Page 2 (Chapter# 07 - 12)


Srimad Bhagavad Gita As It Is


For chapters from 01 through 06: Refer to another page #1 

https://gita-telugu-english.blogspot.com/p/bhagavad-gita-page-1-chapter-01-06.html


For chapters from 13 through 18: Refer to another page #3

https://gita-telugu-english.blogspot.com/p/srimad-bhagavad-gita-page-2-chapter-13.html


---------------------------------------- x ----------------------------------------


శ్రీమద్భగవద్గీత - 262: 07వ అధ్.,  శ్లో 01 /  Bhagavad-Gita - 262: Chap. 07, Ver. 01

🌹. శ్రీమద్భగవద్గీత - 262 / Bhagavad-Gita -  262 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 01 🌴

01. శ్రీభగవానువాచ
మయ్యాసక్తమనా: పార్థ యోగం యుంజన్మదాశ్రయ: |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తుచ్చ్రుణు ||

🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనస్సును నా యందే సంలగ్నము చేసి నా సంపూర్ణభావనలో యోగమభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము. 

🌷. భాష్యము : 
భగవద్గీత యొక్క ఈ సప్తమాధ్యాయమున కృష్ణభక్తిరసభావనా తత్త్వము సమగ్రముగా వివరింపబడినది. 

సమస్త విభూతులను సంగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను ఏ విధముగా ప్రదర్శించునో ఈ అధ్యాయమున వర్ణింపబడినది. 

అదే విధముగా శ్రీకృష్ణుని శరణుజొచ్చు నాలుగు తరగతుల అదృష్టభాగుల గూర్చియు మరియు కృష్ణునికి ఎన్నడును శరణమునొందని నాలుగు తరగతుల అదృష్టహీనుల గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది.

భగవద్గీత యొక్క మొదటి ఆరుఅధ్యాయములలో జీవుడు ఆత్మస్వరూపుడనియు మరియు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మసాక్షాత్కారస్థితితికి ఉద్దరించుకొనగలడనియు వివరింపబడినది. 

శ్రీకృష్ణభగవానుని యందు స్థిరముగా మనస్సును సంలగ్నము చేయుటయే (కృష్ణభక్తిరసభావనము) యోగములన్నింటి యందును అత్యున్నత యోగమనియు షష్టాధ్యాయపు అంతమున స్పష్టముగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనస్సును నిలుపుట ద్వారానే మనుజుడు పరతత్త్వమును సమగ్రముగా నెరుగగలడు గాని అన్యథా కాదు. నిరాకార బ్రహ్మానుభూతి గాని లేదా పరమాత్మానుభూతి గాని అసంపూర్ణమై యున్నందున ఎన్నడును పరతత్త్వపు సంపూర్ణజ్ఞానము కాజాలదు. 

వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయజ్ఞానము శ్రీకృష్ణభగవానుడే. కృష్ణభక్తిరసభావన యందు మనుజుడు శ్రీకృష్ణుడే నిస్సందేహముగా చరమజ్ఞానమని ఎరుగగలడు. వివిధములైన యోగపద్ధతులు అట్టి కృష్ణభక్తిరసభావనమునకు సోపానములు వంటివి మాత్రమే. కనుకనే కృష్ణభక్తిభావన యందు ప్రత్యక్షముగా నెలకొనినవాడు బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును సంపూర్ణముగా అప్రయత్నముగనే పొందగలుగును. 

అనగా కృష్ణభక్తిభావనాయోగమును అభ్యసించుట ద్వారా మనుజుడు పరతత్త్వము, జీవులు, ప్రకృతి, సంపత్పూర్ణమైనటువంటి వాని వ్యక్తీకరణముల గూర్చి పూర్ణముగా తెలిసికొనగలుగును.

కనుక ప్రతియొక్కరు యోగమును షష్టాధ్యాయపు చివరి శ్లోకము నందు నిర్దేశింపబడిన రీతిగా ఆరంభింపవలెను. ఆ విధముగగా శ్రీకృష్ణభగవానునిపై మనస్సును నిలుపుట నవవిధరూప సమన్వితమైన భక్తియుతసేవ ద్వారానే సాధ్యమగును. ఆ నవవిధ పద్ధతులలో శ్రవణము ఆదియైనది మరియు అత్యంత ముఖ్యమైనది. 

కనుకనే శ్రీకృష్ణభగవానుడు “తచ్చ్రుణు – నా నుండి వినుము” అని బోధించెను. శ్రీకృష్ణుని కన్నను గొప్పనైన ప్రామాణికుడు వేరొకడు ఉండబోడు కనుక అతని ద్వారా శ్రవణము చేయు అవకాశము మనుజుని పూర్ణభక్తునిగా చేయగలదు. కనుక ప్రతియొక్కరు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని నుండి గాని లేదా కృష్ణభక్తుని ద్వారా గాని తత్త్వమును నేర్వవలెను. అంతియేగాని లౌకికపాండిత్యముచే గర్వించు అభక్తుని నుండి ఎన్నడును శ్రవణము చేయరాదు.

దేవదేవుడు మరియు పరతత్త్వమును అగు శ్రీకృష్ణుని అవగాహన చేసికొను విధానము శ్రీమద్భాగవతము నందలి ప్రథమస్కందపు ద్వితీయాధ్యాయమునందు ఇట్లు వివరింపబడినది.

శృణ్వతాం స్వకథా: కృష్ణ: పుణ్య శ్రవణకీర్తన: |
హృద్యన్తస్థోహ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్ ||

నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా |
భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ ||

తదా రజస్తమోభావా: కామలోభాదయశ్చ యే |
చేత ఏతైరనావిద్ధం స్థితం సత్త్వే ప్రసీదతి ||

ఏవం ప్రసన్నమనసో భగవద్బక్తియోగత: |
భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే ||

భిద్యతే హృదయగ్రన్థి: ఛిద్యన్తే సర్వసంశయా: |
క్షీయన్తే చాస్య కర్మాణి దృష్టఏవాత్మనీశ్వరే ||

“శ్రీకృష్ణుని గూర్చి వేదవాజ్మయము నుండి శ్రవణము చేయుట లేదా ఆ భగవానుని నుండియే ప్రత్యక్షముగా భగవద్గీత ద్వారా శ్రవణము చేయుట అత్యుత్తమ కార్యము. ఏలయన సర్వహృదయాంతరవాసియైన శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణము చేసినవానికి సన్నిహిత స్నేహితునిగా వర్తించి నిత్యశ్రవణానురక్తుడైన అతనిని పవిత్రుని చేయును. ఈ విధముగా భక్తుడు తనలో నిద్రాణమై యున్న ఆధ్యాత్మికజ్ఞానము వృద్ధిచేసికొనగలడు. 

అతడు శ్రీమద్భాగవతము నుండియు మరియు భక్తుల నుండియు శ్రీకృష్ణుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది అధికముగా భక్తియోగమునందు స్థిరత్వమును పొందగలడు. అట్టి భక్తియుతసేవ ద్వారా మనుజుడు రజస్తమోగుణముల నుండి దూరుడగును. ఆ విధముగా కామము, లోభము నశింపగలవు. ఆ కల్మషములు తొలగించినంతనే భక్తుడు శుద్ధసత్త్వములో స్థితిని పొంది, భక్తియోగము ద్వారా రంజితుడై భగవత్తత్త్వ విజ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసికొనగలుగును. 
(భాగవతము 1.2.17-21)
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 262 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 01 🌴

01. śrī-bhagavān uvāca
mayy āsakta-manāḥ pārtha
yogaṁ yuñjan mad-āśrayaḥ
asaṁśayaṁ samagraṁ māṁ
yathā jñāsyasi tac chṛṇu

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Now hear, O son of Pṛthā, how by practicing yoga in full consciousness of Me, with mind attached to Me, you can know Me in full, free from doubt.

🌹 Purport :
In this Seventh Chapter of Bhagavad-gītā, the nature of Kṛṣṇa consciousness is fully described. Kṛṣṇa is full in all opulences, and how He manifests such opulences is described herein. Also, four kinds of fortunate people who become attached to Kṛṣṇa and four kinds of unfortunate people who never take to Kṛṣṇa are described in this chapter.

In the first six chapters of Bhagavad-gītā, the living entity has been described as nonmaterial spirit soul capable of elevating himself to self-realization by different types of yogas. At the end of the Sixth Chapter, it has been clearly stated that the steady concentration of the mind upon Kṛṣṇa, or in other words Kṛṣṇa consciousness, is the highest form of all yoga. By concentrating one’s mind upon Kṛṣṇa, one is able to know the Absolute Truth completely, but not otherwise. Impersonal brahma-jyotir or localized Paramātmā realization is not perfect knowledge of the Absolute Truth, because it is partial. Full and scientific knowledge is Kṛṣṇa, and everything is revealed to the person in Kṛṣṇa consciousness. In complete Kṛṣṇa consciousness one knows that Kṛṣṇa is ultimate knowledge beyond any doubts. Different types of yoga are only steppingstones on the path of Kṛṣṇa consciousness. One who takes directly to Kṛṣṇa consciousness automatically knows about brahma-jyotir and Paramātmā in full. By practice of Kṛṣṇa consciousness yoga, one can know everything in full – namely the Absolute Truth, the living entities, the material nature, and their manifestations with paraphernalia.

One should therefore begin yoga practice as directed in the last verse of the Sixth Chapter. Concentration of the mind upon Kṛṣṇa the Supreme is made possible by prescribed devotional service in nine different forms, of which śravaṇam is the first and most important. The Lord therefore says to Arjuna, tac chṛṇu, or “Hear from Me.” No one can be a greater authority than Kṛṣṇa, and therefore by hearing from Him one receives the greatest opportunity to become a perfectly Kṛṣṇa conscious person. One has therefore to learn from Kṛṣṇa directly or from a pure devotee of Kṛṣṇa – and not from a nondevotee upstart, puffed up with academic education.

In the Śrīmad-Bhāgavatam this process of understanding Kṛṣṇa, the Supreme Personality of Godhead, the Absolute Truth, is described in the Second Chapter of the First Canto as follows:

śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ
puṇya-śravaṇa-kīrtanaḥ
hṛdy antaḥ-stho hy abhadrāṇi
vidhunoti suhṛt satām

naṣṭa-prāyeṣv abhadreṣu
nityaṁ bhāgavata-sevayā
bhagavaty uttama-śloke
bhaktir bhavati naiṣṭhikī

tadā rajas-tamo-bhāvāḥ
kāma-lobhādayaś ca ye
ceta etair anāviddhaṁ
sthitaṁ sattve prasīdati

evaṁ prasanna-manaso
bhagavad-bhakti-yogataḥ
bhagavat-tattva-vijñānaṁ
mukta-saṅgasya jāyate

bhidyate hṛdaya-granthiś
chidyante sarva-saṁśayāḥ
kṣīyante cāsya karmāṇi
dṛṣṭa evātmanīśvare

“To hear about Kṛṣṇa from Vedic literatures, or to hear from Him directly through the Bhagavad-gītā, is itself righteous activity. And for one who hears about Kṛṣṇa, Lord Kṛṣṇa, who is dwelling in everyone’s heart, acts as a best-wishing friend and purifies the devotee who constantly engages in hearing of Him. In this way, a devotee naturally develops his dormant transcendental knowledge.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/Jan/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 263: 07వ అధ్.,  శ్లో 02 /  Bhagavad-Gita - 263: Chap. 07, Ver. 02

🌹. శ్రీమద్భగవద్గీత - 263 / Bhagavad-Gita -  263 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 02 🌴

02. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషత: |
యజ్జ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే ||

🌷. తాత్పర్యం :
జ్ఞానము మరియు విజ్ఞానములను గూడిన సంపూర్ణజ్ఞానము నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించెను. అది తెలిసిన పిమ్మట నీవు తెలిసికొనవలసినది ఏదియును మిగిలి యుండడు. 

🌷. భాష్యము : 
సంపూర్ణజ్ఞానము నందు భౌతికజగము, దాని వెనుక నున్న ఆత్మ మరియు ఆ రెండింటిని మూలకారణముల జ్ఞానము ఇమిడియుండును. కనుకనే అది దివ్యజ్ఞానమై యున్నది. 

తనకు అర్జునుడు భక్తుడు మరియు స్నేహితుడై యున్నందున శ్రీకృష్ణభగవానుడు అతనికి పైన వివరింపబడిన జ్ఞానవిధానమును తెలుపగోరెను. 

తన నుండియే ప్రత్యక్షముగా వచ్చుచున్న గురుశిష్యపరంపరలో నున్న భక్తునికి మాత్రమే సంపూర్ణజ్ఞానము ప్రాప్తించునని చతుర్థాధ్యాయపు ఆరంభములో వివరించిన విషయమునే శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తిరిగి నిర్ధారించుచున్నాడు. 

కనుక ప్రతియొక్కరు ఎవడు సర్వకారణములకు కారణుడో మరియు సమస్త యోగములందు ఏకైక ధ్యానధ్యేయమో అతడే సమస్తజ్ఞానమునకు మూలమని ఎరుగవలసియున్నది. ఆ విధముగా సర్వకారణకారణము విదితమైనపుడు తెలిసికొనదగినదంతయు తెలియబడి, తెలియవలసినదేదియును ఇక మిగిలియుండదు. 

కనుకనే “కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి” యని వేదములు (ముండకోపనిషత్తు 1.3) తెలుపుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 263 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 02 🌴

02. jñānaṁ te ’haṁ sa-vijñānam
idaṁ vakṣyāmy aśeṣataḥ
yaj jñātvā neha bhūyo ’nyaj
jñātavyam avaśiṣyate

🌷 Translation : 
I shall now declare unto you in full this knowledge, both phenomenal and numinous. This being known, nothing further shall remain for you to know.

🌹 Purport :
Complete knowledge includes knowledge of the phenomenal world, the spirit behind it, and the source of both of them. 

This is transcendental knowledge. The Lord wants to explain the above-mentioned system of knowledge because Arjuna is Kṛṣṇa’s confidential devotee and friend. 

In the beginning of the Fourth Chapter this explanation was given by the Lord, and it is again confirmed here: complete knowledge can be achieved only by the devotee of the Lord in disciplic succession directly from the Lord. 

Therefore one should be intelligent enough to know the source of all knowledge, who is the cause of all causes and the only object for meditation in all types of yoga practice. 

When the cause of all causes becomes known, then everything knowable becomes known, and nothing remains unknown. The Vedas (Muṇḍaka Upaniṣad 1.1.3) say, kasminn u bhagavo vijñāte sarvam idaṁ vijñātaṁ bhavatīti.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/Jan/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 264: 07వ అధ్.,  శ్లో 03 /  Bhagavad-Gita - 264: Chap. 07, Ver. 03

🌹. శ్రీమద్భగవద్గీత - 264  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 03 🌴

03. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వత: ||

🌷. తాత్పర్యం :
వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలిసికొనగలుగుచున్నాడు.

🌷. భాష్యము : 
మానవులందరు పెక్కు తరగతులవారు కలరు. అట్టి వేలాదిమనుష్యులలో ఒకానొకడు మాత్రమే ఆత్మసాక్షాత్కారమునందు అభిరుచిని కలిగి ఆత్మ యననేమో, దేహమననేమో, పరతత్త్త్వమననేమో తెలిసికొనుటకు యత్నించును. 

సాధారణముగా మనుజులు పశుప్రవృత్తులేయైన ఆహారము, భయము, నిద్ర, మైథునముల యందు మాత్రమే నియుక్తులై యుందురు. ఏ ఒక్కడు కుడా ఆధ్యాత్మికజ్ఞానము నందు అభిరుచిని కలిగియుండడు. భగవద్గీత యందలి మొదటి ఆరు అధ్యాయములు ఆధ్యాత్మికజ్ఞానము నందును, ఆత్మ, పరమాత్మలను అవగాహన చేసికొనుట యందును, జ్ఞానయోగము మరియు ధ్యానయోగము ద్వారా ఆత్మసాక్షాత్కారమును పొందుట యందును, అనాత్మయైన భౌతికపదార్థమును ఆత్మ నుండి వేరుగా గాంచుట యందును అనురక్తులై యుండెడి వారికై నిర్దేశింపబడినవి. 

కాని వాస్తవమునకు కృష్ణభక్తిభావనయందున్న వారికే శ్రీకృష్ణభగవానుడు సంపూర్ణముగా అవగతము కాగలడు. ఇతర తత్త్వవేత్తలు నిరాకార బ్రహ్మతత్త్వమును మాత్రము పొందిన పొందవచ్చును. 

ఏలయన నిరాకార బ్రహ్మతత్త్వము నెరుగుట శ్రీకృష్ణుని అవగతము చేసికొనుట కన్నను సులువైనది. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడే గాక నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు పరమైనవాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైనవారు కృష్ణుని అవగాహనము చేసికొను యత్నములో భ్రమనొందుదురు. పరమ అద్వైతియైన శ్రీశంకరాచార్యులు తమ గీతాభాష్యములో శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించినను, ఆయన అనుయాయులు మాత్రము శ్రీకృష్ణుని దేవదేవుడని అంగీకరింపరు. మనుజడు నిరాకారబ్రహ్మానుభూతిని కలిగియున్నను శ్రీకృష్ణుని అవగతము చేసికొనుట అతి కష్టకార్యమగుటయే అందులకు కారణము.

శ్రీకృష్ణుడు దేవదేవుడు, సర్వకారణములకు కారణమును, ఆదిపురుషుడైన గోవిందుడును అయి యున్నాడు – “ ఈశ్వర: పరం: కృష్ణ: సచ్చిదానందవిగ్రహ: అనాదిరాదిర్గోవింద: సర్వకారణకారణమ్.” 

అభక్తులకు అతనిని తెలిసికొనుట మిగుల కష్టతరము. అట్టివారు భక్తిమార్గము అతిసులభమైనదని ప్రకటించినను దానిని అవలంబింప లేరు. వారు తెలిపినట్లు ఒకవేళ భక్తిమార్గము సులభమేయైనచో ఎందులకు వారు కటినమార్గము నెన్నుకొందరు? అనగా వాస్తవమునకు భక్తిమార్గము సులభమైనది కాదు. భక్తినెరుగని అప్రమాణికులైనవారు అవలంబించు నామమాత్ర భక్తిమార్గము సులభము అయిన కావచ్చును కాని నియమ నిబంధన ప్రకారము వాస్తవముగా ఒనరింపవలసివచ్చినప్పుడు కల్పనాపరులైన పండితులు మరియు తత్త్వవేత్తలు ఆ మార్గమున కొనసాగలేక వైదొలగుదురు. 

ఈ విషయమున శ్రీరూపగోస్వామి భక్తిరసామృతసింధువు (1.2.101) నందు ఇట్లు పలికిరి.

శ్రుతిస్మృతిపురాణాది పంచరాత్రవిధిం వినా |
ఐకాన్తికీ హరేర్భక్తి రుత్పాతాయైవ కల్పతే ||

“ఉపనిషత్తులు, పురాణములు, నారదపంచరాత్రము వంటి ప్రామాణిక వేదవాజ్మయము ననుసరించి చేయబడని శ్రీకృష్ణభగవానుని భక్తి కేవలము సంఘమునందు అవసర కలతలేకే కారణము కాగలదు.”

దేవదేవుడైన శ్రీకృష్ణుని యశోదాతనయునిగా లేదా అర్జునిరథసారథిగా అవగాహనము చేసికొనుట బ్రహ్మానుభవము కలిగిన అద్వైతికి గాని, పరమాత్మానుభవము కలిగిన యోగికి గాని దుర్లభమైనట్టిది. గొప్ప గొప్ప దేవతలే ఆ శ్రీకృష్ణుని విషయమున కొన్నిమార్లు మోహము నొందుచుందురు (ముహ్యన్తి యత్సూరయ:). 

ఈ విషయమున శ్రీకృష్ణభగవానుడు కూడా “మాం తు వేదం న కశ్చన – నన్ను యథారూపముగా ఎవ్వరును తెలిసికొనలేరు” అని పలికెను. ఒకవేళ అతనిని తెలిసికొనగలిగినను అట్టి మహాత్ములు అతి అరుదుగా నుందురు( స మహాత్మా సుదుర్లభ: ). 

కనుకనే మనుజుడు గొప్ప పండితుడైనను లేదా తత్త్వవేత్తయైనను భక్తియుక్తసేవ నొనరించనిదే అతనిని యథార్థముగా (తత్త్వత: ) ఎరుగజాలడు. కేవలము శుద్ధభక్తులే ఆ దేవదేవుని సర్వకారణకారణత్వము, సర్వశక్తిసామర్థ్యము, విభూతిమత్వము, షడ్గుణైశ్యర్య సంపన్నత్వము (సంపద, యశస్సు, శక్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము) లందలి అచింత్య దివ్యగుణములను కొద్దిగా అవగతము చేసికొనగలరు. తన భక్తుల యెడ శ్రీకృష్ణభగవానుడు దయతో మ్రొగ్గు చూపియుండుటయే అందులకు కారణము. 

బ్రహ్మానుభూతికి పరమావధియైన అతనిని భక్తులు మాత్రమే యథారూపములో అనుభూతమొనర్చుకొనగలరు. కనుకనే భక్తిరసామృతసింధువు (1.2.234) నందు ఇట్లు చెప్పబడినది.

అత: శ్రీకృష్ణనామాది న భవేద్ గ్రాహ్యమిన్ద్రియై: |
సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యద: ||

“జడమైన ఇంద్రియములచే ఎవ్వరును శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహనము చేసికొనలేరు. కాని తనకొనర్చెడి ప్రేమయుత సేవతో ముదమంది అతడే తనను తాను భక్తులకు ఎరుకపరచుకొనును,”
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 264 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 03 🌴

03. manuṣyāṇāṁ sahasreṣu
kaścid yatati siddhaye
yatatām api siddhānāṁ
kaścin māṁ vetti tattvataḥ

🌷 Translation : 
Out of many thousands among men, one may endeavor for perfection, and of those who have achieved perfection, hardly one knows Me in truth.

🌹 Purport :
There are various grades of men, and out of many thousands, one may be sufficiently interested in transcendental realization to try to know what is the self, what is the body, and what is the Absolute Truth. 

Generally mankind is simply engaged in the animal propensities, namely eating, sleeping, defending and mating, and hardly anyone is interested in transcendental knowledge. 

The first six chapters of the Gītā are meant for those who are interested in transcendental knowledge, in understanding the self, the Superself and the process of realization by jñāna-yoga, dhyāna-yoga and discrimination of the self from matter. However, Kṛṣṇa can be known only by persons who are in Kṛṣṇa consciousness. 

Other transcendentalists may achieve impersonal Brahman realization, for this is easier than understanding Kṛṣṇa. Kṛṣṇa is the Supreme Person, but at the same time He is beyond the knowledge of Brahman and Paramātmā. The yogīs and jñānīs are confused in their attempts to understand Kṛṣṇa. 

Although the greatest of the impersonalists, Śrīpāda Śaṅkarācārya, has admitted in his Gītā commentary that Kṛṣṇa is the Supreme Personality of Godhead, his followers do not accept Kṛṣṇa as such, for it is very difficult to know Kṛṣṇa, even though one has transcendental realization of impersonal Brahman.

Kṛṣṇa is the Supreme Personality of Godhead, the cause of all causes, the primeval Lord Govinda. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ/ anādir ādir govindaḥ sarva-kāraṇa-kāraṇam. 

It is very difficult for the nondevotees to know Him. Although nondevotees declare that the path of bhakti, or devotional service, is very easy, but why they cannot practice it.  Actually the path of bhakti is not easy. 

The so-called path of bhakti practiced by unauthorized persons without knowledge of bhakti may be easy, but when it is practiced factually according to the rules and regulations, the speculative scholars and philosophers fall away from the path. Śrīla Rūpa Gosvāmī writes in his Bhakti-rasāmṛta-sindhu (1.2.101):

śruti-smṛti-purāṇādi-
pañcarātra-vidhiṁ vinā
aikāntikī harer bhaktir
utpātāyaiva kalpate

“Devotional service of the Lord that ignores the authorized Vedic literatures like the Upaniṣads, Purāṇas and Nārada Pañcarātra is simply an unnecessary disturbance in society.”

It is not possible for the Brahman-realized impersonalist or the Paramātmā-realized yogī to understand Kṛṣṇa the Supreme Personality of Godhead as the son of mother Yaśodā or the charioteer of Arjuna. Even the great demigods are sometimes confused about Kṛṣṇa (muhyanti yat sūrayaḥ). Māṁ tu veda na kaścana: 

“No one knows Me as I am,” the Lord says. And if one does know Him, then sa mahātmā su-durlabhaḥ: “Such a great soul is very rare.” 

Therefore unless one practices devotional service to the Lord, one cannot know Kṛṣṇa as He is (tattvataḥ), even though one is a great scholar or philosopher. 

Only the pure devotees can know something of the inconceivable transcendental qualities in Kṛṣṇa – His being the cause of all causes, His omnipotence and opulence, and His wealth, fame, strength, beauty, knowledge and renunciation – because Kṛṣṇa is benevolently inclined to His devotees. He is the last word in Brahman realization, and the devotees alone can realize Him as He is. Therefore it is said:

ataḥ śrī-kṛṣṇa-nāmādi
na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau
svayam eva sphuraty adaḥ

“No one can understand Kṛṣṇa as He is by the blunt material senses. But He reveals Himself to the devotees, being pleased with them for their transcendental loving service unto Him.” (Bhakti-rasāmṛta-sindhu 1.2.234)
🌹 🌹 🌹 🌹 🌹

Date: 30/Jan/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 265: 07వ అధ్.,  శ్లో 04 /  Bhagavad-Gita - 265: Chap. 07, Ver. 04

🌹. శ్రీమద్భగవద్గీత - 265 / Bhagavad-Gita - 265 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 04 🌴

04. భూమిరాపోనలో వాయు; ఖం మనో బుద్ధిరేవ చ |
అహజ్కార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ||

🌷. తాత్పర్యం :
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఎనిమిది అంశముల సముదాయము నా భిన్నప్రకృతి యనబడును.

🌷. భాష్యము :
భగవత్తత్త్వవిజ్ఞానము భగవానుని దివ్యమగు స్థితిని మరియు అతని విభిన్నశక్తులను విశ్లేషించి చర్చించును. సాత్వతంత్ర్యములో వివరింపబడినట్లు ఆ భగవానుని వివిధ పురుషావతారముల యందలి శక్తిచే ప్రకృతి యని పేరు.

విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యథో విదు: |
ఏకం తు మహత: స్రష్టృ ద్వితీయం త్వండ సంస్థితం |
తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే ||

“భౌతికజగత్తు సృష్టికై శ్రీకృష్ణభగవానుడు సంపూర్ణస్వాంశ మూడు విష్ణురూపములను దాల్చును. అందులో మొదటి విష్ణురూపమైన మాహావిష్ణువు మహతత్త్వమని తెలియబడును భౌతికశక్తిని సృష్టించును. రెండవ విష్ణురూపమైన గర్భోదకశాయివిష్ణువు వివధవ్యక్తీకరణలకై అన్ని విశ్వములందును ప్రవేశించును. ఇక మూడవ విష్ణురూపమైన క్షీరోదకశాయివిష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపున వ్యాపించి పరమాత్మగా పిలువబడు అణువణువు నందును నిలిచియుండును. ఈ ముగ్గురు విష్ణువుల గూర్చి తెలిసినవాడు భవబంధము నుండి ముక్తిని పొందగలడు.”

ఈ శ్లోకమున తెలుపబడినట్లు భౌతికశక్తి యందు ముఖ్యముగా ఎనిమిది అంశములు కలవు. వీనిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము లనునవి మహత్తర సృష్టి లేదా స్థూలసృష్టిగా పిలువబడును. వీనియందే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమను ఐదు ఇంద్రియార్థములు ఇమిడియున్నవి. భౌతిక విజ్ఞానశాస్త్రము కేవలము ఈ పదివిషయములనే చర్చించును. కాని అన్యమును కాదు. కాని మనస్సు, బుద్ధి, అహంకారమను మిగతా మూడువిషయములు భౌతికవాదులచే ఉపేక్షింపబడును. మనోకర్మలతో తాదాత్మ్యము చెందియుండు తత్త్వవేత్తలు కూడా సర్వమునకు మూలకారణము శ్రీకృష్ణుడని ఎరుగలేనందున జ్ఞానమునందు అసంపూర్ణులైయున్నారు. “నేను నాది” యను అహంకారభావనమే భౌతికస్థితి మూలకారణమై యున్నది. అట్టి అహంకారము భౌతికకర్మలకు ఉపయోగపడు దశేంద్రియములను కూడియుండును. బుద్ధి యనునది మహతత్త్వమని పిలువబడు పూర్ణ భౌతికసృష్టి సంబంధించినది. అనగా శ్రీకృష్ణభగవానుని ఈ ఎనిమిది భిన్నశక్తుల నుండి భౌతికజగత్తు యొక్క ఇరువదినాలుగు అంశములు వ్యక్తమగుచున్నవి. ఈ ఇరువదినాలుగు అంశములు విషయమే నాస్తిక సాంఖ్యవాదపు చర్చనీయాంశమై యున్నది. వాస్తవమునకు అవియన్నియును శ్రీకృష్ణుని శక్తి నుండియే ఉద్భవించి, అతని నుండి విడివడియున్నవి. కాని అల్పజ్ఞులైన సాంఖ్యతత్త్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా ఎరుగలేరు. గీతయందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్యశక్తి స్వరూపమే సాంఖ్యతత్త్వమునందు చర్చనియాంశమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 265 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 04 🌴

04. bhūmir āpo ’nalo vāyuḥ
khaṁ mano buddhir eva ca
ahaṅkāra itīyaṁ me
bhinnā prakṛtir aṣṭadhā

🌷 Translation : 
Earth, water, fire, air, ether, mind, intelligence and false ego – all together these eight constitute My separated material energies.

🌹 Purport :
The science of God analyzes the constitutional position of God and His diverse energies. Material nature is called prakṛti, or the energy of the Lord in His different puruṣa incarnations (expansions) as described in the Nārada Pañcarātra, one of the Sātvata-tantras:

viṣṇos tu trīṇi rūpāṇi
puruṣākhyāny atho viduḥ
ekaṁ tu mahataḥ sraṣṭṛ
dvitīyaṁ tv aṇḍa-saṁsthitam
tṛtīyaṁ sarva-bhūta-sthaṁ
tāni jñātvā vimucyate

“For material creation, Lord Kṛṣṇa’s plenary expansion assumes three Viṣṇus. The first one, Mahā-viṣṇu, creates the total material energy, known as the mahat-tattva. The second, Garbhodaka-śāyī Viṣṇu, enters into all the universes to create diversities in each of them. The third, Kṣīrodaka-śāyī Viṣṇu, is diffused as the all-pervading Supersoul in all the universes and is known as Paramātmā. He is present even within the atoms. Anyone who knows these three Viṣṇus can be liberated from material entanglement.”
🌷 🌷 🌷 🌷 🌷

Date: 31/Jan/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 266: 07వ అధ్.,  శ్లో 05 /  Bhagavad-Gita - 266: Chap. 07, Ver. 05

🌹. శ్రీమద్భగవద్గీత - 266 / Bhagavad-Gita - 266 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 05 🌴

05. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ||

🌷. తాత్పర్యం :
ఓ మాహాబాహుడవైన అర్జునా! వాటికి అన్యముగా న్యునమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు.

🌷. భాష్యము :
జీవులు శ్రీకృష్ణభగవానుని ఉన్నతమైన ప్రకృతికి (శక్తికి) చెందినవారని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములుగా ప్రదర్శింపబడు భౌతికపదార్థమే న్యూనమైన శక్తి. భుమ్యాది స్థూలవిషయములు రెండు ప్రకృతిరూపములు న్యునశక్తి నుండి ఉద్భవించినట్టివే. వివిధప్రయోజనములకై ఈ న్యునశక్తులను వినియోగించుకొను జీవులు శ్రీకృష్ణభగవానుని ఉన్నతశక్తికి సంబంధించినవారై యున్నారు. అటువంటి ఈ ఉన్నతశక్తి వలననే సమస్తజగత్తు నడుచుచున్నది. ఉన్నతశక్తికి చెందిన జీవుడు నడుపనిదే భౌతికజగత్తు నడువలేదు. కాని శక్తులు అన్నివేళలా వానిని కలిగియున్న శక్తిమానినిచే నియమింపబడి యున్నందున జీవులు సదా భగవానునిచే నియమింపబడెడివారే. కనుక వారికెన్నడును స్వతంత్ర ఉనికి యనునది ఉండదు. కొందరు బుద్ధిహీనులు ఊహించునట్లు వారెన్నడును భగవానునితో సమశక్తిమంతులు కాజాలరు. శ్రీకృష్ణభగవానుడు మరియు జీవులకు నడుమగల భేదమును శ్రీమద్భాగవతము ఈ క్రిందివిధముగా వివరించుచున్నది. (10.87.30).

అపరిమితా ధ్రువాస్తనుభృతో యది సర్వగతా
స్తర్హి న శాస్యతేతి నియమో ద్రువ నేతరథా |
అజని చ యన్మయం తదవిముచ్య నియన్తృ భవేత్
సమమనుజానతాం యదమతం మతదుష్టయా ||

“ఓ దేవదేవా! బద్ధజీవులు నీ వలెనే నిత్యులును మరియు సర్వవ్యాపకులును అయినచో నీ ఆధీనములో వారెన్నడును ఉండరు. కాని వాస్తవమునకు జీవులు నీ సూక్ష్మాంశములై నందున నీ ఆధీనమందే నిలువవలసియున్నది. కనుకనే నిజమైన ముక్తి జీవులను నీ శరణమున చేరునట్లుగా చేయుచున్నది. అట్టి శరణాగతియే వారికి ఆనందమును గూర్చగలదు. అటువంటి సహజస్థితి యందే వారు నియామకులు కాగలరు. కనుకనే నీవు మరియు జీవులు సర్వవిధములుగా సమానులే యను అద్వైతవాదమును తమ పరిమితజ్ఞానముతో ప్రతిపాదించు మనుజులు దోషము, కలుషితమైన భావనను కలిగియున్న వారగుదురు.”

దదేవదేవుడైన శ్రీకృష్ణుడే దివ్యనియామకుడు మరియు జీవులు అతనిచే నియమింపబడెడివారు. కాని జీవుల నిజస్థితి గుణరీతిని భగవానునితో సమానమై యున్నందున వారు భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తించబడిరి. కాని శక్తిపరిమాణములో వారెన్నడును భగవానునితో సమానులు కాజాలరు. కాని ఉన్నతశక్తికి చెందిన జీవుడు గౌణమైన స్థూల, సూక్ష్మశక్తులును (భౌతికపదార్థము) ఉపయోగించునప్పుడు తన నిజ ఆధ్యాత్మికమనస్సును మరియు బుద్ధిని మరచిపోవును. జీవునిపై భౌతికశక్తి ప్రభావమే ఈ మరుపునకు కారణమై యున్నది. కాని అతడు భౌతికశక్తి ప్రభావము నుండి బయటపడినంతనే ముక్తిని పొందగలడు. భ్రాంతి కారణమున జీవుడు అహంకారముచే “నేను భౌతికదేహమును మరియు ఇవన్నియును నావి” అను భావమును కలిగియుండును. భగవానునితో సర్వవిధములా సముడను కావలెనను భావముతో సహా సర్వవిషయభావనల నుండి ముక్తుడైనప్పుడు తన నిజస్థితిని అవగతము చేసికొనగలడు. అనగా శ్రీకృష్ణభగవానుని వివిధశక్తులలో జీవుడు ఒకడని గీత నిర్ధారించుచున్నట్లు మనము గ్రహింపవచ్చును. అట్టి జీవుడు భౌతికసంపర్కము నుండి ముక్తుడైనపుడు పూర్ణముగా కృష్ణభక్తిరసభావితుడు (ముక్తుడు) కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 266 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 05 🌴

05. apareyam itas tv anyāṁ
prakṛtiṁ viddhi me parām
jīva-bhūtāṁ mahā-bāho
yayedaṁ dhāryate jagat

🌷 Translation : 

Besides these, O mighty-armed Arjuna, there is another, superior energy of Mine, which comprises the living entities who are exploiting the resources of this material, inferior nature.

🌹 Purport :
Here it is clearly mentioned that living entities belong to the superior nature (or energy) of the Supreme Lord. The inferior energy is matter manifested in different elements, namely earth, water, fire, air, ether, mind, intelligence and false ego. Both forms of material nature, namely gross (earth, etc.) and subtle (mind, etc.), are products of the inferior energy. The living entities, who are exploiting these inferior energies for different purposes, are the superior energy of the Supreme Lord, and it is due to this energy that the entire material world functions. The cosmic manifestation has no power to act unless it is moved by the superior energy, the living entity.

Energies are always controlled by the energetic, and therefore the living entities are always controlled by the Lord – they have no independent existence. 

They are never equally powerful, as unintelligent men think. The distinction between the living entities and the Lord is described in Śrīmad-Bhāgavatam (10.87.30) as follows:

aparimitā dhruvās tanu-bhṛto yadi sarva-gatās
tarhi na śāsyateti niyamo dhruva netarathā
ajani ca yan-mayaṁ tad avimucya niyantṛ bhavet
samam anujānatāṁ yad amataṁ mata-duṣṭatayā

“O Supreme Eternal! If the embodied living entities were eternal and all-pervading like You, then they would not be under Your control. 

But if the living entities are accepted as minute energies of Your Lordship, then they are at once subject to Your supreme control. Therefore real liberation entails surrender by the living entities to Your control, and that surrender will make them happy. 

In that constitutional position only can they be controllers. Therefore, men with limited knowledge who advocate the monistic theory that God and the living entities are equal in all respects are actually guided by a faulty and polluted opinion.”

The Supreme Lord, Kṛṣṇa, is the only controller, and all living entities are controlled by Him. 

These living entities are His superior energy because the quality of their existence is one and the same with the Supreme, but they are never equal to the Lord in quantity of power. 

While exploiting the gross and subtle inferior energy (matter), the superior energy (the living entity) forgets his real spiritual mind and intelligence. This forgetfulness is due to the influence of matter upon the living entity. 

But when the living entity becomes free from the influence of the illusory material energy, he attains the stage called mukti, or liberation. The false ego, under the influence of material illusion, thinks, “I am matter, and material acquisitions are mine.” 

His actual position is realized when he is liberated from all material ideas, including the conception of his becoming one in all respects with God. Therefore one may conclude that the Gītā confirms the living entity to be only one of the multi-energies of Kṛṣṇa; and when this energy is freed from material contamination, it becomes fully Kṛṣṇa conscious, or liberated.
🌷 🌷 🌷 🌷 🌷

Date: 01/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 267: 07వ అధ్.,  శ్లో 06 /  Bhagavad-Gita - 267: Chap. 07, Ver. 06

🌹. శ్రీమద్భగవద్గీత - 267 / Bhagavad-Gita - 267 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 06 🌴

06. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగత: ప్రభవ: ప్రలయస్తథా ||

🌷. తాత్పర్యం :
సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండుప్రకృతులే కారణములై యున్నవి. ఈ జగత్తు నందలి భౌతికము, ఆధ్యాత్మికమగు అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే యని నిశ్చయముగా నెరుగుము.

🌷. భాష్యము :
దృశ్యమాన జగత్తంతయు ఆత్మ, భౌతికపదార్థముల కలయికచే ఏర్పడినది. సృష్టికి ఆత్మ మూలము కాగా, భౌతికపదార్థము ఆత్మచే సృష్టింపబడినది. అనగా ఆత్మ ఎట్టి స్థితియందును భౌతికపదార్థముచే సృష్టించబడదు. 

వాస్తవమునకు ఈ జగత్తు ఆధ్యాత్మికశక్తి ఆధారము పైననే సృష్టింపబడినది. భౌతికపదార్థమునందు ఆత్మ నిలుచుట చేతనే స్థూలదేహము వృద్ధినొందును. శిశువు క్రమముగా బాలునిగా, పిదప యౌవనవంతునిగా మారుటకు ఉన్నతశక్తియగు ఆత్మఉనికియే కారణము. 

అదే విధముగా పరమాత్మయైన విష్ణువు యొక్క ఉనికి వలననే బ్రహ్మాండమైన విశ్వము వృద్ధినొందినది. కనుకనే భౌతికపదార్థము, ఆత్మ అనునవి శ్రీకృష్ణభగవానుని శక్తులుగా తెలియబడుచున్నవి. అనగా శ్రీకృష్ణభగవానుడే సర్వమునకు మూలకారణుడై యున్నాడు. 

అతని అంశయైన జీవుడు ఒక గొప్ప ఆకాశమునంటు భవంతినిగాని లేదా గొప్పనగరముగాని లేదా గొప్ప కర్మాగారమునుగాని సృష్టింపవచ్చునేమో గాని విశ్వమును మాత్రము సృష్టించలేడు. అనగా పెద్దదైన విశ్వమునకు పరమాత్ముడే (విభుఆత్మ) కారణుడై యున్నాడు. అటువంటి విభుఆత్మ మరియు అణుఆత్మలకు (జీవులకు) శ్రీకృష్ణుడే మూలకారణుడు. 

కనుకనే అతడు సర్వకారణములకు కారణమై యున్నాడు. “నిత్యోనిత్యానం చేతనశ్చేతనానాం” అని ఈ విషయము కఠోపనిషత్తు (2.2.13) నందు నిర్ధారింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 267 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 06 🌴

06. etad-yonīni bhūtāni
sarvāṇīty upadhāraya
ahaṁ kṛtsnasya jagataḥ
prabhavaḥ pralayas tathā

🌷 Translation : 
All created beings have their source in these two natures. Of all that is material and all that is spiritual in this world, know for certain that I am both the origin and the dissolution.

🌹 Purport :
Everything that exists is a product of matter and spirit. Spirit is the basic field of creation, and matter is created by spirit. 

Spirit is not created at a certain stage of material development. Rather, this material world is manifested only on the basis of spiritual energy. 

This material body is developed because spirit is present within matter; a child grows gradually to boyhood and then to manhood because that superior energy, spirit soul, is present. 

Similarly, the entire cosmic manifestation of the gigantic universe is developed because of the presence of the Supersoul, Viṣṇu. 

Therefore spirit and matter, which combine to manifest this gigantic universal form, are originally two energies of the Lord, and consequently the Lord is the original cause of everything. 

A fragmental part and parcel of the Lord, namely the living entity, may be the cause of a big skyscraper, a big factory, or even a big city, but he cannot be the cause of a big universe. The cause of the big universe is the big soul, or the Supersoul. 

And Kṛṣṇa, the Supreme, is the cause of both the big and small souls. Therefore He is the original cause of all causes. 

This is confirmed in the Kaṭha Upaniṣad (2.2.13). Nityo nityānāṁ cetanaś cetanānām. 
🌷 🌷 🌷 🌷 🌷

Date: 02/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 268: 07వ అధ్.,  శ్లో 07 /  Bhagavad-Gita - 268: Chap. 07, Ver. 07

🌹. శ్రీమద్భగవద్గీత - 268 / Bhagavad-Gita - 268 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 07 🌴

07. మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ||

🌷. తాత్పర్యం :
ఓ ధనంజయా! నా కన్నను శ్రేష్ఠమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు ముత్యములు కూర్చాబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడియున్నది.

🌷. భాష్యము :
పరతత్త్వము సాకారమా లేక నిరాకారమా అను విషయముపై ఒక వివాదము కలదు. కాని భగవద్గీతకు సంబంధించినంతవరకు పరతత్త్వమనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగుగడుగునా నిర్దారింపబడినది. ముఖ్యముగా ఈ శ్లోకములో పరతత్త్వము సాకారమని నొక్కి చెప్పబడినది. దేవదేవుడే పరతత్త్వమనెడి విషయమును బ్రహ్మసంహిత సైతము ద్రువీకరించినది. “ఈశ్వర: పరమ: కృష్ణ: సచ్చిదానందవిగ్రహ: - ఆదిదేవుడును, ఆనందనిదానమును, గోవిందుడును, సచ్చిదానంద విగ్రహుడును అగు శ్రీకృష్ణుడే పరతత్త్వమైన దేవదేవుడు”. ఈ ప్రాణములన్నియును పరతత్త్వము సర్వకారణకారణుడైన దివ్యపురుషుడని నిస్సందేహముగా నిరూపించుచున్నవి. కాని నిరాకారవాదులు శ్వేతాశ్వతరోపనిషత్తు (3.10) నందు తెలుపబడిన విషయమును ఆధారము చేసికొని తమ నిరాకారవాదనను చేయుదురు. “తతో యదుత్తరతరం తదురూప మనామయమ్/ య ఏతద్విదు రమృతాస్తే భవన్త్యథేతరే దుఃఖమేవాపియన్తి – విశ్వపు తొలిజీవియైన బ్రహ్మదేవుడు ఈ భౌతికజగమునందు దేవతలు, మానవులు, జంతువుల కన్నను అత్యంత ఘనుడని తెలియబడుచున్నాడు. కాని ఆ బ్రహ్మదేవునకు పరముగా భౌతికరూపరహితము మరియు భౌతికకల్మషరహితము నైన తత్త్వము (పరమపురుషుడు) వేరొకటున్నది. అతనిని తెలిసికొనగలిగినవాడు సైతము అతని దివ్యుడు కాగా, అతనిని తెలిసికొనలేనివారు భౌతికజగమునందు దుఃఖభాగులదురు.”

నిరాకారవాది ఈ ఉపనిషద్వాక్యములోని “అరూపమ్” అను పదమునకే ఎక్కువ ప్రాధాన్యత నొసగుచున్నను వాస్తవమునకు ఈ “అరూపము” అను పదము నిరాకారవాదమును సూచించుట లేదు. కేవలము అది బ్రహ్మసంహితలో వర్ణింపబడిన సచ్చిదానంద దివ్యరూపమునే సూచించుచున్నది. శ్వేతాశ్వతరోపనిషత్తు నందలి(3.8-9) ఇతర శ్లోకములు కూడా ఈ విషయమునే నిర్ధారించుచున్నవి.

వేదాహమేతం పురుషం మహాన్తమ్ ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ |
తమేవ విద్వానతిమృత్యు మేతి నాన్య: పన్థా విద్యతేయనాయ ||

యస్మాత్పరం నా పరమస్తి కిఞ్చిద్ యస్మాన్ నాణీయో నో జ్యాయో(స్తి కిఞ్చిత్ |
వృక్షఇవ స్తబ్ధో దివి తిష్టత్యేక స్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం ||

“భౌతిక తమోభావనలన్నింటికిని పరుడైన దేవదేవుని నేను ఎరుగుదును. అతనిని ఎరిగినవాడే జనన, మరణబంధము నుండి ముక్తుడు కాగలడు. ఆ పరమపురుషుని గూర్చిన ఈ జ్ఞానము కన్నను ముక్తికి వేరొక్క మార్గము లేదు.”

“దివ్యతముడగుటచే ఆ దివ్యపురుషుని కన్నను శ్రేష్ఠమగు సత్యము వేరొక్కటి లేదు. అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మము మరియు ఘనముల కన్నను ఘనమైనవాడై యున్నాడు. వృక్షము వలె స్థిరుడై యుండు నాతడు ఆధ్యాత్మికజగత్తు నంతటిని ప్రకాశింప జేయును. చెట్టు తనవ్రేళ్ళను వ్యాపింపజేయునట్లు అతడు తన శక్తులను వ్యాపింపజేయును.”

ఈ శ్లోకముల ద్వారా పరతత్త్వమనగా భౌతికము మరియు ఆధ్యాత్మికములనెడి వివిధశక్తులచే సర్వవ్యాపియై యుండు దేవదేవుడైన శ్రీకృష్ణుడే యని ఎవరైనను సారాంశపరుపవచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 268 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 07 🌴

07. mattaḥ parataraṁ nānyat
kiñcid asti dhanañ-jaya
mayi sarvam idaṁ protaṁ
sūtre maṇi-gaṇā iva

🌷 Translation : 
O conqueror of wealth, there is no truth superior to Me. Everything rests upon Me, as pearls are strung on a thread.

🌹 Purport :
There is a common controversy over whether the Supreme Absolute Truth is personal or impersonal. As far as Bhagavad-gītā is concerned, the Absolute Truth is the Personality of Godhead, Śrī Kṛṣṇa, and this is confirmed in every step. In this verse, in particular, it is stressed that the Absolute Truth is a person. That the Personality of Godhead is the Supreme Absolute Truth is also the affirmation of the Brahma-saṁhitā: īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ; that is, the Supreme Absolute Truth Personality of Godhead is Lord Kṛṣṇa, who is the primeval Lord, the reservoir of all pleasure, Govinda, and the eternal form of complete bliss and knowledge. These authorities leave no doubt that the Absolute Truth is the Supreme Person, the cause of all causes.

The impersonalist, however, argues on the strength of the Vedic version given in the Śvetāśvatara Upaniṣad (3.10): tato yad uttara-taraṁ tad arūpam anāmayam/ ya etad vidur amṛtās te bhavanti athetare duḥkham evāpiyanti. “In the material world Brahmā, the primeval living entity within the universe, is understood to be the supreme amongst the demigods, human beings and lower animals. But beyond Brahmā there is the Transcendence, who has no material form and is free from all material contaminations. Anyone who can know Him also becomes transcendental, but those who do not know Him suffer the miseries of the material world.”

The impersonalist puts more stress on the word arūpam. But this arūpam is not impersonal. It indicates the transcendental form of eternity, bliss and knowledge as described in the Brahma-saṁhitā quoted above. Other verses in the Śvetāśvatara Upaniṣad (3.8–9) substantiate this as follows:

vedāham etaṁ puruṣaṁ mahāntam
āditya-varṇaṁ tamasaḥ parastāt
tam eva viditvāti mṛtyum eti
nānyaḥ panthā vidyate ’yanāya

yasmāt paraṁ nāparam asti kiñcid
yasmān nāṇīyo no jyāyo ’sti kiñcit
vṛkṣa iva stabdho divi tiṣṭhaty ekas
tenedaṁ pūrṇaṁ puruṣeṇa sarvam

“I know that Supreme Personality of Godhead who is transcendental to all material conceptions of darkness. Only he who knows Him can transcend the bonds of birth and death. There is no way for liberation other than this knowledge of that Supreme Person.

“There is no truth superior to that Supreme Person, because He is the supermost. He is smaller than the smallest, and He is greater than the greatest. He is situated as a silent tree, and He illumines the transcendental sky, and as a tree spreads its roots, He spreads His extensive energies.”

From these verses one concludes that the Supreme Absolute Truth is the Supreme Personality of Godhead, who is all-pervading by His multi-energies, both material and spiritual.
🌷 🌷 🌷 🌷 🌷

Date: 03/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 269: 07వ అధ్.,  శ్లో 08 /  Bhagavad-Gita - 269: Chap. 07, Ver. 08

🌹. శ్రీమద్భగవద్గీత - 269 / Bhagavad-Gita - 269 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 08 🌴

08. రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయో: |
ప్రణవ: సర్వవేదేషు శబ్ద: ఖే పౌరుషం నృషు ||

🌷. తాత్పర్యం :
ఓ కుంతీపుత్రా! నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశము నందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి యున్నాను.

🌷. భాష్యము :
భౌతికము మరియు ఆధ్యాత్మికములనెడి తన వైవిధ్యశక్తులచే శ్రీకృష్ణభగవానుడు ఏ విధముగా సర్వవ్యాపియై యుండునో ఈ శ్లోకము వివరించుచున్నది. ఈ వివిధశక్తుల ద్వారానే భగవానుడు తొలుత దర్శింపబడి నిరాకారరూపముగా అనుభవమునకు వచ్చును. సూర్యమండలము నందుండెడి సాకారుడైన సూర్యదేవుడు తన సర్వవ్యాపకశక్తి (సూర్యకాంతి) ద్వారా దర్శనీయుడైనట్లు, శ్రీకృష్ణభగవానుడు తన దామమునందు నిలిచియున్నను సర్వత్రా వ్యాపించియుండెడి తన శక్తుల ద్వారా దర్శనీయుడగును. ఉదాహరణకు రుచి యనునది నీటి యందలి ప్రధాన విషయము. లవణపూర్ణమై యున్నందున సముద్రనీటిని త్రాగుటకు ఎవ్వరును ఇచ్చగింపరు. అనగా రుచిని బట్టియే నీటి యెడ ఎవ్వరైనను ఆకర్షణను కలిగియుందురు. అట్టి రుచి శ్రీకృష్ణభగవానుని శక్తులలో ఒకటియై యున్నది. నిరాకారవాదియైనవాడు నీటి రుచి ద్వారా దాని యందు భగవానుని ఉనికిని గాంచగా, మనుజుని దాహమును తీర్చుటకు కరుణతో రుచిగల నీటి నొసగుచున్న ఆ భగవానుని సాకారవాడి కీర్తించును. భగవానుని దర్శించుటకు ఇదియే మార్గము. వాస్తవమునకు సాకారవాదమునకు మరియు నిరాకారవాదమునకు ఎట్టి విరోధము లేదు. భగవతత్త్వము నెరిగినవాడు సాకారభావనము మరియు నిరాకారభావనము అనునవి ఏకకాలమున సమస్తమునందు నెలకొనియున్నవనియు మరియు ఆ తత్త్వములందు ఎట్టి వ్యతిరేకత లేదనియు తెలిసియుండును. కనుకనే శ్రీచైతన్యమాహాప్రభువు ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వము తెలిపెడి “అచింత్యభేదాభేదతత్త్వము” అనెడి తమ ఉదాత్తమగు సిద్ధాంతమును స్థాపించిరి.

సూర్యచంద్రుల కాంతి సైతము శ్రీకృష్ణభగవానుని నిరాకారతేజమైన బ్రహ్మజ్యోతి నుండియే వెలువడునటువంటిది. అలాగుననే సర్వవేదమంత్రముల ఆదిపదమైన ప్రణవాము లేదా ఓంకారము దేవదేవునే సంబోధించును. నిరాకారవాదులు శ్రీకృష్ణభగవానుని అతని అసంఖ్యాక నామముల ద్వారా సంబోధించుటకు వెరగు చెందియుండుటచే దివ్యమగు ఓంకారమును పలుకుట యందు మక్కువను చూపుదురు. కాని ఓంకారము శ్రీకృష్ణుని శబ్దప్రాతినిధ్యమై యని వారు ఎరుగజాలరు. వాస్తవమునకు కృష్ణభక్తిరసభావనపు పరిధి సర్వత్రా వ్యాపించియున్నది. దాని నెరిగినవాడు ధన్యుడు కాగలడు. అనగా కృష్ణుని గూర్చి తెలియనివారు మాయలో నున్నట్టివారే. కనుకనే కృష్ణపరజ్ఞానము ముక్తియై యుండగా, కృష్ణుని గూర్చి తెలియకుండుట బంధమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 269 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 08 🌴

08. raso ’ham apsu kaunteya
prabhāsmi śaśi-sūryayoḥ
praṇavaḥ sarva-vedeṣu
śabdaḥ khe pauruṣaṁ nṛṣu

🌷 Translation : 
O son of Kuntī, I am the taste of water, the light of the sun and the moon, the syllable oṁ in the Vedic mantras; I am the sound in ether and ability in man.

🌹 Purport :
This verse explains how the Lord is all-pervasive by His diverse material and spiritual energies. The Supreme Lord can be preliminarily perceived by His different energies, and in this way He is realized impersonally. As the demigod in the sun is a person and is perceived by his all-pervading energy, the sunshine, so the Lord, although in His eternal abode, is perceived by His all-pervading diffusive energies. The taste of water is the active principle of water. No one likes to drink sea water, because the pure taste of water is mixed with salt. Attraction for water depends on the purity of the taste, and this pure taste is one of the energies of the Lord. The impersonalist perceives the presence of the Lord in water by its taste, and the personalist also glorifies the Lord for His kindly supplying tasty water to quench man’s thirst. That is the way of perceiving the Supreme. Practically speaking, there is no conflict between personalism and impersonalism. One who knows God knows that the impersonal conception and personal conception are simultaneously present in everything and that there is no contradiction. Therefore Lord Caitanya established His sublime doctrine: acintya bheda- and abheda-tattva – simultaneous oneness and difference.
🌷🌷🌷🌷🌷

Date: 04/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 270: 07వ అధ్.,  శ్లో 09 /  Bhagavad-Gita - 270: Chap. 07, Ver. 09

🌹. శ్రీమద్భగవద్గీత - 270 / Bhagavad-Gita - 270 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 09 🌴

09. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు।।

🌷. తాత్పర్యం :
భూమి యొక్క ఆద్యమైన సుగంధము, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్వుల యందు తపస్సును నేనైయున్నాను.

🌷. భాష్యము :
“పుణ్యము” అనగా శిథిలము కాకుండా ఉండునదని భావము. అట్టి పుణ్యము ఆద్యమైనట్టిది. పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైనవానికి ఒక ప్రత్యేకమైన వాసన యున్నట్లే జగమునందు ప్రతియొక్కటియు ఒక ప్రత్యేకమైన వాసనను (గంధమును) కలిగియుండును. ఆద్యమై సర్వత్రా వ్యాపించియుండి కలుషితము గానటువంటి పరిమళము శ్రీకృష్ణుడే అయి యున్నాడు. వాసన రీతిగానే ప్రతిదియు ఒక సహజరుచిని కలిగియుండును. కాని ఆ రుచి రసాయన మిశ్రణముచే మార్పుచెందగలదు. అనగా ఆద్యమైన ప్రతిదియు ఒక వాసనను, సుగంధము, రుచిని కలిగియుండును. ఇక “విభావసౌ” యనగా అగ్ని యని భావము. ఆ అగ్ని లేనిదే కర్మాగారములను నడుపుట, వంటచేయుట వంటి కార్యములు ఏవియును మనము చేయజాలము. అట్టి అగ్ని మరియు అగ్ని యందలి ఉష్ణము శ్రీకృష్ణుడే. ఆయుర్వేదము ప్రకారము ఉదరములో జఠరాగ్ని మందగించుటయే అజీర్తికి కారణము. అనగా ఆహారము పచనమగుటకు సైతము అగ్నియే అవసరము. ఈ విధముగా భూమి, జలము, అగ్ని, వాయువు, సర్వచైతన్యపదార్థములు (రసాయనములు మరియు మూలకములు) శ్రీకృష్ణుని వలననే కలుగుచున్నవి కృష్ణభక్తిరసభావన ద్వారా మనము తెలిసికొనగలము. మనుజుని ఆయు:పరిమితి కూడా కృష్ణుని చేతనే నిర్ణయింపబడుచున్నది. కనుక ఆ కృష్ణుని కరుణచే మనుజుడు తన ఆయు:పరిమితిని పెంచుకొనుట లేక తగ్గించుకొనుట చేసికొనవచ్చును. అనగా కృష్ణభక్తిరస భావనయే అన్నిరంగములందును అవసరమైనట్టిది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 270 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 09 🌴

09. puṇyo gandhaḥ pṛthivyāṁ ca
tejaś cāsmi vibhāvasau
jīvanaṁ sarva-bhūteṣu
tapaś cāsmi tapasviṣu

🌷 Translation : 
I am the original fragrance of the earth, and I am the heat in fire. I am the life of all that lives, and I am the penances of all ascetics.

🌹 Purport :
Puṇya means that which is not decomposed; puṇya is original. Everything in the material world has a certain flavor or fragrance, as the flavor and fragrance in a flower, or in the earth, in water, in fire, in air, etc. The uncontaminated flavor, the original flavor, which permeates everything, is Kṛṣṇa. Similarly, everything has a particular original taste, and this taste can be changed by the mixture of chemicals. So everything original has some smell, some fragrance and some taste. Vibhāvasu means fire. Without fire we cannot run factories, we cannot cook, etc., and that fire is Kṛṣṇa. The heat in the fire is Kṛṣṇa. According to Vedic medicine, indigestion is due to a low temperature in the belly. So even for digestion fire is needed. In Kṛṣṇa consciousness we become aware that earth, water, fire, air and every active principle, all chemicals and all material elements are due to Kṛṣṇa. The duration of man’s life is also due to Kṛṣṇa. Therefore by the grace of Kṛṣṇa, man can prolong his life or diminish it. So Kṛṣṇa consciousness is active in every sphere.
🌷🌷🌷🌷🌷

Date: 05/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 271: 07వ అధ్.,  శ్లో 10 /  Bhagavad-Gita - 271: Chap. 07, Ver. 10

🌹. శ్రీమద్భగవద్గీత - 271 / Bhagavad-Gita - 271 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 10 🌴

10. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ పృథాకుమారా! నేనే సర్వప్రాణులకు సనాతనబీజముననియు, బుద్ధిమంతుల బుద్ధిననియు, శక్తిమంతుల శక్తిననియు తెలిసికొనుము.

🌷. భాష్యము :
బీజమనగా విత్తనము, స్థావర, జంగమాది సమస్తజీవులకు శ్రీకృష్ణుడే బీజమై యున్నాడు. పక్షులు, జంతువులు, మనుజులు, పలు ఇతరజీవులు జంగమములు కాగా, వృక్షాదులు స్థావరములు. స్థావరములు కదలలేక కేవలము స్థిరముగా నిలిచియుండును. ప్రతిజీవియు ఎనుబదినాలుగులక్షల జీవరాసులలో ఏదియో ఒక రకమునకు చెందియుండును. వానిలో కొన్ని స్థావరములై యుండగా, మరికొన్ని జంగములై యున్నవి. అయినను అన్నింటికిని బీజప్రదాత శ్రీకృష్ణుడే. దేని నుండి సమస్తము ఉద్భవించునో అదియే పరబ్రహ్మము లేదా పరతత్త్వమని వేదవాజ్మయమునందు తెలుపబడినది. శ్రీకృష్ణుడే ఆ పరతత్త్వము మరియు పరబ్రహ్మమును అయి యున్నాడు. బ్రహ్మము నిరాకారము కాగా పరబ్రహ్మము మాత్రము సాకారము. భగవద్గీత యందు తెలుపబడినట్లు నిరాకారబ్రహ్మము పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని యందు పతిష్టితమై యున్నది. కనుక శ్రీకృష్ణుడే సర్వమునాకు కారణమును మరియు మూలమును అయి యున్నాడు. వృక్షమూలము వృక్షమునంతటిని పోషించురీతి, సర్వమునకు సనాతనములమై యున్నందున శ్రీకృష్ణుడు జగమునందు సమస్తమును పోషించుచున్నాడు. ఈ విషయము కఠోపనిషత్తు (2.2.13) నందు కూడా నిర్దారింపబడినది. 

నిత్యోనిత్యానాం చేతన శ్చేతనానామ్ |
ఏకో బహూనాం యో విదధాతి కామాన్ ||

నిత్యులైనవారిలో ప్రధానమైనవాడు అతడే. సమస్తజీవులలో దివ్యుడు అతడే. అతడొక్కడే సర్వులకు పోషించువాడై యున్నాడు. వాస్తవమునకు బుద్ధి నుపయోగింపక ఎవ్వరును ఏ కార్యమును చేయలేరు. అట్టి బుద్ధికి సైతము కారణము తానేనని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు. కనుకనే మనుజుడు బుద్ధిమంతుడు కానిదే దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసికొనజాలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 271 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 10 🌴

10. bījaṁ māṁ sarva-bhūtānāṁ
viddhi pārtha sanātanam
buddhir buddhimatām asmi
tejas tejasvinām aham

🌷 Translation : 
O son of Pṛthā, know that I am the original seed of all existences, the intelligence of the intelligent, and the prowess of all powerful men.

🌹 Purport :
Bījam means seed; Kṛṣṇa is the seed of everything. There are various living entities, movable and inert. Birds, beasts, men and many other living creatures are moving living entities; trees and plants, however, are inert – they cannot move, but only stand. Every entity is contained within the scope of 8,400,000 species of life; some of them are moving and some of them are inert. In all cases, however, the seed of their life is Kṛṣṇa. As stated in Vedic literature, Brahman, or the Supreme Absolute Truth, is that from which everything is emanating. Kṛṣṇa is Para-brahman, the Supreme Spirit. Brahman is impersonal and Para-brahman is personal. Impersonal Brahman is situated in the personal aspect – that is stated in Bhagavad-gītā. Therefore, originally, Kṛṣṇa is the source of everything. He is the root. As the root of a tree maintains the whole tree, Kṛṣṇa, being the original root of all things, maintains everything in this material manifestation. This is also confirmed in the Vedic literature (Kaṭha Upaniṣad 2.2.13):

nityo nityānāṁ cetanaś cetanānām
eko bahūnāṁ yo vidadhāti kāmān

He is the prime eternal among all eternals. He is the supreme living entity of all living entities, and He alone is maintaining all life. One cannot do anything without intelligence, and Kṛṣṇa also says that He is the root of all intelligence. Unless a person is intelligent he cannot understand the Supreme Personality of Godhead, Kṛṣṇa.
🌷🌷🌷🌷🌷

Date: 06/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 272: 07వ అధ్.,  శ్లో 11 /  Bhagavad-Gita - 272: Chap. 07, Ver. 11

🌹. శ్రీమద్భగవద్గీత - 272 / Bhagavad-Gita - 272 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 11 🌴

11. బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు కామో(స్మి భరతర్షభ ||

🌷. తాత్పర్యం :
ఓ భరతవంశశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మనియమములకు విరుద్ధము కానటువంటి సంభోగమును నేనే అయియున్నాను.

🌷. భాష్యము :
బలవంతుడైనవాని బలము ఎల్లప్పుడును బలహీనులను రక్షించుటకే వినియోగపడవలెను గాని స్వలాభము కొరకు కాదు. అదే విధముగా ధర్మానుసారముగా నుండెడి మైథునసుఖము కేవలము సంతానప్రాప్తికే గాని అన్యమునకు కాదు. అటు పిమ్మట సంతానము కృష్ణభక్తిభావనాయుతులుగా చేయుట తల్లిదండ్రుల బాధ్యతయై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 272 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 11 🌴

11. balaṁ balavatāṁ cāhaṁ
kāma-rāga-vivarjitam
dharmāviruddho bhūteṣu
kāmo ’smi bharatarṣabha

🌷 Translation : 
I am the strength of the strong, devoid of passion and desire. I am sex life which is not contrary to religious principles, O lord of the Bhāratas [Arjuna].

🌹 Purport :
The strong man’s strength should be applied to protect the weak, not for personal aggression. Similarly, sex life, according to religious principles (dharma), should be for the propagation of children, not otherwise. The responsibility of parents is then to make their offspring Kṛṣṇa conscious.
🌷🌷🌷🌷🌷

Date: 07/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 273: 07వ అధ్.,  శ్లో 12 /  Bhagavad-Gita - 273: Chap. 07, Ver. 12

🌹. శ్రీమద్భగవద్గీత - 273 / Bhagavad-Gita - 273 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 12 🌴

12. యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ||

🌷. తాత్పర్యం :
సత్త్వగుణమునకు గాని, రజోగుణమునకు గాని లేదా తమోగుణమునకు గాని సంబంధించిన జీవుల భావములన్నియును నా శక్తి నుండే ఉద్భవించినవని నీవు తెలిసికొనుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడనై యున్నాను. ప్రకృతిత్రిగుణములు నా యందున్నను నేను వాటికి లోబడియుండును.

🌷. భాష్యము :
జగమునందలి సమస్తకర్మలు ప్రకృతిజన్య త్రిగుణముల చేతనే నిర్వహింపబడుచున్నవి. ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండియే కలుగుచున్నను అతడెన్నడును వాటిచే ప్రభావితుడు కాడు. ఉదాహరణకు రాజ్యాంగనియమములచే ఎవ్వరైనను శిక్షింపబడవచ్చునేమో కాని, ఆ రాజ్యాంగమును తయారుచేసిన రాజు మాత్రం రాజ్యాంగనియమములకు అతీతుడై యుండును. అదే విధముగా సత్త్వరజస్తమోగుణములు శ్రీకృష్ణభగవానుని నుండియే ఉద్భవించినను అతడెన్నడును ప్రకృతిచే ప్రభావితుడు కాడు. కనుకనే అతడు నిర్గుణుడు. అనగా గుణములు అతని నుండియే కలుగుచున్నను అతనిపై ప్రభావము చూపలేవు. అదియే భగవానుని లేదా దేవదేవుని ప్రత్యేక లక్షణములలో ఒకటి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 273 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 12 🌴

12. ye caiva sāttvikā bhāvā
rājasās tāmasāś ca ye
matta eveti tān viddhi
na tv ahaṁ teṣu te mayi

🌷 Translation : 
Know that all states of being – be they of goodness, passion or ignorance – are manifested by My energy. I am, in one sense, everything, but I am independent. I am not under the modes of material nature, for they, on the contrary, are within Me.

🌹 Purport :
All material activities in the world are being conducted under the three modes of material nature. Although these material modes of nature are emanations from the Supreme Lord, Kṛṣṇa, He is not subject to them. For instance, under the state laws one may be punished, but the king, the lawmaker, is not subject to that law. Similarly, all the modes of material nature – goodness, passion and ignorance – are emanations from the Supreme Lord, Kṛṣṇa, but Kṛṣṇa is not subject to material nature. Therefore He is nirguṇa, which means that these guṇas, or modes, although issuing from Him, do not affect Him. That is one of the special characteristics of Bhagavān, or the Supreme Personality of Godhead.
🌷🌷🌷🌷🌷

Date: 08/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 274: 07వ అధ్.,  శ్లో 13 /  Bhagavad-Gita - 274: Chap. 07, Ver. 13

🌹. శ్రీమద్భగవద్గీత - 274 / Bhagavad-Gita - 274 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 13 🌴

13. త్రిభిర్గుణమయైర్భావైరేభి: సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్య: పరమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
సమస్తవిశ్వము సత్త్వరజస్తమోగుణములనెడి త్రిగుణములచే భ్రాంతికి గురియై గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను ఎరుగజాలకున్నది.

🌷. భాష్యము :
సమస్త ప్రపంచము త్రిగుణములచే మోహింపజేయబడియున్నది. అట్టి త్రిగుణములచే మోహమునకు గురియైనవారు శ్రీకృష్ణభగవానుడు ప్రకృతికి పరమైనవాడని ఎరుగజాలరు.

భౌతికప్రకృతి ప్రభావము నందున్న ప్రతిజీవియు ఒక ప్రత్యేకమైన దేహమును మరియు తత్సంబంధిత కర్మలను కలిగియుండును. గుణముల ననుసరించి కర్మల యందు చరించు మనుజులు నాలుగురకములుగా నుందురు. సత్త్వగుణమునందు సంపూర్ణముగా నిలిచియుండువారు బ్రహ్మణులు. రజోగుణమునందు సంపూర్ణముగా నిలిచియుండువారు క్షత్రియులు. రజస్తమోగుణములను కలిగియుండువారు వైశ్యులు, కేవలము తమోగుణము నందే యుండువారు శూద్రులు. శూద్రులకన్నను నీచులైనవారు జంతువులు లేక పశుప్రాయ జీవనులు అనబడుదురు. కాని వాస్తవమునాకు ఈ ఉపాదులన్నియు అశాశ్వతములు. బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను లేక ఇంకేదైనను ఈ జీవితము తాత్కాలికమైనది. ఈ జీవతము తాత్కాలికమైనను దీని పిదప మనకు ఈ జన్మ లభించునో ఎరుగలేము. మాయావశమున దేహభావనకు లోబడియే మనలను మనము భారతీయులుగనో, అమెరికావాసులుగానో లేక బ్రాహ్మణులుగనో, హిందువులుగనో, మహమ్మదీయులుగనో భావించుచుందురు. ఈ విధముగా త్రిగుణములచే బంధితులమైనచో మనము ఆ గుణముల వెనుకనున్న భగవానుని మరతుము. కనుకనే త్రిగుణములచే మోహమునొందిన జీవులు భౌతిక నేపథ్యము వెనుక నున్నది తానేయనుచు ఎరుగజాలకున్నారని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు.

మానవులు, దేవతలు, జంతువులాదిగాగల అనేకరకముల జీవుల ప్రకృతి ప్రభావము చేతనే నిర్గుణుడైన శ్రీకృష్ణభగవానుని మరచియున్నారు. రజస్తమోగుణముల యందున్నవారే గాక, సత్త్వగుణమునందున్నవారు కూడా పరతత్త్వము యొక్క నిరాకారబ్రహ్మభావమును దాటి ముందుకు పోజాలరు. సౌందర్యము, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, యశస్సు, వైరాగ్యములు సమగ్రముగా నున్న శ్రీకృష్ణభగవానుని దివ్యరూపముచే వారు భ్రాంతి నొందుదురు. శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుట సత్త్వగుణమునందున్నవారికే సాధ్యము కాదన్నచో, రజస్తమోగుణము లందున్నవారికి ఏమి ఆశ మిగిలి యుండగలదు? కాని కృష్ణభక్తిరసభావనము ఈ త్రిగుణములకు పరమైనట్టిది. దాని యందు ప్రతిష్టితులైనట్టివారు నిజముగా ముక్తపురుషులు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 274 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 13 🌴

13. tribhir guṇa-mayair bhāvair
ebhiḥ sarvam idaṁ jagat
mohitaṁ nābhijānāti
mām ebhyaḥ param avyayam

🌷 Translation : 
Deluded by the three modes [goodness, passion and ignorance], the whole world does not know Me, who am above the modes and inexhaustible.

🌹 Purport :
The whole world is enchanted by the three modes of material nature. Those who are bewildered by these three modes cannot understand that transcendental to this material nature is the Supreme Lord, Kṛṣṇa.

Every living entity under the influence of material nature has a particular type of body and a particular type of psychological and biological activities accordingly. There are four classes of men functioning in the three material modes of nature. Those who are purely in the mode of goodness are called brāhmaṇas. Those who are purely in the mode of passion are called kṣatriyas. Those who are in the modes of both passion and ignorance are called vaiśyas. Those who are completely in ignorance are called śūdras. And those who are less than that are animals or animal life. However, these designations are not permanent. I may be either a brāhmaṇa, kṣatriya, vaiśya or whatever – in any case, this life is temporary. But although life is temporary and we do not know what we are going to be in the next life, by the spell of this illusory energy we consider ourselves in terms of this bodily conception of life, and we thus think that we are American, Indian, Russian, or brāhmaṇa, Hindu, Muslim, etc. And if we become entangled with the modes of material nature, then we forget the Supreme Personality of Godhead, who is behind all these modes. So Lord Kṛṣṇa says that living entities deluded by these three modes of nature do not understand that behind the material background is the Supreme Personality of Godhead.

There are many different kinds of living entities – human beings, demigods, animals, etc. – and each and every one of them is under the influence of material nature, and all of them have forgotten the transcendent Personality of Godhead. Those who are in the modes of passion and ignorance, and even those who are in the mode of goodness, cannot go beyond the impersonal Brahman conception of the Absolute Truth. They are bewildered before the Supreme Lord in His personal feature, which possesses all beauty, opulence, knowledge, strength, fame and renunciation. When even those who are in goodness cannot understand, what hope is there for those in passion and ignorance? Kṛṣṇa consciousness is transcendental to all these three modes of material nature, and those who are truly established in Kṛṣṇa consciousness are actually liberated.
🌷🌷🌷🌷🌷

Date: 09/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 275: 07వ అధ్.,  శ్లో 14 /  Bhagavad-Gita - 275: Chap. 07, Ver. 14

🌹. శ్రీమద్భగవద్గీత - 275 / Bhagavad-Gita - 275 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 14 🌴

14. దైవీహ్యేషా గుణమయాయి మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||

🌷. తాత్పర్యం :
త్రిగుణాత్మకమైన నా ఈ దైవీమాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కాని నన్ను శరణుజొచ్చినవారు దీనిని సులభముగా దాటగలుగులుగుదురు.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన శక్తులు కలవు. అవన్నియును దివ్యమైనవి. జీవులు అతని శక్తిలో భాగములై కారణముగా దివ్యులైనను మయాశక్తి సంపర్కముచే వారి ఆదియైన ఉన్నతశక్తి కప్పబడియుండును. ஆఆ విధముగా మాయాశక్తిచే కప్పబడినప్పుడు ఎవ్వరును దాని ప్రభావము నుండి తప్పించుకొనలేరు. పూర్వమే తెలుపబడినట్లు భౌతికములు, ఆధ్యాత్మికములు అగు ప్రకృతులు శ్రీకృష్ణభగవానుని నుండియే ఉత్పన్నమగుచున్నందున నిత్యములై యున్నవి. జీవులు భగవానుని నిత్యమైన ఉన్నతప్రకృతికి చెందినవారు. కాని గౌణప్రకృతి సంపర్కము వలన (భౌతికపదార్థ సంపర్కము) వారి మోహము సైతము నిత్యమగుచున్నది. కనుకనే బద్ధజీవుడు “నిత్యబద్ధుడు” అని పిలువబడుచున్నాడు. ఏ సమయమున అతడు బద్ధుడైనాడన్న చరిత్రను కనుగొనుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. కనుకనే భౌతికప్రకృతి గౌణశక్తియైనను ప్రకృతిబంధము నుండి జీవుని ముక్తి అత్యంత కఠినమై యున్నది. జీవుడు అతిక్రమింపలేనటువంటి భగవత్సంకల్పము చేతనే భౌతికప్రకృతియు నడుచుటయే అందులకు కారణము. భౌతికప్రకృతి గౌణమైనను శ్రీకృష్ణభగవానునితో సంబంధమును కలిగి అతని సంకల్పము చేతనే నడుచుచున్నందున భౌతికప్రకృతి విశ్వము యొక్క సృష్టి, లయములందు అద్భుతముగా పనిచేయుచుండును. “మాయం తు ప్రకృతిం విద్యాన్ మాయినం తు మహేశ్వరమ్ (శ్వేతాశ్వతరోపనిషత్తు 4.10) – మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక ఘన ఇంద్రజాలకుడైన దేవదేవుడు కలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్యనియామకుడు” అని వేదములు సైతము ఈ విషయమును నిర్ధారించుచున్నవి.

“గుణము” అను దానికి వేరొక అర్థము త్రాడు. అనగా బద్ధజీవుడు మొహమనెడి త్రాళ్ళతో గట్టిగా బంధింపబడియున్నాడని అవగతము చేసికొనవలెను. చేతులు, కాళ్ళు బంధింపబడిన వ్యక్తి తనను తాను బంధముక్తుని గావించుకొనలేడు. బంధరహితుడైనవాడే అతనికి సహాయము చేయవలసియుండును. బంధింపబడియున్నవాడు బంధింపబడినవానిచే సహాయము నొందలేడు గనుక రక్షించువాడు ముక్తుడై యుండవలెను. కనుక కేవలము శ్రీకృష్ణభగవానుడు లేదా అతని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు మాత్రమే బద్ధజీవునికి బంధము నుండి ముక్తిని గూర్చవలదు. అట్టి ఉన్నతమైన సహాయము లేనిదే ఎవ్వరును ప్రకృతిబంధము నుండి విడివడలేరు. అనగా కృష్ణభక్తిరసభావనము(భక్తియోగము) మనుజునికి బంధము నుండి ముక్తిని పొందుటకు తోడ్పాడగలదు. శ్రీకృష్ణభగవానుడు మాయకు ప్రభువైనందున జీవుని ముక్తుని చేయమని దాటశక్యము గాని ఆ మాయను ఆదేశించును. సహజముగా తన సంతానమేయైన జీవునిపై గల పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని యెడ గల నిర్హేతుక కరుణయే భగవానుడు అట్టి విడుదలను ఆదేశించుటకు కారణమై యున్నది. కనుక శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణము నొందుటయే అతి కఠినమైన ప్రకృతిబంధముల నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమే యున్నది.

“మామేవ” అను పదమునకు సైతము విశేష ప్రాధాన్యత కలదు. ఇచ్చట “మామ్” అనగా కృష్ణుడే (విష్ణువు) యని భావము కాని బ్రహ్మ లేదా శివుడని భావము కాదు. బ్రహ్మరుద్రాదులు ఉన్నతులు మరియు దాదాపు విష్ణుస్థాయికి చెందినవారేయైనను మాయాబంధము నుండి జీవునికి ముక్తిని మాత్రము కలిగించలేరు. అట్టి రజస్తమోగుణావతారములకు అది సాధ్యము కాదు. వేరు మాటలలో బ్రహ్మరుద్రాదులు సైతము మాయాప్రభావమునకు లోబడియుండువారే. కేవలము విష్ణువే మాయకు ప్రభువు కావున అతడే బద్ధజీవుని బంధము నుండి విడిపింపగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుట ద్వారానే ముక్తి లభింపగలదు – “తమేవ విదిత్వా” యని శ్వేతాశ్వతరోపనిషత్తు (3.8) సైతము దీనిని నిర్ధారించుచున్నది. ముక్తి కేవలము విష్ణుకరుణ చేతనే లభించునని శివుడు సైతము ధ్రువీకరించెను. “ముక్తి ప్రదాతా సర్వేషాం విష్ణురేవ న సంశయ: - సర్వులకు ముక్తిప్రదాత విష్ణువే యనుటలో ఎట్టి సందేహము లేదు” అని పరమశివుడు పలికెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 275 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 14 🌴

14. daivī hy eṣā guṇa-mayī
mama māyā duratyayā
mām eva ye prapadyante
māyām etāṁ taranti te

🌷 Translation : 
This divine energy of Mine, consisting of the three modes of material nature, is difficult to overcome. But those who have surrendered unto Me can easily cross beyond it.

🌹 Purport :
The Supreme Personality of Godhead has innumerable energies, and all these energies are divine. Although the living entities are part of His energies and are therefore divine, due to contact with material energy their original superior power is covered. Being thus covered by material energy, one cannot possibly overcome its influence. As previously stated, both the material and spiritual natures, being emanations from the Supreme Personality of Godhead, are eternal. The living entities belong to the eternal superior nature of the Lord, but due to contamination by the inferior nature, matter, their illusion is also eternal. The conditioned soul is therefore called nitya-baddha, or eternally conditioned. No one can trace out the history of his becoming conditioned at a certain date in material history. Consequently, his release from the clutches of material nature is very difficult, even though that material nature is an inferior energy, because material energy is ultimately conducted by the supreme will, which the living entity cannot overcome. Inferior, material nature is defined herein as divine nature due to its divine connection and movement by the divine will. Being conducted by divine will, material nature, although inferior, acts so wonderfully in the construction and destruction of the cosmic manifestation. The Vedas confirm this as follows: māyāṁ tu prakṛtiṁ vidyān māyinaṁ tu maheśvaram. “Although māyā [illusion] is false or temporary, the background of māyā is the supreme magician, the Personality of Godhead, who is Maheśvara, the supreme controller.” (Śvetāśvatara Upaniṣad 4.10)

Another meaning of guṇa is rope; it is to be understood that the conditioned soul is tightly tied by the ropes of illusion. A man bound by the hands and feet cannot free himself – he must be helped by a person who is unbound. Because the bound cannot help the bound, the rescuer must be liberated. Therefore, only Lord Kṛṣṇa, or His bona fide representative the spiritual master, can release the conditioned soul. Without such superior help, one cannot be freed from the bondage of material nature. Devotional service, or Kṛṣṇa consciousness, can help one gain such release. Kṛṣṇa, being the Lord of the illusory energy, can order this insurmountable energy to release the conditioned soul. He orders this release out of His causeless mercy on the surrendered soul and out of His paternal affection for the living entity, who is originally a beloved son of the Lord. Therefore surrender unto the lotus feet of the Lord is the only means to get free from the clutches of the stringent material nature.

The words mām eva are also significant. Mām means unto Kṛṣṇa (Viṣṇu) only, and not Brahmā or Śiva. Although Brahmā and Śiva are greatly elevated and are almost on the level of Viṣṇu, it is not possible for such incarnations of rajo-guṇa (passion) and tamo-guṇa (ignorance) to release the conditioned soul from the clutches of māyā. In other words, both Brahmā and Śiva are also under the influence of māyā. Only Viṣṇu is the master of māyā; therefore He alone can give release to the conditioned soul. The Vedas (Śvetāśvatara Upaniṣad 3.8) confirm this in the phrase tam eva viditvā, or “Freedom is possible only by understanding Kṛṣṇa.” Even Lord Śiva affirms that liberation can be achieved only by the mercy of Viṣṇu. Lord Śiva says, mukti-pradātā sarveṣāṁ viṣṇur eva na saṁśayaḥ: “There is no doubt that Viṣṇu is the deliverer of liberation for everyone.”
🌹 🌹 🌹 🌹 🌹

Date: 10/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 276: 07వ అధ్.,  శ్లో 15 /  Bhagavad-Gita - 276: Chap. 07, Ver. 15

🌹. శ్రీమద్భగవద్గీత - 276 / Bhagavad-Gita - 276 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 15 🌴

15. న మాం దుష్కృతినో మూఢా: ప్రపద్యన్తే నరాధమా: |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితా: ||

🌷. తాత్పర్యం :
దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడినవారు, దానవప్రవృత్తియైన నాస్తికస్వభావమును కలిగియుండువారు నా శరణము నొందరు.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణకమలములకు కేవలము శరణమునొందుట ద్వారా మనుజుడు అతికఠినమైన ప్రకృతినియమములను దాటగాలడని భగవద్గీత యందు తెలుపబడినది. అట్టి యెడ విద్యావంతులైన తాత్త్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్థులు, పాలకులు, సామాన్యజనుల నేతలు పలువురు ఎందులకు సర్వశక్తిసంపన్నుడైన శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణుజొచ్చరనెడి ప్రశ్న ఇచ్చట ఉదయించును. మానవులకు మార్గదర్శకులైనవారు పలురీతులలో గొప్ప ప్రణాలికలు మరియు పట్టుదలతో ముక్తిని (ప్రకృతి నియమముల నుండి విడుదల) బడయుటకై పలు సంవత్సరములు లేదా జన్మలు యత్నింతురు. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణకమలములకు కేవలము శరణము నొందుట ద్వారా ముక్తి సాధ్యమగుచున్నప్పుడు మేధావులు మరియు కష్టించువారును అగు నాయకులు ఎందులకై ఈ సులభవిధానము ఎన్నుకొనుటలేదు?

ఈ ప్రశ్నకు భగవద్గీత స్పష్టముగా సమాధానమొసగుచున్నది. మానవులకు వాస్తవముగా మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాదిఋషులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలిమహారాజు, తదనంతరము వారైన మధ్వాచార్యులు, రామానజాచార్యులు, శ్రీచైతన్యమాహాప్రభువు మరియు శ్రద్ధను కలిగినటువంటి తాత్వికులు, ప్రజానేతలు, విద్యాబోధకులు, శాస్త్రజ్ఞుల వంటివారు సర్వశక్తిసమన్వితుడు మరియు ప్రామాణికుడును అగు శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణము నొందియేయున్నారు. కేవలము నిజమైన తత్త్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కానివారు మాత్రమే విషయాభిలాషులై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు ఆ భగవానుని ప్రణాళికను గాని, మార్గమును గాని అంగీకరించుట లేదు. వారు భగవానుని గూర్చిన అవగాహన ఏమియునులేక కేవలము లోకవ్యవహార ప్రణాళికలను మాత్రము పలుజేయుచు, భౌతికస్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింత వృద్ధిచేసికొందురు. భౌతికప్రకృతి శక్తివంతమైనందున అది సర్వదా అట్టి నాస్తికుల అప్రమాణిక ప్రణాళికలను నిరోధించి వారి యోచనాసంఘముల జ్ఞానమును భంగపరచుచుండును. 

నాస్తికలైనట్టి యోజనకర్తలు ఇచ్చట “దుష్కృతిన:” (చెడు కార్యములు ఆచరించువారుగా) అని వర్ణింపబడినారు. “కృతి” యనగా గణనీయమైన కార్యము చేసినవాడని భావము. దుష్టమైనది గాని, మంచిదైనది కాని ఏదేని ఒక ఘనకార్యమును నిర్వహించుటకు గొప్పబుద్ధి అవసరమైయున్నది. కనుక నాస్తికయోజనకర్తలు సైతము కొన్నిమార్లు తెలివిగలవారు మరియు బుద్ధికుశలతగలవారుగా కన్పట్టుచుందురు. కాని వారి అట్టి నాస్తికబుద్ధి భగవానుని విధానమునకు వ్యతిరేకముగా ఉపయోగించబడుట వలన వారు “దుష్కృతిన:” అని పిలువబడుదురు. అట్టి నాస్తికులు బుద్ధి మరియు ప్రయత్నములు చెడుమార్గమును పట్టియుండునని ఈ పదము సూచించును.

భౌతికశక్తి సంపూర్ణముగా శ్రీకృష్ణభగవానుని ఆధీనములో వర్తించునని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. దానికెన్నడును స్వతంత్ర అధికారము లేదు. వస్తువునకు అనుగుణముగా దాని ఛాయ చరించురీతి అది పనిచేయుచుండును. అయినప్పటికిని అది అతిశక్తివంతమై యుండును. కాని భక్తిలేని కారణముగా నాస్తికుడు ఆ భౌతికప్రకృతి వర్తించు విధానమును గాని, భగవానుని సంకల్పమును గాని ఎరుగజాలకుండును, శాస్త్రజ్ఞులు, తత్త్వవేత్తలు, నేతలు, బోధకులని లౌకికముగా గొప్పపేరు పొందినను హిరణ్యకశిపుడు మరియు రావణుల యోచనలన్నియును రూపుమాసినట్లు, మాయ మరియు రజస్తమోగుణముల కారణముగా నాస్తికుడైనట్టివాని ప్రణాళికలన్నియును భంగపడును
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 276 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 15 🌴

15. na māṁ duṣkṛtino mūḍhāḥ
prapadyante narādhamāḥ
māyayāpahṛta-jñānā
āsuraṁ bhāvam āśritāḥ

🌷 Translation : 
Those miscreants who are grossly foolish, who are lowest among mankind, whose knowledge is stolen by illusion, and who partake of the atheistic nature of demons do not surrender unto Me.

🌹 Purport :
It is said in Bhagavad-gītā that simply by surrendering oneself unto the lotus feet of the Supreme Personality Kṛṣṇa one can surmount the stringent laws of material nature. At this point a question arises: How is it that educated philosophers, scientists, businessmen, administrators and all the leaders of ordinary men do not surrender to the lotus feet of Śrī Kṛṣṇa, the all-powerful Personality of Godhead? Mukti, or liberation from the laws of material nature, is sought by the leaders of mankind in different ways and with great plans and perseverance for a great many years and births. But if that liberation is possible by simply surrendering unto the lotus feet of the Supreme Personality of Godhead, then why don’t these intelligent and hard-working leaders adopt this simple method?

The Gītā answers this question very frankly. Those really learned leaders of society like Brahmā, Śiva, Kapila, the Kumāras, Manu, Vyāsa, Devala, Asita, Janaka, Prahlāda, Bali, and later on Madhvācārya, Rāmānujācārya, Śrī Caitanya and many others – who are faithful philosophers, politicians, educators, scientists, etc. – surrender to the lotus feet of the Supreme Person, the all-powerful authority. Those who are not actually philosophers, scientists, educators, administrators, etc., but who pose themselves as such for material gain, do not accept the plan or path of the Supreme Lord. They have no idea of God; they simply manufacture their own worldly plans and consequently complicate the problems of material existence in their vain attempts to solve them. Because material energy (nature) is so powerful, it can resist the unauthorized plans of the atheists and baffle the knowledge of “planning commissions.”

The atheistic planmakers are described herein by the word duṣkṛtinaḥ, or “miscreants.” Kṛtī means one who has performed meritorious work. The atheist planmaker is sometimes very intelligent and meritorious also, because any gigantic plan, good or bad, must take intelligence to execute. But because the atheist’s brain is improperly utilized in opposing the plan of the Supreme Lord, the atheistic planmaker is called duṣkṛtī, which indicates that his intelligence and efforts are misdirected.

In the Gītā it is clearly mentioned that material energy works fully under the direction of the Supreme Lord. It has no independent authority. It works as the shadow moves, in accordance with the movements of the object. But still material energy is very powerful, and the atheist, due to his godless temperament, cannot know how it works; nor can he know the plan of the Supreme Lord. Under illusion and the modes of passion and ignorance, all his plans are baffled, as in the case of Hiraṇyakaśipu and Rāvaṇa, whose plans were smashed to dust although they were both materially learned as scientists, philosophers, administrators and educators.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 11/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 277: 07వ అధ్.,  శ్లో 16 /  Bhagavad-Gita - 277: Chap. 07, Ver. 16

🌹. శ్రీమద్భగవద్గీత - 277 / Bhagavad-Gita - 277 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 16 🌴

16. చతుర్విధా భజన్తే మాం జనా: సుకృతినో(ర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ||

🌷. తాత్పర్యం :
ఓ భరతవంశశ్రేష్టుడా! ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్త్వజ్ఞానము నన్వేషించువాడు అనెడి నాలుగురకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్తసేవ నొనరింతురు.

🌷. భాష్యము :
.దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన నియమములకు కట్టుబడి వర్తించు ఇట్టివారు “సుకృతిన:” అనబడుదురు. అనగా వారు శాస్త్రములందలి సాంఘిక మరియు నైతికనియమములను పాటించుచు దాదాపు శ్రీకృష్ణభగవానుని యెడ భక్తిని కలిగియుందురు. అటువంటి వారిలో ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, పరతత్త్వజ్ఞానము కొరకై అన్వేషించువారు అనెడి నాలుగుతరగతుల వారు గలరు. ఇట్టివారు వివిధ పరిస్థితులలో భక్తియుక్తసేవ నొనర్చుటకు భగవానుని దరిచేరుదురు. తాము చేయు భక్తికి కొంత ప్రతిఫలమును కోరియుండుటచే వాస్తవమునకు వారు శుద్ధభక్తులు కారు. శుద్ధభక్తి యనునది ఆశలకు మరియు భౌతికలాభాపేక్షకు అతీతమైనట్టిది. అటువంటి శుద్ధభక్తిని భక్తిరసామృతసింధువు (1.1.11) ఈ విధముగా నిర్వచించినది.

అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యనావృతం |
అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా ||

“కామ్యకర్మల ద్వారా గాని, తాత్త్వికకల్పనల ద్వారా గాని భౌతికలాభాపేక్ష లేకుండగ అనుకూల్యముగా శ్రీకృష్ణభగవానునికి ప్రతియొక్కరు దివ్యమైన ప్రేమయుక్తసేవ నొనరింపవలసియున్నది. అదియే శుద్ధమైన భక్తియుతసేవ యనబడును.”

ఈ నాలుగుతెగల మనుజులు భక్తియోగమును నిర్వహించుటకై శ్రీకృష్ణభగవానుని దరిచేరినపుడు శుద్ధభక్తుని సాంగత్యములో పరిశుద్ధులై వారును శుద్ధభక్తులు కాగాలరు. కాని దుష్కృతులైన వారి జీవనము స్వార్థపూరితము,క్రమరహితము, ఆధ్యాత్మికగమ్యశూన్యమై యుండుట వలన వారికి భక్తిలో నెలకొనుట అతికష్టము కాగలదు. కాని అదృష్టవశాత్తు ఒకవేళ వారు శుద్ధభక్తుని సాంగత్యమును పొందినచో వారును శుద్ధభక్తులు కాగలరు.

కామ్యకర్మలతో రతులై యుండెడివారు ఆర్తి సమయమున శ్రీకృష్ణభగవానుని చేరి భక్తులతో సాంగత్యము నెరిపి ఆ ఆర్తి యందు భక్తులుగా మారుదురు. నిరాశ పొందినవారు సైతము కొన్నిమార్లు భక్తుల సాంగత్యమును పొంది భగవానుని గూర్చి తెలిసికొనుటకు జిజ్ఞాసులగుదురు. అదేవిధముగా శుష్కవేదాంతులు కూడా తమ జ్ఞానవిషయమున విసుగుచెంది, భగవతత్త్వమును గూర్చి వాస్తవముగా తెలిసికొనగోరి శ్రీకృష్ణభాగవానునకు సేవనొనర్చు సిద్ధమగుదురు. ఆ విధముగా వారు ఆ భగవానుని కరుణ మరియు భక్తుల కరుణచే నిరాకారబ్రహ్మభావనము, పరమాత్మభావనలను దాటి సచ్చిదానందవిగ్రహభావనకు వత్తురు. అనగా ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞానసముపార్జనాభిలాషులు, అర్థార్థులు విషయాభిలషల నుండి ముక్తులై భౌతికలాభములు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఏమాత్రము దోహదము కావని సంపూర్ణముగా అవగతము చేసికొనినప్పుడు శుద్ధభక్తులు కాగలరు. అటువంటి పరిశుద్ధస్థితి ప్రాప్తించనంతవరకు భక్తి యందు నెలకొనియున్నవారు లౌకికజ్ఞానన్వేషణ, కామ్యకర్మలు వంటి పలువిషయములచే కలుషితమైనట్టివారే యగుదురు. కనుక శుద్ధమైన భక్తియుతసేవాస్థితికి వచ్చుటకు పూర్వము మనుజుడు వీనినన్నింటిని తరింపవలసి యుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 277 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 16 🌴

16. catur-vidhā bhajante māṁ
janāḥ su-kṛtino ’rjuna
ārto jijñāsur arthārthī
jñānī ca bharatarṣabha

🌷 Translation : 
O best among the Bhāratas, four kinds of pious men begin to render devotional service unto Me – the distressed, the desirer of wealth, the inquisitive, and he who is searching for knowledge of the Absolute.

🌹 Purport :
Unlike the miscreants, these are adherents of the regulative principles of the scriptures, and they are called su-kṛtinaḥ, or those who obey the rules and regulations of scriptures, the moral and social laws, and are, more or less, devoted to the Supreme Lord. Out of these there are four classes of men – those who are sometimes distressed, those who are in need of money, those who are sometimes inquisitive, and those who are sometimes searching after knowledge of the Absolute Truth. These persons come to the Supreme Lord for devotional service under different conditions. These are not pure devotees, because they have some aspiration to fulfill in exchange for devotional service. Pure devotional service is without aspiration and without desire for material profit. The Bhakti-rasāmṛta-sindhu (1.1.11) defines pure devotion thus:

anyābhilāṣitā-śūnyaṁ
jñāna-karmādy-anāvṛtam
ānukūlyena kṛṣṇānu-
śīlanaṁ bhaktir uttamā

“One should render transcendental loving service to the Supreme Lord Kṛṣṇa favorably and without desire for material profit or gain through fruitive activities or philosophical speculation. That is called pure devotional service.”

When these four kinds of persons come to the Supreme Lord for devotional service and are completely purified by the association of a pure devotee, they also become pure devotees. As far as the miscreants are concerned, for them devotional service is very difficult because their lives are selfish, irregular and without spiritual goals. But even some of them, by chance, when they come in contact with a pure devotee, also become pure devotees.

Those who are always busy with fruitive activities come to the Lord in material distress and at that time associate with pure devotees and become, in their distress, devotees of the Lord. Those who are simply frustrated also come sometimes to associate with the pure devotees and become inquisitive to know about God. Similarly, when the dry philosophers are frustrated in every field of knowledge, they sometimes want to learn of God, and they come to the Supreme Lord to render devotional service and thus transcend knowledge of the impersonal Brahman and the localized Paramātmā and come to the personal conception of Godhead by the grace of the Supreme Lord or His pure devotee. On the whole, when the distressed, the inquisitive, the seekers of knowledge, and those who are in need of money are free from all material desires, and when they fully understand that material remuneration has nothing to do with spiritual improvement, they become pure devotees. As long as such a purified stage is not attained, devotees in transcendental service to the Lord are tainted with fruitive activities, the search for mundane knowledge, etc. So one has to transcend all this before one can come to the stage of pure devotional service.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 12/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 278: 07వ అధ్.,  శ్లో 17 /  Bhagavad-Gita - 278: Chap. 07, Ver. 17

🌹. శ్రీమద్భగవద్గీత - 278 / Bhagavad-Gita - 278 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 17 🌴

17. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినో(త్యర్థమహం స చ మమ ప్రియ: ||

🌷. తాత్పర్యం :
వీరిలో సంపూర్ణజ్ఞానము కలిగి సదా భక్తియుక్తసేవలో నియుక్తుడై యుండెడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేనతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు.

🌷. భాష్యము :
ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, దివ్యజ్ఞానమును సముపార్జించగోరు జ్ఞాని యనువారలు విషయకోరికల నుండి విడివడినప్పుడు శుద్ధభక్తులు కాగలరు. వీరిలో పరతత్త్వజ్ఞానమును కలిగి సర్వవిషయకోరికల నుండి ముక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని నిజమైన భక్తుడు కాగలడు. ఇట్టి సుకృతులైన నలుగురిలో సంపూర్ణ జ్ఞానవంతుడై యుండి అదే సమయమున భక్తియుక్తసేవలో నియుక్తుడై యుండెడివాడు అత్యుత్తముడని శ్రీకృష్ణభగవానుడు తెలుపుచున్నాడు. జ్ఞానమును అన్వేషించువాడు తనను దేహము కన్నను అన్యునిగా తెలిసికొని, మరింత పురోగతి పొందిన పిదప నిరాకారబ్రహ్మానుభూతిని మరియు పరమాత్మానుభవమును పొందును. అతడు పూర్ణముగా పవిత్రుడైనప్పుడు తన నిజస్థితి శ్రీకృష్ణభగవానుని దాసత్వమే ననెడి విషయమును అవగతము చేసికొనగలడు. అనగా శుద్ధభక్తుల సాంగత్యములో జిజ్ఞాసువు, ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని అనువారలు క్రమముగా పవిత్రులు కాగలరు. కాని ప్రయత్నదశలో శ్రీకృష్ణభగవానుని గూర్చిన జ్ఞానమును కలిగియుండి, అదే సమయమున సేవను సైతము గూర్చువాడు ఆ భగవానుని మిక్కిలి ప్రియతముడు కాగలడు. భగవానుని దివ్యమగు శుద్ధజ్ఞానమునందు నెలకొనినవాడు భక్తిచే రక్షితుడై యుండి భౌతికకల్మషములచే ఎన్నడును అంటబడకుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 278 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 17 🌴

17. teṣāṁ jñānī nitya-yukta
eka-bhaktir viśiṣyate
priyo hi jñānino ’tyartham
ahaṁ sa ca mama priyaḥ

🌷 Translation : 
Of these, the one who is in full knowledge and who is always engaged in pure devotional service is the best. For I am very dear to him, and he is dear to Me.

🌹 Purport :
Free from all contaminations of material desires, the distressed, the inquisitive, the penniless and the seeker after supreme knowledge can all become pure devotees. But out of them, he who is in knowledge of the Absolute Truth and free from all material desires becomes a really pure devotee of the Lord. And of the four orders, the devotee who is in full knowledge and is at the same time engaged in devotional service is, the Lord says, the best. By searching after knowledge one realizes that his self is different from his material body, and when further advanced he comes to the knowledge of impersonal Brahman and Paramātmā. When one is fully purified, he realizes that his constitutional position is to be the eternal servant of God. So by association with pure devotees the inquisitive, the distressed, the seeker after material amelioration and the man in knowledge all become themselves pure. But in the preparatory stage, the man who is in full knowledge of the Supreme Lord and is at the same time executing devotional service is very dear to the Lord. He who is situated in pure knowledge of the transcendence of the Supreme Personality of God is so protected in devotional service that material contamination cannot touch him. 
🌹 🌹 🌹 🌹 🌹

Date: 13/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 279: 07వ అధ్.,  శ్లో 18 /  Bhagavad-Gita - 279: Chap. 07, Ver. 18

🌹. శ్రీమద్భగవద్గీత - 279 / Bhagavad-Gita - 279 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 18 🌴

18. ఉదారా: సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థిత: స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||

🌷. తాత్పర్యం :
ఈ భక్తులందరును నిస్సంశయముగా ఉదాత్తులే యైనను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైనవానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగతియైన నన్ను తప్పక పొందగలడు.

