శ్రీమద్భగవద్గీత - 092: 02వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 092: Chap. 02, Ver. 45



🌹. శ్రీమద్భగవద్గీత - 92 / Bhagavad-Gita - 92 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 45 🌴

45. త్రైగుణ్యవిషయా వేదా
నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో
నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||



తాత్పర్యం :

వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా! నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై, ద్వంద్వముల నుండియు మరియు యోగ క్షేమములనెడి చింతల నుండియు విడివడిన వాడవై ఆత్మ యందు స్థిరుడవగుము.


భాష్యము :

భౌతిక కార్యములు అన్నియును త్రిగుణములను కూడిన కర్మలను మరియు ఫలములను కూడి యుండును. భౌతిక జగమున బంధము కలిగించు సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. జనులను ఇంద్రియ భోగానుభవము నుండి ఆధ్యాత్మిక స్థాయికి క్రమముగా గొనిపోవు నిమిత్తమే వేదములు అట్టి సకామకర్మలను ఉపదేశించును.

శ్రీకృష్ణభగవానుని స్నేహితునిగా మరియు శిష్యునిగా అర్జునుడు ఇచ్చట వేదాంత తత్త్వము యొక్క దివ్యస్థాయికి ఎదుగవలసినదిగా ఉపదేశింపబడినాడు. బ్రహ్మజిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గుర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్త్వము యొక్క ఆరంభాములోని అంశము. భౌతికజగము నందు గల జీవులందరును తీవ్ర జీవన సంఘర్షణకు లోనై యుందురు.

ఏ విధముగా మనుగడను సాగించి పిదప భౌతికబంధము నుండి ముక్తినొందగగలరో ఉపదేశించుటకే భౌతికజగత్తును సృష్టించిన పిమ్మట భగవానుడు వారికి వేదంజ్ఞానము నొసగెను. భోగవాంఛను కూడిన కర్మలు(కర్మకాండ) ముగిసినంతనే ఆధ్యాత్మికానుభవమునకు అతడు ఉపనిషత్తుల రూపున అవకాశము నొసగెను. భగవద్గీత పంచమవేదమైన మహాభారతము యొక్క భాగమైనట్లు, ఉపనిషత్తులు వివిధ వేదములందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మికజీవనపు ఆరంభము సూచించును.

భౌతికదేహము నిలిచియున్నంత కాలము త్రిగుణ పూర్ణములైన కర్మలు మరియు ఫలితములు తప్పవు. కనుక ప్రతియొక్కరు సుఖదుఃఖములు, శీతతాపముల వంటి ద్వంద్వములను సహించుట నేర్చుకొని ఆ ద్వంద్వ సహనము ద్వారా లాభనష్టముల యెడ గల చింత నుండి దూరులు కావలెను. దేవదేవుడైన శ్రీకృష్ణుని కృపా కటాక్షములపై మనుజుడు సంపూర్ణముగా ఆధారపడినప్పుడు అట్టి దివ్యస్థితి (సంపూర్ణ కృష్ణభక్తిభావన యందు) సిద్ధింపగలదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 92 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 45 🌴


45. trai-guṇya-viṣayā vedā nistrai-guṇyo bhavārjuna
nirdvandvo nitya-sattva-stho niryoga-kṣema ātmavān



🌻 Translation :

The Vedas deal mainly with the subject of the three modes of material nature. O Arjuna, become transcendental to these three modes. Be free from all dualities and from all anxieties for gain and safety, and be established in the self.


🌻 Purport :

All material activities involve actions and reactions in the three modes of material nature. They are meant for fruitive results, which cause bondage in the material world. The Vedas deal mostly with fruitive activities to gradually elevate the general public from the field of sense gratification to a position on the transcendental plane.

Arjuna, as a student and friend of Lord Kṛṣṇa, is advised to raise himself to the transcendental position of Vedānta philosophy where, in the beginning, there is brahma-jijñāsā, or questions on the supreme transcendence. All the living entities who are in the material world are struggling very hard for existence. For them the Lord, after creation of the material world, gave the Vedic wisdom advising how to live and get rid of the material entanglement.

When the activities for sense gratification, namely the karma-kāṇḍa chapter, are finished, then the chance for spiritual realization is offered in the form of the Upaniṣads, which are part of different Vedas, as the Bhagavad-gītā is a part of the fifth Veda, namely the Mahābhārata. The Upaniṣads mark the beginning of transcendental life.

As long as the material body exists, there are actions and reactions in the material modes. One has to learn tolerance in the face of dualities such as happiness and distress, or cold and warmth, and by tolerating such dualities become free from anxieties regarding gain and loss. This transcendental position is achieved in full Kṛṣṇa consciousness when one is fully dependent on the good will of Kṛṣṇa.

🌹🌹🌹🌹🌹


31 Jul 2019