శ్రీమద్భగవద్గీత - 105: 02వ అధ్., శ్లో 58 / Bhagavad-Gita - 105: Chap. 02, Ver. 58


🌹. శ్రీమద్భగవద్గీత - 105 / Bhagavad-Gita - 105 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 58 🌴


58. యదా సంహరతే చాయం
కుర్మోజ్గ్నానీవ సర్వశ : |
ఇన్ద్రియాణిన్ద్రియార్తేభ్యస్తస్య
ప్రజ్ఞా ప్రతిష్టితా ||


🌷. తాత్పర్యం :

తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనెడి రీతి, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణమునందు స్థిరముగా నున్నవాడును.


🌷. భాష్యము :

తాను కోరిన రీతిలో తన ఇంద్రియములను నియమింపగలుగుట యోగి(భక్తుడు) లేదా ఆత్మదర్శియైనవానికి పరీక్షయై యున్నది. సాధారణముగా జనులందరును ఇంద్రియములచే దాసులై అవి చెప్పిన రీతి వర్తింతురు. యోగి ఎట్టి స్థితిలో నుండుననెడి ప్రశ్నకు ఇదియే సమాధానము. ఇంద్రియములు విషపూర్ణసర్పములతో పోల్చబడినవి. అవి సదా ఎటువంటి అడ్డు లేకుండా విచ్చలవిడిగా వర్తింపగోరు చుండును.

కనుక యోగియైనవాడు లేదా భక్తుడు సర్పముల వంటి ఇంద్రియములను అణుచుటకు (పాములవాని వలె) పరమ శక్తిశాలియై యుండవలెను. అవి యథేచ్చగా వర్తించుటకు అతడెన్నడును అనుమతింపడు. నిషేదింపబడిన కర్మలను గూర్చియు, అమోదింపబడిన కర్మలను గూర్చియు పలువిధములైన ఉపదేశములు శాస్త్రములందు కలవు.

ఇంద్రియభోగము నుండి దూరులై అట్టి నిషిద్దకర్మలను మరియు ఆమోదయోగ్యమైన కర్మలను అవగతము చేసికొననిదే కృష్ణభక్తిభావన యందు స్థిరత్వము పొందుట సాధ్యపడడు. ఈ విషయమున తాబేలు ఒక చక్కని ఉపమానముగా తెలుపబడినది. తాబేలు తన అవయములను ఏ క్షణమైనను ఉపసంహరించుకొని, తిరిగి ఏ సమయమందైనను ఏదేని కార్యార్థమై ప్రదర్శింపగలదు. అదేవిధముగా కృష్ణభక్తిభావనలో నున్న వ్యక్తి యొక్క ఇంద్రియములు కేవలము భగవానుని సేవ కొరకే వినియోగింపబడి అనన్యసమయములలో ఉపసంహరింప బడి యుండును.

ఇంద్రియములను స్వీయసంతృప్తి కొరకు గాక శ్రీకృష్ణభగవానుని సేవ కొరకు వినియోగించమని ఇచ్చట అర్జునుడు ఉపదేశింప బడుచున్నాడు. ఇంద్రియములన్నింటిని శ్రీకృష్ణభగవానుని సేవ యందే నిలుపవలెననెడి విషయమిచ్చట ఇంద్రియములను సదా తన యందే నిలుపుకొని యుండు తాబేలు ఉపమానముతో పోల్చి తెలుబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 105 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 58 🌴



58. yadā saṁharate cāyaṁ kūrmo ’ṅgānīva sarvaśaḥ
indriyāṇ īndriyār thebhyas tasya prajñā pratiṣṭhitā


🌷Translation :

One who is able to withdraw his senses from sense objects, as the tortoise draws its limbs within the shell, is firmly fixed in perfect consciousness.


🌷 Purport :

The test of a yogī, devotee or self-realized soul is that he is able to control the senses according to his plan. Most people, however, are servants of the senses and are thus directed by the dictation of the senses. That is the answer to the question as to how the yogī is situated. The senses are compared to venomous serpents. They want to act very loosely and without restriction. The yogī, or the devotee, must be very strong to control the serpents – like a snake charmer. He never allows them to act independently.

There are many injunctions in the revealed scriptures; some of them are do-not’s, and some of them are do’s. Unless one is able to follow the do’s and the do-not’s, restricting oneself from sense enjoyment, it is not possible to be firmly fixed in Kṛṣṇa consciousness. The best example, set herein, is the tortoise. The tortoise can at any moment wind up its senses and exhibit them again at any time for particular purposes. Similarly, the senses of the Kṛṣṇa conscious persons are used only for some particular purpose in the service of the Lord and are withdrawn otherwise.

Arjuna is being taught here to use his senses for the service of the Lord, instead of for his own satisfaction. Keeping the senses always in the service of the Lord is the example set by the analogy of the tortoise, who keeps the senses within.

🌹 🌹 🌹 🌹 🌹


13 Aug 2019