🌷. భాష్యము :
జ్ఞానమునందు పూర్ణత్వము లేని భక్తులు శ్రీకృష్ణభగవానునకు ప్రియులు కాజాలరని ఎన్నడును భావింపరాదు. భక్తులందరును ఉదాత్తులేయని భగవానుడు పలుకుచున్నాడు. ఏ ప్రయోజనము కొరకైనను భగవానుని దరిచేరువారలు మాహాత్ములని పిలువబడుటయే అందులకు కారణము. తామొనరించు భక్తికి ప్రతిఫలముగా ఏదేని లాభమును కోరు భక్తులను సైతము భగవానుడు ఆమోదించును. వారి భక్తి యందు ప్రేమభావ వినిమయము ఉండుటయే అందులకు కారణము. ఆ ప్రేమలోనే వారు భగవానుని కొంత విషయలాభమును గోరి, అది ప్రాప్తించిన పిమ్మట తృప్తి చెంది మరింతగా భక్తిలో పురోగతి నొందుదురు. కాని జ్ఞానపూర్ణుడైన భక్తుడు కేవలము భక్తి, ప్రేమలతో శ్రీకృష్ణభగవానుని సేవించుటయే ఏకైక ప్రయోజనముగా భావించి యున్నందున ఆ భగవానునికి అత్యంత ప్రియుడగును. అట్టివాడు భగవానుని తలచకుండా లేదా అతనిని సేవించకుండా క్షణకాలమును జీవింపలేడు. అదే విధముగా భగవానుడు సైతము అట్టి భక్తుని యెడ మిగుల ప్రియుడై యుండి అతని నుండి దూరుడు కాకుండును.

శ్రీమద్భాగవతము (9.4.68) నందు భగవానుడు ఇట్లు పలికెను.

సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహమ్ |
మదన్యత్ తే న జానన్తి నాహం తేభ్యో మనాగపి ||

“భక్తులు సదా నా హృదయమునందు నిలిచియుందురు మరియు నేనును సదా భక్తుల హృదయమునందు వసింతును. వారు నన్ను తప్ప అన్యమును ఎరుగరు మరియు నేనును వారిని ఎన్నడును మరువను. నాకు, వారికి నడుమ ఒక సన్నిహిత సంబంధము కలదు. అట్టి జ్ఞానపూర్ణులైన శుద్ధభక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడును దూరము కానందునే నాకు అత్యంత ప్రియులై యున్నారు.”
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 279 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 18 🌴

18. udārāḥ sarva evaite
jñānī tv ātmaiva me matam
āsthitaḥ sa hi yuktātmā
mām evānuttamāṁ gatim

🌷 Translation : 
All these devotees are undoubtedly magnanimous souls, but he who is situated in knowledge of Me I consider to be just like My own self. Being engaged in My transcendental service, he is sure to attain Me, the highest and most perfect goal.

🌹 Purport :
It is not that devotees who are less complete in knowledge are not dear to the Lord. The Lord says that all are magnanimous because anyone who comes to the Lord for any purpose is called a mahātmā, or great soul. The devotees who want some benefit out of devotional service are accepted by the Lord because there is an exchange of affection. Out of affection they ask the Lord for some material benefit, and when they get it they become so satisfied that they also advance in devotional service. But the devotee in full knowledge is considered to be very dear to the Lord because his only purpose is to serve the Supreme Lord with love and devotion. Such a devotee cannot live a second without contacting or serving the Supreme Lord. Similarly, the Supreme Lord is very fond of His devotee and cannot be separated from him.

In the Śrīmad-Bhāgavatam (9.4.68), the Lord says:

sādhavo hṛdayaṁ mahyaṁ
sādhūnāṁ hṛdayaṁ tv aham
mad-anyat te na jānanti
nāhaṁ tebhyo manāg api

“The devotees are always in My heart, and I am always in the hearts of the devotees. The devotee does not know anything beyond Me, and I also cannot forget the devotee. There is a very intimate relationship between Me and the pure devotees. Pure devotees in full knowledge are never out of spiritual touch, and therefore they are very much dear to Me.”
🌹 🌹 🌹 🌹 🌹

Date: 14/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 280: 07వ అధ్.,  శ్లో 19 /  Bhagavad-Gita - 280: Chap. 07, Ver. 19

🌹. శ్రీమద్భగవద్గీత - 280 / Bhagavad-Gita - 280 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 19 🌴

19. బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవ: సర్వమితి స మహాత్మా సుదుర్లభ: ||

🌷. తాత్పర్యం :
జ్ఞానవంతుడైనవాడు బహు జన్మమృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలిసికొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు.

🌷. భాష్యము :
భక్తియుతసేవ నొనరించుచు జీవుడు పలుజన్మల పిదప శ్రీకృష్ణభగవానుడే ఆధ్యాత్మికానుభవపు చరమలక్ష్యమును దివ్యమగు శుద్ధజ్ఞానమునందు వాస్తవముగా స్థితుడు కాగలడు. ఆధ్యాత్మికానుకానుభవపు ఆది యందు మనుజుడు భౌతికత్వసంపర్కమును తొలగించుకొను యత్నము చేయునపుడు కొంత నిరాకారభావము వైపునకు మ్రొగ్గుచూపుట జరుగును. కాని అతడు తన యత్నములో పురోభివృద్ధి నొందినప్పుడు ఆధ్యాత్మిక జీవనమున పెక్కు కర్మలు గలవనియు, అవియే భక్తియుత సేవాకార్యములనియు అవగతము చేసికొనును. ఆ విధముగా అతడు తెలిసికొని శ్రీకృష్ణభగవానుని యెడ ఆకర్షితుడై అతనిని శరణుజొచ్చును. అట్టి సమయముననే మనుజుడు శ్రీకృష్ణభగవానుని కరుణయే సర్వస్వమనియు, అతడే సర్వకారణములకు కారణమనియు, విశ్వము అతని నుండి స్వతంత్రమై యుండదనియు అవగాహనము చేసికొనును. ఈ జగత్తు ఆధ్యాత్మికవైవిధ్యము యొక్క వికృత ప్రతిబింబమనియు మరియు ప్రతిదియు దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఒక సంబంధము కలిగియున్నదనియు అంతట అతడు తెలియగలుగును. ఆ విధముగా అతడు ప్రతిదానిని వాసుదేవపరముగా లేదా కృష్ణపరముగా గాంచును. అట్టి విశ్వాతమకమగు వాసుదేవా దృష్టి శ్రీకృష్ణభగవానుని శరణుపొందుటయే ఉత్తమోత్తమ గమ్యమనెడి భావనకు చేర్చగలదు. కాని అట్టి శరణాగతులైన మహాత్ములు అతిఅరుదుగా నుందురు.

ఈ శ్లోకమునందలి భావమును శ్వేతాశ్వతరోపనిషత్తులోని తృతీయాధ్యాయము నందలి 14,15 శ్లోకములు చక్కగా ఇట్లు వివరించుచున్నవి.

సహస్రశీర్షా పురుష: సహస్రాక్ష: సహస్రాపాత్ |
స భూమిం విశ్వతో వృత్వాత్యతిష్టద్దశాంగులమ్ ||

పురుష ఏవేదం సర్వం యాద్భూతం యచ్చభవ్యమ్ |
ఉతామృతత్వ స్యేశానో యదన్నేనాతిరోహతి ||

“న వై వాచో న చాక్షూంషి న శ్రోత్రాణి న మానాంసీ త్యాచక్షతే ప్రాణ ఇతి ఏవాచక్షతే ప్రాణోహ్యేవైతాని సర్వాణి భవన్తి – జీవి దేహములో వాక్శక్తిగాని, దృశ్యశక్తిగాని, శ్రవణశక్తిగాని లేదా ఆలోచనాశక్తిగాని ముఖ్యములు గాక వాటికి కారణమైన ప్రాణమే అత్యంత ముఖ్యమై యున్నది.” యని ఛాందగోప్యోపనిషత్తు(5.1.15) నందు తెలుపబడినది. అదే విధముగా వాసుదేవుడు(శ్రీకృష్ణభగవానుడు) సర్వమునకు ములమై యున్నాడు. దేహమునందు వాక్శక్తి, దృశ్యశక్తి, శ్రవణశక్తి, ఆలోచనాశక్తి అనునవి ఉన్నను అవియన్నియును శ్రీకృష్ణభగవానునితో సంబంధమును కలిగియుండనిచో వ్యర్థములే యగును. వాసుదేవుడే సర్వవ్యాపి మరియు సమస్తమై యున్నందున సంపూర్ణజ్ఞానముతో భక్తుడు అతనికి శరణమునొందును (భగవద్గీత 7.17 మరియు 11.40).
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 280 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 19 🌴

19. bahūnāṁ janmanām ante
jñānavān māṁ prapadyate
vāsudevaḥ sarvam iti
sa mahātmā su-durlabhaḥ

🌷 Translation : 
After many births and deaths, he who is actually in knowledge surrenders unto Me, knowing Me to be the cause of all causes and all that is. Such a great soul is very rare.

🌹 Purport :
The living entity, while executing devotional service or transcendental rituals after many, many births, may actually become situated in transcendental pure knowledge that the Supreme Personality of Godhead is the ultimate goal of spiritual realization. In the beginning of spiritual realization, while one is trying to give up one’s attachment to materialism, there is some leaning towards impersonalism, but when one is further advanced he can understand that there are activities in the spiritual life and that these activities constitute devotional service. Realizing this, he becomes attached to the Supreme Personality of Godhead and surrenders to Him. At such a time one can understand that Lord Śrī Kṛṣṇa’s mercy is everything, that He is the cause of all causes, and that this material manifestation is not independent from Him. He realizes the material world to be a perverted reflection of spiritual variegatedness and realizes that in everything there is a relationship with the Supreme Lord Kṛṣṇa. Thus he thinks of everything in relation to Vāsudeva, or Śrī Kṛṣṇa. Such a universal vision of Vāsudeva precipitates one’s full surrender to the Supreme Lord Śrī Kṛṣṇa as the highest goal. Such surrendered great souls are very rare.

This verse is very nicely explained in the Third Chapter (verses 14 and 15) of the Śvetāśvatara Upaniṣad:

sahasra-śīrṣā puruṣaḥ
sahasrākṣaḥ sahasra-pāt
sa bhūmiṁ viśvato vṛtvā-
tyātiṣṭhad daśāṅgulam

puruṣa evedaṁ sarvaṁ
yad bhūtaṁ yac ca bhavyam
utāmṛtatvasyeśāno
yad annenātirohati

“Lord Viṣṇu has thousands of heads, thousands of eyes and thousands of feet. Entirely encompassing the whole universe, He still extends beyond it by ten fingers’ breadth. He is in fact this entire universe. He is all that was and all that will be. He is the Lord of immortality and of all that is nourished by food.” In the Chāndogya Upaniṣad (5.1.15) it is said, na vai vāco na cakṣūṁṣi na śrotrāṇi na manāṁsīty ācakṣate prāṇa iti evācakṣate prāṇo hy evaitāni sarvāṇi bhavanti: “In the body of a living being neither the power to speak, nor the power to see, nor the power to hear, nor the power to think is the prime factor; it is life which is the center of all activities.” Similarly Lord Vāsudeva, or the Personality of Godhead, Lord Śrī Kṛṣṇa, is the prime entity in everything. In this body there are powers of speaking, of seeing, of hearing, of mental activities, etc. But these are not important if not related to the Supreme Lord. And because Vāsudeva is all-pervading and everything is Vāsudeva, the devotee surrenders in full knowledge (cf. Bhagavad-gītā 7.17 and 11.40).
🌹 🌹 🌹 🌹 🌹

Date: 15/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 281: 07వ అధ్.,  శ్లో 20 /  Bhagavad-Gita - 281: Chap. 07, Ver. 20

🌹. శ్రీమద్భగవద్గీత - 281 / Bhagavad-Gita - 281 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 20 🌴

20. కామైస్తైస్తైర్హృతజ్ఞానా: ప్రపద్యన్తే(న్యదేవతా: |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా: స్వయా ||

🌷. తాత్పర్యం :
విషయకోరికలచే జ్ఞానము అపహరింపబడినవారు ఇతర దేవతలకు శరణమునొంది తమ గుణములను బట్టి ఆయా పూజావిధానములను అనుసరింతురు.

🌷. భాష్యము :
సమస్త భౌతికకల్మషముల నుండి ముక్తులైనవారు శ్రీకృష్ణభగవానుని శరణువేడి అతని భక్తియుక్తసేవలో నియుక్తులగుదురు. భౌతికసంపర్కము సంపూర్ణముగా క్షాళనము కానంతవరకు వారు అభక్తులుగానే పరిగణింపబడుదురు. విషయకోరికలు కలిగియున్నను శ్రీకృష్ణభగవానుని శరణుజొచ్చినవారు బాహ్యప్రకృతిచే ఆకర్షింపబడనివారే యగుదురు. ఏలయన వారు సరియైన గమ్యమునె దరిచేరియున్నందున క్రమముగా కామము నుండి బయటపడగలరు. శుద్ధభక్తుడై సర్వవిధములైన కోరికల నుండి ముక్తుడైనను లేదా సర్వవిధములైన విషయకోరికలు పూర్ణముగా కలిగియున్నను లేదా భౌతికసంపర్కము నుండి ముక్తిని వాంఛించుచున్నను మనుజుడు సర్వవిధములా వాసుదేవునికే శరణుపొంది అతనినే సేవించవలెనని శ్రీమద్భాగవతము (2.3.10) నందు ఉపదేశింపబడినది.

అకామ: సర్వకామో వా మోక్షకామ ఉదారధీ: |
తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరమ్ ||

కాని బుద్ధిహీనులైన మనుజులు ఆధ్యాత్మికజ్ఞానము లేకుండుటచే విషయకోరికల తక్షణప్రాప్తి కొరకు ఇతరదేవతల శరణుజొత్తురు. సాధారణముగా అట్టివారు శ్రీకృష్ణుని దరిచేరరు. రజస్తమోగుణ భరితులై యున్నందున వారు వివిధ దేవతలను అర్చింతురు. ఆయా పూజా విధివిధానములను అనుసరించుచు వారు సంతృప్తులై యుందురు. అట్టి దేవతారాధకులు అల్పకోరికల యందే మగ్నులైయుండి పరమగమ్యమును ఎట్లు పొందవలెనో ఎరుగకుందురు. కాని శ్రీకృష్ణభగవానుని భక్తులు మాత్రము ఆ విధముగా పెడమార్గమును పట్టరు. వేదశాస్త్రమునందు వివధ ప్రయోజనములకై వివిధ దేవతారాధానము ప్రతిపాదించబడియున్నందున (ఉదా రోగియైనవాడు సూర్యుని పూజించవలెను) కృష్ణభక్తులు కానివారు కొన్ని ప్రయోజనములకు భగవానుని కన్నను దేవతలే మేలని భావింతురు. కాని శుద్ధభక్తుడు శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువని తెలిసియుండును. “ఏకలే ఈశ్వర కృష్ణ, ఆర సబ భృత్య – దేవదేవుడైన శ్రీకృష్ణుడొక్కడే ప్రభువు, ఇతరులందరును అతని సేవకులు” అని చైతన్యచరితామృతము (ఆదిలీల – 5.142) నందు తెలుపబడినది. కనుకనే శుద్ధభక్తుడు ఎన్నడును తన కోరికల పూర్ణము కొరకై దేవతలను ఆశ్రయింపక కేవలము శ్రీకృష్ణభగవానుని పైననే ఆధారపడియుండును. అట్టి శుద్ధభక్తుడు తనకు భగవానుడు ఒసగినదానితో సంతృప్తి చెందియుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 281 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 20 🌴

20. kāmais tais tair hṛta-jñānāḥ
prapadyante ’nya-devatāḥ
taṁ taṁ niyamam āsthāya
prakṛtyā niyatāḥ svayā

🌷 Translation : 
Those whose intelligence has been stolen by material desires surrender unto demigods and follow the particular rules and regulations of worship according to their own natures.

🌹 Purport :
Those who are freed from all material contaminations surrender unto the Supreme Lord and engage in His devotional service. As long as the material contamination is not completely washed off, they are by nature nondevotees. But even those who have material desires and who resort to the Supreme Lord are not so much attracted by external nature; because of approaching the right goal, they soon become free from all material lust. In the Śrīmad-Bhāgavatam it is recommended that whether one is a pure devotee and is free from all material desires, or is full of material desires, or desires liberation from material contamination, he should in all cases surrender to Vāsudeva and worship Him. As stated in the Bhāgavatam (2.3.10):

akāmaḥ sarva-kāmo vā
mokṣa-kāma udāra-dhīḥ
tīvreṇa bhakti-yogena
yajeta puruṣaṁ param

Less intelligent people who have lost their spiritual sense take shelter of demigods for immediate fulfillment of material desires. Generally, such people do not go to the Supreme Personality of Godhead, because they are in the lower modes of nature (ignorance and passion) and therefore worship various demigods. Following the rules and regulations of worship, they are satisfied. The worshipers of demigods are motivated by small desires and do not know how to reach the supreme goal, but a devotee of the Supreme Lord is not misguided.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 16/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 282: 07వ అధ్.,  శ్లో 21 /  Bhagavad-Gita - 282: Chap. 07, Ver. 21

🌹. శ్రీమద్భగవద్గీత - 282 / Bhagavad-Gita - 282 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 21 🌴

21. యో యో యాం యాం తనుం భక్త: శ్రద్ధయార్చితుమిచ్చతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ||

🌷. తాత్పర్యం :
నేను ప్రతివారు హృదయమునందు పరమాత్మరూపున నిలిచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును.

🌷. భాష్యము :
భగవానుడు సర్వజీవులకు స్వతంత్రత నొసగియున్నాడు. కనుకనే మనుజుడు విషయభోగమును వాంఛించి దానిని దేవతల నుండి పొందగోరినచో సర్వుల హృదయాంతరవర్తి రూపున ఆ భగవానుడు వారి భావముల నవగాహనము చేసికొని వారు కోరినట్లు చేసికొనుట అవకాశము కల్పించును. 

సర్వజీవులకు దివ్యజనకునిగా అతడు వారి స్వాతంత్ర్యముతో జోక్యమును కల్పించుకొనక, వారు తమ కోరికలు తీర్చుకొనుటకు అవకాశమును కల్పించును. సర్వశక్తిసమన్వితుడైన భగవానుడు జీవులకు విషయజగమునందు అనుభవించుటకు అవకాశము నొసగి మాయాశక్తి వలలో తగులుకొనునట్లు ఏల చేయవలెనని కొందరు ప్రశ్నించవచ్చును. 

శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపున అట్టి అవకాశములు మరియు సౌకర్యములు కల్పించనచో జీవుల స్వాతంత్ర్యమను పదమునకు అర్థమే ఉండదనుట ఆ ప్రశ్నకు సమాధానము. కనుకనే అతడు సర్వజీవులకు సంపూర్ణ స్వాతంత్ర్యమును వారు కోరినది కోరినట్లుగా ఒసగుచున్నాడు. 

కాని సర్వధర్మములను విడిచి తననొక్కనినే శరణుపొందవలె ననునది అతని చరమోపదేశము. అది మనకు గీతాజ్ఞానపు అంత్యమున దర్శనమిచ్చును. అట్టి ఉపదేశపాలనము మనుజుని ఆనంధభాగుని చేయగలదు.

జీవులు మరియు దేవతలు ఇరువురును శ్రీకృష్ణభగవానుని ఆధీనమున ఉండువారు. తత్కారణమున జీవుడు తన కోరిక ననుసరించి ఏదేని దేవతను పూజింపజాలడు. 

అదేవిధముగా దేవదేవుని అనుమతి లేనిదే దేవతలు సైతము ఎట్టి వరముల నొసగజాలరు. సాధారణముగా చెప్పబడునట్లు భగవానుని ఆజ్ఞ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. సామాన్యముగా జగమునందు ఆర్తులైనవారు వేదములు ఉపదేశించిన రీతి వివిధ దేవతల దరిచేరుదురు. అనగా ఏదేని వరమును వాంఛించువాడు ఆయా దేవతలను పూజించుచుండును. 

రోగగ్రస్థుడు సూర్యుని పూజింపవలెననియు, విద్యను కోరువాడు సరస్వతీదేవని పూజింపవలెననియు, అందమైన భార్యను కోరువాడు శివపత్నియైన ఉమాదేవిని పూజింపవలెననియు వివధగుణములకు సంబంధించిన వివిధదేవతార్చనపు ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఏదేని ఒక భౌతికసౌఖ్యమును పొంద అభిలషించినప్పుడు ఆ వరమును ప్రత్యేక దేవత ద్వారా పొందు కోరికను భగవానుడే వాని యందు కలిగింపజేయును. 

తద్ద్వారా జీవుడు ఆ వరమును బడయుచుండును. ఏదేని ప్రత్యేకదేవత యెడ జీవునకు ప్రత్యేక భక్తితత్పరతను సైతము భగవానుడే ఏర్పరుచుండును. దేవతలు జీవుల యందు అటువంటి సన్నిహితత్వమును ఉద్దీపితము చేయజాలరు. 

కాని సర్వజీవహృదయాంతరవర్తియైన పరమాత్ముడును లేదా ఆదిదేవుడను అయినందున శ్రీకృష్ణుడే దేవతలను పూజించుటకు వలసిన ప్రేరణను మానవునకు ఒసగును. 

వాస్తవమునకు దేవతలందరును దేవదేవుని విశ్వరూపమందలి వివధభాగములు. తత్కారణమున వారికి ఎట్టి స్వాతంత్ర్యమును లేదు. “దేవదేవుడు పరమాత్మరూపున దేవతల హృదయమందును నిలిచియుండి, వారి ద్వారా జీవుల కోరికలను పూర్ణము చేయు ఏర్పాట్లను చేయుచుండును. 

దేవతలు మరియు జీవులిరువురును భగవానుని ఆధీనముననే ఉండువారు కనుక ఎన్నడును స్వతంత్రులు కాజాలరు”. అని వేదవాజ్మయమునందు తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 282 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 21 🌴

21. yo yo yāṁ yāṁ tanuṁ bhaktaḥ
śraddhayārcitum icchati
tasya tasyācalāṁ śraddhāṁ
tām eva vidadhāmy aham

🌷 Translation : 
I am in everyone’s heart as the Supersoul. As soon as one desires to worship some demigod, I make his faith steady so that he can devote himself to that particular deity.

🌹 Purport :
God has given independence to everyone; therefore, if a person desires to have material enjoyment and wants very sincerely to have such facilities from the material demigods, the Supreme Lord, as Supersoul in everyone’s heart, understands and gives facilities to such persons. 

As the supreme father of all living entities, He does not interfere with their independence, but gives all facilities so that they can fulfill their material desires. 

Some may ask why the all-powerful God gives facilities to the living entities for enjoying this material world and so lets them fall into the trap of the illusory energy. 

The answer is that if the Supreme Lord as Supersoul does not give such facilities, then there is no meaning to independence.

Therefore He gives everyone full independence – whatever one likes – but His ultimate instruction we find in the Bhagavad-gītā: one should give up all other engagements and fully surrender unto Him. That will make man happy.

Both the living entity and the demigods are subordinate to the will of the Supreme Personality of Godhead; therefore the living entity cannot worship the demigod by his own desire, nor can the demigod bestow any benediction without the supreme will. 

As it is said, not a blade of grass moves without the will of the Supreme Personality of Godhead. Generally, persons who are distressed in the material world go to the demigods, as they are advised in the Vedic literature. A person wanting some particular thing may worship such and such a demigod. 

For example, a diseased person is recommended to worship the sun-god; a person wanting education may worship the goddess of learning, Sarasvatī; and a person wanting a beautiful wife may worship the goddess Umā, the wife of Lord Śiva. 

In this way there are recommendations in the śāstras (Vedic scriptures) for different modes of worship of different demigods. And because a particular living entity wants to enjoy a particular material facility, the Lord inspires him with a strong desire to achieve that benediction from that particular demigod, and so he successfully receives the benediction. 

The particular mode of the devotional attitude of the living entity toward a particular type of demigod is also arranged by the Supreme Lord. The demigods cannot infuse the living entities with such an affinity, but because He is the Supreme Lord, or the Supersoul who is present in the hearts of all living entities, Kṛṣṇa gives impetus to man to worship certain demigods. 

The demigods are actually different parts of the universal body of the Supreme Lord; therefore they have no independence. In the Vedic literature it is stated: 

“The Supreme Personality of Godhead as Supersoul is also present within the heart of the demigod; therefore He arranges through the demigod to fulfill the desire of the living entity. But both the demigod and the living entity are dependent on the supreme will. They are not independent.”
🌹 🌹 🌹 🌹 🌹

Date: 17/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 283: 07వ అధ్.,  శ్లో 22 /  Bhagavad-Gita - 283: Chap. 07, Ver. 22

🌹. శ్రీమద్భగవద్గీత - 283 / Bhagavad-Gita - 283 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 22 🌴

22. స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే |
లభతే చ తత: కామాన్మయైవ విహితాన్ హి తాన్ ||

🌷. తాత్పర్యం :
అట్టి శ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కాని వాస్తవమునకు ఆ వరములన్నియును నా చేతనే ఒసగబడుచున్నవి.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని అనుజ్ఞ లేనిదే దేవతలు తమ భక్తులకు ఎట్టి వరములను ఒసగలేరు. సర్వము శ్రీకృష్ణభగవానునికి చెందినదే యున్న విషయమును జీవులు మరచినను దేవతలు మాత్రము మరువరు. 

అనగా దేవతార్చనము మరియు తద్ద్వారా ఇష్టసిద్ధి యనునవి దేవతల వలన గాక ఆ భగవానుని ఏర్పాటు వలననే జరుగుచుండును. 

అల్పజ్ఞుడైన జీవుడు ఈ విషయము నెరుగలేడు. కనుకనే మూర్ఖముగా అతడు కొద్దిపాటి లాభమునకై దేవతల నాశ్రయించును. కాని శుద్ధభక్తుడు మాత్రము ఏదేని కావలసివచ్చినప్పుడు ఆ భగవానునే ప్రార్థించును. 

అయినను ఆ విధముగా భౌతికలాభమును అర్థించుట శుద్ధభక్తుని లక్షణము కాదు. సాధారణముగా జీవుడు తన కామమును పూర్ణము చేసికొనుట యందు ఆతురతను కలిగియుండును కనుక దేవతల నాశ్రయించును. 

జీవుడు తనకు తగనటువంటిదానిని కోరగా భగవానుడు అట్టి కోరికను తీర్చనప్పుడు ఆ విధముగా జరుగుచుండును. ఒకవైపు ఆదిదేవుడైన శ్రీకృష్ణుని అర్చించుచు వేరొక వైపు విషయభోగవాంఛలు కూడియుండుట విరుద్దకోరికలను కలిగియుండుట వంటిదని శ్రీచైతన్యచరితామృతము తెలుపుచున్నది. 

కృష్ణునకు ఒనర్చబడు భక్తియుతసేవ మరియు దేవతలకు ఒనర్చబడు పూజ సమస్థాయిలో నున్నటువంటివి కావు. దేవతార్చనము భౌతికము కాగా భగవానుని భక్తియుతసేవ సంపూర్ణముగా దివ్యమగుటయే అందులకు కారణము.

భగవద్ధామమును చేర నభిలషించు జీవునకి విషయకోరికలనునవి అవరోధములు వంటివి. కనుకనే అల్పజ్ఞులగు జీవుల వాంఛించు భౌతికలాభములు శుద్ధభక్తునకు సాధారణముగా ఒసగబడవు. 

తత్కారణముననే అట్టి అల్పజ్ఞులు భగవానుని భక్తియుతసేవ యందు నిలుచుటకు బదులు భౌతికజగమునకు చెందిన దేవతల పూజకే ప్రాధాన్యత నొసగుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 283 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 22 🌴

22. sa tayā śraddhayā yuktas
tasyārādhanam īhate
labhate ca tataḥ kāmān
mayaiva vihitān hi tān

🌷 Translation : 
Endowed with such a faith, he endeavors to worship a particular demigod and obtains his desires. But in actuality these benefits are bestowed by Me alone.

🌹 Purport :
The demigods cannot award benedictions to their devotees without the permission of the Supreme Lord. 

The living entity may forget that everything is the property of the Supreme Lord, but the demigods do not forget. So the worship of demigods and achievement of desired results are due not to the demigods but to the Supreme Personality of Godhead, by arrangement. 

The less intelligent living entity does not know this, and therefore he foolishly goes to the demigods for some benefit. But the pure devotee, when in need of something, prays only to the Supreme Lord. Asking for material benefit, however, is not a sign of a pure devotee. A living entity goes to the demigods usually because he is mad to fulfill his lust. 

This happens when something undue is desired by the living entity and the Lord Himself does not fulfill the desire. In the Caitanya-caritāmṛta it is said that one who worships the Supreme Lord and at the same time desires material enjoyment is contradictory in his desires. 

Devotional service to the Supreme Lord and the worship of a demigod cannot be on the same platform, because worship of a demigod is material and devotional service to the Supreme Lord is completely spiritual.

For the living entity who desires to return to Godhead, material desires are impediments. A pure devotee of the Lord is therefore not awarded the material benefits desired by less intelligent living entities, who therefore prefer to worship demigods of the material world rather than engage in the devotional service of the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 19/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 284: 07వ అధ్.,  శ్లో 23 /  Bhagavad-Gita - 284: Chap. 07, Ver. 23

🌹. శ్రీమద్భగవద్గీత - 284 / Bhagavad-Gita - 284 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 23 🌴

23. అన్తవత్తు ఫలం తేషాం తద్ భవత్యల్పమేధసాం |
దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి ||

🌷. తాత్పర్యం :
అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు. కాని వారొసగెడి ఫలములు అల్పములు, తాత్కాలికములై యున్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు.

🌷. భాష్యము :
ఇతరదేవతలను పూజించువారు కూడా శ్రీకృష్ణభగవానునే చేరుదురని భగవద్గీతా వ్యాఖ్యాతలు కొందరు పలుకుదురు. కాని దేవతలను పూజించువారు ఆ దేవతలు నివసించు లోకమునె చేరుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అనగా సూర్యుని పూజించువారు సూర్యలోకమును చేరగా, చంద్రుని పూజించువారు చంద్రలోకమును చేరుదురు. అదే విధముగా ఇంద్రుని వంటి దేవతను పూజించినచో ఆ దేవతకు సంబంధించిన లోకమును మనుజుడు పొందగలడు. అంతియే గాని ఏ దేవతను పూజించినను చివరకు అందరును శ్రీకృష్ణభగవానునే చేరుదున్నది సత్యము కాదు. అట్టి భావనమిచ్చుట ఖండింపబడినది. అనగా దేవతలను పూజించువారు భౌతికజగమునందలి ఆయా దేవతలా లోకములను చేరగా, దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తులు మాత్రము ఆ భగవానుని దివ్యధామమునే నేరుగా చేరుచున్నారు.

దేవతలు శ్రీకృష్ణభగవానుని దేహమునందలి వివిధభాగములే అయినచో ఆ భగవానుని అర్చించుట వలన కలిగెడి ఫలితమే దేవతలను అర్చించుట చేతను కలుగవలెనను భావాన ఇచ్చట ఉదయింపవచ్చును. కాని దేహమునందు ఏ భాగమునకు ఆహారము నందించవలెనో తెలియనివారిగా పరిగణింపబడినందున దేవతార్చకులు అల్పజ్ఞులై యున్నారు. వారిలో మరింత మూఢులైన కొందరు దేహమునకు ఆహారము నందించుటకు పలుమార్గములున్నవని మూర్ఖముగా పలుకుదురు. కాని వాస్తవమునకు వారి వాదము యుక్తమైనది కాదు. ఏలయన ఎవరైనా చెవుల ద్వారా గాని, కన్నుల ద్వారా గాని దేహమునకు ఆహారమును అందించగలరా? దేవతలు శ్రీకృష్ణుని విశ్వరూపమందలి వివధ భాగములని వారు ఎరుగజాలరు. అంతియేగాక అజ్ఞానకారణముగా వారు ప్రతిదేవతయు భగవానుడనియు లేదా భగవానునితో సముడనియు మూర్ఖముగా భావింతురు.

దేవతలేగాక సాధారణజీవులు సైతము శ్రీకృష్ణుని అంశలై యున్నారు. బ్రాహ్మణులు ఆ భగవానుని శిరమనియు, క్షత్రియులు అతని భుజములనియు, వైశ్యులు అతని ఉదరమనియు, శూద్రులు అతని పాదములనియు మరియు వారందరును వివిధములైన ప్రయోజనములను నెరవేర్తురనియు శ్రీమద్భాగవతమున తెలుపబడినది. తన స్థితితో నిమిత్తము లేకుండా తనను మరియు దేవతలను ఆ భగవానుని అంశలుగా తెలిసికొనగలిగినచో మనుజుని జ్ఞానము పూర్ణము కాగలదు. కాని ఈ విషయమును అతడు అవగాహన చేసికొనినచో వివిధ దేవతాలోకములను పొందవలసివచ్చును. భక్తులు మాత్రము అటువంటి గమ్యము నెన్నడును చేరరు.

భౌతికజగమునందలి లోకములు, దేవతలు, వారిని అర్చించువారు సర్వము నశ్వరమే కనుక దేవతావరములచే కలుగు ఫలితములు సైతము నశ్వరములై యున్నవి. కనుకనే దేవతార్చనచే కలుగు ఫలములు నశ్వరమనియు, కేవలము అల్పజ్ఞులైన జీవుల చేతనే అట్టి దేవతార్చనము ఒనరించబడుననియు ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. శుద్ధభక్తుడు కృష్ణభక్తిరసభావనలో శ్రీకృష్ణుని భక్తియుక్తసేవ యందు నియుక్తుడై జ్ఞానపూర్ణమగు నిత్యానందస్థితిని సాధించును కనుక అతడు పొందు లాభములు సామాన్య దేవతార్చకుడు పొందువానికి భిన్నములై యుండును. ఏలయన ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు అప్రమేయుడు. అతని ఉపకారము అపరిమితమైనది. అతని కరుణయు పరిమితములేనిది. కనుకనే అతడు తన శుద్ధభక్తులపై చూపు కరుణ అపారమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 284 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 23 🌴

23. antavat tu phalaṁ teṣāṁ
tad bhavaty alpa-medhasām
devān deva-yajo yānti
mad-bhaktā yānti mām api

🌷 Translation : 
Men of small intelligence worship the demigods, and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of the demigods, but My devotees ultimately reach My supreme planet.

🌹 Purport :
Some commentators on the Bhagavad-gītā say that one who worships a demigod can reach the Supreme Lord, but here it is clearly stated that the worshipers of demigods go to the different planetary systems where various demigods are situated, just as a worshiper of the sun achieves the sun or a worshiper of the demigod of the moon achieves the moon. Similarly, if anyone wants to worship a demigod like Indra, he can attain that particular god’s planet. It is not that everyone, regardless of whatever demigod is worshiped, will reach the Supreme Personality of Godhead.

That is denied here, for it is clearly stated that the worshipers of demigods go to different planets in the material world but the devotee of the Supreme Lord goes directly to the supreme planet of the Personality of Godhead.

Here the point may be raised that if the demigods are different parts of the body of the Supreme Lord, then the same end should be achieved by worshiping them. However, worshipers of the demigods are less intelligent because they don’t know to what part of the body food must be supplied. Some of them are so foolish that they claim that there are many parts and many ways to supply food. This isn’t very sanguine. Can anyone supply food to the body through the ears or eyes? They do not know that these demigods are different parts of the universal body of the Supreme Lord, and in their ignorance they believe that each and every demigod is a separate God and a competitor of the Supreme Lord.

Not only are the demigods parts of the Supreme Lord, but ordinary living entities are also. In the Śrīmad-Bhāgavatam it is stated that the brāhmaṇas are the head of the Supreme Lord, the kṣatriyas are His arms, the vaiśyas are His waist, the śūdras are His legs, and all serve different functions. Regardless of the situation, if one knows that both the demigods and he himself are part and parcel of the Supreme Lord, his knowledge is perfect. But if he does not understand this, he achieves different planets where the demigods reside. This is not the same destination the devotee reaches.

The results achieved by the demigods’ benedictions are perishable because within this material world the planets, the demigods and their worshipers are all perishable. Therefore it is clearly stated in this verse that all results achieved by worshiping demigods are perishable, and therefore such worship is performed by the less intelligent living entity. Because the pure devotee engaged in Kṛṣṇa consciousness in devotional service of the Supreme Lord achieves eternal blissful existence that is full of knowledge, his achievements and those of the common worshiper of the demigods are different. The Supreme Lord is unlimited; His favor is unlimited; His mercy is unlimited. Therefore the mercy of the Supreme Lord upon His pure devotees is unlimited.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 20/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 285: 07వ అధ్.,  శ్లో 24 /  Bhagavad-Gita - 285: Chap. 07, Ver. 24

🌹. శ్రీమద్భగవద్గీత - 285 / Bhagavad-Gita - 285 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 24 🌴

24. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయ: |
పరం భావమజానన్తో మామవ్యయమనుత్తమమ్ ||

🌷. తాత్పర్యం :
నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను(శ్రీకృష్ణుడు) తొలుత నిరాకారుడనై యుండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని తలతురు. అల్పజ్ఞత వలన వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్యభావమును ఎరుగలేరు.

🌷. భాష్యము :
దేవతలను పూజించువారు అల్పజ్ఞులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణింపబడినారు. నిరాకారవాదులు సైతము అదేవిధముగా ఇచ్చట వర్ణింపబడిరి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన స్వీయరూపమున అర్జునుని ఎదుట సంభాషించుచున్నను నిరాకారవాదులు తమ అజ్ఞానకారణముగా భగవానుడు రూపరహితుడనియు వాదింతురు. శ్రీరామానుజాచార్యుల పరంపరలో నున్న పరమభక్తుడైన శ్రీయమునాచార్యులు ఈ విషయమున ఒక చక్కని శ్లోకమును ఇట్లు రచించియుండిరి.

త్వాం శీలరూపచరితై: పరమప్రకృష్టై:
సత్త్వేన సాత్త్వికతయా ప్రబలైశ్చ శాస్త్రై: |
ప్రఖ్యాతదైవపరమార్థవిదాం మతైశ్చ
నైవాసురప్రకృతయ: ప్రభవన్తి బోద్ధుమ్ || 

“హే ప్రభూ! వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవు దేవదేవుడవని ఎరిగియున్నారు. వేదవాజ్మయమును అవగాహన చేసికొనుట ద్వారా నీ గుణములను, రూపమును, కర్మలను తెలిసికొని మనుజుడు నిన్ను దేవదేవుడని అవగతము చేసికొనగలడు. కాని రజస్తమోగుణములందున్న దానవులు మరియు అభక్తులు మాత్రము నిన్నెన్నడును ఎరుగజాలరు. వారు నిన్ను అవగాహన చేసికొనజాలకున్నారు. అభక్తులైనవారు వేదాంతమును, ఉపనిషత్తులను, ఇతర వేదవాజ్మయమును నిపుణతతో చర్చించినను ఆదిదేవుడవైన నిన్ను అవగాహన చేసికొనుట వారికి సాధ్యము కాదు.” (స్తోత్రరత్నము 12)

కేవలము వేదవాజ్మయమును అధ్యయనము చేయుట ద్వారా శ్రీకృష్ణభగవానుడు తెలియబడడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. శ్రీకృష్ణుని గూర్చి తెలియుట కేవలము అతని కరుణతోనే సాధ్యము కాగలదు. కనుకనే దేవతలను పూజించువారే బుద్ధిహీనులు కాడనియు, కృష్ణభక్తిరసభావనము అనునది ఏమాత్రములేక కేవలము వేదాంతచర్చ మరియు వేదవాజ్మయముపై ఊహాకల్పనలు చేయు భక్తిహీనులు సైతము బుద్ధిహినులేయనియు ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. అట్టివారికి భగవానుని స్వీయరూపమును అవగతము చేసికొనుట సాధ్యముకాని విషయము. పరతత్త్వము అనుననది నిరాకారమనెడి భావనలో నున్నవారు “అబుద్ధులు” అని వర్ణింపబడిరి. అనగా వారు పరతత్త్వపు నిజరూపము తెలియనివారని భావము. దివ్యానుభవము యనునది నిరాకార బ్రహ్మానుభూతిలో ప్రారంభమై పిదప పరమాత్మానుభూతికి పురోగమించుననియు, కాని పరతత్త్వపు చరమానుభవము శ్రీకృష్ణభగవానుడే యనియు శ్రీమద్భాగవతమున తెలుపబడినది. నవీనయుగపు నిరాకారవాదులు మరింత అల్పజ్ఞులై యున్నారు. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు దేవదేవుడని ప్రత్యేకముగా పలికినట్టి తమ పూర్వీకుడైన శంకరాచార్యుని సైతము వారు అనుసరింపరు. కనుకనే నిరాకారవాదులు శ్రీకృష్ణుని నిజతత్త్వమును ఎరుగలేక అతనిని దేవకీవసుదేవుల పుత్రుడనియో, రాజకుమారుడనియో లేక శక్తిమంతుడైన మనుజుడనియో భావింతురు. ఇట్టి భావన కూడా భగవద్గీత(9.11) యందు “అవజానన్తి మాం మూఢా: మానుషీం తనుమాశ్రితమ్ – మూఢులు మాత్రమే నన్ను సాధారణ మానవునిగా భావింతురు” అని ఖండింపబడినది.

సత్యమేమనగా భక్తియుక్తసేవ నొనర్చక మరియు కృష్ణభక్తిరసభావనను పెంపొందించుకొనక ఎవ్వరును శ్రీకృష్ణుని అవగతము చేసికొనజాలరు. ఈ విషయమునే శ్రీమద్భాగవతము(10.14.29) ఇట్లు నిర్ధారించుచున్నది.

అథాపి తే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవ హి |
జానాతి తత్త్వం భగవన్మహిమ్నో న చాన్య ఏకో(పి చిరం విచిన్వన్ ||

“హే ప్రభూ! నీ చరణకమలముల కరుణ లేశమాత్రము లభించినను మనుజుడు నీ గొప్పతనమును అవగాహనము చేసికొనగలడు. కాని నిన్ను అవగతము చేసికొనుటకు ఊహాగానము చేయువారు సంవత్సరముల కొలది వేదాధ్యయనము గావించినను నిన్ను తెలిసికొనజాలరు.” అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని గాని, అతని రూపగుణములను గాని, నామమును గాని ఎవ్వరును కేవల ఊహాకల్పనలు లేదా వేదాధ్యయనముచే ఎరుగలేరు. ఆ భగవానుని కేవలము భక్తి ద్వారానే మనుజుడు అవగాహన చేసికొనగలడు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే – అను మహామంత్ర జపము మరియు కీర్తనతో ప్రారంభమగు కృష్ణభక్తిరసభావన యందు మనుజుడు సంపూర్ణముగా నిమగ్నమైనప్పుడే దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనగలడు. అభక్తులైన నిరాకారవాదులు శ్రీకృష్ణుని దేహము పాంచభౌతికమనియు మరియు అతని కర్మలు, రూపము, అతనికి సంబంధించిన సమస్తము “మాయ” అనియు పలుకుదురు. కనుకనే అట్టి నిరాకారవాదులు మాయావాదులని పిలువబడుదురు. వాస్తవమునకు వారు పరమతత్త్వమును ఎరిగినట్టివారు కారు. 

“కామైకామైస్తైస్తైర్హృతజ్ఞానా: ప్రపద్యన్తే(న్యదేవతా: - కామపూర్ణ కోరికలచే అంధులైనవారు వివిధదేవతల శరణుజొత్తురు” అని ఇరువదియవ శ్లోకము స్పష్టముగా వివరించినది. అంతియే గాక దేవదేవునితో పాటు వివిధలోకములు కలగిన దేవతలు కలరనియు మరియు దేవదేవుడు దివ్యలోకమును కలిగి యున్నాడనియు అంగీకరింపబడినది. “దేవాన్ దేవయజోయాన్తి మద్బక్తా యాన్తి మామపి” యని ఇరువదిమూడవ శ్లోకమున తెలుపబడినది. అనగా దేవతలను పూజించువారు వారి లోకములను పొందుదురు, కృష్ణభక్తులు కృష్ణలోకమును చేరుదురు. ప్రతిదియు ఇంత స్పష్టముగా తెలుపబడియున్నను మూర్ఖులైన నిరాకారవాదులు శ్రీకృష్ణభగవానుడు రూపరహితుడనియు, ఈ రూపములన్నియు ఆపాదించబడినవనియు వాదము చేయుదురు. గీతాధ్యాయనము పిమ్మట దేవతలు మరియు వారి లోకములు నిరాకారములనెడి భావన ఎట్లు కలుగును? కనుకనే నిశ్చయముగా దేవతలు గాని, శ్రీకృష్ణభగవానుడు గాని నిరాకారులు కారు. వారందరును రూపమును కలిగియున్నట్టివారే. దేవదేవుడైన శ్రీకృష్ణడు తన స్వీయలోకమును కలిగియున్నట్లే, దేవతలను తమ తమ లోకములను కలిగియున్నారు.

కనుక పరతత్త్వము రూపరహితము మరియు రూపమనునది ఆపాదించబడినదే యను మాయావాదము సత్యమైనది కాదు. ఇది ఆపాదించబడినది కాదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. దేవతల రూపములు మరియు దేవదేవుని రూపము వేరువేరుగా ఏకకాలమున స్థితమైయున్నవనియు మరియు శ్రీకృష్ణుడు సచ్చిదానందవిగ్రహుడనియు (నిత్యత్వము, జ్ఞానము, ఆనందపూర్ణము) భగవద్గీత ద్వారా మనము స్పష్టముగా తెలిసికొనగలము. పరతత్త్వము సహజముగా ఆనందమయుడనియు (ఆనందమయో(భ్యాసాత్) మరియు అనంతకళ్యాణగుణములకు నిధి యనియు వేదములు ధ్రువపరచుచున్నవి. తాను “అజుడు” అయినను (పుట్టుకలేనివాడు) అవతరించుచుందుననియు భగవద్గీత యందు శ్రీకృష్ణభగవానుడు పలికియుండెను. ఈ సత్యములన్నింటిని మనము భగవద్గీత ద్వారా అవగాహన చేసికొనవలెను. వాస్తవమునకు ఏ విధముగా శ్రీకృష్ణుడు రూపరహితుడనియు చెప్పబడునో మనకు అవగతము కాదు. కనుకనే పరతత్త్వమునందు రూపము ఆపాదించబడునని పలుకు నిరాకారవాది యొక్క మాయావాదమును గీత ప్రకారము అసత్యమై యున్నది. అనగా పరతత్త్వమైన శ్రీకృష్ణుడు రూపమును మరియు వ్యక్తిత్వమును కలిగియున్నాడని ఇచ్చట స్పష్టముగా విదితమైనది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 285 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 24 🌴

24. avyaktaṁ vyaktim āpannaṁ
manyante mām abuddhayaḥ
paraṁ bhāvam ajānanto
mamāvyayam anuttamam

🌷 Translation : 
Unintelligent men, who do not know Me perfectly, think that I, the Supreme Personality of Godhead, Kṛṣṇa, was impersonal before and have now assumed this personality. Due to their small knowledge, they do not know My higher nature, which is imperishable and supreme.

🌹 Purport :
Those who are worshipers of demigods have been described as less intelligent persons, and here the impersonalists are similarly described. Lord Kṛṣṇa in His personal form is here speaking before Arjuna, and still, due to ignorance, impersonalists argue that the Supreme Lord ultimately has no form. Yāmunācārya, a great devotee of the Lord in the disciplic succession of Rāmānujācārya, has written a very appropriate verse in this connection. He says,

tvāṁ śīla-rūpa-caritaiḥ parama-prakṛṣṭaiḥ
sattvena sāttvikatayā prabalaiś ca śāstraiḥ
prakhyāta-daiva-paramārtha-vidāṁ mataiś ca
naivāsura-prakṛtayaḥ prabhavanti boddhum

“My dear Lord, devotees like Vyāsadeva and Nārada know You to be the Personality of Godhead. By understanding different Vedic literatures, one can come to know Your characteristics, Your form and Your activities, and one can thus understand that You are the Supreme Personality of Godhead. But those who are in the modes of passion and ignorance, the demons, the nondevotees, cannot understand You. They are unable to understand You. However expert such nondevotees may be in discussing Vedānta and the Upaniṣads and other Vedic literatures, it is not possible for them to understand the Personality of Godhead.” (Stotra-ratna 12)

In the Brahma-saṁhitā it is stated that the Personality of Godhead cannot be understood simply by study of the Vedānta literature. Only by the mercy of the Supreme Lord can the Personality of the Supreme be known. Therefore in this verse it is clearly stated that not only are the worshipers of the demigods less intelligent, but those nondevotees who are engaged in Vedānta and speculation on Vedic literature without any tinge of true Kṛṣṇa consciousness are also less intelligent, and for them it is not possible to understand God’s personal nature. Persons who are under the impression that the Absolute Truth is impersonal are described as abuddhayaḥ, which means those who do not know the ultimate feature of the Absolute Truth. In the Śrīmad-Bhāgavatam it is stated that supreme realization begins from the impersonal Brahman and then rises to the localized Supersoul – but the ultimate word in the Absolute Truth is the Personality of Godhead. Modern impersonalists are still less intelligent, for they do not even follow their great predecessor Śaṅkarācārya, who has specifically stated that Kṛṣṇa is the Supreme Personality of Godhead. Impersonalists, therefore, not knowing the Supreme Truth, think Kṛṣṇa to be only the son of Devakī and Vasudeva, or a prince, or a powerful living entity. This is also condemned in the Bhagavad-gītā (9.11). Avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam: “Only the fools regard Me as an ordinary person.”

The fact is that no one can understand Kṛṣṇa without rendering devotional service and without developing Kṛṣṇa consciousness. The Bhāgavatam (10.14.29) confirms this:

athāpi te deva padāmbuja-dvaya-
prasāda-leśānugṛhīta eva hi
jānāti tattvaṁ bhagavan-mahimno
na cānya eko ’pi ciraṁ vicinvan

“My Lord, if one is favored by even a slight trace of the mercy of Your lotus feet, he can understand the greatness of Your personality. But those who speculate to understand the Supreme Personality of Godhead are unable to know You, even though they continue to study the Vedas for many years.” One cannot understand the Supreme Personality of Godhead, Kṛṣṇa, or His form, quality or name simply by mental speculation or by discussing Vedic literature.

One must understand Him by devotional service. When one is fully engaged in Kṛṣṇa consciousness, beginning by chanting the mahā-mantra – Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare – then only can one understand the Supreme Personality of Godhead. Nondevotee impersonalists think that Kṛṣṇa has a body made of this material nature and that all His activities, His form and everything are māyā. These impersonalists are known as Māyāvādīs. They do not know the ultimate truth.

The twentieth verse clearly states, kāmais tais tair hṛta-jñānāḥ prapadyante ’nya-devatāḥ: “Those who are blinded by lusty desires surrender unto the different demigods.” It is accepted that besides the Supreme Personality of Godhead, there are demigods who have their different planets, and the Lord also has a planet. As stated in the twenty-third verse, devān deva-yajo yānti mad-bhaktā yānti mām api: the worshipers of the demigods go to the different planets of the demigods, and those who are devotees of Lord Kṛṣṇa go to the Kṛṣṇaloka planet. Although this is clearly stated, the foolish impersonalists still maintain that the Lord is formless and that these forms are impositions. From the study of the Gītā does it appear that the demigods and their abodes are impersonal? Clearly, neither the demigods nor Kṛṣṇa, the Supreme Personality of Godhead, are impersonal. They are all persons; Lord Kṛṣṇa is the Supreme Personality of Godhead, and He has His own planet, and the demigods have theirs.

Therefore the monistic contention that ultimate truth is formless and that form is imposed does not hold true. It is clearly stated here that it is not imposed. From the Bhagavad-gītā we can clearly understand that the forms of the demigods and the form of the Supreme Lord are simultaneously existing and that Lord Kṛṣṇa is sac-cid-ānanda, eternal blissful knowledge. The Vedic literature confirms that the Supreme Absolute Truth is knowledge and blissful pleasure, vijñānam ānandam brahma (Bṛhad-āraṇyaka Upaniṣad 3.9.28), and that He is the reservoir of unlimited auspicious qualities, ananta-kalyāna-guṇātmako ’sau (Viṣṇu Purāṇa 6.5.84). And in the Gītā the Lord says that although He is aja (unborn), He still appears. These are the facts that we should understand from the Bhagavad-gītā. We cannot understand how the Supreme Personality of Godhead can be impersonal; the imposition theory of the impersonalist monist is false as far as the statements of the Gītā are concerned. It is clear herein that the Supreme Absolute Truth, Lord Kṛṣṇa, has both form and personality.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 21/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 286: 07వ అధ్.,  శ్లో 25 /  Bhagavad-Gita - 286: Chap. 07, Ver. 25

🌹. శ్రీమద్భగవద్గీత - 286 / Bhagavad-Gita - 286 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 25 🌴

25. నాహం ప్రకాశ: సర్వస్య యోగమాయాసమావృత: |
మూఢో(యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడును వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగశక్తిచే కప్పబడియుందును. తత్కారణముగా వారు నేను అజుడననియు, నాశములేనివాడననియు ఎరుగరు.

🌷. భాష్యము :
శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమొసగెను గావున ఇప్పుడు మాత్రము ఎందులకు సర్వులకు దర్శితమగుటలేదని ఎవరైనను వాదింపవచ్చును. కాని వాస్తవమునకు ఆ సమయమున కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తము కాలేదు. భూమిపై అవతరించియున్నప్పుడు కొద్దిమంది మాత్రమే అతనిని దేవదేవునిగా తెలిసికొనగలిగిరి. కురుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరముగా పలికినప్పుడు, భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవదేవునిగా తీర్మానించెను. అలాగుననే పాండవులు మరియు ఇతర కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవదేవుడని తెలిసికొనగలిగిరి. అతడెన్నడును అభక్తులకు మరియు సామాన్యజనులకు విదితము కాలేదు. కనుకనే భక్తులు తప్ప మిగిలిన వారందరు తనను తమవంటివాడనే తలంతురని శ్రీకృష్ణుడు గీత యందు పలికియుండెను. భక్తులకు ఆనందనిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన ఆభక్తులకు తన అంతరంగశక్తిచే కప్పుబడియుండును.

శ్రీకృష్ణభగవానుడు “యోగమాయ” అను తెరచే కప్పబడియున్నందున సామాన్యజనులు అతనిని తెలిసికొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేసెను. (శ్రీమద్భాగవతము 1.8.19). ఈ “యోగమాయ” అను తెర ఈశోపనిషత్తు (మంత్రము 15) నందును తెలుపబడినది. దీని యందు భక్తుడు భగవానుని ఇట్లు కీర్తించును.

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్ |
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే ||

“హే ప్రభూ! సమస్తవిశ్వమును పోషించువాడవు నీవే. నీ భక్తియే అత్యుత్తమ ధర్మనియమమై యున్నది. కనుకనే నన్ను కుడా పోషింపుమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్యరూపము యోగమాయచే కప్పబడియున్నది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే ఆచ్చాదితమై యున్నది. నీ సచ్చిదానందవిగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని ఉపసంహరింపుమని నేను ప్రార్థించుచున్నాను.” సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణభగవానుడు బ్రహ్మజ్యోతిచే కప్పబడియుండుట వలన బుద్ధిహీనులైన నిరాకారవాదులు అతనిని గాంచలేకున్నారు.

శ్రీమద్భాగవతము(10.14.7) నందు బ్రహ్మదేవుడును శ్రీకృష్ణుని ఇట్లు కీర్తించెను. “ఓ దేవదేవా! పరమాత్మా! అచింత్యశక్తిస్వరూపా! నీ శక్తి మరియు లీలల గణనమును ఎవ్వరును చేయగలరు? నీవు నీ అంతరంగశక్తిని ఎల్లప్పుడును విస్తరించుచున్నందున నిన్నెవ్వరును అవగాహన చేసికొనలేరు. విజ్ఞానవేత్తలు మరియు పండితులైనవారు భౌతికజగము లేదా వివిధగ్రహముల నిర్మాణమును పరీక్ష చేయగలుగుదురేమో గాని ఎదుట నిలిచియున్నను నీ శక్తిసామర్థ్యములను మాత్రము గణింపజాలరు.” దేవదేవుడైన శ్రీకృష్ణుడు అజుడే గాక నాశరహితుడై యున్నాడు. అతని నిత్యరూపము జ్ఞానానందపూర్ణము కాగా, అతని సర్వశక్తులు అక్షయములై యున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 286 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 25 🌴

25. nāhaṁ prakāśaḥ sarvasya
yoga-māyā-samāvṛtaḥ
mūḍho ’yaṁ nābhijānāti
loko mām ajam avyayam

🌷 Translation : 
I am never manifest to the foolish and unintelligent. For them I am covered by My internal potency, and therefore they do not know that I am unborn and infallible.

🌹 Purport :
It may be argued that since Kṛṣṇa was visible to everyone when He was present on this earth, how can it be said that He is not manifest to everyone? But actually He was not manifest to everyone. When Kṛṣṇa was present there were only a few people who could understand Him to be the Supreme Personality of Godhead. In the assembly of Kurus, when Śiśupāla spoke against Kṛṣṇa’s being elected president of the assembly, Bhīṣma supported Him and proclaimed Him to be the Supreme God. Similarly, the Pāṇḍavas and a few others knew that He was the Supreme, but not everyone. He was not revealed to the nondevotees and the common man. Therefore in the Bhagavad-gītā Kṛṣṇa says that but for His pure devotees, all men consider Him to be like themselves. He was manifest only to His devotees as the reservoir of all pleasure. But to others, to unintelligent nondevotees, He was covered by His internal potency.

In the prayers of Kuntī in the Śrīmad-Bhāgavatam (1.8.19) it is said that the Lord is covered by the curtain of yoga-māyā and thus ordinary people cannot understand Him. This yoga-māyā curtain is also confirmed in the Īśopaniṣad (Mantra 15), in which the devotee prays:

hiraṇmayena pātreṇa
satyasyāpihitaṁ mukham
tat tvaṁ pūṣann apāvṛṇu
satya-dharmāya dṛṣṭaye

“O my Lord, You are the maintainer of the entire universe, and devotional service to You is the highest religious principle. Therefore, I pray that You will also maintain me. Your transcendental form is covered by the yoga-māyā. The brahma-jyotir is the covering of the internal potency. May You kindly remove this glowing effulgence that impedes my seeing Your sac-cid-ānanda-vigraha, Your eternal form of bliss and knowledge.” The Supreme Personality of Godhead in His transcendental form of bliss and knowledge is covered by the internal potency of the brahma-jyotir, and the less intelligent impersonalists cannot see the Supreme on this account.

Also in the Śrīmad-Bhāgavatam (10.14.7) there is this prayer by Brahmā: “O Supreme Personality of Godhead, O Supersoul, O master of all mystery, who can calculate Your potency and pastimes in this world? You are always expanding Your internal potency, and therefore no one can understand You. Learned scientists and learned scholars can examine the atomic constitution of the material world or even the planets, but still they are unable to calculate Your energy and potency, although You are present before them.” The Supreme Personality of Godhead, Lord Kṛṣṇa, is not only unborn but also avyaya, inexhaustible. His eternal form is bliss and knowledge, and His energies are all inexhaustible. 
🌹 🌹 🌹 🌹 🌹

Date: 22/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 287: 07వ అధ్.,  శ్లో 26 /  Bhagavad-Gita - 287: Chap. 07, Ver. 26

🌹. శ్రీమద్భగవద్గీత - 287 / Bhagavad-Gita - 287 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 26 🌴

26. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ||

🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! దేవదేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగనున్న వానినన్నింటిని ఎరుగుదును. అలాగుననే జీవులందరిని నేను ఎరుగుదురు. కాని నన్నెవ్వరును ఎరుగరు.

🌷. భాష్యము :
సాకార, నిరాకారతత్త్వములకు సంబంధించిన వివాదము ఇచ్చట స్పష్టముగా విశదీకరింపబడినది. మాయావాదులు తలచురీతిగా శ్రీకృష్ణభగవానుని రూపము మాయ (భౌతికము) అయినచో, సాధారణజీవుల వలె అతడును దేహమును మార్చును గడచిన జన్మను మరచిపోవలెను. దేహదారులెవ్వరును గడచిన జన్మను గుర్తుంచుకొనుట, రాబోవు జన్మమును గూర్చి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుతజన్మము యొక్క ఫలితమును ఊహించుట చేయలేరు. కనుకనే వారు భూత, భవిష్యత్, వర్తమానములును తెలియరని తీర్మానింపవచ్చును. భౌతికసంపర్కము నుండి ముక్తిని పొందనిదే ఎవ్వరును భూత, భవిష్యత్, వర్తమానములను ఎరుగజాలరు.

సాధారణమావవునకి భిన్నముగా శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తాను భూతకాలమున గడచిన సర్వమును, వర్తమానమున జరుగుచున్న సమస్తమును, భవిష్యత్తులో జరుగనున్న వానినన్నింటిని సంపూర్ణముగా తెలియుదనిని స్పష్టముగా పలికియున్నాడు. లక్షలాది సంవత్సరముల క్రిందట సూర్యదేవుడైన వివస్వానునకు జ్ఞానోపదేశము చేసిన విషయమును శ్రీకృష్ణుడు జ్ఞప్తి యందుంచుకొనినట్లు మనము భగవద్గీత యొక్క చతుర్థాధ్యాయమున గాంచియున్నాము. సర్వజీవహృదయములలో పరమాత్మ రూపున నిలిచియున్నందున అతడు సర్వజీవులను సైతము ఎరిగియున్నాడు. కాని శ్రీకృష్ణుడు ఆ విధముగా సర్వజీవుల యందు పరమాత్మగా నిలిచియున్నను మరియు దేవదేవునిగా స్థితుడై యున్నను అల్పజ్ఞులైనవారు (నిరాకారబ్రహ్మానుభూతిని బడయగలిగినప్పటికిని) అతనిని పరమపురుషునిగా ఎరుగుజాలకున్నారు. నిక్కముగా శ్రీకృష్ణభగవానుని దేహము అవ్యయమైనది మరియు నశ్వరము కానిది. అతడు సూర్యుడైనచో మాయ మేఘము వంటిది. భౌతికజగత్తులోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు కలిగిన ఆకాశమును ఒక్కక్కమారు మేఘములు తాత్కాలికముగా కప్పివేసినను వాస్తవమునకు అది మన దృష్టిని కప్పివేయుటయే యగును. ఏలయన సూర్యచంద్రాదులు వాస్తవమునకు కప్పబడరు. అలాగుననే మాయ సైతము శ్రీకృష్ణభగవానుని కప్పలేదు. అతడే తన అంతరంగశక్తిచే అల్పజ్ఞులైనవారికి గోచరించకయుండును. ఈ అధ్యాయపు మూడవశ్లోకమున తెలుపబడినట్లు లక్షలాది జనులలో అతి కొద్దిమంది మాత్రమే మానవజన్మను సఫలము చేసికొనవలెనని యత్నింతురు. అట్లు యత్నించి సఫలీకృతలైన వేలాదిమందిలో ఒకానొకడు మాత్రమే శ్రీకృష్ణుని వాస్తవముగా అవగతము చేసికొనగలడు. నిరాకార బ్రహ్మానుభూతిని పూర్ణముగా బడిసినను లేక పరమాత్మానుభూతి యందు నిలిచినను కృష్ణభక్తిరసభావన యందు పూర్ణుడు కానిదే ఎవ్వరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనజాలరు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 287 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 26 🌴

26. vedāhaṁ samatītāni
vartamānāni cārjuna
bhaviṣyāṇi ca bhūtāni
māṁ tu veda na kaścana

🌷 Translation : 
O Arjuna, as the Supreme Personality of Godhead, I know everything that has happened in the past, all that is happening in the present, and all things that are yet to come. I also know all living entities; but Me no one knows.

🌹 Purport :
Here the question of personality and impersonality is clearly stated. If Kṛṣṇa, the form of the Supreme Personality of Godhead, were māyā, material, as the impersonalists consider Him to be, then like the living entity He would change His body and forget everything about His past life. Anyone with a material body cannot remember his past life, nor can he foretell his future life, nor can he predict the outcome of his present life; therefore he cannot know what is happening in past, present and future. Unless one is liberated from material contamination, he cannot know past, present and future.

Unlike the ordinary human being, Lord Kṛṣṇa clearly says that He completely knows what happened in the past, what is happening in the present, and what will happen in the future. In the Fourth Chapter we have seen that Lord Kṛṣṇa remembers instructing Vivasvān, the sun-god, millions of years ago. Kṛṣṇa knows every living entity because He is situated in every living being’s heart as the Supersoul.

 But despite His presence in every living entity as Supersoul and His presence as the Supreme Personality of Godhead, the less intelligent, even if able to realize the impersonal Brahman, cannot realize Śrī Kṛṣṇa as the Supreme Person. Certainly the transcendental body of Śrī Kṛṣṇa is not perishable. He is just like the sun, and māyā is like a cloud. In the material world we can see that there is the sun and that there are clouds and different stars and planets. The clouds may cover all these in the sky temporarily, but this covering is only apparent to our limited vision. The sun, moon and stars are not actually covered. Similarly, māyā cannot cover the Supreme Lord. By His internal potency He is not manifest to the less intelligent class of men. As it is stated in the third verse of this chapter, out of millions and millions of men, some try to become perfect in this human form of life, and out of thousands and thousands of such perfected men, hardly one can understand what Lord Kṛṣṇa is. Even if one is perfected by realization of impersonal Brahman or localized Paramātmā, he cannot possibly understand the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, without being in Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 23/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 288: 07వ అధ్.,  శ్లో 27 /  Bhagavad-Gita - 288: Chap. 07, Ver. 27

🌹. శ్రీమద్భగవద్గీత - 288 / Bhagavad-Gita - 288 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 27 🌴

27. ఇచ్చాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ||

🌷. తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా! పరంతపా! కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులైన జీవులందరును మోహమునందే జన్మించుచున్నారు.

🌷. భాష్యము :
శుద్ధజ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణభగవానుని అధీనమున ఉండుటయే జీవుని సహజస్థితియై యున్నది. అట్టి శుద్ధజ్ఞానము నుండి జీవుడు మోహముచే విడివడినప్పుడు మాయాశక్తి అధీనమునకు వచ్చి దేవదేవుని అవగతము చేసికొనజాల కుండును. 

అట్టి మాయాశక్తి కోరిక, ద్వేషములనెడి ద్వంద్వ రూపమున వ్యక్తమగుచుండును; అటువంటి కోరిక మరియు ద్వేషముల వలన మూర్ఖమానవుడు భగవానునితో ఏకము కావలెనని కోరి, శ్రీకృష్ణుడు భగవానుడన్న విషయమున ఈర్ష్యను పొందును. 

కోరిక, ద్వేషములచే అంటబడని మోహరహిత శుద్ధభక్తులు శ్రీకృష్ణభగవానుడు తన అంతరంగశక్తిచే ఆవిర్భవించునని తెలిసియుండగా, ద్వంద్వములు మరియు అజ్ఞానకారణముగా మోహరహితులైనవారు ఆ భగవానుడు భౌతికప్రకృతిచే సృజింపబడునని భావింతురు. అది వారి దురదృష్టము. 

భ్రాంతులైన అట్టి మానవులు “ ఈమె నా భార్య, ఇది నా ఇల్లు, నేను ఈ ఇంటికి యజమానిని, నేనీమెకు భర్తను” అని భావించుచు మానావమానములను, సుఖదుఃఖములు, స్త్రీపురుషులు, శుభాశుభములు అనెడి ద్వంద్వములలో మునిగియుందురు. 

ఇవియే మోహకారక ద్వంద్వములు. అటువంటివాటిచే మోహితులగువారు పూర్ణముగా మూఢులగుదురు. తత్కారణముగా వారు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనజాలరు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 288 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 27 🌴

27. icchā-dveṣa-samutthena
dvandva-mohena bhārata
sarva-bhūtāni sammohaṁ
sarge yānti paran-tapa

🌷 Translation : 
O scion of Bharata, O conqueror of the foe, all living entities are born into delusion, bewildered by dualities arisen from desire and hate.

🌹 Purport :
The real constitutional position of the living entity is that of subordination to the Supreme Lord, who is pure knowledge. 

When one is deluded into separation from this pure knowledge, he becomes controlled by the illusory energy and cannot understand the Supreme Personality of Godhead. 

The illusory energy is manifested in the duality of desire and hate. Due to desire and hate, the ignorant person wants to become one with the Supreme Lord and envies Kṛṣṇa as the Supreme Personality of Godhead. 

Pure devotees, who are not deluded or contaminated by desire and hate, can understand that Lord Śrī Kṛṣṇa appears by His internal potencies, but those who are deluded by duality and nescience think that the Supreme Personality of Godhead is created by material energies. This is their misfortune. 

Such deluded persons, symptomatically, dwell in dualities of dishonor and honor, misery and happiness, woman and man, good and bad, pleasure and pain, etc., thinking, “This is my wife; this is my house; I am the master of this house; I am the husband of this wife.” 

These are the dualities of delusion. Those who are so deluded by dualities are completely foolish and therefore cannot understand the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 24/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 289: 07వ అధ్.,  శ్లో 28 /  Bhagavad-Gita - 289: Chap. 07, Ver. 28

🌹. శ్రీమద్భగవద్గీత - 289 / Bhagavad-Gita - 289 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 28 🌴

28. యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతా: ||

🌷. తాత్పర్యం :
పూర్వజన్మములందు, ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగ నశింపజేసికొనిన మనుజులు ద్వంద్వమోహముల నుండి విడివడినవారై నా సేవ యందు దృఢవ్రతముతో నెలకొనెదరు.

🌷. భాష్యము :
దివ్యమైన ఆధ్యాత్మికస్థితిని పొందుటకు అర్హతను కలిగినవారు ఈ శ్లోకమున పేర్కొనబడినవారు. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైనవారికి కోరిక మరియు ద్వేషములనెడి ద్వంద్వములను దాటుటకు దుస్సాధ్యము. కేవలము ధర్మనియమాను సారముగా జీవనము గడుపుచు పుణ్యముగా వర్తించి పాపఫలమును నశింపజేసికొనినవారే భక్తిమార్గమును చేపట్టి క్రమముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని శుద్ధజ్ఞానమును పొందు స్థాయికి ఎదగగలరు. తదుపరి వారు క్రమముగా ఆ భగవానుని తలచుచు సమాధిమగ్నులు కాగలరు. ఆధ్యాత్మికస్థితి యందు నెలకొనుటకు ఇదియే సరియైన పద్ధతి. శుద్ధభక్తుల సంగమములో కృష్ణభక్తిరసభావన ద్వారా ఇట్టి ఉద్ధారము సాధ్యపడగలదు. మాహాభక్తుల సాంగత్యమున మనుజుడు భ్రాంతి నుండి విడివడుటయే అందులకు కారణము.

ఎవరేని నిజముగా ముక్తిని వాంఛించినచో భక్తులకు సేవను గూర్చవలెనని శ్రీమద్భాగవతము (5.5.2) నందు తెలుపబడినది (మహాత్సేవం ద్వారమాహు: విముక్తే: ). కాని భౌతికభావన కలిగిన కామ్యకర్మరతులతో సంగత్వము కలిగినవాడు తమస్సుకు చేరు మార్గమును చేపట్టినవాడగును (తమోద్వారం యోషితాం సంగిసంగమ్). కనుకనే బద్ధజీవులను భ్రాంతి నుండు తప్పించుటకే కృష్ణభక్తులు జగమంతటను సంచరించుచుందురు. శ్రీకృష్ణభగవానుని దాసత్వమనెడి తమ నిజస్థితిని మరచుటన్నది ఆ భగవానుని నియమమోల్లంఘనమని నిరాకారవాదులు ఎరుగజాలరు. కనుకనే మనుజుడు తన సహజస్థితియైన శ్రీకృష్ణుని దాసత్వమున తిరిగి నెలకొననంతవరకు ఆ భగవానుని అవగతము చేసికొనుట గాని, దృఢవ్రతముతో ఆ దేవదేవుని భక్తియుతసేవ యందు పూర్ణముగా నిలుచుట గాని సంభవింపదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 289 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 28 🌴

28. yeṣāṁ tv anta-gataṁ pāpaṁ
janānāṁ puṇya-karmaṇām
te dvandva-moha-nirmuktā
bhajante māṁ dṛḍha-vratāḥ

🌷 Translation : 
Persons who have acted piously in previous lives and in this life and whose sinful actions are completely eradicated are freed from the dualities of delusion, and they engage themselves in My service with determination.

🌹 Purport :
Those eligible for elevation to the transcendental position are mentioned in this verse. For those who are sinful, atheistic, foolish and deceitful, it is very difficult to transcend the duality of desire and hate. 

Only those who have passed their lives in practicing the regulative principles of religion, who have acted piously, and who have conquered sinful reactions can accept devotional service and gradually rise to the pure knowledge of the Supreme Personality of Godhead. Then, gradually, they can meditate in trance on the Supreme Personality of Godhead. 

That is the process of being situated on the spiritual platform. This elevation is possible in Kṛṣṇa consciousness in the association of pure devotees, for in the association of great devotees one can be delivered from delusion.

It is stated in the Śrīmad-Bhāgavatam (5.5.2) that if one actually wants to be liberated he must render service to the devotees (mahat-sevāṁ dvāram āhur vimukteḥ); but one who associates with materialistic people is on the path leading to the darkest region of existence (tamo-dvāraṁ yoṣitāṁ saṅgi-saṅgam). All the devotees of the Lord traverse this earth just to recover the conditioned souls from their delusion. 

The impersonalists do not know that forgetting their constitutional position as subordinate to the Supreme Lord is the greatest violation of God’s law. 

Unless one is reinstated in his own constitutional position, it is not possible to understand the Supreme Personality or to be fully engaged in His transcendental loving service with determination.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 25/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 290: 07వ అధ్.,  శ్లో 29 /  Bhagavad-Gita - 290: Chap. 07, Ver. 29

🌹. శ్రీమద్భగవద్గీత - 290 / Bhagavad-Gita - 290 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 29 🌴

29. జరామరణమొక్షాయ మామాశ్రిత్య యతన్తి యే |
తే బ్రహ్మ తద్ విదు: కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ||

🌷. తాత్పర్యం :
ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్యకర్మలను గూర్చి సమగ్రముగా నెరిగియుండుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై యున్నారు.

🌷. భాష్యము :
జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనునవి పాంచభౌతిక దేహమునే ప్రభావితము చేయును గాని ఆధ్యాత్మికదేహమును కాదు. 

జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు ఆధ్యాత్మికదేహమునకు లేనందున ఆధ్యాత్మికదేహమును పొందినవాడు భగవానుని పార్షదులలో ఒకడై నిత్యమైన భక్తియుతసేవను చేయుచు వాస్తవముగా ముక్తిని పొందినవాడగును. “అహం బ్రహ్మాస్మి – నేను బ్రహ్మమును” అనగా తానూ వాస్తవమునకు బ్రహ్మస్వరూపుడనని ప్రతియొక్కరు తెలిసికొనవలెను. 

ఇట్టి బ్రహ్మభావనము భక్తియందును కలదని ఈ శ్లోకము వివరించుచున్నది. శుద్ధభక్తులైనవారు బ్రహ్మాభావనలో నిత్యముగా నిలిచియుండి దివ్యమైన కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగియుందురు.

శ్రీకృష్ణభగవానుని సేవించు నాలుగుతరగతుల అసంపూర్ణ భక్తులు తమ వాంచితఫలములను పొందుదురు. 

అయినను భగవత్కరుణచే వారు కృష్ణభక్తిపూర్ణులైనంతనే శ్రీకృష్ణభగవానునితో నిజముగా ఆధ్యాత్మికసాహచర్యము ననుభవింతురు. కాని దేవతలను పూజించువారు దివ్యధామము నందలి భగవానుని ఎన్నడును చేరలేరు. వారేగాక అల్పజ్ఞులైన బ్రహ్మానుభూతిని బడసినవారు కూడా శ్రీకృష్ణుని దివ్యధామమైన గోలోకబృందావనమును చేరలేరు. 

వాస్తవముగా కృష్ణలోకమును చేర యత్నించుచున్నందున కృష్ణభక్తిరసభావన యందు కర్మల నొనరించువారే (మామాశ్రిత్య) “బ్రహ్మము”గా పిలువబడుటకు అర్హులై యున్నారు. అట్టివారికి కృష్ణని యెడ ఎట్టి అపోహలు గాని, సందేహములు గాని లేనందున యథార్థముగా బ్రహ్మస్వరూపులై యున్నారు.

శ్రీకృష్ణభగవానుని శ్రీవిగ్రహారాధన యందు నియుక్తులైనవారు మరియు భవబంధము నుండి ముక్తికొరకే ఆ భగవానుని ధ్యానమునందు నిలిచియుండెడివారు సైతము రాబోవు అధ్యాయములో తెలుపబడినట్లు బ్రహ్మము, ఆధిభూతములాది విషయముల భావముల నెరుగగలరు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 290 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 29 🌴

29. jarā-maraṇa-mokṣāya
mām āśritya yatanti ye
te brahma tad viduḥ kṛtsnam
adhyātmaṁ karma cākhilam

🌷 Translation : 
Intelligent persons who are endeavoring for liberation from old age and death take refuge in Me in devotional service. They are actually Brahman because they entirely know everything about transcendental activities.

🌹 Purport :
Birth, death, old age and diseases affect this material body, but not the spiritual body. There is no birth, death, old age and disease for the spiritual body, so one who attains a spiritual body, becomes one of the associates of the Supreme Personality of Godhead and engages in eternal devotional service is really liberated. Ahaṁ brahmāsmi: I am spirit. It is said that one should understand that he is Brahman, spirit soul. This Brahman conception of life is also in devotional service, as described in this verse. The pure devotees are transcendentally situated on the Brahman platform, and they know everything about transcendental activities.

Four kinds of impure devotees who engage themselves in the transcendental service of the Lord achieve their respective goals, and by the grace of the Supreme Lord, when they are fully Kṛṣṇa conscious, they actually enjoy spiritual association with the Supreme Lord. But those who are worshipers of demigods never reach the Supreme Lord in His supreme planet. Even the less intelligent Brahman-realized persons cannot reach the supreme planet of Kṛṣṇa known as Goloka Vṛndāvana. Only persons who perform activities in Kṛṣṇa consciousness (mām āśritya) are actually entitled to be called Brahman, because they are actually endeavoring to reach the Kṛṣṇa planet. Such persons have no misgivings about Kṛṣṇa, and thus they are factually Brahman.

Those who are engaged in worshiping the form or arcā of the Lord, or who are engaged in meditation on the Lord simply for liberation from material bondage, also know, by the grace of the Lord, the purports of Brahman, adhibhūta, etc., as explained by the Lord in the next chapter.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 26/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 291: 07వ అధ్.,  శ్లో 30 /  Bhagavad-Gita - 291: Chap. 07, Ver. 30

Image may contain: 1 person
🌹. శ్రీమద్భగవద్గీత - 291 / Bhagavad-Gita - 291 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం  - 30 🌴

30. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదు: |
ప్రయాణకాలే(పి చ మాం తే విదుర్యుక్తచేతస: ||

🌷. తాత్పర్యం :
నా యందు సంలగ్నమైన చిత్తము కలిగినవారు దేవదేవుడనైన నన్నే భౌతికజగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలిసికొని మరణసమయమందును నన్ను (దేవదేవుడు) అవగాహనతో ఎరిగియుందురు.

🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావన యందు వర్తించు జనులు దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణముగా అవగాహనము చేసికొను మార్గము నుండి ఎన్నడును వైదొలగురు. 

శ్రీకృష్ణభగవానుడు ఈ విధముగా జగత్తును మరియు దేవతలను కూడా నడుపువాడై యున్నాడో కృష్ణభక్తిరసభావాన యొక్క దివ్యసాంగత్యము ద్వారా మనుజుడు తెలిసికొనగలడు. కృష్ణభక్తిభావనతో గల దివ్యసాహచర్యము ద్వారా క్రమముగా అతడు దేవదేవుని యందు విశ్వాసమును పొందును. అటువంటి కృష్ణభక్తిరసభావితుడు మరణసమయమున కూడా మరువబోడు. ఆ విధముగా సహజముగనే అతడు కృష్ణలోకమగు గోలోకబృందావనమును చేరగలడు.

ఏ విధముగా మనుజుడు సంపూర్ణ కృష్ణభక్తిపరాయణుడు కాగలడో ఈ సప్తమాధ్యాయము ప్రత్యేకముగా వివరించినది. 

కృష్ణభక్తులైనవారితో సాంగత్యముననది అట్టి కృష్ణభక్తిరసభావనను పొందుటలో మొట్టమొదటి అంశము. ఏలయన అట్టి సాంగత్యము ఆధ్యాత్మిక యుండి మనుజునికి భగవానునితో ప్రత్యక్షసంబంధమును కలుగజేయును. అంతట శ్రీకృష్ణుని కరుణచే మనుజునికి ఆ కృష్ణుడే దేవదేవుడని అవగాహన కాగలదు. 

అదే సమయమున అతనికి జీవుల సహజస్థితి మరియు ఏ విధముగా జీవుడు శ్రీకృష్ణుని మరచి విషయకర్మలలో బంధితుడగుననెడి విషయము అవగతము కాగలదు. అనగా సత్సాంగత్యమున కృష్ణభక్తిభావనము క్రమముగా వృద్ధినొందినపుడు కృష్ణుని మరచుట చేతనే తాను ప్రకృతిచే బంధితుడనైతినని జీవుడు అవగతము చేసికొనగలడు.

 కృష్ణభక్తిరసభావనను తిరిగి పొందుటకు మానవజన్మము చక్కని అవకాశమనియు, కనుక దానిని దేవదేవుని నిర్హేతుక కరుణను పొందుటకు సంపూర్ణముగా ఉపయోగించవలెననియు అంతట అతడు నిశ్చయముగా తెలిసికొనుము.

ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, బ్రహ్మజ్ఞానము, పరమాత్మజ్ఞానము, జన్మమృత్యు జరావ్యాధుల నుండి ముక్తి మరియు దేవదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుక్తసేవ లనెడి పలు అంశములు ఈ అధ్యాయమున చర్చించబడినవి. 

అయినను కృష్ణభక్తిరసభావన యందు పురోభివృద్ధి నొందినవాడు పలువిధములైన పద్ధతులను పట్టించుకొనక కృష్ణభక్తిరసభావిత కర్మల యందే ప్రత్యక్షముగా నియుక్తుడగును. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని నిత్యదాసునిగా తన సహజస్థితిని వాస్తవముగా పొందగలుగును. 

అట్టి స్థితిలో అతడు భక్తితో శ్రవణ, కీర్తనములను చేయుట యందు దివ్యానందమును పొందుచు ఆ విధముగా చేయుట వలన తన లక్ష్యములన్నియును సిద్ధించునన్న విశ్వాసమును పొందును ఆ విధముగా చేయుట వలన తన లక్ష్యములన్నియును సిద్ధించునన్న విశ్వాసమును పొందును. 

అతని అట్టి నిశ్చయాత్మక శ్రద్ధయే “దృఢవ్రతము” అని పిలువబడును. అదియే భక్తియోగమునకు నాంది యని సర్వశాస్త్రములు వచించుచున్నవి. భగవద్గీత యందలి ఈ సప్తమాధ్యాయము అటువంటి శ్రద్ధ యొక్క సారాంశమై యున్నది.

శ్రీమద్భగవద్గీత యందలి “భగవద్విజ్ఞానము” అను సప్తమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 291 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 30 🌴

30. sādhibhūtādhidaivaṁ māṁ
sādhiyajñaṁ ca ye viduḥ
prayāṇa-kāle ’pi ca māṁ
te vidur yukta-cetasaḥ

🌷 Translation : 
Those in full consciousness of Me, who know Me, the Supreme Lord, to be the governing principle of the material manifestation, of the demigods, and of all methods of sacrifice, can understand and know Me, the Supreme Personality of Godhead, even at the time of death.

🌹 Purport :
Persons acting in Kṛṣṇa consciousness are never deviated from the path of entirely understanding the Supreme Personality of Godhead. In the transcendental association of Kṛṣṇa consciousness, one can understand how the Supreme Lord is the governing principle of the material manifestation and even of the demigods. Gradually, by such transcendental association, one becomes convinced of the Supreme Personality of Godhead, and at the time of death such a Kṛṣṇa conscious person can never forget Kṛṣṇa. Naturally he is thus promoted to the planet of the Supreme Lord, Goloka Vṛndāvana.

This Seventh Chapter particularly explains how one can become a fully Kṛṣṇa conscious person. The beginning of Kṛṣṇa consciousness is association of persons who are Kṛṣṇa conscious.

Such association is spiritual and puts one directly in touch with the Supreme Lord, and, by His grace, one can understand Kṛṣṇa to be the Supreme Personality of Godhead. At the same time one can really understand the constitutional position of the living entity and how the living entity forgets Kṛṣṇa and becomes entangled in material activities. By gradual development of Kṛṣṇa consciousness in good association, the living entity can understand that due to forgetfulness of Kṛṣṇa he has become conditioned by the laws of material nature. He can also understand that this human form of life is an opportunity to regain Kṛṣṇa consciousness and that it should be fully utilized to attain the causeless mercy of the Supreme Lord.

Many subjects have been discussed in this chapter: the man in distress, the inquisitive man, the man in want of material necessities, knowledge of Brahman, knowledge of Paramātmā, liberation from birth, death and diseases, and worship of the Supreme Lord. However, he who is actually elevated in Kṛṣṇa consciousness does not care for the different processes. He simply directly engages himself in activities of Kṛṣṇa consciousness and thereby factually attains his constitutional position as an eternal servitor of Lord Kṛṣṇa. In such a situation he takes pleasure in hearing and glorifying the Supreme Lord in pure devotional service. He is convinced that by his doing so, all his objectives will be fulfilled. This determined faith is called dṛḍha-vrata, and it is the beginning of bhakti-yoga, or transcendental loving service. That is the verdict of all scriptures. This Seventh Chapter of the Bhagavad-gītā is the substance of that conviction.

Thus end the Bhaktivedanta Purports to the Seventh Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Knowledge of the Absolute.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 27/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 292: 08వ అధ్.,  శ్లో 01 /  Bhagavad-Gita - 292: Chap. 08, Ver. 01

🌹. శ్రీమద్భగవద్గీత - 292 / Bhagavad-Gita - 292 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 01 🌴

01. అర్జున ఉవాచ
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే || 

🌷. తాత్పర్యం :
అర్జునుడు ప్రశ్నించెను: ఓ దేవదేవా! పురుషోత్తమా! బ్రహ్మమననేమి? ఆత్మయననేమి? కామ్యకర్మలననేవి? భౌతికసృష్టి యననేమి? దేవతలన నెవరు? దయతో ఇది నాకు వివరింపుము.

🌷. భాష్యము :
“బ్రహ్మమననేమి?” యను ప్రశ్నతో మొదలైన అర్జునుని వివిధప్రశ్నలను శ్రీకృష్ణభగవానుడు ఈ అధ్యాయనము సమాధానము లొసగును. కామ్యకర్మలు, భక్తియుక్తసేవ, యోగనియమములు, శుద్ధభక్తిని గూర్చియు దీని యందు భగవానుడు వివరించుచున్నాడు. పరతత్త్వమనునది బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానునిగా తెలియబడుచున్నది శ్రీమద్భాగవతము వివరించుచున్నది. కాని దీనితోపాటు జీవాత్మ కూడా బ్రహ్మముగానే పిలువబడుచుండును. దేహము, ఆత్మ, మనస్సు యనువానిగా అన్వయింపదగిన ఆత్మను గూర్చియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. వేదనిఘంటువు ప్రకారము ఆత్మ యనగా మనస్సు, ఆత్మ, దేహము, ఇంద్రియములనియు భావము. 

ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా సంభోదించెను. అనగా అతడు పరమపురుషునే ప్రశ్నించుచున్నాడు గాని సామాన్య స్నేహితుని కాదు. శ్రీకృష్ణుడు నిశ్చితమైన సమాధానములొసగు పరమప్రామాణికుడని అతడు ఎరిగియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 292 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 01 🌴

01. arjuna uvāca
kiṁ tad brahma kim adhyātmaṁ
kiṁ karma puruṣottama
adhibhūtaṁ ca kiṁ proktam
adhidaivaṁ kim ucyate

🌷 Translation : 
Arjuna inquired: O my Lord, O Supreme Person, what is Brahman? What is the self? What are fruitive activities? What is this material manifestation? And what are the demigods? Please explain this to me.

🌹 Purport :
In this chapter Lord Kṛṣṇa answers different questions from Arjuna, beginning with “What is Brahman?” The Lord also explains karma (fruitive activities), devotional service and yoga principles, and devotional service in its pure form. The Śrīmad-Bhāgavatam explains that the Supreme Absolute Truth is known as Brahman, Paramātmā and Bhagavān. In addition, the living entity, the individual soul, is also called Brahman. Arjuna also inquires about ātmā, which refers to body, soul and mind. According to the Vedic dictionary, ātmā refers to the mind, soul, body and senses also.

Arjuna has addressed the Supreme Lord as Puruṣottama, Supreme Person, which means that he was putting these questions not simply to a friend but to the Supreme Person, knowing Him to be the supreme authority able to give definitive answers.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 293: 08వ అధ్.,  శ్లో 02 /  Bhagavad-Gita - 293: Chap. 08, Ver. 02

🌹. శ్రీమద్భగవద్గీత - 293 / Bhagavad-Gita - 293 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 02 🌴

02. అధియజ్ఞ: కథం కోత్ర దేహేస్మిన్మధుసూదన |
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి: ||

🌷. తాత్పర్యం :
ఓ మధుసుదనా! యజ్ఞప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగమునందు నిలిచినవారు మరణసమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు?

🌷. భాష్యము :
యజ్ఞప్రభువను పదము ఇంద్రుని గాని, విష్ణువు గాని సూచించును. విష్ణువు బ్రహ్మరుద్రాది ప్రధానదేవతలతో ముఖ్యుడు కాగా, ఇంద్రుడు కార్యనిర్వాహక దేవతలతో ముఖ్యుడు. 

కనుకనే విష్ణువు మరియు ఇంద్రుడు ఇరువురును యజ్ఞములచే అర్పింపబడుదురు. కాని ఎవరు వాస్తవముగా యజ్ఞములకు ప్రభువనియు మరియు ఏ విధముగా భగవానుడు జీవిదేహములో వశించియుండుననియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు.

శ్రీకృష్ణుడు మధువనెడి దానవుని సంహరించియున్నందున అర్జునుడు అతనిని ఇచ్చట మధుసూదన అని సంభోదించుచున్నాడు. అర్జునుడు కృష్ణభక్తిపరాయణుడైనందున వాస్తవమునకు అతని మనస్సునందు ఇట్టి సంశయములు ఉదయించకూడదు. 

అనగా ఈ సంశయములు దానవులను బోలియున్నవి. దానవులు దునుమాడుటులలో శ్రీకృష్ణుడు నేర్పరి కనుక తన మనస్సులో ఉదయించుచున్న దానవస్వభావ సంశయములను అతడు నశింపజేయునని భావించి అర్జునుడు ఆ దేవదేవుని మధుసూదన యని సంబోధించుచున్నాడు.

జీవితమున చేసినదంతయు మరణసమయమున పరీక్షింపబడుచున్నందున “ప్రయాణకాలే” యను పదము ఈ శ్లోకమున ప్రధానమై యున్నది. కృష్ణభక్తిభావన యందు నిరంతరము సంలగ్నమైనవారికి గూర్చి ఎరుగుటలో అర్జునుడు ఆతురతను కలిగియున్నాడు. చివరి క్షణమున వారి స్థితి ఎట్టిదన్నదే అతని ప్రశ్న. 

మరణ సమయములో దేహకర్మలన్నియును స్తంభించిపోయి మనస్సు సరియైన స్థితిలో నిలివజాలకుండును. దేహపరిస్థితి కారణముగా విచలితుడై మనుజుడు శ్రీకృష్ణభగవానుని జ్ఞప్తికి తెచ్చుకొనలేకపోవచ్చును. కనుకనే “హే ప్రభూ! నేనిపుడు పూర్ణ స్వస్థతతో ఉన్నాను. 

నీ పాదపద్మముల చెంత నా మనస్సనెడి రాజహంస చేరగలిగిన రీతిలో నేను శీఘ్రమే మరణించుట ఉత్తమము” అని మాహారాజు కులశేఖరుడు ప్రార్థించెను. నీటి యందుండెడి హంస పద్మములను చేరి క్రీడించుట యందు ఆనందమును పొందును గనుక అతడు ఆ ఉపమానము ఒసెగెను. పద్మములందు చేరుటయే దాని స్వభావసిద్ధమైన క్రీడ. 

కనుకనే ఆయన “ హే ప్రభూ! నా మనస్సు ఇప్పుడు నిర్మలముగా నున్నది మరియు నేను స్వస్థుడనై యున్నాను. కనుక నీ పాదపద్మములను తలచుచు నేను ఈ క్షణమే మరణించినచో నిక్కముగా నా భక్తి పూర్ణము కాగలదు. 

కాని సహజ మరణమునకై ఎదురు చూసినచో ఏమి జరుగనున్నదో నేనెరుగగలను. ఏలయన ఆ సమయమున దేహకార్యములన్నియును భంగపడి గొంతు కఫముతో నిండిపోవును గనుక నీ నామమును నేను పలుకగలనో లేదో నేనెరుగజాలను. 

కనుక శీఘ్రమే మరణించుట ఉత్తమము” అని శ్రీకృష్ణభగవానునితో పలికెను.కనుకనే మరణసమయమున ఏ విధముగా మనుజుడు శ్రీకృష్ణుని చరణకమలములపై మనస్సును నిలుపగలడనునదియే అర్జునుని ప్రశ్నయై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 293 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 02 🌴

02. adhiyajñaḥ kathaṁ ko ’tra
dehe ’smin madhusūdana
prayāṇa-kāle ca kathaṁ
jñeyo ’si niyatātmabhiḥ

🌷 Translation : 
Who is the Lord of sacrifice, and how does He live in the body, O Madhusūdana? And how can those engaged in devotional service know You at the time of death?

🌹 Purport :
“Lord of sacrifice” may refer to either Indra or Viṣṇu. Viṣṇu is the chief of the primal demigods, including Brahmā and Śiva, and Indra is the chief of the administrative demigods. Both Indra and Viṣṇu are worshiped by yajña performances. But here Arjuna asks who is actually the Lord of yajña (sacrifice) and how the Lord is residing within the body of the living entity.

Arjuna addresses the Lord as Madhusūdana because Kṛṣṇa once killed a demon named Madhu. Actually these questions, which are of the nature of doubts, should not have arisen in the mind of Arjuna, because Arjuna is a Kṛṣṇa conscious devotee. Therefore these doubts are like demons. Since Kṛṣṇa is so expert in killing demons, Arjuna here addresses Him as Madhusūdana so that Kṛṣṇa might kill the demonic doubts that arise in Arjuna’s mind.

Now the word prayāṇa-kāle in this verse is very significant because whatever we do in life will be tested at the time of death. Arjuna is very anxious to know of those who are constantly engaged in Kṛṣṇa consciousness. What should be their position at that final moment?

At the time of death all the bodily functions are disrupted, and the mind is not in a proper condition. Thus disturbed by the bodily situation, one may not be able to remember the Supreme Lord. Mahārāja Kulaśekhara, a great devotee, prays, “My dear Lord, just now I am quite healthy, and it is better that I die immediately so that the swan of my mind can seek entrance at the stem of Your lotus feet.” The metaphor is used because the swan, a bird of the water, takes pleasure in digging into the lotus flowers; its sporting proclivity is to enter the lotus flower. Mahārāja Kulaśekhara says to the Lord, “Now my mind is undisturbed, and I am quite healthy. If I die immediately, thinking of Your lotus feet, then I am sure that my performance of Your devotional service will become perfect. But if I have to wait for my natural death, then I do not know what will happen, because at that time the bodily functions will be disrupted, my throat will be choked up, and I do not know whether I shall be able to chant Your name. Better let me die immediately.” Arjuna questions how a person can fix his mind on Kṛṣṇa’s lotus feet at such a time.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/Feb/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 294: 08వ అధ్.,  శ్లో 03 /  Bhagavad-Gita - 294: Chap. 08, Ver. 03

🌹. శ్రీమద్భగవద్గీత - 294 / Bhagavad-Gita - 294 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 03 🌴

03. శ్రీభగవానువాచ
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో(ధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గ: కర్మసంజ్ఞిత: ||

🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : నాశరహితమును, దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్యస్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము (కామ్యకర్మలు) అనబడును.

🌷. భాష్యము :
బ్రహ్మము నాశరహితమును మరియు శాశ్వతమును అయి యున్నది. కాలములో దాని సహజస్థితి యందు ఎట్టి మార్పు ఉండదు. అట్టి బ్రహ్మమునకు పరముగా నున్నదే పరబ్రహ్మము. బ్రహ్మము జీవుని సూచించగా పరబ్రహ్మము దేవదేవుడైన శ్రీకృష్ణుని సూచించును. అట్టి జీవుడు భౌతికజగత్తు నందు స్వీకరించెడి స్థితి అతని నిజస్థితి భిన్నమైనటువంటిది. భౌతికచైతన్యములో అతడు ప్రకృతితో ప్రభువుగా నగుటకు యత్నించినను ఆధ్యాత్మిక చైతన్యములో (కృష్ణభక్తిభావన యందు) మాత్రము శ్రీకృష్ణభగవానునికి దాసునిగా వర్తించును. అట్టి భౌతికచైతన్యము నందున్నంత కాలము అతడు భౌతికజగమున వివిధములైన దేహములను పొందవలసివచ్చును. అదియే భౌతికచైతన్యపు ప్రభావము వలన కలిగెడి విభిన్నసృష్టి లేదా కర్మము అనబడును.

వేదవాజ్మయమునందు జీవుడు జీవాత్మగా మరియు బ్రహ్మముగా పిలువబడెనే గాని పరబ్రహ్మముగా ఎన్నడును పిలువబడలేదు. అట్టి జీవుడు కొన్నిమార్లు భౌతికచైతన్యముతో తాదాత్మ్యము చెంది తనను భౌతికమని భావించును. మరికొన్నిమార్లు ఉన్నతమైన ఆధ్యాత్మికశక్తితో తనను గుర్తించుచుండును. ఈ విధముగా అతడు వివధగతులను పొందుచుండును. కనుకనే అతడు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తిగా పిలువబడినాడు. అతని భౌతిక, ఆధ్యాత్మిక తాదాత్మ్యము ననుసరించి అతడు భౌతికదేహమునుగాని లేదా ఆధ్యాత్మికదేహమునుగాని పొందుచుండును. భౌతికప్రకృతిలో అతడు ఎనుమదినాలుగులక్షల జీవరాసులలోని ఏదేని ఒక జన్మను పొందినను ఆధ్యాత్మికస్వభావమున మాత్రము ఒకే దివ్యదేహమును కలిగియుండును. భౌతికప్రకృతిలో అతడు కొన్నిమార్లు మనుజునిగా, కొన్నిమార్లు దేవతగా, కొన్నిమార్లు జంతువుగా, కొన్నిమార్లు పక్షిగా తన కర్మననుసరించి ప్రకటమగుచుండును. స్వర్గలోకములను పొంది అచ్చట సౌఖ్యముల ననుభవించుటకు అతడు కొన్నిమార్లు యజ్ఞములను చేసినను, ఆ పుణ్యఫలము నశించినంతనే తిరిగి భూమిపై మనుజినిగా జన్మించుచుండును. ఇదియే “కర్మము” అనబడును.

వైదిక యజ్ఞవిధానమును “ఛాందోగ్యోపనిషత్తు” వివరించుచున్నది. దాని ప్రకారము యజ్ఞవేదికపై ఐదురకముల ఆహుతులు పంచాగ్నుల యందు ఆహుతి చేయబడును. స్వర్గలోకములు, మేఘములు, భూమి, పురుషుడు, స్త్రీ యనునవి పంచాగ్నులు కాగా, శ్రద్ధ, చంద్రుడు, వర్షము, ధ్యానము, వీర్యము లనునవి పంచాహుతులుగా భావింపబడును.

యజ్ఞవిధానములందు జీవుడు ప్రత్యేకములైన స్వర్గలోకములను పొందుటకు ప్రత్యేకమైన యజ్ఞములను ఆచరించి, తత్పలితముగా వాటిని పొందుచుండును. కాని యజ్ఞఫలము నశించినంతనే భూమి వర్షరూపమున అరుదెంచెను. తదుపరి వర్షరూపము నుండి అతడు ధ్యానరూపమును పొందును. ధ్యానము మనుజులచే భుజింపబడగా పిదప వీర్యరూపమును పొంది స్త్రీగర్భమున చేరి తిరిగి మానవదేహమును పొందును. మనవజన్మలో తిరిగి యజ్ఞములు చేయుచు ఈ చక్రమును కొనసాగుచుండును. ఈ విధముగా జీవుడు భౌతికమార్గమునందే నిరంతరము రాకపోకలు సల్పుచుండును. కాని కృష్ణభక్తిరసభావితుడు అట్టి యజ్ఞములను ఏమాత్రము చేపట్టక కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలిచి కృష్ణధామమును చేరుటకు యత్నించును.

గీతావ్యాఖ్యానమును గూర్చు కొందరు నిరాకారవాదులు భౌతికజగమునందు పరబ్రహ్మము జీవరూపము దాల్చునని ఆయుక్తముగా పలుకుచు తమ వాదమును సమర్థించుటకు గీత యందలి పంచదశాధ్యాయపు ఏడవశ్లోకమును ఉదాహరింతురు. కాని ఆ శ్లోకమునందు శ్రీకృష్ణభగవానుడు తన అంశగా జీవుని వర్ణించియున్నాడు. అట్టి భగవదంశయైన జీవుడు భౌతికజగమునకు పతనము చెందవచ్చును గాని భగవానుడెన్నడును (అచ్యుతుడు) పతనము నొందడు. కనుకనే పరబ్రహ్మము జీవరూపము దాల్చునని పలుకువాదము ఆమోదయోగ్యము కాదు. కావుననే బ్రహ్మము (జీవుడు) పరబ్రహ్మమునకు (దేవదేవునకు) భిన్నుడని వేదవాజ్మయమునందు తెలుపబడిన విషయమును జ్ఞప్తియందుంచుకొనుట అత్యంత ముఖ్యమైనది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 294 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 03 🌴

03. śrī-bhagavān uvāca
akṣaraṁ brahma paramaṁ
svabhāvo ’dhyātmam ucyate
bhūta-bhāvodbhava-karo
visargaḥ karma-saṁjñitaḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: The indestructible, transcendental living entity is called Brahman, and his eternal nature is called adhyātma, the self. Action pertaining to the development of the material bodies of the living entities is called karma, or fruitive activities.

🌹 Purport :
Brahman is indestructible and eternally existing, and its constitution is not changed at any time. But beyond Brahman there is Para-brahman. Brahman refers to the living entity, and Para-brahman refers to the Supreme Personality of Godhead. The constitutional position of the living entity is different from the position he takes in the material world. In material consciousness his nature is to try to be the lord of matter, but in spiritual consciousness, Kṛṣṇa consciousness, his position is to serve the Supreme. When the living entity is in material consciousness, he has to take on various bodies in the material world. That is called karma, or varied creation by the force of material consciousness.

In Vedic literature the living entity is called jīvātmā and Brahman, but he is never called Para-brahman. The living entity (jīvātmā) takes different positions – sometimes he merges into the dark material nature and identifies himself with matter, and sometimes he identifies himself with the superior, spiritual nature. Therefore he is called the Supreme Lord’s marginal energy. According to his identification with material or spiritual nature, he receives a material or spiritual body. In material nature he may take a body from any of the 8,400,000 species of life, but in spiritual nature he has only one body. In material nature he is manifested sometimes as a man, demigod, animal, beast, bird, etc., according to his karma. To attain material heavenly planets and enjoy their facilities, he sometimes performs sacrifices (yajña), but when his merit is exhausted he returns to earth again in the form of a man. This process is called karma.

