శ్రీమద్భగవద్గీత - 096: 02వ అధ్., శ్లో 49 / Bhagavad-Gita - 096: Chap. 02, Ver. 49


🌹. శ్రీమద్భగవద్గీత -96 / Bhagavad-Gita - 96 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 49 🌴


49. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ద్ధనంజయ
బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా: ఫలహేతవ: |


🌷. తాత్పర్యం :

ఓ ధనుంజయా! భక్తియోగముచే హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణువేడుము. కర్మఫలములను అనుభవింప గోరు వారు లోభులు.


🌻. భాష్యము :

శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా నిజస్థితిని అవగతము చేసికొననివాడు కృష్ణభక్తిభావన యందు పనిచేయుట మినహా సమస్త కలాపములను త్యజించును.

ఇదివరకే వివరింపబడినట్లు బుద్ధియోగమనగా శ్రీకృష్ణభగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ. అదియే జీవులకు నిజమైన కర్మము. కేవలము లోభులు మాత్రమే మరింత భౌతికబంధమున చిక్కుబడుటకు తన కర్మఫలములను అనుభవింపగోరుదురు. కృష్ణపరమైన కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నియును కర్తను జనన, మరణచక్రము నందే సదా బంధించును గావున హేయములై యున్నవి.

కావుననే కర్మలకు ఎవ్వరును కారణము కారాదు. ప్రతికర్మయు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కృష్ణభక్తిభావన యందు నిర్వహింప వలెను. లోభులైనవారు కష్టముతో లేదా అదృష్టముతో కూడబెట్టిన ధనమును ఏ విధముగా వినియోగించవలెనో ఎరుగరు. వాస్తవమునకు ప్రతియొక్కరు తమ శక్తిసామర్త్యములను కృష్ణభక్తి కొరకే వినియోగించవలెను. అదియే మనుజుని జన్మను సఫలము కావింపగలదు. అదృష్టహీనులైనవారే లోభుల వలె తమ శక్తిని భగవానుని సేవలో వినియోగింపరు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 96 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 49 🌴

49. dūreṇa hy avaraṁ karma buddhi-yogād dhanañ-jaya
buddhau śaranam anviccha kṛpaṇāḥ phala-hetavaḥ


🌻 Translation :

O Dhanañjaya, keep all abominable activities far distant by devotional service, and in that consciousness surrender unto the Lord. Those who want to enjoy the fruits of their work are misers.


🌻 Purport :

One who has actually come to understand one’s constitutional position as an eternal servitor of the Lord gives up all engagements save working in Kṛṣṇa consciousness. As already explained, buddhi-yoga means transcendental loving service to the Lord. Such devotional service is the right course of action for the living entity. Only misers desire to enjoy the fruit of their own work just to be further entangled in material bondage. Except for work in Kṛṣṇa consciousness, all activities are abominable because they continually bind the worker to the cycle of birth and death.

One should therefore never desire to be the cause of work. Everything should be done in Kṛṣṇa consciousness, for the satisfaction of Kṛṣṇa. Misers do not know how to utilize the assets of riches which they acquire by good fortune or by hard labor. One should spend all energies working in Kṛṣṇa consciousness, and that will make one’s life successful. Like misers, unfortunate persons do not employ their human energy in the service of the Lord.

🌹🌹🌹🌹🌹


27 Sep 2021