శ్రీమద్భగవద్గీత - 176: 04వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 176: Chap. 04, Ver. 14
🌹. శ్రీమద్భగవద్గీత - 176 / Bhagavad-Gita - 176 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 14 🌴
14. న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోభి జానాతి కర్మభిర్న స బధ్యతే
🌷. తాత్పర్యం :
నన్ను ఏ కర్మము ప్రభావితము చేయజాలదు; నేను యెట్టి కర్మఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు సైతము కర్మఫలములచే బంధింపబడడు.
🌻. భాష్యము :
దేశేములేనేడి రాజు తప్పుచేసెడి అవకాశములేదనియు లేదా రాజ్యాంగశాసనములకు అతడు అతీతుడై యుండుననియు పలికెడి భౌతికజగత్తుకు సంబంధించిన రాజ్యశసనములు కలవు. అదేవిధముగా భగవానుడు ఈ భౌతికజగత్తుకు సృష్టికర్తయైనప్పటికి అట్టి జగత్కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు ఈ జగమును సృష్టించి దానికి పరముగా నిలిచియుండగా, ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహించు స్వభావముతో జీవులు వివిధ కామ్యకర్మ ఫలము లందు బంధితులగుదురు.
ఉదాహరణమునకు ఒక సంస్థ యందలి పనివారి మంచి మరియు చెడుకర్మలకు వారే బాధ్యులు కాగలరుగాని సంస్థ యొక్క యజమాని కాదు. అదే విధముగా ఈ జగమునందు జీవులందరును తమ తమ ఇంద్రియభోగకర్మల యందు మగ్నులై యున్నారు. అట్టి కర్మలను భగవానుడేమియును నిర్దేశించి యుండలేదు. అయినను జీవులు భోగానుభవవృద్ధి కొరకు ఈ జగత్తు నందలి కర్మల యందు నియుక్తులై, మరణానంతరము స్వర్గలోకమును పొందవలెనని వాంచింతురు.
పూర్ణుడైనందున శ్రీకృష్ణభగవానుడు ఎన్నడును నామమాత్ర స్వర్గభోగములందు ఆకర్షణను కలిగియుండడు. వాస్తవమునాకు స్వర్గవాసులైన దేవతలందరును అతని సేవకులే. పనివారు వాంచించెడి తుచ్చ సౌఖ్యమును, ఆనందమును యజమాని ఎన్నడును కోరడు. కర్మలకు మరియు కర్మఫలములకు అతడు సర్వదా అతీతుడై యుండును. ఉదాహరణమునాకు భూమిపై ఉద్బవించు వృక్షజాలమునకు వర్షము కారణము కాకున్నను, వర్షము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 176 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 14 🌴
14. na māṁ karmāṇi limpanti na me karma-phale spṛhā
iti māṁ yo ’bhijānāti karmabhir na sa badhyate
🌷 Translation :
There is no work that affects Me; nor do I aspire for the fruits of action. One who understands this truth about Me also does not become entangled in the fruitive reactions of work.
🌹 Purport :
As there are constitutional laws in the material world stating that the king can do no wrong, or that the king is not subject to the state laws, similarly the Lord, although He is the creator of this material world, is not affected by the activities of the material world. He creates and remains aloof from the creation, whereas the living entities are entangled in the fruitive results of material activities because of their propensity for lording it over material resources. The proprietor of an establishment is not responsible for the right and wrong activities of the workers, but the workers are themselves responsible.
The living entities are engaged in their respective activities of sense gratification, and these activities are not ordained by the Lord. For advancement of sense gratification, the living entities are engaged in the work of this world, and they aspire to heavenly happiness after death. The Lord, being full in Himself, has no attraction for so-called heavenly happiness.
The heavenly demigods are only His engaged servants. The proprietor never desires the low-grade happiness such as the workers may desire. He is aloof from the material actions and reactions. For example, the rains are not responsible for different types of vegetation that appear on the earth, although without such rains there is no possibility of vegetative growth.
🌹 🌹 🌹 🌹 🌹
23 Oct 2019