🌹. శ్రీమద్భగవద్గీత - 158 / Bhagavad-Gita - 158 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 39 🌴
39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కొన్తేయ దుష్పురేణానలేన చ ||
🌷. తాత్పర్యం :
ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధచైతన్యము ఎన్నడును తృప్తి చెందనిదియు మరయు అగ్ని వలె దహించుచునదియైన కామమనెడి నిత్యవైరిచే ఆవరింపబడును.
🌷. భాష్యము :
ఇంధనముచే అగ్ని ఆర్పబడనట్లు, ఎంతటి భోగానుభవము చేతను కామము సంతృప్తి చెందదని మనుస్మృతి యందు తెలుపబడినది. ఈ భౌతికజగమునందు సర్వకర్మలకు మూలము మైథునభోగమై యున్నది. కనుకనే ఈ జగము “మైథునాగారము” లేక మైథునభోగ బంధమని పిలువబడును. కారాగారమునందు నేరస్థులు బంధింపబడినట్లు భగవానుని ఆజ్ఞలను ఉల్లఘించినవారు మైథునభోగము ద్వారా బంధింపబడుదురు.
ఇంద్రియభోగమునే పరమావధిగా భావించుచు సాధించెడి నాగరికత యొక్క పురోగతియనగా భౌతికత్వమున జీవుడు నిలిచియుండవలసిన కాలపరిమితి పొడగించుటనియే భావము. అనగా అజ్ఞానమునకు చిహ్నమైన కామమే జీవుని భౌతికజగమునందు బంధించుచున్నది. ఇంద్రియభోగము ననుభవించునప్పుడు సుఖభావనము కొద్దిగా కలిగినను వాస్తవమునకు అట్టి నామమాత్ర సుఖభావనను ఇంద్రియభోగికి నిత్యశత్రువై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 158 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 39 🌴
39. āvṛtaṁ jñānam etena jñānino nitya-vairiṇā
kāma-rūpeṇa kaunteya duṣpūreṇānalena ca
🌷 Translation :
Thus the wise living entity’s pure consciousness becomes covered by his eternal enemy in the form of lust, which is never satisfied and which burns like fire.
🌷 Purport :
It is said in the Manu-smṛti that lust cannot be satisfied by any amount of sense enjoyment, just as fire is never extinguished by a constant supply of fuel. In the material world, the center of all activities is sex, and thus this material world is called maithunya-āgāra, or the shackles of sex life. In the ordinary prison house, criminals are kept within bars; similarly, the criminals who are disobedient to the laws of the Lord are shackled by sex life.
Advancement of material civilization on the basis of sense gratification means increasing the duration of the material existence of a living entity. Therefore, this lust is the symbol of ignorance by which the living entity is kept within the material world. While one enjoys sense gratification, it may be that there is some feeling of happiness, but actually that so-called feeling of happiness is the ultimate enemy of the sense enjoyer.
🌹 🌹 🌹 🌹 🌹
5 Oct 2019