శ్రీమద్భగవద్గీత - 122: 03వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 122: Chap. 03, Ver. 03
🌹. శ్రీమద్భగవద్గీత -122 / Bhagavad-Gita - 122 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 3 🌴
3. శ్రీభగవానువాచ
లోకేస్మిన్ ద్వివిధా నిష్టా
పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యనాం
కర్మయోగేన యోగినామ్ ||
🌷. తాత్పర్యం :
దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను: పాపరహితుడవైన ఓ అర్జునా! ఆత్మానుభూతిని పొందగోరు మానవుల రెండు రకములని ఇదివరకే నేను వివిరించితివి. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసికొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అర్థము చేసికొనగోరుదురు.
🌷. భాష్యము :
ద్వితీయాధ్యయపు ముప్పది తొమ్మిదవ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము (బుద్ధియోగము) లనెడి రెండు విధానములను శ్రీకృష్ణభగవానుడు వివరించెను. అదే విషయమును భగవానుడు ఈ శ్లోకమున మరింత విశదముగా వివరించుచున్నాడు.
ఆత్మ మరియు భౌతికపదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను కావించుట యందును మరియు ఏదేని విషయము పయోగాత్మక జ్ఞానము, తాత్విక చింతన ద్వారా ఎరుగుట యందును అభిరుచిని కలిగినట్టి మనుజులకు చెందినట్టిది. ఇక రెండవ రకము వారు కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించెడి వారు.
ఈ విషయమును ద్వితీయాధ్యాయపూ అరువదియెకటక శ్లోకమునందు వివరింపబడినది. బుద్ధియోగము (కృష్ణభక్తిభావన) ననుసరించి కర్మచేయుట ద్వారా మనుజుడు కర్మబంధము నుండి విడివడగలడనియు, పైగా కర్మయందు ఎటువంటి దోషము కలుగాదనియు శ్రీకృష్ణభగవానుడు ద్వితియాద్యయపు ముప్పదితొమ్మిదవ శ్లోకమున తెలిపియే యున్నాడు.
బుద్ధియోగామనగా భగవానుని పైననే (మరింత విశదముగా చెప్పవలెనన్న శ్రీకృష్ణుని పైననే ) సంపూర్ణముగా ఆధారపడుటయనియు, తద్ద్వారా ఇంద్రియములన్నియు సులభముగా అదుపులోనికి రాగాలవనియు ఆ అధ్యాయపు అరువదియెకటవ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. అనగా ధర్మము మరియు తత్త్వముల వలె ఈ రెండుయోగములు ఒకదానిపై మరొకటి ఆధారపడియున్నవి.
తత్త్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేదా మూడవిశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్త్వము కేవలము మానసిక కల్పనము కాగలదు. పరతత్త్వమును అనుభూతమొనర్చుకొనుటకు నిష్టగా యత్నించువారు సైతము అంత్యమున కృష్ణభక్తిభావననే పొందుదురు కావున శ్రీకృష్ణుడే పరమలక్ష్యమై యున్నాడు. ఈ విషయము భగవద్గీత యందును తెలుపబడినది. భగవానునితో పోల్చినచో జీవుని నిజస్థితి ఎట్టిదని అవగతము చేసికొనుటయే అన్నింటి యందును ముఖ్యాంశమై యున్నది.
పరోక్షమార్గామైన మనోకల్పనను కావించుచు మనుజుడు క్రమముగా కృష్ణభక్తిభావనాస్థితికి రావచ్చును లేదా రెండవమార్గమున కృష్ణభక్తి యందు ప్రత్యక్షసంబంధము నేర్పరచుకొనవచ్చను. ఈ రెండింటిలో కృష్ణభక్తిభావనా మార్గము ఉత్తమమైనది. తాత్వికవిధానము ద్వారా ఇంద్రియములను శుద్ధిపరచుకొనవలసిన అవసరం దాని యందు లేకపోవుటయే అందులకు కారణము. కృష్ణభక్తియే సాక్షాత్తుగా అతి పవిత్రమొనర్చు విధానము. భక్తియుక్తసేవ యనెడి ప్రత్యక్ష విధానము వలన ఆ కార్యము సులభమును మరియు ఉదాత్తమును అయి యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 122 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 3 - Karma Yoga -3 🌴
3. śrī-bhagavān uvāca
loke ’smin dvi-vidhā niṣṭhā purā proktā mayānagha
jñāna-yogena sāṅkhyānāṁ karma-yogena yoginām
🌷Translation :
The Supreme Personality of Godhead said: O sinless Arjuna, I have already explained that there are two classes of men who try to realize the self. Some are inclined to understand it by empirical, philosophical speculation, and others by devotional service.
🌷 Purport :
In the Second Chapter, verse 39, the Lord explained two kinds of procedures – namely sāṅkhya-yoga and karma-yoga, or buddhi-yoga. In this verse, the Lord explains the same more clearly. Sāṅkhya-yoga, or the analytical study of the nature of spirit and matter, is the subject matter for persons who are inclined to speculate and understand things by experimental knowledge and philosophy.
The other class of men work in Kṛṣṇa consciousness, as it is explained in the sixty-first verse of the Second Chapter. The Lord has explained, also in the thirty-ninth verse, that by working by the principles of buddhi-yoga, or Kṛṣṇa consciousness, one can be relieved from the bonds of action; and, furthermore, there is no flaw in the process.
The same principle is more clearly explained in the sixty-first verse – that this buddhi-yoga is to depend entirely on the Supreme (or more specifically, on Kṛṣṇa), and in this way all the senses can be brought under control very easily.
🌹 🌹 🌹 🌹 🌹
30 Aug 2019