శ్రీమద్భగవద్గీత - 094: 02వ అధ్., శ్లో 47 / Bhagavad-Gita - 094: Chap. 02, Ver. 47


🌹. శ్రీమద్భగవద్గీత - 94 / Bhagavad-Gita - 94 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 47 🌴

47. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫల హేతుర్బూర్మా తే సజ్ఞోస్త్వకర్మణి ||



🌷. తాత్పర్యం :

విధ్యుక్తధర్మమును నిర్వర్తించుట యందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విధ్యుక్తధర్మమును వీడుట యందు ఆసక్తుడవు కాకుము.


🌻. భాష్యము :

విధ్యుక్తధర్మములు, దుష్కర్మలు, అకర్మ అనుచు కర్మలు మూడు రకములు. మనుజుని గుణముల ననుసరించి విధింపబడిన కర్మలే విధ్యుక్తధర్మములు. ప్రామాణికమైన అనుమతి లేకుండగనే ఒనరింపబడునవి దుష్కర్మలు కాగా, విధ్యుక్తధర్మమును చేయకుండుట అకర్మ అనుదాని భావము. ఆకర్మునిగా కారాదనియు మరియు ఫలాపేక్ష లేకుండా విధ్యుక్తధర్మమును విధిగా నిర్వహించు మనియు ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు. కర్మఫలములందు ఆసక్తిని కలిగియుండెడివాడు ఆ కర్మలకు సైతము కారణముగుటచే ఆ ఫలముల వలన సుఖి లేదా దుఃఖి యగుచున్నాడు.

ఇక విధ్యుక్తధర్మములకు సంబంధించినవరకు వాటిని నిత్యకర్మము, అత్యవసరకర్మము, ఇష్టమైన కర్మలనెడి మూడింటిగా విభజింపవచ్చును. శాస్త్రానుసారముగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా విధిగా నిర్వర్తింపబడు నిత్యకర్మ సత్వగుణకర్మ అనబడును. ఫలితము వాంచించుచు చేయబడు కర్మ బంధమును కలిగించును గావున అది అమంగళదాయకము. ప్రతియెక్కరికిని వారి విధ్యుక్తధర్మమునందు అధికారము కలదు. కాని ఆ ధర్మమును వారు ఫలాపేక్ష లేకుండా నిర్వర్తింప వలసి యున్నది. అట్టి ఫలాపేక్ష రహిత విధ్యుక్త ధర్మపాలనము మనుజుని ముక్తిమార్గమును చేర్చగలదు.

కావుననే ఫలమునందు ఆసక్తిని గొనక విధిగా యుద్ధము చేయుమని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశమొసగినాడు. యుద్ధములో పాల్గొనకపోవుటయు ఒక విధముగా ఆసక్తియే. అటువంటి ఆసక్తి ఎన్నడును మనుజుని ముక్తిపథమునకు నడిపించదు. ఆసక్తి ఎటువంటిదైనను అది బంధమునకే కారణము కాగలదు. అకర్మ అనునది పాపమే కనుక విధిగా యుద్ధము చేయుటయే అర్జునునికి శుభప్రదమైన మోక్షమార్గమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 94 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 47 🌴

47. karmaṇy evādhikāras te mā phaleṣu kadācana
mā karma-phala-hetur bhūr mā te saṅgo ’stv akarmaṇi



🌻 Translation :

You have a right to perform your prescribed duty, but you are not entitled to the fruits of action. Never consider yourself the cause of the results of your activities, and never be attached to not doing your duty.


🌻 Purport :

There are three considerations here: prescribed duties, capricious work, and inaction. Prescribed duties are activities enjoined in terms of one’s acquired modes of material nature. Capricious work means actions without the sanction of authority, and inaction means not performing one’s prescribed duties. The Lord advised that Arjuna not be inactive, but that he perform his prescribed duty without being attached to the result. One who is attached to the result of his work is also the cause of the action. Thus he is the enjoyer or sufferer of the result of such actions.

As far as prescribed duties are concerned, they can be fitted into three subdivisions, namely routine work, emergency work and desired activities. Routine work performed as an obligation in terms of the scriptural injunctions, without desire for results, is action in the mode of goodness. Work with results becomes the cause of bondage; therefore such work is not auspicious. Everyone has his proprietary right in regard to prescribed duties, but should act without attachment to the result; such disinterested obligatory duties doubtlessly lead one to the path of liberation.

Arjuna was therefore advised by the Lord to fight as a matter of duty without attachment to the result. His nonparticipation in the battle is another side of attachment. Such attachment never leads one to the path of salvation. Any attachment, positive or negative, is cause for bondage. Inaction is sinful. Therefore, fighting as a matter of duty was the only auspicious path of salvation for Arjuna.

🌹🌹🌹🌹🌹


2 Aug 2019