శ్రీమద్భగవద్గీత - 179: 04వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 179: Chap. 04, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 179 / Bhagavad-Gita - 179 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 17 🌴


17. కర్మణ్యో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ: |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి: ||


🌷. తాత్పర్యం :

కర్మగతులను అవగాహన చేసికొనుట అత్యంత కష్టము కనుక కర్మ యననేమో, వికర్మ యననేమో, అకర్మ యననేమో ప్రతియొక్కరు చక్కగా ఎరుగవలెను.

🌻. భాష్యము :

ఎవరేని భవబంధము నుండి ముక్తిని బడయుట యందు కృతనిశ్చయులై యున్నచో వారు తప్పక కర్మము, వికర్మము, అకర్మముల నడుమ గల భేదమును అవగాహన చేసికొనవలెను. ఈ కర్మసంబంధ విషయము అత్యంత కటినమైనది గనుక ప్రతియొక్కరు అటువంటి వివిధ కర్మలను విశ్లేషించి తెలిసికొనవలెను. కృష్ణభక్తిని మరియు తత్పరమైన కర్మలను అవగతము చేసికొనుటకు ప్రతియొక్కరు తమకు భగవానునితో గల సంబంధమును ఎరుగవలెను.

అనగా జ్ఞానవంతుడైనవాడు జీవుడు శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనియు, తత్కారణముగా అతడు కృష్ణభక్తిభావనలో వర్తించవలసియుండుననియు అవగాహన చేసికొనును. భగవద్గీత యంతయు ఈ సారాంశము వైపునకే కేంద్రీకృతమై యున్నాది. ఈ భావనను మరియు తత్సంబంధిత కర్మలకు విరుద్ధములైన నిర్ణయములన్నియును నిషిద్దకర్మలే (వికర్మలే).

ఈ విషయము నంతటిని సంపూర్ణముగా నెరుగుట కృష్ణభక్తి యందు నిష్ణాతులైనవారితో సాహచార్యము పొంది, వారి నుండి ఈ రహస్యమును తెలిసికొనవలెను. ఆ విధముగా చేయుట భగవానుని నుండి ప్రత్యక్షముగా నేర్చుటతో సమానము కాగలదు. లేనిచో అత్యంత బుద్ధిమంతులైనవారు సైతము భ్రాంతి గురికాగలరు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 179 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 17 🌴

17 . karmaṇo hy api boddhavyaṁ boddhavyaṁ ca vikarmaṇaḥ
akarmaṇaś ca boddhavyaṁ gahanā karmaṇo gatiḥ


🌷 Translation :

The intricacies of action are very hard to understand. Therefore one should know properly what action is, what forbidden action is and what inaction is.


🌹 Purport :

If one is serious about liberation from material bondage, one has to understand the distinctions between action, inaction and unauthorized actions. One has to apply oneself to such an analysis of action, reaction and perverted actions because it is a very difficult subject matter. To understand Kṛṣṇa consciousness and action according to its modes, one has to learn one’s relationship with the Supreme; i.e., one who has learned perfectly knows that every living entity is an eternal servitor of the Lord and that consequently one has to act in Kṛṣṇa consciousness.

The entire Bhagavad-gītā is directed toward this conclusion. Any other conclusions against this consciousness and its attendant actions are vikarmas, or prohibited actions. To understand all this one has to associate with authorities in Kṛṣṇa consciousness and learn the secret from them; this is as good as learning from the Lord directly. Otherwise, even the most intelligent persons will be bewildered.

🌹 🌹 🌹 🌹 🌹


26 Oct 2019