శ్రీమద్భగవద్గీత - 116: 02వ అధ్., శ్లో 69 / Bhagavad-Gita - 116: Chap. 02, Ver. 69
🌹. శ్రీమద్భగవద్గీత - 116 / Bhagavad-Gita - 116 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 69 🌴
69. యా నిశా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని
సా నిశా పశ్యతో మునే: ||
🌷. తాత్పర్యం :
సకల జీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని యుండు సమయము. సర్వజీవులు మేల్కొని యుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము.
🌷. భాష్యము :
తెలివిగల వారిలో రెండు తరగతుల వారు కలరు. అందులో నొకరు ఇంద్రియ ప్రీత్యర్థమై భౌతికకర్మల యందు తెలివిని కలిగియుండగా, ఇంకొక రకమువారు అంతర్ముఖులు మరియు అభ్యాసతత్పరులై యుందురు. అంతర్ముఖుడైన ముని (తెలివిగల మనుజుడు) కర్మల విషయములో లగ్నమైయున్న మనుజులకు రాత్రి వంటివి. ఆత్మానుభవరాహిత్యము వలన అట్టి రాత్రి యందు లౌకికజనులు సదా నిద్రలో నుందురు. అట్టి విషయానురక్తుల “రాత్రిసమయము” నందు మాత్రము అంతర్ముఖుడైన ముని జాగరూకుడై యుండును.
మునియైనవాడు ఆద్యాత్మిక పురోభివృద్ధి యందు దివ్యానందము నొందగా, ఆత్మానుభవ విషయమున నిద్రించు కారణముగా భౌతికకర్మల యందున్న మనుజుడు పలువిధములైన భోగములను గూర్చి కలలు గనుచు ఆ నిద్రావస్థ యందు కొన్నిమార్లు సుఖమును, మరికొన్నిమార్లు దుఖమును అనుభవించుచుండును. అతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖదు:ఖముల యెడ సదా తటస్థుడై యుండును. భౌతికకర్మలచే ఏమాత్రము కలతచెందక అతడు తన ఆత్మానుభవకర్మల యందు నిమగ్నుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 116 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 69 🌴
69. yā niśā sarva-bhūtānāṁ tasyāṁ jāgarti saṁyamī
yasyāṁ jāgrati bhūtāni sā niśā paśyato muneḥ
🌷Translation :
What is night for all beings is the time of awakening for the self-controlled; and the time of awakening for all beings is night for the introspective sage.
🌷 Purport :
There are two classes of intelligent men. One is intelligent in material activities for sense gratification, and the other is introspective and awake to the cultivation of self-realization. Activities of the introspective sage, or thoughtful man, are night for persons materially absorbed.
Materialistic persons remain asleep in such a night due to their ignorance of self-realization. The introspective sage remains alert in the “night” of the materialistic men. The sage feels transcendental pleasure in the gradual advancement of spiritual culture, whereas the man in materialistic activities, being asleep to self-realization, dreams of varieties of sense pleasure, feeling sometimes happy and sometimes distressed in his sleeping condition. The introspective man is always indifferent to materialistic happiness and distress. He goes on with his self-realization activities undisturbed by material reactions.
🌹 🌹 🌹 🌹 🌹
24 Aug 2019