శ్రీమద్భగవద్గీత - 106: 02వ అధ్., శ్లో 59 / Bhagavad-Gita - 106: Chap. 02, Ver. 59


🌹. శ్రీమద్భగవద్గీత - 106 / Bhagavad-Gita - 106 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 59 🌴

59. విషయా వినివర్తన్తే
నిరాహారస్య దేహిన: |
రసవర్జం రసోప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే ||



🌷. తాత్పర్యం :

దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే యుండును. కాని అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింప జేసి అతడు చైతన్యము నందు స్థిరుడు కాగలుడు.


🌷. భాష్యము :

దివ్యమైన ఆధ్యాత్మికస్థితిలో నిలువనిదే ఇంద్రియభోగముల నుండి మరలుట ఎవ్వరికిని సాధ్యము కాదు. విధినియమముల ద్వారా ఇంద్రియభోగానుభవముపై ఆంక్షలు విధించుట యనునది రోగిని కొన్ని విధములైన ఆహారపదార్థమూలా నుండి నియమించుట వంటిది. అట్టి నియమములు రోగికెన్నడును రుచింపవు.

అంతియేగాక ఆహారపదార్థములపై కోరికయు అతనికి పోదు. ఆ విధముగనే అల్పజ్ఞులైన మనుజుల కొరకు యమము, నియమము, ఆసనము, ప్రాణాయాము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణాడి పలు పక్రియలు కలిగిన అష్టాంగయోగ విధానము ఇంద్రియములు అదుపు కొరకై నిర్దేశింపబడినవి.

కాని కృష్ణభక్తిలో పురోభివృద్ధి నొందుచు శ్రీకృష్ణభగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు మృతప్రాయములైన లౌకికవిషయముల యెడ రుచిని కోల్పోయియుండును. అనగా నియమములనునవి తోలోదశలో నున్న భక్తుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకే ఏర్పాటు చేయబడినవి. కృష్ణభక్తిభావన యందు నిజమగు రసాస్వాదానము కలుగునంతవరకే అవి ప్రయోజనము కలిగియుండును. మనుజుడు కృష్ణభక్తిరసభావితుడైనంతనే శుష్కవిషయములందు అప్రయత్నముగా రుచిని కోల్పోవును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 106 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 59 🌴

59. viṣayā vinivartante nirāhārasya dehinaḥ
rasa-varjaṁ raso ’py asya paraṁ dṛṣṭvā nivartate



🌷Translation :

Though the embodied soul may be restricted from sense enjoyment, the taste for sense objects remains. But, ceasing such engagements by experiencing a higher taste, he is fixed in consciousness.


🌷 Purport :

Unless one is transcendentally situated, it is not possible to cease from sense enjoyment. The process of restriction from sense enjoyment by rules and regulations is something like restricting a diseased person from certain types of eatables. The patient, however, neither likes such restrictions nor loses his taste for eatables. Similarly, sense restriction by some spiritual process like aṣṭāṅga-yoga, in the matter of yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna, etc., is recommended for less intelligent persons who have no better knowledge.

But one who has tasted the beauty of the Supreme Lord Kṛṣṇa, in the course of his advancement in Kṛṣṇa consciousness, no longer has a taste for dead, material things. Therefore, restrictions are there for the less intelligent neophytes in the spiritual advancement of life, but such restrictions are only good until one actually has a taste for Kṛṣṇa consciousness. When one is actually Kṛṣṇa conscious, he automatically loses his taste for pale things.

🌹 🌹 🌹 🌹 🌹


14 Aug 2019