శ్రీమద్భగవద్గీత - 182: 04వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 182: Chap. 04, Ver. 20


🌹. శ్రీమద్భగవద్గీత - 182 / Bhagavad-Gita - 182 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 20 🌴

20. త్యక్త్వాకర్మఫలాసజ్గ్ం నిత్యతృప్తో నిరాశ్రయ: |
కర్మణ్యభిప్రవృత్తోవి నైవ కించత్ కరోతి స: ||



🌷. తాత్పర్యం :

కర్మఫలముల యెడ ఆసక్తిని విడిచి నిత్యతృప్తుడును, నిరాశ్రయుడును అయియుండెడి వాడు అన్నిరకములగు కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయని వాడే యగును.

🌷. భాష్యము :

మనుజుడు ప్రతిదియు కృష్ణుని కొరకే ఒనరించునపుడు ఆ భావన యందే కర్మబంధము నుండి విడుదల సాధ్యము కాగలదు. కృష్ణభక్తిపూర్ణుడైన భక్తుడు ఆ దేవదేవుని యెడ గల ప్రేమతోనే వర్తించును గావున కర్మఫలముల యెడ ఆకర్షణను కలిగియుండడు. అతడు సర్వభారమును కృష్ణునికే వదలివేయుటచే స్వీయపోషణము గూర్చియు చింతింపడు. లేనివి పొందవలెనని గాని, ఉన్నవానిని రక్షించుకొనవలెనని గాని అతడు ఆతురతపడడు. తన ధర్మమును శ్యక్తానుసారము నిర్యహించి పిదప అతడు సమస్తమును కృష్ణునికే వదలివేయును.

అట్టి అసంగుడైన భక్తుడు ఏమియును చేయనివాని చందమున కర్మల యొక్క శుభాశుభఫలముల నుండి సర్వదా ముక్తుడై యుండును. ఇట్టి స్థితి అకర్మకు లేదా విషయఫలరహితమైన కర్మకు చిహ్నమై యున్నది. కనుక కృష్ణభక్తిభావన లేనటువంటి ఇతర కర్మ ఏదైనను సరియే కర్తను నిక్కముగా బంధించును. పూర్వము తెలుపబడినట్లు అదియే వికర్మ యొక్క నిజస్వరూపమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 182 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 20 🌴

20 . tyaktvā karma-phalāsaṅgaṁ nitya-tṛpto nirāśrayaḥ
karmaṇy abhipravṛtto ’pi naiva kiñcit karoti saḥ



🌷 Translation :

Abandoning all attachment to the results of his activities, ever satisfied and independent, he performs no fruitive action, although engaged in all kinds of undertakings.


🌹 Purport :

This freedom from the bondage of actions is possible only in Kṛṣṇa consciousness, when one is doing everything for Kṛṣṇa.

A Kṛṣṇa conscious person acts out of pure love for the Supreme Personality of Godhead, and therefore he has no attraction for the results of the action. He is not even attached to his personal maintenance, for everything is left to Kṛṣṇa. Nor is he anxious to secure things, nor to protect things already in his possession.

He does his duty to the best of his ability and leaves everything to Kṛṣṇa. Such an unattached person is always free from the resultant reactions of good and bad; it is as though he were not doing anything. This is the sign of akarma, or actions without fruitive reactions.

Any other action, therefore, devoid of Kṛṣṇa consciousness, is binding upon the worker, and that is the real aspect of vikarma, as explained hereinbefore.

🌹 🌹 🌹 🌹 🌹


29 Oct 2019