శ్రీమద్భగవద్గీత - 160: 03వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 160: Chap. 03, Ver. 41


🌹. శ్రీమద్భగవద్గీత - 160 / Bhagavad-Gita - 160 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 41 🌴



41. తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్


🌷. తాత్పర్యం :

కావున భరతవంశీయులలో శ్రేష్టుడవైన ఓ అర్జునా! ఇంద్రియనిగ్రహము ద్వారా పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి, జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి అద్దానిని నశింపజేయుము.


🌷. భాష్యము :

ఆత్మకు సంబంధించిన విజ్ఞానము మరియు ఆత్మానుభవమును పొందు వాంఛను నశింపజేయునటువంటి గొప్ప పాపశత్రువైన కామమును నశింప జేయుటకు తొలి నుండియే ఇంద్రియములను నిగ్రహింపుమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు. ఇచ్చట జ్ఞానమనగా అనాత్మకు భిన్నమైన ఆత్మజ్ఞానము. అనగా ఆత్మ దేహము కాదని తెలుపునటువంటి జ్ఞానము. ఇక విజ్ఞానమనగా ఆత్మ యొక్క నిజస్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధమును తెలుపునటువంటిది. ఈ విషయము శ్రీమద్భాగవతము (2.9.31) నందు ఇట్లు తెలుపబడినది.

జ్ఞానమ్ పరమగుహ్యమ్ మే యద్విజ్ఞాన సమన్వితమ్ |
సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా

“ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము అతిగుహ్యము మరియు గహనమై యున్నది. కాని అట్టి జ్ఞానమును మరియు అనుభూతిని వాటి వివిధ అంశములతో భగవానుడే స్వయముగా వివరించినచో అవగతము కాగలవు.”

ఆత్మను గూర్చిన అట్టి సాధారణ మరియు ప్రత్యేక జ్ఞానమును భగవద్గీత మనకు ఒసగుచున్నది. జీవులు వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుని అంశలైనందున అతనిని సేవించుటకే వారు ఉద్దేశింపబడియున్నారు. అట్టి సేవాభావనమే కృష్ణభక్తిరసభావానము. కావున జీవితము తొలినుండియే ప్రతియొక్కరు కృష్ణభక్తిభావన నలవరచుకొనుటకు యత్నించవలెను. తద్ద్వారా వారు సంపూర్ణ కృష్ణభక్తిభావితులై తదనుగుణముగా వర్తించగలరు.

ప్రతిజీవునకు సహజమైనటువంటి భగవత్ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కామము. జీవితపు ఏ స్థితి నుండైనను లేదా జీవితలక్ష్యము తెలిసిన తోడనే ప్రతియొక్కరు కృష్ణభక్తిభావన యందు (భక్తియోగము నందు) ఇంద్రియములను అదుపు చేయుట నారంభించి కామమును శ్రీకృష్ణభగవానుని ప్రేమగా మార్చవచ్చును. అట్టి కృష్ణప్రేమయే మానవజీవితము నందలి అత్యున్నత పూర్ణత్వస్థితియై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 160 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 41 🌴


41. tasmāt tvam indriyāṇy ādau niyamya bharatarṣabha
pāpmānaṁ prajahi hy enaṁ jñāna-vijñāna-nāśanam


🌷 Translation :

Therefore, O Arjuna, best of the Bhāratas, in the very beginning curb this great symbol of sin [lust] by regulating the senses, and slay this destroyer of knowledge and self-realization.


🌷 Purport :

The Lord advised Arjuna to regulate the senses from the very beginning so that he could curb the greatest sinful enemy, lust, which destroys the urge for self-realization and specific knowledge of the self. Jñāna refers to knowledge of self as distinguished from non-self, or in other words, knowledge that the spirit soul is not the body. Vijñāna refers to specific knowledge of the spirit soul’s constitutional position and his relationship to the Supreme Soul. It is explained thus in the Śrīmad-Bhāgavatam (2.9.31):


jñānaṁ parama-guhyaṁ me yad vijñāna-samanvitam
sa-rahasyaṁ tad-aṅgaṁ ca gṛhāṇa gaditaṁ mayā

“The knowledge of the self and Supreme Self is very confidential and mysterious, but such knowledge and specific realization can be understood if explained with their various aspects by the Lord Himself.” Bhagavad-gītā gives us that general and specific knowledge of the self. The living entities are parts and parcels of the Lord, and therefore they are simply meant to serve the Lord. This consciousness is called Kṛṣṇa consciousness. So, from the very beginning of life one has to learn this Kṛṣṇa consciousness, and thereby one may become fully Kṛṣṇa conscious and act accordingly.


Lust is only the perverted reflection of the love of God which is natural for every living entity. But if one is educated in Kṛṣṇa consciousness from the very beginning, that natural love of God cannot deteriorate into lust. So, from any stage of life, or from the time of understanding its urgency, one can begin regulating the senses in Kṛṣṇa consciousness, devotional service of the Lord, and turn the lust into love of Godhead – the highest perfectional stage of human life.

🌹 🌹 🌹 🌹 🌹


7 Oct 2019