శ్రీమద్భగవద్గీత - 149: 03వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 149: Chap. 03, Ver. 42

🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 149 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము  - 42 🌴

42. ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్య: పరం మన: |
మనస్తు పరా బుద్ధిర్యో బుద్ధే: పరతస్తు స: ||

🌷. తాత్పర్యం :
జడపదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు; ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము; మనస్సు కన్నను బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము.

🌷. భాష్యము :
ఇంద్రియములు కామము యొక్క కర్మలకు వివిధ ద్వారములై యున్నవి. అనగా దేహమునందు నిలిచియుండెడి కామము వివిధములైన ఇంద్రియముల ద్వారా బహిర్గతమగుచుండును. కనుక దేహము కన్నను ఇంద్రియములు శ్రేష్టములై యున్నవి. కాని కృష్ణభక్తిరసభావనము (ఉత్తమచైతన్యము) కలిగినప్పడు ఇంద్రియములు కామము బహిర్గతమగుటకు ఉపయోగింపబడవు. కృష్ణభక్తిభావన యందు ఆత్మ భగవానునితో ప్రత్యక్షసంబంధమును ఏర్పరచుకొనును గావున ఇచ్చట తెలుపబడిన దేహకర్మాది సర్వవిషయములు అంత్యమున పరమాత్మ యందే ముగియును. దేహకర్మ యనగా ఇంద్రియకర్మ గనుక ఇంద్రియములను నిరోధించుట యనగా దేహకర్మలను ఆపివేయుట యని భావము. కాని మనస్సు క్రియాశీలత కలిగియున్నందున దేహము ఎట్టి కర్మను చేయక నిశ్చలముగా నున్నను ఉన్నతమైనది బుద్ధి మరియు ఆ బుద్ధి కన్నను ఉన్నతమైనదే ఆత్మ. కనుక ఒకవేళ ఆత్మను ప్రత్యక్షముగా శ్రీకృష్ణభగవానుని సంబంధమును నిలిపినచో బుద్ధి, మనస్సు, ఇంద్రియములనునవి వాటంతట అవియే అప్రయత్నముగా భగవత్సేవలో నియుక్తములగును. ఇటువంటి విషయమే కఠోపనిషత్తునందు ఒక చోట చెప్పబడినది. దాని ప్రకారము ఇంద్రియార్థములు ఇంద్రియముల కన్నను ఉత్తమములు కాగా, మనస్సు ఇంద్రియార్థముల కన్నను ఉత్తమమై యున్నది. కావున ఒకవేళ మనస్సు భగవానుని సేవలో నిత్యము నిలిచియున్నచో ఇంద్రియములు ఇతర మార్గములందు నియుక్తమగుటకు అవకాశముండదు. ఇట్టి మానసికస్థితి పూర్వమే వివరింప బడినది. “పరమ దృష్ట్వా నివర్తతే”. అనగా మనస్సును శ్రీకృష్ణభగవానుని దివ్యమైన సేవలో నిలిపినచో అది ఇతర హీనప్రవృత్తులను కలిగియుండు అవకాశముండదు. కఠోపనుషత్తునందు ఆత్మ “మహాన్”(ఘనమైనది) అని వర్ణింపబడినది. అనగా ఇంద్రియార్థములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కన్నను ఆత్మ ఘనమైనది. కనుక ఆత్మ యొక్క నిజస్థితిని ప్రత్యక్షముగా అవగతము చేసికొనుటయే సమస్యాపరిష్కారమునకు మార్గమై యున్నది.

బుద్ధి చేత మనుజుడు ఆత్మ యొక్క నిజస్థితిని తెలిసికొని, మనస్సును సదా కృష్ణభక్తిరసభావన యందు నిలుపవలెను. అది సమస్యలన్నింటిని సంపూర్ణముగా పరిష్కరింపగలదు. ఇంద్రియార్థముల నుండి దూరముగా నుండుమని ప్రారంభదశలో నున్న సాధకునికి సాధారణముగా ఉపదేశింపబడును. కాని దానితో పాటుగా అతడు బుద్ధిచే మనస్సును దృడపరచుకొనవలెను. శ్రీకృష్ణభగవానుని యందు సంపూర్ణ శరణాగతితో మనుజుడు బుద్ధి నుపయోగించి తన మనస్సును కృష్ణభక్తిభావన యందు నిలిపినచో అతని మనస్సు అప్రయత్నముగా దృడవంతమగును. అట్టి స్థితిలో సర్పముల వలె బలమైన ఇంద్రియములకు ఆత్మ ప్రభువైనను భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని సాహచర్యమునందు అది దృడము కానిచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందు అవకాశము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 149 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 42 🌴

42. indriyāṇi parāṇy āhur
indriyebhyaḥ paraṁ manaḥ
manasas tu parā buddhir
yo buddheḥ paratas tu saḥ

🌷 Translation : 
The working senses are superior to dull matter; mind is higher than the senses; intelligence is still higher than the mind; and he [the soul] is even higher than the intelligence.

🌷 Purport :
The senses are different outlets for the activities of lust. Lust is reserved within the body, but it is given vent through the senses. Therefore, the senses are superior to the body as a whole. These outlets are not in use when there is superior consciousness, or Kṛṣṇa consciousness. In Kṛṣṇa consciousness the soul makes direct connection with the Supreme Personality of Godhead; therefore the hierarchy of bodily functions, as described here, ultimately ends in the Supreme Soul. Bodily action means the functions of the senses, and stopping the senses means stopping all bodily actions. But since the mind is active, then even though the body may be silent and at rest, the mind will act – as it does during dreaming. But above the mind is the determination of the intelligence, and above the intelligence is the soul proper.

If, therefore, the soul is directly engaged with the Supreme, naturally all other subordinates, namely, the intelligence, mind and senses, will be automatically engaged. In the Kaṭha Upaniṣad there is a similar passage, in which it is said that the objects of sense gratification are superior to the senses, and mind is superior to the sense objects. 

If, therefore, the mind is directly engaged in the service of the Lord constantly, then there is no chance that the senses will become engaged in other ways. This mental attitude has already been explained. Paraṁ dṛṣṭvā nivartate. If the mind is engaged in the transcendental service of the Lord, there is no chance of its being engaged in the lower propensities. In the Kaṭha Upaniṣad the soul has been described as mahān, the great. Therefore the soul is above all – namely, the sense objects, the senses, the mind and the intelligence. Therefore, directly understanding the constitutional position of the soul is the solution of the whole problem.

With intelligence one has to seek out the constitutional position of the soul and then engage the mind always in Kṛṣṇa consciousness. That solves the whole problem. A neophyte spiritualist is generally advised to keep aloof from the objects of the senses. But aside from that, one has to strengthen the mind by use of intelligence. If by intelligence one engages one’s mind in Kṛṣṇa consciousness, by complete surrender unto the Supreme Personality of Godhead, then, automatically, the mind becomes stronger, and even though the senses are very strong, like serpents, they will be no more effective than serpents with broken fangs. But even though the soul is the master of intelligence and mind, and the senses also, still, unless it is strengthened by association with Kṛṣṇa in Kṛṣṇa consciousness, there is every chance of falling down due to the agitated mind.
🌹 🌹 🌹 🌹 🌹