✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 63 🌴
63. క్రోధాద్ భవతి సమ్మోహ:
సమ్మోహాత్స్మ్రువిభ్రమ: |
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో
బుద్ధినాశాత్ప్రుణశ్యతి ||
🌷. తాత్పర్యం :
క్రోధము వలన అధికమోహము కలుగగా,మోహము వలన జ్ఞాపకశక్తి భ్రమకు గురియగును. జ్ఞాపకశక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధి నశించినపుడు మనుజుడు తిరిగి సంసారగర్తమున పడిపోవును.
🌷. భాష్యము :
ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సమ్భన్దివస్తున: |
ముముక్షుభి: పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే ||
(భక్తిరసామృతసింధువు – 1.2.258)
ప్రతిదియు భగవానుని సేవలో వినియోగమునకు వచ్చుననెడి విషయమును కృష్ణభక్తిభావన వృద్ధియైనపుడు మనుజుడు ఎరుగగలడు. కృష్ణభక్తిభావనకు సంబంధించిన జ్ఞానము లేని కొందరు కృత్రిమముగా విషయవస్తువులను త్యజించుటకు యత్నింతురు. తత్పలితముగా భౌతికబంధము నుండి వారు ముక్తిని వాంఛించుచున్నను వైరాగ్యమునందు సంపూర్ణస్థితిని మాత్రము పొందజాలరు. వారి నామమాత్ర వైరాగ్యము “ఫల్గు” లేదా అప్రధానమైనదని పిలువబడును. కాని కృష్ణభక్తియందున్న వ్యక్తి ఏ విధముగా ప్రతిదానిని శ్రీకృష్ణసేవలో వినియోగించవలెనో ఎరిగియుండును. తత్కారణముగా అతడు విషయభావనలకు ఎన్నడును బలి కాడు.
ఉదాహరణకు భగవానుడు (లేదా పరతత్త్వము) నిరాకారుడు అయినందున భుజింపడని నిరాకారవాది భావించును. కనుక అతడు సైతము రుచికర పదార్థములను త్యజించుటకు యత్నించును. కాని భక్తుడైనవాడు మాత్రము శ్రీకృష్ణుడు దివ్యభోక్తయనియు మరియు భక్తితో నొసగు సమస్తమును ప్రియముతో ఆరగించుననియు తెలిసియుండుటచే రుచికరమైన ఆహారపదార్థములను ఆ భగవానునకు అర్పించును. ఆ పిదప ప్రసాదముగా పిలువబడును అన్నశేషమును అతడు గ్రహించును.
ఆ విధముగా ప్రతిదియు ఆధ్యాత్మికమగుచున్నందున భక్తునికి పతనభయము లేదు. భక్తుడు ప్రసాదమును భక్తితో స్వీకరించగా, అభక్తుడైనవాడు దానిని భౌతికమైనదని భావించి విసర్జించును. కనుకనే నిరాకారవాదులు కృత్రిమ వైరాగ్యము వలన జీవితము ఆనందముగా అనుభవింపలేరు. ఈ కారణము వలననే కొద్దిపాటి మనోచలనమైనను వారిని తిరిగి సంసారగర్తమున తోయుచున్నది. భక్తియుతసేవ యొక్క ఆసరా లేకపోవుట వలననే ముక్తినొందు స్థితి వరకు ఎదిగినను, అట్టివారు తిరిగి పతనము నొందుదురని తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 110 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 63 🌴
63. krodhād bhavati sammohaḥ sammohāt smṛti-vibhramaḥ
smṛti-bhraṁśād buddhi-nāśo buddhi-nāśāt praṇaśyati
🌷Translation :
From anger, complete delusion arises, and from delusion bewilderment of memory. When memory is bewildered, intelligence is lost, and when intelligence is lost one falls down again into the material pool.
🌷 Purport :
Śrīla Rūpa Gosvāmī has given us this direction:
prāpañcikatayā buddhyā
hari-sambandhi-vastunaḥ
mumukṣubhiḥ parityāgo
vairāgyaṁ phalgu kathyate
(Bhakti-rasāmṛta-sindhu 1.2.258)
By development of Kṛṣṇa consciousness one can know that everything has its use in the service of the Lord. Those who are without knowledge of Kṛṣṇa consciousness artificially try to avoid material objects, and as a result, although they desire liberation from material bondage, they do not attain to the perfect stage of renunciation. Their so-called renunciation is called phalgu, or less important. On the other hand, a person in Kṛṣṇa consciousness knows how to use everything in the service of the Lord; therefore he does not become a victim of material consciousness.
For example, for an impersonalist, the Lord, or the Absolute, being impersonal, cannot eat. Whereas an impersonalist tries to avoid good eatables, a devotee knows that Kṛṣṇa is the supreme enjoyer and that He eats all that is offered to Him in devotion. So, after offering good eatables to the Lord, the devotee takes the remnants, called prasādam. Thus everything becomes spiritualized, and there is no danger of a downfall.
The devotee takes prasādam in Kṛṣṇa consciousness, whereas the nondevotee rejects it as material. The impersonalist, therefore, cannot enjoy life, due to his artificial renunciation; and for this reason, a slight agitation of the mind pulls him down again into the pool of material existence. It is said that such a soul, even though rising up to the point of liberation, falls down again due to his not having support in devotional service.
🌹 🌹 🌹 🌹 🌹
18 Aug 2019