildered condition, therefore, the embodied soul identifies himself with the circumstantial material body and becomes subjected to the temporary misery and happiness of life. The Lord is the constant companion of the living entity as Paramātmā, or the Supersoul, and therefore He can understand the desires of the individual soul, as one can smell the flavor of a flower by being near it. Desire is a subtle form of conditioning for the living entity. The Lord fulfills his desire as he deserves: Man proposes and God disposes. The individual is not, therefore, omnipotent in fulfilling his desires. The Lord, however, can fulfill all desires, and the Lord, being neutral to everyone, does not interfere with the desires of the minute independent living entities. However, when one desires Kṛṣṇa, the Lord takes special care and encourages one to desire in such a way that one can attain to Him and be eternally happy. The Vedic hymns therefore declare, eṣa u hy eva sādhu karma kārayati taṁ yam ebhyo lokebhya unninīṣate. eṣa u evāsādhu karma kārayati yam adho ninīṣate: “The Lord engages the living entity in pious activities so that he may be elevated. The Lord engages him in impious activities so that he may go to hell.” (Kauṣītakī Upaniṣad 3.8)
ajño jantur anīśo ’yam
ātmanaḥ sukha-duḥkhayoḥ
īśvara-prerito gacchet
svargaṁ vāśv abhram eva ca
“The living entity is completely dependent in his distress and happiness. By the will of the Supreme he can go to heaven or hell, as a cloud is driven by the air.”
Therefore the embodied soul, by his immemorial desire to avoid Kṛṣṇa consciousness, causes his own bewilderment. Consequently, although he is constitutionally eternal, blissful and cognizant, due to the littleness of his existence he forgets his constitutional position of service to the Lord and is thus entrapped by nescience. And, under the spell of ignorance, the living entity claims that the Lord is responsible for his conditional existence. The Vedānta-sūtras (2.1.34) also confirm this. Vaiṣamya-nairghṛṇye na sāpekṣatvāt tathā hi darśayati: “The Lord neither hates nor likes anyone, though He appears to.”
🌹 🌹 🌹 🌹 🌹
Date: 04/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 207: 05వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 207: Chap. 05, Ver. 16
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 207 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 16 🌴
16. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మాన: |
తేషామాదిత్యవద్జ్ఞానం ప్రకాశయతి తత్ పరమ్ ||
🌷. తాత్పర్యం :
అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు, పగటిసమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు, అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుని మరచినవారు నిశ్చయముగా మొహపరవశులగుదురు. కాని కృష్ణభక్తిభావన యందున్నవారు ఎన్నడును మోహమునాకు గురికారు. “సర్వం జ్ఞానప్లవేవైన, జ్ఞానాగ్ని: సర్వకర్మాణి, న హి జ్ఞానేన సదృశమ్” అనుచు జ్ఞానము సర్వదా భగవధ్గీత యందు గొప్ప గౌరవమొసగబడినది. ఇక ఆ జ్ఞానమెట్టిది: సంపూర్ణజ్ఞానము శ్రీకృష్ణునికి శరణుపొందుట ద్వారానే లభించునని భగవద్గీత సప్తమాధ్యాయపు పంతొమ్మిదవ శ్లోకము (7.19) తెలుపుచున్నది (బహూనాం జన్మనా మన్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే). అనేకానేక జన్మలు గడచిన పిమ్మట జ్ఞానవంతుడైనవాడు శ్రీకృష్ణుని శరణుపొందినపుడు (కృష్ణభక్తిరసభావితుడైనపుడు) పగటిసమయమున సూర్యుని వలన సర్వము గోచరమైనట్లు అతనికి సర్వము వెల్లడి చేయబడును. నిజమునకు జీవులు పలువిధములుగా మొహమునకు గురియగుచుందురు. ఉదాహరణకు అతడు తనను తానూ భగవానునిగా భావించుచు అజ్ఞానవాగురమున పడిపోవును. జీవుడు భగవానుడేయైనచో అజ్ఞానముచే ఎట్లు మొహితుడగును? భగవానుడు అజ్ఞానముచే మొహితుడగునా? ఒకవేళ అదే నిజమైనచో అజ్ఞానము భగవానుని కన్నను గొప్పదే కాగలదు. నిజమైన జ్ఞానము కృష్ణభక్తిపరాయణుడైన వాని నుండే లభించును కనుక ప్రతియొక్కరు అట్టి ప్రామాణిక గురువును ఆశ్రయించి, ఆయన శరణమున కృష్ణభక్తిరసభావనము సమస్త అజ్ఞానమును నిక్కముగా పారద్రోలగలదు. తాను దేహమును గాక దేహమునకు పరమైనవాడిననెడి పూర్ణజ్ఞానము మనుజునకున్నను, ఆత్మ మరియు పరమాత్ముని నడుమగల భేదమును అతడు గాంచలేకపోవచ్చును. కాని కృష్ణభక్తిపరాయణుడైన గురువు యొక్క శరణమును పొందినచో అతనికి సర్వము విదితము కాగలదు. శ్రీకృష్ణభగవానుని గూర్చియు మరియు దేవదేవునితో తనకు గల సంబంధమును గూర్చియు మనుజుడు అతని ప్రతినిధి నాశ్రయించినప్పుడే నిజముగా తెలిసికొనగలడు. కృష్ణసంబంధ విజ్ఞానము సంపూర్ణముగా కలిగియున్నందున కృష్ణునితో సమానముగా భక్తిగౌరవములు లభించినను కృష్ణుని ప్రతినిధియైనవాడు తానెడెన్నడును భగవానుడనని పలుకడు. భగవానుడు మరియు జీవుల నడుమ గల వ్యత్యాసమును సర్వులు ఎరుగవలెను. కనకనే శ్రీకృష్ణభగవానుడు ద్వితీయాధ్యాయమున (2.12) ప్రతిజీవియు వ్యక్తిత్వమును కలిగియుందురు. ముక్తి పిదపయు వారు ఆ స్వభావమును కలిగియుందురు. రాత్రి యందు చీకటిలో సర్వము ఒకటిగానే గోచరించినను సూర్యోదయమైనంతనే ప్రతిదియు వాటి యథార్థరూపములో గోచరించును. ఆధ్యాత్మిక జీవితమునందలి వ్యక్తిత్వముతో కూడిన గుర్తింపే యథార్థజ్ఞానమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 207 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 16 🌴
16. jñānena tu tad ajñānaṁ
yeṣāṁ nāśitam ātmanaḥ
teṣām āditya-vaj jñānaṁ
prakāśayati tat param
🌷 Translation :
When, however, one is enlightened with the knowledge by which nescience is destroyed, then his knowledge reveals everything, as the sun lights up everything in the daytime.
🌹 Purport :
Those who have forgotten Kṛṣṇa must certainly be bewildered, but those who are in Kṛṣṇa consciousness are not bewildered at all. It is stated in the Bhagavad-gītā, sarvaṁ jñāna-plavena, jñānāgniḥ sarva-karmāṇi and na hi jñānena sadṛśam. Knowledge is always highly esteemed. And what is that knowledge? Perfect knowledge is achieved when one surrenders unto Kṛṣṇa, as is said in the Seventh Chapter, nineteenth verse: bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate. After passing through many, many births, when one perfect in knowledge surrenders unto Kṛṣṇa, or when one attains Kṛṣṇa consciousness, then everything is revealed to him, as everything is revealed by the sun in the daytime. The living entity is bewildered in so many ways. For instance, when he unceremoniously thinks himself God, he actually falls into the last snare of nescience. If a living entity is God, then how can he become bewildered by nescience? Does God become bewildered by nescience? If so, then nescience, or Satan, is greater than God. Real knowledge can be obtained from a person who is in perfect Kṛṣṇa consciousness.
Therefore, one has to seek out such a bona fide spiritual master and, under him, learn what Kṛṣṇa consciousness is, for Kṛṣṇa consciousness will certainly drive away all nescience, as the sun drives away darkness. Even though a person may be in full knowledge that he is not this body but is transcendental to the body, he still may not be able to discriminate between the soul and the Supersoul. However, he can know everything well if he cares to take shelter of the perfect, bona fide Kṛṣṇa conscious spiritual master. One can know God and one’s relationship with God only when one actually meets a representative of God. A representative of God never claims that he is God, although he is paid all the respect ordinarily paid to God because he has knowledge of God. One has to learn the distinction between God and the living entity. Lord Śrī Kṛṣṇa therefore stated in the Second Chapter (2.12) that every living being is individual and that the Lord also is individual. They were all individuals in the past, they are individuals at present, and they will continue to be individuals in the future, even after liberation. At night we see everything as one in the darkness, but in day, when the sun is up, we see everything in its real identity. Identity with individuality in spiritual life is real knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 05/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 208: 05వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 208: Chap. 05, Ver. 17
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 208 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 17 🌴
17. తద్బుద్ధయస్తదాత్మా నస్తన్నిష్టా స్తత్పరాయణా: |
గచ్ఛన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషా: ||
🌷. తాత్పర్యం :
బుద్ధి, మనస్సు, నిష్ఠ, ఆశ్రయములన్నియును భగవానుని యందే లగ్నమైనపుడు మనుజుడు సంపూర్ణజ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తిమార్గమున ప్రయాణించును.
🌷. భాష్యము :
దివ్యమగు పరమసత్యమే శ్రీకృష్ణభగవానుడు. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు భగవానుని ప్రకటించుటయందే గీతాజ్ఞానమంతయు కేంద్రీకృతమైనది. వేదవాజ్మయమంతయు ఈ విషయమునే తెలుపుచున్నది. పరతత్త్వమనగా పరమసత్యత్వమని భావము. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనెడి తత్త్వములుగా పరతత్త్వము నెరిగినవారే దానిని అవగాహన చేసికొనగలరు. ఆ పరతత్త్వము యొక్క చరమానుభవమే శ్రీకృష్ణభగవానుడు. అతనికి మించి వేరొక్కటి లేదు. కనుకనే ఆ భగవానుడు “మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ” అని భోధించెను. నిరాకారబ్రహ్మము సైతము శ్రీకృష్ణుని పైననే ఆధారపడియున్నదని తెలుపబడినది (బ్రాహ్మణోహి ప్రతిష్టాహమ్). కనుకనే అన్నివిధముల శ్రీకృష్ణుడే పరమసత్యమై యున్నాడు. తత్కారణముగా శ్రీకృష్ణుని యందే మనస్సు, బుద్ధి, నిష్ఠ, ఆశ్రయములను సదా కలిగి యున్నారు (కృష్ణభక్తిరసభావితులు) నిస్సందేహముగా కల్మషరహితులును మరియు పరతత్త్వ విషయమున సంపూర్ణజ్ఞానమును కలిగినవారు అగుదురు. కృష్ణభక్తిరసభావితుడు శ్రీకృష్ణుని యందు ద్వైతము కలదని (ఏకకాలమున ఏకత్వము మరియు వ్యక్తిత్వము) సంపూర్ణముగ అవగతము చేసికొనగలుగును. అట్టి జ్ఞానమును కలిగిన మనుజుడు ముక్తిమార్గమున పురోభివృద్ధిని పొందును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 208 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 17 🌴
17. tad-buddhayas tad-ātmānas
tan-niṣṭhās tat-parāyaṇāḥ
gacchanty apunar-āvṛttiṁ
jñāna-nirdhūta-kalmaṣāḥ
🌷 Translation :
When one’s intelligence, mind, faith and refuge are all fixed in the Supreme, then one becomes fully cleansed of misgivings through complete knowledge and thus proceeds straight on the path of liberation.
🌹 Purport :
The Supreme Transcendental Truth is Lord Kṛṣṇa. The whole Bhagavad-gītā centers around the declaration that Kṛṣṇa is the Supreme Personality of Godhead. That is the version of all Vedic literature. Para-tattva means the Supreme Reality, who is understood by the knowers of the Supreme as Brahman, Paramātmā and Bhagavān. Bhagavān, or the Supreme Personality of Godhead, is the last word in the Absolute. There is nothing more than that. The Lord says, mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañ-jaya. Impersonal Brahman is also supported by Kṛṣṇa: brahmaṇo hi pratiṣṭhāham. Therefore in all ways Kṛṣṇa is the Supreme Reality. One whose mind, intelligence, faith and refuge are always in Kṛṣṇa, or, in other words, one who is fully in Kṛṣṇa consciousness, is undoubtedly washed clean of all misgivings and is in perfect knowledge in everything concerning transcendence. A Kṛṣṇa conscious person can thoroughly understand that there is duality (simultaneous identity and individuality) in Kṛṣṇa, and, equipped with such transcendental knowledge, one can make steady progress on the path of liberation.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 06/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 209: 05వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 209: Chap. 05, Ver. 18
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 209 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 18 🌴
18. విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పణ్డితా: సమదర్శిన: ||
🌷. తాత్పర్యం :
వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగినవారగుటచే విద్యావినయసంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును, శునకమాంసము తినువానిని(చండాలుని) సమదృష్టితో వీక్షింతురు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందున్నవాడు జాతి, కుల విచక్షణను చూపడు. సంఘదృష్టిలో బ్రహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును. ఆలాగుననే కుక్క, గోవు, ఏనుగు మొదలుగునవి జాతిదృష్టిలో వేరుకావచ్చును. కాని ఈ విధమైన దేహపరభేదములు జ్ఞానవంతుడైన యోగి దృష్టిలో అర్థరహితములు. పరమాత్మ రూపున శ్రీకృష్ణభగవానుడు వాటన్నింటి యందును నిలిచి వాటితో సంబంధమును కలిగియుండుటే అందులకు కారణము. భగవానుని గూర్చిన అట్టి అవగాహనయే నిజమైన జ్ఞానమై యున్నది. భగవానుడు ప్రతిజీవిని కూడా మిత్రునిగా భావించు కారణమున దేహములు వివిధవర్ణములు లేదా జాతులు యందున్నను అతడు మాత్రము సమభావము కలిగియుండును. జీవుల స్థితులతో నిమిత్తములేక అతడు సర్వుల యందును పరమాత్మరూపున వసించియుండును. బ్రహ్మణుడు మరియు చండాలుని దేహములు సమానములు కాకున్నను పరమాత్మ రూపున భగవానుడు ఆ రెండింటి యందును నిలిచియుండును. దేహములనునవి ప్రక్రుతిజన్యత్రిగుణముల ద్వారా రూపొందినవైనను, దేహము నందుండెడి ఆత్మా, పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మికతను కలిగియున్నట్టివి. సమాన ఆధ్యాత్మికతను కలిగియున్నప్పటికిని ఆత్మ, పరమాత్మ పరిమాణరీతిని ఎన్నడును సమానములు కావు. ఏలయన జీవాత్మ తాను నిలిచియున్న దేహమునకే పరిమితము చెందియుండగా, పరమాత్మ ప్రతిజీవి దేహమునందు నిలిచియుండును. కృష్ణభక్తిరసభావితుడు ఈ జ్ఞానమును సంపూర్ణముగా కలిగియుండుటచే నిక్కముగా జ్ఞానవంతుడును మరియు సమదృష్టి కలవాడును అయియుండును. చైతన్యము, సనాతనత్వము, ఆనందమయత్వము అనునవి ఆత్మ, పరమాత్మల ఒకేరీతి లక్షణములు. కాని వాటి నడుమ గల బేధమేమనగా ఆత్మ తాను నిలిచి యున్న దేహపరిధిలో చేతనము కలిగియుండగా, పరమాత్మ సర్వదేహములు జ్ఞానమును కలిగియుండును. అట్టి పరమాత్మ సర్వదేహములందు ఎట్టి విచక్షణలేక నిలిచియుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 209 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 18 🌴
18. vidyā-vinaya-sampanne
brāhmaṇe gavi hastini
śuni caiva śva-pāke ca
paṇḍitāḥ sama-darśinaḥ
🌷 Translation :
The humble sages, by virtue of true knowledge, see with equal vision a learned and gentle brāhmaṇa, a cow, an elephant, a dog and a dog-eater [outcaste].
🌹 Purport :
A Kṛṣṇa conscious person does not make any distinction between species or castes. The brāhmaṇa and the outcaste may be different from the social point of view, or a dog, a cow and an elephant may be different from the point of view of species, but these differences of body are meaningless from the viewpoint of a learned transcendentalist. This is due to their relationship to the Supreme, for the Supreme Lord, by His plenary portion as Paramātmā, is present in everyone’s heart. Such an understanding of the Supreme is real knowledge. As far as the bodies are concerned in different castes or different species of life, the Lord is equally kind to everyone because He treats every living being as a friend yet maintains Himself as Paramātmā regardless of the circumstances of the living entities. The Lord as Paramātmā is present both in the outcaste and in the brāhmaṇa, although the body of a brāhmaṇa and that of an outcaste are not the same. The bodies are material productions of different modes of material nature, but the soul and the Supersoul within the body are of the same spiritual quality. The similarity in the quality of the soul and the Supersoul, however, does not make them equal in quantity, for the individual soul is present only in that particular body whereas the Paramātmā is present in each and every body. A Kṛṣṇa conscious person has full knowledge of this, and therefore he is truly learned and has equal vision. The similar characteristics of the soul and Supersoul are that they are both conscious, eternal and blissful. But the difference is that the individual soul is conscious within the limited jurisdiction of the body whereas the Supersoul is conscious of all bodies. The Supersoul is present in all bodies without distinction.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 07/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 210: 05వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 210: Chap. 05, Ver. 19
🌹. శ్రీమద్భగవద్గీత - 210 / Bhagavad-Gita - 210 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 19 🌴
19. ఇహైవ తైర్జిత: సర్గో యేషాం సామ్యే స్థితం మన: |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రాహ్మణి తే స్థితా: ||
🌷. తాత్పర్యం :
సమానత్వము మరియు ఏకత్వములందు మనస్సు నెలకొనినట్టివారు జననమరణస్థితిని జయించినట్టివారే. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగినట్టివారే యగుదురు.
🌷. భాష్యము :
పైన తెలిపిన విధముగా మనస్సు నందలి సమానత్వము ఆత్మానుభవపు చిహ్నమై యున్నది. అట్టి స్థితిని పొందినవారిని జన్మమృత్యువుల వంటి భౌతికస్థితులను జయించినవారుగా భావింపవలెను. దేహముగా ఆత్మగా భావించు దేహాత్మభావనము కలిగియున్నంతవరకు మనుజుడు బద్ధునిగా భావింపబడినను, ఆత్మజ్ఞానము ద్వారా సమత్వస్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధజీవితము నుండి ముక్తిని పొందినవాడగును. అనగా మరణానంతరము అతడు తిరిగి ఈ భౌతికజగమున జన్మను పొందక ఆధ్యాత్మికజగమున ప్రవేశించును. రాగద్వేషములు లేనందున భగవానుడు దోషరహితుడైనట్లే, జీవుడును రాగద్వేషముల నుండి విడివడినప్పుడు దోషరహితుడై ఆధ్యాత్మికజగమున ప్రవేశించుటకు అర్హతను పొందును. అట్టివానిని ముక్తపురుషునిగానే భావింపవలెను. అతని లక్షణములు తరువాతి శ్లోకములో వర్ణింపబడినవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 210 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 19 🌴
19. ihaiva tair jitaḥ sargo
yeṣāṁ sāmye sthitaṁ manaḥ
nirdoṣaṁ hi samaṁ brahma
tasmād brahmaṇi te sthitāḥ
🌷 Translation :
Those whose minds are established in sameness and equanimity have already conquered the conditions of birth and death. They are flawless like Brahman, and thus they are already situated in Brahman.
🌹 Purport :
Equanimity of mind, as mentioned above, is the sign of self-realization. Those who have actually attained to such a stage should be considered to have conquered material conditions, specifically birth and death. As long as one identifies with this body, he is considered a conditioned soul, but as soon as he is elevated to the stage of equanimity through realization of self, he is liberated from conditional life. In other words, he is no longer subject to take birth in the material world but can enter into the spiritual sky after his death. The Lord is flawless because He is without attraction or hatred. Similarly, when a living entity is without attraction or hatred, he also becomes flawless and eligible to enter into the spiritual sky. Such persons are to be considered already liberated, and their symptoms are described below.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 08/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 211: 05వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 211: Chap. 05, Ver. 20
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 211 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 20 🌴
20. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసమ్మూడో బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థిత: ||
🌷. తాత్పర్యం :
ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందనివాడును, స్థిరబుద్ధిని కలిగనవాడును, మోహపరవశుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్ణముగా నెరిగినవాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగియున్నట్టివాడే యగును.
🌷. భాష్యము :
ఆత్మానుభవమును పొందిన మహాత్ముని లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి. మిథ్యాతాదాత్మ్యముచే దేహమునే ఆత్మగా భావించెడి మోహగ్రస్థుడు కాకపోవుట అతని ప్రథమలక్షణము. దేహాత్మభావనను కలిగియుండక తానూ శ్రీకృష్ణభగవానుని అంశనని అతడు సంపూర్ణముగా ఎరిగియుండును. కనుకనే దేహమును సంబంధించినదేదైనను లభించినప్పుడు పొంగుట గాని, నష్టపోయినప్పుడు చింతించుట గాని అతడు చేయడు. మనస్సు యొక్క ఈ స్థిరత్వమే “స్థిరబుద్ధి” అనబడును. కనుక అతడు దేహమును ఆత్మగా భ్రమించుట గాని, దేహమును శాశ్వతమని తలచి ఆత్మను తృణికరించుట గాని చేయడు. ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనెడి పరతత్త్వజ్ఞానమును అవగాహన చేసికొనగలిగెడి స్థితికి చేర్చగలడు. తద్ద్వారా ఆ భక్తుడు భగవానునితో అన్ని విధములుగా సమానము కావలెను మిథ్యాయత్నమును త్యజించి తన నిజస్థితి తెలిసికొనగలడు. ఇదియే వాస్తవమునకు బ్రహ్మానుభవము లేదా ఆత్మానుభావము అనబడును. అట్టి స్థిరమైన భావనయే కృష్ణభక్తిరస భావనము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 211 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 20 🌴
20. na prahṛṣyet priyaṁ prāpya
nodvijet prāpya cāpriyam
sthira-buddhir asammūḍho
brahma-vid brahmaṇi sthitaḥ
🌷 Translation :
A person who neither rejoices upon achieving something pleasant nor laments upon obtaining something unpleasant, who is self-intelligent, who is unbewildered, and who knows the science of God is already situated in transcendence.
🌹 Purport :
The symptoms of the self-realized person are given herein. The first symptom is that he is not illusioned by the false identification of the body with his true self. He knows perfectly well that he is not this body but is the fragmental portion of the Supreme Personality of Godhead. He is therefore not joyful in achieving something, nor does he lament in losing anything which is related to his body. This steadiness of mind is called sthira-buddhi, or self-intelligence. He is therefore never bewildered by mistaking the gross body for the soul, nor does he accept the body as permanent and disregard the existence of the soul. This knowledge elevates him to the station of knowing the complete science of the Absolute Truth, namely Brahman, Paramātmā and Bhagavān. He thus knows his constitutional position perfectly well, without falsely trying to become one with the Supreme in all respects. This is called Brahman realization, or self-realization. Such steady consciousness is called Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 09/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 212: 05వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 212: Chap. 05, Ver. 21
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 212 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 21 🌴
21. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్ సుఖము |
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ||
🌷. తాత్పర్యం :
అట్టి ముక్తపురుషుడు బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడు గాక ఆత్మయందే సౌఖ్యమనుభవించు సదా ధ్యానమగ్నుడై యుండును. పరబ్రహ్మమును ధ్యానించు కారణమున ఆత్మదర్శి ఆ విధముగా అనంతసౌఖ్యము ననుభవించును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిపరాయణుడైన శ్రీయామునాచార్యులు ఈ క్రింది విధముగా పలికియుండిరి.
యదవధి మమ చేత: కృష్ణపాదారవిన్దే |
నవనవరసధామాన్యుద్యతం రంతు మాసీత్ ||
తదవధి బట నారీసంగమే స్మర్యమాణే |
భవతి ముఖవికార: సుష్టు నిష్ఠీవనం చ ||
“శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్తసేవ యందు నియుక్తమై, ఆ దేవదేవుని యందు నిత్యనూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున మైథునసుఖభావన కలిగినంతనే ఆరుచిచే నా ముఖము వికారము నొంది నేనా భావముపై ఉమ్మివేయుదును.” బ్రహ్మయోగము (కృష్ణభక్తిరసభావనము) నందున్నవాడు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుతసేవ యందు నిమగ్నుడై యున్నందున భౌతికభోగముల యెడ రుచిని కోల్పోవును. భౌతికభావనలో అత్యంత ఘనమైన సుఖము మైథునభోగము. జగమంతయు దీనిపై ఆధారపడియే పనిచేయుచున్నది. దీని ప్రోద్బలము లేకుండా లౌకికుడు ఎట్టి కర్మల యందును పాల్గొనలేడు. కాని కృష్ణభక్తిభావన యందున్నవాడు అట్టి సుఖమును వాచింపకయే అత్యంత ఉత్సాహముతో కర్మను ఒనరింపగలడు. దాని నతడు సంపూర్ణముగా త్యజించును. అట్టి సుఖత్యాగము ఆత్మానుభవమునకు ఒక పరీక్ష వంటిది. ఏలయన ఆత్మానుభవమునకు మరియు మైథునభోగమునకు పొత్తు ఎన్నడును కుదరదు. కృష్ణభక్తిభావన యందున్నవాడు ముక్తపురుషుడై యున్నందున ఏ విధమైన ఇంద్రియభోగముల యెడను ఆకర్షణను కలిగియుండడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 212 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 21 🌴
21. bāhya-sparśeṣv asaktātmā
vindaty ātmani yat sukham
sa brahma-yoga-yuktātmā
sukham akṣayam aśnute
🌷 Translation :
Such a liberated person is not attracted to material sense pleasure but is always in trance, enjoying the pleasure within. In this way the self-realized person enjoys unlimited happiness, for he concentrates on the Supreme.
🌹 Purport :
Śrī Yāmunācārya, a great devotee in Kṛṣṇa consciousness, said:
yad-avadhi mama cetaḥ kṛṣṇa-pādāravinde
nava-nava-rasa-dhāmany udyataṁ rantum āsīt
tad-avadhi bata nārī-saṅgame smaryamāne
bhavati mukha-vikāraḥ suṣṭhu niṣṭhīvanaṁ ca
“Since I have been engaged in the transcendental loving service of Kṛṣṇa, realizing ever-new pleasure in Him, whenever I think of sex pleasure I spit at the thought, and my lips curl with distaste.” A person in brahma-yoga, or Kṛṣṇa consciousness, is so absorbed in the loving service of the Lord that he loses his taste for material sense pleasure altogether. The highest pleasure in terms of matter is sex pleasure. The whole world is moving under its spell, and a materialist cannot work at all without this motivation. But a person engaged in Kṛṣṇa consciousness can work with greater vigor without sex pleasure, which he avoids. That is the test in spiritual realization. Spiritual realization and sex pleasure go ill together. A Kṛṣṇa conscious person is not attracted to any kind of sense pleasure, due to his being a liberated soul.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 10/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 213: 05వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 213: Chap. 05, Ver. 22
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 213 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 22 🌴
22. యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యన్తవన్త: కౌన్తేయ న తేషు రమతే బుధ: ||
🌷. తాత్పర్యం :
బుద్ధిమంతుడైనవాడు ఇంద్రియసంపర్కముచే కలుగు దుఃఖకారణములందు పాల్గొనడుడు. ఓ కౌంతేయా! ఆ సుఖములు ఆద్యంతములు కూడియున్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు.
🌷. భాష్యము :
భౌతికసుఖములు ఇంద్రియసంపర్కముచే కలుగుచుండును. కాని దేహమే ఆశాశ్వతము గనుక అట్టి భౌతికసుఖములన్నియును తాత్కాలికములై యున్నవి. తాత్కాలికమైన దేనియందును ముక్తపురుషుడు ఆసక్తిని కనబరచడు. దివ్యమైన ఆధ్యాత్మికానంద రుచిని తెలిసిన ముక్తపురుషుడు ఎట్లు ఆభాససుఖమును అనుభవింప అంగీకరించును? ఈ విషయమును గూర్చి పద్మపురాణమునందు ఇట్లు తెలుపబడినది.
రమంతే యోగినో(నన్తే సత్యానందే చిదాత్మని |
ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే ||
“యోగులైనవారు పరతత్త్వము నందు రమించుచు అనంతముగా దివ్యానందము ననుభవింతురు. కనుకనే పరతత్త్వము రాముడనియు తెలియబడును.”
శ్రీమద్భాగవాతము నందు కూడా ఈ విధముగా తెలుపబడినది(5.5.1).
నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామానర్హతే విడ్భుజాం యే |
తపో దివ్య పుత్రకాయేన సత్త్వం శుద్ధ్యేద్యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం ||
“ప్రియమైన పుత్రులారా! మానవజన్మ యందు ఇంద్రియప్రీతి కొరకు కష్టించి పనిచేయుట యుక్తము కాదు. ఏలయన అట్టి ఇంద్రియసుఖములు మలభక్షణము చేయు సూకరములకు సైతము లభించుచున్నవి. దానికి బదులు జీవితమనుగడనే శుద్ధిపరచునటువంటి తపస్సును ఈ జీవితమున మీరు చేపట్టుడు. తత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మికానందము ననుభవింపగలరు.”
కనుకనే నిజమైన యోగులు (బుధజనులు) నిరంతర భవబంధమునకు కారణమైన ఇంద్రియసుఖముచే ఆకర్షణకు గురికారు. విషయసుఖముల యెడ ఎంత ఎక్కువ అనురక్తి పెరుగునో అంత ఎక్కువగా మనుజుడు దుఃఖములందు చిక్కుబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 213 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 22 🌴
22. ye hi saṁsparśa-jā bhogā
duḥkha-yonaya eva te
ādy-antavantaḥ kaunteya
na teṣu ramate budhaḥ
🌷 Translation :
An intelligent person does not take part in the sources of misery, which are due to contact with the material senses. O son of Kuntī, such pleasures have a beginning and an end, and so the wise man does not delight in them.
🌹 Purport :
Material sense pleasures are due to the contact of the material senses, which are all temporary because the body itself is temporary. A liberated soul is not interested in anything which is temporary. Knowing well the joys of transcendental pleasures, how can a liberated soul agree to enjoy false pleasure? In the Padma Purāṇa it is said:
ramante yogino ’nante
satyānande cid-ātmani
iti rāma-padenāsau
paraṁ brahmābhidhīyate
“The mystics derive unlimited transcendental pleasures from the Absolute Truth, and therefore the Supreme Absolute Truth, the Personality of Godhead, is also known as Rāma.”
In the Śrīmad-Bhāgavatam also (5.5.1) it is said:
nāyaṁ deho deha-bhājāṁ nṛ-loke
kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye
tapo divyaṁ putrakā yena sattvaṁ
śuddhyed yasmād brahma-saukhyaṁ tv anantam
“My dear sons, there is no reason to labor very hard for sense pleasure while in this human form of life; such pleasures are available to the stool-eaters [hogs]. Rather, you should undergo penances in this life by which your existence will be purified, and as a result you will be able to enjoy unlimited transcendental bliss.”
Therefore, those who are true yogīs or learned transcendentalists are not attracted by sense pleasures, which are the causes of continuous material existence. The more one is addicted to material pleasures, the more he is entrapped by material miseries.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 11/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 214: 05వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 214: Chap. 05, Ver. 23
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 214 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 23 🌴
23. శక్నోతీహైవ య: సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ |
కామక్రోధోద్భవం వేగం స యుక్త: స సుఖీ నర: ||
🌷. తాత్పర్యం :
దేహమును విడుచుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగిన వాడు, కామక్రోధవేగమును అణచగలిగినవాడు దివ్యస్థితి యందున్నట్టివాడై ఈ జగమునందు సుఖవంతుడగును.
🌷. భాష్యము :
ఆత్మానుభవమార్గమున స్థిరమైన పురోభివృద్దిని గోరువాడు ఇంద్రియవేగమును అణుచుటకు యత్నింపవలెను. వాచవేగము, క్రోధవేగము, మనోవేగము, ఉదరవేగము, ఉపస్థవేగము, జిహ్వావేగము అను పలు ఇంద్రియవేగములు కలవు. ఈ వివిదేంద్రియ వేగములను మరియు మనస్సును అదుపు చేయగలిగినవాడు గోస్వామి లేదా స్వామి యని పిలువబడును. అట్టి గోస్వాములు నిష్ఠగా నియమజీవనము పాటించుచు, సర్వవిధములైన ఇంద్రియవేగముల నుండి దూరులై యుందురు. కోరికలను సంతృప్తి నొందనప్పడు అవి క్రోధమును కలిగించును. తత్కారణముగా మనస్సు, కన్నులు, హృదయము ఉద్విగ్నమగును. కనుకనే ఈ భౌతికదేహమును విడుచుటకు పూర్వమే ప్రతియొక్కరు ఆ ఇంద్రియ, మనోవేగములను నియమించుటను అభ్యసించవలెను. అట్లు చేయగలిగినవాడు ఆత్మానుభవమును పొందినవాడని భావింపబడును. అట్టి ఆత్మానుభవస్థితి యందు అతడు పూర్ణానందము ననుభవించును. కనుక కోరిక, క్రోధములను తీవ్రముగా అణుచుటకు యత్నించుటయే ఆధ్యాత్మికజ్ఞాన సంపన్నున విధ్యుక్తధర్మమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 214 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 23 🌴
23. śaknotīhaiva yaḥ soḍhuṁ
prāk śarīra-vimokṣaṇāt
kāma-krodhodbhavaṁ vegaṁ
sa yuktaḥ sa sukhī naraḥ
🌷 Translation :
Before giving up this present body, if one is able to tolerate the urges of the material senses and check the force of desire and anger, he is well situated and is happy in this world.
