శ్రీమద్భగవద్గీత - 180: 04వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 180: Chap. 04, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 180 / Bhagavad-Gita - 180 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 18 🌴


18. కర్మణ్యకర్మ య: పశ్యేద కర్మణి కర్మ కర్మ య: |
స బుద్ధిమన్మసుష్యేషు స యుక్త: కృత్స్నకర్మకృత్ ||

🌷. తాత్పర్యం :

కర్మ యందు ఆకర్మను మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మనుజులలో బుద్ధిమంతుడైనవాడు. అట్టివాడు అన్నిరకముల కర్మలు యందు నియుక్తుడైన దివ్యస్థితి యందున్నవాడే యగును.

🌷. భాష్యము :

కృష్ణభక్తిభావన యందు కర్మ నొనరించువాడు సహజముగా అన్ని కర్మబంధముల నుండి ముక్తుడై యుండును. కర్మలన్నియును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరింపబడినందున అతడు కర్మప్రభావముచే సుఖదుఃఖములకు లోనుగాడు. తత్కారణమున అతడు కృష్ణుని కొరకై అన్నిరకముల కర్మల యందు నియుక్తుడైనను మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును.

అకర్మ యనగా కర్మ చేయకుండుట యని భావము. ఆత్మానుభవమార్గములలో కర్మఫలము అవరోధము కాకూడదని తలచి నిరాకారవాదులు భయముతో కామ్యకర్మల నుండి విరమింతురు. కాని భక్తుడు మాత్రము భగవానుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా ఎరిగి సదా భక్తిపరమగుకర్మల యందు నియుక్తుడై యుండును.

ప్రతిదియు కేవలము కృష్ణుని కొరకే చేయబడును కావున అతడు తన సేవాకార్యమునందు దివ్యానందము ననుభవించును. ఇట్టి విధానమునందు నియుక్తులైనవారు నిష్కాములుగా తెలియబడుదురు. శ్రీకృష్ణుని యెడ గల నిత్యదాసత్వభావము సర్వవిధములైన కర్మఫలముల నుండి మనుజుని ముక్తిని చేయగలదు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 180 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 18 🌴

18 . karmaṇy akarma yaḥ paśyed akarmaṇi ca karma yaḥ
sa buddhimān manuṣyeṣu sa yuktaḥ kṛtsna-karma-kṛt


🌷 Translation :

One who sees inaction in action and action in inaction is intelligent among men, and he is in the transcendental position, although engaged in all sorts of activities.


🌹 Purport :

A person acting in Kṛṣṇa consciousness is naturally free from the bonds of karma. His activities are all performed for Kṛṣṇa; therefore he does not enjoy or suffer any of the effects of work. Consequently he is intelligent in human society, even though he is engaged in all sorts of activities for Kṛṣṇa. Akarma means without reaction to work.

The impersonalist ceases fruitive activities out of fear, so that the resultant action may not be a stumbling block on the path of self-realization, but the personalist knows rightly his position as the eternal servitor of the Supreme Personality of Godhead. Therefore he engages himself in the activities of Kṛṣṇa consciousness. Because everything is done for Kṛṣṇa, he enjoys only transcendental happiness in the discharge of this service.

Those who are engaged in this process are known to be without desire for personal sense gratification. The sense of eternal servitorship to Kṛṣṇa makes one immune to all sorts of reactionary elements of work.

🌹 🌹 🌹 🌹 🌹


27 Oct 2019