🌹. శ్రీమద్భగవద్గీత - 155 / Bhagavad-Gita - 155 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 36 🌴
36. అర్జున ఉవాచ
అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష: |
అనిచ్ఛన్నపి వార్ ష్ణేయ బలాదిన నియోజిత: ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను : ఓ వృష్ణివంశసంజాతుడా! అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైనవాని వలె మనుజుడు దేనిచే పాపకర్మలను చేయుట యందు ప్రేరేపింప బడుచున్నాడు?
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశగా జీవుడు ఆదిలో అధ్యాత్మికుడు, పవిత్రుడు, భౌతికకల్మషరాహిత్యుడు అయియుండెను. అనగా స్వభావరీత్యా అతడు భౌతికజగమునకు సంబంధించన పాపములకు అతీతుడై యున్నాడు. కాని ప్రకృతి సంగత్వము కలుగగనే అతడు ఎటువంటి సంకోచము లేకుండా వివిధములైన పాపకర్మలయందు మగ్నుడగుచున్నాడు. కొన్నిమార్లు అతడు తన అభిప్రాయమునకు భిన్నముగను వర్తించి అట్టి పాపమును చేయుచుండును.
కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచిన ప్రశ్న జీవుల వికృత స్వభావమునాకు తగినదియై ఆలోచనాపూర్ణముగా నున్నది. జీవుల కొన్నిమార్లు పాపము చేయ కోరకున్నను బలవంతముగా వారు దాని యందు వర్తింపబడుదురు. తరువాతి శ్లోకములో భగవానునిచే వివరింపబడినట్లు అట్టి పాపకర్మలు అంతరమందున్న పరమాత్మునిచే కాక వేరుకారణములచే ప్రేరేపింపబడుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 155 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 36 🌴
36. arjuna uvāca
atha kena prayukto ’yaṁ pāpaṁ carati pūruṣaḥ
anicchann api vārṣṇeya balād iva niyojitaḥ
🌷 Translation :
Arjuna said: O descendant of Vṛṣṇi, by what is one impelled to sinful acts, even unwillingly, as if engaged by force?
🌷 Purport :
A living entity, as part and parcel of the Supreme, is originally spiritual, pure, and free from all material contaminations. Therefore, by nature he is not subject to the sins of the material world. But when he is in contact with the material nature, he acts in many sinful ways without hesitation, and sometimes even against his will. As such, Arjuna’s question to Kṛṣṇa is very sanguine, as to the perverted nature of the living entities.
Although the living entity sometimes does not want to act in sin, he is still forced to act. Sinful actions are not, however, impelled by the Supersoul within, but are due to another cause, as the Lord explains in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹
2 Oct 2019