🌹 Purport :
If one wants to make steady progress on the path of self-realization, he must try to control the forces of the material senses. There are the forces of talk, forces of anger, forces of mind, forces of the stomach, forces of the genitals, and forces of the tongue. One who is able to control the forces of all these different senses, and the mind, is called gosvāmī, or svāmī. Such gosvāmīs live strictly controlled lives and forgo altogether the forces of the senses. Material desires, when unsatiated, generate anger, and thus the mind, eyes and chest become agitated. Therefore, one must practice to control them before one gives up this material body. One who can do this is understood to be self-realized and is thus happy in the state of self-realization. It is the duty of the transcendentalist to try strenuously to control desire and anger.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 12/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 215: 05వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 215: Chap. 05, Ver. 24
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 215 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 24 🌴
24. యోన్త:సుఖోన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ య: |
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి యనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు.
🌷. భాష్యము :
అంతరంగమునందు ఆనందమును అనుభవించనిదే పైపై సుఖములను కలుగజేయు బాహ్యకర్మల నుండి మనుజుడెట్లు విరమింపగలడు? ముక్తపురుషుడైనవాడు సుఖమును యథార్థానుభవము చేతనే అనుభవించును. కనుక మౌనముగా ఎచ్చటనైనను కూర్చిండి అంతరంగమునందే అతడు సౌఖ్యమును అనుభవింపగలడు. అట్టి ముక్తపురుషుడు బాహ్యసుఖమును ఎన్నడును అభిలషింపడు. “బ్రహ్మభూతస్థితి” యని పిలువబడు అట్టి స్థితిని పొందినంతట మనుజుడు భగవద్ధామమును నిశ్చయముగా చేరగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 215 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 24 🌴
24. yo ’ntaḥ-sukho ’ntar-ārāmas
tathāntar-jyotir eva yaḥ
sa yogī brahma-nirvāṇaṁ
brahma-bhūto ’dhigacchati
🌷 Translation :
One whose happiness is within, who is active and rejoices within, and whose aim is inward is actually the perfect mystic. He is liberated in the Supreme, and ultimately he attains the Supreme.
🌹 Purport :
Unless one is able to relish happiness from within, how can one retire from the external engagements meant for deriving superficial happiness? A liberated person enjoys happiness by factual experience. He can, therefore, sit silently at any place and enjoy the activities of life from within. Such a liberated person no longer desires external material happiness. This state is called brahma-bhūta, attaining which one is assured of going back to Godhead, back to home.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 13/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 216: 05వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 216: Chap. 05, Ver. 25
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 216 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 25 🌴
25. లభన్తే బ్రహ్మనిర్వాణం ఋషయ: క్షీణకల్మషా: |
ఛిన్నద్వైధా యతాత్మాన: సర్వభూతహితే రతా: ||
🌷. తాత్పర్యం :
అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైనవారును, సర్వజీవహితము కొరకే పనిచేయువారును, సర్వపాపదూరులైనవారును అగు ఋషులే బ్రహ్మనిర్వాణమును పొందుదురు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనాపూర్ణుడే వాస్తవమునాకు సర్వజీవుల హితకార్యమునందు నియుక్తుడైనవాడని చెప్పబడును. శ్రీకృష్ణుడే సర్వమునకు మూలకారణమనెడి నిజజ్ఞానమును కలిగి తద్భావానలో వర్తించినప్పుడు మనుజుడు సర్వుల హితార్థమై వర్తించినవాడగును. శ్రీకృష్ణభగవానుడు దివ్యభోక్త, దివ్యయజమాని, పరమమిత్రుడు అనెడి విషయమును మరచుటయే మానవుల దుఃఖమునకు కారణమై యున్నది. కనుక మానవుల యందు ఈ చైతన్యమును జాగృతము చేయుటకై వర్తించుట వాస్తవమునకు అత్యంత ఘనమైన హితకార్యమై యున్నది. బ్రహ్మనిర్వాణమును బడయనిదే ఎవ్వరును అట్టి శ్రేష్ఠమైన క్షేమకరకార్యము నొనరింపలేరు. కృష్ణభక్తిరసభావనాయుతుడు శ్రీకృష్ణుని దేవదేవత్వమున ఎట్టి సందేహమును కలిగియుండడు. అతడు సంపూర్ణముగా పాపదూరుడై యుండుటయే అందులకు కారణము. అదియే దివ్యమైన ప్రేమస్థితి.
మానవుల యొక్క కేవల బాహ్యక్షేమమును చూచుట యందు మాత్రమే నియుక్తుడైనవాడు వాస్తవమునకు ఎవారికినీ హితమును గూర్చలేడు. మనస్సు, దేహములకు కూర్చబడు తాత్కాలిక ఉపశమనము నిత్యతృప్తిని ఎన్నడును కూర్చలేదు. జీవనసంఘర్షణ మందలి కష్టములకు నిజమైన కారణము శ్రీకృష్ణభగవానునితో గల సంబంధమును జీవుడు మరచుటయే. తనకు శ్రీకృష్ణుతోతో గల నిత్యసంబంధమును మనుజుడు సంపూర్ణముగా అవగతము చేసికొనినప్పుడు భౌతికజగమునందు ఉన్నప్పటికిని అతడు ముక్తపురుషుడే కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 216 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 25 🌴
25. labhante brahma-nirvāṇam
ṛṣayaḥ kṣīṇa-kalmaṣāḥ
chinna-dvaidhā yatātmānaḥ
sarva-bhūta-hite ratāḥ
🌷 Translation :
Those who are beyond the dualities that arise from doubts, whose minds are engaged within, who are always busy working for the welfare of all living beings and who are free from all sins achieve liberation in the Supreme.
🌹 Purport :
Only a person who is fully in Kṛṣṇa consciousness can be said to be engaged in welfare work for all living entities. When a person is actually in the knowledge that Kṛṣṇa is the fountainhead of everything, then when he acts in that spirit he acts for everyone. The sufferings of humanity are due to forgetfulness of Kṛṣṇa as the supreme enjoyer, the supreme proprietor and the supreme friend. Therefore, to act to revive this consciousness within the entire human society is the highest welfare work. One cannot be engaged in such first-class welfare work without being liberated in the Supreme. A Kṛṣṇa conscious person has no doubt about the supremacy of Kṛṣṇa. He has no doubt because he is completely freed from all sins. This is the state of divine love.
A person engaged only in ministering to the physical welfare of human society cannot factually help anyone. Temporary relief of the external body and the mind is not satisfactory. The real cause of one’s difficulties in the hard struggle for life may be found in one’s forgetfulness of his relationship with the Supreme Lord. When a man is fully conscious of his relationship with Kṛṣṇa, he is actually a liberated soul, although he may be in the material tabernacle.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 14/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 217: 05వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 217: Chap. 05, Ver. 26
🌹. శ్రీమద్భగవద్గీత - 217 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 26 🌴
26. కామక్రోక్రోధవిముక్తానాం యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మనిర్వాణాం వర్తతే విదితాత్మనామ్ ||
🌷. తాత్పర్యం :
కామక్రోధము నుండి విడివడినవారును, ఆత్మదర్శులును, ఆత్మసంయమనము కలిగినవారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారును అగు మాహాత్ములు అచిరకాలములోనే బ్రహ్మనిర్వాణము నిశ్చయముగా బడయుదురు.
🌷. భాష్యము :
ముక్తిని పొందుట కొరకై నిరంతరము యత్నించు సాధుపురుషులలో కృష్ణభక్తిరసభావన యందున్నవాడు అత్యంత శ్రేష్టుడు. శ్రీమద్భాగవతము (4.22.39) ఈ విషయమునే ఇట్లు నిర్ధారించుచున్నది.
యత్పాదపంకజపలాశవిలాసభక్త్యా కర్మాశయం గ్రథితముద్గృథయన్తి సంత: |
తద్వన్న రిక్తమతయో యతయో(పి రుద్ధస్రోతోగణాస్తమరణం భజ వాసుదేవమ్ ||
“దేవదేవుడైన వాసుదేవుని భక్తియోగముతో అర్చించుటకు యత్నింపుము. తీవ్రముగా నాటుకొని యుండెడి కామ్యకర్మల కోరికను నశింపజేసికొనుచు ఆ భగవానుని చరణకమల సేవ యందు నిమగ్నులై దివ్యానందము ననుభవించు భక్తులు తమ ఇంద్రియవేగమును అణచినరీతిగా మహామునులు సైతము ఇంద్రియవేగమును అణచలేకున్నారు.”
కామ్యకర్మల ఫలమును అనుభవింపవలెనను కోరిక బద్ధజీవుని యందు అతి గట్టిగా నాటుకొనియుండును. తీవ్రముగా యత్నించుచున్నను మాహామునులైనవారు సైతము అట్టి కోరికలను అదుపు చేసికొనలేరు. కాని కృష్ణభక్తిరసభావన యందు శ్రీకృష్ణభగవానుని సేవలో సర్వదా నియుక్తుడైయుండు భక్తుడు ఆత్మజ్ఞానపూర్ణుడై శీఘ్రమే బ్రహ్మనిర్వాణస్థితిని బడయును. తనకుగల ఆత్మజ్ఞానముచే అతడు సదా ధ్యానమగ్నుడై యుండును. దీనికి ఈ క్రింది ఉదాహరణమును తెలుపవచ్చును.
దర్శనధ్యానసంస్పర్శై: మత్స్యకుర్మవిహంగమా: |
స్వాన్యపత్యాని పుష్ణన్తి తథా(హమపి పద్మజ ||
“మత్స్యము చూపు ద్వారా, తాబేలు ధ్యానము ద్వారా, పక్షులు స్పర్శ ద్వారా తమ సంతానమును ఉత్పత్తి చేయును. ఓ పద్మజా! నేను కూడా రీతిగానే చేయుచుందును.”
మత్స్యము కేవలము చూచుట ద్వారానే తన సంతానము ఉత్పత్తి చేయును. తాబేలు ధ్యానము ద్వారా తన సంతానమును ఉత్పత్తి చేయును. తాబేలు తన గ్రుడ్లను తీరము నందుగల భూమిలో నుంచి, నీటి యందు నిలిచి వాటిపై ధ్యానము చ్యును. అదే విధముగా కృష్ణభక్తుడు సైతము భగవద్దామము నుండి అనంతదూరమున ఉన్నను కృష్ణభక్తి యందు నియుక్తుడగుట ద్వారా సదా ఆ దేవదేవునే చింతించుచు భగవద్దామమును చేరగలడు. అతడెన్నడును భౌతికక్లేశములచే ప్రభావితుడు కాడు. అట్టి జీవనస్థితియే “బ్రహ్మనిర్వాణము” (నిరంతర బ్రహ్మభావనచే భౌతికక్లేశభావనము లేకుండుట) అని పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 217 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 26 🌴
26. kāma-krodha-vimuktānāṁ
yatīnāṁ yata-cetasām
abhito brahma-nirvāṇaṁ
vartate viditātmanām
🌷 Translation :
Those who are free from anger and all material desires, who are self-realized, self-disciplined and constantly endeavoring for perfection, are assured of liberation in the Supreme in the very near future.
🌹 Purport :
Of the saintly persons who are constantly engaged in striving toward salvation, one who is in Kṛṣṇa consciousness is the best of all. The Bhāgavatam (4.22.39) confirms this fact as follows:
yat-pāda-paṅkaja-palāśa-vilāsa-bhaktyā
karmāśayaṁ grathitam udgrathayanti santaḥ
tadvan na rikta-matayo yatayo ’pi ruddha-
sroto-gaṇās tam araṇaṁ bhaja vāsudevam
“Just try to worship, in devotional service, Vāsudeva, the Supreme Personality of Godhead. Even great sages are not able to control the forces of the senses as effectively as those who are engaged in transcendental bliss by serving the lotus feet of the Lord, uprooting the deep-grown desire for fruitive activities.”
In the conditioned soul the desire to enjoy the fruitive results of work is so deep-rooted that it is very difficult even for the great sages to control such desires, despite great endeavors. A devotee of the Lord, constantly engaged in devotional service in Kṛṣṇa consciousness, perfect in self-realization, very quickly attains liberation in the Supreme. Owing to his complete knowledge in self-realization, he always remains in trance. To cite an analogous example of this:
darśana-dhyāna-saṁsparśair
matsya-kūrma-vihaṅgamāḥ
svāny apatyāni puṣṇanti
tathāham api padma-ja
“By vision, by meditation and by touch only do the fish, the tortoise and the birds maintain their offspring. Similarly do I also, O Padmaja!”
The fish brings up its offspring simply by looking at them. The tortoise brings up its offspring simply by meditation. The eggs of the tortoise are laid on land, and the tortoise meditates on the eggs while in the water. Similarly, the devotee in Kṛṣṇa consciousness, although far away from the Lord’s abode, can elevate himself to that abode simply by thinking of Him constantly – by engagement in Kṛṣṇa consciousness. He does not feel the pangs of material miseries; this state of life is called brahma-nirvāṇa, or the absence of material miseries due to being constantly immersed in the Supreme.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 15/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 218: 05వ అధ్., శ్లో 27, 28 / Bhagavad-Gita - 218: Chap. 05, Ver. 27, 28
🌹. శ్రీమద్భగవద్గీత - 218 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 27 - 28 🌴
27. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువో: |
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ ||
28. యతేన్ద్రియమనో బుద్ధిర్మునిర్మోక్ష పరాయణ : | విగతేచ్చాభయ క్రోధో య: సదా ముక్త ఏవ స: ||
🌷. తాత్పర్యం :
బాహ్యేంద్రియార్థములన్నింటిని త్యజించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను నాసిక యందే సమములుగా చేసి తద్ద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను అదుపుజేయునట్టి మోక్షవాంచితుడు కోరిక, భయము, కోపముల నుండి ముక్తుడగును. అట్టి స్థితిలో సదా నిలిచియుండువాడు నిక్కముగా ముక్తిని పొందగలడు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందు నియుక్తుమగుట ద్వారా మనుజుడు శీఘ్రమే తన ఆధ్యాత్మిక ఉనికిని గుర్తించగలుగును. తదుపరి అతడు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనగాల్డు. భక్తియోగమునందు చక్కగా నెలకొనినపుడు మనుజుడు దివ్యమైన ఆధ్యాత్మికస్థితికి చేరి తన కర్మలన్నింటి యందును శ్రీకృష్ణుని దర్శించగలుగును. ఇట్టి విశేషస్థితియే పరబ్రహ్మమందు ముక్తస్థితి యనబడును.
పరబ్రహ్మమునందు ముక్తిని సాధించు విషయమును గూర్చి అర్జునునకు వివరించిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు అట్టి స్థితికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయమము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి యను ఎనిమిదివిధములుగా గల అష్టాంగయోగము ద్వారా ఎట్లు మనుజుడు చేరగలడో ఉపదేశించుచున్నాడు. రాబోవు షష్టాధ్యాయమున సంపూర్ణముగా వివరింపబడిన ఈ యోగవిషయము ఇప్పటి పంచమాధ్యాయపు చివరన కొద్దిగా తెలుపబడినది. శభ్దము, స్పర్శ, రూపము, రుచి, ఘ్రాణము వంటి ఇంద్రియార్థములను యోగమునందలి ప్రత్యాహార విధానము ద్వారా తరిమివేసి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, అర్థనిమీలిత నేత్రములతో ధ్యానమును సలుపవలెను. కనులను పూర్తిగా మూసినచో నిదురవచ్చు అవకాశము కలదు. కనుక కనులను పూర్తిగా మూయుటలో ఎట్టి ప్రయోజనము లేదు. ఇంద్రియార్థములచే ఆకర్షణకు గురియయ్యెడి ప్రమాదమున్నందున కనులను పూర్తిగా తెరచియుండుట యందును ఎట్టి ప్రయోజనము లేదు. కనుకనే అర్థనిమీలిత నేత్రములను కలిగి, ప్రాణాపానవాయువులను తటస్థము చేయుట ద్వారా శ్వాసను నాసిక యందే నియంత్రించవలెను. ఇటువంటి యోగాభ్యాసము ద్వారా మనుజుడు ఇంద్రియములపై ఆధిపత్యమును పొందగలిగి బాహ్యమగు ఇంద్రియార్థములను త్యజింపగలుగును. ఆ విధముగా అతడు బ్రహ్మనిర్వాణమును బడయుటకు సన్నద్దుడగును.
మనుజుడు సర్వవిధములైన భయము, క్రోధముల నుండి విడివడి దివ్యస్థితి యందు పరమాత్ముని సన్నిధిని అనుభూతమొనర్చుకొనుటకు ఈ యోగవిధానము మిక్కిలి దోహదకరము కాగలదు. వేరుమాటలలో చెప్పవలెనన్న కృష్ణభక్తిరసభావనము యోగనిర్వహణకు అత్యంత సులభవిధానమై యున్నది. ఈ విషయము రాబోవు ఆధ్యాయములో సంపూర్ణముగా వివరింపబడును. కృష్ణభక్తిపరాయణుడు సదా భక్తియోగమునందు నిలిచియున్నందున తన ఇంద్రియములను వేరే ఇతర కార్యములందు నిమగ్నము చేయడు. ఇంద్రియములను నియమించుటకు ఈ పధ్ధతియే అష్టాంగయోగపధ్ధతి కన్నను ఉత్తమమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 218 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 27, 28 🌴
27. sparśān kṛtvā bahir bāhyāṁś
cakṣuś caivāntare bhruvoḥ
prāṇāpānau samau kṛtvā
nāsābhyantara-cāriṇau
28. yatendriya-mano-buddhir
munir mokṣa-parāyaṇaḥ
vigatecchā-bhaya-krodho
yaḥ sadā mukta eva saḥ
🌷 Translation :
Shutting out all external sense objects, keeping the eyes and vision concentrated between the two eyebrows, suspending the inward and outward breaths within the nostrils, and thus controlling the mind, senses and intelligence, the transcendentalist aiming at liberation becomes free from desire, fear and anger. One who is always in this state is certainly liberated.
🌹 Purport :
Being engaged in Kṛṣṇa consciousness, one can immediately understand one’s spiritual identity, and then one can understand the Supreme Lord by means of devotional service. When one is well situated in devotional service, one comes to the transcendental position, qualified to feel the presence of the Lord in the sphere of one’s activity. This particular position is called liberation in the Supreme.
After explaining the above principles of liberation in the Supreme, the Lord gives instruction to Arjuna as to how one can come to that position by the practice of the mysticism or yoga known as aṣṭāṅga-yoga, which is divisible into an eightfold procedure called yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi. In the Sixth Chapter the subject of yoga is explicitly detailed, and at the end of the Fifth it is only preliminarily explained. One has to drive out the sense objects such as sound, touch, form, taste and smell by the pratyāhāra process in yoga, and then keep the vision of the eyes between the two eyebrows and concentrate on the tip of the nose with half-closed lids. There is no benefit in closing the eyes altogether, because then there is every chance of falling asleep. Nor is there benefit in opening the eyes completely, because then there is the hazard of being attracted by sense objects. The breathing movement is restrained within the nostrils by neutralizing the up-moving and down-moving air within the body. By practice of such yoga one is able to gain control over the senses, refrain from outward sense objects, and thus prepare oneself for liberation in the Supreme.
This yoga process helps one become free from all kinds of fear and anger and thus feel the presence of the Supersoul in the transcendental situation. In other words, Kṛṣṇa consciousness is the easiest process of executing yoga principles. This will be thoroughly explained in the next chapter. A Kṛṣṇa conscious person, however, being always engaged in devotional service, does not risk losing his senses to some other engagement. This is a better way of controlling the senses than by aṣṭāṅga-yoga.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 16/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 219: 05వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 219: Chap. 05, Ver. 29
🌹. శ్రీమద్భగవద్గీత - 219 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 29 🌴
29. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |
సుహృదం సర్వభుతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్చతి ||
🌷. తాత్పర్యం :
నా సంపూర్ణభావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను, సకలజీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతికదుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును.
🌷. భాష్యము :
మాయాశక్తి బంధములో నున్న బద్ధజీవులు భౌతికజగమునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు. కాని శాంతిసూత్రమును మాత్రము వారెరుగరు. అదియే భగవద్గీత యందు ఇచ్చట వివరింపబడినది. ఆ ఘనమైన శాంతిసూత్రము ఈ విధముగా తెలుపబడినది. సమస్త మానవకర్మలకు శ్రీకృష్ణభగవానుడే దివ్యభోక్త. అతడే సర్వలోకములకు మరియు అందున్న దేవతలకు ప్రభువు కనుక జనులు అతని దివ్యసేవకే సమస్తమును అర్పించవలసియున్నది. అతని కన్నాను ఘనుడైనవాడు వేరోక్కడు లేడు. బ్రహ్మరుద్రాదుల వంటి దేవతల కన్న్నాను అతడు ఘనమైనవాడు. కనుకనే అతడు “టం ఈశ్వరాణం పరమం మహేశ్వరమ్” అని వేదములందు (శ్వేతాశ్వతరోపనిషత్తు 6.7) వర్ణింపబడినాడు. మాయకారణముననే జీవులు తమను ప్రభువులుగా తలచుచున్నను వాస్తవమునాకు వారు దేవదేవుని మాయకు ఆధీనులైనట్టివారే. శ్రీకృష్ణభగవానుడు ప్రకృతి ప్రభువు కాగా, కఠినమగు ప్రకృతి నియమములచే నియమింపబడువారు బద్ధజీవులు. ఈ నగ్నసత్యమును అవగతము చేసికొననంతవరకు వక్తిగతముగా గాని, సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించు అవకాశమే లేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువు మరియు దేవతలతో సహా సర్వజీవులు అతనికి లోబడియుండువారు అనుటయే కృష్ణభక్తిరసభావనము. అట్టి సంపూర్ణ కృష్ణభక్తిభావన యందే మనుజుడు పూర్ణశాంతిని పొందగలడు.
సాధారణముగా కర్మయోగమని తెలియబడు కృష్ణభక్తిరసభావనకు ఈ పంచమాధ్యాయము ప్రయోగాత్మక వివరణమై యున్నది. కర్మయోగము ఏ విధముగా ముక్తిని గూర్చగలదనెడు. మనోకల్పిత ప్రశ్నకు ఇచ్చట సమాధానము ఒసగబడినది. కృష్ణభక్తిభావనలో కర్మచేయుటనగా శ్రీకృష్ణుడే సర్వమునకు ప్రభువనెడి సంపూర్ణజ్ఞానముతో కర్మచేయుటని భావము. అట్టి కర్మ ఆధ్యాత్మికజ్ఞానము కన్నను అన్యమైనది కాదు. కృష్ణభక్తిభాన యందు లగ్నమగుట భక్తియోగము కాగా, జ్ఞానయోగము అట్టి భక్తియోగమునకు చేరు మార్గము వంటిది. పరతత్వముతో గల సంబంధజ్ఞానముతో కర్మచేయుట కృష్ణభక్తిరసభావనము కాగా, శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణజ్ఞానమును కలిగియుండుటయే కృష్ణభక్తిభావన యందలి సమగ్రస్థితియై యున్నది. వాస్తవమునాకు అంశగా జీవుడు శ్రీకృష్ణునికి నిత్యదాసుడు. కాని మాయపై ఆధిపత్యము వహింపవలెనను కోరికచే అతడు మాయాసంపర్కమునకు వచ్చును. ఆ సంపర్కమే అతని సుఖదుఃఖములకు కారణమై యున్నది. అతడు భౌతికత్వముతో సంపర్కము కలిగియున్నంతవరకు భౌతికావసరముల దృష్ట్యానే కర్మనొనరింపవలసివచ్చును. కృష్ణభక్తిరసభావనమనునది అభ్యాసము ద్వారా ఆధ్యాత్మికస్థితిని జగమునందు జాగృతము చేయునదైనందున మనుజుడట్లు భౌతికత్వము నందున్నను క్రమముగా అది అతనిని ఆధ్యాత్మికతను గొనిరాగలదు. ఆధ్యాత్మికజీవనమున అతడు ఎంత అధికముగా పురోభివృద్ధి పొందునో అంత అధికముగా భౌతికబంధముల నుండి విడివడగలుగును. శ్రీకృష్ణభగవానుడు ఎవరి యెదను పక్షపాతమును కలిగియుండడు గనుక మనుజుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణభక్తిభావనలో అతని విధ్యుక్తధర్మ నిర్వాహణము పైననే ఆధారపడియుండును. అట్టి కృష్ణభక్తిరసభావితకర్మ ఇంద్రియములను నిగ్రహించుట యందును మరియు కామక్రోధముల వేగమును జయించుట యందును తోడ్పడును. ఈ విధముగా ఇంద్రియముల పలువేగములను నియమించి, కృష్ణభక్తిభావన యందు స్థిరుడై నిలిచినవాడు బ్రహ్మనిర్వాణమును ఆధ్యాత్మికస్థితి యందే నిలిచినవాడగును. యోగము యొక్క అంతిమప్రయోజనము నిర్వహింపబడుచున్నందున కృష్ణభక్తిభావన యందు అష్టాంగయోగము అప్రయత్నముగా నిర్వహింపబడినట్లే యగును. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి యను ఎనిమిది అంగములు గల యోగాభ్యాసమునందు క్రమానుగతమైన ఉద్దరమున్నను అది భక్తియుక్తసేవచే సంపూర్ణత్వము నొందుట యందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే. భక్తియోగమునందలి సంపూర్ణత్వమొక్కటే మనుజునకు శాంతిని గూర్చగలదు. అదియే మానవజన్మ యొక్క పరమసిద్ధియై యున్నది.
శ్రీమద్భగవద్గీత యందలి “కర్మయోగము – కృష్ణభక్తిరసభావితకర్మ” అను పంచమాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 219 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 29 🌴
29. bhoktāraṁ yajña-tapasāṁ
sarva-loka-maheśvaram
suhṛdaṁ sarva-bhūtānāṁ
jñātvā māṁ śāntim ṛcchati
🌷 Translation :
A person in full consciousness of Me, knowing Me to be the ultimate beneficiary of all sacrifices and austerities, the Supreme Lord of all planets and demigods, and the benefactor and well-wisher of all living entities, attains peace from the pangs of material miseries.
🌹 Purport :
The conditioned souls within the clutches of the illusory energy are all anxious to attain peace in the material world. But they do not know the formula for peace, which is explained in this part of the Bhagavad-gītā. The greatest peace formula is simply this: Lord Kṛṣṇa is the beneficiary in all human activities. Men should offer everything to the transcendental service of the Lord because He is the proprietor of all planets and the demigods thereon. No one is greater than He. He is greater than the greatest of the demigods, Lord Śiva and Lord Brahmā. In the Vedas (Śvetāśvatara Upaniṣad 6.7) the Supreme Lord is described as tam īśvarāṇāṁ paramaṁ maheśvaraṁ. Under the spell of illusion, living entities are trying to be lords of all they survey, but actually they are dominated by the material energy of the Lord. The Lord is the master of material nature, and the conditioned souls are under the stringent rules of material nature. Unless one understands these bare facts, it is not possible to achieve peace in the world either individually or collectively. This is the sense of Kṛṣṇa consciousness: Lord Kṛṣṇa is the supreme predominator, and all living entities, including the great demigods, are His subordinates. One can attain perfect peace only in complete Kṛṣṇa consciousness.
This Fifth Chapter is a practical explanation of Kṛṣṇa consciousness, generally known as karma-yoga. The question of mental speculation as to how karma-yoga can give liberation is answered herewith. To work in Kṛṣṇa consciousness is to work with the complete knowledge of the Lord as the predominator. Such work is not different from transcendental knowledge. Direct Kṛṣṇa consciousness is bhakti-yoga, and jñāna-yoga is a path leading to bhakti-yoga. Kṛṣṇa consciousness means to work in full knowledge of one’s relationship with the Supreme Absolute, and the perfection of this consciousness is full knowledge of Kṛṣṇa, or the Supreme Personality of Godhead. A pure soul is the eternal servant of God as His fragmental part and parcel. He comes into contact with māyā (illusion) due to the desire to lord it over māyā, and that is the cause of his many sufferings. As long as he is in contact with matter, he has to execute work in terms of material necessities. Kṛṣṇa consciousness, however, brings one into spiritual life even while one is within the jurisdiction of matter, for it is an arousing of spiritual existence by practice in the material world. The more one is advanced, the more he is freed from the clutches of matter. The Lord is not partial toward anyone. Everything depends on one’s practical performance of duties in Kṛṣṇa consciousness, which helps one control the senses in every respect and conquer the influence of desire and anger. And one who stands fast in Kṛṣṇa consciousness, controlling the abovementioned passions, remains factually in the transcendental stage, or brahma-nirvāṇa. The eightfold yoga mysticism is automatically practiced in Kṛṣṇa consciousness because the ultimate purpose is served. There is a gradual process of elevation in the practice of yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi. But these only preface perfection by devotional service, which alone can award peace to the human being. It is the highest perfection of life.
Thus end the Bhaktivedanta Purports to the Fifth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Karma-yoga, or Action in Kṛṣṇa Consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 17/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 220: 06వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 220: Chap. 06, Ver. 01
🌹. శ్రీమద్భగవద్గీత - 220 / Bhagavad-Gita - 220 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 01 🌴
01. శ్రీ భగవానువాచ
అనాశ్రిత: కర్మఫలం కార్యం కర్మ కరోతి య: |
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియ: ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను: కర్మఫలముల యెడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్న్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతియేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక యుండెడి వాడు యోగి కాజాలడు.
🌷. భాష్యము :
అష్టాంగయోగపధ్ధతి మనస్సును మరియు ఇంద్రియములను నియమించుటకు ఒక మార్గమని శ్రీకృష్ణభగవానుడు ఈ అధ్యాయమున వివరింపనున్నాడు. కాని కలియుగములో దీనిని ఆచరించుట సాధారణ మానవులకు అత్యంత కటినమైన కార్యము. ఈ ఆధ్యాయమున అష్టాంగయోగపద్ధతి ప్రతిపాదించబడినను కర్మయోగమే (కృష్ణభక్తిరసభావిత కర్మ) ఉత్తమమని శ్రీకృష్ణభగవానుడు నొక్కి చెప్పెను. ప్రతియొక్కరు ఈ జగమునందు కుటుంబమును పోషించుట కొరకే కర్మను చేయుచుందురు. తన కొరకు లేదా తనవారు కొరకు యనెడి స్వార్థము లేకుండా ఎవ్వరును పనిచేయలేరు. కాని కర్మఫలములను ఆశింపక కృష్ణభక్తిభావన యందే కర్మ చేయుట పూర్ణత్వలక్షణమై యున్నది. జీవులందరును శ్రీకృష్ణభగవానుని అంశలైనందున వారు వాస్తవమునకు కృష్ణభక్తిభావన యందే కర్మ నొనరింపవలెను. దేహాన్గములు దేహతృప్తి కొరకే కర్మనొనరించును. అవి ఎన్నడును తమ తృప్తి కొరకు వర్తించక దేహతృప్తి కొరకే పనిచేయును. అదే విధముగా స్వీయతృప్తి కొరకు కాక శ్రీకృష్ణభగవానుని ప్రిత్యర్థము కర్మ నొనరించు జీవుడే సన్న్యాసి (పూర్ణుడైన యోగి) యనబడును.
సన్న్యాసులైనవారు కొన్నిమార్లు తమను తాము భౌతికకర్మల నుండి ముక్తిని పొందినవారిగా భావించి తత్కారణముగా అగ్నిహోత్రయజ్ఞముల నుండి విరమింతురు. కాని తమ అంతిమ లక్ష్యము నిరాకార పరబ్రహ్మమునందు లీనమగుటయే అయినందున వారు వాస్తవముగా స్వార్థపరులై యున్నారు. అట్టి సాయుజ్యముక్తి వాంఛ విషయవాంఛ కన్ను గొప్పదే యైనను స్వార్థరహితమైనది కాజాలదు. అదే విధముగా విషయకర్మలన్నింటి నుండి విరమణను పొంది అర్థనిమీలిత నేత్రములతో యోగాభ్యాసమును కావించు యోగి సైతము కొంత స్వీయలాభమును కోరియుండును. కాని కృష్ణభక్తిభావన యందున్నవాడు మాత్రము ఎటువంటి స్వార్థములేక కేవలము శ్రీకృష్ణభగవానుని ప్రీత్యర్థమే కర్మ నోనరించును. అట్టి కృష్ణభక్తిపరాయణుడు తన ప్రీతి కొరకు ఎట్టి కోరికను కలిగియుండడు. శ్రీకృష్ణభగవానుని ప్రీతియే తన ఆధ్యాత్మికజయమునకు ప్రయాణమనెడి భావన కలిగినందున ఆ భక్తుడు పూర్ణుడైన సన్న్యాసి లేదా పూర్ణుడైన యోగి యనబడును. సన్న్యాసమునకు ప్రతిరూపమైన శ్రీచైతన్యమాహాప్రభువు ఈ క్రింది విధముగా ప్రార్థించిరి.