The Chāndogya Upaniṣad describes the Vedic sacrificial process. On the sacrificial altar, five kinds of offerings are made into five kinds of fire. The five kinds of fire are conceived of as the heavenly planets, clouds, the earth, man and woman, and the five kinds of sacrificial offerings are faith, the enjoyer on the moon, rain, grains and semen.

In the process of sacrifice, the living entity makes specific sacrifices to attain specific heavenly planets and consequently reaches them. When the merit of sacrifice is exhausted, the living entity descends to earth in the form of rain, then takes on the form of grains, and the grains are eaten by man and transformed into semen, which impregnates a woman, and thus the living entity once again attains the human form to perform sacrifice and so repeat the same cycle. In this way, the living entity perpetually comes and goes on the material path. The Kṛṣṇa conscious person, however, avoids such sacrifices. He takes directly to Kṛṣṇa consciousness and thereby prepares himself to return to Godhead.

Impersonalist commentators on the Bhagavad-gītā unreasonably assume that Brahman takes the form of jīva in the material world, and to substantiate this they refer to Chapter Fifteen, verse 7, of the Gītā. But in this verse the Lord also speaks of the living entity as “an eternal fragment of Myself.” The fragment of God, the living entity, may fall down into the material world, but the Supreme Lord (Acyuta) never falls down. 

Therefore this assumption that the Supreme Brahman assumes the form of jīva is not acceptable. It is important to remember that in Vedic literature Brahman (the living entity) is distinguished from Para-brahman (the Supreme Lord).
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 295: 08వ అధ్.,  శ్లో 04 /  Bhagavad-Gita - 295: Chap. 08, Ver. 04

🌹. శ్రీమద్భగవద్గీత - 295 / Bhagavad-Gita - 295 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 04 🌴

04. అధిభూతం క్షరో భావ: పురుశ్చాధిదైవతం |
అధియజ్ఞో(హమేవాత్ర దేహే దేహభృతాం వర ||

🌷. తాత్పర్యం :
ఓ దేహధారులలో శ్రేష్టుడా ! నిరంతరము పరిణామశీలమైన భౌతికప్రకృతి అధిభూతమనబడును(భౌతికజగత్తు). సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండెడి విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండెడి దేవదేవుడైన నేనే అధియజ్ఞడును (యజ్ఞప్రభువును). 

🌷. భాష్యము :
భౌతికప్రకృతి నిరంతర పరిణామశీలమై యుండును. పుట్టుట, పెరుగుట, కొంతకాలము నిలిచియుండుట, ఇతరదేహములను ఉత్పత్తి చేయుట, శిథిలమగుట, చివరికి నశించుట యను ఆరువిధములైన మార్పులకు భౌతికదేహములు లోనగుచుండును. అట్టి ఈ భౌతికప్రకృతియే “అధిభూతము” అనబడును. ఇది ఒక నిర్దిష్టమైన సమయమున సృష్టించబడి వేరొక నిర్దిష్ట సమయమున నశింపజేయబడును. సమస్తదేవతలను మరియు సమస్తలోకములను తన యందు కలిగియున్న శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమే “అధిదైవతము” అనబడును. దేహమునందు ఆత్మతోపాటుగా శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యమైన పరమాత్మయు నిలిచియుండును. ఈ శ్లోకమునందు “ఏవ” అను పదము మిగుల ప్రధానమైనది. ఏలయన దాని ద్వారా శ్రీకృష్ణుడు తన కన్నను పరమాత్ము భిన్నుడు కాడని నొక్కి చెప్పుచున్నాడు. ఆత్మ చెంతనే నిలిచియుండెడి ఆ పరమాత్మయే జీవి కర్మలకు సాక్షిగా నుండి అతని వివిధస్వభావములకు కారణమై యున్నాడు. అనగా జీవుడు స్వతంత్రముగా వర్తించుటకు అవకాశమొసగుచు అతని కర్మలను పరమాత్ముడు సాక్షిగా గమనించుచుండును. శ్రీకృష్ణభగవానుని వివిధరూపముల ఇట్టి సర్వకార్యములు దివ్యసేవలో నియుక్తడైన కృష్ణభక్తిభావనాయుతునికి అప్రయత్నముగా విదితము కాగలవు. “అధిదైవతము” అని పిలువబడు భగవానుని విశ్వరూపము ఆ దేవదేవుని పరమాత్మరూపమున ఎరుగలేని ఆరంభదశలో నున్న సాధకునిచే ద్యానింపబడుచుండును. కనుకనే అధోలోకములు పాదములుగా, సూర్యచంద్రులు నేత్రములుగా, శిరము ఊర్థ్వలోకములుగా పరిగిణింపబడు “విరాట్పురుషుని” (విశ్వరూపమును) ధ్యానము చేయుమని ఆరంభకునికి ఉపదేశించ బడుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 295 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 04 🌴

04. adhibhūtaṁ kṣaro bhāvaḥ
puruṣaś cādhidaivatam
adhiyajño ’ham evātra
dehe deha-bhṛtāṁ vara

🌷 Translation : 
O best of the embodied beings, the physical nature, which is constantly changing, is called adhibhūta [the material manifestation]. The universal form of the Lord, which includes all the demigods, like those of the sun and moon, is called adhidaiva. And I, the Supreme Lord, represented as the Supersoul in the heart of every embodied being, am called adhiyajña [the Lord of sacrifice].

🌹 Purport :
The physical nature is constantly changing. Material bodies generally pass through six stages: they are born, they grow, they remain for some duration, they produce some by-products, they dwindle, and then they vanish. This physical nature is called adhibhūta. It is created at a certain point and will be annihilated at a certain point. The conception of the universal form of the Supreme Lord, which includes all the demigods and their different planets, is called adhidaivata. And present in the body along with the individual soul is the Supersoul, a plenary representation of Lord Kṛṣṇa. The Supersoul is called the Paramātmā or adhiyajña and is situated in the heart. The word eva is particularly important in the context of this verse because by this word the Lord stresses that the Paramātmā is not different from Him. The Supersoul, the Supreme Personality of Godhead, seated beside the individual soul, is the witness of the individual soul’s activities and is the source of the soul’s various types of consciousness. The Supersoul gives the individual soul an opportunity to act freely and witnesses his activities. The functions of all these different manifestations of the Supreme Lord automatically become clarified for the pure Kṛṣṇa conscious devotee engaged in transcendental service to the Lord. The gigantic universal form of the Lord called adhidaivata is contemplated by the neophyte who cannot approach the Supreme Lord in His manifestation as Supersoul.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 02/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 296: 08వ అధ్.,  శ్లో 05 /  Bhagavad-Gita - 296: Chap. 08, Ver. 05

🌹. శ్రీమద్భగవద్గీత - 296 / Bhagavad-Gita - 296 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 05 🌴

05. అంతకాలే చ మామేవ స్మరున్ముక్త్వా కలేవరమ్ |
య: ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ:

🌷. తాత్పర్యం :
అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.

🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావనపు ప్రాముఖ్యము ఈ శ్లోకమునందు నొక్కి చెప్పబడినది. 

కృష్ణభక్తిభావనలో నిలిచి దేహత్యాగము చేసినవాడు శీఘ్రమే శ్రీకృష్ణభగవానుని పొందగలడు ఆ దేవదేవుడు పవిత్రులలో పవిత్రతముడు గనుక అతని సంపూర్ణ భక్తిభావనలో సదా నిలిచియుండెడి భక్తుడు సైతము పవిత్రతముడు కాగలడు. ఈ శ్లోకమునందు “స్మరణ్” (స్మరించుట) యను పదము మిక్కిలి ప్రధానమైనది. 

కృష్ణభక్తిభావనలో భక్తియోగమును అనుసరించని అపవిత్రునికి కృష్ణుని స్మరించుట సాధ్యము కాదు. కనుకనే జీవితారంభము నుండియే కృష్ణభక్తిభావనను అలవరచుకొనవలెను. 

జీవితారంభమున విజయమును కోరినచో శ్రీకృష్ణునిస్మరణము అత్యంత అవసరము గనుక ప్రతియొక్కరు హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హర హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మాహామంత్రమును నిత్యము నిర్విరామముగా జపించుట మరియు కీర్తించుట చేయవలెను. 

ప్రతియొక్కరును తరువువలె గొప్ప ఓర్పును (తరోరివ సహిష్ణునా) కలిగియుండవలెనని శ్రీచైతన్యమహాప్రభువు ఉపదేశించియుండిరి. కనుక మాహామంత్రమును జపించునపుడు మనుజినికి అవరోధములు కలిగినను వానిని అతడు సహిష్ణుడై ఓర్చుకొనవలెను. 

ఆ విధముగా అతడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను నామజపమును కొనసాగించినచో జీవితాంతమున కృష్ణభక్తిరసభావనపు సంపూర్ణ ప్రయోజనమును నిశ్చయముగా పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 296 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 05 🌴

05. anta-kāle ca mām eva
smaran muktvā kalevaram
yaḥ prayāti sa mad-bhāvaṁ
yāti nāsty atra saṁśayaḥ

🌷 Translation : 
And whoever, at the end of his life, quits his body remembering Me alone at once attains My nature. Of this there is no doubt.

🌹 Purport :
In this verse the importance of Kṛṣṇa consciousness is stressed. Anyone who quits his body in Kṛṣṇa consciousness is at once transferred to the transcendental nature of the Supreme Lord. The Supreme Lord is the purest of the pure. Therefore anyone who is constantly Kṛṣṇa conscious is also the purest of the pure. 

The word smaran (“remembering”) is important. Remembrance of Kṛṣṇa is not possible for the impure soul who has not practiced Kṛṣṇa consciousness in devotional service. Therefore one should practice Kṛṣṇa consciousness from the very beginning of life. 

If one wants to achieve success at the end of his life, the process of remembering Kṛṣṇa is essential. Therefore one should constantly, incessantly chant the mahā-mantra – Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. 

Lord Caitanya has advised that one be as tolerant as a tree (taror api sahiṣṇunā). There may be so many impediments for a person who is chanting Hare Kṛṣṇa. 

Nonetheless, tolerating all these impediments, one should continue to chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, so that at the end of one’s life one can have the full benefit of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 297: 08వ అధ్.,  శ్లో 06 /  Bhagavad-Gita - 297: Chap. 08, Ver. 06

🌹. శ్రీమద్భగవద్గీత - 297 / Bhagavad-Gita - 297 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 06 🌴

06. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యన్తే కలేవరమ్ |
తం తమేవైతి కొన్తేయ సదా తద్భావభావిత: ||

🌷. తాత్పర్యం :
ఓ కౌంతేయా! దేహమును త్యజించునపుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును.

🌷. భాష్యము :
అతిక్లిష్టమైన మరణసమయమున మనుజుడు తన భావమును మార్చుకొను విధానము ఇచ్చట వివరింపబడినది. జీవితారంభమున శ్రీకృష్ణుని తలచుచు శరీరమును విడుచువాడు ఆ భగవానుని దివ్యభావమునే పొందగలడు. 

కాని కృష్ణునకు అన్యమైనదానిని చింతించువాడు సైతము అదే దివ్యస్థితిని పొందగలడనుట ఏమాత్రము సత్యము కాదు. ఈ విషయమును ప్రతియొక్కరు అతిజాగ్రత్తతో గమనింపవలెను. కాని మనస్సు సరియైన స్థితిలో నుండగా మరణించుట ఎట్లు సంభవము? 

ఉదాహరణమునకు భరతమహారాజు మహానుభావుడే అయినను అంత్యకాలమున ఒక జింకను తలచినందున తదుపరి జన్మలో జింకదేహమును పొందవలసివచ్చెను. జింకదేహములో అతడు పూర్వజన్మ స్మృతులను కలిగియున్నను ఆ జంతుశరీరముననే కొనసాగవలసివచ్చెను. 

జీవితకాలము నాటి ఆలోచనలే ప్రోగుపడి మరణసమయమున మనుజుని ఆలోచనలను ప్రభావితము చేయును గనుక, ప్రస్తుత దేహమే తరువాతి దేహమును తయారు చేయుచున్నదని పలుకవచ్చును. 

అనగా ప్రస్తుత జన్మమున సత్త్వగుణమున నిలిచి సదా శ్రీకృష్ణుని తలచినచో అంత్యకాలమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవ్వరికైనను సాధ్యము కాగలదు. 

అదియే దివ్యమైన శ్రీకృష్ణుని ధామము చేరుటకు మనుజునికి తోడ్పడును. అనగా మనుజడు దివ్యమైన శ్రీకృష్ణసేవలో సంపూర్ణముగా నిమగ్నుడైనచో అతని తరువాతి దేహము దివ్యమే(ఆధ్యాత్మికమే) కాగలదు గాని భౌతికము కాజాలదు. 

కనుక హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మాహామంత్ర కీర్తనమే అంత్యకాలమున మనుజుని స్థితిని జయప్రదముగా మార్చుటకు ఉత్తమవిధానమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 297 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 06 🌴

06. yaṁ yaṁ vāpi smaran bhāvaṁ
tyajaty ante kalevaram
taṁ tam evaiti kaunteya
sadā tad-bhāva-bhāvitaḥ

🌷 Translation : 
Whatever state of being one remembers when he quits his body, O son of Kuntī, that state he will attain without fail.

🌹 Purport :
The process of changing one’s nature at the critical moment of death is here explained. 

A person who at the end of his life quits his body thinking of Kṛṣṇa attains the transcendental nature of the Supreme Lord, but it is not true that a person who thinks of something other than Kṛṣṇa attains the same transcendental state. This is a point we should note very carefully. 

How can one die in the proper state of mind? Mahārāja Bharata, although a great personality, thought of a deer at the end of his life, and so in his next life he was transferred into the body of a deer. Although as a deer he remembered his past activities, he had to accept that animal body. 

Of course, one’s thoughts during the course of one’s life accumulate to influence one’s thoughts at the moment of death, so this life creates one’s next life. 

If in one’s present life one lives in the mode of goodness and always thinks of Kṛṣṇa, it is possible for one to remember Kṛṣṇa at the end of one’s life. 

That will help one be transferred to the transcendental nature of Kṛṣṇa. If one is transcendentally absorbed in Kṛṣṇa’s service, then his next body will be transcendental (spiritual), not material. 

Therefore the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare is the best process for successfully changing one’s state of being at the end of one’s life.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 298: 08వ అధ్.,  శ్లో 07 /  Bhagavad-Gita - 298: Chap. 08, Ver. 07

🌹. శ్రీమద్భగవద్గీత - 298 / Bhagavad-Gita - 298 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 07 🌴

07. తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయ; ||

🌷. తాత్పర్యం :
కావున ఓ అర్జునా! సర్వకాలముల యందును నీవు నన్నే(శ్రీకృష్ణుని) తలచుచు నీ విధ్యుక్తధర్మమైన యుద్ధము నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. 

🌷. భాష్యము :
అర్జునునకు ఒసగబడిన ఈ ఉపదేశము కామ్యకర్మల యందు మునిగియుండెడి సర్వజనులకు అత్యంత ముఖ్యమైనది. విధ్యుక్తధర్మములను లేదా కర్మలను త్యజించుమణి భగవానుడిచ్చట తెలుపుటలేదు. అనగా వాటిని వారు కొనసాగించుచునే హరేకృష్ణమహామంత్ర జప,కీర్తనముల ద్వారా శ్రీకృష్ణుని స్మరించవలెను. 

ఈ పద్ధతి మనుజిని భౌతికకల్మషము నుండి ముక్తిని చేసి, మనోబుద్ధులను కృష్ణుని యందు నియుక్తమగునట్లు చేయగలదు. దివ్యమైన శ్రీకృష్ణుని నామమును కీర్తించుట ద్వారా మనుజుడు అసంశయముగా దివ్యలోకమగు కృష్ణధామమును చేరగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 298 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 07 🌴

07. tasmāt sarveṣu kāleṣu
mām anusmara yudhya ca
mayy arpita-mano-buddhir
mām evaiṣyasy asaṁśayaḥ

🌷 Translation : 
Therefore, Arjuna, you should always think of Me in the form of Kṛṣṇa and at the same time carry out your prescribed duty of fighting. 

With your activities dedicated to Me and your mind and intelligence fixed on Me, you will attain Me without doubt.

🌹 Purport :
This instruction to Arjuna is very important for all men engaged in material activities. 

The Lord does not say that one should give up his prescribed duties or engagements. One can continue them and at the same time think of Kṛṣṇa by chanting Hare Kṛṣṇa. 

This will free one from material contamination and engage the mind and intelligence in Kṛṣṇa. By chanting Kṛṣṇa’s names, one will be transferred to the supreme planet, Kṛṣṇaloka, without a doubt.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 05/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 299: 08వ అధ్.,  శ్లో 08 /  Bhagavad-Gita - 299: Chap. 08, Ver. 08

🌹. శ్రీమద్భగవద్గీత - 299 / Bhagavad-Gita - 299 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 08 🌴

08. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ ||

🌷. తాత్పర్యం :
ఓ పార్థా! మనస్సును ఎల్లవేళలా నా స్మరణమునందే నియుక్తముజేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు తన స్మరణ ప్రాముఖ్యమును ఈ శ్లోకమున నొక్కి చెప్పుచున్నాడు. అట్టి శ్రీకృష్ణుని స్మరణము హరేకృష్ణమాహామంత్ర జపకీర్తనముల ద్వారా మనుజుని హృదయమునందు జాగృతము చేయబడును. అట్ట్ శ్రీకృష్ణనామము యొక్క శ్రవణ, కీర్తనములందు కర్ణములు, జిహ్వ, మనస్సు సంపూర్ణముగా నియుక్తమగుచున్నందున ఈ ధ్యానము ఆచరణకు అత్యంతసులభమై యున్నది. ఇట్టి ధ్యానము భగవానుని పొందుటకు తోడ్పడగలదు. “పురుషం” అనగా భోక్త యని భావము. జీవులు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తి స్వరూపులైనను భౌతికకల్మషములకు గురియై యున్నారు. వారు తమను తాము భోక్తలుగా తలచినను వాస్తవమునకు దివ్యభోక్తలు కాజాలరు. శ్రీకృష్ణభగవానుడే తన సంపూర్ణాంశములైన నారాయణుడు, వాసుదేవుడు మొదలగు పలురూపములలో పరమ భోక్తయై యున్నాడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.

కనుక భక్తుడైనవాడు హరేకృష్ణమహామంత్ర జపకీర్తనములను చేయుచు తన పూజాధ్యేయమైన భగవానుని నారాయణ, కృష్ణ, రామాది ఏ రూపములలోనైనా నిరంతరము తలచవచ్చును. ఈ విధానము అతనిని పవిత్రుని చేయగలదు. నిరంతర జపకీర్తనముల వలన అతడు అంత్యకాలమున భగవద్ధామమును చేరగలడు. యోగాభ్యాసమునందు అంతరమందున్న పరమాత్మపై ధ్యానము నిలిపినట్లు, హరినామ జపకీర్తనము ద్వారా మనస్సును సదా శ్రీకృష్ణుని యందు నిలుపవలెను. మనస్సు సదా చంచలమై యుండును గనుక దానిని బలవంతముగా శ్రీకృష్ణుని చింతించునట్లు చేయుట అత్యంత అవసరము. భ్రమరమునే సదా తలచుచు కీటకము ప్రస్తుత జన్మముననే భ్రమరముగా మారెడి వృత్తాంతము ఇచ్చట సాధారణముగా ఉదహరింపబడును. అదేవిధముగా మనము శ్రీకృష్ణుని నిరంతరము స్మరించినచో అంత్యమున ఆ దేవదేవుని స్వరూపమును బోలిన స్వరూపమునే పొందగలము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 299 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 08 🌴

08. abhyāsa-yoga-yuktena
cetasā nānya-gāminā
paramaṁ puruṣaṁ divyaṁ
yāti pārthānucintayan

🌷 Translation : 
He who meditates on Me as the Supreme Personality of Godhead, his mind constantly engaged in remembering Me, undeviated from the path, he, O Pārtha, is sure to reach Me.

🌹 Purport :
In this verse Lord Kṛṣṇa stresses the importance of remembering Him. One’s memory of Kṛṣṇa is revived by chanting the mahā-mantra, Hare Kṛṣṇa. By this practice of chanting and hearing the sound vibration of the Supreme Lord, one’s ear, tongue and mind are engaged. 

This mystic meditation is very easy to practice, and it helps one attain the Supreme Lord. Puruṣam means enjoyer. Although living entities belong to the marginal energy of the Supreme Lord, they are in material contamination. 

They think themselves enjoyers, but they are not the supreme enjoyer. Here it is clearly stated that the supreme enjoyer is the Supreme Personality of Godhead in His different manifestations and plenary expansions as Nārāyaṇa, Vāsudeva, etc.

The devotee can constantly think of the object of worship, the Supreme Lord, in any of His features – Nārāyaṇa, Kṛṣṇa, Rāma, etc. – by chanting Hare Kṛṣṇa. This practice will purify him, and at the end of his life, due to his constant chanting, he will be transferred to the kingdom of God. 

Yoga practice is meditation on the Supersoul within; similarly, by chanting Hare Kṛṣṇa one fixes his mind always on the Supreme Lord. The mind is fickle, and therefore it is necessary to engage the mind by force to think of Kṛṣṇa. 

One example often given is that of the caterpillar that thinks of becoming a butterfly and so is transformed into a butterfly in the same life. Similarly, if we constantly think of Kṛṣṇa, it is certain that at the end of our lives we shall have the same bodily constitution as Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 06/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 300: 08వ అధ్.,  శ్లో 09 /  Bhagavad-Gita - 300: Chap. 08, Ver. 09

🌹. శ్రీమద్భగవద్గీత - 300 / Bhagavad-Gita - 300 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 09 🌴

09. కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్ య: |
సర్వస్య ధాతారమచిన్త్యరూపమ్
ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ ||

🌷. తాత్పర్యం :
నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడను, సమస్తమును పోషించువాడును, భౌతికభావనలకు పరమైనవాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనునిగను ప్రతియొక్కరు ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజోసంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతికప్రకృతికి అతీతుడు.

🌷. భాష్యము :
భగవానుని స్మరించు విధానము ఈ శ్లోకమున తెలుపబడినది. ముఖ్యమైన విషయమేమనగా అతడు నిరాకారుడు(శూన్యుడు) కాడు. 

నిరాకారము లేదా శూన్యమునందు ఎవ్వరును ధ్యానమును నిలుపలేరు. అది అతికష్టము. కాని శ్రీకృష్ణుని స్మరణము అత్యంత సులభమైనది. అట్టి స్మరణమే వాస్తవముగా ఇచ్చట పేర్కొనబడినది. 

మొట్టమొదట మనము అతడు పురుషుడని (రూపసహితుడని) తెలిసికొనవలెను. అనగా శ్రీకృష్ణనిగాని లేక శ్రీరామునిగాని సచ్చిదానందవిగ్రహునిగానే మనము ద్యానింపవలెను. రాముని తలచినను లేదా కృష్ణుని తలచినను అతడు ఎట్టివాడో ఈ శ్లోకమునందు వివరింపబడినది. శ్రీకృష్ణభగవానుడు “కవి” యని ఇచ్చట వర్ణింపబడినాడు. 

అనగా భూత, భవిష్యత్, వర్తమానములను తెలియుట ద్వారా సమస్తము నెరిగియుండెడి సర్వజ్ఞుడని భావము. సమస్తమునకు అది అతడే కనుక ప్రాచీనునిగా పిలువబడినాడు. సమస్తము అతని నుండియే ఉద్భవించినది. 

జగన్నియామకుడు మరియు మనుజుల పోషకుడుపోషకుడు, శిక్షకుడు అతడే. అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడు. వెంట్రుక కొనలో పదివేలవంతు యుండెడి ఆత్మ యందును అచింత్యముగా ప్రవేశింపగలిగినంత సూక్ష్మమైనవాడు గనుకనే అతడు సూక్ష్మమైనవాటిలో సూక్ష్మమైనవాడని పిలువబడినాడు. 

దేవదేవునిగా అతడు అణువు నందును మరియు అతిసూక్ష్మమైనట్టి దాని హృదయమునందును ప్రవేశించి పరమాత్మరూపమున నియమించుచుండును. అతిసూక్ష్మమైనను అతడు సర్వత్రా వ్యాపించి సమస్తమును పోషించుచున్నాడు. అతని వలననే సమస్త గ్రహమండలము నిలిచియున్నది. 

ఏ విధముగా అతిపెద్ద గ్రహములు సులభముగా అంతరిక్షమున తేలుచున్నవని మనము ఆశ్చర్యపోవచ్చునుగాని, వాస్తవమునాకు శ్రీకృష్ణభగవానుడే తన అచింత్యశక్తిచే పెద్దగ్రహములను మరియు నక్షత్రమండలమును నిలిపియున్నాడని ఇచ్చట పేర్కొనబడినది. 

కనుకనే ఈ విషయము “అచింత్యము” అణు పదము మిక్కిలి ప్రాధాన్యమును సంతరించుకొన్నది. భగవచ్చక్తి మన ఆలోచనాపరిధికి, భావనకు మించినదగుట చేతనే అచింత్యమణి పిలువబడినది. వాస్తవమునాకు ఇది నిర్వివాదాంశము. అతడు ఈ భౌతికజగత్తు నంతటిని వ్యాపించియున్నను దానికి అతీతుడై యుండును. 

ఆధ్యాత్మికజగత్తుతో పోల్చినచో అతిస్వల్పమైన ఈ భౌతికజగత్తును గూర్చియే మనకు తెలియదన్నచో దీనికి పరమైనదానిని మనమెట్లు ఊహింపగలము? కనుక భౌతికజగమునకు పరమైనది మరియు మన వాదము, తర్కము, తాత్త్వికకల్పనలకు అందనిదే అచింత్యమనుదాని భావము. 

కనుక బుద్ధిమంతులైనవారు వ్యర్థమైన వాదములను, కల్పనలను త్యజించి, భగవద్గీత, భాగవతము, వేదముల వంటి వాజ్మయమునందు తెలుపబడిన విషయములను అంగీకరించి అనుసరింపవలెను. అదియే మనుజుని సరియైన అవగాహనకు గొనిపోగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 300 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 09 🌴

09. kaviṁ purāṇam anuśāsitāram
aṇor aṇīyāṁsam anusmared yaḥ
sarvasya dhātāram acintya-rūpam
āditya-varṇaṁ tamasaḥ parastāt

🌷 Translation : 
One should meditate upon the Supreme Person as the one who knows everything, as He who is the oldest, who is the controller, who is smaller than the smallest, who is the maintainer of everything, who is beyond all material conception, who is inconceivable, and who is always a person. He is luminous like the sun, and He is transcendental, beyond this material nature.

🌹 Purport :
The process of thinking of the Supreme is mentioned in this verse. The foremost point is that He is not impersonal or void. One cannot meditate on something impersonal or void. That is very difficult. The process of thinking of Kṛṣṇa, however, is very easy and is factually stated herein. 

First of all, the Lord is puruṣa, a person – we think of the person Rāma and the person Kṛṣṇa. And whether one thinks of Rāma or of Kṛṣṇa, what He is like is described in this verse of Bhagavad-gītā. 

The Lord is kavi; that is, He knows past, present and future and therefore knows everything. He is the oldest personality because He is the origin of everything; everything is born out of Him. 

He is also the supreme controller of the universe, and He is the maintainer and instructor of humanity. He is smaller than the smallest. The living entity is one ten-thousandth part of the tip of a hair, but the Lord is so inconceivably small that He enters into the heart of this particle. 

Therefore He is called smaller than the smallest. As the Supreme, He can enter into the atom and into the heart of the smallest and control him as the Supersoul. Although so small, He is still all-pervading and is maintaining everything. 

By Him all these planetary systems are sustained. We often wonder how these big planets are floating in the air. It is stated here that the Supreme Lord, by His inconceivable energy, is sustaining all these big planets and systems of galaxies. 

The word acintya (“inconceivable”) is very significant in this connection. God’s energy is beyond our conception, beyond our thinking jurisdiction, and is therefore called inconceivable (acintya). 

Who can argue this point? He pervades this material world and yet is beyond it. We cannot comprehend even this material world, which is insignificant compared to the spiritual world – so how can we comprehend what is beyond? 

Acintya means that which is beyond this material world, that which our argument, logic and philosophical speculation cannot touch, that which is inconceivable. 

Therefore intelligent persons, avoiding useless argument and speculation, should accept what is stated in scriptures like the Vedas, Bhagavad-gītā and Śrīmad-Bhāgavatam and follow the principles they set down. This will lead one to understanding.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 07/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 301: 08వ అధ్.,  శ్లో 10 /  Bhagavad-Gita - 301: Chap. 08, Ver. 10

🌹. శ్రీమద్భగవద్గీత - 301 / Bhagavad-Gita - 301 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 10 🌴

10. ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురషముపైతి దివ్యమ్ ||

🌷. తాత్పర్యం :
మరణసమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి, యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తిభావమున భగవానుని స్మరించెడివాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు.

🌷. భాష్యము :
మరణసమయమునందు దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తి యందే మనస్సును లగ్నము చేయవలెనని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. యోగాభ్యాసము చేయువారు ప్రాణమును భ్రూమధ్యమునకు (ఆజ్ఞాచక్రమునకు) చేర్చవలెనని ఇచ్చట ఉపదేశింపబడినది. 

ఈ విధముగా ఆరుచక్రములపై ధ్యానమును కూడిన షట్చక్రాభ్యాసము ఇచ్చట సూచించబడుచున్నది. కాని శుద్ధభక్తుడు ఇట్టి షట్చక్రయోగము నభ్యసింపడు. 

కాని అతడు కృష్ణభక్తిభావనలో సంతతమగ్నుడై మరణ సమయము నందును దేవదేవుడైన శ్రీకృష్ణుని అతని కరుణ చేతనే స్మరింపగలుగును. ఈ విషయము పదునాలుగవ శ్లోకమున విశదముగా వివరింపబడినది. 

ఈ శ్లోకమున “యోగబలేన” యను పదమునకు ప్రాధాన్యము కలదు. ఏలయన యోగాభ్యాసము లేకుండా మరణసమయమునందు ఎవ్వరును ఇట్టి దివ్యస్థితికి రాలేరు. ఆ యోగము షట్చక్రయోగమైనను లేదా భక్తియోగమైనను సరియే. 

అంతియేగాక ఈ యోగమును అభ్యసించకుండా హఠాత్తుగా మరణసమయమున శ్రీకృష్ణభగవానుని స్మరించుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. మనుజుడు ఏదియో ఒక యోగవిధానమును (ముఖ్యముగా భక్తియోగమును) అభ్యసించియే తిరవలెను. 

మరణ సమయమున మనస్సు కలత చెందియుండును గనుక మనుజుడు యోగము ద్వారా జీవితకాలమునందు దివ్యత్వము అభ్యసింపవలసియున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 301 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 10 🌴

10. prayāṇa-kāle manasācalena
bhaktyā yukto yoga-balena caiva
bhruvor madhye prāṇam āveśya samyak
sa taṁ paraṁ puruṣam upaiti divyam

🌷 Translation : 
One who, at the time of death, fixes his life air between the eyebrows and, by the strength of yoga, with an undeviating mind, engages himself in remembering the Supreme Lord in full devotion, will certainly attain to the Supreme Personality of Godhead.

🌹 Purport :
In this verse it is clearly stated that at the time of death the mind must be fixed in devotion to the Supreme Personality of Godhead. 

For those practiced in yoga, it is recommended that they raise the life force between the eyebrows (to the ājñā-cakra). The practice of ṣaṭ-cakra-yoga, involving meditation on the six cakras, is suggested here. 

A pure devotee does not practice such yoga, but because he is always engaged in Kṛṣṇa consciousness, at death he can remember the Supreme Personality of Godhead by His grace. This is explained in verse 14.

The particular use of the word yoga-balena is significant in this verse because without practice of yoga – whether ṣaṭ-cakra-yoga or bhakti-yoga – one cannot come to this transcendental state of being at the time of death. 

One cannot suddenly remember the Supreme Lord at death; one must have practiced some yoga system, especially the system of bhakti-yoga. 

Since one’s mind at death is very disturbed, one should practice transcendence through yoga during one’s life.
🌹 🌹 🌹 🌹

Date: 08/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 302: 08వ అధ్.,  శ్లో 11 /  Bhagavad-Gita - 302: Chap. 08, Ver. 11

🌹. శ్రీమద్భగవద్గీత - 302 / Bhagavad-Gita - 302 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 11 🌴

11. యదక్షరం వేదవిదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగా: |
యదిచ్చన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే ||

🌷. తాత్పర్యం :
వేదవిదులైనవారును, ఓంకారమును ఉచ్చరించువారును, సన్న్యాసాశ్రమము నందున్న మహర్షులు అగు మనుజులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరినవారు బ్రహ్మచర్యవ్రతము నభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానము ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు భ్రూమధ్యమున ప్రాణవాయువును నిలుపు షట్చక్రయోగాభ్యాసమును ఉపదేశించినాడు. అర్జునుడు ఆ యోగాభ్యాసము తెలియదని భావించి భగవానుడు దానిని రాబోవు శ్లోకములందు వివరింపనున్నాడు. 

పరబ్రహ్మము అద్వితీయుడైనను పలురూపములను మరియు లక్షణములను కలిగియుండునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు. 

నిరాకారవాదులకు ఓంకారము (అక్షరము) పరబ్రహ్మముతో సమానము. వీతరాగులైన యతులు ప్రవేశించు నిరాకారబ్రహ్మమును గూర్చి శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు.

వైదికమార్గమునందు ఓంకారము జపించుట మరియు పూర్ణ బ్రహ్మచర్యములో గురువుచెంత నిరాకారబ్రహ్మమును గూర్చి ఎరుంగుట శిష్యులకు ఆది నుండియే భోదింపబడును. ఆ విధముగా వారు బ్రహ్మము యొక్క రెండు లక్షణములను తెలియగలరు. 

ఈ అభ్యాసము బ్రహ్మచారుల ఆధ్యాత్మికజీవన పురోగతికి అత్యంత అవసరమైనను సంపూర్ణముగా నేటికాలమున అట్టి బ్రహ్మచర్యజీవనము సాధ్యము కాదు. ప్రపంచ సాంఘికవ్యవస్థ సంపూర్ణముగా మార్పునొందినందున బ్రహ్మచర్యమును విద్యార్థిదశ నుండియే పాటించుట ఎవ్వరికినీ సాధ్యము కాకున్నది. 

ప్రపంచమంతటను వివిధజ్ఞానశాఖలకు పలు సంస్థలున్నను బ్రహ్మచర్యనియమములందు విద్యార్థులకు విద్యగరుపు ప్రామాణిక సంస్థ ఒక్కటియు లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటించనిదే ఆధ్యాత్మికజీవన పురోగతి అత్యంత కష్టతరము కాగలదు. 

కనుకనే కలియుగమున శాస్త్రనియమము ప్రకారము శ్రీకృష్ణభగవానుని ప్రాప్తికి  పవిత్ర శ్రీకృష్ణనామము తప్ప అన్యవిధానము లేదని శ్రీచైతన్యమాహాప్రభువు ప్రకటించి యుండిరి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 302 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 11 🌴

17 . yad akṣaraṁ veda-vido vadanti
viśanti yad yatayo vīta-rāgāḥ
yad icchanto brahma-caryaṁ caranti
tat te padaṁ saṅgraheṇa pravakṣye

🌷 Translation : 
Persons who are learned in the Vedas, who utter oṁ-kāra, and who are great sages in the renounced order enter into Brahman. Desiring such perfection, one practices celibacy. I shall now briefly explain to you this process by which one may attain salvation.

🌹 Purport :
Lord Śrī Kṛṣṇa has recommended to Arjuna the practice of ṣaṭ-cakra-yoga, in which one places the air of life between the eyebrows. 

Taking it for granted that Arjuna might not know how to practice ṣaṭ-cakra-yoga, the Lord explains the process in the following verses. The Lord says that Brahman, although one without a second, has various manifestations and features. 

Especially for the impersonalists, the akṣara, or oṁ-kāra – the syllable oṁ – is identical with Brahman. Kṛṣṇa here explains the impersonal Brahman, into which the renounced order of sages enter.

In the Vedic system of knowledge, students, from the very beginning, are taught to vibrate oṁ and learn of the ultimate impersonal Brahman by living with the spiritual master in complete celibacy. In this way they realize two of Brahman’s features. 

This practice is very essential for the student’s advancement in spiritual life, but at the moment such brahmacārī (unmarried celibate) life is not at all possible. The social construction of the world has changed so much that there is no possibility of one’s practicing celibacy from the beginning of student life. 

Throughout the world there are many institutions for different departments of knowledge, but there is no recognized institution where students can be educated in the brahmacārī principles. 

Unless one practices celibacy, advancement in spiritual life is very difficult. Therefore Lord Caitanya has announced, according to the scriptural injunctions for this Age of Kali, that in this age no process of realizing the Supreme is possible except the chanting of the holy names of Lord Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 09/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 303: 08వ అధ్.,  శ్లో 12 /  Bhagavad-Gita - 303: Chap. 08, Ver. 12

🌹. శ్రీమద్భగవద్గీత - 303 / Bhagavad-Gita - 303 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 12 🌴

12. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుద్య చ |
మూర్ద్న్యాధాయాత్మన: ప్రాణమాస్థితో యోగధారణమ్ ||

🌷. తాత్పర్యం :
ఇంద్రియకర్మల నుండు విడివడియుండుటయే యోగస్థితి యనబడును. సర్వేంద్రియద్వారములను మూసివేసి, మనస్సును హృదయమునందు స్థిరము చేసి, ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు.

🌷. భాష్యము :
ఇచ్చట తెలుపబడిన యోగవిధానమును అభ్యసించుట మనుజుడు మొట్టమొదట సర్వభోగద్వారములను మూసివేయవలెను. ఇట్టి అభ్యాసమునకే “ప్రత్యాహారము”  
(ఇంద్రియార్థముల నుండు ఇంద్రియములను మరలించుట) అని పేరు.

 జ్ఞానేంద్రియములైన కన్నులు, చెవులు, నాసికము, జిహ్య, స్పర్శను సంపూర్ణముగా నిగ్రహించవలెను. స్వీయతృప్తి యందు వాటిని నియుక్తము చేయరాదు. ఈ విధముగా ఒనరించినపుడు మనస్సు హృదయస్థ పరమాత్మపై నెలకొని, ప్రాణవాయువు శీర్షాగ్రము నందు ప్రతిష్టితమగును. షష్టాధ్యాయమున ఈ పద్ధతి విపులముగా వివరింపబడినది. 

కాని ఇదివరకే తెలుపబడినట్లు ఈ యోగపద్ధతి ప్రస్తుతకాలమునాకు ఆచరణీయము కానిది. కలియుగమునకు ఏకైక ఉత్తమమార్గము కృష్ణభక్తిరసభావనమే. భక్తియోగమునందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సు లగ్నము చేయగలిగినచో అచంచలమైన సమాధిస్థితి యందు నిలుచుట మనుజునకు సులభతరము కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 303 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 12 🌴

12 . sarva-dvārāṇi saṁyamya
mano hṛdi nirudhya ca
mūrdhny ādhāyātmanaḥ prāṇam
āsthito yoga-dhāraṇām

🌷 Translation : 
The yogic situation is that of detachment from all sensual engagements. Closing all the doors of the senses and fixing the mind on the heart and the life air at the top of the head, one establishes himself in yoga.

🌹 Purport :
To practice yoga as suggested here, one first has to close the doors of all sense enjoyment. This practice is called pratyāhāra, or withdrawing the senses from the sense objects. The sense organs for acquiring knowledge – the eyes, ears, nose, tongue and touch – should be fully controlled and should not be allowed to engage in self-gratification. In this way the mind focuses on the Supersoul in the heart, and the life force is raised to the top of the head. In the Sixth Chapter this process is described in detail. But as mentioned before, this practice is not practical in this age. The best process is Kṛṣṇa consciousness. If one is always able to fix his mind on Kṛṣṇa in devotional service, it is very easy for him to remain in an undisturbed transcendental trance, or in samādhi.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 10/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 304: 08వ అధ్.,  శ్లో 13 /  Bhagavad-Gita - 304: Chap. 08, Ver. 13

🌹. శ్రీమద్భగవద్గీత - 304 / Bhagavad-Gita - 304 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 13 🌴

13. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
య: ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్ ||

🌷. తాత్పర్యం :
ఈ యోగవిధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మికలోకములను పొందగలడు.

🌷. భాష్యము :
ఓంకారము, బ్రహ్మము, శ్రీకృష్ణభగవానుడు అభిన్నులని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నిరాకారశభ్ధ రూపమే ఓంకారము. 

కనుకనే శ్రీకృష్ణుని నామమే అయిన హరేకృష్ణ మాహామంత్రమునందును ఓంకారము కలదని చెప్పవచ్చును. ఆ మహామంత్ర జపమే కలియుగమునకు ప్రత్యేకముగా ఉపదేశింపబడినది. 

కనుక మనుజడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యని కీర్తనము, జపము చేయచు దేహత్యాగము చేసినచో తన భక్తిలక్షణముల ననుసరించి ఏదియో ఒక ఆధ్యాత్మికలోకమును నిశ్చయముగా చేరగలడు. అనగా కృష్ణభక్తులు కృష్ణలోకమైన గోలోకబృందావనమును చేరుదురు. 

సాకారవాదులైన భక్తులకు ఆధ్యాత్మికజగమున ఇంకను వైకుంఠలోకనామమున తెలియబడు అసంఖ్యాక లోకములు లభ్యమై యున్నవి. కాని నిరాకారవాదులు మాత్రము అంత్యమున బ్రహ్మజ్యోతి యందు లీనమగును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 304 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 13 🌴

13 . oṁ ity ekākṣaraṁ brahma
vyāharan mām anusmaran
yaḥ prayāti tyajan dehaṁ
sa yāti paramāṁ gatim

🌷 Translation : 
After being situated in this yoga practice and vibrating the sacred syllable oṁ, the supreme combination of letters, if one thinks of the Supreme Personality of Godhead and quits his body, he will certainly reach the spiritual planets.

🌹 Purport :
It is clearly stated here that oṁ, Brahman and Lord Kṛṣṇa are not different. 

The impersonal sound of Kṛṣṇa is oṁ, but the sound Hare Kṛṣṇa contains oṁ. The chanting of the Hare Kṛṣṇa mantra is clearly recommended for this age. 

So if one quits his body at the end of life chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, he certainly reaches one of the spiritual planets, according to the mode of his practice. 

The devotees of Kṛṣṇa enter the Kṛṣṇa planet, Goloka Vṛndāvana. For the personalists there are also innumerable other planets, known as Vaikuṇṭha planets, in the spiritual sky, whereas the impersonalists remain in the brahma-jyotir.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 11/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 305: 08వ అధ్.,  శ్లో 14 /  Bhagavad-Gita - 305: Chap. 08, Ver. 14

🌹. శ్రీమద్భగవద్గీత - 305 / Bhagavad-Gita - 305 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 14 🌴

14.  అనన్యచేతా: సతతం యో మాం స్మరతి నిత్యశ: |
తస్యాహం సులభ: పార్థ నిత్యయుక్తస్య యోగిన: ||

🌷. తాత్పర్యం :
ఓ పార్థా! అనన్యచిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుతసేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై యున్నాను.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియోగాముతో సేవించు శుద్ధభక్తుల చరమగమ్యము ఈ శ్లోకమున ముఖ్యముగా వివరించబడినది. గడచిన అధ్యాయపు శ్లోకములందు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, కల్పనాపూర్ణ తత్త్వవేత్తలనెడి నాలుగురకముల భక్తులు పేర్కొనబడిరి. కర్మయోగము, జ్ఞానయోగము, హటయోగము మొదలగు వివధ ముక్తివిధానములు కూడా వివరింపబడినవి. ఈ యోగవిధానములు భక్తిని కొద్దిగా కలిగియున్నను, ఈ శ్లోకమునందు మాత్రము జ్ఞాన, కర్మ, హతాది ఎట్టి యోగములతోను సంపర్కము లేనటువంటి శుద్ధభక్తియోగము పేర్కొనబడినది. “అనన్యచేతా:” అను పదముతో తెలుపబడినట్లు శుద్ధభక్తియోగమునందు భక్తుడు కృష్ణుని తప్ప అన్యమును వాంచింపడు. అట్టి శుద్ధభక్తుడు స్వర్గలోకములకు పోవలెనని గాని, బ్రహ్మజ్యోతిలో లీనము కావలెనని గాని, భవబంధముల నుండి ముక్తిని పొందవలెనని గాని వాంచింపడు. అట్టివాడు దేనిని కూడా వాంచింపడు. కనుకనే చైతన్యచరితామృతమునందు అతడు “నిష్కాముడు” అని పిలువబడినాడు. అనగా స్వీయలాభమునందు ఎట్టి కోరికయు లేనివాడని భావము. పరమశాంతి అతనికే లభించును గాని స్వీయలాభమునకై ప్రాకులాడువానికి కాదు. జ్ఞానయోగి, కర్మయోగి లేదా హఠయోగి యనువారలు ఏదియో కొంత స్వార్థమును కలిగియున్నను, పూర్ణభక్తుడు శ్రీకృష్ణభగవానుని ప్రియమునకు అన్యమైన దానిని కోరడు. కనుకనే అకుంఠితభక్తితో తనను సేవించువారికి తాను సులభముగా లబింతునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 305 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 14 🌴

14 . ananya-cetāḥ satataṁ
yo māṁ smarati nityaśaḥ
tasyāhaṁ su-labhaḥ pārtha
nitya-yuktasya yoginaḥ

🌷 Translation : 
For one who always remembers Me without deviation, I am easy to obtain, O son of Pṛthā, because of his constant engagement in devotional service.

🌹 Purport :
This verse especially describes the final destination attained by the unalloyed devotees who serve the Supreme Personality of Godhead  bhakti-yoga. Previous verses have mentioned four different kinds of devotees – the distressed, the inquisitive, those who seek material gain, and the speculative philosophers. 

Different processes of liberation have also been described: karma-yoga, jñāna-yoga and haṭha-yoga. The principles of these yoga systems have some bhakti added, but this verse particularly mentions pure bhakti-yoga, without any mixture of jñāna, karma or haṭha. 

As indicated by the word ananya-cetāḥ, in pure bhakti-yoga the devotee desires nothing but Kṛṣṇa. A pure devotee does not desire promotion to heavenly planets, nor does he seek oneness with the brahma-jyotir or salvation or liberation from material entanglement. 

A pure devotee does not desire anything. In the Caitanya-caritāmṛta the pure devotee is called niṣkāma, which means he has no desire for self-interest. 

Perfect peace belongs to him alone, not to them who strive for personal gain. Whereas a jñāna-yogī, karma-yogī or haṭha-yogī has his own selfish interests, a perfect devotee has no desire other than to please the Supreme Personality of Godhead. 

Therefore the Lord says that for anyone who is unflinchingly devoted to Him, He is easy to attain.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 12/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 306: 08వ అధ్.,  శ్లో 15 /  Bhagavad-Gita - 306: Chap. 08, Ver. 15

🌹. శ్రీమద్భగవద్గీత - 306 / Bhagavad-Gita - 306 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 15 🌴

15.  మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువన్తి మహాత్మాన: సంసిద్ధిం పరమాం గతా: ||

🌷. తాత్పర్యం :
భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసినవారగుటచే దు:ఖాలయమైన ఈ అనిత్యజగమునకు ఎన్నడును తిరిగిరారు.

🌷. భాష్యము :
ఈ అనిత్యమగు జన్మము, ముసలితనము, వ్యాధి, మరణములనెడి దుఃఖములచే నిండియున్నందున, పూర్ణత్వమును పొంది కృష్ణలోకమైన (దివ్యలోకము) గోలోకబృందావనమును పొందిన మహాత్ముడు తిరిగి ఈ లోకమునకు రాగోరడు. 

అట్టి శ్రీకృష్ణధామము “అవ్యక్తము” , “అక్షరము”, “పరమగతి” యని వేదవాజ్మయము నందు వర్ణింపబడినది. అనగా అది మన భౌతికసృష్టికి అతీతమైనట్టిది మరియు అచింత్యమైనట్టిది. కాని అది పరమగతియై యుండి మహాత్ములకు మాత్రము గమ్యమై యున్నది. మహాత్ములైనవారు పూర్ణ భక్తుల నుండి ఉపదేశములను పొందుచుందురు. 

ఆ విధముగా వారు కృష్ణభక్తిభావనలో భక్తియోగమునందు క్రమముగా వృద్ధినొందుచు భగవత్సేవలో నియుక్తులై స్వర్గాది ఉన్నతలోకములను గాని, చివరకు వైకుంఠలోకములను గాని కోరకుందురు. 

వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాహచర్యమును తప్ప అన్యమును వాంచింపరు. వాస్తవమునకు అదియే జీవితపు సంపూర్ణత్వమై యున్నది. ఈ శ్లోకము ముఖ్యముగా శ్రీకృష్ణభగవానుని భక్తుల గూర్చియే ప్రస్తావించుచున్నది. 

అట్టి కృష్ణభక్తిరసభావితులు అత్యున్నత జీవనపూర్ణత్వమును బడయగలరు. అనగా వారే మహామహితాత్ములై యున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 306 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 15 🌴

15 . mām upetya punar janma
duḥkhālayam aśāśvatam
nāpnuvanti mahātmānaḥ
saṁsiddhiṁ paramāṁ gatāḥ

🌷 Translation : 
After attaining Me, the great souls, who are yogīs in devotion, never return to this temporary world, which is full of miseries, because they have attained the highest perfection.

🌹 Purport :
Since this temporary material world is full of the miseries of birth, old age, disease and death, naturally he who achieves the highest perfection and attains the supreme planet, Kṛṣṇaloka, Goloka Vṛndāvana, does not wish to return. 

The supreme planet is described in Vedic literature as avyakta and akṣara and paramā gati; in other words, that planet is beyond our material vision, and it is inexplicable, but it is the highest goal, the destination for the mahātmās (great souls). 

The mahātmās receive transcendental messages from the realized devotees and thus gradually develop devotional service in Kṛṣṇa consciousness and become so absorbed in transcendental service that they no longer desire elevation to any of the material planets, nor do they even want to be transferred to any spiritual planet. They only want Kṛṣṇa and Kṛṣṇa’s association, and nothing else. That is the highest perfection of life. 

This verse specifically mentions the personalist devotees of the Supreme Lord, Kṛṣṇa. These devotees in Kṛṣṇa consciousness achieve the highest perfection of life. In other words, they are the supreme souls.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 13/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 307: 08వ అధ్.,  శ్లో 16 /  Bhagavad-Gita - 307: Chap. 08, Ver. 16

🌹. శ్రీమద్భగవద్గీత - 307 / Bhagavad-Gita - 307 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 16 🌴

16.  ఆబ్రహ్మభువనాల్లోకా: పునరావర్తినో(ర్జున |
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే ||

🌷. తాత్పర్యం :
భౌతికజగమునందలి అత్యున్నతలోకము మొదలుకొని అధమలోకము వరకుగల సర్వలోకములు జన్మమృత్యుభరితమైన దుఃఖప్రదేశములలే. కాని ఓ కౌంతేయా! నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు.

🌷. భాష్యము :
కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు వంటివారు శ్రీకృష్ణుని దివ్యదామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తియోగమున (కృష్ణభక్తిరసభావన యందు) పూర్ణత్వమును బడయవలసియే ఉండును.

దేవతాలోకములైన ఉన్నతలోకములను పొందినవారు సైతము జన్మ, మృత్యువులచే ప్రభావితులగుచుందురు. భూలోకవాసులు ఉన్నతలోకములకు చెందినవారు భూలోకమునకు పతనము చెందుచుందురు. 

బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసెడి “పంచాగ్నివిద్య” యను యజ్ఞము చాందోగ్యోపనిషత్తు నందు ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞము ద్వారా బ్రహ్మలోకమును పొందినను అచ్చట కృష్ణభక్తిరసభావనను ఆచరింపనిచో తిరిగి మనుజుడు భూలోకమునకు రావలసివచ్చును. 

ఉన్నతలోకములందు కృష్ణభక్తిభావనను కొనసాగించువారు మాత్రము క్రమముగా మరింత ఉన్నతమైన లోకములను చేరుచు విశ్వ ప్రళయసమయమున ఆధ్యాత్మికజగమునకు చేరుదురు. ఈ విషయమున శ్రీధరస్వామి తమ భగవద్గీత వ్యాఖ్యానము నందు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి.

బ్రాహ్మణే సహ తే సర్వే సమ్ప్రా ప్తే ప్రతిసంచరే |
పరిస్యాన్తే కృతాత్మాన: ప్రవిశన్తి పరం పదమ్ ||

“విశ్వప్రళయము సంభవించినపుడు కృష్ణభక్తిభావన యందు సంతతమగ్నులైన బ్రహ్మ మరియు అతని భక్తులు తమ తమ కోరికల ననుసరించి ఆధ్యాత్మికజగము నందలి వివిధలోకములను చేరుచుందురు.”
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 307 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 16 🌴

16 . ā-brahma-bhuvanāl lokāḥ
punar āvartino ’rjuna
mām upetya tu kaunteya
punar janma na vidyate

🌷 Translation : 
From the highest planet in the material world down to the lowest, all are places of misery wherein repeated birth and death take place. But one who attains to My abode, O son of Kuntī, never takes birth again.

🌹 Purport :
All kinds of yogīs – karma, jñāna, haṭha, etc. – eventually have to attain devotional perfection in bhakti-yoga, or Kṛṣṇa consciousness, before they can go to Kṛṣṇa’s transcendental abode and never return. 

Those who attain the highest material planets, the planets of the demigods, are again subjected to repeated birth and death. 

As persons on earth are elevated to higher planets, people on higher planets such as Brahmaloka, Candraloka and Indraloka fall down to earth. 

The practice of sacrifice called pañcāgni-vidyā, recommended in the Chāndogya Upaniṣad, enables one to achieve Brahmaloka, but if, on Brahmaloka, one does not cultivate Kṛṣṇa consciousness, then he must return to earth. 

Those who progress in Kṛṣṇa consciousness on the higher planets are gradually elevated to higher and higher planets and at the time of universal devastation are transferred to the eternal spiritual kingdom. Baladeva Vidyābhūṣaṇa, in his commentary on Bhagavad-gītā, quotes this verse:

brahmaṇā saha te sarve
samprāpte pratisañcare
parasyānte kṛtātmānaḥ
praviśanti paraṁ padam

“When there is devastation of this material universe, Brahmā and his devotees, who are constantly engaged in Kṛṣṇa consciousness, are all transferred to the spiritual universe and to specific spiritual planets according to their desires.”
🌹 🌹 🌹 🌹 🌹

Date: 14/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 308: 08వ అధ్.,  శ్లో 17 /  Bhagavad-Gita - 308: Chap. 08, Ver. 17

🌹. శ్రీమద్భగవద్గీత - 308 / Bhagavad-Gita - 308 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 17 🌴

17.  సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రాహ్మణో విదు: |
రాత్రిం యుగసహస్రాన్తాం తే(హోరాత్రవిదో జనా: ||

🌷. తాత్పర్యం :
మానవపరిగణనము ననుసరించి వేయియుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణము కలిగియుండును.

🌷. భాష్యము :
భౌతికజగత్తు యొక్క కాలపరిమాణము పరిమితమై కల్పములుగా తెలుపబడు చుండును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగటి సమయము. బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయమున సత్య, త్రేత, ద్వాపర, కలియుగములు వేయిమార్లు మారుచుండును. 

అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవియును లేకుండా కేవలము, సద్గుణము, జ్ఞానము, ధర్మములను కూడియుండు సత్యయుగము 17,28,000 సంవత్సరముల కాలపరిమితి కలిగియుండును. త్రేతాయుగమునందు దుర్గుణము ప్రవేశించును. 

ఆ యుగపు కాలపరిమితి 12,96,000 సంవత్సరములు. ద్వాపరయుగమున సద్గుణము మరియు ధర్మము మరింతగా నశించి దుర్గుణము వృద్దినొందును. దాని కాలపరిమితి 8,64,000 సంవత్సరములు. 

చివరిదైన కలిగియుగమునందు సద్గుణము దాదాపు లుప్తమై కలహము, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము, వ్యసనాది లక్షణము తీవ్రముగా విజృంభించును. ఈ యుగపు కాలపరిమితి 4,32,000 సంవత్సరములు ( ఈ యుగము గత 5,000 సంవత్సరములుగా మన అనుభవము నందున్నది). 

దీని యందు దుర్గుణము మరయు పాపము విపరీతముగా ప్రబలిపోవును కనుక యుగాంతమున శ్రీకృష్ణభగవానుడు కల్కిఅవతారమున దానవులను నిర్జించి, భక్తులను రక్షించి, వేరొక సత్యయుగమును ఆరంభించును. ఆ విధముగా జగత్కార్యము కొనసాగించబడును. 

అదేరీతి నాలుగుయుగములు వేయిమార్లు మారినప్పడు (చతుర్యుగచక్రము వేయిమార్లు తిరిగినప్పడు) అది బ్రహ్మదేవుని పగలును పూర్తిచేయును. అతని రాత్రియు అంతే పరిమాణము కలిగియుండును. బ్రహ్మదేవుడు అట్టి “శతసంవత్సరముల” కాలము జీవించి తదుపరి తన దేహమును త్యజించును. 

మానవపరిగణన ప్రకారము బ్రహ్మదేవుని శతసంవత్సరముల కాలము 311 ట్రిలియన్లు 40 బిలియన్ల సంవత్సరములతో సమానము. ఈ సంఖ్యను బట్టి బ్రహ్మదేవుని ఆయు:పరిమితి అద్భుతముగను, అనంతముగను ఉన్నట్లు తోచినను, నిత్యత్వ దృష్టిలో అది ఒక మెరుపుమెరిసినంత కాలము మాత్రమే. 

కారణార్ణవ జలములలో అసంఖ్యాకములుగా బ్రహ్మలు సముద్రమునందలి బుడగలవలె ప్రత్యక్షమగుచు నశించుచుందురు. బ్రహ్మ మరియు అతని సృష్టి యనునవి భౌతికజగమునందలి భాగములు గనుక అవి నిత్యపరివర్తన శీలములై యున్నవి.

అనగా భౌతికజగమున బ్రహ్మదేవుడు సైతము జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల నుండి బయటబడియుండలేదు. 

కాని అతడు విశ్వకలాప నిర్వహణములో శ్రీకృష్ణభగవానుని సేవ యందు నియుక్తుడైనందున శీఘ్రమే ముక్తిని పొందగలడు. ఆ బ్రహ్మదేవుని లోకమైన బ్రహ్మలోకమునే ఉన్నతులైన సన్న్యాసులు పొందుదురు. 

అట్టి లోకము భౌతికజగత్తు నందు అత్యున్నతమైన స్వర్గాది ఊర్థ్వలోకములను పోషించుచున్నను, బ్రహ్మ మరియు ఆ బ్రహ్మలోకవాసులు ప్రకృతినియమము ప్రకారము మరణమునకు గురికావలసియే వచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 308 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 17 🌴

17 . sahasra-yuga-paryantam
ahar yad brahmaṇo viduḥ
rātriṁ yuga-sahasrāntāṁ
te ’ho-rātra-vido janāḥ

🌷 Translation : 
By human calculation, a thousand ages taken together form the duration of Brahmā’s one day. And such also is the duration of his night.

🌹 Purport :
The duration of the material universe is limited. It is manifested in cycles of kalpas. 

A kalpa is a day of Brahmā, and one day of Brahmā consists of a thousand cycles of four yugas, or ages: Satya, Tretā, Dvāpara and Kali. The cycle of Satya is characterized by virtue, wisdom and religion, there being practically no ignorance and vice, and the yuga lasts 1,728,000 years. 

In the Tretā-yuga vice is introduced, and this yuga lasts 1,296,000 years. In the Dvāpara-yuga there is an even greater decline in virtue and religion, vice increasing, and this yuga lasts 864,000 years. 

And finally in Kali-yuga (the yuga we have now been experiencing over the past 5,000 years) there is an abundance of strife, ignorance, irreligion and vice, true virtue being practically nonexistent, and this yuga lasts 432,000 years. 

In Kali-yuga vice increases to such a point that at the termination of the yuga the Supreme Lord Himself appears as the Kalki avatāra, vanquishes the demons, saves His devotees, and commences another Satya-yuga. 

Then the process is set rolling again. These four yugas, rotating a thousand times, comprise one day of Brahmā, and the same number comprise onenight. Brahmā lives one hundred of such “years” and then dies. 

These “hundred years” by earth calculations total to 311 trillion and 40 billion earth years. By these calculations the life of Brahmā seems fantastic and interminable, but from the viewpoint of eternity it is as brief as a lightning flash. 

In the Causal Ocean there are innumerable Brahmās rising and disappearing like bubbles in the Atlantic. Brahmā and his creation are all part of the material universe, and therefore they are in constant flux.

In the material universe not even Brahmā is free from the process of birth, old age, disease and death. Brahmā, however, is directly engaged in the service of the Supreme Lord in the management of this universe – therefore he at once attains liberation. 

Elevated sannyāsīs are promoted to Brahmā’s particular planet, Brahmaloka, which is the highest planet in the material universe and which survives all the heavenly planets in the upper strata of the planetary system, but in due course Brahmā and all the inhabitants of Brahmaloka are subject to death, according to the law of material nature.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 15/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 309: 08వ అధ్.,  శ్లో 18 /  Bhagavad-Gita - 309: Chap. 08, Ver. 18

🌹. శ్రీమద్భగవద్గీత - 309 / Bhagavad-Gita - 309 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 18 🌴

18.  అవ్యక్తాద్ వ్యక్తయ: సర్వా: ప్రభవన్త్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే ||

🌷. తాత్పర్యం :
బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరు అవ్యక్తస్థితి నుండి వ్యక్తము చెంది, పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు.

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 309 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 18 🌴

18 . avyaktād vyaktayaḥ sarvāḥ
prabhavanty ahar-āgame
rātry-āgame pralīyante
tatraivāvyakta-saṁjñake

🌷 Translation : 
At the beginning of Brahmā’s day, all living entities become manifest from the unmanifest state, and thereafter, when the night falls, they are merged into the unmanifest again.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date:  16/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 310: 08వ అధ్.,  శ్లో 19 /  Bhagavad-Gita - 310: Chap. 08, Ver. 19

🌹. శ్రీమద్భగవద్గీత - 310 / Bhagavad-Gita - 310 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 19 🌴

19.  భూతగ్రామ: స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమేవశ: పార్థ ప్రభవత్యహరాగమే ||

🌷. తాత్పర్యం :
బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనపుడు జీవులు మరల మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు.

🌷. భాష్యము :
భౌతికజగమునందే నిలుచుట యత్నించు మందమతులు ఒకవేళ ఉన్నతలోకములను చేరినను నిశ్చయముగా తిరిగి ఈ భూలోకమునకు రావలసివచ్చును. 

వారు బ్రహ్మదేవుని పగటి సమయమున భౌతికమందలి ఊర్థ్వ, అధోలోకములందు తమ కార్యములను చేయుచు బ్రహ్మదేవుని రాత్రిసమయము అరుదెంచగనే నశించిపోవుదురు. 

తమ కామ్యకర్మలకై వారు బ్రహ్మదేవుని పగటి యందు పలువిధములైన దేహములను పొందినను, అతని రాత్రిసమయమున ఎటువంటి దేహము లేకుండా విష్ణువు యొక్క దేహమందు నిలిచియుండి, తిరిగి బ్రహ్మదేవుని పగలు ఆరంభమైనంతనే మరల వ్యక్తమగుచుందురు. “భూత్వా భూత్వా ప్రలీయతే – పగటియందు వ్యక్తమై రాత్రి యందు మరల నశింతురు.” 

చివరికి బ్రహ్మదేవుని ఆయుష్షు తీరినంతనే వారందరును నశించిపోయి కోట్లాది సంవత్సరములు అవ్యక్తమందు నిలిచిపోవుదురు. తిరిగి బ్రహ్మదేవుడు జన్మించగనే వారును మరల వ్యక్తమగుదురు. ఈ విధముగా వారు భౌతికజగత్తు మాయచే మోహితులగుదురు. 

కాని కృష్ణభక్తిరసభావనను స్వీకరించు జ్ఞానవంతులైన మనుజులు మాత్రము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే – యను కృష్ణనామకీర్తనము చేయుచు శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందే మానవజన్మను నియోగింతురు. 

ఆ విధముగా వారు ఈ జన్మమునందే దివ్యమైన కృష్ణలోకమును చేరి పునర్జన్మలు లేకుండా నిత్యానందభాగులు కాగలరు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 310 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 19 🌴

19 . bhūta-grāmaḥ sa evāyaṁ
bhūtvā bhūtvā pralīyate
rātry-āgame ’vaśaḥ pārtha
prabhavaty ahar-āgame

🌷 Translation : 
Again and again, when Brahmā’s day arrives, all living entities come into being, and with the arrival of Brahmā’s night they are helplessly annihilated.

🌹 Purport :
The less intelligent, who try to remain within this material world, may be elevated to higher planets and then again must come down to this planet earth. 

During the daytime of Brahmā they can exhibit their activities on higher and lower planets within this material world, but at the coming of Brahmā’s night they are all annihilated. 

In the day they receive various bodies for material activities, and at night they no longer have bodies but remain compact in the body of Viṣṇu. 

Then again they are manifest at the arrival of Brahmā’s day. Bhūtvā bhūtvā pralīyate: during the day they become manifest, and at night they are annihilated again. Ultimately, when Brahmā’s life is finished, they are all annihilated and remain unmanifest for millions and millions of years. 

And when Brahmā is born again in another millennium they are again manifest. In this way they are captivated by the spell of the material world. 

But those intelligent persons who take to Kṛṣṇa consciousness use the human life fully in the devotional service of the Lord, chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. 

Thus they transfer themselves, even in this life, to the spiritual planet of Kṛṣṇa and become eternally blissful there, not being subject to such rebirths.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 17/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 311: 08వ అధ్.,  శ్లో 20 /  Bhagavad-Gita - 311: Chap. 08, Ver. 20

🌹. శ్రీమద్భగవద్గీత - 311 / Bhagavad-Gita - 311 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 20 🌴

20.  పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్య క్తాత్సనాతన: |
య: స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||

🌷. తాత్పర్యం :
వ్యక్తావ్యక్తములయ్యెడి ఈ భౌతికప్రకృతి కన్నను పరమైనదియు, శాశ్వతమైనదియు నగు అవ్యక్తప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును, నాశరహితమును అయియున్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అదిమాత్రము యథాతథముగా నిలిచియుండును.

🌷. భాష్యము :
శ్రీకృష్ణుని ఉత్కృష్టమైన అంతరంగశక్తి దివ్యమును, శాశ్వతమును అయియున్నది. బ్రహ్మదేవుని పగటి సమయమున వ్యక్తమై, రాత్రికాలమున నశించు భౌతికప్రకృతి యందలి మార్పులకు అది అతీతమైనది. 

అనగా శ్రీకృష్ణుని ఉన్నతశక్తి భౌతికప్రకృతి గుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. ఉన్నత ప్రకృతి మరియు న్యునప్రకృతి యనునవి ఇదివరకే సప్తమాధ్యాయమున వివరింపబడినవి. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 311 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 20 🌴

20 . paras tasmāt tu bhāvo ’nyo
’vyakto ’vyaktāt sanātanaḥ
yaḥ sa sarveṣu bhūteṣu
naśyatsu na vinaśyati

🌷 Translation : 
Yet there is another unmanifest nature, which is eternal and is transcendental to this manifested and unmanifested matter. It is supreme and is never annihilated. When all in this world is annihilated, that part remains as it is.

🌹 Purport :
Kṛṣṇa’s superior, spiritual energy is transcendental and eternal. It is beyond all the changes of material nature, which is manifest and annihilated during the days and nights of Brahmā. 

Kṛṣṇa’s superior energy is completely opposite in quality to material nature. Superior and inferior nature are explained in the Seventh Chapter.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 18/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 312: 08వ అధ్.,  శ్లో 21 /  Bhagavad-Gita - 312: Chap. 08, Ver. 21

🌹. శ్రీమద్భగవద్గీత - 312 / Bhagavad-Gita - 312 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 21 🌴

21.  అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు: పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||

🌷. తాత్పర్యం :
వేదాంతులు దేనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము సర్వకోరికలు ఈడేరునటువంటి “చింతామణి” ధామముగా బ్రహ్మసంహిత యందు వర్ణింపబడినది. గోలోకబృందావనముగా తెలియబడు ఆ శ్రీకృష్ణదామము చింతామణి భరితమైన సౌధములతో అలరారుచుండును. 

కోరిన ఎత్తి భక్ష్యమునైనను సమకూర్చు కల్పవృక్షములను మరియు అక్షయముగా పాలనొసగు సురభినామ గోవులను కలిగియుండెడి ఆ ధామమున శ్రీకృష్ణుడు లక్షలకొలది లక్ష్ములచే సేవించబడుచుండును. ఆదిదేవుడును మరియు సర్వకారణకారణుడును అగు గోవిందునిగా అచ్చట అతడు పిలువబడును. 

మధురముగా వేణువునూదును (వేణుంక్వణన్తమ్) అతని దివ్యరూపము సర్వజగన్మోహనమై యుండును. అతని కన్నులు కలువపూల రెక్కలను బోలి, దేహఛాయ నీలమేఘవర్ణమును బోలియుండును. 

పరమాకర్షకుకుడైన అతని సౌందర్యము వేలాది మన్మథులను అతిశయించునంత మనోహారముగా నుండును. పీతాంబారమును ధరించియుండు ఆ భగవానుడు మెడలో దివ్యమైన పూమాలను, శిరమున పింఛమును దాల్చియుండును. 

ఆధ్యాత్మికజగమున అత్యంత ఉన్నతమైన తన ధామము (గోలోకబృందావనము) గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇచ్చట సూచనగా మాత్రమే తెలిపియున్నాడు. దాని విస్తృతవివరణము బ్రహ్మసంహిత యందు ఒసగబడినది. 

భగవద్ధామమునకు పరమైనది వేరొకటి లేదనియు, అదియే పరమగమ్యస్థానమనియు వేదవాజ్మయము (కఠోపనిషత్తు 1.3.11) తెలియజేయుచున్నది (పురుషాన్నపరం కిఞ్చిత్ సా కాష్టా పరమా గతి:). 

దానిని పొందినవాడు ఈ భౌతికజగమునకు తిరిగిరాదు. ఒకే లక్షణములను కలిగియున్నందున ఆ ధామమును మరియు శ్రీకృష్ణునకు ఎట్టి భేదము లేదు.

 డిల్లీనగరమునకు ఈశాన్యముగా తొంబదిమైళ్ళ దూరములోనున్న బృందావనము పుణ్యభూమి ఆధ్యాత్మికజగమునందలి ఆ గోలోకబృందావనము ప్రతిరూపము. శ్రీకృష్ణభగవానుడు ధరత్రిపై అవతరించినపుడు మధురామండలము నందలి ఎనుబదినాలుగు చదరపుమైళ్ళ విస్తీర్ణముగల ఆ బృందావనభూమి యందే క్రీడించియుండెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 312 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 21 🌴

21 . avyakto ’kṣara ity uktas
tam āhuḥ paramāṁ gatim
yaṁ prāpya na nivartante
tad dhāma paramaṁ mama

🌷 Translation : 
That which the Vedāntists describe as unmanifest and infallible, that which is known as the supreme destination, that place from which, having attained it, one never returns – that is My supreme abode.

🌹 Purport :
The supreme abode of the Personality of Godhead, Kṛṣṇa, is described in the Brahma-saṁhitā as cintāmaṇi-dhāma, a place where all desires are fulfilled. The supreme abode of Lord Kṛṣṇa, known as Goloka Vṛndāvana, is full of palaces made of touchstone. 

There are also trees, called “desire trees,” that supply any type of eatable upon demand, and there are cows, known as surabhi cows, which supply a limitless supply of milk. 

In this abode, the Lord is served by hundreds of thousands of goddesses of fortune (Lakṣmīs), and He is called Govinda, the primal Lord and the cause of all causes. The Lord is accustomed to blow His flute (veṇuṁ kvaṇantam). 

His transcendental form is the most attractive in all the worlds – His eyes are like lotus petals, and the color of His body is like the color of clouds. He is so attractive that His beauty excels that of thousands of Cupids. 

He wears saffron cloth, a garland around His neck and a peacock feather in His hair. In the Bhagavad-gītā Lord Kṛṣṇa gives only a small hint of His personal abode, Goloka Vṛndāvana, which is the supermost planet in the spiritual kingdom. 

A vivid description is given in the Brahma-saṁhitā. Vedic literatures (Kaṭha Upaniṣad 1.3.11) state that there is nothing superior to the abode of the Supreme Godhead, and that that abode is the ultimate destination (puruṣān na paraṁ kiñcit sā kāṣṭhā paramā gatiḥ). 

When one attains to it, he never returns to the material world. Kṛṣṇa’s supreme abode and Kṛṣṇa Himself are nondifferent, being of the same quality. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 19/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 313: 08వ అధ్.,  శ్లో 22 /  Bhagavad-Gita - 313: Chap. 08, Ver. 22

🌹. శ్రీమద్భగవద్గీత - 313 / Bhagavad-Gita - 313 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 22 🌴

22.  పురుష: స పర: పార్థ భక్త్యా లభ్యస్త్యనన్యయా |
యస్యాన్త:స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ||

🌷. తాత్పర్యం :
సర్వులకన్నను అధికుడైన దేవదేవుడు అనన్యభక్తి చేతనే పొందబడును. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపియై యున్నాడు మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగియున్నది.

🌷. భాష్యము :
పరమగమ్యస్థానము పరమపురుషుడైన శ్రీకృష్ణుని ధామమే యని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. 

అది పునరావృత్తిరహితముగు స్థానము. అట్టి ధామమును బ్రహ్మసంహిత “ఆనందచిన్మయరసము” అని వర్ణించినది. అనగా అచ్చట ప్రతిదియు దివ్యానందపూర్ణమై యుండును. అచ్చట వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనందపూర్ణమేగాని భౌతికము కాదు. 

సప్తమాధ్యాయమున తెలుపబడినట్లు అచ్చట ప్రకటితమగు సర్వము శ్రీకృష్ణభగవానుని ఆధ్యాత్మికశక్తికి సంబంధించినదే గావున అచ్చటి వైవిధ్యము ఆ భగవానుని విస్తారమే అయి యున్నది. 

ఇక భౌతికజగమునకు సంబంధించినంత వరకు అతడు స్వధామమునందే సదా నిలిచియున్నను తన భౌతికశక్తి ద్వారా సర్వత్రా వ్యాపించియుండును. అనగా శ్రీకృష్ణభగవానుడు తన ఆధ్యాత్మికశక్తి మరియు భౌతికశక్తుల ద్వారా ఆధ్యాత్మిక, భౌతికముల యందంతటను నిలిచియుండును. 

“యస్యాన్త:స్థాని” యనగా సర్వము అతని యందే నిలిచియున్నదని భావము. అనగా ప్రతిదియు అతని ఆధ్యాత్మికశక్తియందో లేక భౌతికశక్తియందో నిలిచియుండును. ఈ రెండుశక్తుల ద్వారానే ఆ దేవదేవుడు సర్వవ్యాపియై యున్నాడు.

“భక్త్యా” అను పదము ద్వారా ఇట స్పష్టముగా సూచింపబడినట్లు దివ్యమైన కృష్ణలోకమునందు గాని, అసంఖ్యాకములుగా నున్న వైకుంటలోకములందు గాని ప్రవేశుంచుట కేవలము భక్తి ద్వారానే సాధ్యము కాగలదు. భగవద్దామమును పొందుటకు ఇతరమైన ఏ పద్దతియు సహకరింపదు. 

అట్టి ధామము మరియు భగవానుని గోపాలతాపన్యుపనిషత్తు (3.2) “ఏకోవశీ సర్వగ: కృష్ణ:” యని వర్ణించినది. అనగా ఆ దివ్యధామమున శ్రీకృష్ణనామాంకితుడైన దేవదేవుడు ఒక్కడే కలడు. అతడు దివ్యకరుణాపూర్ణుడు. ఒక్కనిగానే స్థితుడై యున్నప్పటికిని ఆ దేవదేవుడు కోట్లాది సంపూర్ణరూపములలో విస్తరించియుండును. 

నిశ్చలముగా నిలిచియున్నను ఫలములను, పుష్పములను, పత్రములను కలిగయుండెడి వృక్షముతో అట్టి దేవదేవుని వేదములు పోల్చుచున్నవి. శ్రీకృష్ణుని సంపూర్ణాంశములైన వైకుంఠాధిపతులు చతుర్బాహులు కలిగి పురుషోత్తముడు, త్రివిక్రముడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్ధనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు అది పలునామములతో పిలువబడుదురు.

శ్రీకృష్ణభగవానుడు తన దివ్యధామమైన గోలోకబృందావనమున సదా నిలిచియున్నను సర్వత్రా వ్యాపించియుండుట చేత సమస్తము సలక్షణముగా జరుగుచుండునని బ్రహ్మసంహిత (5.37) “గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూత:” యని నిర్ధారించియున్నది. 

వేదములలో (శ్వేతాశ్వతరోపనిషత్తు 6.8) తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుడు అత్యంత దూరములలో నున్నను అతని సర్వవ్యాపకశక్తులు జగమునందలి సమస్తమును క్రమపద్ధతిలో ఎటువంటి పొరపాటు జరుగకుండా నిర్వహించుచున్నవి (పరాస్యశక్తి: వివిధైవ శ్రూయతే స్వాభావకీ జ్ఞానబలక్రియా చ).
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 313 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 22 🌴

22 . puruṣaḥ sa paraḥ pārtha
bhaktyā labhyas tv ananyayā
yasyāntaḥ-sthāni bhūtāni
yena sarvam idaṁ tatam

🌷 Translation : 
The Supreme Personality of Godhead, who is greater than all, is attainable by unalloyed devotion. Although He is present in His abode, He is all-pervading, and everything is situated within Him.

🌹 Purport :
It is here clearly stated that the supreme destination, from which there is no return, is the abode of Kṛṣṇa, the Supreme Person. The Brahma-saṁhitā describes this supreme abode as ānanda-cinmaya-rasa, a place where everything is full of spiritual bliss. 

All the variegatedness manifest there is of the quality of spiritual bliss – nothing there is material. 

That variegatedness is expanded as the spiritual expansion of the Supreme Godhead Himself, for the manifestation there is totally of the spiritual energy, as explained in Chapter Seven. 

As far as this material world is concerned, although the Lord is always in His supreme abode, He is nonetheless all-pervading by His material energy. 

So by His spiritual and material energies He is present everywhere – both in the material and in the spiritual universes. 

Yasyāntaḥ-sthāni means that everything is sustained within Him, within either His spiritual or material energy. The Lord is all-pervading by these two energies.

To enter Kṛṣṇa’s supreme abode or the innumerable Vaikuṇṭha planets is possible only by bhakti, devotional service, as clearly indicated here by the word bhaktyā. No other process can help one attain that supreme abode.

 The Vedas (Gopāla-tāpanī Upaniṣad 1.21) also describe the supreme abode and the Supreme Personality of Godhead. Eko vaśī sarva-gaḥ kṛṣṇaḥ.

In that abode there is only one Supreme Personality of Godhead, whose name is Kṛṣṇa. He is the supreme merciful Deity, and although situated there as one He has expanded Himself into millions and millions of plenary expansions.

The Vedas compare the Lord to a tree standing still yet bearing many varieties of fruits, flowers and changing leaves. The plenary expansions of the Lord who preside over the Vaikuṇṭha planets are four-armed, and they are known by a variety of names – Puruṣottama, Trivikrama, Keśava, Mādhava, Aniruddha, Hṛṣīkeśa, Saṅkarṣaṇa, Pradyumna, Śrīdhara, Vāsudeva, Dāmodara, Janārdana, Nārāyaṇa, Vāmana, Padmanābha, etc.

The Brahma-saṁhitā (5.37) also confirms that although the Lord is always in the supreme abode, Goloka Vṛndāvana, He is all-pervading, so that everything is going on nicely (goloka eva nivasaty akhilātma-bhūtaḥ).

As stated in the Vedas (Śvetāśvatara Upaniṣad 6.8), parāsya śaktir vividhaiva śrūyate/ svābhāvikī jñāna-bala-kriyā ca:

His energies are so expansive that they systematically conduct everything in the cosmic manifestation without a flaw, although the Supreme Lord is far, far away.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 20/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 314: 08వ అధ్.,  శ్లో 23 /  Bhagavad-Gita - 314: Chap. 08, Ver. 23

🌹. శ్రీమద్భగవద్గీత - 314 / Bhagavad-Gita - 314 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 23 🌴

23.  యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగిన: |
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||

🌷. తాత్పర్యం :

ఓ భరతవంశశ్రేష్టుడా! ఏయే కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగనునో లేక తిరిగిరాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను.

🌷. భాష్యము :
సంపూర్ణశరణాగతులైన అనన్యభక్తులు తమ దేహత్యాగము ఎప్పుడు జరుగునున్న విషయము గాని, ఈ విధముగా జరుగనున్నదనెడి విషయము గాని పట్టించుకొనరు. సర్వమును కేవలము శ్రీకృష్ణుని చేతులలో వదలి సులభముగా, నిశ్చింతగా, సుఖముగా వారు కృష్ణధామమును చేరుదురు. 

కాని అనన్యభక్తులు గాక ఆత్మానుభమునకై కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగాది పద్ధతులపై ఆధారపడెడివారు మాత్రము తగిన సమయమునందే దేహత్యాగము చేయవలసియుండును. దానిపైననే వారు ఈ జన్మ, మృత్యువులు కలిగిన జగమునాకు తిరిగి వచ్చుటయో లేక తిరిగి రాకపోవుటయో ఆధారపడియుండును.

యోగియైనవాడు పూర్ణత్వమును సాధించినచో ఈ భౌతికజగమును వీడుటకు సరియైన స్థితిని, సమయమును నిర్ణయించుకొనగలడు. కాని పూర్ణుడుగాని వాని సఫలత యాదృచ్చికముగా తగిన సమయమున జరుగు అతని దేహత్యాగముపై ఆధారపది యుండును. 

ఏ సమయమున మరణించినచో తిరిగి వెనుకకు రావలసిన అవసరము కలుగదో అట్టి తగిన సమయములను గూర్చి శ్రీకృష్ణభగవానుడు రాబోవు శ్లోకములో వివరింపనున్నాడు. 

ఆచార్యులైన శ్రీ బలదేవవిద్యాభూషణుల వ్యాఖ్యానము ననుసరించి “కాలము” అను సంస్కృతపదము ఇచ్చట కాలము యొక్క అధిష్టానదేవతను సూచించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 314 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 23 🌴

23 . yatra kāle tv anāvṛttim
āvṛttiṁ caiva yoginaḥ
prayātā yānti taṁ kālaṁ
vakṣyāmi bharatarṣabha

🌷 Translation : 
O best of the Bhāratas, I shall now explain to you the different times at which, passing away from this world, the yogī does or does not come back.

🌹 Purport :
The unalloyed devotees of the Supreme Lord, who are totally surrendered souls, do not care when they leave their bodies or by what method. They leave everything in Kṛṣṇa’s hands and so easily and happily return to Godhead. 

But those who are not unalloyed devotees and who depend instead on such methods of spiritual realization as karma-yoga, jñāna-yoga and haṭha-yoga must leave the body at a suitable time in order to be sure of whether or not they will return to the world of birth and death.

If the yogī is perfect he can select the time and situation for leaving this material world. 

But if he is not so expert his success depends on his accidentally passing away at a certain suitable time. The suitable times at which one passes away and does not come back are explained by the Lord in the next verse. 

According to Ācārya Baladeva Vidyābhūṣaṇa, the Sanskrit word kāla used herein refers to the presiding deity of time.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 21/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 315: 08వ అధ్.,  శ్లో 24 /  Bhagavad-Gita - 315: Chap. 08, Ver. 24

🌹. శ్రీమద్భగవద్గీత - 315 / Bhagavad-Gita - 315 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 24 🌴

24.  అగ్నిర్జ్యోతిరహ: శుక్ల: షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనా: ||

🌷. తాత్పర్యం :
పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మవిదులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతి యందు, పగటియందలి ఏదేని శుభఘడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు.

🌷. భాష్యము :
అగ్ని, కాంతి, పగలు, శుక్లపక్షము అనువాటిని తెలిపినప్పుడు వానికి అధిష్టానదేవతలు కలరనియు, వారు ఆత్మ నిష్క్రమించుటకు తగిన ఏర్పాట్లు చేయుదురనియు మనము అవగతము చేసికొనవలెను. మరణ సమయమున మనస్సు జీవుని వేరొక జన్మను పొందునట్లుగా చేయును. 

కాని పైన తెలుపబడిన సమయములందు యాదృచ్చికముగా గాని, ప్రయత్నపుర్వకముగా గాని దేహత్యాగము చేసిడివారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలరు. 

యోగాభ్యాసమునందు నిష్ణాతులైన యోగులు తాము దేహత్యాగము చేసెడి స్థలమును మరియు సమయమును నిర్ణియించుకొనగలరుగాని ఇతరులకు అది సాధ్యము కాదు. 

ఒకవేళ యాదృచ్చికముగా వారు ఆ పుణ్యఘడియలలో మరణించినచో జనన,మరణచక్రమున తిరిగి ప్రవేశింపరు. అట్లు కానిచో వారు తిరిగి జన్మను పొందక తప్పదు. 

కాని కృష్ణభావనాయుతుడైన భక్తునకు శుభాశుభ సమయములందు దేహమును విడచినను, యాదృచ్చికముగా లేక పూర్వనిర్దేశ ప్రకారముగా దేహత్యాగము చేసినను వెనుకకు మరలివచ్చుట యనెడి భయము ఏమాత్రము ఉండదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 315 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 24 🌴

24 . agnir jyotir ahaḥ śuklaḥ
ṣaṇ-māsā uttarāyaṇam
tatra prayātā gacchanti
brahma brahma-vido janāḥ

🌷 Translation : 
Those who know the Supreme Brahman attain that Supreme by passing away from the world during the influence of the fiery god, in the light, at an auspicious moment of the day, during the fortnight of the waxing moon, or during the six months when the sun travels in the north.

🌹 Purport :
When fire, light, day and the fortnight of the moon are mentioned, it is to be understood that over all of them there are various presiding deities who make arrangements for the passage of the soul. 

At the time of death, the mind carries one on the path to a new life. If one leaves the body at the time designated above, either accidentally or by arrangement, it is possible for him to attain the impersonal brahma-jyotir. 

Mystics who are advanced in yoga practice can arrange the time and place to leave the body. 

Others have no control – if by accident they leave at an auspicious moment, then they will not return to the cycle of birth and death, but otherwise there is every possibility that they will have to return. 

However, for the pure devotee in Kṛṣṇa consciousness, there is no fear of returning, whether he leaves the body at an auspicious or inauspicious moment, by accident or arrangement.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 22/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 316: 08వ అధ్.,  శ్లో 25 /  Bhagavad-Gita - 316: Chap. 08, Ver. 25

🌹. శ్రీమద్భగవద్గీత - 316 / Bhagavad-Gita - 316 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 25 🌴

25.  ధూమో రాత్రిస్తథా కృష్ణ: షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ||

🌷. తాత్పర్యం :
ధూమమునందు, రాత్రియందు, కృష్ణపక్షమునందు, సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగివచ్చును.

🌷. భాష్యము :
భూలోకమున కామ్యకర్మలు మరియు యజ్ఞవిధానములందు నిష్ణాతులైనవారు మరణానంతరము చంద్రలోకమును పొందుదురని శ్రీమద్భాగవతము నందలి మూడవస్కంధమున కపిలముని తెలిపెను. 

అట్టి ఉన్నతులు చంద్రలోకమున దేవతల గణనము ప్రకారము పదివేలసంవత్సరములు జీవించి, సోమరసమును పానము చేయుచు జీవితమును అనుభవింతురు. కాని అంత్యమున వారు మరల భులోకమునకే తిరిగి వత్తురు. 

దీని భావమేమనగా జడేంద్రియములచే అనుభూతము కాకున్నను ఉన్నతులైన జీవులు చంద్రలోకమున నిలిచియున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 316 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 25 🌴

25 . dhūmo rātris tathā kṛṣṇaḥ
ṣaṇ-māsā dakṣiṇāyanam
tatra cāndramasaṁ jyotir
yogī prāpya nivartate

🌷 Translation : 
The mystic who passes away from this world during the smoke, the night, the fortnight of the waning moon, or the six months when the sun passes to the south reaches the moon planet but again comes back.

🌹 Purport :
In the Third Canto of Śrīmad-Bhāgavatam Kapila Muni mentions that those who are expert in fruitive activities and sacrificial methods on earth attain to the moon at death. 

These elevated souls live on the moon for about 10,000 years (by demigod calculations) and enjoy life by drinking soma-rasa. They eventually return to earth. This means that on the moon there are higher classes of living beings, though they may not be perceived by the gross senses.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 23/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 317: 08వ అధ్.,  శ్లో 26 /  Bhagavad-Gita - 317: Chap. 08, Ver. 26

🌹. శ్రీమద్భగవద్గీత - 317 / Bhagavad-Gita - 317 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 26 🌴

26.  శుక్లకృష్ణే గతీ హ్యేతే జగత: శాశ్వతే మతే |
 ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పున: ||

🌷. తాత్పర్యం :
ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయము ననుసరించి శుక్ల, కృష్ణములనెడి రెండు మార్గములు కలవు. శుక్లమార్గమునందు మరణించువాడు తిరిగిరాకుండును. కాని చీకటిమార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగివచ్చును.

🌷. భాష్యము :
మరణము మరియు పునరాగమనములను ఇదే వివరణను శ్రీబలదేవవిద్యాభూషణులు ఛాందోగ్యోపనిషత్తు (5.10.3-5) నుండి ఉదాహరించిరి. 

కామ్యకర్మరతులు, తాత్వికకల్పనాపరులు అనంతకాలముగా ఇట్టి మరణము మరియు పునరాగమనములందు తగుల్కొనియున్నారు. 

శ్రీకృష్ణుని శరణుజొచ్చని కారణముగా వారెన్నడును దివ్యమైన చరమమోక్షమును పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 317 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 26 🌴

26 . śukla-kṛṣṇe gatī hy ete
jagataḥ śāśvate mate
ekayā yāty anāvṛttim
anyayāvartate punaḥ

🌷 Translation : 
According to Vedic opinion, there are two ways of passing from this world – one in light and one in darkness. When one passes in light, he does not come back; but when one passes in darkness, he returns.

🌹 Purport :
The same description of departure and return is quoted by Ācārya Baladeva Vidyābhūṣaṇa from the Chāndogya Upaniṣad (5.10.3–5). 

Those who are fruitive laborers and philosophical speculators from time immemorial are constantly going and coming. 

Actually they do not attain ultimate salvation, for they do not surrender to Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 24/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 318: 08వ అధ్.,  శ్లో 27 /  Bhagavad-Gita - 318: Chap. 08, Ver. 27

🌹. శ్రీమద్భగవద్గీత - 318 / Bhagavad-Gita - 318 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 27 🌴

27.  నైతే సృతీ పార్థ జాన న్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ||

🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! భక్తులు ఈ రెండు మార్గములు నెరిగినప్పటికిని ఎన్నడును మోహము నొందరు. కనుక నీవు భక్తియందు సదా స్థిరుడవగుము.

🌷. భాష్యము :
భౌతికజగమును వీడునప్పుడు ఆత్మ అనుసరించెడి వివిధమార్గముల యెడ కలతనొందవలదని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించుచున్నాడు. భక్తుడైనవాడు తాను యాదృచ్చికముగా మరణింతునాయని గాని లేదా పూర్వనిర్దేశము ననుసరించి మరణింతునాయని గాని చింతింపరాదు. 

అతడు కేవలము కృష్ణభక్తిరసభావన యందు స్థిరముగా నిలిచి హరేకృష్ణ మాహామంత్రమును సదా జపించవలెను. పైన తెలిపిన రెండుమార్గములలో దేనిని గూర్చి చింతించినను అది కేవలము కలతకు మాత్రమే కారణమని అతడు తెలిసియుండవలెను. 

శ్రీకృష్ణభగవానుని సేవలో సదా అనురక్తమగుటయే కృష్ణభక్తిభావనలో లీనమగుటకు ఉత్తమమమైన మార్గము. 

అదియే భగవద్దామమునకు మనుజుని పథమును సురక్షితము, నిశ్చితము, సరళము చేయగలదు. “యోగయుక్త” అను పదము ఈ శ్లోకములో ముఖ్యమైనది. యోగమునందు స్థితిని పొందినవాడు కృష్ణభక్తిభావనలో నిలిచి తన కర్మలన్నింటిని కొనసాగించును. 

కనుకనే ప్రతియొక్కరు భౌతికకర్మ కలాపముల యెడ అనాసక్తులై, కృష్ణభక్తిభావనలోనే సర్వము నొనరించవలెనని శ్రీ రూపగోస్వామి తెలిపిరి (అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజత: ). ఇట్టి “యుక్తవైరాగ్యము” చేతనే ప్రతియొక్కరు పూర్ణత్వమును సాధింపగలరు. 

కనుకనే భక్తుడెన్నడును ఈ వివిధమార్గములచే కలతనొందడు. భక్తియోగము ద్వారా తాను దివ్య దామమునకు చేరుట తథ్యమణి అతడు తెలిసియుండుటయే అందులకు కారణము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 318 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 27 🌴

27 . naite sṛtī pārtha jānan
yogī muhyati kaścana
tasmāt sarveṣu kāleṣu
yoga-yukto bhavārjuna

🌷 Translation : 
Although the devotees know these two paths, O Arjuna, they are never bewildered. Therefore be always fixed in devotion.

🌹 Purport :
Kṛṣṇa is here advising Arjuna that he should not be disturbed by the different paths the soul can take when leaving the material world. A devotee of the Supreme Lord should not worry whether he will depart by arrangement or by accident. 

The devotee should be firmly established in Kṛṣṇa consciousness and chant Hare Kṛṣṇa. He should know that concern over either of these two paths is troublesome. 

The best way to be absorbed in Kṛṣṇa consciousness is to be always dovetailed in His service, and this will make one’s path to the spiritual kingdom safe, certain and direct. 

The word yoga-yukta is especially significant in this verse. One who is firm in yoga is constantly engaged in Kṛṣṇa consciousness in all his activities. 

Śrī Rūpa Gosvāmī advises, anāsaktasya viṣayān yathārham upayuñjataḥ: one should be unattached in material affairs and do everything in Kṛṣṇa consciousness. 

By this system, which is called yukta-vairāgya, one attains perfection. Therefore the devotee is not disturbed by these descriptions, because he knows that his passage to the supreme abode is guaranteed by devotional service.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 25/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 319: 08వ అధ్.,  శ్లో 28 /  Bhagavad-Gita - 319: Chap. 08, Ver. 28

🌹. శ్రీమద్భగవద్గీత - 319 / Bhagavad-Gita - 319 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం  - 28 🌴

28.  వేదేషు యజ్ఞేషు తప:సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరంస్థానముపైతి చాద్యమ్ ||

🌷. తాత్పర్యం :
వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్వికకర్మలను మరియు కామ్యకర్మలను ఒనరించుట వలన కలుగు ఫలితములు భక్తిమార్గము చేపట్టి మనుజునికి లభింపకపోవు. కేవలము భక్తియుతసేవ నొనరించుట ద్వారా అతడు వీటినన్నింటిని పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధామమును సైతము చేరగలడు.

🌷. భాష్యము :
ఈ శ్లోకము కృష్ణభక్తిరసభావనపు మరియు భక్తియుతసేవను గూర్చి ప్రత్యేకముగా చర్చించిన సప్తమ, అష్టమాధ్యాయముల సారాంశమై యున్నది. 

ప్రతియొక్కరు ఆధ్యాత్మికగురువు నిర్దేశమునందు వేదాధ్యనము కావించును ఆయన సన్నిధిలో పలువిధములైన తపస్సులను నిర్వహింపవలసియున్నది. బ్రహ్మచారియైనవాడు గుర్వాశ్రయమున సేవకునిగా జీవించును, ఇంటింట భిక్షను స్వీకరించి గురువునకు అర్పింపవలెను. 

గురువుగారి ఆజ్ఞపైననే ఆహారమును స్వీకరించుచు, ఒకవేళ ఆయన భోజమునకు పిలువకున్నచో ఉపవసింపవలెను. ఇవియే బ్రహ్మచర్యమును ననుసరించువానికి విధింపబడిన కొన్ని వేదనియమములు. 

విద్యార్థి ఆ విధముగా గురువు చెంత ఐదు నుండు ఇరువది సంవత్సరముల కాలము వేదాధ్యయనము చేసిన పిమ్మట సమగ్రలక్షణములు కలిగిన మనుజునిగా రూపొందును. 

వాస్తవమునకు వేదాధ్యయనమనునది విలాసవంతులగు కల్పనాపరులకు కొరకు గాక, మనుజుని ఉత్తమ శీలాభివృద్ధికై ఉద్దేశింపబడినది. ఆ శిక్షణము పొందిన పిమ్మట గృహస్థాశ్రమము నందు ప్రవేశించుటకు బ్రహ్మచారి అవకాశమొసగబడును. 

గృహస్థునిగా అతడు తన మరింత ఆత్మవికాసమునకు యజ్ఞములను చేయుచు,గీత యందు తెలిపినరీతిగా దేశ, కాల పాత్రులను గూర్చియు మరియు సత్త్వరజస్తమోగుణపూర్ణమైన దానములను గూర్చియు తెలిసి దానము చేయవలసియుండును. 

గృహస్థధర్మము నుండు అతడు వానప్రస్థాశ్రమమును స్వీకరించిన పిమ్మట వనములందు వసించుట, వల్కములను ధరించుట, శిరోజములను తొలగించుకొనకుండుట వంటి పలుతపముల నాచరింపవలెను. 

ఈ విధముగా బ్రహ్మచర్యాశ్రమమును, గృహస్థాశ్రమమును, వానప్రస్థాశ్రమమును, ఆ పిదప సన్న్యాసాశ్రమమును చక్కగా నిర్వహించుట ద్వారా మనుజుడు పూర్ణత్వస్థాయికి ఉద్ధరింపబడును. అట్టివారిలో కొందరు స్వర్గాది ఉన్నతలోకములను పొందుదురు. 

వారు తమ అభ్యాసములో మరింత ఉన్నతిని సాధించినపుడు ఆధ్యాత్మికజగమునందు (నిరాకారబ్రహ్మజ్యోతి యందు గాని లేదా వైకుంటలోకములు, కృష్ణలోకమునందు గాని ముక్తిని బడయగలరు. ఈ మార్గమే వేదవాజ్మయమునందు నిర్దేశింపబడినది.

కాని కృష్ణభక్తిరసభావనపు విశిష్టత యేమనగా కేవలము శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ నొనర్చుట ద్వారా మనుజుడు సర్వాశ్రమముల యందలి సర్వకర్మలను ఒక్కమారుగా అతిశయించిన వాడగుచున్నాడు.

ఈ అధ్యాయమున మరియు సప్తమాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు ఒసగిన ఉపదేశములను ప్రతియొక్కరు అవగాహన చేసికొనవలెనని “ఇదం విదిత్వా” యను పదము సూచించుచున్నది. 

ఈ అధ్యాయములను పాండిత్యము ద్వారా లేదా ఊహాకల్పనల ద్వారా కాక, భక్తుల సాంగత్యములో శ్రవణము చేయుట ద్వారా ప్రతివారును అవగాహన చేసికొనుటకు ప్రయత్నించవలెను. గీత యందలి సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయము వరకు గల ఆరు అధ్యాయములు భగవద్గీత సారమై యున్నవి. 

మొదటి ఆరు అధ్యాయములు మరియు చివరి ఆరు అధ్యాయములు ఆచ్చాదానలుగా కలిగిన ఈ నడుమ ఆరు అధ్యాయములు శ్రీకృష్ణభగవానునిచే ప్రత్యేకముగా రక్షింపబడుచున్నవి. 

భక్తుల సంగమములో భగవద్గీతను ( ముఖ్యముగా ఈ నడుమ ఆరు అధ్యాయములను) అవగాహన చేసికొనగలిగిన భాగ్యము కలిగినచో మనుజుని జీవితము తపస్సులను, యజ్ఞములను, దానములను, ఊహాకల్పనలను అతిశయించి సఫలమగును. ఏలయన వాని ద్వారా కలుగు ఫలముల నన్నింటిని మనుజుడు కేవలము కృష్ణభక్తిరసభావన యందు నిలిచి సులభముగా పొందగలడు.

భగవద్గీత యందు ఏ కొద్దిపాటి శ్రద్దయున్నను మనుజుడు దానిని భక్తుల నుండియే నేర్వవలెను. ఏలయన భగవద్గీత భక్తులకు మాత్రమే పూర్ణముగా అవగతమగుననియు, ఇతరులెవ్వరును దాని ముఖ్యోద్దేశమును తెలియజాలరనియు చతుర్థాధ్యాయపు ఆరంభములో తెలుపబడినది. కనుకనే గీతను కృష్ణభక్తుని నుండి మాత్రమే నేర్వవలెను గాని, మానసికకల్పనాపరుల నుండి కాదు. ఇదియే మనుజుని శ్రద్ధకు నిదర్శనమై యున్నది. 

భక్తుల సాంగత్యము కొరకై అన్వేషించి దానిని పొందినపుడే మనుజుడు గీతాధ్యయనమును వాస్తవముగా ఆరంభించి దానిని అవగతము చేసికొనగలడు. భక్తుల సాంగత్యములో పురోగతి నొందుట ద్వారా అతడు భక్తియుతసేవలో నెలకొనగలడు. 

శ్రీమద్భగవద్గీత యందలి “భాగవత్ప్రాప్తి” అను అష్టమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 319 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 28 🌴

28 . vedeṣu yajñeṣu tapaḥsu caiva
dāneṣu yat puṇya-phalaṁ pradiṣṭam
atyeti tat sarvam idaṁ viditvā
yogī paraṁ sthānam upaiti cādyam

🌷 Translation : 
A person who accepts the path of devotional service is not bereft of the results derived from studying the Vedas, performing sacrifices, undergoing austerities, giving charity or pursuing philosophical and fruitive activities. Simply by performing devotional service, he attains all these, and at the end he reaches the supreme eternal abode.

🌹 Purport :
This verse is the summation of the Seventh and Eighth chapters, which particularly deal with Kṛṣṇa consciousness and devotional service. One has to study the Vedas under the guidance of the spiritual master and undergo many austerities and penances while living under his care. 

A brahmacārī has to live in the home of the spiritual master just like a servant, and he must beg alms from door to door and bring them to the spiritual master. He takes food only under the master’s order, and if the master neglects to call the student for food that day, the student fasts. These are some of the Vedic principles for observing brahmacarya.

After the student studies the Vedas under the master for some time – at least from age five to twenty – he becomes a man of perfect character. Study of the Vedas is not meant for the recreation of armchair speculators, but for the formation of character. After this training, the brahmacārī is allowed to enter into household life and marry. 

When he is a householder, he has to perform many sacrifices so that he may achieve further enlightenment. He must also give charity according to the country, time and candidate, discriminating among charity in goodness, in passion and in ignorance, as described in Bhagavad-gītā. 

Then after retiring from household life, upon accepting the order of vānaprastha, he undergoes severe penances – living in forests, dressing with tree bark, not shaving, etc. By carrying out the orders of brahmacarya, householder life, vānaprastha and finally sannyāsa, one becomes elevated to the perfectional stage of life. 

