శ్రీమద్భగవద్గీత - 093: 02వ అధ్., శ్లో 46 / Bhagavad-Gita - 093: Chap. 02, Ver. 46


🌹. శ్రీమద్భగవద్గీత -93 / Bhagavad-Gita - 93 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 46 🌴

46. యావానర్థ ఉదపానే సర్వత: సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత: ||


🌷. తాత్పర్యం :

చిన్ననుతిచే ఒనగూడు ప్రయోజనములన్నియును శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలముచే సిద్ధించురీతి, వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి.


🌻. భాష్యము :

వేదవాజ్మయమునందలి కర్మకాండ భాగములో తెలియజేయబడిన యజ్ఞములు మరియు కర్మలన్నియును క్రమానుగతమైన ఆత్మానుభూతి కొరకే నిర్దేశింపబడినవి. ఇక ఆత్మానుభవపు ప్రయోజనము భగవద్గీత యొక్క పంచదశాధ్యాయము (15.15) నందు స్పష్టముగా తెలుపబడినది. సమస్తమునకు ఆదికారణుడైన శ్రీకృష్ణభగవానుని ఎరుగుటయే వేదాధ్యయనపు ప్రయోజనమని అచ్చట వివరించబడినది; అనగా శ్రీకృష్ణుని గూర్చియు మరియు అతనితో జీవునికి గల నిత్యసంబంధమును గూర్చియు తెలియజేయుటయే అత్మనుభవపు నిజమైనభావము. గీత యొక్క పంచదశాధ్యాయపు (15.7) నందు జీవులకు శ్రీకృష్ణభగవానునితో గల సంబంధము సైతము వివరింపబడినది. జీవులందరును శ్రీకృష్ణుని అంశలు గావున ప్రతిజీవుడును కృష్ణభక్తిభావన యందు పునరుద్ధరించుకొనుటయే వేదజ్ఞానపు పూర్ణతస్థితియై యున్నది. ఈ విషయమున శ్రీమద్భాగవతము (3.33.7) నందు ఇట్లు స్థిరీకరించబడినది.

అహో బత శ్వపచో తో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నాం తుభ్యమ్ |
తేపుస్తప స్తే జుహువు: సస్నురార్యా బ్రహ్మానూ చుర్నామ గృణన్తి యే తే ||

“హే ప్రభూ! నీ పవిత్ర నామమును కీర్తించువాడు చండాలుని (శునకమాంసను భుజించువాడు) వంశము వంటి అధమవంశములో జన్మించినను అత్యున్నత ఆత్మానుభవస్థాయిలో నున్నట్టివాడు. అట్టివాడు వేదప్రకారము సర్వవిధములైన యజ్ఞములను, తపస్సులను ఆచరించినట్టివాడే! సమస్త పుణ్యతీర్థములలో స్నానమాచరించి, వేదవాజ్మయమును పలుమార్లు అధ్యయనము చేసినట్టివాడే! అట్టివాడే ఆర్యవంశములో ఉత్తముడని పరిగణింపబడును.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 93 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 46 🌴

46. yāvān artha uda-pāne sarvataḥ samplutodake
tāvān sarveṣu vedeṣu brāhmaṇasya vijānataḥ



🌻 Translation :

All purposes served by a small well can at once be served by a great reservoir of water. Similarly, all the purposes of the Vedas can be served to one who knows the purpose behind them.


🌻 Purport :

The rituals and sacrifices mentioned in the karma-kāṇḍa division of the Vedic literature are meant to encourage gradual development of self-realization. And the purpose of self-realization is clearly stated in the Fifteenth Chapter of the Bhagavad-gītā (15.15): the purpose of studying the Vedas is to know Lord Kṛṣṇa, the primeval cause of everything. So, self-realization means understanding Kṛṣṇa and one’s eternal relationship with Him.

🌹 🌹 🌹 🌹 🌹


1 Aug 2019