శ్రీమద్భగవద్గీత - 153: 03వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 153: Chap. 03, Ver. 34


🌹. శ్రీమద్భగవద్గీత - 153 / Bhagavad-Gita - 153 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 34 🌴


34. ఇన్ద్రియ స్యెన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపన్తినౌ ||


🌷. తాత్పర్యం :

ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల యెడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి గావున వాటికి ఎవ్వరును వశము కాకూడదు.


🌷. భాష్యము :

భాష్యము కృష్ణభక్తిరసభావన యందున్నవారు ఇంద్రియ భోగముల యెడ సహజముగా విముఖులై యుందురు. అటువంటి దివ్యభావన లేనివారు శాస్త్రములలో తెలుపబడిన విధి నియమములను తప్పక అనుసరింపవలసియుండును. విచ్చలవడి భోగానుభవము భౌతికబంధము కలిగించగలదు.

కాని శాస్త్రములందు తెలుపబడిన విధినియమములను పాటించువారు ఇంద్రియార్థములచే బంధింపబడరు. ఉదాహరణకు మైథునభోగమనునది బద్ధజీవునకు అత్యంత అవసరమైనది. అట్టి సుఖము వివాహము ద్వారా ఆమోదింపబడినది. భార్యతో తప్ప ఇతర స్త్రీలతో లైంగియభోగమునందు పాల్గొనరాదనీ శాస్త్రములు తెలుపుచున్నవి. పరస్త్రీని తల్లిగా భావించవలెను.

అటువంటి ఆదేశములు ఉన్నప్పటికిని మనుజుడు ఇతర స్త్రీలతో అక్రమసంబంధమును పొందగోరును. అటువంటి భావములను సంపూర్ణముగా నశింపజేయవలెను. లేనిచో అవి ఆత్మానుభవమార్గమున గొప్ప ఆటమకములు కాగలవు. దేహమున్నంత కాలము దేహావసరవములు తప్పవు కనుక వానిని నియమనిబంధనల ననుసరించి గ్రహించవలెను. అయినను ఆ నియమముల పైన కూడా పూర్తిగా ఆధారపడరాదు. కేవలము సంగరహితులమై వాటిని మనము అనుసరింపవలెను. భౌతికసంపర్క కారణమున భోగవాంఛ అనంతకాలము నుండి వచ్చుచున్నది. కావున ఇంద్రియభోగము నియమితమై నప్పటికిని మనుజుడు పతనము నొందుట ఆస్కారము కలదు. అందుచే విధినియమానుసార ఇంద్రియభోగము సైతము త్యజించ వలసియున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 153 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 3 - Karma Yoga - 34 🌴


34. indriyasyendriyasyārthe rāga-dveṣau vyavasthitau
tayor na vaśam āgacchet tau hy asya paripanthinau


🌷 Translation :

There are principles to regulate attachment and aversion pertaining to the senses and their objects. One should not come under the control of such attachment and aversion, because they are stumbling blocks on the path of self-realization.


🌷 Purport :

Those who are in Kṛṣṇa consciousness are naturally reluctant to engage in material sense gratification. But those who are not in such consciousness should follow the rules and regulations of the revealed scriptures. Unrestricted sense enjoyment is the cause of material encagement, but one who follows the rules and regulations of the revealed scriptures does not become entangled by the sense objects. For example, sex enjoyment is a necessity for the conditioned soul, and sex enjoyment is allowed under the license of marriage ties. According to scriptural injunctions, one is forbidden to engage in sex relationships with any women other than one’s wife.

All other women are to be considered as one’s mother. But in spite of such injunctions, a man is still inclined to have sex relationships with other women. These propensities are to be curbed; otherwise they will be stumbling blocks on the path of self-realization. As long as the material body is there, the necessities of the material body are allowed, but under rules and regulations. And yet, we should not rely upon the control of such allowances.

Therefore, in spite of regulated sense enjoyment, there is every chance of falling down; therefore any attachment for regulated sense enjoyment must also be avoided by all means. But attachment to Kṛṣṇa consciousness, or acting always in the loving service of Kṛṣṇa, detaches one from all kinds of sensory activities. Therefore, no one should try to be detached from Kṛṣṇa consciousness at any stage of life. The whole purpose of detachment from all kinds of sense attachment is ultimately to become situated on the platform of Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


30 Sept 2019