Some are then elevated to the heavenly kingdoms, and when they become even more advanced they are liberated in the spiritual sky, either in the impersonal brahma-jyotir or in the Vaikuṇṭha planets or Kṛṣṇaloka. This is the path outlined by Vedic literatures.

The beauty of Kṛṣṇa consciousness, however, is that by one stroke, by engaging in devotional service, one can surpass all the rituals of the different orders of life.

The words idaṁ viditvā indicate that one should understand the instructions given by Śrī Kṛṣṇa in this chapter and the Seventh Chapter of Bhagavad-gītā. One should try to understand these chapters not by scholarship or mental speculation but by hearing them in association with devotees. 

Chapters Seven through Twelve are the essence of Bhagavad-gītā. The first six and the last six chapters are like coverings for the middle six chapters, which are especially protected by the Lord. 

If one is fortunate enough to understand Bhagavad-gītā – especially these middle six chapters – in the association of devotees, then his life at once becomes glorified beyond all penances, sacrifices, charities, speculations, etc., for one can achieve all the results of these activities simply by Kṛṣṇa consciousness.

One who has a little faith in Bhagavad-gītā should learn Bhagavad-gītā from a devotee, because in the beginning of the Fourth Chapter it is stated clearly that Bhagavad-gītā can be understood only by devotees; no one else can perfectly understand the purpose of Bhagavad-gītā. One should therefore learn Bhagavad-gītā from a devotee of Kṛṣṇa, not from mental speculators. This is a sign of faith.

Thus end the Bhaktivedanta Purports to the Eighth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Attaining the Supreme.

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 26/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 320: 09వ అధ్.,  శ్లో 01 /  Bhagavad-Gita - 320: Chap. 09, Ver. 01

🌹. శ్రీమద్భగవద్గీత - 320 / Bhagavad-Gita - 320 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 01 🌴

01.  శ్రీ భగవానువాచ
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే |
జ్ఞాన విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్షసే(శుభాత్ ||

🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవు నా యెడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమజ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతికస్థితి వలన కలిగెడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు.

🌷. భాష్యము :
భక్తుడు శ్రీకృష్ణభగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసినకొలది అధికముగా ఆత్మవికాసము నొందుచుండును. ఇట్టి శ్రవణవిధానమే శ్రీమద్భాగవతమునందు ఈ విధముగా ఉపదేశింపబడినది. “భాగవత్కథలు పరమశక్తిపుర్నములు. 

భవత్సంబంధిత విషయములు భక్తుల సంగములో చర్చించినచో అవి అనుభవమునకు వచ్చును. అనుభవపూర్వక జ్ఞానమైనందున ఇది ఎన్నడును మానసికకల్పనాపరులు లేదా లౌకికవిద్వాంసుల సాంగత్యమున సాధింపబడదు.”

భక్తులు సదా శ్రీకృష్ణభగవానుని సేవలో నిలిచియుందురు. ఆ విధముగా కృష్ణభక్తిభావనాయుతుడైన జీవుని మనోగతమును, శ్రద్ధను గమనించిన ఆ భగవానుడు భక్తుల సాంగత్యములో తనను గూర్చి సంపూర్ణముగా అవగతము చేసికొను బుద్ధిని అతనికి ప్రసాదించును. 

కృష్ణపరమగు చర్చ అత్యంత శక్తివంతమైనది. అదృష్టభాగుడైన మనుజుడు అట్టి సాంగత్యమును పొంది ఈ జ్ఞానమును అవగతము చేసికొనుటకు యత్నించినచో తప్పక ఆధ్యాత్మికానుభావమును బడయగలడు. 

తన శక్తిపూర్ణమైన సేవ యందు అత్యంత ఉన్నతస్థితిని అర్జునుడు బడయనట్లుగా చేయుటకే శ్రీకృష్ణుడు తానింతవరకు తెలియజేసిన విషయముల కన్నను పరమరహస్యమైనవానిని ఈ నవమాధ్యాయమున వివరింపనున్నాడు.

భగవద్గీతకు ఆదియైనటువంటి ప్రథమాధ్యాయము దాదాపు గీతకు ఉపోద్ఘాతము వంటిది కాగా, ద్వితీయ మరియు తృతీయ అధ్యయములలో వివరింపబడిన ఆధ్యాత్మికజ్ఞానము “గుహ్యము” అయియున్నది. 

సప్తమ, అష్టమాధ్యాయములలో చర్చించబడిన విషయములు ప్రత్యేకముగా భక్తియుతసేవకు సంబంధించినవై యున్నవి. కృష్ణభక్తిభావన యందు వికాసము కూర్చునవైనందున అవి “గుహ్యతరము” అయియున్నవి. 

కాని ఈ నవమాధ్యాయమున వివరింపబడిన విషయములు శుద్ధభక్తికి సంబంధించినవైనందున “గుహ్యతమము” అని పిలువబడుచున్నవి. శ్రీకృష్ణభగవానుని అట్టి గుహ్యతమ జ్ఞానమునందు స్థితిని పొందినవాడు సహజముగా దివ్యుడగును. తత్కారణముగా అతడు భౌతికజగమునందున్నను భౌతికక్లేశములను పొందడు. 

కనుకనే హృదయపూర్వకముగా కృష్ణసేవాభిలాషను కలిగియుండెడివాడు భౌతికబంధస్థితిలో నున్నప్పటికి ముక్తునిగానే భావింపబడవలెనని భక్తిరసామృతసింధువు తెలుపుచున్నది. అదేవిధముగా భగవద్గీత దశామాధ్యాయమునందు కూడా భక్తియందు నియుక్తుడైనవాడు ముక్తపురుషుడని తెలుపబడినది.

నవమాధ్యయపు ఈ ప్రథమశ్లోకమునకు ఒక వేశేష ప్రాధాన్యము కలదు. దీని యందలి “ఇదం జ్ఞానం” (ఈ జ్ఞానము) అణు పదము శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనములను నవవిధకర్మలను కూడిన భక్తియుతసేవను సూచించుచున్నది. 

భక్తియుతసేవ యందలి ఈ తొమ్మిది అంశములను అభ్యాసము చేయుట ద్వారా మనుజుడు ఆధ్యాత్మకచైతన్యము (కృష్ణభక్తిరసభావనము) బడయగలడు. 

ఆ విధముగా హృదయము భౌతికకల్మషము నుండి శుద్ధిపడినంతట అతడు కృష్ణపరజ్ఞానము సంపూర్ణముగా అవగాహన చేసికొనగలడు. వాస్తవమునకు జీవుడు భౌతికము కాదన్న భావనను పొందుట ఒక్కటే సరిపోదు. 

అది ఆధ్యాత్మికానుభావమునకు నాంది మాత్రమే. పిదప ప్రతియొక్కరు దేహపరములగు కర్మలు మరియు దేహాత్మభావన తొలగినవాని ఆధ్యాత్మికకర్మల నడుమ గల భేదమును చక్కగా గుర్తించవలెను.

శ్రీకృష్ణభగవానుని విభూతిపూర్ణశక్తి, ఉన్నత, న్యూనప్రకృతులుగా తెలియబడు అతని వివిధశక్తులు, భౌతికజగత్తు మొదలుగునవి సప్తమధ్యాయమున ఇదివరకే మనము చర్చించియున్నాము. ఇప్పుడు ఈ నవమాధ్యాయమున ఆ భగవానుని వైభవములు విశదీకరింపబడునున్నవి.

ఈ శ్లోకమున “అనసూయవే” అను పదము కూడా మిక్కిలి ప్రధానమైనది.

 సాధారణముగా గీతావ్యాఖ్యాతలు గొప్ప పండితులైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అసూయను కలిగియుందురు. మాహాపండితులైనవారు కుడా భగవద్గీతకు అసమంజసముగనే వ్యాఖ్యానములు వ్రాయుదురు. 

వారు కృష్ణుని యెడ అసూయను కలిగియున్నందున వారి వ్యాఖ్యానములు ప్రయోజనశూన్యములు. కేవలము భగవద్భక్తులు వ్రాసిన వ్యాఖ్యానములు మాత్రమే నిజమునకు ప్రామాణికములు. 

అసూయగ్రస్థుడైన వాడెవ్వడును భగవద్గీతను యథాతథముగా వివరింపలేడు మరియు కృష్ణుని గూర్చిన సమగ్రమైన జ్ఞానమును అందించలేడు. కృష్ణుని గూర్చి ఎరుగకయే విమర్శలు కావించువాడు నిక్కముగా మూర్ఖుడు. అటువంటి గీతా వ్యాఖ్యానములను జాగరూకతతో త్యజించవలెను. 

శ్రీకృష్ణుని పరమపవిత్రుడును, దివ్యపురుషుడును అగు దేవదేవునిగా అవగతము చేసికొనగలిగిన వానికి ఈ గీతాధ్యాయములు మిక్కిలి ప్రయోజనములు కాగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 320 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 01 🌴

01 . śrī-bhagavān uvāca
idaṁ tu te guhya-tamaṁ
pravakṣyāmy anasūyave
jñānaṁ vijñāna-sahitaṁ
yaj jñātvā mokṣyase ’śubhāt

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: My dear Arjuna, because you are never envious of Me, I shall impart to you this most confidential knowledge and realization, knowing which you shall be relieved of the miseries of material existence.

🌹 Purport :
As a devotee hears more and more about the Supreme Lord, he becomes enlightened. This hearing process is recommended in the Śrīmad-Bhāgavatam: 

“The messages of the Supreme Personality of Godhead are full of potencies, and these potencies can be realized if topics regarding the Supreme Godhead are discussed amongst devotees.” 

This cannot be achieved by the association of mental speculators or academic scholars, for it is realized knowledge.

The devotees are constantly engaged in the Supreme Lord’s service. 

The Lord understands the mentality and sincerity of a particular living entity who is engaged in Kṛṣṇa consciousness and gives him the intelligence to understand the science of Kṛṣṇa in the association of devotees. 

Discussion of Kṛṣṇa is very potent, and if a fortunate person has such association and tries to assimilate the knowledge, then he will surely make advancement toward spiritual realization. 

Lord Kṛṣṇa, in order to encourage Arjuna to higher and higher elevation in His potent service, describes in this Ninth Chapter matters more confidential than any He has already disclosed.

The very beginning of Bhagavad-gītā, the First Chapter, is more or less an introduction to the rest of the book; and in the Second and Third chapters, the spiritual knowledge described is called confidential. 

Topics discussed in the Seventh and Eighth chapters are specifically related to devotional service, and because they bring enlightenment in Kṛṣṇa consciousness, they are called more confidential. But the matters which are described in the Ninth Chapter deal with unalloyed, pure devotion. 

Therefore this is called the most confidential. One who is situated in the most confidential knowledge of Kṛṣṇa is naturally transcendental; he therefore has no material pangs, although he is in the material world. 

In the Bhakti-rasāmṛta-sindhu it is said that although one who has a sincere desire to render loving service to the Supreme Lord is situated in the conditional state of material existence, he is to be considered liberated. Similarly, we shall find in the Bhagavad-gītā, Tenth Chapter, that anyone who is engaged in that way is a liberated person.

Now this first verse has specific significance. The words idaṁ jñānam (“this knowledge”) refer to pure devotional service, which consists of nine different activities: hearing, chanting, remembering, serving, worshiping, praying, obeying, maintaining friendship and surrendering everything. 

By the practice of these nine elements of devotional service one is elevated to spiritual consciousness, Kṛṣṇa consciousness. 

When one’s heart is thus cleared of material contamination, one can understand this science of Kṛṣṇa. Simply to understand that a living entity is not material is not sufficient. 

That may be the beginning of spiritual realization, but one should recognize the difference between activities of the body and the spiritual activities of one who understands that he is not the body.

The Sanskrit word anasūyave in this verse is also very significant. Generally the commentators, even if they are highly scholarly, are all envious of Kṛṣṇa, the Supreme Personality of Godhead. 

Even the most erudite scholars write on Bhagavad-gītā very inaccurately. Because they are envious of Kṛṣṇa, their commentaries are useless. 

The commentaries given by devotees of the Lord are bona fide. No one can explain Bhagavad-gītā or give perfect knowledge of Kṛṣṇa if he is envious. 

One who criticizes the character of Kṛṣṇa without knowing Him is a fool. So such commentaries should be very carefully avoided. 

For one who understands that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the pure and transcendental Personality, these chapters will be very beneficial.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 27/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 321: 09వ అధ్.,  శ్లో 02 /  Bhagavad-Gita - 321: Chap. 09, Ver. 02

🌹. శ్రీమద్భగవద్గీత - 321 / Bhagavad-Gita - 321 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 02 🌴

02.  రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది మరియు సర్వరహస్యములలో పరమరహస్యమైనది. పరమపవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షజ్ఞానము కలుగజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై యున్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది.

🌷. భాష్యము :
పూర్వము తెలుపబడిన సకల సిద్ధాంతములు మరియు తత్త్వముల సారమైయున్నందున భగవద్గీత యందలి ఈ అధ్యాయము విద్యలకెల్ల రాజుగా పిలువబడుచున్నది. 

భారతదేశమునందలి తత్త్వవేత్తలలో గౌతముడు, కణాడుడు, కపిలుడు, యాజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, వైశ్వానరుడు మరియు వేదాంతసూత్ర రచయితయైన వ్యాసదేవుడు అతిముఖ్యులు. కనుక ఇచ్చట ఆధ్యాత్మికజ్ఞానమునందు గాని లేదా తత్త్వమునందు గాని ఎట్టి కొరతయు లేదు. 

అట్టి సమస్తజ్ఞానమునకు రాజుగా ఈ నవమాధ్యాయమును శ్రీకృష్ణభగవానుడు వర్ణించుచున్నాడు. అనగా ఈ అధ్యాయము వేదాధ్యయనము మరియు పలు తత్త్వాధ్యయనము వలన కలిగెడి జ్ఞానము యొక్క సారమై యున్నది. 

గుహ్యము లేదా దివ్యము నైన జ్ఞానము దేహము మరియు ఆత్మల నడుమ గల భేదమును అవగాహన చేసికొనుట యందు కేంద్రీకరింపబడను గావున ఈ నవమాధ్యాయము రాజగుహ్యముగా కూడా తెలుపబడినది. అట్టి రాజగుహ్యజ్ఞానము భక్తియుతసేవ యందే పరిసమాప్తి నొందును.

సాధారణముగా జనులు ఇట్టి గుహ్యమైన జ్ఞానమునందు గాక, భౌతికమైన జ్ఞానమునందు ప్రవీణులై యందురు. 

లౌకికవిద్యకు సంబంధించినంతవరకు జనులు రాజనీతి, సామాజికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము, యంత్రశాస్త్రముల వంటి వాటితోనే సంబంధమును కలిగియున్నారు. 

ప్రపంచమనదంతటను పలు విజ్ఞానశాఖలు మరియు విశ్వవిద్యాలయములు ఉన్నను దురదృష్టవశాత్తు వారికి ఆత్మను గూర్చి విద్యగరువు విశ్వవిద్యాలయముగాని లేక విద్యాసంస్థగాని ఎచ్చోటను లేదు. కాని వాస్తవమునకు దేహమునందు ఆత్మ అత్యంత ముఖ్యాంశమై యున్నది. 

ఆత్మ లేని దేహము నిరుపయోగమును, విలువరహితమును కాగలదు. అయినను జనులు ముఖ్యమైన ఆత్మను గూర్చి పట్టించుకొనక దేహావసరములకే ఎక్కువ ప్రాముఖ్యము నొసగుచున్నారు.

భగవద్గీత ( ముఖ్యముగా ద్వితీయాధ్యాయము నుండి) ఆత్మ యొక్క ప్రాముఖ్యమును నొక్కి చెప్పుచున్నది. దేహము నశ్వరమనియు మరియు ఆత్మ అవ్యయమనియు శ్రీకృష్ణభగవానుడు ఆదిలోనే తెలిపియుండెను (అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా: శరీరిణ: ). 

ఆత్మ దేహము కన్నను అన్యమైనదనియు మరియు అది నిర్వికల్పము, నాశరహితము, శాశ్వతమనియు తెలియగలుగుటయే జ్ఞానమునందలి గుహ్యభాగము. కాని వాస్తవమునకు ఇది ఆత్మను గూర్చిన పూర్తి విషయమును తెలుపజాలదు. 

ఆత్మ దేహము కన్నను వేరుగా నుండి, దేహము నశించిన పిమ్మట లేదా మోక్షము ప్రాప్తించిన పిమ్మట శూన్యమునందు నిలిచి నిరాకారమగునని కొందరు భావింతురు. కాని వాస్తవమునకు అది సత్యము కాదు. 

దేహమునందు నిలిచియున్నప్పుడు చైతన్యపూర్ణమై యుండు ఆత్మ దేహము నుండి ముక్తిని పొందిన పిదప ఎట్లు చైతన్యరహితమగును? అనగా ఆత్మ నిత్యము చైతన్యపుర్ణమే. ఆత్మ నిత్యమేయైనచో, అది శాశ్వతముగా చైతన్యపుర్ణమై యుండవలెను. 

భగవద్దామమునందు ఆ నిత్యమైన ఆత్మ యొక్క కార్యకలాపములే ఆధ్యాత్మికజ్ఞానపు పరమగుహ్యభాగమై యున్నవి. కనుకనే ఆత్మ యొక్క కార్యకలాపములు ఇచ్చట రాజవిద్యగా (పరమగుహ్యజ్ఞానము) పేర్కొనబడినవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 321 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 02 🌴

02 . rāja-vidyā rāja-guhyaṁ
pavitram idam uttamam
pratyakṣāvagamaṁ dharmyaṁ
su-sukhaṁ kartum avyayam

🌷 Translation : 
This knowledge is the king of education, the most secret of all secrets. It is the purest knowledge, and because it gives direct perception of the self by realization, it is the perfection of religion. It is everlasting, and it is joyfully performed.

🌹 Purport :
This chapter of Bhagavad-gītā is called the king of education because it is the essence of all doctrines and philosophies explained before. Among the principal philosophers in India are Gautama, Kaṇāda, Kapila, Yājñavalkya, Śāṇḍilya and Vaiśvānara. 

And finally there is Vyāsadeva, the author of the Vedānta-sūtra. So there is no dearth of knowledge in the field of philosophy or transcendental knowledge.

Now the Lord says that this Ninth Chapter is the king of all such knowledge, the essence of all knowledge that can be derived from the study of the Vedas and different kinds of philosophy. 

It is the most confidential because confidential or transcendental knowledge involves understanding the difference between the soul and the body. And the king of all confidential knowledge culminates in devotional service.

Generally, people are not educated in this confidential knowledge; they are educated in external knowledge. 

As far as ordinary education is concerned, people are involved with so many departments: politics, sociology, physics, chemistry, mathematics, astronomy, engineering, etc. 

There are so many departments of knowledge all over the world and many huge universities, but there is, unfortunately, no university or educational institution where the science of the spirit soul is instructed. 

Yet the soul is the most important part of the body; without the presence of the soul, the body has no value. Still people are placing great stress on the bodily necessities of life, not caring for the vital soul.

The Bhagavad-gītā, especially from the Second Chapter on, stresses the importance of the soul. In the very beginning, the Lord says that this body is perishable and that the soul is not perishable (antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ). 

That is a confidential part of knowledge: simply knowing that the spirit soul is different from this body and that its nature is immutable, indestructible and eternal. But that gives no positive information about the soul. 

Sometimes people are under the impression that the soul is different from the body and that when the body is finished, or one is liberated from the body, the soul remains in a void and becomes impersonal. 

But actually that is not the fact. How can the soul, which is so active within this body, be inactive after being liberated from the body? 

It is always active. If it is eternal, then it is eternally active, and its activities in the spiritual kingdom are the most confidential part of spiritual knowledge. 

These activities of the spirit soul are therefore indicated here as constituting the king of all knowledge, the most confidential part of all knowledge.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 322: 09వ అధ్.,  శ్లో 03 /  Bhagavad-Gita - 322: Chap. 09, Ver. 03

🌹. శ్రీమద్భగవద్గీత - 322 / Bhagavad-Gita - 322 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 03 🌴

03.  అశ్రద్ధధానా: పురుషా ధర్మస్యాస్య పరన్తప |
 అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని ||

🌷. తాత్పర్యం :
ఓ శత్రుంజయుడా! ఈ భక్తియుతసేవ యందు శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతికజగమునందలి జనన, మరణమార్గమునకే తిరిగివత్తురు.

🌷. భాష్యము :
శ్రద్ధలేనివారు ఈ భక్తియోగవిధానమును పొందలేరన్నది ఈ శ్లోకపు సారాంశము. 

శ్రద్ధ యనునది భక్తుల సాంగత్యము ద్వారా కలుగగలదు. అదృష్టహీనులైనవారు మహాత్ముల ద్వారా వేదవాజ్మయమునందలి నిదర్శనములను శ్రవణము చేసిన పిమ్మటయును శ్రీకృష్ణభగవానుని యందు శ్రద్ధను గాని, విశ్వాసమును గాని పొందారు. 

సంశయాత్ములైనందున వారు ఆ భగవానుని భక్తియోగములో స్థితిని పొందలేరు. కనుకనే కృష్ణభక్తిభావన యందు పురోగతి విశ్వాసము లేదా శ్రద్ధ యనునది అత్యంత ముఖ్యమైన అంశముగా పేర్కొనబడినది. 

దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవామాత్రము చేతనే మనుజుడు పూర్ణత్వమును సాధింపగలడనెడి సంపూర్ణ నమ్మకమే విశ్వాసమని “చైతన్యచరితామృతము” తెలుపుచున్నది. అదియే నిజమైన శ్రద్ధ. ఈ విషయమును గూర్చి శ్రీమద్భాగవతము (4.31.14) నందు ఇట్లు తెలుపబడినది. 

యథాతరోర్మూలనిషేచనేన తృప్యన్తి తత్స్కన్ధభుజోపశాఖా: |
ప్రాణోపహారాచ్చ యథేన్ద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా ||

“వృక్షమూలమునకు నీరుపోయుట ద్వారా కొమ్మలు, రెమ్మలు, పత్రములను సంతృప్తిపరచినట్లు మరియు ఉదరమునకు ఆహారము నొసగుట ద్వారా ఇంద్రియములన్నింటిని తృప్తిపరచినట్లు, శ్రీకృష్ణభగవానుని దివ్యమగుసేవ యందు నిలుచుట ద్వారా మనుజుడు సర్వదేవతలను మరియు సర్వ ఇతరజీవులను అప్రయత్నముగా సంతృప్తిపరచినవాడగును.” 

కనుక ప్రతియొక్కరు సర్వవిధములైన కర్మలను, ధర్మములను విడిచి శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవను స్వీకరింపవలసియున్నది. 

గీతను పఠించిన పిమ్మట ప్రతియోక్కరును ఈ గీతాసారాంశమునకే అరుదెంచవలెను. ఇట్టి తత్త్వము యెడ నిశ్చయమును పొందుటయే శ్రద్ధ యనబడును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 322 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 03 🌴

03 . aśraddadhānāḥ puruṣā
dharmasyāsya paran-tapa
aprāpya māṁ nivartante
mṛtyu-saṁsāra-vartmani

🌷 Translation : 
Those who are not faithful in this devotional service cannot attain Me, O conqueror of enemies. Therefore they return to the path of birth and death in this material world.

🌹 Purport :
The faithless cannot accomplish this process of devotional service; that is the purport of this verse. Faith is created by association with devotees. 

Unfortunate people, even after hearing all the evidence of Vedic literature from great personalities, still have no faith in God. They are hesitant and cannot stay fixed in the devotional service of the Lord. 

Thus faith is a most important factor for progress in Kṛṣṇa consciousness. In the Caitanya-caritāmṛta it is said that faith is the complete conviction that simply by serving the Supreme Lord, Śrī Kṛṣṇa, one can achieve all perfection. That is called real faith. As stated in the Śrīmad-Bhāgavatam (4.31.14),

yathā taror mūla-niṣecanena
tṛpyanti tat-skandha-bhujopaśākhāḥ
prāṇopahārāc ca yathendriyāṇāṁ
tathaiva sarvārhaṇam acyutejyā

“By giving water to the root of a tree one satisfies its branches, twigs and leaves, and by supplying food to the stomach one satisfies all the senses of the body. 

Similarly, by engaging in the transcendental service of the Supreme Lord one automatically satisfies all the demigods and all other living entities.” 

Therefore, after reading Bhagavad-gītā one should promptly come to the conclusion of Bhagavad-gītā: one should give up all other engagements and adopt the service of the Supreme Lord, Kṛṣṇa, the Personality of Godhead. If one is convinced of this philosophy of life, that is faith.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 323: 09వ అధ్.,  శ్లో 04 /  Bhagavad-Gita - 323: Chap. 09, Ver. 04

🌹. శ్రీమద్భగవద్గీత - 323 / Bhagavad-Gita - 323 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 04 🌴

04.  మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థిత: |

🌷. తాత్పర్యం :
సమస్తజగత్తు అవ్యక్తరూపమున నాచే ఆవరించబడియున్నది. జీవులన్నియు నా యందున్నవి, కాని నేను వాని యందు లేను.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియయములకు అనుభూతుడు కాదు. ఇదే విషయము ఈ క్రింది విధముగా తెలుపబడినది.

అత: శ్రీకృష్ణనామాది న భవేద్గ్రాహ్య మిన్ద్రియై: |
సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యద: ||

(భక్తిరాసామృతసింధువు 1.2.234)

శ్రీకృష్ణుని నామము, మహిమలు, లిలాదులు ఇంద్రియములచే అవగాహనకు రావు. తగిన నేతృత్వములో భక్తియుతసేవ యందు నిలిచిన మనుజునికే అతడు స్వయముగా విదితుడు కాగలడు. 

కనుకనే “ప్రేమాంజన చ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయన్తి” యని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. అనగా దేవదేవుడైన గోవిందుని యెడ దివ్యమైన ప్రేమను వృద్ధికావించుకొననివాడు ఆ భగవానుని సదా తన అంతర్బాహ్యములలో గాంచగలడు. సాధారణజనులకు అతడు గోచరుడు. 

ఆ భగవానుడు సర్వవ్యాపియై సర్వత్రా నిలిచియున్నను ఇంద్రియములచే అనుభూతుడు కాడని ఇచ్చట తెలుపబడినది. ఇదే విషయము “అవ్యక్తమూర్తినా” అను పదము ద్వారా ఇచ్చట సూచించబడినది. 

మనమాతనిని గాంచలేకున్నను వాస్తవమునకు సర్వము అతని యందు స్థితిని కలిగియున్నది. సప్తమాధ్యాయమున ఇదివరకే చర్చించినట్లు జగత్తంతయు అతని ఆధ్యాత్మికశక్తి, భౌతికశక్తుల కలయిక చేతనే ఏర్పడినది. 

సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించియున్నట్లు, శ్రీకృష్ణభగవానుని శక్తియు సృష్టియందంతటను వ్యాపించియండి, సమస్తము ఆ శక్తి యందు స్థితిని కలిగియున్నది.

శ్రీకృష్ణభగవానుడు సర్వత్రా వ్యాపించి యుండుటచే తన వ్యక్తిగత రూపమును కోల్పోవునని ఎవ్వరును భావింపరాదు. 

అటువంటి వాదనను ఖండించుటకే ఆ భగవానుడు “సర్వత్రా నిలిచియున్న నా యందే సర్వము నిలిచియున్నను నేను సర్వమునకు పరుడనై యున్నను” అని పలికెను. ఆ భగవానుని వివిధశక్తుల విస్తారము వలననే జగత్తు సృజింపబడుచున్నది. 

భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుడు స్వీయప్రాతినిధ్యమైన తన వివిధశక్తుల విస్తారముచే సర్వత్రా నిలిచియుండును (విష్ట భ్యాహమిదం కృత్స్నమ్ ).
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 323 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 04 🌴

04 . mayā tatam idaṁ sarvaṁ
jagad avyakta-mūrtinā
mat-sthāni sarva-bhūtāni
na cāhaṁ teṣv avasthitaḥ

🌷 Translation : 
By Me, in My unmanifested form, this entire universe is pervaded. All beings are in Me, but I am not in them.

🌹 Purport :
The Supreme Personality of Godhead is not perceivable through the gross material senses. It is said,

ataḥ śrī-kṛṣṇa-nāmādi
na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau
svayam eva sphuraty adaḥ

(Bhakti-rasāmṛta-sindhu 1.2.234)

Lord Śrī Kṛṣṇa’s name, fame, pastimes, etc., cannot be understood by material senses. Only to one who is engaged in pure devotional service under proper guidance is He revealed. 

In the Brahma-saṁhitā (5.38) it is stated, premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti: one can see the Supreme Personality of Godhead, Govinda, always within himself and outside himself if one has developed the transcendental loving attitude towards Him. 

Thus for people in general He is not visible. Here it is said that although He is all-pervading, everywhere present, He is not conceivable by the material senses. 

This is indicated here by the word avyakta-mūrtinā. But actually, although we cannot see Him, everything is resting in Him. 

As we have discussed in the Seventh Chapter, the entire material cosmic manifestation is only a combination of His two different energies – the superior, spiritual energy and the inferior, material energy. 

Just as the sunshine is spread all over the universe, the energy of the Lord is spread all over the creation, and everything is resting in that energy.
🌹 🌹 🌹 🌹 🌹

DAte: 30/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 324: 09వ అధ్.,  శ్లో 05 /  Bhagavad-Gita - 324: Chap. 09, Ver. 05

🌹. శ్రీమద్భగవద్గీత - 324 / Bhagavad-Gita - 324 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 05 🌴

05.  న చ మత్థ్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావన: ||

🌷. తాత్పర్యం :
అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగియుండదు. అచింత్యమైన నా యోగవైభమును గాంచుము! నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను, సర్వసృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమానజగత్తు నందలి భాగమును కాను. 

🌷. భాష్యము : 
సమస్తము తన యందే స్థితిని కలిగియున్నదని (మత్థ్సాని సర్వభూతాని) శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట పలుకగా దానిని వేరు విధముగా అర్థము చేసికొనరాదు. వాస్తవమునకు విశ్వము యొక్క భరణ, పోషణములతో ప్రత్యక్షముగా ఆ భగవానునకు ఎట్టి సంబంధము లేదు. కొన్నిమార్లు “అట్లాస్” తన భుజములపై భూగోళమును మోయుచు, అట్టి కార్యములో అలసినట్లుగా మనము చిత్రములలో గాంతుము. ఇదే భావనను శ్రీకృష్ణభగవానుడు విశ్వమును భరించుచున్నాడనెడి విషయమును మనము ఊహింపరాదు. ఏలయన తన యందే సర్వము స్థితిని కలిగియున్నను తాను మాత్రము వాటికి పరుడని యున్నానని భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. గ్రహమండలము అంతరిక్షమున నిలిచియున్నది. ఆ అంతరిక్షము భగవానుని శక్తియైనను, అతడు అంతరిక్షమునకు భిన్నుడు. అతడు భిన్నముగా స్థితుడై యున్నాడు. కనుకనే “జీవులందరు నా అచింత్యశక్తి యందు నిలిచియున్నను, దేవదేవుడైన నేను వారికి పరుడనై యున్నాను” అని శ్రీకృష్ణభగవానుడు పలికినాడు. ఇదియే శ్రీకృష్ణుని అచింత్యమైన యోగవైభవము.

“భగవానుడు తన శక్తి ప్రదర్శనము చేయుచు ఊహాతీతములైన అద్భుత లీలలను గావించుచున్నాడు” అని వేదనిఘంటువైన నిరుక్తి యందు తెలుపబడినది (యుజ్యతేఽనేన దుర్ఘటేషు కార్యేషు). శ్రీకృష్ణభగవానుడు దివ్యములైన వివిధశక్తులను కలిగియున్నాడు మరియు అతని సంకల్పమే వాస్తవమైనదనెడి భావనలో మనమాతనిని అవగాహన చేసికొనవలెను. మనమొక కార్యమును చేయవలదని తలచినపుడు దానికి పెక్కు అవరోధములు కలుగవచ్చును. కొన్నిమార్లు మనము కోరినరీతిగా చేయుటకు సాధ్యము గాకపోవచ్చును. కాని శ్రీకృష్ణభగవానుడు ఏదేని ఒక కార్యమును చేయగోరినపుడు, అతని సంకల్పమాత్రముననే అది ఊహాతీతముగా, సమగ్రముగా నిర్వహింపబడును. ఈ విషయమునే భగవానుడు వివరించుచున్నాడు. అతడే సృష్టిని పోషించువాడు మరియు భరించువాడైనను వాస్తవమునకు తాను సృష్టిని తాకనైనను తాకడు. కేవలము అతని దివ్య సంకల్పము చేతనే సమస్తము సృష్టింపబడి, భరించబడి, పోషించబడి  అంత్యమున నశించిపోవును. పరతత్త్వమైనందున అతనికి మరియు అతని మనస్సునకు ఎట్టి భేదము లేదు (మనకు మరియు మన మనస్సునకు భేదము కలదు). ఏకకాలమున ఆ భగవానుడు సర్వము నందు వసించియున్నను ఏ విధముగా రూపసహితుడై ఉండగలడో సామాన్యుడు ఎరుగజాలడు. ఈ భౌతికసృష్టికి భిన్నముగా నున్నను సర్వము అతని యందే నిలిచియున్నది. ఇట్టి విషయమే ఇచ్చట దేవదేవుని యోగశక్తిగా (యోగమైశ్వరమ్) వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 324 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 05 🌴

05 . na ca mat-sthāni bhūtāni
paśya me yogam aiśvaram
bhūta-bhṛn na ca bhūta-stho
mamātmā bhūta-bhāvanaḥ

🌷 Translation : 
And yet everything that is created does not rest in Me. Behold My mystic opulence! Although I am the maintainer of all living entities and although I am everywhere, I am not a part of this cosmic manifestation, for My Self is the very source of creation.

🌹 Purport :
The Lord says that everything is resting on Him (mat-sthāni sarva-bhūtāni). This should not be misunderstood. The Lord is not directly concerned with the maintenance and sustenance of this material manifestation. Sometimes we see a picture of Atlas holding the globe on his shoulders; he seems to be very tired, holding this great earthly planet. Such an image should not be entertained in connection with Kṛṣṇa’s upholding this created universe. He says that although everything is resting on Him, He is aloof. The planetary systems are floating in space, and this space is the energy of the Supreme Lord. But He is different from space. He is differently situated. Therefore the Lord says, “Although they are situated on My inconceivable energy, as the Supreme Personality of Godhead I am aloof from them.” This is the inconceivable opulence of the Lord.

In the Nirukti Vedic dictionary it is said, yujyate ’nena durghaṭeṣu kāryeṣu: “The Supreme Lord is performing inconceivably wonderful pastimes, displaying His energy.” His person is full of different potent energies, and His determination is itself actual fact. In this way the Personality of Godhead is to be understood. We may think of doing something, but there are so many impediments, and sometimes it is not possible to do as we like. But when Kṛṣṇa wants to do something, simply by His willing, everything is performed so perfectly that one cannot imagine how it is being done. The Lord explains this fact: although He is the maintainer and sustainer of the entire material manifestation, He does not touch this material manifestation. Simply by His supreme will, everything is created, everything is sustained, everything is maintained and everything is annihilated. There is no difference between His mind and Himself (as there is a difference between ourselves and our present material mind) because He is absolute spirit. Simultaneously the Lord is present in everything; yet the common man cannot understand how He is also present personally. He is different from this material manifestation, yet everything is resting on Him. This is explained here as yogam aiśvaram, the mystic power of the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 31/Mar/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 325: 09వ అధ్.,  శ్లో 06 /  Bhagavad-Gita - 325: Chap. 09, Ver. 06

🌹. శ్రీమద్భగవద్గీత - 325 / Bhagavad-Gita - 325 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 06 🌴

06.  యథాకాశస్థితో నిత్యం వాయు: సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్థ్సానీత్యుపధారయ ||

🌷. తాత్పర్యం :
సర్వత్రా వీచునట్టి ప్రచండవాయువు సదా ఆకాశము నందే స్థితిని కలిగియుండునట్లు, సృజింపబడిన సమస్తజీవులు నా యందు స్థితిని కలిగియున్నవని గ్రహింపుము. 

🌷. భాష్యము : 
బ్రహ్మాండమైన విశ్వము ఏ విధముగా శ్రీకృష్ణభగవానునిపై ఆధారపడియున్నదో తెలియుట సామాన్యమానవునికి దాదాపు ఊహాతీత విషయము. 

కాని మన అవగాహనకు తోడ్పడు ఉపమానము నొకదానిని భగవానుడు ఒసగుచున్నాడు. మనము ఊహింపగలిగిన వానిలో అత్యంత ఘనమైనది ఆకాశము. 

అట్టి ఆకాశమున వాయువే అతి గొప్పదైనది. అది ప్రతిదాని చలనమును పభావితము చేయగలదు. ఆ విధముగా వాయువు అతిఘనమైనను ఆకాశమునందే స్థితిని కలిగియుండును. అది ఆకాశపరధిని దాటక దాని యందే ఒదిగియుండును. 

అదేవిధముగా అధ్భుతమైన సృష్టులన్నియును శ్రీకృష్ణభగవానుని సంకల్పము చేతనే స్థితిని కలిగియుండి అతనికి లోబడి వర్తించును. సాధారణముగా చెప్పబడునట్లు భగవానుని ఆజ్ఞ లేనిదే తృణము కూడా కదలదు. అనగా ఆ భగవానుని సంకల్పము చేతనే సమస్తము నడుచుచున్నది. 

అతని సంకల్పము చేతనే సర్వము సృష్టింపబడి, పోషింపబడి, అంత్యమున నశించిపోవుచున్నది. అయినను వాయువు యొక్క కార్యకలాపములకు ఆకాశము అతీతముగా నున్నట్లు, శ్రీకృష్ణభగవానుడు సమస్తము నుండి వేరుగా నున్నాడు.

“భగవానుని భయము చెట్నీ వాయువు వీచుచున్నది” అని తైత్తరీయోపనిషత్తు (2.81) నందు తెలుపబడినది (యద్భీషా వాత: పవతే). 

అదే విధముగా బృహదారణ్యకోపనిషత్తు (3.8.9) నందు కూడా “దేవదేవుని నేతృత్వములో అతని దివ్య శాసనము చేతనే సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహములు చలించుచున్నవి” యని తెలుపబడినది 

( ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యచంద్రమసౌ విధ్రుతౌ తిష్టత ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావాపృథివ్యౌ విద్రుతౌ తిష్టత: ). 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 325 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 06 🌴

06 . yathākāśa-sthito nityaṁ
vāyuḥ sarvatra-go mahān
tathā sarvāṇi bhūtāni
mat-sthānīty upadhāraya

🌷 Translation : 
Understand that as the mighty wind, blowing everywhere, rests always in the sky, all created beings rest in Me.

🌹 Purport :
For the ordinary person it is almost inconceivable how the huge material creation is resting in Him. 

But the Lord is giving an example which may help us to understand. The sky may be the biggest manifestation we can conceive. And in that sky the wind or air is the biggest manifestation in the cosmic world. 

The movement of the air influences the movements of everything. But although the wind is great, it is still situated within the sky; the wind is not beyond the sky. 

Similarly, all the wonderful cosmic manifestations are existing by the supreme will of God, and all of them are subordinate to that supreme will. As we generally say, not a blade of grass moves without the will of the Supreme Personality of Godhead. 

Thus everything is moving under His will: by His will everything is being created, everything is being maintained, and everything is being annihilated. Still He is aloof from everything, as the sky is always aloof from the activities of the wind.

In the Upaniṣads it is stated, yad-bhīṣā vātaḥ pavate: “It is out of the fear of the Supreme Lord that the wind is blowing.” (Taittirīya Upaniṣad 2.8.1) 

In the Bṛhad-āraṇyaka Upaniṣad (3.8.9) it is stated, etasya vā akṣarasya praśāsane gārgi sūrya-candramasau vidhṛtau tiṣṭhata etasya vā akṣarasya praśāsane gārgi dyāv-āpṛthivyau vidhṛtau tiṣṭhataḥ. 

“By the supreme order, under the superintendence of the Supreme Personality of Godhead, the moon, the sun, and the other great planets are moving.”
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 326: 09వ అధ్.,  శ్లో 07 /  Bhagavad-Gita - 326: Chap. 09, Ver. 07

🌹. శ్రీమద్భగవద్గీత - 326 / Bhagavad-Gita - 326 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 07 🌴

07.  సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిమ యాన్తి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యాహమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ కొన్తేయ! కల్పాంతమున సమస్త భౌతికసృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును.

🌷. భాష్యము : 
ఈ భౌతికసృష్టి యొక్క సృష్టి, స్థితి, లయములు సంపూర్ణముగా శ్రీకృష్ణభగవానుని దివ్యసంకల్పము పైననే ఆధారపడియుండును. ఇచ్చట కల్పాంతమనగా బ్రహ్మదేవుని నిర్వాణము పిదప యని భావము. 

నూరు సంవత్సరములు జీవించు ఆ బ్రహ్మదేవుని ఒక పగలు 4,300,000,000 భూలోక సంవత్సరములతో సమానము. అతని రాత్రి సమయము కూడా అంతే కాలపరిమాణమును కలిగియుండును. అనగా అతని మాసమున అట్టి పగలు మరియు రాత్రి సమయములు ముప్పదియుండగా, అతని సంవత్సరకాలము పన్నెండు అట్టి మాసములను కలిగియుండును. 

అటువంటి వంద సంవత్సరములు గడచిన పిమ్మట బ్రహ్మదేవుడు తనువును చాలించినపుడు ప్రళయము సంభవించును. అనగా అట్టి సమయమున అంతవరకు ప్రదర్శితమైన శ్రీకృష్ణభగవానుని శక్తి అతని యందే తిరిగి లయించిపోవును. 

మరల విశ్వసృష్టి అవసరమైనప్పుడు, ఆ భగవానుని సంకల్పముచే అది తిరిగి ప్రకటితమగును. కనుకనే “బహుస్యాం – నేనొక్కడనే అయినను బహురూపములు దాల్చుదును” అని తెలుపబడినది. 

ఇది చాందోగ్యోపనిషత్తు మంత్రము (6.2.3). శ్రీకృష్ణభగవానుడు ఆ రీతి భౌతికశక్తి యందు వ్యాపించినపుడు సమస్త విశ్వము తిరిగి ప్రకటితమగును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 326 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 07 🌴

07 . sarva-bhūtāni kaunteya
prakṛtiṁ yānti māmikām
kalpa-kṣaye punas tāni
kalpādau visṛjāmy aham

🌷 Translation : 
O son of Kuntī, at the end of the millennium all material manifestations enter into My nature, and at the beginning of another millennium, by My potency, I create them again.

🌹 Purport :
The creation, maintenance and annihilation of this material cosmic manifestation are completely dependent on the supreme will of the Personality of Godhead. “At the end of the millennium” means at the death of Brahmā. 

Brahmā lives for one hundred years, and his one day is calculated at 4,300,000,000 of our earthly years. His night is of the same duration. His month consists of thirty such days and nights, and his year of twelve months. 

After one hundred such years, when Brahmā dies, the devastation or annihilation takes place; this means that the energy manifested by the Supreme Lord is again wound up in Himself. 

Then again, when there is a need to manifest the cosmic world, it is done by His will. Bahu syām: “Although I am one, I shall become many.” 

This is the Vedic aphorism (Chāndogya Upaniṣad 6.2.3). He expands Himself in this material energy, and the whole cosmic manifestation again takes place.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 02/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 327: 09వ అధ్.,  శ్లో 08 /  Bhagavad-Gita - 327: Chap. 09, Ver. 08

🌹. శ్రీమద్భగవద్గీత - 327 / Bhagavad-Gita - 327 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 08  🌴

08.  ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పున:పున: |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ ||

🌷. తాత్పర్యం :
సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టింపబడుచు, నా సంకల్పము చేతనే అంత్యమున లయము నొందుచుండును.

🌷. భాష్యము : 
ఇంతకు పూర్వమే పలుమార్లు వివరింపబడినట్లు భౌతికజగత్తు శ్రీకృష్ణభగవానుని న్యునశక్తి యొక్క వ్యక్తీకరణమై యున్నది. సృష్టి సమయమున భౌతికశక్తి మహాతత్త్వముగా రుపొందగా భగవానుడు తన తొలి పురుషావతారమైన మాహావిష్ణువుగా దాని యందు ప్రవేశించును. అతడు కారణసముద్రములలో శయనించి తన శ్వాస ద్వారా అసంఖ్యాకముగా బ్రహ్మాండములను సృష్టించగా, దేవదేవుడు వాని యందు ద్వితీయ పురుషావతారమైన గర్భోదకశాయివిష్ణువు రూపమున ప్రవేశించును. ప్రతివిశ్వము ఈ విధముగనే సృజింపబడినది. పిమ్మట భగవానుడు క్షీరోదకశాయివిష్ణువు రూపమున ఆ బ్రహ్మాండము యందలి కణకణములతో సహా సర్వమునందును ప్రవేశించును. ఈ విధముగా శ్రీకృష్ణభగవానుడు సమస్తము నందును ప్రవేశించుననెడి విషయమే ఇచ్చట వివరింపబడినది.

ఇక జీవులకు సంబంధించినంతవరకు వారనదరును భౌతికప్రకృతి గర్భము నందుంచబడగా, వారివారి కర్మఫలముల ననుసరించి వివిధస్థానములను పొందుదురు. ఆ విధముగా భౌతికజగత్తు యొక్క కలాపములు ప్రారంభమగును. అనగా సృష్ట్యారంభమైన క్షణము నుండియే వివధజీవుల కార్యకలాపములు ఆరంభమై యున్నవి. కాలక్రమమున వృద్ధినొందుట లేదా పరిణామము చెందుటన్నది జరుగక జగము యొక్క సృష్టితో పాటుగానే వివిధజీవులు సృష్టింపబడిరి. అనగా మనుష్యులు, జంతువులు, మృగములు, పక్షులు మొదలుగునవన్నియును ఏకకాలమున సృష్టింపబడినవే. గడిచిన కల్పాంతమున జీవులు ఈ కోరికలను కలిగియుందురో తద్రీతిగా వారు తిరిగి సృష్టింపబడుటయే అందులకు కారణము. ఈ విధానమున జీవుల చేయవలసినది ఏదియును లేదని “అవశమ్” అణు పదము ద్వారా సూచింపబడినది. అనగా గడచిన కల్పమునందలి గడచిన జన్మము యొక్క స్వభావము ననుసరించి జీవుడు తిరిగి సృష్టించబడును. ఇదియంతయు భగవానుని సంకల్పము చేతనే జరుగుచుండును. ఇదియే శ్రీకృష్ణభగవానుని అచింత్యశక్తి. ఈ విధముగా వివిధజీవులను సృష్టించిన పిమ్మట అతడు వారితో సంబంధమును కలిగియుండడు. వివిధజీవుల కోరికలను పూర్ణము చేయుటకే జగత్తు సృష్టింపబడుచున్నందున భగవానుడు దానితో సంబంధమును పెట్టుకొనడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 327 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 08  🌴

08 . prakṛtiṁ svām avaṣṭabhya
visṛjāmi punaḥ punaḥ
bhūta-grāmam imaṁ kṛtsnam
avaśaṁ prakṛter vaśāt

🌷 Translation : 
The whole cosmic order is under Me. Under My will it is automatically manifested again and again, and under My will it is annihilated at the end.

🌹 Purport :
This material world is the manifestation of the inferior energy of the Supreme Personality of Godhead. This has already been explained several times. At the creation, the material energy is let loose as the mahat-tattva, into which the Lord as His first puruṣa incarnation, Mahā-viṣṇu, enters. He lies within the Causal Ocean and breathes out innumerable universes, and into each universe the Lord again enters as Garbhodaka-śāyī Viṣṇu. Each universe is in that way created. He still further manifests Himself as Kṣīrodaka-śāyī Viṣṇu, and that Viṣṇu enters into everything – even into the minute atom. This fact is explained here. He enters into everything.

Now, as far as the living entities are concerned, they are impregnated into this material nature, and as a result of their past deeds they take different positions. Thus the activities of this material world begin. The activities of the different species of living beings are begun from the very moment of the creation. It is not that all is evolved. The different species of life are created immediately along with the universe. Men, animals, beasts, birds – everything is simultaneously created, because whatever desires the living entities had at the last annihilation are again manifested. It is clearly indicated here by the word avaśam that the living entities have nothing to do with this process. The state of being in their past life in the past creation is simply manifested again, and all this is done simply by His will. This is the inconceivable potency of the Supreme Personality of God.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 328: 09వ అధ్.,  శ్లో 09 /  Bhagavad-Gita - 328: Chap. 09, Ver. 09

🌹. శ్రీమద్భగవద్గీత - 328 / Bhagavad-Gita - 328 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 09  🌴

09.  న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ||

🌷. తాత్పర్యం :
ఓ ధనంజయా! ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తతస్థునివలె ఉండి ఈ భౌతికకర్మలన్నింటి యెడ సదా ఆసక్తిలేనివాడనై యుందును.

🌷. భాష్యము : 
భగవానునకు ఎట్టి కర్మము లేదని ఈ విషయమున ఎవ్వరును భావింపరాదు. ఆధ్యాత్మికజగత్తులో అతడు సదా దివ్యకర్మల యందు నిమగ్నుడై యుండును. 

కనుకనే శ్రీకృష్ణభగవానుడు సదా సచ్చిదానందపూర్ణములైన కర్మలలో నిమగ్నుడైయుండుననియు, భౌతికకర్మలతో అతనికెట్టి సంబంధము లేదనియు బ్రహ్మసంహిత యందు తెలుపబడినది (ఆత్మారామస్య తస్యా స్తి ప్రకృత్యా న సమాగమ: ). 

భౌతికకర్మలన్నియు అతని వివధశక్తులచే నిర్వహింపబడును. అతడు మాత్రము సృష్టించబడిన జగత్తు యొక్క భౌతికకర్మల యెడ సదా తటస్థుడై యుండును. 

ఆ తటస్థత్వమే “ఉదాసీనవత్” యను పదము ద్వారా ఇచ్చట తెలుపబడినది. అనగా భౌతికకర్మల యందలి ప్రతి సుక్ష్మంశము పైనను అదుపు కలిగియున్నప్పటికిని అతడు తతస్థుని వలె వర్తించుచుండును. న్యాయస్థానమున కూర్చుండు న్యాయాధికారి ఉదాహరణను ఇచ్చట ఒసగవచ్చును. 

అతని ఆజ్ఞచే కొందరికి మరణశిక్ష, ఇంకొందరికి కారాగారవాసము, మరికొందరికి ధనలాభములు వంటివి జరుగుచున్నను అతడు మాత్రము అచ్చట జరుగు లాభనష్టములతో సంబంధములేక తటస్థుడై యుండును. 

అదే విధముగా జగము యొక్క ప్రతికార్యమందును తన ప్రమేయమున్నప్పటికి భగవానుడు సదా తటస్థుడై యుండును. కనుకనే వేదాంతసూత్రము (2.1.34) “వైషమ్యనైర్ఘృణ్యేన” అని ప్రవచించినది. 

అనగా శ్రీకృష్ణభగవానుడు భౌతికజగత్తు ద్వంద్వములతో సంబంధములేక వాటికి పరుడై యుండును. అలాగుననే జగత్తు యొక్క సృష్టి, లయములతో కూడా అతనికి సంబంధము లేదు. 

అనగా జీవులు తమ పూర్వకర్మల ననుసరించి పలువిధములైన జన్మలను పొందుచుండగా, శ్రీకృష్ణభగవానుడు వారితో ఎట్టి జ్యోక్యమును కల్పించుకొనడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 328 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 09  🌴

09 . na ca māṁ tāni karmāṇi
nibadhnanti dhanañ-jaya
udāsīna-vad āsīnam
asaktaṁ teṣu karmasu

🌷 Translation : 
O Dhanañjaya, all this work cannot bind Me. I am ever detached from all these material activities, seated as though neutral.

🌹 Purport :
One should not think, in this connection, that the Supreme Personality of Godhead has no engagement. 

In His spiritual world He is always engaged. In the Brahma-saṁhitā (5.6) it is stated, ātmārāmasya tasyāsti prakṛtyā na samāgamaḥ: 

“He is always involved in His eternal, blissful, spiritual activities, but He has nothing to do with these material activities.” Material activities are being carried on by His different potencies. The Lord is always neutral in the material activities of the created world. 

This neutrality is mentioned here with the word udāsīna-vat. Although He has control over every minute detail of material activities, He is sitting as if neutral. 

The example can be given of a high-court judge sitting on his bench. By his order so many things are happening – someone is being hanged, someone is being put into jail, someone is awarded a huge amount of wealth – but still he is neutral. He has nothing to do with all that gain and loss. 

Similarly, the Lord is always neutral, although He has His hand in every sphere of activity. In the Vedānta-sūtra (2.1.34) it is stated, vaiṣamya-nairghṛṇye na: 

He is not situated in the dualities of this material world. He is transcendental to these dualities. Nor is He attached to the creation and annihilation of this material world. 

The living entities take their different forms in the various species of life according to their past deeds, and the Lord doesn’t interfere with them.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 329: 09వ అధ్.,  శ్లో 10 /  Bhagavad-Gita - 329: Chap. 09, Ver. 10

🌹. శ్రీమద్భగవద్గీత - 329 / Bhagavad-Gita - 329 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 10  🌴

10.  మయాధ్యక్షేణ ప్రకృతి: సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే ||

🌷. తాత్పర్యం :
ఓ కౌంతేయా! నా శక్తులలో ఒకటైన భౌతికప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావరజంగమములను సృష్టించుచున్నది. దాని నియమము ననుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది.

🌷. భాష్యము : 
భౌతికజగత్తు కర్మలకు దూరముగా నున్నప్పటికి శ్రీకృష్ణభగవానుడే సర్వమునకు పరమాధ్యక్షుడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఈ సృష్టి వెనుక నున్న దివ్యసంకల్పము మరియు పూర్వరంగము ఆ దేవదేవుడే. 

కాని దాని నిర్వహణము మాత్రము భౌతికప్రకృతిచే కొనసాగించబడుచుండును. వివిధరూపములలో, జాతులలో నున్న సర్వజీవులకు తాను తండ్రినని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందే తెలిపియున్నాడు. 

సంతానము కొరకై తండ్రి తల్లి యందు బీజప్రదానము చేయునట్లు, భగవానడు కేవలము తన చూపు ద్వారా జీవులను ప్రకృతి గర్భములలో బీజరూపమున ఉంచగా వారు తమ పూర్వకోరికలు, కర్మల ననుసరించి వివిధరూపములలో మరియు జాతులలో జన్మింతురు. 

జీవులందరును శ్రీకృష్ణభగవానుని వీక్షణము చేతనే జన్మించినను, తమ కర్మానుసారము మరియు కోరికల ననుసరించి వివిధ దేహములను పొందవలసివచ్చును. 

అనగా యా భగవానునికి ఈ భౌతికసృష్టితో ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. కేవలము అతని వీక్షణము చేతనే ప్రభావితమై సమస్తము శీఘ్రమే సృష్టింపబడుచున్నది. 

ప్రకృతిపై భగవానుడు దృష్టి సారించుచున్నందున సృష్టి విషయమున అతడు కర్మనొనరించుచున్నాడన్న విషయము సందేహరహితమైనను, భౌతికజగత్తు వ్యక్తీకరణమునందు మాత్రము అతనకి ప్రత్యక్ష సంబంధముండదు. ఈ విషయమున స్మృతి ఒక చక్కని ఉపమానమును ఒసగుచున్నది. 

సువాసన కలిగిన పుష్పము మనుజూని ముందున్నప్పుడు దాని సుగంధము అతని ఘ్రాణశక్తిని చేరినను, మనుజుని ఘ్రాణశక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి వేరొకటి విడివడియే యుండును. 

భౌతికజగత్తు మరియు భగవానుని నడుమగల సంబంధము సైతము ఇట్టిదియే. వాస్తవమునకు భౌతికజగత్తులో ఎట్టి సంబంధము లేకున్నను అతడు తన వీక్షణముచే దానిని సృష్టించి నియమించును. 

సారాంశమేమనగా శ్రీకృష్ణభగవానుని అధ్యక్షత లేనిదే ప్రకృతి ఏమియును చేయజాలదు. అయినను ఆ దేవదేవుడు సర్వవిధములైన భౌతికకర్మల యెడ అనాసక్తుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 329 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 10  🌴

10 . mayādhyakṣeṇa prakṛtiḥ
sūyate sa-carācaram
hetunānena kaunteya
jagad viparivartate

🌷 Translation : 
This material nature, which is one of My energies, is working under My direction, O son of Kuntī, producing all moving and nonmoving beings. Under its rule this manifestation is created and annihilated again and again.

🌹 Purport :
It is clearly stated here that the Supreme Lord, although aloof from all the activities of the material world, remains the supreme director. 

The Supreme Lord is the supreme will and the background of this material manifestation, but the management is being conducted by material nature. Kṛṣṇa also states in Bhagavad-gītā that of all the living entities in different forms and species, “I am the father.” 

The father gives seeds to the womb of the mother for the child, and similarly the Supreme Lord by His mere glance injects all the living entities into the womb of material nature, and they come out in their different forms and species, according to their last desires and activities. 

All these living entities, although born under the glance of the Supreme Lord, take their different bodies according to their past deeds and desires. 

So the Lord is not directly attached to this material creation. He simply glances over material nature; material nature is thus activated, and everything is created immediately. 

Because He glances over material nature, there is undoubtedly activity on the part of the Supreme Lord, but He has nothing to do with the manifestation of the material world directly. 

There is a similar connection between the material world and the Supreme Personality of Godhead; actually He has nothing to do with this material world, but He creates by His glance and ordains. 

In summary, material nature, without  the superintendence of the Supreme Personality of Godhead, cannot do anything. Yet the Supreme Personality is detached from all material activities.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 05/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 330: 09వ అధ్.,  శ్లో 11 /  Bhagavad-Gita - 330: Chap. 09, Ver. 11

🌹. శ్రీమద్భగవద్గీత - 330 / Bhagavad-Gita - 330 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 11  🌴

11.  అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
 పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్ |

🌷. తాత్పర్యం :
నేను మానవరూపమున అవతరించినపుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమప్రభువైన నా దివ్యత్వమును వారెరుగరు.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణభగవానుడు మనవరూపమున అవతరించినప్పటికిని సామాన్య మానవుడు కాడని ఈ అధ్యాయమునందలి కడచిన శ్లోకముల భాష్యము వలన స్పష్టముగా విదితమైనది. వాస్తవమునకు సమస్త విశ్వము సృష్టి, స్థితి, లయములను గావించు శ్రీకృష్ణభగవానుడు సాధారణమానవుడు కానేకాడు. అయినప్పటికిని పెక్కురు మూఢులు శ్రీకృష్ణుడు కేవలము శక్తిమంతుడైన మానవుడే గాని అంతకు మించి ఏదియును కాడని భావింతురు. కాని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినట్లు అతడే ఆదిదేవుడు మరియు దేవదేవుడు (ఈశ్వర: పరమ: కృష్ణ: ) .

వాస్తవమునకు నియమించెడి ఈశ్వరులు పెక్కురు గలరు. వారిలో ఒకరికన్నను వేరొకరు అధికులుగా గోచరింతురు. భౌతికజగమునందలి లౌకికకార్యములందు కూడా ఒక అధికారి, అతనిపై ఒక కార్యదర్శి, అతనిపై ఒక మంత్రి, ఆ మంత్రిపై అధ్యక్షుడు ఉన్నట్లుగా మనము గాంతుము. వీరందరు తమ పరధిలో ఈశ్వరులేయైనను వేరొకనిచే నియమింపబడెడివారు. కాని శ్రీకృష్ణభగవానుడు మాత్రము దివ్య నియామకుడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. భౌతిక, ఆధ్యాత్మికజగత్తులలో పలు ఈశ్వరులున్నను శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు (ఈశ్వర: పరమ: కృష్ణ: ) మరియు అతని దేహము సచ్చిదానందమయమైనది (భౌతికము కానిది).
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 330 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 11  🌴

11 . avajānanti māṁ mūḍhā
mānuṣīṁ tanum āśritam
paraṁ bhāvam ajānanto
mama bhūta-maheśvaram

🌷 Translation : 
Fools deride Me when I descend in the human form. They do not know My transcendental nature as the Supreme Lord of all that be.

🌹 Purport :
From the other explanations of the previous verses in this chapter, it is clear that the Supreme Personality of Godhead, although appearing like a human being, is not a common man. The Personality of Godhead, who conducts the creation, maintenance and annihilation of the complete cosmic manifestation, cannot be a human being. Yet there are many foolish men who consider Kṛṣṇa to be merely a powerful man and nothing more. Actually, He is the original Supreme Personality, as is confirmed in the Brahma-saṁhitā (īśvaraḥ paramaḥ kṛṣṇaḥ); He is the Supreme Lord.

There are many īśvaras, controllers, and one appears greater than another. In the ordinary management of affairs in the material world, we find some official or director, and above him there is a secretary, and above him a minister, and above him a president. Each of them is a controller, but one is controlled by another. In the Brahma-saṁhitā it is said that Kṛṣṇa is the supreme controller; there are many controllers undoubtedly, both in the material and spiritual world, but Kṛṣṇa is the supreme controller (īśvaraḥ paramaḥ kṛṣṇaḥ), and His body is sac-cid-ānanda, nonmaterial.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 06/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 331: 09వ అధ్.,  శ్లో 12 /  Bhagavad-Gita - 331: Chap. 09, Ver. 12

🌹. శ్రీమద్భగవద్గీత - 331 / Bhagavad-Gita - 331 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 12  🌴

12.  మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతస: |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిమ మోహినీం శ్రితా: ||

🌷. తాత్పర్యం :
ఆ విధముగా మోహపరవశులైనవారు దానవ, నాస్తికభావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞానసముపార్జన లన్నియును వ్యర్థములగును.

🌷. భాష్యము : 
తమను తాము కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిలిచియున్నవారిగా భావించుచునే అంతరంగమున మాత్రము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరతత్త్వముగా అంగీకరింపని భక్తులు పెక్కురు గలరు. భగవద్ధామప్రాప్తి యను భక్తియోగఫలమును అట్టి వారెన్నడును రుచిచూడలేరు. అదే విధముగా కామ్యకర్మలందు, పుణ్యకర్మలందు మగ్నులైనవారు మరియు భౌతికబంధముల నుండి ముక్తిని వాంచించువారు సైతము దేవదేవుడైన శ్రీకృష్ణుని నిరసించు కారణముగా కృతకృత్యులు కాజాలరు. వేరుమాటలలో శ్రీకృష్ణుని యెడ అపహాస్య భావముతో వర్తించువారే దానవస్వభావులు లేదా నాస్తికస్వభావులు అయినట్టివారు. భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు అట్టి దానవప్రవృత్తి కలవారు కృష్ణుని శరణునొందరు. కనుక పరతత్త్వమును అవగాహన చేసికొన యత్నించు వారు మానసికకల్పనలు సాధారణజీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే, సమానమే అనెడి మిథ్యానిర్ణయమునకు వారిని చేర్చును. అట్టి మిథ్యాభావనలో వారు ప్రస్తుతము దేహము ప్రక్రుతిచే కప్పబడియున్నదనియు, భౌతికదేహము నుండి ముక్తిని బడసినంతనే భగవానుడు మరియు తమ నడుమ భేదముండదనియు భావింతురు. కాని శ్రీకృష్ణునితో ఏకము కావలెననెడి వారు ప్రయత్నము భ్రాంతి కారణముగా వ్యర్థమగును. అట్టి దానవ, నాస్తికప్రవృత్తితో కూడియున్న జ్ఞానము వ్యర్థమని ఈ శ్లోకమున సూచించబడినది. అనగా వేదాంతసూత్రములు, ఉపనిషత్తులు వంటి వేదవాజ్మయమునందలి జ్ఞానసముపార్జనము దానవ, నాస్తికప్రవృత్తి గలవారికి సదా వ్యర్థమే కాగలదు.

కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుని సామాన్యమానవునిగా భావించుట గొప్ప అపరాధము. అట్లు భావించెడివారు శ్రీకృష్ణుని నిత్యస్వరూపమును తెలియలేనందున నిక్కము భ్రాంతులగుదురు. ఈ విషయమునే బృహద్విష్ణుస్మృతి ఇట్లు స్పష్టముగా పలుకుచున్నది.

యోవేత్తి భౌతికం దేహమ్ కృష్ణస్య పరమాత్మన: |
స సర్వస్మా ద్బహిష్కార్య: శ్రౌతస్మార్తవిధానత: |
ముఖం తస్యావలోక్యాపి సచేలం స్నానమాచరేత్ ||

“శ్రీకృష్ణుని దేహమును భౌతికమని భావించువారిని శృతి మరియు స్మృతుల సర్వకర్మకలాపముల నుండి తరిమివేయవలెను. అట్టివారి ముఖమును చూచినచో, పాపపరిహారార్థము తక్షణమే గంగలో స్నానమాడవలెను.” శ్రీకృష్ణుని దేవదేవత్వముపై అసూయ కలిగినవారైనందుననే జనులు అతనిని అవమానింతురు. వారు నిక్కముగా మరల, మరల నాస్తిక, దానవజన్మలనే పొందుదురు. తత్కారణముగా వారి నిజజ్ఞానము భ్రాంతికి లోనైయుండి క్రమముగా వారు సృష్టియందలి అంధకారబంధురమైన లోకములను చేరుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 331 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 12  🌴

12 . moghāśā mogha-karmāṇo
mogha-jñānā vicetasaḥ
rākṣasīm āsurīṁ caiva
prakṛtiṁ mohinīṁ śritāḥ

🌷 Translation : 
Those who are thus bewildered are attracted by demonic and atheistic views. In that deluded condition, their hopes for liberation, their fruitive activities, and their culture of knowledge are all defeated.

🌹 Purport :
There are many devotees who assume themselves to be in Kṛṣṇa consciousness and devotional service but at heart do not accept the Supreme Personality of Godhead, Kṛṣṇa, as the Absolute Truth. For them, the fruit of devotional service – going back to Godhead – will never be tasted. Similarly, those who are engaged in fruitive pious activities and who are ultimately hoping to be liberated from this material entanglement will never be successful either, because they deride the Supreme Personality of Godhead, Kṛṣṇa. In other words, persons who mock Kṛṣṇa are to be understood to be demonic or atheistic. As described in the Seventh Chapter of Bhagavad-gītā, such demonic miscreants never surrender to Kṛṣṇa. Therefore their mental speculations to arrive at the Absolute Truth bring them to the false conclusion that the ordinary living entity and Kṛṣṇa are one and the same. With such a false conviction, they think that the body of any human being is now simply covered by material nature and that as soon as one is liberated from this material body there is no difference between God and himself.

This attempt to become one with Kṛṣṇa will be baffled because of delusion. Such atheistic and demoniac cultivation of spiritual knowledge is always futile. That is the indication of this verse. For such persons, cultivation of the knowledge in the Vedic literature, like the Vedānta-sūtra and the Upaniṣads, is always baffled.

It is a great offense, therefore, to consider Kṛṣṇa, the Supreme Personality of Godhead, to be an ordinary man. Those who do so are certainly deluded because they cannot understand the eternal form of Kṛṣṇa. The Bṛhad-viṣṇu-smṛti clearly states:

yo vetti bhautikaṁ dehaṁ
kṛṣṇasya paramātmanaḥ
sa sarvasmād bahiṣ-kāryaḥ
śrauta-smārta-vidhānataḥ
mukhaṁ tasyāvalokyāpi
sa-celaṁ snānam ācaret

“One who considers the body of Kṛṣṇa to be material should be driven out from all rituals and activities of the śruti and the smṛti. And if one by chance sees his face, one should at once take bath in the Ganges to rid himself of infection.” People jeer at Kṛṣṇa because they are envious of the Supreme Personality of Godhead. Their destiny is certainly to take birth after birth in the species of atheistic and demoniac life. Perpetually, their real knowledge will remain under delusion, and gradually they will regress to the darkest region of creation.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 07/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 332: 09వ అధ్.,  శ్లో 13 /  Bhagavad-Gita - 332: Chap. 09, Ver. 13

🌹. శ్రీమద్భగవద్గీత - 332 / Bhagavad-Gita - 332 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 13  🌴

13.  మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా: |
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ పృథాకుమారా! భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీప్రకృతిని ఆశ్రయించియుందురు. వారు నన్ను ఆదియును, అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు.

🌷. భాష్యము : 
మహాత్ములైనవారి వర్ణనము ఈ శ్లోకమున స్పష్టముగా ఒసగబడినది. దైవీప్రకృతిలో స్థితిని పొందియుండుటయే మహాత్ముల ప్రథమ లక్షణము. అతడెన్నడును భౌతికప్రకృతికి లోబడియుండడు. అది ఎట్లు సాధ్యమనెడి విషయము సప్తమాధ్యాయమున ఇదివరకే వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణము నొందినవాడు శీఘ్రమే భౌతికప్రకృతి యొక్క అధీనము నుండి ముక్తి నొందగలడు. అదియే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మనుజుడు తన ఆత్మను ఆ భగవానుని అధీనము చేసినంతనే భౌతికప్రకృతి అదుపు నుండి ముక్తుడు కాగాలడన్నది ప్రాథమికసూత్రము. తటస్థశక్తియైన జీవుడు భౌతికశక్తి నుండి విడివడినంతనే ఆధ్యాత్మికశక్తి నేతృత్వమునకు మరియు నిర్దేశమునకు వచ్చును. అట్టి ఆధ్యాత్మికప్రకృతి నిర్దేశమే “దైవీప్రకృతి” యని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణభగవానునికి శరణమునొంది ఆ విధముగా పురోగతి నొందినపుడు మనుజుడు “మహాత్ముడు” అనెడి స్థాయిని పొందగలడు.

శ్రీకృష్ణుడే ఆదిపురుషుడు మరియు సర్వకారణములకు కారణమని సంపూర్ణముగా తెలిసియున్నందున మహాత్ముడైనవాడు తన మనస్సును కృష్ణునిపై నుండి ఇతరము వైపునకు మళ్ళింపడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. మహాత్ములైన శుద్ధభక్తుల సాంగత్యము వలననే అట్టి మహాత్ముడు రూపొందగలడు. శుద్ధభక్తులైనవారు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపములందును ఆకర్షితులుగాక కేవలము అతని ద్విభుజరూపమునందే అనురాగమును, ఆకర్షణను కలిగియుందురు. కృష్ణుని ఇతర రూపముల యెడ గాని, ఇతర దేవతల యెడగాని, మనుజుల యెడగాని వారెన్నడును ఆకర్షుతులు కారు. సంపూర్ణ భక్తిభావనలో కృష్ణుని పైననే ధ్యానము నిలిపి, ఆ కృష్ణభక్తిరసభావనలో వారు నిశ్చితమైన కృష్ణసేవ యందు సదా నియుక్తులై యుందురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 332 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 13  🌴

13 . mahātmānas tu māṁ pārtha
daivīṁ prakṛtim āśritāḥ
bhajanty ananya-manaso
jñātvā bhūtādim avyayam

🌷 Translation : 
O son of Pṛthā, those who are not deluded, the great souls, are under the protection of the divine nature. They are fully engaged in devotional service because they know Me as the Supreme Personality of Godhead, original and inexhaustible.

🌹 Purport :
In this verse the description of the mahātmā is clearly given. The first sign of the mahātmā is that he is already situated in the divine nature. He is not under the control of material nature. And how is this effected? That is explained in the Seventh Chapter: one who surrenders unto the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, at once becomes freed from the control of material nature. That is the qualification. One can become free from the control of material nature as soon as he surrenders his soul to the Supreme Personality of Godhead. That is the preliminary formula. Being marginal potency, as soon as the living entity is freed from the control of material nature, he is put under the guidance of the spiritual nature. The guidance of the spiritual nature is called daivī prakṛti, divine nature. So when one is promoted in that way – by surrendering to the Supreme Personality of Godhead – one attains to the stage of great soul, mahātmā.

The mahātmā does not divert his attention to anything outside Kṛṣṇa, because he knows perfectly well that Kṛṣṇa is the original Supreme Person, the cause of all causes. There is no doubt about it. Such a mahātmā, or great soul, develops through association with other mahātmās, pure devotees. Pure devotees are not even attracted by Kṛṣṇa’s other features, such as the four-armed Mahā-viṣṇu. They are simply attracted by the two-armed form of Kṛṣṇa. They are not attracted to other features of Kṛṣṇa, nor are they concerned with any form of a demigod or of a human being. They meditate only upon Kṛṣṇa in Kṛṣṇa consciousness. They are always engaged in the unswerving service of the Lord in Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 08/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 333: 09వ అధ్.,  శ్లో 14 /  Bhagavad-Gita - 333: Chap. 09, Ver. 14

🌹. శ్రీమద్భగవద్గీత - 333 / Bhagavad-Gita - 333 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 14 🌴
14. సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతా: |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||
🌷. తాత్పర్యం :
ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు, నాకు నమస్కారమొసగుచు, నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు.
🌷. భాష్యము :
సామాన్యమానవునికి అధికారికముగా ముద్రవేయుట ద్వారా మహాత్ముడు కాజాలడు.
మహాత్ముని లక్షణములు ఇట వర్ణింపబడినవి. మాహాత్ముడైనవాడు సదా దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమలను కీర్తించుట యందే నిమగ్నుడై యుండును. దానికి అన్యమైన కర్మ ఏదియును లేకుండా ఆ భక్తుడు కీర్తనమందే సదా నియుక్తుడై యుండును. అనగా అతడెన్నడును నిరాకారవాది కాడు.
కీర్తనమను విషయము చర్చకు వచ్చినప్పుడు మనుజుడు దానిని దేవదేవుని పవిత్రనామమును, దివ్యరూపమును, దివ్యగుణములను, అసాధారణలీలలను కీర్తించుటకే ఉపయోగించవలెను.
అవన్నియును ప్రతియోక్కరిచే కీర్తనీయములు కనుకనే మహాత్ముడైనవాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురక్తుడై యుండును.
శ్రీకృష్ణభగవానుని నిరాకారరూపమైన బ్రహ్మజ్యోతి యెడ అనురక్తుడై యుండెడివాడు భగవద్గీత యందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివాడు తదుపరి శ్లోకమున ఇందుకు భిన్నముగా వర్ణింపబడినాడు.
శ్రీమద్భాగవతమున తెలుపబడినట్లు మహాత్ముడైనవాడు విష్ణువు యొక్క శ్రవణ, కీర్తనములను కూడిన భక్తియుతసేవ యందు సదా నిమగ్నుడై యుండును.
అతడు శ్రీకృష్ణభగవానుని సేవలోనే నిలుచునుగాని, దేవతలు లేదా మనుష్యుల సేవలో కాదు. ఆ రీతి దేవదేవుని సదా స్మరించుటయే భక్తి(శ్రవణం, కీర్తనం, విష్ణో: స్మరణం) యనబడును.
దివ్యమైన ఐదు భక్తిరసములలో ఏదేని ఒక భక్తిరసము ద్వారా అంత్యమున అ భగవానునితో నిత్య సాహచార్యమును పొందవలెనని ఆ మహాత్ముడు దృఢనిశ్చయమును కలిగయుండును.
దాని యందు జయమును పొందుట అతడు తన మనోవాక్కాయ కర్మలన్నింటిని ఆ దేవదేవుని సేవ యందే నియోగించును. అదియే సంపూర్ణ కృష్ణభక్తిరస భావనమని పిలువబడుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 333 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 14 🌴
14 . satataṁ kīrtayanto māṁ
yatantaś ca dṛḍha-vratāḥ
namasyantaś ca māṁ bhaktyā
nitya-yuktā upāsate
🌷 Translation :
Always chanting My glories, endeavoring with great determination, bowing down before Me, these great souls perpetually worship Me with devotion.
🌹 Purport :
The mahātmā cannot be manufactured by rubber-stamping an ordinary man.
His symptoms are described here: a mahātmā is always engaged in chanting the glories of the Supreme Lord Kṛṣṇa, the Personality of Godhead.
He has no other business. He is always engaged in the glorification of the Lord. In other words, he is not an impersonalist.
When the question of glorification is there, one has to glorify the Supreme Lord, praising His holy name, His eternal form, His transcendental qualities and His uncommon pastimes.
One has to glorify all these things; therefore a mahātmā is attached to the Supreme Personality of Godhead.
One who is attached to the impersonal feature of the Supreme Lord, the brahma-jyotir, is not described as mahātmā in the Bhagavad-gītā. He is described in a different way in the next verse.
The mahātmā is always engaged in different activities of devotional service, as described in the Śrīmad-Bhāgavatam, hearing and chanting about Viṣṇu, not a demigod or human being.
That is devotion: śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ and smaraṇam, remembering Him. Such a mahātmā has firm determination to achieve at the ultimate end the association of the Supreme Lord in any one of the five transcendental rasas.
To achieve that success, he engages all activities – mental, bodily and vocal, everything – in the service of the Supreme Lord, Śrī Kṛṣṇa. That is called full Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

Date:  09/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 334: 09వ అధ్.,  శ్లో 15 /  Bhagavad-Gita - 334: Chap. 09, Ver. 15

🌹. శ్రీమద్భగవద్గీత - 334 / Bhagavad-Gita - 334 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 15  🌴

15.  జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ||

🌷. తాత్పర్యం :
జ్ఞానసముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివధరుపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.

🌷. భాష్యము : 
పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము. సంపూర్ణ భక్తిభావనలో నిలిచి తనను తప్ప అన్యమును తెలియనివారు మహాత్ములని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపియున్నాడు. అట్టి మహాత్ముల స్థాయికి చెందకున్నను శ్రీకృష్ణునే పలువిధములుగా పూజించువారు కొందరు గలరు. 

వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానసముపార్జన యందు నియుక్తులైనవారుగా ఇదివరకే వర్ణింపబడినారు. 

వీరికన్నను తక్కువస్థాయిలో గల ఇతరులు తిరిగి మూడు రకములుగా విభజింపబడిరి. 

అందులో మొదటిరకమువారు ఆత్మనే భగవానుని తలచి తమను తాము అర్చించుకొందురు. 

రెండవరకమువారు భగవానునికి ఏదో తోచినరూపము ఆపాదించి దానిని అర్చింతురు. 

మూడవ రకము వారు చెందినవారు విశ్వమును భగవానునిగా భావించి పూజింతురు. 

ఈ మూడురకములలో తమను అద్వైతులుగా భావించుచు తమను తామే భగవానుని రూపమున అర్చించువారు అధికముగా నుందురు. వారు అధములు. 

అట్టివారు తమనే భగవానుని భావించుచు అదే భావనలో తమను తాము పూజించుకొందురు. ఇదియును ఒక విధమైన భగవదర్చనమే. 

ఏలయన అట్లు చేయువారు తాము దేహాదులము కామనియు, కేవలము ఆత్మస్వరూపలమేననియు సంపూర్ణముగా తెలిసియుందురు. కనీసము వారి యందు అట్టి భావనము ప్రబలముగా నుండును. 

సాధారణగా నిరాకారవాదులు దేవదేవుని ఈ రీతిగనే అర్చింతురు. ఈ రూపమైనను భగవానుని రూపమే అనెడి భావనలో ఇతర దేవతార్చనము చేయువారు రెండవ తరగతికి చెందినవారు. 

ఇక మూడవతరగతికి చెందినవారు విశ్వమును తప్ప అన్యమును ఊహింపలేక విశ్వమునే దివ్యముగా భావించి దానిని అర్చింతురు. 

అట్టి విశ్వము కూడా శ్రీకృష్ణభగవానుని రూపమే అయియున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 334 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 15  🌴

15. jñāna-yajñena cāpy anye
yajanto mām upāsate
ekatvena pṛthaktvena
bahudhā viśvato-mukham

🌷 Translation : 
Others, who engage in sacrifice by the cultivation of knowledge, worship the Supreme Lord as the one without a second, as diverse in many, and in the universal form.

🌹 Purport :
This verse is the summary of the previous verses. 

The Lord tells Arjuna that those who are purely in Kṛṣṇa consciousness and do not know anything other than Kṛṣṇa are called mahātmā; yet there are other persons who are not exactly in the position of mahātmā but who worship Kṛṣṇa also, in different ways. 

Some of them have already been described as the distressed, the financially destitute, the inquisitive, and those who are engaged in the cultivation of knowledge. But there are others who are still lower, and these are divided into three: 

(1) he who worships himself as one with the Supreme Lord, 

(2) he who concocts some form of the Supreme Lord and worships that, and 

(3) he who accepts the universal form, the viśva-rūpa of the Supreme Personality of Godhead, and worships that. 

Out of the above three, the lowest, those who worship themselves as the Supreme Lord, thinking themselves to be monists, are most predominant. Such people think themselves to be the Supreme Lord, and in this mentality they worship themselves. 

This is also a type of God worship, for they can understand that they are not the material body but are actually spiritual soul; at least, such a sense is prominent. Generally the impersonalists worship the Supreme Lord in this way. 

The second class includes the worshipers of the demigods, those who by imagination consider any form to be the form of the Supreme Lord. 

And the third class includes those who cannot conceive of anything beyond the manifestation of this material universe. 

They consider the universe to be the supreme organism or entity and worship that. The universe is also a form of the Lord.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 10/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 335: 09వ అధ్.,  శ్లో 16 /  Bhagavad-Gita - 335: Chap. 09, Ver. 16

🌹. శ్రీమద్భగవద్గీత - 335 / Bhagavad-Gita - 335 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 16  🌴

16.  అహం క్రతురహం యజ్ఞ: స్వధాహమహమౌష ధమ్ |
 మన్త్రోహమహవేవాజ్యమహమగ్నిరహం హుతమ్ || 

🌷. తాత్పర్యం :
నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే.

🌷. భాష్యము : 
“జ్యోతిష్టోమము” అను వైదికయజ్ఞము శ్రీకృష్ణుడే. అదే విధముగా స్మృతి యందు తెలుపబడిన “మహాయజ్ఞము” కూడా అతడే. పితృలోకమునకు అర్పింపబడు ఆహుతి లేక పితృలోకప్రీత్యర్థమై ఒనరించబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. 

అట్టి ఆహుతులు నెయ్యిరూపున గల ఒకానొక ఔషధముగా పరిగణింపబడును. ఇట్టి కార్యమునకు సంబంధించిన మంత్రములు సైతము శ్రీకృష్ణుడే. 

యజ్ఞములందు అర్పింపబడు పాలకు సంబంధించిన పదార్థములన్నియును శ్రీకృష్ణుడే. ప్రకృతి మూలకములలో ఒకటియైనందున అగ్నియు శ్రీకృష్ణుడే. 

కాని అది ప్రకృతికి సంబంధించినది కావున భగవానుని నుండి విడివడియున్నదిగా తెలియబడును. వేరు మాటలలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగము నందు ఉపదేశింపబడిన యజ్ఞములన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణుడే. 

అనగా శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు నియుక్తులైనవారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టివారే యగుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 335 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 16  🌴

16. ahaṁ kratur ahaṁ yajñaḥ
svadhāham aham auṣadham
mantro ’ham aham evājyam
aham agnir ahaṁ hutam

🌷 Translation : 
But it is I who am the ritual, I the sacrifice, the offering to the ancestors, the healing herb, the transcendental chant. I am the butter and the fire and the offering.

🌹 Purport :
The Vedic sacrifice known as Jyotiṣṭoma is also Kṛṣṇa, and He is also the Mahā-yajña mentioned in the smṛti. 

The oblations offered to the Pitṛloka or the sacrifice performed to please the Pitṛloka, considered as a kind of drug in the form of clarified butter, is also Kṛṣṇa. 

The mantras chanted in this connection are also Kṛṣṇa. And many other commodities made with milk products for offering in the sacrifices are also Kṛṣṇa. 

The fire is also Kṛṣṇa because fire is one of the five material elements and is therefore claimed as the separated energy of Kṛṣṇa. 

In other words, the Vedic sacrifices recommended in the karma-kāṇḍa division of the Vedas are in total also Kṛṣṇa. 

Or, in other words, those who are engaged in rendering devotional service unto Kṛṣṇa are to be understood to have performed all the sacrifices recommended in the Vedas.
🌹 🌹 🌹 🌹 🌹
#Bhagavad-Gita

Date: 11/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 336: 09వ అధ్.,  శ్లో 17 /  Bhagavad-Gita - 336: Chap. 09, Ver. 17

🌹. శ్రీమద్భగవద్గీత - 336 / Bhagavad-Gita - 336 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 17  🌴

17.  పితాహమస్య జగతో మతా ధాతా పితామహ: |
వేద్యం పవిత్రం ఓంకార ఋక్సామ యజురేవచ ||

🌷. తాత్పర్యం :
నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయియున్నాను. జ్ఞానలక్ష్యమును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము,యజుర్వేదములు కూడా నేనే.

🌷. భాష్యము : 
స్థావరజంగమాత్మకమైన సమస్తసృష్టి శ్రీకృష్ణుని శక్తి యొక్క వ్యక్తీకరణమై యున్నది. ప్రస్తుత భౌతికస్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థశక్తులేయైన వివిధజీవులతో వివధ సంబంధములను ఏర్పరచుకొనియున్నాము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా గోచరింతురు. కాని వాస్తవమునకు అట్లు గోచరించు వారందరును శ్రీకృష్ణుని అంశలే. అనగా తల్లి, తండ్రి ఆది వివిధరూపములలో గోచరించునది శ్రీకృష్ణుడే గాని వేరెవ్వరును కాదు. ఈ శ్లోకమునందలి “ధాత” యను పదమునకు “సృష్టికర్త” యని భావము. మన తల్లిదండ్రులే గాక, సృష్టికర్త, పితామహి, పితామాహాదులు సైతము శ్రీకృష్ణుడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలైయున్నందున ప్రతిజీవియు కృష్ణునితో సమానమే. కనుకనే వేదములన్నియును శ్రీకృష్ణుని వైపునకే కేంద్రీకరింపబడియున్నవి. తత్కారణముగా మనము వేదముల నుండి ఏది తెలియ యత్నించినను అది శ్రీకృష్ణపరజ్ఞానమును పొందుటలో పురోగతియే యగును. మన స్థితి పవిత్రపరచు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అదే విధముగా వేదంనియమములను అవగతము చేసికొనుట యందు జిజ్ఞాసువైనవాడు సైతము శ్రీకృష్ణుని అంశయే. కనుక అతడును శ్రీకృష్ణుడే. వేదమంత్రములందు ప్రణవమని పిలువబడు పవిత్ర ఓంకారము కూడా శ్రీకృష్ణుడే. సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము మరియు అథర్వవేదములందలి అన్ని శ్లోకములలో ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని శ్రీకృష్ణునుగా అవగాహనము చేసికొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 336 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 17  🌴

17. pitāham asya jagato
mātā dhātā pitāmahaḥ
vedyaṁ pavitram oṁ-kāra
ṛk sāma yajur eva ca

🌷 Translation : 
I am the father of this universe, the mother, the support and the grandsire. I am the object of knowledge, the purifier and the syllable oṁ. I am also the Ṛg, the Sāma and the Yajur Vedas.

🌹 Purport :
The entire cosmic manifestations, moving and nonmoving, are manifested by different activities of Kṛṣṇa’s energy. In the material existence we create different relationships with different living entities who are nothing but Kṛṣṇa’s marginal energy; under the creation of prakṛti some of them appear as our father, mother, grandfather, creator, etc., but actually they are parts and parcels of Kṛṣṇa. As such, these living entities who appear to be our father, mother, etc., are nothing but Kṛṣṇa. In this verse the word dhātā means “creator.” Not only are our father and mother parts and parcels of Kṛṣṇa, but the creator, grandmother and grandfather, etc., are also Kṛṣṇa. Actually any living entity, being part and parcel of Kṛṣṇa, is Kṛṣṇa. All the Vedas, therefore, aim only toward Kṛṣṇa. Whatever we want to know through the Vedas is but a progressive step toward understanding Kṛṣṇa. That subject matter which helps us purify our constitutional position is especially Kṛṣṇa. Similarly, the living entity who is inquisitive to understand all Vedic principles is also part and parcel of Kṛṣṇa and as such is also Kṛṣṇa. In all the Vedic mantras the word oṁ, called praṇava, is a transcendental sound vibration and is also Kṛṣṇa. And because in all the hymns of the four Vedas – Sāma, Yajur, Ṛg and Atharva – the praṇava, or oṁ-kāra, is very prominent, it is understood to be Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 12/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 337: 09వ అధ్.,  శ్లో 18 /  Bhagavad-Gita - 337: Chap. 09, Ver. 18

🌹. శ్రీమద్భగవద్గీత - 337 / Bhagavad-Gita - 337 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 18  🌴

18.  గతిర్భర్తా ప్రభు: సాక్షీ నివాస: శరణం సుహృత్ |
ప్రభవ: ప్రలయ: స్థానం నిధానం బీజమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
గమ్యమును, భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, విధానమును, అవ్యయ బీజమును అయి యున్నాను.

🌷. భాష్యము : 
“గతి”యనగా చేరవలసిన గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికిని శ్రీకృష్ణభగవానుడే చేరవలసిన గమ్యస్థానము. శ్రీకృష్ణుని తెలిసికొనలేనివాడు తప్పుదోవ పట్టగలడు. అంతియేగాక అట్టివాని నామమాత్ర పురోగతి పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. కొందరు వివిధదేవతలను తమ గమ్యస్థానముగా భావించి ఆయా విధానముల తీవ్ర యత్నములచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకాది వివిధలోకములును చేరుచుందురు. శ్రీకృష్ణుని సృష్టియే అయినందున ఆ లోకములన్నియు ఏకకాలమున కృష్ణునితో సమానములు మరియు కృష్ణునితో అసమానములై యున్నవి. కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణములై ఆ లోకములు కృష్ణునితో సమానమైన కృష్ణుని సంపూర్ణజ్ఞానమును పొందుటలో ముందడుగు వంటివి మాత్రమే. అనగా కృష్ణుని వివిధశక్తుల దరిచేరుట లేదా వాటిని గమ్యముగా భావించుట యనునది శ్రీకృష్ణుని పరోక్షముగా చేరుట వంటిది. కాని మనుజుడు కాలము మరియు శక్తి వ్యర్థము కాకూడదని తలచినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని దరిచేరవలెను. ఉదాహరణమునకు అనేక అంతస్థులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్థునకు చేరుటకు యంత్రసౌకర్యమున్నచో మెట్ల మీద నెమ్మదిగా ఏల పోవలెను? సర్వము శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి యున్నందున అతని ఆశ్రయము లేనిదే ఏదియును స్థితిని కలిగియుండలేదు. సమస్తము శ్రీకృష్ణునికే చెంది అతని శక్తి పైననే ఆధారపడియుండుటచే వాస్తవమునకు సర్వమును ఆ భగవానుడే పరమ నియామకుడు. సర్వుల హృదయములందు పరమాత్మ రూపున వసించియుండుటచే అతడే దివ్య సాక్షి. మన నివాసములు, దేశములు లేక లోకములన్నియు వాస్తవమునకు శ్రీకృష్ణునితో సమానమే. అతడే పరమ ఆశ్రయమైనందున రక్షణమునకు లేదా దుఃఖనాశమునకు ప్రతియొక్కరు అతనినే శరణము నొందవలెను. మనము ఏదేని రక్షణము అవసరమైనప్పుడు దానిని సమాకుర్చునది ఒక సజీవశక్తియై యుండవలెనని మనము గుర్తెరుగవలెను. శ్రీకృష్ణుడే పరమజీవశక్తియై యున్నాడు. మన సృష్టికి అతడే కారణుడైనందున లేదా దివ్యజనకుడైనందున అతనికి మించిన సన్నిహిత స్నేహితుడుగాని, బంధువుగాని వేరొకరుండరు. ఆ శ్రీకృష్ణుడే సృష్టికి ఆదికారణుడు మరియు ప్రళయము పిమ్మట సర్వమునకు నిధానమునై యున్నాడు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వకారణములకు నిత్యకారణమని తెలియబడినాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 337 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 18  🌴

18. gatir bhartā prabhuḥ sākṣī
nivāsaḥ śaraṇaṁ suhṛt
prabhavaḥ pralayaḥ sthānaṁ
nidhānaṁ bījam avyayam

🌷 Translation : 
I am the goal, the sustainer, the master, the witness, the abode, the refuge and the most dear friend. I am the creation and the annihilation, the basis of everything, the resting place and the eternal seed.

🌹 Purport :
Gati means the destination where we want to go. But the ultimate goal is Kṛṣṇa, although people do not know it. One who does not know Kṛṣṇa is misled, and his so-called progressive march is either partial or hallucinatory. There are many who make as their destination different demigods, and by rigid performance of the strict respective methods they reach different planets known as Candraloka, Sūryaloka, Indraloka, Maharloka, etc. But all such lokas, or planets, being creations of Kṛṣṇa, are simultaneously Kṛṣṇa and not Kṛṣṇa. Such planets, being manifestations of Kṛṣṇa’s energy, are also Kṛṣṇa, but actually they serve only as a step forward for realization of Kṛṣṇa. To approach the different energies of Kṛṣṇa is to approach Kṛṣṇa indirectly. One should directly approach Kṛṣṇa, for that will save time and energy. For example, if there is a possibility of going to the top of a building by the help of an elevator, why should one go by the staircase, step by step? Everything is resting on Kṛṣṇa’s energy; therefore without Kṛṣṇa’s shelter nothing can exist. Kṛṣṇa is the supreme ruler because everything belongs to Him and everything exists on His energy. Kṛṣṇa, being situated in everyone’s heart, is the supreme witness.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 13/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 338: 09వ అధ్.,  శ్లో 19 /  Bhagavad-Gita - 338: Chap. 09, Ver. 19

🌹. శ్రీమద్భగవద్గీత - 338 / Bhagavad-Gita - 338 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 19 🌴

19. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్స్రుజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||

🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! వేడినొసగువాడను, వర్షము నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్, అసత్తులు రెండును నా యందే యున్నవి.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు తన వివిధశక్తులచే విద్యుత్,సూర్యుల ద్వారా వేడిని, వెలుతురును ప్రసరించుచుండును. 

వేసవి కాలమున వర్షము పడకుండా ఆపునది మరియు వర్షకాలమున కుండపోత వర్షములు కురిపించినది ఆ శ్రీకృష్ణుడే. జీవితకాలమున పొడగించుచు మనలను పోషించు ప్రాణశక్తి అయిన అతడు అంత్యమున మృత్యువుగా మనకు దర్శనమిచ్చును. 

ఈ శక్తులన్నింటిని విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడుమ ఎత్తి భేదము లేదని మనము నిశ్చయించుకొనగలము. అనగా సత్, అసత్తులు రెండును అతడే. 

కనుకనే కృష్ణభక్తిరసభావన యందు పురోగమించిన స్థితి యందు మనుజుడు సత్, అసత్తుల భేదమును గాంచక సర్వమునందు కృష్ణునే గాంచును.

సత్, అసత్ లు రెండును శ్రీకృష్ణుడే అయినందున సర్వ భౌతికసృష్టులను కలిగియున్న విశ్వరూపము కుడా శ్రీకృష్ణుడే. అంతియేగాక ద్విభుజ మురళీధర శ్యామసుందరుని రూపమున అతడు ఒనరించిన బృందావనలీలలు ఆ దేవదేవునివే.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 338 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 19 🌴

19. tapāmy aham ahaṁ varṣaṁ
nigṛhṇāmy utsṛjāmi ca
amṛtaṁ caiva mṛtyuś ca
sad asac cāham arjuna

🌷 Translation : 
O Arjuna, I give heat, and I withhold and send forth the rain. I am immortality, and I am also death personified. Both spirit and matter are in Me.

🌹 Purport :
Kṛṣṇa, by His different energies, diffuses heat and light through the agency of electricity and the sun. 

During the summer season it is Kṛṣṇa who checks rain from falling from the sky, and then during the rainy season He gives unceasing torrents of rain. 

The energy which sustains us by prolonging the duration of our life is Kṛṣṇa, and Kṛṣṇa meets us at the end as death. 

By analyzing all these different energies of Kṛṣṇa, one can ascertain that for Kṛṣṇa there is no distinction between matter and spirit, or, in other words, He is both matter and spirit. In the advanced stage of Kṛṣṇa consciousness, one therefore makes no such distinctions. He sees only Kṛṣṇa in everything.

Since Kṛṣṇa is both matter and spirit, the gigantic universal form comprising all material manifestations is also Kṛṣṇa, and His pastimes in Vṛndāvana as two-handed Śyāmasundara, playing on a flute, are those of the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 14/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 339: 09వ అధ్.,  శ్లో 20 /  Bhagavad-Gita - 339: Chap. 09, Ver. 20

🌹. శ్రీమద్భగవద్గీత - 339 / Bhagavad-Gita - 339 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 20 🌴

20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా
యజ్ఞైరష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే |
తే పుణ్యమాసాద్య సురేద్రలోకమ్
అశ్నన్తి దివ్యాన్దివి దేవా భోగాన్ ||

🌷. తాత్పర్యం :
స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగముల ననుభవింతురు.

🌷. భాష్యము :
ఈ శ్లోకము నందలి “త్రైవిద్యా:” అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుచున్నది. ఇట్టి మూడు వేదములను అధ్యయనము చేసిన బ్రహ్మణుడే “త్రివేది” యని పిలువబడును. 

ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానము యెడ ఆకర్షణను కలిగియుండువాడు నిక్కముగా సంఘములో అత్యంత గౌరవనీయుడు కాగలడు. కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనపు అంతిమ ప్రయోజనమును తెలియని వేదపండితులే అధికముగా నున్నారు. 

కనుకనే ఆ త్రివేదులకు అంతిమలక్ష్యము తానేయని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు శరణమునొంది అతని ప్రీత్యర్థమై భక్తియుక్తసేవలో నియుక్తులగుదురు. 

అట్టి భక్తియోగము హరేకృష్ణ మహామంత్రమును జపించుటతోను మరియు అదేసమయమున కృష్ణుని గూర్చి నిజముగా అవగతము చేసికొనుట యత్నించుటతోను ఆరంభమగును. 

కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనపరులు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకు యజ్ఞములు చేయుట యందే మగ్నులగుదురు. 

అట్టి యత్నముచే వివిధ దేవతార్చకులు నిక్కముగా రజస్తమోగుణ సంపర్కము నుండి శుద్ధిపడినవారై మహర్లోకము, జనలోకము, తపోలోకము పలు ఊర్థ్వలోకములను(స్వర్గలోకములను) చేరుదురు. అట్టి ఉన్నతలోకములను చేరిన పిమ్మట వారు భూలోకమున్నను అనేక లక్షలరెట్లు అధికముగా సుఖముల ననుభవింతురు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 339 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 20 🌴

20. trai-vidyā māṁ soma-pāḥ pūta-pāpā
yajñair iṣṭvā svar-gatiṁ prārthayante
te puṇyam āsādya surendra-lokam
aśnanti divyān divi deva-bhogān

🌷 Translation : 
Those who study the Vedas and drink the soma juice, seeking the heavenly planets, worship Me indirectly. Purified of sinful reactions, they take birth on the pious, heavenly planet of Indra, where they enjoy godly delights.

🌹 Purport :
The word trai-vidyāḥ refers to the three Vedas – Sāma, Yajur and Ṛg. A brāhmaṇa who has studied these three Vedas is called a tri-vedī. 

Anyone who is very much attached to knowledge derived from these three Vedas is respected in society. 

Unfortunately, there are many great scholars of the Vedas who do not know the ultimate purport of studying them. Therefore Kṛṣṇa herein declares Himself to be the ultimate goal for the tri-vedīs. 

Actual tri-vedīs take shelter under the lotus feet of Kṛṣṇa and engage in pure devotional service to satisfy the Lord. Devotional service begins with the chanting of the Hare Kṛṣṇa mantra and side by side trying to understand Kṛṣṇa in truth. 

Unfortunately those who are simply official students of the Vedas become more interested in offering sacrifices to the different demigods like Indra and Candra. 

By such endeavor, the worshipers of different demigods are certainly purified of the contamination of the lower qualities of nature and are thereby elevated to the higher planetary systems or heavenly planets known as Maharloka, Janaloka, Tapoloka, etc. 

Once situated on those higher planetary systems, one can satisfy his senses hundreds of thousands of times better than on this planet.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 15/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 340: 09వ అధ్.,  శ్లో 21 /  Bhagavad-Gita - 340: Chap. 09, Ver. 21

🌹. శ్రీమద్భగవద్గీత - 340 / Bhagavad-Gita - 340 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 21 🌴

21. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి |
ఏవం త్రయిధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభన్తే ||

🌷. తాత్పర్యం :
విస్తృతమైన స్వర్గలోకభోగముల ననుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగివత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియభోగమును వాంచించువారు కేవలము జననమరణములనే మరల, మరల పొందుదురు.

🌷. భాష్యము :
ఊర్థ్వలోకములను పొందినవాడు అధిక ఆయుష్షును మరియు ఇంద్రియభోగమును అధికమైన వసతులను పొందగలిగినను శాశ్వతముగా అచ్చటనే ఉండుటకు అనుమతింపబడడు. పుణ్యకర్మఫలము నశించినంతనే అతడు తిరిగి భూలోకమునకు పంపబడును. వేదాంతసూత్రములందు (జన్మాద్యస్యయత:) తెలుపబడినరీతిగా సంపూర్ణజ్ఞానమును సాధించినట్టివాడు, అనగా సర్వకారణకారణుడైన శ్రీకృష్ణుని అవగతము చేసికొనుటలో విఫలుడైనవాడు జీవితపు పరమలక్ష్యమును సాధించుటలో విఫలత్వము నొందినవాడగును. తత్కారణముగా అతడు క్రిందికి, పైకి సదా తిరుగుచుండు రంగులరాట్నముపైన కూర్చున్నవాని వలె ఊర్థ్వలోకమునకు ఉద్ధరింపబడుచు, తిరిగి క్రిందకు చేరుచుండును. అనగా మనుజుడు మరల క్రిందికి తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మికలోకమును పొందక కేవలము ఊర్థ్వ, అధోలోకముల నడుమ జనన, మరణచక్రమందే తిరుగుచుండును. కావున మనుజుడు జ్ఞానానందపూర్ణమగు నిత్యజీవనమును అనుభవించుట ఆధ్యాత్మికలోకమును పొంది, తిరిగి ఈ దుఃఖకరమైన భౌతికస్థితికి రాకుండుట ఉత్తమము.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 340 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 21 🌴

21. te taṁ bhuktvā svarga-lokaṁ viśālaṁ
kṣīṇe puṇye martya-lokaṁ viśanti
evaṁ trayī-dharmam anuprapannā
gatāgataṁ kāma-kāmā labhante

🌷 Translation : 
When they have thus enjoyed vast heavenly sense pleasure and the results of their pious activities are exhausted, they return to this mortal planet again. Thus those who seek sense enjoyment by adhering to the principles of the three Vedas achieve only repeated birth and death.

🌹 Purport :
One who is promoted to the higher planetary systems enjoys a longer duration of life and better facilities for sense enjoyment, yet one is not allowed to stay there forever. One is again sent back to this earth upon finishing the resultant fruits of pious activities. He who has not attained perfection of knowledge, as indicated in the Vedānta-sūtra (janmādy asya yataḥ), or, in other words, he who fails to understand Kṛṣṇa, the cause of all causes, becomes baffled about achieving the ultimate goal of life and is thus subjected to the routine of being promoted to the higher planets and then again coming down, as if situated on a ferris wheel which sometimes goes up and sometimes comes down. The purport is that instead of being elevated to the spiritual world, from which there is no longer any possibility of coming down, one simply revolves in the cycle of birth and death on higher and lower planetary systems. One should better take to the spiritual world to enjoy an eternal life full of bliss and knowledge and never return to this miserable material existence.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 16/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 341: 09వ అధ్.,  శ్లో 22 /  Bhagavad-Gita - 341: Chap. 09, Ver. 22

🌹. శ్రీమద్భగవద్గీత - 341 / Bhagavad-Gita - 341 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 22 🌴

22. అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనా: పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||

🌷. తాత్పర్యం :
నా దివ్యరూపమును ధ్యానించుచు అనన్యభక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును (వారికి లేనివి సమకూర్చి, ఉన్నవి సంరక్షింతును).

🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావన లేకుండా క్షణకాలమును జీవింపలేనివాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మ సేవనము, ఇతర సేవలను గూర్చుట, సఖ్యము, ఆత్మనివేదనముల ద్వారా భక్తియుక్తసేవ యందు నియుక్తుడై ఇరువదినాలుగు గంటలు శ్రీకృష్ణుని చింతించుట కన్నను అన్యమును కావింపడు. 

అట్టి కర్మలు సర్వమంగళదాయకములు మరియు ఆధ్యాత్మికశక్తిపూర్ణములు. అవి ఆత్మానుభవమునందు భక్తుని పూర్ణుని కావింపగలదు. 

తద్ద్వారా శ్రీకృష్ణభగవానుని సాహచార్యము పొందుటయే అతని ఏకైక కోరిక కాగలదు. అట్టివాడు నిస్సందేహముగా ఆ భగవానుని ఎట్టి కష్టము లేకుండా చేరగలడు. వాస్తవమునకు ఇదియే యోగమనబడును. 

భగవానుని కరుణచే అట్టి భక్తుడు ఎన్నడును ఈ భౌతికజీవనమునకు తిరిగిరాడు. ఈ శ్లోకమునందలి “క్షేమము” అను పదము శ్రీకృష్ణభగవానుని కృపాపూర్ణరక్షణమును సూచించుచున్నది. 

అనగా యోగము ద్వారా కృష్ణభక్తిరసభావనను పొందుటకు భక్తునకు తోడ్పడు శ్రీకృష్ణభగవానుడు, అతడు సంపూర్ణ కృష్ణభక్తిరసభావితుడైన పిమ్మట దుఃఖభూయిష్టమైన బద్ధజీవనమునకు తిరిగి పతనము చెందకుండా రక్షణము నొసగును.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 341 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 22 🌴

22. ananyāś cintayanto māṁ
ye janāḥ paryupāsate
teṣāṁ nityābhiyuktānāṁ
yoga-kṣemaṁ vahāmy aham

🌷 Translation : 
But those who always worship Me with exclusive devotion, meditating on My transcendental form – to them I carry what they lack, and I preserve what they have.

🌹 Purport :
One who is unable to live for a moment without Kṛṣṇa consciousness cannot but think of Kṛṣṇa twenty-four hours a day, being engaged in devotional service by hearing, chanting, remembering, offering prayers, worshiping, serving the lotus feet of the Lord, rendering other services, cultivating friendship and surrendering fully to the Lord. 

Such activities are all auspicious and full of spiritual potencies, which make the devotee perfect in self-realization, so that his only desire is to achieve the association of the Supreme Personality of Godhead. Such a devotee undoubtedly approaches the Lord without difficulty. 

This is called yoga. By the mercy of the Lord, such a devotee never comes back to this material condition of life. Kṣema refers to the merciful protection of the Lord. 

The Lord helps the devotee to achieve Kṛṣṇa consciousness by yoga, and when he becomes fully Kṛṣṇa conscious the Lord protects him from falling down to a miserable conditioned life.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 17/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 342: 09వ అధ్.,  శ్లో 23 /  Bhagavad-Gita - 342: Chap. 09, Ver. 23

🌹. శ్రీమద్భగవద్గీత - 342 / Bhagavad-Gita - 342 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 23 🌴

23. యేప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితా: |
తేపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపుర్వకమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ కౌంతేయా! అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు.

🌷. భాష్యము :
“దేవతార్చనమునందు నియుక్తులైనవారు చేసెడి అర్చనము నాకే పరోక్షముగా అర్పింపబడినాడు వారు నిజమునకు మందబుద్దులై యున్నారు” అని శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. 

ఉదాహరణకు ఒకడు కొమ్మలకు, ఆకులకు నీరుపోసి చెట్టు మొదలుకు నీరుపోయనిచే తగినంత జ్ఞానము లేనివాడుగా (నియమపాలనము లేనివాడు) పరిగణింపబడును. 

అదేవిధముగా ఉదరమునకు ఆహారము నందించుటయే దేహేంద్రియములన్నింటిని సేవించుట లేదా పోషించుట కాగలదు. వాస్తవమునకు దేవతలు భగవానుని ప్రభుత్వమున వివిధ అధికారులు మరియు నిర్దేశకుల వంటివారు. 

జనులు ప్రభుత్వముచే ఏర్పరచబడిన శాసనములనే అనుసరించవలెను గాని, దాని యందలి అధికారులు లేదా నిర్దేశకుల వ్యక్తిగత శాసనములకు కాదు. అదేవిధముగా ప్రతియొక్కరు భగవానునే అర్చించవలెను. 

తద్ద్వారా అతని వివిధ అధికారులు మరియు నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములందు నియుక్తులై యున్నందున వారికి లంచమివ్వజూచుట వాస్తవమునకు చట్టవిరుద్ధము. 

ఈ విషయమే ఇచ్చట “అవిధిపూర్వకమ్” అని తెలుపబడినది. అనగా అనవసరమైన అన్యదేవతార్చనమును శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ఆమోదించుట లేదు. 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 342 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 23 🌴

23. ye ’py anya-devatā-bhaktā
yajante śraddhayānvitāḥ
te ’pi mām eva kaunteya
yajanty avidhi-pūrvakam

🌷 Translation : 
Those who are devotees of other gods and who worship them with faith actually worship only Me, O son of Kuntī, but they do so in a wrong way.

🌹 Purport :
“Persons who are engaged in the worship of demigods are not very intelligent, although such worship is offered to Me indirectly,” Kṛṣṇa says. 

For example, when a man pours water on the leaves and branches of a tree without pouring water on the root, he does so without sufficient knowledge or without observing regulative principles. 

Similarly, the process of rendering service to different parts of the body is to supply food to the stomach. 

The demigods are, so to speak, different officers and directors in the government of the Supreme Lord. One has to follow the laws made by the government, not by the officers or directors. 

Similarly, everyone is to offer his worship to the Supreme Lord only. That will automatically satisfy the different officers and directors of the Lord. 

The officers and directors are engaged as representatives of the government, and to offer some bribe to the officers and directors is illegal. 

This is stated here as avidhi-pūrvakam. In other words, Kṛṣṇa does not approve the unnecessary worship of the demigods.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 18/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 343: 09వ అధ్.,  శ్లో 24 /  Bhagavad-Gita - 343: Chap. 09, Ver. 24

🌹. శ్రీమద్భగవద్గీత - 343 / Bhagavad-Gita - 343 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 24 🌴

24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
నతు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ||

🌷. తాత్పర్యం :
నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయియున్నాను. కావున నా వాస్తవమైన దివ్యస్వభావమును గుర్తింపలేనివారు పతనము చెందుదురు.

🌷. భాష్యము : 
వేదవాజ్మయమునందు పలువిధములైన యజ్ఞములు నిర్దేశింపబడియున్నను, వాస్తవమునకు అవియన్నియును దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొరకే నిర్దేశింపబడినవి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. యజ్ఞముగా విష్ణువు. 

యజ్ఞుడు లేదా విష్ణువు ప్రీత్యర్థమే ప్రతియొక్కరు కర్మనొనరించవలెనని భగవద్గీత యందలి తృతీయాధ్యాయమున స్పష్టముగా తెలపబడినది. 

మానవనాగరికతకు పరిపక్వరూపమైన వర్ణాశ్రమధర్మము విష్ణుప్రీతికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. కనుకనే శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట “నేనే దివ్యప్రభువును గావున సర్వయజ్ఞములకు నేనే భోక్తను” అని పలికియున్నాడు. 

కాని మందమతులైనవారు ఈ సత్యమును తెలియక తాత్కాలిక లాభముల కొరకు ఇతర దేవతలను పూజింతురు. తత్కారణముగా వారు భౌతికస్థితికి పతనము నొంది ఎన్నడును మానవజన్మ యొక్క వాంఛితలక్ష్యమును సాధింపలేరు. 

అయినను ఎవరేని ఒక భౌతికకోరికరను కలిగియున్నచో దాని కొరకై శ్రీకృష్ణభగవానుని ప్రార్థించుట ఉత్తమము (అది శుద్ధభక్తి కానేరదు). తద్ద్వారా అతడు వాంఛితఫలమును పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 343 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 24 🌴

24. ahaṁ hi sarva-yajñānāṁ
bhoktā ca prabhur eva ca
na tu mām abhijānanti
tattvenātaś cyavanti te

🌷 Translation : 
I am the only enjoyer and master of all sacrifices. Therefore, those who do not recognize My true transcendental nature fall down.

🌹 Purport :
Here it is clearly stated that there are many types of yajña performances recommended in the Vedic literatures, but actually all of them are meant for satisfying the Supreme Lord. Yajña means Viṣṇu. 

In the Third Chapter of Bhagavad-gītā it is clearly stated that one should only work for satisfying Yajña, or Viṣṇu. The perfectional form of human civilization, known as varṇāśrama-dharma, is specifically meant for satisfying Viṣṇu. 

Therefore, Kṛṣṇa says in this verse, “I am the enjoyer of all sacrifices because I am the supreme master.” Less intelligent persons, however, without knowing this fact, worship demigods for temporary benefit. 

Therefore they fall down to material existence and do not achieve the desired goal of life. If, however, anyone has any material desire to be fulfilled, he had better pray for it to the Supreme Lord (although that is not pure devotion), and he will thus achieve the desired result.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 19/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 344: 09వ అధ్.,  శ్లో 25 /  Bhagavad-Gita - 344: Chap. 09, Ver. 25

🌹. శ్రీమద్భగవద్గీత - 344 / Bhagavad-Gita - 344 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 25 🌴

25. యాన్తి దేవవ్రతా దేవన్పితౄన్యాన్తి పితృవ్రతా: |
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోపి మాం ||

🌷. తాత్పర్యం :
దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత, ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు.

🌷. భాష్యము : 
చంద్రలోకమునుగాని, సూర్యలోకమునుగాని లేదా వేరే ఇతరలోకమును గాని చేరగోరిచనచో తత్ర్పయోజనార్థమై వేదములందు నిర్దేశింపబడిన “దర్శపౌర్ణమాసి” వంటి విధానములను పాటించుట ద్వారా మనుజుడు తన కోరిన గమ్యమును సాధించగలడు. 

వేదముల యందలి కర్మకాండభాగములో విశదముగా వివరింపబడిన ఈ పద్ధతులు వివిధ ఉన్నతలోకములందలి దేవతల కొరకు ప్రత్యేకములైన పూజలను నిర్దేశించుచున్నవి. 

అదే విధముగా ప్రత్యేక యజ్ఞముల ద్వారా మనుజుడు పితృలోకమును చేరవచ్చును లేదా భూత, ప్రేతలోకములను చేరి యక్షునిగా, రాక్షసునిగా లేక పిశాచముగా మారవచ్చును. పిశాచములకు ఒనర్చుపూజ వాస్తవమునకు “క్షుద్రదేవతార్చనము” అని పిలువబడును. అట్టి క్షుద్రదేవతార్చనము కావించువారు పెక్కురు కలరు. 

వారు దానిని ఆధ్యాత్మికమని భావించినను ఆ సమస్త కర్మలు నిజమునకు భౌతికములే. అదేవిధముగా దేవదేవునే అర్చించు శుద్ధభక్తుడు వైకుంఠలోకములందు గాని, కృష్ణలోకమును గాని అసంశయముగా పొందును. 

దేవతలను పూజించుట ద్వారా పితృలోకములను, క్షుద్రదేవతార్చనము ద్వారా పిశాచలోకములను మనుజుడు పొందుచుండ శుద్ధభక్తుడు ఎందులకు వైకుంఠలోకములను లేదా కృష్ణలోకమును పొందకుండునని ఈ అతిముఖ్యమైన శ్లోకము ద్వారా సులభముగ గ్రహింపవచ్చును. 

కాని శ్రీకృష్ణడు మరియు విష్ణువు వసించు ఈ దివ్యలోకములను గూర్చిన సమాచారము పెక్కుమందికి తెలియదు. వాని నెరుగని కారణమున వారు పతితులగుదురు. నిరాకారవాదులు సైతము బ్రహ్మజ్యోతి నుండు పతనము చెందగలరు. 

కనుకనే కేవలము హరేకృష్ణ మాహా మంత్రమును జపించుట ద్వారా మనుజుడు ఈ జన్మమందే పూర్ణుడై భగవద్దామమును చేరగలడని మహత్తరమైన సందేశమును సమస్త మానవాళికి కృష్ణచైతన్యోద్యమము తెలియపరచుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 344 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 25 🌴

25. yānti deva-vratā devān
pitṝn yānti pitṛ-vratāḥ
bhūtāni yānti bhūtejyā
yānti mad-yājino ’pi mām

🌷 Translation : 
Those who worship the demigods will take birth among the demigods; those who worship the ancestors go to the ancestors; those who worship ghosts and spirits will take birth among such beings; and those who worship Me will live with Me.

🌹 Purport :
If one has any desire to go to the moon, the sun or any other planet, one can attain the desired destination by following specific Vedic principles recommended for that purpose, such as the process technically known as Darśa-paurṇamāsa. 

These are vividly described in the fruitive activities portion of the Vedas, which recommends a specific worship of demigods situated on different heavenly planets. Similarly, one can attain the Pitā planets by performing a specific yajña.

 Similarly, one can go to many ghostly planets and become a Yakṣa, Rakṣa or Piśāca. Piśāca worship is called “black arts” or “black magic.” 

There are many men who practice this black art, and they think that it is spiritualism, but such activities are completely materialistic. Similarly, a pure devotee, who worships the Supreme Personality of Godhead only, achieves the planets of Vaikuṇṭha and Kṛṣṇaloka without a doubt. 

It is very easy to understand through this important verse that if by simply worshiping the demigods one can achieve the heavenly planets, or by worshiping the Pitās achieve the Pitā planets, or by practicing the black arts achieve the ghostly planets, why can the pure devotee not achieve the planet of Kṛṣṇa or Viṣṇu? 

Unfortunately many people have no information of these sublime planets where Kṛṣṇa and Viṣṇu live, and because they do not know of them they fall down. Even the impersonalists fall down from the brahma-jyotir. 

The Kṛṣṇa consciousness movement is therefore distributing sublime information to the entire human society to the effect that by simply chanting the Hare Kṛṣṇa mantra one can become perfect in this life and go back home, back to Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 20/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 345: 09వ అధ్.,  శ్లో 26 /  Bhagavad-Gita - 345: Chap. 09, Ver. 26

🌹. శ్రీమద్భగవద్గీత - 345 / Bhagavad-Gita - 345 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 26 🌴

26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మన: ||

🌷. తాత్పర్యం :
పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను, భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును.

🌷. భాష్యము : 
నిత్యానందము కొరకై శాశ్వతమును మరియు ఆనందనిధానమును అగు భగవద్దామమును పొందుటకు బుద్ధిమంతుడైనవాడు కృష్ణభక్తిభావనాయుతుడై శ్రీకృష్ణభగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తుడు కావలెను. అట్టి అద్భుతఫలములను కలుగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. 

ఎటువంటి యోగ్యతలేని అతిదరిద్రునికి సైతము అది ఆచరణసాధ్యము. కేవలము శ్రీకృష్ణభగవానునికి శుద్ధభక్తుడగుటయే ఈ విషయమున వాంఛనీయమగు ఏకైక యోగ్యత. మనుజుని దేశ,కాల పరిస్థితులతో దానికెట్టి సంబంధము లేదు. 

అతిసులభమైన ఈ పద్దతిలో మనుజుడు భక్తితో పత్రమునుగాని, జలమునుగాని, ఫలమునుగాని ఆ భగవానునకు ప్రేమతో అర్పింపవచ్చును. భగవానుడు అట్టి అర్పణమును ప్రియముతో స్వీకరింపగలడు. కృష్ణభక్తిభావన విధానము అత్యంత సులభము మరియు విశ్వజనీనమైనందున ఎవ్వరికినీ దీని యందు నిషేదము లేదు. 

అట్టియెడ ఈ సులభమార్గము ద్వారా కృష్ణభక్తిభావితుడై అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానపూర్ణమగు జీవనము పొంద వాంఛింపని అజ్ఞాని ఎవడుండును? శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాచించును గాని అన్యమును కాదు. 

తన శుద్ధభక్తుల నుండి చిన్న పుష్పమునైనను స్వీకరించు అతడు అభక్తుల నుండి ఎత్వంటి దానిని కూడా అంగీకరింపడు. ఆత్మారాముడైన అతడు ఇతరుల నుండి కోరునదేదియును లేదు. అయినను అతడు భక్తులు ప్రేమానురాగభావముతో ఒసగుదానిని ప్రియముతో స్వీకరించును. 

అట్టి భక్తిభావనను వృద్దిపరచుకొనుటయే జీవితపు పూర్ణత్వమై యున్నది. భక్తి యొక్కటే శ్రీకృష్ణుని చేరుటకు ఏకైకమార్గమని కచ్చితముగా తెలుపుట కొరకే ఈ శ్లోకమున భక్తి యను పదము రెండుమార్లు వాడబడినది. 

అనగా బ్రహ్మణుడగుట, పండితుడు, ధనవంతుడగుట లేదా గొప్ప తత్త్వవేత్త యగుట వంటి ఇతర ఏ విధానము చేతను మనుజుడు తానొసగునది శ్రీకృష్ణుడు అంగీకరించునట్లుగా చేయజాలడు. 

మూలనియమమైన భక్తి లేనప్పుడు ఏదియును అతనిని అంగీకరింపజేయలేదు. కనుకనే భక్తి ఎన్నడును సామాన్యమైనది కాదు. ఆ విధానము నిత్యమైనది. అది పరతత్త్వమునకు ఒనర్చబడు ప్రత్యక్ష్యసేవ.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 345 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 26 🌴

26. patraṁ puṣpaṁ phalaṁ toyaṁ
yo me bhaktyā prayacchati
tad ahaṁ bhakty-upahṛtam
aśnāmi prayatātmanaḥ

🌷 Translation : 
If one offers Me with love and devotion a leaf, a flower, a fruit or water, I will accept it.

🌹 Purport :
For the intelligent person, it is essential to be in Kṛṣṇa consciousness, engaged in the transcendental loving service of the Lord, in order to achieve a permanent, blissful abode for eternal happiness. 

The process of achieving such a marvelous result is very easy and can be attempted even by the poorest of the poor, without any kind of qualification. The only qualification required in this connection is to be a pure devotee of the Lord. It does not matter what one is or where one is situated. 

The process is so easy that even a leaf or a little water or fruit can be offered to the Supreme Lord in genuine love and the Lord will be pleased to accept it. No one, therefore, can be barred from Kṛṣṇa consciousness, because it is so easy and universal. 

Who is such a fool that he does not want to be Kṛṣṇa conscious by this simple method and thus attain the highest perfectional life of eternity, bliss and knowledge? Kṛṣṇa wants only loving service and nothing more. Kṛṣṇa accepts even a little flower from His pure devotee. 

He does not want any kind of offering from a nondevotee. He is not in need of anything from anyone, because He is self-sufficient, and yet He accepts the offering of His devotee in an exchange of love and affection. 

To develop Kṛṣṇa consciousness is the highest perfection of life. Bhakti is mentioned twice in this verse in order to declare more emphatically that bhakti, or devotional service, is the only means to approach Kṛṣṇa. 

No other condition, such as becoming a brāhmaṇa, a learned scholar, a very rich man or a great philosopher, can induce Kṛṣṇa to accept some offering.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 21/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 346: 09వ అధ్.,  శ్లో 27 /  Bhagavad-Gita - 346: Chap. 09, Ver. 27

🌹. శ్రీమద్భగవద్గీత - 346 / Bhagavad-Gita - 346 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 27 🌴

27. యత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కొన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.

🌷. భాష్యము : 
ఎట్టి పరిస్థితి యందును శ్రీకృష్ణభగవానుని మరవకుండునట్లుగా జీవితమును మలచుకొనుట ప్రతియొక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతియొక్కరు కర్మ చేయవలసియే ఉన్నందున తనకొరకు కర్మ చేయుమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. 

జీవనముకై ఆహారమును భుజించుట అవసరము గనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాదరూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను ఒనరింపవలసియున్నందున వానిని తన కొరకే చేయుమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అదియే అర్చనము. 

ప్రతియొక్కరు ఏదియో ఒకదానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే ఒసగుమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుపడిన ధనమును మనుజుడు కృష్ణచైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను. 

ధ్యానము ఈ యోగమునకు ఆచరణయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. 

కనుక ఎవరైనను హరేకృష్ణ మాహా మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని ఇరువదినాలుగుగంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి షష్టాధ్యాయమున వివరింపబడినట్లు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్పయోగి కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 346 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 🌴

27. yat karoṣi yad aśnāsi
yaj juhoṣi dadāsi yat
yat tapasyasi kaunteya
tat kuruṣva mad-arpaṇam

🌷 Translation : 
Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform – do that, O son of Kuntī, as an offering to Me.

🌹 Purport :
Thus, it is the duty of everyone to mold his life in such a way that he will not forget Kṛṣṇa in any circumstance. 

Everyone has to work for maintenance of his body and soul together, and Kṛṣṇa recommends herein that one should work for Him. 

Everyone has to eat something to live; therefore he should accept the remnants of foodstuffs offered to Kṛṣṇa. 

Any civilized man has to perform some religious ritualistic ceremonies; therefore Kṛṣṇa recommends, “Do it for Me,” and this is called arcana. 

Everyone has a tendency to give something in charity; Kṛṣṇa says, “Give it to Me,” and this means that all surplus money accumulated should be utilized in furthering the Kṛṣṇa consciousness movement. 

Nowadays people are very much inclined to the meditational process, which is not practical in this age, but if anyone practices meditating on Kṛṣṇa twenty-four hours a day by chanting the Hare Kṛṣṇa mantra round his beads, he is surely the greatest meditator and the greatest yogī, as substantiated by the Sixth Chapter of Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹

Date:  22/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 347: 09వ అధ్.,  శ్లో 28 /  Bhagavad-Gita - 347: Chap. 09, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 347 / Bhagavad-Gita - 347 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 28 🌴

28. శుభాశుభఫలరేవం మోక్ష్యసే కర్మబన్ధనై: |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||

🌷. తాత్పర్యం :
ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్న్యాసయోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు.

🌷. భాష్యము : 
ఉన్నతమైన మార్గదర్శకత్వమున కృష్ణభక్తిభావనలో వర్తించువాడు యుక్తుడని పిలువబడును. దీనికి సరియైన పదము “యుక్తవైరాగ్యము”. ఈ విషయమును గూర్చి శ్రీరూపగోస్వామి మరింతగా ఇట్లు వర్ణించిరి.

అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజత: |
 నిర్భంధ: కృష్ణసంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే ||

(భక్తిరసామృతసింధువు 1.2.255)

భౌతికజగమున ఉన్నంతవరకు మనము కర్మ చేయవలసిన ఉండును. కర్మను విరమించుట సాధ్యము కాదు. 

కనుకనే కర్మలను ఒనరించి ఆ ఫలమును శ్రీకృష్ణునకు సమర్పించినచో అది “యుక్తవైరాగ్యము” అనబడునని శ్రీరూపగోస్వామి పలికిరి. వైరాగ్యమునందు వాస్తవముగా నెలకొనినపుడు అట్టి కర్మలు చిత్తదర్పణమును పరిశుభ్రము చేయగలవు. 

ఇక కర్త ఆధ్యాత్మికానుభవమునందు క్రమపురోగతి సాధించిన కొలది శ్రీకృష్ణభగవానుని సంపూర్ణ శరణాగతుడై అంత్యమున మోక్షమును బడయును. అతడు పొందు ముక్తియు స్పష్టముగా వివరింపబడినది. 

ఈ ముక్తి ద్వారా అతడు బ్రహ్మజ్యోతిలో లీనముగాక భగవద్దామమున ప్రవేశించునని “మాముపైష్యసి” (నన్ను పొందును) యను పదము ద్వారా స్పష్టముగా తెలుపబడినది. 

వాస్తవమునకు ముక్తి ఐదురకములైనను జీవితమంతయు శ్రీకృష్ణభగవానుని నేతృత్వమున భక్తియోగమును సాగించిన భక్తుడు మాత్రము ఆధాత్మికముగా అత్యున్నతస్థితికి చేరి, దేహత్యాగానంతరము ఆ దేవదేవుని ధామము కేగి అతని ప్రత్యక్ష సాహచర్యమున నియుక్తుడగును.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 347 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 28 🌴

28. śubhāśubha-phalair evaṁ
mokṣyase karma-bandhanaiḥ
sannyāsa-yoga-yuktātmā
vimukto mām upaiṣyasi

🌷 Translation : 
In this way you will be freed from bondage to work and its auspicious and inauspicious results. With your mind fixed on Me in this principle of renunciation, you will be liberated and come to Me.

🌹 Purport :
One who acts in Kṛṣṇa consciousness under superior direction is called yukta. The technical term is yukta-vairāgya. This is further explained by Rūpa Gosvāmī as follows:

anāsaktasya viṣayān
yathārham upayuñjataḥ
nirbandhaḥ kṛṣṇa-sambandhe
yuktaṁ vairāgyam ucyate

(Bhakti-rasāmṛta-sindhu, 1.2.255)

Rūpa Gosvāmī says that as long as we are in this material world we have to act; we cannot cease acting. Therefore if actions are performed and the fruits are given to Kṛṣṇa, then that is called yukta-vairāgya. 

Actually situated in renunciation, such activities clear the mirror of the mind, and as the actor gradually makes progress in spiritual realization he becomes completely surrendered to the Supreme Personality of Godhead. Therefore at the end he becomes liberated, and this liberation is also specified. 

By this liberation he does not become one with the brahma-jyotir, but rather enters into the planet of the Supreme Lord. It is clearly mentioned here: mām upaiṣyasi, “he comes to Me,” back home, back to Godhead. 

There are five different stages of liberation, and here it is specified that the devotee who has always lived his lifetime here under the direction of the Supreme Lord, as stated, has evolved to the point where he can, after quitting this body, go back to Godhead and engage directly in the association of the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹

Date:  23/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 348: 09వ అధ్.,  శ్లో 29 /  Bhagavad-Gita - 348: Chap. 09, Ver. 29

🌹. శ్రీమద్భగవద్గీత - 348 / Bhagavad-Gita - 348 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 29 🌴

29. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియ: |
యే భజన్తి తు మాం భక్యా మయి తే తేషు చాప్యహమ్ ||

🌷. తాత్పర్యం :
నేనెవరిని ద్వేషింపను, ఎవరి యెడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల యెడ సమముగా వర్తింతురు. కాని భక్తితో నాకు సేవనొసగెడివాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణుడు సర్వుల యెడ సమముగా వర్తించువాడైనచో మరియు అతనికి ఎవ్వరును ప్రత్యేక స్నేహితులు కానిచో తన దివ్యసేవలో సదా నిమగ్నులై యుండెడి భక్తుల యెడ ఎందులకై ప్రత్యేకశ్రద్ధ వహించుననెడి ప్రశ్న ఇచ్చట ఉదయించును. కాని వాస్తవమునకు ఇది సహజమేగాని భేదభావము కాదు. 

ఉదాహరణకు జగమునందు ఎవరేని మనుజుడు గొప్పదాత యని పేరుగాంచినను, తన సంతానము యెడల అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును. 

అదే విధముగా భగవానుడు వివిధరూపములలో నున్న సర్వజీవులను సంతానముగ భావించి వారి జీవితావాసరమునకు కావలసిన సర్వమును ఉదారముగా సమకూర్చును. 

భూమియని గాని, కొండయని గాని, జలమని గాని ఎట్టి భేదభావము లేకుండా వర్షమును కురిపించెడి మేఘము వంటివాడు ఆ దేవదేవుడు. కాని తన భక్తుల యెడ మాత్రము అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును. 

అట్టి భక్తిపరాయణులైనవారే ఈ శ్లోకమునందు పేర్కొనబడినవారు. కృష్ణభక్తిభావనలో సదా నిలిచియుండుటచే ఆ భక్తులు నిత్యము కృష్ణుని యందే స్థితిని కలిగియుందురు. 

కనుకనే కృష్ణభక్తిభావనము నందున్న మహాత్ములు దివ్యాత్ములై ఆ శ్రీకృష్ణభగవానుని యందు నిలిచియున్నట్టివారని “కృష్ణభక్తిరసభావనము” అనెడి పదము సూచించుచున్నది. తత్కారణముగనే శ్రీకృష్ణుడు “మయితే” (వారు నాయందున్నారు) అని స్పష్టముగా పలికియున్నాడు. 

అనగా భగవానుడు వారియందున్నాడు. ఇట్టి పరస్పరానుభవమే “యే యథా మామ్ ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్” అనెడి భగవానుని వాక్యములను సైతము వివరించును. 

అనగా “ఎవరు ఏ విధముగా నన్ను శరణు పొందుచున్నారో, వారి యెడ తదనుగుణముగా నేను వారి రక్షణభారమును వహింతును” అని దాని భావము. 

భగవానుడు మరియు భక్తుడు ఇరువురును చైతన్యవంతులే గనుక వారి నడుమ ఇట్టి దివ్య పరస్పరానుభూతి, ఆశ్రయత్వము సమంజసమే. ఉదాహరణకు ఒక వజ్రము బంగారపు ఉంగరములో పొదగబడినప్పుడు ఆకర్షణీయముగా నుండును. బంగారము శ్లాఘింపబడినపుడు వజ్రము సైతము శ్లాఘింపబడును. 

వాస్తవమునకు భగవానుడు మరియు జీవుడు ఇరువురును నిత్యకాంతి శోభితులు. అట్టి జీవుడు భగవానుని సేవించుటకు ఆసక్తుడైనచో బంగారమువలె శోభించును. అట్టి యెడ వజ్రమువంటి భగవానునితో అతని కలయిక అత్యంత సుందరమై అలరారును. 

అట్టి శుద్ధస్థితిలో గల జీవులే భక్తులనబడుదురు మరియు భగవానుడు అటువంటి భక్తునికి స్వయముగా తాను భక్తుడగును. భగవానుడు మరియు భక్తుల నడుమ ఇట్టి సంబంధము లేనిచో సాకారతత్త్వమునకు మనుగడయేలేదు. 

నిరాకారతత్త్వమున భగవానుడు మరియు భక్తుల నడుమ అట్టి పరస్పర వినిమయ సంబంధము లేకున్నను సాకారతత్త్వమున మాత్రము అట్టి దివ్యసంబంధము నిశ్చయముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 348 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 29 🌴

29. samo ’haṁ sarva-bhūteṣu
na me dveṣyo ’sti na priyaḥ
ye bhajanti tu māṁ bhaktyā
mayi te teṣu cāpy aham

🌷 Translation : 
I envy no one, nor am I partial to anyone. I am equal to all. But whoever renders service unto Me in devotion is a friend, is in Me, and I am also a friend to him.

🌹 Purport :
One may question here that if Kṛṣṇa is equal to everyone and no one is His special friend, then why does He take a special interest in the devotees who are always engaged in His transcendental service? But this is not discrimination; it is natural. Any man in this material world may be very charitably disposed, yet he has a special interest in his own children. 

The Lord claims that every living entity – in whatever form – is His son, and so He provides everyone with a generous supply of the necessities of life. He is just like a cloud which pours rain all over, regardless of whether it falls on rock or land or water. 

But for His devotees, He gives specific attention. Such devotees are mentioned here: they are always in Kṛṣṇa consciousness, and therefore they are always transcendentally situated in Kṛṣṇa. 

The very phrase “Kṛṣṇa consciousness” suggests that those who are in such consciousness are living transcendentalists, situated in Him. The Lord says here distinctly, mayi te: “They are in Me.” 

Naturally, as a result, the Lord is also in them. This is reciprocal. This also explains the words ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham: “Whoever surrenders unto Me, proportionately I take care of him.” 

This transcendental reciprocation exists because both the Lord and the devotee are conscious. When a diamond is set in a golden ring, it looks very nice. The gold is glorified, and at the same time the diamond is glorified. 

The Lord and the living entity eternally glitter, and when a living entity becomes inclined to the service of the Supreme Lord he looks like gold. The Lord is a diamond, and so this combination is very nice. Living entities in a pure state are called devotees. 

The Supreme Lord becomes the devotee of His devotees. If a reciprocal relationship is not present between the devotee and the Lord, then there is no personalist philosophy. 

In the impersonal philosophy there is no reciprocation between the Supreme and the living entity, but in the personalist philosophy there is.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 24/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 349: 09వ అధ్.,  శ్లో 30 /  Bhagavad-Gita - 349: Chap. 09, Ver. 30

See the source image
🌹. శ్రీమద్భగవద్గీత - 349 / Bhagavad-Gita - 349 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 30 🌴

30. ఆపి అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్య: సమ్యగ్వ్యవసితో హి స: ||

🌷. తాత్పర్యం :
మిక్కిలి హేయమైన కార్యము నినరించినప్పటికిని మనుజుడు భక్తియుతసేవలో నియుక్తుడైయున్నచో, తన సంకల్పమున స్థిరనిశ్చయుడై యున్నందున అతనిని సాధువుగనే పరిగణింపవలెను.

🌷. భాష్యము : 
ఈ శ్లోకమునందలి భావగర్భితమైన “సుదురాచార” అను పదమును మనము సరిగా అర్థము చేసికొనవలెను. జీవుడు బద్ధస్థితిలో నున్నప్పుడు బద్ధకర్మలు మరియు సహజస్థితికి అనుగుణమైన కర్మలనెడి రెండు విధములైన కర్మలను కలిగియుండును. దేహమును రక్షించుకొనుటకు లేదా సంఘము మరియు దేశమునకు సంబంధించిన నియమనిబంధనలను పాటించుటకు బద్ధజీవనస్థితి యందు నిక్కముగా వివిధ కర్మములు కలవు. అవియే బద్ధజీవన కర్మలనబడును. అవి భక్తులకు సైతము తప్పవు. కాని తన ఆధ్యాత్మికస్వభావమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన (భక్తియోగము) యందు నియుక్తుడైన జీవుడు ఆ బద్ధకర్మలతో పాటు ఆధ్యాత్మికములనబడు కర్మలను సైతము కలిగియుండును. అట్టి కర్మలు అతని సహజస్థితి యందు ఒనరింపబడుచు భక్తియోగకర్మలుగా పిలువబడును. కనుక బద్ధస్థితిలో నున్నప్పుడు భక్తికర్మలు మరియు దేహపరమైన బద్ధకర్మలు రెండును సమానాంతరములుగా సాగుచున్నను, కొన్నిమార్లు అవి ఒకదానికొకటి విరుద్ధములుగా తయారగును. ఈ విషయమున భక్తుడు సాధ్యమైనంతవరకు అత్యంత జాగరూకుడై తన భక్తికి మరియు సహజస్థితికి ఆటంకము కలిగించు దేనిని చేయకుండును. కృష్ణభక్తిభావనా అనుభవపు పురోగతి పైననే తన కర్మల పూర్ణత్వము ఆధారపడియుండునని అతడు ఎరిగియుండును. అయినను కొన్నిమార్లు అట్టివాడు సంఘదృష్ట్యా లేదా చట్టము దృష్ట్యా అత్యంత హేయముగా భావింపబడు కార్యమును ఒనరించినట్లుగా కనిపించవచ్చును. కాని అట్టి తాత్కాలికమగుపతనము అతనిని ఏ విధముగను అనర్హుని చేయజాలదు. అత్యంత శ్రద్ధతో భక్తియుక్తసేవ యందు నిలిచియున్నవాడు ఒకవేళ పతనము నొందినను హృదయస్థుడైన పరమాత్ముడు అతనిని పవిత్రుని చేసి ఆ పాపమును క్షమించునని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. అనగా భౌతికసంపర్కము అత్యంత బలమైనదగుటచే భగవత్సేవ యందు పూర్ణముగా నియుక్తుడైన యోగి సైతము కొన్నిమార్లు మాయకు గురియగును. కాని కృష్ణభక్తి యనునది మరింత బలమైనదగుటచే భక్తుని అట్టి తాత్కాలిక పతనమును వెంటనే సరిదిద్దగలదు. కనుక భక్తియోగము సదా జయమునే కలిగించును. 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 349 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 30 🌴

30. api cet su-durācāro
bhajate mām ananya-bhāk
sādhur eva sa mantavyaḥ
samyag vyavasito hi saḥ

🌷 Translation : 
Even if one commits the most abominable action, if he is engaged in devotional service he is to be considered saintly because he is properly situated in his determination.

🌹 Purport :
The word su-durācāraḥ used in this verse is very significant, and we should understand it properly. When a living entity is conditioned, he has two kinds of activities: one is conditional, and the other is constitutional. As for protecting the body or abiding by the rules of society and state, certainly there are different activities, even for the devotees, in connection with the conditional life, and such activities are called conditional. Besides these, the living entity who is fully conscious of his spiritual nature and is engaged in Kṛṣṇa consciousness, or the devotional service of the Lord, has activities which are called transcendental. Such activities are performed in his constitutional position, and they are technically called devotional service. Now, in the conditioned state, sometimes devotional service and the conditional service in relation to the body will parallel one another. But then again, sometimes these activities become opposed to one another. As far as possible, a devotee is very cautious so that he does not do anything that could disrupt his wholesome condition. He knows that perfection in his activities depends on his progressive realization of Kṛṣṇa consciousness. Sometimes, however, it may be seen that a person in Kṛṣṇa consciousness commits some act which may be taken as most abominable socially or politically. But such a temporary falldown does not disqualify him.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 25/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 350: 09వ అధ్.,  శ్లో 31 /  Bhagavad-Gita - 350: Chap. 09, Ver. 31

🌹. శ్రీమద్భగవద్గీత - 350 / Bhagavad-Gita - 350 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 31 🌴

31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాన్తిం నిగచ్చతి |
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి ||

🌷. తాత్పర్యం :
అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయా! నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము.

🌷. భాష్యము : 
 ఈ శ్లోకమును తప్పుగా అర్థము చేసికొనరాదు. దురాచారుడైనవాడు తన భక్తుడు కాలేడని భగవానుడు సప్తమాధ్యాయమున తెలిపియున్నాడు. 

అలాగుననే భగవద్భకుడు కానివానికి ఎట్టి శుభలక్షణములు ఉండవనియు మమమెరిగియున్నాము. అట్టి యెడ యాదృచ్చికముగా లేక ప్రయత్నపూర్వకముగా పాపమును ఒనరించినవాడు ఎట్లు భక్తుడగును? ఇటువంటి ప్రశ్న ఇచ్చట ఉదయించుట సహజమే. 

గీత యందలి సప్తమాధ్యాయమున పేర్కొనబడిన దుష్కృతులు (వారెన్నడును శ్రీకృష్ణుని భక్తియోగమునకు రారు) ఎటువంటి శుభలక్షణములను కలిగియుండరని శ్రీమద్భాగవతము నందు తెలుపబడినది. కాని భక్తుడైనవాడు అట్లుగాక నవవిధములైన భక్తిమార్గముల ద్వారా తన హృదయమాలిన్యమును తొలగించుకొన యత్నమున ఉన్నట్టివాడు. 

అతడు శ్రీకృష్ణభగవానుని సదా తన హృదయమునందే నిలిపియుండుటచే, అతని పాపములన్నియును సహజముగనే నశించిపోయియుండును. భగవానుని నిరంతర చింతన అతనిని పరమపవిత్రునిగ చేయును. ఉన్నతస్థితి నుండి పతనము చెందినవాడు పవిత్రతకై కొన్ని ప్రాయశ్చిత్తకర్మలను చేయవలెనని వేదానుసారము కొన్ని నియమములు కలవు. 

పవిత్రీకరణ విధానము భక్తుని హృదయమునందు ఇదివరకే నెలకొనియున్నందున అటువంటి పరిస్థితి భక్తియోగమునకు అన్యయింపదు. హృదయమునందు అతడు శ్రీకృష్ణభగవానుని సదా స్మరించుటయే అందులకు కారణము. కనుకనే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను దివ్యమాహామంత్ర జపకీర్తనలు నిలుపుదల లేకుండా సదా జరుగవలెను. 

అట్టి కార్యము భక్తుని సర్వవిధములైన యాదృచ్చిక పతనముల నుండి రక్షించును. ఆ విధముగా అతడు భౌతికసంపర్కము నుండి సదా ముక్తుడై యుండగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 350 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 31 🌴

31. kṣipraṁ bhavati dharmātmā
śaśvac-chāntiṁ nigacchati
kaunteya pratijānīhi
na me bhaktaḥ praṇaśyati

🌷 Translation : 
He quickly becomes righteous and attains lasting peace. O son of Kuntī, declare it boldly that My devotee never perishes.

🌹 Purport :
This should not be misunderstood. In the Seventh Chapter the Lord says that one who is engaged in mischievous activities cannot become a devotee of the Lord. 

One who is not a devotee of the Lord has no good qualifications whatsoever. The question remains, then, How can a person engaged in abominable activities – either by accident or by intention – be a pure devotee? This question may justly be raised. 

The miscreants, as stated in the Seventh Chapter, who never come to the devotional service of the Lord, have no good qualifications, as is stated in the Śrīmad-Bhāgavatam. 

Generally, a devotee who is engaged in the nine kinds of devotional activities is engaged in the process of cleansing all material contamination from the heart. He puts the Supreme Personality of Godhead within his heart, and all sinful contaminations are naturally washed away. 

Continuous thinking of the Supreme Lord makes him pure by nature. According to the Vedas, there is a certain regulation that if one falls down from his exalted position he has to undergo certain ritualistic processes to purify himself. 

But here there is no such condition, because the purifying process is already there in the heart of the devotee, due to his remembering the Supreme Personality of Godhead constantly. 

Therefore, the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare should be continued without stoppage. 

This will protect a devotee from all accidental falldowns. He will thus remain perpetually free from all material contaminations.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 26/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 351: 09వ అధ్.,  శ్లో 32 /  Bhagavad-Gita - 351: Chap. 09, Ver. 32

🌹. శ్రీమద్భగవద్గీత - 351 / Bhagavad-Gita - 351 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 32 🌴

32. మాం హి పార్థా వ్యపాశ్రిత్య యే(పి స్యు: పాపయోనయ: |
స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తే(పి యాన్తి పరాం గతిమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ పార్థా! నా శరణుజొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికిని పరమగతిని పొందగలరు.

🌷. భాష్యము : 
భక్తిలో ఉచ్చ, నీచ జనుల నడుమ భేదభావము ఉండదని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా ప్రకటించుచున్నాడు. భౌతికభావనము నందున్నప్పుడు అట్టి విభాగములు ఉండవచ్చును గాని భగవానుని భక్తియుతసేవ యందు నియుక్తుడైనవానికి అట్టివి ఉండవు. 

ప్రతియొక్కరు పరమగతిని పొందుటకు అర్హులై యున్నారు. చండాలురు (శునకమాంసము భుజించువారు) యని పిలువబడు అతినీచతరగతికి చెందినవారు సైతము శుద్ధభక్తుని సంగములో పవిత్రులు కాగలరని శ్రీమద్భాగవతము (2.4.18) తెలుపుచున్నది. 

భక్తియోగము మరియు భక్తుల మార్గదర్శనము అనునవి అత్యంత శక్తివంతమగుటచే ఉచ్చ, నీచ తరగతి జనుల నడుమ భేదభావమును కలిగియుండవు. ఎవ్వరైనను అట్టి భక్తుని స్వీకరింపవచ్చును. అతిసామాన్యుడు సైతము భక్తుని శరణము నొందినచో చక్కని మార్గదర్శనముచే పవిత్రుడు కాగలడు. 

వాస్తవమునకు గుణముల ననుసరించి మనుజులు సత్త్వగుణప్రధానులని (బ్రాహ్మణులు), రజోగుణప్రధానులని (క్షత్రియులు), రజస్తమోగుణ ప్రధానులని (వైశ్యులు), తమోగుణప్రదానులని (శూద్రులు) నాలుగు తరగతులుగా విభజింపబడిరి. ఈ నాలుగు తరగతుల కన్నను నీచమైనవారు పాపయోనులైన చండాలురు. 

సాధారణముగా అట్టి పాపజన్ముల సాంగత్యమును ఉన్నత తరగతికి చెందినవారు అంగీకరింపరు. కాని భక్తియోగము అత్యంత శక్తివంతమైనదగుటచే శుద్ధభక్తుడు సమస్త నీచజనులు సైతము అత్యున్నత జీవనపూర్ణత్వమును బడయునట్లుగా చేయగలడు. శ్రీకృష్ణభగవానుని శరణుజొచ్చుట ద్వారానే అది సాధ్యము కాగలదు. 

కనుకనే “వ్యపాశ్రిత్య” యను పదముచే సూచింపబడినట్లు ప్రతియొక్కరు శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందవలెను. అంతట మనుజుడు ఘనులైన జ్ఞానులు, యోగుల కన్నను అత్యంత ఘనుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 351 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 32 🌴

32. māṁ hi pārtha vyapāśritya
ye ’pi syuḥ pāpa-yonayaḥ
striyo vaiśyās tathā śūdrās
te ’pi yānti parāṁ gatim

🌷 Translation : 
O son of Pṛthā, those who take shelter in Me, though they be of lower birth – women, vaiśyas [merchants] and śūdras [workers] – can attain the supreme destination.

🌹 Purport :
It is clearly declared here by the Supreme Lord that in devotional service there is no distinction between the lower and higher classes of people. 

In the material conception of life there are such divisions, but for a person engaged in transcendental devotional service to the Lord there are not. Everyone is eligible for the supreme destination. In the Śrīmad-Bhāgavatam (2.4.18) it is stated that even the lowest, who are called caṇḍālas (dog-eaters), can be purified by association with a pure devotee. 

Therefore devotional service and the guidance of a pure devotee are so strong that there is no discrimination between the lower and higher classes of men; anyone can take to it. The most simple man taking shelter of the pure devotee can be purified by proper guidance. 

According to the different modes of material nature, men are classified in the mode of goodness (brāhmaṇas), the mode of passion (kṣatriyas, or administrators), the mixed modes of passion and ignorance (vaiśyas, or merchants), and the mode of ignorance (śūdras, or workers). Those lower than them are called caṇḍālas, and they are born in sinful families. Generally, the association of those born in sinful families is not accepted by the higher classes. 

But the process of devotional service is so strong that the pure devotee of the Supreme Lord can enable people of all the lower classes to attain the highest perfection of life. 

This is possible only when one takes shelter of Kṛṣṇa. As indicated here by the word vyapāśritya, one has to take shelter completely of Kṛṣṇa. Then one can become much greater than great jñānīs and yogīs.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 27/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 352: 09వ అధ్.,  శ్లో 33 /  Bhagavad-Gita - 352: Chap. 09, Ver. 33

🌹. శ్రీమద్భగవద్గీత - 352 / Bhagavad-Gita - 352 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 33 🌴

33. కిం పునర్బ్రాహ్మణా: పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమామ్ ||

🌷. తాత్పర్యం :
ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా! అందుచే అనిత్యమును, అసుఖమును అగు ఈ లోకమునకు వచ్చియున్నందున నా ప్రేమయుక్తసేవలో నియుక్తుడవగుము.

🌷. భాష్యము : 
భౌతికజగమున జనులలో పలువర్గములున్నను వాస్తవమునకు వారెవ్వరికినీ ఈ జగము సుఖకరమైన ప్రదేశము కాదు. కనుకనే “అనిత్యమ్ అసుఖం లోకమ్” అని స్పష్టముగా తెలుపబడినది. అనగా ఈ భౌతికజగత్తు అశాశ్వతము, దుఃఖపూర్ణమునై సజ్జనుడైనవాడు నివసించుటకు యోగ్యము కాకున్నది. ఈ జగము శ్రీకృష్ణభగవానునిచే అశాశ్వతమైనదిగను మరియు దుఃఖపూర్ణముగను ప్రకటింపబడగా, కొందరు తత్త్వవేత్తలు (ముఖ్యముగా మయావాదులు) దీనిని మిథ్యగా వర్ణింతురు. కాని గీత ప్రకారము జగత్తు ఆశాశ్వతమే గాని మిథ్య కాదు. మిథ్యత్వము మరియు అనిత్యత్వముల నడుమ భేదము కలదు. భౌతికజగము అశాశ్వతము. కాని దీనికి పరమైన వేరొకజగము నిత్యమైనది. అలాగుననే ఈ జగము దుఃఖపూర్ణము. కాని దీనికి పరమైన జగము నిత్యమైనది మరియు ఆనందపూర్ణమైనది.

అర్జునుడు రాజర్షుల వంశములో జన్మించినట్టివాడు. అతనికి సైతము “నా భక్తియోగమును చేపట్టి శీఘ్రమే నా ధామమును చేరుము” అని శ్రీకృష్ణుడు ఉపదేశమొసగియుండెను. అనగా దుఃఖపూర్ణము మరియు ఆశాశ్వతమైన ఈ లోకముననే ఎవ్వరును నిలిచిపోరాదు. ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని ఆశ్రయించి నిత్యానందమును పొందవలెను. అన్ని తరగతుల జనుల సమస్యలు పరిష్కరింపబడుటకు ఆ దేవదేవుని భక్తియోగమే ఏకైక విధానము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనము అలవరచుకొని తమ జీవితమును పూర్ణము కావించుకొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 352 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 33 🌴

33. kiṁ punar brāhmaṇāḥ puṇyā
bhaktā rājarṣayas tathā
anityam asukhaṁ lokam
imaṁ prāpya bhajasva mām

🌷 Translation : 
How much more this is so of the righteous brāhmaṇas, the devotees and the saintly kings. Therefore, having come to this temporary, miserable world, engage in loving service unto Me.

🌹 Purport :
In this material world there are classifications of people, but, after all, this world is not a happy place for anyone. It is clearly stated here, anityam asukhaṁ lokam: this world is temporary and full of miseries, not habitable for any sane gentleman. This world is declared by the Supreme Personality of Godhead to be temporary and full of miseries. Some philosophers, especially Māyāvādī philosophers, say that this world is false, but we can understand from Bhagavad-gītā that the world is not false; it is temporary. There is a difference between temporary and false. This world is temporary, but there is another world, which is eternal. This world is miserable, but the other world is eternal and blissful.

Arjuna was born in a saintly royal family. To him also the Lord says, “Take to My devotional service and come quickly back to Godhead, back home.” No one should remain in this temporary world, full as it is with miseries. Everyone should attach himself to the bosom of the Supreme Personality of Godhead so that he can be eternally happy. The devotional service of the Supreme Lord is the only process by which all problems of all classes of men can be solved. Everyone should therefore take to Kṛṣṇa consciousness and make his life perfect.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 353: 09వ అధ్.,  శ్లో 34 /  Bhagavad-Gita - 353: Chap. 09, Ver. 34

🌹. శ్రీమద్భగవద్గీత - 353 / Bhagavad-Gita - 353 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం  - 34 🌴

34. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమష్కురు |
మామేవైష్యసి యుక్వైవమాత్మానం మత్పరాయణ: ||

🌷. తాత్పర్యం :
నీ మనస్సు సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము. నాకు నమస్కారము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు.

🌷. భాష్యము : 
కృష్ణభక్తిరసభావన మొక్కటే కలుషితమైన భౌతికప్రపంచ బంధముల నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టముగా తెలుపబడినది. భక్తియుతసేవను శ్రీకృష్ణభగవానునికే అర్పించవలెనని స్పష్టముగా ఇచ్చట తెలుపబడిన విషయమునకు అప్రమాణికులైన గీతావ్యాఖ్యాతలు కొన్నిమార్లు అర్థమును చెరచుదురు. దురదృష్టవశాత్తు వారు సాధ్యము కానటువంటి విషయముపైకి పాఠకుని మనస్సును మళ్ళింతురు. పరతత్త్వమేగాని సామాన్యుడు కానటువంటి శ్రీకృష్ణుని మరియు అతని మనస్సుకు భేదము లేదని అట్టి వారు తెలియజాలరు. శ్రీకృష్ణుడు, అతని దేహము, అతని మనస్సు అన్నియును ఏకమే. పరిపూర్ణమే. ఈ విషయమునే “దేహదేహివిభేదో(యం నేశ్వరే విద్యతే క్వచిత్” యని చైతన్యచరితామృతము (ఆదిలీల పంచమాధ్యాయము 41-48) యొక్క అనుభాష్యమునందు శ్రీభక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారు కుర్మపురాణము నందు తెలుపబడినదానిని ఉదహరించియుండిరి. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు భేదభావమనునదియే లేదు. అతడు మరియు అతని శరీరము అభేదములు. కాని కృష్ణసంభందవిజ్ఞానము లేని కారణముగా అట్టి వ్యాఖ్యాతలు కృష్ణుని దేవదేవత్వమును మరుగుపరచి ఆ భగవానుడు అతని దేహము లేదా మనస్సు కన్నను అన్యుడని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది వాస్తవమునకు కృష్ణసంబంధవిజ్ఞాన రాహిత్యమేయైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుచుందురు.

శ్రీకృష్ణుని ధ్యానించు దానవులు సైతము కొందరు కలరు. కాని వారు ఆ భగవానుని అసూయతో ధ్యానించుచుందురు. అట్టివారికి ఉదాహరణము శ్రీకృష్ణుని మేనమామయైన కంసుడు. శ్రీకృష్ణుని అతడు సదా తన శత్రువుగా తలచుచుండెను. కృష్ణుడు వచ్చి ఎన్నడు తనను సంహరించునో యని అతడు సదా భీతితో ఉండెడివాడు. వాస్తవమునకు అట్టి చింతనము ఏమాత్రము సహాయభూతము కాదు. శ్రీకృష్ణుని ప్రతియొక్కరు భక్తిభావముతోనే చింతించవలెను. అదియే నిజమైన భక్తి. దాని కొరకై ప్రతియొక్కరు కృష్ణసంబంధ విజ్ఞానమును నిరంతరము అభ్యసించవలెను. కాని అననుకూలమైన అభ్యాసము ఎట్టిది? ప్రామాణికుడైన గురువు నుండి గ్రహించునదే అట్టి అనుకూల అభ్యాసము కాగలదు. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడైన దేవదేవుడు. ఇదివరకే పలుమార్లు వివరించినట్లు అతని దేహము భౌతికమైనదే కాక సచ్చిదానందమయమైనట్టిది. ఈ విధమైన కృష్ణపరచర్చ మనుజుడు భక్తుడగుటకు తోడ్పడగలదు. అప్రమాణికుల వలన శ్రీకృష్ణుని అన్యవిధముగా అవగాహన చేసికొనుట నిరుపయోగము కాగలదు.

కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుడే పరమపురుషుడనెడి పూర్ణవిశ్వాసముతో మనస్సును ఆ భగవానుని నిత్యమును మరియు ఆద్యమును అయిన రూపమునందే లగ్నముచేసి అతని భక్తియుతసేవలో నిమగ్నులు కావలెను. శ్రీకృష్ణభగవానునికి భారతదేశమునందు అనేకవేల మందిరములు కలవు. వాని యందు ఆ భగవానుని భక్తియుతసేవ నిరంతరము ఒనరించబడుచుండును. అటువంటి భక్తియుతసేవ యందు మనుజుడు కృష్ణునకు వందనముల నర్పించవలెను. శిరము వంచి తన మనోవాక్కాయ కర్మలనన్నింటిణి భక్తి యందే నియుక్తము కావింపవలెను. తద్ద్వారా అతడు కృష్ణభావన యందే అనన్యముగా నిమగ్నుడు కాగలడు. అట్టి స్థితి అతడు కృష్ణలోకమును చేరుటకు తోడ్పడగలదు. కనుక ప్రతియొక్కరు కపటులు, అప్రమాణికులైన వ్యాఖ్యాతలచే సరియైన మార్గము నుండి వైదొలగక, శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ,కీర్తనములతో ఆరంభమగు నవవిధపూర్ణ భక్తియోగవిధానమున నియుక్తులు కావలెను. అట్టి శుద్ధభక్తియే మానవసమాజమునకు అత్యున్నత వరప్రసాదమై యున్నది.

భగవద్గీత యందలి సప్తమ, అష్టమాధ్యాయములలో ఊహాత్మకమైన జ్ఞానము, యోగము, కామ్యకర్మములకు పరమైన శుద్ధభక్తి విశదముగా వివరింపబడినది. సంపూర్ణముగా పవిత్రులు కానివారు శ్రీకృష్ణభగవానుని ఇతర తత్త్వములైన నిరాకారబ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ వైపుకు ఆకర్షితులైనను, శుద్ధభక్తుడు మాత్రము శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షసేవనే స్వీకరించును. 

ఇతర దేవతార్చనమున నియుక్తుడైనవాడు గొప్ప మందమతియనియు, అతడు శ్రీకృష్ణభగవానుని దివ్యవరదానము నెన్నడును పొందజాలడనియు తెలుపు కృష్ణపరమగు శ్లోకమొకటి కలదు. కనుకనే కృష్ణభక్తుడైనవాడు తొలిదశలో కొన్నిమార్లు తన నిజస్థితి నుండి పతనము చెందినను ఇతర తత్త్వవేత్తలు మరియు యోగుల కన్నను అధికుడనియే భావింపవలెను. కృష్ణభక్తిరసభావనము నందు సదా నియుక్తుడై యుండెడివాడు పరిపూర్ణుడైన సాధుపురుషుడు. యాదృచ్చికముగా జరుగు అతని పతనములు క్రమముగా నశించి, నిస్సంశముగా అతడు పూర్ణస్థితి యందు శీఘ్రమే నెలకొనగలడు. శ్రీకృష్ణుడే స్వయముగా శుద్ధభక్తుల రక్షణాభారము స్వీకరించును కనుక వారు పతనము చెందు అవకాశమే లేదు. కనుక బుద్ధిమంతుడైనవాడు నేరుగా కృష్ణభక్తిరసభావన విధానమును అవలబించి ఈ జగమునందు సుఖముగా జీవించవలెను. అట్టి భక్తుడు అంత్యమున శ్రీకృష్ణభగవానుని పరమానుగ్రహమును పొందగలడు.

శ్రీమద్భాగవతము యందలి “పరమగుహ్యజ్ఞానము” అను నవమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 353 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 34 🌴

34. man-manā bhava mad-bhakto
mad-yājī māṁ namaskuru
mām evaiṣyasi yuktvaivam
ātmānaṁ mat-parāyaṇaḥ

🌷 Translation : 
Engage your mind always in thinking of Me, become My devotee, offer obeisances to Me and worship Me. Being completely absorbed in Me, surely you will come to Me.

🌹 Purport :
In this verse it is clearly indicated that Kṛṣṇa consciousness is the only means of being delivered from the clutches of this contaminated material world. Sometimes unscrupulous commentators distort the meaning of what is clearly stated here: that all devotional service should be offered to the Supreme Personality of Godhead, Kṛṣṇa. Unfortunately, unscrupulous commentators divert the mind of the reader to that which is not at all feasible. Such commentators do not know that there is no difference between Kṛṣṇa’s mind and Kṛṣṇa. Kṛṣṇa is not an ordinary human being; He is Absolute Truth. His body, His mind and He Himself are one and absolute. It is stated in the Kūrma Purāṇa, as it is quoted by Bhaktisiddhānta Sarasvatī Gosvāmī in his Anubhāṣya comments on Caitanya-caritāmṛta (Fifth Chapter, Ādi-līlā, verses 41–48), deha-dehi-vibhedo ’yaṁ neśvare vidyate kvacit. This means that there is no difference in Kṛṣṇa, the Supreme Lord, between Himself and His body. But because the commentators do not know this science of Kṛṣṇa, they hide Kṛṣṇa and divide His personality from His mind or from His body. Although this is sheer ignorance of the science of Kṛṣṇa, some men make profit out of misleading people.

There are some who are demonic; they also think of Kṛṣṇa, but enviously, just like King Kaṁsa, Kṛṣṇa’s uncle. He was also thinking of Kṛṣṇa always, but he thought of Kṛṣṇa as his enemy. He was always in anxiety, wondering when Kṛṣṇa would come to kill him. That kind of thinking will not help us. One should be thinking of Kṛṣṇa in devotional love. That is bhakti. One should cultivate the knowledge of Kṛṣṇa continuously. What is that favorable cultivation? It is to learn from a bona fide teacher. Kṛṣṇa is the Supreme Personality of Godhead, and we have several times explained that His body is not material, but is eternal, blissful knowledge. This kind of talk about Kṛṣṇa will help one become a devotee. Understanding Kṛṣṇa otherwise, from the wrong source, will prove fruitless.

One should therefore engage his mind in the eternal form, the primal form of Kṛṣṇa; with conviction in his heart that Kṛṣṇa is the Supreme, he should engage himself in worship. There are hundreds of thousands of temples in India for the worship of Kṛṣṇa, and devotional service is practiced there. When such practice is made, one has to offer obeisances to Kṛṣṇa. One should lower his head before the Deity and engage his mind, his body, his activities – everything. That will make one fully absorbed in Kṛṣṇa without deviation. This will help one transfer to Kṛṣṇaloka. One should not be deviated by unscrupulous commentators. One must engage in the nine different processes of devotional service, beginning with hearing and chanting about Kṛṣṇa. Pure devotional service is the highest achievement of human society.

The Seventh and Eighth chapters of Bhagavad-gītā have explained pure devotional service to the Lord that is free from speculative knowledge, mystic yoga and fruitive activities. Those who are not purely sanctified may be attracted by different features of the Lord like the impersonal brahma-jyotir and localized Paramātmā, but a pure devotee directly takes to the service of the Supreme Lord.

There is a beautiful poem about Kṛṣṇa in which it is clearly stated that any person who is engaged in the worship of demigods is most unintelligent and cannot achieve at any time the supreme award of Kṛṣṇa. The devotee, in the beginning, may sometimes fall from the standard, but still he should be considered superior to all other philosophers and yogīs. One who always engages in Kṛṣṇa consciousness should be understood to be a perfectly saintly person. His accidental nondevotional activities will diminish, and he will soon be situated without any doubt in complete perfection. The pure devotee has no actual chance to fall down, because the Supreme Godhead personally takes care of His pure devotees. Therefore, the intelligent person should take directly to the process of Kṛṣṇa consciousness and happily live in this material world. He will eventually receive the supreme award of Kṛṣṇa.

Thus end the Bhaktivedanta Purports to the Ninth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Most Confidential Knowledge.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 354: 10వ అధ్.,  శ్లో 01 /  Bhagavad-Gita - 354: Chap. 10, Ver. 01

🌹. శ్రీమద్భగవద్గీత - 354 / Bhagavad-Gita - 354 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 01 🌴

01. శ్రీ భగవానువాచ
భూయ ఏవ మహాబాహో శ్రుణు మే పరమం వచ: |
యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యాయా ||

🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను: మహాబాహువులుగల ఓ అర్జునా! మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను.

🌷. భాష్యము : 
“భగవానుడు” అను పదమునకు శక్తి, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనెడి ఆరు విభూతులను సమగ్రమముగా కలిగియున్నవాడని భావమైనట్లుగా పరాశరముని వివరించియున్నారు. ధరత్రిపై అవతరించినపుడు శ్రీకృష్ణుడు అట్టి ఆరువిభూతులను సమగ్రమముగా ప్రదర్శించియున్నందున పరాశరుడు వంటి మహా మునులు అతనిని దేవదేవునిగా ఆంగీకరించియున్నారు. ఇప్పుడు ఆ భగవానుడే స్వయముగా తన విభూతులు మరియు తన కర్మలను గూర్చిన రహస్యజ్ఞానమును అర్జునునకు ఉపదేశించనున్నాడు. సప్తమాధ్యాయపు ఆరంభము నుండియే తన వివిధశక్తులు గుర్చియు మరియు అవి వర్తించు విధమును గూర్చియు తెలియజేసిన భగవానుడు ఈ అధ్యాయమున తన ప్రత్యేక విభూతులను అర్జునునకు వివరింపనున్నాడు. నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకై తన వివిధశక్తులను విపులముగా గడచిన అధ్యాయమున వర్ణించిన శ్రీకృష్ణభగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధభూతులను మరియు సృష్టివిస్తారములను అర్జునునకు తెలియజేయుచున్నాడు.

శ్రీకృష్ణభగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది భక్తి యందు మనుజుడు అధికముగా స్థిరత్వమును పొందును. ప్రతియొక్కరు ఆ దేవదేవుని గూర్చి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలెను. అది వారి భక్తిని వృద్ధి చేయగలదు. వాస్తవమునకు కృష్ణపరచర్చలు మరియు ప్రసంగములనునవి కృష్ణభక్తిభావన యందు నిజముగా లగ్నమైనవారి నడుమనే జరుగును. ఇతరులు అట్టివాటి యందు పాల్గొనజాలరు. అర్జునుడు తనకు అత్యంత ప్రియుడైనందునే అతని హితము కొరకు అటువంటి ఉపదేశము చేయబడుచున్నది శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 354 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 01 🌴

01. śrī-bhagavān uvāca
bhūya eva mahā-bāho
śṛṇu me paramaṁ vacaḥ
yat te ’haṁ prīyamāṇāya
vakṣyāmi hita-kāmyayā

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Listen again, O mighty-armed Arjuna. Because you are My dear friend, for your benefit I shall speak to you further, giving knowledge that is better than what I have already explained.

🌹 Purport :
The word bhagavān is explained thus by Parāśara Muni: one who is full in six opulences, who has full strength, full fame, wealth, knowledge, beauty and renunciation, is Bhagavān, or the Supreme Personality of Godhead. While Kṛṣṇa was present on this earth, He displayed all six opulences. 

Therefore great sages like Parāśara Muni have all accepted Kṛṣṇa as the Supreme Personality of Godhead. Now Kṛṣṇa is instructing Arjuna in more confidential knowledge of His opulences and His work. 

Previously, beginning with the Seventh Chapter, the Lord has already explained His different energies and how they are acting. Now in this chapter He explains His specific opulences to Arjuna. 

In the previous chapter He has clearly explained His different energies to establish devotion in firm conviction. Again in this chapter He tells Arjuna about His manifestations and various opulences.

The more one hears about the Supreme God, the more one becomes fixed in devotional service. 

One should always hear about the Lord in the association of devotees; that will enhance one’s devotional service. Discourses in the society of devotees can take place only among those who are really anxious to be in Kṛṣṇa consciousness. 

Others cannot take part in such discourses. The Lord clearly tells Arjuna that because Arjuna is very dear to Him, for his benefit such discourses are taking place.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 30/Apr/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 355: 10వ అధ్.,  శ్లో 02 /  Bhagavad-Gita - 355: Chap. 10, Ver. 02

🌹. శ్రీమద్భగవద్గీత - 355 / Bhagavad-Gita - 355 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 02 🌴

02. న మే విదు: సురగణా: ప్రభవం న మహర్షయ: |
అహమాదిర్షి దేవానాం మహర్షీణాం చ సర్వశ: ||

🌷. తాత్పర్యం :
సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై యున్నందున దేవతా సమూహముగాని, మహర్షులుగాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలిసికొనజాలరు.

🌷. భాష్యము : 
బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే దేవదేవుడు. అతని కన్నను అధికుడు వేరొక్కడు లేడు. అతడే సర్వకారణకారణుడు. తానే దేవతలకు మరియు ఋషులకు కారణుడనని అతడే స్వయముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా దేవతలు మరియు మహర్షులు కూడా శ్రీకృష్ణుని సంపూర్ణముగా ఎరుగలేరు. వారే ఆ భగవానుని నామమును గాని, స్వరూపమును గాని ఎరుగలేరన్నచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల విషయము వేరుగా తెలుపపనిలేదు. భగవానుడు ఏ కారణము నిమిత్తము ధరత్రి యందు సామాన్యమానవునిగా అవతరించి అద్భుతములు మరియు అసాధారణములైన కార్యముల నొనర్చునో ఎవ్వరును ఎరుగాజాలరు. అనగా పాండిత్యమనునది శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుటకు ఒక యోగ్యత కాదని మనము గ్రహింపవలెను. దేవతలు మరియు ఋషులు సైతము తమ మానసికకల్పనలచే శ్రీకృష్ణుని అవగతము చేసికొన యత్నించినను విఫలురైరి. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణభగవానుని ఎరుగాజాలరని శ్రీమద్భాగవతమునందు స్పష్టముగా తెలుపబడినది. వారు తమ పరిమిత ఇంద్రియముల పరధి మేరకు ఊహాగానము చేయ యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్త్వమునకు విరుద్ధభావమైన నిరాకారతత్త్వమునే చేరగలరు. అనగా వారు మానసిక కల్పనలను కావించినను దాని ద్వారా శ్రీకృష్ణుని మాత్రము ఎరుగాజాలరు.

పరతత్త్వమును తెలిసికొనగోరువారు కొరకై శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తాను దేవదేవుడననియు మరియు పరమపురుషుడనని పరోక్షముగా తెలియజేయుచున్నాడు. ఈ విషయమును ప్రతియొక్కరు గమనింపవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 355 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 02 🌴

02. na me viduḥ sura-gaṇāḥ
prabhavaṁ na maharṣayaḥ
aham ādir hi devānāṁ
maharṣīṇāṁ ca sarvaśaḥ

🌷 Translation : 
Neither the hosts of demigods nor the great sages know My origin or opulences, for, in every respect, I am the source of the demigods and sages.

🌹 Purport :
As stated in the Brahma-saṁhitā, Lord Kṛṣṇa is the Supreme Lord. No one is greater than Him; He is the cause of all causes. Here it is also stated by the Lord personally that He is the cause of all the demigods and sages. Even the demigods and great sages cannot understand Kṛṣṇa; they can understand neither His name nor His personality, so what is the position of the so-called scholars of this tiny planet? No one can understand why this Supreme God comes to earth as an ordinary human being and executes such wonderful, uncommon activities. One should know, then, that scholarship is not the qualification necessary to understand Kṛṣṇa. Even the demigods and the great sages have tried to understand Kṛṣṇa by their mental speculation, and they have failed to do so. In the Śrīmad-Bhāgavatam also it is clearly said that even the great demigods are not able to understand the Supreme Personality of Godhead. They can speculate to the limits of their imperfect senses and can reach the opposite conclusion of impersonalism, of something not manifested by the three qualities of material nature, or they can imagine something by mental speculation, but it is not possible to understand Kṛṣṇa by such foolish speculation.

Here the Lord indirectly says that if anyone wants to know the Absolute Truth, “Here I am present as the Supreme Personality of Godhead. I am the Supreme.” One should know this. 
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 356: 10వ అధ్.,  శ్లో 03 /  Bhagavad-Gita - 356: Chap. 10, Ver. 03

🌹. శ్రీమద్భగవద్గీత - 356 / Bhagavad-Gita - 356 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 03 🌴

03. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢ: స మర్త్యేషు సర్వపాపై: ప్రముచ్యతే ||

🌷. తాత్పర్యం :
నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్యప్రభువుగను తెలిసికొనినవాడు మాత్రమే మనుజులందరిలోను భ్రాంతిరహితుడై, సర్వపాపముల నుండి ముక్తుడగును.

🌷. భాష్యము : 
“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతిసిద్ధయే” యని సప్తమాధ్యాయమున (7.3) తెలుపబడినట్లు ఆధ్యాత్మికానుభవస్థాయిని పొందుటకై యత్నించువారు సామాన్యజనులు కానేరరు. ఆధ్యాత్మికానుభవమునకు సంబంధించిన జ్ఞానము ఏ మాత్రములేని కోట్లాది సామాన్యమానవుల కన్నను వారు నిక్కము ఉత్తములు. కాని ఆ విధముగా తమ ఆధ్యాత్మికస్థితిని అవగాహన చేసికొన యత్నించువారిలో శ్రీకృష్ణుడు దేవదేవుడు, సర్వమునకు ప్రభువు, పుట్టుకలేనివాడనెడి అవగాహనకు వచ్చినవాడు ఆత్మానుభవప్రాప్తిలో కృతకృత్యుడైనట్టివాడు. శ్రీకృష్ణుని దివ్యస్థితిని సంపూర్ణముగా నెరుగగలిగిన స్థితి యందే మనుజుడు సర్వవిధములైన పాపఫలముల నుండి ముక్తుడు కాగలడు.

ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అజునిగా (పుట్టుకలేనివానిగా) వర్ణింపబడినాడు. ద్వితీయాధ్యాయమున జీవులు సైతము అజులుగా తెలుపబడినను భగవానుడు వారికి భిన్నమైనవాడు. భౌతికబంధకారణముగా జన్మించుచు మరణించు జీవులకు అతడు భిన్నుడు. ఆ బద్ధజీవులు తమ దేహములను మార్చుచుండ, భగవానుని దేహము మార్పురహితమై యున్నది. అతడు భౌతికప్రపంచమునకు అరుదెంచినను అజునిగనే అరుదెంచును. కనుకనే శ్రీకృష్ణభగవానుడు తన అంతరంగశక్తి ద్వారా న్యునమైన భౌతికశక్తికి అధీనుడుగాక సదా దివ్యశక్తియందే స్థితుడై యుండునని చతుర్థాధ్యాయమున తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 356 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 03 🌴

03. yo mām ajam anādiṁ ca
vetti loka-maheśvaram
asammūḍhaḥ sa martyeṣu
sarva-pāpaiḥ pramucyate

🌷 Translation : 
He who knows Me as the unborn, as the beginningless, as the Supreme Lord of all the worlds – he only, undeluded among men, is freed from all sins.

🌹 Purport :
As stated in the Seventh Chapter (7.3), manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye: those who are trying to elevate themselves to the platform of spiritual realization are not ordinary men; they are superior to millions and millions of ordinary men who have no knowledge of spiritual realization. But out of those actually trying to understand their spiritual situation, one who can come to the understanding that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the proprietor of everything, the unborn, is the most successful spiritually realized person. In that stage only, when one has fully understood Kṛṣṇa’s supreme position, can one be free completely from all sinful reactions.

Here the Lord is described by the word aja, meaning “unborn,” but He is distinct from the living entities who are described in the Second Chapter as aja. The Lord is different from the living entities who are taking birth and dying due to material attachment. The conditioned souls are changing their bodies, but His body is not changeable. Even when He comes to this material world, He comes as the same unborn; therefore in the Fourth Chapter it is said that the Lord, by His internal potency, is not under the inferior, material energy, but is always in the superior energy.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 02/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 357: 10వ అధ్.,  శ్లో 04, 05 /  Bhagavad-Gita - 357: Chap. 10, Ver. 04, 05

🌹. శ్రీమద్భగవద్గీత - 357 / Bhagavad-Gita - 357 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 04, 05🌴

04. బుద్ధిర్ జ్ఞానమసమ్మోహ: క్షమా సత్యం దమ: శమ: |
సుఖం దుఃఖం భవో(భావో భయం చాభయమేవ చ ||

05. అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో(యశః |
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధా: ||

🌷. తాత్పర్యం :
బుద్ధి,జ్ఞానము, సంశయముగాని భ్రాంతిగాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధగుణములు నా చేతనే సృష్టించబడినవి.

🌷. భాష్యము : 
జీవుల శుభాశుభములైన వివధ గుణములన్నియును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. ఆ గుణములే ఇచ్చట వివరింపబడినవి.

విషయములను సరియైన దృక్పథముతో విశ్లేషించు శక్తియే బుద్ధి యనబడును. ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికమనెడి అవగాహనయే జ్ఞానము. 

విశ్వవిద్యాలయ చదువుతో లభ్యమైన జ్ఞానము భౌతికమునకు సంబంధించిన జ్ఞానమైనందున, వాస్తవజ్ఞానముగా ఆంగీకరింపబడదు. ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ భేదము నెరుగగలుగుటయే వాస్తవజ్ఞానము. 

కాని నేటి ఆధునిక విద్యావిధానమున ఆధ్యాత్మికత్వమును గూర్చిన ఎట్టి జ్ఞానము లేదు. జనుల కేవలము భౌతికమూలకములు మరియు దేహావసరముల యెడ మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విద్యాలయజ్ఞానము అసంపూర్ణమై యున్నది.

మనుజుడు శంకను వదిలి దివ్యతత్త్వము నవగాహన చేసికొనినప్పుడు సంశయము మరియు భ్రాంతిరాహిత్యమనెడి (అసమ్మోహము) స్థితిని సాధించగలడు. అట్టివాడు నెమ్మదిగా అయినప్పటికిని నిక్కముగా భ్రాంతి నుండి ముక్తుడు కాగలడు. కనుక దేనిని కూడా గ్రుడ్డిగా ఆంగీకరింపక శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసియున్నది. 

ఓర్పు మరియు క్షమాగుణములను (క్షమ) అలవరచుకొని ఇతరుల సాధారణ అపరాధముల యెడ ఓర్పును కలిగి వారిని క్షమింపవలెను. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా తెలియజేయుటయే సత్యమనుదాని భావము. వాస్తవములనెన్నడును తప్పుగా ప్రదర్శించరాదు. 

ఇతరులకు నచ్చునదైనప్పుడే సత్యమును పలుకుట సాంఘికమర్యాదయైనను వాస్తవమునకు అది సత్యసంధత కానేరదు. కావున వాస్తవములను సర్వులు అవగాహన చేసికొను రీతిలో సత్యమును నిక్కచ్చిగా పలుకవలెను. 

దొంగను దొంగయని పలికి జనులను సావధానపరచుటయే సత్యము కాగలదు. సత్యము కొన్నిమార్లు రుచింపకపోయినను ఎవ్వరును దానిని పలుకుట యందు జంకును కలిగియుండరాదు. 

ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా ప్రదర్శించవలెనని సత్యసంధత కోరును. సత్యమునకు ఒసగబడు నిర్వచనమిదియే.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 357 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 04, 05 🌴

04. buddhir jñānam asammohaḥ
kṣamā satyaṁ damaḥ śamaḥ
sukhaṁ duḥkhaṁ bhavo ’bhāvo
bhayaṁ cābhayam eva ca

05. ahiṁsā samatā tuṣṭis
tapo dānaṁ yaśo ’yaśaḥ
bhavanti bhāvā bhūtānāṁ
matta eva pṛthag-vidhāḥ

🌷 Translation : 
Intelligence, knowledge, freedom from doubt and delusion, forgiveness, truthfulness, control of the senses, control of the mind, happiness and distress, birth, death, fear, fearlessness, nonviolence, equanimity, satisfaction, austerity, charity, fame and infamy – all these various qualities of living beings are created by Me alone.

🌹 Purport :
The different qualities of living entities, be they good or bad, are all created by Kṛṣṇa, and they are described here.

Intelligence refers to the power to analyze things in their proper perspective, and knowledge refers to understanding what is spirit and what is matter. 

Ordinary knowledge obtained by a university education pertains only to matter, and it is not accepted here as knowledge. Knowledge means knowing the distinction between spirit and matter. 

In modern education there is no knowledge about spirit; they are simply taking care of the material elements and bodily needs. Therefore academic knowledge is not complete.

Asammoha, freedom from doubt and delusion, can be achieved when one is not hesitant and when he understands the transcendental philosophy. 

Slowly but surely he becomes free from bewilderment. Nothing should be accepted blindly; everything should be accepted with care and with caution. 

Kṣamā, tolerance and forgiveness, should be practiced; one should be tolerant and excuse the minor offenses of others. Satyam, truthfulness, means that facts should be presented as they are, for the benefit of others. Facts should not be misrepresented. 
🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 358: 10వ అధ్.,  శ్లో 06 /  Bhagavad-Gita - 358: Chap. 10, Ver. 06

🌹. శ్రీమద్భగవద్గీత - 358 / Bhagavad-Gita - 358 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 06  🌴

06. మహర్షయ: సప్త పూర్వే చతుర్వా మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమా: ప్రజా: ||

🌷. తాత్పర్యం :
సప్తమహాఋషులు, వారికి పూర్వము సనకసనందనాదులు మరియు మనువురు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధలోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి.

🌷. భాష్యము : 
ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు విశ్వజనము యొక్క వంశక్రమానుగత సారాంశమును వివరించుచున్నాడు. 

తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడని తెలియబడు భగవానుని శక్తి నుండి ఉద్భవించెను. ఆ బ్రహ్మదేవుని నుండి తొలుత సనక, సనందన, సనాతన, సనత్కుమారులును, మనువులును, ఆ తరువాత సప్తఋషులును ఉద్భవించిరి. 

ఈ ఇరువదియైదుమంది ఋషులు విశ్వమునందలి జీవులందరికి ప్రజాపతులుగా ప్రసిద్ధినొందిరి. అసంఖ్యాకములుగా నున్నటువంటి విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు. 

ఆ లోకములన్నియును వివధజనులతో నిండియున్నవి. వారందరును ఆ ఇరువదియైదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి. శ్రీకృష్ణుని కరుణచే విశ్వమును సృష్టించు జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వేయి దేవతాసంవత్సరములు తపమాచరించియుండెను. 

తదుపరి బ్రహ్మ నుండి సనక, సనందన, సనాత్కుమారులును, ఆపై రుద్రుడును మరియు సప్తఋషులును ఉదయించిరి. ఈ విధముగా బ్రహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరు భగవానుని శక్తి నుండి ఉద్భవించినట్టివారు. 

కనుకనే బ్రహ్మదేవుడు పితామహునిగను మరియు అతనికి తండ్రియైన శ్రీకృష్ణుడు ప్రపితామహునిగను తెలియబడినారు. ఈ విషయము భగవద్గీత (11.39) యందలి ఏకాదశాధ్యాయమున తెలుపబడినది.

ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు విశ్వజనము యొక్క వంశక్రమానుగత సారాంశమును వివరించుచున్నాడు. తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడని తెలియబడు భగవానుని శక్తి నుండి ఉద్భవించెను. 

ఆ బ్రహ్మదేవుని నుండి తొలుత సనక, సనందన, సనాతన, సనత్కుమారులును, మనువులును, ఆ తరువాత సప్తఋషులును ఉద్భవించిరి. 

ఈ ఇరువదియైదుమంది ఋషులు విశ్వమునందలి జీవులందరికి ప్రజాపతులుగా ప్రసిద్ధినొందిరి. అసంఖ్యాకములుగా నున్నటువంటి విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు. ఆ లోకములన్నియును వివధజనులతో నిండియున్నవి. 

వారందరును ఆ ఇరువదియైదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి. శ్రీకృష్ణుని కరుణచే విశ్వమును సృష్టించు జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వేయి దేవతాసంవత్సరములు తపమాచరించియుండెను. 

తదుపరి బ్రహ్మ నుండి సనక, సనందన, సనాత్కుమారులును, ఆపై రుద్రుడును మరియు సప్తఋషులును ఉదయించిరి. ఈ విధముగా బ్రహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరు భగవానుని శక్తి నుండి ఉద్భవించినట్టివారు. 

కనుకనే బ్రహ్మదేవుడు పితామహునిగను మరియు అతనికి తండ్రియైన శ్రీకృష్ణుడు ప్రపితామహునిగను తెలియబడినారు. ఈ విషయము భగవద్గీత (11.39) యందలి ఏకాదశాధ్యాయమున తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 358 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 06 🌴

06. maharṣayaḥ sapta pūrve
catvāro manavas tathā
mad-bhāvā mānasā jātā
yeṣāṁ loka imāḥ prajāḥ

🌷 Translation : 
The seven great sages and before them the four other great sages and the Manus [progenitors of mankind] come from Me, born from My mind, and all the living beings populating the various planets descend from them.

🌹 Purport :
The Lord is giving a genealogical synopsis of the universal population. Brahmā is the original creature born out of the energy of the Supreme Lord, who is known as Hiraṇyagarbha. 

And from Brahmā all the seven great sages, and before them four other great sages, named Sanaka, Sananda, Sanātana and Sanat-kumāra, and the fourteen Manus, are manifested. 

All these twenty-five great sages are known as the patriarchs of the living entities all over the universe. There are innumerable universes and innumerable planets within each universe, and each planet is full of population of different varieties. 

All of them are born of these twenty-five patriarchs. Brahmā underwent penance for one thousand years of the demigods before he realized by the grace of Kṛṣṇa how to create. 

Then from Brahmā came Sanaka, Sananda, Sanātana and Sanat-kumāra, then Rudra, and then the seven sages, and in this way all the brāhmaṇas and kṣatriyas are born out of the energy of the Supreme Personality of Godhead. 

Brahmā is known as Pitāmaha, the grandfather, and Kṛṣṇa is known as Prapitāmaha, the father of the grandfather. That is stated in the Eleventh Chapter of the Bhagavad-gītā (11.39).
🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 359: 10వ అధ్.,  శ్లో 07 /  Bhagavad-Gita - 359: Chap. 10, Ver. 07

🌹. శ్రీమద్భగవద్గీత - 359 / Bhagavad-Gita - 359  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 07  🌴

07. ఏతాం విభూతిం యోగం చ మామ యో వేత్తి తత్త్వత: |
సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ: ||

🌷. తాత్పర్యం :
నా ఈ దివ్యవిభూతిని, యోగశక్తిని యథార్థముగ నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. 

🌷. భాష్యము : 
దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మికపూర్ణత్వము యొక్క అత్యున్నతదశ వంటిది. 

ఆ భగవానుని వివిధములైన దివ్యవిభూతుల యెడ స్థిరనిశ్చయము కలుగనిదే ఎవ్వరును సంపూర్ణముగా భక్తియోగమున నెలకొనలేరు. సాధారణముగా జనులు భగవానుడు గొప్పవాడని తెలిసియుందురుగాని అతడెంతటి గొప్పవాడనెడి విషయమును పూర్తిగా ఎరిగియుండరు. 

ఇచ్చట ఆ విషయములన్నియును సమగ్రముగా తెలుపబడినవి. శ్రీకృష్ణభగవానుడు ఎంతటి ఘనుడనెడి విషయము సమగ్రముగా తెలిసినపుడు సహజముగా మనుజుడు అతనికి శరణమునొంది భక్తియుతసేవలో నిమగ్నుడగును. 

భగవానుని దివ్యవిభూతులు యథార్థముగా అవగతమైనప్పుడు అతని శరణుజొచ్చుట కన్నను మనుజునకు వేరొక్క మార్గముండదు. ఇటువంటి వాస్తవమైన జ్ఞానమును భగవద్గీత, భాగవతము మరియు అటువంటి ఇతర వాజ్మయము ద్వారా తెలిసికొనవచ్చును.

ఈ విశ్వపాలనము కొరకు విశ్వమనదంతటను పలుదేవతలు కలరు. వారిలో బ్రహ్మ, శివుడు, సనకసనందనాదులు, ఇతర ప్రజాపతులు ముఖ్యమైనవారు. 

విశ్వజనులకు గల పలువురు పితృదేవతలు శ్రీకృష్ణుని నుండియే జన్మించిరి. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వపితృదేవతలకు ఆది పితృదేవుడై యున్నాడు.

ఇవన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుని కొన్ని విభూతులు మాత్రమే. 

ఈ విభూతుల యెడ విశ్వాసము కలిగినవాడు శ్రీకృష్ణుని శ్రద్ధతో శంకారహితముగా గ్రహించి, అతని భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. భగవత్సేవలో ఆసక్తిని మరియు శ్రద్ధను వృద్ధిపరచుకొనుటకు ఈ ప్రత్యేక జ్ఞానము అత్యంత అవసరమై యున్నది. 

శ్రీకృష్ణభగవానుని దివ్యఘనతను సంపూర్ణముగా నెరుగుటచే మనుజుడు శ్రద్ధాపూరితమైన భక్తియోగమున స్థిరుడు కాగాలనందున ఆ దేవదేవుడు ఎంతటి ఘనుడో తెలిసికొనుట యందు ఎవ్వరును ఉపేక్ష వహింపరాదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 359 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 07 🌴

07. etāṁ vibhūtiṁ yogaṁ ca
mama yo vetti tattvataḥ
so ’vikalpena yogena
yujyate nātra saṁśayaḥ

🌷 Translation : 
One who is factually convinced of this opulence and mystic power of Mine engages in unalloyed devotional service; of this there is no doubt.

🌹 Purport :
The highest summit of spiritual perfection is knowledge of the Supreme Personality of Godhead. 

Unless one is firmly convinced of the different opulences of the Supreme Lord, he cannot engage in devotional service. Generally people know that God is great, but they do not know in detail how God is great. 

Here are the details. If one knows factually how God is great, then naturally he becomes a surrendered soul and engages himself in the devotional service of the Lord. 

When one factually knows the opulences of the Supreme, there is no alternative but to surrender to Him. This factual knowledge can be known from the descriptions in Śrīmad-Bhāgavatam and Bhagavad-gītā and similar literatures.

In the administration of this universe there are many demigods distributed throughout the planetary system, and the chief of them are Brahmā, Lord Śiva and the four great Kumāras and the other patriarchs. 

There are many forefathers of the population of the universe, and all of them are born of the Supreme Lord, Kṛṣṇa. The Supreme Personality of Godhead, Kṛṣṇa, is the original forefather of all forefathers.

These are some of the opulences of the Supreme Lord. When one is firmly convinced of them, he accepts Kṛṣṇa with great faith and without any doubt, and he engages in devotional service. All this particular knowledge is required in order to increase one’s interest in the loving devotional service of the Lord. 

One should not neglect to understand fully how great Kṛṣṇa is, for by knowing the greatness of Kṛṣṇa one will be able to be fixed in sincere devotional service.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 05/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 360: 10వ అధ్.,  శ్లో 08 /  Bhagavad-Gita - 360: Chap. 10, Ver. 08

🌹. శ్రీమద్భగవద్గీత - 360 / Bhagavad-Gita - 360  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 08  🌴

08. అహం సర్వస్య ప్రభవో మత్త: సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితా: ||

🌷. తాత్పర్యం :
నేనే సర్వములైన ఆధ్యాత్మిక, భౌతికజగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపుర్వకముగా అర్చింతురు.

🌷. భాష్యము : 
వేదములను సంపూర్ణముగా అధ్యయనము చేసినవాడును మరియు శ్రీచైతన్యమహాప్రభువు వంటి ప్రామాణికుల ద్వారా జ్ఞానమును పొంది, ఆ ఉపదేశములను ఏ విధముగా ఆచరణలో పెట్టవలెనో ఎరిగినవాడు అగు పండితుడు శ్రీకృష్ణుడే భౌతిక, ఆధ్యాత్మికజగత్తుల యందలి సర్వమునకు మూలమని అవగాహన చేసికొనగలడు. 

ఈ విషయమును పూర్ణముగా నెరిగియుండుటచే అతడు అ భగవానుని భక్తియుతసేవలో స్థిరముగా నుమగ్నుడగును. అర్థరహిత వ్యాఖ్యానములచే గాని, మూర్ఖులచేగాని ప్రభావితుడు గాక ఆ భక్తుడు తన భక్తిమార్గము నుండి వైదొలగకుండును. 

శ్రీకృష్ణుడే బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలందరికీ మూలమని వేదవాజ్మయము ఆంగీకరించుచున్నది. “యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ గాపయతి స్మ కృష్ణ: “ యని అథర్వణవేదము నందలి గోపాలతాపన్యుపనిషత్తు (1.24) నందు తెలుపబడినది. 

అనగా ఆదిలో బ్రహ్మదేవునకు వేదజ్ఞానమొసగినవాడును మరియు పూర్వము వేదజ్ఞానమును విస్తరింపజేసినవాడును శ్రీకృష్ణుడే. అదే విధముగా నారాయణోపనిషత్తు(1) నందు కూడా “అప్పుడు దేవదేవుడైన నారాయణుడు జీవులను సృజించదలచెను” అని తెలుపబడినది (అథ పురుషో హ వై నారాయణో(కామయత ప్రజా: సృజేయేతి). 

అదే ఉపనిషత్తు ఇంకను కొనసాగి “నారాయణాద్ బ్రహ్మా జాయతే, నారాయణాద్ ప్రజాపతి:ప్రజాయతే, నారాయణాద్ ఇంద్రోజాయతే, నారాయణాదష్టౌవసవో జాయన్తే, నారాయణాద్ ఏకాదశ రుద్రా జాయన్తే, నారాయణాద్ ద్వాదశాదిత్యా:” యనియు తెలిపినది. అనగా నారాయణుని నుండియే బ్రహ్మదేవుడు మరియు ప్రజాపతులు ఉద్భవించిరి. నారాయణుని నుండియే ఇంద్రుడు జన్మించెను. నారాయణుని నుండియే అష్టవసువులు జన్మించిరి. 

నారాయణుని నుండియే ఏకాదశ రుద్రులు ఉద్భవించిరి మరియు నారాయణుని నుండియే ద్వాదశాధిత్యులును జన్మించిరి. అట్టి నారాయణుడు శ్రీకృష్ణభగవానుని ఒక ప్రధాన విస్తృతాంశము.

నారాయణోపనిషత్తు(4) నందే “బ్రహ్మణ్యో దేవకీపుత్ర:” అని తెలుపబడినది. అనగా దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడే ఆదిదేవుడు. 

దాని యందే మరల “ఏకో వై నారాయణ ఆసీన్నబ్రహ్మా న ఈ శానో నాపో నాగ్ని- సోమౌ నేమే ద్యావాపృథ్వీ న నక్షత్రాణి న సూర్య:” అని తెలుపబడినది. అనగా సృష్ట్యారంభమున దేవదేవుడైన నారాయణుడొక్కడే యుండెను. 

బ్రహ్మదేవుడుగాని, శివుడుగాని, అగ్నిగాని, చంద్రుడుగాని, ఆకాశమున నక్షత్రములుగాని, సూర్యుడుగాని అప్పుడు లేరు. అదే విధముగా మహోపనిషత్తు(1) నందు కూడా శివుడు దేవదేవుని ఫాలభాగము నుండి జన్మించెనని తెలుపబడినది. కనుకనే బ్రహ్మరుద్రాదులను సృష్టించిన దేవదేవుడే పూజనీయుడని వేదములు పలుకుచున్నవి.

మోక్షధర్మమునందు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: 

ప్రజాపతిం చ రుద్రం చాప్యహం ఏవ సృజామి వై |
తౌ హి మాం న విజానీతో మమ మాయావిమోహితౌ ||

“ప్రజాపతులు, శివుడు మరియు ఇతరులు మాయాశక్తిచే భ్రమితులైన కారణమున నాచే తాము సృజించబడితిమని ఎరుగకున్నను వాస్తవముగా నా చేతనే సృష్టించబడిరి.” వరాహపురాణమునందు కూడా ఇదే విషయము ఇట్లు తెలుపబడినది.

నారాయణ: పరో దేవస్తస్మా జ్జాతశ్చతుర్ముఖ: |
తస్మాద్ రుద్రో(భవద్దేవ స చ సర్వజ్ఞతాం గత: ||

“నారాయణుడు దేవదేవుడు. అతని నుండియే బ్రహ్మ జన్మించగా, ఆ బ్రహ్మ నుండి శివుడు ఉద్భవించెను.”

కనుకనే శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి కారణమైయుండి సర్వమునకు కారణునిగా పిలువబడుచున్నాడు. 

కనుకనే ఆ భగవానుడు “సర్వము నా నుండియే ఉద్భవించుట వలన సర్వమునకు నేనే ఆదికారణుడనై యున్నాను. సమస్తము నా ఆధీనమునందే కలదు. నా కన్నను అధికులెవ్వరు లేరు” అని పలికెను. అనగా శ్రీకృష్ణుడు తప్ప అన్యమైన దివ్యనియామకుడు వేరోక్కడు లేడు. 

ప్రామాణికుడైన గురువు నుండి శాస్త్రాన్వయముతో శ్రీకృష్ణుని గూర్చి ఈ విధముగా అవగతము చేసికొనినవాడు తన శక్తినంతటిని కృష్ణభక్తిభావనలో నిమగ్నము చేసి నిజమైన పండితుడు కాగలడు. 

అట్టివానితో పోల్చినచో కృష్ణుని గూర్చి సరిగా ఎరుగనట్టి ఇతరులందరును మూర్ఖులే. కేవలము మూర్ఖుడైనవాడే శ్రీకృష్ణుని సాధారణమానవునిగా భావించును. 

కనుక కృష్ణభక్తిభావన యందున్నవాడు అట్టి మూర్ఖులచే ఎన్నడును కలతనొందరాదు. భగవద్గీతకు గల అప్రామాణిక వ్యాఖ్యానములకు మరియు వివరణములకు అతడు దూరుడై కృష్ణభక్తిరసభావనమందే నిశ్చయము మరియు స్థిరత్వముతో కొనసాగవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 360 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 08 🌴

08. ahaṁ sarvasya prabhavo
mattaḥ sarvaṁ pravartate
iti matvā bhajante māṁ
budhā bhāva-samanvitāḥ

🌷 Translation : 
I am the source of all spiritual and material worlds. Everything emanates from Me. The wise who perfectly know this engage in My devotional service and worship Me with all their hearts.

🌹 Purport :
A learned scholar who has studied the Vedas perfectly and has information from authorities like Lord Caitanya and who knows how to apply these teachings can understand that Kṛṣṇa is the origin of everything in both the material and spiritual worlds, and because he knows this perfectly he becomes firmly fixed in the devotional service of the Supreme Lord. 

He can never be deviated by any amount of nonsensical commentaries or by fools. All Vedic literature agrees that Kṛṣṇa is the source of Brahmā, Śiva and all other demigods. 

In the Atharva Veda (Gopāla-tāpanī Upaniṣad 1.24) it is said, yo brahmāṇaṁ vidadhāti pūrvaṁ yo vai vedāṁś ca gāpayati sma kṛṣṇaḥ: “It was Kṛṣṇa who in the beginning instructed Brahmā in Vedic knowledge and who disseminated Vedic knowledge in the past.” 

Then again the Nārāyaṇa Upaniṣad (1) says, atha puruṣo ha vai nārāyaṇo ’kāmayata prajāḥ sṛjeyeti: “Then the Supreme Personality Nārāyaṇa desired to create living entities.” 

The Upaniṣad continues, nārāyaṇād brahmā jāyate, nārāyaṇād prajāpatiḥ prajāyate, nārāyaṇād indro jāyate, nārāyaṇād aṣṭau vasavo jāyante, nārāyaṇād ekādaśa rudrā jāyante, nārāyaṇād dvādaśādityāḥ: 

“From Nārāyaṇa, Brahmā is born, and from Nārāyaṇa the patriarchs are also born. From Nārāyaṇa, Indra is born, from Nārāyaṇa the eight Vasus are born, from Nārāyaṇa the eleven Rudras are born, from Nārāyaṇa the twelve Ādityas are born.” This Nārāyaṇa is an expansion of Kṛṣṇa.

It is said in the same Vedas, brahmaṇyo devakī-putraḥ: 

“The son of Devakī, Kṛṣṇa, is the Supreme Personality.” (Nārāyaṇa Upaniṣad 4) Then it is said, eko vai nārāyaṇa āsīn na brahmā neśāno nāpo nāgni-somau neme dyāv-āpṛthivī na nakṣatrāṇi na sūryaḥ: “In the beginning of the creation there was only the Supreme Personality Nārāyaṇa. 

There was no Brahmā, no Śiva, no water, no fire, no moon, no heaven and earth, no stars in the sky, no sun.” (Mahā Upaniṣad 1.2) 

In the Mahā Upaniṣad it is also said that Lord Śiva was born from the forehead of the Supreme Lord. Thus the Vedas say that it is the Supreme Lord, the creator of Brahmā and Śiva, who is to be worshiped.

In the Mokṣa-dharma section of the Mahābhārata, Kṛṣṇa also says,

prajāpatiṁ ca rudraṁ cāpy
aham eva sṛjāmi vai
tau hi māṁ na vijānīto
mama māyā-vimohitau

“The patriarchs, Śiva and others are created by Me, though they do not know that they are created by Me because they are deluded by My illusory energy.” In the Varāha Purāṇa it is also said,

nārāyaṇaḥ paro devas
tasmāj jātaś caturmukhaḥ
tasmād rudro ’bhavad devaḥ
sa ca sarva-jñatāṁ gataḥ

“Nārāyaṇa is the Supreme Personality of Godhead, and from Him Brahmā was born, from whom Śiva was born.”

Lord Kṛṣṇa is the source of all generations, and He is called the most efficient cause of everything. He says, “Because everything is born of Me, I am the original source of all. Everything is under Me; no one is above Me.” There is no supreme controller other than Kṛṣṇa. 

One who understands Kṛṣṇa in such a way from a bona fide spiritual master, with references from Vedic literature, engages all his energy in Kṛṣṇa consciousness and becomes a truly learned man. 

In comparison to him, all others, who do not know Kṛṣṇa properly, are but fools. Only a fool would consider Kṛṣṇa to be an ordinary man. 

A Kṛṣṇa conscious person should not be bewildered by fools; he should avoid all unauthorized commentaries and interpretations on Bhagavad-gītā and proceed in Kṛṣṇa consciousness with determination and firmness.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 06/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 361: 10వ అధ్.,  శ్లో 09 /  Bhagavad-Gita - 361: Chap. 10, Ver. 09

🌹. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 09  🌴

09. మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్త: పరస్పరమ్ |
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ||

🌷. తాత్పర్యం :
నా శుద్ధభక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై, వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై యుండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు.

🌷. భాష్యము :
శుద్ధభక్తులు (వారి లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి) శ్రీకృష్ణభగవానుడు దివ్యమగు ప్రేమయుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు. 

వారి మనస్సు లెన్నడును శ్రీకృష్ణచరణారవిందముల నుండి మరలవు. వారి చర్చలు ఆధ్యాత్మిక విషయముల పైననే పూర్ణముగా కేంద్రీకృతమై యుండును. కనుకనే వారి దివ్యలక్షణములు ఈ శ్లోకమున ప్రత్యేకముగా వర్ణింపబడినవి. అట్టి శుద్ధభక్తులు ఇరువదినాలుగుగంటలు శ్రీకృష్ణభగవానుని గుణములను మరియు లీలలను కీర్తించుట యందు లగ్నమై యుందురు. హృదయము మరియు ఆత్మ సదా శ్రీకృష్ణతత్పరములై యుండి వారు ఇతర భక్తులతో ఆ దేవదేవుని గూర్చి చర్చించుట యందు ఆనదమును ననుభవింతురు.

భక్తియోగపు ప్రాథమికదశ యందు సేవ ద్వారా దివ్యానందము ననుభవించెడి భక్తులు పరిపక్వస్థితిలో భగవత్ప్రేమ యందే వాస్తవముగా స్థితులగుదురు. 

అటువంటి దివ్యస్థితి యందు నెలకొనిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు తన ధామమునందు ప్రదర్శించు సంపూర్ణత్వమును వారు అనుభవింపగలరు. భక్తియుతసేవను జీవుని హృదయమునందు బీజమును నాటుటగా శ్రీచైతన్యమహాప్రభువు పోల్చియున్నారు. 

విశ్వమునందలి అసంఖ్యాకలోకములలో సదా పరిభ్రమించు అనంతకోటి జీవరాసులలో భాగ్యవంతులైన కొందరే శుద్ధభక్తుని సాంగత్యమును పొంది భక్తిని గూర్చి తెలియుట అవకాశమును పొందుదురు. ఈ భక్తియుతసేవ యనునది బీజము వంటిది. 

అట్టి భక్తిబీజము హృదయములో నాటబడిన పిమ్మట మనుజుడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను కృష్ణనామమును కీర్తించుటను, శ్రవణము చేయుటను నిరంతరము కొనసాగించినచో నిత్యము జలమొసగుటచే వృక్షబీజము మొలకెత్తు రీతి, ఆ భక్తిబీజము మొలకెత్తగలదు. పిమ్మట భక్తిలత క్రమముగా పెరిగి పెరిగి బ్రంహాండమును చేదించుకొని ఆధ్యాత్మికాకాశమునందలి బ్రహ్మజ్యోతిని చేరును. 