న ధనం న జనం న సుందరీం కవిటం వా జగదీశ కామయే |
మం జన్మనీ జన్మనీశ్వరే భావతాద్భక్తిరహైతుకీ త్వయి ||
“హే భగవాన్! ధనమును కూడబెట్టవలెనని గాని, సుందరస్త్రీలతో ఆనందింపవలెనని గాని లేక శిష్యులు పలువురు కావలెనని గాని నేను కోరను. ప్రతిజన్మ యందును నీ భక్తి యనెడి నిర్హేతుక కరుణనే నేను వాంచించుచున్నను.”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 220 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 01 🌴
01. śrī-bhagavān uvāca
anāśritaḥ karma-phalaṁ
kāryaṁ karma karoti yaḥ
sa sannyāsī ca yogī ca
na niragnir na cākriyaḥ
🌷 Translation :
The Supreme Personality of Godhead said: One who is unattached to the fruits of his work and who works as he is obligated is in the renounced order of life, and he is the true mystic, not he who lights no fire and performs no duty.
🌹 Purport :
In this chapter the Lord explains that the process of the eightfold yoga system is a means to control the mind and the senses. However, this is very difficult for people in general to perform, especially in the Age of Kali. Although the eightfold yoga system is recommended in this chapter, the Lord emphasizes that the process of karma-yoga, or acting in Kṛṣṇa consciousness, is better. Everyone acts in this world to maintain his family and their paraphernalia, but no one is working without some self-interest, some personal gratification, be it concentrated or extended. The criterion of perfection is to act in Kṛṣṇa consciousness, and not with a view to enjoying the fruits of work. To act in Kṛṣṇa consciousness is the duty of every living entity because all are constitutionally parts and parcels of the Supreme. The parts of the body work for the satisfaction of the whole body.
The limbs of the body do not act for self-satisfaction but for the satisfaction of the complete whole. Similarly, the living entity who acts for satisfaction of the supreme whole and not for personal satisfaction is the perfect sannyāsī, the perfect yogī.
The sannyāsīs sometimes artificially think that they have become liberated from all material duties, and therefore they cease to perform agnihotra yajñas (fire sacrifices), but actually they are self-interested because their goal is to become one with the impersonal Brahman. Such a desire is greater than any material desire, but it is not without self-interest. Similarly, the mystic yogī who practices the yoga system with half-open eyes, ceasing all material activities, desires some satisfaction for his personal self. But a person acting in Kṛṣṇa consciousness works for the satisfaction of the whole, without self-interest. A Kṛṣṇa conscious person has no desire for self-satisfaction. His criterion of success is the satisfaction of Kṛṣṇa, and thus he is the perfect sannyāsī, or perfect yogī. Lord Caitanya, the highest perfectional symbol of renunciation, prays in this way:
na dhanaṁ na janaṁ na sundarīṁ
kavitāṁ vā jagad-īśa kāmaye
mama janmani janmanīśvare
bhavatād bhaktir ahaitukī tvayi
“O Almighty Lord, I have no desire to accumulate wealth, nor to enjoy beautiful women. Nor do I want any number of followers. What I want only is the causeless mercy of Your devotional service in my life, birth after birth.”
🌹 🌹 🌹 🌹 🌹
Date: 18/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 221: 06వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 221: Chap. 06, Ver. 02
🌹. శ్రీమద్భగవద్గీత - 221 / Bhagavad-Gita - 221 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 02 🌴
02. యం యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ |
న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ||
🌷. తాత్పర్యం :
ఏది సన్న్యాసమని పిలువబడునో దానిని యోగామనియు (భగవానునితో కలయిక) నీవు తెలిసికొనుము. ఓ పాండుకుమారా! ఇంద్రియప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడును యోగి కాజాలడు.
🌷. భాష్యము :
జీవునిగా తన నిజస్థితిని సంపూర్ణముగా తెలిసి తద్రీతి వర్తించుటయే నిజమైన సన్న్యాసయోగము(భక్తి) అనబడును. నిజమునకు జీవునికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అతడు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తియైనట్టివాడు. అతడు బాహ్యశక్తిచే బంధితుడైనప్పుడు బద్ధునిగాను మరియు కృష్ణభక్తిరసభావితుడైనప్పుడు (ఆధ్యాత్మికశక్తిని ఎరిగినపుడు) నిజమైన సహజస్థితిని పొందినవానిగను తెలియబడును. కనుకనే మనుజుడు పూర్ణజ్ఞానవంతుడైనపుడు సర్వవిధములైన ఇంద్రియభోగకర్మల నుండి (కామ్యకర్మల నుండి) దూరుడై యుండును. భౌతికాసక్తి నుండి ఇంద్రియములను నియమించు యోగులు ఈ పద్దతిని అభ్యసింతురు. కాని కృష్ణభక్తిభావన యందున్నవాడు కృష్ణపరములు కానటువంటి కర్మల యందు ఇంద్రియములను నియుక్తముచేయు అవకాశమే లేదు. కనుకనే కృష్ణభక్తిభావితుడు ఏకకాలమున సన్న్యాసియు మరియు యోగియు అయియున్నాడు. జ్ఞాన, యోగవిధానములందు తెలుపబడిన జ్ఞానము, ఇంద్రియనిగ్రహమనువాని ప్రయోజనము కృష్ణభక్తిభావన యందు అప్రయత్నముగానే సిద్ధించును. మనుజుడు స్వార్థపూరిత కర్మలను విడువలేనిచో అట్టి జ్ఞానము, యోగము నిరర్థకములే కాగలవు. స్వార్థపూరితమగు చింతను విడచి శ్రీకృష్ణభగవానునికి ప్రియమును గూర్చ సిద్దమగుటయే జీవుని ముఖ్యలక్షణమై యున్నది. కనుకనే కృష్ణభక్తిభావన యందున్నవాడు ఎటువంటి స్వీయానందము కొరకు కోరికను కలిగియుండక, సదా శ్రీకృష్ణునికి ఆనందము నొసగుట యందే నియుక్తుడై యుండును. కర్మచేయక ఎవ్వడును ఉండలేనందున శ్రీకృష్ణభగవానుని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయతృప్తికర కార్యమునందు నియుక్తుడగును. కాని వాస్తవమునాకు కృష్ణభక్తిరసభావావితకర్మ ద్వారా సర్వప్రయోజనములు మనుజునకు సంపూర్ణముగా సిద్ధింపగలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 221 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 02 🌴
02. yaṁ sannyāsam iti prāhur
yogaṁ taṁ viddhi pāṇḍava
na hy asannyasta-saṅkalpo
yogī bhavati kaścana
🌷 Translation :
What is called renunciation you should know to be the same as yoga, or linking oneself with the Supreme, O son of Pāṇḍu, for one can never become a yogī unless he renounces the desire for sense gratification.
🌹 Purport :
Real sannyāsa-yoga or bhakti means that one should know his constitutional position as the living entity, and act accordingly. The living entity has no separate independent identity. He is the marginal energy of the Supreme. When he is entrapped by material energy, he is conditioned, and when he is Kṛṣṇa conscious, or aware of the spiritual energy, then he is in his real and natural state of life. Therefore, when one is in complete knowledge, one ceases all material sense gratification, or renounces all kinds of sense gratificatory activities. This is practiced by the yogīs who restrain the senses from material attachment. But a person in Kṛṣṇa consciousness has no opportunity to engage his senses in anything which is not for the purpose of Kṛṣṇa. Therefore, a Kṛṣṇa conscious person is simultaneously a sannyāsī and a yogī. The purpose of knowledge and of restraining the senses, as prescribed in the jñāna and yoga processes, is automatically served in Kṛṣṇa consciousness. If one is unable to give up the activities of his selfish nature, then jñāna and yoga are of no avail. The real aim is for a living entity to give up all selfish satisfaction and to be prepared to satisfy the Supreme. A Kṛṣṇa conscious person has no desire for any kind of self-enjoyment. He is always engaged for the enjoyment of the Supreme. One who has no information of the Supreme must therefore be engaged in self-satisfaction, because no one can stand on the platform of inactivity. All purposes are perfectly served by the practice of Kṛṣṇa consciousness
🌹 🌹 🌹 🌹 🌹
Date: 19/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 222: 06వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 222: Chap. 06, Ver. 03
🌹. శ్రీమద్భగవద్గీత - 222 / Bhagavad-Gita - 222 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 03 🌴
03. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమ: కారణముచ్యతే ||
🌷. తాత్పర్యం :
అష్టాంగయోగపద్ధతి యందు ఆరంభస్థితిలో నున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబాడగా, యోగమునందు సిద్ధిని పొందినవానికి భౌతికకర్మల విరమణ సాధనముగా చెప్పబడినది.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానునితో సంబధమును ఏర్పరచుకొను పద్ధతియే యోగమని పిలువబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మికానుభవమును పొందుటకు అట్టి యోగమును ఒక నిచ్చెనగా భావింపవచ్చును. అది జీవుని అత్యంత హీనస్థితి నుండి ప్రారంభమై పూర్ణమైన ఆత్మానుభవస్థితి వరకు కొనసాగియుండును. వివిధములైన ఉన్నతుల ననుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధభాగములు వివిధనామములతో పిలువబడును. అట్టి యోగమును నిచ్చెనను జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తియోగమను నామములు కలిగిన మూడుభాగములుగా విభజింపవచ్చును. ఆ యోగనిచ్చెన యొక్క ఆరంభము “యోగారురుక్షువు” స్థితియనియు, దాని చివరిమెట్టు “యోగారూఢము” అనియు పిలువబడును.
ఆరంభదశలో వివిధములైన నియమముల ద్వారా మరియు వివిధములైన ఆసనముల ద్వారా(దాదాపు శరీరవ్యాయామము వంటివి మాత్రమే) ధ్యానము నందు ప్రవేశించుటకు చేయు అష్టాంగయోగమందలి పద్ధతులు కామ్యకర్మలనియే భావింపబడును. అయినను ఇంద్రియములను నియమించుటకు అవసరమగు పూర్ణ మనోనిర్మలత్వమును సాధించుటకు అవన్నియును సహాయభూతములు కాగలవు. అట్టి ధ్యానమునందు పూర్ణత్వమును బడసినవాడు కలతపెట్టెడి సర్వమనోకర్మల నుండి దూరుడగును.
కృష్ణభక్తిరసభవితుడు శ్రీకృష్ణునే సదా తలచుచున్నందున తొలి నుండియే ధ్యానస్థితి యందు నెలకొనియుండును. అంతియేగాక నిరంతర కృష్ణసేవ యందు నిలిచియున్నందున అతడు సర్వవిధములైన కామ్యకర్మలను త్యజించినవానిగా భావింపబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 222 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 03 🌴
03. ārurukṣor muner yogaṁ
karma kāraṇam ucyate
yogārūḍhasya tasyaiva
śamaḥ kāraṇam ucyate
🌷 Translation :
For one who is a neophyte in the eightfold yoga system, work is said to be the means; and for one who is already elevated in yoga, cessation of all material activities is said to be the means.
🌹 Purport :
The process of linking oneself with the Supreme is called yoga. It may be compared to a ladder for attaining the topmost spiritual realization. This ladder begins from the lowest material condition of the living entity and rises up to perfect self-realization in pure spiritual life. According to various elevations, different parts of the ladder are known by different names. But all in all, the complete ladder is called yoga and may be divided into three parts, namely jñāna-yoga, dhyāna-yoga and bhakti-yoga. The beginning of the ladder is called the yogārurukṣu stage, and the highest rung is called yogārūḍha.
Concerning the eightfold yoga system, attempts in the beginning to enter into meditation through regulative principles of life and practice of different sitting postures (which are more or less bodily exercises) are considered fruitive material activities. All such activities lead to achieving perfect mental equilibrium to control the senses. When one is accomplished in the practice of meditation, he ceases all disturbing mental activities.
A Kṛṣṇa conscious person, however, is situated from the beginning on the platform of meditation because he always thinks of Kṛṣṇa. And, being constantly engaged in the service of Kṛṣṇa, he is considered to have ceased all material activities.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 20/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 223: 06వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 223: Chap. 06, Ver. 04
🌹. శ్రీమద్భగవద్గీత - 223 / Bhagavad-Gita - 223 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 04 🌴
04. యదా హి నేన్ద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ||
🌷. తాత్పర్యం :
విషయకోరికల నన్నింటిని విడిచి ఇంద్రియప్రీతి కొరకు వర్తించుట గాని, కామ్యకర్మలందు నియుక్తుడగుట గాని చేయని మనుజుడు యోగారూఢుడని చెప్పబడును.
🌷. భాష్యము :
మనుజుడు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్తసేవ యందు సంపూర్ణముగా నియుక్తుడైనపుడు తన యందే ఆనందము ననుభవించును కావున ఇంద్రియభోగమునందు కాని, కామ్యకర్మలందు కాని ఎన్నడును రతుడు కాడు. కర్మ కర్మ చేయక ఎవ్వరును ఉండలేనందున అట్లు కృష్ణభక్తిపరాయణుడు కానిచో మనుజుడు ఇంద్రియభోగరతుడు కావలసివచ్చును. కృష్ణభక్తిభావన లేనప్పుడు ప్రతియొక్కరు తన కొరకు గాని లేదా తనవారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మల యందు పాల్గొనుచుందురు. కాని కృష్ణభక్తిపరాయణుడు మాత్రము ప్రతిదియు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరించును ఇంద్రియభోగము నుండి పూర్ణముగా దూరుడై యుండును. అట్టి అనుభవము లేనివాడు యోగమను నిచ్చెన యొక్క చివరిమెట్టును చేరుటకు ముందు యాంత్రికమైన విధానము ద్వారా విషయవాంఛల నుండి బయటపడుటకు యత్నించ వలసి యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 223 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 04 🌴
04. yadā hi nendriyārtheṣu
na karmasv anuṣajjate
sarva-saṅkalpa-sannyāsī
yogārūḍhas tadocyate
🌷 Translation :
A person is said to be elevated in yoga when, having renounced all material desires, he neither acts for sense gratification nor engages in fruitive activities.
🌹 Purport :
When a person is fully engaged in the transcendental loving service of the Lord, he is pleased in himself, and thus he is no longer engaged in sense gratification or in fruitive activities. Otherwise, one must be engaged in sense gratification, since one cannot live without engagement. Without Kṛṣṇa consciousness, one must be always seeking self-centered or extended selfish activities. But a Kṛṣṇa conscious person can do everything for the satisfaction of Kṛṣṇa and thereby be perfectly detached from sense gratification. One who has no such realization must mechanically try to escape material desires before being elevated to the top rung of the yoga ladder.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 21/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 224: 06వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 224: Chap. 06, Ver. 05
🌹. శ్రీమద్భగవద్గీత - 224 / Bhagavad-Gita - 224 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 05 🌴
05. ఉద్ధరేదాత్మనాత్మనం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బన్దురాత్మైవ రిపురాత్మన: ||
🌷. తాత్పర్యం :
ప్రతియొక్కడు తన మనస్సుయొక్క సహాయముచే తనను తాను ఉద్దరించుకొన వలెనే గాని అధోగతిపాలు చేసికొనరాదు. బద్ధజీవునికి మనస్సనునది మిత్రుడును, అలాగుననే శత్రువును అయియున్నది.
🌷. భాష్యము :
పరిస్థితుల ననుసరించి ఆత్మ అను పదము దేహమును, మనస్సును, ఆత్మను సూచించును. యోగపద్ధతి యందు మనస్సు మరియు బద్ధజీవి యను అంశములు అత్యంత ముఖ్యములైన విషయములు. యోగాభ్యాసమునందు మనస్సే కేంద్రవిషయమైనందున ఇచ్చట ఆత్మ యనగా మనస్సని భావము. అట్టి మనస్సును నియమించి, దానిని ఇంద్రియార్థముల నుండి వేరుచేయుటయే యోగము యొక్క ముఖ్యప్రయోజనమై యున్నది. బద్ధజీవునికి అజ్ఞానమనెడి బురద నుండి ముక్తిని కలిగించు రీతిగా మనస్సుకు శిక్షణ నొసగవలెనని ఇచ్చట నొక్కి చెప్పబడినది. వాస్తవమునకు భౌతికస్థితి యందు ప్రతియొక్కరు మనోఇంద్రియముల ప్రభావమునకు గురియై యుందురు. ప్రకృతిపై ఆధిపత్యమును వహించు కోరిక కలిగిన మిథ్యాహంకారముతో మనస్సు లగ్నమైయున్నందునే భౌతికజగమునందు శుద్దాత్మ భవబంధములో తగుల్కొనును. కనుక భౌతికప్రకృతి యొక్క పై పై మెరుగులకు ఆకర్షితము కానట్లుగా మనస్సును మలచవలెను. ఆ విధముగా బద్ధజీవుడు రక్షింపబడగలడు. ఇంద్రియార్థముల యెడ ఆకర్షణతో ఎవ్వరును తమను తాము అధోగతిపాలు చేసికొనరాదు. ఇంద్రియార్థముల యెడ మనుజుడు ఎంతగా ఆకర్షణను కలిగియుండునో అంతగా అతడు భవబంధములో చిక్కుకొనును. అట్టి భవబంధము నుండి తప్పించుకొనుటకు మనస్సును సదా కృష్ణభక్తిభావన యందు నిలిపుటయే అత్యంత ఉత్తమమార్గము. ఈ విషయమును నొక్కి చెప్పుటకే ఈ శ్లోకమునందు “హి” అను పదము ప్రయోగింపబడినది. అనగా ప్రతియొక్కరు దీనిని ఆచరింపవలసియున్నది. అమృతబిందూపనిషత్తు (2) ఈ విషయమున ఇట్లు పలుకుచున్నది.
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో: |
బంధాయ విషయాసంగో ముక్వై నిర్విషయం మన: ||
“మనుజునకు మనస్సే బంధకారణము మరియు ముక్తికారణము అయియున్నది. ఇంద్రియార్థములందు లగ్నమైన మనస్సు బంధకారణము కాగా, ఇంద్రియార్థముల నుండి విడివడిన మనస్సు మోక్షమునకు కారణమగుచున్నది”. అనగా కృష్ణభక్తిభావన యందు సంలగ్నమైన మనస్సు దివ్యమైన ముక్తికి కారణమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 224 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 05 🌴
05. uddhared ātmanātmānaṁ
nātmānam avasādayet
ātmaiva hy ātmano bandhur
ātmaiva ripur ātmanaḥ
🌷 Translation :
One must deliver himself with the help of his mind, and not degrade himself. The mind is the friend of the conditioned soul, and his enemy as well.
🌹 Purport :
The word ātmā denotes body, mind and soul – depending upon different circumstances. In the yoga system, the mind and the conditioned soul are especially important. Since the mind is the central point of yoga practice, ātmā refers here to the mind. The purpose of the yoga system is to control the mind and to draw it away from attachment to sense objects. It is stressed herein that the mind must be so trained that it can deliver the conditioned soul from the mire of nescience. In material existence one is subjected to the influence of the mind and the senses. In fact, the pure soul is entangled in the material world because the mind is involved with the false ego, which desires to lord it over material nature. Therefore, the mind should be trained so that it will not be attracted by the glitter of material nature, and in this way the conditioned soul may be saved. One should not degrade oneself by attraction to sense objects. The more one is attracted by sense objects, the more one becomes entangled in material existence. The best way to disentangle oneself is to always engage the mind in Kṛṣṇa consciousness. The word hi is used for emphasizing this point, i.e., that one must do this. It is also said:
mana eva manuṣyāṇāṁ
kāraṇaṁ bandha-mokṣayoḥ
bandhāya viṣayāsaṅgo
muktyai nirviṣayaṁ manaḥ
“For man, mind is the cause of bondage and mind is the cause of liberation. Mind absorbed in sense objects is the cause of bondage, and mind detached from the sense objects is the cause of liberation.” (Amṛta-bindu Upaniṣad 2) Therefore, the mind which is always engaged in Kṛṣṇa consciousness is the cause of supreme liberation.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 22/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 225: 06వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 225: Chap. 06, Ver. 06
🌹. శ్రీమద్భగవద్గీత - 225 / Bhagavad-Gita - 225 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 06 🌴
06. బన్దురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జిత: |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ||
🌷. తాత్పర్యం :
మనస్సును జయించినవానికి మనస్సే ఉత్తమమిత్రుడు. కాని అట్లు చేయలేనివానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును.
🌷. భాష్యము :
మానవధర్మమును నిర్వహించుట యందు మనస్సుని మిత్రునిగా చేసికొనుట కొరకు దానిని నియమించుటయే అష్టాంగయోగాభ్యాసపు ప్రయోజమై యున్నది. మనస్సు నియమింపబడనిచో యోగాభ్యాసము కేవలము సమయమును వృథాచేయుటయే కాగలదు. మనస్సును అదుపు చేయనివాడు సదా గొప్ప శత్రువుతో కలసి జీవనము సాగించువాడు కాగలడు. తత్కారణముగా అతని జన్మ మరియు జన్మప్రయోజనము సంపూర్ణముగా నష్టము కాగలవు. తన కన్నను ఉన్నతుడైనవాని ఆజ్ఞలను నిర్వర్తించుట జీవుల సహజస్థితియై యున్నది. మనస్సు జయింపరాని శత్రువుగా నిలిచినంతకాలము మనుజుడు కామము, క్రోధము, ద్వేషము, మోహము మొదలుగువాని ఆజ్ఞలను అనుసరింపవలసివచ్చును. కాని మనస్సు జయింపబడినప్పుడు మనుజుడు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపున వసించియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలకు కట్టుబడియుండుటకు స్వచ్చందముగా అంగీకరించును. హృదయస్థుడైన పరమాత్మను చేరి, అతని ఆజ్ఞల మేరకు వర్తించుటనే నిజమైన యోగము ఉపదేశించును. కృష్ణభక్తిభావన యందు ప్రత్యక్షముగా నియుక్తుడైనవానికి శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా నియుక్తుడైనవానికి శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా జరిగిపోవును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 225 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 06 🌴
06. bandhur ātmātmanas tasya
yenātmaivātmanā jitaḥ
anātmanas tu śatrutve
vartetātmaiva śatru-vat
🌷 Translation :
For him who has conquered the mind, the mind is the best of friends; but for one who has failed to do so, his mind will remain the greatest enemy.
🌹 Purport :
The purpose of practicing eightfold yoga is to control the mind in order to make it a friend in discharging the human mission. Unless the mind is controlled, the practice of yoga (for show) is simply a waste of time. One who cannot control his mind lives always with the greatest enemy, and thus his life and its mission are spoiled. The constitutional position of the living entity is to carry out the order of the superior. As long as one’s mind remains an unconquered enemy, one has to serve the dictations of lust, anger, avarice, illusion, etc. But when the mind is conquered, one voluntarily agrees to abide by the dictation of the Personality of Godhead, who is situated within the heart of everyone as Paramātmā. Real yoga practice entails meeting the Paramātmā within the heart and then following His dictation. For one who takes to Kṛṣṇa consciousness directly, perfect surrender to the dictation of the Lord follows automatically.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 23/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 226: 06వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 226: Chap. 06, Ver. 07
🌹. శ్రీమద్భగవద్గీత - 226 / Bhagavad-Gita - 226 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 07 🌴
07. జితాత్మన: ప్రశాన్తస్య పరమాత్మా సమాహిత: |
శీతోష్ణసుఖదు:ఖేషు తథా మానాపమానయో: ||
🌷. తాత్పర్యం :
మనస్సు జయించినవాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజునకు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవమానములు అన్నియును సమానములె అయియున్నవి.
🌷. భాష్యము :
వాస్తవమునకు ప్రతిజీవియు ఎల్లరి హృదయములందు పరమాత్మరూపున నిలిచియుండు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను పాటించుటకే ఉద్దేశింపబడియున్నాడు. కాని మనస్సు బాహ్యశక్తిచే మోహితమై తప్పుదారి పట్టినప్పుడు మనుజుడు భొతికకర్మల యందు రతుడగును. కనుక ఏదేని ఒక యోగపద్ధతి ద్వారా మనస్సు నియమింపబడినంతనే అతడు తన గమ్యస్థానమును చేరినట్టివానిగా భావింపబడును. వాస్తవమునకు మనుజుడెప్పుడును ఉన్నతమైన ఆజ్ఞకు లోబడబలసియుండును. కనుక మనుజుని మనస్సు దివ్యచైతన్యము నందు నిలిచినప్పుడు అతడు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను పాటించుట తప్ప అన్యమును ఎరుగలేడు. మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి పాటించుట తప్ప అన్యమును ఎరుగలేడు. మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి వానిని అనుసరింపవలసియుండును. కనుక అది నిగ్రహింపబడినపుడు అప్రయత్నముగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించును. ఇట్టి దివ్యమైన స్థితిని కృష్ణభక్తిభావన యందు నిలిచియున్న భక్తుడు శీఘ్రమే పొందుచున్నందున సుఖదుఃఖములు, శీతతాపముల వంటి ప్రకృతి ద్వంద్వములచే ప్రభావితుడు కాకుండును. ఇట్టి స్థితియే శ్రీకృష్ణభగవానుని యందు సంలగ్నమైన స్థితి లేదా సమాధి యనబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 226 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 07 🌴
07. jitātmanaḥ praśāntasya
paramātmā samāhitaḥ
śītoṣṇa-sukha-duḥkheṣu
tathā mānāpamānayoḥ
🌷 Translation :
For one who has conquered the mind, the Supersoul is already reached, for he has attained tranquillity. To such a man happiness and distress, heat and cold, honor and dishonor are all the same.
🌹 Purport :
Actually, every living entity is intended to abide by the dictation of the Supreme Personality of Godhead, who is seated in everyone’s heart as Paramātmā. When the mind is misled by the external, illusory energy, one becomes entangled in material activities. Therefore, as soon as one’s mind is controlled through one of the yoga systems, one should be considered to have already reached the destination. One has to abide by superior dictation. When one’s mind is fixed on the superior nature, he has no alternative but to follow the dictation of the Supreme. The mind must admit some superior dictation and follow it. The effect of controlling the mind is that one automatically follows the dictation of the Paramātmā, or Supersoul. Because this transcendental position is at once achieved by one who is in Kṛṣṇa consciousness, the devotee of the Lord is unaffected by the dualities of material existence, namely distress and happiness, cold and heat, etc. This state is practical samādhi, or absorption in the Supreme.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 24/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 227: 06వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 227: Chap. 06, Ver. 08
🌹. శ్రీమద్భగవద్గీత - 227 / Bhagavad-Gita - 227 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 08 🌴
08. జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియ: |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్ట్రాశ్మకాంచన: ||
🌷. తాత్పర్యం :
మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన,విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినపుడు ఆత్మానుభవము నందు స్థితిని పొందినట్టివాడై యోగి యనబడును. అట్టివాడు ఆధ్య్తాత్మికస్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్లనైనను, రాళ్ళనైనను లేదా బంగారమైనను సమానముగా గాంచును.
🌷. భాష్యము :
పరతత్వానుభవము లేనటువంటి కేవల పుస్తపాండిత్యము నిష్ప్రయోజనమైనట్టిది. ఈ విషయమే ఇట్లు చెప్పబడినది.
అత: శ్రీకృష్ణనామాది న భవేద్ గ్రాహ్యమింద్రియై: |
సేవన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్పురత్యద: ||
“శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలల దివ్యస్వభావమును భౌతికత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవ్వరును అవగాహన చేసికొనలేరు. కేవలము దివ్యమైన భక్తియుక్తసేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మనుజునకు ఆ ఆదిదేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తములగును.” (భక్తిరసామృతసింధువు 1.2.234)
కృష్ణభక్తిరసభావన శాస్త్రమే ఈ శ్రీమద్భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవ్వరును కృష్ణభక్తిరసభావితులు కాలేరు. అందులకు శుద్దాంతరంగునితో సాహచర్యము అత్యంత అవసరము. అట్టి భక్తుడు శుద్ధమగు భక్తియోగాముతో సంతృప్తుడై యుండుటచే కృష్ణుని కరుణ వలన అనుభవజ్ఞానమును కలిగియుండును. అటువంటి అనుభవజ్ఞానము చేతనే ఎవ్వరైనను పూర్ణులు కాగలరు మరియు తమ విశ్వాసము నందు స్తిరులై నిలువగలరు. కాని అనుభవజ్ఞానములేక కేవలము పుస్తకజ్ఞానము కలవారు బాహ్యవరుధ్యములచే భ్రాంతులును, కలతనొందినవారును కాగలరు. శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందియున్నందున ఆత్మజ్ఞానము గలవాడే నిజముగా ఆత్మనిగ్రహమును కలిగియుండగలడు. లౌకికపాండిత్యముతో ఎట్టి సంబంధము లేనందున అతడు దివ్యస్థితిలో నెలకొని యుండును. ప్రాపంచిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారము వంటివైనను అతనికి మాత్రము గులకరాళ్ళు లేదా రాళ్ళతో సమానమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 227 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 08 🌴
08. jñāna-vijñāna-tṛptātmā
kūṭa-stho vijitendriyaḥ
yukta ity ucyate yogī
sama-loṣṭrāśma-kāñcanaḥ
🌷 Translation :
A person is said to be established in self-realization and is called a yogī [or mystic] when he is fully satisfied by virtue of acquired knowledge and realization. Such a person is situated in transcendence and is self-controlled. He sees everything – whether it be pebbles, stones or gold – as the same.
🌹 Purport :
Book knowledge without realization of the Supreme Truth is useless. This is stated as follows:
ataḥ śrī-kṛṣṇa-nāmādi
na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau
svayam eva sphuraty adaḥ
“No one can understand the transcendental nature of the name, form, quality and pastimes of Śrī Kṛṣṇa through his materially contaminated senses. Only when one becomes spiritually saturated by transcendental service to the Lord are the transcendental name, form, quality and pastimes of the Lord revealed to him.” (Bhakti-rasāmṛta-sindhu 1.2.234)
This Bhagavad-gītā is the science of Kṛṣṇa consciousness. No one can become Kṛṣṇa conscious simply by mundane scholarship. One must be fortunate enough to associate with a person who is in pure consciousness. A Kṛṣṇa conscious person has realized knowledge, by the grace of Kṛṣṇa, because he is satisfied with pure devotional service. By realized knowledge, one becomes perfect. By transcendental knowledge one can remain steady in his convictions, but by mere academic knowledge one can be easily deluded and confused by apparent contradictions. It is the realized soul who is actually self-controlled, because he is surrendered to Kṛṣṇa. He is transcendental because he has nothing to do with mundane scholarship. For him mundane scholarship and mental speculation, which may be as good as gold to others, are of no greater value than pebbles or stones.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 25/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 228: 06వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 228: Chap. 06, Ver. 09
🌹. శ్రీమద్భగవద్గీత - 228 / Bhagavad-Gita - 228 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 09 🌴
09. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబన్దుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ||
🌷. తాత్పర్యం :
శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించువారలను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ది నొందినవానిగా పరిగణింపబడును.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 228 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 09 🌴
09. suhṛn-mitrāry-udāsīna-
madhyastha-dveṣya-bandhuṣu
sādhuṣv api ca pāpeṣu
sama-buddhir viśiṣyate
🌷 Translation :
A person is considered still further advanced when he regards honest well-wishers, affectionate benefactors, the neutral, mediators, the envious, friends and enemies, the pious and the sinners all with an equal mind.
🌹 Purport :
----
🌹 🌹 🌹 🌹 🌹
Date: 26/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 229: 06వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 229: Chap. 06, Ver. 10
🌹. శ్రీమద్భగవద్గీత - 229 / Bhagavad-Gita - 229 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 10 🌴
10. యోగీ యుజ్ఞీత సతతమాత్మానం రహసి స్థిత: |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహ: ||
🌷. తాత్పర్యం :
యోగియైనవాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవానుని సంబంధములో నియుక్తము చేసి, ఒంటరిగా ఏకాంతస్థలమునందు నివసించుచు సావధానముగా మనస్సు నియమింపవలెను. అతడు కోరికల నుండియు మరియు సమస్తమును కలిగియుండవలెనను భావనలనుండియు ముక్తుడై యుండవలెను.
🌷. భాష్యము :
బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు మూడువిధములుగా వివిధదశలలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనుభవమునకు వచ్చును. అట్టి దేవదేవుని దివ్యమగు ప్రేమయుక్తసేవ యందు సదా నెలకొనియుండుటయే కృష్ణభక్తిరసభావనమని సంక్షిప్తముగా తెలుపవచ్చును. అయినను నిరాకారబ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభావము నందు అనురక్తులైనవారు సైతము పాక్షికముగా కృష్ణభక్తిరసభావితులే యనబడుదురు. ఏలయన నిరాకారబ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా, పరమాత్మ రూపము శ్రీకృష్ణుని సర్వత్రా వ్యాపించియున్నటువంటి రూపము. అనగా నిరాకారవాదులు మరియు యోగులు సైతము పరోక్షముగా కృష్ణభక్తులే. కాని కృష్ణభక్తిపరాయణుడు బ్రహ్మమననేమో మరియు పరమాత్మయననేమో సంపూర్ణముగా తెలిసియున్నందున ఆధ్యాత్మికులలో అత్యున్నతుడై యున్నాడు. పరతత్త్వమును గూర్చిన అతని జ్ఞానము సంపూర్ణమై యుండగా, నిరాకారవాదులు మరియు యోగులు కృష్ణభక్తిభావన యందు అసంపూర్ణులై యున్నాడు.
