శ్రీమద్భగవద్గీత - 098: 02వ అధ్., శ్లో 51 / Bhagavad-Gita - 098: Chap. 02, Ver. 51


🌹. శ్రీమద్భగవద్గీత - 98 / Bhagavad-Gita - 98🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 51 🌴


51. కర్మజం బుద్ధియుక్తా హి
ఫలం త్యక్వా మనీషిణ: |
జన్మబన్ధ వినిర్ముక్తా:
పదం గచ్ఛన్త్యనామయమ్ ||


🌷. తాత్పర్యం :

ఆ విధముగా భక్తియోగమునందు నియుక్తులైన మహర్షులు లేదా భక్తులు ఈ భౌతికజగము నందు కర్మఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన,మరణచక్రము నుండి విడుదలను పొంది (భగవద్దామమును చేరుట ద్వారా) దుఃఖరాహిత్యస్థితిని పొందుచున్నారు.

🌷. భాష్యము :

ముక్తజీవులు దుఃఖరాహిత్యమైన స్థానమునకు చెందినవారై యున్నారు. ఈ విషయమున శ్రీమద్భాగవతము(10.14.58)

ఈ విధముగా పలుకు చున్నది. సమాశ్రితా యే పపదపల్లవప్లం మహత్పదం పుణ్యయశో మురారే: |

భవామ్భుది ర్వత్సపదం పరం పదం పదం పదం యద్విపదాం న తేషామ్ ||

“విశ్వమునకు శరణ్యుడును మరియు ముక్తినిచ్చు ముకుందునిగా ప్రసిద్ధినొందినవాడును అగు శ్రీకృష్ణభగవానుని పాదపద్మనౌకను ఆశ్రయించినవానికి సంసారసాగరము దూడపాదముద్ర యందలి జలమే కాగలదు. వైకుంఠము లేదా దుఃఖరహితస్థలమైన పరమపదమే ఆ భక్తుని గమ్యస్థానముగాని అడుగడుగున అపాయము కలిగిన అన్యస్థానము కాదు.”

ఈ భౌతికజగము అడుగడుగున అపాయము కలిగిన దుఃఖ;భూయిష్ట స్థానమని ఎవ్వరును అజ్ఞానవశమున తెలిసికొనజాలరు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు సకామకర్మల ద్వారా తమ స్థితిని చక్కబరచుకొనుటకు యత్నింపుము. అట్టి కర్మఫలములు తమకు ఆనందము నొసగగలవని వారు భావింతురు. కాని విశ్వమునందు ఎచ్చోటను దుఃఖరాహిత్యమైన జన్మముండదని వారెరుగరు.

జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులనెడి నాలుగు దుఃఖములు విశ్వమందంతటను గలవు. కాని భగవానుని నిత్యదాసునిగా తన నిజస్థితిని అవగతము చేసికొనినవాడు భగవానుని స్థితిని తెలిసికొని అతని భక్తియుక్తసేవలో నియుక్తుడగును. తత్పలితముగా అతడు దుఃఖమాయజీవనము గాని, కాలము మరియు మృత్యువుల ప్రభావము గాని లేనటువంటి వైకుంఠలోకములందు ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు.

వాస్తవమునకు తన నిజస్థితిని తెలియుట యనగా భగవానుని ఉదాత్తము మరియు ఉన్నతమైన స్థితిని తెలియుట యనియే భావము. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానమైనవే యని తప్పుగా తలంచువాడు అంధకారమున ఉన్నట్టివాడు. తత్పలితముగా అట్టివాడు భగవానుని సేవలో ఎన్నడును నిలువజాలడు.

అట్టివాడు తనకు తానే ప్రభువై జన్మ,మృత్యు పరంపరకు మార్గము నేర్పరచుకొనును. కాని సేవయే తన నిజస్థితి యని అవగతము చేసికొనినవాడు శ్రీకృష్ణభగవానుని సేవలో నిలిచి శీఘ్రమే వైకుంఠలోకమును పొందుటకు అర్హుడగుచున్నాడు. శ్రీకృష్ణభగవానునికి ఒనర్చబడు సేవయే కర్మయోగము (బుద్ధియోగము) అనబడును. సులభవాక్యములలో చెప్పవలెనన్న అదియే కృష్ణభక్తి యనబడును..

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 98 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 51 🌴


51. karma-jaṁ buddhi-yuktā hiphalaṁ tyaktvā manīṣiṇaḥ
janma-bandha-vinirmuktāḥ padaṁ gacchanty anāmayam


🌷Translation :

By thus engaging in devotional service to the Lord, great sages or devotees free themselves from the results of work in the material world. In this way they become free from the cycle of birth and death and attain the state beyond all miseries [by going back to Godhead].


🌷 Purport :

For one who has accepted the boat of the lotus feet of the Lord, who is the shelter of the cosmic manifestation and is famous as Mukunda, or the giver of mukti, the ocean of the material world is like the water contained in a calf’s footprint. Paraṁ padam, or the place where there are no material miseries, or Vaikuṇṭha, is his goal, not the place where there is danger in every step of life.”

Owing to ignorance, one does not know that this material world is a miserable place where there are dangers at every step. Out of ignorance only, less intelligent persons try to adjust to the situation by fruitive activities, thinking that the resultant actions will make them happy.

🌹 🌹 🌹 🌹 🌹


6 Aug 2019