శ్రీమద్భగవద్గీత - 102: 02వ అధ్., శ్లో 55 / Bhagavad-Gita - 102: Chap. 02, Ver. 55


🌹. శ్రీమద్భగవద్గీత - 102 / Bhagavad-Gita - 102 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 55 🌴


55. శ్రీ భగవానువాచ

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్ట: స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||


🌷 తత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆవిధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మ యందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

🌷 భష్యము :

కృష్ణభక్తి యందు పూర్ణుడైనట్టివాడు (భక్తియోగమునందు పూర్ణుడు) మహర్షుల సర్వసద్గుణములను కలిగియుండగా, దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలువలేనటు వంటివాడు ఎటువంటి సద్గుణములను కలిగియుండ జాలడని శ్రీమద్భాగవతము నిర్ధారించుచున్నది. అట్టివాడు మానసికకల్పనాపరుడగుటయే అందులకు కారణము. కనుకనే మనోజనితమైన సర్వవిధ కామములను మనుజుడు త్యజింపవలెనని ఇచ్చట తెలుపబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ కోరికలు బలవంతముగా అణచబడలేవు. కాని మనుజుడు కృష్ణభక్తిలో నియుక్తుడైనంతనే ఇంద్రియసంబంధ కోరికలు ఎట్టి బాహ్యయత్నము లేకుండా అప్రయత్నముగా అణిగిపోగలవు.

కనుక ప్రతియొక్కరు ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణభక్తి భావన యందు నియుక్తులు కావలెను. ఏలయన అదియే దివ్యచైతన్యస్థాయిని తక్షణమే చేరుటకు సహాయభూతమగు చున్నది. మహాత్ముడైనవాడు తనను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా గుర్తించి సదా తృప్తుడై నిలిచియుండును. దివ్యస్థితి యందు నెలకొనిన అటువంటి మనుజుడు తుచ్చమైన ఇంద్రియపర కోరికలను కలిగియుండక శ్రీకృష్ణభగవానుని నిత్యసేవనమనెడి తన సహజస్థితిలో సదా ఆనందమగ్నుడై యుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 102 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankya Yoga - 55 🌴


55. śrī-bhagavān uvāca

prajahāti yadā kāmān sarvān pārtha mano-gatān
ātmany evātmanā tuṣṭaḥ sthita-prajñas tadocyate


🌷Translation :

The Supreme Personality of Godhead said: O Pārtha, when a man gives up all varieties of desire for sense gratification, which arise from mental concoction, and when his mind, thus purified, finds satisfaction in the self alone, then he is said to be in pure transcendental consciousness.


🌷 Purport :

The Bhāgavatam affirms that any person who is fully in Kṛṣṇa consciousness, or devotional service of the Lord, has all the good qualities of the great sages, whereas a person who is not so transcendentally situated has no good qualifications, because he is sure to be taking refuge in his own mental concoctions. Consequently, it is rightly said herein that one has to give up all kinds of sense desire manufactured by mental concoction. Artificially, such sense desires cannot be stopped. But if one is engaged in Kṛṣṇa consciousness, then, automatically, sense desires subside without extraneous efforts.

Therefore, one has to engage himself in Kṛṣṇa consciousness without hesitation, for this devotional service will instantly help one onto the platform of transcendental consciousness. The highly developed soul always remains satisfied in himself by realizing himself as the eternal servitor of the Supreme Lord. Such a transcendentally situated person has no sense desires resulting from petty materialism; rather, he remains always happy in his natural position of eternally serving the Supreme Lord.

🌹 🌹 🌹 🌹 🌹

10 Aug 2019