అయినను శీఘ్రముగనో లేదా ఆలస్యముగనో అత్యున్నత పుర్ణత్వమును బడయుటకై వారందరును తమ తమ సాధనల యందు నిష్ఠగా కొనసాగవలెనని ఇచ్చట ఉపదేశించబడిరి. శ్రీకృష్ణుని యందే మనస్సును సంలగ్నము చేయుట యోగి యొక్క ప్రథమకర్తవ్యము. క్షణకాలమును మరువక కృష్ణునే అతడు సదా స్మరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణభగవానునిపై మనస్సు కేంద్రీకృతమగుటయే “సమాధి” యనబడును. మనస్సును కేంద్రికరించుటకు మనుజుడు ఏకాంతముననే సదా నిలిచి, బాహ్యవిషయముల నుండి కలిగెడి కలతను నివారింపవలెను. తన ఆత్మానుభవమునకు అనుకూలమైనవానిని గ్రహించుట మరియు ప్రతికూలమైనవానిని త్యజించుటను అతడు జగరూకుడై ఒనరింపవలెను. కూడబెట్టవలెనను భావనతో తనను బంధించునటువంటి అవాంఛిత విషయవస్తువుల యెడ అతడు నిశ్చయముగా తపన చెందరాదు.
మనుజుడు పత్యక్షముగా కృష్ణభక్తిభావన యందు నెలకొనినప్పుడు ఈ సంపూర్ణత్వము, నియమములు అప్రయత్నముగా చక్కగా ఒనగూడగలవు. ఏలయన కృష్ణభక్తిభావన యనగా ఆత్మసమర్పణమణి భావము. దాని యందు నాది యను భావనకు కించత్తు కూడా ఆస్కారముండదు. కనుకనే శ్రీరూపగోస్వామి కృష్ణభక్తిభావనను ఈ క్రింది విధముగా వివరించిరి.
అనాసక్తస్య విషయాన్ యథార్హ ముపయుంజత: |
నిర్బంధ: కృష్ణసంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే ||
ముముక్షుభి: పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే ||
“దేని యెడను సంగత్వమును కలిగియుండక, అదే సమయమున ప్రతిదానిని కృష్ణుని కొరకు స్వీకరించెడి మనుజుడు సర్వమును కలిగియుండవలెనను భావనకు(స్వామిత్వమునకు) అతీతుడైనట్టివాడు. అట్లుగాక కృష్ణునితో వాటికి గల సంబంధమును తెలియక సర్వమును త్యజించువాడు వైరాగ్యమునందు పూర్ణత్వమును పొందినవాడు కాజాలడు.” (భక్తిరసామృతసింధువు, 2.255-256)
కృష్ణభక్తిరసభావితుడు సర్వము కృష్ణునకే చెందినదని తెలిసియుండుటచే “నాది” యను భావన నుండి ముక్తుడై యుండును. తన కొరకై అతడు దేని యెదను ఆత్రుతను కలిగియుండడు. తన భక్తికి దోహదమగు విషయములను ఎట్లు గ్రహింపవలెనో మరియు దానికి ప్రతిబంధకమగు విషయములను ఎట్లు త్యజించవలెనో అతడు సంపూర్ణముగా నెరిగియుండును. దివ్యుడై యుండుటచే అతడు సదా విషయవస్తువుల నుండి దూరముగా నుండును. అభక్తులతో సంబంధము లేకుండుటచే సదా ఒంటరియై యుండును. కనుకనే కృష్ణభక్తిరసభావితుడు సంపూర్ణయోగి యనబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 229 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 10 🌴
10. yogī yuñjīta satatam
ātmānaṁ rahasi sthitaḥ
ekākī yata-cittātmā
nirāśīr aparigrahaḥ
🌷 Translation :
A transcendentalist should always engage his body, mind and self in relationship with the Supreme; he should live alone in a secluded place and should always carefully control his mind. He should be free from desires and feelings of possessiveness.
🌹 Purport :
Kṛṣṇa is realized in different degrees as Brahman, Paramātmā and the Supreme Personality of Godhead. Kṛṣṇa consciousness means, concisely, to be always engaged in the transcendental loving service of the Lord. But those who are attached to the impersonal Brahman or the localized Supersoul are also partially Kṛṣṇa conscious, because the impersonal Brahman is the spiritual ray of Kṛṣṇa and the Supersoul is the all-pervading partial expansion of Kṛṣṇa.
Thus the impersonalist and the meditator are also indirectly Kṛṣṇa conscious. A directly Kṛṣṇa conscious person is the topmost transcendentalist because such a devotee knows what is meant by Brahman and Paramātmā. His knowledge of the Absolute Truth is perfect, whereas the impersonalist and the meditative yogī are imperfectly Kṛṣṇa conscious.
Nevertheless, all of these are instructed herewith to be constantly engaged in their particular pursuits so that they may come to the highest perfection sooner or later. The first business of a transcendentalist is to keep the mind always on Kṛṣṇa. One should always think of Kṛṣṇa and not forget Him even for a moment. Concentration of the mind on the Supreme is called samādhi, or trance. In order to concentrate the mind, one should always remain in seclusion and avoid disturbance by external objects. He should be very careful to accept favorable and reject unfavorable conditions that affect his realization. And, in perfect determination, he should not hanker after unnecessary material things that entangle him by feelings of possessiveness.
All these perfections and precautions are perfectly executed when one is directly in Kṛṣṇa consciousness, because direct Kṛṣṇa consciousness means self-abnegation, wherein there is very little chance for material possessiveness. Śrīla Rūpa Gosvāmī characterizes Kṛṣṇa consciousness in this way:
anāsaktasya viṣayān, yathārham upayuñjataḥ
nirbandhaḥ kṛṣṇa-sambandhe, yuktaṁ vairāgyam ucyate
prāpañcikatayā buddhyā
hari-sambandhi-vastunaḥ
mumukṣubhiḥ parityāgo
vairāgyaṁ phalgu kathyate
“When one is not attached to anything, but at the same time accepts everything in relation to Kṛṣṇa, one is rightly situated above possessiveness. On the other hand, one who rejects everything without knowledge of its relationship to Kṛṣṇa is not as complete in his renunciation.” (Bhakti-rasāmṛta-sindhu 1.2.255–256)
A Kṛṣṇa conscious person well knows that everything belongs to Kṛṣṇa, and thus he is always free from feelings of personal possession. As such, he has no hankering for anything on his own personal account. He knows how to accept things in favor of Kṛṣṇa consciousness and how to reject things unfavorable to Kṛṣṇa consciousness. He is always aloof from material things because he is always transcendental, and he is always alone, having nothing to do with persons not in Kṛṣṇa consciousness. Therefore a person in Kṛṣṇa consciousness is the perfect yogī.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 27/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 230: 06వ అధ్., శ్లో 11, 12 / Bhagavad-Gita - 230: Chap. 06, Ver. 11, 12
🌹. శ్రీమద్భగవద్గీత - 230 / Bhagavad-Gita - 230 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 11, 12 🌴
11. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మాన: |
నాత్యుచ్చ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ||
12. తత్రైకాగ్రం మన: కృత్వా యతచిత్తేన్ద్రియక్రియ: |
ఉపవిశ్యాసనే యుజ్ఞ్యాద్ యోగమాత్మవిశుద్ధయే ||
🌷. తాత్పర్యం :
యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంతస్థాలమున కేగి నేలపై కుశగ్రాసమును పరచి, దానిని జింకచర్మము మరియు వస్త్రముతో కప్పవలెను, అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్రస్థానములో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియమనోకర్మలను నియమించి, మనస్సును ఏకాగ్రపరచి హృదయశుద్ధి కొరకు యోగము నభ్యసించవలెను.
🌷. భాష్యము :
“శుచౌదేశే” అను పదము ఇచ్చట తీర్థస్థానములను సూచించుచున్నది. భారతభూమి యందు యోగులు మరియు భక్తులు గృహములను విడిచి గంగ, యమున వంటి పవిత్రనదులు ప్రవహించు ప్రయాగ, మథుర, బృందావనము, హృషీకేశము, హరిద్వారము వంటి తీర్థస్థానముల కేగి అచ్చట ఏకాంత యోగాభ్యాసమును కావింతురు. కాని ఇది అన్నివేళలా సర్వులకు (ముఖ్యముగా పాశ్చాత్యదేశవాసులకు) సాధ్యము కాదు. పెద్ద పెద్ద నగరములందలి యోగసంఘములు ధనమును గడింపవచ్చునేమో గాని నిజమైన యోగసాధనకు అవి ఏమాత్రము తగినవి కావు. ఆత్మనిగ్రహము లేనివాడు మరియు మనోచంచలము కలవాడు ధ్యానమును కొనసాగింపలేడు. కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతి యందు బద్ధకస్తులు, వివిధములైన తాపత్రయములచే సదా కలతనొందనివారు యగుట చేతనే ఆత్మానుభవమునకు హరినామసంకీర్తనము ఉత్తమమార్గమని బృహన్నారదీయ పురాణమునందు తెలుపబడినది.
హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం |
కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా ||
“కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు హరినామకిర్తనమే ఏకైక ముక్తిమార్గము. దానికి మించి వేరొకమార్గము లేదు. వేరొకమార్గము లేదు. వేరొకమార్గము లేదు.”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 230 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 11, 12 🌴
11. śucau deśe pratiṣṭhāpya
sthiram āsanam ātmanaḥ
nāty-ucchritaṁ nāti-nīcaṁ
cailājina-kuśottaram
12. tatraikāgraṁ manaḥ kṛtvā
yata-cittendriya-kriyaḥ
upaviśyāsane yuñjyād
yogam ātma-viśuddhaye
🌷 Translation :
To practice yoga, one should go to a secluded place and should lay kuśa grass on the ground and then cover it with a deerskin and a soft cloth. The seat should be neither too high nor too low and should be situated in a sacred place. The yogī should then sit on it very firmly and practice yoga to purify the heart by controlling his mind, senses and activities and fixing the mind on one point.
🌹 Purport :
“Sacred place” refers to places of pilgrimage. In India the yogīs – the transcendentalists or the devotees – all leave home and reside in sacred places such as Prayāga, Mathurā, Vṛndāvana, Hṛṣīkeśa and Hardwar and in solitude practice yoga where the sacred rivers like the Yamunā and the Ganges flow. But often this is not possible, especially for Westerners. The so-called yoga societies in big cities may be successful in earning material benefit, but they are not at all suitable for the actual practice of yoga. One who is not self-controlled and whose mind is not undisturbed cannot practice meditation. Therefore, in the Bṛhan-nāradīya Purāṇa it is said that in Kali-yuga (the present yuga, or age), when people in general are short-lived, slow in spiritual realization and always disturbed by various anxieties, the best means of spiritual realization is chanting the holy name of the Lord.
harer nāma harer nāma
harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva
nāsty eva gatir anyathā
“In this age of quarrel and hypocrisy the only means of deliverance is chanting the holy name of the Lord. There is no other way. There is no other way. There is no other way.”
🌹 🌹 🌹 🌹 🌹
Date: 28/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 231: 06వ అధ్., శ్లో 13, 14 / Bhagavad-Gita - 231: Chap. 06, Ver. 13, 14
🌹. శ్రీమద్భగవద్గీత - 231 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 13, 14 🌴
13. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర: |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ||
14. ప్రశాన్తాత్మా విగతభీర్భ్రహ్మచారివ్రతే స్థిత: |
మన: సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర: ||
🌷. తాత్పర్యం :
శరీరము, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రికరింపవలెను. ఆ విధముగా కలతనొందనటువంటి నియమిత మనస్సుతో, భయమును వీడి, బ్రహ్మచర్యమును పాటించుచు యోగియైనవాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవితపరమగతిగా చేసికొనవలెను.
🌷. భాష్యము :
చతుర్బాహు విష్ణురూపమైన పరమాత్మగా ప్రతిజీవి హృదయమునందు వసించియున్న శ్రీకృష్ణుని తెలిసికొనుటయే మానవజన్మ యొక్క ముఖ్యలక్ష్యమై యున్నది. హృదయమునందు నిలిచియుండెడి అట్టి విష్ణురూపము శోధించి చూచు నిమిత్తమే యోగము అభ్యసింపబడవలెను గాని అన్యప్రయోజనము కొరకు కాదు. సర్వజీవ హృదయస్థమైన ఆ విష్ణురూపము శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యరూపము. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారము లేదా అనుభవమన్నది ఉద్దేశ్యము కానప్పుడు మనుజుడొనరించు యోగాభ్యాసము కేవలము బూటకమాత్రమే కాలమును వ్యర్థము చేయుటయే కాగలదు. అనగా జీవితపు అంతిమలక్ష్యము శ్రీకృష్ణభగవానుడై యున్నాడు మరియు హృదయస్థుసిన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసపు లక్ష్యమై యున్నది. ఈ హృదయస్థ విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మనుజుడు సంపూర్ణముగా మైథునజీవనము నుండి విడివడవలెను. కనుక అతడు గృహమును విడిచి గతమునందు తెలిపిన రీతిగా ఆసీనుడై ఏకాంతమున జీవించవలెను. ఒకవైపు మైథునసుఖమును అనుభవించుచునే మరొకవైపు నామమాత్ర యోగతరగతులందు పాల్గొనుట ద్వారా ఎవ్వరును యోగులు కాజాలరు. అందులకై మనోనియమమును, సర్వవిధ భోగత్యాగమును (ఆ సుఖములలో అతిముఖ్యమైనదైన మైథునసుఖత్యాగమును) మనుజుడు అభ్యసింపవలెను. యాజ్ఞవల్క్యమహర్షి రచించిన బ్రహ్మచర్య నియమములందు ఈ విషయములందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.
కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా |
సర్వత్ర మైథునత్యాగో బ్రహ్మచర్యం పచక్షతే ||
“అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనసా, వాచా, కర్మణా మైథునభోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్యవ్రతము ఉద్దేశింపబడియున్నది.” మైథునసుఖము అనుభవించుచునే సరియైన యోగాభ్యాసమును ఎవ్వరును చేయజాలరు. కనుకనే మైథునసుఖపు జ్ఞానముండని బాల్యము నుండియే బ్రహ్మచర్యము బోధింపబడును. ఐదేండ్ల సమయము నందే పిల్లలను గురుకులమునకు లేదా గురువు వద్దకు పంపినచో అతడు వారిని చక్కని బ్రహ్మచారులగు రీతిగా శిక్షణను ఒసగగలడు. ధ్యానమార్గము, జ్ఞానమార్గము లేదా భక్తిమార్గము ఏదైనను సరియే అట్టి బ్రహ్మచర్యభ్యాసము లేనిదే ఎవ్వరును వారి యోగమునందు అభివృద్ధిని పొందలేరు. అయినను గృహస్థజీవన ధర్మమును చక్కగా పాటించుచు, కేవలము భార్యతోనే నియమబద్ధముగా సాంసారికసుఖమును కలిగియున్నవాడు సైతము బ్రహ్మచారిగా పిలువబడును. అట్టి నియమిత గృహస్థ బ్రహ్మచారలు భక్తిమార్గమునందు ఆమోదింపబడుదురు. కాని జ్ఞానము మరియు ధ్యానమార్గ సంప్రదాయములు అట్టి గృహస్థ బ్రహ్మచారులను తమ యందు చేర్చుకొనుటకైనను అంగీకరింపవు. ఆ సంప్రదాయముల వారు మైథునజీవన త్యాగమునందు ఎటువంటి సడలింపును అంగీకరింపరు. కాని భక్తియోగవిధానము అత్యంత శక్తివంతమైనందున ఉన్నతమగు భగవత్సేవ యందు నియుక్తుడైనవాడు అప్రయత్నముగా మైథునసుఖ ఆకర్షణ నుండి బయటపడును.ఆ కారణముననే గృహస్థ బ్రహ్మచారికి నియమితమగు మైథునసుఖము ఆమోదింపబడినది. భగవద్గీత (2.59) యందు ఇదే విషయము ఇట్లు చెప్పబడినది.
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహిన: |
రసవర్ణం రసో(ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||
ఇతరులు బలవంతముగా తమను ఇంద్రియభోగము నుండి నియమించుకొనుచుండగా భక్తులు తమ ఉన్నత రసాస్వాదన కారణముగా అప్రయత్నముగా ఇంద్రియభోగముల నుండి దూరులగుచున్నారు. భక్తులు తప్ప అన్యులకు ఆ దివ్యరసాస్వాదనపు జ్ఞానము ఏమాత్రము ఉండదు.
సంపూర్ణముగా కృష్ణభక్తిభావన యందు నిలివనిదే ఎవ్వరును అభయత్వమును పొందలేరని “విగతభీ:” యను పదము సూచించుచున్నది. తన వికృతస్మృతి (తనకు కృష్ణునితో గల సంబంధమును మరచుట) కారణముననే బద్ధజీవుడు భయాతురుడై యుండును. “భయం ద్వితీయాభినివేశత: స్యాద్ ఈశాదాపేతస్య విపర్యయో(స్మృతి:” అని శ్రీమద్భాగవతము (11.2.37) పలుకుచున్నది. అనగా కృష్ణభక్తిరసభావనమే భయరాహిత్యమునకు మూలమై యున్నది. కనుకనే కృష్ణభక్తునకు సమగ్రాభ్యాసము సాధ్యమై యున్నది. అంతియేగాక యోగాభ్యాసపు ముఖ్యోద్దేశ్యము హృదయస్థుడైన పరమాత్ముని దర్శించుటయే గనుక యోగులందరిలోను అతడు ఉత్తముడగుచున్నాడు ఇచ్చట తెలుపబడిన యోగపధ్ధతి నియమములు జనాదరణ పొందిన నామమాత్ర యోగసమాజముల నియమములకు భిన్నములై యున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 231 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 13, 14 🌴
13. samaṁ kāya-śiro-grīvaṁ
dhārayann acalaṁ sthiraḥ
samprekṣya nāsikāgraṁ svaṁ
diśaś cānavalokayan
14.praśāntātmā vigata-bhīr
brahmacāri-vrate sthitaḥ
manaḥ saṁyamya mac-citto
yukta āsīta mat-paraḥ
🌷 Translation :
One should hold one’s body, neck and head erect in a straight line and stare steadily at the tip of the nose. Thus, with an unagitated, subdued mind, devoid of fear, completely free from sex life, one should meditate upon Me within the heart and make Me the ultimate goal of life.
🌹 Purport :
The goal of life is to know Kṛṣṇa, who is situated within the heart of every living being as Paramātmā, the four-handed Viṣṇu form. The yoga process is practiced in order to discover and see this localized form of Viṣṇu, and not for any other purpose. The localized viṣṇu-mūrti is the plenary representation of Kṛṣṇa dwelling within one’s heart. One who has no program to realize this viṣṇu-mūrti is uselessly engaged in mock yoga practice and is certainly wasting his time. Kṛṣṇa is the ultimate goal of life, and the viṣṇu-mūrti situated in one’s heart is the object of yoga practice. To realize this viṣṇu-mūrti within the heart, one has to observe complete abstinence from sex life; therefore one has to leave home and live alone in a secluded place, remaining seated as mentioned above. One cannot enjoy sex life daily at home or elsewhere and attend a so-called yoga class and thus become a yogī. One has to practice controlling the mind and avoiding all kinds of sense gratification, of which sex life is the chief. In the rules of celibacy written by the great sage Yājñavalkya it is said:
karmaṇā manasā vācā
sarvāvasthāsu sarvadā
sarvatra maithuna-tyāgo
brahmacaryaṁ pracakṣate
“The vow of brahmacarya is meant to help one completely abstain from sex indulgence in work, words and mind – at all times, under all circumstances and in all places.” No one can perform correct yoga practice through sex indulgence. Brahmacarya is taught, therefore, from childhood, when one has no knowledge of sex life. Children at the age of five are sent to the guru-kula, or the place of the spiritual master, and the master trains the young boys in the strict discipline of becoming brahmacārīs. Without such practice, no one can make advancement in any yoga, whether it be dhyāna, jñāna or bhakti. One who, however, follows the rules and regulations of married life, having a sexual relationship only with his wife (and that also under regulation), is also called a brahmacārī. Such a restrained householder brahmacārī may be accepted in the bhakti school, but the jñāna and dhyāna schools do not even admit householder brahmacārīs. They require complete abstinence without compromise. In the bhakti school, a householder brahmacārī is allowed controlled sex life because the cult of bhakti-yoga is so powerful that one automatically loses sexual attraction, being engaged in the superior service of the Lord. In the Bhagavad-gītā (2.59) it is said:
viṣayā vinivartante
nirāhārasya dehinaḥ
rasa-varjaṁ raso ’py asya
paraṁ dṛṣṭvā nivartate
Whereas others are forced to restrain themselves from sense gratification, a devotee of the Lord automatically refrains because of superior taste. Other than the devotee, no one has any information of that superior taste.
Vigata-bhīḥ. One cannot be fearless unless one is fully in Kṛṣṇa consciousness. A conditioned soul is fearful due to his perverted memory, his forgetfulness of his eternal relationship with Kṛṣṇa. The Bhāgavatam (11.2.37) says, bhayaṁ dvitīyābhiniveśataḥ syād īśād apetasya viparyayo ’smṛtiḥ. Kṛṣṇa consciousness is the only basis for fearlessness. Therefore, perfect practice is possible for a person who is Kṛṣṇa conscious. And since the ultimate goal of yoga practice is to see the Lord within, a Kṛṣṇa conscious person is already the best of all yogīs. The principles of the yoga system mentioned herein are different from those of the popular so-called yoga societies.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 29/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 232: 06వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 232: Chap. 06, Ver. 15
🌹. శ్రీమద్భగవద్గీత - 232 / Bhagavad-Gita - 232 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 15 🌴
15. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస: |
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి ||
🌷. తాత్పర్యం :
దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము మియమించుచు యోగియైనవాడు నియమితమనస్సు కలవాడై భౌతికస్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును (కృష్ణధామమును) పొందును.
🌷. భాష్యము :
యోగాభ్యాసపు అంతిమలక్ష్యము ఇప్పుడు స్పష్టముగా వివరింపబడినది. అట్టి యోగాభ్యాసము ఎటువంటి భౌతికసౌక్యకరము పొందుట కొరకు గాక భౌతికస్థితి నుండి ముక్తిని పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్యవృద్ధి చేసికొనుటకు లేదా ఏదేని సిద్ధిని పొందుటకు యత్నించువాడు గీత ప్రకారము యోగి కానేరడు. అలాగుననే భౌతికస్థితి నుండి విరమణము మనుజుని “శూన్యము” నందు ప్రవేశింపజేయదు. నిజమునకు అట్టి భావన మిథ్యయై యున్నది. భగవానుని సృష్టిలో ఎచ్చటను శూన్యమనునది లేదు. వాస్తవమునాకు భౌతికస్థితి నుండి ముక్తి మనుజిని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామమునకు చేర్చగలదు. సూర్యచంద్రులు లేదా విద్యుత్తు యొక్క అవసరము లేని అట్టి భగవద్ధామము భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ఆధ్యాత్మికజగము నందు యాని లోకములు కూడా భౌతికాకాశము నందలి సూర్యుని వలె స్వయంప్రకాశమానములై యుండును. సృష్టియంతయు భగవద్రాజ్యమేయైనను, ఆధ్యాత్మికాకాశము మరియు దాని యందలి లోకములు మాత్రము పరంధామమని పిలువబడును.
కృష్ణుని గూర్చిన సంపూర్ణజ్ఞానమును కలిగిన పూర్ణయోగి ఆ భగవానుడు స్వయముగా ఇచ్చట తెలిపిన రీతి (మచ్చిత్త:, మత్పర:, మత్స్థానం) నిజమైన శాంతిని పొంది, అంత్యమున గోలోకబృందావనమని తెలియబడు దివ్యమైన కృష్ణలోకమును చేరగలడు. “గోలోక ఏవ నివసిలాత్మభూత: శ్రీకృష్ణుభగవానుడు తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించియున్నను, తన దివ్యశక్తులచే సర్వత్రా వ్యాపించియున్న పరబ్రహ్మముగా మరియు సర్వజీవహృదయస్థుడైన పరమాత్మగా తెలియబడుచున్నాడు” అని బ్రహ్మసంహిత (5.37) తెలియజేయుచున్నది. అట్టి శ్రీకృష్ణభగవానుని సంపూర్ణావగాహనము మరియు అతని సంపూర్ణాంశయైన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవ్వరును ఆధ్యాత్మికజగత్తునందు గాని (వైకుంటాము) లేదా భగవద్ధామమునందు గాని (గోలోకబృందావనము) ప్రవేశింపలేరు. కనుకనే కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించువాడు తన మనస్సు కృష్ణపరములగు కర్మల యందు సంలగ్నమై యుండుటచే శ్రేష్టుడైన యోగి యనబడును ( సవై మన: కృష్ణపదారవిందయో:). అంతియేగాక “తమేవ విదిత్వాతిమృత్యుమేతి – దేవదేవుడైన శ్రీకృష్ణుని తెలియుట ద్వారానే జన్మమృత్యువులను అధిగమింపవచ్చును” అని వేదము (శ్వేతాశ్వతరోపనిషత్తు 3.8) మనకు తెలియజేయుచున్నది. అనగా భౌతికస్థితి నుండి ముక్తిని బడయుటయే యోగపూర్ణత్వ మనబడును. అమాయకప్రజలను మోసపుచ్చు ఇంద్రజాలము గాని, వ్యాయామ ప్రదర్శనము గాని యోగపూర్ణత్వము కానేరదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 232 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 15 🌴
15. yuñjann evaṁ sadātmānaṁ
yogī niyata-mānasaḥ
śāntiṁ nirvāṇa-paramāṁ
mat-saṁsthām adhigacchati
🌷 Translation :
Thus practicing constant control of the body, mind and activities, the mystic transcendentalist, his mind regulated, attains to the kingdom of God [or the abode of Kṛṣṇa] by cessation of material existence.
🌹 Purport :
The ultimate goal in practicing yoga is now clearly explained. Yoga practice is not meant for attaining any kind of material facility; it is to enable the cessation of all material existence. One who seeks an improvement in health or aspires after material perfection is no yogī according to Bhagavad-gītā. Nor does cessation of material existence entail one’s entering into “the void,” which is only a myth. There is no void anywhere within the creation of the Lord. Rather, the cessation of material existence enables one to enter into the spiritual sky, the abode of the Lord. The abode of the Lord is also clearly described in the Bhagavad-gītā as that place where there is no need of sun, moon or electricity. All the planets in the spiritual kingdom are self-illuminated like the sun in the material sky. The kingdom of God is everywhere, but the spiritual sky and the planets thereof are called paraṁ dhāma, or superior abodes.
A consummate yogī, who is perfect in understanding Lord Kṛṣṇa, as is clearly stated herein by the Lord Himself (mat-cittaḥ, mat-paraḥ, mat-sthānam), can attain real peace and can ultimately reach His supreme abode, Kṛṣṇaloka, known as Goloka Vṛndāvana. In the Brahma-saṁhitā (5.37) it is clearly stated, goloka eva nivasaty akhilātma-bhūtaḥ: the Lord, although residing always in His abode called Goloka, is the all-pervading Brahman and the localized Paramātmā as well by dint of His superior spiritual energies. No one can reach the spiritual sky (Vaikuṇṭha) or enter into the Lord’s eternal abode (Goloka Vṛndāvana) without the proper understanding of Kṛṣṇa and His plenary expansion Viṣṇu. Therefore a person working in Kṛṣṇa consciousness is the perfect yogī, because his mind is always absorbed in Kṛṣṇa’s activities (sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ). In the Vedas also (Śvetāśvatara Upaniṣad 3.8) we learn, tam eva viditvāti mṛtyum eti: “One can overcome the path of birth and death only by understanding the Supreme Personality of Godhead, Kṛṣṇa.” In other words, perfection of the yoga system is the attainment of freedom from material existence and not some magical jugglery or gymnastic feats to befool innocent people.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 30/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 233: 06వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 233: Chap. 06, Ver. 16
🌹. శ్రీమద్భగవద్గీత - 233 / Bhagavad-Gita - 233 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 16 🌴
16. నాట్యనాత్యశ్నతస్తు యోగో(స్తి న చైకాన్తమనశ్నత: |
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! అతిగా భుజించువానికి లేదా అతితక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేనివానికి యోగి యగుటకు అవకాశము లేదు.
🌷. భాష్యము :
ఆహారము మరియు నిద్రయందు నియమము ఇచ్చట యోగులకు నిర్దేశింపబడుచున్నది. అధికముగా భుజించుట యనగా దేహపోషణకు అవసరమైనదాని కన్నాను అధికముగా భుజించుటని భావము. సమృద్ధిగా ధాన్యము, కూరగాయలు, ఫలములు, పాలు లభించుచున్నందున మనుజుల జంతుమాంసము తిననవసరము లేదు. శ్రీమద్భగవద్గీత ప్రకారము అట్టి సరళమగు ఆహారము సాత్వికమైనట్టిది. మాంసాహారము తమోగుణప్రధానులకు ఉద్దేశింపబడినది. కావున మాంసాహారము, మద్యపానము, ధూమపానము చేయుచు కృష్ణునకు అర్పింపని ఆహారమును గ్రహించువారు తాము పాపమునే భుజించుటచే పాపకర్మల ఫలములను అనుభవింపవలసివచ్చును. “భుంజతే తే త్వఘం పాపా: యే పచన్త్యాత్మకారణాత్ – ఎవరైతే కృష్ణునికి అర్పింపక తమ ప్రీత్యర్థమే ఆహారమును స్వీకరింతురో లేక తయారుచేకొందురో అట్టివారు పాపమునే భుజించువారు కాగలరు.” పాపమును భుజించువాడు మరియు అతిగా భుజించువాడు పూర్ణయోగమును అభ్యసింపలేడు. కనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమును భుజించుటయే సర్వులకు ఉత్తమము. కృష్ణభక్తిభావన యందున్నవాడు తొలుత కృష్ణునికి అర్పింపబడని ఆహారమును దేనిని కూడా స్వీకరింపడు. కనుక కృష్ణభక్తిరసభావితుడే యోగాభ్యాసమునందు పూర్ణత్వమును పొందగలడు. అట్లుగాక కేవలము తనకు తోచిన విధముగా ఉపవాసముండి కృత్రిమముగా ఆహారమును విడిచి యోగమభ్యసించువాడు ఎన్నడును యోగమునందు పూర్ణుడు కాలేడు. కృష్ణభక్తిపరాయణుడు శాస్త్రములలో తెలిపినరీతి ఉపవాసమును అవలంబించును. అతడు అధికముగా భుజించుట లేదా అతిగా ఉపవసించుట చేయనందున యోగాభ్యాసమును చక్కగా పాటించగలడు. అధికముగా భుజించువానికి స్వప్నములు ఎక్కువగా వచ్చుచున్నందున అధికసమయము నిద్రించును. వాస్తవమునకు మనుజుడు ఆరుగంటల కన్నాను అధికముగా నిద్రపోరాదు. ఆ విధముగా రోజులో ఆరుగంటల కన్నను అధికముగా నిద్రించువాడు తమోగుణముచే ప్రభావితుడైనట్టివాడే. తమోగుణప్రధానుడు మందుడై, అధికముగా నిద్రించును. అట్టివాడు ఎన్నడును యోగమును నిర్వహింపలేడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 233 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 16 🌴
16. nāty-aśnatas tu yogo ’sti
na caikāntam anaśnataḥ
na cāti-svapna-śīlasya
jāgrato naiva cārjuna
🌷 Translation :
There is no possibility of one’s becoming a yogī, O Arjuna, if one eats too much or eats too little, sleeps too much or does not sleep enough.
🌹 Purport :
Regulation of diet and sleep is recommended herein for the yogīs. Too much eating means eating more than is required to keep the body and soul together. There is no need for men to eat animals, because there is an ample supply of grains, vegetables, fruits and milk. Such simple foodstuff is considered to be in the mode of goodness according to the Bhagavad-gītā. Animal food is for those in the mode of ignorance. Therefore, those who indulge in animal food, drinking, smoking and eating food which is not first offered to Kṛṣṇa will suffer sinful reactions because of eating only polluted things. Bhuñjate te tv aghaṁ pāpā ye pacanty ātma-kāraṇāt. Anyone who eats for sense pleasure, or cooks for himself, not offering his food to Kṛṣṇa, eats only sin. One who eats sin and eats more than is allotted to him cannot execute perfect yoga. It is best that one eat only the remnants of foodstuff offered to Kṛṣṇa. A person in Kṛṣṇa consciousness does not eat anything which is not first offered to Kṛṣṇa. Therefore, only the Kṛṣṇa conscious person can attain perfection in yoga practice. Nor can one who artificially abstains from eating, manufacturing his own personal process of fasting, practice yoga. The Kṛṣṇa conscious person observes fasting as it is recommended in the scriptures. He does not fast or eat more than is required, and he is thus competent to perform yoga practice. One who eats more than required will dream very much while sleeping, and he must consequently sleep more than is required. One should not sleep more than six hours daily. One who sleeps more than six hours out of twenty-four is certainly influenced by the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 31/Dec/2019
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 234: 06వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 234: Chap. 06, Ver. 17
🌹. శ్రీమద్భగవద్గీత - 234 / Bhagavad-Gita - 234 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 17 🌴
17. యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ||
🌷. తాత్పర్యం :
నియమితులైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతికక్లేశములను శమింపజేసికొనగలడు.
