శ్రీమద్భగవద్గీత - 177: 04వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 177: Chap. 04, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 177 / Bhagavad-Gita - 177 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద0
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 15 🌴


15. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
పుర్వైరపి ముముక్షుభి: |
కురు కర్మైవ తస్మాత్త్వం పుర్వై:
పూర్వతరం కృతమ్ ||


🌷. తాత్పర్యం :

పూర్వకాలమున ముక్త పురుషులందరు నా దివ్యతత్త్వపు ఈ అవగాహనతోనే కర్మలను ఒనరించి యుండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మనొనరింపుము.


🌻. భాష్యము :

మానవులలో రెండు తరగతులవారు కలరు. ఒకరు హృదయమునందు మలినభావములను కలవారు కాగా, మిగిలినవారు కల్మషదూరులై యుందురు. ఈ ఇరువురికిని కృష్ణభక్తిరసభావానము సమానముగా శ్రేయోదాయకమైనదే. మలినచిత్తులు భక్తియోగము నందలి నియమితసూత్రములను అనుసరించుచు పవిత్రతను పొందుటకై కృష్ణభక్తి విధానమును స్వీకరింపవచ్చును.

విషయమాలిన్యము తొలగియున్నవారు సైతము ఈ కృష్ణభక్తిభావన యందు కొనసాగుచు, ఇతరులు తమను అనుసరించి లాభపడురీతిలో ఆదర్శముగా కర్మల నొనరింపవచ్చును. మూర్ఖజనులు లేదా భక్తి యొక్క ఆరంభదశలో నున్నవారు కొందరు తగినంత కృష్ణపరజ్ఞానము లేకుండుటచే కర్మల నుండి విరమింపగోరుదురు.

యుధరంగకర్మల నుండి విరమించవలెననెడి అర్జునుని కోరికను శ్రీకృష్ణభగవానుడు ఆమోదింపలేదు. అనగా మనుజుడు కర్మను ఏ విధముగా ఒనరించవలెనో తెలిపిన చాలును. కృష్ణపరములగు కర్మల నుండి విరమించి కృష్ణభక్తి ప్రదర్శనము కావించుచు ఒంటరిగా కూర్చుండుట యనునది కృష్ణపరమగు కర్మరంగమున నియుక్తమగుట కన్నను ముఖ్యమెన్నడును కాబోదు. కనుకనే పూర్వము తెలుపబడిన వివస్వానుడు(సూర్యదేవుడు) వంటి శ్రీకృష్ణభగవానుని శిష్యులను అనుసరించుచు కృష్ణభక్తిభావనలో వర్తింపవలసినదిగా ఇచ్చట అర్జునుడు భోధింపబడెను.

శ్రీకృష్ణభగవానుడు తన పూర్వకర్మలన్నింటిని మరియు పూర్వము కృష్ణభక్తిభావనలో వర్తించిన వారి కర్మలన్నింటిని సంపూర్ణముగా ఎరిగియుండెను. కనుకనే తన నుండి లక్షలసంవత్సరములకు పూర్వము విద్యను బడసిన సూర్యదేవుని కర్మలను అతడు అనుసరణియములని పలుకుచున్నాడు. శ్రీకృష్ణుని అట్టి శిష్యులే ఇచ్చట ముక్తపురుషులుగా పేర్కొనబడిరి. వారన్దరునుఆ దేవదేవుడు నిర్దేశించిన కార్యనిర్వాహణమందు నియుక్తులై యుందురు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 177 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 15 🌴

15. evaṁ jñātvā kṛtaṁ karma pūrvair api mumukṣubhiḥ
kuru karmaiva tasmāt tvaṁ pūrvaiḥ pūrva-taraṁ kṛtam



🌷 Translation :

All the liberated souls in ancient times acted with this understanding of My transcendental nature. Therefore you should perform your duty, following in their footsteps.

🌹 Purport :

There are two classes of men. Some of them are full of polluted material things within their hearts, and some of them are materially free. Kṛṣṇa consciousness is equally beneficial for both of these persons. Those who are full of dirty things can take to the line of Kṛṣṇa consciousness for a gradual cleansing process, following the regulative principles of devotional service.

Those who are already cleansed of the impurities may continue to act in the same Kṛṣṇa consciousness so that others may follow their exemplary activities and thereby be benefited. Foolish persons or neophytes in Kṛṣṇa consciousness often want to retire from activities without having knowledge of Kṛṣṇa consciousness. Arjuna’s desire to retire from activities on the battlefield was not approved by the Lord. One need only know how to act. To retire from the activities of Kṛṣṇa consciousness and to sit aloof making a show of Kṛṣṇa consciousness is less important than actually engaging in the field of activities for the sake of Kṛṣṇa.

Arjuna is here advised to act in Kṛṣṇa consciousness, following in the footsteps of the Lord’s previous disciples, such as the sun-god Vivasvān, as mentioned hereinbefore. The Supreme Lord knows all His past activities, as well as those of persons who acted in Kṛṣṇa consciousness in the past. Therefore He recommends the acts of the sun-god, who learned this art from the Lord some millions of years before. All such students of Lord Kṛṣṇa are mentioned here as past liberated persons, engaged in the discharge of duties allotted by Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


24 Oct 2019