✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 54 🌴
54. అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితిధీ: కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షనము లేవి? అతడు ఏ విధముగా భాషించును, అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును, ఎట్లు నడుచును?
🌷. భాష్యము :
ప్రతిమనిషిని అతని ప్రత్యేక స్థితిని ననుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణభక్తియందున్నవాడు సైతము తన ప్రత్యేక నైజమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులను కలిగియుండును. ధనికుడైనవాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగియుండునట్లు, దివ్యమైన కృష్ణభక్తి రసభావన యందు నిమగ్నుడైన మహాత్ముడు తన వివిధ వ్యవహారము లందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగియుండును. భక్తుని అటువంటి ప్రత్యేక లక్షణములు భగవద్గీత ద్వారా తెలియగలవు.
భాషణమనునది మనుజుని ముఖ్యమైన లక్షణము కనుక కృష్ణభక్తిభావన యందున్నవాడు ఏ విధముగా భాషించుననెడి విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడైనవాడు భాషించనంతవరకే ముర్ఖుడుగా గుర్తింపబడడనెది తెసిలిన విషయమే. చక్కని వేషధారణ కావించిన మూర్ఖుడు పలుకనంత వరకు ముర్ఖునిగా గుర్తింపబడకున్నను పలుకుట నారంభించినంతనే తన నిజరూపమును వెల్లడిజేయును.
కృష్ణభక్తిరసభావన యందున్న మనుజుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపబడనున్నట్లు పిదప ఇతర లక్షణములు అప్రయత్నముగా ఒనగూడగలవు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 101 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankya Yoga - 54 🌴
54. arjuna uvāca
sthita-prajñasya kā bhāṣā samādhi-sthasya keśava
sthita-dhīḥ kiṁ prabhāṣeta kim āsīta vrajeta kim
🌷Translation :
Arjuna said: O Kṛṣṇa, what are the symptoms of one whose consciousness is thus merged in transcendence? How does he speak, and what is his language? How does he sit, and how does he walk?
🌷 Purport :
As there are symptoms for each and every man, in terms of his particular situation, similarly one who is Kṛṣṇa conscious has his particular nature – talking, walking, thinking, feeling, etc. As a rich man has his symptoms by which he is known as a rich man, as a diseased man has his symptoms by which he is known as diseased, or as a learned man has his symptoms, so a man in transcendental consciousness of Kṛṣṇa has specific symptoms in various dealings. One can know his specific symptoms from the Bhagavad-gītā. Most important is how the man in Kṛṣṇa consciousness speaks; for speech is the most important quality of any man.
It is said that a fool is undiscovered as long as he does not speak, and certainly a well-dressed fool cannot be identified unless he speaks, but as soon as he speaks, he reveals himself at once. The immediate symptom of a Kṛṣṇa conscious man is that he speaks only of Kṛṣṇa and of matters relating to Him. Other symptoms then automatically follow, as stated below.
🌹 🌹 🌹 🌹 🌹
9 Aug 2019