🌷. భాష్యము :
దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములందు అతి యనునది యోగాభ్యాసము నందు పురోభివృద్ధిని ఆటంకపరచును. శ్రీకృష్ణభగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాదరూపమున స్వీకరించుట ద్వారా ఆహారవిషయము నియమింపబడగలదు. భగవద్గీత (9.26) ప్రకారము కురగాయలు, పుష్పములు, ఫలములు, ధ్యానము, పాలు మొదలుగునవి శ్రీకృష్ణునకు అర్పింపవచ్చును. ఈ విధముగా కృష్ణభక్తిభావన యందున్నవాడు మానవుల స్వీకరించుటకు పనికిరాణి ఆహారమును (సత్త్వగుణమునందు లేనటువంటి ఆహారములను) స్వీకరింపకుండుట యందు అప్రయత్నముగానే శిక్షుతుడు లేదా నేర్పరి కాగలడు. కృష్ణభక్తిపరాయణుడు కృష్ణపరకర్మలను చేయుట యందు సదా జాగరూకుడై యుండును. నిద్ర యందు అధికముగా కాలమును వ్యర్థము చేయుట గొప్ప నష్టమే కాగలదు (అవ్యర్థ కాలత్వమ్). అట్టి భక్తుడు భక్తియుతసేవ లేకుండా క్షణకాలము వృథాయగుటయు సహింపలేడు. కనుకనే అతడు నిద్రకు అతి తక్కువ సమయమును కేటాయించును. ఈ విషయమున అతనికి శ్రీరూపగోస్వామి అత్యంత ఆదర్శనియులై యున్నారు. శ్రీకృష్ణుని దివ్యసేవలో రతులై యుండి ఆయన రోజుకు రెండుగంటలు మాత్రమే నిద్రించెడివారు. కొన్నిమార్లు ఆమాత్రమును ఆయన నిద్రించెడివారు కారు. హరిదాసఠాకూరు తన నిత్యనియమమైన మూడులక్షల హరినామజపము పూర్తికానిదే ప్రసాదమును స్వీకరించుట గాని లేదా క్షణకాలము నిద్రించుట గాని చేసెడివారు కారు. ఇక కర్మ విషమమున కృష్ణభక్తిపరాయణుడు కృష్ణపరములు కానటువంటి కర్మలేవియును చేయకున్నందున అతని కర్మము సదా నియమింపబడి ఇంద్రియభోగభావనచే కలుషితము కాకుండును. ఇంద్రియభోగమనెడి ప్రశ్నయే లేనందున కృష్ణభక్తిరసభావితునికి భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దేహకర్మలన్నియును నియమితులై యున్నందున కృష్ణభక్తిపరాయణునికి భౌతికక్లేశము లేవియును లేకుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 234 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 17 🌴
17. yuktāhāra-vihārasya
yukta-ceṣṭasya karmasu
yukta-svapnāvabodhasya
yogo bhavati duḥkha-hā
🌷 Translation :
He who is regulated in his habits of eating, sleeping, recreation and work can mitigate all material pains by practicing the yoga system.
🌹 Purport :
Extravagance in the matter of eating, sleeping, defending and mating – which are demands of the body – can block advancement in the practice of yoga. As far as eating is concerned, it can be regulated only when one is practiced to take and accept prasādam, sanctified food. Lord Kṛṣṇa is offered, according to the Bhagavad-gītā (9.26), vegetables, flowers, fruits, grains, milk, etc. In this way, a person in Kṛṣṇa consciousness becomes automatically trained not to accept food not meant for human consumption, or not in the category of goodness. As far as sleeping is concerned, a Kṛṣṇa conscious person is always alert in the discharge of his duties in Kṛṣṇa consciousness, and therefore any unnecessary time spent sleeping is considered a great loss. Avyartha-kālatvam: a Kṛṣṇa conscious person cannot bear to pass a minute of his life without being engaged in the service of the Lord. Therefore, his sleeping is kept to a minimum. His ideal in this respect is Śrīla Rūpa Gosvāmī, who was always engaged in the service of Kṛṣṇa and who could not sleep more than two hours a day, and sometimes not even that. Ṭhākura Haridāsa would not even accept prasādam nor even sleep for a moment without finishing his daily routine of chanting with his beads three hundred thousand names. As far as work is concerned, a Kṛṣṇa conscious person does not do anything which is not connected with Kṛṣṇa’s interest, and thus his work is always regulated and is untainted by sense gratification. Since there is no question of sense gratification, there is no material leisure for a person in Kṛṣṇa consciousness. And because he is regulated in all his work, speech, sleep, wakefulness and all other bodily activities, there is no material misery for him.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 01/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 235: 06వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 235: Chap. 06, Ver. 18
🌹. శ్రీమద్భగవద్గీత - 235 / Bhagavad-Gita - 235 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 18 🌴
18. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్టతే |
నిస్పృహ: సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ||
🌷. తాత్పర్యం :
యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలనన్నింటిని నియమించి, విషయకోరికల రహితమైన ఆధ్యాత్మికస్థితి యందు నిలిచినప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును.
🌷. భాష్యము :
సమస్తమగు విషయకోరికల నుండి (వాటిలో ముఖ్యమైనది మైథునసుఖము) విరమణ పొందియుండుటనెడి విషయము ద్వారా యోగికర్మలను సాధారణజనుల కర్మల నుండి వేరుపరుపవచ్చును. తన మనోకర్మలను చక్కగా నియమించిన సంపూర్ణయోగి ఏ విధమైన విషయకోరికల చేతను కలతకు గురికాడు. శ్రీమద్భాగవతము (9.4.18-20) తెలుపబడినట్లు అట్టి పూర్ణత్వస్థితి కృష్ణభక్తిభావన యందున్నవారిచే అప్రయత్నముగా పొందబడును.
స వై మన: కృష్ణపదారవిన్దయో:
వచాంసి వైకుంఠగుణానువర్ణనే |
కరౌ హరేర్ మన్దిరమార్జనాదిషు
శ్రుతిం చకారాచ్యుతసత్కథోదయే ||
ముకున్దలింగాలయదర్శనే దృశా
తద్భృత్యగాత్రస్పర్శే(జ్గ్ సజ్జ్ఞమమ్ |
ఘ్రాణం చ తత్పాదసరోజసౌరభే
శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే ||
పాదౌ హరే: క్షేత్రపదానుసర్పణే
శిరో హృషీ కేశపదాభివన్దనే |
కామం చ దాస్యే న తు కామకామ్యయా
యథోత్తమశ్లోకజనాశ్రయా రతి: ||
“మహారాజు అంబరీషుడు తన మనస్సును శ్రీకృష్ణుని చరణకమలముల చెంత నియుక్తము చేసెను. అతడు తన పలుకులను ఆ దేవదేవుని దివ్యగుణములను వర్ణించుట యందును, తన హస్తములను శ్రీహరి మందిరములను శుభ్రము చేయుట యందును, తన కర్ణములను అచ్యుతిని కర్మలను శ్రవణము చేయుట యందును, తన చక్షువులను ముకుందుని దివ్యరూపములను వీక్షించు యందును, తన దేహమును భక్తుల దేహములను స్పృశించుట యందును, తన నాసికను శ్రీకృష్ణభాగావానునికిని అర్పింపబడిన కలువపూలను వాసన చూచుట యందును, తన జిహ్వను ఆ భగవానుని చరణకమలములకు అర్పించిన తులసీదళములను రుచిచూచుట యందును, తన పాదములను శ్రీహరి తీర్థస్థలములకు మరియు మందిరములకు పోవుట యందును, తన శిరమును హృషీకేశునికి వందనమొనర్చుట యందును, తన కోరికలను ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణుని కార్యములను నిర్వహించుట యందును నియోగించును. అతని ఈ దివ్యకార్యములన్నియును శుద్ధభక్తులకు తగినవై యున్నవి.”
నిరాకారమార్గమును అవలంబించువారికి ఇట్టి ఆధ్యాత్మికస్థితి అనిర్వచనీయము, ఊహాతీతమైనను కృష్ణభక్తిభావనలో నున్నవారికి సులభము మరియు ఆచరణీయమై యున్నది. ఈ విషయము పైన వర్ణింపబడిన అంబరీషుని కార్యముల ద్వారా విదితమగుచున్నది. నిత్యస్మరణము ద్వారా శ్రీకృష్ణభగవానుని చరణకమలముల చెంత మనస్సు లగ్నము కానిదే అట్టి ఆధ్యాత్మిక కర్మలు ఆచరణీయములు కాజాలవు. కనుకనే శ్రీకృష్ణుని భక్తియుతసేవ యందలి కర్మలు “అర్చనము” (ఇంద్రియముల నన్నింటిని శ్రీకృష్ణభగవానుని సేవలో నియుక్తముచేయుట) అనబడును. వాస్తవమునాకు మనస్సునకు, ఇంద్రియములకు ఏదియో ఒక వ్యాపకముండవలెను. వాటిని వ్యాపకరహతము చేయుటన్నది ఆచరణీయమైనది కాదు. కనుకనే సామాన్యజనులకు, ముఖ్యముగా సన్న్యాసాశ్రమమున లేనివారికి, పైన తెలుపబడినటువంటి దివ్యమైన ఇంద్రియ, మనోవ్యాపకము ఆధ్యాత్మికానుభవ ప్రాప్తికై చక్కని విధానమై యున్నది. అదియే “యుక్తము” అని భగవద్గీత యందు తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 235 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 18 🌴
18. yadā viniyataṁ cittam
ātmany evāvatiṣṭhate
nispṛhaḥ sarva-kāmebhyo
yukta ity ucyate tadā
🌷 Translation :
When the yogī, by practice of yoga, disciplines his mental activities and becomes situated in transcendence – devoid of all material desires – he is said to be well established in yoga.
🌹 Purport :
The activities of the yogī are distinguished from those of an ordinary person by his characteristic cessation from all kinds of material desires – of which sex is the chief. A perfect yogī is so well disciplined in the activities of the mind that he can no longer be disturbed by any kind of material desire. This perfectional stage can automatically be attained by persons in Kṛṣṇa consciousness, as stated in the Śrīmad-Bhāgavatam (9.4.18–20):
sa vai manaḥ kṛṣṇa-padāravindayor
vacāṁsi vaikuṇṭha-guṇānuvarṇane
karau harer mandira-mārjanādiṣu
śrutiṁ cakārācyuta-sat-kathodaye
mukunda-liṅgālaya-darśane dṛśau
tad-bhṛtya-gātra-sparśe ’ṅga-saṅgamam
ghrāṇaṁ ca tat-pāda-saroja-saurabhe
śrīmat-tulasyā rasanāṁ tad-arpite
pādau hareḥ kṣetra-padānusarpaṇe
śiro hṛṣīkeśa-padābhivandane
kāmaṁ ca dāsye na tu kāma-kāmyayā
yathottama-śloka-janāśrayā ratiḥ
“King Ambarīṣa first of all engaged his mind on the lotus feet of Lord Kṛṣṇa; then, one after another, he engaged his words in describing the transcendental qualities of the Lord, his hands in mopping the temple of the Lord, his ears in hearing of the activities of the Lord, his eyes in seeing the transcendental forms of the Lord, his body in touching the bodies of the devotees, his sense of smell in smelling the scents of the lotus flowers offered to the Lord, his tongue in tasting the tulasī leaf offered at the lotus feet of the Lord, his legs in going to places of pilgrimage and the temple of the Lord, his head in offering obeisances unto the Lord, and his desires in executing the mission of the Lord. All these transcendental activities are quite befitting a pure devotee.”
This transcendental stage may be inexpressible subjectively by the followers of the impersonalist path, but it becomes very easy and practical for a person in Kṛṣṇa consciousness, as is apparent in the above description of the engagements of Mahārāja Ambarīṣa. Unless the mind is fixed on the lotus feet of the Lord by constant remembrance, such transcendental engagements are not practical. In the devotional service of the Lord, therefore, these prescribed activities are called arcana, or engaging all the senses in the service of the Lord. The senses and the mind require engagements. Simple abnegation is not practical. Therefore, for people in general – especially those who are not in the renounced order of life – transcendental engagement of the senses and the mind as described above is the perfect process for transcendental achievement, which is called yukta in the Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 02/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 236: 06వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 236: Chap. 06, Ver. 19
🌹. శ్రీమద్భగవద్గీత - 236 / Bhagavad-Gita - 236 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 19 🌴
19. యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మన: ||
🌷. తాత్పర్యం :
గాలి లేని చోట నున్న దీపము నిశ్చలముగా నుండు రీతి, నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్త్వధ్యానమున సదా స్థిరుడై యుండును.
🌷. భాష్యము :
సదా దివ్యత్వమునందు రమించుచు తన పూజనీయ భగవానుని ధ్యానమున అచంచలముగా నిలుచు నిజమైన కృష్ణభక్తుడు గాలిలేని చోట నున్న దీపము వలె స్థిరముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 236 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 19 🌴
19. yathā dīpo nivāta-stho
neṅgate sopamā smṛtā
yogino yata-cittasya
yuñjato yogam ātmanaḥ
🌷 Translation :
As a lamp in a windless place does not waver, so the transcendentalist, whose mind is controlled, remains always steady in his meditation on the transcendent Self.
🌹 Purport :
A truly Kṛṣṇa conscious person, always absorbed in transcendence, in constant undisturbed meditation on his worshipable Lord, is as steady as a lamp in a windless place.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 03/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 237: 06వ అధ్., శ్లో 20 - 23 / Bhagavad-Gita - 237: Chap. 06, Ver. 20 - 23
🌹. శ్రీమద్భగవద్గీత - 237 / Bhagavad-Gita - 237 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 20 - 23 🌴
20. యాత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
యత్ర చైవాత్మనాత్మనం పశ్యన్నాత్మని తుష్యతి ||
21. సుఖమాత్యన్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వత: ||
22. యం లభ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత: |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||
23. తం విద్యాద్దు:ఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ||
🌷. తాత్పర్యం :
సమాధి యనబడు పూర్ణత్వస్థితిలో మనుజుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడియుండును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మ యందే ఆనందమును, సుఖమును అనుభవింపగలుగుట యను విషయమున మనుజుని సమర్థతను బట్టి అట్టి పూర్ణత్వస్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయస్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొందియుండును. ఆ విధముగా స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగక, దానిని మించిన వేరొక అధికలాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచినవాడు గొప్ప కష్టమునందైనను చలింపక యుండును. భౌతికసంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే.
🌷. భాష్యము :
యోగాభ్యాసము ద్వారా మనుజుడు క్రమముగా భౌతికభావనల నుండి ముక్తుడగును. ఇదియే యోగసిద్ధాంతపు ప్రధాన లక్షణము. తదుపరి మనుజుడు సమాధి యందు మగ్నుడగును. అనగా ఆత్మ పరమాత్మతో సమానమనెడి ఎట్టి అపోహలు లేకుండా, పవిత్రమైన మనోబుద్దులతో హృదయస్థ పరమాత్మను యోగి గుర్తించగలుగు స్థితియే సమాధి యనబడును. వాస్తవమునాకు యోగపధ్ధతి దాదాపు పతంజలి యోగానియమముల పైననే ఆధారపడియున్నది. కొందరు అప్రమానణిక వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించగా, అద్వైతులు అట్టిదానినే మోక్షమని భావింతురు. కాని వారందరు పతంజలి యోగపద్ధతి యందు దివ్యానందమును విషయము అంగీకరింపబడినను, అద్వైతులు ఆ విషయము అద్వైతసిద్ధాంతమందలి ఏకత్వమునకు భంగకరమని భయపడి అట్టి దివ్యానందమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞాత యను ద్వైతమును అద్వైతులు అంగీకరింపకున్నను, పవిత్రములైన ఇంద్రియముల ద్వారా అనుభవింపబడెడి దివ్యానందము ఈ శ్లోకము నందు అంగీకరింపబడినది. ఇదే విషయము యోగవిధానకర్తయైన పతంజలిముని చేతను ఆమోదింపబడినది. ఆ మహాముని “పురుషార్థశూన్యానాం గుణానాం ప్రతిప్రసవ: కైవల్యం స్వరూపప్రతిష్టా వా చితిశక్తిరితి” యని తన యోగసూత్రములలో (4.33) ప్రకటించియున్నాడు.
పై సూత్రమునందలి “చితశక్తి” లేదా “అంతరంగశక్తి” దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము, అంత్యమున భగవానునితో ఏకమగుటయైన మోక్షము అనునవియే పురుషార్థ మనబడును. ఈ పురుషార్థములలోని భగవదైక్యమే అద్వైతులచే కైవల్యమని పిలువబడును. కాని పతంజలి ముని ప్రకారం ఈ కైవల్యము అంతరంగశక్తి (ఆధ్యాత్మికశక్తి) అయియున్నది. దాని దవారా జీవుడు తన సహజస్థితి తెలిసికొనగలడు. శ్రీచైతన్యమాహాప్రభువు వాక్యములలో ఇదియే “చేతోదర్పణమార్జనము” లేదా చిత్తదర్పణ మాలిన్యమును తొలగించుకొను కార్యము. నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవమైన ముక్తియై (భవమహా దావాగ్ని నిర్వాపణం) యున్నది. నిర్వాణమను సిద్ధాంతము (ఇది కూడా ప్రాథమికమైనదే) ఈ సిద్ధాంతములలో ఏకీభవించుచున్నది. శ్రీమద్భాగవతము (2.10.6) నందు ఇది “స్వరుపేణ వ్యవస్థితి:” అని పిలువబడినది. అట్టి స్థితియే భగవద్గీత యందు కూడా ఈ శ్లోకమున నిర్ధారింపబడినది.
నిర్వాణము పిదప(భౌతికత్వము యొక్క విరమణ పిమ్మట) కృష్ణభక్తిరసభావనముగా తెలియబడు శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవ (ఆధ్యాత్మికకర్మలు) ఆరంభమ్మగును. శ్రీమద్భాగవతము ప్రకారము అదియే జీవుని నిజస్థితియై యున్నది (స్వరూపేణ వ్యవస్థితి:). అట్టి జీవుని ఆధ్యాత్మికజీవనస్థితి భౌతికత్వముచే కలుషితమైనప్పడు అది మాయా అనబడును. అట్టి భౌతికసంపర్కము నుండి ముక్తిని పొందుట జీవుని ఆదియైన నిత్యస్థితిని నశింపజేయుట కాదు. “కైవల్యం స్వరూపపప్రతిష్టా వా చితిశక్తిరితి” యని తన వాక్యముల ద్వారా పతంజలి మునియు దీనిని ఆమోదించియున్నారు. ఈ చితశక్తియే(దివ్యానందము) నిజమైన జీవనస్థితియై యున్నది. “ఆనందమయో(భ్యాసాత్” యని వేదాంతసూత్రములందు (1.1.12) సైతము ఇది నిర్ధారింపబడినది. ఈ సహజ దివ్యానందమే యోగపు చరమలక్ష్యమై భక్తియోగము ద్వారా అతిసులభముగా పొందబడుచున్నది. ఈ భక్తియోగము భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున విస్తారముగా వివరింపబడినది.
ఈ అధ్యాయమున వివరింపబడినట్లు యోగపద్ధతిలో సంప్రజ్ఞాతసమాధి మరియు అసంప్రజ్ఞాత సమాధి యను రెండు విధములైన సమాధిస్థితులు కలవు. వివిధములైన తాత్విక పరిశీలనచే ఎవ్వరేని ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియున్నచో అతడు సంప్రజ్ఞాత సమాధిని సాధించినట్లు చెప్పబడును.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 237 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 20 - 23 🌴
20. yatroparamate cittaṁ
niruddhaṁ yoga-sevayā
yatra caivātmanātmānaṁ
paśyann ātmani tuṣyati
21. sukham ātyantikaṁ yat tad
buddhi-grāhyam atīndriyam
vetti yatra na caivāyaṁ
sthitaś calati tattvataḥ
22. yaṁ labdhvā cāparaṁ lābhaṁ
manyate nādhikaṁ tataḥ
yasmin sthito na duḥkhena
guruṇāpi vicālyate
23. taṁ vidyād duḥkha-saṁyoga-
viyogaṁ yoga-saṁjñitam
🌷 Translation :
In the stage of perfection called trance, or samādhi, one’s mind is completely restrained from material mental activities by practice of yoga. This perfection is characterized by one’s ability to see the Self by the pure mind and to relish and rejoice in the Self. In that joyous state, one is situated in boundless transcendental happiness, realized through transcendental senses. Established thus, one never departs from the truth, and upon gaining this he thinks there is no greater gain. Being situated in such a position, one is never shaken, even in the midst of greatest difficulty. This indeed is actual freedom from all miseries arising from material contact.
🌹 Purport :
By practice of yoga one becomes gradually detached from material concepts. This is the primary characteristic of the yoga principle. And after this, one becomes situated in trance, or samādhi, which means that the yogī realizes the Supersoul through transcendental mind and intelligence, without any of the misgivings of identifying the self with the Superself. Yoga practice is more or less based on the principles of the Patañjali system. Some unauthorized commentators try to identify the individual soul with the Supersoul, and the monists think this to be liberation, but they do not understand the real purpose of the Patañjali system of yoga. There is an acceptance of transcendental pleasure in the Patañjali system, but the monists do not accept this transcendental pleasure, out of fear of jeopardizing the theory of oneness. The duality of knowledge and knower is not accepted by the nondualist, but in this verse transcendental pleasure – realized through transcendental senses – is accepted. And this is corroborated by Patañjali Muni, the famous exponent of the yoga system. The great sage declares in his Yoga-sūtras (4.33): puruṣārtha-śūnyānāṁ guṇānāṁ pratiprasavaḥ kaivalyaṁ svarūpa-pratiṣṭhā vā citi-śaktir iti.
This citi-śakti, or internal potency, is transcendental. Puruṣārtha means material religiosity, economic development, sense gratification and, at the end, the attempt to become one with the Supreme. This “oneness with the Supreme” is called kaivalyam by the monist. But according to Patañjali, this kaivalyam is an internal, or transcendental, potency by which the living entity becomes aware of his constitutional position. In the words of Lord Caitanya, this state of affairs is called ceto-darpaṇa-mārjanam, or clearance of the impure mirror of the mind. This “clearance” is actually liberation, or bhava-mahā-dāvāgni-nirvāpaṇam. The theory of nirvāṇa – also preliminary – corresponds with this principle. In the Bhāgavatam (2.10.6) this is called svarūpeṇa vyavasthitiḥ. The Bhagavad-gītā also confirms this situation in this verse.
After nirvāṇa, or material cessation, there is the manifestation of spiritual activities, or devotional service to the Lord, known as Kṛṣṇa consciousness. In the words of the Bhāgavatam, svarūpeṇa vyavasthitiḥ: this is the “real life of the living entity.” Māyā, or illusion, is the condition of spiritual life contaminated by material infection. Liberation from this material infection does not mean destruction of the original eternal position of the living entity. Patañjali also accepts this by his words kaivalyaṁ svarūpa-pratiṣṭhā vā citi-śaktir iti. This citi-śakti, or transcendental pleasure, is real life.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Date: 04/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 238: 06వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 238: Chap. 06, Ver. 24
🌹. శ్రీమద్భగవద్గీత - 238 / Bhagavad-Gita - 238 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 24 🌴
24. స నిశ్చయేన యోక్తవ్యో యోగోనిర్విణ్ణ చేతసా |
సంకల్పప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వాన శేషత: |
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్యసమన్తత: ||
🌷. తాత్పర్యం :
స్థిరనిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగము నభ్యసించుచు మనుజుడు ఆ మార్గము నుండు వైదొలగక యుండవలెను. మానసికకల్పనల నుండి ఉత్పన్నమైన విషయకోరికల నన్నింటిని ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి, అతడు మనస్సు ద్వారా ఇంద్రియములను అన్నివైపుల నుండి నియమింపవలెను.
🌷. భాష్యము :
యోగము నభ్యసించువాడు స్థిరనిశ్చయము కలిగి ఏమాత్రము మార్గము నుండి వైదొలగకే ఓపికగా తన అభ్యాసమును కొనసాగింపవలెను. అంతిమవిజయము నెడ విశ్వాసమును కలిగియుండి, గొప్ప పట్టుదలతో తన పనిని నిర్వహింపవలెను. విజయము లభించుట యందు ఆలస్యమైనచో అతడెన్నడును నిరాశ చెందరాదు. నిష్ఠతో అభ్యాసము కావించువానికి విజయము తథ్యమై యుండును. శ్రీరూపగోస్వామి భక్తియోగమును గూర్చి ఈ విధముగా పలికియుండిరి.
ఉత్సాహా న్నిశ్చయాద్ధైర్యాత్ తత్తత్కర్మప్రవర్తనాత్ |
సంగత్యగాత్ సతో వృత్తే: షడ్భిర్భక్తి: ప్రసిధ్యతి ||
“ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము, భక్తుల సమక్షములో విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట మరియు సత్వగుణకార్యములందే సంపూర్ణముగా నిమగ్నమగుట ద్వారా భక్తియోగమును మనుజుడు విజయవంతముగా నిర్వహింపగలడు.” (ఉపదేశామృతము 3)
యోగాభ్యాశము, ముఖ్యముగా కృష్ణభక్తిరసభావన యందు నిర్వహింపబడెడి భక్తియోగము అతికటినమైనదిగా తోచవచ్చును. కాని దాని నియమములను నిశ్చయముగా పాటించువారికి శ్రీకృష్ణభగవానుడు తప్పక సహాయమును గూర్చును. తనకు తాను సహాయము చేసికొనెడివానికి భగవానుని సహాయము లభించుచున్నది తెలిసిన విషయమే కదా!
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 238 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 24 🌴
24. sa niścayena yoktavyo
yogo ’nirviṇṇa-cetasā
saṅkalpa-prabhavān kāmāṁs
tyaktvā sarvān aśeṣataḥ
manasaivendriya-grāmaṁ
viniyamya samantataḥ
🌷 Translation :
One should engage oneself in the practice of yoga with determination and faith and not be deviated from the path. One should abandon, without exception, all material desires born of mental speculation and thus control all the senses on all sides by the mind.
🌹 Purport :
The yoga practitioner should be determined and should patiently prosecute the practice without deviation. One should be sure of success at the end and pursue this course with great perseverance, not becoming discouraged if there is any delay in the attainment of success. Success is sure for the rigid practitioner. Regarding bhakti-yoga, Rūpa Gosvāmī says:
utsāhān niścayād dhairyāt
tat-tat-karma-pravartanāt
saṅga-tyāgāt sato vṛtteḥ
ṣaḍbhir bhaktiḥ prasidhyati
“One can execute the process of bhakti-yoga successfully with full-hearted enthusiasm, perseverance and determination, by following the prescribed duties in the association of devotees and by engaging completely in activities of goodness.” (Upadeśāmṛta 3)
Practice of yoga, especially bhakti-yoga in Kṛṣṇa consciousness, may appear to be a very difficult job. But if anyone follows the principles with great determination, the Lord will surely help, for God helps those who help themselves.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 05/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 239: 06వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 239: Chap. 06, Ver. 25
🌹. శ్రీమద్భగవద్గీత - 239 / Bhagavad-Gita - 239 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 25 🌴
25. శనై: శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మన: కృత్వా న కించిదపి చిన్తయేత్ ||
🌷. తాత్పర్యం :
నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మనుజుడు సమాధిమగ్నుడు కావలెను. ఆ విధముగా మనస్సును ఆత్మ యందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు.
🌷. భాష్యము :
సరియైన నిశ్చయము మరియు బుద్ధి ద్వారా మనుజుడు ఇంద్రియకర్మల నుండి క్రమముగా విరమణను పొందవలెను. ఇదియే “ప్రత్యాహారము” అనబడును. అనగా నిశ్చయము, ధ్యానము, ఇంద్రియకర్మల నుండి విరమణ ద్వారా మనస్సును సమాధి యందు లగ్నము చేయవలెను. ఆ సమయమున భౌతికభావన యందు కూరుకొనిపోవుట యనెడి భయము ఏమాత్రము కలుగదు. వేరుమాటలలో దేహమున్నంతవరకు మనుజుడు భౌతికవిషయములను కూడియుండ వలసి వచ్చును ఇంద్రియతృప్తి భావనను మాత్రము కలిగియుండరాదు. శ్రీకృష్ణభగవానుని ప్రియమునకు అన్యమైన ప్రియమును గూర్చి అతడు చింతింపరాదు. ఇట్టి దివ్యస్థితి కృష్ణపరమగు కర్మల యందు ప్రత్యక్షముగా పాల్గొనుట ద్వారా సులభముగా ప్రాప్తించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 239 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 25 🌴
25. śanaiḥ śanair uparamed
buddhyā dhṛti-gṛhītayā
ātma-saṁsthaṁ manaḥ kṛtvā
na kiñcid api cintayet
🌷 Translation :
Gradually, step by step, one should become situated in trance by means of intelligence sustained by full conviction, and thus the mind should be fixed on the Self alone and should think of nothing else.
🌹 Purport :
By proper conviction and intelligence one should gradually cease sense activities. This is called pratyāhāra. The mind, being controlled by conviction, meditation and cessation from the senses, should be situated in trance, or samādhi. At that time there is no longer any danger of becoming engaged in the material conception of life. In other words, although one is involved with matter as long as the material body exists, one should not think about sense gratification. One should think of no pleasure aside from the pleasure of the Supreme Self. This state is easily attained by directly practicing Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 06/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 240: 06వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 240: Chap. 06, Ver. 26
🌹. శ్రీమద్భగవద్గీత - 240 / Bhagavad-Gita - 240 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 26 🌴
26. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్యన్యేవ వశం నయేత్ ||
🌷. తాత్పర్యం :
చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మ వశమునకు గొనిరావలెను.
🌷. భాష్యము :
చంచలత్వము, అస్థిరత్వమనునవి మనస్సు యొక్క స్వభావములు. కాని ఆత్మదర్శియైన యోగి అట్టి మనస్సును నియమింపవలెను. దానిచే అతడెన్నడును నియమింపబడరాదు. మనస్సును నియమించినవాడు (తద్ద్వారా ఇంద్రియములను నియమించినవాడు) గోస్వామి లేదా స్వామి యనబడును. అట్లుగాక మనస్సు చేతనే నియమింపబడెడివాడు గోదాసుడు లేదా ఇంద్రియదాసుడని పిలువబడును. ఇంద్రియముల వలన కలిగే ఆనందపు పరిమాణమును గోస్వామి ఎరిగియుండును. కనుకనే దివ్యానంద భావనలో అతని ఇంద్రియములు హృషీకేశుని (ఇంద్రియాధినేతయైన శ్రీకృష్ణుడు) సేవ యందు నియుక్తమై యుండును. ఆ విధముగా పవిత్రములైన ఇంద్రియములతో కృష్ణుని సేవించుటయే కృష్ణభక్తిరసభావనమనబడును.
ఇంద్రియములను అదుపులోనికి తెచ్చుటకు ఇదియే ఉత్తమమార్గము. యోగాభ్యాసపు అత్యున్నత పూర్ణత్వమైన దీనికి మించినది వేరొక్కటి లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 240 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 26 🌴
26. yato yato niścalati
manaś cañcalam asthiram
tatas tato niyamyaitad
ātmany eva vaśaṁ nayet
🌷 Translation :
From wherever the mind wanders due to its flickering and unsteady nature, one must certainly withdraw it and bring it back under the control of the Self.
🌹 Purport :
The nature of the mind is flickering and unsteady. But a self-realized yogī has to control the mind; the mind should not control him. One who controls the mind (and therefore the senses as well) is called gosvāmī, or svāmī, and one who is controlled by the mind is called go-dāsa, or the servant of the senses. A gosvāmī knows the standard of sense happiness. In transcendental sense happiness, the senses are engaged in the service of Hṛṣīkeśa, or the supreme owner of the senses – Kṛṣṇa. Serving Kṛṣṇa with purified senses is called Kṛṣṇa consciousness.
That is the way of bringing the senses under full control. What is more, that is the highest perfection of yoga practice.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 07/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 241: 06వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 241: Chap. 06, Ver. 27
🌹. శ్రీమద్భగవద్గీత - 241 / Bhagavad-Gita - 241 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 27 🌴
27. ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ||
🌷. తాత్పర్యం :
నా యందు మనస్సు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పుర్ణత్వమును బడయును. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఎకతము నెరిగి పూర్వ కర్మఫలములన్నింటి నుండియు ముక్తుడగును.
🌷. భాష్యము :
భౌతికసంపర్కము నుండి ముక్తిని పొంది శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో నిలిచియుండు స్థితియే “బ్రహ్మభూతస్థితి” యనబడును. “మధ్బక్తిం లభతే పరామ్” (భగవద్గీత 18.54) – మనస్సు శ్రీకృష్ణుని చరణకమలములపై లగ్నము కానిదే ఎవ్వరును బ్రహ్మభావనలో నిలిచియుండలేరు. “స వై మన: కృష్ణపదారవిందయో:”. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యమైన భక్తియోగము నందు సదా నిలిచియండుటయే (కృష్ణభక్తిరసభావన యందు మగ్నమగుటయే) వాస్తవమునకు రజోగుణము నుండియు మరియు సమస్త భౌతికసంపర్కము నుండియు ముక్తిని పొందుటయై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 241 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 27 🌴
27. praśānta-manasaṁ hy enaṁ
yoginaṁ sukham uttamam
upaiti śānta-rajasaṁ
brahma-bhūtam akalmaṣam
🌷 Translation :
The yogī whose mind is fixed on Me verily attains the highest perfection of transcendental happiness. He is beyond the mode of passion, he realizes his qualitative identity with the Supreme, and thus he is freed from all reactions to past deeds.
🌹 Purport :
Brahma-bhūta is the state of being free from material contamination and situated in the transcendental service of the Lord. Mad-bhaktiṁ labhate parām (Bg. 18.54). One cannot remain in the quality of Brahman, the Absolute, until one’s mind is fixed on the lotus feet of the Lord. Sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ. To be always engaged in the transcendental loving service of the Lord, or to remain in Kṛṣṇa consciousness, is to be factually liberated from the mode of passion and all material contamination.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 08/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 242: 06వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 242: Chap. 06, Ver. 28
. శ్రీమద్భగవద్గీత - 242 / Bhagavad-Gita - 242
. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
. ప్రసాద్ భరద్వాజ
28. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మష: |
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే ||
. తాత్పర్యం :
ఆ విధముగా ఆత్మనిగ్రహుడైన యోగి నిరంతరము యోగము నభ్యసించును భౌతికకల్మషములకు దూరుడై, భగవానుని దివ్యమైన ప్రేమయుతసేవ యందు అత్యున్నతమైన పూర్ణానందస్థితిని పొందును.
