శ్రీమద్భగవద్గీత - 117: 02వ అధ్., శ్లో 70 / Bhagavad-Gita - 117: Chap. 02, Ver. 70


🌹. శ్రీమద్భగవద్గీత - 117 / Bhagavad-Gita - 117 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 70 🌴

70. ఆపూర్వ మాణమచల ప్రతిష్టం
సముద్రమాప: ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్ కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ ||


🌷. తాత్పర్యం :

సదా సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి, తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహములే కలత నొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు.

🌷. భాష్యము :

విస్తారమగు సముగ్రము సదా జలపూర్ణమై యుండును. అధికపరిమాణములో జలముచే పూరింపబడుట వలన ముఖ్యముగా వర్షాకాలమునందు ఆది జలముచే నిండియుండును. కాని అది స్థిరముగా నునుండి చలింపకుండును. కనీసము చెలియకట్టనైనను దాటదు. ఈ విషయము కృష్ణభక్తిభావన యందు స్థితినొందిన వ్యక్తియందును సత్యమై యున్నది. దేహమున్నంతవరకు దేహమునకు సంబంధించిన కోరికలు కలుగుచునే యుండును.

కాని భక్తుడైనవాడు తన యందలి పూర్ణత్వము కారణముగా అట్టి కోరికలచే కలతనొందడు. కృష్ణభక్తి యందున్నవానికి ఆ శ్రీకృష్ణుడే సర్వావసరములను తీర్చును గావున అతడు ఏదియును వాంచింపడు. కనుకనే అతడు సముద్రము వలె సదా తన యందే పూర్ణుడై యుండును. సముద్రమునందు నదులు ప్రవేశించు రీతిగా తన యందు కోరికలు ప్రవేశించినను అతడు తన కర్మల యందు స్థిరుడై యుండి ఇంద్రియభోగ కోరికలచే ఏమాత్రము కలత నొంద కుండును.

కోరికలు కలుగుచున్నప్పటికి భోగవాంచను త్యజించి యుండెడి కృష్ణభక్తి భావనాయుతునికి ఇదియే నిదర్శనము. భగవానుని ప్రేమయుత సేవలో తృప్తినొందుచు సముద్రము వలె స్థిరుడై యుండును గావున ఆ భక్తుడు సంపూర్ణశాంతిని పొందును. కాని మోక్షపర్యంతము (భౌతికజయమును గూర్చి వేరుగా తెలుపపనిలేదు) కోరికల నీడేర్చుకొనుట యందే ప్రియము గలవాడు ఎన్నడును శాంతిని పొందలేరు.

కామ్యకర్మరతులు, మోక్షకాములు, సిద్దులను పొంద యత్నించు యోగులు మొదలగు వారందరును తీరని కోరికలచే ఎల్లప్పుడును దు:ఖముచే కలిగియుందురు. కాని కృష్ణభక్తిభావన యందుండువాడు శ్రీకృష్ణభగవానుని సేవలో సద ఆనందమునే కలిగియుండును. అతనికి ఏ కోరికలు ఉండవు. చివరకు నామమాత్ర భౌతికబంధము నుండి ముక్తిని సైతము అతడు వాంచింపడు. అనగా లౌకిక కోరికలు లేనందునే కృష్ణభక్తులు సదా సంపూర్ణశాంతిని కలిగియుందురు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 117 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 70 🌴

70. āpūryamāṇam acala-pratiṣṭhaṁ samudram āpaḥ praviśanti yadvat
tadvat kāmā yaṁ praviśanti sarve sa śāntim āpnoti na kāma-kāmī


🌷Translation :

A person who is not disturbed by the incessant flow of desires – that enter like rivers into the ocean, which is ever being filled but is always still – can alone achieve peace, and not the man who strives to satisfy such desires.


🌷 Purport :

Although the vast ocean is always filled with water, it is always, especially during the rainy season, being filled with much more water. But the ocean remains the same – steady; it is not agitated, nor does it cross beyond the limit of its brink. That is also true of a person fixed in Kṛṣṇa consciousness. As long as one has the material body, the demands of the body for sense gratification will continue. The devotee, however, is not disturbed by such desires, because of his fullness.

A Kṛṣṇa conscious man is not in need of anything, because the Lord fulfills all his material necessities. Therefore he is like the ocean – always full in himself. Desires may come to him like the waters of the rivers that flow into the ocean, but he is steady in his activities, and he is not even slightly disturbed by desires for sense gratification. That is the proof of a Kṛṣṇa conscious man – one who has lost all inclinations for material sense gratification, although the desires are present.

Because he remains satisfied in the transcendental loving service of the Lord, he can remain steady, like the ocean, and therefore enjoy full peace. Others, however, who want to fulfill desires even up to the limit of liberation, what to speak of material success, never attain peace.

🌹 🌹 🌹 🌹 🌹


25 Aug 2019