ఆధ్యాత్మికాకాశము నందును అది గోలోకబృందావనమగా పిలువబడు అత్యున్నతమైన దివ్యకృష్ణలోకమును చేరునంతవరకు పెరిగి పెరిగి అంత్యమున కృష్ణపాదారవిందమును చేరి అచ్చట విశ్రమించును. అటుపిమ్మట లతలు పుష్పములను, ఫలములను ఒసగురీతి భక్తిలత సైతము ఫల, పుష్పములను ఒసగును. అట్టి సమయమున కూడా శ్రవణ, కీర్తనల రూపమున జలసేవ భక్తిలతకు జరుగుచునే యుండును. 

ఇట్టి భక్తిలత చైతన్యచరితామృతమునందు (మధ్యలీల 19వ అధ్యాయము) విపులముగా వర్ణింపబడినది. భక్తిలత శ్రీకృష్ణభగవానుని చరణాశ్రయమును సంపూర్ణముగా పొందిన పిమ్మట మనుజుడు భగవత్ప్రేమ యందు పూర్ణముగా లీనమగునని దాని యందు వివరింపబడినది. 

అంతట జలమును వీడి మత్య్సము బ్రతుకలేనట్లు, భక్తుడు భగవానుని సంబంధము లేకుండా క్షణకాలమును జీవింపలేడు. అటువంటి దివ్యస్థితిలో భక్తుడు శ్రీకృష్ణభగవానుని సంబధమున దివ్యమైన లక్షణములను వాస్తవముగా పొందును. 

భగవానుడు మరియు అతని భక్తుల నడుమగల సంబంధపు వర్ణనలతోనే శ్రీమద్భాగవతము నిండియున్నది. 

కావున భాగవతముననే (12.13.18) తెలుపబడినట్లు అది భక్తులకు అత్యంత ప్రియమైనదై యున్నది (శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం ). శ్రీమద్భాగవతమునందు ధర్మము, అర్థము, కామము, మోక్షములను గూర్చిన చర్చలేదు. భగవానుడు మరియు భక్తుల దివ్యస్వభావము పూర్ణముగా వర్ణింపబడిన ఏకైక చరితము శ్రీమద్భాగవతమే. 

కనుకనే యువతీయువకులు ఒండరుల సాహచర్యమున ఆనందమును పొందురీతి, కృష్ణభక్తిభావన యందు పూర్ణతనొందిన మహాత్ములు అట్టి దివ్యశాస్త్రములను శ్రవణము చేయుట యందు నిత్యానందమును పొందుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 361 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 09 🌴

09. mac-cittā mad-gata-prāṇā
bodhayantaḥ parasparam
kathayantaś ca māṁ nityaṁ
tuṣyanti ca ramanti ca

🌷 Translation : 
The thoughts of My pure devotees dwell in Me, their lives are fully devoted to My service, and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about Me.

🌹 Purport :
Pure devotees, whose characteristics are mentioned here, engage themselves fully in the transcendental loving service of the Lord. Their minds cannot be diverted from the lotus feet of Kṛṣṇa. Their talks are solely on the transcendental subjects. The symptoms of the pure devotees are described in this verse specifically. 

Devotees of the Supreme Lord are twenty-four hours daily engaged in glorifying the qualities and pastimes of the Supreme Lord. Their hearts and souls are constantly submerged in Kṛṣṇa, and they take pleasure in discussing Him with other devotees.

In the preliminary stage of devotional service they relish the transcendental pleasure from the service itself, and in the mature stage they are actually situated in love of God. Once situated in that transcendental position, they can relish the highest perfection which is exhibited by the Lord in His abode. 

Lord Caitanya likens transcendental devotional service to the sowing of a seed in the heart of the living entity. There are innumerable living entities traveling throughout the different planets of the universe, and out of them there are a few who are fortunate enough to meet a pure devotee and get the chance to understand devotional service. 

This devotional service is just like a seed, and if it is sown in the heart of a living entity, and if he goes on hearing and chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, that seed fructifies, just as the seed of a tree fructifies with regular watering. 

The spiritual plant of devotional service gradually grows and grows until it penetrates the covering of the material universe and enters into the brahma-jyotir effulgence in the spiritual sky. 

In the spiritual sky also that plant grows more and more until it reaches the highest planet, which is called Goloka Vṛndāvana, the supreme planet of Kṛṣṇa. 

Ultimately, the plant takes shelter under the lotus feet of Kṛṣṇa and rests there. Gradually, as a plant grows fruits and flowers, that plant of devotional service also produces fruits, and the watering process in the form of chanting and hearing goes on. 

This plant of devotional service is fully described in the Caitanya-caritāmṛta (Madhya-līlā, Chapter Nineteen). It is explained there that when the complete plant takes shelter under the lotus feet of the Supreme Lord, one becomes fully absorbed in love of God; then he cannot live even for a moment without being in contact with the Supreme Lord, just as a fish cannot live without water. In such a state, the devotee actually attains the transcendental qualities in contact with the Supreme Lord.

The Śrīmad-Bhāgavatam is also full of such narrations about the relationship between the Supreme Lord and His devotees; therefore the Śrīmad-Bhāgavatam is very dear to the devotees, as stated in the Bhāgavatam itself (12.13.18). 

Śrīmad-bhāgavataṁ purāṇam amalaṁ yad vaiṣṇavānāṁ priyam. In this narration there is nothing about material activities, economic development, sense gratification or liberation. 

Śrīmad-Bhāgavatam is the only narration in which the transcendental nature of the Supreme Lord and His devotees is fully described. Thus the realized souls in Kṛṣṇa consciousness take continual pleasure in hearing such transcendental literatures, just as a young boy and girl take pleasure in association.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 07/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 362: 10వ అధ్.,  శ్లో 10 /  Bhagavad-Gita - 362: Chap. 10, Ver. 10

🌹. శ్రీమద్భగవద్గీత - 362 / Bhagavad-Gita - 362  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 10  🌴

10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే ||

🌷. తాత్పర్యం :
ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైనవారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనొసగుదును. 

🌷. భాష్యము :
“బుద్ధియోగమ్” అను పదము ఈ శ్లోకమునందు ముఖ్యమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశమొసగుచు తాను అనేక విషయములను చర్చించితిననియు మరియు ఇకపై బుద్ధియోగము ద్వారా కొన్ని విషయములు తెలుపనున్నట్లుయు పలికియున్న విషయమును మనమిచ్చట జ్ఞాపకము చేసికొనవలెను. అట్టి బుద్ధియోగమే ఇచ్చట పేర్కొనబడినది. బుద్ధియోగమనగా కృష్ణభక్తిరసభావనలో కర్మనొనర్చుట యనియే భావము. అదియే అత్యుత్తమబుద్ధి మరియు జ్ఞానము అనబడును. బుద్ధి యనగా తెలివి మరియు యోగమనగా యోగకర్మలు. భగవద్దామమునకు చేరగోరి మనుజుడు కృష్ణభక్తిభావనలో భక్తియుక్తసేవయందు నిలిచినచో అతని కర్మలు బుద్ధియోగమనబడును. అనగా బుద్ధియోగము ద్వారా మనుజుడు భౌతికజగత్తు బంధముల నుండి సులభముగా విడివడగలడు. పురోగతి యనుదాని చరమప్రయోజనము శ్రీకృష్ణుడే. కాని జనసామాన్యము ఈ విషయము నెరుగరు. కనుకనే గురువు మరియు భక్తుల సాంగత్యము అత్యంత ముఖ్యమై యున్నది. కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుడే పరమగమ్యమని తెలిసికొనవలసియున్నది. ఆ విధముగా గమ్యమును నిర్ణయించి, నెమ్మదిగా అయినప్పటికిని క్రమముగా ప్రయాణించినచో అంతిమలక్ష్యము ప్రాప్తించగలదు.

మానవుడు జీవితలక్ష్యము నెరిగియు తన కర్మఫలముల యెడ అనురక్తిని కలిగియున్నచో అతడు కర్మయోగమునందు వర్తించినవాడగును. అదే విధముగా మానవుడు కృష్ణుడే గమ్యమని తెలిసియు, కృష్ణుని అవగతము చేసికొనుటకు మానసికకల్పనలను ఆశ్రయించినచో జ్ఞానయోగమునందు వర్తించినవాడగును. ఇక మానవుడు తన గమ్యమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన యందు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినపుడు భక్తియోగమునందు లేదా బుద్ధియోగమునందు వర్తించినవాడగును. వాస్తవమునకు ఈ బుద్ధియోగమే సంపూర్ణము మరియు సమగ్రమైన యోగమై యున్నది. ఇదియే మానవజన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణస్థితి.

మనుజుడు ఆధ్యాత్మికగురువును పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మికసంఘముతో సంబంధమును కలిగయున్నను ఒకవేళ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధిని పొందలేకపోయినచో ఎటువంటి కష్టము లేకుండా అతడు అంత్యమున తనను చేరురీతిలో శ్రీకృష్ణుడే అతనికి అంతర్యమున ఉపదేశములొసగును. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 362 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 10 🌴

10. teṣāṁ satata-yuktānāṁ
bhajatāṁ prīti-pūrvakam
dadāmi buddhi-yogaṁ taṁ
yena mām upayānti te

🌷 Translation : 
To those who are constantly devoted to serving Me with love, I give the understanding by which they can come to Me.

🌹 Purport :
In this verse the word buddhi-yogam is very significant. We may remember that in the Second Chapter the Lord, instructing Arjuna, said that He had spoken to him of many things and that He would instruct him in the way of buddhi-yoga. Now buddhi-yoga is explained. Buddhi-yoga itself is action in Kṛṣṇa consciousness; that is the highest intelligence. Buddhi means intelligence, and yoga means mystic activities or mystic elevation. When one tries to go back home, back to Godhead, and takes fully to Kṛṣṇa consciousness in devotional service, his action is called buddhi-yoga. In other words, buddhi-yoga is the process by which one gets out of the entanglement of this material world. The ultimate goal of progress is Kṛṣṇa. People do not know this; therefore the association of devotees and a bona fide spiritual master are important. One should know that the goal is Kṛṣṇa, and when the goal is assigned, then the path is slowly but progressively traversed, and the ultimate goal is achieved.

When a person knows the goal of life but is addicted to the fruits of activities, he is acting in karma-yoga. When he knows that the goal is Kṛṣṇa but he takes pleasure in mental speculations to understand Kṛṣṇa, he is acting in jñāna-yoga. And when he knows the goal and seeks Kṛṣṇa completely in Kṛṣṇa consciousness and devotional service, he is acting in bhakti-yoga, or buddhi-yoga, which is the complete yoga. This complete yoga is the highest perfectional stage of life.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 08/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 363: 10వ అధ్.,  శ్లో 11 /  Bhagavad-Gita - 363: Chap. 10, Ver. 11

🌹. శ్రీమద్భగవద్గీత - 363 / Bhagavad-Gita - 363  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 11  🌴

11. తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమ: |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||

🌷. తాత్పర్యం :
నేను వారి యెడ ప్రత్యేకకరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు, తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును.

🌷. భాష్యము :
శ్రీచైతన్యమహాప్రభువు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రకీర్తనమును వారణాసి యందు ప్రచారము చేసినపుడు వేలాదిమంది అయినను అనుసరించి. కాని ప్రకాశానందసరస్వతి యను నతడు (ఆ కాలమున వారణాసి యందు గొప్పసేవ మోసిన పండితుడు) మాత్రము మహాప్రభువు భావావేశపరుడైనందుకు ఆయనను హేళనచేసెను. 

అదేవిధముగా కొన్నిమార్లు కొందరు తత్త్వవేత్తలు భక్తులైనవారు అజ్ఞానాంధకారములో నుండి, తత్త్వరీత్యా భావావేశపరులై యుందురన్న భావానలో వారిని విమర్శింతురు. కాని వాస్తవమునకు అది సత్యముకాదు. ఘనులైన పండితులెందరో భక్తితత్త్వమును సమగ్రమముగా విశదపరిచిరి. కాని భక్తుడు వారి రచనల నుండి కాని, గురూపదేశముల నుండి కాని లాభము పొందలేకున్నను, 

భక్తియోగము నందు శ్రద్దాళువైనచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని అంతర్యము నుండి సహాయమును కూర్చగలడు. అనగా శ్రద్ధతో కృష్ణభక్తిభావన యందు నిలిచిన భక్తుడు ఎన్నడును జ్ఞానరహితుడు కాబోడు. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో సేవ నొనర్చుట ఒక్కటే దానికి కావలసిన యోగ్యత.

ఆత్మానాత్మవిచక్షణ లేకుండా ఎవ్వరును శుద్ధజ్ఞానమును పొందలేరని ఆధునిక తత్త్వవేత్తలు భావింతురు. అట్టివారికి శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున చక్కని సమాధానమొసగినాడు. 

అనగా శుద్ధభక్తియోగమున నియుక్తులైనవారు తగినంత విద్య లేనప్పటికి మరియు వేదనియమములను గూర్చిన తగిన జ్ఞానమును కలిగియుండనప్పటికిని ఈ శ్లోకమున తెలుపబడినట్లు తప్పక భగవానునిచే సహాయమును పొందగలరు.

పరతత్త్వమైన తనను కేవలము మానసికకల్పనల ద్వారా అవగాహన చేసికొనుట సాధ్యముకాని విషయమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బోధించెను. పరతత్త్వమైన భగవానుడు అత్యంత ఘనుడైనవాడగుచో మనోకల్పనల ద్వారా అతనిని అవగాహనము చేసికొనుట లేదా పొందగలుగుట సాధ్యము కాదు. 

మనుజడు భక్తి లేకుండ మరియు పరతత్త్వమునందు అనురాగము లేకుండ కోట్లాది సంవత్సరములు మానసికకల్పనలు గావించినను పరతత్త్వమైన శ్రీకృష్ణుడు ముదమొంది తన అంతరంగశక్తి ద్వారా శుద్ధభక్తుని హృదయమున తనను తాను విశదపరచుకొనును. శుద్ధభక్తుడు శ్రీకృష్ణుడు సదా తన హృదయమునందు నిలుపుకొనియుండును. 

సూర్యసముడైన శ్రీకృష్ణుని అట్టి ఉనికిచే భక్తుని హృదయమునందలి అజ్ఞానాంధకారము పటాపంచలైపోవును. ఇదియే శ్రీకృష్ణుడు తన శుద్ధభక్తుల యెడ చూపు ప్రత్యేక కరుణయై యున్నది.

కోటానుకోట్ల జన్మల యందలి విషయసంపర్క మాలిన్యముచే మనుజుని హృదయము సదా భౌతికత్వమనెడి ధూళిచే కప్పబడియుండును. 

కాని అతడు భక్తియుతసేవలో నియుక్తుడై హరేకృష్ణమహామంత్రమును నిరంతరము జపించినచో శీఘ్రమే ఆ హృదయమాలిన్యము తొలగిపోయి, శుద్ధజ్ఞానస్థితికి ఉద్దరింపబడును. 

అనగా చరమలక్ష్యమైన విష్ణువు కేవలము హరినామసంకీర్తనము మరియు భక్తియుతసేవ తోడనే లభించునుగాని మనోకల్పన లేదా వాదములతో కాదు. శుద్ధభక్తుడు ఏనాడును భౌతిక జీవితావసరములను గూర్చిన చింత మరియు ఆందోళనలను కలిగియుండ నవసరము లేదు. 

ఏలయన అతడు తన హృదయము నుండి అజ్ఞానాంధకారమును తొలగించుకొనినంతనే ప్రేమయుతసేవచే తృప్తుడైన శ్రీకృష్ణభగవానుడు అతనికి అప్రయత్నముగా సర్వమును సమకూర్చును. ఇదియే గీతోపదేశముల సారాంశము. 

కనుకనే గీతాధ్యయనము ద్వారా మనుజుడు శ్రీకృష్ణభగవానునకు సంపూర్ణశరణాగతుడై అతని శుద్ధభక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. పిదప భగవానుడే రక్షణభారమును స్వీకరించినపుడు అతడు సర్వవిధములైన భౌతికయత్నముల నుండి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 363 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 11 🌴

11. teṣām evānukampārtham
aham ajñāna-jaṁ tamaḥ
nāśayāmy ātma-bhāva-stho
jñāna-dīpena bhāsvatā

🌷 Translation : 
To show them special mercy, I, dwelling in their hearts, destroy with the shining lamp of knowledge the darkness born of ignorance.

🌹 Purport :
When Lord Caitanya was in Benares promulgating the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, thousands of people were following Him. Prakāśānanda Sarasvatī, a very influential and learned scholar in Benares at that time, derided Lord Caitanya for being a sentimentalist. 

Sometimes Māyāvādī philosophers criticize the devotees because they think that most of the devotees are in the darkness of ignorance and are philosophically naive sentimentalists. Actually that is not the fact. There are very, very learned scholars who have put forward the philosophy of devotion. 

But even if a devotee does not take advantage of their literatures or of his spiritual master, if he is sincere in his devotional service he is helped by Kṛṣṇa Himself within his heart. 

So the sincere devotee engaged in Kṛṣṇa consciousness cannot be without knowledge. The only qualification is that one carry out devotional service in full Kṛṣṇa consciousness.

The Māyāvādī philosophers think that without discriminating one cannot have pure knowledge. For them this answer is given by the Supreme Lord: those who are engaged in pure devotional service, even though they be without sufficient education and even without sufficient knowledge of the Vedic principles, are still helped by the Supreme God, as stated in this verse.

The Lord tells Arjuna that basically there is no possibility of understanding the Supreme Truth, the Absolute Truth, the Supreme Personality of Godhead, simply by speculating, for the Supreme Truth is so great that it is not possible to understand Him or to achieve Him simply by making a mental effort. 

Man can go on speculating for several millions of years, and if he is not devoted, if he is not a lover of the Supreme Truth, he will never understand Kṛṣṇa, or the Supreme Truth. Only by devotional service is the Supreme Truth, Kṛṣṇa, pleased, and by His inconceivable energy He can reveal Himself to the heart of the pure devotee. 

The pure devotee always has Kṛṣṇa within his heart; and with the presence of Kṛṣṇa, who is just like the sun, the darkness of ignorance is at once dissipated. This is the special mercy rendered to the pure devotee by Kṛṣṇa.

Due to the contamination of material association, through many, many millions of births, one’s heart is always covered with the dust of materialism, but when one engages in devotional service and constantly chants Hare Kṛṣṇa, the dust quickly clears, and one is elevated to the platform of pure knowledge. The ultimate goal, Viṣṇu, can be attained only by this chant and by devotional service, and not by mental speculation or argument. 

The pure devotee does not have to worry about the material necessities of life; he need not be anxious, because when he removes the darkness from his heart, everything is provided automatically by the Supreme Lord, who is pleased by the loving devotional service of the devotee. 

This is the essence of the teachings of Bhagavad-gītā. By studying Bhagavad-gītā, one can become a soul completely surrendered to the Supreme Lord and engage himself in pure devotional service. As the Lord takes charge, one becomes completely free from all kinds of materialistic endeavors.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 09/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 364: 10వ అధ్.,  శ్లో 12, 13 /  Bhagavad-Gita - 364: Chap. 10, Ver. 12, 13

🌹. శ్రీమద్భగవద్గీత - 364 / Bhagavad-Gita - 364  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 12, 13 🌴

12. అర్జున ఉవాచ
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ||

13. ఆహుస్త్వామృషయ: సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాస: స్వయం చైవ బ్రవీషి మే ||

🌷. తాత్పర్యం :
అర్జునుడు ఇట్లు పలికెను: నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్త్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేనివాడవు, ఘనమైనవాడవు అయియున్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాఋషులందరును నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధ్రువపరచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమున నాకు తెలియజేయుచున్నావు.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు ఈ రెండు శ్లోకములలో ఆధునిక తత్త్వవేత్తలకు ఒక అవకాశమొసగుచున్నాడు. భగవానుడు జీవాత్మకు భిన్నుడని ఇచ్చట స్పష్టముగ విశదమగుటచే అందులకు కారణము. 

ఈ అధ్యాయపు ముఖ్యమైన నాలుగుశ్లోకములను శ్రవణము చేసినంతనే అర్జునుడు సర్వసందేహముల నుండి ముక్తుడై శ్రీకృష్ణుని పూర్ణపురుషోత్తముడైన ఆదిదేవునిగా అంగీకరించెను. కనుకనే అతడు “నీవే పరబ్రహ్మమువు మరియు ఆదిదేవుడవు” అని ప్రకటించెను. సమస్తము తన నుండియే ఉద్భవించినదనియు మరియు దేవ, మనుష్యాది జీవులందరును తన పైననే ఆధారపడినవారనియు శ్రీకృష్ణుడు పూర్వమే ప్రకటించియున్నాడు. 

కాని వారు అజ్ఞానకారణముగా తమనే పరతత్త్వముగా భావించుచు తాము దేవదేవునికి ఆధీనులము కామని భావింతురు. అట్టి అజ్ఞానము భక్తియుతసేవ ద్వారా సంపూర్ణముగా తొలగునని శ్రీకృష్ణభగవానుడు గడచిన శ్లోకములలో వివరించియున్నాడు. 

ఇప్పుడు ఆ భగవానుని కరుణచే అర్జునుడు వేదానుసారముననే అతనిని పరతత్త్వముగా అంగీకరించుచున్నాడు. అనగా శ్రీకృష్ణుడు తన స్నేహితుడు కనుక అతనిని పరతత్త్వమనియు, దేవదేవుడనియు అర్జునుడు ముఖస్తుతి చేయుటలేదు. కేవలము వేదానుసారమే అతడట్లు కీర్తించెను. అర్జునుడు ఈ రెండు శ్లోకములలో పలికినదంతయు వేదములచే నిర్దారింపబడినది. 

భక్తియుతసేవను చేపట్టినవాడే శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనగలడుగాని ఇతరులు అందుకు సమర్థులు కారని వేదములు ద్రువీకరించుచున్నవి. అనగా అర్జునుడు పలికిన ప్రతిపదము కూడా వేదనిర్దేశముచే సమర్థింపబడుచున్నది.

పరబ్రహ్మము సర్వమునకు ఆశ్రయస్థానమని కేనోపనిషత్తు నందు తెలుపబడినది. అందుకు తగినట్లుగా శ్రీకృష్ణుడు సమస్తము తననే ఆశ్రయించియున్నదని పూర్వమే పలికియున్నాడు. సర్వమునకు ఆధారభూతుడైన భగవానుడు తననే సదా చింతించువానికి మాత్రమే అనుభూతుడగునని ముండకోపనిషత్తు ధ్రువపరచుచున్నది. 

అట్లు కృష్ణుని గూర్చి సదా చింతించుటయే నవవిధభక్తిమార్గములలో ఒకటైన స్మరణము. శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ ద్వారానే మనుజుడు తన నిజస్థితినెరిగి భౌతికదేహము నుండి విడివడగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 364 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 12, 13 🌴

12. arjuna uvāca
paraṁ brahma paraṁ dhāma
pavitraṁ paramaṁ bhavān
puruṣaṁ śāśvataṁ divyam
ādi-devam ajaṁ vibhum

13. āhus tvām ṛṣayaḥ sarve
devarṣir nāradas tathā
asito devalo vyāsaḥ
svayaṁ caiva bravīṣi me

🌷 Translation : 
Arjuna said: You are the Supreme Personality of Godhead, the ultimate abode, the purest, the Absolute Truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest. All the great sages such as Nārada, Asita, Devala and Vyāsa confirm this truth about You, and now You Yourself are declaring it to me.

🌹 Purport :
In these two verses the Supreme Lord gives a chance to the Māyāvādī philosopher, for here it is clear that the Supreme is different from the individual soul. 

Arjuna, after hearing the essential four verses of Bhagavad-gītā in this chapter, became completely free from all doubts and accepted Kṛṣṇa as the Supreme Personality of Godhead. He at once boldly declares, “You are paraṁ brahma, the Supreme Personality of Godhead.” 

And previously Kṛṣṇa stated that He is the originator of everything and everyone. Every demigod and every human being is dependent on Him. Men and demigods, out of ignorance, think that they are absolute and independent of the Supreme Personality of Godhead. 

That ignorance is removed perfectly by the discharge of devotional service. This has already been explained in the previous verse by the Lord. Now, by His grace, Arjuna is accepting Him as the Supreme Truth, in concordance with the Vedic injunction. 

It is not that because Kṛṣṇa is Arjuna’s intimate friend Arjuna is flattering Him by calling Him the Supreme Personality of Godhead, the Absolute Truth. Whatever Arjuna says in these two verses is confirmed by Vedic truth. 

Vedic injunctions affirm that only one who takes to devotional service to the Supreme Lord can understand Him, whereas others cannot. Each and every word of this verse spoken by Arjuna is confirmed by Vedic injunction.

In the Kena Upaniṣad it is stated that the Supreme Brahman is the rest for everything, and Kṛṣṇa has already explained that everything is resting on Him. 

The Muṇḍaka Upaniṣad confirms that the Supreme Lord, in whom everything is resting, can be realized only by those who engage constantly in thinking of Him. 

This constant thinking of Kṛṣṇa is smaraṇam, one of the methods of devotional service. It is only by devotional service to Kṛṣṇa that one can understand his position and get rid of this material body.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 10/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 365: 10వ అధ్.,  శ్లో 14 /  Bhagavad-Gita - 365: Chap. 10, Ver. 14

🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 14 🌴

14. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా: ||

🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను ఆంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులుగాని నీ స్వరూపమును ఎరుగజాలరు.

🌷. భాష్యము :
శ్రద్ధలేనివారు, దానవప్రవృత్తిగలవారు శ్రీకృష్ణభగవానుని ఎరుగజాలరని అర్జునుడు ఇచ్చట ధ్రువపరచుచున్నాడు. 

అతడు దేవతలకే తెలియబడుటలేదన్నచో ఆధునికజగత్తుకు చెందిన నామమాత్ర పండితులను గూర్చి వేరుగా తెలుపనవసరము లేదు. కాని అర్జునుడు ఇచ్చట కృష్ణని కరుణ వలన అతనిని పరతత్త్వముగను, పరిపూర్ణునిగను తెలిసికొనగలిగెను. 

భగవద్గీతకు ప్రామాణికుడైన అట్టి అర్జునుని మార్గమునే ప్రతియొక్కరు అనుసరింపవలెను. చతుర్ధాధ్యాయమున తెలుపబడినట్లు గీతాధ్యాయనము కొరకు వలసిన పరంపర నశించియుండుటచే ఆ పరంపరను శ్రీకృష్ణభగవానుడు తిరిగి అర్జునునితో ప్రారంభించెను. 

అర్జునుని సన్నిహిత స్నేహితుడనియు మరియు భక్తుడనియు ఆ దేవదేవుడు భావించుటయే అందులకు కారణము. కనుక ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమున తెలుపబడినట్లు భగవద్గీతను పరంపరారూపముననే అవగతము చేసికొనవలెను. 

అట్టి పరంపర నశించియుండుట చేతనే దానిని పునరుద్ధరించుటకు అర్జునుడు ఎన్నుకోబడెను. శ్రీకృష్ణుడు పలికిన సర్వమును అర్జునుడు అంగీకరించిన విధమును తప్పక అనుసరింపవలెను. 

అప్పుడే భగవద్గీత సారము మనకు అవగతము కాగలదు. ఆ పిదపనే శ్రీకృష్ణుడు దేవదేవుడని మనము సంపూర్ణముగా అవగాహనము చేసికొనగలము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 365 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 14 🌴

14. sarvam etad ṛtaṁ manye
yan māṁ vadasi keśava
na hi te bhagavan vyaktiṁ
vidur devā na dānavāḥ

🌷 Translation : 
O Kṛṣṇa, I totally accept as truth all that You have told me. Neither the demigods nor the demons, O Lord, can understand Your personality.

🌹 Purport :
Arjuna herein confirms that persons of faithless and demonic nature cannot understand Kṛṣṇa. He is not known even by the demigods, so what to speak of the so-called scholars of this modern world? 

By the grace of the Supreme Lord, Arjuna has understood that the Supreme Truth is Kṛṣṇa and that He is the perfect one. One should therefore follow the path of Arjuna. He received the authority of Bhagavad-gītā. 

As described in the Fourth Chapter, the paramparā system of disciplic succession for the understanding of Bhagavad-gītā was lost, and therefore Kṛṣṇa reestablished that disciplic succession with Arjuna because He considered Arjuna His intimate friend and a great devotee. 

Therefore, as stated in our Introduction to Gītopaniṣad, Bhagavad-gītā should be understood in the paramparā system. When the paramparā system was lost, Arjuna was selected to rejuvenate it. 

The acceptance by Arjuna of all that Kṛṣṇa says should be emulated; then we can understand the essence of Bhagavad-gītā, and then only can we understand that Kṛṣṇa is the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 11/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 366: 10వ అధ్.,  శ్లో 15 /  Bhagavad-Gita - 366: Chap. 10, Ver. 15

🌹. శ్రీమద్భగవద్గీత - 366 / Bhagavad-Gita - 366  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 15 🌴

15. స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ||

🌷. తాత్పర్యం :
ఓ పురుషోత్తమా! సర్వకారణుడా! సర్వేశ్వరుడా! దేవదేవా! జగన్నాథా! నీవొక్కడవే నీ అంతరంగశక్తి ద్వారా నిజాముగా నిన్నెరుగుదువు.

🌷. భాష్యము :
అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించువారివలె భక్తియుతసేవ ద్వారా శ్రీకృష్ణునితో సంబంధమును కలిగియున్నవారికే ఆ దేవదేవుడు విడితుడు కాగలడు. 

దానవ, నాస్తికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఎన్నడును ఎరుగలేరు. శ్రీకృష్ణభగవానుని నిజతత్త్వము నుండి దూరముగా గొనిపోవు మానసికకల్పనము వాస్తవమునకు గొప్ప పాపము. ఆ విధముగా శ్రీకృష్ణుని ఎరుగజాలనివారు గీతకు వ్యాఖ్యానమును చేయరాడు. భగవద్గీత శ్రీకృష్ణుని ఉపదేశము. 

అది కృష్ణసంబంధవిజ్ఞానమై యున్నందున కృష్ణుని నుండి దానిని అర్జునుడు అవగతము చేసికొన రీతిలోనే మనము అవగతము చేసికొనవలెను. దానినెన్నడును నాస్తికులైనవారి నుండి గ్రహింపరాదు.

శ్రీమద్భాగవతమున పరతత్త్వమును గూర్చి ఇట్లు తెలుపబడినది (1.2.11)

వదన్తి తత్ తత్త్వవిదస్తత్త్వమ్ యద్ జ్ఞానమద్వయం |
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ధ్యతే ||

పరతత్త్వమనునది నిరాకారబ్రహ్మము, పరమాత్మ, అంత్యమున భగవానునిగా వివధదశలలో అనుభవమునకు వచ్చును. అనగా పరతత్త్వావగాహనలో మనుజుడు అంత్యమున శ్రీకృష్ణభగవానుని అనుభూతికి చేరును. ఆ దేవదేవుని స్వరూపమును సామాన్యమానవుడు గాని, బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభూతి కలిగిన ముక్తపురుషుడు గాని అవగతము చేసికొనలేడు. 

కనుక అట్టివారు శ్రీకృష్ణుడు స్వయముగా పలికిన భగవద్గీత శ్లోకముల ద్వారా ఆ భగవానుని నిజతత్త్వమును అవగతము చేసికొనుటకు యత్నింపవచ్చును. నిరాకారవాదులు కొన్నిమార్లు కృష్ణుని భగవానుడు గాని లేదా అతని అధికారమును గాని అంగీకరింతురు. అయినప్పటికి ఆ ముక్తపురుషులలో పెక్కురు అతనిని పురుషోత్తమునిగా ఎరుగాజాలరు. 

కనుకనే అర్జునుడిచ్చట శ్రీకృష్ణుని “పురుషోత్తముడు” అనుచు సంబోధించినవాడు. పురుషోత్తముడైనను జీవులందరికీ అతడే తండ్రి యని జనులు తెలియకపోవచ్చునని అర్జునుడు అతనిని “భూతభావన” అనియు సంబోదించినాడు. ఆ దేవదేవుని సకలజీవులకు తండ్రిగా తెలిసినను అతడే దివ్యనియామకుడని మనుజుడు తెలియకపోవచ్చును గావున అతడు ఇచ్చట “భూతేశ” (పరమనియామకుడు) అనియు సంబోధించినాడు. 

అతనిని జీవులను నియమించువానిగా అవగతము చేసికొనినను దేవతలందరికీ అతడే మూలమని మనుజుడు తెలియకపోవచ్చును కావున అర్జునుడు శ్రీకృష్ణుని దేవతాపూజ్యుడైన దేవదేవుడనియు కీర్తించినాడు. సర్వదేవతా పూజ్యుడైన భగవానుని అవగతము చేసికొనినను అతడే సర్వమునకు అధిపతి యని మనుజుడు తెలిసికొనలేకపోవచ్చును కావున అతడు తిరిగి “జగత్పతి” యని సంబోధింపబడినాడు. 

ఈ విధముగా కృష్ణునికి సంబంధించిన నిజతత్త్వము అర్జునుని అనుభవముచే ఈ శ్లోకము నందు నిర్ధారితమైనది. కనుక కృష్ణుని యథార్థముగా తెలిసికొనుట కొరకు మనము అర్జునుని అడుగుజాడలను అనుసరింపవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 366 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 15 🌴

15. svayam evātmanātmānaṁ
vettha tvaṁ puruṣottama
bhūta-bhāvana bhūteśa
deva-deva jagat-pate

🌷 Translation : 
Indeed, You alone know Yourself by Your own internal potency, O Supreme Person, origin of all, Lord of all beings, God of gods, Lord of the universe!

🌹 Purport :
The Supreme Lord, Kṛṣṇa, can be known by persons who are in a relationship with Him through the discharge of devotional service, like Arjuna and his followers. Persons of demonic or atheistic mentality cannot know Kṛṣṇa. 

Mental speculation that leads one away from the Supreme Lord is a serious sin, and one who does not know Kṛṣṇa should not try to comment on Bhagavad-gītā. Bhagavad-gītā is the statement of Kṛṣṇa, and since it is the science of Kṛṣṇa, it should be understood from Kṛṣṇa as Arjuna understood it. It should not be received from atheistic persons.

As stated in Śrīmad-Bhāgavatam (1.2.11):

vadanti tat tattva-vidas
tattvaṁ yaj jñānam advayam
brahmeti paramātmeti
bhagavān iti śabdyate

The Supreme Truth is realized in three aspects: as impersonal Brahman, localized Paramātmā and at last as the Supreme Personality of Godhead. So at the last stage of understanding the Absolute Truth, one comes to the Supreme Personality of Godhead. 

A common man or even a liberated man who has realized impersonal Brahman or localized Paramātmā may not understand God’s personality.

Such men, therefore, may endeavor to understand the Supreme Person from the verses of Bhagavad-gītā, which are being spoken by this person, Kṛṣṇa. 

Sometimes the impersonalists accept Kṛṣṇa as Bhagavān, or they accept His authority. Yet many liberated persons cannot understand Kṛṣṇa as Puruṣottama, the Supreme Person. 

Therefore Arjuna addresses Him as Puruṣottama. Yet one still may not understand that Kṛṣṇa is the father of all living entities. Therefore Arjuna addresses Him as Bhūta-bhāvana. 

And if one comes to know Him as the father of all the living entities, still one may not know Him as the supreme controller; therefore He is addressed here as Bhūteśa, the supreme controller of everyone. 

And even if one knows Kṛṣṇa as the supreme controller of all living entities, still one may not know that He is the origin of all the demigods; therefore He is addressed herein as Deva-deva, the worshipful God of all demigods. 

And even if one knows Him as the worshipful God of all demigods, one may not know that He is the supreme proprietor of everything; therefore He is addressed as Jagat-pati. Thus the truth about Kṛṣṇa is established in this verse by the realization of Arjuna, and we should follow in the footsteps of Arjuna to understand Kṛṣṇa as He is.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 12/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 367: 10వ అధ్.,  శ్లో 16 /  Bhagavad-Gita - 367: Chap. 10, Ver. 16

🌹. శ్రీమద్భగవద్గీత - 367 / Bhagavad-Gita - 367  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 16  🌴

16. వక్తుమర్హస్యశేణ దివ్యా హ్యాత్మవిభూతయ: |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్టసి ||

🌷. తాత్పర్యం :
నీవు ఏ దివ్యవిభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపిచియుందువో వాటన్నింనిటిని దయతో నాకు విశదముగా తెలియజేయుమ.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన తన అవగాహనచే అర్జునుడు సంతుష్టి చెందియే ఉన్నట్లుగా ఈ శ్లోకమున గోచరించుసునది. 

కృష్ణుని కరుణ వలన అతడు స్వానుభావమును, బుద్ధిని, జ్ఞానమును మరియు వాని ద్వారా తెలిసికొనదగిన సర్వవిషయములను ఏరుగజాలి శ్రీకృష్ణుని దేవదేవునిగా అవగతము చేసికొనగలిగెను. 

తనకెటువంటి సందేహము లేకున్నను ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపకక లక్షణమును వివరింపుమని అడుగుచున్నాడు. 

శ్రీకృష్ణభగవానుని ఈ సర్వవ్యాపక లక్షణమునకే సామాన్యజనులు, ముఖ్యముగా నిరాకారవాదులు ఎక్కువ ప్రాముఖ్యము నొసగుటయే అందులకు కారణము. 

కనుకనే వివిధశక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపియై యుండునో అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. ఈ ప్రశ్నను అర్జునుడు సామాన్యజనుల పక్షమున అడిగినట్లుగా ప్రతియొక్కరు గుర్తింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 367 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 16 🌴

16. vaktum arhasy aśeṣeṇa
divyā hy ātma-vibhūtayaḥ
yābhir vibhūtibhir lokān
imāṁs tvaṁ vyāpya tiṣṭhasi

🌷 Translation : 
Please tell me in detail of Your divine opulences by which You pervade all these worlds.

🌹 Purport :
In this verse it appears that Arjuna is already satisfied with his understanding of the Supreme Personality of Godhead, Kṛṣṇa. 

By Kṛṣṇa’s grace, Arjuna has personal experience, intelligence and knowledge and whatever else a person may have, and through all these agencies he has understood Kṛṣṇa to be the Supreme Personality of Godhead. 

For him there is no doubt, yet he is asking Kṛṣṇa to explain His all-pervading nature. People in general and the impersonalists in particular concern themselves mainly with the all-pervading nature of the Supreme. 

So Arjuna is asking Kṛṣṇa how He exists in His all-pervading aspect through His different energies. One should know that this is being asked by Arjuna on behalf of the common people.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 13/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 368: 10వ అధ్.,  శ్లో 17 /  Bhagavad-Gita - 368: Chap. 10, Ver. 17

🌹. శ్రీమద్భగవద్గీత - 368 / Bhagavad-Gita - 368  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 17  🌴

17. కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్ |
కేషు కేషు చ భావేషు చిన్త్యో(సి భగవన్మయా ||

🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! యోగీశ్వరా! నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలిసికొనగలను? ఓ దేవదేవా! ఏ యే రూపములందు నున్ను స్మరింపవలెను?

🌷. భాష్యము :
గడచిన అధ్యాయమునందు తెలుపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణడు తన యోగమాయచే కప్పబడియుండును. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులే అతనిని గాంచగలరు. 

ఇప్పుడు అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడని సంపూర్ణముగా విశ్వసించినను, సామాన్యుడు సైతము ఏవిధముగా ఆ సర్వవ్యాపియైన భగవానుని అవగతము చేసికొనగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని తెలియగోరుచున్నాడు. 

యోగమాయచే కప్పబడినందున శ్రీకృష్ణుని సామాన్యజనులు (దానవులు మరియు నాస్తికులతో సహా) ఎరుగలేరు. కనుక వారి లాభము కొరకే అర్జునుడు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ఉన్నతుడైన భక్తుడు తన స్వీయావగాహన కొరకే గాక సమస్త మానవాళి అవగాహన కొరకై యత్నించును. 

కనుకనే భక్తుడును మరియు ఘనవైష్ణవుడును అగు అర్జునుడు కరుణాపూర్ణుడై తన ప్రశ్నచే భగవానుని సర్వవ్యాపకత్వమును సామాన్యుడు తెలియుటకు అవకాశమొసగుచున్నాడు. శ్రీకృష్ణుడు తనను ఆచ్చాదించియున్న యోగమాయకు ప్రభువైనందునే అర్జునుడు ఇచ్చట అతనిని “యోగిన్” అని ప్రత్యేకముగా సంబోధించినాడు. 

అట్టి యోగమాయ కారణముననే ఆ భగవానుడు సామాన్యునకు గోచరింపకుండుట లేక గోచరించుట జరుగుచుండును. కృష్ణుని యెడ ప్రేమలేని సామాన్యమానవుడు అతనిని గూర్చి సదా చింతనను గావింపలేడు. 

కనుక అతడు భౌతికభావనముననే చింతింపవలసియుండును. అర్జునుడు భౌతికప్రవృత్తి కలిగిన జనుల ఆలోచనాధోరణిని పరిగణనకు తీసికొనుచున్నాడు. ఇచ్చట “కేషు కేషు చ భావేషు” అను పదములు భౌతికప్రవృతిని (భావ మనగా భౌతికవిషయములు) సూచించును. 

భౌతికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికముగా అవగాహన చేసికొనలేనందున భౌతికములైనవానిపై మనస్సును కేంద్రీకరించి, భౌతికప్రాతినిధ్యముల ద్వారా ఏవిధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమగుచున్నాడో గాంచవలసినదిగా ఉపదేశింపబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 368 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 17 🌴

17. kathaṁ vidyām ahaṁ yogiṁs
tvāṁ sadā paricintayan
keṣu keṣu ca bhāveṣu
cintyo ’si bhagavan mayā

🌷 Translation : 
O Kṛṣṇa, O supreme mystic, how shall I constantly think of You, and how shall I know You? In what various forms are You to be remembered, O Supreme Personality of Godhead?

🌹 Purport :
As it is stated in the previous chapter, the Supreme Personality of Godhead is covered by His yoga-māyā. Only surrendered souls and devotees can see Him. 

Now Arjuna is convinced that his friend, Kṛṣṇa, is the Supreme Godhead, but he wants to know the general process by which the all-pervading Lord can be understood by the common man. 

Common men, including the demons and atheists, cannot know Kṛṣṇa, because He is guarded by His yoga-māyā energy. 

Again, these questions are asked by Arjuna for their benefit. The superior devotee is concerned not only for his own understanding but for the understanding of all mankind. 

So Arjuna, out of his mercy, because he is a Vaiṣṇava, a devotee, is opening for the common man the understanding of the all-pervasiveness of the Supreme Lord. 

He addresses Kṛṣṇa specifically as yogin because Śrī Kṛṣṇa is the master of the yoga-māyā energy, by which He is covered and uncovered to the common man. 

The common man who has no love for Kṛṣṇa cannot always think of Kṛṣṇa; therefore he has to think materially. Arjuna is considering the mode of thinking of the materialistic persons of this world. 

The words keṣu keṣu ca bhāveṣu refer to material nature (the word bhāva means “physical things”). 

Because materialists cannot understand Kṛṣṇa spiritually, they are advised to concentrate the mind on physical things and try to see how Kṛṣṇa is manifested by physical representations.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 14/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 369: 10వ అధ్.,  శ్లో 18 /  Bhagavad-Gita - 369: Chap. 10, Ver. 18

🌹. శ్రీమద్భగవద్గీత - 369 / Bhagavad-Gita - 369  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 18  🌴

18. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన |
భూయ: కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ జనార్ధనా! నీ యోగవిభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదించగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివితీరుట లేదు.

🌷. భాష్యము :
శౌనకుని అధ్యక్షతనగల నైమిశారణ్యఋషులు సైతము సూతగోస్వామితో ఈ విధముగనే పలికియుండిరి.

వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే |
యచ్చృణ్వాతామ్ రసజ్ఞానామ్ స్వాదు స్వాదు పదేపదే ||

“ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలను నిరంతరము శ్రవణము చేసినను ఎవ్వరును తనివినొందలేరు. 

శ్రీకృష్ణునితో దివ్యసంబంధమును కలిగినవారు అతని లీలావర్ణనములను అడుగడున అస్వాదింతురు” 
(శ్రీమద్భాగవతము 1.1.19). అనగా అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చియు, ముఖ్యముగా అతడు ఏ విధముగా సర్వవ్యాపియై యున్నాడన్న విషయమును గూర్చియు శ్రవణము చేయుటలో అనురక్తుడై యున్నాడు.

కృష్ణునకు సంబంధించిన ఏ వర్ణనమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతముతో సమానము. అటువంటి అమృతమును ఎవ్వరైనను అనుభవపూర్వకముగా ఆస్వాదింపవచ్చును. 

ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటి గ్రామ్యకథలు శ్రీకృష్ణుని దివ్యలీలకు భిన్నములై యుండును. మనుజుడు వారి యెడ కొంతకాలమునకు విసుగు చెందవచ్చునేమో గాని కృష్ణుని గూర్చి వినుట యందు విసుగు చెందడు. కనుకనే విశ్వచరిత్ర దేవదేవుని వివిధావతారములతో నిండియున్నది. 

భగవానుని అట్టి వివిధ అవతారముల యందలి లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. ఈ కారణముననే ఎన్నిమార్లు పఠించినను వాని యందలి పఠనాంశములు నిత్యనూతనముగా నుండును. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 369 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 18 🌴

18. vistareṇātmano yogaṁ
vibhūtiṁ ca janārdana
bhūyaḥ kathaya tṛptir hi
śṛṇvato nāsti me ’mṛtam

🌷 Translation : 
O Janārdana, again please describe in detail the mystic power of Your opulences. I am never satiated in hearing about You, for the more I hear the more I want to taste the nectar of Your words.

🌹 Purport :
A similar statement was made to Sūta Gosvāmī by the ṛṣis of Naimiṣāraṇya, headed by Śaunaka. That statement is:

vayaṁ tu na vitṛpyāma
uttama-śloka-vikrame
yac chṛṇvatāṁ rasa-jñānāṁ
svādu svādu pade pade

“One can never be satiated even though one continuously hears the transcendental pastimes of Kṛṣṇa, who is glorified by excellent prayers. Those who have entered into a transcendental relationship with Kṛṣṇa relish at every step the descriptions of the pastimes of the Lord.” (Śrīmad-Bhāgavatam 1.1.19) Thus Arjuna is interested in hearing about Kṛṣṇa, and specifically how He remains as the all-pervading Supreme Lord.

Now as far as amṛtam, nectar, is concerned, any narration or statement concerning Kṛṣṇa is just like nectar. And this nectar can be perceived by practical experience. 

Modern stories, fiction and histories are different from the transcendental pastimes of the Lord in that one will tire of hearing mundane stories but one never tires of hearing about Kṛṣṇa. It is for this reason only that the history of the whole universe is replete with references to the pastimes of the incarnations of Godhead. 

The Purāṇas are histories of bygone ages that relate the pastimes of the various incarnations of the Lord. In this way the reading matter remains forever fresh, despite repeated readings.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 16/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 370: 10వ అధ్.,  శ్లో 19 /  Bhagavad-Gita - 370: Chap. 10, Ver. 19

🌹. శ్రీమద్భగవద్గీత - 370 / Bhagavad-Gita - 370  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 19  🌴

19. శ్రీ భగవానువాచ
హస్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయ: |
ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే ||

🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను : సరియే! నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసెదను. కాని ఓ అర్జునా! నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైనవానినే నేను నీకు తెలుపుదును.

🌷. భాష్యము :
శ్రీకృష్ణుని ఘనతను మరియు అతని విభూతుల ఘనతను సంపూర్ణముగా గ్రహించుట సాధ్యముగాని విషయము. జీవుని ఇంద్రియములు పరిమితములుగా నుండి శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా నెరుగుటకు అతనిని అనుమతింపవు. అయినను భక్తులైనవారు శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుటకు సదా యత్నింతురు. 

కాని ఏదేని ఒక ప్రత్యేక సమయమున లేదా ప్రత్యేక జీవనస్థితిలో అతనిని పూర్తిగా అవగతము చేసికొనియే తీరుదుమనెడి భావనలో కాదు. పైగా కృష్ణపరములగు విషయములు అత్యంత మధురములై వారికి అమృతప్రాయములుగా తోచును కనుకనే వారు కృష్ణకథల యందు దివ్యానందమును పొందుదురు. 

శ్రీకృష్ణుని దివ్యవిభూతులను మరియు వివిధశక్తులను చర్చించుట యందు అట్టి శుద్ధభక్తులు ఆధ్యాత్మికానందమును అనుభవింతురు. కనుకనే వాటి శ్రవణమును మరియు చర్చను వారు చేయగోరుదురు. తన విభూతుల పరిధిని జీవులు అవగతము చేసికొనలేరని శ్రీకృష్ణుడు తెలిసియున్నందునే వివిధశక్తులలో ప్రధానమైన వానిని మాత్రమే తెలుపుటకు అతడు ఆంగీకరించినాడు. 

ఇచ్చట “ప్రాధాన్యత:” అను పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణభగవానుని విభూతులు అనంతములైనందున వానిలో ప్రధానములైన కొన్నింటినే మనము తెలిసికొనగలము. వానినన్నింటిని అవగతము చేసికొనుట సాధ్యముగాని విషయము. 

భగవానుడు ఏ విభూతుల ద్వారా సమస్త జగత్తును నియమించునో వాటినే ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన “విభూతి” యను పదము సూచించుచున్నది. విభూతి యనునది అసాధారణ వైభవమును సూచించునని అమరకోశనిఘంటువు నందు తెలుపబడినది.

శ్రీకృష్ణభగవానుని అసాధారణ విభూతులనుగాని, అతని దివ్యశక్తులనుగాని నిరాకారవాది లేక బహుదేవతార్చనాపరుడు ఎరుగలేడు. భౌతిక, ఆధ్యాత్మికజగత్తు లందంతటను అతని దివ్యశక్తులు సర్వరూపములలో విస్తరించియున్నవి. కాని సామాన్యుడు ప్రత్యక్షముగా గాంచగలిగిన దానినే శ్రీకృష్ణుడు ఇచ్చట వివరింపనున్నాడు. అనగా వైవిధ్యముతో కూడిన అతని శక్తిలో కొంతభాగమే ఇచ్చట వర్ణింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 370 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 19  🌴

19. śrī-bhagavān uvāca
hanta te kathayiṣyāmi
divyā hy ātma-vibhūtayaḥ
prādhānyataḥ kuru-śreṣṭha
nāsty anto vistarasya me

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Yes, I will tell you of My splendorous manifestations, but only of those which are prominent, O Arjuna, for My opulence is limitless.

🌹 Purport :
It is not possible to comprehend the greatness of Kṛṣṇa and His opulences. 

The senses of the individual soul are limited and do not permit him to understand the totality of Kṛṣṇa’s affairs. Still the devotees try to understand Kṛṣṇa, but not on the principle that they will be able to understand Kṛṣṇa fully at any specific time or in any state of life. 

Rather, the very topics of Kṛṣṇa are so relishable that they appear to the devotees as nectar. Thus the devotees enjoy them. In discussing Kṛṣṇa’s opulences and His diverse energies, the pure devotees take transcendental pleasure. 

Therefore they want to hear and discuss them. Kṛṣṇa knows that living entities do not understand the extent of His opulences; He therefore agrees to state only the principal manifestations of His different energies. 

The word prādhānyataḥ (“principal”) is very important because we can understand only a few of the principal details of the Supreme Lord, for His features are unlimited. It is not possible to understand them all. 

And vibhūti, as used in this verse, refers to the opulences by which He controls the whole manifestation. In the Amara-kośa dictionary it is stated that vibhūti indicates an exceptional opulence.

The impersonalist or pantheist cannot understand the exceptional opulences of the Supreme Lord nor the manifestations of His divine energies. 

Both in the material world and in the spiritual world His energies are distributed in every variety of manifestation.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 17/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 371: 10వ అధ్.,  శ్లో 20 /  Bhagavad-Gita - 371: Chap. 10, Ver. 20

🌹. శ్రీమద్భగవద్గీత - 371 / Bhagavad-Gita - 371  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 20  🌴

20. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత: |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ ||

🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! నేను సర్వజీవ హృదయములందు వసించియున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదిమధ్యాంతములు నేనే అయి యున్నాను.

🌷. భాష్యము :
ఈ శ్లోకమున అర్జునుడు గూడాకేశునిగా సంబోధింపబడినాడు. అనగా నిద్ర యనెడి అంధకారమును జయించినవాడని భావము. అజ్ఞానాంధకారమున నిద్రించువారికి ఏ విధముగా భగవానుడు భౌతిక, ఆధ్యాత్మికజగత్తులందు వివిధరీతుల ప్రకటితిమగునో అవగతము చేసికొనుట సాధ్యము కాదు. 

కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుని ఆ విధముగా సంబోధించుట ప్రాముఖ్యమును సంతరించుకొన్నది. అర్జునుడు అంధకారమును ఆవలయుండుట వలననే శ్రీకృష్ణభగవానుడు అతనికి వివిధభూతులను వివరించుటకు అంగీకరించెను.

తాను తన ప్రధానవిస్తారము ద్వారా సమస్త విశ్వమునకు ఆత్మనై యున్నానని శ్రీకృష్ణుడు తొలుత అర్జునునకు తెలుపుచున్నాడు. 

సృష్టికి పూర్వము శ్రీకృష్ణభగవానుడు తన ప్రధానాంశము ద్వారా పురుషావతారములను దాల్చగా అతనిని నుండియే సర్వము ఆరంభమయ్యెను. కనుక అతడే ఆత్మయై (విశ్వపు మూలతత్త్వమైన మహతత్త్వమునకు ఆత్మ) యున్నాడు. అనగా భౌతికశక్తి యనునది సృష్టికి కారణము కాదు. 

వాస్తవమునకు మహావిష్ణువు మహాతత్త్వమనెడి సంపూర్ణ భౌతికశక్తి యందు ప్రవేశించును. అతడే దానికి ఆత్మయై యున్నాడు. సృష్టింపబడిన విశ్వములలో ప్రవేశించు మహావిష్ణువు తిరిగి పరమాత్మగా ప్రతిజీవి యందును ప్రకటమగును. 

ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచియుండుననియు, ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధినొందదనియు మనము అనుభవపుర్వకముగా నెరిగియున్నాము. అదే విధముగా పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ప్రవేశించినంతనే భౌతికసృష్టియు వృద్ధినొందదు. 

కనుకనే “సర్వవిశ్వములందు భగవానుడు పరమాత్మ రూపున వసించియున్నాడు” అని సుబలోపనిషత్తు నందు తెలుపబడినది (ప్రకృత్యాదిసర్వభుతాంతర్యామీ సర్వశేషీ చ నారాయణ: ). 

శ్రీకృష్ణభగవానుని మూడు పురుషావతారములు శ్రీమద్భాగవతము నందు వర్ణింపబడినవి. “విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యథో విదు:” అని స్వాతంత్రము నందు కూడా ఆ అవతారములు వర్ణింపబడినవి. 

అనగా శ్రీకృష్ణభగవానుడు కారణోదకశాయి విష్ణువు, గర్భోదకశాయి విష్ణువు మరియు క్షీరోదకశాయి విష్ణువు అనెడి మూడురూపములలో భౌతికసృష్టి యందు ప్రకటమగును. 

“య: కారణార్ణవజలే భజతి స్మ యోగనిద్రాం” అని కారణోదకశాయి విష్ణువు (మహావిష్ణువు) బ్రహ్మసంహిత (5.49) యందు వర్ణింపబడినాడు. 

అనగా దేవదేవుడును, సర్వకారణ కారణుడును అయిన శ్రీకృష్ణుడు విశ్వజలములందు మహావిష్ణువు రూపమున శయనించును. అనగా అతడే విశ్వమునకు ఆదియును, సృష్టులకు పోషకుడును, సమస్త శక్తికి అంతమును అయి యున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 371 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 20  🌴

20. aham ātmā guḍākeśa
sarva-bhūtāśaya-sthitaḥ
aham ādiś ca madhyaṁ ca
bhūtānām anta eva ca

🌷 Translation : 
I am the Supersoul, O Arjuna, seated in the hearts of all living entities. I am the beginning, the middle and the end of all beings.

🌹 Purport :
In this verse Arjuna is addressed as Guḍākeśa, which means “one who has conquered the darkness of sleep.” 

For those who are sleeping in the darkness of ignorance, it is not possible to understand how the Supreme Personality of Godhead manifests Himself in various ways in the material and spiritual worlds. 

Thus this address by Kṛṣṇa to Arjuna is significant. Because Arjuna is above such darkness, the Personality of Godhead agrees to describe His various opulences.

Kṛṣṇa first informs Arjuna that He is the soul of the entire cosmic manifestation by dint of His primary expansion. 

Before the material creation, the Supreme Lord, by His plenary expansion, accepts the puruṣa incarnation, and from Him everything begins. 

Therefore He is ātmā, the soul of the mahat-tattva, the universal elements. The total material energy is not the cause of the creation; actually the Mahā-viṣṇu enters into the mahat-tattva, the total material energy. He is the soul. 

When Mahā-viṣṇu enters into the manifested universes, He again manifests Himself as the Supersoul in each and every entity. We have experience that the personal body of the living entity exists due to the presence of the spiritual spark. 

Without the existence of the spiritual spark, the body cannot develop. Similarly, the material manifestation cannot develop unless the Supreme Soul, Kṛṣṇa, enters. 

As stated in the Subāla Upaniṣad, prakṛty-ādi-sarva-bhūtāntar-yāmī sarva-śeṣī ca nārāyaṇaḥ: “The Supreme Personality of Godhead is existing as the Supersoul in all manifested universes.”

The three puruṣa-avatāras are described in Śrīmad-Bhāgavatam. They are also described in the Nārada Pañcarātra, one of the Sātvata-tantras. 

Viṣṇos tu trīṇi rūpāṇi puruṣākhyāny atho viduḥ: the Supreme Personality of Godhead manifests three features – as Kāraṇodaka-śāyī Viṣṇu, Garbhodaka-śāyī Viṣṇu and Kṣīrodaka-śāyī Viṣṇu – in this material manifestation. 

The Mahā-viṣṇu, or Kāraṇodaka-śāyī Viṣṇu, is described in the Brahma-saṁhitā (5.47). Yaḥ kāraṇārṇava-jale bhajati sma yoga-nidrām: the Supreme Lord, Kṛṣṇa, the cause of all causes, lies down in the cosmic ocean as Mahā-viṣṇu. 

Therefore the Supreme Personality of Godhead is the beginning of this universe, the maintainer of the universal manifestations, and the end of all energy.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 18/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 372: 10వ అధ్.,  శ్లో 21 /  Bhagavad-Gita - 372: Chap. 10, Ver. 21

🌹. శ్రీమద్భగవద్గీత - 372 / Bhagavad-Gita - 372  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 21  🌴

21. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ||

🌷. తాత్పర్యం :
నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై యున్నాను.

🌷. భాష్యము :
ఆదిత్యులు పన్నెండురు కలరు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. అకాశమునందు ప్రకాశించువానిలో సూర్యుడు ముఖ్యమైనవాడు. అతడు దేవదేవుని సముజ్జ్వలనేత్రముగా బ్రహ్మసంహిత యందు అంగీకరింపబడినాడు. ఆకాశమున ఏబదిరకముల వాయువులు వీచుచుండును. వాటికి అధిష్టానదేవతయైన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి. 

రాత్రిసమయమున నక్షత్రములందు ప్రదానుడైన చంద్రుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. చంద్రుడు ఒకానొక నక్షత్రమని ఈ శ్లోకము ద్వారా గోచరించుచున్నది. అనగా ఆకాశమునందు మెరయు నక్షత్రములు కూడా సూర్యునికాంతినే ప్రతిబింబించుచున్నవి. విశ్వమునందు అనేక సూర్యులు కలరనెడి సిద్ధాంతమును వేదవాజ్మయము అంగీకరింపదు. సూర్యుడొక్కడే. సూర్యునికాంతిని ప్రతిబింబించుట ద్వారా చంద్రుడు వెలుగునట్లు, నక్షత్రములు కూడా వెలుతురును ప్రసరించుచున్నవి. చంద్రుడు నక్షత్రములలో ఒకడని భగవద్గీత ఇచ్చట తెలుపుచున్నందున ఆకాశమున మొరయు నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కానేరవు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 372 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 21  🌴

21. ādityānām ahaṁ viṣṇur
jyotiṣāṁ ravir aṁśumān
marīcir marutām asmi
nakṣatrāṇām ahaṁ śaśī

🌷 Translation : 
Of the Ādityas I am Viṣṇu, of lights I am the radiant sun, of the Maruts I am Marīci, and among the stars I am the moon.

🌹 Purport :
There are twelve Ādityas, of which Kṛṣṇa is the principal. Among all the luminaries shining in the sky, the sun is the chief, and in the Brahma-saṁhitā the sun is accepted as the glowing eye of the Supreme Lord. There are fifty varieties of wind blowing in space, and of these winds the controlling deity, Marīci, represents Kṛṣṇa.

Among the stars, the moon is the most prominent at night, and thus the moon represents Kṛṣṇa. 

It appears from this verse that the moon is one of the stars; therefore the stars that twinkle in the sky also reflect the light of the sun. 

The theory that there are many suns within the universe is not accepted by Vedic literature. The sun is one, and as by the reflection of the sun the moon illuminates, so also do the stars. 

Since Bhagavad-gītā indicates herein that the moon is one of the stars, the twinkling stars are not suns but are similar to the moon.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 19/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 373: 10వ అధ్.,  శ్లో 22 /  Bhagavad-Gita - 373: Chap. 10, Ver. 22

🌹. శ్రీమద్భగవద్గీత - 373 / Bhagavad-Gita - 373  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 22  🌴

22. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ: |
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ||

🌷. తాత్పర్యం :
నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతియైన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును(చైతన్యమును) అయి యున్నాను.

🌷. భాష్యము :
భౌతికపదార్థము మరియు ఆత్మ నడుమ భేదమేమనగా భౌతికపదార్థము జీవునివలె చైతన్యమును కలిగియుండదు. అనగా ఈ చైతన్యము దివ్యమును మరియు నిత్యమును అయి యున్నది. అట్టి చైతన్యమెన్నడును భౌతికపదార్థ సమ్మేళనముచే ఉద్భవించదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 373 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 22 🌴

22. vedānāṁ sāma-vedo ’smi
devānām asmi vāsavaḥ
indriyāṇāṁ manaś cāsmi
bhūtānām asmi cetanā

🌷 Translation : 
Of the Vedas I am the Sāma Veda; of the demigods I am Indra, the king of heaven; of the senses I am the mind; and in living beings I am the living force [consciousness].

🌹 Purport :
The difference between matter and spirit is that matter has no consciousness like the living entity; therefore this consciousness is supreme and eternal. Consciousness cannot be produced by a combination of matter.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 20/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 374: 10వ అధ్.,  శ్లో 23 /  Bhagavad-Gita - 374: Chap. 10, Ver. 23

🌹. శ్రీమద్భగవద్గీత - 374 / Bhagavad-Gita - 374  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 23  🌴

23. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరు: శిఖరిణామహమ్ ||

🌷. తాత్పర్యం :
నేను రుద్రులలో శివుడను, యక్ష, రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి యున్నాను.

🌷. భాష్యము :
రుద్రులు పదునొకండుగురు కలరు. వారిలో శివుడు (శంకరుడు) ముఖ్యమైనవాడు. అతడు ఈ విశ్వమునందు భగవానుని తమోగుణావతారము. యక్ష, రాక్షసుల నాయకుడైన కుబేరుడు దేవతల కోశాధిపతి. అతడు దేవదేవుని ప్రతినిధి. సమృద్ధియైన ప్రకృతి సపదలకు మేరుపర్వతము మిక్కిలి ప్రసిద్ధము
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 374 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 23 🌴

23. rudrāṇāṁ śaṅkaraś cāsmi
vitteśo yakṣa-rakṣasām
vasūnāṁ pāvakaś cāsmi
meruḥ śikhariṇām aham

🌷 Translation : 
Of all the Rudras I am Lord Śiva, of the Yakṣas and Rākṣasas I am the Lord of wealth [Kuvera], of the Vasus I am fire [Agni], and of mountains I am Meru.

🌹 Purport 
There are eleven Rudras, of whom Śaṅkara, Lord Śiva, is predominant. He is the incarnation of the Supreme Lord in charge of the mode of ignorance in the universe. The leader of the Yakṣas and Rākṣasas is Kuvera, the master treasurer of the demigods, and he is a representation of the Supreme Lord. Meru is a mountain famed for its rich natural resources.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 21/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 375: 10వ అధ్.,  శ్లో 24 /  Bhagavad-Gita - 375: Chap. 10, Ver. 24

🌹. శ్రీమద్భగవద్గీత - 375 / Bhagavad-Gita - 375  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 24  🌴

24. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కన్ద: సరసామస్మి సాగర: ||

🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునై యున్నాను. 

🌷. భాష్యము :
స్వర్గలోకదేవతలలో ఇంద్రుడు ముఖ్యదేవత. అతడే స్వర్గాధిపతియనియు తెలియబడును. అతడు పాలించు లోకము ఇంద్రలోకము మరియు బృహస్పతి అతని పురోహితుడు. 

ఇంద్రుడు రాజులందరిలో ముఖ్యుడగుట వలన బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడయ్యెను. రాజులందరిలో ఇంద్రుడు ప్రధానుడైనట్లుగా పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కార్తికేయుడు సేనానాయకులలో ప్రధానుడు. 

అదే విధముగ జలనిధులలో సముద్రము ఘనమైనది. ఈ ప్రాతినిధ్యములన్నియును శ్రీకృష్ణుని ఘనతకు సూచనలు మాత్రమే ఒసగును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 375 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 24 🌴

24. purodhasāṁ ca mukhyaṁ māṁ
viddhi pārtha bṛhaspatim
senānīnām ahaṁ skandaḥ
sarasām asmi sāgaraḥ

🌷 Translation : 
Of priests, O Arjuna, know Me to be the chief, Bṛhaspati. Of generals I am Kārttikeya, and of bodies of water I am the ocean.

🌹 Purport 
Indra is the chief demigod of the heavenly planets and is known as the king of the heavens. 

The planet on which he reigns is called Indraloka. Bṛhaspati is Indra’s priest, and since Indra is the chief of all kings, Bṛhaspati is the chief of all priests. 

And as Indra is the chief of all kings, similarly Skanda, or Kārttikeya, the son of Pārvatī and Lord Śiva, is the chief of all military commanders. 

And of all bodies of water, the ocean is the greatest. These representations of Kṛṣṇa only give hints of His greatness.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 22/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 376: 10వ అధ్.,  శ్లో 25 /  Bhagavad-Gita - 376: Chap. 10, Ver. 25

🌹. శ్రీమద్భగవద్గీత - 376 / Bhagavad-Gita - 376  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 25  🌴

25. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం |
యజ్ఞానాం జపయజ్ఞో(స్మి స్థావరాణాం హిమాలయ: ||

🌷. తాత్పర్యం :
నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైనవానిలో హిమాలయమును అయి యున్నాను. 

🌷. భాష్యము :
విశ్వమునందలి తొలిజీవియైన బ్రహ్మదేవుడు వివిధజీవజాతుల సృష్టికై పెక్కురు పుత్రులను సృజించెను. అట్టి పుత్రులలో భృగుమహర్షి శక్తిమంతుడైన ఋషి. 

దివ్య ధ్వనులలో ఓంకారము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. అదేvవిధముగా సమస్తయజ్ఞములలో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను జపయజ్ఞము శ్రీకృష్ణుని విశుద్ధ ప్రాతినిధ్యమే. 

కొన్నిమార్లు పశుహింసను కూడిన యజ్ఞములు ఉపదేశింపబడినను ఈ హరినామ జపయజ్ఞమునందు హింస యనెడి ప్రశ్నయే ఉదయింపదు. కనుకనే ఇది అత్యంత సులభము మరియు పరమపవిత్రమై యున్నది. 

సృష్టియందు ఉదాత్తమైనది శ్రీకృష్ణునికి ప్రాతినిద్యము వహించును గావున ప్రపంచమునందలి ఘనపర్వతములైన హిమాలయములు సైతము శ్రీకృష్ణునికి ప్రాతినిద్యములు. 

శ్లోకములలో మేరుపర్వతమును గూర్చి చెప్పబడినను, అది హిమాలయమువలె స్థావరముగాక, కొన్నిమార్లు చలనశీలమై యుండును. కనుకనే హిమాలయములు మేరువుకన్నను ఘనమైనవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 376 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 25 🌴

25. maharṣīṇāṁ bhṛgur ahaṁ
girām asmy ekam akṣaram
yajñānāṁ japa-yajño ’smi
sthāvarāṇāṁ himālayaḥ

🌷 Translation : 
Of the great sages I am Bhṛgu; of vibrations I am the transcendental oṁ. Of sacrifices I am the chanting of the holy names [japa], and of immovable things I am the Himālayas.

🌹 Purport : 
Brahmā, the first living creature within the universe, created several sons for the propagation of various kinds of species. Among these sons, Bhṛgu is the most powerful sage. 

Of all the transcendental vibrations, oṁ (oṁ-kāra) represents Kṛṣṇa. Of all sacrifices, the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare is the purest representation of Kṛṣṇa. 

Sometimes animal sacrifices are recommended, but in the sacrifice of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, there is no question of violence. It is the simplest and the purest. 

Whatever is sublime in the worlds is a representation of Kṛṣṇa. Therefore the Himālayas, the greatest mountains in the world, also represent Him. 

The mountain named Meru was mentioned in a previous verse, but Meru is sometimes movable, whereas the Himālayas are never movable. Thus the Himālayas are greater than Meru.
🌹 🌹 🌹 🌹 🌹

DAte: 23/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 377: 10వ అధ్.,  శ్లో 26 /  Bhagavad-Gita - 377: Chap. 10, Ver. 26

🌹. శ్రీమద్భగవద్గీత - 377 / Bhagavad-Gita - 377  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 26  🌴

26. అశ్వత్థ: సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద: |
గంధర్వాణాం చిత్రరథ: సిద్దానాం కపిలో ముని: ||

🌷. తాత్పర్యం :
నేను వృక్షములలో రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అయి యున్నాను.

🌷. భాష్యము :
అత్యంత ఉన్నతమును మరియు సుందరమును అగు వృక్షములలో రావిచెట్టు ఒకటి. భారతదేశజనులు తమ ప్రాత:కాల కర్మలలో ఒకటిగా దానిని అర్చింతురు. విశ్వములలో గొప్ప భక్తునిగా పరిగణింపబడెడి నారదుడు దేవతలలో సైతము పూజలనందును. 

కనుకనే భక్తుని రూపున అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. గంధర్వలోకము మనోహరముగా గానము చేయువారితో నిండియుండును. వారి ఉత్తమగాయకుడు చిత్రరథుడు. 

సిద్దులలో దేవహుతి తనయుడైన కపిలుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. శ్రీకృష్ణుని అవతారమైన అతడు తెలిపిన తత్త్వము శ్రీమద్భాగవతమున వివరింపబడినది. 

తదనంతర కాలమున వేరొక కపిలుడు ప్రసిద్ధి పొందినను అతని తత్త్వము నాస్తికమైనట్టిది. కావుననే వారి నడుమ గొప్ప అంతరము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 377 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 26 🌴

26. aśvatthaḥ sarva-vṛkṣāṇāṁ
devarṣīṇāṁ ca nāradaḥ
gandharvāṇāṁ citrarathaḥ
siddhānāṁ kapilo muniḥ

🌷 Translation : 
Of all trees I am the banyan tree, and of the sages among the demigods I am Nārada. Of the Gandharvas I am Citraratha, and among perfected beings I am the sage Kapila.

🌹 Purport : 
The banyan tree (aśvattha) is one of the highest and most beautiful trees, and people in India often worship it as one of their daily morning rituals. Amongst the demigods they also worship Nārada, who is considered the greatest devotee in the universe. 

Thus he is the representation of Kṛṣṇa as a devotee. The Gandharva planet is filled with entities who sing beautifully, and among them the best singer is Citraratha. 

Amongst the perfect living entities, Kapila, the son of Devahūti, is a representative of Kṛṣṇa. He is considered an incarnation of Kṛṣṇa, and His philosophy is mentioned in the Śrīmad-Bhāgavatam. 

Later on another Kapila became famous, but his philosophy was atheistic. Thus there is a gulf of difference between them.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 24/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 378: 10వ అధ్.,  శ్లో 27 /  Bhagavad-Gita - 378: Chap. 10, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 378 / Bhagavad-Gita - 378  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 27  🌴

27. ఉచ్చై:శ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేన్ద్రాణాం నారాణాం చ నరాధిపమ్ ||

🌷. తాత్పర్యం :
అశ్వములలో అమృతము కొరకై సాగరమంథనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును అయి యున్నాను.

🌷. భాష్యము :
ఒకమారు దేవదానవులు సముద్రమంథనము నందు పాల్గొనగా ఆ కార్యము వలన అమృతము మరియు హాలాహలము రెండును ఉద్భవించినవి. అట్లు ఉద్భవించిన హాలాహలమును పరమశివుడు త్రాగెను. అమృతము నుండి ఉద్భవించిన అనేకములలో ఉచ్చైశ్రవనామము గల అశ్వమొకటి. అమృతము నుండి ఉద్భవించిన వేరొక జంతువు ఐరావతమను గజము. అమృతము నుండి ఉద్భవించినందున ఈ రెండు జంతువుల ప్రత్యేకతను సంతరించుకొని, శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి.

నరులలో నరాధిపుడైన రాజు శ్రీకృష్ణునికి ప్రతినిధి. ఏలయన శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు కాగా, రాజులు (దైవగుణములు కలిగియున్నందున రాజులుగా నియమింపబడినవారు) తమ రాజ్యమును పాలించువారై యున్నారు.ధర్మరాజు, పరీక్షిత్తు, శ్రీరాముడు వంటి ధర్మాత్ములైన రాజులు సదా తమ ప్రజల క్షేమమును గూర్చియే తలచియుండిరి. కనుకనే వేదములందు రాజు భగవానుని ప్రతినిధిగా పరిగణింపబడినాడు. కాని నేటి కాలమున ధర్మము నశించిన కారణముగా రాజవంశములు క్షీణించి చివరకు పూర్తిగా నశించిపోయినవి. అయినను పూర్వకాలమున ధర్మాత్ములైన రాజులు సంరక్షణలో జనులు ఆనందముతో జీవించిరని మనము అవగాహన చేసికొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 378 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 27 🌴

27. uccaiḥśravasam aśvānāṁ
viddhi mām amṛtodbhavam
airāvataṁ gajendrāṇāṁ
narāṇāṁ ca narādhipam

🌷 Translation : 
Of horses know Me to be Uccaiḥśravā, produced during the churning of the ocean for nectar. Of lordly elephants I am Airāvata, and among men I am the monarch.

🌹 Purport : 
The devotee demigods and the demons (asuras) once took part in churning the sea. From this churning, nectar and poison were produced, and Lord Śiva drank the poison. From the nectar were produced many entities, of which there was a horse named Uccaiḥśravā. Another animal produced from the nectar was an elephant named Airāvata. Because these two animals were produced from nectar, they have special significance, and they are representatives of Kṛṣṇa.

Amongst the human beings, the king is the representative of Kṛṣṇa because Kṛṣṇa is the maintainer of the universe, and the kings, who are appointed on account of their godly qualifications, are maintainers of their kingdoms. Kings like Mahārāja Yudhiṣṭhira, Mahārāja Parīkṣit and Lord Rāma were all highly righteous kings who always thought of the citizens’ welfare. In Vedic literature, the king is considered to be the representative of God. In this age, however, with the corruption of the principles of religion, monarchy decayed and is now finally abolished. It is to be understood that in the past, however, people were more happy under righteous kings.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 25/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 379: 10వ అధ్.,  శ్లో 28 /  Bhagavad-Gita - 379: Chap. 10, Ver. 28

🌹. శ్రీమద్భగవద్గీత - 379 / Bhagavad-Gita - 379  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 28  🌴

28. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్ప: సర్పాణామస్మి వాసుకి: ||

🌷. తాత్పర్యం :
నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మథుడను మరియు సర్పములలో వాసుకుని అయి యున్నాను.

🌷. భాష్యము :
నిక్కముగా మహాత్తరమగు ఆయుధమైన వజ్రాయుధము శ్రీకృష్ణుని శక్తికి ప్రాతినిధ్యము వహించును. ఆధ్యాత్మికజగమునందలి కృష్ణలోకమున ఎప్పుడు కోరినను, 

ఎంతకోరినను క్షీరము నొసగగల గోవులు అసంఖ్యాకములుగా కలవు. అటువంటి గోవులు ఈ భౌతికజగమున లేవు. 

అవి కృష్ణలోకమున ఉన్నట్లుగా మాత్రము పేర్కొనబడినది. “సురభి” నామము గల ఆ గోవులను శ్రీకృష్ణభగవానుడు పెక్కింటిని కలిగియుండి వానిని గాంచుట యందు నిమగ్నుడై యుండుననియు తెలుపబడినది. 

సత్సాంతానము కొరకై కలిగెడి కామవాంఛ కందర్పుడు కనుక అతడు శ్రీకృష్ణుని ప్రతినిధి. కొన్నిమార్లు మైథునక్రియ కేవలము ఇంద్రియభోగము కొరకే ఒనరింపబడుచుండును. 

అదియెన్నడును కృష్ణునికి ప్రాతినిధ్యము వహింపదు. కేవలము సత్సాంతానప్రాప్తికై ఒరరింపబడెడిదే కందర్పునిగా పిలువబడి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 379 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 28 🌴

28. āyudhānām ahaṁ vajraṁ
dhenūnām asmi kāma-dhuk
prajanaś cāsmi kandarpaḥ
sarpāṇām asmi vāsukiḥ

🌷 Translation : 
Of weapons I am the thunderbolt; among cows I am the surabhi. Of causes for procreation I am Kandarpa, the god of love, and of serpents I am Vāsuki.

🌹 Purport : 
The thunderbolt, indeed a mighty weapon, represents Kṛṣṇa’s power. In Kṛṣṇaloka in the spiritual sky there are cows which can be milked at any time, and they give as much milk as one likes. 

Of course such cows do not exist in this material world, but there is mention of them in Kṛṣṇaloka. The Lord keeps many such cows, which are called surabhi. 

It is stated that the Lord is engaged in herding the surabhi cows. Kandarpa is the sex desire for presenting good sons; therefore Kandarpa is the representative of Kṛṣṇa. 

Sometimes sex is engaged in only for sense gratification; such sex does not represent Kṛṣṇa. But sex for the generation of good children is called Kandarpa and represents Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 26/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 380: 10వ అధ్.,  శ్లో 29 /  Bhagavad-Gita - 380: Chap. 10, Ver. 29

🌹. శ్రీమద్భగవద్గీత - 380 / Bhagavad-Gita - 380  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 29  🌴

29. అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమ: సంయమతామహమ్ ||

🌷. తాత్పర్యం :
నేను పెక్కుపడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో అర్యముడను, ధర్మనిర్వాహకులలో మృత్యుదేవతయైన యముడను అయి యున్నాను. 

🌻. భాష్యము : 
జలవాసులలో వరుణదేవుడు ఘనుడైనట్లుగా పెక్కుపడగలు గల నాగులలో అనంతుడు ఘనుడైనట్టివాడు. వారిరువురును శ్రీకృష్ణుని ప్రతినిధులు. ఆర్యముడు అధిపతిగా గల పితృలోకమొకటి కలదు. అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. దుష్కృతులైనవారిని దండించుటకు గల పెక్కుమందిలో యమధర్మరాజు ముఖ్యుడు. ఈ భూలోకమునకు చేరువలోగల లోకమునందే అతడు నిలిచియుండును. మరణానంతరము పాపులు అచ్చటకు గొనిపోబడగా అతడు వారికి వివిధరకములైన శిక్షలు విధించుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 380 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 29 🌴

29. anantaś cāsmi nāgānāṁ
varuṇo yādasām aham
pitṝṇām aryamā cāsmi
yamaḥ saṁyamatām aham

🌷 Translation : 
Of the many-hooded Nāgas I am Ananta, and among the aquatics I am the demigod Varuṇa. Of departed ancestors I am Aryamā, and among the dispensers of law I am Yama, the lord of death.

🌹 Purport : 
Among the many-hooded Nāga serpents, Ananta is the greatest, as is the demigod Varuṇa among the aquatics. They both represent Kṛṣṇa. There is also a planet of Pitās, ancestors, presided over by Aryamā, who represents Kṛṣṇa. There are many living entities who give punishment to the miscreants, and among them Yama is the chief. Yama is situated in a planet near this earthly planet. After death those who are very sinful are taken there, and Yama arranges different kinds of punishments for them.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 27/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 381: 10వ అధ్.,  శ్లో 30 /  Bhagavad-Gita - 381: Chap. 10, Ver. 30

Image may contain: 3 people
🌹. శ్రీమద్భగవద్గీత - 381 / Bhagavad-Gita - 381  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 30  🌴

30. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల: కలయతామహమ్ |
మృగాణాం చ మృగేన్ర్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ ||

🌷. తాత్పర్యం :
నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, అణుచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షలలో గరుత్మంతుడను అయి యున్నాను.

🌻. భాష్యము : 
అక్కాచెల్లెండ్రయిన దితి మరియు అదితులలో అదితి తనయులు అదిత్యులుగా, దితి తనయులు దైత్యులుగా పిలువబడిరి. వారిలో ఆదిత్యులు భగవానుని భక్తులు కాగా, దైత్యులు నాస్తికులైరి. ప్రహ్లాదుడు అట్టి దైత్యవంశమున జన్మించినప్పటికి చిన్ననాటి నుండియు గొప్పభక్తుడై యుండెను. తన భక్తితత్పరత మరియు దైవీస్వభావము కారణముగా అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా గుర్తింపబడినాడు.

దమనమొనర్చునవి లేక అణుచునవి మొదలగు అంశములు పలు ఉన్నప్పటికిని కాలము మాత్రము భౌతికవిశ్వమునందలి సమస్తమును అణుచునదై యున్నది. కనుక అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మృగములలో సింహము అతి భయంకరము మరియు శక్తివంతమైనది. అదే విధముగా లక్షలాది పక్షిజాతులలో విష్ణువాహనమైన గరుడుడు అత్యంత ఘనుడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 381 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 30 🌴

30. prahlādaś cāsmi daityānāṁ
kālaḥ kalayatām aham
mṛgāṇāṁ ca mṛgendro ’haṁ
vainateyaś ca pakṣiṇām

🌷 Translation : 
Among the Daitya demons I am the devoted Prahlāda, among subduers I am time, among beasts I am the lion, and among birds I am Garuḍa.

🌹 Purport : 
Diti and Aditi are two sisters. The sons of Aditi are called Ādityas, and the sons of Diti are called Daityas. All the Ādityas are devotees of the Lord, and all the Daityas are atheistic. Although Prahlāda was born in the family of the Daityas, he was a great devotee from his childhood. Because of his devotional service and godly nature, he is considered to be a representative of Kṛṣṇa.

There are many subduing principles, but time wears down all things in the material universe and so represents Kṛṣṇa. Of the many animals, the lion is the most powerful and ferocious, and of the million varieties of birds, Garuḍa, the bearer of Lord Viṣṇu, is the greatest.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 382: 10వ అధ్.,  శ్లో 31 /  Bhagavad-Gita - 382: Chap. 10, Ver. 31

Image may contain: 1 person
🌹. శ్రీమద్భగవద్గీత - 382 / Bhagavad-Gita - 382  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 31  🌴

31. పవన: పవతాస్మి రామ: శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ ||

🌷. తాత్పర్యం :
నేను పవిత్రమొనర్చువానిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జలజంతువులలో మకరమును, నదులలో గంగానదిని అయి యున్నాను.

🌻. భాష్యము : 
అతిపెద్దవైన జలజంతువులలో మకరము ఒకటి. అది నిక్కముగా మానవునకు ప్రమాదకరమైనది. అట్టి మకరము శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 382 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 31 🌴

31. pavanaḥ pavatām asmi
rāmaḥ śastra-bhṛtām aham
jhaṣāṇāṁ makaraś cāsmi
srotasām asmi jāhnavī

🌷 Translation : 
Of purifiers I am the wind, of the wielders of weapons I am Rāma, of fishes I am the shark, and of flowing rivers I am the Ganges.

🌹 Purport : 
Of all the aquatics the shark is one of the biggest and is certainly the most dangerous to man. Thus the shark represents Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 383: 10వ అధ్.,  శ్లో 32 /  Bhagavad-Gita - 383: Chap. 10, Ver. 32

🌹. శ్రీమద్భగవద్గీత - 383 / Bhagavad-Gita - 383  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 32  🌴

32. సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున |
ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాద: ప్రవదతామహమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! సమస్తసృష్టికి ఆది, అంతము, మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మికశాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయియున్నాను.

🌻. భాష్యము : 
భౌతికతత్త్వముల సృష్టి యనునది సృష్టులలో ఆదియైనది. పూర్వము వివరింపబడినట్లు విశ్వము మహావిష్ణువుచే (గర్భోదకశాయివిష్ణువు మరియు క్షీరోదకశాయివిష్ణువు) సృష్టినొంది, పోషింపబడి, పిదప శివునిచే లయమొందింపబడును. బ్రహ్మదేవుడు వాస్తవమునకు గౌణసృష్టికర్త. 

విశ్వపు ఈ సృష్టి, స్థితి, లయకారకులందరును కృష్ణుని భౌతికగుణావతారములు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వసృష్టులకు ఆది, మధ్యము, అంతమునై యున్నాడు. 

ఉన్నతవిజ్ఞానము కొరకు నాలుగువేదములు, షడంగములు, వేదాంతసూత్రములు, తర్కశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు ఆది పలుగ్రంథములు గలవు. 

మొత్తము మీద ఉన్నతవిజ్ఞానము కొరకు పదునాలుగు విభాగముల గ్రంథములు కలవు. వీటిలో ఆధ్యాత్మికవిద్యను ఒసగునట్టి గ్రంథము (ముఖ్యముగా వేదాంతసూత్రము) శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. 

తార్కికుల నడుమ వివిధములైన వాదములు జరుగుచుండును. నిదర్శనముతో తన వాడమునే బలపరచువాదము జల్పమనవడును. ప్రతిపక్షమును ఓడించుటయే ప్రధానముగా భావించి చేయబడు వాదము వితండము. 

కాని వాస్తవతత్త్వనిర్ణయమే నిజమైన వాదము. అట్టి కడపటి సత్యము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 383 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 32 🌴

32. sargāṇām ādir antaś ca
madhyaṁ caivāham arjuna
adhyātma-vidyā vidyānāṁ
vādaḥ pravadatām aham

🌷 Translation : 
Of all creations I am the beginning and the end and also the middle, O Arjuna. Of all sciences I am the spiritual science of the self, and among logicians I am the conclusive truth.

🌹 Purport : 
Among the created manifestations, the first is the creation of the total material elements. 

As explained before, the cosmic manifestation is created and conducted by Mahā-viṣṇu, Garbhodaka-śāyī Viṣṇu and Kṣīrodaka-śāyī Viṣṇu, and then again it is annihilated by Lord Śiva. Brahmā is a secondary creator. 

All these agents of creation, maintenance and annihilation are incarnations of the material qualities of the Supreme Lord. 

Therefore He is the beginning, the middle and the end of all creation.

For advanced education there are various kinds of books of knowledge, such as the four Vedas, their six supplements, the Vedānta-sūtra, books of logic, books of religiosity and the Purāṇas. 

So all together there are fourteen divisions of books of education. Of these, the book which presents adhyātma-vidyā, spiritual knowledge – in particular, the Vedānta-sūtra – represents Kṛṣṇa.

Among logicians there are different kinds of argument. 

Supporting one’s argument with evidence that also supports the opposing side is called jalpa. 

Merely trying to defeat one’s opponent is called vitaṇḍā. But the actual conclusion is called vāda. This conclusive truth is a representation of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 30/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 384: 10వ అధ్.,  శ్లో 33 /  Bhagavad-Gita - 384: Chap. 10, Ver. 33

🌹. శ్రీమద్భగవద్గీత - 384 / Bhagavad-Gita - 384  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 33  🌴

33. అక్షరాణా మకారోస్మి ద్వన్ద్వ: సామాసికస్య చ |
అహమేవాక్షయ: కాలో ధాతాహం విశ్వతోముఖ: ||

🌷. తాత్పర్యం :
నేను అక్షరములలో ఆకారమును, సమాసములలో ద్వంద్వసమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి యున్నాను.

🌻. భాష్యము : 
సంస్కృత అక్షరములలో తొలి అక్షరమైన ‘అ’ కారము వేదవాజ్మయమునకు ఆదియై యున్నది. ‘అ’ కారము లేకుండా ఏదియును ధ్వనింపదు గనుక, అది ధ్వనికి ఆదియై యున్నది. సంస్కృతమున అనేక సమాసపదములు గలవు. అందు “రామకృష్ణులు” వంటి ద్వంద్వపదము ద్వంద్వసమాసమనబడును. ఈ సమాసమున రాముడు మరియు కృష్ణుడు అను పదములు రెండును ఒకే రూపమును కలిగియున్నందున అది ద్వంద్వసమాసముగా పిలువబడినది. 

కాలము సమస్తమును నశింపజేయును కావున సంహరించువారిలో అది చరమమైనది. రాబోవు కాలములో సృష్ట్యాంతమున గొప్ప అగ్ని ఉద్భవించి, సర్వమును నశింపజేయును కనుక కాలము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.

సృష్టికార్యము కావించు జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ముఖ్యుడు. కనుక అతడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 384 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 33 🌴

33. akṣarāṇām a-kāro ’smi
dvandvaḥ sāmāsikasya ca
aham evākṣayaḥ kālo
dhātāhaṁ viśvato-mukhaḥ

🌷 Translation : 
Of letters I am the letter A, and among compound words I am the dual compound. I am also inexhaustible time, and of creators I am Brahmā.

🌹 Purport : 
A-kāra, the first letter of the Sanskrit alphabet, is the beginning of the Vedic literature. Without a-kāra, nothing can be sounded; therefore it is the beginning of sound. In Sanskrit there are also many compound words, of which the dual word, like rāma-kṛṣṇa, is called dvandva. In this compound, the words rāma and kṛṣṇa have the same form, and therefore the compound is called dual.

Among all kinds of killers, time is the ultimate because time kills everything. Time is the representative of Kṛṣṇa because in due course of time there will be a great fire and everything will be annihilated.

Among the living entities who are creators, Brahmā, who has four heads, is the chief. Therefore he is a representative of the Supreme Lord, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 31/May/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 385: 10వ అధ్.,  శ్లో 34 /  Bhagavad-Gita - 385: Chap. 10, Ver. 34

The Bhagavad Gita by Anonymous
🌹. శ్రీమద్భగవద్గీత - 385  / Bhagavad-Gita - 385  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 34 🌴

34. మృత్యు: సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తి: శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి: క్షమా ||

🌷. తాత్పర్యం :
సమస్తమును మ్రింగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడుచున్న జీవులకు ఉద్భవమును నేనే అయి యున్నాను. స్త్రీల యందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే.

🌻. భాష్యము : 
జన్మతోడనే మనుజుడు ప్రతిక్షణము మరణించుట ఆరంభించును. అనగా మృత్యువు జీవుని ప్రతిక్షణము కబళించుచున్నను దాని చివరి ఘాతమే మృత్యువుగా పిలువబడును. ఆ మృత్యువే శ్రీకృష్ణుడు. భవిష్యత్ పురోగతికి సంబంధించినంతవరకు జీవులు పుట్టుట, పెరుగుట, కొంతకాలము స్థితిని కలిగియుండుట, ఇతరములను సృష్టించుట, క్షీణించుట, అంత్యమున నశించుట యనెడి ఆరువిధములైన మార్పులను పొందుచుందురు. ఇట్టి మార్పులలో మొదటిదైన గర్భము నుండి జననము శ్రీకృష్ణుడే. ఆ జన్మమే తదుపరి కర్మలకు నాందియై యున్నది.

కీర్తి, శ్రీ:, వాక్కు, స్మృతి, బుద్ధి, ధృఢత్వము, క్షమా అను ఏడు వైభవములు స్త్రీవాచకములుగా భావింపబడును. వానినన్నింటిని గాని లేక కొన్నింటినిగాని మనుజుడు కలిగియున్నచో కీర్తినీయుడగును. ఎవరైనా ధర్మాత్ముడని ప్రసాద్దినొందినచో అతడు కీర్తివంతుడు, వైభవోపేతుడు కాగలడు. ఉదాహరణకు సంస్కృతము పూర్ణమైన భాషయైనందున వైభవోపేతమై యున్నది. ఏదేని విషయమును అధ్యయనమును చేసిన పిమ్మట మనుజడు దానిని జ్ఞప్తి యందుంచుకొనగలిగినచో అతడు చక్కని “స్మృతి”ని కలిగియున్నాడని భావము. పలువిషయములపై పెక్కు గ్రంథములు పఠించుటయే గాక, వాటిని అవగాహన చేసికొని అవసరమైనప్పుడు ఉపయోగించుట “మేధ” యనబడును. అది మరియొక విభూతి. చంచలత్వమును జయించుటయే దృఢత్వము (ధృతి) అని పిలువబడును. పరిపూర్ణయోగ్యత కలిగియుండియు నమ్రతను, మృదుస్వభావమును కలిగి సుఖదుఃఖములందు సమత్వమును కలిగియున్నచో మనుజుని ఆ లక్షణము (వైభవము) ‘క్షమా’ అనబడును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 385 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 34 🌴

34. mṛtyuḥ sarva-haraś cāham
udbhavaś ca bhaviṣyatām
kīrtiḥ śrīr vāk ca nārīṇāṁ
smṛtir medhā dhṛtiḥ kṣamā

🌷 Translation : 
I am all-devouring death, and I am the generating principle of all that is yet to be. Among women I am fame, fortune, fine speech, memory, intelligence, steadfastness and patience.

🌹 Purport : 
As soon as a man is born, he dies at every moment. Thus death is devouring every living entity at every moment, but the last stroke is called death itself. That death is Kṛṣṇa. As for future development, all living entities undergo six basic changes. They are born, they grow, they remain for some time, they reproduce, they dwindle, and finally they vanish. Of these changes, the first is deliverance from the womb, and that is Kṛṣṇa. The first generation is the beginning of all future activities.

The seven opulences listed – fame, fortune, fine speech, memory, intelligence, steadfastness and patience – are considered feminine. If a person possesses all of them or some of them he becomes glorious. If a man is famous as a righteous man, that makes him glorious. Sanskrit is a perfect language and is therefore very glorious. If after studying one can remember a subject matter, he is gifted with a good memory, or smṛti. And the ability not only to read many books on different subject matters but to understand them and apply them when necessary is intelligence (medhā), another opulence. The ability to overcome unsteadiness is called firmness or steadfastness (dhṛti). And when one is fully qualified yet is humble and gentle, and when one is able to keep his balance both in sorrow and in the ecstasy of joy, he has the opulence called patience (kṣamā).
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 386: 10వ అధ్.,  శ్లో 35 /  Bhagavad-Gita - 386: Chap. 10, Ver. 35

Krishna story – Every day | Bhagavatam-katha
🌹. శ్రీమద్భగవద్గీత - 386  / Bhagavad-Gita - 386  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 35 🌴

35. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహం |
మాసానాం మార్గశీర్షో(హమృతూనాం కుసుమాకర: ||

🌷. తాత్పర్యం :
నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును అయి యున్నాను.

🌻. భాష్యము : 
వేదములలో తాను సామవేదమునని శ్రీకృష్ణభగవానుని ఇదివరకే వివరించియున్నాడు. వివిధ దేవతలచే గానము చేయబడు శ్రావ్యగేయభరితమైన ఆ సామవేదమునందు “బృహత్సామము” అనునది ఒకటి. 

అసాధారణ మధురిమను కలిగియుండెడి ఆ బృహత్సామము నడిరేయి యందు గానము చేయబడుచుండును.

సంస్కృతమున కవిత్వమునకు అనేక నియమములుండును. ఆధునిక కవిత్వములలో జరుగురీతి దానియందు ప్రాస మరియు ఛందములు తోచినరీతిని వ్రాయుబడవు. అట్లు నియమబద్ధముగా వ్రాయబడిన కవిత్వములలో గాయత్రీమంత్రము శ్రీమద్భావతమునందు పేర్కొనబడినది. ఈ మంత్రము భగవదనుభూతికై ప్రత్యేకముగా నిర్ణయింపబడియున్నందున దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. 

ఆధ్యాత్మిక పురోగతినొందిన మహాత్ముల కొరకై నిర్దేశింపబడియున్న దీనిని జపించుచు ఆధ్యాత్మికజయము నొందెడివారు భగవానుని దివ్యస్థానమున ప్రవేశింపగలరు. 

కాని ఈ మహామంత్రము జపించుటకు పూర్వము మనుజుడు పూర్ణత్వమునొందిన మనుజుని లక్షణములను (సత్వగుణమును) అలవరచుకొనవలెను. పరబ్రహ్మము యొక్క ధ్వని అవతారముగా భావింపబడు ఈ గాయత్రీమంత్రము వైదికజీవనవిధానమున అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మదేవునిచే ప్రారంభింపబడిన ఈ మంత్రము పరంపర రూపముగా వ్యాప్తినొందినది.

మార్గశీర్షమాసము (నవంబర్ – డిసంబర్) అన్ని మాసముల యందును ఉత్తమమైనదిగా పరిగణింపబడును. ఏలయన ఆ సమయమున జనులు పొలముల నుండి ధ్యానమును సేకరించి ఆనందముతో నుందురు. అలాగుననే ఋతువుల యందు వసంతఋతువు ప్రపంచమంతటికిని అత్యంత ప్రియమైనది. వాతావరణము అతివేడి, అతిశీతలముగా లేకుండ వృక్షములు ఫల, పుష్పభరితమై యండుటయే అందులకు కారణము. 

ఈ వసంతఋతువునందే శ్రీకృష్ణుని పలులీలలను గుర్తుచేసికొను పలు ఉత్సవములు జరుపబడుచుండును. కనుకనే ఋతువులన్నింటిని యందును వసంతఋతువు అత్యంత ఆనందదాయకమైనదిగా పరిగణింపబడును. అది దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 386 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 35 🌴

35. bṛhat-sāma tathā sāmnāṁ
gāyatrī chandasām aham
māsānāṁ mārga-śīrṣo ’ham
ṛtūnāṁ kusumākaraḥ

🌷 Translation : 
Of the hymns in the Sāma Veda I am the Bṛhat-sāma, and of poetry I am the Gāyatrī. Of months I am Mārgaśīrṣa [November-December], and of seasons I am flower-bearing spring.

🌹 Purport : 
It has already been explained by the Lord that amongst all the Vedas, He is the Sāma Veda. The Sāma Veda is rich with beautiful songs played by the various demigods. One of these songs is the Bṛhat-sāma, which has an exquisite melody and is sung at midnight.

In Sanskrit, there are definite rules that regulate poetry; rhyme and meter are not written whimsically, as in much modern poetry. Amongst the regulated poetry, the Gāyatrī mantra, which is chanted by the duly qualified brāhmaṇas, is the most prominent. The Gāyatrī mantra is mentioned in the Śrīmad-Bhāgavatam. Because the Gāyatrī mantra is especially meant for God realization, it represents the Supreme Lord. This mantra is meant for spiritually advanced people, and when one attains success in chanting it, he can enter into the transcendental position of the Lord. One must first acquire the qualities of the perfectly situated person, the qualities of goodness according to the laws of material nature, in order to chant the Gāyatrī mantra. The Gāyatrī mantra is very important in Vedic civilization and is considered to be the sound incarnation of Brahman. Brahmā is its initiator, and it is passed down from him in disciplic succession.

The month of November-December is considered the best of all months because in India grains are collected from the fields at this time and the people become very happy. Of course spring is a season universally liked because it is neither too hot nor too cold and the flowers and trees blossom and flourish. In spring there are also many ceremonies commemorating Kṛṣṇa’s pastimes; therefore this is considered to be the most joyful of all seasons, and it is the representative of the Supreme Lord, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 02/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 387: 10వ అధ్.,  శ్లో 36 /  Bhagavad-Gita - 387: Chap. 10, Ver. 36

Krishna And Arjuna Paintings - Krishna and Arjuna Tanjore Painting ...
🌹. శ్రీమద్భగవద్గీత - 387  / Bhagavad-Gita - 387  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 36 🌴

36. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయోస్మి(స్మి వ్యవసా యో(స్మి సత్త్వం సత్త్వవతామహమ్ ||

🌷 . తాత్పర్యము :
నేను మోసములలో జూదమును, జేజస్వులలో తేజస్సునై యున్నాను. ఆలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే.

🌻. భాష్యము : 
విశ్వమనదంతటను పలువిధములైన మోసకారులు కలరు. 

వారి పలువిధములైన మోసములలో జూదము అగ్రగణ్యమై యున్నందున అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. అనగా పరమపురుషునిగా శ్రీకృష్ణుడు సామాన్యపురుషుని కన్నను గొప్ప వంచన చేయగలడు. 

ఒకవేళ అతడు ఎవ్వరినైనను వంచింప దలచినచో ఎవ్వరును వంచన యందు అతనిని అధిగమింపలేరు. అనగా శ్రీకృష్ణుని ఘనత ఒక రంగమునందే గాక, అన్ని రంగములందు గొప్పదై యున్నది.

జయించు వారిలో జయమును, తేజస్సులలో తేజస్సును అతడే. యత్నశీలురులలో ఘన యత్నశీలుడు, సాహసులలో అతిసాహసుడు మరియు బలము గలవారిలో అతిబలశాలి అతడే. 

శ్రీకృష్ణుడు ధరత్రిపై అవతరించినపుడు ఎవ్వరును అతని శక్తిని అధిగమింపలేకపోయిరి. అతడు చిన్ననాతనే గోవర్ధనపర్వతము నెత్తెను. అట్టి శ్రీకృష్ణుని మోసమునందు గాని, తేజస్సునందు గాని, జయమునందు గాని, యత్నమునందు గాని మరియు బలమునందు గాని ఎవ్వరును అధిగమింపలేరు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 387 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 36 🌴

36. dyūtaṁ chalayatām asmi
tejas tejasvinām aham
jayo ’smi vyavasāyo ’smi
sattvaṁ sattvavatām aham

🌷 Translation : 
I am also the gambling of cheats, and of the splendid I am the splendor. I am victory, I am adventure, and I am the strength of the strong.

🌹 Purport :
There are many kinds of cheaters all over the universe. Of all cheating processes, gambling stands supreme and therefore represents Kṛṣṇa. 

As the Supreme, Kṛṣṇa can be more deceitful than any mere man. If Kṛṣṇa chooses to deceive a person, no one can surpass Him in His deceit. His greatness is not simply one-sided – it is all-sided.

Among the victorious, He is victory. He is the splendor of the splendid. Among the enterprising and industrious, He is the most enterprising, the most industrious. 

Among adventurers He is the most adventurous, and among the strong He is the strongest. When Kṛṣṇa was present on earth, no one could surpass Him in strength. Even in His childhood He lifted Govardhana Hill. 

No one can surpass Him in cheating, no one can surpass Him in splendor, no one can surpass Him in victory, no one can surpass Him in enterprise, and no one can surpass Him in strength.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 388: 10వ అధ్.,  శ్లో 37 /  Bhagavad-Gita - 388: Chap. 10, Ver. 37

🌹. శ్రీమద్భగవద్గీత - 388  / Bhagavad-Gita - 388  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 37 🌴

37. వృష్ణీనాం వాసుదేవో(స్మి పాణ్డవానాం ధనంజయ: |
మునీనామప్యహం వ్యాస: కవీనాముశనా కవి: ||

🌷. తాత్పర్యం : 
నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి యున్నాను.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణుడు ఆద్యదేవదేవుడు కాగా, బలదేవుడు అతని అవ్యవహిత విస్తృతాంశయై యున్నాడు. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు వసుదేవుని తనయులుగా అవతరించి యున్నందున వారిరువురిని వాసుదేవులుగా పిలువవచ్చును. 