. భాష్యము :
భగవానుని సంబంధములో తన నిజస్థితిని మనుజుడు తెలిసికొనగలుగుటయే ఆత్మానుభవమనబడును. ఆత్మ శ్రీకృష్ణభగవానుని అంశయైనందున ఆ దేవదేవునికి సేవను గూర్చుటయే దాని నిజస్థితియై యున్నది. ఆత్మకు భగవానునితో గల ఇట్టి దివ్యసంబంధమే “బ్రహ్మసంస్పర్శ” మని పిలువబడును.
Bhagavad-Gita as It is - 242
Swami Bhakthi Vedantha Sri Prabhupada
Prasad Bharadwaj
28. yuñjann evaṁ sadātmānaṁ
yogī vigata-kalmaṣaḥ
sukhena brahma-saṁsparśam
atyantaṁ sukham aśnute
Translation :
Thus the self-controlled yogī, constantly engaged in yoga practice, becomes free from all material contamination and achieves the highest stage of perfect happiness in transcendental loving service to the Lord.
Purport :
Self-realization means knowing one’s constitutional position in relationship to the Supreme. The individual soul is part and parcel of the Supreme, and his position is to render transcendental service to the Lord. This transcendental contact with the Supreme is called brahma-saṁsparśa.
Date: 09/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 243: 06వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 243: Chap. 06, Ver. 29
🌹. శ్రీమద్భగవద్గీత - 243 / Bhagavad-Gita - 243 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 29 🌴
29. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన: ||
🌷. తాత్పర్యం :
నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. ఆత్మదర్శియైన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును.
🌷. భాష్యము :
సర్వుల హృదయములలో పరమాత్మ రూపున స్థితుడై యున్న శ్రీకృష్ణభగవానుని గాంచగలిగినందున కృష్ణభక్తిరసభావితుడైన యోగి నిజమైన ద్రష్ట యనబడును. “ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి”. శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపములో శునకహృదయమునందును మరియు బ్రహ్మణుని హృదయమునందును నిలిచియుండును. ఆ భగవానుడు నిత్యముగా భౌతికముగా ప్రభావితుడు కాడనియు పూర్ణయోగి ఎరిగియుండును. ఆ విధముగా భౌతికత్వముచే ప్రభావితము కాకుండుటయే భగవానుని దివ్యమైన తటస్థస్వభావమై యున్నది. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమందు నిలిచియున్న పరమాత్మ వలె అది ఎల్లరి హృదయములలో నిలిచియుండలేదు. ఇదియే జీవాత్మ మరియు పరమాటం నడుమ గల భేదము. నిజమైన యోగాభ్యాసము నందు నియుక్తుడు కానివాడు ఈ విషయమున స్పష్టముగా గాంచలేదు. కాని ఆస్తికుడు మరియు నాస్తికుడు కానివాడు ఈ విషయమున స్పష్టముగా గాంచలేదు. కాని ఆస్తికుడు మరియు నాస్తికుడు ఇరువురి యందును కృష్ణభక్తిరసభావితుడు శ్రీకృష్ణుని గాంచగలుగును. ఈ విషయము స్మృతి యందు ఇట్లు నిర్దారింపబడినది. “ఆతతత్త్వాచ్చ మాతృత్వాచ్చ ఆత్మ హి పరమోహరి:” సర్వులకు కారణమై యున్నందున భగవానుడు తల్లి లేదా పోషకుడు వంటివాడు. తల్లి తన సమస్త సంతానము నెడ సమభావముతో నుండునట్లు భగవానుడు తన సంతానము నెడ సమభావముతో నుండును. కనుకనే సర్వజీవుల యందు అతడు పరమాత్మగా సదా నిలిచియుండును.
బాహ్యమునను జీవులు సదా భగవానుని శక్తి యందే నిలిచియుందురు. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు ఆధ్యాత్మికశక్తి (ఉత్తమము), భౌతికశక్తి (అల్పము) యను రెండుశక్తులను శ్రీకృష్ణభగవానుడు ప్రధానముగా కలిగియుండును. జీవుడు ఉత్తమశక్తి అంశయైన అల్పమైన భౌతికశక్తిచే బద్ధుడై యుండును. ఈ విధముగా అతడు సర్వదా భగవానుని శక్తి యందున్నట్టివాడే. అనగా జీవుడు భగవానుని యందే ఏదో ఒక విధముగా స్థితిని కలిగియున్నట్టివాడే యగుచున్నాడు.
జీవులు తమ కర్మఫలముల ననుసరించి వివిధస్థితుల యందున్నప్పటికిని ఆన్ని పరిస్థితుల యందును వారు శ్రీకృష్ణభగవానుని దాసులే యని గాంచగలిగినందున యోగి సమదర్శియై యుండును. భౌతికశక్తి యందు నిలిచినపుడు జీవుడు ఇంద్రియములను సేవించును. కాని అదే జీవుడు ఆధ్యాత్మికశక్తి యందు నిలిచినప్పుడు మాత్రము ప్రత్యక్షముగా భగవానుని సేవించును. ఈ విధముగా రెండు పరిస్థితుల యందును అతడు భగవానుని దాసుడే. ఇట్టి సమత్వ వీక్షణము కృష్ణభక్తిభావనాపూర్ణుడైన వ్యక్తి యందు పూర్ణముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 243 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 29 🌴
29. sarva-bhūta-stham ātmānaṁ
sarva-bhūtāni cātmani
īkṣate yoga-yuktātmā
sarvatra sama-darśanaḥ
🌷 Translation :
A true yogī observes Me in all beings and also sees every being in Me. Indeed, the self-realized person sees Me, the same Supreme Lord, everywhere.
🌹 Purport :
A Kṛṣṇa conscious yogī is the perfect seer because he sees Kṛṣṇa, the Supreme, situated in everyone’s heart as Supersoul (Paramātmā). Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe ’rjuna tiṣṭhati. The Lord in His Paramātmā feature is situated within both the heart of the dog and that of a brāhmaṇa. The perfect yogī knows that the Lord is eternally transcendental and is not materially affected by His presence in either a dog or a brāhmaṇa. That is the supreme neutrality of the Lord. The individual soul is also situated in the individual heart, but he is not present in all hearts. That is the distinction between the individual soul and the Supersoul. One who is not factually in the practice of yoga cannot see so clearly. A Kṛṣṇa conscious person can see Kṛṣṇa in the heart of both the believer and the nonbeliever. In the smṛti this is confirmed as follows: ātatatvāc ca mātṛtvāc ca ātmā hi paramo hariḥ. The Lord, being the source of all beings, is like the mother and the maintainer. As the mother is neutral to all different kinds of children, the supreme father (or mother) is also. Consequently the Supersoul is always in every living being.
Outwardly, also, every living being is situated in the energy of the Lord. As will be explained in the Seventh Chapter, the Lord has, primarily, two energies – the spiritual (or superior) and the material (or inferior). The living entity, although part of the superior energy, is conditioned by the inferior energy; the living entity is always in the Lord’s energy. Every living entity is situated in Him in one way or another.
The yogī sees equally because he sees that all living entities, although in different situations according to the results of fruitive work, in all circumstances remain the servants of God. While in the material energy, the living entity serves the material senses; and while in the spiritual energy, he serves the Supreme Lord directly. In either case the living entity is the servant of God. This vision of equality is perfect in a person in Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 09/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 244: 06వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 244: Chap. 06, Ver. 30
🌹. శ్రీమద్భగవద్గీత - 244 / Bhagavad-Gita - 244 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 30 🌴
30. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ||
🌷. తాత్పర్యం :
నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తము గాంచువానికి నేను కనబడకపోవుట గాని, నాకు అతడు కనబడకపోవుట గాని జరుగదు.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందున్నవాడు శ్రీకృష్ణభగవానుడు సర్వత్రా నిలిచియున్నట్లుగా నిక్కము గాంచగలుగును. అంతియేగాక అతడు ఆ దేవదేవుని యందు సమస్తమును వీక్షించును. అట్టివాడు ప్రకృతి యొక్క విభిన్నరూపములను దర్శించినట్లు గోచరించినను సర్వము శ్రీకృష్ణుని శక్తిప్రదర్శనమే యని తెలిసికొని అన్నివేళలా కృష్ణభక్తిభావన యందు నిలిచియుండును. సర్వమునకు శ్రీకృష్ణుడే ప్రభువు మరియు కృష్ణుడు లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదన్న భావనయే కృష్ణభక్తిరసభావనపు మూలసిద్ధాంతము. కృష్ణప్రేమ వృద్ధియే కృష్ణభక్తిరసభావనము. అట్టి దివ్యస్థితి లౌకికముక్తికి సైతము అతీతమై యున్నది. ఆత్మానుభవమునకు అతీతమైన అట్టి కృష్ణప్రేమను పొందిన స్థితిలో భక్తుడు కృష్ణునితో ఏకమగును. అనగా భక్తునకు కృష్ణుడే సర్వస్వమై నిలుచును మరియు భక్తుడు అట్టి కృష్ణప్రేమతో నిండిపోవును. అంతట భగవానుడు మరియు భక్తుని నడుమ ఒక సన్నహిత సంబంధము ఏర్పడును. అటువంటి స్థితిలో జీవుడు నశించుట గాని, భగవానుడు భక్తుని చూపు నుండి దూరమగుట గాని జరుగదు. వాస్తవమునకు కృష్ణుని యందు లీనమగుట యనునది ఆధ్యాత్మికనశింపు వంటిది. కనుకనే భక్తుడు అట్టి ప్రమాదమును కొనితెచ్చుకొనడు. బ్రహ్మసంహిత (5.38) యందు ఇట్లు తెలుపబడినది.
ప్రేమాంజనచ్చురితభక్తివిలోచనేన
సన్తస్సదైవ హృదయేషు విలోకయన్తి |
యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం
గోవిందం ఆదిపురుషం తమహం భజామి ||
“ప్రేమాంజనమును కనులకు పూసూకొనియున్న భక్తులచే సదా వీక్షింపబడు ఆదిదేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయములో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపముతో సదా దర్శితమై యుండును.”
ఇటువంటి స్థితిలో భక్తుని చూపునకు శ్రీకృష్ణుడు ఎన్నడును దూరము కాడు. అలాగుననే భక్తుడును శ్రీకృష్ణభగవానుని దృష్టి నుండి దూరముగా పోడు. దేవదేవుడైన శ్రీకృష్ణుని హృదయస్థ పరమాత్మగా వీక్షించు యోగి విషయమును ఇది వర్తించును. అట్టి యోగి క్రమముగా శుద్ధభక్తునిగా మారి, హృదయమునందు శ్రీకృష్ణుని గాంచకుండా క్షణకాలమును జీవించలేని స్థితికి వచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 244 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 30 🌴
30. yo māṁ paśyati sarvatra
sarvaṁ ca mayi paśyati
tasyāhaṁ na praṇaśyāmi
sa ca me na praṇaśyati
🌷 Translation :
For one who sees Me everywhere and sees everything in Me, I am never lost, nor is he ever lost to Me.
🌹 Purport :
A person in Kṛṣṇa consciousness certainly sees Lord Kṛṣṇa everywhere, and he sees everything in Kṛṣṇa. Such a person may appear to see all separate manifestations of the material nature, but in each and every instance he is conscious of Kṛṣṇa, knowing that everything is a manifestation of Kṛṣṇa’s energy. Nothing can exist without Kṛṣṇa, and Kṛṣṇa is the Lord of everything – this is the basic principle of Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is the development of love of Kṛṣṇa – a position transcendental even to material liberation. At this stage of Kṛṣṇa consciousness, beyond self-realization, the devotee becomes one with Kṛṣṇa in the sense that Kṛṣṇa becomes everything for the devotee and the devotee becomes full in loving Kṛṣṇa. An intimate relationship between the Lord and the devotee then exists. In that stage, the living entity can never be annihilated, nor is the Personality of Godhead ever out of the sight of the devotee. To merge in Kṛṣṇa is spiritual annihilation. A devotee takes no such risk. It is stated in the Brahma-saṁhitā (5.38):
premāñjana-cchurita-bhakti-vilocanena
santaḥ sadaiva hṛdayeṣu vilokayanti
yaṁ śyāmasundaram acintya-guṇa-svarūpaṁ
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
“I worship the primeval Lord, Govinda, who is always seen by the devotee whose eyes are anointed with the pulp of love. He is seen in His eternal form of Śyāmasundara, situated within the heart of the devotee.”
At this stage, Lord Kṛṣṇa never disappears from the sight of the devotee, nor does the devotee ever lose sight of the Lord. In the case of a yogī who sees the Lord as Paramātmā within the heart, the same applies.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 10/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 245: 06వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 245: Chap. 06, Ver. 31
🌹. శ్రీమద్భగవద్గీత - 245 / Bhagavad-Gita - 245 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 31 🌴
31. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత: |
సర్వథా వర్తమానో(పి స యోగీ మయి వర్తతే ||
🌷. తాత్పర్యం :
నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురుము ఏకమేనని ఎరిగి పరమాత్మ భజనమందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నా యందే నిలిచియుండును.
🌷. భాష్యము :
పరమాత్మ ధ్యానమును సాగించు యోగి శ్రీకృష్ణుని సంపూర్ణాంశను శంఖము, చక్రము, గద, పద్మమును దాల్చిన చతుర్భాహు విష్ణువుగా హృదయమునందు వీక్షించును. యోగియైనవాడు ఆ విష్ణువు శ్రీకృష్ణునకు అభిన్నుడని ఎరుగవలెను. వాస్తవమునకు కృష్ణుడే అట్టి పరమాత్మ రూపములో ఎల్లరి హృదయములందును నిలిచియున్నాడు. అంతియేగాక అసంఖ్యాక జీవరాసులలో నిలిచియున్న అసంఖ్యాక పరమాత్మల నడుమను ఎట్టి భేదము లేదు. అలాగుననే శ్రీకృష్ణభగవానుని దివ్యమగు భక్తియుతసేవ యందు నియుక్తుడైన కృష్ణభక్తిరసభావితునికి మరియు పరమాత్మ ధ్యానమునందు సంలగ్నమైన పూర్ణయోగికి ఎట్టి భేదము లేదు. కృష్ణభక్తిభావన యందున్న యోగి భౌతికస్థితిలో వివిధకర్మల యందు నియుక్తుడైనను సదా కృష్ణుని యందే స్థితిని కలిగినట్టివాడగును. “నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక: స ఉచ్యతే” యనుచు శ్రీరూపగోస్వామివారిని భక్తిరసామృతసింధువు (1.2.187) నందును ఇది నిర్ధారింపబడినది. అనగా కృష్ణభక్తి యందు చరించు భక్తుడు అప్రయత్నముగా ముక్తుడే యగుచున్నాడు. ఈ విషయము నారదపంచరాత్రము నందు ఈ విధముగా ధృవీకరింపబడినది.
దిక్కాలాద్యనవిచ్చిన్నే కృష్ణే చేతో విధాయ చ |
తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్ ||
“సర్వవ్యాపియు మరియు దేశకాలాతీతుడును అగు శ్రీకృష్ణుని దివ్యరూపముపై ధ్యానము కావించువాడు కృష్ణుని భావములోనే నిమగ్నుడై, తదనంతరము ఆ భగవానుని దివ్య సహచర్యమును ఆనందస్థితిని పొందగలడు.”
కృష్ణభక్తిరసభావన మనునది యోగపధ్ధతి యందలి అత్యున్నత సమాధిస్థితి వంటిది. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపున ఎల్లరి హృదయములందు వసించియున్నాడనెడి ఈ అవగాహనయే యోగిని దోషరహితునిగా చేయగలదు. “ఏకో(పి సన్ బహుధా యో 'వభాతి – భగవానుడు ఏకమైనను అసంఖ్యాక హృదయములలో బహురూపునిగా నిలిచియున్నాడు” అని వేదములు (గోపాలతాపన్యుపనిషత్తు 121) ఆ భగవానుని అచింత్యశక్తిని నిరూపించుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 245 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 31 🌴
31. sarva-bhūta-sthitaṁ yo māṁ
bhajaty ekatvam āsthitaḥ
sarvathā vartamāno ’pi
sa yogī mayi vartate
🌷 Translation :
Such a yogī, who engages in the worshipful service of the Supersoul, knowing that I and the Supersoul are one, remains always in Me in all circumstances.
🌹 Purport :
A yogī who is practicing meditation on the Supersoul sees within himself the plenary portion of Kṛṣṇa as Viṣṇu – with four hands, holding conchshell, wheel, club and lotus flower. The yogī should know that Viṣṇu is not different from Kṛṣṇa. Kṛṣṇa in this form of Supersoul is situated in everyone’s heart. Furthermore, there is no difference between the innumerable Supersouls present in the innumerable hearts of living entities. Nor is there a difference between a Kṛṣṇa conscious person always engaged in the transcendental loving service of Kṛṣṇa and a perfect yogī engaged in meditation on the Supersoul. The yogī in Kṛṣṇa consciousness – even though he may be engaged in various activities while in material existence – remains always situated in Kṛṣṇa. This is confirmed in the Bhakti-rasāmṛta-sindhu (1.2.187) of Śrīla Rūpa Gosvāmī: nikhilāsv apy avasthāsu jīvan-muktaḥ sa ucyate. A devotee of the Lord, always acting in Kṛṣṇa consciousness, is automatically liberated.
erstanding that Kṛṣṇa is present as Paramātmā in everyone’s heart makes the yogī faultless. The Vedas (Gopāla-tāpanī Upaniṣad 1.21) confirm this inconceivable potency of the Lord as follows: eko ’pi san bahudhā yo ’vabhāti. “Although the Lord is one, He is present in innumerable hearts as many.” Similarly, in the smṛti-śāstra it is said:
eka eva paro viṣṇuḥ
sarva-vyāpī na saṁśayaḥ
aiśvaryād rūpam ekaṁ ca
sūrya-vat bahudheyate
“Viṣṇu is one, and yet He is certainly all-pervading. By His inconceivable potency, in spite of His one form, He is present everywhere, as the sun appears in many places at once.”
🌹 🌹 🌹 🌹 🌹
Date: 11/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 246: 06వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 246: Chap. 06, Ver. 32
🌹. శ్రీమద్భగవద్గీత - 246 / Bhagavad-Gita - 246 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 32 🌴
32. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మత: ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! ఎవడు తనతో పోల్చుకొని సమస్తజీవులకు వాటి సుఖదుఃఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమయోగి యనబడును.
🌷. భాష్యము :
తన స్వానుభవకారణముగా సర్వుల సుఖదుఃఖములను తెలిసియుండెడి కృష్ణభక్తిరసభావితుడు వాస్తవమునకు ఉత్తమయోగి యనబడును. భగవానునితో తనకు గల సంబధమును మరచుటయే జీవుని దుఃఖమునకు కారణమై యున్నది. కాని శ్రీకృష్ణుడే సర్వమానవకర్మలకు దివ్యభోక్తయనియు, సమస్తజగములకు ప్రభువనియు, సర్వజీవుల ఆప్తమిత్రుడనియు ఎరుగుటయే జీవుని సుఖశాంతులకు కారణము కాగలదు. ప్రకృతిజన్య త్రిగుణములకు లొంగి యుండెడి జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే తాపత్రయములకు లోనగునని యోగియైనవాడు ఎరిగియుండును. కృష్ణభక్తిభావన యందు నిలుచు అట్టి యోగి సుఖియై యుండును కనుక కృష్ణసంబంధ విజ్ఞానమును సర్వులకు పంచుటకు యత్నించును. ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావితులు కావలసిన అవశ్యకతను అతడు ప్రచారము చేయ యత్నించునందున అతడే నిజముగా జగములో ఉత్తమమైన జహితైషియు మరియు శ్రీకృష్ణునకు ప్రియతమ సేవకుడును కాగలడు. “న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ:” ( భగవద్గీత 18.69). అనగా భక్తుడు సదా జీవులందరి క్షేమమును గాంచుట సర్వులకు ఆప్తమిత్రుడు కాగలడు. యోగమునందు పూర్ణత్వమును స్వీయలాభాపేక్ష కొరకు గాక కేవలము ఇతరుల కొరకే ఉపయోగించు కారణమున అతడు ఉత్తమయోగియు కాగలడు. ఇతర జీవుల యెడ అతడెన్నడును ఈర్ష్యను కలిగియుండడు. విశుద్ధభక్తునికి మరియు స్వీయోద్ధారమునకై యత్నించు సాధారణయోగికి నడుమ వ్యత్యాసము ఇచ్చటనే యున్నది. కనుకనే చక్కగా ధ్యానము చేయుట కొరకు ఏకాంతస్థలమునకు పోవు యోగి, ప్రతియొక్కరికి తన శక్తి కొలది కృష్ణభక్తిరసభావితులుగా మార్చ యత్నము చేయు భక్తుని కన్నను పూర్ణుడు కానేరడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 246 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 32 🌴
32. ātmaupamyena sarvatra
samaṁ paśyati yo ’rjuna
sukhaṁ vā yadi vā duḥkhaṁ
sa yogī paramo mataḥ
🌷 Translation :
He is a perfect yogī who, by comparison to his own self, sees the true equality of all beings, in both their happiness and their distress, O Arjuna!
🌹 Purport :
One who is Kṛṣṇa conscious is a perfect yogī; he is aware of everyone’s happiness and distress by dint of his own personal experience. The cause of the distress of a living entity is forgetfulness of his relationship with God. And the cause of happiness is knowing Kṛṣṇa to be the supreme enjoyer of all the activities of the human being, the proprietor of all lands and planets, and the sincerest friend of all living entities. The perfect yogī knows that the living being who is conditioned by the modes of material nature is subjected to the threefold material miseries due to forgetfulness of his relationship with Kṛṣṇa. And because one in Kṛṣṇa consciousness is happy, he tries to distribute the knowledge of Kṛṣṇa everywhere. Since the perfect yogī tries to broadcast the importance of becoming Kṛṣṇa conscious, he is the best philanthropist in the world, and he is the dearest servitor of the Lord. Na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ (Bg. 18.69). In other words, a devotee of the Lord always looks to the welfare of all living entities, and in this way he is factually the friend of everyone. He is the best yogī because he does not desire perfection in yoga for his personal benefit, but tries for others also. He does not envy his fellow living entities. Here is a contrast between a pure devotee of the Lord and a yogī interested only in his personal elevation. The yogī who has withdrawn to a secluded place in order to meditate perfectly may not be as perfect as a devotee who is trying his best to turn every man toward Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 12/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 247: 06వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 247: Chap. 06, Ver. 33
🌹. శ్రీమద్భగవద్గీత - 247 / Bhagavad-Gita - 247 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 33 🌴
33. అర్జున ఉవాచ
యోయం యోగస్త్వయా ప్రోక్త: సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను : ఓ మధుసుదనా! మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయియున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగపద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది.
🌷. భాష్యము :
“శుచౌదేశే” యను పదముతో ఆరంభమై “యోగీపరమ:” యను పదముతో సమాప్తి నొందెడి యోగపద్ధతిని శ్రీకృష్ణుడు అర్జునునకు వివరించగా, దానికి తాను అశక్తుడననెడి భావనలో అతడు ఆ పద్ధతిని ఇచ్చట తిరస్కరించుచున్నాడు. కలియుగములో సాధారణమానవునకు గృహమును విడిచి కొండలలోనో, అడవులలోనో ఏకాంతస్థలమునకు పోయి యోగాభ్యాసము చేయుట సాధ్యము కానటువంటి విషయము. స్వల్పజీవితము కొరకు తీవ్రసంఘర్షణ యనునది ఈ యుగలక్షణమై యున్నది. ఈ కాలమున జనులు ఆత్మానుభూతి విషయమున శ్రద్ధారహితులై యున్నారు. సామాన్యములు మరియు ఆచరణయోగ్యములైన పద్ధతులనే వారు స్వీకరింపలేరన్నచో నియమితజీవనము, ప్రత్యేక ఆసనపద్ధతి, స్థాననిర్దేసము, విషయకర్మల నుండి మనోనిగ్రహము వంటి కఠినకార్యములు గల యోగపద్ధతిని అనుసరింపలేరనెడి విషయమును గూర్చి వేరుగా చెప్పపనిలేదు. పలు అనుకూలపరిస్థితులను కలిగియున్నప్పటికిని క్రియాశీలునిగా అర్జునుడు అట్టి యోగము నాచరించుట తనకు సాధ్యము కాదని భావించెను. రాచవంశమునకు చెందిన అతడు పలుయోగ్యతల దృష్ట్యా అత్యంత ఉన్నతుడై యుండెను. అతడు గొప్ప వీరుడు, దీర్ఘాయువు గలవాడు మరియు అన్నింటికి మించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడు. ఐదువేల సంవత్సరములకు పూర్వము అర్జునుడు ప్రస్తుతము మనకున్నటువంటి పరిస్థితుల కన్నను చక్కని అనుకూల పరిస్థితులను కలిగియున్నను ఈ యోగపద్ధతిని తిరస్కరించెను. అతడు యోగమును ఆచరించినట్లుగా మనకెటువంటి చారిత్రికాధారము లభింపదు. కనకనే ఈ యోగపద్ధతి కలియుగమున అసాధ్యమని భావింపబడినది. ఒకవేళ ఏ కొద్దిమందికో (అసాధారణ పురుషులు) సాధ్యపడినను జనసామాన్యమునకు మాత్రము ఇది మిగుల అసాధ్యము. ఐదువేల సంవత్సరముల క్రిందటే దీని విషయమిట్లుండ ఇక నేటి పరిస్థితి యేమిటి? నామమాత్ర యోగశాలల యందు మరియు సంఘములందు ఈ యోగవిధానము అనుకరింప యత్నించువారు తమను తాము కృతార్థులుగా భావించును, నిక్కముగా కాలమును వృథాపరచునట్టివారే యగుచున్నారు. వాంఛితమగు లక్ష్యమును గూర్చిన విషయమున వారు సంపూర్ణముగా అజ్ఞానులై యున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 247 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 33 🌴
33. arjuna uvāca
yo ’yaṁ yogas tvayā proktaḥ
sāmyena madhusūdana
etasyāhaṁ na paśyāmi
cañcalatvāt sthitiṁ sthirām
🌷 Translation :
Arjuna said: O Madhusūdana, the system of yoga which You have summarized appears impractical and unendurable to me, for the mind is restless and unsteady.
🌹 Purport :
The system of mysticism described by Lord Kṛṣṇa to Arjuna beginning with the words śucau deśe and ending with yogī paramaḥ is here being rejected by Arjuna out of a feeling of inability. It is not possible for an ordinary man to leave home and go to a secluded place in the mountains or jungles to practice yoga in this Age of Kali. The present age is characterized by a bitter struggle for a life of short duration. People are not serious about self-realization even by simple, practical means, and what to speak of this difficult yoga system, which regulates the mode of living, the manner of sitting, selection of place, and detachment of the mind from material engagements. As a practical man, Arjuna thought it was impossible to follow this system of yoga, even though he was favorably endowed in many ways. He belonged to the royal family and was highly elevated in terms of numerous qualities; he was a great warrior, he had great longevity, and, above all, he was the most intimate friend of Lord Kṛṣṇa, the Supreme Personality of Godhead. Five thousand years ago, Arjuna had much better facilities than we do now, yet he refused to accept this system of yoga. In fact, we do not find any record in history of his practicing it at any time. Therefore this system must be considered generally impossible in this Age of Kali. Of course it may be possible for some very few, rare men, but for the people in general it is an impossible proposal.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 13/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 248: 06వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 248: Chap. 06, Ver. 34
🌹. శ్రీమద్భగవద్గీత - 248 / Bhagavad-Gita - 248 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 34 🌴
34. చంచలం హి మన: కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! మనస్సు చంచలమును, కల్లోలపూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరమును అయి యున్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నాను కష్టతరమని నేను భావించుచున్నాను.
🌷. భాష్యము :
మనస్సు మిగుల బలవత్తరము, దృఢమును అయియున్నది. తత్కారణమున అది వాస్తవమునకు బుద్ధికి విధీయమై యుండవలసినను కొన్నిమార్లు దానిని అతిక్రమించుచుండును. జగమునందు అనేకములైన అవరోధములతో సంఘర్షణ పడు మనుజుని అట్టి మనస్సును నిగ్రహించుట అత్యంత కష్టమైన కార్యము. కృత్రిమముగా ఎవరైనను శత్రుమిత్రుల యెడ సమానవైఖరిని కనబరచిన కనబరచవచ్చును. కాని లౌకికుడును మాత్రము ఆ విధముగా చేయలేడు. మనస్సును నిగ్రహించుట తీవ్రగాలిని నియమించుట కన్నను అతికష్టమైన కార్యమగుటయే అందులకు కారణము. కతోపనిషత్తు (1.3.3-4) నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.
ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ |
బుద్ధిం తు సారథిం విద్ధి మన: ప్రగ్రహమేవ చ ||
ఇంద్రియాణి హయా నాహు: విషయాం స్తేషు గోచరాన్ |
ఆత్మేన్ద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ: ||
“దేహమును రథములో జీవుడు ప్రయాణికుడు కాగా, బుద్ధి రథచోదకుడై యున్నాడు. మనస్సు రథమును నడుపు సాధనము కాగా ఇంద్రియముల అశ్వములై యున్నవి. ఈ విధముగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సంగత్వమున భోక్త యగుచున్నాడని మునులచే అవగాహన చేసికొనబడినది.” వాస్తవమునకు బుద్ధి యనునది మనస్సునకు నిర్దేశము నొసగవలెను. కాని బలవత్తరము, దృఢమును అగు మనస్సు అంటువ్యాధి ఔషధశక్తిని సైతము అతిక్రమించునట్లు, మనుజుని బుద్ధిని సైతము కొన్నిమార్లు అతిక్రమించుచుండును. అట్టి బలమైన మనస్సును యోగపద్ధతిచే నియమింపవలసియున్నది. అయినను అర్జునుని వంటి వానికి కూడా ఈ యోగాభ్యాసము ఆచరణీమైనదిగా లేదు. అట్టి యెడ నేటి సాధారణమానవుని గూర్చి ఇక చెప్పవలసినది ఏమున్నది? ఈ శ్లోకమునందు తెలుపబడిన వాయువు ఉదాహరణము అత్యంత సమంజసముగా నున్నది. ఏలయన ఎవ్వరును వాయువును బంధించలేరు. కాని దాని కన్నను కల్లోలపూర్ణమగు మనస్సును నిరోధించుట ఇంకను కష్టతరమై యున్నది. అటువంటి మనస్సును నిరోధించుటకు శ్రీచైతన్యమాహాప్రభువు ఉపదేశించిన భవతారకమైన హరే కృష్ణ మాహామంత్రమును నమ్రతతో కీర్తించుట అతిసులభమైన మార్గము. అనగా “స వై మన: కృష్ణపదారవిందయో:” అను విధానమే ఇచ్చట నిర్దేశింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 248 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 34 🌴
34. cañcalaṁ hi manaḥ kṛṣṇa
pramāthi balavad dṛḍham
tasyāhaṁ nigrahaṁ manye
vāyor iva su-duṣkaram
🌷 Translation :
The mind is restless, turbulent, obstinate and very strong, O Kṛṣṇa, and to subdue it, I think, is more difficult than controlling the wind.
🌹 Purport :
The mind is so strong and obstinate that it sometimes overcomes the intelligence, although the mind is supposed to be subservient to the intelligence. For a man in the practical world who has to fight so many opposing elements, it is certainly very difficult to control the mind. Artificially, one may establish a mental equilibrium toward both friend and enemy, but ultimately no worldly man can do so, for this is more difficult than controlling the raging wind. In the Vedic literature (Kaṭha Upaniṣad 1.3.3–4) it is said:
ātmānaṁ rathinaṁ viddhi
śarīraṁ ratham eva ca
buddhiṁ tu sārathiṁ viddhi
manaḥ pragraham eva ca
indriyāṇi hayān āhur
viṣayāṁs teṣu gocarān
ātmendriya-mano-yuktaṁ
bhoktety āhur manīṣiṇaḥ
“The individual is the passenger in the car of the material body, and intelligence is the driver. Mind is the driving instrument, and the senses are the horses. The self is thus the enjoyer or sufferer in the association of the mind and senses. So it is understood by great thinkers.” Intelligence is supposed to direct the mind, but the mind is so strong and obstinate that it often overcomes even one’s own intelligence, as an acute infection may surpass the efficacy of medicine. Such a strong mind is supposed to be controlled by the practice of yoga, but such practice is never practical for a worldly person like Arjuna.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 14/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 249: 06వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 249: Chap. 06, Ver. 35
🌹. శ్రీమద్భగవద్గీత - 249 / Bhagavad-Gita - 249 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 35 🌴
35. శ్రీ భగవానువాచ
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ గొప్పభుజములు కలిగిన కుంతీపుత్రా! చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగులకష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును.
