శ్రీమద్భగవద్గీత - 165: 04వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 165: Chap. 04, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 165 / Bhagavad-Gita - 165🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 03 🌴


03. స ఏవాయం మయా తేద్య యోగ: ప్రోక్త: పురాతన: |
భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతుదుత్తమమ్ ||


🌷. తాత్పర్యం :

నీవు నా భక్తుడు మరియు స్నేహితుడువు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసికొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను.


🌷. భాష్యము :

భక్తులు మరియు దానప్రవృత్తిగలవారు అనుచు మానవులలో రెండు తరగతుల వారు గలరు. అర్జునుడు భక్తుడైన కారణమున అతనిచే ఈ గొప్పజ్ఞానపు గ్రహీతగా శ్రీకృష్ణభగవానుడు ఎంచుకొనెను. ఈ రహస్యశాస్త్రమును అవగతము చేసికొనుట దానవప్రవృత్తి గలవారికి సాధ్యము కాదు. ఈ దివ్యజ్ఞాన గ్రంథమునకు పలు వ్యాఖ్యానములు కలవు. ఆ వ్యాఖ్యానములలో కొంతమంది భక్తులచే రచింపబడగా, మరికొన్ని దానప్రవృత్తి గలవారిచే వ్రాయబడియున్నవి. భక్తుల వ్యాఖ్యానము సత్యమైనది కాగా, దానవప్రవృత్తి గలవారి లిఖితములు వ్యర్థములై యున్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించెను.

అర్జునుని మార్గము ననుసరించి వ్రాయబడిన ఏ గీతావ్యాఖ్యానమైనను ఈ దివ్యశాస్త్రమున కొనరింపబడు నిజమైన భక్తియుతసేవయై యున్నది. దానవప్రవృత్తిగలవారు శ్రీకృష్ణుని యథాతథముగా స్వీకరింపక, ఆ దేవదేవుని గూర్చి స్వకల్పనలు చేయుచ పాఠకులను అతని బోధల నుండి పెడత్రోవ మార్గములను గూర్చి ఇచ్చట హెచ్చరిక చేయబడుచున్నది.కనుక ప్రతియొక్కరు అర్జునుని నుండి వచ్చిన పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్భగవద్గీత యనెడి ఈ దివ్యశాస్త్రము ద్వారా లాభమును గడింపవలసియున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 165 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 03 🌴


03. sa evāyaṁ mayā te ’dya yogaḥ proktaḥ purātanaḥ
bhakto ’si me sakhā ceti rahasyaṁ hy etad uttamam


🌷 Translation :

That very ancient science of the relationship with the Supreme is today told by Me to you because you are My devotee as well as My friend and can therefore understand the transcendental mystery of this science.

🌷 Purport :

There are two classes of men, namely the devotee and the demon. The Lord selected Arjuna as the recipient of this great science owing to his being a devotee of the Lord, but for the demon it is not possible to understand this great mysterious science. There are a number of editions of this great book of knowledge. Some of them have commentaries by the devotees, and some of them have commentaries by the demons.

Commentation by the devotees is real, whereas that of the demons is useless. Arjuna accepts Śrī Kṛṣṇa as the Supreme Personality of Godhead, and any commentary on the Gītā following in the footsteps of Arjuna is real devotional service to the cause of this great science. The demonic, however, do not accept Lord Kṛṣṇa as He is. Instead they concoct something about Kṛṣṇa and mislead general readers from the path of Kṛṣṇa’s instructions. Here is a warning about such misleading paths. One should try to follow the disciplic succession from Arjuna, and thus be benefited by this great science of Śrīmad Bhagavad-gītā.

🌹 🌹 🌹 🌹 🌹


12 Oct 2019