శ్రీమద్భగవద్గీత - 156: 03వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 156: Chap. 03, Ver. 37
🌹. శ్రీమద్భగవద్గీత - 156 / Bhagavad-Gita - 156 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 37 🌴
37. శ్రీభగవానువాచ
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవ: |
మహాశనో మాహాపాప్మా విద్ద్యేనమిహ వైరిణమ్ ||
🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను : అర్జునా! రజోగుణసంపర్కముచే ఉద్భవించి, తదుపరి క్రోధముగా పరిణమించి కామమే దానికి కారణము. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును కబళించునట్టి పాపభూయిష్ట శత్రువు.
🌷. భాష్యము :
జీవుడు భౌతికసంపర్కమును పొందినంతనే కృష్ణుని యెడ గల అతని నిత్యప్రేమ రజోగుణము వలన కామముగా మార్పుచెందును. అనగా పుల్లని చింతపండుతో కలసినంతనే పాలు పెరుగుగా మారునట్లు, భగవత్ప్రేమ భావము కామముగా మార్పు చెందుచున్నది. ఆ కామము సంతృప్తి చెందినచో శీఘ్రమే కోపముగా మార్పుచెందును. అటుపిమ్మట కోపము మోహముగా మార్పునొందును. ఆ మొహమే జీవుని భౌతికస్థితిని అనంతముగా కొనసాగించును.
అనగా కామమే జీవునకు గొప్ప శత్రువై యున్నది. అదియే పవిత్రుడైన జీవుడు భౌతికజగమున బద్దునిగా నిలుచునట్లు చేయుచున్నది. క్రోధము రజోగుణమునకు మారురూపము. ఈ గుణములు ఈ విధముగా క్రోధము మరియ తజ్జన్యములైన వానిగా ప్రకటితమగుచుండును. కనుక నిర్దేశింపబడిన జీవనవిధానము మరియు కర్మము ద్వారా రజోగుణము తమోగునముగా పతనము చెందుట బదులు సత్త్వగుణమునకు ఉద్ధరింపబడినచో మనుజుడు ఆధ్యాత్మిక సంపర్క కారణమున క్రోధము యొక్క పతనము నుండి రక్షింపబడును.
అనవతరము వృద్ధిచెందెడి తన ఆధ్యాత్మికానందము కొరకు భగవానుడు బహురూపములుగా విస్తరించెను. జీవులు అట్టి ఆధ్యాత్మికానందపు అంశలు. వారు కూడా పాక్షికమైన స్వతంత్రను కలిగియున్నారు. కాని సేవాభావము భోగవాంఛగా మారి వారి స్వాతంత్ర్యము దుర్వినియోగామైనపుడు వారు కామము యొక్క వశములోనికి వత్తురు. బద్ధజీవులు ఈ కామభావనలను సంతృప్తిపరచుకొనుట కొరకే భగవానుడు ఈ భౌతికజగత్తును సృష్టించెను. అట్టి అనంత కామభోగపు కర్మలలో పూర్తిగా విసుగుచెంది, హతాశయులైనపుడు వారు తమ నిజస్థితిని గూర్చి ప్రశ్నించుట (విచారణను) నారభించుతురు. ఒకవేళ అట్టి కామము భగత్ప్రేమగా మార్పు చెందినచో కామక్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 156 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga - 37 🌴
37. śrī-bhagavān uvāca
kāma eṣa krodha eṣa rajo-guṇa-samudbhavaḥ
mahāśano mahā-pāpmā viddhy enam iha vairiṇam
🌷 Translation :
The Supreme Personality of Godhead said: It is lust only, Arjuna, which is born of contact with the material mode of passion and later transformed into wrath, and which is the all-devouring sinful enemy of this world.
🌷 Purport :
When a living entity comes in contact with the material creation, his eternal love for Kṛṣṇa is transformed into lust, in association with the mode of passion. Or, in other words, the sense of love of God becomes transformed into lust, as milk in contact with sour tamarind is transformed into yogurt. Then again, when lust is unsatisfied, it turns into wrath; wrath is transformed into illusion, and illusion continues the material existence. Therefore, lust is the greatest enemy of the living entity, and it is lust only which induces the pure living entity to remain entangled in the material world. Wrath is the manifestation of the mode of ignorance; these modes exhibit themselves as wrath and other corollaries. If, therefore, the mode of passion, instead of being degraded into the mode of ignorance, is elevated to the mode of goodness by the prescribed method of living and acting, then one can be saved from the degradation of wrath by spiritual attachment.
The Supreme Personality of Godhead expanded Himself into many for His ever-increasing spiritual bliss, and the living entities are parts and parcels of this spiritual bliss. They also have partial independence, but by misuse of their independence, when the service attitude is transformed into the propensity for sense enjoyment, they come under the sway of lust.
This material creation is created by the Lord to give facility to the conditioned souls to fulfill these lustful propensities, and when completely baffled by prolonged lustful activities, the living entities begin to inquire about their real position. If, lust is transformed into love for the Supreme, or transformed into Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
3 Oct 2019