శ్రీమద్భగవద్గీత - 172: 04వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 172: Chap. 04, Ver. 10


🌹. శ్రీమద్భగవద్గీత - 172 / Bhagavad-Gita - 172 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 10 🌴


10. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితా: |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా: ||


🌷. తాత్పర్యం :

రాగము, భయము, క్రోధము నుండి విడివాడి, నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్యప్రేమను పొందగలిగిరి.


🌻. భాష్యము :

పైన వర్ణింపబడినట్లు భౌతికభావన యందు మగ్నమైనవానికి పరతత్త్వము యొక్క రూపసహితత్వమును అవగతము చేసికొనుట అత్యంత కఠిన విషయము. దేహాత్మభావన యందే ఆసక్తమైన జనులు సాధారణముగా భౌతికతత్త్వమునందే మునిగి యున్నందున పరతత్త్వము ఏ విధముగా రూపసహితమై యున్నదో అవగతము చేసికొనజాలరు. అట్టి లౌకికులు నాశము పొందనిదియు, జ్ఞానపూర్ణమైనదనియు, ఆనంద స్వరూపమైనదనియు నైన ఆధ్యాత్మిక దేహమొకటి కలదని ఊహింపలేరు.

భౌతికభావన యందు దేహము నశించునది, అజ్ఞానపూర్ణమైనది మరియు దుఃఖభూయిష్టమైనది అయియున్నది. కనుకనే భగవానుని దేహమును గూర్చి తెలుపగనే సాధారణముగా జనసామాన్యము అదే దేహభావనను మనస్సులో అన్వయించుకొందురు. అటువంటి లౌకికులకు విశ్వరూపమే పరతత్త్వము. తత్కారణముగా వారు పరతత్త్వమును నిరాకారమని భావింతురు. అదియును గాక భౌతికభావనలో సంపూర్ణముగా మునిగియున్నందున ముక్తి పిదపయు వ్యక్తిత్వమును నిలుపుకొనుట యనెడి భావన వారికి అత్యంత భయమును కలుగజేయును. అట్టి వారికి ఆధ్యాత్మిక జీవనమనగా వ్యక్తిగతము మరియు రూప సహితమని తెలిపినపుడు తిరిగి రూపమును పొందుట మిక్కిలి జంకి నిరాకారత్వము నందు లీనమగుటనే వాంచింతురు.

కొందరు భౌతికత్వము నందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవనము నెడ అనాసక్తులు కాగా, కొందరు పరబ్రహ్మములో లీనము కాగోరుదురు. మరికొందరు విసుగుతో సర్వవిధములైన తాత్వికకల్పనల యెడ క్రోధాముపూని దేనిని కుడా విశ్వసింపరు. ఇటువంటి చివరి తెగవారు మాదకద్రవ్యములను ఆశ్రయించి, వాటి ద్వారా కలిగెడి మత్తునే కొన్నిమార్లు ఆధ్యాత్మికానుభుతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మికజీవనము నెడ భయము, విసుగు చెందిన జీవనము కలిగెడి శూన్యభావనము అనెడి మూడుస్థితుల భౌతిక ప్రపంచాసక్తిని మనుజుడు త్యజించవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 172 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 10 🌴



10. vīta-rāga-bhaya-krodhā man-mayā mām upāśritāḥ
bahavo jñāna-tapasā pūtā mad-bhāvam āgatāḥ


🌷 Translation :

Being freed from attachment, fear and anger, being fully absorbed in Me and taking refuge in Me, many, many persons in the past became purified by knowledge of Me – and thus they all attained transcendental love for Me.

🌹 Purport :

As described above, it is very difficult for a person who is too materially affected to understand the personal nature of the Supreme Absolute Truth. Generally, people who are attached to the bodily conception of life are so absorbed in materialism that it is almost impossible for them to understand how the Supreme can be a person. Such materialists cannot even imagine that there is a transcendental body which is imperishable, full of knowledge and eternally blissful. In the materialistic concept, the body is perishable, full of ignorance and completely miserable.

Therefore, people in general keep this same bodily idea in mind when they are informed of the personal form of the Lord. For such materialistic men, the form of the gigantic material manifestation is supreme. Consequently they consider the Supreme to be impersonal. And because they are too materially absorbed, the conception of retaining the personality after liberation from matter frightens them. When they are informed that spiritual life is also individual and personal, they become afraid of becoming persons again, and so they naturally prefer a kind of merging into the impersonal void.

🌹 🌹 🌹 🌹 🌹


19 Oct 2019