🌷. భాష్యము :
దృఢమైన మనస్సును నిగ్రహించుట యందలి కష్టమును గూర్చి అర్జునుడు పలికినదానిని శ్రీకృష్ణభగవానుడు అంగీకరించెను. కాని అట్టి కార్యము అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధ్యమగునని అదే సమయమున అతడు ఉపదేశించుచున్నాడు. అట్టి అభ్యాసమంగా నేమి? తీర్థస్థలమున కేగుట, మనస్సును పరమాత్మ యందు సంలగ్నము చేయుట, ఇంద్రియ మనస్సులను నిరోధించుట బ్రహ్మచర్యము పాటించుట, ఏకాంతముగా వసించుట వంటి కటిన నియమనిబంధనలను ఈ కాలమున ఎవ్వరును పాటించలేరు. కాని కృష్ణభక్తిభావన ద్వారా మనుజుడు నవవిధములైన భక్తిమార్గములందు పాల్గొనగలడు. అట్టి భక్తికార్యములలో ప్రప్రథమమైనది శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము. అది మనస్సును అన్నివిధములైన అపోహల నుండి ముక్తినొందించు దివ్యవిధానము. శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము అధికాధికముగా జరిగిన కొలది మనుడు అధికముగా జ్ఞానవంతుడై, కృష్ణుని నుండి మనస్సును దూరము చేయు సమస్తవిషయములందును వైరాగ్యమును పొందును. కృష్ణపరములు కానటువంటి కార్యములు నుండి మనస్సును నిగ్రహించుట ద్వారా మనుజుడు వైరాగ్యమును సులభముగా నేర్వగలడు. భౌతికత్వము నుండి విడివడి, ఆధ్యాత్మికత యందే మనస్సు లగ్నమగుట యనెడి కార్యము వైరాగ్యమనబడును. వాస్తవమునకు నిరాకారతత్త్వములో వైరాగ్యమును పొందుట యనునది మనస్సును కృష్ణపరకర్మల యందు నియుక్తము చేయుట కన్నను మిక్కిలి కష్టమైనది. కనుకనే కృష్ణభక్తి ఆచరణీయమైన పద్ధతియై యున్నది. ఏలయన కృష్ణుని గూర్చి శ్రవణము చేయుట ద్వారా మనుజుడు అప్రయత్నముగా పరతత్త్వమునందు అనురక్తుడగును. అట్టి పరతత్త్వానురాగమే “పరేశానుభవము” (ఆధ్యాత్మికసంతృప్తి) అనబడును. ఆకలిగొన్నవాడు తాను తిను ప్రతిముద్ద యందు తృప్తిని పొందుటతో ఈ ఆధ్యాత్మిక సంతృప్తిని పోల్చవచ్చును. ఆకలిగొన్నవాడు ఎంత అధికముగా భుజించినచో అంత అధికముగా తృప్తిని మరియు శక్తిని పొందెడి రీతి, భక్తియోగమును అధికముగా ఒనరించుచున్నప్పుడు మనస్సు భౌతికవిషయముల నుండి విముఖుడై యుండును కనుక అధికముగా దివ్యానందమును మరియు సంతృప్తిని ఒనగూడుచుండును. ఇది చక్కని వైద్యము మరియు పథ్యముతో రోగమును నయము చేయు ప్రక్రియ వంటిది. కనుకనే శ్రీకృష్ణభగవానుని దివ్యలీలలనను శ్రవణము చేయుట మూర్ఖమనస్సుకు చక్కని వైద్యము కాగా, కృష్ణప్రసాదమును స్వీకరించుట భవరోగికి సరియైన ఆహారమై యున్నది. ఇట్టి భవరోగచికిత్సా విధానమే కృష్ణభక్తిరసభావన విధానము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 249 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 35 🌴
35. śrī-bhagavān uvāca
asaṁśayaṁ mahā-bāho
mano durnigrahaṁ calam
abhyāsena tu kaunteya
vairāgyeṇa ca gṛhyate
🌷 Translation :
Lord Śrī Kṛṣṇa said: O mighty-armed son of Kuntī, it is undoubtedly very difficult to curb the restless mind, but it is possible by suitable practice and by detachment.
🌹 Purport :
The difficulty of controlling the obstinate mind, as expressed by Arjuna, is accepted by the Personality of Godhead. But at the same time He suggests that by practice and detachment it is possible. What is that practice? In the present age no one can observe the strict rules and regulations of placing oneself in a sacred place, focusing the mind on the Supersoul, restraining the senses and mind, observing celibacy, remaining alone, etc. By the practice of Kṛṣṇa consciousness, however, one engages in nine types of devotional service to the Lord. The first and foremost of such devotional engagements is hearing about Kṛṣṇa. This is a very powerful transcendental method for purging the mind of all misgivings. The more one hears about Kṛṣṇa, the more one becomes enlightened and detached from everything that draws the mind away from Kṛṣṇa. By detaching the mind from activities not devoted to the Lord, one can very easily learn vairāgya. Vairāgya means detachment from matter and engagement of the mind in spirit. Impersonal spiritual detachment is more difficult than attaching the mind to the activities of Kṛṣṇa.
This is practical because by hearing about Kṛṣṇa one becomes automatically attached to the Supreme Spirit. This attachment is called pareśānubhava, spiritual satisfaction. It is just like the feeling of satisfaction a hungry man has for every morsel of food he eats. The more one eats while hungry, the more one feels satisfaction and strength. Similarly, by discharge of devotional service one feels transcendental satisfaction as the mind becomes detached from material objectives. It is something like curing a disease by expert treatment and appropriate diet. Hearing of the transcendental activities of Lord Kṛṣṇa is therefore expert treatment for the mad mind, and eating the foodstuff offered to Kṛṣṇa is the appropriate diet for the suffering patient. This treatment is the process of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 15/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 250: 06వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 250: Chap. 06, Ver. 36
🌹. శ్రీమద్భగవద్గీత - 250 / Bhagavad-Gita - 250 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 36 🌴
36. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి: |
వశ్యాత్మనా తు యతతా శక్యో(వాప్తుముపాయత: ||
🌷. తాత్పర్యం :
మనస్సు నిగ్రహింపబడినవానికి ఆత్మానుభవము అతికష్టకార్యము. కాని మనోనిగ్రహము కలిగి, తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము.
🌷. భాష్యము :
విషయకర్మల నుండు మనస్సును దూరము చేయుటకు తగిన చికిత్సను పొందనివాడు ఆత్మానుభవము నందు విజయమును సాధింపలేడని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట పకటించుచున్నాడు. భౌతికానందమున మనస్సును నిమగ్నముచేసి యోగాభ్యాసమునకు యత్నించుట యనునది ఒకవైపు అగ్ని యందు నీరు పోయుచునే దానిని జ్వలింపజేయు యత్నము వంటిది. మనోనిగ్రహము లేనటువంటి యోగాభ్యాసము కేవలము కాలమును వ్యర్థము చేయుటయే కాగలదు. అట్టియోగప్రదర్శనము బాహ్యమునకు ఆకర్షణీయముగా తోచినను ఆత్మానుభవమునకు సంబంధించినంతవరకు మాత్రము అది నిరుపయోగమై యున్నది. కనుక ప్రతియొక్కరు మనస్సును సదా దివ్యమగు ప్రేమయుతసేవ యందు లగ్నము చేయుట ద్వారా నియమించవలెను. మనుజుడు కృష్ణభక్తిభావన యందు నిలువనిదే తన మనస్సును నియమింపజాలడు. అనగా కృష్ణభక్తిరసభావితుడు యోగాభ్యాసపు ఫలమును ప్రత్యేకమైన శ్రమ వేరేదియును లేకనే సులభముగా పొందగలడు. కాని కేవల యోగాభ్యాసపరుడు కృష్ణభక్తిరసభావితుడు కానిదే జయమును సాధింపలేడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 250 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 36 🌴
36. asaṁyatātmanā yogo
duṣprāpa iti me matiḥ
vaśyātmanā tu yatatā
śakyo ’vāptum upāyataḥ
🌷 Translation :
For one whose mind is unbridled, self-realization is difficult work. But he whose mind is controlled and who strives by appropriate means is assured of success. That is My opinion.
🌹 Purport :
The Supreme Personality of Godhead declares that one who does not accept the proper treatment to detach the mind from material engagement can hardly achieve success in self-realization. Trying to practice yoga while engaging the mind in material enjoyment is like trying to ignite a fire while pouring water on it. Yoga practice without mental control is a waste of time. Such a show of yoga may be materially lucrative, but it is useless as far as spiritual realization is concerned. Therefore, one must control the mind by engaging it constantly in the transcendental loving service of the Lord. Unless one is engaged in Kṛṣṇa consciousness, he cannot steadily control the mind. A Kṛṣṇa conscious person easily achieves the result of yoga practice without separate endeavor, but a yoga practitioner cannot achieve success without becoming Kṛṣṇa conscious.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 16/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 251: 06వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 251: Chap. 06, Ver. 37
🌹. శ్రీమద్భగవద్గీత - 251 / Bhagavad-Gita - 251 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 37 🌴
37. అర్జున ఉవాచ
అయతి: శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానస: |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! తొలుత ఆత్మానుభవ విధానము శ్రద్ధతో అనుసరించి, పిదప లౌకికభావన కారణముగా దానిని త్యజించి, యోగమునందు పూర్ణత్వమును పొందలేని విఫలయోగి గమ్యమెట్టిది?
🌷. భాష్యము :
ఆత్మానుభావము (యోగము) పొందు మార్గము భగవద్గీత యందు వివరింపబడినది. జీవుడు వాస్తవమునాకు పాంచభౌతికదేహము గాక దానికి అతీతుడైన వాడనియు మరియు సత్, చిత్, ఆనందమందే అతనికి నిజమైన ఆనందము కలదనియు తెలిపెడి జ్ఞానము ఆత్మానుభావము యొక్క మూలసిద్ధాంతమై యున్నది. ఇట్టి నిత్యజీవనము, జ్ఞానము మరియు ఆనందములనునవి(సత్, చిత్, ఆనందము) దేహము, మనస్సులకు అతీతమైన దివ్యలక్షణములు. ఇట్టి ఆత్మానుభవము జ్ఞానమార్గము ద్వారా, అష్టాంగయోగ మార్గము ద్వారా లేక భక్తిమార్గము ద్వారా పొందుటకు సాధ్యమగును. ఈ మార్గములన్నింటి యందును జీవుడు తన నిజస్థితిని, తనకు భగవానునితో గల సంబంధమును మరియు తనకు భగవానునితో గల సంబంధమును పున:స్థాపించి కృష్ణభక్తిభావన యందలి అత్యున్నత పూర్ణత్వస్థితిని బడయుటకు వలసిన కర్మలను ఎరుగవలసియున్నది. ఈ మూడుమార్గములలో దేనిని చేపట్టినను శీఘ్రముగనో లేక ఆలస్యముగనో తప్పక మనుజుడు దివ్యగమ్యమును చేరగలడు. ఆధ్యాత్మికమార్గమున కొద్ది యత్నమైనను ముక్తికి గొప్పగా దోహదము కాగలదని పలుకుచు శ్రీకృష్ణభగవానుడు ద్వితీయాధ్యాయమున ఈ విషయమును నిర్ధారించియున్నాడు. ఈ మూడుమార్గములలో భక్తియోగమార్గము భగవదనుభూతిని బడయుటకు ప్రత్యక్షమార్గమై యున్నందున ఈ యుగమునకు మిక్కిలి అనువైనదియై యున్నది. భగవానుడు గతమునందు తెలిపియున్న వచనమును తిరిగి నిర్దారించుకొనుట కొరకే అర్జునుడిచ్చట ఈ విధముగా ప్రశ్నించుచున్నాడు. మనుజుడు ఆత్మానుభవమార్గమును శ్రద్ధతో స్వీకరించినను జ్ఞానయోగవిధానము మరియు అష్టాంగయోగపద్ధతి ఈ కాలమున మిగుల కష్టతరవిధానములై యున్నవి. కనుకనే ఈ మార్గములందు పలుయత్నములు కావించినను బహుకారణముల చేత మనుజుడు విఫలత్వమునే బడయవచ్చును. మొట్టమొదటి విషయమేమన ఈ విధానము ననుసరించుట యందు మనుజుడు అత్యంత శ్రద్ధ యుండదు. అంతియేగాక ఆధ్యాత్మికమార్గమును చేపట్టుట యనగా దాదాపు మాయపై యుద్ధము ప్రకటించు వంటిది. కనుక ఎవ్వరైనను అట్లు యత్నించుగనే మాయ వివిధములైన ఆకర్షణలచే సాధకుని జయింప యత్నించుచుండును. వాస్తవమునకు బద్ధజీవుడు మయాగుణములచే ప్రభావితుడైనట్టివాడే గనుక ఆధ్యాత్మిక కలాపములందున్న తిరిగి ఆ గుణములచే మోహింపబడుటకు అవకాశము కలదు. ఇదియే ఆధ్యాత్మికమార్గము నుండి పతనము నొందుట యనబడును. యోగాచ్చలిత మానస: . ఆ విధముగా ఆత్మానుభవమార్గము నుండి వైదొలగుట వలన కలిగెడి ఫలితములను తెలిసికొనుట అర్జునుడు కుతూహలపడుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 251 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 37 🌴
37. arjuna uvāca
ayatiḥ śraddhayopeto
yogāc calita-mānasaḥ
aprāpya yoga-saṁsiddhiṁ
kāṁ gatiṁ kṛṣṇa gacchati
🌷 Translation :
Arjuna said: O Kṛṣṇa, what is the destination of the unsuccessful transcendentalist, who in the beginning takes to the process of self-realization with faith but who later desists due to worldly-mindedness and thus does not attain perfection in mysticism?
🌹 Purport :
The path of self-realization or mysticism is described in the Bhagavad-gītā. The basic principle of self-realization is knowledge that the living entity is not this material body but that he is different from it and that his happiness is in eternal life, bliss and knowledge. These are transcendental, beyond both body and mind. Self-realization is sought by the path of knowledge, by the practice of the eightfold system or by bhakti-yoga. In each of these processes one has to realize the constitutional position of the living entity, his relationship with God, and the activities whereby he can reestablish the lost link and achieve the highest perfectional stage of Kṛṣṇa consciousness. Following any of the above-mentioned three methods, one is sure to reach the supreme goal sooner or later. This was asserted by the Lord in the Second Chapter: even a little endeavor on the transcendental path offers a great hope for deliverance. Out of these three methods, the path of bhakti-yoga is especially suitable for this age because it is the most direct method of God realization.
To be doubly assured, Arjuna is asking Lord Kṛṣṇa to confirm His former statement. One may sincerely accept the path of self-realization, but the process of cultivation of knowledge and the practice of the eightfold yoga system are generally very difficult for this age. Therefore, despite constant endeavor one may fail, for many reasons. First of all, one may not be sufficiently serious about following the process. To pursue the transcendental path is more or less to declare war on the illusory energy. Consequently, whenever a person tries to escape the clutches of the illusory energy, she tries to defeat the practitioner by various allurements. A conditioned soul is already allured by the modes of material energy, and there is every chance of being allured again, even while performing transcendental disciplines. This is called yogāc calita-mānasaḥ: deviation from the transcendental path. Arjuna is inquisitive to know the results of deviation from the path of self-realization.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 17/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 252: 06వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 252: Chap. 06, Ver. 38
🌹. శ్రీమద్భగవద్గీత - 252 / Bhagavad-Gita - 252 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 38 🌴
38. కచ్చిన్నోభయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్టో మహాబాహా విమూడో బ్రహ్మణ: పథి ||
🌷. తాత్పర్యం :
ఓ మాహాబాహో శ్రీకృష్ణా! ఆధ్యాత్మికమార్గము నుండి వైదొలగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మికజయము మరియు లౌకికజయమును రెండింటిని పొందినవాడై ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చెదరిన మేఘము వలె నశింపడా?
🌷. భాష్యము :
మానవాభ్యుదయమునకు రెండు మార్గములు గలవు. లౌకికులు ఆధ్యాత్మికత యందు అనురక్తి యుండదు. తత్కారణమున వారు ఆర్ధికాభివృద్ధి ద్వారా లౌకికపురోగతిని బడయుట యందు గాని, తగిన కర్మల ద్వారా ఉన్నతలోకములను చేరుట యందు గాని ప్రియమును కలిగియుందురు. కాని ఎవ్వరేని ఆధ్యాత్మికమార్గమును చేపట్టినచో అట్టి విషయకర్మల నుండి విరమణను పొంది, సర్వవిధములైన నామమాత్ర సుఖముల నన్నింటిని త్యజించవలసివచ్చును. ఇట్టి స్థితిలో ఆధ్యాత్మికమార్గమున పయనించువాడు తన యత్నములో విఫలమైనచో బాహ్యమునకు రెండువిధములా నష్టపోయినవాడగును. వేరుమాటలలో అతడు భౌతికసుఖమును అనుభవింపలేదు. అలాగుననే ఆధ్యాత్మికజయమును సైతము పొందలేడు. గాలి చేత చెదరగొట్టబడిన మేఘమువలె అతడు రెండింటి యందును స్థానము లేకుండును. కొన్నిమార్లు ఆకాశమున మేఘము ఒక చిన్న మేఘము నుండి విడివడి పెద్ద మేఘముతో కలియుచుండును. కాని ఆ ప్రయత్నములో అది విఫలమైనచో, గాలిచే చెదరగొట్టబడి అనంత ఆకాశములో జాడలేకుండా పోవును. బ్రహ్మము, పరమాత్మ, భగవానుని ప్రకటమగు పరతత్త్వపు అంశరూపమున తాను నిజమునకు దివ్యుడనని జీవుడు ఎరుగగలిగే ఆత్మానుభవమార్గమే “బ్రహ్మణపథి:” యనబడును. శ్రీకృష్ణభగవానుడే ఆ పరతత్త్వము కనుక అతనికి శరణము నొందినవాడు కృతకృత్యుడైన ఆధ్యాత్మికుడు కాగలడు. కాని బ్రహ్మానుభవము మరియు పరతత్త్వానుభవము ద్వారా ఇట్టి జీవితలక్ష్యమును చేరగలుగుట బహుజన్మలు అవసరమగును (బహూనాం జన్మనామన్తే). కనుకనే ప్రత్యక్ష విధానమైన భక్తియోగమే (కృష్ణభక్తిరసభావనము) అత్యుత్తమ ఆధ్యాత్మికానుభవ మార్గమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 252 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 38 🌴
38. kaccin nobhaya-vibhraṣṭaś
chinnābhram iva naśyati
apratiṣṭho mahā-bāho
vimūḍho brahmaṇaḥ pathi
🌷 Translation :
O mighty-armed Kṛṣṇa, does not such a man, who is bewildered from the path of transcendence, fall away from both spiritual and material success and perish like a riven cloud, with no position in any sphere?
🌹 Purport :
There are two ways to progress. Those who are materialists have no interest in transcendence; therefore they are more interested in material advancement by economic development, or in promotion to the higher planets by appropriate work. When one takes to the path of transcendence, one has to cease all material activities and sacrifice all forms of so-called material happiness. If the aspiring transcendentalist fails, then he apparently loses both ways; in other words, he can enjoy neither material happiness nor spiritual success. He has no position; he is like a riven cloud. A cloud in the sky sometimes deviates from a small cloud and joins a big one. But if it cannot join a big one, then it is blown away by the wind and becomes a nonentity in the vast sky. The brahmaṇaḥ pathi is the path of transcendental realization through knowing oneself to be spiritual in essence, part and parcel of the Supreme Lord, who is manifested as Brahman, Paramātmā and Bhagavān. Lord Śrī Kṛṣṇa is the fullest manifestation of the Supreme Absolute Truth, and therefore one who is surrendered to the Supreme Person is a successful transcendentalist. To reach this goal of life through Brahman and Paramātmā realization takes many, many births (bahūnāṁ janmanām ante). Therefore the supermost path of transcendental realization is bhakti-yoga, or Kṛṣṇa consciousness, the direct method.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 18/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 253: 06వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 253: Chap. 06, Ver. 39
🌹. శ్రీమద్భగవద్గీత - 253 / Bhagavad-Gita - 253 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 39 🌴
39. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషత: |
త్వదన్య: సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ||
🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరును లేరు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుడు భూత, భవిష్యత్, వర్తమానములను పూర్ణముగా నెరిగినవాడు. జీవుల వ్యక్తిత్వముతో గతము నందును, వర్తమానము నందును, భవిష్యత్తు నందును నిలిచియుందురనియు, భవబంధము నుండి ముక్తిని పొందిన పిదపయు వారట్లే వ్యక్తిత్వముతో కొనసాగుదురనియు అతడు భగవద్గీత యొక్క ఆరంభమున తెలిపెను. అనగా జీవుని భవిష్యత్తును గూర్చిన ప్రశ్నకు అతడు సమాధానము నొసగియే యున్నాడు. కాని ఇప్పుడు అర్జునుడు సామాన్యజీవుని విషయమున గాక, ఆధ్యాత్మికమార్గమునందు జయమును సాధింపలేని యోగి భవిష్యత్తును గూర్చి తెలియగోరుచున్నాడు. వాస్తవమునకు కృష్ణునికి సమానులు గాని, అధికులు గాని లేరు. నామమాత్ర యోగులు మరియు తత్త్వవేత్తలు ప్రకృతికి లోబడియుండువారే గనుక ముమ్మాటికి శ్రీకృష్ణునికి సములు కాలేరు. తత్కారణముగా అర్జునుని ఈ ప్రశ్న విషయమున శ్రీకృష్ణుని తీర్పే తుదియై, సర్వసంశయములకు సంపూర్ణ సమాధానమై యున్నది. ఆ దేవదేవుడు భూత, భవిష్యత్, వర్తమానములను పూర్ణముగా నెరిగియుండుటయే అందులకు కారణము. కాని అతనికి మాత్రము ఎవ్వరును ఎరుగజాలరు. కృష్ణుడు మరియు కృష్ణభక్తులు మాత్రమే ఏది ఎట్టిదన్న విషయమును సంపూర్ణముగా నెరిగియుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 253 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 39 🌴
39. etan me saṁśayaṁ kṛṣṇa
chettum arhasy aśeṣataḥ
tvad-anyaḥ saṁśayasyāsya
chettā na hy upapadyate
🌷 Translation :
This is my doubt, O Kṛṣṇa, and I ask You to dispel it completely. But for You, no one is to be found who can destroy this doubt.
🌹 Purport :
Kṛṣṇa is the perfect knower of past, present and future. In the beginning of the Bhagavad-gītā, the Lord said that all living entities existed individually in the past, they exist now in the present, and they continue to retain individual identity in the future, even after liberation from the material entanglement. So He has already cleared up the question of the future of the individual living entity. Now, Arjuna wants to know of the future of the unsuccessful transcendentalist. No one is equal to or above Kṛṣṇa, and certainly the so-called great sages and philosophers who are at the mercy of material nature cannot equal Him. Therefore the verdict of Kṛṣṇa is the final and complete answer to all doubts, because He knows past, present and future perfectly – but no one knows Him. Kṛṣṇa and Kṛṣṇa conscious devotees alone can know what is what.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 19/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 254: 06వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 254: Chap. 06, Ver. 40
🌹. శ్రీమద్భగవద్గీత - 254 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 40 🌴
40. శ్రీ భగవానువాచ
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ పార్థా! శుభకార్యముల యందు నియుక్తుడైనవాడు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా! మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు.
🌷. భాష్యము :
శ్రీమద్భాగవతము (1.5.17) నందు శ్రీనారదముని వ్యాసదేవునికి ఈ విధముగా ఉపదేశము కావించిరి.
త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే
ర్భజన్నపక్వో(థ పతేత్తతో యది |
యత్ర క్వ వాభద్ర మభూదముష్య కిమ్
కో వార్థ ఆప్తో(భజతాం స్వధర్మత: ||
“భౌతికవాంఛల నన్నింటిని త్యజించి దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని బడసినవానికి ఏవిధమైన నష్టము గాని, వినాశము గాని ఉండదు. కాని అభక్తుడైనవాడు తన విధ్యుక్తధర్మములలో సంపూర్ణముగా నిమగ్నుడైనను పొందునదేదియును లేదు.” భౌతికవాంఛా పూర్ణమునకై శాస్త్రవిహితములు మరియు ఆచారవిహితములు అయిన పలుకర్మలు కలవు. యోగియైనవాడు ఆధ్యాత్మికపురోగతి(కృష్ణభక్తిరసభావనము) కొరకై అట్టి సమస్త లౌకికకర్మలను త్యజింపవలసియుండును. కృష్ణభక్తిభావనను పూర్ణముగా అనుసరించినచో దాని ద్వారా మనుజుడు అత్యున్నత పూర్ణత్వము బడయుననుట సత్యమే అయినను ఒకవేళ అతడు పూర్ణత్వస్థితిని పొందకున్నచో భౌతికరంగమునందును మరియు ఆధ్యాత్మికరంగమందును నష్టపోయినట్లు కాడా యని కొందరు ప్రశ్నించు నవకాశము కలదు. విధ్యుక్తధర్మములను విధిగా నిరహింపనివాడు తత్పలితముగా అనుభవింపవలసివచ్చునని శాస్త్రమునందు నిర్దేశింపబడినది. కనుక ఆధ్యాత్మికకర్మలను చక్కగా ఒనరింపజాలనివాడు సైతము కర్మఫలముచే ప్రభావితుడు కాగలడని భావించు నవకాశము కలదు. కాని ఈ విషయమున చింత ఏమాత్రము వలదని సఫలీకృతుడు కానట్టి యోగికి శ్రీమద్భాగవతము హామీ ఇచ్చుచున్నది. కర్మనిర్వాహణను పూర్ణముగా ఒనరించని కారణమున ఒకవేళ వారు అట్లు కర్మఫలముల ననుభవింపవలసివచ్చినను వారు ఎట్టి నష్టము పొందబోరు. ఏలయన శుభప్రదమైన కృష్ణభక్తిభావనను మరుపునకు వచ్చునటువంటిది కాదు. అంతియేగాక ఆ విధముగా నియుక్తుడైనవాడు తదుపరి జన్మమున నీచకులమున బుట్టినను దానిని కొనసాగించగలుగును. అట్లుగాక మనుజుడు విధ్యుక్తధర్మములను నిష్టగా నిర్వహించినను ఒకవేళ కృష్ణభక్తిభావన లేనివాడై శుభఫలములను పొందలేక పోవచ్చును.
దీనిని మనము ఈ క్రింది విధముగా అర్థము చేసికొనవచ్చును. మనుజులను క్రమపద్ధతి గలవారు మరియు క్రమపద్ధతి లేనివారని రెండు తరగతులుగా విభజింపవచ్చును. మరుజన్మ జ్ఞానము ఏమాత్రము లేకుండా లేదా ముక్తిని గూర్చిన చింతను కలిగియుండక కేవలము ఇంద్రియభోగమునందే నిలిచియుండెడివారు క్రమపద్ధతి లేనివారు. శాస్త్రములలో తెలియజేయబడిన విధ్యుక్తధర్మములను విధిగా అనుసరించువారు క్రమపద్ధతి గలవారు. క్రమపద్ధతిని పాటించనివారు నాగరికులైనను, అనాగరికులైనను, విద్యావంతులైనను, అవిద్యావంతులైనను, బలవంతులైనను, బలహీనులైనను సర్వులు జంతులక్షణములనే కలిగియుందురు. ఆహారము, నిద్ర, భయము, మైథునము వంటి జంతులక్షణములనే కలిగియుందురు. ఆహారము, నిద్ర, భయము, మైథునము వంటి జంతులక్షణములందే మునిగి యున్నందున, కర్మలు అశుభములై వారు సదా దుఃఖకరమైన భౌతికత్వమునందే పడియుందురు. కాని శాస్త్రనియమానుసారము నియమితజీవనము కలిగిన క్రమపద్ధతి గలవారు క్రమముగా కృష్ణభక్తిభావన యందు పురోభివృద్ధిని పొంది జీవితాభ్యుదయమును గాంచుదురు.
ఇక ఈ పుణ్యమార్గమును అనుసరించువారు తిరిగి మూడు తరగతులుగా విభజింపవచ్చును. 1.భౌతికాభ్యుదయమును అనుభవించుచునే శాస్త్రనియమ, నిబంధనలను అనుసరించువారు. 2.భౌతికత్వము నుండి చరమముక్తిని బడయుటకై యత్నించువారు 3.కృష్ణభక్తిరసభావితమతులు.భౌతికానందము కొరకై శాస్త్రనియమములను అనుసరించు మొదటి తరగతివారిని తిరిగి రెండు తరగతులుగా విభజింపవచ్చును. వారే కామ్యకర్మరతులు మరియు ఇంద్రియభోగమునకై కర్మఫలములను కోరనివారు. ఇంద్రియభోగార్థమై కర్మఫలములను కోరువారు ఉత్తమజన్మమును (చివరకు ఉత్తమలోకములను కూడా) పొందవచ్చునేమో గాని భౌతికత్వము నుండి విడివడినారు కానందున వాస్తవమైన శుభమార్గమున చనువారిగా గుర్తింపబడరు. మనుజునికి ముక్తి వైపునకు నడుపు కర్మలే నిజమునకు శుభకర్మలు. చరమమైన ఆత్మానుభవమునకు లేదా భవబంధముల నుండి ముక్తి కొరకు ఉద్దేశింపబడని ఏ కర్మయు శుభకరము కానేరదు. కేవలము కృష్ణభక్తిభావన యందలి కర్మమే శుభకరకార్యము. కనుకనే కృష్ణునికి యందు పురోభివృద్ధి నొందుటకై తనంతట తాను సర్వవిధములైన దేహపర అసౌకర్యములను అంగీకరించువాడు తపోనిష్టుడైన ఉత్తమయోగి యనబడును. ఇట్టి కృష్ణభక్తిభావనపు చరమానుభవమును పొందుట కొరకే ఉద్దేశింపబడియున్నందున అష్టాంగయోగపద్ధతియు శుభకరమే అయియున్నది. కనుకనే ఈ విషయమున తన శక్త్యానుసారము యత్నించువాడు పతనభయమును కలిగియుండ నవసరము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 254 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 40 🌴
40. śrī-bhagavān uvāca
pārtha naiveha nāmutra
vināśas tasya vidyate
na hi kalyāṇa-kṛt kaścid
durgatiṁ tāta gacchati
🌷 Translation :
The Supreme Personality of Godhead said: Son of Pṛthā, a transcendentalist engaged in auspicious activities does not meet with destruction either in this world or in the spiritual world; one who does good, My friend, is never overcome by evil.
🌹 Purport :
In the Śrīmad-Bhāgavatam (1.5.17) Śrī Nārada Muni instructs Vyāsadeva as follows:
tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer
bhajann apakvo ’tha patet tato yadi
yatra kva vābhadram abhūd amuṣya kiṁ
ko vārtha āpto ’bhajatāṁ sva-dharmataḥ
“If someone gives up all material prospects and takes complete shelter of the Supreme Personality of Godhead, there is no loss or degradation in any way. On the other hand a nondevotee may fully engage in his occupational duties and yet not gain anything.” For material prospects there are many activities, both scriptural and customary. A transcendentalist is supposed to give up all material activities for the sake of spiritual advancement in life, Kṛṣṇa consciousness. One may argue that by Kṛṣṇa consciousness one may attain the highest perfection if it is completed, but if one does not attain such a perfectional stage, then he loses both materially and spiritually. It is enjoined in the scriptures that one has to suffer the reaction for not executing prescribed duties; therefore one who fails to discharge transcendental activities properly becomes subjected to these reactions. The Bhāgavatam assures the unsuccessful transcendentalist that there need be no worries. Even though he may be subjected to the reaction for not perfectly executing prescribed duties, he is still not a loser, because auspicious Kṛṣṇa consciousness is never forgotten, and one so engaged will continue to be so even if he is lowborn in the next life. On the other hand, one who simply follows strictly the prescribed duties need not necessarily attain auspicious results if he is lacking in Kṛṣṇa consciousness.
The purport may be understood as follows. Humanity may be divided into two sections, namely, the regulated and the nonregulated. Those who are engaged simply in bestial sense gratifications without knowledge of their next life or spiritual salvation belong to the nonregulated section. And those who follow the principles of prescribed duties in the scriptures are classified amongst the regulated section. The nonregulated section, both civilized and noncivilized, educated and noneducated, strong and weak, are full of animal propensities. Their activities are never auspicious, because while enjoying the animal propensities of eating, sleeping, defending and mating, they perpetually remain in material existence, which is always miserable. On the other hand, those who are regulated by scriptural injunctions, and who thus rise gradually to Kṛṣṇa consciousness, certainly progress in life.
Those who are following the path of auspiciousness can be divided into three sections, namely (1) the followers of scriptural rules and regulations who are enjoying material prosperity, (2) those who are trying to find ultimate liberation from material existence, and (3) those who are devotees in Kṛṣṇa consciousness. Those who are following the rules and regulations of the scriptures for material happiness may be further divided into two classes: those who are fruitive workers and those who desire no fruit for sense gratification. Those who are after fruitive results for sense gratification may be elevated to a higher standard of life – even to the higher planets – but still, because they are not free from material existence, they are not following the truly auspicious path. The only auspicious activities are those which lead one to liberation. Any activity which is not aimed at ultimate self-realization or liberation from the material bodily concept of life is not at all auspicious.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 20/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 255: 06వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 255: Chap. 06, Ver. 41
🌹. శ్రీమద్భగవద్గీత - 255 / Bhagavad-Gita - 255 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 41 🌴
41. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ: సమా: |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ||
🌷. తాత్పర్యం :
యోగభ్రష్టులైనవాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరముల సుఖముల ననుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును.
🌷. భాష్యము :
యోగమునందు కృతకృత్యులు కానివారికి రెండుతరగతులుగా విభజింపవచ్చును. వారే 1. యోగమునందు కొద్దిపాటి పురోగతి పిమ్మట పతనము నొందినవారు 2. యోగమునందు తీవ్ర అభ్యాసము చేసిన పిమ్మట పతనము నొందినట్టివారు. కొలదికాల యోగాభ్యాసము పిమ్మట పతనమైనవాడు పుణ్యలోకములను (పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతి కలిగిన) పొందును. అచ్చట చిరకాల జీవనము పిమ్మట అతడు తిరిగి ఈ లోకమునకు పంపబడి పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబమున గాని లేదా ధనవంతులైనవారి ఇంట గాని జన్మమునొందును.
