శ్రీమద్భగవద్గీత - 154: 03వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 154: Chap. 03, Ver. 35


🌹. శ్రీమద్భగవద్గీత - 154 / Bhagavad-Gita - 154 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 35 🌴


35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: ||


🌷. తాత్పర్యం :
పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!


🌷. భాష్యము :
ప్రతియొక్కరు పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణభక్తిభావన యందు తమ విధ్యుక్తధర్మములను నిర్వహింపవలసియున్నది. భౌతికప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములో మనుజుని స్థితి ననుసరించి విధింపబడిన ధర్మములే విధ్యుక్తధర్మములు.


ఇక శ్రీకృష్ణుని దివ్య సేవార్థమే ఆధ్యాత్మికగురువుచే ఒసగబడిన కర్మలు ఆధ్యాత్మికకర్మలు. భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను మరణము వరకు ప్రతియొక్కరు పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విధ్యుక్తధర్మములను నిర్వహింపవలసియున్నది. ఆధ్యాత్మికస్థాయిలో ఒనరింపబడు కర్మలు మరియు భౌతికస్థాయిలో ఒనరింపబడు కర్మలు భిన్నమైనను ప్రామాణికమైన నిర్దేశమును అనుసరించుట కర్తకు సర్వదా లాభదాయకము.


గుణప్రభావము నందున్న మనుజుడు ఇతరులను అనుకరింప తన స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటింపవలెను. ఉదాహరణకు సత్వగుణము నందుండెడి బ్రాహ్మణుడు అహింసాపరుడుగా నుండును. కాని రజోగుణము నందుండెడి క్షత్రియుడు హింసాపూర్ణుడగుటకు ఆమోదయోగ్యమైనది. క్షత్రియుడైనవానికి హింసకు సంబధించిన నియమముల ననుసరించి నశించుట యనునది అహింసాపరుడైన బ్రహ్మణుని అనుకరించుట కన్నను ఉత్తమమైనది.


ప్రతియొక్కరు తమ హృదయకల్మషము క్రమవిధానము ద్వారా శుద్ధిపరచుకొనవలెనే గాని తొందరపాటుతో కాదు. అయినను గుణసంపర్కమును దాటి సంపూర్ణముగా కృష్ణభక్తిరసభావన యందు స్థితుడైన పిమ్మట మనుజుడు గురునిర్దేశములో ఎట్టి కర్మమునైనను ఒనరింప సమర్థుడగును. అట్టి సంపూర్ణ కృష్ణభక్తిభావనా స్థితి యందు క్షత్రియడు బ్రాహ్మణునిగా వర్తించవచ్చును. అలాగుననే బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించవచ్చును. అనగా అట్టి దివ్య ఆధ్యాత్మికస్థితి యందు భౌతికజగమునకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తించవు.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 154 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 3 - Karma Yoga - 35 🌴



35. śreyān sva-dharmo viguṇaḥ para-dharmāt sv-anuṣṭhitāt
sva-dharme nidhanaṁ śreyaḥ para-dharmo bhayāvahaḥ


🌷 Translation :
It is far better to discharge one’s prescribed duties, even though faultily, than another’s duties perfectly. Destruction in the course of performing one’s own duty is better than engaging in another’s duties, for to follow another’s path is dangerous.


🌷 Purport :
One should therefore discharge his prescribed duties in full Kṛṣṇa consciousness rather than those prescribed for others. Materially, prescribed duties are duties enjoined according to one’s psychophysical condition, under the spell of the modes of material nature. Spiritual duties are as ordered by the spiritual master for the transcendental service of Kṛṣṇa. But whether material or spiritual, one should stick to his prescribed duties even up to death, rather than imitate another’s prescribed duties. Duties on the spiritual platform and duties on the material platform may be different, but the principle of following the authorized direction is always good for the performer.


When one is under the spell of the modes of material nature, one should follow the prescribed rules for his particular situation and should not imitate others. For example, a brāhmaṇa, who is in the mode of goodness, is nonviolent, whereas a kṣatriya, who is in the mode of passion, is allowed to be violent. As such, for a kṣatriya it is better to be vanquished following the rules of violence than to imitate a brāhmaṇa who follows the principles of nonviolence.


Everyone has to cleanse his heart by a gradual process, not abruptly. However, when one transcends the modes of material nature and is fully situated in Kṛṣṇa consciousness, he can perform anything and everything under the direction of a bona fide spiritual master. In that complete stage of Kṛṣṇa consciousness, the kṣatriya may act as a brāhmaṇa, or a brāhmaṇa may act as a kṣatriya. In the transcendental stage, the distinctions of the material world do not apply.
🌹 🌹 🌹 🌹 🌹

1 Oct 2019