🌹. శ్రీమద్భగవద్గీత - 113 / Bhagavad-Gita - 113 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 66 🌴
66. నాస్తి బుద్ధిరయుక్తస్య
న చాయుక్తస్య భావనా |
న చాభావయుత: శాన్తిరశాన్తస్య
కుత: సుఖమ్ ||
🌷. తాత్పర్యం :
భగవానునితో సంబంధమును పొందని వాడు విశుద్ధ బుద్ధిని గాని, స్థిరమైన మనస్సును గాని కలిగి యుండజాలడు. అవి లేనిదే శాంతిని పొందటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును?
🌷. భాష్యము :
మనుజుడు కృష్ణభక్తిభావన యందు నిలువనిదే శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు, తపస్సులకు ఫలభోక్తయనియు, అతడే సకలసృష్టులకు అధిపతి యనియు, అతడే సకలజీవులకు నిజమైన స్నేహితుడనియు మనుజుడు అవగతము చేసికొనినపుడు వాస్తవమైన శాంతిని పొందునని భగవద్గీత పంచామాధ్యాయమున (5.29) ద్రువీకరింప బడినది. అనగా మనుజుడు కృష్ణభక్తిరస భావితుడు కానిచో మనస్సుకు ఒక లక్ష్యము లభింపడు.
చరమలక్ష్యము లేనందునే మనస్సు చంచలమగును గనుక శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తమునకు భోక్త, ప్రభువు, స్నేహితుడు తెలిసికొననిచో మనుజుడు స్థిరమనస్సుతో శాంతిని పొందగలడు.
కనుకనే శ్రీకృష్ణునితో ఎటువంటి సంబంధము లేకుండా వర్తించువాడు ఎంతటి ఆధ్యాత్మికపురోగతిని మరియు శాంతిని ప్రదర్శించినను శాంతి లేకుండా సదా కలత చెందియే ఉండును. కృష్ణభక్తిరసభావన యనునది స్వయముగా ప్రకటమయ్యే దివ్యమైన శాంతిస్థితి. అట్టి దివ్యస్థితి శ్రీకృష్ణునితో గల దివ్య సంబంధముతోనే ప్రాప్తించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 113 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 66 🌴
66. nāsti buddhir ayuktasya na cāyuktasya bhāvanā
na cābhāvayataḥ śāntir aśāntasya kutaḥ sukham
🌷Translation :
One who is not connected with the Supreme [in Kṛiṣhṇa consciousness] can have neither transcendental intelligence nor a steady mind, without which there is no possibility of peace. And how can there be any happiness without peace?
🌷 Purport :
Unless one is in Kṛiṣhṇa consciousness, there is no possibility of peace. So it is confirmed in the Fifth Chapter (5.29) that when one understands that Kṛiṣhṇa is the only enjoyer of all the good results of sacrifice and penance, that He is the proprietor of all universal manifestations, and that He is the real friend of all living entities, then only can one have real peace.
Therefore, if one is not in Kṛiṣhṇa consciousness, there cannot be a final goal for the mind. Disturbance is due to want of an ultimate goal, and when one is certain that Kṛiṣhṇa is the enjoyer, proprietor and friend of everyone and everything, then one can, with a steady mind, bring about peace.
Therefore, one who is engaged without a relationship with Kṛiṣhṇa is certainly always in distress and is without peace, however much he may make a show of peace and spiritual advancement in life. Kṛiṣhṇa consciousness is a self-manifested peaceful condition which can be achieved only in relationship with Kṛiṣhṇa.
🌹 🌹 🌹 🌹 🌹
21 Aug 2019