వేరొక దృష్టితో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడును బృందావనమును వీడడు కనుక, బృందావనమునకు అన్యమైన స్థలములలో దర్శితమైన కృష్ణుని రూపములు అతని విస్తృతాంశములై యున్నవి. అనగా శ్రీకృష్ణుని విస్తృతాంశయైన వాసుదేవుడు శ్రీకృష్ణుని కన్నను అన్యుడు కాదు. 

భగవద్గీత యందలి ఈ శ్లోకమున గల వాసుదేవ పదము బలరామునే సూచించుచున్నదని అవగతము చేసికొనవలెను. ఏలయన బలరాముడే సర్వవతారములకు మూలమై యున్నందున వాసుదేవ అంశములకు సైతము అతడే మూలమై యున్నాడు. 

ఈ విధమైన శ్రీకృష్ణభగవానుని అవ్యవహిత విస్తారములు “స్వాంశములు” (వ్యక్తిగత రూపములు) అని పిలువబడును. ఇవియేగాక “విభిన్నాంశములు” అని పిలువబడు విస్తృతరూపములును కలవు.

పాండురాజు తనయులలో ధనంజయునిగా పేరొందిన అర్జునుడు నరులలో శ్రేష్టుడు గనుక శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మునులు లేక వేదజ్ఞానపారంగతులైన మనుజులలో వ్యాసుడు శ్రేష్టుడు. 

ఏలయన ఆయన ఈ కలియుగ జనులకు అవగతమగునట్లు భిన్నపద్దతులలో వేదజ్ఞానమును వివరించెను. అంతియేగాక వ్యాసుడు శ్రీకృష్ణుని అవతారమై యున్నాడు. 

కనుక అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. ఎట్టి విషయమును గూర్చియైనను సమగ్రముగా ఆలోచింప సమర్థులైనవారిని కవులందురు. 

అట్టి కవులలో దానవుల గురువైన ఉశనుడు(శుక్రాచార్యుడు) అసాధారణ మేధాసంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజనీతినిపుణుడు కనుక శ్రీకృష్ణుని విభూతికి ప్రతినిధియై యున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 388 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 37 🌴

37. vṛṣṇīnāṁ vāsudevo ’smi
pāṇḍavānāṁ dhanañ-jayaḥ
munīnām apy ahaṁ vyāsaḥ
kavīnām uśanā kaviḥ

🌷 Translation : 
Of the descendants of Vṛṣṇi I am Vāsudeva, and of the Pāṇḍavas I am Arjuna. Of the sages I am Vyāsa, and among great thinkers I am Uśanā.

🌹 Purport :
Kṛṣṇa is the original Supreme Personality of Godhead, and Baladeva is Kṛṣṇa’s immediate expansion. Both Lord Kṛṣṇa and Baladeva appeared as sons of Vasudeva, so both of Them may be called Vāsudeva. 

From another point of view, because Kṛṣṇa never leaves Vṛndāvana, all the forms of Kṛṣṇa that appear elsewhere are His expansions. Vāsudeva is Kṛṣṇa’s immediate expansion, so Vāsudeva is not different from Kṛṣṇa. 

It is to be understood that the Vāsudeva referred to in this verse of Bhagavad-gītā is Baladeva, or Balarāma, because He is the original source of all incarnations and thus He is the sole source of Vāsudeva. 

The immediate expansions of the Lord are called svāṁśa (personal expansions), and there are also expansions called vibhinnāṁśa (separated expansions).

Amongst the sons of Pāṇḍu, Arjuna is famous as Dhanañjaya. He is the best of men and therefore represents Kṛṣṇa. 

Among the munis, or learned men conversant in Vedic knowledge, Vyāsa is the greatest because he explained Vedic knowledge in many different ways for the understanding of the common mass of people in this Age of Kali. 

And Vyāsa is also known as an incarnation of Kṛṣṇa; therefore Vyāsa also represents Kṛṣṇa. Kavis are those who are capable of thinking thoroughly on any subject matter. 

Among the kavis, Uśanā, Śukrācārya, was the spiritual master of the demons; he was an extremely intelligent and far-seeing politician. Thus Śukrācārya is another representative of the opulence of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 389: 10వ అధ్.,  శ్లో 38 /  Bhagavad-Gita - 389: Chap. 10, Ver. 38

Bhagavad Gita Krishna Inspirational Quotes | Hindu Devotional Blog
🌹. శ్రీమద్భగవద్గీత - 389  / Bhagavad-Gita - 389  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 38 🌴

38. దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ | 
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ || 

🌷. తాత్పర్యం : 
నేను చట్టవిరుద్ధతను అణుచువానిలో శిక్షను, జయమును కోరువారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును అయియున్నాను.

🌷. భాష్యము  : 
దుష్కృతులైనవారిని శిక్షించు విధానములు దండనసాధనములలో ముఖ్యమైనవి. కనుక దుష్కృతులు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను గూర్చువాడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. ఏదేని ఒక రంగమునందు జయమును పొంద యత్నించువారిలో మిక్కిలి విజయవంతమైన అంశము నీతి. శ్రవణము, చింతనము, ధ్యానాది గుహ్యమగు కర్మలలో మౌనమైనది. ఏలయన మౌనము ద్వారా మనుజడు త్వరితముగా పురోగతిని సాధింపగలడు. జ్ఞానవంతుడైనవాడు భగవానుని ఉన్నత, గౌణప్రకృతులైన ఆత్మ మరియు భౌతికపదార్థముల నడుమ అంతరమును విశ్లేషించగలిగియుండును. అట్టి జ్ఞానము స్వయముగా శ్రీకృష్ణుడే.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 389 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 38 🌴

38. daṇḍo damayatām asmi
nītir asmi jigīṣatām
maunaṁ caivāsmi guhyānāṁ
jñānaṁ jñānavatām aham

🌷 Translation : 
Among all means of suppressing lawlessness I am punishment, and of those who seek victory I am morality. Of secret things I am silence, and of the wise I am the wisdom.

🌹 Purport :
There are many suppressing agents, of which the most important are those that cut down miscreants. When miscreants are punished, the agency of chastisement represents Kṛṣṇa. Among those who are trying to be victorious in some field of activity, the most victorious element is morality. Among the confidential activities of hearing, thinking and meditating, silence is most important because by silence one can make progress very quickly. The wise man is he who can discriminate between matter and spirit, between God’s superior and inferior natures. Such knowledge is Kṛṣṇa Himself.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 05/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 390: 10వ అధ్.,  శ్లో 39 /  Bhagavad-Gita - 390: Chap. 10, Ver. 39

Lord Krishna with Arjun at Kurkushetra | Hinduism | Graphics99.com
🌹. శ్రీమద్భగవద్గీత - 390  / Bhagavad-Gita - 390  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 39 🌴

39. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున | 
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ || 

🌷. తాత్పర్యం : 
ఇంకను ఓ అర్జునా! సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావరజంగములలో నేను లేకుండ ఏదియును స్థితిని కలిగియుండలేదు. 

🌷. భాష్యము  : 
ప్రతిదానికి ఒక కారణముండును. అట్టి కారణము లేదా బీజము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదు కనుక అతడు సర్వశక్తిమంతుడని పిలువబడినాడు. అతని శక్తి లేకుండా స్థావరము గాని, జంగమము గాని ఏదియును మనుగడను కలిగియుండలేదు. కనుకనే కృష్ణుని శక్తిపై ఆధారపడనిదిగా గోచరించునది మాయగా (లేనటువంటిది) పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 390 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 39 🌴

39. yac cāpi sarva-bhūtānāṁ
bījaṁ tad aham arjuna
na tad asti vinā yat syān
mayā bhūtaṁ carācaram

🌷 Translation : 
Furthermore, O Arjuna, I am the generating seed of all existences. There is no being – moving or nonmoving – that can exist without Me.

🌹 Purport :
Everything has a cause, and that cause or seed of manifestation is Kṛṣṇa. Without Kṛṣṇa’s energy, nothing can exist; therefore He is called omnipotent. Without His potency, neither the movable nor the immovable can exist. Whatever existence is not founded on the energy of Kṛṣṇa is called māyā, “that which is not.”
🌹 🌹 🌹 🌹 🌹

Date: 06/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 391: 10వ అధ్.,  శ్లో 40 /  Bhagavad-Gita - 391: Chap. 10, Ver. 40

🌹. శ్రీమద్భగవద్గీత - 391  / Bhagavad-Gita - 391  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 40 🌴

40. నాన్తోస్తి మయ దివ్యానాం విభూతీనాం పరన్తప | 
ఏష తూద్దేశత: ప్రోక్తా విభూతేర్విస్తరో మయా || 
🌷. తాత్పర్యం : 
ఓ శత్రుంజయుడా! నా దివ్య విభూతులకు అంతమనునది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. 

🌷. భాష్యము  : 
వేదవాజ్మయమున తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విభూతులు మరియు శక్తులు వివిధరీతుల అవగతమైనను వాస్తవమునకు అట్టి విభూతులకు పరిమితిలేదు. కనుకనే సమస్త విభూతులు మరియు శక్తులు ఎన్నడును వివరింపబడలేవు. 

అనగా అర్జునుని జిజ్ఞాసను సంతృప్తిపరచుట కొరకు శ్రీకృష్ణభగవానుడు కేవలము కొన్ని ఉదాహరణములను మాత్రమే వివరించియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 391 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 40 🌴

40. nānto ’sti mama divyānāṁ
vibhūtīnāṁ paran-tapa
eṣa tūddeśataḥ prokto
vibhūter vistaro mayā

🌷 Translation : 
O mighty conqueror of enemies, there is no end to My divine manifestations. What I have spoken to you is but a mere indication of My infinite opulences.

🌹 Purport :
As stated in the Vedic literature, although the opulences and energies of the Supreme are understood in various ways, there is no limit to such opulences; therefore not all the opulences and energies can be explained. Simply a few examples are being described to Arjuna to pacify his inquisitiveness.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 07/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 392: 10వ అధ్.,  శ్లో 41 /  Bhagavad-Gita - 392: Chap. 10, Ver. 41

🌹. శ్రీమద్భగవద్గీత - 392  / Bhagavad-Gita - 392  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 41 🌴

41. యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్చ త్వం మమ తేజోంశసంభవమ్ ||

🌷. తాత్పర్యం : 
సంపన్నములును, సుందరములును, వైభవోపేతములును అగు సమస్తసృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినదిగా తెలిసికొనుము.

🌷. భాష్యము  : 
భౌతిక, ఆధ్యాత్మికజగముల యందలి ఎట్టి వైభవోపేతము లేదా సుందరసృష్టియైనను శ్రీకృష్ణుని విభూతి యొక్క అంశమాత్ర వ్యక్తీకరణమే యని సర్వులు ఎరుగవలెను. కనుక విశేషవైభవముతో కూడినదేడైనను శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 392 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 41 🌴

41. yad yad vibhūtimat sattvaṁ
śrīmad ūrjitam eva vā
tat tad evāvagaccha tvaṁ
mama tejo-’ṁśa-sambhavam

🌷 Translation : 
Know that all opulent, beautiful and glorious creations spring from but a spark of My splendor.

🌹 Purport :
Any glorious or beautiful existence should be understood to be but a fragmental manifestation of Kṛṣṇa’s opulence, whether it be in the spiritual or material world. Anything extraordinarily opulent should be considered to represent Kṛṣṇa’s opulence.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 08/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 393: 10వ అధ్.,  శ్లో 42 /  Bhagavad-Gita - 393: Chap. 10, Ver. 42

Krishna Arjuna Bhagavad Gita Mahabharata Rama, Lord Krishna ...
🌹. శ్రీమద్భగవద్గీత - 393  / Bhagavad-Gita - 393  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం  - 42 🌴

42. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున | 
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాం శేన స్థితో జగత్ || 

🌷. తాత్పర్యం : 
కాని ఓ అర్జునా! ఈ సవిస్తరమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించు చుందును. 

🌷. భాష్యము  : 
పరమాత్మ రూపమున సమస్తము నందును ప్రవేశించుట ద్వారా శ్రీకృష్ణభగవానుడు సర్వవిశ్వములందును నలిచియుండును. సమస్త విషయములు ఏ విధముగా విభూతిసంపన్నములు మరియు వైభవోపేతములుగా నిలిచియున్నవో అవగతము చేసికొనుటలో అర్థము లేదని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలియజేయుచున్నాడు. 

శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున చేరియుండుట చేతనే ప్రతిదియు స్థితిని కలిగియున్నదని అతడు అవగతము చేసికొనవలసియున్నది. అనగా మహత్తర జీవియైన బ్రహ్మదేవుని మొదలుగా అతిసూక్ష్మమైన చీమ వరకు గల సమస్తజీవుల యందును శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపమున వాటి యందు నిలిచి పోషించుట చేతనే అవి స్థితిని కలిగియున్నవి.  

ఏ దేవతార్చనమైనను చివరకు దేవదేవుడైన శ్రీకృష్ణుని చెంతకే లేదా పరమగమ్యమునకే మనుజుని చేర్చునని పలుకు సిద్ధాంతమొకటి కలదు. కాని బ్రహ్మరుద్రాదులు వంటి గొప్ప దేవతలే శ్రీకృష్ణభగవానుని విభుతిలో అంశమాత్రమునకు ప్రాతినిధ్యము వహించుచున్నందున దేవతార్చనము ఇచ్చట పూర్తిగా నిరసింపబడుచున్నది. జన్మగల ప్రతియొక్కరికి అతడే మూలము మరియు అతని కన్నను ఘనుడెవ్వడును లేడు. 

అతని కన్నను ఘనుడు గాని, సమానుడు గాని లేనందునే అతడు “ఆసమౌర్థ్వ” యని పిలువబడినాడు. 

శ్రీమద్భగవద్గీత యందలి “భగవద్విభూతి” అను దశమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 393 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 42 🌴

42. atha vā bahunaitena
kiṁ jñātena tavārjuna
viṣṭabhyāham idaṁ kṛtsnam
ekāṁśena sthito jagat

🌷 Translation : 
But what need is there, Arjuna, for all this detailed knowledge? With a single fragment of Myself I pervade and support this entire universe.

🌹 Purport :
The Supreme Lord is represented throughout the entire material universes by His entering into all things as the Supersoul. The Lord here tells Arjuna that there is no point in understanding how things exist in their separate opulence and grandeur. 

He should know that all things are existing due to Kṛṣṇa’s entering them as Supersoul. From Brahmā, the most gigantic entity, on down to the smallest ant, all are existing because the Lord has entered each and all and is sustaining them.

There is a Mission that regularly propounds that worship of any demigod will lead one to the Supreme Personality of Godhead, or the supreme goal. 

But worship of demigods is thoroughly discouraged herein because even the greatest demigods like Brahmā and Śiva represent only part of the opulence of the Supreme Lord. 

He is the origin of everyone born, and no one is greater than Him. He is asamaurdhva, which means that no one is superior to Him and that no one is equal to Him.

Thus end the Bhaktivedanta Purports to the Tenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Opulence of the Absolute.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 09/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 394: 11వ అధ్.,  శ్లో 01 /  Bhagavad-Gita - 394: Chap. 11, Ver. 01

Krishna Arjun in Kurukshetra War
🌹. శ్రీమద్భగవద్గీత - 394  / Bhagavad-Gita - 394  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 01 🌴

01. అర్జున ఉవాచ
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహో(యం విగతో మమ ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు పలికెను: ఈ పరమరహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడని ఈ అధ్యాయము తెలియజేయును. ఎవని నుండి భౌతికవిశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువునకు శైత్యము అతడే కారణము. అట్టి శ్రీకృష్ణుడు అవతారము కాదు. సర్వావతారములకు కారణుడైన అవతారి. ఈ విషయము గడచిన అధ్యాయమున విశదముగా వివరింపబడినది.

ఇచ్చట అర్జునుడు తన మోహము తొలగిపోయినట్లుగా పలికినాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్యమానవునిగా లేక తన స్నేహితునిగా భావించక, సర్వమునకు కారణమైనవానిగా తెలియగలిగినాడు. 

అతడు పరమ్ ఉత్తేజితుడై తనకు కృష్ణుని వంటి గొప్ప స్నేహితుడు లభించినందులకు పరమానందభరితుడైనాడు. కాని తాను శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా ఆంగీకరింపరేమోనని అతడు యోచింప నారంభించెను. 

కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్వులకు విశదపరచుటకు అతడు తన విశ్వరూపమును చూపుమని ఈ అధ్యాయమున శ్రీకృష్ణుని ప్రార్థించెను. వాస్తవమునకు శ్రీకృష్ణుని విశ్వరూపము గాంచినపుడు ఎవరైనను అర్జునుని వలె భీతి నొందెదరు. కాని కరుణాంతరంగుడైన ఆ భగవానుడు విశ్వరూపమును చూపిన పిమ్మట తన మూలరూపమును పొందియుండెను.

 “నీ హితము కొరకు నేనిది ఉపదేశించుచున్నాను” అని పలుమార్లు శ్రీకృష్ణుడు పలికిన విషయమును సంపూర్ణముగా అంగీకరించిన అర్జునుడు అంతయు శ్రీకృష్ణుని కరుణ చేతనే జరుగుచున్నదని కృతజ్ఞతాపూర్వకముగా ఇచ్చట పలుకుచున్నాడు. 

అనగా శ్రీకృష్ణుడు సర్వకారణకారణుడనియు మరియు సర్వుల హృదయమునందు పరమాత్మరూపమున వసించియున్నాడనియు అర్జునుడు ఇప్పుడు సంపూర్ణ నిశ్చయమునకు వచ్చెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 394 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 01 🌴

01. arjuna uvāca
mad-anugrahāya paramaṁ
guhyam adhyātma-saṁjñitam
yat tvayoktaṁ vacas tena
moho ’yaṁ vigato mama

🌷 Translation : 
Arjuna said: By my hearing the instructions You have kindly given me about these most confidential spiritual subjects, my illusion has now been dispelled.

🌹 Purport :
This chapter reveals Kṛṣṇa as the cause of all causes. He is even the cause of the Mahā-viṣṇu, from whom the material universes emanate. 

Kṛiṣṇa is not an incarnation; He is the source of all incarnations. That has been completely explained in the last chapter.

Now, as far as Arjuna is concerned, he says that his illusion is over. This means that Arjuna no longer thinks of Kṛṣṇa as a mere human being, as a friend of his, but as the source of everything. 

Arjuna is very enlightened and is glad that he has such a great friend as Kṛṣṇa, but now he is thinking that although he may accept Kṛṣṇa as the source of everything, others may not. 

So in order to establish Kṛṣṇa’s divinity for all, he is requesting Kṛṣṇa in this chapter to show His universal form. 

Actually when one sees the universal form of Kṛṣṇa one becomes frightened, like Arjuna, but Kṛṣṇa is so kind that after showing it He converts Himself again into His original form. 

Arjuna agrees to what Kṛṣṇa has several times said: Kṛṣṇa is speaking to him just for his benefit. 

So Arjuna acknowledges that all this is happening to him by Kṛṣṇa’s grace. He is now convinced that Kṛṣṇa is the cause of all causes and is present in everyone’s heart as the Supersoul.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 10/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 395: 11వ అధ్.,  శ్లో 02 /  Bhagavad-Gita - 395: Chap. 11, Ver. 02

ART OF KRISHNA - ☀ SHRI KRISHNA & ARJUNA ☀ Shri Krishna ...
🌹. శ్రీమద్భగవద్గీత - 395  / Bhagavad-Gita - 395  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 02 🌴

02. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్త: కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ కమలపత్రాక్షా! సర్వజీవుల జననమరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసితిని మరియు అవ్యయములైన నీ మహాత్య్మములను కూడ గుర్తించితిని.

🌷. భాష్యము  : 
గడచిన సప్తమాధ్యాయమున శ్రీకృష్ణుడు తానే సమస్త భౌతికజగత్తు యొక్క సృష్టి, నాశములకు కారణమని (అహం కృత్స్నస్య జగత: ప్రభవ: ప్రలయస్తథా:) తనతో నిశ్చయముగా పలికియున్నందున అర్జునుడు ఇచ్చట ఆనందోత్సాహములతో అతనిని “కమలపత్రాక్షా” యని (కృష్ణుని కన్నులు కమలదళములను పోలియుండును) సంభోధించుచున్నాడు. 

ఈ విషయమును గూర్చి అర్జునుడు శ్రీకృష్ణుని నుండి సవిస్తరముగా శ్రవణము చేసెను. ఆ భగవానుడు సమస్త సృష్టి, లయములకు కారణమైనను వాటికి అతీతుడై యుండునని అర్జునుడు ఎరిగియుండెను. 

శ్రీకృష్ణభగవానుడు స్వయముగా నవమాధ్యాయమున తెలిపినట్లు తాను సర్వవ్యాపకుడైనను సర్వత్రా వ్యక్తిగతముగా నిలిచియుండడు. అచింత్యమైన ఆ దివ్యవిభూతినే తాను పూర్తిగా అవగాహన చేసికొనినట్లు అర్జునుడు ఆంగీకరించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 395 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 02 🌴

02. bhavāpyayau hi bhūtānāṁ
śrutau vistaraśo mayā
tvattaḥ kamala-patrākṣa
māhātmyam api cāvyayam

🌷 Translation : 
O lotus-eyed one, I have heard from You in detail about the appearance and disappearance of every living entity and have realized Your inexhaustible glories.

🌹 Purport :
Arjuna addresses Lord Kṛṣṇa as “lotus-eyed” (Kṛṣṇa’s eyes appear just like the petals of a lotus flower) out of his joy, for Kṛṣṇa has assured him, in a previous chapter, 

ahaṁ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayas tathā: 

“I am the source of the appearance and disappearance of this entire material manifestation.” 

Arjuna has heard of this from the Lord in detail. Arjuna further knows that in spite of His being the source of all appearances and disappearances, He is aloof from them. 

As the Lord has said in the Ninth Chapter, He is all-pervading, yet He is not personally present everywhere. 

That is the inconceivable opulence of Kṛṣṇa which Arjuna admits that he has thoroughly understood.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 11/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 396: 11వ అధ్.,  శ్లో 03 /  Bhagavad-Gita - 396: Chap. 11, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 396  / Bhagavad-Gita - 396  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 03 🌴

03. ఏవమేత ద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ||

🌷. తాత్పర్యం : 
ఓ పురుషోత్తమా! ఓ పరమేశ్వారా! నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థరూపమును నేను నా యెదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ నభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును.

🌷. భాష్యము  : 
భౌతికవిశ్వమునందు తాను తన స్వీయప్రాతినిధ్యముచే ప్రవేశించియున్న కారణముగా అది సృష్టినొంది, నడుచుచున్నదని శ్రీకృష్ణభగవానుడు పలికెను. తనకు సంబంధించినంతవరకు అర్జునుడు శ్రీకృష్ణుని వచనములచే జ్ఞానవంతుడయ్యెను. 

కాని శ్రీకృష్ణుడు సామాన్యమానవుడే యని భావించు నవకాశము కలిగిన భావిజనులకు విశ్వాసము కలిగించుట కొరకు అతడు ఆ దేవదేవుని విశ్వరూపమునందు గాంచగోరెను. 

తద్ద్వారా ఏ విధముగా ఆ భగవానుడు విశ్వమునకు పరుడై యున్నను విశ్వకార్యము నొనరించునో అతడు తెలియనెంచెను. అర్జునుడు శ్రీకృష్ణుని “పురుషోత్తమ” అని సంబోధించు యందును ప్రాముఖ్యము కలదు. ఏలయన దేవదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుని అంతరమునందు నిలిచి అతని కోరికను ఎరిగియుండెను. 

స్వీయరూపమునందు గాంచుటనే సంపూర్ణముగా తృప్తిని బడసియున్నందున తనను విశ్వరూపమునందు నమ్మకమును కలిగించుటకే అతడు విశ్వరూపమును గాంచగోరుచున్నాడనియు శ్రీకృష్ణుడు ఎరిగియుండెను. అనగా నిర్ధారణమును గూర్చి అర్జునుడు ఎట్టి స్వీయకోరికను కలిగియుండలేదు. 

భవిష్యత్తులో పలువురు తాము భగవానుని అవతారములని పలుకు అవకాశమున్నందున ఆ విషయమున ఒక ప్రమాణమును లేదా గురుతును ఏర్పరచుటకు అర్జునుడు విశ్వరూపమును గాంచగోరెనని శ్రీకృష్ణుడు అవగతము చేసికొనెను. 

కనుక తాము అవతారములని ప్రకటించుకొనివారి విషయమున జనులు జాగరూకులై యుండవలెను. తాను కృష్ణుడనని పలుకువాడు విశ్వరూపమును చూపి తన పలుకు సత్యమని జనులకు నిరూపణ చేయ సంసిద్ధుడై యుండవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 396 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 03 🌴

03. evam etad yathāttha tvam
ātmānaṁ parameśvara
draṣṭum icchāmi te rūpam
aiśvaraṁ puruṣottama

🌷 Translation : 
O greatest of all personalities, O supreme form, though I see You here before me in Your actual position, as You have described Yourself, I wish to see how You have entered into this cosmic manifestation. I want to see that form of Yours.

🌹 Purport :
The Lord said that because He entered into the material universe by His personal representation, the cosmic manifestation has been made possible and is going on. 

Now as far as Arjuna is concerned, he is inspired by the statements of Kṛṣṇa, but in order to convince others in the future who may think that Kṛṣṇa is an ordinary person, Arjuna desires to see Him actually in His universal form, to see how He is acting from within the universe, although He is apart from it. 

Arjuna’s addressing the Lord as puruṣottama is also significant. Since the Lord is the Supreme Personality of Godhead, He is present within Arjuna himself; therefore He knows the desire of Arjuna, and He can understand that Arjuna has no special desire to see Him in His universal form, for Arjuna is completely satisfied to see Him in His personal form of Kṛṣṇa. 

But the Lord can understand also that Arjuna wants to see the universal form to convince others. Arjuna did not have any personal desire for confirmation. 

Kṛṣṇa also understands that Arjuna wants to see the universal form to set a criterion, for in the future there would be so many imposters who would pose themselves as incarnations of God. 

The people, therefore, should be careful; one who claims to be Kṛṣṇa should be prepared to show his universal form to confirm his claim to the people.
🌹 🌹 🌹 🌹 🌹

DAte: 12/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 397: 11వ అధ్.,  శ్లో 04 /  Bhagavad-Gita - 397: Chap. 11, Ver. 04

🌹. శ్రీమద్భగవద్గీత - 397  / Bhagavad-Gita - 397  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 04 🌴

04. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం : 
హే ప్రభూ! యోగేశ్వరా! నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము.

🌷. భాష్యము  : 
భౌతికేంద్రియముల ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని దర్శించుట, శ్రవణము చేయుట, అవగాహన చేసికొనుట లేదా గ్రహించుట సాధ్యముకాదని తెలపబడినది. 

కాని తొలి నుండియే మనుజుడు ప్రేమయుతసేవలో నిమగ్నుడైనచో అ భగవానుని గాంచగలుగును. వాస్తవమునకు ఆధ్యాత్మిక స్పులింగము మాత్రమేయైన జీవునకు భగవానుని దర్శనముగాని, అవగాహనముగాని సాధ్యముగాని విషయము. 

కనుకనే భక్తుడైన అర్జునుడు తన ఊహాశక్తికి లేదా కల్పనాశక్తిపై ఆధారపడక సామాన్యజీవిగా తన పరిమితిని అంగీకరించి, శ్రీకృష్ణభగవానుని అపరిమేయ స్థితిని కీర్తించుచున్నాడు. పరిమితుడైన జీవునికి అపరిమితుడును మరియు అనంతుడును అయిన భగవంతుని గూర్చి తెలియుట సాధ్యము కాదని అర్జునుడు ఎరుగగలిగెను. 

అపరిమితుడైనవాడు తనను తాను వ్యక్తపరచుకొనినపుడే అతని కరుణచే అతని అపరిమిత స్వభావమును ఎరుగుట సాధ్యపడగలదు. శ్రీకృష్ణభగవానుడు అచింత్యశక్తి సంపన్నుడు కనుకనే “యోగేశ్వరా” యను పదము సైతము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. 

అనగా అతడు అపరిమితుడైనను తాను కోరినచో తనంతట తాను వ్యక్తము కాగలడు. కనుకనే అర్జునుడు ఇచ్చట ఆజ్ఞలను ఒసగక అతని నిర్హేతుక, అచింత్యకరుణకై ప్రార్థించుచున్నాడు. 

భక్తిభావనలో తనను సంపూర్ణ శరణాగతుడై భక్తియుతసేవలో నిలువనిదే ఎవ్వరికినీ తనను వ్యక్తపరచుకొనవలసిన అవసరము శ్రీకృష్ణునకు లేదు. కనుక మానసికకల్పనాబలముపై ఆధారపడివారికి శ్రీకృష్ణభగవానుని దర్శించుట సాధ్యము కాదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 397 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 04 🌴

04. manyase yadi tac chakyaṁ
mayā draṣṭum iti prabho
yogeśvara tato me tvaṁ
darśayātmānam avyayam

🌷 Translation : 
If You think that I am able to behold Your cosmic form, O my Lord, O master of all mystic power, then kindly show me that unlimited universal Self.

🌹 Purport :
It is said that one can neither see, hear, understand nor perceive the Supreme Lord, Kṛṣṇa, by the material senses. 

But if one is engaged in loving transcendental service to the Lord from the beginning, then one can see the Lord by revelation. Every living entity is only a spiritual spark; therefore it is not possible to see or to understand the Supreme Lord. 

Arjuna, as a devotee, does not depend on his speculative strength; rather, he admits his limitations as a living entity and acknowledges Kṛṣṇa’s inestimable position. 

Arjuna could understand that for a living entity it is not possible to understand the unlimited infinite. If the infinite reveals Himself, then it is possible to understand the nature of the infinite by the grace of the infinite. 

The word yogeśvara is also very significant here because the Lord has inconceivable power. If He likes, He can reveal Himself by His grace, although He is unlimited. Therefore Arjuna pleads for the inconceivable grace of Kṛṣṇa. 

He does not give Kṛṣṇa orders. Kṛṣṇa is not obliged to reveal Himself unless one surrenders fully in Kṛṣṇa consciousness and engages in devotional service. 

Thus it is not possible for persons who depend on the strength of their mental speculations to see Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 13/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 398: 11వ అధ్.,  శ్లో 05 /  Bhagavad-Gita - 398: Chap. 11, Ver. 05

🌹. శ్రీమద్భగవద్గీత - 398  / Bhagavad-Gita - 398  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 05 🌴

05. శ్రీ భగవానువాచ
పశ్య మే పార్థ రూపాణి శతశో(థ సహస్రశ: |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ||

🌷. తాత్పర్యం : 
దేవదేవడైన శ్రీకృష్ణుడు పలికెను: ఓ అర్జునా! పృథాకుమారా! లక్షలాదిగాగల నానావిధములును, దివ్యములును, పలువర్ణమయలును అగు రూపములను (నా విభూతులను) ఇప్పుడు గాంచుము.

🌷. భాష్యము  : 
అర్జునుడు శ్రీకృష్ణుని అతని విశ్వరూపమునందు గాంచగోరెను. అది ఆధ్యాత్మికరూపమే అయినప్పటికిని విశ్వసృష్టి కొరకే వ్యక్తమైనందున భౌతికప్రకృతి యొక్క తాత్కాలిక కాలమునకు ప్రభావితమై యుండును. 

భౌతికప్రకృతి వ్యక్తమగుట మరియు అవ్యక్తమగుట జరుగునట్లే, శ్రీకృష్ణుని విశ్వరూపము సైతము వ్యక్తమై, అవ్యక్తమగుచుండును. అనగా ఆధ్యాత్మికాకాశమునందు అది శ్రీకృష్ణుని ఇతర రూపముల వలె నిత్యముగా నెలకొనియుండదు. 

భక్తుడెన్నడును అట్టి విశ్వరూపమును చూడ కుతూహలపడడు. కాని అర్జునుడు శ్రీకృష్ణుని ఆ విధముగా చూడగోరినందున ఆ దేవదేవుడు దానిని చూపుచున్నాడు. 

అట్టి విశ్వరూపమును దర్శించుట సామాన్యమానవునకు సాధ్యముకాని విషయము. దానిని గాంచుటకు శ్రీకృష్ణుడే మనుజునకు శక్తినొసగవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 398 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 05 🌴

05. śrī-bhagavān uvāca
paśya me pārtha rūpāṇi
śataśo ’tha sahasraśaḥ
nānā-vidhāni divyāni
nānā-varṇākṛtīni ca

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: My dear Arjuna, O son of Pṛthā, see now My opulences, hundreds of thousands of varied divine and multicolored forms.

🌹 Purport :
Arjuna wanted to see Kṛṣṇa in His universal form, which, although a transcendental form, is just manifested for the cosmic manifestation and is therefore subject to the temporary time of this material nature. 

As the material nature is manifested and not manifested, similarly this universal form of Kṛṣṇa is manifested and nonmanifested. It is not eternally situated in the spiritual sky like Kṛṣṇa’s other forms. 

As far as a devotee is concerned, he is not eager to see the universal form, but because Arjuna wanted to see Kṛṣṇa in this way, Kṛṣṇa reveals this form. This universal form is not possible to be seen by any ordinary man. Kṛṣṇa must give one the power to see it.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 15/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 399: 11వ అధ్.,  శ్లో 06 /  Bhagavad-Gita - 399: Chap. 11, Ver. 06


🌹. శ్రీమద్భగవద్గీత - 399  / Bhagavad-Gita - 399  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 06 🌴

06. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినౌ మరుతస్తథా |
బహున్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ||

🌷. తాత్పర్యం : 
పశ్య – చూడుము; ఆదిత్యాన్ – అదితి కుమారులైన పండ్రెండుగురు ఆదిత్యులను; వసూన్ – ఎనమండుగురు వస్తువులను; రుద్రాన – పదునొకండు రుద్రులను; అశ్వినౌ – ఇరువురు అశ్వినీకుమారులను; మరుత: - నలుబదితొమ్మిదిమంది మరుత్తులను (వాయుదేవతలను); తథా – అట్లే; బహూని – పెక్కు; అదృష్టపూర్వాణి – నీవు గతమునందు గాంచనటువంటి; పశ్య – చూడుము; ఆశ్చర్యాణి – అన్ని అద్భుతములను; భారత – ఓ భరతవంశశ్రేష్టుడా.

🌷. భాష్యము  : 
అర్జునుడు శ్రీకృష్ణుని సన్నిహిత స్నేహితుడైనను మరియు విజ్ఞులలో అగ్రగణ్యుడైనను ఆ దేవదేవుని గూర్చి ప్రతిదియు నెరుగుట అతనికి సాధ్యము కాదు. ఆ రూపములను, వ్యక్తీకరణలను మానవులు కని, వినియుండలేదని ఇచ్చట తెలుపబడినది. అట్టి అద్భుతరూపములను శ్రీకృష్ణభగవానుడు ఇప్పుడు వ్యక్తపరచుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 399 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 06 🌴

06. paśyādityān vasūn rudrān
aśvinau marutas tathā
bahūny adṛṣṭa-pūrvāṇi
paśyāścaryāṇi bhārata

🌷 Translation : 
O best of the Bhāratas, see here the different manifestations of Ādityas, Vasus, Rudras, Aśvinī-kumāras and all the other demigods. Behold the many wonderful things which no one has ever seen or heard of before.

🌹 Purport :
Even though Arjuna was a personal friend of Kṛṣṇa and the most advanced of learned men, it was still not possible for him to know everything about Kṛṣṇa. Here it is stated that humans have neither heard nor known of all these forms and manifestations. Now Kṛṣṇa reveals these wonderful forms.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 16/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 400: 11వ అధ్.,  శ్లో 07 /  Bhagavad-Gita - 400: Chap. 11, Ver. 07

🌹. శ్రీమద్భగవద్గీత - 400  / Bhagavad-Gita - 400  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 07 🌴

07. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్
మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్ద్రష్టుమిచ్చసి ||

🌷. తాత్పర్యం : 
ఓ అర్జునా! నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్ష్మింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర, జంగమాది సర్వము ఏకస్థానమున దీని యందే సంపూర్ణముగా కలవు.

🌷. భాష్యము  : 
ఒక్కచోటనే నిలిచి ఎవ్వరును సమస్తవిశ్వమును గాంచలేరు. ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడైనను విశ్వము నందలి ఇతర భాగములలో ఏమి జరుగుచున్నదో గాంచలేడు. కాని అర్జునుని వంటి భక్తుడు మాత్రము విశ్వములోగల సర్వమును గాంచగలుగును. అతడు భూత, భవిష్యత్, వర్తమానములందు దేనినైనను గాంచుటకు వలసిన శక్తిని శ్రీకృష్ణుడు ఒసగును. ఆ విధముగా కృష్ణుని కరుణ వలననే అర్జునుడు సమస్తమును వీక్షింప సమర్థుడయ్యెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 400 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 07 🌴

07. ihaika-sthaṁ jagat kṛtsnaṁ
paśyādya sa-carācaram
mama dehe guḍākeśa
yac cānyad draṣṭum icchasi

🌷 Translation : 
O Arjuna, whatever you wish to see, behold at once in this body of Mine! This universal form can show you whatever you now desire to see and whatever you may want to see in the future. Everything – moving and nonmoving – is here completely, in one place.

🌹 Purport :
No one can see the entire universe while sitting in one place. Even the most advanced scientist cannot see what is going on in other parts of the universe. 

But a devotee like Arjuna can see everything that exists in any part of the universe. Kṛṣṇa gives him the power to see anything he wants to see, past, present and future. Thus by the mercy of Kṛṣṇa, Arjuna is able to see everything.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 17/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 401: 11వ అధ్.,  శ్లో 08 /  Bhagavad-Gita - 401: Chap. 11, Ver. 08

🌹. శ్రీమద్భగవద్గీత - 401  / Bhagavad-Gita - 401  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 08 🌴

08. న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |
    దివ్యం దదామి తే చక్షు: పశ్య మే యోగమైశ్వరమ్ ||

🌷. తాత్పర్యం : 
కాని ప్రస్తుత నేత్రములందే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్యనేత్రములను ఒసగుచున్నాను. నా యోగవైభావమును వీక్షింపుము!

🌷. భాష్యము  : 
శుద్ధభక్తుడైనవాడు శ్రీకృష్ణుని అతని ద్విభుజరూపమున కన్నను అన్యమైన ఏ రూపమునందు గాంచగోరడు. విశ్వరూపమును అతడు మనస్సుతోగాక, ఆధ్యాత్మిక చక్షువులతో ఆ దేవదేవుని కరుణ ద్వారా గాంచవలెను. కనుకనే విశ్వరూప దర్శనమునకు మనస్సునుగాక, దృష్టిని మార్చుకొనమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. రాబోవు శ్లోకములందు స్పష్టపరుపబడినట్లు శ్రీకృష్ణుని విశ్వరూపము ప్రాధాన్యమైనది కాదు. అయినను అర్జునుడు కోరియున్నందున దాని దర్శనము కొరకై భగవానుడు అతనికి దివ్యదృష్టి నొసగినాడు.
శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధమున చక్కగా నెలకొనిన భక్తులు అతని ప్రేమలక్షణములతోనే ఆకర్షితులగుదురు కాని విభూతిప్రదర్శచే కాదు. శ్రీకృష్ణునితో ఆటలాడుకొనువారు, మిత్రులు, అతని తల్లితండ్రులు ఎన్నడును అతడు విభూతులను మరియు వైభవములను ప్రదర్శించవలెనని కోరియుండలేదు. శుద్ధప్రేమలో వారెంత మునిగియుండిరనగా అతడు దేవదేవుడనియు వారెరుగకుండిరి. తమ ప్రేమపూర్వక వ్యవహారములందు వారు శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విషయమును సైతము మరచిపోయిరి. శ్రీకృష్ణునితో ఆటలాడిన బాలురు కృతపుణ్యపుంజులనియు(ఘనపుణ్యాత్ములని) మరియు బహుజన్మల పిదపనే వారు ఆ విధముగా కృష్ణునితో క్రీడింపగలిగిరనియు శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఆ బాలురు శ్రీకృష్ణుని దేవదేవునిగా నెరుగక, తమ సన్నిహిత మిత్రునిగా భావించిరి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 401 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 08 🌴

08. na tu māṁ śakyase draṣṭum
anenaiva sva-cakṣuṣā
divyaṁ dadāmi te cakṣuḥ
paśya me yogam aiśvaram

🌷 Translation : 
But you cannot see Me with your present eyes. Therefore I give you divine eyes. Behold My mystic opulence!

🌹 Purport :
A pure devotee does not like to see Kṛṣṇa in any form except His form with two hands; a devotee must see His universal form by His grace, not with the mind but with spiritual eyes. To see the universal form of Kṛṣṇa, Arjuna is told not to change his mind but his vision. 

The universal form of Kṛṣṇa is not very important; that will be clear in subsequent verses. Yet because Arjuna wanted to see it, the Lord gives him the particular vision required to see that universal form.

Devotees who are correctly situated in a transcendental relationship with Kṛṣṇa are attracted by loving features, not by a godless display of opulences. 

The playmates of Kṛṣṇa, the friends of Kṛṣṇa and the parents of Kṛṣṇa never want Kṛṣṇa to show His opulences. They are so immersed in pure love that they do not even know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. 

In their loving exchange they forget that Kṛṣṇa is the Supreme Lord. In the Śrīmad-Bhāgavatam it is stated that the boys who play with Kṛṣṇa are all highly pious souls, and after many, many births they are able to play with Kṛṣṇa. Such boys do not know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. They take Him as a personal friend.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 18/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 402: 11వ అధ్.,  శ్లో 09 /  Bhagavad-Gita - 402: Chap. 11, Ver. 09

🌹. శ్రీమద్భగవద్గీత - 402  / Bhagavad-Gita - 402  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 09 🌴

09. సంజయ ఉవాచ
ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి: |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||

🌷. తాత్పర్యం : 
సంజయుడు పలికెను :ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు ఆ విధముగా పలికిన తదుపరి తన విశ్వరూపమును అర్జునునకు చూపెను.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 402 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 09 🌴

09. sañjaya uvāca
evam uktvā tato rājan
mahā-yogeśvaro hariḥ
darśayām āsa pārthāya
paramaṁ rūpam aiśvaram

🌷 Translation : 
Sañjaya said: O King, having spoken thus, the Supreme Lord of all mystic power, the Personality of Godhead, displayed His universal form to Arjuna.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date: 19/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 403: 11వ అధ్.,  శ్లో 10, 11 /  Bhagavad-Gita - 403: Chap. 11, Ver. 10, 11

🌹. శ్రీమద్భగవద్గీత - 403  / Bhagavad-Gita - 403  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 10, 11 🌴

10. అనేకవక్త్రనయనమనేకాధ్బుతదర్శనమ్ |
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ||

11. దివ్యమాల్యామ్బరధరం దివ్యగంధానులేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్ ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు ఆ విశ్వరూపమున అనతసంఖ్యలో ముఖములను, నేత్రములను,అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై, ఎత్తబడియున్న పలు దివ్యాయుధములను కలిగియుండెను. అతడు దివ్య పూమాలలను మరియు వస్త్రములను దాల్చియుండెను. పలు దివ్యసుగంధములు అతని దేహమునకు అలదబడియుండెను. అంతయు ఆశ్చర్యమయముగను, ప్రకాశమానముగను, అనంతముగను, సర్వవ్యాపకముగను ఉండెను.

🌷. భాష్యము  : 
అర్జునుడు గాంచుచున్న హస్తములు, ముఖములు, పాదములు, ఇతర రూపముల సంఖ్యకు పరిమితి లేదనెడి విషయమును ఈ రెండు శ్లోకములలో పలుమార్లు వాడబడిన “అనేక” యను పదము సూచించుచున్నది. విశ్వమంతటిని వ్యాపించియున్న ఆ రూపములను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని కరుణచే ఒకే స్థలమున నిలిచి గాంచగలిగెను. శ్రీకృష్ణభగవానుని అచింత్యశక్తియే దానికి కారణము. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 403 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 10, 11 🌴

10. aneka-vaktra-nayanam
anekādbhuta-darśanam
aneka-divyābharaṇaṁ
divyānekodyatāyudham

11. divya-mālyāmbara-dharaṁ
divya-gandhānulepanam
sarvāścarya-mayaṁ devam
anantaṁ viśvato-mukham

🌷 Translation : 
Arjuna saw in that universal form unlimited mouths, unlimited eyes, unlimited wonderful visions. The form was decorated with many celestial ornaments and bore many divine upraised weapons. He wore celestial garlands and garments, and many divine scents were smeared over His body. All was wondrous, brilliant, unlimited, all-expanding.

🌹 Purport :
In these two verses the repeated use of the word many indicates that there was no limit to the number of hands, mouths, legs and other manifestations Arjuna was seeing. These manifestations were distributed throughout the universe, but by the grace of the Lord, Arjuna could see them while sitting in one place. That was due to the inconceivable potency of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 22/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 404: 11వ అధ్.,  శ్లో 12 /  Bhagavad-Gita - 404: Chap. 11, Ver. 12

🌹. శ్రీమద్భగవద్గీత - 404  / Bhagavad-Gita - 404  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 12 🌴

12. దివి దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |
యది భా: సదృశీ సా స్యా ద్భాసస్తస్య మహాత్మన: ||

🌷. తాత్పర్యం : 
లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమపురుషుని తేజస్సును పోలగలదు.

🌷. భాష్యము  : 
అర్జునుడు గాంచిన విషయము వర్ణణాతీతమైనది. అయినను సంజయుడు ఆ అద్భుతము యొక్క మనోచిత్రణను ధృతరాష్ట్రునకు తెలుప యత్నించుచున్నాడు. సంజయుడుగాని, ధృతరాష్ట్రుడుగాని యుద్ధరంగమున లేకున్నను వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు జరిగినదంతయు యథాతథముగా గాంచగలిగెను. కనుకనే అతడు అచ్చటి పరిస్థితిని సాధ్యమైనంతవరకు అవగతమగునట్లు వేలాదిసూర్యులు ఉదయించుట వంటి ఊహాత్మక భావములతో పోల్చుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 404 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 12 🌴

12. divi sūrya-sahasrasya
bhaved yugapad utthitā
yadi bhāḥ sadṛśī sā syād
bhāsas tasya mahātmanaḥ

🌷 Translation : 
If hundreds of thousands of suns were to rise at once into the sky, their radiance might resemble the effulgence of the Supreme Person in that universal form.

🌹 Purport :
What Arjuna saw was indescribable, yet Sañjaya is trying to give a mental picture of that great revelation to Dhṛtarāṣṭra. Neither Sañjaya nor Dhṛtarāṣṭra was present, but Sañjaya, by the grace of Vyāsa, could see whatever happened. Thus he now compares the situation, as far as it can be understood, to an imaginable phenomenon (i.e., thousands of suns).
🌹 🌹 🌹 🌹 🌹

Date: 21/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 405: 11వ అధ్.,  శ్లో 13 /  Bhagavad-Gita - 405: Chap. 11, Ver. 13

How many eyewitnesses were there to see the great Vishwaroop of ...
🌹. శ్రీమద్భగవద్గీత - 405  / Bhagavad-Gita - 405  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 13 🌴

13. తత్త్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవస్య శరీరే పాండవస్తదా ||

🌷. తాత్పర్యం : 
ఆ సమయమున అర్జునుడు బహువేలసంఖ్యలో విభజింపబడియున్నను ఒకేచోట నిలిచియున్న విశ్వము యొక్క అనంతరూపములను శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమున గాంచెను.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 405 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 13 🌴

13. tatraika-sthaṁ jagat kṛtsnaṁ
pravibhaktam anekadhā
apaśyad deva-devasya
śarīre pāṇḍavas tadā

🌷 Translation : 
At that time Arjuna could see in the universal form of the Lord the unlimited expansions of the universe situated in one place although divided into many, many thousands.

🌹 Purport :
The word tatra (“there”) is very significant. It indicates that both Arjuna and Kṛṣṇa were sitting on the chariot when Arjuna saw the universal form. Others on the battlefield could not see this form, because Kṛṣṇa gave the vision only to Arjuna. Arjuna could see in the body of Kṛṣṇa many thousands of planets. As we learn from Vedic scriptures, there are many universes and many planets. 

Some of them are made of earth, some are made of gold, some are made of jewels, some are very great, some are not so great, etc. Sitting on his chariot, Arjuna could see all these. But no one could understand what was going on between Arjuna and Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 22/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 406: 11వ అధ్.,  శ్లో 14 /  Bhagavad-Gita - 406: Chap. 11, Ver. 14

🌹. శ్రీమద్భగవద్గీత - 406  / Bhagavad-Gita - 406  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 14 🌴

14. తత: స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ: |
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ||

🌷. తాత్పర్యం : 
అంతట సంభ్రమమునకు గురుయైనవాడును, ఆశ్చర్యచకితుడైనవాడును, రోమాంచితుడైనవాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు అంజలిబద్ధుడై దేవదేవుని ప్రార్థింపదొడగెను.

🌷. భాష్యము  : 
దివ్యదర్శనమైనంతట శ్రీకృష్ణార్జునుల నడుమగల సంబంధము శీఘ్రమే మారిపోయెను. పూర్వము వారు స్నేహముపై ఆధారపడిన సంబంధము కలిగియుండిరి.

 కాని విశ్వరూపదర్శనమైనంతనే అర్జునుడు అత్యంత గౌరవముతో వందనమొసగుచు, దోసలి యెగ్గి శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాడు. అనగా ఇప్పుడు అర్జునుని సంబంధము స్నేహరసపూర్ణము కాక అద్భుతరసముగా మార్పునొందెను. పరమభక్తులు శ్రీకృష్ణుని సమస్త సంబంధములకు (రసములకు) నిధిగా నెరిగియుందురు. శాస్త్రములందు పండ్రెండు రకములైన మూల రసములు పేర్కొనబడినవి. 

అవియన్నియు శ్రీకృష్ణుని యందే కలవు. ఇరువురు జీవుల నడుమ, దేవతల నడుమ లేదా భగవానుడు మరియు భక్తుల నడుమ పరస్పరము వినిమయము జరుగు సర్వసంబంధములకు అతడే నిధి వంటివాడని చెప్పబడినది.
ఇచ్చట అర్జునుడు అద్భుతరస సంబంధముచే ఉత్తేజితుడయ్యెను. 

స్వభావికముగా సమచిట్టుడును, శాంతుడును అయినప్పటికిని ఆ అద్భుతరసభావమునందు అతడు పరవశుడై, రోమాంచితము కాగా దోసలియొగ్గి పరమపురుషునికి వందనముల నొసగ నారంభించెను. 

అతడు దేవదేవుని అద్భుతములచే ప్రభావితుడయ్యెనే గాని భయమునకు గురి కాలేదు. అనగా అచట వ్యక్తమైన భావము అద్భుతరసము. దానిచే అతని సహజ సఖ్యసంబంధము ప్రభావితము కాగా అతడు ఆ విధముగా ప్రవర్తించెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 406 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 14 🌴

14. tataḥ sa vismayāviṣṭo
hṛṣṭa-romā dhanañ-jayaḥ
praṇamya śirasā devaṁ
kṛtāñjalir abhāṣata

🌷 Translation : 
Then, bewildered and astonished, his hair standing on end, Arjuna bowed his head to offer obeisances and with folded hands began to pray to the Supreme Lord.

🌹 Purport :
.Once the divine vision is revealed, the relationship between Kṛṣṇa and Arjuna changes immediately. 

Before, Kṛṣṇa and Arjuna had a relationship based on friendship, but here, after the revelation, Arjuna is offering obeisances with great respect, and with folded hands he is praying to Kṛṣṇa. He is praising the universal form. 

Thus Arjuna’s relationship becomes one of wonder rather than friendship. Great devotees see Kṛṣṇa as the reservoir of all relationships. 

In the scriptures there are twelve basic kinds of relationships mentioned, and all of them are present in Kṛṣṇa. It is said that He is the ocean of all the relationships exchanged between two living entities, between the gods, or between the Supreme Lord and His devotees.

Here Arjuna was inspired by the relationship of wonder, and in that wonder, although he was by nature very sober, calm and quiet, he became ecstatic, his hair stood up, and he began to offer his obeisances unto the Supreme Lord with folded hands. 

He was not, of course, afraid. He was affected by the wonders of the Supreme Lord. The immediate context is wonder; his natural loving friendship was overwhelmed by wonder, and thus he reacted in this way.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 23/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 407: 11వ అధ్.,  శ్లో 15 /  Bhagavad-Gita - 407: Chap. 11, Ver. 15

🌹. శ్రీమద్భగవద్గీత - 407  / Bhagavad-Gita - 407  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 15 🌴

15. అర్జున ఉవాచ
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్ |
బ్రహ్మీణమీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురాగాంశ్చ దివ్యాన్ ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు పలికెను : హే కృష్ణా! సమస్తదేవతలు, ఇతర సమస్తజీవులు నీ దేహమునందు సమావిష్టులై యుండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్యసర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను.

🌷. భాష్యము  : 
అర్జునుడు విశ్వములోనున్న సమస్తమును విశ్వరూపమున గాంచెను. 

అనగా విశ్వము నందలి తొలిజీవియైన బ్రహ్మను, విశ్వపు అధోభాగములందు గర్భోదకశాయి విష్ణువు శయనించు దేవతాసర్పమును అతడు గాంచగలిగెను. ఆ సర్పతల్పము వాసుకి యని పిలువబడును. ఈ వాసుకి నామము కలిగిన సర్పములు ఇంకను కొన్ని గలవు. 

అనగా ఇచ్చట అర్జునుడు గర్భోదకశాయివిష్ణువు మొదలుగా విశ్వము నందలి తొలిజీవియైన బ్రహ్మదేవుడు వసించు పద్మలోకము యొక్క అత్యంత ఉన్నతభాగము వరకు గాంచెను. 

దీని భావమేమనగా కేవలము రథముపై ఒకేచోట ఆసీనుడైయున్న అతడు ఆద్యంతములలో సమస్తమును గాంచగలిగెను. దేవదేవుడైన శ్రీకృష్ణుని కరుణ చేతనే అది సాధ్యమయ్యెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 407 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 15 🌴

15. arjuna uvāca
paśyāmi devāṁs tava deva dehe
sarvāṁs tathā bhūta-viśeṣa-saṅghān
brahmāṇam īśaṁ kamalāsana-stham
ṛṣīṁś ca sarvān uragāṁś ca divyān

🌷 Translation : 
Arjuna said: My dear Lord Kṛṣṇa, I see assembled in Your body all the demigods and various other living entities. I see Brahmā sitting on the lotus flower, as well as Lord Śiva and all the sages and divine serpents.

🌹 Purport :
Arjuna sees everything in the universe; therefore he sees Brahmā, who is the first creature in the universe, and the celestial serpent upon which the Garbhodaka-śāyī Viṣṇu lies in the lower regions of the universe. This snake bed is called Vāsuki. 

There are also other snakes known as Vāsuki. Arjuna can see from the Garbhodaka-śāyī Viṣṇu up to the topmost part of the universe on the lotus-flower planet where Brahmā, the first creature of the universe, resides. 

That means that from the beginning to the end, everything could be seen by Arjuna, who was sitting in one place on his chariot. This was possible by the grace of the Supreme Lord, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BhagavadGita

Date: 24/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 408: 11వ అధ్.,  శ్లో 16 /  Bhagavad-Gita - 408: Chap. 11, Ver. 16

Image result for Arjuna Bhagavad Gita
🌹. శ్రీమద్భగవద్గీత - 408  / Bhagavad-Gita - 408  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 16 🌴

16. అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతో(నన్తరూపం |
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ||

🌷. తాత్పర్యం : 
హే విశ్వప్రభూ! విశ్వరూపా! నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆదిమధ్యాంతములను నేను గాంచలేకున్నాను.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడగు భగవానుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును గాంచవచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 408 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 16 🌴

16. aneka-bāhūdara-vaktra-netraṁ
paśyāmi tvāṁ sarvato ’nanta-rūpam
nāntaṁ na madhyaṁ na punas tavādiṁ
paśyāmi viśveśvara viśva-rūpa

🌷 Translation : 
O Lord of the universe, O universal form, I see in Your body many, many arms, bellies, mouths and eyes, expanded everywhere, without limit. I see in You no end, no middle and no beginning.

🌹 Purport :
Kṛṣṇa is the Supreme Personality of Godhead and is unlimited; thus through Him everything could be seen.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita

Date: 25/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 409 : 11వ అధ్.,  శ్లో 17 /  Bhagavad-Gita - 409: Chap. 11, Ver. 17

Image result for Arjuna Bhagavad Gita
🌹. శ్రీమద్భగవద్గీత - 409  / Bhagavad-Gita - 409  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 17 🌴

17. కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వత్రో దీప్తిమన్తమ్ |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ ||

🌷. తాత్పర్యం : 
జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కుల యందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీతములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్జ్వల రూపమును సర్వత్ర నేను గాంచుచున్నాను.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 409 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 17 🌴

17. kirīṭinaṁ gadinaṁ cakriṇaṁ ca
tejo-rāśiṁ sarvato dīptimantam
paśyāmi tvāṁ durnirīkṣyaṁ samantād
dīptānalārka-dyutim aprameyam

🌷 Translation : 
Your form is difficult to see because of its glaring effulgence, spreading on all sides, like blazing fire or the immeasurable radiance of the sun. Yet I see this glowing form everywhere, adorned with various crowns, clubs and discs.

🌹 Purport :
.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 26/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 410 : 11వ అధ్.,  శ్లో 18 /  Bhagavad-Gita - 410: Chap. 11, Ver. 18

Image result for Arjuna Bhagavad Gita
🌹. శ్రీమద్భగవద్గీత - 410  / Bhagavad-Gita - 410  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 18 🌴

18. త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
త్వమవ్యయ: శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే ||

🌷. తాత్పర్యం : 
దివ్యమైన ఆదిధ్యేయము నీవే. విశ్వమంతటికిని పరమాధారము నీవే. అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే. నీవే శాశ్వతధర్మమును రక్షించు దేవదేవుడవు. ఇదియే నా అభిప్రాయము.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 410 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 18 🌴

18. tvam akṣaraṁ paramaṁ veditavyaṁ
tvam asya viśvasya paraṁ nidhānam
tvam avyayaḥ śāśvata-dharma-goptā
sanātanas tvaṁ puruṣo mato me

🌷 Translation : 
You are the supreme primal objective. You are the ultimate resting place of all this universe. You are inexhaustible, and You are the oldest. You are the maintainer of the eternal religion, the Personality of Godhead. This is my opinion.

🌹 Purport :
.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 27/06/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 411 : 11వ అధ్.,  శ్లో 19 /  Bhagavad-Gita - 411: Chap. 11, Ver. 19

🌹. శ్రీమద్భగవద్గీత - 411  / Bhagavad-Gita - 411 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 19 🌴

19. అనాదిమధ్యాన్తమనన్తవీర్యమ్
అనన్తబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రమ్
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ||

🌷. తాత్పర్యం : 
నీవు ఆదిమధ్యాంత రహితుడవై యున్నావు. నీ వైభవము అపరిమితమై యున్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగియున్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణభగవానుని షడ్గుణైశ్వర్యములకు పరిమితి లేదు. ఈ సందర్భమున మరియు పెక్కు ఇతరచోట్ల పునరుక్తి జరిగియున్నది. కాని శాస్త్రరీత్యా శ్రీకృష్ణుని వైభములను పునరుక్తి సారస్వతలోపము కాదు. సంభ్రమము, ఆశ్చర్యము లేదా పారవశ్యము కలిగినపుడు పదముల పునరుక్తి కలుగుచుండుననియు, అది దోషమేమియును కాదనియు తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 411 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 19 🌴

19. anādi-madhyāntam ananta-vīryam
ananta-bāhuṁ śaśi-sūrya-netram
paśyāmi tvāṁ dīpta-hutāśa-vaktraṁ
sva-tejasā viśvam idaṁ tapantam

🌷 Translation : 
You are without origin, middle or end. Your glory is unlimited. You have numberless arms, and the sun and moon are Your eyes. I see You with blazing fire coming forth from Your mouth, burning this entire universe by Your own radiance.

🌹 Purport :
.There is no limit to the extent of the six opulences of the Supreme Personality of Godhead. Here and in many other places there is repetition, but according to the scriptures, repetition of the glories of Kṛṣṇa is not a literary weakness. It is said that at a time of bewilderment or wonder or of great ecstasy, statements are repeated over and over. That is not a flaw.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 412 : 11వ అధ్.,  శ్లో 20 /  Bhagavad-Gita - 412: Chap. 11, Ver. 20

Image result for Arjuna Bhagavad Gita
🌹. శ్రీమద్భగవద్గీత - 412   / Bhagavad-Gita - 412  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 20 🌴

20. ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా: |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదమ్
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||

🌷. తాత్పర్యం : 
నీవు ఒక్కడవేయైనను సమస్త ఆకాశమును, స్వర్గలోకములను మరియు వాని నడుమగల ప్రదేశమునంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావా! అద్భుతమును, భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నియును కలతనొందుచున్నది.

🌷. భాష్యము  : 
“ద్యావాపృథివ్యో” (స్వర్గమునకు, భూమికి నడుమగల ప్రదేశము) మరియు “లోకత్రయం” (ముల్లోకములు) అను పదములు ఈ శ్లోకమున ప్రాముఖ్యమును కలిగియున్నవి. అర్జునుడే గాక ఇతర లోకములందలి వారు కూడా శ్రీకృష్ణభగవానుని ఈ విశ్వరూపమును గాంచినట్లు గోచరించుటయే అందులకు కారణము. అర్జునుని విశ్వరూపదర్శనము స్వప్నము కాదు. దివ్యదృష్టి ఒసగబడిన వారందరును రణరంగమున విశ్వరూపమును గాంచగలిగినారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 412 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 20 🌴

20. dyāv ā-pṛthivyor idam antaraṁ hi
vyāptaṁ tvayaikena diśaś ca sarvāḥ
dṛṣṭvādbhutaṁ rūpam ugraṁ tavedaṁ
loka-trayaṁ pravyathitaṁ mahātman

🌷 Translation : 
Although You are one, You spread throughout the sky and the planets and all space between. O great one, seeing this wondrous and terrible form, all the planetary systems are perturbed.

🌹 Purport :
Dyāv ā-pṛthivyoḥ (“the space between heaven and earth”) and loka-trayam (“the three worlds”) are significant words in this verse because it appears that not only did Arjuna see this universal form of the Lord, but others in other planetary systems saw it also. Arjuna’s seeing of the universal form was not a dream. All whom the Lord endowed with divine vision saw that universal form on the battlefield.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 413 : 11వ అధ్.,  శ్లో 21 /  Bhagavad-Gita - 413: Chap. 11, Ver. 21

🌹. శ్రీమద్భగవద్గీత - 413   / Bhagavad-Gita - 413  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 21 🌴

21. అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి\
కేచిద్భీతా: ప్రాంజలయో గృణన్తి |
    స్వస్తీత్యుక్తా మహర్షిసిద్ధసఙ్ఘా:
స్తువన్తి త్వాం స్తుతిభి: పుష్కలాభి: ||

🌷. తాత్పర్యం : 
దేవతా సమూహములన్నియును నిన్ను శరణువేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు ముగుల భయవిహ్వలులై దోసలియొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు, సిద్ధసమూహములు “శాంతి, శాంతి” యని పలుకుచు వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.

🌷. భాష్యము  : 
సర్వలోకముల యందలి దేవతలు అద్భుతమైన విశ్వరుపముచే మరియ దాని దేదీప్యమాన తేజముచే భయమునొంది తమ రక్షణ నిమిత్తమై ప్రార్థనలను కావించిరి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 413 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 21 🌴

21. amī hi tvāṁ sura-saṅghā viśanti
kecid bhītāḥ prāñjalayo gṛṇanti
svastīty uktvā maharṣi-siddha-saṅghāḥ
stuvanti tvāṁ stutibhiḥ puṣkalābhiḥ

🌷 Translation : 
All the hosts of demigods are surrendering before You and entering into You. Some of them, very much afraid, are offering prayers with folded hands. Hosts of great sages and perfected beings, crying “All peace!” are praying to You by singing the Vedic hymns.

🌹 Purport :
The demigods in all the planetary systems feared the terrific manifestation of the universal form and its glaring effulgence and so prayed for protection.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 30/Jun/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 414 : 11వ అధ్.,  శ్లో 22 /  Bhagavad-Gita - 414: Chap. 11, Ver. 22

Related image
🌹. శ్రీమద్భగవద్గీత - 414   / Bhagavad-Gita - 414  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 22 🌴

22. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |
గన్ధర్వయక్షాసురసిద్ధఙ్ఘా
వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||

🌷. తాత్పర్యం : 
పరమశివుని పలుమారులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీకుమారులు, మరత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 414 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 22 🌴

22. rudrādityā vasavo ye ca sādhyā
viśve ’śvinau marutaś coṣmapāś ca
gandharva-yakṣāsura-siddha-saṅghā
vīkṣante tvāṁ vismitāś caiva sarve

🌷 Translation : 
All the various manifestations of Lord Śiva, the Ādityas, the Vasus, the Sādhyas, the Viśvedevas, the two Aśvīs, the Maruts, the forefathers, the Gandharvas, the Yakṣas, the Asuras and the perfected demigods are beholding You in wonder.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 415 : 11వ అధ్.,  శ్లో 23 /  Bhagavad-Gita - 415: Chap. 11, Ver. 23

🌹. శ్రీమద్భగవద్గీత - 415   / Bhagavad-Gita - 415  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 23 🌴

23. రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహురుపాదమ్ |
బహూదరం బహు దంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకా: ప్రవ్యథితాస్తథాహమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ మహాబాహో! బహుముఖములును, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నియు వ్యథ చెందుచున్నవి. వానివలెనే నేనును కలతచెందుచున్నాను.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 415 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 23 🌴

23. rūpaṁ mahat te bahu-vaktra-netraṁ
mahā-bāho bahu-bāhūru-pādam
bahūdaraṁ bahu-daṁṣṭrā-karālaṁ
dṛṣṭvā lokāḥ pravyathitās tathāham

🌷 Translation : 
O mighty-armed one, all the planets with their demigods are disturbed at seeing Your great form, with its many faces, eyes, arms, thighs, legs and bellies and Your many terrible teeth; and as they are disturbed, so am I.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date: 02/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 416 : 11వ అధ్.,  శ్లో 24 /  Bhagavad-Gita - 416: Chap. 11, Ver. 24

Image result for Arjuna Bhagavad Gita
🌹. శ్రీమద్భగవద్గీత - 416   / Bhagavad-Gita - 416  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 24 🌴

24. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||

🌷. తాత్పర్యం : 
ఓ సర్వవ్యాపక విష్ణూ! పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు, విప్పారిన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను గాంచి నా మనస్సు భీతిచే కలతనొందినది. మనోస్థిరత్వమును గాని, సమత్వమును గాని నేను ఏ మాత్రము నిలుపుకొనలేకున్నాను.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 416 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 24 🌴

24. nabhaḥ-spṛśaṁ dīptam aneka-varṇaṁ
vyāttānanaṁ dīpta-viśāla-netram
dṛṣṭvā hi tvāṁ pravyathitāntar-ātmā
dhṛtiṁ na vindāmi śamaṁ ca viṣṇo

🌷 Translation : 
O all-pervading Viṣṇu, seeing You with Your many radiant colors touching the sky, Your gaping mouths, and Your great glowing eyes, my mind is perturbed by fear. I can no longer maintain my steadiness or equilibrium of mind.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 417 : 11వ అధ్.,  శ్లో 25 /  Bhagavad-Gita - 417: Chap. 11, Ver. 25

Image result for Arjuna Bhagavad Gita
🌹. శ్రీమద్భగవద్గీత - 417   / Bhagavad-Gita - 417  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 25 🌴

25. దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని |
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగాన్నివాస ||

🌷. తాత్పర్యం : 
ఓ దేవదేవా! ప్రపంచశరణ్యా! దయచే నా యెడ ప్రసన్నుడవగుము. నీ మండుచున్న మృత్యువును బోలిన ముఖములను మరియు భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వవిధముల నేను భ్రాంతుడనైతిని.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 417 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 25 🌴

25. daṁṣṭrā-karālāni ca te mukhāni
dṛṣṭvaiva kālānala-sannibhāni
diśo na jāne na labhe ca śarma
prasīda deveśa jagan-nivāsa

🌷 Translation : 
O Lord of lords, O refuge of the worlds, please be gracious to me. I cannot keep my balance seeing thus Your blazing deathlike faces and awful teeth. In all directions I am bewildered.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 418 : 11వ అధ్.,  శ్లో 26, 27 /  Bhagavad-Gita - 418: Chap. 11,  Ver. 26, 27

Image result for Arjuna Bhagavad Gita
🌹. శ్రీమద్భగవద్గీత - 418   / Bhagavad-Gita - 418  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 26, 27  🌴

26. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా:
సర్వే సహైవావనిపాలసఙ్ఘై: |
భీష్మో ద్రోణ: సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యై: ||

27. వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సందృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గై: ||

🌷. తాత్పర్యం : 


🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 418 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 26 , 27 🌴

26. amī ca tvāṁ dhṛtarāṣṭrasya putrāḥ
sarve sahaivāvani-pāla-saṅghaiḥ
bhīṣmo droṇaḥ sūta-putras tathāsau
sahāsmadīyair api yodha-mukhyaiḥ

27. vaktrāṇi te tvaramāṇā viśanti
daṁṣṭrā-karālāni bhayānakāni
kecid vilagnā daśanāntareṣu
sandṛśyante cūrṇitair uttamāṅgaiḥ

🌷 Translation : 
All the sons of Dhṛtarāṣṭra, along with their allied kings, and Bhīṣma, Droṇa, Karṇa – and our chief soldiers also – are rushing into Your fearful mouths. And some I see trapped with heads smashed between Your teeth.

🌹 Purport :
In a previous verse the Lord promised to show Arjuna things he would be very interested in seeing. 

Now Arjuna sees that the leaders of the opposite party (Bhīṣma, Droṇa, Karṇa and all the sons of Dhṛtarāṣṭra) and their soldiers and Arjuna’s own soldiers are all being annihilated. 

This is an indication that after the death of nearly all the persons assembled at Kurukṣetra, Arjuna will emerge victorious. It is also mentioned here that Bhīṣma, who is supposed to be unconquerable, will also be smashed. 

So also Karṇa. Not only will the great warriors of the other party like Bhīṣma be smashed, but some of the great warriors of Arjuna’s side also.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 05/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 419: 11వ అధ్.,  శ్లో 28 /  Bhagavad-Gita - 419: Chap. 11, Ver. 28 

Image result for Lord Krishna and Arjuna
🌹. శ్రీమద్భగవద్గీత - 419   / Bhagavad-Gita - 419  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 28 🌴

28. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||

🌷. తాత్పర్యం : 
అనేక నదీ ప్రవాహాలు సముద్రంవైపు వేగంగా పరుగెత్తుతున్నట్లే ఈ పరలోక వీరులంతా ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 419 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 28 🌴

28. yathā nadīnāṁ bahavo ’mbu-vegāḥ
samudram evābhimukhā dravanti
tathā tavāmī nara-loka-vīrā
viśanti vaktrāṇy abhivijvalanti

🌷 Translation : 
As the many waves of the rivers flow into the ocean, so do all these great warriors enter blazing into Your mouths.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date: 06/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

 శ్రీమద్భగవద్గీత - 420 : 11వ అధ్.,  శ్లో 29 /  Bhagavad-Gita - 420: Chap. 11, Ver. 29 

Image may contain: 6 people
🌹. శ్రీమద్భగవద్గీత - 420   / Bhagavad-Gita - 420  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 29 🌴

29. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||

🌷. తాత్పర్యం : 
చావుకోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే నశించడం కోసం మహావేగంగా నీ నోళ్ళలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 420 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 29 🌴

29. yathā pradīptaṁ jvalanaṁ pataṅgā
viśanti nāśāya samṛddha-vegāḥ
tathaiva nāśāya viśanti lokās
tavāpi vaktrāṇi samṛddha-vegāḥ

🌷 Translation : 
I see all people rushing full speed into Your mouths, as moths dash to destruction in a blazing fire.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date: 07/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 421: 11వ అధ్.,  శ్లో 30 /  Bhagavad-Gita - 421: Chap. 11, Ver. 30

Image result for Viṣṇu, Krishna Vishwaroop
🌹. శ్రీమద్భగవద్గీత - 421   / Bhagavad-Gita - 421  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 30 🌴

30. లేలిహ్యసే గ్రసమాన: సమన్తాల్
లోకాన్ సమగ్రాన్  వదనైర్జ్వలద్భి: |
తేజోభిరాపూర్వ జగత్సమగ్రమ్
భాసస్తవోగ్రా: ప్రతపన్తి విష్ణో ||

🌷. తాత్పర్యం : 
ఓ విష్ణూ! నీవు సమస్తజనులను నీ మండుచున్న నోళ్ళ ద్వారా అన్ని వైపుల నుండియు మ్రింగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి, భయంకరములును మరియు తాపకరములును అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు.

🌷. భాష్యము  : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 421 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 30 🌴

30. lelihyase grasamānaḥ samantāl
lokān samagrān vadanair jvaladbhiḥ
tejobhir āpūrya jagat samagraṁ
bhāsas tavogrāḥ pratapanti viṣṇo

🌷 Translation : 
O Viṣṇu, I see You devouring all people from all sides with Your flaming mouths. Covering all the universe with Your effulgence, You are manifest with terrible, scorching rays.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

Date: 08/Jul/2020

---------------------------------------- x ----------------------------------------


శ్రీమద్భగవద్గీత - 424: 11వ అధ్.,  శ్లో 33 /  Bhagavad-Gita - 424: Chap. 11, Ver. 33

🌹. శ్రీమద్భగవద్గీత - 424   / Bhagavad-Gita - 424  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 33 🌴

33. తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్య
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవైతే నిహతా: పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||

🌷. తాత్పర్యం : 
అందుచే లెమ్ము. యుద్ధసన్నద్ధుడవై కీర్తిని గడింపుము. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యము ననుభవింపుము. ఓ సవ్యసాచీ! నా ఏర్పాటుచే వారందరును ఇదివరకే మరణించియున్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్తమాత్రుడవగుము.

🌷. భాష్యము  : 
“సవ్యసాచి” యను పదము యుద్ధరంగమున అతినిపుణతతో బాణప్రయోగము చేయగలవానిని సూచించును.

 ఆ విధముగా అర్జుండు శత్రుసంహారము కొరకు బాణప్రయోగమును చేయగల సమర్థుడైన యోధుడని సంభోధింపబడినాడు. ఈ శ్లోకమున “నిమిత్తమాత్రమ్” అను పదము మిక్కిలి ప్రధానమైనది. 

జగత్తంతయు శ్రీకృష్ణభగవానుని సంకల్పము, ప్రణాళికచే నడుచుచుండ తగినంత జ్ఞ్ఞానములేని మూఢులు ప్రకృతి ఎట్టి ప్రణాళిక లేకనే నడుచుచున్నదనియు మరియు సృష్టులన్నియును యాదృచ్చికముగా సంభవించినవనియు భావింతురు. 

“బహుశ: ఇది ఇట్లుండవచ్చును” లేదా “బహుశ: దానిని పోలవచ్చును” అని పలుకు నామమాత్ర శాస్త్రజ్ఞులు పలువురు కలరు. కాని ఈ విషయమున “బహుశ:” లేదా “ఇది కావచ్చును” అను ప్రశ్నకు తావే లేదు. 

అనగా ఈ భౌతికజగత్తు సృష్టి వెనుక ప్రత్యేకమైన ప్రణాళిక ఒకటి కలదు. ఆ ప్రణాళిక యేమిటి? ఈ భౌతికసృష్టి బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరుటకు ఒక ఆవకాశమై యున్నది. 

భౌతికప్రకృతిపై అధిపత్యము చెలాయించు భావమున్నంతవరకు జీవులు బద్ధులై యుందురు. కాని ఎవరైనను శ్రీకృష్ణభగవానుని సంకల్పము నెరిగి కృష్ణభక్తి అలవరచుకొనినచో అత్యంత బుద్ధికుశలురు కాగలరు. 

విశ్వము యొక్క సృష్టి, లయములు ఆ భగవానుని పరమనిర్దేశమునందు జరుగుచుండును గనుక కురుక్షేత్రమందలి యుద్ధము కూడా అతని సంకల్పము పైననే ఏర్పాటు చేయబడినది. 

కనుకనే అర్జునుడు యుద్ధము చేయ నిరాకారించినపుడు దేవదేవుని  కోరిక ననుసరించి యుద్ధము చేయమని బోధింపబడినాడు. అప్పుడే అతడు ఆనందభాగుడు కాగలడు. 

అనగా కృష్ణభక్తిభావనలో సంపూర్ణముగా నిమగ్నుడై జీవితమును ఆ భగవానుని దివ్యసేవకే అంకితము చేసినవాడు పరిపూర్ణుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 424 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 33 🌴

33. tasmāt tvam uttiṣṭha yaśo labhasva
jitvā śatrūn bhuṅkṣva rājyaṁ samṛddham
mayaivaite nihatāḥ pūrvam eva
nimitta-mātraṁ bhava savya-sācin

🌷 Translation : 
Therefore get up. Prepare to fight and win glory. Conquer your enemies and enjoy a flourishing kingdom. They are already put to death by My arrangement, and you, O Savyasācī, can be but an instrument in the fight.

🌹 Purport :
Savya-sācin refers to one who can shoot arrows very expertly in the field; thus Arjuna is addressed as an expert warrior capable of delivering arrows to kill his enemies. “Just become an instrument”: nimitta-mātram. 

This word is also very significant. The whole world is moving according to the plan of the Supreme Personality of Godhead. 

Foolish persons who do not have sufficient knowledge think that nature is moving without a plan and all manifestations are but accidental formations. 

There are many so-called scientists who suggest that perhaps it was like this, or maybe like that, but there is no question of “perhaps” and “maybe.” There is a specific plan being carried out in this material world. 

What is this plan? This cosmic manifestation is a chance for the conditioned souls to go back to Godhead, back to home. As long as they have the domineering mentality which makes them try to lord it over material nature, they are conditioned. 

But anyone who can understand the plan of the Supreme Lord and cultivate Kṛṣṇa consciousness is most intelligent. The creation and destruction of the cosmic manifestation are under the superior guidance of God. 

Thus the Battle of Kurukṣetra was fought according to the plan of God. Arjuna was refusing to fight, but he was told that he should fight in accordance with the desire of the Supreme Lord. 

Then he would be happy. If one is in full Kṛṣṇa consciousness and his life is devoted to the Lord’s transcendental service, he is perfect.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 11/Jul/20

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 425: 11వ అధ్.,  శ్లో 34 /  Bhagavad-Gita - 425: Chap. 11, Ver. 34

🌹. శ్రీమద్భగవద్గీత - 425   / Bhagavad-Gita - 425  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 34 🌴

34. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా
యుధ్యస్య జేతాసి రణే సపత్నాన్ ||

🌷. తాత్పర్యం : 
ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహా యోధులందరును నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏ మాత్రము వ్యథనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు.

🌷. భాష్యము  : 
ప్రతిప్రణాళికయు దేవదేవుని చేతనే నిర్వహింపబడుచుండును. కాని భక్తుల యెడ అరమ కరుణామయుడైన అతడు తన కోరిక ననుసరించి స్వీయప్రణాళికలను అమలరుపరచు భక్తుల కార్యసాఫల్య ప్రతిష్టను ఒసగగోరును. 

కనక గురుముఖముగా కృష్ణభక్తిభావన యందు వర్తించుచు ఆ దేవదేవుని అవగతము చేసికొనునట్లుగా ప్రతియొక్కరు జీవితమును మలచుకొనవలెను. శ్రీకృష్ణభగవానుని సంకల్పము అతని కరుణ తోడనే తెలియుటకు సాధ్యమగును. 

భక్తుల సంకల్పములు సైతము ఆ దేవదేవుని సంకల్పముతో సమానముగా ఉత్తమములై యుండును. కనుక మనుజుడు వాటిని అనుసరించి జీవనసమరమున జయమును పొందవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 425 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 34  🌴

34. droṇaṁ ca bhīṣmaṁ ca jayadrathaṁ ca
karṇaṁ tathānyān api yodha-vīrān
mayā hatāṁs tvaṁ jahi mā vyathiṣṭhā
yudhyasva jetāsi raṇe sapatnān

🌷 Translation : 
Droṇa, Bhīṣma, Jayadratha, Karṇa and the other great warriors have already been destroyed by Me. Therefore, kill them and do not be disturbed. Simply fight, and you will vanquish your enemies in battle.

🌹 Purport :
Every plan is made by the Supreme Personality of Godhead, but He is so kind and merciful to His devotees that He wants to give the credit to His devotees who carry out His plan according to His desire. 

Life should therefore move in such a way that everyone acts in Kṛṣṇa consciousness and understands the Supreme Personality of Godhead through the medium of a spiritual master. 

The plans of the Supreme Personality of Godhead are understood by His mercy, and the plans of the devotees are as good as His plans. 

One should follow such plans and be victorious in the struggle for existence.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 12/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 426: 11వ అధ్.,  శ్లో 35 /  Bhagavad-Gita - 426: Chap. 11, Ver. 35

🌹. శ్రీమద్భగవద్గీత - 426   / Bhagavad-Gita - 426  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 35 🌴

35. సంజయ ఉవాచ
ఏతచ్చ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమాన: కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీత: ప్రణమ్య ||

🌷. తాత్పర్యం : 
ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను; ఓ రాజా! దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనముల నొసగెను. భీతిని కూడినవాడై అతడు డగ్గుత్తికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.

🌷. భాష్యము  : 
పూర్వమే తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విశ్వరూపముచే సృష్టింపబడిన పరిస్థితి కారణముగా అర్జునుడు సంభ్రమమునకు గురియయ్యెను. 

తత్కారణముగా అతడు కృష్ణునకు గౌరవపూర్వక వందనములను మరల మరల అర్పించుట మొదలిడెను. అతడు స్నేహితునివలె గాక, అద్భుతరసభావితుడైన భక్తునిగా గద్గదస్వరముతో ప్రార్థింపదొడగెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 426 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 35  🌴

35. sañjaya uvāca
etac chrutvā vacanaṁ keśavasya
kṛtāñjalir vepamānaḥ kirīṭī
namaskṛtvā bhūya evāha kṛṣṇaṁ
sa-gadgadaṁ bhīta-bhītaḥ praṇamya

🌷 Translation : 
Sañjaya said to Dhṛtarāṣṭra: O King, after hearing these words from the Supreme Personality of Godhead, the trembling Arjuna offered obeisances with folded hands again and again. He fearfully spoke to Lord Kṛṣṇa in a faltering voice, as follows.

🌹 Purport :
As we have already explained, because of the situation created by the universal form of the Supreme Personality of Godhead, Arjuna became bewildered in wonder; thus he began to offer his respectful obeisances to Kṛṣṇa again and again, and with faltering voice he began to pray, not as a friend, but as a devotee in wonder.
🌹 🌹 🌹 🌹 🌹

---------------------------------------- x ----------------------------------------

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 428: 11వ అధ్.,  శ్లో 37 /  Bhagavad-Gita - 428: Chap. 11, Ver. 37

🌹. శ్రీమద్భగవద్గీత - 428   / Bhagavad-Gita - 428  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 37 🌴

37. కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయ సే బ్రహ్మణో(ప్యాథికర్త్రే |
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్ ||

🌷. తాత్పర్యం : 
ఓ మహాత్మా! బ్రహ్మదేవుని కంటేను ఘనమైనవాడా! నీవే ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంతా! దేవదేవా! జగన్నివాసా! నీవు అక్షయమగు మూలమువు, సర్వకారణకారణుడవు, ఈ భౌతికసృష్టికి అతీతుడవు.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణుడు సర్వులచే ఆరాధనీయుడని ఈ ప్రణామములను అర్పించుట ద్వారా అర్జునుడు సూచించుచున్నాడు. 

అతడే సర్వవ్యాపి మరియు సర్వాత్మలకు ఆత్మయై యున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని “మహాత్మా” అని సంభోదించినాడు. అనగా ఆ భగవానుడు మహోదాత్తుడు మరియు అప్రమేయుడని భావము. 

అలాగుననే అతని శక్తి మరియు ప్రభావముచే ఆవరింపబడనిది ఏదియును జగత్తు నందు లేదని “అనంత” అను పదము సూచించుచున్నది. దేవతల నందరిని నియమించుచు అతడు వారికన్నను అధికుడై యున్నాడనుటయే “దేవేశ” అను పదపు భావము. సమస్త విశ్వమునకు ఆధారమతడే. 

అతని కన్నను అధికులెవ్వరును లేనందున సిద్ధులు మరియు శక్తిమంతులైన దేవతలందరు శ్రీకృష్ణభగవానునికి నమస్సులు గూర్చుట యుక్తముగా నున్నదని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని సృష్టించినందున, అతడు బ్రహ్మ కన్నను ఘనుడని అర్జునుడు ప్రత్యేకముగ పేర్కొనబడినాడు. 

శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతియైన గర్భోదకశాయి విష్ణువు నాభికమలమున బ్రహ్మదేవుని జన్మము కలిగెను. కనుక బ్రహ్మ, బ్రహ్మ నుండి ఉద్భవించిన శివుడు మరియు ఇతర సర్వదేవతలు శ్రీకృష్ణభగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పించవలసియున్నది. 

ఆ రీతిగనే బ్రహ్మరుద్రాది దేవతలు శ్రీకృష్ణభగవానునకు నమస్సులు గూర్తురని శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఈ భౌతికసృష్టి నశ్వరమైనను శ్రీకృష్ణభగవానుడు దానికి అతీతుడై యున్నందున “అక్షరం” అను పదము మిగుల ప్రాధాన్యమును సంతరించుకొన్నది. 

అతడు సర్వకారణకారణుడు. తత్కారణమున అతడు భౌతికప్రకృతి యందలి బద్ధజీవులందరి కన్నను మరియు స్వయము భౌతికసృష్టి కన్నను అత్యంత ఉన్నతుడై యున్నాడు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు పరమపురుషుడై యున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 428 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 37 🌴

37. kasmāc ca te na nameran mahātman
garīyase brahmaṇo ’py ādi-kartre
ananta deveśa jagan-nivāsa
tvam akṣaraṁ sad-asat tat paraṁ yat

🌷 Translation : 
O great one, greater even than Brahmā, You are the original creator. Why then should they not offer their respectful obeisances unto You? O limitless one, God of gods, refuge of the universe! You are the invincible source, the cause of all causes, transcendental to this material manifestation.

🌹 Purport :
By this offering of obeisances, Arjuna indicates that Kṛṣṇa is worshipable by everyone. 

He is all-pervading, and He is the Soul of every soul. Arjuna is addressing Kṛṣṇa as mahātmā, which means that He is most magnanimous and unlimited. 

Ananta indicates that there is nothing which is not covered by the influence and energy of the Supreme Lord, and deveśa means that He is the controller of all demigods and is above them all. He is the shelter of the whole universe. 

Arjuna also thought that it was fitting that all the perfect living entities and powerful demigods offer their respectful obeisances unto Him, because no one is greater than Him. Arjuna especially mentions that Kṛṣṇa is greater than Brahmā because Brahmā is created by Him. 

Brahmā is born out of the lotus stem grown from the navel abdomen of Garbhodaka-śāyī Viṣṇu, who is Kṛṣṇa’s plenary expansion; therefore Brahmā and Lord Śiva, who is born of Brahmā, and all other demigods must offer their respectful obeisances. 

It is stated in Śrīmad-Bhāgavatam that the Lord is respected by Lord Śiva and Brahmā and similar other demigods. The word akṣaram is very significant because this material creation is subject to destruction but the Lord is above this material creation. 

He is the cause of all causes, and being so, He is superior to all the conditioned souls within this material nature as well as the material cosmic manifestation itself. He is therefore the all-great Supreme.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 15/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 429: 11వ అధ్.,  శ్లో 38 /  Bhagavad-Gita - 429: Chap. 11, Ver. 38

🌹. శ్రీమద్భగవద్గీత - 429   / Bhagavad-Gita - 429 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 38 🌴

38. త్వమాదిదేవ: పురుష: పురాణ
స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప ||

🌷. తాత్పర్యం : 
నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్యశరణ్యుడవు. ఓ అనంతరుపా! ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడియున్నది. 

🌷. భాష్యము  : 
సమస్తము శ్రీకృష్ణభగవానునిపై ఆధారపడియుండుటచే అతడు పరమాధారమై యున్నాడు. 

“నిధానం” అనగా సమస్తము (చివరకు బ్రహ్మతేజస్సు సైతము) ఆ దేవదేవుడైన కృష్ణుని పైననే ఆధారపడియున్నదని భావము. ఈ జగమందు జరుగుచున్నదంతయు అతడు సంపూర్ణముగా నెరుగును. 

ఇక జ్ఞానమునకు అవధియన్నది ఉన్నచో అతడే సర్వజ్ఞానమునకు పరమావధి. కనుకనే తెలిసినవాడు మరియు తెలియదగినవాడు అతడే. సర్వవ్యాపియైనందున జ్ఞానధ్యేయమతడే. 

ఆధాత్మిక జగత్తులో అతడే కారణము కనుక దివ్యుడైనవాడతడే. ఆలాగుననే ఆధాత్మికజగమునందు ప్రధానపురుషుడు ఆ శ్రీకృష్ణభగవానుడే.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 429 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 38 🌴

38. tvam ādi-devaḥ puruṣaḥ purāṇas
tvam asya viśvasya paraṁ nidhānam
vettāsi vedyaṁ ca paraṁ ca dhāma
tvayā tataṁ viśvam ananta-rūpa

🌷 Translation : 
You are the original Personality of Godhead, the oldest, the ultimate sanctuary of this manifested cosmic world. You are the knower of everything, and You are all that is knowable. You are the supreme refuge, above the material modes. O limitless form! This whole cosmic manifestation is pervaded by You!

🌹 Purport :
Everything is resting on the Supreme Personality of Godhead; therefore He is the ultimate rest. 

Nidhānam means that everything, even the Brahman effulgence, rests on the Supreme Personality of Godhead, Kṛṣṇa. 

He is the knower of everything that is happening in this world, and if knowledge has any end, He is the end of all knowledge; therefore He is the known and the knowable. 

He is the object of knowledge because He is all-pervading. Because He is the cause in the spiritual world, He is transcendental. 

He is also the chief personality in the transcendental world.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 16/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 430: 11వ అధ్.,  శ్లో 39 /  Bhagavad-Gita - 430: Chap. 11, Ver. 39

🌹. శ్రీమద్భగవద్గీత - 430   / Bhagavad-Gita - 430 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 39 🌴

39. వాయుర్యమో(గ్నిర్వరుణ: శశాఙ్క:
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తే(స్తు సహస్రకృత్వ:
పునశ్చ భూయో(పి నమో నమస్తే ||

🌷. తాత్పర్యం : 
వాయువును మరియు పరం నియామకుడును నీవే! అగ్ని, జలము, చంద్రుడవు నీవే! ఆదిజీవియైన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే. కనుకనే నీకు వేయినమస్కారములు జేయుచు, మరల మరల వందనముల నర్పించుచున్నాను.

🌷. భాష్యము  : 
సర్వవ్యాపకమైనందున వాయువు దేవతలకు ముఖ్య ప్రాతినిధ్యము కనుక భగవానుడిచ్చట వాయువుగా సంబోధింపబడినాడు. విశ్వమునందలి ఆదిజీవియైన బ్రహ్మదేవునకు సైతము తండ్రియైనందున శ్రీకృష్ణుని అర్జునుడు ప్రపితామహునిగా సైతము సంబోధించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 430 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 39 🌴

39. vāyur yamo ’gnir varuṇaḥ śaśāṅkaḥ
prajāpatis tvaṁ prapitāmahaś ca
namo namas te ’stu sahasra-kṛtvaḥ
punaś ca bhūyo ’pi namo namas te

🌷 Translation : 
You are air, and You are the supreme controller! You are fire, You are water, and You are the moon! You are Brahmā, the first living creature, and You are the great-grandfather. I therefore offer my respectful obeisances unto You a thousand times, and again and yet again!

🌹 Purport :
The Lord is addressed here as air because the air is the most important representation of all the demigods, being all-pervasive. Arjuna also addresses Kṛṣṇa as the great-grandfather because He is the father of Brahmā, the first living creature in the universe.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 17/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 431: 11వ అధ్.,  శ్లో 40 /  Bhagavad-Gita - 431: Chap. 11, Ver. 40

🌹. శ్రీమద్భగవద్గీత - 431   / Bhagavad-Gita - 431 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 40 🌴

40. నమ: పురస్తాదథ పృష్టతస్తే
నమో(స్తు తే సర్వత ఏవ సర్వ |
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతో(సి సర్వ: ||

🌷. తాత్పర్యం : 
నీకు ముందు నుండి, వెనుక నుండి, సర్వదిక్కుల నుండి నమస్కారముల నర్పించుచున్నాను. ఓ అనంతవీర్యా! నీవు అమితవిక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి. కనుకనే సర్వమును నీవే అయి యున్నావు.

🌷. భాష్యము  : 
అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుని యెడ ప్రేమపారవశ్యముచే అన్నివైపుల నుండి నమస్సుల నర్పించుచున్నాను. శ్రీకృష్ణుడు సకల పరాక్రమములకు, శక్తులకు ప్రభువనియు, యుద్దరంగమునందు కూడియున్న మహాయోధులందరికన్నను అత్యంత ఘనుడనియు అర్జునుడు ఆంగీకరించుచున్నాడు. ఈ విషయమునకు సంబంధించినదే విష్ణుపురాణమున (1.9.69) ఇట్లు చెప్పబడినది.
యో(యం తవాగతో దేవ సమీపం దేవతాగణ: |
స త్వమేవ జగత్స్రష్టా యత: సర్వగతో భవాన్ ||
“ఓ దేవదేవా! నిన్ను సమీపించు ఎవ్వరైనను (దేవతలైనను సరియే) నీ చేత సృష్టింపబడినవారే.”
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 431 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 40 🌴

40. namaḥ purastād atha pṛṣṭhatas te
namo ’stu te sarvata eva sarva
ananta-vīryāmita-vikramas tvaṁ
sarvaṁ samāpnoṣi tato ’si sarvaḥ

🌷 Translation : 
Obeisances to You from the front, from behind and from all sides! O unbounded power, You are the master of limitless might! You are all-pervading, and thus You are everything!

🌹 Purport :
Out of loving ecstasy for Kṛṣṇa, his friend, Arjuna is offering his respects from all sides. He is accepting that He is the master of all potencies and all prowess and far superior to all the great warriors assembled on the battlefield. It is said in the Viṣṇu Purāṇa (1.9.69):

yo ’yaṁ tavāgato deva
samīpaṁ devatā-gaṇaḥ
sa tvam eva jagat-sraṣṭā
yataḥ sarva-gato bhavān

“Whoever comes before You, even if he be a demigod, is created by You, O Supreme Personality of Godhead.”
🌹 🌹 🌹 🌹 🌹

Date: 18/Jul/2010

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 432: 11వ అధ్.,  శ్లో 41, 42 /  Bhagavad-Gita - 432: Chap. 11, Ver. 41, 42

🌹. శ్రీమద్భగవద్గీత - 432   / Bhagavad-Gita - 432 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 41 , 42 🌴

41. సఖేతి మత్వా ప్రసభం యదుక్తమ్
హే కృష్ణ హే యాదవ హే సఖేతి |
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ||

42. యచ్చాపహాసార్థమసత్కృతో(సి
విహారశయ్యాసనభోజనేషు |
ఏకో(థవాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||

🌷. తాత్పర్యం : 
నీ మహిమము తెలియక నిన్ను మిత్రునిగా భావించి “ఓ కృష్ణా”, “ఓ యాదవా”, “ ఓ మిత్రమా” అని తొందరపాటుగా సంబోధించితిని. ప్రేమతోగాని లేదా మూర్ఖత్వముతోగాని నేనొరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్నిమార్లు మరియు పలుమిత్రుల సమక్షమున మరికొన్నిమార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరపరచితిని. ఓ అచ్యుతా! ఆ అపరాధములన్నింటికిని నన్ను క్షమింపుము.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణుడు విశ్వరూపముతో తన యెదుట వ్యక్తమైనప్పటికిని అతనితో గల స్నేహసంబంధమును అర్జునుడు స్మృతి యందుంచుకొనెను. 

తత్కారణముగా అతడు క్షమార్పణ వేడుచు, స్నేహభావము వలన ఉత్పన్నమైనట్టి పలు సామాన్య వ్యవహారములకు తనను మన్నింపుమని శ్రీకృష్ణుని అర్థించుచున్నాడు. 

ప్రియమిత్రునిగా భావించి శ్రీకృష్ణుడు తనకు తెలియపరచినను, శ్రీకృష్ణుడు ఆ విధమైన విశ్వరూపధారణము చేయగలడని తాను పూర్వము తెలియనట్లుగా అర్జునుడు అంగీకరించుచున్నాడు. 

ఆ భగవానుని విభూతులను గుర్తెరుగాక “ ఓ మిత్రమా”, “ఓ కృష్ణా”, “ఓ యాదవా” అనెడి సంబోధనములచే తానెన్నిమార్లు అతనిని అగౌరవపరచెనో అర్జునుడు ఎరుగడు. అయినను కరుణాంతరంగుడైన శ్రీకృష్ణుడు అట్టి దివ్యవిభూతి సంపన్నుడైనను అర్జునునితో మిత్రుని రూపమున వ్యవహరించెను. 

భక్తుడు మరియు భగవానుని నడుమగల దివ్యప్రేమయుత సంబంధమిదియే. శ్రీకృష్ణుడు మరియు జీవుల నడుమగల సంబంధము నిత్యమైనది, మరుపునకు రానిదని అర్జునుని ప్రవృత్తి ద్వారా మనము గాంచవచ్చును. 

విశ్వరూప వైభవమును గాంచినప్పటికిని అర్జునుడు తనకు శ్రీకృష్ణునితో గల సన్నిహిత స్నేహసంభందమును మరువజాలడు. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 432 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 41, 42 🌴

41. sakheti matvā prasabhaṁ yad uktaṁ
he kṛṣṇa he yādava he sakheti
ajānatā mahimānaṁ tavedaṁ
mayā pramādāt praṇayena vāpi

42. yac cāvahāsārtham asat-kṛto ’si
vihāra-śayyāsana-bhojaneṣu
eko ’tha vāpy acyuta tat-samakṣaṁ
tat kṣāmaye tvām aham aprameyam

🌷 Translation : 
Thinking of You as my friend, I have rashly addressed You “O Kṛṣṇa,” “O Yādava,” “O my friend,” not knowing Your glories. Please forgive whatever I may have done in madness or in love. I have dishonored You many times, jesting as we relaxed, lay on the same bed, or sat or ate together, sometimes alone and sometimes in front of many friends. O infallible one, please excuse me for all those offenses.

🌹 Purport :
Although Kṛṣṇa is manifested before Arjuna in His universal form, Arjuna remembers his friendly relationship with Kṛṣṇa and is therefore asking pardon and requesting Kṛṣṇa to excuse him for the many informal gestures which arise out of friendship. 

He is admitting that formerly he did not know that Kṛṣṇa could assume such a universal form, although Kṛṣṇa explained it as his intimate friend. 

Arjuna did not know how many times he may have dishonored Kṛṣṇa by addressing Him “O my friend,” “O Kṛṣṇa,” “O Yādava,” etc., without acknowledging His opulence. 

But Kṛṣṇa is so kind and merciful that in spite of such opulence He played with Arjuna as a friend. Such is the transcendental loving reciprocation between the devotee and the Lord. 

The relationship between the living entity and Kṛṣṇa is fixed eternally; it cannot be forgotten, as we can see from the behavior of Arjuna.

 Although Arjuna has seen the opulence in the universal form, he cannot forget his friendly relationship with Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 19/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 433: 11వ అధ్.,  శ్లో 43 /  Bhagavad-Gita - 433: Chap. 11, Ver. 43

🌹. శ్రీమద్భగవద్గీత - 433   / Bhagavad-Gita - 433 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 43 🌴

43. పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమో(స్త్యభ్యదిక: కుతో(న్యో
లోకత్రయే(ప్యప్రతిమప్రభావ ||

🌷. తాత్పర్యం : 
స్థావర, జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్యపూజనీయుడగు పరమ ఆధ్యాత్మికగురుడవు నీవే. నీతో సమానమైనవాడు గాని, ఏకమైనవాడుగాని మరొకడుండడు. ఓ అపరిమితశక్తి సంపన్నుడా! అట్టి యెడ నీ కన్నను అధికుడు ముల్లోకములలో ఎవడుండును?

🌷. భాష్యము  : 
లుపబడినది.
న తస్య కార్యం కరణం చ విద్యతే |
న తత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే ||
సాధారణ మనుజుని వలెనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సైతము ఇంద్రియములను మరియు దేహమును కలిగియున్నాను, ఆ భగవానుని విషయమున అతని ఇంద్రియములు, దేహము, మనస్సు, ఆత్మ నడుమ ఎట్టి భేదము లేదు. కాని అతనిని పూర్ణముగా నెరుగని మూఢులే అతని ఇంద్రియములు, మనస్సు, దేహాదులు అతని కన్నను అన్యమని పలుకుదురు. కాని వాస్తవమునకు శ్రీకృష్ణుడు దివ్య పరతత్త్వము. కనుకనే అతని కర్మలు, శక్తులు దివ్యములై యున్నవి. మనకున్నటువంటి ఇంద్రియములు లేకున్నను, ఇంద్రియకార్యములన్నింటిని అతడు చేయగలిగినంతనే అతని ఇంద్రియములు పరిమితములు లేక అసమగ్రములు కావని తెలుపబడినది. అతని కన్నను ఘనుడైనవాడు లేడు. అలాగుననే అతనికి సముడును లేదు. సర్వులును ఆ శ్రీకృష్ణభగవానుని కన్నను తక్కువైనవారే. 
దేవదేవుని జ్ఞానము, శక్తి, కర్మలు అన్నియును దివ్యములు. ఈ విషయమే భగవద్గీత యందు ఇట్లు తెలుపబడినది (4.9).
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వత: |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మా మేతి సో(ర్జున ||
శ్రీకృష్ణుని దివ్యమైన జన్మను, కర్మలను, పూర్ణత్వమును సంపూర్ణముగా నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట ఆ కృష్ణునే చేరి ఈ దుఃఖపూర్ణ జగమునకు తిరిగిరాకుండును. కనుక శ్రీకృష్ణుని కర్మలు ఇతరుల కర్మల కన్నను భిన్నమైనవని ప్రతియొక్కరు ఎరుగవలెను. అందులకు శ్రీకృష్ణుడు తెలిపిన నియమములను పాటించుట అత్యుత్తమ పధ్ధతి. అది ఎల్లరును పూర్ణులను చేయగలదు. ఆ భగవానునకు ఎవ్వరును యజమానులు కారనియు, ప్రతియొక్కరు అతని భృత్యులనియు తెలుపబడినది. “కృష్ణుడొక్కడే  భగవానుడు. ఇతరులందరును అతని సేవకులు” అని చైతన్యచరితామృతము (ఆదిలీల 5.14) ఈ విషయమునే నిర్ధారించుచున్నది (ఏకలే ఈశ్వర కృష్ణ, ఆర సబ భృత్య). అనగా ప్రతియొక్కరు అతని ఆజ్ఞానుసారమే వర్తింపవలసియున్నది. ఎవ్వరును అతని ఆజ్ఞను త్రోసిపుచ్చజాలరు. ఆ రీతిగా ప్రతియొక్కరు అతని పర్యవేక్షణలో అతని నిర్దేశము ననుసరించియే వర్తించుచున్నారు. బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు ఆ దేవదేవుడే సర్వకారణములకు కారణుడై యున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 433 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 43 🌴

43. pitāsi lokasya carācarasya
tvam asya pūjyaś ca gurur garīyān
na tvat-samo ’sty abhyadhikaḥ kuto ’nyo
loka-traye ’py apratima-prabhāva

🌷 Translation : 
You are the father of this complete cosmic manifestation, of the moving and the nonmoving. You are its worshipable chief, the supreme spiritual master. No one is greater than You, nor can anyone be one with You. How then could there be anyone greater than You within the three worlds, O Lord of immeasurable power?

