శ్రీమద్భగవద్గీత - 103: 02వ అధ్., శ్లో 56 / Bhagavad-Gita - 103: Chap. 02, Ver. 56


🌹. శ్రీమద్భగవద్గీత -103 / Bhagavad-Gita - 103 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 56 🌴


56. దుఃఖేష్వనుద్విగ్నమనా: సుఖేషు విగతస్పృహ: |
వీతరాగభయక్రోధ: స్థితధీర్మునిరుచ్యతే ||

🌷 తత్పర్యం :

త్రివిధ తాపములందును చలింపని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడును, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సుగల ముని యని చెప్పబడును.

🌷. భాష్యము :

ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసికకల్పనలతో పలురీతుల మననము కావించువాడనియే “ముని” యను పదమునకు అర్థము. ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణముండును. మునియైనవాడు ఇతర మునులకు భిన్నుడు కానిచో ముని యని పిలువబడును అర్హుడు కాడు. “ న చాసౌ ఋషి: యస్యమతం న భిన్నం” (మాహాభారతము, వనపర్వము 313.117 ). కాని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తెలిపిన “స్థితధీర్ముని:” సామాన్య మునులకు అన్యమైనవాడు. సర్వవిధములైన మనోకల్పిత భావములను త్యజించి యున్నందున అట్టి స్థితధీర్ముని సదా కృష్ణభక్తిలో నిలిచి యుండును.

అతడు “ప్రశాంత నిశ్శేష మనోరథాంతరుడు” (స్తోత్రరత్నం 43) అని పిలువబడును. అనగా అతడు సర్వవిధములిన మానసికకల్పనా భావములను అతిశయించిన శ్రీకృష్ణుడే సర్వస్వమనెడి నిర్ణయమునకు వచ్చినట్టివాడు (వాసుదేవ: సర్వమితి స మహాత్మా సుదుర్లభ:). అతడే ఆత్మయందు స్థితిని కలిగినట్టి ముని. అట్టి కృష్ణభక్తిపరాయణుడైన ముని త్రివిధతాపములను తాకిడిచే ఎట్టి కలతను పొందడు.

తన గతము నందలి పాపములకు ఎక్కువ శిక్ష అనుభవింపవలసి యున్నదని భావించును అతడు ఆ తాపాత్రయములను భగవత్కరుణగా అంగీకరించును. అంతియేగాక భగవానుని కరుణచే తనకు దుఃఖములు అతికొద్ది పరిమాణములో కలుగుచున్నవని అతడు తలపోయును. అదే విధముగా సుఖము కలిగినప్పుడు అట్టివాడు (తానా సౌఖ్యమునకు అర్హుడు కానని తలచుచు) ఆ కీర్తిని శ్రీకృష్ణునకు ఆపాధించును.

భగవానుని కరుణ వలననే తాను అట్టి అనుకూల, సుఖ వాతావరణములలో నిలిచి భక్తిని సాగించుగలుగుచున్నానని అతడు అవగతము చేసికొనును. అట్టి సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడు ధైర్యమును కలిగియుండి ఆసక్తి మరియు అనాసక్తులచే ప్రభావితుడు కాకుండును. ఇంద్రియభోగము కొరకు దేనినైనను గ్రహించుట యనునది ఆసక్తి కాగా, విషయసుఖముల యెడ అనాసక్తిని యనునది ఆసక్తి కాగా, విషయసుఖముల యెడ అనాసక్తి యనునది వైరాగ్యమనబడును. కాని కృష్ణభక్తి యందు స్థిరుడైనట్టివాడు జీవితమున శ్రీకృష్ణభగవానుని సేవ కొరకే అర్పించి యున్నందున అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడై యుండును. కావుననే తన ప్రయత్నములు విఫలమైనను అతడు క్రోధము చెందడు. అనగా కృష్ణభక్తిపరాయణుడు. జయాపజయములు రెండింటి యందును సదా ధీరుడై స్థిరనిశ్చయముతో నిలుచును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 103 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 56 🌴


56. duḥkheṣv anudvigna-manāḥ sukheṣu vigata-spṛhaḥ
vīta-rāga-bhaya-krodhaḥ sthita-dhīr munir ucyate


🌷Translation :

One who is not disturbed in mind even amidst the threefold miseries or elated when there is happiness, and who is free from attachment, fear and anger, is called a sage of steady mind.

🌷 Purport :

The word muni means one who can agitate his mind in various ways for mental speculation without coming to a factual conclusion. It is said that every muni has a different angle of vision, and unless a muni differs from other munis, he cannot be called a muni in the strict sense of the term. Nāsāv ṛṣir yasya mataṁ na bhinnam (Mahābhārata, Vana-parva 313.117). But a sthita-dhīr muni, as mentioned herein by the Lord, is different from an ordinary muni.

The sthita-dhīr muni is always in Kṛṣṇa consciousness, for he has exhausted all his business of creative speculation. He is called praśānta-niḥśeṣa-mano-rathāntara (Stotra-ratna 43), or one who has surpassed the stage of mental speculations and has come to the conclusion that Lord Śrī Kṛṣṇa, or Vāsudeva, is everything (vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ). He is called a muni fixed in mind.

Such a fully Kṛṣṇa conscious person is not at all disturbed by the onslaughts of the threefold miseries, for he accepts all miseries as the mercy of the Lord, thinking himself only worthy of more trouble due to his past misdeeds; and he sees that his miseries, by the grace of the Lord, are minimized to the lowest.


🌹 🌹 🌹 🌹 🌹

11 Aug 2019