శ్రీమద్భగవద్గీత - 104: 02వ అధ్., శ్లో 57 / Bhagavad-Gita - 104: Chap. 02, Ver. 57
🌹. శ్రీమద్భగవద్గీత -104 / Bhagavad-Gita - 104 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 57 🌴
57. య: సర్వత్రానభి స్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||
🌷. తాత్పర్యం :
భౌతిక జగము నందు ప్రాప్తించిన మంచి, చెడులను ప్రశంసించుట గాని, ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కాని వాడు సంపూర్ణజ్ఞానము నందు స్థిరుడై నిలుచును.
🌷. భాష్యము :
భౌతికజగమునందు సదా మంచి, చెడులలో ఏదియోనొకటి కలుగుచునే యుండును. అట్టి ఒడుదుడుకులచే కలతనొందక మంచిచెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణభక్తిరసభావనలో స్థిరుడైనవాడిని అవగతము చేసికొనవచ్చును. లోకము ద్వంద్వభరితము కావున భౌతికజగమున ఉన్నంతకాలము మంచి, చెడులలో ఏదియో నొకటి కలుగుచునే ఉండును.
కాని కృష్ణభక్తిభావన యందు స్థిరుడైనట్టివాడు నిర్గుణుడైన కృష్ణుని గుర్చియే సదా చింతించుచుండుట వలన అట్టి మంచి, చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణభక్తిరసభావనయే సమాధి యని పిలువబడు సంపూర్ణ ఆధ్యాత్మికస్థితి యందు మనుజుని నెలకొల్పగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 104 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 57 🌴
57. yaḥ sarvatrāna bhisnehas tat tat prāpya śubhāśubham
nābhinandati na dveṣṭi tasya prajñā pratiṣṭhitā
🌷Translation :
In the material world, one who is unaffected by whatever good or evil he may obtain, neither praising it nor despising it, is firmly fixed in perfect knowledge.
🌷 Purport :
There is always some upheaval in the material world which may be good or evil. One who is not agitated by such material upheavals, who is unaffected by good and evil, is to be understood to be fixed in Kṛṣṇa consciousness. As long as one is in the material world there is always the possibility of good and evil because this world is full of duality.
But one who is fixed in Kṛṣṇa consciousness is not affected by good and evil, because he is simply concerned with Kṛṣṇa, who is all-good absolute. Such consciousness in Kṛṣṇa situates one in a perfect transcendental position called, technically, samādhi.
🌹 🌹 🌹 🌹 🌹
12 Aug 2019