✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 38 🌴
38. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ||
🌷. తాత్పర్యం :
పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామము యొక్క వివిధ దశలచే జీవుడు కప్పుడియుండును.
🌷. భాష్యము :
జీవుని శుద్ధచైతన్యమును మరుగుపరచు ఆవరణదశలు మూడు కలవు. ఆ ఆవరణయే కామము. అదియే అగ్ని యందలి పొగ, అద్దము పై నుండెడి ధూళి మరియు గర్భము పైని మావి వలె వివిధరూపములలో నుండును. కామము పొగచే పోల్చినపుడు జీవుడనెడి అగ్ని అతికొద్దిగా అనుభూతమగునని అవగతము చేసికొనవచ్చును.
అనగా జీవుడు కృష్ణభక్తిభావనను కొద్దిగా ప్రదర్శించునపుడు పొగ చేత కప్పబడిన అగ్నిని పోలియుండును. పొగ ఉన్నచోట అగ్నియున్నను ప్రారంభదశలో అగ్ని ప్రదర్శితము కాక గుప్తముగా నుండును. ఈ స్థితిని కృష్ణభక్తిరసభావన యందలి తొలిదశతో పోల్చవచ్చును. అద్దము పైన గల ధూళి వివిధములైన ఆధ్యాత్మికపద్దతుల ద్వారా మనోదర్పణ మాలిన్యమును తొలగించు విధానమును సూచించును. దాని కొరకు హరినామసంకీర్తనమే అత్యుత్తమమైన మార్గము. మావి చేత గర్భము కప్పబడియుండుట అనెడి ఉపమానము నిస్సహాయస్థితిని సూచించును. ఏలయన మావి యందు శిశువు నిస్సహాయస్థితిలో కదలలేకయుండును.
ఇట్టి జీవనస్థితి వృక్షములకు అన్వయింపవచ్చును. వృక్షములు సైతము జీవులే. కాని అత్యధిక కామమును వారు ప్రదర్శించియుండుటచే అట్టి దాదాపు చేతనారహిత జీవనస్థితిని పొందిరి. ధూళి చేత అద్ధము కప్పబడిన ఉపమానము పక్షులకు మరియు జంతువులకు అన్యయింపవచ్చును. మానవజన్మలో జీవుడు కృష్ణభక్తిరసభావనను జాగృతము చేసికొనగలడు. దాని యందు అతడు పురోగమించినచో ఆధ్యాత్మికజీవనమనెడి అగ్ని రగుల్కొనగలదు. తదుపరి పొగను జాగ్రత్తగా నివారించినచో అగ్నిని ప్రజ్వలింపచేయ వచ్చును.
కావుననే ఈ మానవజన్మ భవబంధముల నుండి తప్పించుకొనుటకు జీవునకు ఒక చక్కని అవకాశమై యున్నది. అట్టి మానవజన్మ యందు సమర్థవంతమైన మార్గదర్శకత్వమున కృష్ణభక్తిభావనను అలవరచుకొనుట ద్వారా ఎవ్వరైనను కామమనెడి శత్రువును జయింపగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 157 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 38 🌴
38. dhūmenāvriyate vahnir yathādarśo malena ca
yatholbenāvṛto garbhas tathā tenedam āvṛtam
🌷 Translation :
As fire is covered by smoke, as a mirror is covered by dust, or as the embryo is covered by the womb, the living entity is similarly covered by different degrees of this lust.
🌷 Purport :
There are three degrees of covering of the living entity by which his pure consciousness is obscured. This covering is but lust under different manifestations like smoke in the fire, dust on the mirror, and the womb about the embryo. When lust is compared to smoke, it is understood that the fire of the living spark can be a little perceived.
In other words, when the living entity exhibits his Kṛṣṇa consciousness slightly, he may be likened to the fire covered by smoke. Although fire is necessary where there is smoke, there is no overt manifestation of fire in the early stage. This stage is like the beginning of Kṛṣṇa consciousness. The dust on the mirror refers to a cleansing process of the mirror of the mind by so many spiritual methods.
The best process is to chant the holy names of the Lord. The embryo covered by the womb is an analogy illustrating a helpless position, for the child in the womb is so helpless that he cannot even move. This stage of living condition can be compared to that of the trees. The trees are also living entities, but they have been put in such a condition of life by such a great exhibition of lust that they are almost void of all consciousness. The covered mirror is compared to the birds and beasts, and the smoke-covered fire is compared to the human being.
In the form of a human being, the living entity may revive a little Kṛṣṇa consciousness, and, if he makes further development, the fire of spiritual life can be kindled in the human form of life. By careful handling of the smoke in the fire, fire can be made to blaze. Therefore the human form of life is a chance for the living entity to escape the entanglement of material existence. In the human form of life, one can conquer the enemy, lust, by cultivation of Kṛṣṇa consciousness under able guidance.
🌹 🌹 🌹 🌹 🌹
4 Oct 2019