🌹 Purport :
The Supreme Personality of Godhead, Kṛṣṇa, is worshipable as a father is worshipable for his son. He is the spiritual master because He originally gave the Vedic instructions to Brahmā and presently He is also instructing Bhagavad-gītā to Arjuna; therefore He is the original spiritual master, and any bona fide spiritual master at the present moment must be a descendant in the line of disciplic succession stemming from Kṛṣṇa. Without being a representative of Kṛṣṇa, one cannot become a teacher or spiritual master of transcendental subject matter.

The Lord is being paid obeisances in all respects. He is of immeasurable greatness. No one can be greater than the Supreme Personality of Godhead, Kṛṣṇa, because no one is equal to or higher than Kṛṣṇa within any manifestation, spiritual or material. Everyone is below Him. No one can excel Him. This is stated in the Śvetāśvatara Upaniṣad (6.8):

na tasya kāryaṁ karaṇaṁ ca vidyate
na tat-samaś cābhyadhikaś ca dṛśyate

The Supreme Lord, Kṛṣṇa, has senses and a body like the ordinary man, but for Him there is no difference between His senses, His body, His mind and Himself. 

Foolish persons who do not perfectly know Him say that Kṛṣṇa is different from His soul, mind, heart and everything else. Kṛṣṇa is absolute; therefore His activities and potencies are supreme. It is also stated that although He does not have senses like ours, He can perform all sensory activities; therefore His senses are neither imperfect nor limited. No one can be greater than Him, no one can be equal to Him, and everyone is lower than Him.

The knowledge, strength and activities of the Supreme Personality are all transcendental. As stated in Bhagavad-gītā (4.9):

janma karma ca me divyam
evaṁ yo vetti tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti mām eti so ’rjuna

Whoever knows Kṛṣṇa’s transcendental body, activities and perfection, after quitting his body, returns to Him and doesn’t come back again to this miserable world. 

Therefore one should know that Kṛṣṇa’s activities are different from others. The best policy is to follow the principles of Kṛṣṇa; that will make one perfect. It is also stated that there is no one who is master of Kṛṣṇa; everyone is His servant. 

The Caitanya-caritāmṛta (Ādi 5.142) confirms, ekale īśvara kṛṣṇa, āra saba bhṛtya: only Kṛṣṇa is God, and everyone else is His servant. Everyone is complying with His order. 

There is no one who can deny His order. Everyone is acting according to His direction, being under His superintendence. As stated in the Brahma-saṁhitā, He is the cause of all causes.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 20/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 434: 11వ అధ్.,  శ్లో 44 /  Bhagavad-Gita - 434: Chap. 11, Ver. 44

🌹. శ్రీమద్భగవద్గీత - 434   / Bhagavad-Gita - 434 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 44 🌴

44. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయమ్
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితవే పుత్రస్య సఖేవ సఖ్యు:
ప్రియ: ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||

🌷. తాత్పర్యం : 
నీవు ప్రతిజీవికిని పూజనీయుడైన దేవదేవుడవు. కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలిని ప్రియుడు సహించునట్లు, నీ యెడ నొనరించిన నా తప్పులను దయతో సహింపుము.

🌷. భాష్యము  : 
కృష్ణభక్తులు శ్రీకృష్ణునితో పలువిధములైన సంబంధములను కలిగియుందురు. ఒకరు కృష్ణుని పుత్రునిగా భావించవచ్చును, ఇంకొకరు కృష్ణునిగా భర్తగా భావించవచ్చును, మరియొకరు అతనిని మిత్రునిగా లేదా ప్రభువుగా తలచవచ్చును. ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణునితో మిత్రత్వ సంబంధమును కలిగియున్నాడు. తండ్రి, భర్త లేదా యజమాని సహనగుణము కలిగియుండునట్లుగా శ్రీకృష్ణుడు సైతము సహనగుణమును కలిగియుండును.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 434 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 44 🌴

44. tasmāt praṇamya praṇidhāya kāyaṁ
prasādaye tvām aham īśam īḍyam
piteva putrasya sakheva sakhyuḥ
priyaḥ priyāyārhasi deva soḍhum

🌷 Translation : 
You are the Supreme Lord, to be worshiped by every living being. Thus I fall down to offer You my respectful obeisances and ask Your mercy. As a father tolerates the impudence of his son, a friend the impertinence of a friend, or a husband the familiarity of his wife, please tolerate the wrongs I may have done You.

🌹 Purport :
Kṛṣṇa’s devotees relate to Kṛṣṇa in various relationships; one might treat Kṛṣṇa as a son, or one might treat Kṛṣṇa as a husband, as a friend, or as a master. 

Kṛṣṇa and Arjuna are related in friendship. As the father tolerates, or the husband or a master tolerates, so Kṛṣṇa tolerates.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 21/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 435: 11వ అధ్.,  శ్లో 45 /  Bhagavad-Gita - 435: Chap. 11, Ver. 45

🌹. శ్రీమద్భగవద్గీత - 435   / Bhagavad-Gita - 435 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 45 🌴

45. అదృష్టపూర్వం హృషితో(స్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితమ్ మనో మే |
తదేవమే దర్శయ దేవ రూపమ్
ప్రసీద దేవేశ జగన్నివాస 

🌷. తాత్పర్యం : 
ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించితిని. కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా! జగాన్నివాసా! నా యెడ కరుణను జూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడైనందున అర్జునుడు అతని యెడ పూర్ణవిశ్వాసమును కలిగియుండెను. తన మిత్రుని సంపదను గాంచి ప్రియమిత్రుడైనవాడు సంతసించు రీతి, అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడనియు మరియు అద్భుతమైన విశ్వరూపమును చూపగలడనియు ఎరిగి మిగుల సంతసించెను. 

కాని అదే సమయమున ( ఆ విశ్వరూపమును గాంచిన పిమ్మట) తన విశుద్ధ ప్రేమధోరణిలో ఆ దేవదేవుని యెడ తాను పెక్కు అపరాధముల నొనర్చితినని అతడు భీతియును పొందెను. ఆ విధముగా భయమునొంద నవసరము లేకున్నను అతని మనస్సు భయముతో కలత నొందెను. తత్కారణముగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని నారాయణరూపమును చూపుమని అర్థించుచున్నాడు. 

శ్రీకృష్ణుడు ఎట్టి రూపమునైనను దరించగలుగుటయే అందులకు కారణము. భౌతికజగము తాత్కాలికమైనట్లే ప్రస్తుత విశ్వరూపము సైతము భౌతికమును, తాత్కాలికమును అయి యున్నది. కాని వైకుంఠలోకములందు మాత్రము అతడు దివ్యమగు చతుర్భుజనారాయణ రూపమును కలిగియుండును. 

ఆధ్యాత్మికజగమునందలి అనంతసంఖ్యలో గల లోకములలో శ్రీకృష్ణుడు తన ముఖ్యాంశములచే వివిధనామములతో వసించియుండును. అట్టి వైకుంఠలోకము లందలి వివిధరూపములలోని ఒక్క రూపమును అర్జునుడు గాంచగోరెను. 

అన్ని వైకుంఠలోకములందు నారాయణరూపము చతుర్భుజసహితమే అయినను, వాని చతుర్భుజములలో శంఖ, చక్ర, గద, పద్మముల అమరికను బట్టి నారాయణరూపములకు వివిధనామములు కలుగును. ఆ నారాయణరూపములన్నియును. శ్రీకృష్ణునితో ఏకములే కనుక అర్జునుడు అతని చతుర్భుజ రూపమును గాంచ అర్థించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 435 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 45 🌴

45. adṛṣṭa-pūrvaṁ hṛṣito ’smi dṛṣṭvā
bhayena ca pravyathitaṁ mano me
tad eva me darśaya deva rūpaṁ
prasīda deveśa jagan-nivāsa

🌷 Translation : 
After seeing this universal form, which I have never seen before, I am gladdened, but at the same time my mind is disturbed with fear. Therefore please bestow Your grace upon me and reveal again Your form as the Personality of Godhead, O Lord of lords, O abode of the universe.

🌹 Purport :
Arjuna is always in confidence with Kṛṣṇa because he is a very dear friend, and as a dear friend is gladdened by his friend’s opulence, Arjuna is very joyful to see that his friend Kṛṣṇa is the Supreme Personality of Godhead and can show such a wonderful universal form. But at the same time, after seeing that universal form, he is afraid that he has committed so many offenses to Kṛṣṇa out of his unalloyed friendship. 

Thus his mind is disturbed out of fear, although he had no reason to fear. Arjuna therefore is asking Kṛṣṇa to show His Nārāyaṇa form, because He can assume any form. This universal form is material and temporary, as the material world is temporary. 

But in the Vaikuṇṭha planets He has His transcendental form with four hands as Nārāyaṇa. There are innumerable planets in the spiritual sky, and in each of them Kṛṣṇa is present by His plenary manifestations of different names. 

Thus Arjuna desired to see one of the forms manifest in the Vaikuṇṭha planets. Of course in each Vaikuṇṭha planet the form of Nārāyaṇa is four-handed, but the four hands hold different arrangements of symbols – the conchshell, mace, lotus and disc. According to the different hands these four things are held in, the Nārāyaṇas are variously named. 

All of these forms are one with Kṛṣṇa; therefore Arjuna requests to see His four-handed feature.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 22/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 436: 11వ అధ్.,  శ్లో 46 /  Bhagavad-Gita - 436: Chap. 11, Ver. 46

🌹. శ్రీమద్భగవద్గీత - 436  / Bhagavad-Gita - 436 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 46 🌴

46.  కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే ||

🌷. తాత్పర్యం : 
ఓ విశ్వరూపా! సహస్రబాహో! కిరీటము ధరించి శంఖ,చక్ర, గద, పద్మములను హస్తములందు కలిగియుండెడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదురు. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను.

🌷. భాష్యము  : 
బ్రహ్మసంహిత యందు (5.39) “రామాదిమూర్తిషు కలానియమేన తిష్ఠన్” అని చెప్పబడినది. అనగా శ్రీకృష్ణభగవానుడు వేలాది రూపములలో నిత్యస్థితుడై యుండుననియు మరియు రాముడు, నృసింహుడు, నారాయాణాది రూపములు వానిలో ముఖ్యమైనవనియు తెలుపబడినది. వాస్తవమునకు అట్టి రూపములు అసంఖ్యాకములు. కాని శ్రీకృష్ణుడు ఆదిదేవుడనియు, ప్రస్తుతము తన తాత్కాలిక విశ్వరూపమును ధరించియున్నాడనియు అర్జునుడు ఎరిగియున్నాడు. కనుకనే అతని దివ్యమగు నారాయణరూపమును చూపుమని అర్జునుడు ప్రార్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడనియు మరియు ఇతర రూపములు అతని నుండియే ఉద్భవించుననియు తెలిపిన శ్రీమధ్భాగవతవచనము ఈ శ్లోకము నిస్సందేహముగా నిర్ధారించుచున్నది. ప్రధాన విస్తృతాంశములైన వివిధ రూపములు అతనికి అభిన్నములు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటి యందును అతడు భగవానుడే. వాటన్నింటి యందును నిత్య యౌవననిగా అలరారుట యనునది ఆ దేవదేవుని ముఖ్యలక్షణమై యున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి తెలిసికొనగలిగినవాడు భౌతికజగత్తు యొక్క సమస్త కల్మషము నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 436 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 46 🌴

46. kirīṭinaṁ gadinaṁ cakra-hastam
icchāmi tvāṁ draṣṭum ahaṁ tathaiva
tenaiva rūpeṇa catur-bhujena
sahasra-bāho bhava viśva-mūrte

🌷 Translation : 
O universal form, O thousand-armed Lord, I wish to see You in Your four-armed form, with helmeted head and with club, wheel, conch and lotus flower in Your hands. I long to see You in that form.

🌹 Purport :
In the Brahma-saṁhitā (5.39) it is stated, rāmādi-mūrtiṣu kalā-niyamena tiṣṭhan: the Lord is eternally situated in hundreds and thousands of forms, and the main forms are those like Rāma, Nṛsiṁha, Nārāyaṇa, etc. There are innumerable forms. 

But Arjuna knew that Kṛṣṇa is the original Personality of Godhead assuming His temporary universal form. He is now asking to see the form of Nārāyaṇa, a spiritual form. 

This verse establishes without any doubt the statement of the Śrīmad-Bhāgavatam that Kṛṣṇa is the original Personality of Godhead and all other features originate from Him. He is not different from His plenary expansions, and He is God in any of His innumerable forms. 

In all of these forms He is fresh like a young man. That is the constant feature of the Supreme Personality of Godhead. One who knows Kṛṣṇa becomes free at once from all contamination of the material world.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 23/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 437: 11వ అధ్.,  శ్లో 47 /  Bhagavad-Gita - 437: Chap. 11, Ver. 47

🌹. శ్రీమద్భగవద్గీత - 437  / Bhagavad-Gita - 437 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 47 🌴

47.  శ్రీ భగవానువాచ
మయా ప్రసన్నేన తవార్జుననేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ |
తేజోమయం విశ్వమనన్తమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ||

🌷. తాత్పర్యం : 
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! ప్రసన్నుడైన నేను ణా అంతరంగశక్తిచే భౌతికజగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును, అనంతమును, ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచియుండలేదు.

🌷. భాష్యము  : 
అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచగోరెను. తన భక్తుడైన అర్జునుని యెడ కరుణను కలిగిన అ భగవానుడు అంతట తేజోమయమును, విభూతిపూర్ణమును అగు తన విశ్వరూపమును అతనికి చూపెను. సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ రూపము యొక్క పలుముఖములు త్వరితముగా మార్పుచెందుచుండెను. మిత్రుడైన అర్జునుని కోరికను పూర్ణము చేయుట కొరకే శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపెను. 

తన అంతరంగశక్తి ద్వారా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఆ విశ్వరూపము మానవ ఊహకు అతీతమైనది. అర్జునునికి పూర్వమెవ్వరును భగవానుని ఆ రూపమును గాంచియుండలేదు. కాని భక్తుడైన అర్జునునకు అది శ్రీకృష్ణునిచే చూపబడినందున ఊర్థ్వలోకులు మరియు ఆధ్యాత్మికలోకములందు గల ఇతర భక్తులు సైతము దానిని దర్శించగలిగిరి.

 వారు దానిని పూర్వమెన్నడును గాంచకున్నను అర్జునుని కారణమున ఇప్పుడు గాంచగలిగిరి. అనగా పరంపరానుగత భక్తులందరును కృష్ణుని కరుణచే అర్జునుడు గాంచిన విశ్వరూపమును తామును గాంచగలిగిరి. 

దుర్యోధనునితో సంధిరాయబారము జరుపుటకు వెడలినప్పుడును శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెనని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును అంగీకరించలేదు. 

ఆ సమయనున శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెనని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును ఆంగీకరించలేదు. 

ఆ సమయమున శ్రీకృష్ణుడు విశ్వరూపములో కొన్ని రూపములానే ప్రదర్శించెను. కాని ఆ రూపములు అర్జునునకు చూపిన ఈ రూపము కన్నును భిన్నమైనవి. కనుకనే ఈ రూపమును పూర్వమెవ్వరును చూడలేదని స్పష్టముగా తెలుపబడినది
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 437 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 47 🌴

47. śrī-bhagavān uvāca
mayā prasannena tavārjunedaṁ
rūpaṁ paraṁ darśitam ātma-yogāt
tejo-mayaṁ viśvam anantam ādyaṁ
yan me tvad anyena na dṛṣṭa-pūrvam

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: My dear Arjuna, happily have I shown you, by My internal potency, this supreme universal form within the material world. No one before you has ever seen this primal form, unlimited and full of glaring effulgence

🌹 Purport :
Arjuna wanted to see the universal form of the Supreme Lord, so Lord Kṛṣṇa, out of His mercy upon His devotee Arjuna, showed His universal form, full of effulgence and opulence. 

This form was glaring like the sun, and its many faces were rapidly changing. Kṛṣṇa showed this form just to satisfy the desire of His friend Arjuna. This form was manifested by Kṛṣṇa through His internal potency, which is inconceivable by human speculation. 

No one had seen this universal form of the Lord before Arjuna, but because the form was shown to Arjuna, other devotees in the heavenly planets and in other planets in outer space could also see it. They had not seen it before, but because of Arjuna they were also able to see it. 

In other words, all the disciplic devotees of the Lord could see the universal form which was shown to Arjuna by the mercy of Kṛṣṇa. 

Someone has commented that this form was shown to Duryodhana also when Kṛṣṇa went to Duryodhana to negotiate for peace. Unfortunately, Duryodhana did not accept the peace offer, but at that time Kṛṣṇa manifested some of His universal forms. 

But those forms are different from this one shown to Arjuna. It is clearly said that no one had ever seen this form before.
 🌹 🌹 🌹 🌹 🌹

Date: 24/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 438: 11వ అధ్.,  శ్లో 48 /  Bhagavad-Gita - 438: Chap. 11, Ver. 48

🌹. శ్రీమద్భగవద్గీత - 438  / Bhagavad-Gita - 438 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 48 🌴

48.  న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్
న చ క్రియాభిర్న తపోభిరుగ్రై: |
ఏవంరూప: శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||

🌷. తాత్పర్యం : 
ఓ కురుప్రవీరా! వేదాధ్యయనముచేత గాని, యజ్ఞములచేత గాని, దానములచేత గని, పుణ్యకర్మలచేత గాని, ఉగ్రమగు తపస్సులచేత గాని భౌతికజగమున ఈ రూపములలో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరును గాంచి యుండలేదు.

🌷. భాష్యము  : 
ఈ సందర్భమున దివ్యదృష్టి యననేమో చక్కగా అవగతము చేసికొనవలసియున్నది. దివ్యదృష్టిని ఎవ్వరు కలిగియుందురు? దివ్యము అనగా దేవత్వమని భావము. దేవతల వలె దివ్యత్వమును సాధించనిదే ఎవ్వరును దివ్యదృష్టిని పొందలేరు. 

ఇక దేవతలన యెవరు? విష్ణుభక్తులే దేవతలని వేదవాజ్మయమునందు తెలుపబడినది (విష్ణుభక్తా: స్మృతాదేవా:). అనగా విష్ణువు నందు విశ్వాశము లేని నాస్తికులు మరియు శ్రీకృష్ణుని నిరాకారరూపమునే శ్రేష్టమని భావించువారు దివ్యదృష్టిని పొందలేరు. 

ఒక వంక శ్రీకృష్ణుని నిరసించుచునే దివ్యదృష్టిని పొందుటకు ఎవ్వరుకినీ సాధ్యము కాదు. దివ్యులు కానిదే ఎవ్వరును దివ్యదృష్టిని పొందలేరు. అనగా దివ్యదృష్టిని కలిగినవారు అర్జునుని వలెనే విశ్వరూపమును గాంచగలరు.  
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 438 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 48 🌴

48. na veda-yajñādhyayanair na dānair
na ca kriyābhir na tapobhir ugraiḥ
evaṁ-rūpaḥ śakya ahaṁ nṛ-loke
draṣṭuṁ tvad anyena kuru-pravīra

🌷 Translation : 
O best of the Kuru warriors, no one before you has ever seen this universal form of Mine, for neither by studying the Vedas, nor by performing sacrifices, nor by charity, nor by pious activities, nor by severe penances can I be seen in this form in the material world.

🌹 Purport :
The divine vision in this connection should be clearly understood. Who can have divine vision? Divine means godly. 

Unless one attains the status of divinity as a demigod, he cannot have divine vision. And what is a demigod? It is stated in the Vedic scriptures that those who are devotees of Lord Viṣṇu are demigods (viṣṇu-bhaktaḥ smṛto daivaḥ). 

Those who are atheistic, i.e., who do not believe in Viṣṇu, or who recognize only the impersonal part of Kṛṣṇa as the Supreme, cannot have the divine vision. It is not possible to decry Kṛṣṇa and at the same time have the divine vision. 

One cannot have the divine vision without becoming divine. In other words, those who have divine vision can also see like Arjuna.

The Bhagavad-gītā gives the description of the universal form. 

Although this description was unknown to everyone before Arjuna, now one can have some idea of the viśva-rūpa after this incident. Those who are actually divine can see the universal form of the Lord. 

But one cannot be divine without being a pure devotee of Kṛṣṇa. The devotees, however, who are actually in the divine nature and who have divine vision, are not very much interested in seeing the universal form of the Lord. 

As described in the previous verse, Arjuna desired to see the four-handed form of Lord Kṛṣṇa as Viṣṇu, and he was actually afraid of the universal form.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 25/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 440: 11వ అధ్.,  శ్లో 50 /  Bhagavad-Gita - 440: Chap. 11, Ver. 50

🌹. శ్రీమద్భగవద్గీత - 440  / Bhagavad-Gita - 440 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 50 🌴

50.  సంజయ ఉవాచ
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయ: |
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పున: సౌమ్యవపుర్మహాత్మా ||

🌷. తాత్పర్యం : 
ధృతరాష్ట్రునితో సంజయుడు పలేకెను : దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజరూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఆశ్వాసమును గూర్చుచు అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు పుత్రునిగా లభించినప్పుడు తొలుత చతుర్భుజ నారాయణుని రూపమున దర్శనమొసగెను. కాని తల్లిదండ్రుల కోరికపై అతడు తిరిగి సామాన్యబాలునిగా మారెను. 

అదేవిధముగా అర్జునుడు సైతము చతుర్భుజరూపమును గాంచుట యందు ఎక్కువ ఆసక్తిని కలిగియుండడని శ్రీకృష్ణుడు ఎరిగియుండెను. 

కాని అతడు కోరియున్నందున తన చతుర్భుజరూపమును చూపి పిదప తన సహజ ద్విభుజ రూపమును పొందెను. ఈ శ్లోకమున “సౌమ్యవపు:” అను పదము ప్రధానమైనది. “సౌమ్యవపు:” అనగా అత్యంత సుందరమైన రూపమని భావము. 

శ్రీకృష్ణుడు ధరత్రిపై నిలిచినపుడు ప్రతియొక్కరు అతని అత్యంత సుందరరూపముచే ఆకర్షితులైరి. జగన్నిర్దేశకుడైనందునే ఆ భగవానుడు తన భక్తుడైన అర్జునుని భయమును తొలగించి తన సుందరరూపమును అతనికి చూపెను.

 ప్రేమాంనజనమును కనులకు పూసుకొనిన మనుజుడే శ్రీకృష్ణభగవానుని దివ్యసుందరరూపమును గాంచగలడని బ్రహ్మసంహిత(5.38) యందు తెలుపబడినది. (ప్రేమాంజనచ్చురితభక్తివిలోచనేన).
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 440 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 50 🌴

50. sañjaya uvāca
ity arjunaṁ vāsudevas tathoktvā
svakaṁ rūpaṁ darśayām āsa bhūyaḥ
āśvāsayām āsa ca bhītam enaṁ
bhūtvā punaḥ saumya-vapur mahātmā

🌷 Translation : 
Sañjaya said to Dhṛtarāṣṭra: The Supreme Personality of Godhead, Kṛṣṇa, having spoken thus to Arjuna, displayed His real four-armed form and at last showed His two-armed form, thus encouraging the fearful Arjuna.

🌹 Purport :
When Kṛṣṇa appeared as the son of Vasudeva and Devakī, He first of all appeared as four-armed Nārāyaṇa, but when He was requested by His parents, He transformed Himself into an ordinary child in appearance. 

Similarly, Kṛṣṇa knew that Arjuna was not interested in seeing a four-handed form, but since Arjuna asked to see this four-handed form, Kṛṣṇa also showed him this form again and then showed Himself in His two-handed form. 

The word saumya-vapuḥ is very significant. Saumya-vapuḥ is a very beautiful form; it is known as the most beautiful form. 

When He was present, everyone was attracted simply by Kṛṣṇa’s form, and because Kṛṣṇa is the director of the universe, He just banished the fear of Arjuna, His devotee, and showed him again His beautiful form of Kṛṣṇa.

 In the Brahma-saṁhitā (5.38) it is stated, premāñjana-cchurita-bhakti-vilocanena: 

only a person whose eyes are smeared with the ointment of love can see the beautiful form of Śrī Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 27/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 441: 11వ అధ్.,  శ్లో 51 /  Bhagavad-Gita - 441: Chap. 11, Ver. 51

🌹. శ్రీమద్భగవద్గీత - 441  / Bhagavad-Gita - 441 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 51 🌴

51.  అర్జున ఉవాచ
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్ధన |
ఇదానీమస్మి సంవృత్త: సచేతా: ప్రకృతిం గత: ||

🌷. తాత్పర్యం : 
ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్యరూపమును గాంచినంత ఇట్లు పలికెను: ఓ జనార్ధనా! అత్యంత సుందరమైన ఈ నీ మానవరూపమును గాంచి శాంతచిత్తుడవై నా సహజస్వభావమును పొందితివి.

🌷. భాష్యము  : 
దేవదేవుడైన శ్రీకృష్ణుడు సహజముగా ద్విభుజుడని ఈ శ్లోకమునందలి “మానుషం రూపం” అను పదము స్పష్టముగా తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు సామాన్యమానవుడే యనెడి భావనలో ఆ దేవదేవుని అపహాస్యము చేయువారు అతని దివ్యస్వభావమును ఎరుగనివారని ఇచ్చట నిరూపించబడినది.

 శ్రీకృష్ణుడు సాధారణ మానవుడే యైనచో తొలుత విశ్వరూపమును, ఆ పిదప చతుర్భుజనారాయణ రూపమును చూపుట అతనికెట్లు సాధ్యమగును? 

కనుక శ్రీకృష్ణుని సామాన్యమావవునిగా భావించుచు, నిరాకరబ్రహ్మమే శ్రీకృష్ణునిలో నుండి పలుకుచున్నదని వ్యాఖ్యానించుచు పాఠకుని తప్పుద్రోవ పట్టించువారు నిక్కము జనులకు గొప్ప అన్యాయము చేసినవారగుదురు. ఈ విషయమే భగవద్గీత యందు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. 

శ్రీకృష్ణుడు వాస్తవముగా విశ్వరూపమును మరియు చతుర్భుజనారాయణ రూపమును ప్రదర్శించినపుడు సామాన్యమానవుడెట్లు కాగలడు? శుద్ధభక్తుడైనవాడు సత్యదర్శియైనందున అట్టి తప్పుద్రోవ పట్టించు గీతావ్యాఖ్యానములచే కలతను పొందడు. 

భగవద్గీత యందలి మూలశ్లోకములు సూర్యుని భాతి సుస్పష్టములు. మూర్ఖవ్యాఖ్యాతల దీపపు వెలుగు వాటికి ఏమాత్రము అవసరము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 441 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 51 🌴

51. arjuna uvāca
dṛṣṭvedaṁ mānuṣaṁ rūpaṁ
tava saumyaṁ janārdana
idānīm asmi saṁvṛttaḥ
sa-cetāḥ prakṛtiṁ gataḥ

🌷 Translation : 
When Arjuna thus saw Kṛṣṇa in His original form, he said: O Janārdana, seeing this humanlike form, so very beautiful, I am now composed in mind, and I am restored to my original nature.

🌹 Purport :
Here the words mānuṣaṁ rūpam clearly indicate the Supreme Personality of Godhead to be originally two-handed. Those who deride Kṛṣṇa as if He were an ordinary person are shown here to be ignorant of His divine nature.

 If Kṛṣṇa is like an ordinary human being, then how is it possible for Him to show the universal form and again to show the four-handed Nārāyaṇa form? 

So it is very clearly stated in Bhagavad-gītā that one who thinks that Kṛṣṇa is an ordinary person and who misguides the reader by claiming that it is the impersonal Brahman within Kṛṣṇa speaking is doing the greatest injustice. Kṛṣṇa has actually shown His universal form and His four-handed Viṣṇu form. 

So how can He be an ordinary human being? A pure devotee is not confused by misguiding commentaries on Bhagavad-gītā because he knows what is what. 

The original verses of Bhagavad-gītā are as clear as the sun; they do not require lamplight from foolish commentators.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 442: 11వ అధ్.,  శ్లో 52 /  Bhagavad-Gita - 442: Chap. 11, Ver. 52

No photo description available.
🌹. శ్రీమద్భగవద్గీత - 442  / Bhagavad-Gita - 442 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 52 🌴

52.  శ్రీభగవానువాచ
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి యన్మమ |
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ: ||

🌷. తాత్పర్యం : 
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవిపుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించు నవకాశమునకై దేవతలు సైతము నిత్యమూ వేచియుందురు.

🌷. భాష్యము  : 
ఈ అధ్యాయపూ నలుబదియెనిమిదవ శ్లోకమున విశ్వరూపప్రదర్శనమును ముగించి, అట్టి తన విశ్వరూపములు పలు పుణ్యకార్యములు, యజ్ఞాదులచే దర్శింపసాధ్యము కానిదని శ్రీకృష్ణభగవానుడు అర్జునునితో పలికెను. 

కాని శ్రీకృష్ణుని ద్విభుజరూపము మరింత గుహ్యమైనదని తెలియజేయుచు ఇచ్చట “సుదుర్ధర్శనమ్” అను పదము వాడబడినది. తపస్సు, వేదాధ్యయనము, తాత్విక చింతనము లేదా కల్పనములనెడి వివిధకర్మలకు కొద్దిగా భక్తిని మిళితము చేయుట ద్వారా ఎవ్వరైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచగలుగుదురు. అనగా అది సాధ్యమయ్యెడి కార్యమే. కాని పూర్వమే తెలుపబడినట్లు భక్తి లేకుండా మాత్రము అది సాధ్యము కాదు. 

శ్రీకృష్ణుని అట్టి విశ్వరూపదర్శనము కన్ను అతని ద్విభుజరూపదర్శనము అత్యంత దుర్లభమైనది. బ్రహ్మ, రుద్రాది దేవతలకు సైతము అది సాధ్యము కాదు. సదా వారు అతనిని గాంచ గోరుదురు. దీనికి శ్రీమద్భాగవతమున మనకు ఆధారము లభించగలదు. 

శ్రీకృష్ణుడు తన తల్లియైన దేవకీ గర్భమున ఉన్నప్పుడు అతనిని గాంచుటకు తమ లోకముల నుండి విచ్చేసిన దేవతలు భగవానుడు ఆ సమయమున దర్శనీయుడు కాకున్నను ప్రార్థనలు చేసి అతని దర్శనముకై వేచిరి. 

కాని అజ్ఞానుడైనవాడు శ్రీకృష్ణుడు సామాన్యమానవుడేయని తలచి అతనిని నిరసించుచు, ఆ దేవదేవునికి గాక అతని అంతరమందున్న ఏదియో నిరాకారమునకు వందనముల నర్పించగోరును. 

కాని ఇవన్నియును అర్థరహితములే. శ్రీకృష్ణుని ద్విభుజరూపమును గాంచుటకు బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలు సైతము నిత్యకాంక్షులై యుందురు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 442 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 52 🌴

52. śrī-bhagavān uvāca
su-durdarśam idaṁ rūpaṁ
dṛṣṭavān asi yan mama
devā apy asya rūpasya
nityaṁ darśana-kāṅkṣiṇaḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: My dear Arjuna, this form of Mine you are now seeing is very difficult to behold. Even the demigods are ever seeking the opportunity to see this form, which is so dear.

🌹 Purport :
In the forty-eighth verse of this chapter Lord Kṛṣṇa concluded revealing His universal form and informed Arjuna that this form is not possible to be seen by so many pious activities, sacrifices, etc. Now here the word su-durdarśam is used, indicating that Kṛṣṇa’s two-handed form is still more confidential. 

One may be able to see the universal form of Kṛṣṇa by adding a little tinge of devotional service to various activities like penances, Vedic study and philosophical speculation.

 It may be possible, but without a tinge of bhakti one cannot see; that has already been explained. Still, beyond that universal form, the form of Kṛṣṇa with two hands is still more difficult to see, even for demigods like Brahmā and Lord Śiva. 

They desire to see Him, and we have evidence in the Śrīmad-Bhāgavatam that when He was supposed to be in the womb of His mother, Devakī, all the demigods from heaven came to see the marvel of Kṛṣṇa, and they offered nice prayers to the Lord, although He was not at that time visible to them. They waited to see Him. 

A foolish person may deride Him, thinking Him an ordinary person, and may offer respect not to Him but to the impersonal “something” within Him, but these are all nonsensical postures. Kṛṣṇa in His two-armed form is actually desired to be seen by demigods like Brahmā and Śiva.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 443: 11వ అధ్.,  శ్లో 53 /  Bhagavad-Gita - 443: Chap. 11, Ver. 53

🌹. శ్రీమద్భగవద్గీత - 443  / Bhagavad-Gita - 443 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 53 🌴

53.  నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ||

🌷. తాత్పర్యం : 
దివ్యచక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని, తీవ్రతపస్సులచే గాని, దానముచే గాని, పూజలచేగాని అవగతము కాదు. మనుజుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవియన్నియును సాధనములు కాజాలవు.

🌷. భాష్యము  : 
శ్రీకృష్ణుడు తన జననీజనకులైన దేవకీవసుదేవులకు తొలుత చతుర్భుజ రూపమున దర్శనమిచ్చి పిదప ద్విభుజరూపమునకు మార్పుచెందెను. 

ఈ విషయమును అవగాహనము చేసికొనుట నాస్తికులైనవారికి లేదా భక్తిరహితులకు అత్యంత కఠినము. వేదవాజ్మయమును కేవలము వ్యాకరణజ్ఞానరూపములో లేదా విద్యాయోగ్యతల రూపములో అధ్యయనము చేసిన పండితులకు శ్రీకృష్ణుని అవగతము చేసికొనుట అసాధ్యము. 

అలాగుననే అంతరంగమున భక్తిభావము లేకుండా బాహ్యముగా పూజలొనర్చుటకు మందిరమునకేగు మనుజులకు సైతము అతడు అవగతము కాడు. వారు మందిరదర్శనము కావించుకొనినను శ్రీకృష్ణుని యథార్థరూపము నెరుగలేరు. 

కేవలము భక్తియోగమార్గము ద్వారానే శ్రీకృష్ణుడు యథార్థముగా అవగతము కాగలడు. ఈ విషయము అతని చేతనే స్వయముగా రాబోవు శ్లోకమున వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 443 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 53 🌴

53. nāhaṁ vedair na tapasā
na dānena na cejyayā
śakya evaṁ-vidho draṣṭuṁ
dṛṣṭavān asi māṁ yathā

🌷 Translation : 
The form you are seeing with your transcendental eyes cannot be understood simply by studying the Vedas, nor by undergoing serious penances, nor by charity, nor by worship. It is not by these means that one can see Me as I am.

🌹 Purport :
Kṛṣṇa first appeared before His parents Devakī and Vasudeva in a four-handed form, and then He transformed Himself into the two-handed form. This mystery is very difficult to understand for those who are atheists or who are devoid of devotional service. 

For scholars who have simply studied Vedic literature by way of grammatical knowledge or mere academic qualifications, Kṛṣṇa is not possible to understand. Nor is He to be understood by persons who officially go to the temple to offer worship. 

They make their visit, but they cannot understand Kṛṣṇa as He is. Kṛṣṇa can be understood only through the path of devotional service, as explained by Kṛṣṇa Himself in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 30/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 444: 11వ అధ్.,  శ్లో 54 /  Bhagavad-Gita - 444: Chap. 11, Ver. 54

Image may contain: 12 people, people standing
🌹. శ్రీమద్భగవద్గీత - 444  / Bhagavad-Gita - 444 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 54 🌴

54.  భక్యా త్వనన్యయా శక్య అహమేవంవిధో(ర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప ||

🌷. తాత్పర్యం : 
ఓ ప్రియమైన అర్జునా! కేవలము అనన్యభక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడినరీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహనా రహస్యములందు ప్రవేశింపగలుగుదువు.

🌷. భాష్యము  : 
అనన్యభక్తియుతసేవా విధానముననే శ్రీకృష్ణభగవానుడు అవగతము కాగలడు. మానసికకల్పనాపద్దతుల ద్వారా భగవద్గీతను అవగతము చేసికొన యత్నించు అప్రమాణిక వ్యాఖ్యాతలు తాము కేవలము కాలమును వృథాపరచుచున్నామని అవగతము చేసికొనునట్లుగా ఈ విషయమును శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున స్పష్టముగా తెలియజేసినాడు. 

కృష్ణుడుగాని లేదా కృష్ణుడు ఏ విధముగా తల్లిదండ్రుల ఎదుట చతుర్భుజరూపమున ప్రకటమై, పిదప ద్విభుజరూపమునకు మారెనను విషయమును గాని ఎవ్వరును ఎరుగలేరు. వేదాధ్యయనముచే గాని, తత్త్వవిచారములచే గని ఈ విషయములను తెలియుట రహస్యములందు ప్రవేశింపజాలరనియు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. 

అయినను వేదవాజ్మయమునందు పరమప్రవీణులైనవారు మాత్రము అట్టి వాజ్మయము ద్వారా అతనిని గూర్చి తెలిసికొనగలరు. భక్తియుతసేవ నొనర్చుటకు ప్రామాణిక శాస్త్రములందు పెక్కు నియమనిబంధనలు గలవు. 

శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొన గోరినచో మనుజుడు ప్రామాణిక గ్రంథములందు వర్ణింపబడిన విధియుక్త నియమములను తప్పక అనుసరించవలెను. ఆ నియమానుసారముగా అతడు తపస్సును కావించవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 444 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 54 🌴

54. bhaktyā tv ananyayā śakya
aham evaṁ-vidho ’rjuna
jñātuṁ draṣṭuṁ ca tattvena
praveṣṭuṁ ca paran-tapa

🌷 Translation : 
My dear Arjuna, only by undivided devotional service can I be understood as I am, standing before you, and can thus be seen directly. Only in this way can you enter into the mysteries of My understanding.

🌹 Purport :
Kṛṣṇa can be understood only by the process of undivided devotional service. 

He explicitly explains this in this verse so that unauthorized commentators, who try to understand Bhagavad-gītā by the speculative process, will know that they are simply wasting their time. 

No one can understand Kṛṣṇa or how He came from parents in a four-handed form and at once changed Himself into a two-handed form. These things are very difficult to understand by study of the Vedas or by philosophical speculation. 

Therefore it is clearly stated here that no one can see Him or enter into understanding of these matters. Those who, however, are very experienced students of Vedic literature can learn about Him from the Vedic literature in so many ways. 

There are so many rules and regulations, and if one at all wants to understand Kṛṣṇa, he must follow the regulative principles described in the authoritative literature. One can perform penance in accordance with those principles. 

For example, to undergo serious penances one may observe fasting on Janmāṣṭamī, the day on which Kṛṣṇa appeared, and on the two days of Ekādaśī (the eleventh day after the new moon and the eleventh day after the full moon). 

As far as charity is concerned, it is plain that charity should be given to the devotees of Kṛṣṇa who are engaged in His devotional service to spread the Kṛṣṇa philosophy, or Kṛṣṇa consciousness, throughout the world.

 Kṛṣṇa consciousness is a benediction to humanity. Lord Caitanya was appreciated by Rūpa Gosvāmī as the most munificent man of charity because love of Kṛṣṇa, which is very difficult to achieve, was distributed freely by Him. 

So if one gives some amount of his money to persons involved in distributing Kṛṣṇa consciousness, that charity, given to spread Kṛṣṇa consciousness, is the greatest charity in the world.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 31/Jul/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 445: 11వ అధ్.,  శ్లో 55 /  Bhagavad-Gita - 445: Chap. 11, Ver. 55

🌹. శ్రీమద్భగవద్గీత - 445  / Bhagavad-Gita - 445 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 55 🌴

55.  మత్కర్మకృన్మత్పరమో మద్భక్త: సఙ్గవర్జిత: |
నిర్వైర: సర్వభూతేషు య: స మామేతి పాణ్డవ ||

🌷. తాత్పర్యం : 
ఓ ప్రియమైన అర్జునా! కామ్యకర్మలు, మనోకల్పనలనెడి కల్మషముల నుండి విడివడి నా శుద్ధభక్తి యందు నియుక్తుడయ్యెడివాడును, నన్నే తన జీవితపరమగమ్యముగా భావించి నా కొరకై కర్మనొనరించువాడును, సర్వజీవుల యెడ మిత్రత్వమును కలిగినవాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు.

🌷. భాష్యము  : 
ఆధ్యాత్మికాకాశము నందలి కృష్ణలోకములో దివ్యపురుషుడు శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలెనని అభిలషించువాడు ఆ భగవానుడే స్వయముగా తెలిపినటువంటి ఈ సూత్రమును తప్పక అంగీకరింపవలెను. కనుకనే ఈ శ్లోకము గీతాసారముగా పరిగణింప బడుచున్నది. 

ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలెనను ప్రయోజనముచే భౌతికజగత్తునందు మగ్నులైనవారును, నిజమైన ఆధ్యాత్మికజీవనమును గూర్చి తెలియనివారును అగు బద్దజీవుల కొరకే భగవద్గీత ఉద్దేశింపబడియున్నది. 

మనుజుడు ఏ విధముగా తన ఆధ్యాత్మికస్థితిని, భగవానునితో తనకు గల నిత్య సంబంధమును అవగతము చేసికొనగలడో చూపి, ఏ విధముగా భగవద్దామమునకు అతడు తిరిగి చేరగలడో ఉపదేశించుటకే భగవద్గీత ఉద్దేశింపబడినది. 

మనుజుడు తన ఆధ్యాత్మిక కర్మమున (భక్తియుతసేవ) విజయమును సాధించు విధానమును ఈ శ్లోకము స్పష్టముగా వివరించుచున్నది.
కర్మకు సంబంధించినంతవరకు మనుజుడు తన శక్తినంతటిని కృష్ణభక్తిభావన కర్మలకే మరల్చవలెను. 

శ్రీమద్భగవద్గీత యందలి “విశ్వరూపము” అను ఏకాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 445 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 55 🌴

55. mat-karma-kṛn mat-paramo
mad-bhaktaḥ saṅga-varjitaḥ
nirvairaḥ sarva-bhūteṣu
yaḥ sa mām eti pāṇḍava

🌷 Translation : 
My dear Arjuna, he who engages in My pure devotional service, free from the contaminations of fruitive activities and mental speculation, he who works for Me, who makes Me the supreme goal of his life, and who is friendly to every living being – he certainly comes to Me.

🌹 Purport :
Anyone who wants to approach the supreme of all the Personalities of Godhead, on the Kṛṣṇaloka planet in the spiritual sky, and be intimately connected with the Supreme Personality, Kṛṣṇa, must take this formula, as stated by the Supreme Himself. Therefore, this verse is considered to be the essence of Bhagavad-gītā. 

The Bhagavad-gītā is a book directed to the conditioned souls, who are engaged in the material world with the purpose of lording it over nature and who do not know of the real, spiritual life. 

The Bhagavad-gītā is meant to show how one can understand his spiritual existence and his eternal relationship with the supreme spiritual personality and to teach one how to go back home, back to Godhead. 

Now here is the verse which clearly explains the process by which one can attain success in his spiritual activity: devotional service.

Thus end the Bhaktivedanta Purports to the Eleventh Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Universal Form.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/Aug/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 446: 12వ అధ్.,  శ్లో 01 /  Bhagavad-Gita - 446: Chap. 12, Ver. 01

🌹. శ్రీమద్భగవద్గీత - 446  / Bhagavad-Gita - 446 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము -భక్తియోగము -01 🌴

01.  అర్జున ఉవాచ
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా: ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు ప్రశ్నించెను : నీ భక్తియుతసేవలో సదా యుక్తముగా నియుక్తులైనవయు మరియు అవ్యక్త నిరాకారబ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు?

🌷. భాష్యము  : 
సాకార, నిరాకార, విశ్వరూపముల గూర్చియు, పలురకములైన భక్తులు మరియు యోగుల గూర్చియు శ్రీకృష్ణభగవానుడు ఇంతవరకు వివరించెను. సాధారణముగా ఆధ్యాత్మికులు సాకారవాదులు మరియు నిరాకారవాదులను రెండు తరగతులుగా విభజించబడియుందురు. 

రూపము నందు అనురక్తుడైన భక్తుడు తన సంపూర్ణశక్తిని వినియోగించి శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడై యుండును. కాని నిరాకారవాదియైనవాడు శ్రీకృష్ణుని ప్రత్యక్షసేవలో నిలువక అవ్యక్త నిరాకరబ్రహ్మ ధ్యానమునందు నిమగ్నుడై యుండును.

పరతత్త్వానుభూతికి గల పలువిధములైన పద్ధతులలో భక్తియోగము అత్యంత ఉత్కృష్టమైనదని ఈ అధ్యాయనమున మనకు అవగతము కాగలదు. శ్రీకృష్ణభగవానుని సన్నిహిత సాహచర్యమును వాంచించినచో మనుజుడు ఆ దేవదేవుని భక్తియుతసేవను తప్పక స్వీకరింపవలసియున్నది.

ఈ భక్తియోగము అత్యంత ప్రత్యక్షమార్గమే గాక దేవదేవుని సాహచర్యమును పొందుటకు సులభతరమైన విధానమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 446 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 01 🌴

01. arjuna uvāca
evaṁ satata-yuktā ye
bhaktās tvāṁ paryupāsate
ye cāpy akṣaram avyaktaṁ
teṣāṁ ke yoga-vittamāḥ

🌷 Translation : 
Arjuna inquired: Which are considered to be more perfect, those who are always properly engaged in Your devotional service or those who worship the impersonal Brahman, the unmanifested?

🌹 Purport :
Kṛṣṇa has now explained about the personal, the impersonal and the universal and has described all kinds of devotees and yogīs. Generally, the transcendentalists can be divided into two classes. One is the impersonalist, and the other is the personalist.

 The personalist devotee engages himself with all energy in the service of the Supreme Lord. The impersonalist also engages himself, not directly in the service of Kṛṣṇa but in meditation on the impersonal Brahman, the unmanifested.

We find in this chapter that of the different processes for realization of the Absolute Truth, bhakti-yoga, devotional service, is the highest. If one at all desires to have the association of the Supreme Personality of Godhead, then he must take to devotional service.

Those who worship the Supreme Lord directly by devotional service are called personalists. Those who engage themselves in meditation on the impersonal Brahman are called impersonalists.

 Arjuna is here questioning which position is better. There are different ways to realize the Absolute Truth, but Kṛṣṇa indicates in this chapter that bhakti-yoga, or devotional service to Him, is the highest of all. It is the most direct, and it is the easiest means for association with the Godhead.

In the Second Chapter of Bhagavad-gītā, the Supreme Lord explained that a living entity is not the material body; he is a spiritual spark. 

And the Absolute Truth is the spiritual whole. In the Seventh Chapter He spoke of the living entity as being part and parcel of the supreme whole and recommended that he transfer his attention fully to the whole. 

So in practically every chapter the conclusion has been that one should be attached to the personal form of Kṛṣṇa, for that is the highest spiritual realization.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 02/Aug/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 447: 12వ అధ్.,  శ్లో 02 /  Bhagavad-Gita - 447: Chap. 12, Ver. 02

🌹. శ్రీమద్భగవద్గీత - 447  / Bhagavad-Gita - 447 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -02 🌴

02.  శ్రీ భగవానువాచ
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతా: ||

🌷. తాత్పర్యం : 
శ్రీకృష్ణభగవానుడు పలికెను: నా స్వీయరూపము నందు మనస్సును లగ్నము చేసి దివ్యమును, ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైనవారు అత్యంత పరిపూర్ణములని నేను భావింతురు.

🌷. భాష్యము  : 
అర్జునుని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణభగవానుడు తన స్వీయరూపమును ధ్యానించుచు శ్రద్ధాభక్తులను గూడి తనను పూజించువాడు యోగమునందు పరిపూర్ణుడని స్పష్టముగా పలుకుచున్నాడు. సర్వము కృష్ణుని కొరకే ఒనరింపబడుచున్నందున అట్టి కృష్ణభక్తిభావనలో నున్నవానికి ఎట్టి భౌతికకర్మలను ఉండవు. అటువంటి కృష్ణభక్తిరసభావనలో భక్తుడు సంతతమగ్నుడై యుండును. కొన్నిమార్లు అతడు జపమును గావించును. కొన్నిమార్లు కృష్ణుని గూర్చిన శ్రవణము లేదా పఠనమును కొనసాగించును. మరికొన్నిసార్లు కృష్ణునికై ప్రసాదమును తయారు చేయును. ఇంకొన్నిమార్లు కృష్ణుని నిమిత్తమై అవసరమైనదేదియో ఖరీదు చేయుటకు అంగడికేగును. ఇంకను మందిరమును శుభ్రము చేయుట, భగవానుని భోజనపాత్రులను కడుగుట వంటి కార్యముల నొనరించును. ఈ విధముగా ఆతడు కృష్ణపరకర్మలకు అంకితము కాకుండా క్షణకాలమును వృథాచేయడు. అటువంటి కర్మ సంపూర్ణముగా సమాధిగతమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 447 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 02 🌴

02. śrī-bhagavān uvāca
mayy āveśya mano ye māṁ
nitya-yuktā upāsate
śraddhayā parayopetās
te me yukta-tamā matāḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Those who fix their minds on My personal form and are always engaged in worshiping Me with great and transcendental faith are considered by Me to be most perfect.

🌹 Purport :
In answer to Arjuna’s question, Kṛṣṇa clearly says that he who concentrates upon His personal form and who worships Him with faith and devotion is to be considered most perfect in yoga. For one in such Kṛṣṇa consciousness there are no material activities, because everything is done for Kṛṣṇa. A pure devotee is constantly engaged. 

Sometimes he chants, sometimes he hears or reads books about Kṛṣṇa, or sometimes he cooks prasādam or goes to the marketplace to purchase something for Kṛṣṇa, or sometimes he washes the temple or the dishes – whatever he does, he does not let a single moment pass without devoting his activities to Kṛṣṇa. Such action is in full samādhi.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/Aug/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 448: 12వ అధ్.,  శ్లో 03, 04 /  Bhagavad-Gita - 448: Chap. 12, Ver. 03, 04

🌹. శ్రీమద్భగవద్గీత - 448  / Bhagavad-Gita - 448 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -03, 04 🌴

03. యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచిన్త్యం చ కూటస్థమచలం ద్రువమ్ ||

04. సన్నియమ్యేన్ద్రియగ్రామాం సర్వత్ర సమబుద్ధయ: |
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతా: ||

🌷. తాత్పర్యం : 
ఇంద్రియాతీతమును,సర్వవ్యాపకమును, అచింత్యమును, మార్పురహితమును, స్థిరమును, అచలమును అగు అవ్యక్త తత్త్వమును (పరతత్త్వపు నిరాకార భావనను) సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వల యెడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైనవారు సైతము అంత్యమున నన్ను పొందుదురు.

🌷. భాష్యము  : 
దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా పూజింపక అదే గమ్యమును పరోక్షమార్గమున సాధింప యత్నించువారు సైతము అంత్యమున ఆ పరమగమ్యమైన శ్రీకృష్ణుని చేరగలరు. “బహుజన్మల పిదప జ్ఞానియైనవాడు వాసుదేవుడే సర్వస్వమని తెలిసి నన్ను శరణువేడుచున్నాడు.” అనగా బహుజన్మల పిదప సంపూర్ణజ్ఞానము ప్రాప్తించనంతనే మనుజుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చును. ఈ శ్లోకమునందు తెలుపబడిన విధానము ద్వారా మనుజుడు దేవదేవుని చేరగోరినచో ఇంద్రియనిగ్రహము కలిగి, సర్వులకు సేవను గూర్చుచు, సర్వజీవుల హితకార్యములందు నియుక్తుడు కావలసియుండును. అనగా ప్రతియొక్కరు శ్రీకృష్ణుని దరిచేరవలసియున్నదనియు, లేని యెడల పూర్ణానుభావమునకు ఆస్కారమే లేదనియు గ్రహింపవచ్చును. అట్టి భగవానునికి శరణాగతిని పొందుటకు పూర్వము మనుజుడు తీవ్రతపస్సును నొనరించవలసియుండును.
జీవహృదయస్థుడైన పరమాత్మను గాంచుటకై దర్శనము, శ్రవణము, ఆస్వాదనము, కర్మముల వంటి ఇంద్రియపరకర్మల నుండి మనుజుడు విరమింపవలెను. ఆ సమయముననే పరమాత్ముడు సర్వత్రా కలడనెడు అవగాహనకు అతడు రాగలడు. ఈ సత్యదర్శనము పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్యతొడుగును గాక ఆత్మను వీక్షించుచుండుటచే మానవునికి, జంతువునకు నడుమ భేదమును గాంచడు. కాని ఇట్టి నిరాకారానుభవ విధానము సామాన్యునకు అత్యంత కఠినమైనది.

🌹 Bhagavad-Gita as It is - 448 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 03, 04 🌴

03. ye tv akṣaram anirdeśyam
avyaktaṁ paryupāsate
sarvatra-gam acintyaṁ ca
kūṭa-stham acalaṁ dhruvam

04. sanniyamyendriya-grāmaṁ
sarvatra sama-buddhayaḥ
te prāpnuvanti mām eva
sarva-bhūta-hite ratāḥ

🌷 Translation : 
But those who fully worship the unmanifested, that which lies beyond the perception of the senses, the all-pervading, inconceivable, unchanging, fixed and immovable – the impersonal conception of the Absolute Truth – by controlling the various senses and being equally disposed to everyone, such persons, engaged in the welfare of all, at last achieve Me.

🌹 Purport :
Those who do not directly worship the Supreme Godhead, Kṛṣṇa, but who attempt to achieve the same goal by an indirect process, also ultimately achieve the same goal, Śrī Kṛṣṇa. “After many births the man of wisdom seeks refuge in Me, knowing that Vāsudeva is all.” When a person comes to full knowledge after many births, he surrenders unto Lord Kṛṣṇa. 

If one approaches the Godhead by the method mentioned in this verse, he has to control the senses, render service to everyone and engage in the welfare of all beings. 

It is inferred that one has to approach Lord Kṛṣṇa, otherwise there is no perfect realization. Often there is much penance involved before one fully surrenders unto Him.

In order to perceive the Supersoul within the individual soul, one has to cease the sensual activities of seeing, hearing, tasting, working, etc. Then one comes to understand that the Supreme Soul is present everywhere. 

Realizing this, one envies no living entity – he sees no difference between man and animal because he sees soul only, not the outer covering. But for the common man, this method of impersonal realization is very difficult.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/Aug/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 449: 12వ అధ్.,  శ్లో 05 /  Bhagavad-Gita - 449: Chap. 12, Ver. 05

Image may contain: 1 person
🌹. శ్రీమద్భగవద్గీత - 449  / Bhagavad-Gita - 449 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -05 🌴

05. క్లేశో(ధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దు:ఖం దేహవద్భిరవాప్యతే ||

🌷. తాత్పర్యం : 
పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్త్వము నందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి యనునది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడును కష్టతరమే. 

🌷. భాష్యము  : 
పరమపురుషుని అచింత్య, అవ్యక్త, నిరాకారతత్త్వమార్గము ననుసరించు ఆధ్యాత్మికవాదుల సమూహము జ్ఞానయోగులని పిలువబడుచుండ, పూర్ణ కృష్ణభక్తిభావనలో ఆ దేవదేవుని భక్తియుతసేవ యందు నియుక్తులైన ఆధ్యాత్మికులు భక్తియోగులని పిలువబడుదురు. 

ఈ జ్ఞానయోగము, భక్తియోగము నడుమ గల భేదము ఇచ్చట చక్కగా విశదీకరింపబడినది. అంత్యమున మనుజుని ఒకే లక్ష్యమునకు గొనివచ్చునదైనను జ్ఞానయోగవిధానము మిక్కిలి క్లేశకరము. 

కాని శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షసేవా మార్గమైనందున భక్తియోగము అత్యంత సులభమైనదే గాక జీవాత్మకు సహజధర్మమై యున్నది. జీవుడు అనంతకాలముగా బద్ధుడై యున్నాడు. తాను దేహమును కానని సిద్ధాంతపూర్వకముగా అవగాహన చేసికొనుట అతనికి అత్యంత కరినమైన విషయము. 

కనుక భక్తియోగియైనవాడు శ్రీకృష్ణుని శ్రీవిగ్రహమును పూజనీయమైనదిగా స్వీకరించును. మనస్సులో కొద్దిపాటి దేహభావన స్థిరమై యుండుటచే అందులకు కారణము. దానిని ఆ విధముగా అతడు అర్చనమునందు నియోగించును. అయినను దేవదేవుని రూపమునకు మందిరమునందు చేయబడు పూజ విగ్రహారాధానము కాదు. 

అర్చనము సగుణము (గుణసహితము) మరియు నిర్గుణము(గుణరహితము) అను రెండు విధములుగా నుండునని వేదవాజ్మయము నుండి నిదర్శనము లభించుచున్నది. భగవానుని రూపము భౌతికగుణములతో రూపొందియుండుటచే మందిరమునందలి శ్రీవిగ్రహారాధానము సగుణమని తెలియబడును. 

భగవానుని రూపము ఆ విధముగా భౌతికములైన రాయి, దారువు లేదా తైలవర్ణపటములతో సూచింపబడినను అదెన్నడును నిజమునకు భౌతికము కాదు. అదియే దేవదేవుని పూర్ణస్వభావమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 449 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 04 🌴

05. kleśo ’dhika-taras teṣām
avyaktāsakta-cetasām
avyaktā hi gatir duḥkhaṁ
dehavadbhir avāpyate

🌷 Translation : 
For those whose minds are attached to the unmanifested, impersonal feature of the Supreme, advancement is very troublesome. To make progress in that discipline is always difficult for those who are embodied.

🌹 Purport :
The group of transcendentalists who follow the path of the inconceivable, unmanifested, impersonal feature of the Supreme Lord are called jñāna-yogīs, and persons who are in full Kṛṣṇa consciousness, engaged in devotional service to the Lord, are called bhakti-yogīs. 

Now, here the difference between jñāna-yoga and bhakti-yoga is definitely expressed. 

The process of jñāna-yoga, although ultimately bringing one to the same goal, is very troublesome, whereas the path of bhakti-yoga, the process of being in direct service to the Supreme Personality of Godhead, is easier and is natural for the embodied soul. 

The individual soul is embodied since time immemorial. It is very difficult for him to simply theoretically understand that he is not the body. 

Therefore, the bhakti-yogī accepts the Deity of Kṛṣṇa as worshipable because there is some bodily conception fixed in the mind, which can thus be applied. Of course, worship of the Supreme Personality of Godhead in His form within the temple is not idol worship. 

There is evidence in the Vedic literature that worship may be saguṇa or nirguṇa – of the Supreme possessing or not possessing attributes. 

Worship of the Deity in the temple is saguṇa worship, for the Lord is represented by material qualities. But the form of the Lord, though represented by material qualities such as stone, wood or oil paint, is not actually material. That is the absolute nature of the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 05/Aug/2020

---------------------------------------- x ----------------------------------------

No photo description available.
🌹. శ్రీమద్భగవద్గీత - 450  / Bhagavad-Gita - 450 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -06, 07 🌴

06. యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పతా: |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్తే  ఉపాసతే ||

07. తేషామహం సముద్ధ ర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి న చిరాత్పార్థ మయ్యావేశిచేతసామ్ ||

🌷. తాత్పర్యం : 
కాని ఓ పార్థా! సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింతలేక నాకు భక్తులై, మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు, నా భక్తియుత సేవలో నన్ను అర్చించెడివారిని శీఘ్రమే జనన, మరణమను సంసారసాగరము నుండి ఉద్ధరింతును.

🌷. భాష్యము  : 
పరమభాగ్యుశాలురైన భక్తులు శ్రీకృష్ణభగవానునిచే అతిశీఘ్రముగా భవసాగరము నుండి తరింపజేయబడుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.

 భగవానుడు అత్యంత ఘనుడని మరియు జీవుడు అతనికి సేవకుదనియు తెలిసికొనగలిగే జ్ఞానమునకు శుద్ధభక్తియోగమున మనుజుడు అరుదెంచును. శ్రీకృష్ణభగవానునికి సేవను గూర్చుటయే జీవుని నిజధర్మము. అతడట్లు చేయనిచో మాయను సేవింపవలసివచ్చును.

పూర్వము తెలుపబడినట్లు భక్తియోగము చేతనే శ్రీకృష్ణభగవానుఇ సంపూర్ణతత్త్వము అవగతము కాగలదు. కనుక ప్రతియొక్కరు పూర్ణముగా భక్తియుతులు కావలెను. కృష్ణుని పొందు నిమిత్తమై అతని యందే మనస్సును పూర్ణముగా లగ్నము చేయవలెను.

 కృష్ణుని కొరకే కర్మనొనరింపవలెను. కర్మయేదైనను సరియే దానిని కేవలము కృష్ణుని కొరకే ఒనరింపవలెను. భక్తియోగము ప్రమాణమదియే. దేవదేవుని సంతృప్తిపరచుటకన్నను అన్యమైనదేదియును భక్తుడు సాధింపగోరడు.

 శ్రీకృష్ణుని ప్రియమును గూర్చుటయే తన జీవితకార్యముగా భావించెడి అతడు ఆ భగవానుని సంతృప్తికొరకు కురుక్షేత్ర రణరంగమునందలి అర్జునుని వలె దేనినైనను త్యాగము చేయగలడు. అట్టి ఈ భక్తియోగము యొక్క పద్ధతి అత్యంత సులభమైనది. 

మనుజుడు తన కార్యములను ఒనరించును, అదే సమయమున హరే కృష్ణ హర కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రము జపించవలెను. 

అట్టి మహామంత్రోచ్చారణము అతనిని దేవదేవుడైన శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షితుని చేయును.

ఆ విధముగా నియుక్తుడైన శుద్ధభక్తుని శీఘ్రమే భవసాగరము నుండి ఉద్ధరింతునని శ్రీకృష్ణుడు ఇచ్చట ప్రతిజ్ఞ చేయుచున్నాడు.

🌹 Bhagavad-Gita as It is - 450 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 06, 07 🌴

06. ye tu sarvāṇi karmāṇi
mayi sannyasya mat-parāḥ
ananyenaiva yogena
māṁ dhyāyanta upāsate

07. teṣām ahaṁ samuddhartā
mṛtyu-saṁsāra-sāgarāt
bhavāmi na cirāt pārtha
mayy āveśita-cetasām

🌷 Translation : 
But those who worship Me, giving up all their activities unto Me and being devoted to Me without deviation, engaged in devotional service and always meditating upon Me, having fixed their minds upon Me, O son of Pṛthā – for them I am the swift deliverer from the ocean of birth and death.

🌹 Purport :
It is explicitly stated here that the devotees are very fortunate to be delivered very soon from material existence by the Lord. 

In pure devotional service one comes to the realization that God is great and that the individual soul is subordinate to Him. His duty is to render service to the Lord – and if he does not, then he will render service to māyā.

As stated before, the Supreme Lord can be appreciated only by devotional service. Therefore, one should be fully devoted. One should fix his mind fully on Kṛṣṇa in order to achieve Him. 

One should work only for Kṛṣṇa. It does not matter in what kind of work one engages, but that work should be done only for Kṛṣṇa. That is the standard of devotional service. 

The devotee does not desire any achievement other than pleasing the Supreme Personality of Godhead. His life’s mission is to please Kṛṣṇa, and he can sacrifice everything for Kṛṣṇa’s satisfaction, just as Arjuna did in the Battle of Kurukṣetra. 

The process is very simple: one can devote himself in his occupation and engage at the same time in chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. 

Such transcendental chanting attracts the devotee to the Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

06/Aug/2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 451: 12వ అధ్.,  శ్లో 08 /  Bhagavad-Gita - 451: Chap. 12, Ver. 08

Image may contain: 1 person, standing
🌹. శ్రీమద్భగవద్గీత - 451 / Bhagavad-Gita - 451 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -08 🌴

08. మయ్యేమ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయ: ||

🌷. తాత్పర్యం : 
దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు.

🌷. భాష్యము : 
: శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడైనవాడు ఆ భగవానునితో ప్రత్యక్ష సంబధమున జీవించును. 

తత్కారణముగా తొలినుండియే అతని స్థితి ఆధ్యాత్మికమై యుండుననుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవమునకు భక్తుడెన్నడును భౌతికపరధిలో జీవింపడు. అతడు సదా కృష్ణుని యందే నిలిచియుండును.
కృష్ణనామమునకు మరియు కృష్ణునకు భేదములేదు కనుక భక్తుడు కృష్ణుని నామమును ఉచ్చరించినంతనే కృష్ణుడు మరియు అతని అంతరంగశక్తి భక్తుని నాలుకపై నాట్యము చేయుదురు. భక్తుడు వివిధ పదార్థములను నైవేద్యముగా అర్పించినపుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా వాటిని స్వీకరించును. పిదప భక్తుడు ఆ ప్రసాదమును గొని కృష్ణభావనలో తన్మయుడగును. 

భగవద్గీత యందు మరియు ఇతర వేదవాజ్మయమునందు ఈ పద్ధతి వివరింపబడియున్నను ఇట్టి భక్తియుత సేవాకార్యమున నియుక్తుడు కానివాడు అదియెట్లు సంభవమనెడి విషయమును అవగతము చేసికొనజాలడు.

🌹 Bhagavad-Gita as It is - 451 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 08 🌴

08. mayy eva mana ādhatsva
mayi buddhiṁ niveśaya
nivasiṣyasi mayy eva
ata ūrdhvaṁ na saṁśayaḥ

🌷 Translation : 
Just fix your mind upon Me, the Supreme Personality of Godhead, and engage all your intelligence in Me. Thus you will live in Me always, without a doubt.

🌹 Purport :
One who is engaged in Lord Kṛṣṇa’s devotional service lives in a direct relationship with the Supreme Lord, so there is no doubt that his position is transcendental from the very beginning. A devotee does not live on the material plane – he lives in Kṛṣṇa. 
The holy name of the Lord and the Lord are nondifferent; therefore when a devotee chants Hare Kṛṣṇa, Kṛṣṇa and His internal potency are dancing on the tongue of the devotee. 

When he offers Kṛṣṇa food, Kṛṣṇa directly accepts these eatables, and the devotee becomes Kṛṣṇa-ized by eating the remnants. 

One who does not engage in such service cannot understand how this is so, although this is a process recommended in the Bhagavad-gītā and in other Vedic literatures.
🌹 🌹 🌹 🌹 🌹

07/Aug/2020

---------------------------------------- x ----------------------------------------

🌹. శ్రీమద్భగవద్గీత - 452 / Bhagavad-Gita - 452 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -09 🌴

09. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||

🌷. తాత్పర్యం : 
ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధిచేసికొనుము.

🌷. భాష్యము : 
ఈ శ్లోకమున రెండు విధములైన భక్తియోగావిదానములు తెలుపబడినవి. అందు మొదటిది దివ్యప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురాగమును వాస్తవముగా వృద్దిచేసికొనినవారికి సంబంధించినది. 

దివ్యప్రేమ ద్వారా పరమపురుషుని యెడ అనురాగమును పెంపొందించుకొనినవారికి రెండవ పధ్ధతి పేర్కొనబడినది. ఈ రెండవ తరగతికి పలు విధివిధానములు నిర్దేశింపబదియున్నవి. శ్రీకృష్ణుని యెడ అనురాగాము కలిగిన స్థితికి మనుజుడు అంత్యమున ఉద్ధరింపబడుటకు వాటిని అనుసరింపవచ్చును.

భక్తియోగమనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము. ప్రస్తుతము భౌతికస్థితిలో ఇంద్రియములు భోగతరములై యున్నందున అపవిత్రములై యుండును. కాని భక్తియోగాభ్యాసముచే ఇంద్రియములు పవిత్రములు కాగలవు. 

పవిత్రస్థితిలో అవి శ్రీకృష్ణభగవానునితో ప్రత్యక్ష సంబంధమునకు రాగలవు. ఈ జగమున నేను ఒక యజమాని సేవలో నిలిచినప్పుడు, నిజముగా ప్రేమతో అతనిని సేవింపను. కేవలము కొంత ధనమును పొందుటకే సేవను గూర్తును. 

అదేవిధముగా యజమాని సైతము ప్రేమను కలిగియుండడు. నా నుండి సేవను గ్రహించి, నాకు ధనమొసగుచుండును. కనుక ఇచ్చట ప్రేమ అనెడి ప్రశ్నయే ఉదయింపదు. కాని ఆధ్యాత్మికజీవితమున శుద్ధమగు ప్రేమస్థాయికి ప్రతియొక్కరు ఎదుగవలసినదే. 

ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడెడి భక్తియోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమస్థాయి ప్రాప్తించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 452 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 09 🌴

09. atha cittaṁ samādhātuṁ
na śaknoṣi mayi sthiram
abhyāsa-yogena tato
mām icchāptuṁ dhanañ-jaya

🌷 Translation : 
My dear Arjuna, O winner of wealth, if you cannot fix your mind upon Me without deviation, then follow the regulative principles of bhakti-yoga. In this way develop a desire to attain Me.

🌹 Purport :
In this verse, two different processes of bhakti-yoga are indicated. 

The first applies to one who has actually developed an attachment for Kṛṣṇa, the Supreme Personality of Godhead, by transcendental love. And the other is for one who has not developed an attachment for the Supreme Person by transcendental love. 

For this second class there are different prescribed rules and regulations one can follow to be ultimately elevated to the stage of attachment to Kṛṣṇa.

Bhakti-yoga is the purification of the senses. At the present moment in material existence the senses are always impure, being engaged in sense gratification. 

But by the practice of bhakti-yoga these senses can become purified, and in the purified state they come directly in contact with the Supreme Lord. 

In this material existence, I may be engaged in some service to some master, but I don’t really lovingly serve my master. I simply serve to get some money. And the master also is not in love; he takes service from me and pays me. 

So there is no question of love. But for spiritual life, one must be elevated to the pure stage of love. That stage of love can be achieved by practice of devotional service, performed with the present senses.

This love of God is now in a dormant state in everyone’s heart. And, there, love of God is manifested in different ways, but it is contaminated by material association. 

Now the heart has to be purified of the material association, and that dormant, natural love for Kṛṣṇa has to be revived. That is the whole process.
🌹 🌹 🌹 🌹 🌹

08.Aug.2020

---------------------------------------- x ----------------------------------------

శ్రీమద్భగవద్గీత - 453: 12వ అధ్.,  శ్లో 10 /  Bhagavad-Gita - 453: Chap. 12, Ver. 10

🌹. శ్రీమద్భగవద్గీత - 453 / Bhagavad-Gita - 453 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -10 🌴

10. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||

🌷. తాత్పర్యం : 
భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మచేయుట ద్వారా నీవు పూర్ణశక్తిని పొందగలవు.

🌷. భాష్యము :
భక్తియోగమునందలి నియమములను సైతము విధిగా గురువు నిర్దేశమునందు పాటింపలేనివాడు భగవానుని కొరకు కర్మ చేయట ద్వారా ఈ పూర్ణత్వస్థితిని చేరగలడు. ఆ కర్మను ఏ విధముగా నొనరింపవలెనో ఏకాదశాధ్యాయపు ఏబదిఐదవ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అనగా మనుజుడు కృష్ణచైతన్య ప్రచారోద్యమము సాగించు భక్తులకు సహాయము చేయవచ్చును. 

భక్తియోగనియమములను ప్రత్యక్షముగా అభ్యసింపలేకపోయినను మనుజుడు ఇట్టి ప్రచారకార్యక్రమమునకు సహాయము నందింపవచ్చును. లోకములో ప్రతికార్యక్రమమునకు కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమ లనునని అవసరములు. 

ఏదేని వ్యాపారమునకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దానిని నడుపుటకు వ్యవస్థ అవసరమైనట్లే, కృష్ణుని సేవకొరకు కూడా ఇవన్నియు అవసరములై యున్నవి. కాని ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతికస్థితిలో కర్మ స్వీయప్రీతికై ఒనరింపబడగా, రెండవదానిలో అది కృష్ణుని ప్రీత్యర్థమై ఒనరింపబడును. అట్లు కృష్ణప్రీత్యర్థమై ఒనరింపబడునదే ఆధ్యాత్మిక కర్మము. 

ఎవరైనను ధనమును అధికముగా కలిగియున్నచో కృష్ణభక్తుని ప్రచారము చేయుటకు కార్యాలయముగాని, మందిరమునుగాని నిర్మింపవచ్చును లేదా కృష్ణసంబంధవిజ్ఞానము ముద్రించుటలో తోడ్పడవచ్చును. ఈ విధమైన కృష్ణపరకర్మలు పలుగలవు. మనుజుడు అట్టి కర్మల యందు అనురక్తుడు కావలెను. 

ఒకవేళ మనుజుడు తన కర్మల ఫలముగా లభించినదానిని సంపూర్ణముగా త్యాగము చేయలేకున్నచో దాని యందు కొంతశాతమునైనను కృష్ణభక్తి ప్రచారమునకై దానము చేయవచ్చును. 

ఈ విధముగా కృష్ణచైతన్యోద్యమ ప్రచారము స్వచ్ఛందముగా చేయబడు సేవ మనుజుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ప్రేమస్థాయికి గొనిపోవును. అంతట అతడు పరిపూర్ణుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 453 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 10 🌴

10. abhyāse ’py asamartho ’si
mat-karma-paramo bhava
mad-artham api karmāṇi
kurvan siddhim avāpsyasi

🌷 Translation : 
If you cannot practice the regulations of bhakti-yoga, then just try to work for Me, because by working for Me you will come to the perfect stage.

🌹 Purport :
One who is not able even to practice the regulative principles of bhakti-yoga, under the guidance of a spiritual master, can still be drawn to this perfectional stage by working for the Supreme Lord. How to do this work has already been explained in the fifty-fifth verse of the Eleventh Chapter. 

One should be sympathetic to the propagation of Kṛṣṇa consciousness. There are many devotees who are engaged in the propagation of Kṛṣṇa consciousness, and they require help. 

So, even if one cannot directly practice the regulative principles of bhakti-yoga, he can try to help such work. Every endeavor requires land, capital, organization and labor. 

Just as in business one requires a place to stay, some capital to use, some labor and some organization to expand, so the same is required in the service of Kṛṣṇa. The only difference is that in materialism one works for sense gratification. 

The same work, however, can be performed for the satisfaction of Kṛṣṇa, and that is spiritual activity. If one has sufficient money, he can help in building an office or temple for propagating Kṛṣṇa consciousness. Or he can help with publications. 

There are various fields of activity, and one should be interested in such activities. If one cannot sacrifice the results of his activities, the same person can still sacrifice some percentage to propagate Kṛṣṇa consciousness. 

This voluntary service to the cause of Kṛṣṇa consciousness will help one to rise to a higher state of love for God, whereupon one becomes perfect.
🌹 🌹 🌹 🌹 🌹

09.Aug.2020

---------------------------------------- x ----------------------------------------

🌹. శ్రీమద్భగవద్గీత - 454 / Bhagavad-Gita - 454 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -11 🌴

11. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత: |
సర్వకర్మఫలత్యాగం తత: కురు యతాత్మవాన్ ||

🌷. తాత్పర్యం : 
అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో త్యాగము చేసి ఆత్మస్థితుడవగుట యత్నింపుము.

🌷. భాష్యము :
సాంఘిక, కుటుంబ, ధర్మపరిస్థితుల రీత్యా లేదా ఇతర ఆటంకముల కారణముగా మనుజుడు కృష్ణచైతన్య ప్రచారోద్యమ కార్యక్రమములందు సహాయానుభూతిని చూప సమర్థుడు కాకపోవచ్చును. అట్టి కార్యక్రమములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబసభ్యుల నుండి నిషేధములు లేదా ఇతర కష్టములు సంప్రాప్తింపవచ్చును. 

అటువంటి కష్టము కలిగినవాడు తన కర్మల ద్వారా ప్రోగైన ధనమును ఏదేని ఓక మంచి కార్యమునకై ఉపయోగించవచ్చునని ఉపదేశింపబడినది. అట్టి విధానములు వేదములందు వివరింపబడినవి.

వివిధములైన యజ్ఞములు మరియు విశేష పుణ్యకార్యములు (పూర్వకర్మఫలములను వినియోగించుటకు వీలు కలిగించెడి కొన్ని ముఖ్యకర్మలు) వాని యందు పెక్కుగలవు. 

ఆ విధముగా మనుజుడు క్రమముగా జ్ఞానస్థాయికి ఉద్ధరింపగలడు. కృష్ణపరకర్మల యందు అభిరుచి లేనివాడు సైతము కొన్నిమార్లు వైద్యశాలకో లేదా సాంఘికసంస్థకో తన కష్టార్జితమును దానము చేయుటను మనము గాంచుచుందుము. 

ఇట్టి దానము కూడ ఇచ్చట సమర్థింపబడినది. ఏలయన తన కర్మఫలములను త్యాగము చేయుటను అభ్యసించుట ద్వారా మనుజుడు క్రమముగా మనస్సును పవిత్రమొనర్చుకొనగలడు. 

అట్టి మనోపవిత్రత కలిగిన స్థితిలో అతడు కృషభక్తిరసభావనను అవగాహన చేసికొనుటకు సమర్థుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 454 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 11 🌴

11. athaitad apy aśakto ’si
kartuṁ mad-yogam āśritaḥ
sarva-karma-phala-tyāgaṁ
tataḥ kuru yatātmavān

🌷 Translation : 
If, however, you are unable to work in this consciousness of Me, then try to act giving up all results of your work and try to be self-situated.

🌹 Purport :
It may be that one is unable even to sympathize with the activities of Kṛṣṇa consciousness because of social, familial or religious considerations or because of some other impediments. 

If one attaches himself directly to the activities of Kṛṣṇa consciousness, there may be objections from family members, or so many other difficulties. 

For one who has such a problem, it is advised that he sacrifice the accumulated result of his activities to some good cause. Such procedures are described in the Vedic rules. There are many descriptions of sacrifices and special functions for the full-moon day, and there is special work in which the result of one’s previous action may be applied. 

Thus one may gradually become elevated to the state of knowledge. It is also found that when one who is not even interested in the activities of Kṛṣṇa consciousness gives charity to some hospital or some other social institution, he gives up the hard-earned results of his activities. 

That is also recommended here because by the practice of giving up the fruits of one’s activities one is sure to purify his mind gradually, and in that purified stage of mind one becomes able to understand Kṛṣṇa consciousness. 

Of course, Kṛṣṇa consciousness is not dependent on any other experience, because Kṛṣṇa consciousness itself can purify one’s mind, but if there are impediments to accepting Kṛṣṇa consciousness, one may try to give up the results of his actions. 

In that respect, social service, community service, national service, sacrifice for one’s country, etc., may be accepted so that some day one may come to the stage of pure devotional service to the Supreme Lord. 

In Bhagavad-gītā (18.46) we find it is stated, yataḥ pravṛttir bhūtānām: if one decides to sacrifice for the supreme cause, even if he does not know that the supreme cause is Kṛṣṇa, he will come gradually to understand that Kṛṣṇa is the supreme cause by the sacrificial method.
🌹 🌹 🌹 🌹 🌹

10.Aug.2020

---------------------------------------- x ----------------------------------------

🌹. శ్రీమద్భగవద్గీత - 455 / Bhagavad-Gita - 455 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -12 🌴

12. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్జ్ఞానద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మఫల త్యాగాస్త్యాగాచ్చా న్తిరనన్తరమ్ ||

🌷. తాత్పర్యం : 
ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞానసముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికిని జ్ఞానముకన్నను ధ్యానము మేలైనది. కాని త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనది.

🌷. భాష్యము :
కడచిన శ్లోకములందు తెలుపబడినట్లు భక్తియుతసేవ రెండువిధములు. 

విధిపూర్వక నియమములు కలిగిన మార్గము ఒకటి కాగా, దేవదేవుని యెడ పూర్ణానురాగము కలిగిన మార్గము వేరొకటి. కృష్ణభక్తిభావన యందలి విధినియమములను వాస్తవముగా పాటింపజాలనివారు జ్ఞానసముపార్జన చేయుట ఉత్తమము. 

ఏలయన అట్టి జ్ఞానసముపార్జన ద్వారా మనుజుడు తన నిజస్థితిని అవగాహన చేసికొనగలడు. అట్టి జ్ఞానమును క్రమముగా ధ్యానముగా వృద్ధినొందగలదు. ధ్యానము ద్వారా మనుజుడు క్రమానుగతిని భగవానుని అవగతము చేసికొనగలుగును. 

ఆత్మయే బ్రహ్మమును ఎరుకను కలిగించు కొన్ని విధానములు కలవు. భక్తియుక్తసేవలో నియుక్తుడగుటకు సమర్థుడు కానివానికి అటువంటి ధ్యానము ఉత్తమమైనది. 

ఒకవేళ మనుజుడు ఆ విధముగా ధ్యానము చేయలేనిచో వేదములందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు విధింపబడిన విధ్యుక్తధర్మములను పాటింపవచ్చును. అట్టి వివిధవర్ణముల ధర్మములు భగవద్గీత యందలి అష్టాదశాధ్యాయమున వివరింపబడినవి. 

కాని ఈ అన్నిమార్గములందును మనుజుడు తన కర్మఫలమును త్యాగము చేయవలసియున్నది. అనగా కర్మఫలమును ఏదియోనొక మంచి ప్రయోజనముకై వినియోగింపవలసియుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 455 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 12 🌴

12. śreyo hi jñānam abhyāsāj
jñānād dhyānaṁ viśiṣyate
dhyānāt karma-phala-tyāgas
tyāgāc chāntir anantaram

🌷 Translation : 
If you cannot take to this practice, then engage yourself in the cultivation of knowledge. Better than knowledge, however, is meditation, and better than meditation is renunciation of the fruits of action, for by such renunciation one can attain peace of mind.

🌹 Purport :
If you cannot take to this practice, then engage yourself in the cultivation of knowledge. Better than knowledge, however, is meditation, and better than meditation is renunciation of the fruits of action, for by such renunciation one can attain peace of mind.

As mentioned in the previous verses, there are two kinds of devotional service: the way of regulative principles and the way of full attachment in love to the Supreme Personality of Godhead. 

For those who are actually not able to follow the principles of Kṛṣṇa consciousness it is better to cultivate knowledge, because by knowledge one can be able to understand his real position. 

Gradually knowledge will develop to the point of meditation. By meditation one can be able to understand the Supreme Personality of Godhead by a gradual process. 

In the cultivation of knowledge there are processes which make one understand that one himself is the Supreme, and that sort of meditation is preferred if one is unable to engage in devotional service. 

If one is not able to meditate in such a way, then there are prescribed duties, as enjoined in the Vedic literature, for the brāhmaṇas, kṣatriyas, vaiśyas and śūdras, which we shall find in the last chapter of Bhagavad-gītā. 

But in all cases, one should give up the result or fruits of labor; this means to employ the result of karma for some good cause.

In summary, to reach the Supreme Personality of Godhead, the highest goal, there are two processes: one process is by gradual development, and the other process is direct. 
🌹 🌹 🌹 🌹 🌹

11.Aug.2020

---------------------------------------- x ----------------------------------------

🌹. శ్రీమద్భగవద్గీత - 456  / Bhagavad-Gita - 456 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -13, 14 🌴

13. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకార: సమదుఃఖసుఖ: క్షమీ ||

14. సంతుష్ట: సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయ: |
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్త: స మే ప్రియ: ||

🌷. తాత్పర్యం : 
ద్వేషమనునది లేకుండ సర్వజీవుల యెడ మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైనవాడును, ఆత్మనిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు.

🌷. భాష్యము  :
విశుద్ధ భక్తియుత విషయమునకే మరల అరుదెంచి శ్రీకృష్ణభగవానుడు శుద్దభక్తుని దివ్యలక్షణములను ఈ రెండు శ్లోకములందు వివరించుచున్నాడు. 

శుద్ధభక్తుడు ఎటువంటి పరిస్థితి యందును ఎన్నడు కలతనొందడు. అతడు ఎవ్వరిని ద్వేషింపడు. అలాగుననే శత్రువుకు శత్రువు కావలెననియు అతడు తలపడు. పైగా అతడు “నా పూర్వపాపకర్మల కారణముగా ఇతడు నా యెడ శత్రువుగా వర్తించుచున్నాడు. 

కావున ఎదిరించుట కన్నను అనుభవించుటయే మేలు” అని తలపోయును. ఈ విషయమే “తత్తే(నుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం” అను శ్లోకము ద్వారా శ్రీమద్భాగవతమున (10.14.8) తెలుపబడినది. 

అనగా భక్తుడు కలతకు గురియైనప్పుడు లేదా కష్టము సంప్రాప్తించినప్పుడు దానిని తనపై భగవానుడు చూపు కరుణగా భావించును. “నా పూర్వపాపము వలన ఇప్పుడు అనుభవించు కష్టము కన్నను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవించవలసియున్నది. 

కాని ఆ భగవానుని కరుణ చేతనే నేను పొందవలసిన శిక్షనంతటిని పొందక, ఆ శిక్షలో కొద్దిభాగమును మాత్రమే నేను పొందుచున్నాను” అని ఆ భక్తుడు తలపోయును. కనుకనే పలు కష్టపరిస్థితుల యందైనను భక్తుడు సదా శాంతుడును, కలతనొందనివాడును, ఓర్పు కలిగినవాడును అయి యుండును. అట్టి భక్తుడు తన శత్రువుతో సహా ప్రతివారి యెడను సదా కరుణను కలిగియుండును. 

“నిర్మమ” అనగా భక్తుడు దేహమునకు సంబంధించిన బాధలకు, కష్టములకు ఎక్కువ ప్రాధాన్యము నొసగడని భావము. తాను భౌతికశరీరామును కాననెడి విషయమును అతడు సంపూర్ణముగా ఎరిగియుండుటాయ్ అందులకు కారణము. దేహాత్మభావనము లేని కారణమున అతడు మిథ్యాహంకారమునకు దూరుడై సుఖదుఃఖములందు సదా సమభావమును కలిగియుండును. 

అతడు క్షమాగుణమును కలిగి, భగవత్కరుణచే ఏది ప్రాప్తించినచో దానితో సంతుష్టుడై యుండును. కష్టసాధ్యమైనదానిని పొందవలెనని తీవ్రముగా యత్నింపకుండుటచే సదా అతడు ఆనందమయుడై యుండును. 

గురూపదేశములందు లగ్నమై యున్నందున అతడు సంపూర్ణయోగి యనబడును.

 ఇంద్రియములన్నియును నిగ్రహింపబడియున్నందున అతడు ధీరుడును మరియు స్థిరనిశ్చయుడును అయి యుండును. భక్తియుతసేవ యను స్థిరనిశ్చయము నుండి అతనినెవ్వరును కదల్చలేనందున ఆ భక్తుడు మిథ్యావాదములచే ప్రభావితుడు కాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 456 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 13, 14 🌴

13. adveṣṭā sarva-bhūtānāṁ
maitraḥ karuṇa eva ca
nirmamo nirahaṅkāraḥ
sama-duḥkha-sukhaḥ kṣamī

14. santuṣṭaḥ satataṁ yogī
yatātmā dṛḍha-niścayaḥ
mayy arpita-mano-buddhir
yo mad-bhaktaḥ sa me priyaḥ

🌷 Translation : 
One who is not envious but is a kind friend to all living entities, who does not think himself a proprietor and is free from false ego, who is equal in both happiness and distress, who is tolerant, always satisfied, self-controlled, and engaged in devotional service with determination, his mind and intelligence fixed on Me – such a devotee of Mine is very dear to Me.

🌹 Purport :
Coming again to the point of pure devotional service, the Lord is describing the transcendental qualifications of a pure devotee in these two verses. A pure devotee is never disturbed in any circumstances. Nor is he envious of anyone.

Nor does a devotee become his enemy’s enemy; he thinks, “This person is acting as my enemy due to my own past misdeeds. So it is better to suffer than to protest.”

 In the Śrīmad-Bhāgavatam (10.14.8) it is stated: tat te ’nukampāṁ su-samīkṣamāṇo bhuñjāna evātma-kṛtaṁ vipākam. 

Whenever a devotee is in distress or has fallen into difficulty, he thinks that it is the Lord’s mercy upon him. 
🌹 🌹 🌹 🌹 🌹

12.Aug.2020

---------------------------------------- x ----------------------------------------

🌹. శ్రీమద్భగవద్గీత - 𝟦𝟧𝟩 / 𝐵𝒽𝒶𝑔𝒶𝓋𝒶𝒹-𝒢𝒾𝓉𝒶 - 𝟦𝟧𝟩 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -15 🌴

15. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ య: |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||


🌷. తాత్పర్యం : 
ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.

🌷. భాష్యము :
భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు. 

భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించియుండును. 

వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును. 

కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును.

ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 𝐵𝒽𝒶𝑔𝒶𝓋𝒶𝒹-𝒢𝒾𝓉𝒶 𝒶𝓈 𝐼𝓉 𝒾𝓈 - 𝟦𝟧𝟩 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 15 🌴

15. yasmān nodvijate loko
lokān nodvijate ca yaḥ
harṣāmarṣa-bhayodvegair
mukto yaḥ sa ca me priyaḥ

🌷 Translation : 
He by whom no one is put into difficulty and who is not disturbed by anyone, who is equipoised in happiness and distress, fear and anxiety, is very dear to Me.

🌹 Purport :
A few of a devotee’s qualifications are further being described. No one is put into difficulty, anxiety, fearfulness or dissatisfaction by such a devotee. 

Since a devotee is kind to everyone, he does not act in such a way as to put others into anxiety. At the same time, if others try to put a devotee into anxiety, he is not disturbed. 

It is by the grace of the Lord that he is so practiced that he is not disturbed by any outward disturbance. Actually because a devotee is always engrossed in Kṛṣṇa consciousness and engaged in devotional service, such material circumstances cannot move him. 

Generally a materialistic person becomes very happy when there is something for his sense gratification and his body, but when he sees that others have something for their sense gratification and he hasn’t, he is sorry and envious. 

When he is expecting some retaliation from an enemy, he is in a state of fear, and when he cannot successfully execute something he becomes dejected. 

A devotee who is always transcendental to all these disturbances is very dear to Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

---------------------------------------- x ----------------------------------------

🌹. శ్రీమద్భగవద్గీత - 458 / 𝓑𝓱𝓪𝓰𝓪𝓿𝓪𝓭-𝓖𝓲𝓽𝓪 - 458 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -16 🌴

16. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ య: |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||

🌷. తాత్పర్యం : 
ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.

🌷. భాష్యము :
భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు. 

భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించియుండును. 

వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును. 

కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును.

ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 внαgανα∂-gιтα αѕ ιт ιѕ - 458 🌹
✍️ ѕωαмι внαктнι νє∂αηтнα ѕяι ρяαвнυρα∂α
📚 ρяαѕα∂ внαяα∂ωαנ

🌴 Chapter 12 - Devotional Service - 16 🌴

16. anapekṣaḥ śucir dakṣa
udāsīno gata-vyathaḥ
sarvārambha-parityāgī
yo mad-bhaktaḥ sa me priyaḥ

🌷 Translation : 
My devotee who is not dependent on the ordinary course of activities, who is pure, expert, without cares, free from all pains, and not striving for some result, is very dear to Me.

🌹 Purport :
Money may be offered to a devotee, but he should not struggle to acquire it. 

If automatically, by the grace of the Supreme, money comes to him, he is not agitated. Naturally a devotee takes a bath at least twice in a day and rises early in the morning for devotional service. Thus he is naturally clean both inwardly and outwardly. 

A devotee is always expert because he fully knows the essence of all activities of life and he is convinced of the authoritative scriptures. A devotee never takes the part of a particular party; therefore he is carefree. 

He is never pained, because he is free from all designations; he knows that his body is a designation, so if there are some bodily pains, he is free. The pure devotee does not endeavor for anything which is against the principles of devotional service. 

For example, constructing a big building requires great energy, and a devotee does not take to such business if it does not benefit him by advancing his devotional service. 

He may construct a temple for the Lord, and for that he may take all kinds of anxiety, but he does not construct a big house for his personal relations.
🌹 🌹 🌹 🌹 🌹

14.Aug.2020

---------------------------------------- x ----------------------------------------

🌹. శ్రీమద్భగవద్గీత - 459 / 𝘽𝙝𝙖𝙜𝙖𝙫𝙖𝙙-𝙂𝙞𝙩𝙖 - 459 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -17 🌴

17. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ య: స మే ప్రియ: ||

🌷. తాత్పర్యం : 
ఉప్పొంగుటగాని దుఃఖించుటగాని తెలియనివాడు, శోకించుటగాని వాంచించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటిని త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు.

🌷. భాష్యము :
శుద్ధభక్తుడు విషయపరములైన లాభనష్టములందు హర్షశోకములను ప్రకటింపడు. పుత్రుని గాని, శిష్యుని గాని పొందవలెననెడి ఆతురతను అతడు కలిగియుండడు. అలాగుననే వారిని పొందనందుకు చింతను సైతము కలిగియుండడు. 

తనకు మిగుల ప్రియమైనది కోల్పోయినప్పుడు అతడు శోకింపడు. అదేవిధముగా కోరినది పొందినపుడు అతడు కలతనొందడు. అట్టి భక్తుడు సర్వశుభములకు, అశుభములకు మరియు పాపకార్యములనెడి విషయములకు అతీతుడై యుండును. 

శ్రీకృష్ణుభగవానుని ప్రీత్యర్థము అన్నిరకముల కష్టములకును అతడు వెనుదీయడు. అతని భక్తినిర్వాహణలో ఏదియును అవరోధమును కాజాలదు. అట్టి భక్తుడు శ్రీకృష్ణుడు అత్యంత ప్రియతముడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 459 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 17 🌴

17. yo na hṛṣyati na dveṣṭi
na śocati na kāṅkṣati
śubhāśubha-parityāgī
bhaktimān yaḥ sa me priyaḥ

🌷 Translation : 
One who neither rejoices nor grieves, who neither laments nor desires, and who renounces both auspicious and inauspicious things – such a devotee is very dear to Me.

🌹 Purport :
A pure devotee is neither happy nor distressed over material gain and loss, nor is he very much anxious to get a son or disciple, nor is he distressed by not getting them. 

If he loses anything which is very dear to him, he does not lament. Similarly, if he does not get what he desires, he is not distressed. He is transcendental in the face of all kinds of auspicious, inauspicious and sinful activities. 

He is prepared to accept all kinds of risks for the satisfaction of the Supreme Lord. Nothing is an impediment in the discharge of his devotional service. Such a devotee is very dear to Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

15.Aug.2020

---------------------------------------- x ----------------------------------------


🌹. శ్రీమద్భగవద్గీత - 460 / 𝘉𝘩𝘢𝘨𝘢𝘷𝘢𝘥-𝘎𝘪𝘵𝘢 - 460 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -18, 19 🌴

18. సమ: శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో: |
శీతోష్ణసుఖదు:ఖేషు సమ: సఙ్గవివర్జిత: ||

19. తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్ |
అనికేత: స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నర: ||

🌷. తాత్పర్యం : 
శత్రుమిత్రుల యెడ సమభావము కలిగినవాడును, మానావమానములందు, శీతోష్ణములందు, సుఖదుఃఖములందు, నిందాస్తుతులందు సమబుద్ధి కలిగినవాడును, అసత్సంగము నుండి సదా విడివడియుండువాడును, సదా మౌనియైనవాడును, దేనిచేతనైనను సంతుష్టి నొందెడివాడును, నివాసమేదైనను లెక్క చేయనివాడును, జ్ఞానమునందు స్థితుడైనవాడును, నా భక్తియుతసేవ యందు నియుక్తుడైనట్టివాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు.

🌷. భాష్యము :
భక్తుడు సమస్త దుష్టసంగము నుండి సదా దూరుడై యుండును. ఒకప్పుడు పొగడుట, మరియొకప్పుడు నిందించుట యనునది మానవసంఘపు నైజము. కాని భక్తుడు అట్టి కృత్రిమములైన మానావమానములకు, సుఖదుఃఖములకు సదా అతీతుడై యుండును. అతడు గొప్ప సహనవంతుడై యుండును.

“హరావభక్తస్య కుతో మహద్గుణ: - అనగా భక్తుడు కానివానికి శుభలక్షణములుండజాలవు.” కనుక భక్తునిగా గుర్తింపబడగోరువాడు శుభలక్షణములను వృద్ధిపరచుకొనవలెను. కాని వాస్తవమునకు ఈ గుణములను పొందుటకు భక్తుడు బాహ్యముగా యత్నింపనవసరము లేదు.

కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిమగ్నత ఆ గుణములను వృద్ధిచేసికొనుటకు అప్రయత్నముగా అతనికి సహాయభూతమగును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 460 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 18, 19 🌴

18. samaḥ śatrau ca mitre ca
tathā mānāpamānayoḥ
śītoṣṇa-sukha-duḥkheṣu
samaḥ saṅga-vivarjitaḥ

19. tulya-nindā-stutir maunī
santuṣṭo yena kenacit
aniketaḥ sthira-matir
bhaktimān me priyo naraḥ

🌷 Translation : 
One who is equal to friends and enemies, who is equipoised in honor and dishonor, heat and cold, happiness and distress, fame and infamy, who is always free from contaminating association, always silent and satisfied with anything, who doesn’t care for any residence, who is fixed in knowledge and who is engaged in devotional service – such a person is very dear to Me.

🌹 Purport :
A devotee is always free from all bad association. Sometimes one is praised and sometimes one is defamed; that is the nature of human society. 

But a devotee is always transcendental to artificial fame and infamy, distress or happiness. He is very patient. He does not speak of anything but the topics about Kṛṣṇa; therefore he is called silent. 

Silent does not mean that one should not speak; silent means that one should not speak nonsense. One should speak only of essentials, and the most essential speech for the devotee is to speak for the sake of the Supreme Lord.

A devotee is happy in all conditions; sometimes he may get very palatable foodstuffs, sometimes not, but he is satisfied. Nor does he care for any residential facility. 

He may sometimes live underneath a tree, and he may sometimes live in a very palatial building; he is attracted to neither. He is called fixed because he is fixed in his determination and knowledge. 

We may find some repetition in the descriptions of the qualifications of a devotee, but this is just to emphasize the fact that a devotee must acquire all these qualifications. Without good qualifications, one cannot be a pure devotee. 

Harāv abhaktasya kuto mahad-guṇāḥ: one who is not a devotee has no good qualification. One who wants to be recognized as a devotee should develop the good qualifications. 

Of course he does not extraneously endeavor to acquire these qualifications, but engagement in Kṛṣṇa consciousness and devotional service automatically helps him develop them.
🌹 🌹 🌹 🌹 🌹


16.Aug.2020

---------------------------------------- x ----------------------------------------


🌹. శ్రీమద్భగవద్గీత - 461 / ᗷᕼᗩGᗩᐯᗩᗪ-GITᗩ - 461 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -20 🌴

20. యే తు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే(తీవ మే ప్రియా: ||

🌷. తాత్పర్యం : 
నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తియోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు.

🌷. భాష్యము :
ఈ అధ్యాయపు రెండవ శ్లోకము “మయ్యావేశ్య మనో యే మాం” (మనస్సును నా యందే సంలగ్నము చేసి) నుండి చివరి ఈ శోకమైన “యే తు ధర్మామృతమిదం” (ఈ నిత్యసేవాధర్మము) వరకు శ్రీకృష్ణభగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవాపద్ధతులను వివరించెను.

ఈ భక్తియుక్తసేవా కార్యములు శ్రీకృష్ణునకు అత్యంత ప్రియములై యున్నవి. వాని యందు నియుక్తుడైన మనుజుని అతడు ప్రేమతో అనుగ్రహించును. 

నిరాకారబ్రహ్మమార్గము నందు నిమగ్నుడైనవాడు ఉత్తముడా లేక పూర్ణపురుషోత్తముడగు భగవానుని ప్రత్యక్షసేవలో నియుక్తుడైనవాడు ఉత్తముడా అను ప్రశ్నను అర్జునుడు లేవదీసియుండెను. అర్జునుని అట్టి ప్రశ్నకు శ్రీకృష్ణుడు తన భక్తియుతసేవయే ఆత్మానుభవమునకు గల వివిధపద్ధతులలో అత్యంత శ్రేష్టమైనదనుటలో ఎట్టి సందేహము లేదని స్పష్టముగా సమాధానమొసగినాడు. 

అనగా సత్సంగము ద్వారా మనుజుడు శుద్ధ భక్తియోగము నెడ అభిరుచిని వృద్ధిచేసికొనుననియు, తద్ద్వారా అతడు ఆధ్యాత్మికగురువును స్వీకరించి ఆయన నుండి శ్రవణ, కీర్తనములను చేయుటను ఆరంభించి శ్రద్ధ, అనురాగము, భక్తిభావములతో భక్తియోగమందలి నియమనిబంధనలను పాటించుచు శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడు కాగలడనియు ఈ అధ్యాయమున నిర్ణయింపబడినది. 

శ్రీమద్భగవద్గీత యందలి “భక్తియోగము” అను ద్వాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 ᗷᕼᗩGᗩᐯᗩᗪ-GITᗩ AS IT IS - 461 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 20 🌴

20. ye tu dharmāmṛtam idaṁ
yathoktaṁ paryupāsate
śraddadhānā mat-paramā
bhaktās te ’tīva me priyāḥ

🌷 Translation : 
Those who follow this imperishable path of devotional service and who completely engage themselves with faith, making Me the supreme goal, are very, very dear to Me.

🌹 Purport :
In this chapter, from verse 2 through the end – from mayy āveśya mano ye mām (“fixing the mind on Me”) through ye tu dharmāmṛtam idam (“this religion of eternal engagement”) – the Supreme Lord has explained the processes of transcendental service for approaching Him. Such processes are very dear to the Lord, and He accepts a person engaged in them. 

The question of who is better – one who is engaged in the path of impersonal Brahman or one who is engaged in the personal service of the Supreme Personality of Godhead – was raised by Arjuna, and the Lord replied to him so explicitly that there is no doubt that devotional service to the Personality of Godhead is the best of all processes of spiritual realization. 

In other words, in this chapter it is decided that through good association one develops attachment for pure devotional service and thereby accepts a bona fide spiritual master and from him begins to hear and chant and observe the regulative principles of devotional service with faith, attachment and devotion and thus becomes engaged in the transcendental service of the Lord. 

This path is recommended in this chapter; therefore there is no doubt that devotional service is the only absolute path for self-realization, for the attainment of the Supreme Personality of Godhead. 

Thus end the Bhaktivedanta Purports to the Twelfth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Devotional Service.
🌹 🌹 🌹 🌹 🌹


17.Aug.2020

---------------------------------------- x ----------------------------------------



Srimad Bhagavad Gita As It Is


For chapters from 01 through 06: Refer to another page #1 

https://gita-telugu-english.blogspot.com/p/bhagavad-gita-page-1-chapter-01-06.html


For chapters from 13 through 18: Refer to another page #3

https://gita-telugu-english.blogspot.com/p/srimad-bhagavad-gita-page-2-chapter-13.html



--- x ---