ఈ అధ్యాయపు చివరి శ్లోకమున వివరింపబడినట్లు కృష్ణభక్తిభావన యందు పూర్ణత్వమును పొందుటయే యోగము యొక్క నిజప్రయోజనమై యున్నది. కాని అంత దీర్ఘకాలము యోగమును అభ్యసింపజాలాక భౌతికాకర్షణలచే ప్రభావితులై యోగమునందు కృతకృత్యులు కాలేనివారికి భగవత్కరుణచే వారి విషయభావనలను తృప్తిపరచుకొను అవకాశము కల్పింపబడును. ఆ పిదప వారికి పవిత్రమైన కుటుంబమున గాని లేదా ధనవంతులైనవారి ఇంట గాని జీవించు అవకాశము ఒసగబడును. అట్టి కుటుంబములందు జన్మించినవారు తమకు లభించిన సౌకర్యములను సద్వినియోగపరచుకొని తిరిగి కృష్ణభక్తిభావన యందు అభ్యుదయమును పొందుటకు యత్నించు నవకాశము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 255 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 41 🌴
41. prāpya puṇya-kṛtāṁ lokān
uṣitvā śāśvatīḥ samāḥ
śucīnāṁ śrīmatāṁ gehe
yoga-bhraṣṭo ’bhijāyate
🌷 Translation :
The unsuccessful yogī, after many, many years of enjoyment on the planets of the pious living entities, is born into a family of righteous people, or into a family of rich aristocracy.
🌹 Purport :
The unsuccessful yogīs are divided into two classes: one is fallen after very little progress, and one is fallen after long practice of yoga. The yogī who falls after a short period of practice goes to the higher planets, where pious living entities are allowed to enter. After prolonged life there, one is sent back again to this planet, to take birth in the family of a righteous brāhmaṇa Vaiṣṇava or of aristocratic merchants.
The real purpose of yoga practice is to achieve the highest perfection of Kṛṣṇa consciousness, as explained in the last verse of this chapter. But those who do not persevere to such an extent and who fail because of material allurements are allowed, by the grace of the Lord, to make full utilization of their material propensities. And after that, they are given opportunities to live prosperous lives in righteous or aristocratic families. Those who are born in such families may take advantage of the facilities and try to elevate themselves to full Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 21/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 256: 06వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 256: Chap. 06, Ver. 42
🌹. శ్రీమద్భగవద్గీత - 256 / Bhagavad-Gita - 256 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 42 🌴
42. అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||
🌷. తాత్పర్యం :
లేదా (దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో) అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మము నొందును. కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును.
🌷. భాష్యము :
జీవితారంభము నుండియే శిశువునకు ఆధ్యాత్మిక ప్రోత్సాహము లభించును కనుక జ్ఞానవంతులైన యోగుల ఇంట లేదా భక్తుల ఇంట జన్మము అతిఘనముగా ఇచ్చట కీర్తించబడినది. ఇట్టిది ఆచార్యుల వంశమునందు లేదా గోస్వాములు వంశమునందు ప్రత్యేకమైనదియై యున్నది. అట్టి వంశములవారు సంస్కృతి మరియు శిక్షణ కారణమున జ్ఞానవంతులను, భక్తులును అయియుందురు. తత్కారణమున వారు ఆధ్యాత్మికాచార్యులు కాగలరు. భారతదేశమునందు అట్టి ఆచార్యుల వంశములు పెక్కుయున్నను విద్య మరియు శిక్షణ లోపించియున్నందున అవి ప్రస్తుతము పతనము నొందియున్నవి. అయినను భగవత్కరుణచే అట్టి వంశములు కొన్ని ఇంకను తరతరములుగా భక్తులను వృద్ధిచేయుచున్నవి. అటువంటి వంశములందు జన్మించుట యనునది నిశ్చయముగా మిక్కిలి అదృష్టకరవిషయము. భగవత్కృప చేతనే నా ఆధ్యాత్మిక గురువైన ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారును మరియు నేనును అటువంటి భక్తుల వంశములలో జన్మించుటకు అవకాశమును పొందితిమి. ఆ విధముగా జీవితారంభము నుండియు మేము శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు సుశిక్షితులమై తదుపరి దివ్యమగు భగవత్సంకల్పముచే ఒకరినొకరు కలిసికొంటివి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 256 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 42 🌴
42. Or [if unsuccessful after long practice of yoga] he takes his birth in a family of transcendentalists who are surely great in wisdom. Certainly, such a birth is rare in this world.
🌷 Translation :
Or [if unsuccessful after long practice of yoga] he takes his birth in a family of transcendentalists who are surely great in wisdom. Certainly, such a birth is rare in this world.
🌹 Purport :
Birth in a family of yogīs or transcendentalists – those with great wisdom – is praised herein because the child born in such a family receives a spiritual impetus from the very beginning of his life. It is especially the case in the ācārya or gosvāmī families. Such families are very learned and devoted by tradition and training, and thus they become spiritual masters. In India there are many such ācārya families, but they have now degenerated due to insufficient education and training. By the grace of the Lord, there are still families that foster transcendentalists generation after generation. It is certainly very fortunate to take birth in such families. Fortunately, both our spiritual master, Oṁ Viṣṇupāda Śrī Śrīmad Bhaktisiddhānta Sarasvatī Gosvāmī Mahārāja, and our humble self had the opportunity to take birth in such families, by the grace of the Lord, and both of us were trained in the devotional service of the Lord from the very beginning of our lives. Later on we met by the order of the transcendental system.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 22/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 257: 06వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 257: Chap. 06, Ver. 43
🌹. శ్రీమద్భగవద్గీత - 257 / Bhagavad-Gita - 257 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 43 🌴
43. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయ: సంసిద్ధౌ కురునన్దన ||
🌷. తాత్పర్యం :
ఓ కురునందనా! అట్టి జన్మను పొందిన పిమ్మట అతడ గతజన్మపు దివ్యచైతన్యమును పునరిద్ధరించుకొని పూర్ణవిజయమును సాధించుటకు తిరిగి యత్నము కావించును.
🌷. భాష్యము :
పూర్వజన్మపు ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతము చేయుటకు ఉత్తమజన్మ అవసరమనెడి విషయమునకు తన మూడవజన్మను ఉత్తమ బ్రహ్మణవంశములో పొందినట్టి భరతమాహారాజు వృత్తాంతము చక్కని ఉదాహరణమై యున్నది.
భరతమాహారాజు సమస్త ప్రపంచమునకు చక్రవర్తియై యుండెను. అతని కాలము నుండియే ఈ లోకము భారతవర్షముగా దేవతాలోకములలో ప్రసిద్ధి నొందినది.
పూర్వము ఇది ఇలావృతవర్షముగా తెలియబడెడిది. ప్రపంచాధినేతయైన అతడు ఆధ్యాత్మికసిద్ధిని గోరి యుక్తవయస్సు నందే కర్మల నుండి విరమణను పొందినను జయమును సాధింపలేకపోయెను.
తత్కారణముగా అతడు జన్మనెత్తవలసి వచ్చినను, మూడవజన్మను ఒక ఉత్తమబ్రాహ్మణుని ఇంట పొందెను. సదా ఏకాంతస్థలములో వసించుచు మౌనియై నిలిచినందున అతడు జడభరతుడని పిలువబడెను. కాని అతడు గొప్పయోగి యని తదనంతరము రహుగణుడను రాజు అవగతము చేసికొనగలిగెను.
ఆధ్యాత్మిక యత్నములు (యోగాభ్యాసము) ఎన్నడును వృథా కావని భరతుని ఈ చరిత్ర ద్వారా అవగతమగుచున్నది. అనగా యోగాభ్యాసి శ్రీకృష్ణభగవానుని కరుణచే కృష్ణభక్తిభావన యందలి పూర్ణత్వమునకై అనుకూల పరిస్థితులను మరల మరల పొందుచునే యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 257 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 43 🌴
43. tatra taṁ buddhi-saṁyogaṁ
labhate paurva-dehikam
yatate ca tato bhūyaḥ
saṁsiddhau kuru-nandana
🌷 Translation :
On taking such a birth, he revives the divine consciousness of his previous life, and he again tries to make further progress in order to achieve complete success, O son of Kuru.
🌹 Purport :
King Bharata, who took his third birth in the family of a good brāhmaṇa, is an example of good birth for the revival of previous transcendental consciousness.
King Bharata was the emperor of the world, and since his time this planet has been known among the demigods as Bhārata-varṣa. Formerly it was known as Ilāvṛta-varṣa.
The emperor, at an early age, retired for spiritual perfection but failed to achieve success. In his next life he took birth in the family of a good brāhmaṇa and was known as Jaḍa Bharata because he always remained secluded and did not talk to anyone. And later on he was discovered as the greatest transcendentalist by King Rahūgaṇa. From his life it is understood that transcendental endeavors, or the practice of yoga, never go in vain.
By the grace of the Lord the transcendentalist gets repeated opportunities for complete perfection in Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 23/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 258: 06వ అధ్., శ్లో 44 / Bhagavad-Gita - 258: Chap. 06, Ver. 44
🌹. శ్రీమద్భగవద్గీత - 258 / Bhagavad-Gita - 258 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 44 🌴
44. పూర్వభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి స: |
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ||
🌷. తాత్పర్యం :
పూర్వజన్మపు దివ్యచైతన్య కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగము వైపునకు ఆకర్షితుడగును. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మనియమములకు సదా అతీతుడై యుండును.
🌷. భాష్యము :
ఉన్నతులైన యోగులు శాస్త్రములందు తెలుపబడిన కర్మల యెడ అంతగా ఆకర్షితులు కాక, ఉన్నతయోగ పూర్ణత్వమైన పూర్ణ కృష్ణభక్తిభావనకు తమను ఉద్దరింపచేసెడి యోగనియమముల వైపునకే అప్రయత్నముగా ఆకర్షితులగుదురు. ఉన్నతమైన యోగులు అట్లు వేదకర్మల యెడ చూపు ఉపేక్షను గూర్చి శ్రీమద్భాగవతము (శ్రీమద్భాగవతము 3.33.7) నందు ఈ విధముగా వివరింపబడినది.
అహో బత శ్వపచో(తో గరీయాన్
యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్ |
తేపు స్తపస్తే జుహువు: సస్నురార్యా
బ్రహ్మానూచుర్నామ గృణన్తి యే తే ||
“హే ప్రభూ! శునకమాంసమును భుజించు చండాలుర వంశమున జన్మించినను నీ పవిత్రనామములను కీర్తించువారు ఆధ్యాత్మికజీవనమున పురోగతి సాధించునట్టివారే. అట్టి భక్తులు అన్నిరకములైన తపస్సులను, యజ్ఞములను ఆచరించినట్టివారే. అన్ని తీర్థ స్థానములలో స్నానమాడినట్టివారే, సకల శాస్త్రాధ్యయనమును గావించినట్టివారే.”
శ్రీహరిదాసటాకూరును ముఖ్యశిష్యులలో ఒకనిగా స్వీకరించుట ద్వారా శ్రీచైతన్యమాహాప్రభువు ఈ విషయమున ఒక చక్కని ఉదాహరణమును నెలకొల్పిరి. హరిదాసటాకురు మహ్మదీయవంశమున జన్మించినను శ్రీచైతన్యమహాప్రభువు ఆయనను “నామాచార్యుని” స్థానమనకు ఉద్ధరించిరి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రము ద్వారా మూడులక్షల హరినామమును విడువక పట్టుదలతో ఆయన నిత్యము జపించుటయే అందులకు కారణము. హరినామమును నిరంతరము జపించుటను బట్టి శబ్దబ్రహ్మమని పిలువబడు వేదకర్మవిధానముల నన్నింటిని పూర్వజన్మమందే ఆయన పూర్తిచేసినట్లుగా అవగతమగుచున్నది. కనుకనే పవిత్రులు కానిదే ఎవ్వరును కృష్ణభక్తిరసభావనను స్వీకరించుట గాని, శ్రీకృష్ణుని పవిత్రనామమైన హరేకృష్ణ మాహామంత్రం జపకీర్తనములందు నియుక్తులగుట గాని సంభవించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 258 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 44 🌴
44. pūrvābhyāsena tenaiva
hriyate hy avaśo ’pi saḥ
jijñāsur api yogasya
śabda-brahmātivartate
🌷 Translation :
By virtue of the divine consciousness of his previous life, he automatically becomes attracted to the yogic principles – even without seeking them. Such an inquisitive transcendentalist stands always above the ritualistic principles of the scriptures.
🌹 Purport :
Advanced yogīs are not very much attracted to the rituals of the scriptures, but they automatically become attracted to the yoga principles, which can elevate them to complete Kṛṣṇa consciousness, the highest yoga perfection. In the Śrīmad-Bhāgavatam (3.33.7), such disregard of Vedic rituals by the advanced transcendentalists is explained as follows:
aho bata śva-paco ’to garīyān
yaj-jihvāgre vartate nāma tubhyam
tepus tapas te juhuvuḥ sasnur āryā
brahmānūcur nāma gṛṇanti ye te
“O my Lord! Persons who chant the holy names of Your Lordship are far, far advanced in spiritual life, even if born in families of dog-eaters. Such chanters have undoubtedly performed all kinds of austerities and sacrifices, bathed in all sacred places and finished all scriptural studies.”
The famous example of this was presented by Lord Caitanya, who accepted Ṭhākura Haridāsa as one of His most important disciples. Although Ṭhākura Haridāsa happened to take his birth in a Muslim family, he was elevated to the post of nāmācārya by Lord Caitanya due to his rigidly attended principle of chanting three hundred thousand holy names of the Lord daily: Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. And because he chanted the holy name of the Lord constantly, it is understood that in his previous life he must have passed through all the ritualistic methods of the Vedas, known as śabda-brahma. Unless, therefore, one is purified, one cannot take to the principles of Kṛṣṇa consciousness or become engaged in chanting the holy name of the Lord, Hare Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 24/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 259: 06వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 259: Chap. 06, Ver. 45
🌹. శ్రీమద్భగవద్గీత - 259 / Bhagavad-Gita - 259 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 45 🌴
45. ప్రయత్నాద్ యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిష: |
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ ||
🌷. తాత్పర్యం :
సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినపుడు బహుజన్మల అభ్యాసము పిదప పూర్ణత్వమును బడసి, అంత్యమున పరమగతి పొందును.
🌷. భాష్యము :
పవిత్రము, సంపన్నవంతము లేదా ధర్మయుక్తమైన వంశమున జన్మించిన మనుజుడు యోగాభ్యాసమునకై తనకున్నటువంటి అనుకూల పరిస్థితులను గుర్తించి అసంపూర్ణముగా మిగిలిన తన కార్యమును తీవ్రనిశ్చయముతో ఆరంభించును. ఆ విధముగా అతడు సమస్త పాపముల నుండి తనను ముక్తుని గావించుకొనును. అతడట్లు అంత్యమున సర్వపాపముల నుండి విడివడినంతనే పరమ పూర్ణత్వమైనటువంటి కృష్ణభక్తిరసభావనము అతని ప్రాప్తించగలదు. అట్టి కృష్ణభక్తిరసభావనము సర్వవిధములైన కల్మషముల నుండి దూరమైన సంపూర్ణస్థితియై యున్నది. ఈ విషయము భగవద్గీత (7.28) యందే ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది.
యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతా: ||
“బహుజన్మల యందు పుణ్యకర్మల నొనరించి సర్వపాపముల నుండియు మరియు భ్రాంతిమయమగు ద్వంద్వముల నుండియు విముక్తుడైనపుడు మనుజుడు శ్రీకృష్ణభగవానుని ప్రేమయుతసేవ యందు నియుక్తుడు కాగలడు.”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 259 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 45 🌴
45. prayatnād yatamānas tu
yogī saṁśuddha-kilbiṣaḥ
aneka-janma-saṁsiddhas
tato yāti parāṁ gatim
🌷 Translation :
And when the yogī engages himself with sincere endeavor in making further progress, being washed of all contaminations, then ultimately, achieving perfection after many, many births of practice, he attains the supreme goal.
🌹 Purport :
A person born in a particularly righteous, aristocratic or sacred family becomes conscious of his favorable condition for executing yoga practice. With determination, therefore, he begins his unfinished task, and thus he completely cleanses himself of all material contaminations. When he is finally free from all contaminations, he attains the supreme perfection – Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is the perfect stage of being freed of all contaminations. This is confirmed in the Bhagavad-gītā (7.28):
yeṣāṁ tv anta-gataṁ pāpaṁ
janānāṁ puṇya-karmaṇām
te dvandva-moha-nirmuktā
bhajante māṁ dṛḍha-vratāḥ
“After many, many births of executing pious activities, when one is completely freed from all contaminations, and from all illusory dualities, one becomes engaged in the transcendental loving service of the Lord.”
🌹 🌹 🌹 🌹 🌹
Date: 25/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 260: 06వ అధ్., శ్లో 46 / Bhagavad-Gita - 260: Chap. 06, Ver. 46
🌹. శ్రీమద్భగవద్గీత - 260 / Bhagavad-Gita - 260 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 46 🌴
46. తపస్విభ్యో(ధికో యోగీ జ్ఞానిభ్యో(పి మతోధిక: |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||
🌷. తాత్పర్యం :
యోగియైనవాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మరతుని కన్నను అధికుడైనట్టివాడు. కనుక ఓ అర్జునా! అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము.
🌷. భాష్యము :
యోగమును గూర్చి చర్చించినపుడు దానిని స్వీయచైతన్యమును పరతత్వముతో సంధించు విధానముగా మనము అన్వయింతుము. అట్టి విధానము మనుజులు తామనుసరించు ప్రత్యేక పద్ధతిని బట్టి వివిధనామములతో పిలుతురు. కామ్యకర్మలు అధికముగా నున్నచో అట్టి అనుసంధాన పద్ధతి కర్మయోగామనియు, జ్ఞానముతో అధికముగా ముడివడి యున్నచో జ్ఞానయోగామనియు, శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తకార్యములతో నిండియున్నచో భక్తియోగమును పిలువబడును. తదుపరి శ్లోకములలో వివరింపబడినట్లు భక్తియోగమే(కృష్ణభక్తిరసభావనము) సర్వయోగములకు చరమ పూర్ణత్వమై యున్నది. భగవానుడు ఇచ్చట యోగము యొక్క అధిపత్యమును ధ్రువీకరుంచుచున్నను, దానిని భక్తియోగము కన్నను ఉత్తమమని మాత్రము పలికియుండలేదు. వాస్తవమునకు భక్తియోగము సంపూర్ణ ఆధ్యాత్మికజ్ఞానమైనందున దానిని ఏ యోగము సైతము అతిశయింపలేదు. ఆత్మజ్ఞానములేని తపస్సు అసంపూర్ణమైనది. అలాగుననే భగవానుని శరణాగతి లేని జ్ఞానము సైతము అసంపూర్ణమై యున్నది. ఇక కృష్ణభక్తిభావన లేనటువంటి కామ్యకర్మ వృథాకాలవ్యయమే అయియున్నది. కనుకనే ఇచ్చట ఘనముగా కీర్తించబడిన యోగపద్ధతి వాస్తవమునకు భక్తియోగమే. ఈ విషయము రాబోవు శ్లోకములలో మరింత విపులముగా వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 260 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 46 🌴
46. tapasvibhyo ’dhiko yogī
jñānibhyo ’pi mato ’dhikaḥ
karmibhyaś cādhiko yogī
tasmād yogī bhavārjuna
🌷 Translation :
A yogī is greater than the ascetic, greater than the empiricist and greater than the fruitive worker. Therefore, O Arjuna, in all circumstances, be a yogī.
🌹 Purport :
When we speak of yoga we refer to linking our consciousness with the Supreme Absolute Truth. Such a process is named differently by various practitioners in terms of the particular method adopted. When the linking process is predominantly in fruitive activities it is called karma-yoga, when it is predominantly empirical it is called jñāna-yoga, and when it is predominantly in a devotional relationship with the Supreme Lord it is called bhakti-yoga. Bhakti-yoga, or Kṛṣṇa consciousness, is the ultimate perfection of all yogas, as will be explained in the next verse. The Lord has confirmed herein the superiority of yoga, but He has not mentioned that it is better than bhakti-yoga. Bhakti-yoga is full spiritual knowledge, and therefore nothing can excel it. Asceticism without self-knowledge is imperfect. Empiric knowledge without surrender to the Supreme Lord is also imperfect. And fruitive work without Kṛṣṇa consciousness is a waste of time. Therefore, the most highly praised form of yoga performance mentioned here is bhakti-yoga, and this is still more clearly explained in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 26/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
శ్రీమద్భగవద్గీత - 261: 06వ అధ్., శ్లో 47 / Bhagavad-Gita - 261: Chap. 06, Ver. 47
🌹. శ్రీమద్భగవద్గీత - 261 / Bhagavad-Gita - 261 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 47 🌴
47. యోగినామపి సర్వేషాం మద్గాతేనాన్తరాత్మనా |
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మత: ||
🌷. తాత్పర్యం :
అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను ఒనరించువాడును అగు యోగి యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడై యున్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము.
🌷. భాష్యము :
ఇచ్చట “భజతే” యను పదము అతిముఖ్యమైనది. “భజ్” యను ధాతువునుండి పుట్టిన భజతే యను పదము సేవను కూర్చుటనెడి విషయమునందు ఉపయోగింపబడును. “వర్షిప్” యను ఆంగ్లపదము “భజ్” యనుదాని భావనలో ఉపయోగింపలేము. పూజించుట లేదా ఉత్తముడైనవానికి గౌరవమర్యాదలను చూపుటన్న భావనమే ఆ అంగ్లపదము సూచించును. కాని శ్రద్ధ మరియు ప్రేమతో ఒనరింపబడు సేవ యను పదము కేవలము శ్రీకృష్ణభగవానునికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడియున్నది. గౌరవనీయుడైన వ్యక్తిని లేదా ఏదేని దేవతను పూజింపనపుడు మనుజుడు అమర్యాదపరునిగా మాత్రమే పిలువబడును. కాని భగవానునికి సేవను గూర్చనిచో భ్రష్టుడై నశించును. ప్రతిజీవుయు శ్రీకృష్ణభగవానుని అంశయైనందున తన నిజస్థితి కారణముగా అతడు ఆ దేవదేవునికి సేవను గూర్చవలసియున్నది. ఒకవేళ అతడు ఆ విధముగా గావించినచో పతనము నొందగలడు.
య యేషాం పురషం సాక్షాద్ ఆత్మప్రభవ మీశ్వరమ్ |
న భజన్త్యవజానన్తి స్థానాద్ భ్రష్టా: పతన్త్యధ: ||
“సర్వజీవులకు కారణుడైన భగవానునికి సేవను గూర్చక ఆ పరమపురుషుని యెడ తనకు గల ధర్మమును ఉపేక్షించువాడు నిక్కముగా తన నిజస్థితి నుండి పతితిడు కాగలడు.”
ఈ శ్లోకము నందు కూడా “భజన్తి” యను పదము ఉపయోగించబడినది. అనగా “భజన్తి” యను పదము కేవలము భగవానునికే చిందియుండగా, ‘వర్షిప్’ యను ఆంగ్లపదము దేవతలకు లేదా ఎవరేని సాధారణజీవులకు ఉపయోగయొగ్యమై యున్నది. ఈ భాగవతశ్లోకము నందు వాడబడిన “అవజానన్తి” యను పదము భగవద్గీత యందును గోచరించగలదు. “అవజానన్తి మాం మూఢా: - మూర్ఖులు మాత్రమే దేవదేవుడైన శ్రీకృష్ణుని అపహాస్యము చేయుదురు”. అట్టి మూర్ఖులు భగవానుని యెడ ఎట్టి సేవాభావములేకనే గీతకు వ్యాఖ్యానము వ్రాయుటకు యత్నించు కారణముగా భజన్తి మరియు వర్షిప్ యను పదములకు అర్థభేదమును చక్కగా గ్రహింపజాలరు.
వాస్తవమునకు అన్నియోగముల పరమావధి భక్తియోగమునందే కలదు. అనగా అన్నియోగములు భక్తియోగమందలి భక్తి యనెడి కేంద్ర విషయమును చేరుటకు సాధనముల వంటివి మాత్రమే. యోగామనగా నిజమునకు భక్తియోగమే. ఇతర యోగములన్నియును భక్తియోగ గమ్యస్థానము వైపునకు ప్రయాణించునట్టివే. కర్మయోగాముతో ప్రారంభమై భక్తియోగముతో సమాప్తము నొందు ఆత్మానుభవమార్గము అతి దీర్ఘమైనది. అట్టి సుదీర్ఘమార్గమున కర్మఫలవర్జితమైన కర్మయోగము ఆరంభము వంటిది. జ్ఞానము మరియు వైరాగ్యములతో కర్మయోగము వృద్ధినొందినప్పుడు అట్టి స్థితి జ్ఞానయోగమనబడును. వివిధములైన ఆసనములు, పద్దతుల ద్వారా పరమాత్మ ధ్యానము నందు జ్ఞానము వృద్ధియై, మనస్సు పరమాత్మ యందే నిలిచినపుడు అది అష్టాంగయోగమనబడును. మనుజుడు అట్టి అష్టాంగయోగమును దాటి దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనెడి కేంద్రవిషయమునకు అరుదెంచినపుడు అది భక్తియోగామనబడును. వాస్తవమునకు ఈ భక్తియోగము తుదిలక్ష్యమైనను దాని విశ్లేషణాత్మక అవగాహనకు ఇతర యోగముల అవగాహనము కూడా అవసరమైయున్నది. కనుకనే ఆధ్యాత్మికమార్గమున క్రమముగా పురోభివృద్ధినొందు యోగి నిజమైన నిత్యలాభమార్గమున పయనించువానిగా పరిగణింపబడును. అట్లుగాక ఏదియో ఒక విషయమును అంటిపెట్టుకొని ఏమాత్రము పురోగతిని సాధింపనివాడు కర్మయోగియనో, జ్ఞానయోగియానో, ధ్యానయోగియనో, రాజయోగియనో, హతయోగియనో ప్రత్యేక నామములతో పిలువబడును. కనుకనే భక్తియోగమను స్థానమును చేరగలిగిన భక్తుడు సర్వయోగములను అతిశయించినవానిగా పరిగణింపబడును. అనగా హిమాలయములను గూర్చి మనము చర్చించినపుడు, వానిని ప్రపంచమందలి ఎత్తైన పర్వతములుగా అంగీకరించి వాని యందలి ఎవరెస్ట్ శిఖరమును అత్యున్నత శిఖరముగా గుర్తించు రీతి, కృష్ణభక్తిరసభావనముకు వచ్చుటయే యోగము యొక్క అత్యున్నత స్థితిగా భావింపబడును.
గొప్ప భాగ్యవశముననే మనుజుడు భక్తియోగపథమునందలి కృష్ణభక్తిరసభావనకు అరుదెంచి వేదనిర్దేశము ననుసరించి సుస్థిరుడు కాగలడు. ఆదర్శనీయుడైన యోగి శ్యామసుందరుడను, నీలమేఘశ్యాముడును, సూర్యునిభాతి ప్రకాశించు కలువముఖము గలవాడును, మణులు పొదగబడిన వస్త్రమును దాల్చినవాడును,పూమాలలను ధరించువాడును అగు శ్రీకృష్ణభగవానునే ధ్యానించును, బ్రహ్మజ్యోతిగా పిలువబడు అతని తేజోమయమైన దేహకాంతి సర్వదిక్కులను ప్రకాశింపజేయును. రాముడు, నృసింహుడు, వరాహాది పలు అవతారములలో అతడు అవతరించుచుండును.
🌹 Bhagavad-Gita as It is - 261 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 47 🌴
47. yoginām api sarveṣāṁ
mad-gatenāntar-ātmanā
śraddhāvān bhajate yo māṁ
sa me yukta-tamo mataḥ
🌷 Translation :
And of all yogīs, the one with great faith who always abides in Me, thinks of Me within himself and renders transcendental loving service to Me – he is the most intimately united with Me in yoga and is the highest of all. That is My opinion.
🌹 Purport :
The word bhajate is significant here. Bhajate has its root in the verb bhaj, which is used when there is need of service. The English word “worship” cannot be used in the same sense as bhaj. Worship means to adore, or to show respect and honor to the worthy one. But service with love and faith is especially meant for the Supreme Personality of Godhead. One can avoid worshiping a respectable man or a demigod and may be called discourteous, but one cannot avoid serving the Supreme Lord without being thoroughly condemned. Every living entity is part and parcel of the Supreme Personality of Godhead, and thus every living entity is intended to serve the Supreme Lord by his own constitution. Failing to do this, he falls down. The Bhāgavatam (11.5.3) confirms this as follows:
ya eṣāṁ puruṣaṁ sākṣād
ātma-prabhavam īśvaram
na bhajanty avajānanti
sthānād bhraṣṭāḥ patanty adhaḥ
“Anyone who does not render service and neglects his duty unto the primeval Lord, who is the source of all living entities, will certainly fall down from his constitutional position.”
In this verse also the word bhajanti is used. Therefore, bhajanti is applicable to the Supreme Lord only, whereas the word “worship” can be applied to demigods or to any other common living entity. The word avajānanti, used in this verse of Śrīmad-Bhāgavatam, is also found in the Bhagavad-gītā. Avajānanti māṁ mūḍhāḥ: “Only the fools and rascals deride the Supreme Personality of Godhead, Lord Kṛṣṇa.” Such fools take it upon themselves to write commentaries on the Bhagavad-gītā without an attitude of service to the Lord. Consequently they cannot properly distinguish between the word bhajanti and the word “worship.”
The culmination of all kinds of yoga practices lies in bhakti yoga. All other yogas are but means to come to the point of bhakti in bhakti-yoga. Yoga actually means bhakti-yoga; all other yogas are progressions toward the destination of bhakti-yoga. From the beginning of karma-yoga to the end of bhakti-yoga is a long way to self-realization. Karma-yoga, without fruitive results, is the beginning of this path. When karma-yoga increases in knowledge and renunciation, the stage is called jñāna-yoga. When jñāna-yoga increases in meditation on the Supersoul by different physical processes, and the mind is on Him, it is called aṣṭāṅga-yoga. And when one surpasses the aṣṭāṅga-yoga and comes to the point of the Supreme Personality of Godhead Kṛṣṇa, it is called bhakti-yoga, the culmination. Factually, bhakti-yoga is the ultimate goal, but to analyze bhakti-yoga minutely one has to understand these other yogas. The yogī who is progressive is therefore on the true path of eternal good fortune. One who sticks to a particular point and does not make further progress is called by that particular name: karma-yogī, jñāna-yogī or dhyāna-yogī, rāja-yogī, haṭha-yogī, etc. If one is fortunate enough to come to the point of bhakti-yoga, it is to be understood that he has surpassed all other yogas. Therefore, to become Kṛṣṇa conscious is the highest stage of yoga, just as, when we speak of Himālayan, we refer to the world’s highest mountains, of which the highest peak, Mount Everest, is considered to be the culmination.
It is by great fortune that one comes to Kṛṣṇa consciousness on the path of bhakti-yoga to become well situated according to the Vedic direction.
The ideal yogī concentrates his attention on Kṛṣṇa, who is called Śyāmasundara, who is as beautifully colored as a cloud, whose lotuslike face is as effulgent as the sun, whose dress is brilliant with jewels, and whose body is flower-garlanded.
Illuminating all sides is His gorgeous luster, which is called the brahma-jyotir. He incarnates in different forms such as Rāma, Nṛsiṁha, Varāha and Kṛṣṇa, the Supreme Personality of Godhead, and He descends like a human being, as the son of mother Yaśodā, and He is known as Kṛṣṇa, Govinda and Vāsudeva. He is the perfect child, husband, friend and master, and He is full with all opulences and transcendental qualities. If one remains fully conscious of these features of the Lord, he is called the highest yogī.
This stage of highest perfection in yoga can be attained only by bhakti-yoga, as is confirmed in all Vedic literature:
yasya deve parā bhaktir
yathā deve tathā gurau
tasyaite kathitā hy arthāḥ
prakāśante mahātmanaḥ
“Only unto those great souls who have implicit faith in both the Lord and the spiritual master are all the imports of Vedic knowledge automatically revealed.” (Śvetāśvatara Upaniṣad 6.23)
Bhaktir asya bhajanaṁ tad ihāmutropādhi-nairāsyenāmuṣmin manaḥ-kalpanam, etad eva naiṣkarmyam. “Bhakti means devotional service to the Lord which is free from desire for material profit, either in this life or in the next. Devoid of such inclinations, one should fully absorb the mind in the Supreme. That is the purpose of naiṣkarmya.” (Gopāla-tāpanī Upaniṣad 1.15)
These are some of the means for performance of bhakti, or Kṛṣṇa consciousness, the highest perfectional stage of the yoga system.
Thus end the Bhaktivedanta Purports to the Sixth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Dhyāna-yoga.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 27/Jan/2020
---------------------------------------- x ----------------------------------------
Srimad Bhagavad Gita As It Is
For chapters from 07 through 12: Refer to another page #2
https://gita-telugu-english.blogspot.com/p/x-x-421-11.html
For chapters from 13 through 18: Refer to another page #3
https://gita-telugu-english.blogspot.com/p/srimad-bhagavad-gita-page-2-chapter-13.html