శ్రీమద్భగవద్గీత - 115: 02వ అధ్., శ్లో 68 / Bhagavad-Gita - 115: Chap. 02, Ver. 68
🌹. శ్రీమద్భగవద్గీత -115 / Bhagavad-Gita - 115 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 68 🌴
68. టతస్మాద్ యస్య మాహాబాహో
నిగృహీతాని సర్వశః |
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య
ప్రజ్ఞా ప్రతిష్టితా ||
🌷. తాత్పర్యం :
అందుచే ఓ మాహాబాహో! ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి యుండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడనబడును.
🌷. భాష్యము :
ఇంద్రియములను శ్రీకృష్ణభగవానుని ప్రేమయుత సేవ యందు నిలుపుట ద్వారా మనుజుడు ఇంద్రియ వేగమును అరికట్టవచ్చును. శత్రువులను అధికబలముతో అణిచివేయు రీతి, ఇంద్రియవేగమును సైతము అణచవచ్చును. కాని అది ఎట్టి మానవయత్నముచే గాక ఇంద్రియములను శ్రీకృష్ణభగవానుని సేవలో నిలుపుట ద్వారానే సాధ్యమగును.
ఈ విధముగా కృష్ణభక్తిరసభావన ద్వారానే మనుజుడు నిజముగా స్థితప్రజ్ఞుడు కాగాలడనియు మరియు కృష్ణభక్తి యనెడి ఈ దివ్యకళను ప్రామాణికుడైన గురువు నిర్దేశమునందే ఒనరింపవలెననియు అవగతము చేసికొనినవాడు సాధకుడు (ముక్తిని పొందుటకు యోగ్యుడు) అనబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 115 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 68 🌴
68. tasmād yasya mahā-bāho nigṛhītāni sarvaśaḥ
indriyāṇīndriyārthebhyas tasya prajñā pratiṣṭhitā
🌷Translation :
Therefore, O mighty-armed, one whose senses are restrained from their objects is certainly of steady intelligence.
🌷 Purport :
One can curb the forces of sense gratification only by means of Kṛṣṇa consciousness, or engaging all the senses in the transcendental loving service of the Lord. As enemies are curbed by superior force, the senses can similarly be curbed, not by any human endeavor, but only by keeping them engaged in the service of the Lord. One who has understood this – that only by Kṛṣṇa consciousness is one really established in intelligence and that one should practice this art under the guidance of a bona fide spiritual master – is called a sādhaka, or a suitable candidate for liberation.
🌹 🌹 🌹 🌹 🌹
23 Aug 2019