శ్రీమద్భగవద్గీత - 107: 02వ అధ్., శ్లో 60 / Bhagavad-Gita - 107: Chap. 02, Ver. 60


🌹. శ్రీమద్భగవద్గీత - 107 / Bhagavad-Gita - 107 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 60 🌴


60. యతతో హ్యాపి కౌన్తేయ
పురుషస్య విపశ్చిత: |
ఇంద్రియాణి ప్రమాథీని
హరన్తి ప్రసభం మన: ||


🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! ఇంద్రియములు బలవంతములను మరియు దృడములును అయియున్నవి. వానిని అదుపు చేయు యత్నించు విచక్షణాపూర్ణుని మనస్సును సైతము అవి హరించి వేయుచున్నవి.


🌷. భాష్యము :

ఇంద్రియములను జయించుటకు యత్నించు మునులు, తత్త్వవేత్తలు, జ్ఞానులు పలువురు కలరు. కాని వారట్లు ప్రయత్నించుచున్న వారి యందు ఘనులైనట్టివారే కల్లోలిత మనస్సు కారణముగా ఇంద్రియభోగమునకు బలియగుదురు. గొప్ప తాపసి మరియు పూర్ణయోగియైన విశ్వామిత్రుడు సైతము మేనకచే మైథునభోగమునకు ఆకర్షితుడయ్యెను. యోగము మరియు పలువిధములైన తపస్సులచే ఇంద్రియములను అతడు అదుపుజేయు యత్నించినను మేనకచే మైథునభోగమునకు వశీభూతుడయ్యెను.

ఇటువంటి సంఘటనలు ప్రపంచచరిత్రలో పెక్కు గలవు. కావున కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా లగ్నము కానిదే ఇంద్రియములను మరియు మనస్సును అదుపు చేయుట మిగుల కష్టతరము. కృష్ణుని యందు మనస్సును సంలగ్నము చేయక విషయకర్మల నుండి విరమించుట ఎవ్వరికిని సాధ్యము కాదు. ఈ విషయమున గొప్పముని మరియు భక్తుడు అయిన శ్రీ యమునాచార్యులు ఒక చక్కని ఉపమానము ఇచ్చియున్నారు.

యదవధి మమచేత: కృష్ణపదారవిన్దే
నవనవరసధామన్యుద్యతరం రంతుమాసీత్|
తదవధి బత నారీ సంగమే స్మర్యమాణే
భవతి ముఖవికార: సుష్టు నిష్టివనం చ ||

“శ్రీకృష్ణభగవానుని పాదపద్మసేవ యందు నా మనస్సు సదా నిలిచియుండుట చేతను మరియు అనుక్షణము నేనొక నవ్యదివ్యరసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగభావన కలిగినంతనే నేను విముఖుడనై ఆ భావముపై ఉమ్మివేయుదును.”

కనుకనే కృష్ణభక్తిరసభావన యనునది అతి దివ్యమైనది. దాని ద్వారా విషయభోగములు అన్నియును రసహీనములగును. అట్టి కృష్ణభక్తిరసభావానము ఆకలికొన్నవాడు తగినంత పుష్టికర ఆహారముతో ఆకలిని శమింపజేసికొనుట వంటిది. కృష్ణభక్తిభావనలో మనస్సును సంలగ్నము చేసియున్నందున భక్త అంబరీషుడు గొప్ప యోగియైన దుర్వాసముని సైతము జయించెను ( స వై మన: కృష్ణపాదారవిన్దయో: వచాంసి వైకుంఠ గుణానువర్ణనే).

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 107 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 60 🌴


60. yatato hy api kaunteya puruṣasya vipaścitaḥ
indriyāṇi pramāthīni haranti prasabhaṁ manaḥ


🌷Translation :

The senses are so strong and impetuous, O Arjuna, that they forcibly carry away the mind even of a man of discrimination who is endeavoring to control them.


🌷 Purport :

There are many learned sages, philosophers and transcendentalists who try to conquer the senses, but in spite of their endeavors, even the greatest of them sometimes fall victim to material sense enjoyment due to the agitated mind. Even Viśvāmitra, a great sage and perfect yogī, was misled by Menakā into sex enjoyment, although the yogī was endeavoring for sense control with severe types of penance and yoga practice.

And, of course, there are so many similar instances in the history of the world. Therefore, it is very difficult to control the mind and senses without being fully Kṛṣṇa conscious. Without engaging the mind in Kṛṣṇa, one cannot cease such material engagements. A practical example is given by Śrī Yāmunācārya, a great saint and devotee, who says:

yad-avadhi mama cetaḥ kṛṣṇa-pādāravinde
nava-nava-rasa-dhāmany udyataṁ rantum āsīt
tad-avadhi bata nārī-saṅgame smaryamāne
bhavati mukha-vikāraḥ suṣṭhu niṣṭhīvanaṁ ca

“Since my mind has been engaged in the service of the lotus feet of Lord Kṛṣṇa, and I have been enjoying an ever new transcendental humor, whenever I think of sex life with a woman, my face at once turns from it, and I spit at the thought.”

Kṛṣṇa consciousness is such a transcendentally nice thing that automatically material enjoyment becomes distasteful. It is as if a hungry man had satisfied his hunger by a sufficient quantity of nutritious eatables. Mahārāja Ambarīṣa also conquered a great yogī, Durvāsā Muni, simply because his mind was engaged in Kṛṣṇa consciousness (sa vai manaḥ kṛṣṇa-padāravindayor vacāṁsi vaikuṇṭha-guṇānuvarṇane).

🌹 🌹 🌹 🌹 🌹


15 Aug 2019