🌹. శ్రీమద్భగవద్గీత - 174 / Bhagavad-Gita - 174 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 12 🌴
12. కాంక్షన్త: కర్మాణాం సిద్ధిం యజన్త ఇహ దేవతా: |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||
🌷. తాత్పర్యం :
లోకమున జనులు కామ్యకర్మల యందు జయమును గోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగము నందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు.
🌻. భాష్యము :
ఈ జగమున దైవమును గూర్చి లేదా దేవతలను గూర్చియు గొప్ప తప్పు భావన కలదు. అల్పజ్ఞులైనవారు (విద్వాంసులుగా చలామణి అగుచున్నను) దేవతలను భగవానుని వివిధరూపములుగా భావింతురు. కాని వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధరూపములు కారు. వారు కేవలము అతని అంశాలు మాత్రమే. భగవానుడొక్కడే కాని అతని అంశలు మాత్రము అనతములు. “నిత్యోనిత్యానాం” – భగవానుడొక్కడే యని వేదములు తెలుపుచున్నవి.
“ఈశ్వర: పరమ: కృష్ణ:” – దేవదేవుడు అద్వితీయుడు. ఆతడే శ్రీకృష్ణుడు. భౌతికజగమును పాలించుటకు పాలనాధికారము ఒసగబడెడివారే దేవతలు. వారందరును వివిధశక్తులు కలిగిన జీవులు(నిత్యనాం) మాత్రమే. వారెన్నడను దేవదేవుడైన శ్రీకృష్ణునితో లేదా నారాయణునితో లేదా విష్ణువుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు మరియు శ్రీకృష్ణభగవానుడు సమానమే యని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడని పిలువబడును. బ్రహ్మ మరియు శివుని వంటి మహా దేవతలే ఆ భగవానునకు సాటిరారు.
వాస్తవమునకు భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలచే పూజలనందుచుండును(శివవిరించితమ్). అయినను ఆశ్చర్యవిషయమేమన మూఢజనులు కొందరు భగవానునికి మనుష్యరూపమును ఆపాదించుట లేదా భగవానునికి జంతురూపము నపాదించుట వంటి అపోహలో పలువురు మానవులన పూజించుచుందురు. ఈ శ్లోకమున “ఇహదేవతా:” అణు పదము ఈ లోకమునకు చెందిన శక్తిమంతుడైన మనుజుని గాని, దేవతను గాని సూచించును. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుడు (నారాయణుడు లేదా విష్ణువు) ఈ లోకమునకు చెందినవాడుకాడు. అతడు ఈ భౌతికజగమునకు పరమైనట్టివాడు.
మూఢజనులు (హృతజ్ఞానులు) శీఘ్రఫలములను గోరినందున వివిధదేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను, అవి అశాశ్వతములనియు మరియు బుద్ధిహీనులకు మాత్రమే నిర్దేశింపబడినవనియు ఎరుగజాలరు. కాని బుద్ధిమంతుడైనవాడు కృష్ణభక్తిభావన యందు నిలిచిన కారణముగా ఏదియో తాత్కాలిక లాభము కొరకై వివిధ దేవతలను అర్చింప నవసరము లేదు. వాస్తవమునకు దేవతలు మరియు వారిని పూజించెడి వారందరును విశ్వప్రళయమున నశించిపోవుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 174 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 4 - Jnana Yoga - 12 🌴
12. kāṅkṣantaḥ karmaṇāṁ siddhiṁ yajanta iha devatāḥ
kṣipraṁ hi mānuṣe loke siddhir bhavati karma-jā
🌷 Translation :
Men in this world desire success in fruitive activities, and therefore they worship the demigods. Quickly, of course, men get results from fruitive work in this world.
🌹 Purport :
There is a great misconception about the gods or demigods of this material world, and men of less intelligence, although passing as great scholars, take these demigods to be various forms of the Supreme Lord.
Actually, the demigods are not different forms of God, but they are God’s different parts and parcels. God is one, and the parts and parcels are many. The Vedas say, nityo nityānām: God is one. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ. The Supreme God is one – Kṛṣṇa – and the demigods are delegated with powers to manage this material world. These demigods are all living entities (nityānām) with different grades of material power. They cannot be equal to the Supreme God – Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa.
Anyone who thinks that God and the demigods are on the same level is called an atheist, or pāṣaṇḍī. Even the great demigods like Brahmā and Śiva cannot be compared to the Supreme Lord. In fact, the Lord is worshiped by demigods such as Brahmā and Śiva (śiva-viriñci-nutam). Yet curiously enough there are many human leaders who are worshiped by foolish men under the misunderstanding of anthropomorphism or zoomorphism. Iha devatāḥ denotes a powerful man or demigod of this material world. But Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa, the Supreme Personality of Godhead, does not belong to this world. He is above, or transcendental to, material creation.
🌹 🌹 🌹 🌹 🌹
21 Oct 2019