🌹. శ్రీమద్భగవద్గీత - 99 / Bhagavad-Gita - 99 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 52 🌴
52. యదా తే మోహకలిలం
బుద్ధిర్వ్యతితరిష్యతి ||
తదా గన్తాసి నిర్వేదం
శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||
🌷. తాత్పర్యం :
ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మొహారణ్యమును దదాటునో అప్పుడు నీవు వినినదాని యెడ మరియు వినవలసిన దాని యెడ విరక్తిని కలిగిన వాడవగుదువు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని యెడ గల భక్తియుత సేవ ద్వారా వేదములందలి కర్మల యెడ విరాగామును పొందిన మహాభక్తుల ఉదాహరణములు పెక్కులు కలవు. కృష్ణుని గూర్చియు మరియు కృష్ణునితో తనకు గల సంబంధమును గూర్చియు మనుజుడు వాస్తవముగా నెరిగినప్పుడు తానూ అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికిని అతడు సర్వవిధములైన కామ్యకర్మల యెడ విరక్తుడగును. పరమభక్తుడును మరియు భక్తిపరంపరలో ఆచార్యుడును అగు శ్రీమాధవేంద్రపురి ఈ క్రింది విధముగా పలికిరి.
సంధ్యావందన భద్రమస్తు భవతో భో:స్నాన తుభ్యం నమో భో దేవా: పితరశ్చ తర్పణవిధౌ నాహం క్షమ: క్షమ్యతామ్ |
యాత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తమస్య కంసద్విష: స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే ||
“ఓ సంధ్యావందనమా! నీకు భద్రమగుగాక! ఓ స్నానమా! నీకు నేను నమస్సులు అర్పింతును. ఓ దేవతలారా! ఓ పితృదేవతలారా! మీకు వందనములను అర్పింపలేని నా ఆశక్తతకు నన్ను మన్నింపుడు. ఇప్పుడు నేనెచ్చట నిలిచియున్నను కంసారియైన యాదవకులోత్తముని (శ్రీకృష్ణుని) తలచుచు సర్వపాపబంధముల నుండి విముక్తుడను కాగలను. ఇదియే నాకు చాలునని నేను భావించుచున్నాను.”
త్రిసంధ్యల యందును వివిధస్తుతులను కావించుట, తెల్లవారుఝామునే స్నానము చేయుట, పితృదేవతలకు వందనములొసగుట వంటి వేదవిహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభదశలో నున్న భక్తులకు తప్పనిసరియైనవి. కాని కృష్ణభక్తిభావన యందు మనుజుడు పూర్ణుడైనప్పుడు మరియు ఆ దేవదేవుని ప్రేమయుత సేవలో నియుక్తుడైనపుడు పుర్ణత్వమును సాధించిన కారణమున ఈ విధివిధానముల యెడ విరాగామును పొందును.
శ్రీకృష్ణభగవానుని భక్తి ద్వారా ఈ స్థితికి చేరగలిగినవాడు శాస్త్రమునందు తెలియజేయబడిన వివిధతపస్సులను, యజ్ఞములను నిర్వహింపవలసిన అవసరము లేదు. దీనికి విరుద్ధముగా వేదప్రయోజనము శ్రీకృష్ణుని చేరుటకే ననెడి విషయము తెలియక కేవలము వేదపరమైన కర్మల యందు మగ్నమైనవాడు ఆ కర్మల యందు కాలమును వృథాచేసినట్లే యగును. అనగా కృష్ణభక్తి యందున్నవారు “శబ్ధబ్రహ్మము” లేదా వేదోపనిషత్తులను అతిశయించుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 99 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 52 🌴
52. yadā te moha-kalilaṁ buddhir vyatitariṣyati
tadā gantāsi nirvedaṁ śrotavyasya śrutasya ca
🌷Translation :
When your intelligence has passed out of the dense forest of delusion, you shall become indifferent to all that has been heard and all that is to be heard.
🌷 Purport :
There are many good examples in the lives of the great devotees of the Lord of those who became indifferent to the rituals of the Vedas simply by devotional service to the Lord. When a person factually understands Kṛṣṇa and his relationship with Kṛṣṇa, he naturally becomes completely indifferent to the rituals of fruitive activities, even though an experienced brāhmaṇa. Śrī Mādhavendra Purī, a great devotee and ācārya in the line of the devotees, says:
sandhyā-vandana bhadram astu bhavato bhoḥ snāna tubhyaṁ namo
bho devāḥ pitaraś ca tarpaṇa-vidhau nāhaṁ kṣamaḥ kṣamyatām
yatra kvāpi niṣadya yādava-kulottaṁsasya kaṁsa-dviṣaḥ
smāraṁ smāram aghaṁ harāmi tad alaṁ manye kim anyena me
“O my prayers three times a day, all glory to you. O bathing, I offer my obeisances unto you. O demigods! O forefathers! Please excuse me for my inability to offer you my respects. Now wherever I sit, I can remember the great descendant of the Yadu dynasty [Kṛṣṇa], the enemy of Kaṁsa, and thereby I can free myself from all sinful bondage. I think this is sufficient for me.”
The Vedic rites and rituals are imperative for neophytes: comprehending all kinds of prayer three times a day, taking a bath early in the morning, offering respects to the forefathers, etc. But when one is fully in Kṛṣṇa consciousness and is engaged in His transcendental loving service, one becomes indifferent to all these regulative principles because he has already attained perfection.
🌹 🌹 🌹 🌹 🌹
7 Aug 2019